సేమియా ఉప్మా

కావలిసినవి
సేమియా : పావుకిలో
బంగాళాదుంప : ఒకటి సన్నగా ముక్కలుగా కోసుకోవాలి
కేరెట్ : 1 తురిమినది
ఉల్లిపాయ : 1 సన్న ముక్కలుగా కోయాలి
పచ్చిమిర్చి : 3 కాయలు సన్నగా కోయాలి
ఎండుమిర్చి : 2
పోపుగింజలు : 1 టేబుల్ స్పూను
వేరుశెనగ గుండ్లు : కొద్దిగా
నూనె : 2 టీ స్పూన్లు
పసుపు : పావు స్పూను
కరివేపాకు : కొద్దిగా
కొత్తిమీర : కొద్దిగా
నీళ్ళు : 2 మంచినీళ్ల గ్లాసులు (500 యం.యల్)
తయారు చేయు విధానం :
ముందుగా సేమియాను కొద్దిగా వేయించాలి. తరువాత పాన్ లేక వెడల్పాటి పాత్రలో నెయ్యి లేక నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చి, పోపుగింజలు, వేరుశెనగగుండ్లు ఇంకా పైన చెప్పినవన్నీ వేసి అవి దోరగా వేగిన తరువాత నీళ్ళు పోసి తగినంత ఉప్పు, పావుస్పూను పసుపు వేసి నీరు బాగా తెర్లనివ్వలి. ఇప్పుడు సేమియాను కొద్దికొద్దిగా వేస్తూ అట్లకాడతో త్రిప్పుతుండాలి.బాగా ఉడికిన తరువాత దించి వేడిగా వడ్డించాలి. ఇది సుమారు ముగ్గురు లేక నలుగురికి సరిపోతుంది. సభ్యులను బట్టి పరిమాణం పెంచుకోవాలి

బొంబాయి రవ్వ ఉప్మా

కావలసినవి
బొంబాయి రవ్వ : పావుకిలో
ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి
పచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలి
అల్లం : చిన్న ముక్క తురుముకోవాలి
కరివేపాకు : కొద్దిగా
వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా
నూనె : 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
కొత్తిమీర : కొద్దిగా
నీళ్ళు : రవ్వను గ్లాసుతో కొలచి అదే గ్లాసుతో 1 గ్లాసు రవ్వకు రెండున్నర గ్లాసులు నీళ్ళు పోయాలి. కొద్దిగా జావగా కావలనుకునేవారు 3 గ్లాసు నీళ్ళు పోయాలి.
పోపుగింజలు : 1 స్పూను
ఎండుమిర్చి : 2
తయారు చేయు విధానం
ముందుగా పాన్ లేక వెడల్పాటి పాత్ర తీసుకొని నూనె లేక నెయ్యి వేసి వెడెక్కిన తరువాత ఎండుమిర్చి, పోపుగింజలు, వేరు శెనగగుండ్లు, అల్లం వేసి అవి వేగిన తరువాత నీరు పోయాలి. నీరు మరిగేటప్పుడు తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్య(ఉప్మారవ్వ) ను నిదానంగా కొద్దికొద్దిగా పోస్తూ ఉండకట్టకుండా అట్లకాడతో త్రిప్పుతుండాలి. చక్కగా ఉడికిన తరువాత దించుకొని కొత్తిమీర చల్లి వడ్డించాలి. ఇందులోకి కారప్పొడిగాని, చట్నీగానీ మంచి కాంబినేషన్. ఇందులో పోపుగింజలు వేగినతరువాత కొద్దిగా పసుపు రెండు మీడియం సైజ్ టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసి కలిపితే టమాటో బాత్ తయారవుతుంది.
ఇది సుమారు ముగ్గురు లేక నలుగురికి సరిపోతుంది. సభ్యులను బట్టి పరిమాణం పెంచుకోవాలి

కొర్రలతో ఉప్మా

కావలసినవి
కొర్రలు : పావుకిలో
ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి
బీన్స్ : 2 చిన్నముక్కలు గా కట్ చేయాలి
బంగాళా దుంప : 1 చిన్న ముక్కలుగా తురుముకోవాలి
టమాటో : 1 పెద్దది చిన్నముక్కలుగా తరుగుకోవాలి
పచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలి
కేరెట్ : 1 మీడియం సైజ్ సన్నగా తురుముకోవాలి
పాలకూర : 1 కట్ట సన్నగా ముక్కలు చేయాలి
అల్లం : చిన్న ముక్క తురుముకోవాలి
కరివేపాకు : కొద్దిగా
వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా
నూనె : 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
కొత్తిమీర : కొద్దిగా
నీళ్ళు : కొర్రలను గ్లాసుతో కొలచి అదే గ్లాసుతో 1 గ్లాసుకు 3 గ్లాసులు నీళ్ళు పోయాలి.
పోపుగింజలు : 1 స్పూను
ఎండుమిర్చి : 2
తయారు చేయు విధానం
ముందుగా పాన్ లేక వెడల్పాటి పాత్ర తీసుకొని నూనె లేక నెయ్యి వేసి వెడెక్కిన తరువాత ఎండుమిర్చి, పోపుగింజలు, వేరు శెనగగుండ్లు, కేరెట్, తరిగిన పాలకూర, టమాటో ముక్కలు వేసి అవి వేగిన తరువాత నీరు పోయాలి. నీరు మరిగేటప్పుడు తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు కొర్రలను నిదానంగా కొద్దికొద్దిగా పోస్తూ కట్టకుండా అట్లకాడతో త్రిప్పుతుండాలి. చక్కగ
ా ఉడికిన తరువాత దించుకొని కొత్తిమీర చల్లి వడ్డించాలి. ఇందులోకి కారప్పొడిగాని, చట్నీగానీ మంచి కాంబినేషన్

గోధుమ రవ్వ ఉప్మా

గోధుమ రవ్వ ఉప్మా
కావలసినవి
గోధుమ రవ్వ : పావుకిలో
ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి
పచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలి
అల్లం : చిన్న ముక్క తురుముకోవాలి
కరివేపాకు : కొద్దిగా
వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా
నూనె : 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
కొత్తిమీర : కొద్దిగా
నీళ్ళు : రవ్వను గ్లాసుతో కొలచి అదే గ్లాసుతో 1 గ్లాసు రవ్వకు 3 గ్లాసులు నీళ్ళు పోయాలి.
పోపుగింజలు : 1 స్పూను
ఎండుమిర్చి : 2
తయారు చేయు విధానం
ముందుగా పాన్ లేక వెడల్పాటి పాత్ర తీసుకొని నూనె లేక నెయ్యి వేసి వెడెక్కిన తరువాత ఎండుమిర్చి, పోపుగింజలు, వేరు శెనగగుండ్లు, అల్లం వేసి అవి వేగిన తరువాత నీరు పోయాలి. నీరు మరిగేటప్పుడు తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు గోధుమ రవ్వను నిదానంగా కొద్దికొద్దిగా పోస్తూ అట్లకాడతో త్రిప్పుతుండాలి. చక్కగా ఉడికిన తరువాత దించుకొని కొత్తిమీర చల్లి వడ్డించాలి. ఇందులోకి కారప్పొడిగాని, చట్నీగానీ మంచి కాంబినేషన్
ఇది సుమారు ముగ్గురు లేక నలుగురికి సరిపోతుంది. సభ్యులను బట్టి పరిమాణం పెంచుకోవాలి

అటుకుల ఉప్మా

అటుకుల ఉప్మా
అటుకులు : పావుకిలో
ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి
పచ్చిమిర్చి : 2 కాయలు చిన్నముక్కలుగా తరుగుకోవాలి
అల్లం : చిన్న ముక్క తురుముకోవాలి
కరివేపాకు : కొద్దిగా
వేరుశెనగ గుళ్ళు : కొద్దిగా
నూనె : 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
కొత్తిమీర : కొద్దిగా
పోపుగింజలు : 1 స్పూను
ఎండుమిర్చి : 2
తయారు చేయు విధానం
ముందుగా అటుకులను నీళ్ళలో వేసి 2 నిమిషాలు ఉంచి నీరు వడపోసి అటుకులను నీరులేకుండా గట్టిగా పిండుకోవాలి. తరువాత పాన్ లేక వెడల్పాటి పాత్ర తీసుకొని నూనె లేక నెయ్యి వేసి వెడెక్కిన తరువాత ఎండుమిర్చి, పోపుగింజలు, వేరు శెనగగుండ్లు, అల్లం వేసి అవి దోరగా వేగిన తరువాత అటుకులు, తగినంత ఉప్పు కలుపుకోవాలి.. అట్లకాడతో అన్నీ కలిసేటట్లు చక్కగా త్రిప్పుకోవాలి.
ఇది సుమారు ముగ్గురు లేక నలుగురికి సరిపోతుంది. సభ్యులను బట్టి పరిమాణం పెంచుకోవడం తగ్గించుకోవడం చేయాలి.