దోసెలు బాగా రావాలంటే

దోసలు బాగా రావాలంటి మొదట 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాస్ లు బియ్యం నీళ్ళలో 9 గంటలు నాన పెట్టాలి. 4 చెంచాలు మెంతులు కూడా వేయాలి. తరువాత మెత్తగా రుబ్బాలి. గట్టిగా కాకుండా గరిట జారుడు గా వేసుకుంటే దోసెలు చాలా బాగా రుచి కరముగా వస్తాయి. రుబ్బేటప్పుడు 10 నిమిషాలు నాన పెట్టిన అటుకులు వేస్తే దోసెలు బాగా మెత్తగా వస్తాయి. పచ్చి సెనగ పప్పు వేసి రుబ్బిన దోస ఎర్రగా కరకరలాడుతూ రుచికరంగా ఉంటుంది. కరకర లాడుతూ దోసెలు కావాలంటే 1 మినపప్పు, 3 గ్లాసులు బియ్యం వాడాలి . అదే మెత్తగా దోసలు కావలంటే 1 గ్లాసు మినపప్పు 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలి.

నాన్ స్టిక్ పెనం అయితే ఈజీగా వస్తాయి. ఇనప పెనం మీద దోసలు రావటం ఇబ్బంది పెడితే ఆనపకాయ పై ముచ్చుక కోసి నూనెలో ముంచి పెనం మీద అంతా రాసి అప్పుడు దోస వేస్తే సులువుగా ఉంటుంది .

బొంగులో బిర్యానీ

బొంగు బిర్యానీ

ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమల్లి, అరకు ప్రాంతాల్లో నివసించే గిరిజనుల సంప్రదాయ వంటకం ఈ బొంగు బిర్యానీ.

బొంగు బిర్యానీ
బొంగు బిర్యానీ

రాజ్ కచోరీ తయారీ విధానం

ముందుగా ఒక కప్పుడు మైదా పిండి తీసుకుని జల్లించుకోవాలి. ఇందులో చిటికెడు బేకింగ్ సోడా, సరిపడ ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి కలపాలి. ఇప్పుడు రెండు చెంచాల వంట నూనె వేసి బాగా చపాతీ పిండిని కలిపినట్టు కలపాలి. అలా కలిపాక ముప్పావు కప్పు గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా పోసి కలుపుతూ చపాతీ పిండిలాగా ఉండ చేయాలి, బాగా మద్దించాలి. ఈ పిండిని తడిబట్టలో చుట్టి అరగంట పక్కన పెట్టుకోవాలి.

ఈ అరగంటలో, ఒక కప్పుడు బఠాణీలు క్యారెట్ లు ఉడకబెట్టుకుని నీళ్లు వడబోయాలి, ఇందులో అల్లం పచ్చి మిరపకాయలు వేసి మిక్సీ లో రుబ్బుకోవాలి.. అవసరం అయితే రెండు మూడు చెంచాల నీళ్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బఠాణీలు ముద్దని మూకుట్లో వేసి రెండు చెంచాల నూనె పోసి వేయించాలి. వేయించేటప్పుడు, ఉప్పు ,కారం, ఆమ్ చూర్, గరం మసాలా , జీలకర్ర, ధనియాలపొడి, కొత్తిమీర తరుగు ,వేసి కలపాలి. ముదురు ఆకుపచ్చ రంగులోకి వచ్చేదాకా 5 -7 నిమిషాల పాటు కలుపుతూ వేయించి, ఆ ముద్దని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మైదా పిండిని తడి బట్టలోనించి తీసి 2 నిమిషాలు మద్దించి రోల్ చేసి…సమానం గా అయిదు ఉండలు చేసుకోవాలి. ఒకొక్క ఉండని అరచేతిలో వేసి వెడల్పుగా నొక్కి, అంచులు పట్టుకుని, గిన్నె ఆకరంలోకి పైకి ఎత్తి , బఠాణీల ముద్దని కొద్దిగా ఈ గిన్నె లాంటి మైదా పిండి లో పెట్టి అన్నివైపుల నించీ మోసేయ్యాలి.

అయిదు ఉండలనీ ఇలా చేసుకున్నాక మళ్లీ అరచేతిలో వేసి, వెడల్పు అయ్యేదాక ,నొక్కాలి, మరీ పల్చబడిపోకండా గమనించుకోవాలి..

ఇప్పుడు ఒక లీటర్ వంట నూనెని మూకుట్లో పోసి, 5–7 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. నూనె కాగాక, ఈ అయిదు రాజ్ కచోరీలనీ నూనెలో వేసి వేయించాలి. నిమిషానికొకసారి అటు ఇటు చట్రం తో తిప్పుతూ వేయించుకోవాలి.కొద్దిగా పొంగి, బాగా బంగారు వర్ణంలోకి వచ్చాక వెడల్పాటి పళ్ళెంలో, టిష్యూ పేపర్స్ వేసి ఈ రాజకచోరీలని మూకుట్లోంచి తీసి, పేపర్ మీద పెట్టాలి.

ఇది పుదీనా చట్నీ, టమాటో సాస్ లతో బాగుంటుంది. 

మిస్టీ దోయి – తయారు చేసుకునే విధానం

బెంగాలీ భాష లో మిస్టీ అంటే తీపి, దోయి అంటే పెరుగు = తియ్యని పెరుగు (মিষ্টি দই). 150 సంవత్సరాల క్రితం భారత దేశం లోని షేర్పుర్ జిల్లా (ఇప్పుడు ఇది బంగ్లాదేశ్ లో ఉంది.) లో ఆధునిక మిస్తీ దోయి యొక్క మూల వంటకం తయారు ఐయ్యింది. ఆధునిక భారత దేశం లోని బెంగాల్, త్రిపుర,అస్సాం,ఒడిశా రాష్ట్రాలలో అద్భుతమైన డెసెర్ట్ గా పేరుగాంచింది.

తయారు చేసుకునే విధానం:

ఒక లీటరు పాలు తీసుకొని, తక్కువ, మధ్యస్థ మంట మీద ఉంచి సగం అయ్యేదాకా మరిగించండి. ఇప్పుడు మనం ఈ పాలల్లో వేసే ఈ పదార్థమే, ఈ బెంగాలీ వాళ్ళ సీక్రెట్ అండ్ సిగ్నేచర్ ఇంగ్రిడియంట్ …ఖర్జూరబెల్లం… (dates palm jaggery).

బెంగాలీలు వాళ్ళ వంట విషయం లో చాలా particular గా ఉంటారు.కాబట్టి సంప్రదాయ మిస్టీ దోయి లో పంచదార వాడకూడదు. పంచదార వాడితే బెంగాలీ వాళ్ళు అసలు ఒప్పుకోరు, బెంగాల్ లో ఈ ఖర్జూర బెల్లం చాలా సులభంగా దొరుకుతుంది. కొంత మంది తాటి బెల్లం కూడా ఉపయోగిస్తారు.

చాలా రకాల బెంగాలీ స్వీట్లలో కూడా ఈ ఖర్జూర బెల్లం వాడతారు. ఇప్పుడు అర్థమైందా..? బెంగాలీ స్వీట్స్ ఎందుకు అంత మధురంగా ఉంటాయో..! ఇప్పుడు 300 గ్రాముల ఖర్జూర బెల్లం తీసుకుని పాలలో కరిగేదాకా కలపండి. స్టౌ ఆపివేసి పాల మిశ్రమాన్ని గది ఉష్ణోగ్రత వచ్చేవరకు చల్లారబెట్టాలి. తరువాత కొద్దిగా పెరుగు వేసి ఆ మిశ్రమాన్ని, మట్టి కుండలలో పోయాలి. మట్టి కుండలోని చిన్నచిన్న రంధ్రాల వల్ల పెరుగులోని నీరు ఆవిరైపోతుంది. అందువల్ల మిస్తీ డోయి చాలా చక్కగా వస్తుంది. ఆ మిశ్రమాన్ని ఒక 10 లేదా 12 గంటల పాటు కదపకుండా ఉంచితే మిస్తీ డోయి రెడీ… మీరు దాన్ని అలాగే తినవచ్చు లేదా ఒక రెండు గంటలు ఫ్రీజర్ లో ఉంచి తినొచ్చు.

మిస్తీ డోయి లో యాలకుల పొడి వేయరు, ఎందుకంటే మిస్తీ డోయి యొక్క సహజ రుచి ను (natural flavour) యాలకుల పొడి పాడు చేస్తుంది అంటారు బెంగాలీలు.

మైసూర్ పాక్ – చరిత్ర, తయారీ

మైసూర్ పాక్ అనేది 1935 లో మొదటిసారి తయారు చేయబడిందిని ఆహార చరిత్రకారులు చెబుతారు. ఇలా వంద సంవత్సరాలు కూడా పూర్తి కాని మైసూర్ పాక్, దక్షిణాది తీపి పదార్థాలలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొంది. గట్టిగా, మెత్తగా, గుల్లగా,, జీడి పప్పు, మాల్ట్, క్యారట్ ఇలా ఎన్నో రకాలు మైసూర్ పాక్ లో.

చేయడానికి తేలిక, పెద్ద సమయమూ పట్టదు, ప్రత్యేకమైన వస్తుసామాగ్రీ అవసరంలేదు దీని తయారీలో. పైగా ఎలా వచ్చినా తినడానికీ ఎటువంటి ఇబ్బందీ వుండదు.

మైసూర్ అంటే అందరికీ తెలిసిందే. అక్కడి రాజుగారి దసరా ఉత్సవాలు విశ్వవిఖ్యాతం. పాకం అంటే చక్కెర/బెల్లంతో నీటిని కలిపి ఒక నిర్ధిష్టమైన చిక్కదనం తీసుకు రావడం. దీని తయారీ వెనుక మైసూరు రాజుగారి పాకశాల వుంది; కనుకనే మైసూర్ పాక్ అనే పేరు తెచ్చుకొంది. అసలు విషయానికి వెడితే, 4వ కృష్ణరాజ ఉడియార్ మైసూరు సంస్థానాధిపతిగా వున్న రోజులలో ఆయన ఆస్ఖానంలో పాకశాలాధిపతిగా కాకాసుర మాదప్ప వుండేవాడు. ఆయన తీపి పదార్థాల తయారీకి పేరుగాంచినవాడు. 1935 వ సంవత్సరంలో ఒక రోజు మాదప్ప శనగపిండి, చక్కెర మరియు నెయ్యిలను కలిపి ఒక కొత్త తీపి పదార్థాన్ని ప్రయోగంగా చేసాడు. చల్లారిన ఆ పదార్థం గట్టి పడి కేక్ లాగా తయారవగా, దానిని రాజుగారికి రుచి కొరకు అందించగా ఆది ఆయనకు విపరీతంగా నచ్చడంకో, మైసూరు పాక / మైసూర్ పాకం/ మైసూర్ పాక్ గా రూపు దిద్దుకొంది.

రాజుగారు తానేకాక ప్రజలూ ఆ తీపిని రుచి చూడాలని మాదప్పకి దానిని అమ్మేందుకు దుకాణం తెరవమని చెప్పారట. గురు స్వీట్ మార్ట్ అనే పేరుతో ఆ దురాణం మైసూరులో ఇప్పటికీ ఆయన వారసుల ద్వారా నడపబడుతున్నది. మైసూర్ పాక్ తయారీకి మాదప్ప విధానాన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నరట అక్కడ.

మైసూర్ పాక్ తయారీ: ముఖ్యంగా మూడు పదార్థాలు కావాలి. శనగపిండి, చక్కెర, నెయ్యి (కాదంటే డాల్డానో, రీఫైన్డ్ నూనో లేక అన్నటినీ కలుపుకొని అయినా), 1:2:3 నిష్పత్తిలో తీసుకోవాలి. చక్కెర, నెయ్యి మరీ ఎక్కువనుకొంటే కొంచంగా తగ్గించుకోవచ్చు. మరీ తగ్గితే రుచి బాగుండక పోవచ్చు.

శనగపిండి కావాలంటే పచ్చి వాసన పోయేదాకా సన్న సెగ మీద వేపుకోవాలి. తరువాత సరిపోయేన్ని నీళ్ళు పోసుకొని (తక్కువయితే పాకం చెడే ప్రమాదం వుంది లేక ఎక్కువయితే పాకం వచ్చే దానికి సమయం ఎక్కవ పట్టవచ్చు)పంచదారవేసి వేడి చేయండి. పక్కనే ఇంకో గిన్నెలో నేతిని కూడా బాగా మరగబెట్టాలి. మరిగే నేతిని పాకంలో వేయడం వలన మైసూర్ పాక్ గుల్లగా వస్తుంది. చక్కెర పాకం తీగలాగా వచ్చినప్పుడు శనగపిండిని వుండకట్టకుండా కలుపుతూ పాకంలో వేసుకోవాలి. తరువాత మధ్యమధ్య మరగ కాచిన నెయ్యిని పోసుకోంటూ కలుపుకోవాలి. నెయ్యి పోసినప్పుడు బాగా పొంగుతుంది. పొంగు తగ్గేదాకా కలిపి, మరలా నెయ్యి పోసి కలుపుతూ వుండాలి. పాకం గట్టి పడుకుందనిపించేలోగా మిగతా నెయ్యి మొత్తం పోసి కలిపి, మందుగా నెయ్యి పూసి వుంచుకొన్న పళ్ళం లోకి ఈ మిశ్రమాన్ని పోసి ఐదు నిమిషాలు చల్లార్తి గట్టి పడిన తరువాత మనకు నచ్చిన ఆకారంలో కోసుకొంటే మైసూర్ పాక్ తయ్యారు. వేడిగా తింటే ఒక రుచిలో వుండే మైసూర్ పాక్ చల్లారిన తరువాత ఇంకో రుచిలో వుంటుంది. ఇలా చేసుకొన్న మైసూర్ పాక్ వారం పది రోజుల దాకా నిలువ వుంటుంది.

సుమారు 45-50 గ్రాముల మైసూర్ పాక్ లో 195 కేలరీలు, 10 గ్రాముల కొవ్వు. వుంటాయి, కాబట్టి రుచిగా వుందని అదే పనిగా తినేయకండి. అది వచ్చింది రాజుగారి భోజనశాల నుంచనేది గుర్తుంచుకోవాలి.

కందిపప్పు పచ్చడి – తయారీవిధానం

కావలసిన దినుసులు:

కందిపప్పు-ఒక కప్పు

ఎండు మిర్చి -10 నుంచి 12

చింతపండు నానపెట్టి -చిన్ననిమ్మ సైజు ముద్ద

ధనియాలు-ఒక స్పూను

వెల్లుల్లి -6-7

ఉల్లిపాయ -ఒకటి

ఆవాలు,జీలకర్ర,మినప్పప్పు -అర స్పూను (తిరగమాత కు )

ఇంగువ,పసుపు చిటికెడు నుంచి మీ ఓపిక వరకు

తయారీవిధానం :స్టవ్ వెలిగించుకుని తక్కువ మంట లో ధనియాలు,జీలకర్ర నూనే లో దోరగా వేయించుకుని ఆ తర్వాత ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించి,ఆపైన వెల్లుల్లి వేసి వేగాక స్టవ్ ఆపి ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. బాగా కడిగి ఆరబెట్టిన కందిపప్పును ఒక స్పూన్ నూనె లో మీడియం మంటలో, మంచి సువాసన వచ్చి, బంగారు రంగులోకి మారే వరకు వేయించి స్టవ్ ఆపి పప్పు వేడి తగ్గే దాకా చర్చాలి. ఇప్పుడు ఈ రెండు మిశ్రమాల్ని మిక్సీ లో వేసి కొద్దిగా ఉప్పు మీరుచికి తగినంత (అన్నిట్లోకి పలాయన వాదం ఇక్కడే ఇది ఎవ్వరు చెప్పరు కాబట్టి సరిగా రాపోతే మీ ఖర్మ అంతే కాని చెప్పిన వాడు బాధ్య్డుడు కాదు.ఇన్వెస్ట్ మెంట్స్ అర్ సబ్జెక్టేడ్ టు … అని స్పీడు గా చదివే అడ్వర్టైస్ మెంట్ లాగా )వేసి బరకగా అయెంత వరకు తిప్పాలి.మిక్సి మూత తీసి ఇంతకూ ముందే తడిపి ఉంచిన చింతపండు (వేన్నీళ్ళ లో తడిపితే బాగా మెత్త పడితే రసం లో పులుపు బాగుంటుంది)రసాన్ని తొలికెలు రాకుండా పిండి ,అవసరాన్ని బట్టి నీటిని చేర్చి మరల మిక్సి వేయాలి..పైన చెప్పినట్లు ముద్దగా /జారుడుగా చేసుకోవాలి.మరీ మెత్తగా పిండిలా పట్టటం వల్ల రుచి పోతుంది.కొంచెం నలిగి నలగని రకమైతే అన్నం లోకి రుచి బాగుంటుంది.మెత్తటి పచ్చడి టిఫిన్స్ లోకి బెటర్ .కొద్దిగా రుచి చూసి ఉప్పు ,పులుపు లను సరిచేయండి .

చివరగా బాణలి లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర చిటపటలాడే వరకు వేడిచేసి ,కరివేపాకు,వెల్లుల్లి,పసుపు,ఇంగువ దఫాల వారీగా చేర్చండి.కరివేపాకు మాడేలోగా బాగా కలియబెట్టి రెడీ గా ఉన్న మిక్సి లోని కంది పచ్చడి మాతృక ని ఇందులో వేసి బాగా కలియ తిప్పండి. కందిపప్పును,జీలకర్ర,ధనియా,మిర్చి కలిపి వేయించుకున్న దాని కంటే ఇలా విడివిడిగా వేయించుకున్న పధ్ధతి లో రుచి ఇంకో అంతస్తు ఎక్కువే మరి.(next level).

వేడి అన్నం లోకి నెయ్యి కాంబినేషన్ తో ఇదొక అద్భుతమైన అధరువు. భోజనం దీంతోనే మొదలు పెట్టటమే కాదండోయ్ ముగించే ముందు పెరుగన్నం లోకి కూడా కిక్కు నిచ్చే అలవాటు దీని కున్న మరి సుగుణం . దీన్లో పాలకూర కలిపి కొందరు, కొత్తిమీర కలిపి కొందరు ,కొత్త పుంతలు తొక్కారు.

టమాటా కెచప్‌ vs టమాటా సాస్‌

కెచప్

సాస్‌లలో ఒక రకం కెచప్. కెచప్‌ని టమాటోలు, నూనె, వినెగర్, పంచదార, ఒక్కోసారి కొన్ని మసాలా దినుసులు ఉపయోగించి చేస్తారు. ఇది వేడిగా తినరు. మనం ఫ్రెంచ్ ఫ్రైస్, నూడుల్స్, శాండ్విచ్ వంటివాటిల్లో ఎక్కువగా తినేది కెచప్పే.

మ్యాగీ టమాటో కెచప్. ® నెస్లే వారి రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్.

సాస్

టమాటో సాస్‌ని టమాటో, నూనె, మసాలాదినుసులతో పాటుగా వెజిటబుల్ లేక మీట్ స్టాక్ వాడి చేస్తారు. ఇందులో వినెగర్ వాడరు. సాధారణంగా పంచదార కూడా వాడరు. ఇది కొన్ని వంటకాలు వండుతున్నప్పుడూ, వాండాక పైన డ్రెస్సింగ్ లాగా వాడతారు. టమాటోతో మాత్రమే కాక అనేక రకాల సాస్‌లు చేసుకోవచ్చు. రెడ్ సాస్, వైట్ సాస్‌, బార్బెక్యూ సాస్ లాంటివి దీనికి ఉదాహరణలు. ఇంచుమించు వీటన్నిటినీ వేడిగా వడ్డిస్తారు.

పరోటా రకాలు

పాలక్‌ పరోటా

కావలసినవి: గోధుమపిండి, మైదాపిండి – 1 కప్పు చొప్పున, పాలకూర – 1 కట్ట, నిమ్మరసం – 1 టీ స్పూన్‌, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్‌, అల్లం పేస్ట్‌ – 1 టీ స్పూన్‌, ఉప్పు – తగినంత, నీళ్లు – కావాల్సినన్ని, నూనె/నెయ్యి – సరిపడా

తయారీ: ముందుగా పాలకూర శుభ్రం చేసుకుని మిక్సీ బౌల్‌లో వేసుకుని, అందులో నిమ్మరసం, 2 టేబుల్‌ స్పూన్ల నీళ్లు వేసుకుని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్‌ తీసుకుని.. అందులో గోధుమపిండి, మైదాపిండి, అల్లం పేస్ట్, పాలకూర పేస్ట్, తగినంత ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుని చపాతి ముద్దలా చేసుకుని.. ఆ ముద్దకు తడి వస్త్రాన్ని చుట్టి.. అరగంట పాటు పక్కనపెట్టుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని నిమ్మకాయ సైజ్‌ ఉండలులా చేసుకుని.. చపాతీ కర్రతో ఒత్తుకుని.. మరోసారి మడిచి మళ్లీ చపాతీలా ఒత్తి.. పెనంపై నెయ్యి లేదా నూనెతో ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి.

స్వీట్‌ కార్న్ తో వంటకాలు‌

స్వీట్‌ కార్న్‌ పాయసం

కావలసినవి: స్వీట్‌ కార్న్‌ – 2 కప్పు(మెత్తగా ఉడికించుకోవాలి), చిక్కటి పాలు – 4 కప్పులు, నెయ్యి – పావు కప్పు, పంచదార – అర కప్పు, ఏలకుల పొడి – 1 టీ స్పూన్‌, పిస్తా, కిస్‌ మిస్, జీడిపప్పు, బాదం పప్పు – 2 టేబుల్‌ స్పూన్‌ చొప్పున(నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి), కుంకుమ పువ్వు – చిటికెడు

తయారీ: ముందుగా ఉడికిన కార్న్‌లో 2 టేబుల్‌ స్పూన్లు తీసి పక్కనపెట్టి.. మిగిలిన కార్న్‌ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్‌ తీసుకుని అందులో కార్న్‌ మిశ్రమంతో పాటు 2 కప్పుల పాలు పోసి బాగా కలుపుకోవాలి. అనంతరం స్టవ్‌ ఆన్‌ చేసి, కళాయిలో 4 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి అందులో కార్న్‌ – పాల మిశ్రమాన్ని వేసి చిన్నమంటపై ఉడికించుకోవాలి. అందులో కుంకుమ పువ్వు కలుపుకోవాలి. మిగిలిన పాలు పోసి గరిటెతో తిప్పుతూ.. అడుగంటకుండా చూసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పంచదార, ఏలకుల పొడి వేసి బాగా  కలుపుతూ ఉండాలి. దించే ముందు బాదం, జీడిపప్పు, కిస్‌ మిస్, పిస్తా ముక్కల్ని వేసుకుని ఒకసారి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది స్వీట్‌ కార్న్‌ పాయసం.

పనీర్‌తో వంటలు

పనీర్‌ 65

Paneer 65, Palak Paratha Recipe In Telugu - Sakshi

కావలసినవి: పనీర్‌ ముక్కలు – 15, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు – అర టీస్పూను, కొత్తిమీర తరుగు – పావు కప్పు,  మైదా – ఒక టీస్పూను, కార్న్‌ ఫ్లోర్‌ – ఒక టీ స్పూను, అల్లం పేస్టు – ఒక టీస్పూను, కారం – సరిపడినంత (స్పైసీగా కావాలనుకుంటే టీ స్పూను వేసుకోవచ్చు), పసుపు – అర టీ స్పూను, గరం మసాలా – టీస్పూను, నూనె – సరిపడినంత 

తయారీ: స్టవ్‌ మీద కళాయి పెట్టి… వేయించడానికి సరిపడా నూనె పోయాలి. నూనె కాస్త వేడెక్కాక పన్నీర్‌ ముక్కలు, కార్న్‌ ఫ్లోర్, మైదా, అల్లం పేస్టు వేసి వేపాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి. తరువాత కొంచెం నీరు పోయాలి. అవి ఉడుకుతుండగా… మరో బర్నర్‌ పై కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు బాగా వేగిన పనీర్‌ ముక్కల్ని తీసి వీటిలో వేసి బాగా కలపాలి. అంతే పనీర్‌ 65 సిద్ధం.

బ్రెడ్ తో వంటకాలు

బ్రెడ్ పకోడి

బ్రెడ్ ముక్కలు సగం సగం త్రికోణాకారంలో కోసి, శనగ పిండి బజ్జీ పిండిలా కలిపి, బ్రెడ్ముం ముక్కలు ముంచి తీసి నూనెలో వేయించుకుంటే సరి. కావాలంటే రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో చిదిమిన ఆలూ కూరి, రెంటిని కలిపి ముంచి వేయించుకోవచ్చు.

శాండ్విచ్

బ్రెడ్ రోల్

సమోసా లో కూరే ఆలూ మసాలకి కొంచెం చేయి తడిచేసుకుని చుట్టూ బ్రెడ్డు చుట్టి అంచులు దగ్గరగా అదిమి నూనెలో వేయించుకోడమే.

గార్లిక్ బ్రెడ్

మంచి బ్రెడ్డు (బగెట్ లాంటిది) కోసి నూనెలో నానిన వెల్లుల్లి రెబ్బ అనుమాతం రుద్ది అవెన్ లో వేడిచేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. పైన చీజ్,
బటర్, ఆలివ్ మీ ఇష్టం.

షాహి తుక్డా

నేతిలో దోరగా వేయించిన బ్రెడ్డుముక్కపైన చక్కెర పాకం పోసి, బాగా మరగ కాచిన రబ్డి పరిచి డ్రై ఫ్రూట్సు తో అలంకరించుకుని చూస్తే తినాలనిపించదు. చెదిరిపోతుందని. తింటే వదలడం కష్టం.

బ్రెడ్ ఆమ్లెట్

ఫ్రెంచి వారి ప్రసిద్ధ బ్రెడ్డు బాగేట్(Baguette) .దీని ఆకారమే ముడులు ఉండి ,పొడుగ్గా కర్ర ముక్క ని తలపించే బ్రెడ్ ఇది.దీని అర్ధం wand/baton అంటే సన్న కర్ర అని .

(Redstaryeastచిత్రం)

ఇటలీ లో చేసే షియాబెట(ciabatta).దీనర్ధం స్లిప్పర్ అని అట.దీన్ని సాండ్విచ్ ,పానిని చేయడానికి వాడతారు.

(big oven image)

సౌర్దొవ్(sour dough) పేరులో ఉన్నట్టే చాలా సేపు పులియ బెట్టటం వల్ల పులుపెక్కిన బ్రెడ్ ఇది.

(Bbc image )

పిటా బ్రెడ్(Pita).మధ్య ప్రాచ్యం లో పేరుపొందిన బ్రెడ్ ఇది.ఇంచుమించు మన రొట్టెలా ఉన్న ఇది ఫలఫెల్ అనే సాంద్ విచ్ కి బాగా వాడతారు.లోపల బోలుగా ఉండటాన ఏదైనా కూర లాంటిది పెట్టే ఆస్కారం ఉన్న బ్రెడ్ .

(Browneyedbaker image)

బ్రియోష్ (Brioche): గుడ్లు వెన్న కలిపి చేసిన బ్రెడ్ ఇది.ఓవెన్ లో పెట్టే ముందు గుడ్డు సోన పైన ఒక రౌండ్ పూస్తారు.లోపల మెత్తగా ఉండి కొంచెం తీపి ఉండే బ్రెడ్ ఇది.

(Timesfood image )

క్రోసాంట్(Croissant) : దీనికున్న నెలవంక ఆకృతి వల్ల (crescent shape) వల్ల ఈ పేరు వచ్చింది.ఇది ఆస్ట్రియ లో పుట్టి యూరపు అంతా పాకిన బ్రెడ్.పొరలుపొరలు గా రోల్ చేసి ఓవెన్ లో చేసే విచిత్ర ఆకారపు బ్రెడ్.నాకైతే గొంగళిపురుగు ప్యుపా లాగా ఉంటుంది .

(Shawneemissionpost image)

బాగెల్ (bagel)పోలాండ్ లో యూదుల సృష్టి.రింగులు గా ఉంది బ్రేక్ ఫాస్ట్ లోకి తింటారు.

మనం విరివి గా వాడే పదం పేస్ట్రీ ఇటాలియన్ పదం ఐన పటిస్సేరి(pâtisserie) నుంచి వచ్చింది . పేస్ట్రీ అంటే స్వీట్స్ అనే అర్ధం ఉంది.కేకుల తయారీ ని కేకరీ అని,కాండిమేన్త్స్ అంటే చాక్లెట్ వంటివి చేయటాన్ని కండి టోరి అని ప్రత్యెక పదాలు కూడా ఉన్నాయండి.

మొలకలు – లాభాలు

మొలకలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. శరీరానికి మేలు చేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి గోధుమ ,పెసలు,శెనగలు, మెంతులు, బఠాణీలు,రాగులు. మొలకెత్తిన గింజల్లో ఇనుము, ఫాస్పరస్, కాల్షియమ్,ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, ఏ,సి, బి 6, కే మొదలైన విటమిన్ లు వున్నాయి.

మొలకెత్తిన గింజల్లో మాంసకృత్తులు కూడా చాలా ఎక్కువ లభిస్తాయి. శాఖా హారులు కి మంచి మాంస కృత్తులు కలిగిన శాఖా హారం . విటమిన్ లోపాలతో బాధ పడే వాళ్ళు మొలకెత్తిన గింజలు తింటే ,త్వరగా రోగనిరోధకశక్తి నీ పొందుతారు. మొలకలలోని పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేస్తుంది.కడుపు వుబ్బరం వున్న వాళ్ళు కూడా ఈ మొలకలు తిన వచ్చు. తొందరగా అరుగుతాయి.

నానబెట్టిన లేదా వు డ క బెట్టిన గింజలు కంటే మొలకెత్తిన గింజల్లో 27 శాతం ఎక్కువ ‘ ఏ’ విటమిన్ లభిస్తుంది.అందువల్ల మొలకెత్తిన గింజలు తినడమే మంచిది. ఇక బరువు తగ్గాలనుకునే వారు ఇవి తింటే ,చాలా సేపు ఆకలికి ఆగగల్గుతారు. కొంచెం తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అందువల్ల మంచి శరీరాకృతి పొందుతారు. పొట్ట తగ్గించు కోవాలంటే వీటిని మించిన గొప్ప ఆహారం ఇంకొకటి లేదు.

ఇక జుట్టు అధికంగా వూడే వారు ఈ మొలకలను తినడం వల్ల ,జుట్టు వూడ డా న్ని నివారించ వచ్చు. బట్టతల రాకుండా ముందు గా జాగ్రత్త పడవచ్చు. కొంతమంది నమల లేని వాళ్ళు వీటిని ఎండ బెట్టి, పొడి చేసి, వాడతారు. రాగులు కూడా ఇలా పొడి చేసి పెట్టుకోవాలి.రాగి జావ కాచు కుంటే ,ఎక్కువ పోషకాలు అందుతాయి.

మొలకలు తయారు చేసే విధానం:

పెసలు,శెనగలు,గోధుమలు ఇలా ఏవి మొలకలు చెయ్యాలంటే అవి 6 గంటలు నాన బెట్టాలి. అవి నీళ్లల్లో నుండి తీసి ,ఒక గిన్నెలో వేసి, పైన తడివస్త్రం రెండు మడతలు వేసి, మొత్తం కప్పండి. 8 నుండి 10 గంటల సమయంలో మొలకలు తయారు అవుతాయి. గోధుమలు కి మళ్ళీ తడిపిన వస్త్రం తో ఇంకొక 10 గంటలు కప్పి ఉంచితే, మొలకలు చక్కగా వస్తాయి. ఇంకా ఎక్కువ సేపు వుంచితే మొలకలు పెద్దవి గా అవుతాయి కానీ రుచి అంతగా బాగా వుండవు.

పెసలు, శెనగలు, వేరు సెనగలు, మెంతులు, కాబులి శెనగ లు, గోధుమలు మొలకలు వచ్చిన వి. ఏమైనా సరే వాటిలో పచ్చి మామిడి ముక్కలు, క్యారట్, కొద్దిగా కాబేజీ ముక్కలు, ఇంకా వేరుసెనగ ఉడికించి నవి కూడా కలుపుకొని , రుచికరం గా చేసుకోవచ్చు.

కాలక్షేపం మొక్కశెనగలు తయారీ:

మొలక శెనగలు 1కప్పు, ఉల్లి ముక్కలు కొద్దిగా, టమోటా ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి లేదా కాప్సికం ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం తగినంత, అవిశ కారప్పొడి కొంచెం. మీకు ఇష్టమయితే. ఇంకా రుచి గా కావాలి అంటే మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం శోన్ఫ్ కూడా కలుపుకోవచ్చు. ఇంకా మరమరాలు లేదా వేయించిన అటుకులు, కొద్దిగా కారపు బూందీ కూడా కలుపు కోవచ్చు. గోధుమ రవ్వ లేదా బియ్యం లో కలిపి వండుకొని, ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు.

డేట్స్‌ హల్వా

కావలసినవి: ఖర్జూరం – 2 కప్పులు(గింజలు తొలగించి, శుభ్రం చేసుకోవాలి), నెయ్యి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు(1 కప్పు నీళ్లలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడినన్ని, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు – 10(ముక్కలు కట్‌ చేసుకుని నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఏలకుల పొడి – పావు టీ స్పూన్

తయారీ: ముందుగా ఖర్జూరంలో ఒక కప్పు వేడి నీళ్లు వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. ఆ మిశ్రమాన్ని మొత్తం బౌల్లో వేసుకుని, అందులో పావు కప్పు నెయ్యి వేసుకుని గరిటెతో తిప్పుతూ చిన్న మంటపైన ఉడికించుకోవాలి. దగ్గర పడేసరికి మళ్లీ 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకుని తిప్పుతూ ఉండాలి. తర్వాత మొక్కజొన్న మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. మళ్లీ 2 టేబుల్‌ స్పూన్లు నెయ్యి వేసుకుని, వేయించి పక్కన నెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, ఏలకుల పొడి వేసుకుని బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని.. ఒక బౌల్‌లోకి తీసుకుని 30 నిమిషాలు చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్‌ చేసుకుంటే సరిపోతుంది.

చపాతీ వెజ్‌ రోల్స్‌

Chapati Veg Roll Making Recipe In Telugu - Sakshi

కావలసినవి: చపాతీలు – 4, క్యాప్సికమ్‌ – 2, టమాటోలు –2, బంగాళదుంపలు – 2(మెత్తగా ఉడికించి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), పచ్చి బటానీలు – 2 టేబుల్‌ స్పూన్లు(నానబెట్టి, ఉడికించుకోవాలి), ఉల్లిపాయ – 2(ముక్కలు కట్‌ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 3(ముక్కలు కట్‌ చేసుకోవాలి), మిరియాల పొడి – 1 టీ స్పూన్‌, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్‌, పసుపు – అర టీ స్పూన్‌, టమాటో కెచప్‌ – 1 టీ స్పూన్‌, ఉప్పు – సరిపడా, నూనె – తగినంత

తయారీ: కళాయిలో నూనె వేసి వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, టమాటోలను సన్నగా తరిగి వాటిని కూడా వేయించాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసుకుని కూరలా చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కాస్త నీళ్లు పోసి ఉడికించాలి. దించడానికి కొన్ని నిమిషాల ముందు జీలకర్ర పొడి, ఉప్పు, టమాటా కెచప్‌ వేసి ఉడికించాలి. అనంతరం చపాతీలను పెనంపై ఇరువైపులా కాల్చి.. కర్రీ వేడిగా ఉన్నప్పుడే చపాతీపై ఒకవైపు వేసుకుని రోల్స్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

మీల్‌మేకర్‌ పకోడా

కావలసినవి:మీల్‌మేకర్‌ – 1 కప్పు(పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి – అర కప్పు చొప్పున, శనగపిండి – పావు కప్పు+3 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, కారం – 1 టీ స్పూన్‌, పసుపు – చిటికెడు, నిమ్మరసం – 2 టీ స్పూన్లు, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని, అందులో మీల్‌ మేకర్‌ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అర టీ స్పూన్‌ కారం, ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకుని సరిపడా నీళ్లతో ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న బౌల్‌లో శనగపిండి, అర టీ స్పూన్‌ కారం, చిటికెడు పసుపు వేసుకుని.. కొన్ని నీళ్లతో పలుచగా కలుపుకుని.. అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని ముంచి కాగుతున్న నూనెలో పకోడాలను దోరగా వేయిస్తే రుచి అదిరిపోతుంది.

టమాటో హల్వా

కావలసినవి:  పండిన టమాటోలు – 5 (నీళ్లలో మెత్తగా ఉడికించి, మిక్సీలో గుజ్జు చేసుకోవాలి), పంచదార , నెయ్యి – పావు కప్పు చొప్పున, ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా (మీకు నచ్చిన రంగు), బొంబాయి రవ్వ – పావు కప్పు, డ్రై ఫ్రూట్స్‌ – 2 టేబుల్‌ స్పూన్లు (అభిరుచిని బట్టి), ఏలకుల పొడి – అర టీ స్పూన్‌

తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో డ్రై ఫ్రూట్స్, బొంబాయి రవ్వలను వేర్వేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద కాస్త లోతుగా ఉండే పాత్రని పెట్టి.. అందులో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. అవి కాస్త మరిగాక వేయించిన బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి. రవ్వ చిక్కబడుతున్న సమయంలో టొమాటో గుజ్జు, పంచదార, ఫుడ్‌ కలర్, సగం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం హల్వాలా చిక్కబడుతున్న సమయంలో ఏలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి, స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. సర్వ్‌ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది.

పనీర్‌ లాలీపాప్స్‌

కావలసినవి: పనీర్‌ తురుము – రెండున్నర కప్పులు, బ్రెడ్‌ పౌడర్‌ – అర కప్పు, జీడిపప్పు పేస్ట్‌ – పావు కప్పు, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – పావు టీ స్పూన్‌, పచ్చిమిర్చి ముక్కలు – ఒకటిన్నర టీ స్పూన్లు, పెరుగు – 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్‌ చొప్పున, ఆమ్‌చూర్‌ పౌడర్‌– 2 టీ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, గుడ్లు – 3, చిక్కటి పాలు – 1 టేబుల్‌ స్పూన్‌, ఉప్పు – తగినంత, నీళ్లు – అవసరాన్ని బట్టి, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.

తయారీ: ముందుగా పెద్ద బౌల్‌ తీసుకుని అందులో పనీర్‌ తురుము, జీడిపప్పు పేస్ట్, బ్రెడ్‌ పౌడర్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఆమ్‌చూర్‌ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, పెరుగు, 2 కోడిగుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు వేసుకుని ముద్దగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, ప్రతి బాల్‌కి సన్నటి పుల్లను గుచ్చి పక్కన పెట్టుకోవాలి. అనంతరం రెండు చిన్న చిన్న బౌల్స్‌ తీసుకుని ఒకదానిలో మొక్కజొన్న పిండి, మరోదానిలో ఒక గుడ్డు, పాలు వేసుకుని, ఆ బాల్స్‌ని మొదట గుడ్డు మిశ్రమంలో ముంచి, వెంటనే మొక్కజొన్న పౌడర్‌ పట్టించి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.

ఐస్‌క్రీం – చరిత్ర

మేసపటేమియా లో 4000 ఏళ్ల క్రితమే ఐస్ నిలవ గదులు ఉన్నాయని అంటారు. చైనా లో,అలెక్జాండర్ ,జపాన్ చక్రవర్తుల ఇలా ఐస్ నిలవ చేసే పద్దతి పాటించేవారట.

అయితే ఐస్ కి పాలని, కలపాలని అనిపించిన పాలకులు చైనా లోని టాంగ్ వంశ రాజులు(618-907 AD).అయితే దీన్లో కలిపే వస్తువులువింటే వాంతి కొస్తుంది. అవు,గొర్రే /గేదె పాలను పులిసేట్లు చేసి,పిండి కలిపి,కర్పూరం వేసి మంచి వాసన ,రుచి కోసం డ్రాగన్ మెదడు ,కనుగుడ్లు వెసేవారట.అబ్బో ఏమిరుచో .నెవర్ బెఫోర్ ఎవర్ ఆఫ్టర్ .ఇక ఇక్కడి నుండి మార్కోపోలో(1254-1324) దీన్ని యూరోపుకి పట్టుకు పోయాడు అని ఒక గాధ ఉన్నా చాలా మంది లేదని గట్టిఘా నమ్ముతున్నారు.అరబ్బులు తాగే శర్బత్ పానీయం ఒక రకంగా ఈ ఐస్క్రీం కు దారి తీసింది అని వీరి వాదన.1600 మొదట్లో దీని ప్రస్తావన “అరియానా ఇన్ఫర్మ” అనే పద్యం లో” ఫ్రాన్సేస్కో రెడి” రాసాడు.దీని రెసిపి రాసింది “అన్తొనియో లాటిని “అనే స్పానిష్ వ్యక్తీ.ఆకాలంలో నేపుల్స్ నగరం సార్బెటో కి బాగా ఫేమస్.ఇది పాలులేని సర్బత్ లాంటి పానీయం.ఐస్ క్రీముల పుట్టిల్లు ఏదైనా ,అది వాసికెక్కింది, వన్నె దాల్చింది మాత్రం ఇటలీ అని అందరూ ఒప్పుకునే సత్యం.ఇటాలియన్ జేలాటో ఐస్‌క్రీం లు అన్నిటికి మాతృక.

ఐస్ క్రీమ్ రకాలలో ప్రధానంగా చెప్పుకోవలసినవి జేలాటో.ఇంతకూ ముందే చెప్పినట్లు ఇది ఇటాలియన్ ఐస్ క్రీమ్.దీన్లో తక్కువ గాలి ఉండి ఎక్కువ మందం గా ఉంటుంది.పాల కొవ్వు శాతం తక్కువ. అదే ఐస్ క్రీములో కొవ్వుశాతం కనిష్టంగా పది శాతం.దీన్లో గాలి ఉండటం వల్ల తేలికగా వదులుగా ఉంటుంది.సోర్బెతో లో పాలు గానీ గుడ్లు గానీ ఉండవు.పళ్ళ క్రష్,ఇంకా పంచదార, ఐస్ ఉంటాయి.యోగర్ట్ అంటే పెరుగు దీన్ని కూడా రక రకాల ఫ్లేవర్లతో ఐస్ క్రీము లా తింటారు.

ఇంకా ఆకారాన్ని బట్టి కోన్ ,స్టిక్ లు కప్ లు ,వగైరా లు గా అమ్ముతారు.

ఇంకోముఖ్యమైన ఐస్ క్రీము మనకి అన్నిచోట్ల కనపడేది సండే (SUNDAE) ఆదివారం పేరుతొ అల్లరి పెట్టే ఈ క్రీము గారి కధ ఏమంటే దీన్లో ఓ రెండుమూడు స్కూప్ (చెంచాల ) ఐస్ క్రీము, అదికూడా సాధారణంగా భిన్న రకాలదై ఉంటుంది,ఉదాహరణకి వనీల,స్ట్రాబెరి,పిస్తా లాగ.ఇది కాకుండా సాస్( హిందీ అత్త గారు కాదు ) అనబడే ఒక చిక్కటి ఫ్లేవర్ ఉండే ద్రవం,దానికి తోడూ బాదాం,పిస్తా,వంటి నట్స్ ,ఇంకా చాకో చిప్స్.

ఇన్ని కలిపి కలగాపులగంగా పులిహోర కలిపినట్లు కలిపిన పదార్ధమునే సండే అని నొక్కి వక్కాణించారు.

ఇకపోతే చివరగా దుమ్దుర్మ(dumdurma) ఇది టర్కీలో చేసే ఒక ఐస్ క్రీమ్.దీన్లో వెన్న,పాలలోని కొవ్వు,సలేప్ (ఆర్కిడ్ మొక్క వేరు దుంప),మాస్టిక్(మొక్కలలో స్రవించే రసం)

చివర్లో ఓ మాట.మార్కెట్లో కొన్ని బ్రాండులు మాత్రమె పాలనుంచి ఐస్ క్రీములు చేస్తాయన్నది కొందరికే తెలిసిన నిజం.మిగతావన్నీ పాలే లేని కృత్రిమ ఫ్లేవర్లు, కెమికల్ లు కలసిన వడబోత. వీటిలో వెజిటబుల్ నూనె లు అంటే డాల్డా ని శీతలీకరణ కోసం పాల బదులు వాడతారట.వీటిని ఎక్కువగా తింటే ఆరోగ్యం ధమాల్ అవడం గారంటీ.

పచ్చి బఠాణీలతో వంటలు

పచ్చి బఠాణీ కట్‌లెట్స్‌

కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; పచ్చి బఠాణీలు – అర కప్పు; బొంబాయి రవ్వ – ఒక కప్పు; జీలకర్ర – పావు టీ స్పూను; సోడా – చిటికెడు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి ముద్ద– తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – తగినంత; నూనె – తగినంత; ఉప్పు – తగినంత; ఉడికించిన బంగాళదుంప ముద్ద – అర కప్పు; కొత్తిమీర – తగినంత

తయారీ: సగ్గు బియ్యంలో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి, నీరంతా ఒంపేసి, సగ్గు బియ్యం మునిగేవరకు మంచి నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాక, నీళ్లు వడబోయాలి. బఠాణీలను తగినిన్న నీళ్లలో గంటసేపు నానబెట్టాక, నీళ్లు తీసేసి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి. బొంబాయి రవ్వలో సగ్గుబియ్యం + బఠాణీ ముద్ద, బంగాళదుంప ముద్ద వేసి బాగా కలిపి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు) పకోడీల పిండిలా కలపాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక, తడి వస్త్రం మీద ఈ మిశ్రమాన్ని చిన్న ఉండగా పెట్టి కట్‌లెట్‌ సైజులో ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి బాగా కాలాక, తీసేసి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే బాగుంటుంది.

పచ్చి బఠాణీ ఖీర్‌

కావలసినవి: పచ్చి బఠాణీలు – ఒక కప్పు; పచ్చి కోవా – అర కప్పు; ఆనప కాయ తురుము – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; నెయ్యి – 3 టీ స్పూన్లు; పాలు – 5 కప్పులు; జీడిపప్పు + బాదం పప్పులు – గుప్పెడు; ఎండు ద్రాక్ష – 15; ఏలకుల పొడి – చిటికెడు; కర్బూజ గింజలు – టీ స్పూను

తయారీ: ∙పచ్చి బఠాణీలను గంటసేపు నానబెట్టి, ఉడికించి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కన ఉంచాలి. ఆనపకాయ తురుముకి కొద్దిగా పాలు జత చేసి, కుకర్‌లో ఉంచి, ఒక విజిల్‌ రాగానే దించేయాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగిన తర్వాత పచ్చి బఠాణీ ముద్ద వేసి పది నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి. ఆనపకాయ తురుము జత చేసి ఐదు నిమిషాలు కలిపి ఆ తరవాత కోవా, పాలు, పంచదార వేసి బాగా కలపాలి. ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్‌ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. ఎండాకాలం ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తింటే హాయిగా ఉంటుంది.

పచ్చి బఠాణీ పరోఠా

కావలసినవి:  గోధుమ పిండి – 3 కప్పులు; పచ్చి బఠాణీలు – ఒక కప్పు; పచ్చి మిర్చి ముద్ద – తగినంత; నువ్వులు – అర టీ స్పూను; నూనె – తగినంత; కొత్తిమీర, కరివేపాకు – తగినంత; నెయ్యి – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఉప్పు – తగినంత

తయారీ: పచ్చి బఠాణీలను గంట సేపు నానబెట్టి, కుకర్‌లో ఉంచి ఒక విజిల్‌ వచ్చాక దించేయాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్‌ చేయాలి. గోధుమ పిండికి పచ్చి బఠాణీ ముద్ద జత చేసి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి, నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా కలిపి, అరగంటసేపు నాననివ్వాలి. ఉండలు చేసుకుని, చపాతీ మాదిరిగా ఒత్తాలి ∙పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేస్తూ, కాల్చాలి. పెరుగుతో తింటే రుచిగా ఉంటాయి.

పచ్చిబఠాణీ రైస్‌

కావలసినవి  బాస్మతి బియ్యం – 2 కప్పులు; 
పచ్చి బఠాణీ – అర కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; బంగాళ దుంప ముక్కలు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; పుదీనా ఆకులు – అర కప్పు; కొత్తిమీర – అర కప్పు; గరం మసాలా – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత

తయారీ
స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి తీసేయాలి. పచ్చి మిర్చి తరుగు, బంగాళ దుంప ముక్కలు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి తీయాలి. పసుపు, మిరప కారం జత చేసి మరోమారు కలపాలి. ఉప్పు, ధనియాల పొడి జత చేసి బాగా కలిపాక, పుదీనా ఆకులు జత చేసి మరోమారు కలపాలి. పచ్చి బఠాణీ జత చేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి. మూత ఉంచి సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉడికించి మూత తీసేయాలి. తగినన్ని నీళ్లు జత చేసి మరిగించాక, కడిగిన బియ్యం వేసి కలియబెట్టి, ఉడికించి దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.

పచ్చి బఠాణీ టొమాటో కూర

కావలసినవి: ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు – కప్పు; టొమాటో గుజ్జు – ఒక కప్పు; కొత్తిమీర – అర కప్పు; పచ్చి మిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు; మిరప కారం – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; నీళ్ళు – తగినన్ని; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; నూనె – తగినంత

తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, జీలకర్ర, పచ్చి మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి. టొమాటో గుజ్జు జత చేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.  ∙మిరప కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. మంట కొద్దిగా తగ్గించి, రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి. నీరు పొంగుతుండగా పచ్చి బఠాణీలు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి. గ్రేవీ చిక్కగా ఉండటానికి బాణలిలో ఉడుకుతున్న వాటిని కొన్నిటిని మెత్తగా మెదిపితే చాలు. చపాతీ, రోటీ, పూరీ, అన్నం.. దేనిలోకైనా రుచిగా ఉంటుంది.

పచ్చి బఠాణీ  మసాలా కర్రీ

కావలసినవి: బఠాణీ – ఒకటిన్నర కప్పులు, నూనె – తగినంత;  జీలకర్ర – టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – టీ స్పూను; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – టీ స్పూను;  ధనియాల పొడి – టీ స్పూను

తయారీ: స్టౌ మీద ప్రెజర్‌ పాన్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు బాగా కలియబెట్టాలి. పసుపు, ఉప్పు, మిరప కారం, ధనియాల పొడి జత చేసి ఐదు నిమిషాలు బాగా కలుపుతూ ఉడికించాలి. ఒక కప్పు నీళ్లు జత చేయాలి. బఠాణీలు జత చేసి మరోమారు కలిపి మూత ఉంచి నాలుగు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి, దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించాలి. చపాతీ, పూరీ, అన్నంలోకి రుచిగా ఉంటుంది.

గుడ్లు

1.పచ్చిగుడ్లు

అ. దేహదారుడ్యాన్ని పెంచే వాళ్ళు ఈ పచ్చి గుడ్లను ఎక్కువ తీసుకుంటారు. అలా తీసుకోవడం వలన ఎక్కువ పోషకాలు వస్తాయి అని నిపుణులు చెపుతున్నారు.

ఆ. ఈ పచ్చి గుడ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన హృదయానికి సంబందించిన జబ్బులు వస్తాయి అని కూడా నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే పచ్చి గుడ్ల లో ఎక్కువ బాక్టీరియా ఉంటుంది.

2.ఉడికించిన గుడ్లు

అ. మన నిత్య జీవితం లో ఎక్కువ శాతం మంది ఉడికించిన గుడ్లును తింటారు.

ఆ . ఈ ఉడికించిన గుడ్లులో కూడా బాగా పోషకాలు ఉంటాయి. వైద్య నిపుణులు కూడా రోజుకి ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు.

ఇ . ఉడికించిన గుడ్లును నెమ్ము ఉన్న వాళ్ళు రోజుకి రెండు గుడ్లు తింటే చాలా వరకు నెమ్ము తగ్గుతుంది.

3.నూనెలో వేయించిన గుడ్లు

ఈ రకం గుడ్లు మనం రుచి కోసం మరియు కొంచెం కారం తినడం ఇష్ట పడేవాళ్ళు ఇలాంటివి చేసుకోని తింటారు. పైన రెండు రకాల తో పోలిస్తే దీనిలో కొంచం పోషకాలు తక్కువ గా ఉంటాయి.

పచ్చి గుడ్లలో పోషకాలు చాలా ఎక్కువ గా ఉంటాయి, కానీ బాక్టీరియా కూడా ఉంటుంది. అది కూడా నాటు కోడి గుడ్లు అయితే తినవచ్చు. ఇప్పుడు వచ్చే గుడ్లును కృత్రిమంగా తయారు చేస్తున్నారు. ఈ రకం గుడ్లను మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది.

ఉడికించిన గుడ్లు అయితే ఆరోగ్యానికి మంచిది . ఈ ఉడికించిన గుడ్లు చిన్న పిల్లలకి రోజు కి ఒక గుడ్డు తినిపిస్తే చాలా ఆరోగ్యకరంగా ఉంటారు.

తెలుపు, బ్రౌన్‌ కలర్‌ గుడ్డు

Brown Colour Eggs Vs White Eggs: Do You Know These Facts - Sakshi

సాధారణంగా కోడి గుడ్లను మనం ఎక్కువగా తీసుకుంటుంటాం. ఇందులో బ్రాయిలర్, నాటు కోడి గుడ్లు ముఖ్యమైనవి. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. అయితే, వీటికితోడు బ్రౌన్‌  (గోధుమ రంగు) గుడ్లు కూడా మనకు లభిస్తున్నాయి. ఇవి తెల్లటి గుడ్లకంటే మంచివని అంతా భావిస్తుంటారు. వాస్తవానికి రంగుతో సంబంధం లేకుండా, గుడ్డు ఏదైనా సరే పోషకాలు మాత్రం ఒక్కటేనని నిపుణులు చెబుతున్నారు.

ఈ రెండు రకాల గుడ్లలో విటమిన్లు, మినరల్స్‌తో పాటు శరీరానికి అవసరమైన ప్రొటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. రుచి విషయంలో తెలుపు, గోధుమ రంగు గుడ్లలో కొద్ది తేడా ఉన్నప్పటికీ పోషకాలు మాత్రం సమానమే. నిజానికి కోడి గుడ్డు పెంకు ఏ రంగులో ఉన్నా వాటిల్లోని పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే నాటు కోడి గుడ్డు పరిమాణం కాస్త చిన్నగానూ ఫారం కోడి గుడ్లు కాస్త పెద్దగానూ ఉంటాయి. 

ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌..
కేలరీలు, ప్రొటీన్స్‌, కొలెస్ట్రాల్‌ విషయంలో తెలుపు, గోధుమ రంగు గుడ్లు సమానంగా ఉంటాయి. బ్రౌన్‌ గుడ్లలో మాత్రం ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ పాళ్లు కొంత ఎక్కువగా ఉంటాయి. అది పెద్ద తేడా కాదని నిపుణులు చెబుతున్నారు. తెల్లవైనా, బ్రౌన్‌వి అయినా 100 గ్రాముల గుడ్డులో దాదాపు 13 గ్రాముల ప్రొటీన్స్‌ ఉంటాయి. కానీ బ్రౌన్‌  ఎగ్స్‌ను సేంద్రియ పద్ధతి(ఆర్గానిక్‌)లో ఉత్పత్తి చేయడం వల్ల అందులో పోషకాలు అధికంగా ఉంటాయన్న అపోహతోనే వినియోగదారులు వీటిని కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి బ్రౌన్‌ ఎగ్స్‌ ఉత్పత్తి తక్కువ కాబట్టే డిమాండ్‌ ఎక్కువని, అందుకే అవి అధిక ధర పలుకుతున్నాయని నిపుణులు అంటున్నారు. 

కోళ్లను బట్టి సైజు…
గుడ్ల సైజు విషయంలో తెల్లవి కాస్త పెద్దగా, బ్రౌన్‌వి కాస్త చిన్నగా ఉంటాయి. గుడ్డు పరిమాణం కోడి సైజును బట్టి ఉంటుంది. అలాగే వేసవిలో పెట్టే గుడ్లు చిన్నవిగానూ, చలికాలంలో పెట్టే గుడ్లు పెద్దవిగానూ ఉంటాయి.

‘కర్ర పెండలం’ తో వంటలు

కర్ర పెండలం:

కర్ర పెండలం దుంప ని ఉడకబెట్టి , అమ్ముతుంటారు .ఇది తినే వాళ్ళు చాలా ఇష్టం గా తింటారు . ప్రయాణాల్లో చాలా సేపు ఆకలి వేయకుండా వుంటుంది. దీనిలో పీచు పదార్థాలు, పోషక పదార్థాలు లభిస్తాయి.

సగ్గుబియ్యం కర్ర పెండలం తో తయారు చేస్తారు.

కర్రపెండలం తో సగ్గు బియ్యంతయారు చేస్తారు. సామర్లకోట లో వీటి తయారీ ఎక్కువ. ఇక్కడ ఎక్కువగా కర్రపెండలం పండిస్తారు.

సగ్గుబి్యంతో హల్వా తయారుచేస్తారు. పాయసం చేస్తారు. సగ్గబియ్యంతో వేసవిలో జావ కాచు కుంటారు. బియ్యప్పిండి వడియాలు, గుమ్మడి వడియాలు లో వేసి, ఇంకొంచెం అందం గా ఉండడానికి వాడతారు. సగ్గుబియ్యం తోనే వడియాలు పెడతారు.

చిప్స్:

నీళ్ళ లో వుప్పూ వేసి, కర్ర పెండలం చిప్స్ గా తరిగి,వాటిలో వేసి ,కొంచెం వుడికించి, తీసి ఎండ లో బాగా , ఎండ బెట్టాలి. వాటిని కావలిసి నప్పుడు వేపుకుని తినవచ్చు. మంచి రుచి గా వుంటాయి.

అప్పడాలు:

అప్పడాల రుచి మాత్రం తింటేనే వాటి రుచి తెలుస్తుంది. అంత బాగుంటాయి. అన్నవరం దగ్గర ఇవి ఎక్కువ గా పండి స్తారు. అక్కడే ఈ అప్పడాల తయారీ వుంది.

కర్ర పెండలం కూర:

ఎక్కువగా బొబ్బర్లు, చిక్కుడు లోని రకాల తో కలిపి ( శ్రీకాకుళం వైపు) వండుకుంటారు. వేపుడు చేస్తారు. పులుసు కూడా పెడతారు. వీటి నీ మిక్సి లో వేసి ,రసం తీసి హల్వా చేస్తారు.

గంజి పొడి:

కర్ర పెండలం తో గంజి పొడి తయారు చేస్తారు.అం తే కాదు . సగ్గుబియ్యం కూడా వుడ క బెట్టి, గంజి తయారీ చేసి, చీరలకు పెట్టుకుంటారు.

వీటికి సంబంధించిన చిన్న పరిశ్రమలు సామర్లకోటలో వున్నాయి.

చాక్లెట్ – ఉపయోగాలు

విభిన్న చాక్లెట్‌లు
► చాక్లెట్‌లు తెలుపు, డార్క్‌ విభిన్న రంగులలో లభిస్తున్నాయి.
► వీటిని కోకో చెట్ల నుంచి లభించే కాయల నుంచి తయారు చేస్తారు.
► విభిన్న ఆకారాలలో, అనేక ఫ్లేవర్స్‌లో మనకు అందుబాటులో ఉంటున్నాయి.
► చాక్లెట్‌లను కాఫీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీంలు వంటి వాటిల్లోనూ ఉపయోగిస్తారు.
► చాకలెట్‌లను సింపుల్‌ టెక్నిక్‌తో ఇంటిదగ్గర కూడా తయారు చేయవచ్చు.

చాక్లెట్‌ ఉపయోగాలు:
► చర్మం కాంతివంతంగా మెరిసేందుకు దోహదపడుతుంది.
► అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ బయటకు వెళ్ళిపోయేలా చేస్తోంది.
► శారీరక బరువును తగ్గించడంతోపాటు, మానసికం ఉల్లాసానికి కారణమవుతుంది.
► ఒక చాక్లెట్‌ తిన్నాక మెదడు 2 నుంచి 3గంటలు ఆక్టివ్‌గా పనిచేస్తోందట.
► డార్క్‌ చాక్లెట్‌లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. 

వెలగ పండ్లు – రుచులు

Variet recipes with Wood Apple - Sakshi

వెలగ పండు భేల్‌
కావలసినవి
వెలగ పండ్లు – 4; పచ్చిమిర్చి – 10 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఉప్పు – తగినంత ; పంచదార – 4 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; చాట్‌ మసాలా – ఒక టీ స్పూను; స్వీట్‌ చట్నీ- అర టీ స్పూను; గ్రీన్‌ చట్నీ- ఒక టీ స్పూను

తయారీ: వెలగపండ్లను పగలగొట్టి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకుని, గరిటెతో బాగా మెదపాలి. పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, పంచదార, కొత్తిమీర తరుగు, చాట్‌ మసాలా, గ్రీన్‌ చట్నీ, స్వీట్‌ చట్నీ జత చేసి పప్పు గుత్తితో బాగా మెదపాలి. పగుల గొట్టిన వెలగ పండు చెక్కలలోనే అమర్చి అందిస్తే చూడటానికి అందంగా ఉంటుంది.

వెలగ పండు స్మూతీ
కావలసినవి: వెలగపండు -1; తేనె- 2 టేబుల్‌ స్పూన్లు; ఓట్స్‌ – ఒక టేబుల్‌ స్పూను; పెరుగు- అర కప్పు; తాజా కొబ్బరి తురుము – ఒక టేబుల్‌ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; బెల్లం పొడి – టేబుల్‌ స్పూను

గార్నిషింగ్‌ కోసం: దానిమ్మ గింజలు- ఒక టీ స్పూను; మామిడికాయ ముక్కలు – ఒక టీ స్పూను; జీడిపప్పు ముక్కలు – ఒక టీ స్పూను.

తయారీ: ఓట్సును తియ్యటి నీళ్లలో లేదా ఏదైనా పళ్లరసంలో పది నిమిషాలు నానబెట్టాలి. వెలగపండును పగులగొట్టి గుజ్జు బయటకు తీసి, రెండు కప్పుల నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టాలి. మెత్తగా పిసికి, పీచును, గింజలను వేరు చేయాలి. మిక్సీలో వెలగ పండు గుజ్జు, తేనె, ఐస్‌ క్యూబ్స్, బెల్లం పొడి, కొబ్బరి తురుము, నానబెట్టిన ఓట్స్, ఏలకుల పొడి, పెరుగు, మిరియాల పొడి వేసి మెత్తగా చేయాలి. గ్లాసులలో పోసి, కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా అయ్యాక బయటకు తీసి, జీడిపప్పు ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడికాయ ముక్కలతో అలంకరించి అందించాలి.

వెలగ పండు షర్బత్‌
కావలసినవి
వెలగ పండు -1; నీళ్లు – తగినన్ని; పంచదార – తగినంత

తయారీ:
ముందుగా వెలగపండు గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙చేతితో మెత్తగా మెదిపి, తగిన న్ని నీళ్లు జత చేసి, చేతితో బాగా కలపాలి. ఒక పాత్రలోకి వడ పోయాలి. తగినంత పంచదార జత చేసి బాగా కలియబెట్టాలి. ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి, బయటకు తీసి చల్లగా తాగాలి . ఎండ బాధ నుంచి కాపాడుతుంది.

వెలగ పండు జామ్‌
కావలసినవి: వెలగ పండ్లు – 4; వేడి నీళ్లు – పావు లీటరు; పంచదార – 200 గ్రా.
తయారీ : వెలగ పండ్ల గుజ్జును ఒక పాత్రలో వేసి మెత్తగా మెదపాలి. వేడి నీళ్లు జత చేస్తూ బాగా కలియబెట్టాక, వడబోసి, గింజలను వేరు చేయాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక గుజ్జును  అందులో వేసి బాగా కలపాలి. పంచదార జత చేసి బాగా కలియగొట్టి, పొంగులు  వచ్చేవరకు ఉడికించాలి. పావు గంట తరవాత మిశ్రమం కొద్దిగా చిక్కబడుతుంది. ఒక ప్లేటులోకి తీసుకుని, కొద్దిగా చల్లారాక గాలి చొరని  సీసాలో నిల్వ చేసుకోవాలి.


వెలగ పండు పచ్చడి
కావలసినవి: వెలగపండు- 1; బెల్లం పొడి – ఒక కప్పు; కారం- ఒక టేబుల్‌ స్పూను; ధనియాల పొడి – ఒక టేబుల్‌ స్పూను; వేయించిన జీలకర్ర పొడి – ఒక టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత;  కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు.

తయారీ: ∙ముందుగా వెలగపండును పగులగొట్టి గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి. మిక్సీలో అన్ని పదార్థాలు వేసి మెత్తగా చేయాలి. ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో ఉంచితే పదిరోజుల వరకు బాగుంటుంది.

వెలగ పండు ఐస్‌క్రీం
కావలసినవి: పంచదార- 1 టేబుల్‌ స్పూన్‌; కొబ్బరి పాలు- అరకప్పు; వెలగ కాయ – 1
తయారీ: ఒక పాత్రలో వెలగ పండు గుజ్జు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదపాలి. కొబ్బరి పాలు జత చేస్తూ మరోసారి మెత్తగా చేయాలి. పంచదార జత చేసి బాగా కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అంగుళం మందం ఉన్న ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి, డీప్‌ ఫ్రీజ్‌లో ఐదు గంటల పాటు ఉంచి బయటకు తీయాలి. స్టౌ మీద పాన్‌ వేడయ్యాక, ఫ్రిజ్‌లో ఉంచిన ప్లేటును బయటకు తీసి, అందులోని వెలగపండు మిశ్రమాన్ని పాన్‌లో వేసి, కొద్దిసేపు ఉంచి, మళ్లీ ప్లేటులో పోసి, డీప్‌ ఫ్రీజర్‌లో మూడు గంటల పాటు ఉంచి, బయటకు తీసి, ఐస్‌ క్రీమ్‌ కప్పుల్లో అందించాలి.

ఇలా తింటే ఎలా ఉంటుంది..

 • ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోసెలకు దూరంగా ఉండి, వాటి బదులు జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీ, దోసెలను తినటం మంచిది. మామూలుగా చేసుకునే ఇడ్లీ, దోసెలను వారానికి ఒకసారి మాత్రమే తినాలి.
 • దోసెలను నేతిలో కాల్చుకుని తినటం మంచిది.
 • ఉడకబెట్టిన సెనగలు, వేరు సెనగలు, అలసందలు ఆరోగ్యానికి మంచిది.
 • మొలకెత్తిన గింజలు తినటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
 • పూరీ, మైసూర్‌ బోండా వంటివి నెలకు ఒకసారి తింటే పరవాలేదు. వీలైతే వాటికి దూరంగా ఉండటం మంచిది.
 • వారానికి ఒకటి లేదా రెండు సార్లు చపాతీలు తింటే పరవాలేదు. అవి కూడా నేతితో కాల్చుకుని తినటం మంచిది.

టీ తాగే ముందు మంచి నీళ్లు ఎందుకు తాగాలి

టీ తీసుకునే ముందు ఒక గ్లాసు నీరు త్రాగడానికి కారణం అది కడుపులోని ఆమ్ల స్థాయిలను తగ్గిస్తుంది. ఏదైనా పదార్ధం యొక్క pH విలువ దాని ఆమ్ల స్థాయిలను సూచిస్తుంది. టీలో pH విలువ 6 ఉంటుంది (ఇది ఆమ్లమైనది). నీటి pH విలువ 7 తటస్థంగా ఉంటుంది. మీరు అధిక పిహెచ్ స్థాయి కలిగిన పానీయాలను తీసుకునేటప్పుడు ఇవి గుండెల్లో మంట, కడుపు గోడలు దెబ్బతినడం, పెద్దప్రేగు క్యాన్సర్ మొదలైన ఇతర వ్యాధులకు దారితీస్తుంది. మీరు టీ కి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల, ఇది యాసిడ్ ఉత్పత్తి అరికడుతుంది, యాసిడ్ స్థాయిలను పలుచన చేయడమే కాదు, కడుపుపై నష్టాన్ని తగ్గిస్తుంది, అధిక ఆమ్ల స్థాయి కారణంగా దంతాలపై టీ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. త్రాగునీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది మరియు శరీరం నుండి విషాన్ని బయటకు తీయడానికి సహాయపడుతుంది, తద్వారా మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది.

అలాగే కాఫీకి pH విలువ 5 ఉంటుంది (ఇది కూడా ఆమ్ల పరిధిలో వస్తుంది) కావున కాఫీ తీసుకునే ముందు ఒక గ్లాసు నీరు తాగడం మంచిది.

ప్రస్తుతానికి అప్రస్తుతమైన కూడా నేను ఒకచోట ఎక్కడో నీరు గురించిన డెమో క్లాస్ లో విన్నాను, మనం తాగే కూల్ డ్రింక్లు pH విలువ 2.5 ఉంటుంది, దీని నుండి మన శరీరాన్ని కాపాడుకోవాలి అంటే ఒక గ్లాస్ కూల్ డ్రింక్ కి కనీసం 30 గ్లాసులు నీరు తాగితేగాని లోపల తటస్తం అవ్వదు అని!!!

అరటిపండు పునుగులు

కావలసినవి: అరటి పండ్లు – 4 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి)
గోధుమ పిండి – పావు కప్పు
బియ్యప్పిండి – పావు కప్పు
మైదా పిండి – పావు కప్పు
మొక్కజొన్న పిండి – ముప్పావు కప్పు
ఉప్పు – తగినంత
బేకింగ్‌ పౌడర్‌ – 1 టీ స్పూన్‌
పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు
నూనె – డీప్‌ ఫ్రై కి సరిపడా.

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో అరటిపండ్ల గుజ్జు, గోధుమ పిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్‌ పౌడర్, పంచదార, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి జోడించి, బాగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కాగుతున్న నూనెలో పునుల్లా వేసుకుని దోరగా వేయించి సర్వ్‌ చేసుకోవాలి.

ఆపిల్‌ కోవా హల్వా

కావలసినవి: ఆపిల్స్‌ – 3 (పైతొక్క తొలగించి గుజ్జులా చేసుకోవాలి)
బాదం గుజ్జు – 3 టేబుల్‌ స్పూన్లు
కోవా – అర కప్పు
దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్‌ 
పంచదార – అర కప్పు
నెయ్యి – 4 లేదా 5 టేబుల్‌ స్పూన్లు.

తయారీ: ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. 3 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేడికాగానే.. ఆపిల్‌ గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి. అందులో పంచదార యాడ్‌ చేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి. కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. 

ఎగ్‌ బన్స్

Egg Bun, Apple Halwa, Banana Punugulu Recipes - Sakshi

కావలసినవి: గుడ్లు – 6
బన్స్ – 6, ఉల్లిపాయలు – 3
పచ్చిమిర్చి – 2
చీజ్‌ తురుము – 2 టీ స్పూన్లు
కొత్తిమీర తురుము – 1 టేబుల్‌ స్పూన్‌ 
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌ 
కారం – 1 టీ స్పూన్‌
మిరియాల పొడి – 1 లేదా 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత

తయారీ: ముందుగా బన్స్‌ పైభాగం తొలగించి గుంతల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్‌ తురుము, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి మరిన్ని జోడించుకోవచ్చు. ఆ మొత్తం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బన్స్‌ బౌల్స్‌లో వేసుకుని.. ప్రతి బన్‌లో ఒక కోడిగుడ్డు కొట్టి.. ఓవెన్‌లో ఉడికించుకుంటే భలే రుచిగా ఉంటాయి.

భారత దేశం లో వివిధ హల్వా రకాలు

కేంద్ర బడ్జెట్‌ ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుక ఒకటి ఉంది. అది ఏమిటంటే బడ్జెట్ తయారీ లో అందులోని అంశాల గోప్యత కోసం ఆర్ధిక శాఖ లో బడ్జెట్ రూపకల్పన లో పాల్గొనే ఉద్యోగులు పది రోజుల పాటు ఆర్ధిక శాఖ బేస్మెంట్ లోనే ఉండిపోతారు. ముద్రణ ప్రారంభించిన రోజు ఆర్ధిక మంత్రి సమక్షం లో హల్వా అందరికి పంచి వేడుక చేసుకోవడం ఒక సంప్రదాయం.

బందర్ హల్వా మచిలీ పట్నం లో దొరికే హల్వా వెరైటీ .ఇలాగే విశాఖ కు దగ్గరలో ఉన్న మాడుగుల లో కూడా మాడుగుల హల్వా ఫేమస్ అండీ. 125 ఏళ్ళ చరిత్ర ఉన్న దగ్గేటి ధర్మా రావు షాప్ బాగా స్పెషల్. ఈ హల్వా లో రకరకాల పప్పులు కూడా వేసి చేస్తారు.

ఇక దేశం లో అయితే చేసే పదార్ధం కుడా మారుతుంది.రవ్వ తో చేసే హల్వా ,గోధుమలు,పెసర పప్పు ,కేరట్(గాజర్)ఇది ఎక్కువగ్గా పంజాబ్ లో చేస్తారు, అక్కడ గజ్రేలా అని అంటారు. ఇంకా వేపిన శనగ పప్పు,జీడిపప్పు తో కాజు హల్వా , బెంగాల్ లో మోహన్ భోగ్ , ,కర్నాటక లో దొరికే బూడిద గుమ్మడి హల్వా , దీన్ని కాశి హల్వా గా పిలుస్తారు.ఇదే కాక కేసరి బాత్ అని లేదా సుజీ హల్వా అని అన్ని శుభ కార్యాల్లో, హోటల్ లలో చేస్తారు. ఉత్తరాన నవరాత్రులలో హల్వా పూరి ఆడపిల్లలకు తప్పక పెడతారు. ఈ కేసరి బాత్ ని పైన్ ఆపిల్ ఫ్లవర్ తో చేయడం ఓ స్పెషల్ .సిఖ్ గురుద్వారాల్లో ఆటే కా హల్వా అని కడా ప్రసాద్ గా ఇస్తారు.బొంబాయి లో స్వీట్ షాప్ ఓనర్ లను హల్వాయీ లు గా పిలుస్తారు.బాంబే హల్వా ఇకాడ బాగా ప్రసిద్ది.

తమిళ బ్రాహ్మల వివాహాలలో సొజ్జి బజ్జి అని హల్వా తో బజ్జీ ఇచ్చే సాంప్రదాయం ఉంది .కర్నాటక లో హోటల్ లలో ఉప్మా కేసరి బాత్ అని ఉప్మా తో రవ్వ కేసరి పెడతారు.మన సత్యనారాయణ స్వామి ప్రసాదం రవ్వకేసరి లాంటిదే కదా.

దేశం లో చేసే హల్వా రకాలలో కారట్,బీట్రూట్,బాదం,కరాచి ,మిల్క్,బ్రెడ్ హల్వా (డబల్ క మీటా),గోస్ట్ (మాంసం )చెప్పుకో దగ్గవి.

(అయేషా కుకింగ్ వారి చిత్రం)

కాశి హల్వా (వెరీగుడ్ రెసిపీస్ చిత్రం)

(కాలిమిర్చ్ నుంచి చిత్రం)

కారట్ హల్వా

తమిళ నాట తిరునల్వేలి ,కేరళ కోజికోడ్ రెండు దక్షిణాన హల్వా రాజధానులు.

తిరునల్వేలి హల్వా గోధుమ లా తో చేస్తారు. అక్కడ తామ్రపర్ణి నది నీరు హల్వా కి ప్రత్యెక రుచి నిస్తుంది అంటారు. అక్కడ ప్రధానం గా పెద్ద బాణలి లో జారుడుగా ఉండే హల్వా అరటి ఆకులో వేసి ఇస్తారు.బాగా ప్రాచుర్యం పొందిన దుకాణం ఇరుట్టు కడాయి గా పిలుస్తారు. అంటే తమిళం లో చీకటి గా ఉండే కొట్టు అని పేరు. ఇది అక్కడ నునే దీపాలు మాత్రమె ఉండటం వల్ల వచ్చిన పేరు. ఈ షాప్ కేవలం కొన్ని గంటలు మాత్రమె తెరిచినా బాగా అమ్ముడు పోతుంది.

మదురై లో ఒత కడాయి అని ఇంకో షాప్ ఉంది.పచిరాజ విలాస్ /లక్ష్మి విలాస్ అని పేరున్న ఈ షాపు కు 50 ఏళ్ళ చరిత్ర ఉన్నది.

ఈ గోధుమ హల్వా తయారీ బాగా శ్రమ తో కూడిన వ్యవహారం.2 రోజులు సాంబా గోధుమ ని నానేసి మెత్తని పిండి లాగ రాతి రుబ్బు రోళ్ళలో చేసి ,ఒక రోజు అలాగే వదిలేస్తారు. మర్నాడు నీటిని గుడ్డతో వేసి పిండేస్తారు.అలా వచ్చిన నీటిని గోధుమ పాలు అంటారు.ఈ గోధుమ పాలు చిక్కగ్గా ఉండి హల్వా తయారీ లో ప్రధాన పాత్ర వహిస్తుంది .అందుకే ఈ హల్వా నోటిలో ఐస్ క్రీమ్ లా కరిగి పోతుంది.

కోజికోడ్ హల్వా కి జామోరిన్ రాజ్యం నాటి నుంచి ప్రాచుర్యం ఉంది.ఆయన గుజరాత్ నుంచి వంటవాళ్లు తెప్పించుకుని విందులలో వండటానికి కొంత భూమిని ఇచ్చాడట. వాళ్ళున్న ప్రదేశమే ఈ రోజు SM వీధి (అంటే స్వీట్ మీట్ ) లేదా మిటాయి తెరువు అని అంటారు. కోజికోడ్ హల్వా మొత్తం నేయి తో కాక కొబ్బరి నూనే తో చేస్తారు.అక్కక దొరికే నల్ల హల్వా లేదా కరుత హల్వా బియ్యం నుంచి చేస్తారు. ఇది మధ్య ప్రాచ్యం లోని టర్కీ నుంచి దిగుమతి అయిన అలవాటు .మన రాష్ట్రం నుంచి వెళ్ళిన అయ్యప్ప భక్తులు అక్కడ నుంచి హల్వా, చిప్స్ తెచ్చుకుంటారు.

హల్వా మన దేశం లో ఢిల్లీ సుల్తానుల కాలం అయిన 13వ శతాబ్ది లో ఇండియా లో కాలు పెట్టింది.దాని మూలాలు ఓట్టోమాన్ సామ్రాజ్యం కాలం లో ఉన్నాయి. 10వ సులేమాన్ గొప్ప తీపి ప్రియుడని అతనికి ఇష్టమైన వాటిలో హల్వా ఒకటి అని చరిత్ర చెపుతోంది.అతని రాజ్యం లో తీపి వంటలు వండటానికి కి ఒక ప్రత్యెక వంటశాల ఉందంటే ఆశ్చర్యం కలగుతుంది కదా .

ఇప్పటి కాలం లో పూణే లో పచ్చి మిరప తో హరి మిర్చ్ హల్వా ,బెంగాల్ లో చోలార్ దాల్ హల్వా , కర్నాటక లో కాశి హల్వా ,ఉత్తర ప్రదేశ్ , బిహార్ లలో గుడ్డు తో అండా హల్వా, కేరళ లో కరుత హల్వా, హల్వా గారి విభిన్న అవతారాలు గా మనం భావించ వచ్చు. దీన్న్నే ఇండియన్ జుగాడ్ ( భారతీయ అన్వేషణ ప్రియత్వం) అనుకోవచ్చు.

టమాటా కర్రీ

తయారీ విధానం:-

కావాల్సిన పదార్ధాలు

టమాటాలు 250 గ్రా.లు. ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 2, పసుపు 1/4 టీస్పూన్, కారంపొడి 1 టీస్పూన్, అల్లంవెల్లుల్లి ముద్ద 1/4 టీస్పూన్, ధనియాల పొడి 1 టీస్పూన్, గరం మసాలా 1/4 టీస్పూన్, కరివేపాకు 1 రెబ్బ, ఉప్పు తగినంత, నూనె 3 టీస్పూన్లు.

కడాయిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి, కారంపొడి వేసి కొద్దిగా వేపి సన్నగా తరిగిన టమాటా ముక్కలు తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.

టమాటా ముక్కలు మెత్తబడ్డాక ధనియాలపొడి, గరంమసాలా పొడి వేసి కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించుకు దింపేయాలి.

చింతకాయలతో కూరలు

Tamarind Special Variety Recipes - Sakshi

చింత కాయ దప్పళం
కావలసినవి: చింత కాయలు – పావు కేజీ (పండనివి); కూరగాయ ముక్కలు – పావు కప్పు (బెండకాయ, సొరకాయ వంటివి); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా తరగాలి); పసుపు – అర టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను; మెంతులు + జీలకర్ర – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు

పోపు కోసం : ఆవాలు – ఒక టీ స్పూ ను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; కరివేపాకు – 2 రెమ్మలు

తయారీ:

చింత కాయలను శుభ్రం గా కడిగి, స్టౌ మీద ఒక పాత్ర లో చింత కాయలు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి, దింపాలి. కొద్దిగా చల్లారాక చేతితో మెత్తగా అయ్యేలా మెదిపి వడపోశాక, తగినన్ని నీళ్లు జత చేసి, ఉల్లి తరుగు, కూర ముక్కలు, పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచాలి. పచ్చి మిర్చి + జీలకర్ర ముద్ద జత చేయాలి. కరివేపాకు, కొత్తిమీర జత చేసి బాగా కలియబెట్టాలి. అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి దప్పళాన్ని మరిగించాలి. చిన్న పాత్రలో బియ్యప్పిండి, కొద్దిగా నీళ్లు పోసి దోసెల పిండి మాదిరిగా ఉండలు లేకుండా కలిపి, ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పులుసులో వేసి మరోమారు కలియబెట్టాలి. కొత్తిమీర జత చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాక, కరివేపాకు వేసి మరోమారు వేయించి ఈ పోపు ను మరుగుతున్న చింతకాయ దప్పళంలో వేసి కలియబెట్టాలి. బాగా పొంగుతుండగా దింపేయాలి. బాగా పొంగుతుండగా దింపేయాలి.

చింత కాయ పప్పు
కావలసినవి: వామన  చింతకాయలు –  ఒక కప్పు; కంది పప్పు – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 2 (సన్నగా పొడవుగా తరగాలి); ఎండు మిర్చి – 1; ఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – అర టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను;  కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; నూనె – ఒక టేబుల్‌ స్పూను; మిరప కారం – తగినంత; ఉప్పు – తగినంత

తయారీ:

కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. చింత కాయలను శుభ్రంగా కడిగి, ఒక పాత్రలో చింత కాయలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి, మెత్తగా అయ్యేవరకు ఉడికించి, దింపి చల్లారాక, నీళ్లు ఒంపేయాలి. చల్లారాక చింతకాయల మీద తొక్కు తీసేసి, తగినన్ని నీళ్లు జత చేసి, మెత్తగా పిసికి, నీళ్లు వడకట్టి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించాలి. పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి మరోమారు వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఉడికించిన కంది పప్పు, చింతకాయల రసం, ఉప్పు, మిరప కారం వేసి బాగా కలిపి, సుమారు ఐదు నిమిషాలు సేపు ఉడికించి, దింపేయాలి.

చింత కాయ–కొబ్బరి పచ్చడి
కావలసినవి: చింత కాయలు – 100 గ్రా; కొబ్బరి ముక్కలు – అర కప్పు; పచ్చి మిర్చి – పది

పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; కరివేపాకు – 2 రెమ్మలు; వెల్లుల్లి రేకలు – 4; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – తగినంత; కరివేపాకు – ఒక రెమ్మ

తయారీ:  

చింత కాయలను శుభ్రంగా కడిగి, ఈనెలు తీసి, చిన్న  చిన్న ముక్కలుగా  చేసుకోవాలి. కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి చల్లార్చాలి. మిక్సీలో పోపు వేసి మెత్తగా చేయాలి. చింత కాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ తిప్పాలి. కొబ్బరి ముక్కలు, పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రేకలు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ తిప్పాలి. ఒక గిన్నెలోకి తీసుకుని కరివేపాకుతో అలంకరించాలి.

పాత చింత కాయ తొక్కు

కావలసినవి: పాత చింతకాయ తొక్కు – 1 కప్పు; బెల్లం – అర కప్పు; ఎండు మిర్చి – 10; పచ్చి మిర్చి – 5 (పెద్దవి); ఇంగువ – తగినంత; నువ్వుల నూనె – పావు కప్పు

పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; నూనె – 2 టీ స్పూన్లు; ఇంగువ – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; వెల్లుల్లి రెబ్బలు – 8
తయారీ:

స్టౌ మీద పాన్‌లో నూనె వేడయ్యాక, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. పచ్చి మిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి, ఇంగువ వేసి దోరగా వేయించి చల్లారానివ్వాలి. చింతపండు తొక్కును మిక్సీలో వేసి మెత్తగా చేసి, పసుపు, బెల్లం జత చేసి మరోమారు మెత్తగా నూరి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేయించి ఉంచిన పోపును జత చేసి బాగా కలపాలి ఈ పచ్చడి. ఈ పచ్చడి పథ్యానికి చాలా మంచిది.

చింత కాయ నువ్వుల పచ్చడి
కావలసినవి: చింతకాయలు – 10; వేయించిన నువ్వులు – 100 గ్రా; పచ్చి మిర్చి – 10; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను ; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను

తయారీ:

చింత కాయలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. పప్పు గుత్తితో మెత్తగా అయ్యేలా మెదిపి, గుజ్జును వడకట్టాలి  ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక, పచ్చి మిర్చి వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో మరి కాస్త నూనె వేసి కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి. చల్లారాక మిక్సీలో వేసి, పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు జత చేసి మెత్తగా చేయాలి . వేయించిన నువ్వులు జత చేసి మరోమారు మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టాలి. చింత కాయ గుజ్జు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. 


బూడిద గుమ్మడికాయ తో చేయదగ్గ వంటకాలు

ఏమి చేసినా ,దానికి న్యాయం చేసే గుణం వుండడం గొప్ప అదృష్టం. వంకాయ కి కిరీటం పెట్టినా, మామిడి పండు ను కింగు నీ చేసినా, తిన డానికి మాత్రమే. గొప్ప వాసనా, రుచి, ఔషధ గుణాలు కలిగి, చాలా నమ్మకాలకు నెలవైన కాయ బూడిద గుమ్మడి కాయ. కూర గాను, పులుసు, పచ్చడి, ఇంకా దోశ ల గానూ, వడియాలు గాను, హల్వా గాను ,క్యాండీ గాను, రైతా గాను, పెరుగు పచ్చడి గానే కాకుండా, ఇంటి ముందు ఇంటికి వచ్చే వాళ్ళకి స్వాగతం చెప్పడానికి, దిష్టి తీసి పగలగొట్టడానికి కూడా ఉపయోగిస్తారు.గుమ్మడి రసం, ఆకులు, కాండం అన్నీ ఔషధాలు గా ఉపయోగ పడతాయి.

గుమ్మడి వడియాలు:

చాలా మంది వడియాలు పెట్టాలంటే గుమ్మడి ముక్కలు లో ఉప్పు వేసి , మూట కట్టి దాని పై బరువు పెట్టీ, రసం మొత్తం తీసి, పిప్పి నీ వడియాలు పెడతారు .

బూడిద గుమ్మడి లోని మొత్తం రుచినీ, ఔషధ గుణాలు పొందాలి అంటే…

గుమ్మడి కాయను చిన్న చిన్న ముక్కలు గా చేసి, మంచి ఎండ లో పెట్టీ , బాగా ఎండనివ్వాలి. గుమ్మడి లోని గుణాలు కోల్పోకుండా, ఇలా చేసిన ముక్కల్ని వడియాలు పెడితే చాలా రుచి గా వుంటాయి.

ఈ ముక్కలు సన్నటి సెగ మీద ,నూనె లో వేయించుకుని, ఉప్పూ,కారం జల్లుకొని తినొచ్చు.

మినప్పప్పు 1/4 కేజీ, పచ్చి మిర్చి ముక్కలు,50 గ్రాములు జీలకర్ర కొద్దిగా ఉప్పు.తగినంత, ఉల్లి ముక్కలు 1/4 కేజీ.

నాన పెట్టుకున్న మినప్పప్పు కొద్ది గా నీళ్ళు పోసి, మెత్త గా రుబ్బాలి . ఎండిన గుమ్మడి ముక్కలు లో మినప్పిండి , పచ్చిమిర్చి, జీలకఱ్ఱ, ఉప్పు, వేసి కలిపి, ముద్దలు గా చేసి, కాటన్ క్లాత్ మీద మంచి ఎండలో ఎండబెట్టాలి. ఈ పిండిలో ఉల్లి ముక్కలు వేసి కొన్ని విడి గా వడియాలు పెడితే, వేపించి స్నాక్స్ లా తిన డానికి పకోడీలు లా బాగుంటాయి.

బాగా ఎండాకా , జాగ్రత్త గా తీసి, గాలి తగలని సీసా లో పెట్టుకుంటే, పాడవ్వకుందా వుంటాయి.

సాంబారు,పప్పు మామిడి కాయ కూర వంటివి వండుకున్నప్పుడు నూనె లో వేపించుకుంటే బాగుంటాయి.

సాంబారు తాలింపు లో ఈ వడియం ముక్కలు వేసుకుంటే అద్భుతంగా వుంటుంది సాంబారు.

గుమ్మడి,కొబ్బరి కూర:

లేత గుమ్మడి ముక్క లూ, కొబ్బరి కోరు ,పచ్చిమిర్చి, మిరియాల పొడి వేసుకుని రుచి కరమైన కూర చేసుకోవచ్చు.

కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు.

గుమ్మడి ఆవ పెట్టిన కూర:

లేత గుమ్మడి ముక్కలు, మగ్గబెట్టీ, పచ్చి మిర్చి, అల్లం, చింతపండు గుజ్జు కొద్దిగా వేసి, శెనగపప్పు, మినప్పప్పు, జీల కఱ్ఱ, పోపు వేసి, ఆవాలు నూరి కలిపి, ఆవపెట్టాలి. అన్నం లోకి చాలా రుచి గా వుంటుంది.

గుమ్మడి కందిపప్పు కూట్టు:

లేతవి కూరకి బాగుంటాయి . గింజలు కూడా మెత్తగా వుంటాయి కాబట్టి ,బూడిద లా వున్నది శుభ్రంగా కడగాలి. కందిపప్పు లో వేసి వుడకబెట్టి ,కొద్దిగా చింతపండు రసం వేసి, బాగా మగ్గాకా , ఎండు మిర్చి,కరివేపాకు, ఆవాలు ,జీలకర్ర, తో పోపు పెట్టుకోవాలి.

గుమ్మడి పెరుగు పచ్చడి:

గుమ్మడి కోరు పెరుగు లో కలిపి, క్రోత్తి మెర , ఉప్పు కలిపి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు.

చపాతీ, వుప్మా, అన్నం లోకి చాలా బాగుంటుంది.

గుమ్మడి మినప దోశ:

గుమ్మడి ముక్కలు మెత్తగా మిక్సి లో పేస్ట్ కింద చేసుకుని, దోశ పిండి లో కలిపి దోశలు వేసుకుంటే, ఇల్లంతా ఘుమ ఘుమలు తో నిండి పోతుంది.

చిన్న మంట మీద కొంచెం మగ్గ నిస్తూ వేసుకోవాలి.

పేఠా/ మొరబ్బా/క్యాండీ:

తొక్క,గింజలు తీసేయాలి.ముక్కలు గా కోసు కోవాలి. గుమ్మడి ముక్కలు నీ నిమ్మ ఉప్పు నీళ్లలో వేసి ,నాన బెట్టాలి.కొంత సేపు నాన బెట్టాకా తీసి , ఉడక బెట్టాలి. ఒక గిన్నెలో పంచదార పాకం పట్టి, చిక్కగా అయ్యేవరకు తిప్పాలి. పాకం ముదిరాకా వుడికిన గుమ్మడి ముక్కలు పాకంలో వేసి ,ఇంకా బాగా పాకం పట్టేలా చెయ్యాలి. వేడిగానూ, చల్లారాక కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఉత్తర భారత దేశం లో చాలా మంది ఇష్టం గా తింటారు. ఆగ్రా స్వీట్ అని ప్రసిధ్ధి. రోడ్ల మీద బండి లో అమ్ముతుంటారు.

గుమ్మడి హల్వా:

గుమ్మడి తురుము ను దళసరి మూకుడు లో సన్నటి సెగ లో మగ్గ బెట్టాలి. తగినంత పంచదార వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. జిగురు పాకం వచ్చే వరకు, తిప్పుతూ వుండాలి. పాకం బాగా వచ్చాకా,నెయ్యి,వేయించిన జీడిపప్పు, ఎండు కిస్మిస్ పండ్లు, యలక్కాయ పొడి వేసి కలపాలి. ఒక పళ్ళెంలో నెయ్యి రాసి, దానిలో చక్కగా పరచి, కొంచెం బిగిశాక, ముక్కలు గా కోసుకుంటే నోరూరించే గుమ్మడి హల్వా సిద్ధం.

బూడిద గుమ్మడి రుచికరమైన గుమ్మడి.

గ్రీన్‌ టీలో ఈ రసం కలిపి తాగితే ఈజీగా బరువు తగ్గుతారు

మీరు రెగ్యులర్ గా తీసుకునే గ్రీన్ టీ కు కాసిన్ని మార్పులు చేయండి. సూతింగ్ లెమనేడ్ ను సిద్ధం చేసుకోండి. మీకు గ్రీన్ టీ అంటే ఇష్టమైనా సరే రోజూ అదే పనిగా దాన్నే తీసుకుంటే మీకు బోర్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ లో వివిధ రకాల గ్రీన్ టీలు అందుబాటులో ఉన్నా మీ డ్రింక్ ను కొంచెం ఫ్లేవర్ తో మరికొంచెం టేస్ట్ తో మరింత డెలిషియస్ గా మార్చుకోవడం వల్ల మీరు గ్రీన్ టీ ను ఆస్వాదించగలుగుతారు. కాబట్టి, రెగ్యులర్ గ్రీన్ టీ కు కాస్తంత టేస్టీ ట్విస్ట్ నివ్వండి. దీని ద్వారా హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందండి.

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయన్న విషయం తెలిసిందే. అందుకే, ఇది చాలామందికి ఆల్ టైమ్ ఫ్యావరేట్ డ్రింక్. ఎండాకాలంలో ఈ డ్రింక్ ను తీసుకునేందుకు ఎక్కువగా ప్రిఫర్ చేయరు. అంతేకదా? అప్పుడు చల్ల చల్లటి నిమ్మరసాన్ని దీనికి జోడిస్తే ఆ టేస్టే వేరు. ఇలా చేయడం వల్ల ఈ డ్రింక్ నుంచి కూలింగ్, సూతింగ్ అలాగే హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ లభిస్తాయి. గ్రీన్ టీతో పాటు నిమ్మరసం బెనిఫిట్స్ కూడా పుష్కలంగా అందుతాయి. 

కావలసిన పదార్థాలు

 • వేడి నీళ్ళు – అరకప్పు
 • గ్రీన్ టీ బ్యాగ్
 • ఐస్
 • నిమ్మరసం
 • తేనె

ప్రాసెస్:

అరకప్పు వేడి నీళ్లల్లో గ్రీన్ టీ బ్యాగ్ ను పెట్టండి. వడకట్టండి. ఐస్, నిమ్మ మరియు తేనెను కలపండి. బాగా కలపండి. ఈ డ్రింక్ ను ఆస్వాదించండి. ఈ డ్రింక్ ను మీకు నచ్చినప్పుడు ప్రిపేర్ చేసుకుని తాగండి.

హెల్త్ బెనిఫిట్స్:

నిమ్మ మరియు తేనెతో కలిపిన గ్రీన్ టీ అనేది మెటాబాలిజాన్ని పెంపొందిస్తుంది. బ్యాడ్ బ్రీత్ ప్రాబ్లెమ్ ను తగ్గిస్తుంది. లోపల నుంచి డీటాక్స్ చేస్తుంది. మరోవైపు లేమనేడ్ లో విటమిన్ సి పుష్కలంగా కలిగి ఉంటుంది. కాబట్టి, ఈ డ్రింక్ ను కచ్చితంగా తాగి తీరాలి. నవంబర్ 2014లో జర్నల్ ఆఫ్ ఫుడ్ ప్రోసెసింగ్ అండ్ టెక్నాలజీలో పబ్లిష్ ఐన స్టడీ ప్రకారం సిట్రస్ జ్యూస్ అనేది గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ ను శరీరానికి అందుబాటులో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో, శరీరం గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ ను సులభంగా గ్రహించగలుగుతుంది.

వెయిట్ లాస్..

వెయిట్ లాస్ కి సంబంధించి ఎన్నో డైట్ ప్లాన్స్ తో పాటు మరెన్నో ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో దేన్ని ఫాలో ఐతే మంచిదో అన్న విషయంలో చాలామంది కాస్తంత కన్ఫ్యూజన్ కు గురవుతున్నారన్న విషయం వాస్తవమే. ఐతే, ఖరీదైన మీల్ ప్లాన్స్ అనేవి వెయిట్ లాస్ ను వేగవంతం చేస్తున్నాయని ప్రకటిస్తున్నా ఇంట్లోనే హ్యాపీగా వెయిట్ లాస్ కి సపోర్ట్ చేసే రెమెడీస్ అనేకం ఉన్నాయి. వాటిలో ఈ సింపుల్ ట్రిక్ తో చిరాకు పుట్టించే బెల్లీ ఫ్యాట్ ను తరిమికొట్టవచ్చు. అదనపు బెనిఫిట్స్ ను కూడా పొందవచ్చు.

గ్రీన్ టీ నుండి అనేక హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చని కొన్ని శతాబ్దాల నుంచి హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ చెబుతూనే ఉన్నారు. ఈ విషయంపై అనేక స్టడీస్ కూడా జరిగాయి. వాటిలో కూడా గ్రీన్ టీ లో ఉండే కెఫైన్ తో పాటు ఫ్లెవనాయిడ్స్ అనేవి మెటాబాలిజాన్ని బూస్ట్ చేస్తాయని చెప్పబడి ఉంది. ఫ్యాట్ ను బ్రేక్ డౌన్ చేయడానికి అలాగే ప్రాసెస్ చేయడానికి ఇవి ఎంతో హెల్ప్ చేస్తాయని స్టడీస్ వెల్లడిస్తున్నాయి.

ఒక స్టడీ ప్రకారం గ్రీన్ టీను తరచూ తీసుకున్నవారు పన్నెండు వారాల్లో సగటున ఒకటిన్నర కిలోల బరువు తగ్గారు. వారు తమ డైట్ లో ఎటువంటి మార్పులూ చేర్పులో చేసుకోలేదు. కాటెచిన్ అనే ఫ్లెవనాయిడ్ మరియు గ్రీన్ టీ లో ఉండే కెఫైన్ కాంబినేషన్ వల్ల ఇదంతా సాధ్యమైందని వారంటున్నారు. ఈ రెండూ బాడీలోని ఎనర్జీను వాడే మోతాదును పెంచుతాయట. అందుకే, వెయిట్ లాస్ ప్రక్రియ ఆరోగ్యంగా జరుగుతుందని స్టడీస్ చెబుతున్నాయి.

కేవలం గ్రీన్ టీ మాత్రమే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందన్న విషయం తెలిసిందే. ఐతే, ఈ గ్రీన్ టీలో తాజాగా పిండిన నిమ్మరసాన్ని కలిపితే ఇది అద్భుతమైన డీటాక్స్ డ్రింక్ గా మారి మీ బాడీలోని టాక్సిన్స్ ను బయటికి పంపించేందుకు హెల్ప్ చేస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అలాగే శరీరానికి తగినంత న్యూట్రిషన్ కూడా ఈ విధంగా అందుతుందని చెబుతున్నారు. ఇందులో కేలరీస్ అనేవి లేకపోయినా మెటాబాలిజాన్ని బూస్ట్ చేసే ప్రాపర్టీస్ మాత్రం పుష్కలంగా లభిస్తాయి. డిటాక్సిఫికేషన్ అలాగే క్లీన్సింగ్ తో శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వెయిట్ ని హెల్తీగా మెయింటెయిన్ చేయాలన్నా అలాగే వెయిట్ ను తగ్గించుకోవాలన్నా కూడా ఈ రెండూ ముఖ్యమే. రిజల్ట్స్ ఆశాజనకంగా ఉండాలంటే రోజుకు వందకేలరీలను అదనంగా కరిగించగలగాలి. రోజుకు మూడు సార్లు ఈ మ్యాజిక్ డ్రింక్ ను తాగగలిగితే ఫలితం ఉంటుంది.

గ్రీన్ టీతో పాటు నిమ్మలో శక్తివంతమైన ఫ్యాట్ బర్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ పై పోరాడతాయి. ఇరిటేటెడ్ స్కిన్ ను సూత్ చేస్తాయి. అలాగే, వీటిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఫైన్ లైన్స్ తో పాటు ముడతల సమస్యలు తగ్గుతాయి.

అదేవిధంగా, నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే వెయిట్ లాస్ కి తోడ్పడే న్యూట్రియెంట్స్ కూడా లభిస్తాయి. స్ట్రోక్, ఆస్త్మా, క్యాన్సర్ రిస్క్ లను తగ్గించే గుణం నిమ్మలో ఉంది. రోజూ నిమ్మ వంటి ప్లాంట్ ఫుడ్స్ ను తీసుకుంటే డయాబెటిస్, ఒబెసిటీ, హార్ట్ డిసీజ్ లకు గురయ్యే రిస్క్ చాలామటుకు తగ్గుతుందని స్టడీస్ చెబుతున్నాయి. కాబట్టి, ఈ డెలిషియస్ డ్రింక్ తో హెల్తీగా ఉండండి. వెయిస్ట్ లైన్ కూడా ఆటోమేటిక్ గా స్లిమ్ అవుతుంది.

ఆనపకాయతో వంటలు

ఆనపకాయ హల్వా: ముందుగా ఆనపకాయ ని శుభ్రం గా కడిగి, చెక్కు తీసి, తురుముకుని నీరు అంతా పోయేలాగా పిండుకోవాలి. ఇప్పుడు ఈ తురుము ని, నెయ్యి వేసుకుని పచ్చి వాసన పోయేదాక వేయించుకోవాలి. తర్వాత, పాలు పోసుకుని ఉడికించుకోవాలి. ఉడికి కొంచెం దగ్గర పడ్డాక, పంచదార, యాలకుల పొడి వేసుకుని మరికాసేపు ఉడికించాలి. చివరగా, పచ్చి కోవా వేసి మరో రెండు నిమిషాలు ఉంచి, నేతి లో వేయించుకున్న జీడిపప్పు తో అలంకరిస్తే సరి! నోరూరించే హల్వా సిద్దమైనట్లే!

ఆనపకాయ పాయసం(ఖద్దు కా ఖీర్): ముందుగా, ఆనపకాయని చెక్కు తీసి, తురుముకుని, నేతి లో వేయించుకుని పక్కనుంచుకోవాలి. తర్వాత పాలని, చిక్కబడేంత వరకు సన్నని మంట పై మరగనివ్వాలి. ఇందులో, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, నానబెట్టి రుబ్బుకున్న జీడిపప్పు ముద్ద ని,వేడి పాలలో కరిగించి పెట్టుకున్న పచ్చి కోవా ని కలుపుకోవాలి. సగ్గుబియ్యం ఉడికాక, వేయించి పక్కన పెట్టుకున్న ఆనపకాయ తురుముని, పంచదార ని, యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. చివరగా, బాదం, పిస్తా పప్పుల తురుముని వేసుకోవాలి.

ఆనపకాయ కోఫ్తా కూర:ఆనపకాయ తురుము లో, నీరు పిండేసుకుని, కొద్దిగా శనగ పిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాల, కొత్తిమీర తరుగు వేసి కలుపుకుని, కోఫ్తాల్లా చేసుకుని, నూనె లో వేయించుకుని పక్కన బెట్టుకోవాలి. ఇంకో గిన్నె లో, ఉల్లిపాయ తరుగు, టమాట తరుగు వేసి కాసేపు వేయించుకుని, నానబెట్టిన జీడిపప్పు ని కలుపుకుని, రుబ్బుకోవాలి. బాణాలిలో నూనె పోసి వేడెక్కాక, జీల కర్ర, బిర్యానీ ఆకు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి వేసుకోవాలి. ఇప్పుడు, రుబ్బి పెట్టుకున్న టమాట, ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకుని, నూనె పైకి తేలెంత వరకు ఉడికించుకోవాలి. చివరగా, కోఫ్తాలు, తరిగిన కొత్తిమీర వేసుకోవాలి.

ఆనపకాయ పరాటా: రెండు కప్పుల గోధుమ పిండి లో, ఒక కప్పు ఆనపకాయ తురుము, తరిగిన పచ్చి మిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసుకుని, చాలా కొద్దిగా నీళ్ళు పోసుకుని, చపాతీ పిండి లా కలుపుకోవాలి. ఒక ఇరవై నిమిషాలు పిండి ని పక్కన పెట్టుకుని, తర్వాత పిండి ముద్దని తీసుకుని, కొంచెం మందంగా పరాటాలు చేసుకొవాలి. వీటిని, పెనం మీద, రెండు వైపులా వెన్న వేసుకుంటూ కాల్చుకోవాలి.

ఆనపకాయ-టమాట పచ్చడి: ఆనప కాయ, టమాట, పచ్చిమిర్చి ముక్కల్ని కొద్దిగా నూనె వేసి ఉడికించి, కొంచెం చింతపండు, జీలకర్ర, రెండు వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు వేసుకోవాలి.చల్లారాక, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. ఇప్పుడు, శనగ పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి మిగతా తాలింపు దినుసులు కూడా వేసుకుని పోపు పెట్టుకోవాలి.

ఆనపకాయ-నువ్వుల కూర: ఆనప కాయని శుభ్రంగా కడిగి, చెక్కు తీసి ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. బాణలి లో నూనె పోసి, వేడెక్కాక తాలింపు దినుసులు, తరిగిన ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఆనపకాయ ముక్కలు వేసి, కొద్దిగా నీరు పోసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చి మిర్చి ముద్ద, తగినంత ఉప్పు వేసి ఉడికాక, చివరగా నువ్వుల పొడి, కొత్తిమీర కలుపుకుని దించేసుకోవాలి. ఈ కూర చపాతీ లోకి, అన్నం లోకి కూడా బాగుంటుంది.

రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్

రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్ ఇంట్లోనే చేసుకోండిలా...

ప్రధాన పదార్థం

 • 1 కప్ నానబెట్టినవి బాస్మతి బియ్యం

ప్రధాన వంటకానికి

 • 2 Numbers బిర్యానీ ఆకు
 • 2 1/2 కప్ నీళ్ళు
 • 1 కప్ బఠానీలు
 • 1 కప్ కోయబడినవి చిక్కుళ్ళు
 • 1 కప్ కోయబడినవి క్యారెట్
 • 1 కప్ కోయబడినవి కాలీఫ్లవర్
 • అవసరాన్ని బట్టి మిరియాలు

టెంపరింగ్ కోసం

 • 1 టీ స్పూన్ నెయ్యి
 • 2 Numbers పచ్చి మిర్చి
 • 1 Numbers నల్ల ఏలకులు
 • 1 Numbers దాల్చిన చెక్క
 • అవసరాన్ని బట్టి లవంగం
 • 1 టీ స్పూన్ జీలకర్ర

Step 1:

కడాయిలో నూనె వేసుకొని వేడిచేయండి. ఇపుడు జీలకర్ర , లవంగాలు , బే లిఫ్స్ , యాలకలు, దాల్చిన చెక్క వేసుకొని ఒక నిముషం వేయించు కొండి.

Step 2:

కాలీఫ్లవర్ ముక్కలు , క్యారెట్, బీన్స్ కాలాయిలో వేసి పెద్దమంట మీద 3 నుంచి 4 నిముషాలు వండుకోవాలి.

samayam telugu

Step 3:

బాస్మతి రైస్ ని వేసుకొని అందులో రెండున్నర కప్పుల నీళ్లను పోసుకొని ఉడికించుకోవాలి . నీళ్లు మరిగిన వెంటనే ఉప్పును వేసుకొని 10 నిముషాలు చిన్న మంట మీద వండుకోవాలి. తరువాత ఆవిరిని చల్లబడనివ్వాలి.

samayam telugu

Step 4:

ఇప్పుడు రైతా, మీకు ఇష్టమైన కూరతో రుచికరమైన వెజిటల్ పులావ్ ని వడ్డించుకోండి.

క్యాబేజీతో రుచికరమైన వంటకాలు

1. క్యాబేజీ వేపుడు

స్టవ్ మీద బాండీ పెట్టి స్టౌ వెలిగించి బాండీలో నూనె వేసి నూనె కొంచెం మరిగాక క్యాబేజీ వేసి మెత్తగా ఉడికాక ,అందులో ఉప్పు కారం మనకి నచ్చితే ధనియాల ,జీలకర్ర పొడి వేసి దించుకోవచ్చు.

2. క్యాబేజీ పప్పు

పప్పుని కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ,ఒక బాండీలో నూనె వేసి వెల్లుల్లిపాయలు వేసి వేగాక ,అందులో పోపు దినుసులు వేసి ఇంగువ, పచ్చిమిర్చి వేసి వేగాక ,క్యాబేజి వేసి దగ్గరపడ్డాక పసుపు వేసి ఆ తర్వాత ఈ పప్పులు కలిపి ఉప్పు కారం వేసి ఇ దించుకోవాలి.

3. క్యాబేజీ కూర

ఒక బాండీలో నూనె వేసి పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి ,ముక్కలు కింద చేసి వేసి బాగా వేగనిచ్చి ఉడికించుకున్న క్యాబేజీని ఇందులో కలిపి పసుపు వేసి వేగిన తర్వాత ఉప్పు కారం వేసి దించుకోవాలి

4. క్యాబేజీ ఆవకాయ

ఆవాలు విడిగా మెంతుల్ని విడిగా మాడిపోకుండా వేయించుకొని చల్లారి పెట్టి విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత క్యాబేజీని సుబ్బరంగా కడుక్కుని ఎండలో పెట్టి, తర్వాత తీసుకొచ్చి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో క్యాబేజీ వేసి తర్వాత మెంతి పొడి ఒక స్పూను ఆవ పొడి ఒక స్పూన్ వేసి క్యాబేజీ కి తగ్గట్టుగా ఉప్పు తగ్గట్టుగా కారం కూడా వేసుకుని తర్వాత దీనంతటికీ సరిపడా నూనె పోసుకోవాలి అంతే టెస్ట్ టెస్ట్ క్యాబేజీ ఆవకాయ రెడీ

5. క్యాబేజీ సెనగపప్పు కూర

ఫస్ట్ సెనగపప్పు ని కడిగి దానికి తగ్గట్టుగా నీళ్లుపోసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాలి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి ఆ తరువాత క్యాబేజీని కూడా అట్లనే ఉడకబెట్టి ఆ తర్వాత బాండీ పెట్టి నూనె వేసి పోపు దినుసులు వేసుకుని తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి అవి వేగనిచ్చి అందులో శనగపప్పు కాస్త ఉడికాక అప్పుడు క్యాబేజీ వేసి దగ్గర పడ్డాక పసుపు ఉప్పు కారం వేసి దించుకోవాలి

6. క్యాబేజీ పెసరపప్పు ఫ్రై

పెసరపప్పుని ఒక 30 నిమిషాలు నాననిచ్చి ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకుని నీళ్లు పోసుకుని పెసరపప్పు క్యాబేజీ రెండు కలిపి ఆ గిన్నెలో నీళ్లలో ఉడకనివ్వాలి పెసరపప్పు చేత్తో పట్టుకుని మెత్తగా అయ్యిందో లేదో చూసి ఇ మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత పచ్చిమిర్చి అల్లం రెండు కలిపి పేస్ట్ చేసుకుని ఒక బాండి పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసి ఈ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే దాక వేయించి ఆ తర్వాత పెసరపప్పు క్యాబేజీ కలిపి దగ్గరపడ్డాక పసుపు సాల్టు కారం వేసుకుని దించుకుంటే వేడివేడిగా పెసరపప్పు క్యాబేజీ ఫ్రై రెడీ

7. క్యాబేజీ 65

పెద్దగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలు అలాగే పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఓ పక్కనుంచుకోవాలి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి వేస్ట్ కింద చేసుకొని ఉంచుకోవాలి, ఇప్పుడు తయారీ విధానం ఏంటంటే ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి క్యాబేజీ ముక్కలు ,కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కాన్ ఫ్లోర్ ఒక స్పూన్, తర్వాత బియ్యప్పిండి ఒక స్పూన్ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు ఆ తర్వాత కొత్తిమీర సన్నగా తరుక్కుని అందులో కలుపుకోవాలి అందులోకి టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ,ఒక టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, టేబుల్స్ స్పూన్ కారం ,టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నీ కలిసేలా గా కలుపుకోవాలి, చిన్న కప్పు తో శనగపిండి వేసి జీడి పప్పులు కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి, కొంచెం నీళ్ళు పోసి అంతా కలిసేలా బాగా కలిపి బాండీలో డీప్ ఫ్రై కి నూనె పెట్టి ఇ నూనె కాగాక పకోడీ లాగా వేసుకోవాలి వాటిలో రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి వేగాక ఒక దాంట్లో తీసుకుని వడ్డీ చుకుంటే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ తయారు

8. క్యాబేజీ పరోటా

పరోటా పిండి ని మనం కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి, క్యాబేజీ ఒక గిన్నెలోకి తీసుకుని సన్నగా పచ్చిమిరపకాయలు తరుక్కోవాలి అందులో వేసుకోవాలి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాల పౌడర్, ఉప్పు కారం వేసి అన్ని కలిపి పరోటా పిండి వత్తుకుని ఈ క్యాబేజీ మిశ్రమాన్ని దాని మధ్యలో పెట్టుకుని ఒత్తుకోవాలి, తర్వాత ఒక పెనం పెట్టుకుని ఈ పరోటా ని వేయించుకుని సరిచేసుకుంటే వేడి వేడి క్యాబేజీ పరోట సిద్ధం

9. క్యాబేజీ పెరుగు పచ్చడి

సన్నగా తరుక్కున్న క్యాబేజీ తర్వాత ఉల్లిపాయలు కూడా డా సన్నగా తరుక్కుని సన్న మంటలో వేయించుకోవాలి ఎర్రగా వేగాక అవి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత శనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ఎండు మిర్చి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి, అవి వేగాక ఒక గిన్నెలోకి క్యాబేజీ ఉల్లిపాయలు వేయించుకున్న పోకులు కూడా ఏసి ఆ తర్వాత పెరుగు కొట్టుకుని అందులో కలిపి ఉప్పు పసుపు వేసి దాన్ని కలిపి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది

క్యాబేజీ – బటానీల కూర

కావలసినవి
క్యాబేజీ : పావు కిలో
పచ్చి బటానీలు : 100 గ్రాములు
ఉల్లిపాయ : 1
పచ్చిమిర్చి : 3
ఎండుమిర్చి : 2 కాయలు
తిరగమాత గింజలు : 1 స్పూన్
జీలకర్ర : స్పూన్
కారం : స్పూన్
పసుపు : అరస్పూన్
ఉప్పు : తగినంత
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్
నూనె : 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు : 3 రెబ్బలు
కొత్తిమీర : కొద్దిగా
తయారుచేసే విధానం
ముందుగా క్యాబేజీని, ఉల్లిపాయను, మిర్చిని సన్నగా తురుముకోవాలి. పచ్చి బటానీలు దొరకకపోతే ఎండు బటానీలను ఒక రాత్రంతా నానబెట్టుకొని, ఉడకబెట్టుకొని వాడుకోవచ్చు.
ముందుగా పాన్ పొయ్యిమీద పెట్టి నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చిని తుంచి వేయాలి. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తరువాత తిరగమాత గింజలు, జీలకర్ర వేసి వీటిని కూడా కొద్దిసేపు వేయించాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.
వేగిన తరువాత బటానీలు, సన్నగా తురిమిన క్యాబేజీ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలిపి మూతపెట్టి సన్నని సెగపై చక్కగా వేయించాలి. చక్కగా వేగిన తరువాత దించే ముందు కొత్తిమీర తురుము చల్లుకోవాలి. ఇది అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ మంచి కాంబినేషన్.

బంగాళదుంపలతో వంటలు

Potato Fry…బంగాళదుంపల ఫ్రై

కావలసినవి
ముందుగా నాణ్యమైన దుంపలను తీసుకోవాలి. దుంపల మీద ఆకుపచ్చ రంగు మచ్చలు కానీ, మొలకలు కానీ ఉండకూడదు.
బంగాళా దుంపలు : పావుకిలో
ఉల్లిపాయ : ఒకటి
పచ్చి మిరపకాయలు : మూడు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : పావుస్పూన్
ఉప్పు : తగినంత
తిరగమాత గింజలు : 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి : 2 కాయలు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్


తయారుచేసే విధానం
ముందుగా బంగాళా దుంపలను తగినంత నీరు పోసి కొద్దిగా ఉప్పువేసి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత నీరు వంపివేసి చల్లటి నీళ్లలో దుంపలను వేయాలి. ఆరిన తరువాత పైన తోలు తొలగించాలి. దుంపలను కావలిసిన సైజులో కోసుకోవాలి ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని కూడా చిన్నవిగా తరుగుకోవాలి.

తరువాత స్టవ్ వెలిగించి వెడల్పాటి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చిని రెండుగా తుంచి వేయాలి. అవి కొంచెం వేగాక తిరగమాత గింజలు వేసి అవి కూడా వేగాక సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, రెబ్బలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే దాకా వేయించాలి. తరువాత అందులో బంగాళా దుంపల ముక్కలు వేసి, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి సన్నని సెగమీద చక్కగా వేగనివ్వాలి. తరువాత ఉఫ్పు వేసి చక్కగా కలిపి ఇంకొద్ది సేపు వేగనిచ్చి దింపుకోవాలి.

Alu…Batani Curry….బఠానీ..బంగాళాదుంపల కూర

కావలసినవి
బంగాళదుంపలు – రెండు
పచ్చి బఠాణీలు- కప్పు
ఉల్లిపాయ – రెండు పాయలు
టమాటాలు- రెండు
పచ్చిమిర్చి-నాలుగు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
కారం- చెంచా
పసుపు – పావు స్పూన్
ఉప్పు – తగినంత
కొత్తీమీర : కొద్దిగా
నూనె- రెండు టేబుల్ స్పూన్లు

తయారు చేసే పద్ధతి
ముందుగా పచ్చి బటానీలను ఉడకబెట్టాలి. పచ్చి బటానీలు దొరకకపోతే ఎండు బటానీలను ఒక రాత్రాంతా నానబెట్టుకొని ఉడక బెట్టకోవాలి. ఉల్లిపాలయలను, పచ్చిమిరపకాయలను సన్నగా తరుగుకోవాలి.

తరువాత ఒక కడాయిలో నూనె వేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. బంగాళదుంపలను చెక్కుతీసి చిన్నముక్కలుగా కోసి.. ఉల్లిపాయల్లో వేసి వేయించాలి. పసుపు, కారం, ఉప్పు, టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉడికిన తర్వాత పచ్చి బఠాణీలు వేసి, తగినంత ఉప్పు కలిపి అవసరమైతే కొద్దిగా నీరుపోసి మూతపెట్టేయాలి. ఉడికిన తర్వాత దించుకునే ముందు కొత్తిమీర తురుము చల్లుకోవాలి. ఈ కూర చపాతీలలోకి మంచి కాంబినేషన్.

వంకాయతో వంటలు

Brinjal Fry…వంకాయ ఫ్రై

కావలసినవి
లేత వంకాయలు : పావుకిలో
ఉల్లిపాయ : ఒకటి
పచ్చి మిరపకాయలు : మూడు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
పచ్చి కొబ్బరి తురుము: 2 స్పూన్లు
పసుపు : పావుస్పూన్
ఉప్పు : తగినంత
తిరగమాత గింజలు : 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి : 2 కాయలు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్

తయారుచేసే విధానం
ముందుగా వంకాయలను ఉప్పువేసిన నీటిలో శుభ్రంగా కడుగు కోవాలి. వంకాయలను కోసిన వెంటనే కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో వేయాలి లేకపోతే ఇవి కండ్రు ఎక్కి చేదుగా మారుతాయి. వంకాయలను మధ్యలోకి కోసి వాటిని తిరిగి నిలువుగా నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని కూడా చిన్నవిగా తరుగుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి వెడల్పాటి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చిని రెండుగా తుంచి వేయాలి. అవి కొంచెం వేగాక తిరగమాత గింజలు వేసి అవి కూడా వేగాక సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, రెబ్బలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే దాకా వేయించాలి. తరువాత అందులో వంకాయ ముక్కలు వేసి, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి సన్నని సెగమీద చక్కగా వేగనివ్వాలి. తరువాత కొబ్బరి తురుము, ఉఫ్పు వేసి చక్కగా కలిపి ఇంకొద్ది సేపు వేగనిచ్చి దింపుకోవాలి.

బ్రింజాల్‌ రోల్స్‌

కావలసినవి: వంకాయలు (బ్రింజాల్‌) – 3 లేదా 4 (పొడవైనవి), ఆలివ్‌ నూనె – 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి – అర టీ స్పూన్‌, నీళ్లు – 2 టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం – 4 టేబుల్‌ స్పూన్లు, ఉడికించిన బియ్యం రవ్వ – ముప్పావు కప్పు, అవకాడో – 1, నూనె – డీప్‌ ప్రైకి సరిపడా, టమాటా ముక్కలు – పావు కప్పు, జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు, బీట్‌ రూట్‌ తురుము – 3 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, పుదీనా తరుగు – 1 టేబుల్‌ స్పూన్లు, క్యారెట్‌ – 3, వేరుశనగలు – పావు కప్పు (రవ్వలా మిక్సీ పట్టుకోవాలి), ఉప్పు – తగినంత.

తయారీ: ముందుగా వంకాయలను శుభ్రం చేసుకుని, కాడలు తొలగించి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో ఆలీవ్‌ నూనె, ఉప్పు, మిరియాల పొడి, రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం, నీళ్లు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఓ పాన్‌లో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే వేరుశనగ రవ్వ, బీట్‌రూట్‌ తురుము, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి.

ఇప్పుడు అందులో ఉడికించిన బియ్యం రవ్వను కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో ఆలివ్‌ మిశ్రమం కూడా వేసుకుని, చివరిగా సరిపడా ఉప్పు వేసుకుని, బాగా కలుపుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికిన వంకాయలను పొడవుగా (థిన్‌ స్లైస్‌లా) కట్‌ చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని, అందులో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచుతూ రోల్స్‌లా చుట్టుకుని కొత్తిమీర లేదా పుదీనాతో గార్నిష్‌ చేసుకుని, టమాటా సాస్‌తో సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.

వంకాయ పచ్చి పులుసు

ముందుగా,జామకాయ అంత నల్ల చింతపండు నానబెట్టాలి. ఇప్పుడు నల్లగా పెద్దగా ఉన్న ఒక వంకాయని తీసుకుని కడిగి తుడిచి నూనె రాసి నిప్పుల మీద కాల్చాలి. బొగ్గుల కుంపటి మీద కానీ, గాస్ పొయ్యి మీద కానీ…అటూ ఇటూ తిప్పుతూ కాలుస్తూ ఉండాలి..పది నిమిషాలకి అన్ని వైపులా బాగా కాలి పొట్టు ఊడి వస్తూ ఉంటుంది, లోపల కూడా బాగా కాలి,మెత్తగా అయి ఉంటుంది . ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని ఈ వంకాయని అందులో వేసి పొట్టు వలిచేయాలి. ఇప్పుడు 3–4 పచ్చిమిరపకాయలని నిప్పుల మీద కాల్చాలి, వంకాయని కాల్చినట్టే. తరువాత ఆ వంకాయని చేత్తో మెదిపి లోపల తెల్ల పురుగులు ఉన్నాయేమో గమనించి తీసేయ్యాలి, వంకాయని బాగా మెదిపి, పచ్చిమిరపకాయలని కూడా బాగా మెదిపి, పేస్ట్ లాగా చేసుకుకోవాలి లేదా రోట్లో నూరుకుంటే ఒక నిమిషం లో పేస్ట్ అయిపోతుంది, ఇక, సన్నగా, చిన్నగా ,తరిగిన రెండు ఉల్లిపాయలు, సరిపడా చెంచాడు ఉప్పు,కొత్తిమీర తరుగు వేసి బాగా కిందనించి మీదదాకా కలగలపాలి, నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసి ఈ వంకాయ ఉల్లిపాయ పేస్ట్ లో పోసి గ్లాసుడు నీళ్లుపోయ్యాలి. గరిటతో ఈ మిశ్రమాన్ని బాగా పైనించి కిందకి కలపాలి. ఇష్టం అయితే కొద్దిగా అవలూ, జీలకర్ర ,రెండు ఎండుమిరపకాయలు, పసుపు,కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే వంకాయ పచ్చిపులుసు రెడీ.

Brinjal Curry with Raw greenpeace….వంకాయ బఠాణీ

కావలసినవి
వంకాయలు: పావుకిలో
పచ్చి బఠాణీలు: 50 గ్రాములు
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం: అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
దనియాలపొడి: 1 టేబుల్‌స్పూన్లు
కారం: టీస్పూను
ఉప్పు: తగినంత
కొత్తిమీర తురుము: కొద్దిగా
కొబ్బరి తురుము: టేబుల్‌ స్పూను
తాలింపుకోసం: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు
పసుపు : అర చెంచా
తయారుచేసే విధానం:
ముందు రోజు రాత్రి ఎండు బఠానీలను నాన బెట్టుకొని వంకాయ కూర చేసే ముందు ఉడికించుకోవాలి. పచ్చివయితే నేరుగావేయవచ్చు అల్లం,వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దలా చేయాలి… బాణలిలో నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేసి వేగాక అల్లం, వెల్లుల్లివేయాలి. తరవాత పచ్చిమిర్చి ముద్ద, బఠాణీలు వేసి రెండు నిమిషాలు వేయించాక కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తరువాత వంకాయ ముక్కలుగా కోసి ఇందులో వేసి మూతపెట్టిఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. చివరగా దనియాలపొడి, కారం, ఉప్పు, పసుపు, కొబ్బరితురుము, కొత్తిమీర తురుమువేసి ఉడికించి దించుకోవాలి.

దొండకాయతో వంటలు

Dondakaya Fry…దొండకాయ ఫ్రై

కావలసినవి
దొండకాయ వేపుడుకి సన్న దొండకాయలు మంచివి.
లేత దొండకాయలు : పావుకిలో
ఉల్లిపాయ : ఒకటి
పచ్చి మిరపకాయలు : మూడు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
పచ్చి కొబ్బరి తురుము: 2 స్పూన్లు
పసుపు : పావు స్పూన్ ఉప్పు : తగినంత
తిరగమాత గింజలు : 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి : 2 కాయలు
చిన్నుల్లిపాయలు : 4 రెబ్బలు

తయారుచేసే విధానం
తయారు చేసే విదానం ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలి. వీటిని గుండ్రంగా చక్రాల్లాగా కోసుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని కూడా చిన్నవిగా తరుగుకోవాలి.

తరువాత స్టవ్ వెలిగించి వెడల్పాటి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చిని రెండుగా తుంచి వేయాలి. అవి కొంచెం వేగాక తిరగమాత గింజలు వేసి అవి కూడా వేగాక సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, నలగగొట్టిన చిన్నుల్లి రెబ్బలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే దాకా వేయించాలి. తరువాత అందులో సన్నగా తరిగిన దొండకాయముక్కలు వేసి, కొద్దిగా పసుపు కూడా వేసి సన్నని సెగమీద చక్కగా వేగనివ్వాలి. తరువాత కొబ్బరి తురుము, ఉఫ్పు వేసి చక్కగా కలిపి ఇంకొద్ది సేపు వేగనిచ్చి దింపుకోవాలి.

Tindura Curry … దొండకాయ కూర

కావలసినవి
దొండకాయలు: అరకిలో
పెసరపప్పు: అరకప్పు
మినప్పప్పు: 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి: నాలుగు
కొబ్బరి తురుము: 3 టేబుల్స్పూన్లు
మిరియాలు: నాలుగు
ఆవాలు: టీస్పూను
ఎండుమిర్చి: రెండు
కరివేపాకు: 2 రెమ్మలు
జీలకర్ర: టీస్పూను
పసుపు : అర స్పూను
నూనె: టేబుల్స్పూను
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం
దొండకాయని చిన్న ముక్కలుగా కోయాలి. పెసరపప్పుని కూడా మరీ మెత్తగా కాకుండా ఉడికించి ఉంచాలి. మినప్పప్పు, పచ్చిమిర్చి వేయించాలి. తరవాత వాటికి కొబ్బరి తురుము, మిరియాలు చేర్చి మెత్తని ముద్దలా రుబ్బాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. దొండకాయ ముక్కలు, పెసరపప్పు వేసి కలపాలి. ఇప్పుడు రుబ్బిన కొబ్బరి మిశ్రమం, పసుపు, ఉప్పు, కొద్దిగా కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి సిమ్లో ఉడికించుకొని దించుకోవాలి

బెండకాయ కూరలు

బెండకాయ ని చాలా రకాలుగా వండుకోవచ్చు.బెండకాయ తో ఏ రకం కూర వండిన తక్కువ సమయంలో తయారు అయిపోతుంది. బెండకాయ ని ఉపయోగించి బెండకాయ వేపుడు, బెండకాయ పులుసు, బెండకాయ మసాలా కూర, స్టఫ్ డ్ బెండకాయ, బెండకాయ కుర్కురే (kurkure) , బెండకాయ పచ్చడి .

బెండకాయల్ని తెచ్చుకొనేపుడు వాటి మొదలు అంటే తొడిమ కాకుండా రెండో చివర్లు వేలితో విరిపితే సులువుగా విరగాలి.అలా విరిగినవే లేత బెండకాయ అంటారు. లేత బెండకాయలే కూర వండుకోడానికి బావుంటాయి.

బెండకాయ మసాలా కూర 

అన్ని మసాలా కూర లాగా ముందుగా ఉల్లిపాయ, టమాటా, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాక కాస్త పెరుగుని కలిపి ముందుగా వేయించిన బెండకాయ ముక్కల్ని ఇందులో కల్పుకోడమే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా పొడి వేసి కల్పకొని చివరగా కొత్తిమీర తరుగు వేసుకుంటే కూర తయారు.

బెండకాయ కుర్కురే(kurkure):

బెండకాయల్ని పొడవు చిలీకలుగా తరుగుకొని మధ్యలో గింజలు తీసేసి ఆ ముక్కల్లో శనగపిండి, కాస్త బియ్యంపిండి ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా వేసి కొద్ది కొద్దిగా నీరు కలపండి డీప్ ఫ్రై కి నూనె పెట్టుకొని నూనె బాగా వేడి ఏక్కాక బెండకాయ ముక్కల్ని వేసి వేయించండి.

Ladies Fingers Fry….బెండకాయ ఫ్రై

కావలసినవి
నాణ్యమైన బెండకాయలు చిన్నవిగా ఉండి నూగుతో లోపల సన్నగింజలతో ఉంటుంది. చివరిభాగం తుంచితో తేలికగా విరిగిపోతుంది. హైబ్రీడ్ బెండకాయలు లావుగా, పెద్దవిగా, పెద్ద గింజలతో ఉంటాయి. ఇవి పెద్ద రుచిగా ఉండవు.
లేత బెండకాయలు : పావుకిలో
ఉల్లిపాయ : ఒకటి
పచ్చి మిరపకాయలు : మూడు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
పచ్చి కొబ్బరి తురుము: 2 స్పూన్లు
పసుపు : పావు స్పూన్ ఉప్పు : తగినంత
తిరగమాత గింజలు : 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి : 2 కాయలు
చిన్నుల్లిపాయలు : 4 రెబ్బలు
తయారుచేసే విధానం
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇలా చేస్తే బెండకాయలో జిగురు పెద్దగా ఉండదు. బెండకాయలు తడిలేకుండా పూర్తిగా ఆరినతరువాత చిన్నవిగా గుండ్రంగా కోయాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని కూడా చిన్నవిగా తరుగుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి వెడల్పాటి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తరువాత ఎండుమిర్చిని రెండుగా తుంచి వేయాలి. అవి కొంచెం వేగాక తిరగమాత గింజలు వేసి అవి కూడా వేగాక సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, నలగగొట్టిన చిన్నుల్లి రెబ్బలు కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే దాకా వేయించాలి. తరువాత అందులో సన్నగా తరిగిన బెండకాయముక్కలు వేసి, కొద్దిగా పసుపు కూడా వేసి సన్నని సెగమీద చక్కగా వేగనివ్వాలి. తరువాత ఉఫ్పు వేసి చక్కగా కలిపి ఇంకొద్ది సేపు వేగనిచ్చి దింపుకోవాలి.

Yellow Grams Curry …పచ్చి శెనగల కూర

కావలసినవి
పచ్చి శెనగలు – 100 గ్రాములు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్
ఉల్లిపాయలు : 2
టమాటోలు : 2
పచ్చిమిర్చి : మూడు కాయలు
పసుపు : అరస్పూను
దాల్చిన చెక్క : చిన్న ముక్క
లవంగాలు : 2
అమ్చూర్ పౌడర్ : పావుస్పూన్
నూనె : 2 స్పూన్లు
ఉప్పు : తగినంత
కరివేపాకు : 4 రెబ్బలు
కొత్తిమీర : కొద్దిగా

తయారుచేసే విధానం
ముందుగా శెనగలను ముందు రోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం శెనగలను శుభ్రంగా కడిగి కొద్దిగా నీరుపోసి ఉడికించుకోని పక్కన పెట్టుకోవాలి.
తరువాత పాన్ లో నూనె వేసి వేడెక్కిన తరకువాత లవంగాలు, చెక్క, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత అందులో సన్నగా తరిగిన టమాటో ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత అందులో ఉడికించి శెనగలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, అమ్చూర్ పౌడర్ (మామిడికాయ పౌడర్), పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీరు కూడా పోసికొని మొత్తగా ఉడికించుకోవాలి. దింపుకునే మందు కొత్తిమీర తురుము చల్లుకుంటే మంచి రుచి వస్తుంది. ఇదేవిధంగా బటానీలతో మరియు బెంగాలీ శెనగలతో(కాబూలీ శెనగలు) కూడా కూర చేసుకోవచ్చు. ఇవి చపాతీలలోకి మంచి కాంబినేషన్
ఇదేవిధంగా ఎండు బటానీల కూరకూడా చేసుకోవచ్చు.

Sweet Pototo Curry… చిలగడదుంపల కూర

కావలసినవి
చిలగడదుంపలు: అరకిలో
ఉల్లిపాయలు : రెండు
టొమాటోలు: మూడు
పచ్చిమిర్చి: నాలుగు
కొత్తిమీర తురుము: కొద్దిగా
నూనె: 3 టేబుల్స్పూన్లు
జీలకర్ర: అరటీస్పూను
ఇంగువ: చిటికెడు
పసుపు: పావు టీస్పూను
దనియాలపొడి: టీస్పూను
కారం: పావుటీస్పూను
గరంమసాలా: పావుటీస్పూను
ఉప్పు: తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ : టీస్పూను


తయారుచేసే విధానం
టొమాటోలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోయాలి. చిలగడదుంపలు బాగా కడిగి పొట్టు తీసి కావల్సిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి.
ప్రెషర్ పాన్లో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. తరవాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, ఇంగువ, పసుపు, దనియాల పొడి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా వేసి కలిపి వేయించాలి. తరవాత చిలగడదుంప ముక్కలు వేసి కొద్దిగా ఉడకనిచ్చి కొద్దిగా నీరు కలుపుకుని గరంమసాలా, ఉప్పు కలిపి పూర్తిగా ఉడికిన తరువాత దించేముందు కొత్తిమీర తురుము వేసి దింపుకోవాలి.

Jackfruit Seeds – పనస గింజల కూర

కావలసినవి
గింజలు- పదిహేను
ఉల్లిపాయ- పెద్దది ఒకటి
టొమాటో- రెండు
అల్లం, వెల్లుల్లిపేస్ట్‌- చెంచా
కారం- చెంచా
పోపు గింజలు – 1 స్పూను
ధనియాలపొడి- చెంచా
జీలకర్ర పొడి- చెంచా
గరంమసాలా- అరచెంచా
పసుపు- కొద్దిగా
నూనె- చెంచా
ఉప్పు – సరిపడ
కరివేపాకు – 4 రెబ్బలు

తయారుచేసే విధానం
ముందుగా పనస గింజలని కుక్కర్‌లో ఉడికించి పైన పొర తీసేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, పోపుగింజలు, ఉల్లిపాయ ముక్కలు, వేసి దోరగా వేయించుకోవాలి. దీనిలో అల్లంవెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసుకుని, బాగా వేగాక టొమాటోలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి జీలకర్రపొడి, గరంమసాలా, ధనియాల పొడి వేసుకుని కలియతిప్పుకోవాలి. దానిలో తరిగి పెట్టుకున్న పనస గింజలని కూడా వేసుకుని కలియతిప్పి, కారం, ఉప్పూ,పసుపు వేసి బాగా కలిపి ఉడికిన తర్వాత కొత్తిమీరతో అలంకరించుకుని వడ్డించుకుంటే సరిపోతుంది.

Snakeguard Masala Curry…పొట్లకాయమసాలా కర్రీ

కావలసినవి
పొట్లకాయ – 1
ఉల్లిపాయలు – 3
అల్లం – 2 అంగుళాల ముక్క
వెల్లుల్లి – 10 రెబ్బలు
జీలకర్ర – 1 టీ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
మిరియాలు – అర టీ స్పూన్
చీజ్ – 4 టీ స్పూన్స్
పసుపు – కొంచెం
కారం – 1 టీ స్పూన్
గరం మసాలా – 1 టీ స్పూన్
చింతపండు గుజ్జు – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడ
నూనె 4 టీ స్పూన్లు

తయారుచేసే విధానం
పొట్లకాయ పైపొట్టును స్పూన్తో తీసి కడగాలి. తరువాత పొట్లకాయను అంగుళంన్నర గుండ్రని గొట్టాలలాగా కోయాలి. మధ్యలో ఉన్న గింజలు కూడా తొలగించాలి. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, మిరియాలు అన్నీ కలిపి కొంచెం మొత్తగా మిక్సీ పట్టుకోవాలి.

స్టౌ పైన బాణలి పెట్టి 2 స్ఫూన్లు నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేయాలి ∙తర్వాత చేసుకున్న ఉల్లిపాయ మసాలా ముద్ద, పొట్లకాయను గింజలు, ఉప్పు, కారం, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి చింతపండు గుజ్జు, గరం మసాలా, ఛీజ్ కూడా వేసి మరి కాసేపు వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన ఆ మిశ్రమాన్ని పొట్లకాయ ముక్కలలో కూరుకోవాలి.

పాన్ లో 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడయ్యాక స్టఫింగ్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను వేగనివ్వాలి ∙చిన్న మంట మీద 5 నిమిషాలు మూత పెట్టి వేగనివ్వాలి. తర్వాత నెమ్మదిగా అన్ని వైపులా కాలేలా స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. పూర్తిగా వేగిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి.

Clustard Beans Fry…గోరు చిక్కుడు వేపుడు..

కావలసినవి
గోరుచిక్కుడుకాయలు: పావుకిలో
తెల్లనువ్వులపొడి: నాలుగు స్పూన్లు
ఎండుకొబ్బరితురుము: 3 టీస్పూన్లు
కారం: టీస్పూను
కొత్తిమీర తురుము: కొద్దిగా
పచ్చిమిర్చి: నాలుగు
అల్లంవెల్లుల్లి: టీస్పూను
మినప్పప్పు: టీస్పూను
ఎండుమిర్చి: నాలుగు
ఆవాలు: టీస్పూను
జీలకర్ర: అరటీస్పూను
కరివేపాకు: 4 రెబ్బలు
పసుపు: చిటికెడు
ఉప్పు: తగినంత
నూనె: 2 టీస్పూన్లు

తయారుచేసే విధానం
ముందుగా గోరుచిక్కుడు కాయలను పసుపు వేసి ఉడికించి వాటి ఈనెలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. పాన్లో నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి వేసి వేగాక, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
తరవాత గోరుచిక్కుడుకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, వేసి కలపాలి. తరువాత నువ్వులపొడి,. ఎండుకొబ్బరి తురుము, కొత్తిమీర తురుము వేసి కలిపి రెండు నిమిషాల తరువాత దించుకోవాలి.

Clustard Beans ….గోరుచిక్కుడు కాయల కూర

కావలసినవి
గోరు చిక్కుడుకాయలు: పావు కిలో
అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు
చిల్లీసాస్: 2 టీస్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
పచ్చిమిర్చి:నాలుగు
మిరియాలపొడి: అరటీస్పూను
ఉప్పు: తగినంత
కార్న్ఫ్లోర్: 3 టీస్పూన్లు
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
గోరుచిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి ఈనెలు తీసి అంగుళం సైజు ముక్కలుగా చేసుకోవాలి. కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లిముద్ద, చిల్లీసాస్, సోయాసాస్, మిరియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి మిశ్రమాన్ని కాస్త జారుగా కలపాలి. గోరుచిక్కుడుకాయ ముక్కల్ని ఈ పిండిలో ముంచి తీసి నూనెలో వేసి వేయించి తీయాలి.
విడిగా మరో బాణలిలో కాస్త నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిముక్కలు, కరివేపాకు వేయించాలి. తరవాత చిల్లీసాస్, వేసి కలపాలి. ఇప్పుడు వేయించిన గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి, కొత్తిమీర తురుము వేసి కలిపి దించాలి.

కాలీఫ్లవర్ మసాలా కూర

కావలసినవి
కాలీఫ్లవర్: ఒకటి
టొమాటోలు: మూడు
ఉల్లిపాయలు: ఒకటి
పచ్చిమిర్చి: రెండు
జీడిపప్పు: పావుకప్పు
సోంపు: టీస్పూను
లవంగాలు: నాలుగు
దాల్చిన చెక్క: అంగుళంముక్క
పలావు ఆకులు: రెండు
అల్లంవెల్లుల్లి: టేబుల్స్పూను
పసుపు: అరటీస్పూను
కారం: టేబుల్స్పూను
దనియాలపొడి: టీస్పూను
జీలకర్రపొడి: అరటీస్పూను
పెరుగు: పావుకప్పు
నిమ్మరసం: టేబుల్స్పూను
గరంమసాలా: టీస్పూను
నూనె: తగినంత
ఉప్పు: తగినంత
కొత్తిమీర తురుము: కొద్దిగా
తయారు చేసే విధానం
కాలీఫ్లవర్ ను విడదీసి చిన్న ముక్కలుగా చేసుకొని గోరువెచ్చని ఉప్పు నీళ్లలో వేసి ఓ ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి జీడిపప్పులో పావుకప్పు గోరువెచ్చని నీళ్లు పోసి నానబెట్టాలి.కాలీఫ్లవర్ ముక్కలను నీళ్లు లేకుండా వంపేసి కాస్త ఆరబెట్టు.
తరవాత పాన్ లో లేక నాన్స్టిక్ పాన్లో నూనె వేసి కొద్దికొద్దిగా ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కలను వేసి వేయించి తీయాలి
.బాణలిలో 2 టేబుల్స్పూన్ల నూనె వేసి సోంపు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, పలావు ఆకులు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరవాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. పసుపు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, టమాటో ముక్కలు, గరంమసాలా వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత నానబెట్టి రుబ్బిన జీడిపప్పు ముద్ద కూడా వేసి, అరకప్పు నీళ్లు పోయాలి. ఉప్పు కూడా వేసి సిమ్లో ఉడికించుకోవాలి. తరవాత వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు, వేసి సిమ్లో పది నిమిషాలు ఉడికించాలి. చివరగా దించుకొనేటపుడు కొత్తిమీర చల్లుకోవాలి

బీట్‌రూట్‌తో వంటలు

బీట్రూట్ కూర

బీట్రూట్లను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.

1 ఉల్లిపాయను తరిగి పెట్టుకోండి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. పెసరపప్పును అరగంట నాన్న పెట్టుకోండి.

తయారి విధానం:

స్టవ్ ఆన్ చేసుకుని, బాండి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ పోసుకోండి, నూనె వేడి ఎక్కాక, కొద్దిగా ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడే , జిలకర్ర కరివేపాకు వేసుకోండి. తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలును కూర కి సరిపడా సాల్ట్ వేసుకుని వేయించుకోండి.

ఉల్లిపాయ ముక్కలు వేగాక, నానబెట్టుకున్న పెసరపప్పు, బీట్రూట్ ముక్కలను వేసుకుని మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గి చుకోండి. పదినిమిషాల తర్వాత మూత తీసి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒక్క నిమిషం వేయించుకుంటే కూర అయిపోతుంది.

పెరుగుతో బీట్‌రూట్‌ కూర

కావలసినవి
బీట్‌రూట్‌ తురుము: 2 కప్పులు
కొబ్బరి తురుము: కప్పు
పచ్చిమిర్చి: ఆరు
కరివేపాకు: 4 రెబ్బలు
కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు
నూనె: 4 టీస్పూన్లు
తిరగమాత గింజలు : టీస్పూను
పెరుగు: 2 కప్పులు
పసుపు : అరస్పూను
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
కొబ్బరితురుము, పచ్చిమిర్చి, కరివేపాకు మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి రెండు, తిరగమాత గింజలు వేసి వేయించాలి. బీట్‌రూట్‌ తురుము వేసి కాస్త వేగాక మూతపెట్టి ఓ ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి-పచ్చిమిర్చి మిశ్రమం వేసి బాగా కలిపి, మూతపెట్టి సిమ్‌లో పది నిమిషాలు ఉడికించాలి. తరవాత ఉప్పు, కొత్తిమీర తురుము వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించిన తరువాత పెరుగు వేసి బాగా కలపాలి.

Bottle Guard Curry / సొరకాయ కూర

కావలసినవి
సొరకాయ: అరకిలో
నూనె : 2 టేబుల్స్పూన్లు
ఉల్లిపాయలు: రెండు
పచ్చి మిరపకాయలు : మూడు
కారం : 1 స్పూను
పెరుగు: కప్పు
జీలకర్ర : 1 టీస్పూను
దనియాలపొడి: టీస్పూను
కరివేపాకు : 4 రెబ్బలు
పసుపు : అర స్పూను
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేసే విధానం
బాణలిలో టేబుల్స్పూను నూనె వేసి సొరకాయ ముక్కల్ని వేసి మగ్గనిచ్చి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో మిగిలిన నూనె వేసి ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. తరవాత మృదువుగా గిలకొట్టిన పెరుగు వేసి మరిగించాలి. ఇప్పుడు జీలకర్ర, దనియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత డికించిన సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మరికాసేపు సిమ్లో ఉడికించి, కొత్తిమీర తురుము చల్లుకొని దించుకోవాలి.