మాల్దీవులు

Maldives tourism….మాల్దీవులు ‌

maldives  tourism

విదేశాల్లో బడ్జెట్‌ విహార కేంద్రం మాల్దీవులు. అడవులు ఎక్కువగా ఉన్న మాల్దీవులు ద్వీప సమూహాలివి. చితకా సుమారు వెయ్యి దాకా ఉంటాయి. మాల్దీవుల రాజరాధాని మాలే. ఈ దీవులు ఆసియా ఖండంలో ఉన్నాయి. వీరి కరెన్సీ రూఫియా. ఇది ముస్లిం మతానికి చెందిన దేశం.
సుమారు 200 దీవుల్లో జనావాసాలున్నాయి! వీటిలోనే . పగడపు దిబ్బలు, ప్రశాంత తీరాలు కొత్త దంపతుల విహార కేంద్రాలు. సముద్రతీరంలో ఉన్న పెద్ద పెద్ద రిసార్టులు, సముద్రంపైనే నిర్మించిన కాటేజీల్లో బస ఉత్సాహంగా ఉంటుంది.
స్పా సెంటర్లు అలసటను మరిపిస్తే.. సాహస క్రీడా కేంద్రాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. రుచులకు మాల్దీవులు పెట్టింది పేరు. అంతర్జాతీయ వంటకాలన్నీ ఇక్కడ లభిస్తాయి. ఈ దీవులకు పర్యాటకులు ఎక్కవగానే వస్తుంటారు. మాల్దీవులు వెళ్లాక వీసా ఆన్‌ అరైవల్‌ తీసుకోవచ్చు. చూడవలసినవి
మాల్దీవులు రాజధాని మాలెలో దర్శనీయ స్థలాలు చాలా ఉన్నాయి. రిసార్టులు, బీచ్‌లు, చుట్టుపక్కల దీవులు చూసిరావొచ్చు.
కోమో కొకోవా, బారోస్‌, మిరిహి, గిలి లంకన్‌పుషి, వెలిగండు తదితర దీవుల్లో కడలిపై నిర్మించిన వుడెన్‌ రిసార్టులు ఘనమైన ఆతిథ్యాన్నిస్తాయి.
రంగాలి ద్వీపంలో అండర్‌వాటర్‌ రిసార్టులో విడిది ఎప్పటికీ మరచిపోలేం.

ఫిలిప్పీన్స్

philippines tourism

ఫిలిప్పీన్స్‌ పచ్చని వరి చేలు, నీలి జలాలతో మెరిసిపోయే సముద్రం, అంచున తెల్లని ఇసుక తిన్నెలు! నివురుగప్పిన అగ్నిపర్వతాలు, పచ్చదనాలతో నిండిన వనాలు వీటిన్నింటికీ చిరునామా…. ఫిలిప్పీన్స్‌
సుమారు ఏడు వేల ద్వీపాలతో అలరారుతున్న ఈ దేశంలో హనీమూన్‌ జంటలకు కావాల్సినంత ఏకాంతం లభిస్తుంది. ఒకప్పుడు స్పెయిన్‌, అమెరికా వలస రాజ్యంగా ఉన్న ఫిలిప్పీన్స్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు విలాస కేంద్రంగా ఎదిగింది. ఫిలిఫైన్స రాజధాని మనీలా, వీరి కరెన్సీ ఫిలిఫైన్స్ పెక్సోలు.
వీసా కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఫిలిఫైన్స్ లో చూడవలసినవి
బోహోల్‌ ద్వీపంలో తీరం వెంట ఫెర్రీ ప్రయాణం మధురానుభూతిగా మిగిలిపోతుంది. చాక్లెట్‌ హిల్స్‌గా పేరున్న గుట్టలు చూడముచ్చటగా ఉంటాయి. పాలవాన్‌ ద్వీపంలో సబ్‌టెర్రానియన్‌ నది భూగర్భం నుంచి ప్రవహిస్తుంటుంది. నదిపై జెట్టీలో పయనం అద్భుతంగా ఉంటుంది.
పాలవాన్‌ ద్వీపం జలక్రీడలకు పెట్టింది పేరు. స్కూబా డైవింగ్‌, బనానా రైడింగ్‌, జెట్‌ స్కీయింగ్‌ వంటి ఆటలు సాహసవంతులకు సరదానిస్తాయి.
మనీలాలో షాపింగ్‌, క్రూజ్‌ విహారం భలేగా ఉంటాయి. ఇక్కడ ఎదిగే మడ అడవుల్లో తెలుపుగా ఉండే ‘నిలాడ్’ అనే పూలు పూస్తాయి. వాటి పేరులోంచే దీని రాజధాని నగరానికి ‘మనీలా’ అనే పేరొచ్చింది. కోటిమందికి పైగా జనాభా రాజధాని మనీలా నగరంలోనే నివసిస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద పది షాపింగ్ మాల్లలో మూడు ఇక్కడే ఉన్నాయి. అవి ఎస్ఎమ్ మెగామాల్, ఎస్ నార్త్ ఎడ్సా, ఎస్ఎమ్ మాల్ ఆఫ్ ఏషియా.
గద్దల్లో అతి పెద్దది మంకీ ఈటింగ్ ఈగల్ ఈ దేశంలోనే కనిపిస్తుంది. ఈ పక్షి వీరి జాతీయ పక్షి కూడా.. ఈ పక్షి ఏకంగా కోతులను కూడా చంపి తింటుంది. ఈ పక్షి రెక్కల్ని పూర్తిగా విప్పితే ఆ పొడవే ఆరడుగుల పైన ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇవి అంతరించిపోయే దశలో ఉన్నాయట.
నల్లని ఉడుతల్లా ఉండే ‘స్కన్క్స్’ ఈ దేశంలోనే మాత్రమే కనిపిస్తాయి. గత పదేళ్లలోనే ఇక్కడ 16 రకాల కొత్త జీవ జాతుల్ని శాస్త్రవేత్తలు గుర్తించటం జరిగింది.

టాంజానియా

పర్యాటకం

టాంజానియా తూర్పు ఆఫ్రికా దేశం. టాంజానియా రాజధాని డొడోమా. విస్తీర్ణం 9,45,087 చదరపు కిలోమీటర్లు కరెన్సీ టాంజానియన్ షిల్లింగ్ అధికారిక భాష స్వాహిలి. అయితే ఇంగ్లిష్ కూడా ఎక్కువగా మాట్లాడతారు.
పర్వతాలను, లోతైన లోయల్నీ విశాలమైన గడ్డి మైదానాల్నీ సుందర సరస్సులను వాటి మధ్యలో జీబ్రాల గుంపుల్నీ చిరుతపులుల గుంపులను, ఏనుగులను . అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్నీ అడవి జంతువులను బాగా దగ్గరగా చూడాలంటే ఆఫ్రికాలోని టాంజానియా అటవీ ఉద్యానవనాల్లో సఫారీ ఈ అవకాశం కల్పిస్తుంది
హైదరాబాద్‌ నుంచి విమానంలో టాంజానీయాలోని దారుస్సలాం నగరానికి వెళ్లవచ్చు. వీరి భాషలో దారుస్సలాం అంటే స్వర్గానికి ద్వారం అని అర్థం. ఇది దేశంలోని అతిపెద్ద నగరం. వీధులన్నీ శుభ్రంగా అందంగా ఉంటాయి.. ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడుని మించదు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇక్కడ 30 శాతం భూమిలో జాతీయ12 పార్కులు , 38 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కలవు. రకరకాల అడవి మృగాలు ఇక్కడ దాదాపుగా నలభై లక్షలకు పైగా ఉన్నాయి. చదరపు కిలోమీటరుకు అత్యధిక సంఖ్యలో మృగాలున్న దేశాల్లో ఇది మొదటిది. ఎక్కువ సంఖ్యలో ఏనుగులున్న దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడి రువాహ్ నేషనల్ పార్కులో వీటి సంఖ్య అత్యధికం. ప్రపంచంలోనే అతి పెద్ద పీతల జాతైన కోకోనట్ క్రాబ్లు ఈ దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి.
టాంజానీయాలో లోని రెండు ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన పర్యాటక ప్రాంతాలు. అవి ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారో మరియు Serengeti లాంటి జాతీయ పార్కులు. మనం క్రికెట్ అంటే ఎక్కువగా ఇష్టపడినట్లు వీరంతా ఫుట్బాల్, బాక్సింగ్, రగ్బీలను ఇష్టపడతారు.
వర్షాకాలం మొదలుకాగానే ఇక్కడి నుంచి 20 లక్షలకుపైగా వన్యమృగాలు కెన్యాకు వలస వెళతాయి. దీన్నే ‘ది గ్రేట్ మైగ్రేషన్’ అంటారు.
చిరుతలు చెట్లెక్కడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడి లేక్ మన్యారా నేషనల్ పార్కులో చెట్లెక్కే సింహాల జాతి ఉంది. ఇలాంటివి ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఇవి పైకెక్కడమే కాదు అచ్చం కోతుల్లా అక్కడే నిద్రిస్తాయి.
మన్యరా జాతీయపార్కు
అరుషలో మన్యరా జాతీయపార్కు టోల్‌గేటు దగ్గర ఐడెంటిఫికేషన్‌ చూపించి, అనుమతి తీసుకోవాలి.
ఈ పార్కులో గుంపులు గుంపులుగా తిరిగే జిరాఫీలను, బబూన్లు(నల్లమూతి కోతులు), అడవి పందులూ, లేళ్ల గుంపులను చూడవచ్చు.
అన్ని జంతువుల్లోకెల్లా పిరికివి అడవి పందులే. పందులు శబ్దం వినగానే పరుగు లంకించుకుంటాయి. ఇక్కడే ఉన్న సరస్సు దగ్గర ఉన్న పక్షుల్లో ఎన్నోరకాలు… రంగు రంగుల .. పిచ్చుకల నుంచి పెలికాన్ల దాకా . చిలుకల నుంచి రాబందుల వరకూ చూడవచ్చు. సరస్సునిండా తామరలు విచ్చుకున్నట్లున్న గులాబీరంగు పెలికాన్‌లను కనువిందు చేస్తాయి
మన్యరా సరస్సు చెట్లెక్కే సింహాలకు ప్రత్యేకం. ఈ రకమైన జాతి ప్రపంచం మొత్తమ్మీద ఈ ఒక్కచోటే కనిపిస్తుంది పర్యాటకుల కోసం సాయం సమయంలో స్థానికుల సాంస్కృతిక కార్యక్రమాలూ ఆక్రోబాటిక్‌ ప్రదర్శనలు ఉంటాయి.
గోరోన్గోరో.. గోరోన్గోరో వెళ్లే దారిలో రోడ్డుకు ఆనుకుని ఓ వైపు పెద్ద లోయ, లోయలో నుంచి రోడ్డుకన్నా ఎత్తుగా పెరిగిన పెద్ద చెట్లు, రోడ్డుకి రెండోవైపు కేవలం మూడు నాలుగు అడుగుల ఎత్తులో గోధుమరంగు పొదలతో నిండిన పెద్ద మైదానం. పచ్చని ప్రకృతిలో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది.
గోరోన్గోరో క్రేటర్‌ …ఇది పెద్ద అగ్నిబిలం. సుమారు 3.4 మిలియన్‌ సంవత్సరాల క్రితం భారీ విస్ఫోటం సంభవించి, ఓ పెద్ద అగ్నిపర్వతం పేలిపోయిందనీ అది పేలినచోట ఓ పెద్ద గుంత ఏర్పడిందనీ చెబుతారు. బిలం అంచుమీదుగా ప్రయాణించి వ్యూపాయింట్‌ దగ్గర ఆగి బిలాన్ని చూడవచ్చు. ఈ బిల వైశాల్యం వైశాల్యం 260 చదరపు మైళ్లు. పైనుంచి కిందకి వెళ్లాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. బిలంలో గుండ్రంగా తిరుగుతూ వెళ్తుంది రోడ్డు. బిలం లోపలకి టెలీస్కోపులో చూస్తే జంతువులు కనబడుతుంటాయి.
ఆ బిలం ఏర్పడిన కొన్ని సంవత్సరాలకు అక్కడ పడ్డ వర్షం నీళ్లు, బయటకు పోయే దారిలేక ఓ సరస్సు ఏర్పడిందనీ దానివల్లే అక్కడ జంతువులూ మనుషులూ చేరారనీ అంటుంటారు. ఆదిమ మానవుడి అడుగుజాడలు అక్కడ కనిపించాయనీ, వాటిని మ్యూజియంలో భద్రపరిచామనీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. యునెస్కో ఈ ప్రాంతాన్ని ప్రపంచ సాంస్కృతిక సంపదల్లో ఒకటిగా భావించి కాపాడుతోంది. బిలం అడుగువరకూ వెళితే విశాలమైన మైదానంలోకి ప్రవేశించినట్లుంటుంది. చిన్న చిన్న సరస్సులు చాలా ఉంటాయి.
వేలకొద్దీ జింకలూ మరోవైపు వందలకొద్దీ జీబ్రాలు. మరోవైపు అడవి దున్నలూ, బైసన్లు. సరస్సుల దగ్గర రకరకాల పక్షులు కనబడతాయి. ఇక్కడే ఓ పెద్ద ఏనుగు అన్నింటికన్నా ముందుకు నడుస్తుంటే మిగిలిన ఏనుగులు దాని వెనకే పిల్లలతో సహా వెళుతుంటాయి. అన్నింటికన్నా ముందున్న ఏనుగు దారి సురక్షితమని నిర్ణయించుకున్నాక మిగతా వాటిని వెనక అనుసరించమంటుంది
నక్కలూ, తోడేళ్ల గుంపులు కనిపిస్తాయి. క్రేటర్‌ అంచుపైనే రిసార్టులు ఉంటాయి. వీటిని తీసుకుంటే తనివితీరా క్రేటర్‌ అందాలు చూడవచ్చు.
సెరెంగెటి జాతీయ ఉద్యానవనం
సెరెంగెటి అరణ్యంలో సింహాలు గుంపులుగా తిరుగుతాయి ఈ అడవిలో 80 సింహాలు ఉన్నాయట. ఎక్కువగా నిద్రపోతుంటాయవి. ఒక్కో సింహం రోజుకి సుమారు 22 గంటలు నిద్రపోతుందట. హైనాలు., ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఆస్ట్రిచ్‌లనూ చూడవచ్చు. అవి పరిగెడుతుంటే తమాషాగా అనిపిస్తుంది.
ఇక్కడ ఉన్న నీళ్లలో వందలాది హిప్పోలు సేదతీరుతుంటాయి. ఇవి ఎక్కువసేపు నీటిలోనే ఉంటాయి. వాటిని చూస్తుంటే వాగులో పెద్ద బండరాళ్లులాగా ఉంటాయి. హిప్పోలు ఒక్కొక్కటీ 15 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పులతో ఒక్కోటీ 3 టన్నుల బరువుతో చిన్నసైజు ఏనుగంత ఉంటాయి. వీటికి పుట్టిన పిల్లలు 75 కిలోల బరువు ఉంటాయి. మాంసాహారులు కాకపోయినా వీటికి కోపం ఎక్కువ. దగ్గరకు వచ్చిన జంతువుల్ని నోటికి చిక్కించుకుందంటే అది ముక్కలై బయటకు రావాల్సిందే.

టాంజానైట్

ఖరీదైనా రాళ్ళతో సానినీ లేజర్

టాంజానియాలో గనులు తవ్వే ఓ చిన్నపాటి మైనర్ జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. తన జీవితంలోనే కాదు.. తన దేశంలోనే అత్యంత విలువైన గని అతడికి దొరికింది. సానినీ లేజర్‌కు రెండు పెద్ద ముడి టాంజానైట్ శిలలు దొరికాయి. రెండూ కలిపి 15 కిలోల బరువు ఉన్నాయి.

ఈ విలువైన శిల భూమి మీద అత్యంత అరుదైన ఖనిజాల్లో ఒకటి. వీటిద్వారా అతడికి 34 కోట్ల డాలర్ల (సుమారు 2,566 కోట్ల రూపాయలు) ఆదాయం లభించింది.

టాంజానైట్
భూమిలోపల దొరికే అత్యంత ఖరీైదన శిలలో టాంజానైట్ ఒకటి
Tanzanian Miner Finds Rare Gemstones Worth 25 Crores - Sakshi

టాంజానైట్‌కి ఇంత విలువ ఎందుకు?

టాంజానైట్ ఖనిజం కేవలం ఉత్తర టాంజానియాలో మాత్రమే దొరుకుతుంది. ఉంగరాలు, నెక్‌లెస్‌లు, బ్రేస్‌లెట్లు వంటి నగలలో ఉపయోగించే రత్నాలలో దీనికి చాలా ప్రజాదరణ ఉంది. భూమి మీద అత్యంత అరుదుగా లభించే రత్నాలలో ఇదొకటి. రాబోయే 20 ఏళ్లలో ఈ రత్నాల సరఫరా పూర్తిగా అంతరించిపోతుందని స్థానిక భౌగోళిక శాస్త్రవేత్త ఒకరు చెప్తున్నారు. ఈ విలువైన శిల ఆకర్షణ దీనిలోని ఆకుపచ్చ, ఎరుపు, ఊదా రంగులు సహా విభిన్న వర్ణాల్లో ఉంటుంది. ఎంత అరుదైన శిల అనేదానిని బట్టి దీని విలువను నిర్ధారిస్తారు. శిల రంగు ఎంత స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుంది.

జోర్డాన్‌ పర్యాటకం

ఉన్నతమైన సంస్కృతితో అలరారే దేశంలో ఆధునికతల మేళవింపులకు చిరునామా జోర్డాన్. పశ్చిమ ఆసియాలోని ఎడారి దేశం జోర్డాన్‌ పర్యాటక దేశంగా పేరు పొందింది. జోర్డాన్ రాజదాని అమ్మన్. వీరి అధికార భాష అరబ్. జోర్డాన్ దీనార్స్ వీరి ద్రవ్యం(ఒక దీనార్ మన రూ.100తో సమానం). జోర్డాన్ ముస్లిం దేశం కానీ పర్యాటకంగా పేరు పొందింది.
ప్రాచీన నాగరికత, ఈజిప్ట్‌, రోమ్‌ రాజ్యాల ఆనవాళ్లు నేటికీ ఇక్కడ కనిపిస్తాయి.. సుగంధ ద్రవ్యాలు అమ్మే వీధులు, జోడు మూపురాల ఒంటెలు, రాతికట్టడాలు, మృత సముద్రం.. ఇవన్నీ జోర్డాన్‌ను పర్యాటకటంగా ప్రత్యేకం నిలబెట్టాయి. జోర్డాన్‌ రాజధాని అమన్‌ ప్రధాన పర్యాటక కేంద్రం. రోమన్ల ఏలికలో నిర్మించిన అపురూప కట్టడాల శిథిల సౌందర్యం చారిత్రక ప్రియులను కట్టిపడేస్తుంది. అమన్‌ నుంచి వివిధ పర్యాటక కేంద్రాలకు సులభంగా వెవచ్చు.
ఇక్కడి నుంచి మృత సముద్రానికి బస్సుల్లో వెళ్లచ్చు. లవణ సాంద్రత అధికంగా ఉన్న ఈ డెడ్‌ సీలో అలలపై అలా అలా తేలిపోవచ్చు. కేవలం ఈ అద్భుతాన్ని ఆస్వాదించడానికి మాత్రమే జోర్డాన్‌ వచ్చే పర్యాటకులు ఉన్నారు.
ఈ దేశంలో మరో అద్భుతం పెట్రా. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో పురుడు పోసుకున్న ఈ నగరంలోని అపురూప కట్టడాలు నేటికీ ఆశ్యర్యపరుస్తాయి. ఇంకామ విశేషాలు మరెన్నో ఉన్నాయి జోర్డాన్ లో.
జోర్డాన్ పర్యటనలకు అనుకూల సమయం: సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి
ఆహారం: భారతీయ రెస్టారెంట్లు ఉంటాయి. మసాలా పాళ్లు ఎక్కువగా ఉండే జోర్డాన్‌ వంటకాలు కూడా భోజనప్రియులను అలరిస్తాయి. హైదరాబాద్‌, ముంబయి, అహ్మదాబాద్‌, దిల్లీ, బెంగళూరు తదితర నగరాల నుంచి ప్రైవేట్‌ ట్రావెల్‌ ఆపరేటర్లు జోర్డాన్‌, జోర్డాన్‌తో పాటు ఇతర దేశాల ప్యాకేజీలు నిర్వహిస్తున్నాయి. రూ.75,000-రూ.1.20 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటాయి.
జోర్డాన్ లో చూడవలసినవి మృత సముద్రం , పెట్రా రాతి కట్టడాలు, అంపీ థియేటర్‌, షౌమరీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, వాడిరం డెజర్ట్‌ క్యాంప్‌, అమన్‌ సిటాడెల్‌

వియత్నాం పర్యాటకం

ప్రకృతి సౌందర్యం, సంస్కృతి కలబోత ఈ దేశం. కొండలలో నెలకొని ఉన్న వియత్నాం సాహస క్రీడలకు చిరునామాగా నిలుస్తోంది. గిరిజన గ్రామాలు కోకొల్లలు. దేశ జనాభాలో సగానికిపైగా జనాభా గిరిజనులే కావడం విశేషం. వారి సంప్రదాయాలు, జీవనశైలి అడుగడుగునా ఆశ్చర్యపరుస్తాయి. సముద్ర తీరాలు, గుహలు, పర్వత పంక్తులు, కొండల వాలులో మెట్లు మెట్లుగా ఏర్పాటు చేసిన పంటపొలాలు ఆహ్లాదాన్నిస్తాయి.
వియత్నాం ఆసియా ఖండానికి చెందిన దేశం. ఈ దేశ రాజధాని హానోయ్. వీరి భాష వియత్నీమీస్. వీరి కరెన్సీ డాంగ్. దేశ జనాభా మొత్తం గిరిజన జాతులకు చెందినవారే
‘స్వతంత్రం-స్వేచ్ఛ-సంతోషం’ ఇదీ వియత్నాం దేశ నినాదం. ఒకప్పుడు ఫ్రెంచ్‌ వలసవాదుల పాలనలో ఉండేది. యుద్ధాలు, అస్థిరత నుంచి బయటపడిన వియత్నాం.. వినూత్న పర్యాటక కేంద్రంగా రూపొందింది.
వియత్నాం రాజధాని హానోయ్‌ జనాలతో కిటకిటలాడుతుంటుంది. నగరంలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి హాలాంగ్‌ సముద్రతీరం యునెస్కో హెరిటేజ్‌ సెంటర్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అతి పొడవైన సన్‌డూంగ్‌ గుహ వియత్నాంలో ప్రత్యేక ఆకర్షణ. వియత్నాం వీసా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వాతావరణం: మేలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు నమోదవుతాయి. వియత్నాంలో చూడవలసినవి
హానోయ్‌ సిటీ , హాలాంగ్‌ బీచ్‌, మేకాంగ్‌ డెల్టా, మ్యూనీ బీచ్‌, సన్‌డూంగ్‌ గుహ
టూర్ ఆపరేటర్ల ప్యాకేజీ ధరలు రూ.21,000- రూ.57,000 (ఒక్కరికి) దాకా ఉంటాయి.

సీషెల్స్‌ పర్యాటకం

సీషెల్స్‌ ఆఫ్రికా ఖండానికి చెందిన దేశం. హిందూ మహాసముద్రం మధ్యలో 115 ద్వీపాల సమూహం సీషెల్స్‌. హనీమూన్‌ డెస్టినేషన్‌గా ఈ ద్వీపదేశానికి మంచి పేరుంది. అందమైన తీరాలు, అత్యద్భుతమైన జలపాతాలు, అడవులు, పర్వతాలతో పర్యావరణ కేంద్రంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
పెద్దవాళ్లకు ఆటవిడుపు, యువజంటకు హనీమూన్‌ లొకేషన్‌… మొత్తంగా పర్యటకుల పాలిట భూతల స్వర్గమే సీషెల్స్‌
సీషెల్స్‌ రాజధాని విక్టోరియా. వీరి భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్ సీషెల్లీస్. వీరి కరెన్సీ సీషెల్స్‌ రూపాయి. మన రూ.5.30తో సమానం (2019) సీషెల్స్ క్రిస్టియన్ దేశం.
సాహస క్రీడలకు సీషెల్స్‌ పెట్టింది పేరు. స్కూబా డైవింగ్‌, స్నూర్కెలింగ్‌ సముద్ర గర్భంలోని అందాలను ఆస్వాదించవచ్చ. పగడాల దిబ్బలు పరవశుల్ని చేస్తాయి. స్టార్‌ రిసార్టులు భూతల స్వర్గాన్ని గుర్తు తెస్తాయి. పెద్దగా లోతులేని సముద్ర తీరాలు విహరించవచ్చు. సీషెల్స్‌ ప్రధాన దీవుల మధ్య ఫెర్రీలో విహరించవచ్చు.
160 చ.కి.మీ. వైశాల్యం గల మహె దీవి అన్నింటిలోకెల్లా పెద్దది. దేశ రాజధానితోబాటు అంతర్జాతీయ విమానాశ్రయం, అతిపెద్ద ఓడరేవు ఈ దీవిలోనే ఉన్నాయి. రెండో అతిపెద్ద దీవి ప్రాస్లిన్‌. విస్తీర్ణం 40 చ.కి.మీ. ఇక్కడ కూడా విమానాశ్రయం, ఓడరేవు ఉన్నాయి. అన్ని వసతులతో అనుకూలంగా ఉంటుందని
ఆన్సే లాజియో తీరంలో పాలమీగడని తలపించే తెల్లని ఇసుకా, వెండిరంగులో మెరుస్తున్న గ్రానైట్‌ రాళ్లూ, దట్టంగా అలుముకున్న పచ్చని చెట్లూ స్వచ్ఛ సముద్ర జలాలతో అలరారుతోన్న బీచ్ చూడదగ్గవి. అక్కడి సాగరజలాలు పురాణాల్లోని పాలసముద్రాన్ని తలపిస్తాయి.
అక్కడి నుంచి మరపడవలో ఐదు నిమిషాలు ప్రయాణించి క్యూరియస్‌ దీవికి చేరుకోవచ్చు. కేవలం చదరపు కి.మీ. విస్తీర్ణం గల ఈ దీవి, సీషెల్స్‌లోని అతి సుందర పర్యటక ప్రదేశం. అందులోకి ప్రవేశించాలంటే 200 సీషెల్స్‌ రూపాయలు(సుమారు వెయ్యి రూపాయలు) చెల్లించాలి. భూతల స్వర్గంగా పేరొందిన ఈ దీవి, సీషెల్స్‌కే ఆభరణాలుగా చెప్పుకోదగ్గ నల్లని చిలుక, అతిపెద్ద తాబేలు, కోకోడెమెర్‌ చెట్లకీ ప్రసిద్ధి.
సుమారు పది అడుగుల పొడవూ వెయ్యి కిలోల బరువూ ఉండే అల్డాబ్రా తాబేళ్లు ఇక్కడే కనిపిస్తాయి. చూడ్డానికి భయంకరంగా ఉన్నా ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాయి. సాధారణంగా తాబేళ్లన్నీ గుడ్లు పెట్టడానికీ పొదగడానికీ మరుగు ప్రదేశాలను ఎన్నుకుంటాయి. కానీ అల్డాబ్రా జెయింట్‌ తాబేళ్లు పగటి వెలుగులో గుడ్లు పెట్టి, వాటిని సంరక్షిస్తాయి. వందల సంఖ్యలో తాబేళ్ల పిల్లలు ఒడ్డు నుంచి సముద్రంలోకీ సముద్రం నుంచి ఒడ్డుకీ తిరుగుతుంటే ఆ దృశ్యం చూసేవాళ్లకి కనులపండగే. తరవాత అక్కడి పార్కులో నల్లని ఈకలతో కనిపించాయి చిలుకలు. ఈ నల్లని చిలుక సీషెల్స్‌ జాతీయ పక్షి. ఈ పక్షి, క్యూరియస్‌ దీవిలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
మార్నె జాతీయ వనం….. మహె దీవి భూభాగంలో ఇది 20 శాతం ఉంటుంది. అక్కడ రకరకాల చెట్లు కనువిందు చేస్తాయి. పైగా అక్కడ అన్నీ ఎత్తుపల్లాలే. ఎత్తైన కొండా, అక్కడి నుంచి కిందకు నిటారైన లోయా, లోయ అంచునే సముద్రమూ… ఎంతో ఆహ్లాదంగా అనిపించిందా ప్రాంతం. ఇక్కడే తేయాకు తోట ఉండటం విశేషం.
సీషెల్స్‌లో చూడదగ్గ మరో విశేషం ప్రెగేట్‌ దీవి. అది ప్రపంచ సంపన్నుల స్వర్గం. అక్కడి రిసార్టులో ఒక్కరోజుకి సుమారు మూడు లక్షల రూపాయల పైనే ఉంటుంది. మహె విమానాశ్రయం నుంచి హోటల్‌ వారే వచ్చి హెలీకాప్టర్‌లో తీసుకెళ్తారు.
పర్యటించటానికి అనుకూల సమయం: నవంబరు నుండి మే నెల వరకు
భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. బడ్జెట్‌ హోటళ్ల నుంచి ఖరీదైన రెస్టారెంట్లు…. రకరకాల రుచులు అందిస్తాయి.
ఎలా వెళ్లాలి ? ముంబయి నుంచి సీషెల్స్‌లోని మాహె విమానాశ్రయానికి నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి.
ముంబయి నుంచి ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు సీషెల్స్‌ ప్యాకేజీలు నిర్వహిస్తున్నారు. ధర రూ.75వేల నుంచి మొదలవుతాయి. సీషెల్స్‌ లో చూడవలసినవి….ఆల్డాబ్రా అటోల్‌ – ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ పగడాల దీవి తాబేళ్లకు ఆవాసం. ప్రాస్లిన్‌ బీచ్‌ (ఇక్కడ తీరంలోని ఇసుక.. ముఖానికి రాసుకునే పౌడర్‌లా మెత్తగా ఉంటుంది), మాహె నగరం, సెయింట్‌ అన్నే నేషనల్‌ మెరైన్‌ పార్క్‌ సీషెల్స్‌ నేషనల్‌ పార్క్‌

ఫిజీ దీవుల పర్యాటకం

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న 322 ద్వీపాల సమూహం ఫిజీ. ఆస్ట్రేలియా ఖంఢానికి చెందిన దేశం ఫిజి. ఫిజి రాజధాని సువా. వీరి ద్రవ్యం ఫిజియన్ డాలర్స్. మన రూ.34తో సమానం.(2019) వీరి అధికార భాష ఇంగ్లీష్. భారతీయులు ఎక్కువగా గల క్రిస్టియన్ దేశం ఫిజి
హనీమూన్‌ డెస్టినేషన్‌గా, సాహసక్రీడలకు పేరొందిన ఫిజీలో పర్యాటకం ఆనందంగా ఉంటుంది. ఆస్ట్రేలియా ఆవల ఉండే ఫిజీలో భారతీయుల జనాభా దాదాపు 38 శాతం. ఆంగ్లేయుల కాలంలో చెరకు సాగు కోసం వెళ్లిన భారతీయ కూలీలు.. క్రమంగా పెరిగిపోయారు. భారతీయులు మాత్రమే కాదు.. మనం ఆరాధించే దైవాలూ అక్కడ కొలువైనారు. సుబ్రహ్మణ్యస్వామి, రాముడు, గంగ, నాగదేవత తదితర దేవుళ్లకు అక్కడ ఆలయాలు కట్టబడ్డాయి.
వీటిలో ఫిజీలోని ప్రముఖ నగరం నాడిలో ఉన్న శివసుబ్రహ్మణ్యస్వామి ఆలయం కొండల నడుమ అందంగా ఉంటుంది. ఫిజీ వెళ్లే పర్యాటకులు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఫిజీ ప్రభుత్వం నటి ఇలియానాను పర్యాటక అంబాసిడర్‌గా నియమించింది. అందమైన సముద్ర తీరాలు, ఆశ్చర్యపరిచే జలక్రీడలు ఇక్కడికి వచ్చే పర్యాటకులనుక్షణం తీరిక అలరిస్తాయి. సర్ఫింగ్‌, బోటింగ్‌, రాఫ్టింగ్‌ విన్యాసాలకు ఫిజీ దీవులు వేదికగా నిలుస్తున్నాయి.
ఫీజీ దీవుల పర్యటనకు అనుకూల సమయం నవంబరు నుండి ఏప్రిల్‌ వరకు
భారతీయ రుచులకు ఇబ్బంది లేదు. దేశవిదేశాలకు చెందిన వంటకాలు ఆస్వాదించవచ్చు.
ఎలా వెళ్లాలి ?… ముంబయి నుంచి ఫిజీ రాజధాని సువా, నాడీకి విమానాల ద్వారా వెళ్లవచ్చు.
ప్యాకేజీలు: చాలా పర్యాటక సంస్థలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో కలిపి ఫిజీ ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తున్నాయి. ప్యాకేజీల ధరలు సుమారు రెండు లక్షల నుంచి మొదలవుతున్నాయి.(20190 ఫిజీలో చూడాల్సినవి….ఫిజీ రాజధాని సువా, నాడి నగరాలు, హైక్‌ బౌమా హెరిటేజ్‌ పార్క్‌ (ప్రకృతి ఒడిలో కొలనులు, జలపాతాలు అలరిస్తాయి), లౌటోకా సుగర్‌ సిటీ -చక్కెర కర్మాగారాలకు ప్రత్యేకం, లెవుకా నగరం, స్లీపింగ్‌ గెయింట్‌ ఉద్యానవనం, శివసుబ్రహ్మణ్యస్వామి ఆలయం

ఇండోనేషియా టూరిజం

Indonisia  tourism

ఇండోనేసియా దేశం వేల ద్వీపాల సమూహం. కానీ జనావాసానికి అనుకూలంగా ఉండేవి పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాటిలో కూడా ప్రపంచాన్ని ఆకర్షించేవి కొన్నిమాత్రమే. అందులో ప్రధానమైన ద్వీపం బాలి. పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల అంచున ఉన్న బాలీలో విశేషాలెన్నో. ఇండోనేషియా ముస్లిం దేశం. ఈ దేశంలో 90 శాతం ముస్లిం జనాభా.. కానీ బాలీ దీవిలో 90 శాతం జనాభా హిందువులే! వీరంతా సనాతన ఆచారాలను పద్ధతిగా పాటిస్తారు. ఇండోనేషియా రాజధాని జకార్తా. వీరి భాష ఇండోనేషియన్‌ కరెన్సీ రుపయా.
ఇండోనేషియా… ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప దేశం. ఆగ్నేయ ఆసియాలోని ఈ ద్వీప దేశంలో మొత్తం 17,800 ద్వీపాలుంటాయి. ఇందులో సగం ద్వీపాలకు ఇంకా పేర్లే లేవు. హిందూ, పసిఫిక్‌ సముద్రాల మధ్య ఉందిది. ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ‘రాఫ్లీసియా ఆర్నాల్డి’ని ఇక్కడ చూడొచ్చు. ఈ పూల రేకులు ఒకటిన్నర అడుగుల పొడవు, అంగుళం మందంతో ఉంటాయి.
ఇండోనేసియాలో ప్రత్యేకంగా చూడదగ్గది బాలీ ద్వీపం….. బాలీలో వీధివీధినా హిందూ దేవాలయాలు కనిపిస్తాయి. అందుకే బాలి ‘దేవుళ్ల ద్వీపం’గా గుర్తింపు పొందింది. చాంద్రమానాన్ని అనుసరించి పండగలు, పబ్బాలు జరుపుకుంటారు. అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఉపవాసాలు ఉంటారు. ప్రతి రోజూ దైవానికి కృతజ్ఞతలు చెబుతారు. ‘నిన్నటిరోజు ప్రశాంతంగా గడిచినా, నేడు సంతోషంగా ఉందన్నా.. నీ దయే’ అంటూ వారి ఇష్ట దైవానికి ప్రత్యేకమైన కానుక సమర్పిస్తారు. అరటి, కొబ్బరి, బాదం ఆకులతో అందమైన దొప్పలను చేసి.. అందులో పూలు, వక్కలు పెట్టి.. అగరొత్తులు వెలిగించి.. ఇంటి ముందు ఉంచుతారు. దుకాణాల ముందు, వీధి కూడలిలో, ఆలయం మెట్ల మీద ఇలా ప్రతి చోటా ఇవి కనిపిస్తాయి. వీటిని స్థానికంగా ‘కనంగ్‌-సారి’ అని పిలుస్తారు. ఇదొక్కటి చాలు బాలి ప్రజలు ఎంత సంప్రదాయవాదులో చెప్పడానికి.
ఆతిథ్యం అద్భుతం..
ఏటా బాలిని సందర్శించే పర్యాటకుల సంఖ్య 70 లక్షల పైమాటే. స్థానికుల ఆచారాలు, విశ్వాసాలను గౌరవించే పర్యాటకులను ఆదరిస్తారు ఇక్కడి వారు. ఇంట్లో ఆశ్రయమిస్తారు. దేశీయ రుచులను రుచి చూపిస్తారు. బాలీలో కుటుంబంతో లేక స్నేహితులతో సరదాగా గడపవచ్చు. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించవచ్చు. సాహస క్రీడల్లో పాల్గొనవచ్చు.
క్లబ్బుల్లో, పబ్బుల్లో ఆనందంగా గడపవచ్చు. యూరప్‌, అమెరికా దేశాల నుంచీ కూడా బాలీకి పర్యాటకులు ఎక్కవగా వస్తారు. భారతదేశం నుంచి లక్షల్లో బాలీకి వెళ్తుంటారు.
రామాయణం ……
ఉలవటు ఆలయం బాలీలో చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనది. డెన్పసార్‌ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రం అంచులో ఉన్న పర్వత శిఖరంపై ఉలవటు ఆలయం కట్టబడింది. సముద్రాన్ని చీల్చుకుంటూ పైకి వచ్చిన రెండు పర్వతాలు పచ్చదనంతో కనువిందు చేస్తుంటాయి. ఉలవటు ఆలయంలో ప్రధాన దైవం మహావిష్ణువు. ప్రాంగణంలో భారీ కుంభకర్ణుడి విగ్రహం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతిస్తారు. సూర్యాస్తమయం ఇక్కడ చూడ ముచ్చటగా ఉంటుంది.
ఉలవటు గుడి ప్రాంగణంలో ప్రతి రోజూ సాయంత్రం స్థానిక కళాకారులు రామాయణ కావ్యాన్ని నృత్యరూపకంగా ప్రదర్శిస్తారు. అద్భుతమైన వేషధారణ, అనిర్వచనీయమైన హావభావాలతో రూపకాన్ని వాళ్లు పండించే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రూపకాన్ని చూడటం కోసం బాలీకి వచ్చే వాళ్లూ ఉంటారు.
ఉబుడ్‌ సమీపంలో వానర సంరక్షణ కేంద్రం ఉంది. సఫారీలో తిరిగి కోతి చేష్టలను చూడొచ్చు. జాగ్రత్తగా ఉండాలి.. చటుక్కున వచ్చి పర్యాటకుల చేతిలో ఉన్న కెమెరాలు, కళ్లద్దాలు, పర్సులు లాక్కెళ్లిపోతాయి. పళ్లో, తినుబండారాలో సమర్పిస్తే.. వదిలేస్తాయి. ఉలవటు ఆలయం దగ్గర కూడా వానరమూక చిలిపి చేష్టలను చూడొచ్చు. వానర సంరక్షణ కేంద్రానికి సమీపంలోనే ఏనుగు గుహ ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవేశానికి అనుమతిస్తారు. గుహ ప్రవేశ ద్వారం చాలా చిత్రంగా ఉంటుంది. లోనికి వెళ్లాక విశాలమైన ప్రాంగణం ఉంటుంది. కొలనులు, ఆలయాలు చూడొచ్చు. ఉబుడ్‌ నగర చుట్టుపక్కలున్న పల్లెల్ని చూడాల్సిందే. కొండల్లో, గుట్టల్లో మెట్లలా మడులు ఏర్పాటు చేసి వరి పండించే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
వరుణదేవుడి ఆలయం..
డెన్పసార్‌ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో తనహ్‌లాట్‌ ఆలయం ఉంటుంది. వరుణదేవుడి గుడి, సముద్రం అంచున ఉంటుంది. సముద్రం అలలు ఆలయం ప్రధాన ద్వారం వరకు వస్తుంటాయి. ఈ దృశ్యం మనోహరంగా ఉంటుంది. బాలీలో మరో ఆకర్షణ.. అగుంగ్‌ పర్వత సానువుల్లో ‘పుర బెసకి’ ఆలయం. దీనిని ‘మదర్‌ ఆఫ్‌ టెంపుల్స్‌’ అని పిలుస్తారు. ఈ భారీ ఆలయంలో 23 గుళ్లున్నాయి. శివుడు, విష్ణువు, సరస్వతిదేవి తదితర ఆలయాలు ఇక్కడ దర్శించుకోవచ్చు.
బాలి పర్యటనకు పెద్దగా ఖర్చుకాదు. నాలుగైదు రోజులు (త్రీస్టార్‌ అకామిడేషన్‌) పర్యటించడానికి ఒక్కొక్కిరికీ రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. ఎక్కువమంది కలిసి వెళ్తే రూ.40 వేలల్లో చూసి రావొచ్చు.. బాలీలో వస్తువులు, ఆహార పదార్థాల ధరలన్నీ అమెరికన్‌ డాలర్ల రూపంలోనే కనిపిస్తాయి. చెల్లింపులు మాత్రం ఇండోనేషియా రుపాయాల్లోనే ఉంటాయి. మన ఒక్క రూపాయి సుమారు 215 ఇండోనేషియన్‌ రూపాయాలతో సమానం. ఒక లక్ష రూపాయలు తీసుకొని వెళ్తే.. రెండు కోట్లు వస్తాయి. మంచి భోజనం చేయాలంటే ఇండోనేషియన్‌ రూపాయాలలో యాభై వేలు సమర్పించాలి. మన కరెన్సీలో లెక్కేసుకుంటే సుమారు రూ.220 అన్నమాట. అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి ఇక్కడ స్కూటర్లు, బైకులు అద్దెకిస్తారు. బాలి రాజధాని డెన్పసార్‌, ఉబుడ్‌ నగరాలు ఖరీదైన రిసార్ట్స్‌కు పెట్టింది పేరు. కుటా, లెగియాన్‌, సెమిన్యక్‌, నూసాదువా, సానుర్‌ బీచ్‌లు పర్యాటకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తాయి. సముద్ర తీరాల్లో స్కూబాడైవింగ్‌, సర్ఫింగ్‌, వాటర్‌ స్కీయింగ్‌, పారా సెయిలింగ్‌, బనానా రైడ్‌ వంటి సాహస క్రీడలు జోరుగా సాగుతాయి. సముద్ర గర్భంలో రయ్‌ మంటూ దూసుకుపోయే బైకులపై ప్రయాణం రోమాంచితంగా ఉంటుంది.
పర్యటనకు ఎప్పుడు అనుకూలం…?….
ఏప్రిల్‌, మే, జూన్‌ బాలి పర్యటనకు అనుకూలం. డిసెంబర్‌, జనవరి నెలల్లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండటంతో రిసార్ట్‌ అద్దెలు ఎక్కువగా ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. వేసవి సీజన్‌లో ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు బాలి ప్యాకేజీలు బోలెడు ప్రకటిస్తూ ఉంటారు. వీటి ధర రూ.25,000 నుంచి రూ.1,00,000 వరకు ఉంది. పర్యటన కొనసాగే రోజులు, బస ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను బట్టి ప్యాకేజీ ధర ఉంటుంది.హైదరాబాద్‌ నుంచి బాలి రాజధాని డెన్పసార్‌కు సింగిల్‌ స్టాప్‌ (కౌలాలంపూర్‌) విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. టికెట్‌ ధర 11-18 వేల వరకు ఉంటుంది. విశాఖపట్టణం నుంచి సింగపూర్‌ మీదుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. టికెట్‌ ధర రూ.12-20 వేల వరకు ఉంటుంది.

టర్కీ పర్యాటకం

turky tourism

ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన పర్యాటక దేశాలలో టర్కీ కూడా ఒకటి. టర్కీని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ అని పిలుస్తారు. టర్కీ ఆసియా, ఐరోపా రెండు ఖండాలలోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా మరియు రుమేలియా (బాల్కన్ ప్రాంతం) లోనూ వ్యాపించి యున్నది. టర్కీకి 8 పొరుగుదేశాల సరిహద్దులు ఉన్నాయి. టర్కీ పెద్ద ద్వీపకల్ప దేశం. మూడుపక్కలా నల్ల సముద్రం, మెడిటేరియన్ సముద్రం మరియు ఏజియన్ సముద్రం చే ఆవరించబడి ఉంది. ఒక పక్క భూభాగం.
టర్కీ రాజధాని నగరం అంకారా. ఇస్తాంబుల్ టర్కీలోని పెద్ద నగరం. ఈ నగరం కూడా రెండు ఖండాల్లో విస్తరించిన నగరం. వీరి భాష టర్కిష్, లీరాలు వీరి ద్రవ్యం. టర్కీ ముస్లిం దేశం. ముస్లిం దేశం అయినప్పటి అభివృద్ధి చెందిన పర్యాటక దేశంగా పేరుపొందింది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు చారిత్రక ప్రాధాన్యం గల దేశం టర్కీ.
అందమైన సముద్రతీరాలు, అద్భుతమైన కట్టడాలతో, సాంస్కృతిక ఉత్సవాలతో టర్కీ పర్యాటకులకు కనువిందు చేస్తుంది.
టర్కీ ప్రజలు సహృదయులు. వీరు పర్యాటకులను తమ ఇంటికి ఆహ్వనించి భోజనం పెట్టి పంపిస్తారు.
మంచు మేనిముసుగు ధరించిన ప్రకృతి కాంత శీతాకాలపు సోయగం ‘పముక్కలే’. మంచుతో కప్పబడిన పర్వతాలు.. కనువిందుచేసే సెలయేటి ఒంపులు ఇక్కడి ప్రత్యేకతలు.
టర్కీ భాషలో పముక్కలే అంటే ‘కాటన్ క్యాజల్’ అని అర్థం. పట్టులా కనిపించే తెల్లని మంచు వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.
క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నుంచే పముక్కలే పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి పొందింది. పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశాల్లో టర్కీ కూడా ఒకటి. చారిత్రక ప్రాధాన్యం, మధ్యయుగపు వైభవం, ఆధునిక నిర్మాణాలు, ప్రకృతి సోయగాలతో కూడిన దేశం టర్కీ.
అపెండస్ థియేటర్, బండ్రమ్ క్యాజల్, లైబ్రరీ ఆఫ్ సెల్సస్లు టర్కీ దేశంలో గల చారిత్రక ప్రాధాన్యం కలిగిన నిర్మాణాలు.
మెట్లు మెట్లుగా ఉన్న లైమ్ స్టోన్ కొండ చరియలను మంచు కప్పి ఉంటుంది. అందులో ఉండే నీరు స్పష్టంగా, స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది..
రాజధాని నగరం ఇస్తాంబుల్ అభివృద్ధి చెందిన మానవ నాగరికతకు అద్దం పడుతుంది. చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్యం లేని నగరాలు, ప్రకృతి సోయగాలు, అద్భుత నిర్మాణాలు టర్కీలోని ప్రధాన ఆకర్షణలు. సౌకర్యాల పరంగా ఇస్తాంబుల్ ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఒకటి. పతారా బీచ్, పముక్కలే వంటివి టర్కీలో సందర్శించ దగ్గవి. పముక్కలే గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం మరియు సహజంగా ఏర్పడిన ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేస్తుంది.
పముక్కలే మంచు కొండల మధ్యన కొన్ని చిన్న చిన్న నీటి చెలమలు ఉంటాయి. స్థానిక వాతావరణానికి అనుగుణంగా ఈ నీటి ఉష్ణోగ్రతలు మారుతూ ఉంటాయి. వేసవి కాలంలో చుట్టూ మంచు ఉన్నప్పటికీ, ఆ మంచు కరగదు. ఈ చెలమల్లోని నీరు వెచ్చగా ఉంటుంది. ఆ సమయంలో ఈ నీటిలో స్నానం చేస్తే రక్తపోటు, నేత్ర, చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ఇక్కడి స్థానికుల నమ్మకం.
ఇందులో స్నానం చేయడం మంచిదని యూరోపియన్లు కొన్ని శతాబ్దాలుగా నమ్ముతున్నారు. ఈ నమ్మకం కూడా పముక్కలేకు పర్యాటకులు ఎక్కువగా రావటానికి ఒక కారణం. ఒకవైపు ప్రకృతి సౌందర్యం, మరోవైపు చెలమలలో స్నానం ఇవి పముక్కలేకు మాత్రమే సొంతం.

ఇక్కడ క్లియోపాత్ర అనే ఇంకొక కొలను ఉంటుంది. అందులో నీరు స్వచ్ఛతకు మారుపేరు. ఎంతమంది స్నానాలు చేసినా ఆ నీరు కలుషితం కాకుండా స్వచ్ఛంగా అలాగే ఉంటుంది. నీటి లోపల ఉన్న వారు కూడా స్పష్టంగా కనిపిస్తారు.
ఈ ప్రాంతానికి గ్రీకు, రోమన్ పురాణాలలో స్థానం ఉంది. వీరి గ్రంథాల్లో ఇదొక పవిత్ర నగరంగా స్థానం పొందింది. ఇప్పటికీ ప్రజల్లో ఈ నమ్మకం కొనసాగుతోంది. రోమ్ మైథాలజీలో స్పా సిటీగా దీని ప్రస్తావన ఉందంటారు. పురాతన రోమన్లు నిర్మించిన పవిత్ర ‘హైరపొలిస్’ అనే పూల్ ని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇందులోని నీరు పవిత్రమైనదిగా ఇక్కడి ప్రజలు భావిస్తారు.
టర్కీలో ఒక చిన్న టౌన్ పముక్కలే. హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీస్ షాపులు అందుబాటులో ఉంటాయి. వసతి సౌకర్యాలు కూడా కొదవలేదు.
ఎప్పుడైనా పముక్కలేని సందర్శించవచ్చు. కానీ శీతాకాలంలో మాత్రం పముక్కలే అందం చూడవలసిందే. డెనిజిల్ సిటీ నుంచి పముక్కలేకు బస్సు ద్వారా చేరుకోవచ్చు. పురాతన సమాధి నిర్మాణాలు, మ్యూజియం ప్రధాన ఆకర్షణలు.
భారతదేశంలోని టైమ్ కంటే రెండు గంటల పాటు వెనుక ఉంటుంది. పముక్కలేలో వేసవి కాలం ఉదయం ఐదున్నరకే ప్రారంభమవుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు సూర్యాస్తమయం. శీతాకాలంలో మాత్రం పగటి సమయం తక్కువగా ఉంటుంది.
సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో కాంతి పరావర్తనంతో మంచు విభిన్న రంగుల్లో మెరుస్తూ ఆకర్షిస్తుంది.
పముక్కలేని 1988 సంవత్సరంలో ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా ప్రకటించబడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సంరక్షించడం మొదలుపెట్టారు.
పముక్కలేకు వెళ్లాలంటే టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంకు వెళ్లవలసి ఉంటుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రధాన దేశాల్లోని విమానాశ్రయాల నుండి ఇస్తాంబుల్ విమాన ప్రయాణ సౌకర్యం ఉంది. ఇస్తాంబుల్ నుంచి డెనిజిల్ ఎయిర్పోర్ట్కు వెళ్లాలి. అక్కడనుండి పముక్కలేకు కారు ప్రయాణం 45 నిమిషాలు పడుతుంది.
ఇస్తాంబుల్ నుంచే పముక్కలేకు నేరుగా బస్సు లేక కారులోనూ వెళ్లవచ్చు. ప్రయాణంలో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
ఇంకా టర్కీలోని పర్యాటక ప్రాంతాలు
Blue Fag Marinas, Akirgel, Waterfals,Kackar Mountains (ఈ పర్యతాలను హెలికాప్టర్ లో వీక్షించే సౌకర్యం కలదు).
టర్కీలో పర్యాటక పరంగా పేరు పొందిన దీవులు:
Akdamai Islands, Gokceada Islands, Bozcada Islands, Princes Islands, Cumda Islands, Marmar Islands, Foca Islands.
Yatch Marinas (తెరచాపలతో గల చిన్న చిన్న పడవలు), వీటిలో విహారం ఓ ప్రత్యేకం అని చెప్పవచ్చు. ప్రాంతీయ మరియు విదేశీయుల తెరచాప పడవలు ఇక్కడ ఉంటాయి.
టర్కీలోని ప్రసిద్ధి చెందిన సముద్రతీరాలు :
Antalya, Alanya, Kermer, Belek, (ఇవి మెడిటేరియన్ ప్రాంతంలో ఉన్న సముద్రతీరాలు)
Bodrum, Marmaris, Fethiye, Kusadasi, Didim ఈ సముద్రతీరాలు South Aegean Coast ప్రాంతంలో పేరుపొందినవి.
టర్కీ లో క్రూయజర్ లలో విహరిస్తూ ఆనందించవచ్చు. Kusadasi, Istambul, Izmir, Bodrum, Marmaris, Antalya తీరాలలో క్రూయజర్ లలో విహరించవచ్చు.

భూటాన్ పర్యాటకం

bhutan tourism

ప్రపంచ దేశాలలో ప్రజలు సంతోషకరంగా జీవనం గడిపే దేశాలలో భూటాన్ ఒకటి! కొండల్లో నెలకొన్న ఈ చిన్న దేశ జనాభా ఎనిమిది లక్షలకు లోపే. భూటాన్ ప్రజలు ప్రశాంతమైన జీవనాన్నే ఇష్టపడతారు.
భూటాన్ బౌద్ధమతానికి చెందిన దేశం. అన్నిచోట్లా బుద్ధిజం ఆనవాళ్లే! ఎక్కడ చూసినా బౌద్ధ మఠాలే కనిపిస్తాయి! పెద్ద, పెద్ద బౌద్ధ ఆరామాల్లో వందల మంది బౌద్ధ సన్యాసులుంటారు ¬పర్యావరణాన్ని పరిరక్షించడంలో వీరు అందరికన్నా ముందున్నారు.
బౌద్ధపథంలో నడిచే భుటాన్లో.. గాలి, నీరు, భూమి స్వచ్ఛం. ఆ భూమిలో పండే ఆహార ధాన్యాలు కూడా ఆరోగ్యకరమైనవే. సాగుబడి నూటికి నూరు శాతం సేంద్రియ బాటలో సాగుతోంది. ప్రపంచంలో సంతోషకరమైన దేశాల్లో ఒకటిగా భూటాన్ గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తులో ఉండే భూటాన్లో హిమాలయాల సోయగాలు, కొండలు, కోనలు.. ఎన్నో ఆకర్షణలు. పర్యాటక పరంగా ప్రభుత్వం.. మాస్ టూరిజాన్ని ప్రోత్సహించదు. పర్యాటకులను ఎక్కువగా ఇష్టపడరు కారణం వాతావరణం కలుషితమౌతుందని. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి సాధించే అభివృద్ధి అవసరం లేదంటారు. ‘పర్యాటకులు.. భూటాన్ ను పర్యాటక కేంద్రంగానే చూస్తారు. కానీ పర్యావరణ ప్రేమికులను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం, ఆదరిస్తాం’ అంటారు భూటానీయులు.
భూటాన్ రాజధాని థింపూ. రాజధానిలో విమానాశ్రయం లేదు. దేశంలో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం పారో నగరంలో ఉంది. పారో నుంచి రాజధానికి దూరం 55 కిలోమీటర్లు. చుట్టూ కొండలు, గుట్టలతో ఉండే పారో విమానాశ్రయంలో దిగగానే మంచుతెరలు స్వాగతం పలుకుతాయి. మంచుతెరల చాటు నుంచి ఆకాశాన్నంటే పర్వతాలు కనువిందు చేస్తాయి. పారో ఎయిర్పోర్ట్ నుండే పర్యాటకులకు ఆనందం మొదలవుతుంది. కొండల నడుమ ఉన్న లోయలో పారే పారో నది, తీరం వెంట విస్తరించిన జనావాసాలు, బౌద్ధారామాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పారోలో నేషనల్ మ్యూజియం, పురాతన కట్టడాలు చూడదగ్గవే!
థింపూలో రెస్టారెంట్లు బాగుంటాయి. భారతీయ వంటకాలూ లభిస్తాయి. శాకాహారులకు ఆర్గానిక్ ఫుడ్ అందుబాటు ధరలోనే లభిస్తుంది. 51.5 మీటర్ల బుద్ధుడి కాంస్య విగ్రహం థింపూలో ప్రధాన ఆకర్షణ. అనుభవమున్న ట్యాక్సీ డ్రైవర్ను లేక గైడ్ను చూసుకుంటే.. భూటాన్ పర్యటన మరింత సంతోషంగా సాగిపోతుంది. ఏ పర్యాటక ప్రదేశానికి వెళ్లాలన్నా.. వంద కిలోమీటర్ల దూరం లోపే ఉంటుంది. టాంగో, చెరి మఠాలు, డోకులా పాస్, పునాఖా ఇవన్నీ థింపూ నుంచి 50-80 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. పునాఖాలో భూటాన్ జానపద వైభవాన్ని చూడవచ్చు. ఇది ఒకప్పుడు భూటాన్ రాజధాని. పునాఖా నుంచి థింపూ మీదుగా పారో చేరుకుంటే భూటాన్ పర్యటన ముగిసినట్టే!
శిఖరాగ్ర ఆరామం
పారో పరిసరాల్లో ఉన్న పర్యాటక కేంద్రాల్లో ప్రముఖమైనది టైగర్ నెస్ట్ అనబడే తక్త్సంగ్ మఠం. ఈ బౌద్ధారామాల సమూహం పారో పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన పర్వతంపై ఉన్నాయి. క్రీస్తుశకం 7వ శతాబ్దంలో పద్మసంభవ అనే బౌద్ధ గురువు ఇక్కడ ధ్యానం చేశాడని చెబుతారు. 16వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాలు కట్టబడ్డాయి. పదివేల అడుగుల ఎత్తుండే ఈ పర్వతంపైకి ఎక్కడం సాహసమే. కొండపైకి మెట్ల మార్గం ఉంది. ఏటవాలుగా ఉండే మెట్లు ఎక్కాలంటే కష్టపడాల్సిందే ! భూటాన్ సందర్శనకు వచ్చిన పర్యాటకుల్లో చాలామంది తిరుగు ప్రయాణంలో టైగర్ నెస్ట్ సందర్శిస్తారు.

డోకులా పాస్….
థింపూ నుంచి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉండే డోకులా పాస్.. సముద్రమట్టానికి 10,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఒకే చోట నిర్మించిన 108 స్మారక స్తూపాలు. 2003లో తిరుగుబాటుదారుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగానికి గుర్తుగా వీటిని నిర్మించారు. ఇక్కడి రాయల్ బొటానికల్ గార్డెన్లో అరుదైన పుష్పాలు, ఫలాలు చూడవచ్చు.
సందర్శనకు అనుకూలమైన సీజన్..
అక్టోబర్, నవంబర్ నెలల్లో భూటాన్కు పర్యాటకులు ఎక్కువగా వస్తారు. మళ్లీ వేసవి అనుకూలంగా ఉంటుంది. మార్చి రెండో వారం నుంచి మళ్లీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 29, కనిష్ఠంగా 9 డిగ్రీలు నమోదవుతుంది. వేసవిలో భూటాన్ విహారం ఆనందంగా, ఉత్సాహంగా సాగిపోతుంది.
భూటాన్ సాంకేతిక పరంగా అభివృద్ధి సాధించలేదు. స్మార్ట్ ఫోన్లు మాత్రం అందరి చేతులలో ఉంటాయి. టి.వి కూడా 1999లోనే మొదలైంది.
ప్రయాణ సౌకర్యాలు…
భూటాన్ సందర్శనకు ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు బోలెడన్ని ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. మూడు రోజుల నుంచి వారం రోజుల పాటు ఉన్న ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీల ధరలు ఒక్కొక్కరికి రూ.17,000 నుంచి రూ.75,000 వరకు ఉండవచ్చు.
విమానాల ద్వారా…
కోల్కతా, దిల్లీ నుంచి పారోకు విమాన సర్వీసులు ఉన్నాయి. పారో చేరిన తర్వాత విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో అనుమతి తీసుకోవాలి. కనీసం అరునెలల గడువున్న పాస్పోర్టు, ఓటర్ ఐడీ కార్డు గానీ, భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం ఉండాలి. పారో, థింపూ నగరాలతో పాటు భూటాన్ అంతా చుట్టిరావాలంటే ప్రత్యేకమైన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి బౌద్ధ ఆలయాలు సందర్శించడానికీ.. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనుమతి ‘టెంపుల్ పర్మిట్’ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ అనుమతులన్నీ టూర్ ఆపరేటర్లే ఏర్పాటు చేస్తారు. భారత్ రూపాయి భూటాన్ రూపాయితో సమానం. ఇమ్మిగ్రేషన్ కేంద్రంలోనే మన రూపాయిలను భూటాన్ కరెన్సీగా మార్చుకోవాలి.
రోడ్డు మార్గం….
భూటాన్కు రోడ్డు మార్గంలో కూడా వెళ్లొచ్చు. ముందుగా కోల్కతా చేరుకోవాలి. నగరంలోని సిల్ధా రైల్వే స్టేషన్లో కాంచన్కన్యా ఎక్స్ప్రెస్ (ప్రతిరోజూ రాత్రి 8.30) ఎక్కి హాసిమారాలో దిగాలి. హాసిమారా నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఇండో- భూటాన్ సరిహద్దు ఉంటుంది. ట్యాక్సీలు ఉంటాయి. ఒక్కొక్కరికి రూ.150 నుంచి రూ.200 తీసుకుంటారు.
సరిహద్దు దాటిన తర్వాత.. అక్కడే ప్రాంతీయ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఉంటుంది. పాస్పోర్ట్తో పాటు ఓటర్ ఐడీ లేదా వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం అధికారులకు చూపిస్తే వీసా జారీ చేస్తారు. ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి దగ్గరలోనే నార్గేలామ్ గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి పారో, థింపూ నగరాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి.

మొనాకో పర్యాటకం

మధ్యధరా సముద్రతీర అందాల్లో మొనాకో ఒకటి. ఫ్రాన్స్ దేశానికి ఆగ్నేయదిశలో ఉన్న మధ్యధరా కోస్తా ప్రాంతాన్నే ఫ్రెంచ్ రివియెరా అని పిలుస్తారు. మోనాకో కూడా ఈ భూభాగంలోనే ఉండటంతో ఇది కూడా అద్భుత పర్యాటక మరియు వినోద కేంద్రంగా మారింది. ఆ దేశ విస్తీర్ణం కేవలం 2.02 చదరపు కిలోమీటర్లే. మొనాకో యూరోపియన్ దేశం. వీరి భాష ఫ్రెంచ్. రాజధాని కూడా మొనాకో. కరెన్సీ యూరోలు. రోమన్ కేధలిక్స్ ఎక్కువగా ఉంటారు.
కోటీశ్వరుల దేశంలో
సంపన్నుల ఆటస్థలంగా పేరొందిన మొనాకోలో నివసించే ప్రతి ముగ్గురిలో ఒకరు కోటీశ్వరులే. ప్రపంచ బిలియనీర్లలో అత్యధికులు మొనాకో వాసులే. కానీ మొనాకోలో చేపలు తప్ప ఇతరత్రా ప్రకృతి వనరులేవీ లేవు. వ్యవసాయం అసలే లేదు. సుగంధద్రవ్యాలు, సిగరెట్ల తయారీ మినహా మరే పరిశ్రమలూ పెద్దగా లేవు. వాటికన్ మాదిరిగానే ఇదీ దేశంగా గుర్తింపు పొందిన ఓ చిన్న నగరం. పేదరికం లేని తొలి దేశం. మానవాభివృద్ధి సూచిక ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న ఒకే ఒక్క దేశం మొనాకో. ప్రజలకు ఆదాయపు పన్ను లేదు. భూమి తక్కువ కావడంతో స్థిరాస్థి ధరలు ప్రపంచంలోకెల్లా ఎక్కువ. నేరాలసంఖ్య మాత్రం తక్కువ. ప్రజలకన్నా పోలీసుల సంఖ్యే ఎక్కువ.
జనాబా సుమారు 40 వేలకి మించదు. వారి సగటు జీవితకాలం 94 ఏళ్లకు పైనే. స్థానిక మొనాకో వాసుల్ని మొనగాస్కెలనీ విదేశాల్లో పుట్టి అక్కడ నివసిస్తోన్న వాళ్లను మొనాకోయన్లనీ పిలుస్తారు. కానీ చిత్రంగా ఆ దేశంలో స్థానికులే మైనారిటీలు. జనాభాలో ఐదో వంతు మాత్రమే వాళ్లు ఉంటారు.
మొనాకో విల్
ఇది కొండమీద వెలసిన ఓ పల్లె. విల్ అంటే రాయి అని అర్థం. మధ్యయుగాన్ని ప్రతిబింబించే ఈ పల్లెలో పాతకాలంనాటి భవంతులూ ప్రపంచ యుద్ధంలో వాడిన ఫిరంగులూ మందుగుండ్లూ కనిపిస్తాయి. లాపోస్టే అనే తపాలా భవంతి, క్యాథెడ్రల్, సముద్రజీవుల ఆక్వేరియం, సముద్ర ఉత్పత్తుల మ్యూజియం ప్రధానంగా సందర్శించదగ్గ ప్రాంతాలు.
సెయింట్ మార్టిన్ ఉద్యానవనం
ఎండ లేకుండా ఎంతో చల్లగా ఉంటుంది ఇక్కడ. జార్డిన్ ఎక్సోటిన్ అనే మరో పార్కు కూడా చూడదగ్గది. అక్కడి నుంచి కొండమీద ఉన్న రాజభవనాన్ని అందులో మధ్యయుగం నాటి ఆనవాళ్లు స్పష్టంగా కనబడతాయి. భవనం వెలుపల ప్రతిరోజూ మధ్యాహ్నం 11.55 గంటలకు సంగీతవాద్యాల మధ్యలో కరేబియన్ల పద్ధతిలో వందన కవాతు జరుగుతుంటుంది.
మాంటికాలో …
ఇది మొనాకో అధునాతన నగర విభాగం. ఇక్కడ విభిన్న ఆకారాల్లో నిర్మించిన కట్టడాలూ బహుళ అంతస్తుల భవనాలూ నీటి మార్గాలూ మరపడవలను చూడవలిందే
డె మాంటికాలో క్యాసినో
1863లో ఇక్కడ ప్రారంభించిన డె మాంటికాలో క్యాసినో . ఇప్పటికీ ప్రపంచ జూద గృహాల్లో ఇదే ప్రధానమైనదంటారు. జేమ్స్ బాండ్ సినిమాలలో మూడింటిని ఈ క్యాసినోలో చిత్రీకరించారు. కానీ మొనాకో పౌరులకు ఇందులో ప్రవేశం నిషేధం. అది ఆ దేశానికి ఉద్యోగాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చే కల్పతరువే తప్ప, వాళ్లు డబ్బులు పోగొట్టుకునే వేదిక కాకూడదన్న కారణంతోనే ఈ నిబంధన.
ప్రజలపట్ల ఆ దేశ ప్రభుత్వానికి ఎంతటి నిబద్ధత ఉన్నదన్నది ఈ ఒక్కదాంతోనే తెలుస్తోంది. పర్యటకులకి మాత్రం ప్రవేశ రుసుము పది యూరోలు. దీనికి పక్కనే ఉన్న కార్ల పార్కింగులో ప్రపంచంలోని ఖరీదైన కార్లన్నింటినీ ఏకకాలంలో చూడొచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ కార్ల పోటీ ఏటా మాంటికాలో వీధుల్లో జరుగుతుంది. మూడు వేలమంది వీక్షకులు ఆసీనులై చూస్తుంటారు. అందుకోసం రహదారిని ఆనుకునే స్టేడియాలు నిర్మించారు. ఈ దేశ ఆర్థిక ప్రగతికి క్యాసినోలూ, ఫార్ములా వన్ పోటీలూ తద్వారా వచ్చే పర్యటకులూ… ఇవే ప్రధాన కారణాలు.
మూడువైపులా ఫ్రాన్స్ భూభాగం నాలుగో వైపు మధ్యధరా సముద్రంతో ఉన్న ఆ దేశంలో ఇప్పటికీ రాచరిక పాలనే కొనసాగుతోంది. 1297లో రిపబ్లిక్ ఆఫ్ జెనోవా నుంచి స్వేచ్ఛాస్వాతంత్య్రాలను పొందినప్పటి నుంచీ అక్కడ రాచరిక పాలనే కొనసాగుతుండటం విశేషం.
మొనాకోని పాలించే గ్రిమాల్డీ వంశం ఐరోపా రాచరిక వ్యవస్థలోకెల్లా ప్రాచీనమైనది. 2002లో ఫ్రాన్స్- మొనాకోల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం- ఆ కుటుంబంలో వారసులు లేని పక్షంలో ఆ దేశం ఫ్రాన్స్ అధీనంలోకి వెళ్లిపోతుంది. ఇప్పటివరకూ ఆ దేశానికి అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. కాబట్టి రాచరిక పాలన కొనసాగుతున్న స్వతంత్రదేశాల్లో అదీ ఒకటి. 1956లో ప్రిన్స్ రెయినీర్॥।, అమెరికాకి చెందిన గ్రేస్ కెల్లీ సినీనటిని వివాహం చేసుకున్నాడు. వారి రెండో సంతానమే ప్రస్తుత చక్రవర్తి, ఆల్బర్ట్॥. జనసాంద్రత అక్కడ ఎక్కువ!
లాకొండమిన్ …..
ప్రపంచంలోకెల్లా జన సాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతం ఇదే. ఇక్కడి జనావాసాలకు ఓ వైపు రోడ్డు ప్రయాణానికి అవసరమైన కార్లూ బైకులూ పార్కు చేసి ఉంటాయి. మరో వైపున సాగరయానానికి అనువైన మరపడవలు ఉంటాయి.
పొంటేవిల్ ….
దాదాపు 35 ఏళ్ల క్రితం వచ్చిన సునామీ కారణంగా ఏర్పడిన మైదాన ప్రాంతం ఇది. నీస్ నుంచి వచ్చే హెలీకాప్టర్లు ఇక్కడే ల్యాండ్ అవుతాయి. ఇక్కడ గాజు కిటికీలు అమర్చిన మరపడవలు ఉంటాయి. అందులో కూర్చుని సముద్ర అడుగుభాగంలోని రంగురంగుల చేపల్ని చూసి రావడం వింత అనుభూతిని కలిగిస్తుంది.
కేన్స్….
1946 నుంచీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి పేరొందిన ఈ నగరంలోని స్క్వేర్ రెనాల్డో హన్ దగ్గర ఉన్న గ్రాండ్ ఆడిటోరియాన్నీ క్రొయ్సెటీ క్యాసినోలు చూడవచ్చు. ప్లానారియా హార్బర్, మరపడవలో మధ్యదరా సముద్రంలో గంటసేపు ప్రయాణిస్తే సెయింట్ మార్గురియట్ ద్వీపానికి వెళ్లవచ్చు.
అక్కడ ఫ్రెంచి రివీరా సుందర దృశ్యాలను చూడవచ్చు. ఆంటీబ్ తీరంలోని నౌకాశ్రయం, పాత రాజప్రాకారం చూడదగ్గ ప్రదేశాలు. తీరం బారునా ఓ ఎత్తైన గోడ ఉంటుంది దానికి రెండువైపులా ప్లాట్ ఫామ్స్ ఉంటాయి. ఈ తీరంలో సముద్ర అలల ఎత్తు తక్కువ. నీరు ఎంతో తేటగా ఉంటుంది

స్విట్జర్లాండ్‌ పర్యాటకం

స్విట్జర్లాండ్‌ రాజధాని బెర్న్‌. విస్తీర్ణం 41,285 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు జర్మన్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, రోమన్ష్‌ కరెన్సీ: స్విస్‌ ఫ్రాంక్‌
స్విట్జర్లాండ్‌ లో చలి ఎక్కువ. శీతకాలం -20డిగ్రీలు కూడా నమోదవుతుంది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ ఆయుర్దాయం ఉన్న పురుషులు స్విస్‌వారే. సంతోషంగా జీవించేందుకు ఇది చక్కటి దేశం. ‘వరల్డ్‌ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌’లో డెన్మార్క్‌ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది.
ఏడాదికి సరాసరిన ఒక్కొక్కరూ 11 కేజీల చాక్లెట్లు తినేస్తారు. ఎక్కువ చాక్లెట్‌ను ఎగుమతి చేసే దేశాల్లో ఇదొకటి.
బెర్న్‌లో 100కు పైగా ఫౌంటేన్లు ఉన్నాయి. అందుకే దీన్ని ‘సిటీ ఆఫ్‌ ఫౌంటేన్స్‌’ అంటారు.
ఐరోపా ఖండంలో ఉన్న స్విట్జర్లాండ్‌ దేశంలో అతి పెద్ద నగరం జ్యురిచ్‌. 60 శాతం భూభాగంలో ఆల్ప్స్‌ పర్వతాలే ఉన్నాయి. మోంటే రోసా అన్నింటికంటే ఎత్తైనది. ఏకంగా 24 పర్వతాలు 4000 మీటర్లకంటే ఎత్తున్నాయి. జపాన్‌ తర్వాత సమయానికి రైళ్లు నడిచేదిక్కడే.
బస్సుల్లో డ్రైవర్లే టిక్కెట్లిస్తారు. ప్రపంచంలోనే పొడవైన గొత్తర్డ్‌ సొరంగం(రైల్వే టన్నెల్‌) ఉన్నదిక్కడే. దీని పొడవు 57 కిలోమీటర్లు. అందులో 2.3కిలోమీటర్లు ఆల్ప్స్‌ పర్వతాల కింద నుంచే ఉంది. ఇటు నుంచి అటు ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ప్రయాణించేందుకు 45 నిమిషాలపైనే సమయం పడుతుంది.
ఇక్కడి అరావూ రైల్వే స్టేషన్‌ వద్ద పెద్ద గడియారం ఉంది. ఐరోపాలో అది రెండో అతిపెద్దది. జనాభాలో 25 శాతం మంది విదేశీయులే. 1500కు పైగా సరస్సులున్నాయి.
స్విట్జర్లాండ్ లో చూడవలసినవి……
రైనే జలపాతం…
నయాగరా జలపాతంతో పోలిస్తే రైనె జలపాతం చిన్నదే. కానీ 75 అడుగుల ఎత్తులో 450 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ జలపాతంలో ఏదో ప్రత్యేకత. పైగా ఐరోపాలోని సమతల నీటి జలపాతాల్లోకెల్లా ఇదే పెద్దది. ఈ జలపాతానికి దగ్గరలోనే న్యూహసన్ గుహలు ఉన్నాయి. వాటిని సందర్శించాక జలపాతానికి ఇరువైపులా దాన్ని దగ్గరగా చూసేందుకు పర్యటకులకోసం ప్లాట్ఫామ్లు నిర్మించారు. ఈ జలపాతం కిందకి దూకి నదిగా మారే ప్రదేశం మధ్యలో రైనేఫాల్ ఫెల్సిన్ అనే పెద్ద బండరాయి ఉంది. ఇది చాలా లక్షల సంవత్సరాల నాటిదిగా చెబుతారు. జలపాతానికి దిగువనే పారే నదిలో పడవలు తిరుగుతుంటాయి. ఆ పడవల ద్వారా సందర్శకులు ఆ బండరాయి వరకూ వెళ్లి వస్తుంటారు. జలపాతం దిగువనుంచి మలుపు తీసుకుని, కొండలమీదుగా జలపాతం పైకి రైల్లో ప్రయాణిస్తూ ఆ రైనే జలపాత అందాల్ని చూడటం మరిచిపోలేని అనుభూతి
జ్యురిచ్ …
ఇక్కడ పన్నులు తక్కువ. కానీ చాలా ఖరీదైన నగరం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక నగరాల్లో ఇదొకటి. స్విట్జర్లాండ్ దేశంలోని ముఖ్య బ్యాంకులూ పరిశోధన కేంద్రాలూ అన్నీ ఇక్కడే ఉన్నాయి. జ్యూరిచ్ సెంట్రల్ రైల్వేస్టేషన్ ప్రాంతమే నగరానికి ప్రధాన వ్యాపార కూడలి. జ్యూరిచ్ సరస్సు దిగువ భాగంలో ప్రయాణించే లిమ్మాట్ నది చుట్టూ ఈ సుందర నగరాన్ని నిర్మించారు. నిజానికి పగటివేళలో అక్కడ బస చేయగలిగితే మంచిది. జ్యూరిచ్ కళల మ్యూజియం, బొటానికల్ ఉద్యానవనమూ, ఫిపా ప్రపంచ ఫుట్బాల్ మ్యూజియమూ ప్రార్థనామందిరాలూ… ఇలా చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.

పిలాటుస్ గోల్డెన్ రౌండ్ ట్రిప్’ టిక్కెట్లు
ఒకవైపు నుంచి కేబుల్ కారులో పిలాటుస్ పర్వతశిఖరంమీదకి చేరుకుని, అక్కడ నుంచి రైల్లో మరోదిశగా పర్వతం కిందకివచ్చే ఈ యాత్ర ఐదు అంచెలుగా సాగుతుంది. మొదటి దశలో క్రియొన్స్ నుంచి క్రియెన్సెరిగ్, ఆ తరవాత ప్రాన్మున్టెగ్ వరకూ పనోరమిక్ గండోలా అని పిలిచే కేబుల్ కారులలో వెళ్లాలి.
పచ్చదనంతో నిండిన కొండలమీదుగా 45 డిగ్రీల వాలులో ఈ ప్రయాణం 25 నిమిషాలపాటు సాగుతుంది. అక్కడకు వెళ్లాక ప్రాన్మున్టెగ్ అనే నది మధ్యలో ఓ విడిది ప్రదేశం ఉంది. ఒకవైపు ఎత్తైన కొండ, మరో వైపు లోతైన లోయ, మూడోవైపుకి చూస్తే ల్యూసెర్న్ సరస్సుతో కూడిన సుందర ప్రదేశం అది. రెస్టారెంట్లు కూడా ఎంతో అందంగా ఉంటాయి
చెట్లకాండంమీద ఏర్పాటుచేసిన చిన్న మెట్లను ఎక్కుతూ చెట్టు పై భాగానికి ఎక్కడం వింత అనుభూతిని కలిగిస్తుంది.
తరవాత సమతలంలో సమాంతరంగా కట్టిన తాళ్లలో పై దాన్ని పట్టుకుని కింది తాడుమీద నడవాలి. ఇది నిజంగా సాహసక్రీడే. ఏమాత్రం తడబడినా ప్రమాదం.
పిలాటుస్ శిఖరం మీదకి కేబుల్ బస్సులో పది నిమిషాలపాటు ప్రయాణం… దీన్నే డ్రాగన్ ప్రయాణంగా పిలుస్తారు. ఈ పర్వతం మీద మూడు శిఖరాలు ఉన్నాయి. ఒక్కో శిఖరం సముద్రమట్టం నుంచి ఏడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.
వేసవిలోనే అయినా అక్కడ ఉష్ణోగ్రత ఐదారు డిగ్రీల సెల్సియస్కు మించదు. వేసవిలో తప్ప మిగిలిన సమయాల్లో ఇక్కడ మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. కొండ శిఖరం ఎక్కి చుట్టూ చూస్తే ప్రపంచాన్ని జయించినంత గర్వంగానూ ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగానూ అనిపిస్తుంది.
పిలాటుస్ పర్వతం వెనక భాగం నుంచి కోగ్ రైలుపెట్టెలో కిందకి ప్రయాణించాం. దట్టమైన చెట్లూ, సొరంగాలూ, వంతెనలూ, కొండ మలుపుల గుండా సాగే ఈ ప్రయాణం అందించే అనుభూతిని అనుభవించాల్సిందే. ప్రపంచంలోకెల్లా ఏటవాలుగా ఉండే రైలుమార్గం ఇదే. సుమారు 50 నిమిషాల రైలు విహారం
ఆల్పానాస్టెడ్ నుంచి ఓ పెద్ద పడవలో ల్యూసెర్న్ సరస్సులో ప్రయాణించడం నిజంగా అద్భుతమే. మధ్యమధ్యలో ఆగుతూ ప్రకృతి సౌందర్యాన్ని గుండెలనిండుగా నింపుకుంటూ సాగే ఈ ప్రయాణం ఆహ్లాదభరితం.
చుట్టూ పచ్చని పర్వతాలూ వాటి మధ్యలోంచి దూకే చిన్న చిన్న జలపాతాలూ మనోల్లాసాన్ని కలిగిస్తాయి.
ల్యూసెర్న్ పట్టణం...
1333వ సంవత్సరంలో చెక్కతో కట్టిన 200 మీటర్ల పొడవుగల చాపెల్మీద నడవడం ఓ వింత అనుభూతి. ఇది 1993లో అగ్నిప్రమాదంలో కాలిపోయింది. అయితే ఏడాదిలోనే దీన్ని అంతే అందంగా మరింత సురక్షితంగా నిర్మించారు. పాదచారులు ఈ వంతెనమీద నడిచేటప్పుడు పై కప్పు కింద ఒకదాని తరవాత ఒకటి వరసగా అమర్చిన 30 తైలవర్ణ చిత్రపటాలు ల్యూసెర్న్ చరిత్రనూ క్యాథలిక్ ల సంస్కృతినీ తెలియజేస్తాయి.
లయన్ మెమోరియల్……
ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా మరణించిన స్విస్ గార్డుల స్మృత్యర్థం దీన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించారు. కొండకి దిగువ భాగంలో పదిమీటర్ల వెడల్పూ ఆరుమీటర్ల ఎత్తులో చెక్కిన ఈ సింహం ప్రతిమ సందర్శకుల్ని ఆకర్షిస్తుంటుంది.

ఈజిప్ట్ పర్యాటకం

egypt tourism

ఈజిప్టు ఆఫ్రికా ఖండానికి చెందిన దేశం. ఈజిప్టు …..అనగానే పిరమిడ్లూ… మమ్మీలూ… అద్భుత కళాసంపద గుర్తుకు వస్తాయి. వీటిని చూడవలసిందే….. ఈజిప్షియన్లలో 90 శాతం మంది ముస్లింలు. ముఖ్య భాష అరబ్బీ. ఈజిప్టు రాజధాని కైరో. వీరి ద్రవ్యం ఈజిఫ్టియన్ పౌండ్స్.
ఈజిప్టు మొత్తం నైలునది మీదే ఆధారపడి ఉంది. ఈజిప్టును ‘నో నైల్‌, నో ఈజిప్ట్‌’ అంటుంటారు. ఎందుకంటే సంవత్సరం మొత్తంమీద కేవలం రెండున్నర సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురుస్తుంది. ఎక్కడో చిన్న చిన్న పాయలుగా మొదలైన నైలు నది ఈజిప్టుకు ఓ వరం. పైనుండి వచ్చే వరదల వలన ఇక్కడ నైలునది నిండుగా ఉంటుంది. పర్యాటకపరంగా వచ్చే ఆదాయం కూడా ఈజిప్టుకు ఆదాయ వనరు. పర్యాటకులు ఎక్కువగా పురాతన స్మారక కట్టడాలు, పిరమిడ్లు, స్ఫినిక్స్ చూడాటానికి వస్తారు.ఈజిప్ట్ లో 20 దాకా వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలున్నాయి. పురాతన ఈజిప్ట్ ప్రజలు వేసిన చిత్రాలు…ఏనుగులు, హిప్పోలు, చిరుతలు మొదలగు చిత్రాలు ప్రత్యేకం. ఒకప్పుడు ఈ జంతువులు ఈజిప్ట్ లో ఉండేవి. కానీ వేటడం వలన ఈ జంతువులు ప్రస్తుతం లేవు.
ఈజిప్టులో చూడవలసినవి…
గీజా పిరమిడ్‌ – కైరో
ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గీజా పిరమిడ్‌ రాజధాని కైరో నగరంలోనే ఉంది. రాత్రి ఏడు గంటలకు పర్యాటకుల కోసం గంటసేపు స్ఫింక్స్‌ స్వగతంతో సౌండ్‌ షో ఏర్పాటు చేయబడింది.
గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గీజా
దీన్ని ఫారో కూఫూ క్రీ.పూ. 2560 – 2540 మధ్య నిర్మించాడు. అప్పట్లో మనిషి సృష్టించిన కట్టడాల్లోకెల్లా ఎత్తైనదిగా గీజా పిరమిడ్‌ పేరొందింది.
గీజా పిరమిడ్‌లో
గ్రేట్‌ పిరమిడ్‌కు రెండు ద్వారాలు ఉంటాయి. ఒకటి ఫారో చక్రవర్తి కోసమైతే, రెండోది ప్రజలకోసం. సందర్శకులను ఒక ద్వారం నుంచే అనుమతిస్తారు. కింగ్స్‌ ఛాంబర్‌ లో కూఫూ తనకోసం నిర్మించుకున్న సమాధిని చూడవచ్చు. ప్రస్తుతం నాలుగు పిరమిడ్లను చూడటానికి మాత్రమే సందర్శకులకు అనుమతిస్తున్నారు. ఒక్కో పిరమిడ్‌ వెనక మూడు చిన్న పిరమిడ్లను రాణులకోసం నిర్మించారు.
వ్యాలీ ఆఫ్‌ నైల్ స్ఫింక్స్‌
మనిషి మొహం, సింహం శరీరం గల పౌరాణిక రూపమే స్ఫింక్స్‌. ఒక సున్నపురాతి కొండనే ఆ విధంగా మలిచారు. ఆ ముఖం ఫారో కాఫ్రాది అని చెబుతారు. దీన్ని క్రీ.పూ. 2613- 2494లో నిర్మించినట్లు తెలుస్తోంది.
ఈజిప్టు మ్యూజియం
ఇందులో 1,20,000కి పైగా పురాతన వస్తువులూ 12 మమ్మీలూ ఉన్నాయి. దీన్ని 1902లో నిర్మించారు. 2011లో ఈజిప్టులో జరిగిన తిరుగుబాటులో కొన్ని విగ్రహాలనూ రెండు మమ్మీలనూ ఆందోళనకారులచే ధ్వంసం చేయబడ్డాయి. ఇందులో ప్రధానంగా చూడదగ్గది టూటన్‌కామెన్‌ మమ్మీని ఉంచిన బంగారు శవపేటిక. ఇది ప్రపంచంలోకెల్లా ఖరీదైన శవపేటికగా పేరొందింది. అప్పట్లో ఆయన ముఖానికి 14 కిలోల బంగారు తొడుగు తొడిగారు. ఆయనకోసం చేయించిన బంగారు మంచం, కుర్చీ, నగలు కూడా అక్కడ ఉన్నాయి.
ఆస్వాన్‌ నగరం
ఆస్వాన్‌ సిటీలోని ఆనకట్టను ‘హై డ్యామ్‌’ అని పిలుస్తారు. ఈ నిర్మాణంవల్ల లోతట్టు ప్రాంతం ముంపునకు గురైంది. అందులో ఆస్వాన్‌ ఆలయం, ఫిలై ఆలయం, ఆబుసింబల్‌ ముఖ్యమైనవి. అయితే యునెస్కో సహకారంతో వాటిని ఎత్తైన ప్రదేశాలకు తరలించారు. ఈ చుట్టుపక్కల న్యూబియన్‌ అనే పురాతన తెగ ఉన్న గ్రామం కూడా ముంపునకు గురయింది. వారి భాష న్యూబియన్‌. దీనికి లిపి లేదు. వారికి తప్ప ఎంత ప్రయత్నించినా వేరే ఎవరూ ఆ భాష నేర్చుకోలేరంటారు
ఫిలై ఆలయం
ఇందులోని దేవత పేరు ఐసిస్‌. ప్రాచీన ఈజిప్షియన్లు నిర్మించిన చిట్టచివరి ఆలయం. దీన్ని వాళ్లు దేవతలుగా ఆరాధించే ఓజిరిస్‌, ఐసిస్‌లు పుట్టిన ప్రదేశంగా విశ్వసిస్తారు. కాలక్రమంలో క్రిస్టియన్లు దీన్ని చర్చిగానూ ఉపయోగించారు.
పురాతన ఈజిప్షియన్లు తాము ఆరాధించే దేవతలని మానవరూపంలో కాకుండా జంతురూపంలోనే ఎక్కువగా పూజించేవారు. అందుకే ఆలయగోడలమీద ఎద్దు, గద్ద, నక్క, మొసలి రూపంలో మలిచిన విగ్రహాలన్నీ ఆ కోవకే చెందుతాయి.
ప్రాచీన ఈజిప్షియన్లు ఒంటిరాయి స్తంభాలను నిర్మించి వాటిమీద రాజుల గురించి చెక్కించేవారు. నైలునది దక్షిణం నుంచి ఉత్తరానికి 6,853 కిలోమీటర్లు ప్రవహించి, రెండు పాయలుగా చీలి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.
మొసళ్ల దేవత కొమాంబు ఆలయం ఈ ఆలయాన్ని మొసళ్ల దేవతకోసం నిర్మించారు. 22 మొసళ్లనూ గుడ్లనూ మమ్మీలుగా చేసి ప్రదర్శించబడుతున్నాయి.
ఆబుసింబల్‌ ఆలయం
గొప్ప ఫారో చక్రవర్తిగా పేరొందిన రామ్‌సీస్‌ ఖిఖి నిర్మించినదే ఆబుసింబల్‌ ఆలయం. ఇది రెండు ఆలయాల సముదాయం. ఒకటి రామ్‌సీస్‌ కోసమైతే, రెండోది ఆయన భార్య నెఫెర్‌టారికోసం. ఇది అద్భుత శిల్పకళా సంపద ఒకటే రాతితో నిర్మించిన భారీ విగ్రహాల సముదాయం.

ఎడ్ఫు ఆలయం
గద్ద ముఖం, మనిషి శరీరంతో గల హోరస్‌ దేవతకు చెందిన ఆలయం ఇది.ఇక్కడి ఆలయాలన్నీ ముందు భాగం వెడల్పుగానూ ఎత్తుగానూ లోపలికి వెళ్లే కొద్దీ వెడల్పూ ఎత్తూ తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న భారీ కుడ్యాలనూ స్తంభాలను చూస్తే ఔరా అనిపించక మానదు. గోడలమీద అప్పట్లోనే ఆపరేషన్లకు అవసరమైన వస్తు సామగ్రినీ కాన్పు సమయంలో తల్లిని కూర్చోబెట్టిన దృశ్యాలనూ చూడవచ్చు.

లక్సర్‌ పట్టణం

ఇది ఫారోల రాజధాని నగరం. ఇక్కడ ముఖ్యంగా చూడదగ్గవి నాలుగు. మార్చురీ టెంపుల్‌ ఆఫ్‌ హాట్సెప్పట్‌, కార్నక్‌ టెంపుల్‌, వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌, లక్సర్‌ ఆలయాలు. హాట్సెప్సట్‌ టెంపుల్‌ ఓ సూర్యదేవాలయం. ఈ ప్రదేశంలో దొరికిన శిథిలాలతో దీన్ని పునర్నిర్మించారు. ఇందులోని వర్ణచిత్రాలను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. వేల సంవత్సరాలు గడిచినా ఎండకు ఎండినా రంగులు మాత్రం వెలసిపోలేదు.
వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌….
ఈజిప్టుని పాలించిన ఫారో చక్రవర్తులు మరణానంతర జీవితం ఉంటుందని విశ్వసించేవారు. అందుకోసం భారీ యెత్తున నిర్మించిన పిరమిడ్లు వ్యాలీ ఆఫ్‌ కింగ్స్‌ లో చూడవచ్చు. క్రీ.పూ. 1069 నాటికి క్రమంగా సమాధులు నిర్మించటం ప్రారంభించబడింది . పిరమిడ్‌లలో ఉంచిన మమ్మీలనూ సంపదలనూ దుండగులు కొల్లగొడుతుండటమే దీనికి కారణం కావచ్చుంటారు. ఈ భూభాగమే సహజసిద్ధంగా ఏర్పడిన పిరమిడ్‌ ఆకారంలో ఉంటుంది. ఫారోలు తాము జీవించి ఉండగానే తమ అభిరుచికి అనుగుణంగా తమ సమాధులని ఇక్కడ తీర్చిదిద్దుకున్నారు. వీటిలో టూటన్‌కామెన్‌ సమాధి ఒకటి. కైరో మ్యూజియంలోని మమ్మీలన్నీ ఇక్కడ బయటపడినవే. ప్రస్తుతం ఈ వ్యాలీలో కేవలం మూడింటిలోకే ప్రవేశం ఉంది. భూమిలోపలి పొరల్లో గుహలుగా తొలిచి ఇవి నిర్మించబడ్డయి.
అద్భుత కుడ్యచిత్రాలతో కూడిన టూటన్‌కామెన్‌ సమాధి అతని మమ్మీని చూడవచ్చు. ఆ సమాధిలో అనేక వస్తువులతోబాటు బంగారు తొడుగూ టూటన్‌కామెన్‌ మమ్మీ బయటపడ్డాయట. మమ్మీనీ, చెక్క శవపేటికనీ సందర్శనకు ఇక్కడ ఉంచి మిగిలిన సంపదను కైరో మ్యూజియంకు తరలించారు.
లక్సర్‌ ఆలయం
ఇది 66 ఎకరాల్లో నిర్మించిన 132 భారీ స్తంభాల సముదాయం. ఇక్కడ రహదారికి ఇరువైపులా మానవశరీరం పొట్టేలు ముఖం కలిగిన విగ్రహాలున్నాయి.
ఈజిప్ట్ లో ఇంకా చూడవలసినవి :
Alexandria, Siwa Oasis, Westeran Sahara Desert, Karnak Temple Complex, Temple Philae, Temple of Sobek NS Horus Nile River Cruises

మలేషియా పర్యాటకం

Malaysia Tourism / మలేషియా పర్యాటకం…

ఆసియా ఖండంలోని ముఖ్య దేశాల్లో మలేషియా ఒకటి. పూర్వం డచ్‌, బ్రిటిషర్ల పాలనలో ఉన్న ఇది 1957లో పూర్తి స్వాతంత్య్రం పొందింది. ఇక్కడి జాతీయ రహదారుల పొడవు 65,877 కిలోమీటర్లు. అంటే మొత్తం భూమి చుట్టుకొలత కంటే కూడా ఎక్కువ.
మలేషియా అనగానే జంట టవర్లే గుర్తొస్తాయి. వీటి పేరు ‘పెట్రోనాస్‌ ట్విన్‌ టవర్లు’. ఒక్కోదాంట్లో 88 అంతస్తులుంటాయి. వీటి ఎత్తు 450 మీటర్లు. అంటే ఈఫిల్‌ ప్రపంచంలోనే పొడవైన(కేవ్‌ ఛాంబర్‌) గుహ గది ఉన్నది ఇక్కడి సర్వాక్‌ ఛాంబర్‌ గుహల్లోనే. వీటిలో కార్యాలయాలుంటాయి.
రబ్బరు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశమిది. 2011 సంవత్సరంలోనే 9,96,673 మెట్రిక్‌ టన్నుల రబ్బరును ఉత్పత్తి చేసింది. ప్రపంచంలోనే రబ్బరు చేతి తొడుగులు తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిందీ దేశం.
ప్రపంచంలోనే అతి పెద్ద కార్తికేయుడి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి) విగ్రహం ఉన్నది ఇక్కడి బాటు గుహల్లోని ఆలయం దగ్గరే. దీని ఎత్తు 140 అడుగులు. అంటే ఓ పద్నాలుగు అంతస్తుల భవనమంత. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ దుస్తులు, ఆహారం, నివాస వసతుల కోసం అయ్యే ఖర్చు తక్కువే.
వీరి ఆహార అలవాట్లు మనకులాగే ఉంటాయి. మధ్యాహ్న భోజనంలో గుడ్డు, కొబ్బరన్నం, కారంగా ఉండే సంబల్‌ చిల్లీ పేస్ట్‌, వేరుసెనగ గింజలు, దోసకాయ ముక్కలు… లాంటివి ఉంటాయి.
మలేషియా రాజధాని: కౌలాలంపూర్‌. కరెన్సీ మలేషియన్‌ రింగెట్‌. దీని విలువ ఇప్పుడు మన కరెన్సీలో దాదాపు 14 నుంచి 15 రూపాయలుంది(2017). వీరి జెండాపై ఉన్న ఎరుపు, తెలుపు రంగు గీతలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమాన హోదాకూ, నక్షత్రం వారి ఐకమత్యానికీ నిదర్శనం. పక్కనున్న అర్ధ చంద్రుడు వారి అధికారిక మతం ఇస్లాంకు ప్రతీక.
మలేషియాలో 40,000 సంవత్సరాలకు ముందు ఆధునిక మానవుడు నివసించినట్టు ఆధారాలు దొరికాయి. క్రీస్తుశకం మొదటి శతాబ్దం నుంచి ఇక్కడికి భారత్‌, చైనా నుంచి వ్యాపారులు వలసవచ్చారట. రెండో, మూడో శతాబ్దాల్లో వాణిజ్య రేవులు, తీర ప్రాంత నగరాలు నిర్మించుకున్నారు. దీంతో ఈ దేశ ప్రజలపై భారతీయ, చైనా సంస్కృతులు, సంప్రదాయాల ప్రభావం పడటం మొదలైంది. వీధి గోడలపై బొమ్మలేసే కళకు ఇక్కడ చాలా ఆదరణ ఉంది. అందుకే ఇక్కడి వీధుల్లో ఎక్కడ చూసినా, ముఖ్యంగా కౌలాలంపూర్‌లో గోడలపై చాలా బొమ్మలు కనిపిస్తుంటాయి. మనిషికి దగ్గర పోలికలతో ఉండే తోకలేని కోతులు ‘ఒరాంగుటాన్లు’ తెలుసుగా. ప్రస్తుతం ఇవి ఈ దేశ సమీపంలోని బోర్నియో, సుమత్ర దీవుల్లో మాత్రమే ఉన్నాయి.
ప్రపంచంలోనే విడిపోకుండా ఉన్న అతి పెద్ద ఆకు ఇక్కడి సాభాలో ఉంది. అది అలొకాసియా మక్రోరైజ మొక్కది. 3.2 మీటర్ల పొడవు, 1.92 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇక్కడున్న వలసదారుల్లో చైనీయులు, భారతీయులే ఎక్కువ.
ఇప్పుడు స్వతంత్రంగా ఉన్న సింగపూర్‌ దేశం గతంలో మలేషియాలోని ఒక రాష్ట్రం.
మలేషియా 1957 ఆగష్టు 31 న స్వాతంత్ర్యం పొందినది మలేషియా దేశం ఇస్లాం మతాన్ని దేశీయమతంగా నిర్ణయించినా పౌరులకు మతస్వాతంత్ర్యం ఇచ్చింది
ఇస్లాం మతస్థులు ఎక్కువ. తరువాత కొద్ది సంఖ్యలో, హిందువులు, క్రిస్టియన్లు ఉన్నారు.
మలేషియా అధికారిక భాష మలేషియన్ . ప్రామాణికం చేయబడిన మలయా భాషయే మలేషియన్. వాస్తవంగా చారిత్రకమైన అధికారభాష ఆంగ్లభాషే అయినా 1969 జాతి కలవరం తరువాత మలయాభాష అధికారికభాషగా మార్చబడింది. ఆంగ్లం అధికంగా మాట్లాడుతున్న రెండవ భాష అయింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ మరియు గణితం ఆంగ్లభాషలో బోధించబడుతుంది. బ్రిటిష్ ఇంగ్లీష్ ఆధారిత ఆంగ్లభాష మలేషియన్ ఆంగ్లభాషగా గుర్తించబడుతుంది. వ్యాపారంలో మంగ్లీష్ భాషతో ఆంగ్లభాషను కూడా ఉపయోగిస్తుంటారు. మంగ్లీష్ భాష అధికంగా మలేయాభాషను ఉపయోగిస్తూ ఆంగ్లభాష, చైనీస్ భాష మరియు తమిళ్ భాషలను చేర్చి సామాన్యులు మాట్లాడే మిశ్రిత భాషను మంగ్లీష్ అంటారు.
మలేషియాలో చూడవలసినవి :

బాలి పర్యాటకం / Bali tourism
బాలి మలేషియా దేశంలోని ఒక చిన్న అందమైన దీవి. ఈ దీవిలో హిందూసంస్కృతి ఎక్కువ. అంతే కాదు ఎక్కువగా హిందువులే ఉంటారు. నాలుగురోడ్ల కూడలిలో ఎక్కడ చూసినా హిందూ దేవతల విగ్రహాలు ఉంటాయి. శబ్ద కాలుష్యం ఉండదు. వాహనాలూ పాదచారులూ ఓ పద్ధతిలో వెళతారు. వీధులు కాస్త ఇరుకు కానీ ట్రాఫిక్‌ నిర్వహణ తీరు బాగుంటుంది. రోడ్ల పక్కన కూడా దేవాలయాల్లో ఉండే ధ్వజ స్తంబాలు ఉన్నాయి. వాటిదగ్గరా నైవేద్యాలు పెడతారు.
ఎటు చూసినా దైవత్వమే…
హిందూ జనాభా బాలిలో 83.5 శాతం ఉందని తేలింది. అది ప్రస్తుతం 93 శాతానికి చేరిందని సర్వేలు తెలుపుచున్నాయి. అందువల్లే అక్కడ ఎక్కడ చూసినా హిందూ ధర్మమే కనిపిస్తుంటుంది.
రుద్రుడు, వినాయకుడు, వరుణుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, రాముడు, సీత, సరస్వతి, కృష్ణుడు… ఈ దేవుళ్లందరినీ వాళ్లూ కొలుస్తారు. రామాయణ, భారత కథలు వాళ్లకి ఆదర్శాలు. వేదాలు, ఉపనిషత్తులు, చతుర్విధపురుషార్థాలు, ఇలవేల్పులు, త్రికాల సంధ్య… వంటివన్నీ అక్కడ ఆచరణలో ఉన్నాయి. కుంకుమ ధరించరు. విభూతి, అక్షతలు పెట్టుకుంటారు. మగవారు ధోతీలూ ప్యాంటూ షర్టులూ ధరిస్తే, ఆడవాళ్లు లుంగీ, కుర్తీ ధరిస్తారు.
బాలిలో చిన్నాపెద్దా దేవాలయాలను కలిపితే మొత్తం వెయ్యికి పైగా ఉన్నాయి.
పవిత్ర జలదేవాలయం!
తంపక్‌సిరింగ్‌ జిల్లాలోని మనుకాయ గ్రామంలో ఉన్న జలదేవాలయాన్ని తీర్థ ఎంపల్‌ ఆలయం అనీ అంటారు. అక్కడ చాలా కోనేరులు ఉన్నాయి. వాటిల్లోకి దేవాలయంలోనే ఉన్న ఓ నీటి ఊట నుంచి పవిత్రజలం వస్తుందంటారు. ఈ ఆలయం ఇంద్రుడి సృష్టి అనీ ఈ నీళ్లలో స్నానం చేసినా, తలపై జల్లుకున్నా పవిత్రత సిద్ధిస్తుందనీ బాలి వాసుల నమ్మకం.
ఉలువతు దేవాలయం –పెకాటు
పెకాటు గ్రామంలోని ఉలువతు దేవాలయం సముద్ర అలలు తాకుతున్న ఓ ఎత్తైన కొండ అంచుమీద కట్టిన దేవాలయం. ఉలు అంటే అంచు, వతు అంటే ఎత్తైన కొండ అని అంటారు. ఆలయంలోపల ఉన్న ప్రధాన దైవం రుద్రుడు. అక్కడ పెద్ద శివలింగం ఉంది. పద్మాసన అనే ప్రార్థనాస్థలం కూడా ఉంది. గజ గుహాలయం!
బెడలు గ్రామంలో గజా నదీ ప్రవాహ సమీపంలో ఓ గుహ ఉంది. పచ్చని చెట్లూ రంగురంగుల పూలూ కోనేరూ దేవతా విగ్రహాలూ… ఇవన్నీ ఒక ఎత్తయితే, ఈ గుహ మరో విశేషం. గుహ ముఖ ద్వారం, చుట్టూ ఉన్న చెక్క శిల్పాలూ పాత జానపద చిత్రాల్లోని గుహల్ని గుర్తుకుతెచ్చాయి. గుహ లోపల ఓ వైపు వినాయకుడు, మరో వైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు కనిపిస్తాయి. కానీ ఏ గుడిలోనూ పూజారులు డరు. తీర్థ ప్రసాదాలు అసలే ఉండవు. కానీ పూజారులు దేవుడికి పూజ చేసి, నైవేద్యం పెట్టి వెళ్లిపోతారు. దేవాలయానికి వెళ్లే ప్రతీ వ్యక్తీ ధోతీ ధరించాలి. స్త్రీలు నడుముకు కాషాయరంగు వస్త్రాన్ని కట్టుకోవాలి.
పాండవబీచ్…..
దీనికి దగ్గరలో ఉన్న గుహల్లో కుంతీ దేవి, పంచపాండవుల విగ్రహాలు ఉన్నాయి. అరణ్యవాసంలో పాండవులు ఇక్కడ కొంతకాలం ఉన్నారని బాలివాసుల నమ్మకం. బాలిలో అత్యంత ముఖ్యమైన తనహ్‌ లాట్‌ దేవాలయం దగ్గర సూర్యాస్తమయం చూడదగింది.
ఎటుచూసినా ప్రకృతి అందాలే
బాలిలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లూ రంగురంగుల పూలూ కనువిందు చేస్తుంటాయి. సముద్రతీరాలు కూడా ఎంతో అందంగా ఉంటాయి. కింతామణి అనే అగ్నిపర్వతం ఈ ద్వీపానికే ప్రత్యేకత. వర్షాకాలంలో ఈ ప్రాంతం అంతా పొగమంచు కమ్మేసినట్లుగా ఉంటుంది. వెదురు గడలతో కట్టిన వంతెనలూ, రోడ్ల పక్కన చెక్కతోనూ రాతితోనూ చేసిన రకరకాల బొమ్మలూ, అందమైన వస్తువులతో కూడిన అక్కడి దుకాణాలూ సందర్శకుల్ని ఆకర్షిస్తుంటాయి.
వెండి నగిషీ వస్తువుల తయారీకి కూడా బాలి ద్వీపం ప్రసిద్ధి చెందింది. అవి కళ్లు చెదిరే అందాలతో మెరుస్తుంటాయి. రామాయణ భారత కథలూ, ధర్మసంరక్షణకోసం పోరాడిన వారి గాథలూ, ప్రాచీన, ఆధునిక నాగరికతలు ప్రతిబింబించే అనేకానేక కార్యక్రమాలను బాలిలో విభిన్న రూపాల్లో నిత్యం ప్రదర్శిస్తుంటారు. మనదేశంలో వాల్మీకి రామాయణం ప్రాచుర్యంలో ఉంటే, అక్కడ కంబ రామాయణం ప్రసిద్ధి.. ఉలువతు స్టేడియంలో ప్రతిరోజూ రామాయణ జానపద నృత్య ప్రదర్శన చేస్తుంటారు
నూసాడువా బీచ్‌
ఈ దీవిలో జలక్రీడలూ, సాహసక్రీడలూ ఉన్నాయి. బినోవా హార్బరులోని బౌంటీక్రూయిజ్‌కి బాగుంటుంది. ప్రముఖ నటరాజ రామకృష్ణగారి జన్మస్థలం కూడా బాలి.
శ్రావణ పూర్ణిమ. అది బాలీలోని హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు. పురుషులు ధోతీ చొక్కా తలపాగా టోపీ ధరిస్తే, స్త్రీలు లుంగీ, కుర్తీ, తలకు స్కార్ఫ్‌ ధరించారు. వాళ్లను చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించింది. చూడాలేగానీ బాలిలో ఎన్నో ప్రకృతి అందాలూ… హిందూ ఆలయాలూ… కనబడతాయి.

కౌలాలంపూర్ బర్డ్ పార్క్……
కౌలాలంపూర్ బర్డ్ పార్క్ను ఏ ఒక్కరూ మిస్ కారు. స్వేచ్ఛగా సంచరిస్తోన్న పక్షుల మధ్య మనుషులు కూడా తిరిగే అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు! ప్రపంచంలోని ఈ తరహా పార్కుల్లో ఇదే అతి పెద్దది. పెద్ద పెద్ద నెమళ్లతో సహా 200 రకాల దేశ, విదేశీ పక్షులున్న ఈ పార్కులో జలపాతం, యాంఫీ థియేటర్, బర్డ్ స్కూల్, ఫ్లెమింగో పాండ్, కియోస్క్… ఇలా రకరకాల ఆకర్షణలున్నాయి.
ట్విన్ టవర్స్ వంటి ఆకర్షణలతో పాటు కౌలాలంపూర్లో భారీ షాపింగ్ మాల్స్కు కొదవ లేదు. చైనా టౌన్ను ఆనుకుని ఉండే పురాతన సెంట్రల్ మాల్కి అయితే ఓ ప్రత్యేకత ఉంది. అందులోని ఒక బ్లాకు మొత్తం ఆర్టిస్టులు, వారి పెయింటింగ్స్ తో నిండి ఉంటుంది. కమల్హాసన్, రజనీకాంత్, శివాజీ గణేశన్ వంటి సౌత్ స్టార్ల పెయింటింగ్లూ కనిపిస్తాయక్కడ.
రాయల్ సెలంగూర్ అనేది ఉన్నత స్థాయి కళాకృతుల చెయిన్. ఇక్కడి వస్తువులన్నీ ‘ప్యూటర్’తో తయారైనవే. ప్యూటర్ అంటే దాదాపు తగరమే కానీ… 1 నుంచి 15 శాతం వరకూ రాగి, ఆంటి మొనీ, సీసం, వెండి వంటి ఇతర లోహాలూ కలుస్తాయి. అందుకే ధర రూ. 3 వేల నుంచి రూ.3 కోట్ల వరకూ ఉంది.
ఇక కౌలాలంపూర్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హిందూ యాత్రాస్థలం ‘బటు గుహల’ గురించి. బంగారు వర్ణంలో మెరిసే భారీ మురుగన్ విగ్రహం స్వాగతం పలుకుతుండగా… కొండపైన ఉంటాయి ఈ గుహలు. ప్రధాన గుహ వద్ద మురుగన్ ఆలయం… లోపల ఇతర ఆలయాలు ఉంటాయి. కౌలాలంపూర్కు 40 నిమిషాల దూరంలో నిర్మించిన పాలన రాజధాని పుత్రజయ కూడా సందర్శకుల స్పెషలే.
నీటిపై తేలుతున్నట్లుగా కనిపించే అతి పెద్ద మసీదు, రోడ్డు చివర నుంచి చూసినా ఠీవిగా కనిపించే ప్రధాని కార్యాలయం, 70 ఎకరాల బొటానికల్ గార్డెన్, 76 మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల ఆఫీసులు, 39 ఇతర ప్రభుత్వ భవనాలు, 3000 మంది సమావేశమయ్యే కన్వెన్షన్ సెంటర్… ఇవీ పుత్రజయ విశేషాలు.
మద్యం కానీ, నైట్క్లబ్లు గానీ ఉండవిక్కడ. రెండు నదుల్ని కలిపేసి… వాటి మధ్య దీవిలా నిర్మించారు దీన్ని.
కౌలాలంపూర్ ఎయిర్పోర్టు సమీపంలో నిర్మించిన సెపంగ్ రేసింగ్ సర్క్యూట్లో తరచూ జరిగే ఫార్ములావన్, బైక్ గ్రాండ్ప్రిక్స్ తదితర ఈవెంట్లకు విదేశాల నుంచి భారీగా అభిమానులు వస్తుంటారు.
మలక్కా….
మలక్కా గురించి చెప్పాలంటే, అది ప్రధానంగా సాంస్కృతిక నగరం. ఇక్కడి కట్టడాల్లో డచ్, పోర్చుగీసు, బ్రిటిష్ నిర్మాణ శైలి కలినిస్తుంది. మలక్కా వరల్డ్ హెరిటేజ్ సిటీ, హార్మొనీ స్ట్రీట్లను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హెరిటేజ్ సిటీ హస్త కళాకృతుల కేంద్రం కాగా… హార్మొనీ స్ట్రీట్లో పురాతన హిందూ ఆలయం, చర్చి, మసీదు పక్కపక్కనే కనిపిస్తాయి. మ్యూజియములూ ఎక్కువే. మలక్కా మొత్తాన్నీ చూపించే బోట్ క్రూజ్ కూడా చూడాల్సిందే.
జొహోర్ బహ్రు రాష్ట్రం ……..
మలక్కా తరవాత వచ్చేది జొహోర్ బహ్రు రాష్ట్రం. సింగపూర్ను ఆనుకుని ఉండే ఈ రాష్ట్రంలో… ఆసియాలోనే మొట్ట మొదటి లెగోలాండ్ థీమ్పార్క్తో పాటు పిల్లల కోసం హలోకిట్టీ థీమ్పార్క్ ఉన్నాయి. జొహోర్ శివార్లలో… అర్మాని, బర్బెర్రీ, జెగ్నా, కెల్విన్ క్లీన్, మిఖాయెల్ కోర్స్ వంటి 80కి పైగా విదేశీ దిగ్గజ బ్రాండ్లు ప్రత్యేక ఔట్లెట్లలో కొలువుదీరి ఉంటాయి. 25 శాతం నుంచి 65 శాతం డిస్కవుంట్తో విక్రయాలు చేయటం ఇక్కడ ప్రత్యేకం. సింగపూర్కు జొహోర్ సమీపంలోనే ఉండటంతో… అక్కడి నుంచి వచ్చి కొనుగోళ్లు చేసేవారు కూడా ఎక్కువే.
Kulalampur, Balu Caves, Genting, Highlands, Kaulalampur Tower, Merdeka Tower, Kaulalampur City centre,Petronas Towers, KLCC Park, Colonial Architecture, Golden Trangle…Kaulalampur Bird Park, Butterfly Park, National Muesuem ….. ఇంకా ఎన్నో ఉన్నాయి.
మరిన్ని వివరాలకోసం మలేషియా అధికారిక వెబ్ సైట్ ను చూడండి…
http://www.malaysia.travel/en/in
మలేషియాలో తెలుగువారికి సంబంధించిన అసోసియేషన్ ఉంది…..వివరాల కోసం….
Telugu Association of Malaysia
9-1A, Udarama Complex
Jalan 1/64A, Off Jalan Ipoh
53500 Kuala Lumpur
Malaysia
Website : http://www.telugu.org.my
Email Id : tamhq@telugu.org.my

కంబోడియా

Combodia Tourism / కంబోడియా

ఆగ్నేయాసియా దేశమైన కంబోడియాను పూర్వం కంపూచియాగానూ కాంభోజ రాజ్యంగానూ పిలిచేవారు. ఫునమ్‌ ఫెన్‌ – కంబోడియా రాజధాని. ఇక్కడి కరెన్సీ కంబోడియన్ రియాల్స్ కానీ కంబోడియాలోని లావాదేవీలన్నీ అమెరికన్‌ డాలర్లలోనే జరుగుతాయి. స్థానిక కరెన్సీ ఎవరూ ఎక్కువగా వాడరు. అధికారక భాష ఖ్మేర్.
కంబోడియా అధికార మతం ” తెరవాడ బౌద్ధమతం”. తెరవాడ బౌద్ధమతాన్ని దేశ జనాభాలో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. దేశంలోని అల్పసంఖ్యాకులు వియత్నామీయులు, చైనీయులు, చాములు మరియు 30 రకాల గిరిజనులు మొదలైన వారు. దేశరాజధాని మరియు దేశంలోని అతి పెద్ద నగరమైన ” నాంఫెన్” కాంబోడియా సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక కేంద్రమని చెప్పవచ్చు. రాచరిక విధానం అనుసరిస్తున్న దేశమిది
కంబోడియా గురించి……
పూర్వకాలంలో కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేకమంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్‌ సాప్‌ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న ‘నాగ’ అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్‌ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్‌ సామ్రాజ్యాధినేత అయిన ‘కాము’తో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్‌ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం ఒకటి.
సియాంరీప్‌.
సంస్కృతీసంప్రదాయాలకూ ఆచారవ్యవహారాలకూ నిలువెత్తు నిదర్శనంగా నిలిచే చూడచక్కని పట్టణమే సియాంరీప్‌. ఇప్పటికీ దీని చుట్టుపక్కల గ్రామాల్లో సందర్శకులకోసం ప్రాచీన ఖ్మేర్‌ సామ్రాజ్యకాలంనాటి చెక్క ఇళ్లను యథాతథంగా పరిరక్షిస్తున్నారు. కంబోడియాలో నివసించే ప్రత్యేక జాతి ప్రజల్నీ వాళ్లు మాట్లాడే భాషనీ ఖ్మేర్‌ అని పిలుస్తారు.
అంగ్ కోర్ వాట్ Angkor Wat

అంగ్ కోర్ వాట్ కంబోడియాలోనిప్రపంచ ప్రసిద్ధిపొందిన ప్రాచీన విష్ణుదేవాలయం యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగాగుర్తించబడినది. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ 2 దీనిని నిర్మించారు. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మింపబడిందిప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు దేవాలయం.
ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కంబోడియా లోని సీమ్‌ రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ కంబోడియా జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్‌ సామ్రాజ్య పాలనలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది.
ఈ దేవాలయ నిర్మాణం భారతదేశం లోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది.
భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందినది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. ప్రస్తుతం ఇది బౌద్ధ దేవాలయంగా మార్పు చెందినది.

ఖ్మేర్‌ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించేదట. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయంలో కూడా వాడారు. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయిందనే విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు (వీటిని అక్కడ ‘బారే’లు అంటారు) నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించేవారట. ఫ్రెంచ్‌ ఆర్కియాలజిస్ట్‌ ఫిలిప్‌ గ్లోసియర్‌ ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచాడు. నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్‌ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయట.
పరవశింప చేసే దృశ్యాలు
ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖద్వారం నుండే మూడు పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి. ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యోదయం. ఉషోదయ వేళ ఆలయ దర్శనం రమణీయంగా ఉంటుంది. తెల్లవారుఝూమున లేచి గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు… ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎండ వేడెక్కి చుర్రుమనిపించేవరకు అలాగే ఉండిపోతారు కూడా.
బ్యాస్‌ – రిలీఫ్స్‌ గ్యాలరి :
ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బ్యాస్‌ – రిలీఫ్స్‌ గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలే కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పున ఉన్న ‘మంటన్‌’ అనే గ్యాలరీ అందర్నీ ఆకట్టుకుంటుంది. భారత పురాణాలైన రామాయణ, మహా భారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. తూర్పు వైపు మండపంలో విష్ణుమూర్తి పుట్టుక, అవతారాలకు సంబంధించిన శిల్పాలు ఉంటే పశ్చిమం వైపు మండపం గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన ఆకృతులు కనిపిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ రావణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి. ఇక దక్షిణ మండపంలో ఆలయాన్ని నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్‌ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర, కింపురుష, అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్‌కోర్‌ వాట్‌ ఆలయ గోడలపై సాక్షాత్కరిస్తాయి.
కాంభోజదేశం
భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు? నిర్మించారనే సందేహం కలుగుతుంది? ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో ‘కాంభోజ దేశం’ అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజ దేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్‌ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజదేశం కాలక్రమంలో కంపూచియాగా మారిపోయింది.
మరొక అద్భుత నిర్మాణం ఆంగ్‌కోర్‌ థోమ్
ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుత ప్రదేశం ఆంగ్‌కోర్‌ థోమ్‌. ఖ్మేర్‌ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన ‘జయవర్మ – 6 ఆంగ్‌కోర్‌ థోమ్‌ను రాజధానిగా చేసుకుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. దీనినే ‘మహానగరం’ అని కూడా అంటారు. తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏనుగుల మిద్దెలు, లెపర్‌ రాజు ప్రతిమలు, బెయాన్‌, బఫూన్‌ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత. ఆంగ్‌కోర్‌ థోమ్‌ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్‌ టవర్‌ (బెయాన్‌) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బెయాన్‌ (బుద్ధుని) దేవాలయం ఆంగ్‌కోర్‌ థోమ్‌కి ఆకర్షణీయంగా నిలుస్తుంది
బాంటే స్రెయ్
సియాంరీప్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బాంటే స్రెయ్‌ ఆలయానికి ఉంది. అంకోర్‌వాట్‌ కన్నా ముందే పదో శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పకళ కూడా చూపరులను కట్టిపడేస్తుంది. ఇక్కడికి దగ్గరలోనే ప్రేరుప్‌ అనే ప్రదేశం ఉంది. వర్ణాలు మారుతూ నింగిలోకి ఒరిగిపోతున్న అక్కడి సూర్యాస్తమయ సౌందర్యాన్ని చూసి తీరాల్సిందే.
కులెన్‌ జాతీయ ఉద్యానవనం
ఇక్కడికి 60 కి.మీ.దూరంలో అభయారణ్యం ఉంది. దీన్ని కులెన్‌ జాతీయ ఉద్యానవనంగా పిలుస్తారు. ఆ మార్గం పచ్చని చెట్లతో ఆహ్లాదభరితంగా కనువిందు చేస్తుంటుంది. ఇక్కడ శయనభంగిమలోని బుద్ధుని విగ్రహం ఆకట్టుకుంటుంది. అక్కడకు దగ్గరలోనే ఉన్న నదిలో వేయి శివలింగాలు ఉన్నాయి.
చుట్టూ అడవి, పరవళ్లు తొక్కుతోన్న నదీప్రవాహం… ఇవన్నీ కలిసి ఆ ప్రదేశానికి ఒకలాంటి ఆధ్యాత్మిక భావనను కలిగిస్తాయి
ఫునమ్‌ ఫెన్‌ – కంబోడియా రాజధాని
సియాంరీప్‌ విమానంలో వెళితే గంటన్నర ప్రయాణం కాంబోడియా రాజధాని ఫునమ్‌. రాయల్‌ ప్యాలెస్‌, సిల్వర్‌ పగోడా చూడదగ్గ విశేషాలు. అక్కడే ఉన్న జాతీయ మ్యూజియంలో కంబోడియా దేశ పురాతన శిల్పకళాఖండాలను చూడవచ్చు. ఈ ప్రదర్శనశాలను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు.
దగ్గరలో మేకాంగ్‌ నది ఉంది. దీన్ని స్థానికులు టోనిక్‌ స్పా అని పిలుస్తారు. అందులో షికారు చేయడానికి పడవలు ఉంటాయి.
బీచ్ లు
కంబోడియా సముద్రతీరంలోని సిహనాక్‌ విల్లే. ఇక్కడ అన్నీ బీచ్‌లే. కోహ్‌రాంగ్‌. ఇదో అందమైన దీవి. తీరంలో తెల్లని ఇసుకా స్పటికంలా మెరిసే కనువిందు చేస్తుంది.
ఈ దేశంలో వ్యభిచారం నివారణకు కఠినమైన చట్టాలున్నాయి. అయితే, వీటిని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ఒకప్పుడు వ్యభిచారానికి అనుమతి ఉండేది. అయితే.. చిన్నారులను ఈ వృత్తిలోకి బలవంతంగా లాగుతుండటంతో నిషేధం విధించారు. పేదరికం వల్ల చాలా మంది ఇక్కడ ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. పర్యటకులను ఆకర్షిస్తూ పొట్టపోసుకుంటున్నారు. కొందరైతే డబ్బులు కోసం తమ చిన్నారులను అమ్మేసుకుంటున్నారు.

సింగపూర్ పర్యాటకం

దక్షిణ ఆసియా ఖండంలో అతి చిన్న దేశము సింగపూర్. చిన్న ద్వీపం దేశం. మలేషియాకు దక్షిణాన ఉంది. దక్షిణ ఆసియాలో సింగపూర్ అతి చిన్న దేశం.
1963 సంవత్సరములో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, రెండు సంవత్సరముల తరువాత సైద్ధాంతిక విభేదాలతో విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడినది.
వ్యాపారపరంగానూ, ఆర్థికంగానూ బాగా అభివృద్ధి చెందిన దేశము. చక్కటి పర్యాటక కేంద్రము కూడా అయిన ఈ దేశములో మలయ్, చైనా, భారత దేశీయులు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయము. పర్యాటకముగానే కాక విలాసాలకు, వినోదాలకు పేరుపొందిన దేశము సింగపూర్.
సింగపూరు పారిశుద్ధ్యానికి పేరు పొందిన నగరము. ఈ దేశ ఆర్థిక వనరులలో పర్యాటక రంగము ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది . ఈ దేశానికి వివిధ దేశాలనుండి టూరిస్ట్ వీసా సులువుగానే లభిస్తుంది.
సింగపూర్… పేరు వినగానే సందర్శకులకు అందాల సెంటోసా దీవి, అతిపెద్ద జెయింట్వీల్, మరీనా బే శాండ్స్, చైనాటౌన్, నైట్ సఫారీ
లిటిల్ ఇండియా… ఇలా ఎన్నో ప్రదేశాలు గుర్తుకొస్తాయి. వాటిలో కొన్ని…….
నైట్ సఫారీ
నైట్ సఫారీ అంటే రాత్రివేళలో జంతు ప్రదర్శనశాల చూసే ఏర్పాటు ఉంది. జంతుప్రదర్శనశాలలో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఉంటాయి. రాత్రివేళలో జంతువులను వాటి సహజ పరిస్థితులలో చూడటము పర్యాటకులకు వింత అనుభూతిని కలిగిస్తుంది. పగటివేళలో కూడా జంతుప్రదర్శనశాలను చూసే ఏర్పాటు ఉంది.
పక్షుల పార్క్
ఇక్కడ పక్షులచేత రకరకాల విన్యాసాలు చేయిస్తారు. అద్భుతమైన ఈ ప్రదర్శన పర్యాటకులనెంతో ఆకర్షిస్తుంది.అలాగే అనేక రకముల పక్షులను ఇక్కడ సందర్శించ వచ్చు. గద్ద తన ఆహారాన్ని ఎలా వేటాడుతుందో ఇక్కడ సందర్శకుల కోసము ప్రదర్శిస్తూ ఉంటారు.అత్యంత అపురూపమైన లేత కాషాయ రంగు హంసలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. పార్కు మొత్తము చుట్టి చూడటానికి చక్కని రైలు ప్రయాణము ఉంది. స్కై టవర్లో సందర్శకులను టవర్ పై భాగానికి తీసుకువెళ్ళి కిందకు దించుతారు. పైకి వెళ్ళినపుడు సింగపూరే కాక చుట్టూ ఉండే ఇండోనేషియా, మలేషియా చూడగలగటము ఒక అద్భుతమైన ఆకర్షణ.
సెంతోసా ద్వీపం
ఈ ద్వీపానికి కేబులు కారులో ఒక దారిలో వెళ్ళవచ్చు. తిరిగి రావడానికి బస్సురూటును ఉపయోగించుకుంటారు. సింగపూరులో భాగమైన సెంటోసా ద్వీపంలో సింగపూరు జాతీయ చిహ్నమైన మెర్లాయన్ కింది సగ భాగము చేప, పై సగ భాగము సింహము. సందర్శకులను మెర్లాయన్ తలభాగమువరకు లిఫ్ట్ లో తీసుకు వెళతారు. ముందుగా ఒక చిన్న ప్రదర్శన ఉంటుంది .ఇక్కడ సంప్రదాయక భవనంలో సింగపూరు చరిత్రను లేజర్ షో సహాయంతో ప్రదర్శిస్తారు. అతి సహజమైన పరిస్థితిలో జీవం ఉట్టిపడే బొమ్మలతో నావ ప్రయాణము, నావికులు, వర్తకము అనేక సంప్రదాయాలు ప్రతిబింబించే బొమ్మలతో కూడిన ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు.
ఇక్కడ చూడవలసిన వాటిలో ఆండర్ వాటర్ వరల్డ్ ఇంకొకటి. భూగర్భములో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ వరల్డ్ లో అనేక సముద్ర ప్రాణులు సజీవముగా చూసే ఏర్పాటు ఉంది. రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు జరుగుతూ ఉంటాయి. సింగపూరు సముద్ర తీరాన రేవు (హార్బర్) నుండి క్రూయిజ్ లలో 12 గంటల టూర్, మరియు రెండు నుండి మూడు రోజుల పడవ ప్రయాణము చేయవచ్చు. ఈ టూరులో ఈ దేశములో భాగమైన ఇతర దీవులను సందర్శించవచ్చు. సముద్రతీరములో డాల్ఫిన్ షో లను జరుపుతూ ఉంటారు. లిటిల్ ఇండియా, చైనాటౌన్, సెరంగూన్ రోడ్ ఇవి చూడవలసిన వాటిలో ప్రధానమైనవి. పండుగ సమయాలలో అంగడి వీధులను చూడముచ్చటగా అలంకరిస్తారు. విదేశీయులు ఇక్కడ ముస్తాఫా, సన్ టెక్ లలో తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. సన్ టెక్ నిర్మాణాన్ని ఇక్కడి ప్రజలు గొప్పగా వర్ణిస్తుంటారు. ఇక్కడ అనేక మతాలకు సంబంధించిన గుడులు ఆయా సంప్రదాయాలను చక్కగా ప్రతిబింబిస్తూ భక్తులను అలరిస్తుంటాయి. ఇక్కడి భోజనశాలల్లో రుచికరమైన భారతీయ భోజనం లభిస్తుంది.
చాంగి విమానాశ్రయం
విమానం దిగగానే ముందుగా చూడాల్సింది అక్కడి చాంగి విమానాశ్రయం. అది ఓ సుందరలోకం… ప్రయాణికులు స్వర్గధామంగా భావించే అద్భుత పర్యటక ప్రదేశం..! ఆవిమానాశ్రయంలో అడుగుపెడితే, టెక్నాలజీప్రియులూ ప్రకృతి ప్రేమికులూ షాపింగ్ లవర్లూ అయిన పర్యటకులకి సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. ఎందుకంటే పేరుకే అదో విమానాశ్రయం. కానీ ఉద్యానవన విహారానికీ విందువినోదాలకీ పెట్టింది పేరు. అందుకే ప్రపంచంలోకెల్లా ఉత్తమ విమానాశ్రయంగా ‘స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్’ సంస్థ అందించే అవార్డును వరసగా ఐదోసారీ గెలుచుకుంది. 1981లో ప్రారంభమైననాటి నుంచి నేటి వరకూ 533 పురస్కారాల్ని దక్కించుకుంది.
ఈ విమానాశ్రయం కోసమే తయారుచేసిన ఆర్కిడ్ టీ పెర్ఫ్యూమ్ని అన్నిచోట్లా చల్లడంతో లోపలకు వెళ్లగానే ఒకరకమైన పూల పరిమళం గుబాళిస్తూ ఏ దేవలోకంలోకో అడుగుపెడుతోన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇటీవలే నాలుగో టెర్మినల్నీ సొంతం చేసుకున్న ఈ ఎయిర్పోర్టు, యాభై వేలమంది సిబ్బందితోనూ వేలాది ప్రయాణికులతోనూ నిత్యం కళకళలాడుతుంటుంది. అక్కడి నుంచి ప్రతి 90 సెకన్లకీ ఒకటి చొప్పున వారానికి ఏడు వేల విమానాలు వచ్చిపోతుంటే, ఏటా దాదాపు ఆరుకోట్లకు పైగా ప్రయాణికులు ఎక్కి దిగుతుంటారు.

వన విహారం!
అరుదైన వృక్షజాతుల్నీ జీవజాతుల్నీ చూడాలనుకునే వాళ్లకి చాంగి ఎయిర్పోర్టు ఓ చూడచక్కని వేదిక. దాదాపు 250 జాతులకు చెందిన ఐదు లక్షల మొక్కలు అక్కడ కనువిందు చేస్తుంటాయి. ముళ్లమొక్కల కాక్టస్ గార్డెన్, తామరపూల కొలను, ఆర్కిడ్ వనం, జలపాతాలతో కూడిన వర్షారణ్యం, పొద్దుతిరుగుడు పూలతోట…
ఇలా పలు రకాల ఉద్యానవనాల్లో హాయిగా విహరించవచ్చు. సీతాకోకచిలుకలకూ అక్కడో ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు. అందులో సింగపూర్ జాతీయ కీటకమైన రోజ్ బటర్ఫ్లైతోబాటు నలబై జాతులకు చెందిన ఇతర సీతాకోకచిలుకలు ఎగురుతుంటాయి.
ప్రకృతి అందాలకి సాంకేతిక పరిజ్ఞానం తోడయితే ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నదానికి అక్కడి ఎన్ఛాంటెడ్ గార్డెనే ప్రత్యక్ష నిదర్శనం. అందులో ప్రధానంగా ఆకర్షించేది అక్కడున్న నిలువెత్తు పూలకుండీ. చూడగానే అది మొక్కల్ని పెంచే కుండీలా అనిపిస్తుంది కానీ, అదో ఫ్లవర్ వేజ్. బొకే ఆకారంలో గాజుతో చేసిన ఆ వేజ్లో దాదాపు రెండువేలకు పైగా టెస్ట్ ట్యూబులు అమరి ఉంటాయి. ఒక్కో ట్యూబులో తాజా పూలనీ ఆకుల్నీ ఉంచి వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ నిజంగానే అందులో మొక్కల్ని పెంచుతున్నారేమో అనిపించేలా చేస్తుంటారు. అంతేకాదు, దాని దగ్గరకు వెళ్లగానే మనిషి కదలికల్ని గుర్తించిన సెన్సర్లు, గాలిసవ్వడులు చేస్తూ పచ్చని ప్రకృతిలో విహరించిన అనుభూతిని కలిగిస్తాయి. అలాగే అక్కడున్న కొలనులో నారింజ రంగులోని ఆర్చర్, కొయ్ చేపలూ నీళ్లలో కేరింతలు కొడుతూ సందర్శకుల్ని ఆహ్వానిస్తుంటాయి.

సాంకేతిక వినోదం!
టెర్మినల్-1లో ఏర్పాటుచేసిన సెల్ఫీ ట్రీ అంటే ప్రయాణికులకు ఎంతిష్టమో. చెట్టు ఆకారంలో రూపొందించిన ఆ పరికరం, చుట్టూ నిలువెత్తు సైజులో టచ్ స్క్రీన్ కంప్యూటర్లు ఉంటాయి. వాటి ముందు నిలుచుని సెల్ఫీ దిగగానే అది చెట్టు పైభాగంలోని డిస్ప్లే బోర్డులో కనిపిస్తూ, అందులో స్టోరయిపోతుంది. ఆ విమానాశ్రయాన్ని సందర్శించామన్న గుర్తుగా అది అక్కడ శాశ్వతంగా కనీసం ఓ వందేళ్లపాటు ఉండిపోతుందన్నమాట. కంప్యూటర్లోని ఆప్షన్ల ద్వారా సెల్ఫీ బ్యాక్గ్రౌండ్ డిజైన్లనీ మార్చుకోవచ్చు. దీన్ని ఫేస్బుక్లోకీ పంపించుకోవచ్చు. సినిమాలంటే ఆసక్తి ఉన్నవాళ్లకోసం రెండు, మూడో టెర్మినల్స్లో నిర్మించిన థియేటర్లలో రోజంతా ఉచితంగా ప్రదర్శించే బ్లాక్బస్టర్ మూవీలన్నింటినీ చూడొచ్చు. కంప్యూటర్ గేమింగ్ జోనుల్లో ఎంతసేపయినా ఆడుకోవచ్చు. ట్రాన్సిట్ లాంజ్ల్లోని ఎమ్టీవీ బూత్ల్లో ఇష్టమైన మ్యూజిక్ వీడియోలను చూడొచ్చు.
ఇక, షాపింగుమాల్స్ సరేసరి. విమానం కోసం వేచి చూస్తూ లాంజ్ల్లో కూర్చున్నప్పుడు- పసిపిల్లలకు తల్లులు పాలు ఇవ్వాలన్నా డైపర్లు మార్చాలన్నా ఇబ్బంది పడుతుంటారు. అందుకే పాపాయిలకోసం ప్రత్యేకగదులూ ఉన్నాయి. పిల్లలు విసిగించకుండానూ బోరు కొడుతుందని ఏడవకుండా హాయిగా ఆడుకునేందుకు స్లైడ్లూ, టన్నెల్సూ కూడా ఏర్పాటుచేశారు. విమానాశ్రయంలోని అన్ని టెర్మినల్స్నీ సందర్శించి రావడానికి వెంట లగేజీని తీసుకెళ్లకుండా భద్రపరిచే కౌంటర్లూ ఉన్నాయి. బడలికతో అలసిపోయి కాసేపు కునుకు తీయాలనుకునేవాళ్లకోసం స్నూజ్ లాంజ్లూ, ఎయిర్పోర్టు ట్రాన్సిట్ హోటల్లో సేదతీరే అతిథులకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రూఫ్టాప్ ఈతకొలనూ… వంటివన్నీ ఈ విమానాశ్రయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తయితే, మరో ఏడాదీ రెండేళ్లలో పూర్తయ్యేలా మరో టెర్మినల్నీ, అన్ని టెర్మినల్స్ని అనుసంధానిస్తూ ‘జ్యూయెల్ చాంగి ఎయిర్పోర్టు’ పేరుతో మరో కట్టడాన్నీ నిర్మిస్తున్నారు. అందులో సుమారు 11 వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఇండోర్ ఫారెస్ట్నీ, వాటర్ఫాల్నీ ఏర్పాటుచేస్తున్నారు. ‘ద రెయిన్ వోర్టెక్స్’ పేరుతో ఏర్పాటుచేస్తోన్న ఆ వాటర్ఫాల్ రాత్రి వేళల్లో రకరకాల థీమ్ల్లోని లైట్ అండ్ సౌండ్ మ్యూజిక్ ఫౌంటెయిన్గా మారిపోతూ సందర్శకుల్ని ఆహ్లాదపరుస్తుందనడంలో సందేహం లేదు.
సింగపూరు ప్రజలు ఎక్కువగా మెట్రో రైళ్ళు, సిటీ బస్సుల పై ఆధారపడతారు. ముందుగా డబ్బులు చెల్లించి తీసుకున్న పాసులతో నిర్ణయించిన మైలేజి వరకు ప్రయాణము చేయవచ్చు. పార్కింగ్, ట్రాఫిక్ జామ్, వాహన రద్దీలను తగ్గించుటకు ఇక్కడి ప్రభుత్వము పార్కింగ్ రుసుము అధికము చేయడము, అధిక కొనుగోలు పన్నులను విధించడము చేస్తుంటుంది. ఈ కారణంగా ప్రజలు ఎక్కువగా బస్సులు, రైళ్ళలోనే ప్రయాణిస్తుంటారు. టాక్సీలలో ఎక్కువగా ఒకేరకమైన కనీస రుసుము వసూలు చేస్తుంటారు. విహార యాత్రీకుల కోసము ఆకర్షణీయమైన పైభాగము తెరచి ఉండే బస్సులను నడుపుతూ ఉంటారు.
సింగపూరు దాదాపు ఒకే రకమైన శీతోష్ణ స్థితి, విస్తారమైన వర్షాలు కలిగిన దేశం . గాలిలో తేమ సరాసరి 90 శాతం. వరసగా వర్షాలు పడే సమయాలలో ఇది 100 శాతానికి చేరుకుంటుంది.వర్షాలు ఏసమయంలోనైనా రావడం సహజం కనుక ఇక్కడి ప్రజలు ప్రతి రోజు గొడుగులను వెంట ఉంచుకుంటారు.వీరు వాడే గొడుగులు ప్రత్యేకతను కలిగి ఉంటాయి.గొడుగుల అవసరం ఎక్కువ కాబట్టి వీటిని దృఢంగాను ఆకర్షణీయంగానూ తయారు చేస్తారు.
నవంబరు, డిసెంబరు నెలల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో ప్రక్క దేశమైన ఇండోనేషియా పొదలలో రేగే మంటల కారణంగా సంభవించే వాతావరణ కారణంగా ఆరోగ్య రక్షణకోసం ప్రభుత్వమునుండి కొన్ని హెచ్చరికలను జారీ చేస్తూంటారు.
సింగపూర్ జనాభాలో 51 శాతము ప్రజలు బౌద్ధమత, థాయిజమ్ అవలంబీకులు. 15 శాతము ప్రజలు. క్రిస్టియన్లు, 14 శాతం ముస్లిములు వీరిలో అధిక శాతం ఇండియా ముస్లిములు. స్వల్ప సంఖ్యలో సిక్కుమత, హిందూమత, బహాయి విశ్వాము కలిగిన ప్రజలు ఉన్నారు. 15 శాతము ప్రజలు ఏ మతం అవలంబించని వారుగా గుర్తించబడ్డారు. వీరు కాక అనేక మతాలకు చెందిన దేశ సభ్యత్వము లేని ప్రజలు ఇక్కడ పనులను నిర్వహిస్తూ నివసిస్తూ ఉంటారు.
సింగపూరు జాతీయ భాష మలయ్. వారి జాతీయ గీతం మజులా సింగపుర . అధికార భాషలు మలాయ్, మాండరిన్, ఇంగ్లీష్, తమిళం. దేశ స్వాతంత్ర్యానంతరము ఇంగ్లీష్ అధికారిక హోదాను పొందింది.
ఇంకా పూర్తి వివరాలకోసం …..సింగపూర్ టూరిజం బోర్డ్ వారి అధికారిక వెబ్ సైట్ ను చూడండి……
http://www.visitsingapore.com/en_in.html

నేపాల్‌ పర్యాటకం

Nepal tourism / నేపాల్‌ పర్యాటకం

నేపాల్‌… మనకు బాగా తెలిసిన మన పొరుగు దేశం. భారత దేశంతో పాటు ఇది చైనా సరిహద్దుల్ని పంచుకుంటుంది. హిమాలయ పర్వతాల్ని పంచుకునే అయిదు దేశాలైన భూటాన్‌, భారత్‌, చైనా, పాకిస్థాన్‌లతో పాటు ఇదొకటి. ప్రపంచంలోనే ఎత్తయిన పది పర్వతాల్లో ఎనిమిది నేపాల్‌లోనే ఉన్నాయి. అత్యంత ఎత్తయిన ఎవరెస్టు పర్వతం ఉన్నది ఇక్కడే. మౌంట్‌ఎవరెస్టును ఇక్కడ సాగరమాత అని పిలుస్తారు. నేపాల్‌బుద్ధుడి జన్మస్థలం. క్రీస్తు పూర్వం 563లో గౌతమ బుద్ధుడు ఇక్కడ లుంబినిలో జన్మించాడు. ఈ ప్రాంతం బౌద్ధులకు పవిత్రస్థలం.
నేపాల్‌ రాజధాని కాఠ్‌మాండ్ విస్తీర్ణం 1,47,181చదరపు కిలోమీటర్లు. వీరి భాష నేపాలీ కరెన్సీ నేపాలిస్‌ రూపాయి. భారతదేశ రూపాయి కంటే విలువ తక్కువగా ఉంటుంది. ఈ దేశానికి స్వాతంత్య్ర దినం లేదు. ఎందుకంటే ఈ దేశం ఎప్పుడూ పరాయి దేశాల పరిపాలనలో లేదు.
నేపాల్‌ జాతీయ జంతువు ఆవు. ఆవును చాలా పవిత్రంగా భావిస్తారు గోవధ ఇక్కడ నేరం.
ఈ దేశంలో గౌరవంగా పలకరించడానికి కరచాలనం ఇవ్వరు. రెండు చేతులు జోడించి నమస్తే చెబుతారు.
ప్రపంచంలో ఏ దేశ జెండా అయినా దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. కానీ నేపాల్‌జెండా అందుకు భిన్నం. నీలం అంచుతో ఉండే ఎరుపు రంగు త్రిభుజాకారాలు రెండు ఉంటాయి. వీటిల్లో ఒకటి చంద్రుడికీ, మరోటి సూర్యుడికీ సూచిక.
ఒకప్పుడు ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్‌ లౌకికరాజ్యంగా మారింది. ఇప్పటికి కూడా 81 శాతం మంది హిందువులు ఉన్నారు. ఎన్నోమతాలు సామరస్యంతో కలిసి నివసిస్తున్నారు.
రామాయణ కధానాయకుడు శ్రీరాముని భార్య సీతాదేవి జన్మస్థలం నేపాలే.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు ఉంది ఈ దేశంలోనే. మహాపాదిగా చెప్పుకునే ‘యతి’ ఈ దేశ హిమాలయాల్లో కనిపించినట్టు చెబుతారు. జీవ వైవిధ్య పరంగా ఈ దేశం ముందంజలో ఉంది. ఇక్కడ వేలాది రకాల జీవులుంటాయి. 900 రకాల పక్షి జాతులుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పక్షి జాతుల్లో 8.9 శాతం ఇక్కడే కనిపిస్తాయి. 4.2 శాతం సీతాకోక చిలుకలు, 3.96 క్షీరదాలు ఉంటాయి. అందుకే నేపాల్‌ని ‘అమెజాన్‌ఆఫ్‌ఆసియా’గా పిలుస్తారు.
నేపాల్ పర్యటన
ప్రపంచంలో అత్యదికంగా పర్యాటకులను ఆకర్షించే దేశాలలో నేపాల్ ఒకటి. అక్కడి ప్రకృతి రమణీయత. హిందు మతస్తులకు, బౌద్ధ మతస్తులకు సంబంధించిన అత్యున్నతమైన కేంద్రాలు, ట్రెక్కింగు, రాప్టింగు వంటి సాహస క్రీడలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. నేపాల్ ప్రజల స్నేహపూరిత స్వభావం కలవారు. ఆకాశానికి తాకుతున్నాయా అన్నట్టున్న హిమాలయాలు, పాతాళ లోకంలో వున్నాయా అన్నట్టున లోయలు, నదులు, సెలయేళ్లు, జలపాతాలు, హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలు, భౌద్దులకు అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు ఉన్న నేపాల్ పర్యాటకులకు నయనాందకరం చేసే దేశం. నేపాల్ దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరు కూడా పర్యటకమే.
పోక్రా
నేపాల్ లోని ముఖ్యమైన పట్టణాలలో పోక్రా ఒకటి. ఇది అతి చిన్న పట్టణం. కొండ కోనల్లో కట్టిన ఇళ్లతో సుందరంగా ఉంటుంది. పట్టణానికి కొంచెం దూరంలో మంచుతో కప్పబడిన హిమాలయా పర్వతాలు కనువిందు చేస్తాయి. వెండి కొండలవలె ప్రకాసిస్తున్న ఆ హిమాలయాలను దగ్గర నుండి చూడడానికి విమాన ప్రయాణ సౌకర్యం ఉంది. చిన్న విమానాలలో హిమాలయాలకు కొద్దిగా దగ్గరికి వెళ్లి తిరిగి వస్తాయి. ఈ పట్టణాన్ని స్విజ్డర్ లాండ్ తో పోలుస్తారు. దీనికి ఆసియాలోని స్విజ్డర్ లాండ్ అని అంటారు. హిమాలయాల అందాలను చూడ డానికి మంచి సమయం సూర్యోదయానికి కొంత ముందు దాని తర్వాత కొంత సమయం. ఆ సమయానికి పర్యాటకులు తాము బస చేసిన భవనాల పైకెక్కి హిమాలయాల అందాలను తిలకిస్తుంటారు. సూర్యోదయానికి ఇంకా కొన్ని నిముషాలుందనగా ఆకాశం ఎర్ర బడుతుంది. ఆ కాంతిలో ఆ మంచు కొండలు బంగారు కాంతితో మెరిసి పోతుంటాయి. ఆ బంగారు కాంతి పొద్దెక్కే కొద్ది రంగు మారి వెండి కొండ వలే వెలుగులు చిమ్ముతుంది. ఆ దృశ్యం అత్యంత నయానంద కరం.
దేవి జలపాతం
ఈ పట్టణంలో మరొక వింత దేవి జలపాతం. సాధారణంగా జలపాతాలను క్రింద నుండి పైకి చూసారు. కాని ఈ జలపాతాన్ని పైనుండి క్రిందికి చూడాలి. అంటే కొండ పైకెక్కి చూడాలని కాదు. భూమి పైనుండే విశాలమైన బావిలోనికి చూడాలి. ఆ బావి చుట్టూ ప్రమాద నివారణ కొరకు ఇనుప పట్టీలతో కంచె ఏర్పాటు చేశారు. దాని అంచున నిలబడి బావి లోనికి చూడాలి. లోపల బావి దరిలోనుండి అతి పెద్ద జల ప్రవాహం వచ్చి చాల లోతున్న బావిలోనికి పడుతుంది. ఆ ప్రవాహం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. పర్యాటకులు నిలబడిన భూమి క్రింద సుమారు ఇరవై అడుగుల లోతులోనుండి వచ్చి బావిలోనికి పడుతుంది. ఈ జలంతో ఆ బావి నిండి పోదు. ఆ వచ్చిన నీరు ఎలా వచ్చాయో అదేవిదంగా భూమి లోపలికి వెళ్లి పోతాయి. అవి ఎక్కడ బయట పడతాయో తెలియదు. ఈ వింత జలపాతం పోక్రా పట్టణం మధ్యలోనే ఉంది.
కాఠ్మండ్
కాఠ్మండ్ నగరం కొండల మధ్యన మైదాన ప్రాంతంలో ఉంది. ఇది ఈ దేశంలో అతి పెద్ద పట్టణం మరియు దేశ రాజధాని. కానీ పెద్ద పట్టణమైనా భారతదేశ పట్టణాలతో పోలిస్తే ఇది చిన్నదే. బహుళ అంతస్తుల భవనాలు, బారీ కట్టడాలు చాల తక్కువ. ఈ దేశంలోని వాహనాలు చాల పాతవి. పాత జీపుల్లాంటి వాహనాలే ఇక్కడి ప్రయాణ సాధనాలు. కాఠ్మండులో ఒక ఆకర్షణ అక్కడి జూద గృహాలు. వీటిని కాసినోలు అంటారు.
మద్యం సేవిస్తూ, అర్థ నగ్న నృత్యాలను వీక్షిస్తూ జూదం ఆడుతారు. ఈ జూదం ఆడడనికే ఇతర దేశాలనుండి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరు. సాధారణ పర్యటకులు కూడా వెళుతుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగు సెంటర్లు కూడా ఉన్నాయి. కాని అవి ఎక్కువగా భారత్ లాంటి విదేశాల వర్తకులకు చెందినవే. అన్ని దేశాలకు చెందిన వస్తువులు ఇక్కడ అమ్ముతుంటారు. సామాన్యంగా ఇక్కడ తయారైన వస్తువులు అంటు ఏమి వుండవు. అన్ని విదేశాలవే. స్థానికులకన్నా పర్యటకులే ఈ వస్తువులను కొంటుంటారు.
ఇక్కడ రుద్రాక్ష చెట్లెక్కువ. అందు చేత రుద్రాక్షలు ఎక్కువగా, చాల చవకగా దొరుకుతాయి. కొందరు పర్యాటకులు రుద్రాక్ష కాయలను కిలోల లెక్కన కొంటారు. వాటిని పగల గొట్టి చూస్తే వారి అదృష్టం పండి అందులో ఒకటి రెండు ఏకముఖి రుద్రాక్షలు దొరికాయంటే వారి పంట పండినట్లే. వాటి ధర ఒక్కోటి కొన్ని వేల రూపాయ లుంటుంది మనోకామన దేవాలయ పోక్రా నుండి ఖాట్మండుకు వెళ్లే దారిలో ఈ మనో కామని ఆలయం ఒక పెద్ద కొండపై ఉంది. రోడ్డు కానుకొని త్రిశూల్ నది ప్రవహిస్తుంటుంది. ఇక్కడ నది లోనికి దిగ గలిగినంత లోతులో ఉంది. నదికవతల రెండు మూడు కొండలకవతల ఒక కొండపై మనో కామిని ఆలయం ఉంది. అక్కడికి వెళ్లడానికి రోప్ వే” ఏర్పాటు చేయబడి ఉంది. ఆ రోప్ కారులో వెళుతుంటే ఆదృశ్యం . క్రింద నది, లోయలు, కొండ వాలులో పంటలు చాల మనోహరంగా వుంటుంది. గతంలో ఈ ఆలయానికి వెళ్ల డానికి మెట్ల దారి వున్నట్లు తెలిపే మెట్ల వరుసలు ఇప్పటి కనబడతాయి.
ఈ రోప్ కారులో మనుషులతో బాటు గొర్రెలు కూడా వెళుతుంటాయి. కొండ కొసన పెద్ద ఆలయం ఉంది. ఇది పగోడ పద్ధతిలో ఉంది. ఈ ఆలయంకొరకు వెలసినదే ఇక్కడున్న చిన్న గ్రామం. ఇక్కడి పూజారులను పండితులు అంటారు. వారు భక్తులను దేవి చుట్టు కూర్చో బెట్టి పూజ చేయిస్తారు. చివరన పూలు ప్రసాదం ఇస్తారు. ఇక్కడి అమ్మవారు భక్తుల మనసులోని కోరికలు తెలుసుకొని వాటిని నెరవేరుస్తుందని భక్తుల నమ్మిక. ఈ ఆలయ ప్రాంగణంలో పావురాలు ఎక్కువగావున్నాయి. వాటికి గింజలను మేతగా వేస్తారు. ఇది చాల పురాతన ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక జంతువధ శాల ఉంది. ఇక్కడ తరచు దేవి కొరకు జంతు బలులు ఇస్తుంటారు. ఈప్రాంతం అంతా రక్తసిక్తంగా వుంటుంది. గొర్రెలు కూడా రోప్ కార్లలో రావలసిందే. ఇక్కడ చిన్న చిన్న హోటళ్లు ఉన్నాయి. అందులో ప్రతి టేబుల్ ముందు మద్యం బాటిళ్లు పెట్టి వుంటాయి. ఈ కొండపై నుండి సుదూరంలో మంచుతో కప్పబడిని హిమాలయాలు కనబడు తుంటాయి.

పశుపతి నాధ్ ఆలయం
ఇక్కడ చూడ వలసిన ప్రదేశాలు చాల ఉన్నాయి. అందులో ఒకటి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పశుపతినాధ్ శివాలయం. చాల విశాలమైనది. కాని చాలవరకు శిథిలమయం. ఇక్కడి ప్రధాన ఆలయం పగోడ ఆకారంలో చాల ఎత్తుగా వుంటుంది. ఇందులో గర్భాలయం చతురస్త్రాకారంలో వుండి నాలుగు వైపుల ద్వారాలు కలిగి వుంటుంది. మధ్యలో వున్న శివ లింగానికి నాలుగు వైపుల నాలుగు మొఖాలుంటాయి. అవి ధర్మార్థకామ మోక్షాలకు ప్రతీకలని నమ్మకం. నాలుగు ద్వారాల వద్ద నలుగు పండితులు వుండి పూజలు చేయిస్తుంటారు. ఇక్కడి పూజారులను పండితులు అని అంటారు. వీరందరు తెలుగు వారేనని అంటారు. వారు తర తరాల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఈ ఆలయంలోనికి హిందూవులకు మాత్రమే ప్రవేశం వుంటుంది. కాని వచ్చే వారు హిందువు అవునో కాదో గుర్తించే ఏర్పాట్లెమి వుండవు. ఈ ఆలయం వెనుక వైపున భాగమతి నది ఉంది. అక్కడే ఆతి పెద్ద శ్మశానం ఉంది. అక్కడ ఎప్పుడు శవాలు కాలుతూనే వుంటాయి. గర్భగుడికి ఎదురుగా అతి పెద్ద నంది ఉంది. ఆలయ ప్రాంగణంలో వివిధ మందిరాలలో కొంత మంది పండితులు భక్తులకు పూజలు వ్రతాలు చేయిస్తుంటారు. ఇక్కడ రుద్రాక్షలు ఎక్కువగా దొరుకు తాయి. రుద్రాక్ష మాలలు చాల చవకగా అమ్ముతుంటారు. భక్తులు ఒక రుద్రాక్ష మాలను కొని పూజారికిచ్చి దానిని గర్భగుడిలోని శివునిపై వుంచి మంత్రాలు చదివి దానికి తిరిగి భక్తులకు ఇస్తారు. దాన్ని భక్తులు పవిత్రంగా బావించి ధరిస్తారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాలలో అనేక దుకాణలాలలో ముత్యాలు, నవరత్నాలు, అనేక రంగుల పూసలు విక్రయిస్తుంటారు. విదేశీ యాత్రికులే వీటిని ఎక్కువగా కొంటుంటారు.
మహావిష్ణు ఆలయం
శేషశయనునిపై పవళించి నట్లున్న మహావిష్ణువు నల్లరాతి భారీ విగ్రహం తక్కువ లోతు నీళ్లున్న కోనేరులో తేలి యాడుతున్నట్లుంటుంది. భక్తులు నీళ్లలోకి దిగి పూజలు చేస్తుంటారు. పురాతనమైన ఈ విగ్రహం చేతులలో శంఖం, చక్రం, గద మొదలైన ఆయుధాలున్నాయి. ఇది స్వయంభువని, బుద్ధుని అవతారమని ఇక్కడి వారి నమ్మిక. ఈ చుట్టు పక్కల ఉన్న దేవాలయాల శిథిలాలను చూస్తుంటే గతంలో ఇక్కడ అతి పెద్ద ఆలయం వుండేదని అర్థం అవుతుంది. అతి పొడవైన రుద్రాక్ష మాలలు ఇక్కడ ఎక్కువగా అమ్ముతుంటారు.
ముక్తినాథ ఆలయము
హిందువులు పవిత్రంగా బావించే నూట ఎనిమిది వైష్ణవ దివ్య దామాలలో ముక్తినాథ ఆలయం 106 వది. పోక్రా నుండి ముక్తినాద్ ఆలయానికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. అంతా గతుకుల బాట. చిన్న చిన్న విమానాలు నడుపుతుంటారు. అవికూడ వాతావరణం సరిగా లేకుంటే నడపరు. వాటిలో వెళ్లినా ఆ తర్వాత కూడా కొంత దూరం కాలి నడకన వెళ్లాల్సిందే. ఇది చాల కష్టతరమైన దారి ప్రయాసతో కూడుకున్న పని. ముక్తి నారాయణుడు స్వయంభువు. పద్మాసనంలో కూర్చున్న మూర్తి. నూట ఎనిమిది ధారలలో నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లను నెత్తిన చల్లుకుంటే నూట ఎనిమిది దివ్యధామాలు దర్శించు కున్నంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక.
సూర్యోదయ వీక్షణ
ఖాట్మండుకు సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఒక కొండ మీద ఉదయిస్తున్న సూర్యుని చూడడానికి ఒక కేంద్రం ఉంది. సూర్యోదయానికి ముందే అక్కడికి చేరుకోవాలి. అక్కడికి వెళ్లే దారి సన్నగాను మలుపులు తిరిగి వుంటుంది. కనుక పెద్ద వాహనాలు వెళ్లలేవు. చిన్న వాహనాలలో వెళ్లాలి. ఈ కొండ పైనున్న ఒక హోటల్ లో యాత్రీకులకు కావలసిన టీ, కాఫీ పలహారాల వంటి వసతులు చాల బాగా వుంటాయి. కొండ ఎత్తుగా వున్నందున సుదూర ప్రాంతం చక్కగా కనబడుతుంది. సూర్యోదయ సమయానికి మేఘాలు అడ్డు లేకుంటే ఆ సూర్యోదయ దృశ్యం చాల అద్భుతంగా వుంటుంది.
భక్తాపూర్
నేపాల్ దేశంలో భక్తాపూర్ ఒక చిన్న పట్టణం. గతంలో ఇది ఇక్కడి ఒక రాజ్యానికి రాజధాని. ఈ రాజధాని నగరంలో చూడవలసిన అనేక దేవాలయాలు, రాజరికపు కట్టడాలు అనేకం ఉన్నాయి. పశుపతి నాధ్ ఆలయాన్ని పోలిన ఆలయం కూడా ఇక్కడ ఉంది. అలాంటి దేవాలయాలు అనేకం వున్నాయి . కాని అన్ని శివాలయాలే. రాజ దర్బారు హాలు చాల గంబీరంగా వుంటుంది. ఇక్కడే దుర్గమ్మ వారి ఆలయం ఒకటి ఉంది. ఇది ఆలయం లాగ కాకుండ నివాసగృహం లాగ వుంటుంది. ఆ ఆలయాన్ని కేవలం దసరా సందర్భంలో మాత్రమే తెరుస్తారు. లోన అత్యంత సంపద వున్నట్లు స్థానికులు చెపుతారు. గర్భ గుడిలోనికి వెళ్లనీకున్నా పరిసర ప్రాంతాలను చూడటానికి వీలున్నది. ఈ ప్రాంతంలోని కట్టడాలు అతి మనోహరంగా ఉన్నాయి.
ప్రకృతి పరంగ ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అభయారణ్యాలతో అనేక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలతో ఎంతో ప్రశాంతంగా కనబడుతుంది నేపాల్.
ఎవరెస్టు శిఖరము
ఈ శిఖరము ప్రపంచములోనే ఎత్తైనది. దీనిని నేపాలీలో సాగరమాత అనీ, టిబెట్ భాషలో ఖోమోలోంగ్మ అనీ పిలుస్తారు. ఇది నేపాల్-చైనా సరిహద్దులో ఉంది. సమున్నతమైన ఎవరెస్టు శిఖరము, హిమాలయ పర్వత సానువులతో బాటు, ప్రపంచములో 8000 మీ. దాటిన పది ఎత్తైన శిఖరాలలో ఎనిమిది నేపాలు లోనే ఉన్నాయి. ఇవి పర్యటకులకు ముఖ్య ఆకర్షణ. వీటిని ప్రకృతి వింతలుగా చెప్తారు.

శ్రీలంక పర్యాటకం

Srilanka Tourism / శ్రీలంక పర్యాటకం
ప్రపంచంలోనే అందమైన దేశాలలో శ్రీలంక ఒకటి. శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉన్న పొరుగు దేశం కూడా. శ్రీలంక రాజధాని కొలంబో. ప్రధాన భాష సింహళం. తరువాత ఎక్కువగా తమిళం మాట్లాడతారు. వీరి డబ్బు శ్రీలంక రూపాయి. దక్షిణ దేశాలలో అత్యధిక అక్షరాస్యత కల దేశం. దాదాపు 92 శాతం మంది విద్యాధికులు.
రావణుడి రాజ్యం శ్రీలంక ఇదేనని చాలామంది నమ్ముతారు. 1972 వరకు శ్రీలంకను సిలోన్ అని పిలిచేవారు. 1948లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశంలో 100కు పైగా నదులున్నాయి. జలపాతాలు కూడా ఎక్కువే. జలవిద్యుత్ ఎక్కువ. అతి ప్రాచీనమైన మహాబోధియా అనే వృక్షం ఉంది ఇక్కడ. ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన సిలోన్ టీపొడి ఇక్కడే తయారవుతుంది. తేయాకు ఎక్కువగా పండిస్తారు. తేయాకు ఎగుమతులు కూడా ఎక్కువే.
భారతదేశం పటం చూసినప్పుడు.. అందులోనే మరో దేశం కూడా కనిపిస్తుంది! కన్యాకుమారి దిగువన.. సముద్రంలో మధ్యన.. కాస్త అటూఇటూగా ముక్కోణాకృతిలో ఉండే ఆ చిన్న దేశమే శ్రీలంక. మనదేశంలో పుట్టిపెరిగిన బౌద్ధాన్ని ఆదరించి, ఆచరిస్తున్న ప్రాంతమది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శాంకరీదేవి ఆలయం ఉన్నది లంకలోనే.. సంస్కృతి, సంప్రదాయాల కలబోతగా పర్యాటక ప్రియులను అలరిస్తోంది. ప్రకృతి ఆరాధకులకు, ఆధ్యాత్మిక సాధకులకు, పర్యావరణ హితులకు.. అందరికీ అన్నీ ఉన్నాయి.

ఆదిశక్తిపీఠం..
‘లంకాయాం శాంకరీదేవీ’.. అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటిది శ్రీలంకలోని ట్రింకోమలీ పట్టణంలోని శాంకరీదేవి ఆలయం. పచ్చటి ప్రకృతికి ఆలవాలంగా ఉంటుందీ ప్రాంతం. సముద్రంలోకి చొచ్చుకువచ్చిన ఎత్తయిన పర్వతంపై అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. లంకకు వచ్చే పర్యాటకులందరూ ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శిస్తారు. పదిహేడో శతాబ్దంలో పోర్చుగీసువారి దాడిలో ఇక్కడి ఆలయం ధ్వంసం అయింది. శతాబ్దాల తరబడి ఈ ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 2005లో శ్రీలంక ప్రభుత్వం ఆలయాన్ని పునర్నిర్మింపజేసింది. అప్పటి నుంచి శాంకరీదేవి ఆలయం ప్రముఖ సందర్శనీయ కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడికి సమీపంలోనే శ్రీరాముడు ప్రతిష్ఠించిందిగా చెప్పే కోణేశ్వరాలయం ఉంటుంది. శ్రీలంకలోని ప్రధాన నగరాల్లో ఒకటైన దంబుల్లా నుంచి ట్రింకోమలీ 106 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
సిగిరియా కొండ
లంకలో ప్రధాన ఆకర్షణ సిగిరియా కొండ. ఇది దంబుల్లా నగరం సమీపంలో ఉంటుంది. సింహాకృతిలో ఠీవీగా కనిపించే ఈ భారీ కొండ ఎత్తు 200 మీటర్లు. శ్రీలంక నాగరికతకు నిలువెత్తు నిదర్శనమిది. 5వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించే కశ్యప అనే రాజు.. సిగిరియా కొండపై రాజప్రాసాదం, కోటలు కట్టించాడట. కోటకు వెళ్లే దారి వెంట నీటి కొలనులు, ఉద్యానవనాలు కనిపిస్తాయి. పైగా కొలనుల్లో ఫౌంటెయిన్లు ఉండటం, అవి నేటికీ పని చేస్తుండటం విశేషం. కొండపై నాటి రాజప్రాసాదాల శిథిల నిర్మాణాలు ఇప్పటికీ కనిపిస్తాయి. పచ్చిక బయళ్లు, భారీ వృక్షాలతో కొండ పైభాగం ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఎన్నో వైవిధ్యాలకు నెలవైన సిగిరియా యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.
రామాయణం….లంక…
సుందరకాండలో శ్రీలంకను వాల్మీకి సుందరమైన ప్రదేశంగా వర్ణించారు. అందుకు తగ్గట్టుగానే పర్వతాలు, లోయలు, నదులు, పచ్చదనంతో లంక ఎంతో అందంగా ఉంటుంది. వీటి మధ్యలో రామాయణగాథకు సంబంధం ఉన్నాయని చెప్పే ప్రాంతాలు కనిపిస్తుంటాయి.
– ఆంజనేయుడు లంకలో తొలిసారిగా రంబోడా అనే ప్రాంతంలో అడుగుపెట్టాడట. ఇక్కడ హనుమంతుడి భవ్యమందిరం కూడా ఉంది. ఇక్కడి జలపాతం మనోహరంగా ఉంటుంది. కాండీ నగరం నుంచి రంబోడాకు సుమారు 50 కిలోమీటర్లు.
– సీతమ్మను రావణుడు తీసుకొచ్చిన మార్గంగా ‘సీత ఎలియా’ పేరు చెబుతారు. సీతమ్మను బంధించి ఉంచిన అశోకవనం కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంటుంది. ఇక్కడే ఆంజనేయుడి పాదముద్రలు కూడా కనిపిస్తాయి. ఈ ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఇక్కడ సీతమ్మవారి ఆలయం కూడా ఉంది. కాండీ నుంచి సీత ఎలియా 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
– ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగానికి మూర్చిల్లిన లక్ష్మణుడిని కాపాడటానికి ఆంజనేయుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని పర్వతం తెచ్చాడని రామాయణంలో చదివాం. ఆ సంజీవని పర్వతంలో కొంత భాగం పడిన ప్రాంతంగా రితిగల పేరు చెబుతారు. ఇక్కడి పర్వతంపై అనేక ఔషధ వృక్షాలు నేటికీ కనిపిస్తాయి. లంకలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సిగిరియా నుంచి రితిగల 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
– ఇవేకాకుండా నువార ఏలియా సమీపంలోని రావణ గుహలు, రావణుడి కాలానికి చెందిన సొరంగ మార్గాలు, రావణ జలపాతం, కొలొంబో దగ్గర్లోని విభీషణ ఆలయం, చిలా సమీపంలోని లంకేశ్వరుడి కాలంనాటి విమానాశ్రయంగా చెప్పే గుర్లపోతా తదితర ప్రదేశాలెన్నో నాటి రామయణ ఘట్టాలను ప్రతిబింబిస్తాయి.
వన్యమృగాలు….
వన్యమృగాల ప్రేమికులకు లంక పర్యటన మధురానుభూతిని అందిస్తుంది. దట్టమైన అడవులు, నదీనదాలు ఈ ద్వీపాన్ని పర్యావరణ కేంద్రంగా నిలబెట్టాయి. దంబుల్లాకు 30 కిలోమీటర్ల దూరంలో మిన్నేరియా నేషనల్ పార్క్లో ఏనుగులు మందలు మందలుగా సంచరిస్తుంటాయి. సిగిరియా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోనూ ఏనుగులను చూడొచ్చు. శ్రీలంక దక్షిణ తీరంలోని యల నేషనల్ పార్క్ జీవ వైవిధ్యానికి పట్టుగొమ్మ. ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు, జడలబర్రెలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ సందర్శకుల తాకిడి ఉంటుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకులను లోనికి అనుమతిస్తారు. ఇక్కడ సఫారీ చేయవచ్చు.
ఎలావెళ్లాలి…?
హైదరాబాద్ నుంచి శ్రీలంక నాన్స్టాప్, సింగిల్స్టాప్ విమాన సర్వీసులు, విజయవాడ, విశాఖపట్టణం నుంచి సింగిల్స్టాప్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుంచి విమానాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. టికెట్ ఛార్జీలు రూ.4,200 నుంచి రూ.15,000 వరకు ఉంటాయి.
వీసా ఎలా పొందాలి…?
శ్రీలంక వీసా ఆన్లైన్లో పొందవచ్చు. ఈటీఏ (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) వీసా కోసం కనీసం ఆరునెలల గడువు ఉన్న పాస్పోర్ట్, వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం ఉండాలి. రూ.1800 ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది. వారం రోజుల్లో వీసా లభిస్తుంది. 30 రోజుల గడువుతో, రెండుసార్లు వెళ్లే సౌలభ్యం కల్పిస్తారు. వీసా కోసం http://www.eta.gov.lk వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆరామాలు….
భారత్ నుంచి లంకలోకి వ్యాప్తిచెందిన బౌద్ధధర్మం అక్కడ విశేష ప్రాచుర్యం లంక జనాభాలో దాదాపు 70 శాతం మంది బౌద్ధ మతస్థులే! లంకలో బౌద్ధ ఆరామాలు కోకొల్లలు. శతాబ్దాల పాటు లంక రాజధానిగా వెలుగొందిన అనురాధపురలో చారిత్రక ఆలయాలు ఎన్నో ఉన్నాయి. దంబుల్లాలోని గుహాలయాలు ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందాయి. 150 మీటర్ల ఎత్తున్న గుహాలయాల్లో బుద్ధుడి ప్రతిమలు విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడే గోల్డెన్ బుద్ధ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.
ఇంకా చూడవలసినవి….
– కాండీ-ఎల్లా రైలు ప్రయాణం శ్రీలంకలోని ప్రకృతి సౌందర్యాన్ని పరిచయం చేస్తుంది. సముద్ర తీరం వెంబడి, దట్టమైన అడవుల గుండా, పచ్చటి పొలాల మీదుగా సాగే రైలు ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. – కాండీ, నువర ఏలియా ప్రాంతాల్లో తేయాకు తోటలు విస్తృతంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
– చుట్టూ సముద్రం ఉన్న లంకలో అందమైన బీచ్లు ఎన్నో ఉన్నాయి. కొలొంబో నుంచి మొదలుపెడితే జాఫ్నా వరకు ఎన్నో తీరాలు పర్యాటకులతో సందడిగా ఉంటాయి. బెన్టోటా బీచ్, ట్రింకోమలీ సమీపంలోని నీలవెళ్లి తీరం, తూర్పుతీరంలోని అరుగమ్, పస్సికూడ, దక్షిణ తీరంలోని మిరిస్సా తదితర బీచ్లు సంద్రంలో సాహసక్రీడలకు అడ్డాగా నిలుస్తున్నాయి.
– కొలొంబోకు 153 కి.మీ దూరంలోని మిరిస్సా తీరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి బోట్లో సముద్రంలోకి వెళ్తే.. బ్లూవేల్స్ ఉన్న ప్రాంతానికి చేరుకోవచ్చు. ఆ భారీ జలచరాలు ఆటలను చూడొచ్చు.

శ్రీలంకలో చూడవలసిన వాటికోసం క్లిక్ చేయండి….
Click here

ధాయ్ లాండ్ – బ్యాంకాక్ పర్యాటకం

పర్యాటకులు ఎక్కువగా సందర్శించే దేశం ధాయ్ లాండ్. దీని రాజధాని బ్యాంకాక్. ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష ధాయ్. వీరి కరెన్సీ పేరు బాత్. థాయ్లాండ్ అధికారికంగా కింగ్డం ఆఫ్ థాయ్లాండ్ గా పిలువబడుతుంది. భారతదేశానికి పశ్చిమ దిశలో ఉంది. థాయ్లాండ్ ఉత్తరదిశలో బర్మా, లావోస్, తూర్పుదిశలో లావోస్, కంబోడియా, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్, మలేషియా మరియు పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి
థాయ్లాండ్ ప్రజలలో 75% మంది థాయ్ సంప్రదాయానికి చెందినవారు. 14% మంది ప్రజలు థాయ్ చైనీయులు మరియు 3% మంది ప్రజలు మలే సంప్రదాయానికి చెందిన వారు.. బౌద్ధమతాన్ని థాయ్లాండులో 95% ప్రజలు అనుసరిస్తున్నారు.
ధాయ్ ల్యాండ్ విశేషాలు :
ఈ దేశంలో బౌద్ధమతస్తులు ఎక్కువ. ఎక్కడ చూసినా బుద్ధుని దేవాలయాలు, విగ్రహాలు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద బుద్ధవిగ్రహం కూడా ధాయ్ ల్యాండ్ లోనే ఉంది. రాజధాని బ్యాంకాక్ ను వెనిస్ ఆఫ్ ది వెస్ట్ అని పిలుస్తారు. దీనికి కారణం ఇక్కడ కాలువలు ఎక్కువగా ఉండటమే.
వీరి ప్రధాన ఆహారం వరి. వరి ఎక్కువగా పండుతుంది. బియ్యం ఎక్కువగా ఎగుమతి చేసే దేశాలలో ధాయ్ లాండ్ కూడా ఒకటి. థాయ్ ప్రధాన ఆహారం బియ్యం. ప్రత్యేకంగా జాస్మిన్ బియ్యం ( దీనిని హాం మాలి రైస్ అని కూడా అంటారు) దాదాపు తాయ్ ఆహారాలు అన్నింటికి చేర్చుకుంటారు
అతిపెద్ద మొసళ్ల కేంద్రం ధాయ్ ల్యాండ్ లోనే ఉంది. ఏనుగులు కూడా ధాయ్ ల్యాండ్ లో ఎక్కువ.
ధాయ్ లాండ్ అంటే ల్యాండ్ ఆఫ్ ది ఫ్రీ అని అర్ధం. ఆగ్నేయ ఆసియాలో యూరోపియన్ల ఆధీనంలోకి రానిది ఇదొక్కటే.
ఇక్కడ మడ్ స్కిప్పర్ అనే ఒక ప్రత్యేకమైన జాతి చేప ఉంది. ఈ రకమైన చేపలు నేలమీద నడవగలవు, చెట్లు కూడా ఎక్కగలవు. ప్రపంచంలోని ప్రమాదకరమైన, పొడవైన కింగ్ కోబ్రాలు ఎక్కువ. ఈ కింగ్ కోబ్రాలు సుమారు 18 అడుగుల దాకా ఉంటాయి. వీటి విషం అత్యంత ప్రమాదకరమైనది. ఒక్క కాటుతో ఏనుగును సహితం చంపగలవు.
హిందూ దేవాలయాలు
నకోన్ రాచసీమ రాష్ట్రంలో క్రీ.శ 11వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం ఉంది. అందులోని శివలింగం, నంది విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అక్కడికి 15 కి.మీల దూరంలో పిమాయ్ చారిత్రాత్మక పార్కు ఉంది. 11-12 శతాబ్దాల్లో నిర్మించిన ఈ నగరం పేరు వాస్తవానికి విమయపుర తరువాతి కాలంలో విమయ, పిమాయ్గా మారింది. హిందూఖేమర్ వంశస్థులు నిర్మించిన ఈ నగరం కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ తప్పకుండా చూడాల్సిన మరో ప్రదేశం కోరట్. ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన ఆదిమానవుల అవశేషాలను ప్రదర్శనలో ఉంచారు.
దేశంలో సందర్శించాల్సిన మరో నగరం ఆయుతయ. ఇది కోరట్ – బ్యాంకాక్ మధ్య చావ్ ప్రాయా నది ఒడ్డున ఉన్న ప్రాచీన నగరం. ఆయుతయ… మన అయోధ్య నుంచి వచ్చిందని అభిప్రాయం. ఈ నగరంలో చాయ్వతనరం బౌద్ధాలయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత ప్రధానమైనది. నాలుగు గోపురాల నడుమ 35 మీటర్ల ప్రధాన గోపురం నాటి నిర్మాణ శైలిని, నైపుణ్యాన్ని కళ్ళకు కడుతోంది. దేశంలో వ్యవసాయానికి, పశుసంపదకు ప్రసిద్ధి పొందిన ప్రదేశం కౌయాయ్ రీజియన్ . ప్రత్యేక వాహనాల్లో వైన్ యార్డు మొత్తం తిరిగి చూడవచ్చు. కౌయాయ్ డెయిరీ ఫామ్సకి కూడా ప్రసిద్ధి చెందినది. చోక్చాయ్ ఫామ్ ఆసియాలోకి పెద్దది. 50 ఏళ్లుగా నడుస్తున్న ఈ ఫామ్ గొప్ప పర్యాటక ప్రదేశం కూడ.
సాధారణ పర్యాటకులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు… ఏడాదికి కనీసం మూడు లక్షల మంది సందర్శిస్తారు.
సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ బయోడీజిల్, ఐస్క్రీమ్ వంటి పాల ఉత్పత్తులు తయారుచేసే చోక్చాయ్ ఫామ్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. సందర్శకుల బస కోసం అత్యాధునిక గుడారాలు, వినోదం కోసం కౌబాయ్ షోవంటి వినోద కార్యక్రమాలు, రెస్టారెంట్లు, షాపింగ్ సెంటర్లు ఉన్నాయి.
పర్యాటకులకు వసతులు
థాయ్లో పట్టాయాలో బీచ్ రిసార్టులు, హోటళ్లు ఉన్నట్లే కౌయాయ్లో రిసార్టులు పచ్చటి చెట్లు, పర్వత శ్రేణుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ప్రతి రిసార్టు, హోటల్ పర్యాటకుల వినోదాల కోసం ఏదో ఒక ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. అమ్యూజ్మెంట్ పార్కులు, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్, కౌబాయ్ షోలవంటి వినోద కార్యక్రమాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. అరడజనుపైగా గోల్ఫ్ మైదానాలు ఉన్నాయి. దారిపొడవునా ప్రీమియం ఔట్లెట్, లోటస్ మాల్స్ వంటి షాపింగ్ సెంటర్లు ఉంటాయి. ఇక్కడి పాలియో షాపింగ్ మాల్లో ఏదీ కొనకుండా విండో షాపింగ్ చేయడమూ చక్కని అనుభవమే. కౌయాయ్ ప్రాంతంలోనే ఉన్న డాన్క్వియాన్ ప్రాంతం పాటరీకి ప్రసిద్ధి.
మరాల్డ్ బౌద్ధ ఆలయం
మరకత బుద్ధుడు థాయ్ టూర్లో మరో ప్రత్యేకత బ్యాంకాక్లో ఎమరాల్డ్ బుద్ధుడిని చూడడం. వాట్ ప్రాకయో (ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం) కాంబోడియా నిర్మాణ శైలిలో ఉంటుంది. పచ్చని గ్రానైట్ రాతితో నిర్మించిన బుద్ధుడి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం శతాబ్దాల క్రితం భారతదేశం నుంచి కాంబోడియా, లావోస్, వియత్నాం దేశాలగుండా చేతులు మారుతూ బ్యాంకాక్ చేరింది. బౌద్ధులు జీవితంలో ఒక్కసారైనా మరకత బుద్ధుడిని దర్శించుకోవాలనుకుంటారు. ఈ ఆలయం బ్యాంకాక్లో చావ్ప్రాయ నది ఒడ్డున ఉంది.
వాట్ అరుణ్ దేవాలయం
చావ్ప్రాయ నదికి మరో ఒడ్డున నిర్మించిన వాట్ అరుణ్ దేవాలయం మరో అద్భుత కట్టడం. 79 మీటర్ల పొడవైన పగోడా సూర్య కాంతితో మిలమిలా మెరుస్తూంటుంది. ఇటాలి యన్శైలిలో ఉన్న థాయ్ రాజపస్రాదం ఆనంద సమక్రోమ్ కూడా చూసి తీరాల్సిన కట్టడమే.
బ్యాంకాక్లో చూడాల్సిన అనేక విశేషాల్లో జిమ్ థామ్సన్ హౌస్ మ్యూజియం, సువాన్ పక్కడ్ ప్యాలెస్ మ్యూజియం ఉన్నాయి. సువాన్ పక్కడ్ మ్యూజియం ప్రాచీన థాయ్ ఇళ్ల నిర్మాణాన్ని అనుసరించి ఉంటుంది. రాజవంశస్తులు దేశ, విదేశాల నుంచి సేకరిం చిన అనేక వస్తువులు ఇందులో ఉన్నాయి.

షాపింగ్ సెంటర్లు


బ్యాంకాక్లో షాపింగ్ సెంటర్లలో ప్రముఖమైనది ఆసియాటిక్ షాపింగ్ సెంటర్. ఇది కూడా చావ్ప్రాయ నది ఒడ్డునే ఉంది. ఇందులో వందల షాపులు, అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే పహూరత్ బాంబే మార్కెట్ కూడ. ఇది థాయ్లాండ్కు వలస వెళ్లిన భారతీయులు ఏర్పాటు చేసుకున్న మార్కెట్.
థాయ్లాండ్లో వాతావరణం మన వాతావరణాన్నే తలపిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యటనకు మన వాళ్లు ప్రత్యేక దుస్తులవంటి ఏర్పాట్లు చేసుకోనక్కర్లేదు. థాయ్లాండ్లో పర్యాటకం ముఖ్యమైన పరిశ్రమ, అక్కడి వారు టూరిస్టుల పట్ల ఆదరాభిమానాలు చూపిస్తారు. గొడవలు ఏమున్నా పార్లమెంటుకే పరిమితం. టూరిస్టులు నిర్భయంగా దేశంలో ఎక్కడైనా పర్యటించవచ్చు అని థాయ్లాండ్ పర్యాటకం అథారిటీ ప్రకటించింది.
కౌయాయ్ నేషనల్ పార్కులో…
పర్వతశ్రేణులు, దట్టమైన అడవులు, జలపాతాలు, సెలయేళ్లు, క్రూరమృగాల సంచారం, అరుదైన పక్షుల కిలకిలరవాలు, ఆది మానవుల అవశేషాలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తుంటే… అత్యాధునికతకు ప్రతీకగా హాలిడే రిసార్ట్స్, గోల్ప్ కోర్టులు ఉన్నాయి. టూరిస్టుల కోసం క్యాంపింగ్, నైట్ సఫారీ, ట్రెక్కింగ్కు ఏర్పాట్లు ఉన్నాయి. హనీమూన్ జంటలను అలరించే బ్యూటిఫుల్ స్పాట్లతోపాటు పిల్లలతో వచ్చిన కుటుంబాలు సేదదీరే సౌకర్యం ఉన్న ప్రదేశం కౌయాయ్. ఈ పార్క్ పురావస్తు పరిశోధన, ప్రాచీన కళలు, నిర్మాణం వంటి అంశాలపై ఆసక్తి ఉన్న వారికి సరైన గమ్యస్థానం కూడా. కౌయాయ నేషనల్ పార్క్ నాలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉంది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
మసాజ్ సెంటర్
బ్యాంకాక్లో ఏ వీధిలో చూసినా మసాజ్ సెంటర్లు కనిపిస్తాయి. ఇది వారి సంప్రదాయ వైద్యవిధానం. థాయ్ల్యాండ్ మసాజ్ సెంటర్ల మీద మన వాళ్లకు ఏ అభిప్రాయం ఉన్నా థాయ్ వాసులు మాత్రం దాన్ని పవిత్రంగా భావిస్తారు. మనం కేరళ ఆయుర్వేద మసాజ్ను గౌరవించినట్లు.
య్ సంప్రదాయ నాట్యం లికాయ్. ఈ కళాకారులు బౌద్ధాలయాల్లో ప్రదర్శనలిస్తారు. ఈ నాట్యం చేసేటప్పుడు కళాకారుల వస్త్రధారణ, కథాంశం అన్నీ భారతీయతను పోలి ఉంటాయి.
ఈ దేశం ఆర్కిడ్ పూలకు ప్రసిద్ధి. దాదాపు 15వేల రకాల ఆర్కిడ్స్ ను సాగుచేస్తారు. ధాయలాండ్ వెళ్లాలనుకునేవారు ఇంకొక విషయం గమనించవలసి ఉంది. ధాయ్ కరెన్సీని ఇక్కడి వారు చాలా గౌరవిస్తారు. కరెన్సీపై కాలుపెట్టడం ఇక్కడ చాలా నేరం. శిక్షార్హం కూడా.
Bangkok Tourism / బ్యాంకాక్
బ్యాంకాక్లో ‘ఎరవాన్ శ్రైన్’గా పిలిచే బ్రహ్మ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం. బ్యాంకాక్లో బ్రహ్మదేవాలయం అంటే ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. స్వయంగా థాయ్ ప్రజలే బ్రహ్మకు ప్రత్యేక ఆలయం కట్టడంతోపాటు నిత్యం పూజలు అందిస్తారు. ఈ ఆలయ సమీపంలో లక్ష్మీ, ఇంద్రుడు, నారాయణుడు, వినాయకుడు, త్రిమూర్తుల విగ్రహాలు కూడా ప్రతిష్టంచారు ఇక బ్యాంకాక్లో ‘పటయా సిటీ’ తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం, తెల్లని ఇసుక తిన్నెల బీచ్లో ఓ సారి దిగారంటే చాలు.. సమయమే తెలీదు. ఇంకా ఇక్కడ వాటర్ స్పోర్ట్స్, అడ్వాంచర్స్ కూడా లభిస్తాయి. ఏనుగు సవారీ, ఏనుగుల విన్యాసాలు, థాయ్ సాంప్రదాయ వంటకాలు, డ్యాన్సులు, పోరాటాలు.. ఒకటేమిటీ ఇంకా చాలా ప్రత్యేకతలను మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఎర్వాన్ వాటర్ ఫాల్ ప్రాంతాన్ని చూడకుండా మాత్రం బ్యాంకాక్ టూర్ను పూర్తి చేయొద్దు.
బ్యాంకాక్లో నైట్ లైఫ్
ఇక్కడ థాయ్ మసాజ్కు పెట్టింది పేరు. కేవలం మసాజే కాదు, అంతకు మించి చాలానే దొరుకుతాయి. అందుకే, ఇక్కడికి వచ్చే పర్యటకుల్లో అత్యధికులు ‘భూమ్ భూమ్’ జపం చేస్తుంటారు. ‘భూమ్ భూమ్’ అంటే. ‘మసాజ్ విత్ సెక్స్’. అయితే, ఇక్కడ అది లీగల్ కాదు. పర్యటకులంతా కేవలం సెక్స్ కోసమే థాయ్లాండ్ వస్తున్నారనే ప్రచారాన్ని అక్కడి ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. నిబంధనలను కఠినతరం చేస్తోంది.
థాయ్ సంప్రదాయాల్లో మసాజ్, సెక్స్ అనేవి భాగమని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఇక్కడ సుమారు 3 మిలియన్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు. వీరిలో మూడో వంతు మైనర్లే. ఇక్కడ పర్యటకుల తాకిడి పెరిగే కొద్ది, యువతుల అక్రమ తరలింపు ఘటనలు కూడా పెరిగిపోయాయి. అయితే, ఆ దేశంలో మసాజ్, సెక్స్లు ఆర్థిక వనరులు కావడంతో ప్రభుత్వం కూడా చూసీ చూడకుండా వదిలేస్తోంది. బ్యాంకాక్ పర్యటించేందుకు ఏ సీజనైనా బాగానే ఉంటుంది. అయితే, సమ్మర్లో మాత్రం పర్యటకుల తాకిడి తక్కువగా ఉంటుంది. దీంతో, ఇండియా-థాయ్లాండ్ మధ్య సేవలందించే విమానయాన సంస్థలు టికెట్ ధరల్లో రాయితీలు ప్రకటిస్తాయి.
ఎలా వెళ్లాలి
థాయ్లాండ్ వెళ్లాలంటే వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది. వెట్ బ్యాగ్రౌండ్లో తీసిన రెండు పాస్పోర్టు సైజు ఫొటోలు, రెగ్యులర్ కౌంటర్లో 1000 బాత్లు లేదా తత్కాల్ కౌంటర్లో 1200 బాత్ల ఫీజు చెల్లించాలి. డబ్బును రెండుమూడు వేల బాత్లుగా, మిగిలినది డాలర్లుగా తీసుకువెళ్ళటం మంచిది. దేశంలో కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్లు చాలా ఉన్నాయి. డాలర్లను క్షణాల్లో థాయ్ బాత్లుగా మార్చుకోవచ్చు. థాయ్ బాత్ విలువ దాదాపుగా రూపాయి ఎనభై పైసలు. నాలుగు రోజుల ట్రిప్కు ఒక్కరికీ 20 నుంచి 25 వేల రూపాయవుతుంది. హోటల్ రెంట్ రోజుకు వెయ్యి నుండి ఆరేడు వేల వరకు ఉంటుంది. మరింత సమాచారం కోసం థాయ్లాండ్ పర్యాటకం అథారిటీ వెబ్సైట్ చూడవచ్చు.
విశాఖ, హైదరాబాద్ల నుంచి థాయ్లాండ్కు వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. మే, జూన్ నెలల సమయంలో ఈ ప్రాంతాలకు వెళ్లే విమానాల ధరలు కాస్త తగ్గుముఖం పడతాయి. ఖర్చులుపరంగా చూసుకున్నా.. బ్యాంకాక్ అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఒక థాయ్ బట్(THB)కు, భారత కరెన్సీకి ఒక రుపాయి మాత్రమే వ్యత్యాసం ఉంటుంది.

చియాంగ్ మాయ్
ప్రకృతికాంత సోయగం… సాగర తీర అలలు … మలయ సమీరపు గాలులు… పచ్చపచ్చగా మెరిసిపోయే ప్రకృతి… ఇవన్నీ కలగలసిన చియాంగ్ మాయ్ ను చూడవలసిందే. చియాంగ్ మాయ్లో చెప్పలేనన్ని విశేషాలు.
థాయ్ల్యాండ్ని ఒక పెద్ద రిలీఫ్ సెంటర్. విశ్రాంతి తీసుకోడానికి, ఒత్తిడిని వదిలించుకోవడానికి థాయ్ల్యాండ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. థాయ్ల్యాండ్ అంటే కేవలం విశ్రాంతికి విడిది కాదు. సంప్రదాయ సంగీత సాహిత్యాలకు కూడా విడిదే.
అది కేవలం మసాజుల కేంద్రం కాదు. మనసును శాంతి వైపునకు మళ్లించే ఆధ్యాత్మిక కేంద్రం కూడా. సరదాలు తీర్చుకునే ఆధునిక లోకం మాత్రమే కాదు. సంతోషానికి అసలైన అర్థం తెలుసుకునేందుకు పనికొచ్చే సరికొత్త ప్రపంచం కూడా. ఈ వాస్తవం… ఒక్కసారి చియాంగ్ మాయ్ నగరానికి వెళ్తే మనకు బోధపడుతుంది. థాయ్ల్యాండ్లోని అతి పెద్ద నగరాల్లో ఐదవది చియాంగ్ మాయ్. ఆ పేరుకు కొత్త నగరం అని అర్థం. ఒకప్పుడు లానా అనే రాజ్యానికి రాజధాని ఈ నగరం.
సముద్రపు అలలూ ఇసుక తిన్నెలూ… మలయ పవనాలూ మత్తెక్కించే పూల పరిమళాలూ… పర్వత సానువులూ పుడమి కాగితంపై ప్రకృతి గీసిన పచ్చని చిత్రాలూ… ఆధ్మాత్మిక కేంద్రాలూ అంబరాన్నంటే సంబరాలూ… చియాంగ్ మాయ్లో ప్రతిదీ ప్రత్యేకమే. ప్రతిచోటా అందమే. ప్రతి క్షణమూ ఆనందమే.
అంతా బుద్ధమయం….
చియాంగ్ మాయ్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడి ఆలయాల గురించి. ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా బౌద్ధాలయాలు. ఏడు వందల యేళ్ల పురాతనమైన బౌద్ధాలయం నుంచి, అత్యాధునికంగా నిర్మించిన ఆలయాల వరకూ ఎన్నో ఉన్నాయక్కడ. వాటిలో బౌద్ధ సన్యాసులు నిత్యం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాషాయపు వస్త్రాలు ధరించిన ఆ సాధువులు దారంట నడిచివెళ్తూ ఉంటే… బుద్ధుడే కనుల ముందు నడయాడుతున్నట్టుగా అనిపిస్తుంది. గుండెల నిండా ఆధ్యాత్మికత నిండిపోతుంది. ఏదో చెప్పలేని ప్రశాంతత మనసంతా పరచుకుంటుంది.
సంవత్సరమంతా పండుగే పండుగ…
ప్రతి దేశంలోనూ ప్రతి ప్రాంతంలోనూ పండుగలు ఉంటాయి. కానీ చియాంగ్ మాయ్లో ఉండేటన్ని పండుగలు మరెక్కడా ఉండవు. సంవత్సరం పొడవునా అక్కడ ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుంది. అంబ్రెల్లా ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్, ఎలిఫెంట్ ఫెస్టివల్, ల్యాటర్న ఫెస్టివల్, ఫ్లవర్ ఫెస్టివల్, బెలూన్ ఫెస్టివల్ అంటూ ప్రతి విషయాన్నీ ఓ పండుగలా చేసుకోవడం చియాంగ్ మాయ్ వారికే చెల్లింది.
ఫ్లవర్ ఫెస్టివల్ నాడు థాయ్ల్యాండ్లో పూచే ప్రతి రకమైన పువ్వూ చియాంగ్మాయ్కి చేరుకుంటుంది. వాటితో రకరకాల ఆకృతులు తయారు చేశారు. అలంకారాలు చేస్తారు. మనుషులు సైతం పూలతో అలంకరించుకుంటారు. కొందరైతే పూలతో చేసిన దుస్తులనే వేసుకుంటారు. ఆ రోజంతా చియాంగ్ మాయ్లో పూల పరిమళం గుప్పుమంటుంది.
ఇక యేటా ఫుడ్ ఫెస్టివల్కి తప్పకుండా హాజరై తీరాల్సిందే. స్థానిక వంటకాలతో పాటు చైనీస్, జపనీస్ వంటకాలు కూడా అందులో ఉంటాయి. విభిన్నమైన రుచులు, వైవిధ్యభరితమైన వంటకాలను ఆరగించడానికి భోజన ప్రియులకు అంతకంటే మంచి అవకాశం దొరకదు. అంబ్రెల్లా ఫెస్టివల్ నాడు నగరమంతా ఎక్కడ చూసినా గొడుగులే కనిపిస్తాయి. వీధుల్లో వెదురు బొంగులు పాతి, కరెంటు తీగలు వేసినట్టుగా వీధులన్నిటిలో అంత ఎత్తున తీగలు కడతారు. వాటికి రంగురంగుల గొడుగులను వేళ్లాడదీస్తారు. ప్రతి ఒక్కరూ గొడుగు చేతబట్టే బయటికి వెళ్తారు. రంగు రంగుల గొడుగులను అందరూ చేతబూని తిరగడం చూస్తుంటే… ఇలపై వేల ఇంద్రధనుస్సులుఒక్కసారే వెలిశాయా అనిపిస్తుంది.
ల్యాటర్న ఫెస్టివల్ …. దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ పండుగను ఇ-పెంగ్ అంటారు. ‘ఇ’ అంటే రెండు, ‘పెంగ్’ అంటే నెల అని అర్థం. రెండో నెలలో వచ్చే పండుగ కనుక ఆ పేరుతో పిలుస్తారన్నమాట. ఆ పండుగ రోజున నగరమంతా దీపాలతో అలంకరిస్తారు. చీకటి పడగానే ప్రతి ఇల్లూ దీపాలతో వెలిగిపోతుంది. అందరూ ల్యాటర్న్స (గాలిలో ఎగిరే విధంగా తయారు చేసిన లాంతర్లు) పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వస్తారు.
ఒక్కచోట చేరి, ప్రార్థనలు చేసి, ఆపైన ఆ లాంతర్లను గాల్లోకి ఎగరేస్తారు. ఆ లాంతర్లు ఆకాశానికి ఎగసి, చుక్కలతో పోటీపడుతూ మెరుస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఇలా చేయడం వల్ల కీడు మొత్తం పోయి శుభం జరుగుతుందని అక్కడివారి విశ్వాసం. అలాగే బెలూన్ ఫెస్టివల్, ఎలిఫెంట్ ఫెస్టివల్ తదితర ఎన్నో పండుగలు ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి. వీటన్నిటినీ చూడటానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తూ ఉంటారు. చియాంగ్ మాయ్ టూరిజం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి, థాయ్ల్యాండ్లోని ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లో ప్రముఖమైనదిగా చియాంగ్ మాయ్ మారడానికి ఈ పండుగలే కారణం అంటుంది అక్కడి ప్రభుత్వం.
సాధారణంగా చియాంగ్ మాయ్లో పగలు ప్రజలు పనుల్లో నిమగ్నమై పోతారు. రాతిరైతే షాపింగ్లు, విందులు, వినోదాలు, సరదాలు సంతోషాలంటూ బిజీ అయిపోతారు. ముఖ్యంగా షాపింగ్ అంతా చాలావరకూ రాత్రి పూటే చేస్తుంటారు. అందుకే చియాంగ్ మాయ్ నైట్ బజార్ చాలా ఫేమస్. ఈ బజార్లో షాపింగ్ చేయడం కోసం విదేశీ సందర్శకులు పని గట్టుకుని వస్తుంటారు కూడా. ఈ విశేషాలన్నీ ఒకెత్తయితే అక్కడి ప్రకృతి సౌందర్యం ఒకెత్తు. ఎప్పుడూ చల్లగా వీచే గాలి హాయిపరుస్తుంది. వృక్ష సంపద కన్నులవిందు చేస్తూ ఉంటుంది. దానికితోడు యోగా, మసాజ్ సెంటర్లు కూడా ఉండటంతో మనసుతో పాటు శరీరానికి కూడా ఆహ్లాదమే!
చియాంగ్ మాయ్లో అతి పెద్ద జూ ఒకటి ఉంది. దీనిలో విస్తారమైన జంతు సంపద ఉంది. దాంతో జంతు ప్రేమికులకు మంచి టైమ్పాస్. దానికి తోడు ప్రత్యేకంగా ఎలిఫెంట్ నేచర్ పార్క ఒకటుంది. ఇక్కడ ఏనుగులను సంరక్షించడమే కాదు… మావటి కావాలనుకునే వారికి ట్రెయినింగ్ కూడా ఇస్తుంటారు. వైల్డ్ లైఫ్ టూర్ ప్యాకేజీలు ఉంటాయి. బుక్ చేసుకుంటే మొత్తం అన్నిటినీ ఒకేసారి చూసేయొచ్చు.
బో సంగ్ అనే ప్రాంతం హస్త కళలకు ప్రసిద్ధి. ఇక్కడ తొంభై తొమ్మిది శాతం మంది గొడుగుల తయారీదారులే. వీరు ఓ ప్రత్యేక పద్ధతిలో తయారుచేసే గొడుగులు విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి!
చియాంగ్ మాయ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. హైదరాబాద్ నుంచి అక్కడికి నేరుగా వెళ్లవచ్చు. సీజన్ను బట్టి మనిషికి ఇరవై నుంచి ముప్ఫై వేల వరకూ ఉంటుంది టిక్కెట్ వెల. వెళ్లేటప్పుడే రిటర్న్ టిక్కెట్ కూడా చేయించుకుంటే కాస్త తక్కువకు వచ్చే అవకాశం ఉంటుంది!
థాయ్ల్యాండ్ కరెన్సీని థాయి భట్ అంటారు. మన వంద రూపాయలు యాభై మూడు థాయి భట్స్కి సమానం!

ఫి ఫి ఐలాండ్స్ /Islands
థాయ్లాండ్… పర్యాటక స్వర్గాల్లో ఒకటైతే, ‘ఫి ఫి ఐలాండ్స్’ అందులో మరో అద్భుతం
ఫి ఫి ఐలాండ్స్… ఆరు ద్వీపాల కలయిక. వాటిల్లో ఇవి రెండూ పెద్దద్వీపాలు. మిగతా నాలుగు కేవలం బీచ్లకు ప్రత్యేకం. థాయ్లాండ్ దేశంలో దక్షిణం వైపు ఉంటాయి ఫిఫి దీవులు. స్వచ్ఛతకు మారుపేరైన అండమాన్ సముద్రంలో ఉండటం వల్ల ఈ దీవులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. విశ్రాంతికి పేరు గాంచిన ఈ దీవులు థాయ్లాండ్లోనే కాదు ప్రపంచంలోనే అందమైన దీవులు.
అందమైన సముద్రతీరాలు………
బీచ్లో తిరుగాడే రంగురంగుల చేపలను చూస్తూ బీచ్ ఒడ్డున లాంజర్ చెక్క కుర్చీల్లో కూల్డ్రింక్ తాగుతూ అలా సేదదీరటం ఓ గొప్ప అనుభూతి. బీచ్లను స్వచ్ఛంగా ఉంచటం అంత సులువు కాదు. కానీ, ఇక్కడ అలాంటి అరుదైన అనుభూతి దక్కుతుంది. వాటిలో లోపల తిరుగాడే అనేక రకాల, రంగుల చేపలు కనువిందు చేస్తూ ఆ నీటిలోంచి పైకి కనిపిస్తుంటాయి.
యాచ్ ట్రిప్…
ఈ దీవుల్లో మరో మంచి విశేషం యాచ్ ట్రిప్. ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఈ పొడవాటి పడవలు ఎక్కకుండా తిరిగి వెళ్లరు. వీటిలో ఓ రోజంతా ఆ ఆరు దీవులను చుట్టిరావడం ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఇవి ఖరీదు కూడా కాదు. వీటిని కొన్ని కంపెనీలు, హోటళ్లు, స్థానికులు నడుపుతారు. ఎవరికి నచ్చినవి వాళ్లు ఎంచుకోవచ్చు.స్థానికంగా ఉన్న గైడ్లును కూడా వెంటబెట్టుకుని వెళ
ఫి ఫి ఐలాండ్స్ చాలా చిన్న ప్రాంతమే కానీ ఒక నగరానికి ఉన్న లక్షణాలన్నీ ఉంటాయి. ఇక్కడ టూర్ను చాలా తక్కువ ఖర్చుతోనూ పూర్తి చేయొచ్చు. చాలా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టొచ్చు. ఇక్కడ టాటూ సంస్కృతి బాగా ఎక్కువ. ఏటీఎం సెంటర్లు కనిపించినంత ఎక్కువగా టాటూ సెంటర్లు కనిపిస్తాయి. మీకు ఏ టాటూ కావాలన్నా, ఏ పద్ధతిలో కావాలన్నా నిమిషాల్లో వేసి పంపించేస్తారు. ఒంటి మీద టాటూ పడితే మీరు ఫి ఫి పోయివచ్చినట్టన్నమాట.
క్రాబి టౌన్ పరిధిలోకి ఈ ద్వీపాలు వస్తాయి. వాటితో పాటు ప్రా నంగ్ బీచ్. పక్కనే ఒక పెద్ద కొండ, దాని మీద వేలాడే ఉద్యానవనాలు ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంటాయి. తెల్లటి ఇసుకతో బీచ్ మనోహరంగా ఉంటుంది. కాస్త రద్దీగా ఉన్నా విశాలమైన బీచ్ కావడం వల్ల మీకు ఏ ఇబ్బందీ ఉండదు. జలకాలాడటం వచ్చి ఇసుకలో కాసేపు సేదదీరడం మళ్లీ జలకాలాటకు పోవచ్చు. క్రాబి టౌన్లో సుమారు పది బీచ్లు ఉంటే అన్నీ నిమిషాల ప్రయాణం దూరంలోనే ఉంటాయి. కాబట్టి అన్ని తీరాలనూ కవర్ చేసి ఆనందించొచ్చు.
సామాన్యంగా మూడు కాలాలుంటే ఈ దీవుల్లో రెండే కాలాలుంటాయి. ఎండాకాలం, వానాకాలం. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎండాకాలం. మే నుంచి డిసెంబరు వరకు వానాకాలం. వాన పడనపుడు వెళ్తేనే మంచిది. ఉన్నది ఎక్కువగా బీచ్లే కాబట్టి పగలు సముద్రం దగ్గర, రాత్రి హోటల్లో ఉండొచ్చు. ఎండాకాలం వేడిగా ఏం ఉండదు. ఏకాలమైనా 22-32 డిగ్రీల మధ్య మాత్రమే ఇక్కడ ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఏ కాలం వెళ్లినా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. ఈ వేడి మన భారతీయులకు అయితే సుపరిచితమే. ఇక్కడ థాయ్ భట్ కరెన్సీ. మనవి రెండు రూపాయిలు వాళ్ల ఒక థాయ్భట్తో సమానం. కాబట్టి ఇండియన్లకు థాయ్టూర్ అంత ఖరీదైనది కాదు.
పుకెట్ నగరం
థాయ్లాండ్లో ప్రముఖ పర్యాటక ప్రదేశం పుకెట్ నగరం. ఆ దేశ ఏరోప్లేన్ బ్రాండ్ కూడా ఇదే. ఫి ఫి ఐలాండ్స్ ఈ పుకెట్ నుంచి కేవలం యాభై కిలోమీటర్లే. పుకెట్ దర్శనం కూడా ఫి ఫి ఐలాండ్స్ సందర్శనంతో పాటే అయిపోతుంది. పుకెట్ కూడా పెద్ద పర్యాటక ప్రదేశమే. అక్కడ అనేక ప్రకృతి దృశ్యాలుంటాయి. థాయ్ సంప్రదాయ దర్శనీయ స్థలాలుంటాయి.
ఫి ఫి ఐలాండ్స్ కు ఎలా వెళ్లాలి?
అందరికీ అందుబాటులో ఉన్న ప్రదేశం. ఇక్కడకు చేరుకోవడం చాలా సులువు. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్కు అయినా విమానంలో వెళ్లొచ్చు. నేరుగా ఫుకెట్ ఎయిర్పోర్ట్లో కూడా దిగొచ్చు. హైదరాబాదు నుంచి ఫుకెట్కు నేరుగా వెళ్లాలంటే రూ.14 వేల నుంచి ఫ్లైట్ టికెట్ మొదలవుతుంది. అక్కడి నుంచి బస్సు, కారు, బోటు ఇలా ఏ మార్గంలోనైనా వెళ్లవచ్చు తక్కువ ఖర్చులో వెళ్లిరాగల విదేశీ టూర్ ఇది.
సాధారణంగా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆటోలు, ట్యాక్సీలు అవసరం అవుతుంటాయి. కానీ ఇక్కడ వాటి అవసరమే రాదు. ఏ బీచ్ నుంచి ఏ బీచ్కు అయినా నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. చిన్న దీవులు కనుక ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా పెద్దగా ఉండవు. ఎక్కడ చూసినా తోక పడవలే కనిపిస్తాయి. వీటిని అందరితో కలిసి షేర్ చేసుకోవచ్చు. సొంతంగా గంటల్లెక్కన, రోజు లెక్కన అద్దెకు కూడా తీసుకోవచ్చు.

ధాయ్ ల్యాండ్ లో ఇంకా చూడ వలసినవి…..
Wat Arun బౌద్ధదేవాలయం బ్యాంకాక్ లోని Yai జిల్లాలో ఉంది.
Lumphini Park
Location :: 139/4 Thanon Witthayu, Khwaeng Lumphini, Khet Pathum Wan, Krung Thep Maha Nakhon 10330, Thailand
Jim Thompson House సెంట్రల్ బ్యాంకాక్ లోని మ్యూజియం
Location :: Rama I Rd, Khwaeng Wang Mai, Khet Pathum Wan, Krung Thep Maha Nakhon 10330
Dusit Zoo
it is the oldest zoo of Thailand, built by King Chulalongkorn Located at Khao Din Park in Bangkok’s
Siam Park City
Siam Park City is an amusement and water park in the Khan Na Yao district of Bangkok, Thailand.
Thonburi
is an area of modern Bangkok. During the era of the kingdom of Ayutthaya, its location on the right bank at the mouth of the Chao Phraya River had made it an important garrison town
Golden Buddha
The Golden Buddha, officially titled Phra Phuttha Maha Suwana Patimakon, is a gold statue, with a weight of 5.5 tons. It is located in the temple of Wat Traimit, Bangkok, Thailand. Location :: 951 Charoen Krung Rd, Talat Noi, Samphanthawong, Krung Thep Maha Nakhon 10100, Thailand
Erawan Shrine
The Erawan Shrine, formally the Thao Maha Phrom Shrine, is a Hindu shrine in Bangkok, Thailand, that houses a statue of Phra Phrom, the Thai representation of the Hindu god of creation Lord Brahma.
Location :: Lumphini, Pathum Wan, Bangkok 10260, Thailand
Giant Swing
The Giant Swing is a religious structure in Phra Nakhon, Bangkok, Thailand. Located in front of Wat Suthat, it was formerly used in an old Brahmin ceremony, and is one of Bangkok’s tourist attractions.
Wat Benchamabophit
Wat Benchamabophit Dusitvanaram is a Buddhist temple in the Dusit district of Bangkok, Thailand. Also known as the marble temple, it is one of Bangkok’s most beautiful temples and a major tourist attraction. Location :: 69 Khwaeng Dusit, Khet Dusit, Krung Thep Maha Nakhon 10300, Thailand
Wat Suthat
Wat Suthat Thepphaararam is a Buddhist temple in Bangkok, Thailand. It is a royal temple of the first grade, one of ten such temples in Bangkok. Construction was begun by King Rama I in 2350 BE Wat Mahathat Yuwaratrangsarit
Wat Mahathat Yuwaratrangsar it is a Buddhist temple in Bangkok, Thailand. It is one of the 10 royal temples of the highest class in Bangkok.
Bangkok Art and Culture Centre
Bangkok Art and Culture Centre is a contemporary arts centre in Bangkok, Thailand. Art, music, theatre, film, design and cultural/educational events take place in its exhibition and performance spaces.
Samutprakarn Crocodile Farm and Zoo
The Samutprakarn Crocodile Farm and Zoo is a crocodile zoo in Bangkok, Thailand. The park claims to hold the world’s largest crocodile in captivity, named Yai, measuring 6 m and weighing 1,114 kg
Chatuchak Park
Chatuchak Park is the name of a public park in Chatuchak district, Bangkok, Thailand. It is also the name of the MRT station that lies under the park. Chatuchak park is one of the oldest public parks in Bangkok.
Location :: Bangkok, จังหวัด กรุงเทพมหานคร 10900, Thailand
National Museum of Royal Barges
The National Museum of Royal Barges is a museum in Bangkok, Thailand. It is on the northern rim of Bangkok Noi canal in the Bangkok Noi District. Royal barges from the Royal Barge Procession are kept at the museum. Wikipedia Location :: 80/1 Arun Amarin Road, Krung Thep Maha Nakhon, Bangkok Noi 10700, Thailand
Wat Ratchanatdaram
Wat Ratchanatdaram is a buddhist temple located at the intersection between Ratchadamnoen Klang and Maha Chai Road, in Phra Nakhon district, Bangkok.Wikipedia Location :: Ratchadamnoen Klang Tai Alley, Khwaeng Wat Bowon Niwet, Wat Bawon Niwet, Krung Thep Maha Nakhon 10200, Thailand
Siriraj Medical Museum
The Siriraj Medical Museum, nicknamed the Museum of Death, is a medical museum in Bangkok, Thailand. Siriraj Medical Museum is open to the public and is a valuable resource for medical professionals and students. Wikipedia Location :: 2 Wanglung Road Khwaeng Siriraj, Khet Bangkok Noi, Krung Thep Maha Nakhon 10700, Thailand
King Rama IX Park
Large, lush green space featuring a jogging path, playground, lake with paddle boats and gardens. Location :: Dok Mai, Prawet, Bangkok 10250, Thailand
Bangkok Folk Museum
Bangkok Folk Museum, or Bangkokian Museum, is a museum in Bangkok, Thailand. It is located at Soi Charoen Krung 43, near the Sri Rat Expressway several hundred metres from the right bank of the Chao …
Location :: 271/2 Saphan Yao Alley, Khwaeng Si Phraya, Khet Bang Rak, Krung Thep Maha Nakhon 10500, Thailand
Kamthieng House Museum
The Kamthieng House Museum is a museum in Bangkok, run by the Siam Society under royal patronage. It is a 160-year-old traditional teakwood house from northern Thailand.
Location :: 30 Asok Montri Rd, Khwaeng Khlong Toei Nuea, Khet Watthana, Krung Thep Maha Nakhon 10110, Thailand
Chatuchak Weekend Market
The Chatuchak Weekend Market, on Kamphaeng Phet 2 Road, Chatuchak, Bangkok, is the largest market in Thailand. Also known as JJ Market, it has more than 8,000 stalls, divided into 27 sections. Location :: 587/10 Kamphaeng Phet 2 Rd, Khwaeng Chatuchak, Khet Chatuchak, Krung Thep Maha Nakhon 10900, Thailand
Dream World
Festive amusement park offering roller coasters and other rides, theater performances and restaurants.
Location :: Pathum Thani 12130, Thailand
Pratunam Market
Pratunam Market is one of Bangkok’s major markets, and is Thailand’s largest clothing market. The name Pratunam means “water gate”.
Location :: 869/15 Ratchaprarop Rd, Khwaeng Thanon Phaya Thai, Khet Ratchathewi, Krung Thep Maha Nakhon 10400, Thailand
Wat Pho
Wat Pho, also spelt Wat Po, is a Buddhist temple complex in the Phra Nakhon District, Bangkok, Thailand. It is on Rattanakosin Island, directly south of the Grand Palace.
Location :: 2 Sanamchai Road, Grand Palace Subdistrict, Pranakorn District, Bangkok 10200, Thailand
Sea Life Bangkok Ocean World
Sea Life Bangkok Ocean World is an aquarium in Bangkok, Thailand, the largest in South East Asia. It covers approximately 10,000 square meters with hundreds of different species on display in exhibits totaling about 5,000,000 liters.
Located in: SiamParagon Location :: 991 Rama 1 Road Khwaeng Pathum Wan, Khet Pathum Wan, Krung Thep Maha Nakhon 10330, Thailand
Rod Fai Night Market
Bustling outdoor night market specializing in antiques/vintage memorabilia, plus bars /eateries.
Location :: Thailand, Srinagarindra Road – Soi Srinagarindra 51, Nong Bon, Prawet, Bangkok 10250, Thailand
Patpong
Patpong is an entertainment district in Bangkok, Thailand, catering mainly, though not exclusively, to foreign tourists and expatriates.Wikipedia
Wat Trimitr
This historic temple features a gilded exterior, exhibitions and a massive golden statue of Buddha. Location :: 661 Tri Mit Rd, Khwaeng Talat Noi, Khet Samphanthawong, Krung Thep Maha Nakhon 10100, Thailand
Erawan Museum
Erawan Museum is a museum in Samut Prakan, Thailand. It is well known for its giant three-headed elephant art display.
Location :: 99/9 Moo 1 Bangmuangmai Amphoe Mueang Samut Prakan, Chang Wat Samut Prakan 10270, Thailand
Rattanakosin Island
Rattanakosin Island is a historic area in the Phra Nakhon District in the city of Bangkok, Thailand Jomtien Beach
Jomtien or Jomtien Beach, on road signs and road maps also often written Chom Tian, is a town on the east coast of the Gulf of Thailand about 165 km south-east of Bangkok in Chonburi Province
Sriracha Tiger Zoo
The Sriracha Tiger Zoo is a zoo in Sri Racha, a city on the outskirts of Pattaya, a seaside city in Chonburi Province, Thailand. It is about 97 km from Bangkok
Location :: 341 Amphoe Si Racha, Chang Wat Chon Buri 20110, Thailand
Ko Phai
is the largest island in Mu Ko Phai, a small uninhabited archipelago on the eastern seaboard of Thailand. It is about 21 km to the west of Pattaya. “Ko Phai” is the name of the island in the Royal Thai General System of Transcription
Ramayana Water Park
Ramayana Water Park — is a water park in Pattaya, which is 1.5 hours drive from Bangkok and 15 kilometers south of Pattaya City. It is one of the biggest water theme parks in Southeast Asia.
Location :: 9 Moo 7, Ban Yen Rd, Na Chom Thian, Sattahip, Chon Buri 20250, Thailand
Thailand tourism official website
https://www.tourismthailand.org

దుబాయ్

Dubai Tour: Top Tourist Attractions - Sakshi

దుబాయ్ ఎడారిదేశం… భానుడి ప్రతాపానికి తిరుగుండదు. చుక్క వాన కురవకపోయినా అద్భుతమైన పూలతోటల్నీ పెంచుతున్నారు. భూమ్మీద సముద్రాన్నీ, సముద్రంలో భూమినీ నిర్మించారు. ఎత్తైన కట్టడాలను ఆకాశంలోకి నిర్మించారు. నీటిలోని జంతుప్రదర్శనశాలలతో సాగర లోతుల్నీ చూపిస్తారు. మొత్తంగా ఎడారి జీవితాన్ని అద్భుతంగా తీర్చి దిద్దిన దుబాయ్… విలాసానికీ వినోదానికీ రాజరికానికీ రాజసానికీ నిలువెత్తు ప్రతిరూపం దుబాయ్. . బెల్లీ నృత్యానికి పేరుపొందిన దేశం దుబాయ్. రోడ్టు చక్కగా మెరుస్తూ ఉంటాయి

కార్నిచ్ బీచ్
అబుదాబిలోనే విలాసవంతమైన కార్నిచ్ బీచ్. అది సహజంగా ఏర్పడిన బీచ్ కాదు. సముద్రాన్ని కొంత దూరం మళ్లించిన నీటిపాయల వల్ల ఏర్పడిన బీచ్. తెల్లని ఇసుకనీ నీలి సముద్రాన్నీ చూస్తూ ఆనందించవచ్చు

అబుదాబి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజదాని అబుదాబి. పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరానికి ఆనుకుని ఉంటుందీ నగరం. రాజధాని కావడంతో అధికార కార్యాలయాలు ఎక్కువ. అన్నీ అద్దాల మేడలు, ఆకాశహార్మ్యాలు కనబడతాయి. ఎతిహాద్ టవర్స్, పైనాపిల్ బిల్డింగ్స్…వంటి ఆర్కిటెక్చర్ అద్భుతాలెన్నో కనిపిస్తాయి.

గ్రాండ్ మాస్క్ మసీదు
యూఏఈ జాతిపిత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహయాన్ స్వప్నమే ఈ మసీదు. ప్రపంచాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రార్థనా మందిరం నిర్మించబడింది. పదేళ్లపాటు మూడువేల మంది ఈ మసీదు నిర్మాణంలో పాల్గొన్నారు. ఇందులోని ప్రార్థనా మందిరంలో ఉన్న కార్పెట్, షాండ్లియర్స్ ఈ మసీదుకి ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన ప్రార్థనా మందిరం గోడమీద అల్లా 99 పేర్లు కనిపిస్తాయి. వందో పేరు అల్లాకే కనిపిస్తుందని అంటారు.

పామ్ జుమేరా బీచ్
ఈ బీచ్ మెట్రోలో ఖర్జూర చెట్టు ఆకారంలో నిర్మించిబడినది. పామ్ జుమేరా బీచ్ ప్రాంతం విలాసవంతమైన బీచ్ విల్లాలకు పెట్టింది పేరు. చిల్‌ ఈవినింగ్స్‌ను గడపాలనుకునే యూత్‌  మెచ్చే హ్యాంగవుట్‌ ప్లేస్‌. ఇండియన్, చైనీస్, థాయ్, జపనీస్, ఇటాలియన్, మెక్సికన్‌.. ఎన్నని చెప్తాం.. ప్రపంచంలోని అన్ని రుచులతో క్యుజైన్స్‌  ఘుమఘుమలాడుతుంటాయి. భారతీయ వంటకాలకు సంబంధించి ఇక్కడ బాంబే బంగ్లా ప్రసిద్ధి. ఈ రెస్టారెంట్‌ సెటప్‌ కూడా భారతీయ కోటను పోలి ఉంటుంది. ప్రతిరోజు ఆకాశంలో డ్రోన్స్‌ షో ఉంటుంది. షాపింగ్‌ ప్రియులకు ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్‌ ఉంటాయి. విందువినోదాలతో  జుమేరా బీచ్‌లో సాయంకాలాలను ఆనందంగా ఆస్వాదించవచ్చు.  దుబాయ్ లో మరొక ప్రధాన పర్యటక ప్రాంతం అల్ అరబ్ హోటల్ దగ్గర ఉన్న బీచ్.

దుబాయ్ బంగారానికీ సుగంధ ద్రవ్యాల వ్యాపారానికీ నిలయం. ఆసియా దేశాల నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలు ఇక్కడినుంచి ఆఫ్రికాకు ఎగుమతి అవుతుంటాయి. దుబాయ్ మార్కెట్ లో సుగంధ ద్రవ్యాలు రాశులుగా పోసి అమ్ముతారు. ఇతరదేశాలతో పోలిస్తే దుబాయ్ లో బంగారం ధర తక్కువ. ఆభరణ ప్రియులకి పండగే.

దుబాయ్ మ్యూజియం
అరబ్బుల జీవనశైలి, ఆచార వ్యవహారాలు, వాళ్లు ఎదిగినతీరు అన్నీ ఈ మ్యూజియంలో కనబడాతాయి. మెరీనా మాల్లోని జెయింట్ వీల్ ఎక్కి అబుదాబి నగర అందాలను చూడవచ్చు.

ఎడారి సఫారీ!
దుబాయ్, షార్జా జంట నగరాలు. షార్జా నుంచి 40 కిలోమీటర్ల దూరంలో డెజర్ట్ సఫారీ సెంటర్ ఉంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకూ ఈ సఫారీ ప్యాకేజీ సాగుతుంది. ల్యాండ్ క్రూయిజ్ కార్లలో సఫారీ మొదలౌతేంది. ఓ పక్క అప్పటివరకూ నిప్పులు కక్కి చల్లగా జారుకుంటున్న సూరీడు… దూరంగా ఎడారి ఓడల బారులు… ఇసుకతిన్నెలపై ప్రయాణిస్తూ కొండలూ లోయలూ… చూస్తూ ఆనందించవచ్చు. ఇసుకతిన్నెల మధ్యలో సూర్యాస్తమయం అద్భుతంగా ఉంది.

బుర్జ్ ఖలీఫా – ఎత్తైన నిర్మాణం!
ప్రపంచంలోకెల్లా ఎత్తైన నిర్మాణం బుర్జ్ ఖలీఫా. ఇది ఎక్కడానికి రుసుము చెల్లించాలి. దుబాయ్ డౌన్టౌన్ అభివృద్ధిలో భాగంగా ఈ బుర్జ్ ఖలీఫాను నిర్మించారు. 160 అంతస్తుల ఈ భవనంలో పర్యాటకులను 125 అంతస్తుల వరకూ అనుమతిస్తారు. కేవలం ఒక్క నిమిషంలోనే లిఫ్ట్ లో పైకి చేరుకోవచ్చు. ఎత్తైన స్విమ్మింగ్ ఫూల్, మసీదు, ఎత్తైన నైట్ క్లబ్… ఇలా పదికి పైగా రికార్డులు బుర్జ్ ఖలీఫాకు ఉన్నాయి దుబాయ్ మాల్లోని రెండంతస్తుల ఆ అక్వేరియంలో 4,800 జాతులకు పైగా జలచరాలు ఉంటాయి.

రెండు టవర్లను కలిపే వంతెనే ఆ స్కై డెక్‌. ఆ వంతెన పై నుంచి ఉత్తరం దిక్కు చూస్తే పాత దుబాయ్‌ అంతా దర్శనమిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఆయిల్‌ నిక్షేపాలను కనుగొనకముందున్న దుబాయ్‌.. సముద్రంలో ముత్యాలు, చేపల వేట వృత్తులుగా ఉన్న ప్రాంతం, దుకాణాలు, పరిశ్రమలు, ఇళ్లు, ఓ మోస్తరు మిద్దెలు, మేడలు, క్రీక్‌.. కనిపిస్తాయి.. 360 డిగ్రీల కోణంలో. దక్షిణం వైపు.. అదే 360 డిగ్రీల కోణంలో నవీన దుబాయ్‌ గ్లామర్, నిలువెత్తు ప్రగతి, ఠీవి కళ్లకు కడుతుంది. మధ్యలో గ్లాస్‌ వాక్‌వే ఉంటుంది. అంటే నడిచేదారి.. కిందికి చూస్తే పాత, కొత్త దుబాయ్‌ అంతా 360 డిగ్రీల కోణంలో మనల్ని వెంబడిస్తుంది. ఈ స్కై డెక్‌లో వర్తమాన దుబాయ్‌ పూర్వాపరాలన్నీ ఉంటాయి.

గ్లోబల్‌ విలేజ్‌
ఆ సాయంకాలం గ్లోబల్‌ విలేజ్‌కు వెళ్లాం. దునియా మొత్తం దుబాయ్‌ ముంగిట్లో ఉందా అనిపించే ఉత్సవం అది. ప్రపంచాన్ని ఒక గ్రామంగా చూపించే ఎగ్జిబిషన్‌. 78 దేశాల సంస్కృతులు, రుచులు, అభిరుచులు, ప్రత్యేకతలు, ఉత్పత్తులు ఆయా దేశాల పెవిలియన్స్‌ (గుడారాలు)లో ఆకర్షిస్తుంటాయి. నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు 159 రోజులు సాగే ఈ గ్లోబల్‌ విలేజ్‌కి ప్రతిరోజూ 45 వేల మంది సందర్శకులు హాజరవుతుంటారు. పదహారు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు చెందిన 3 వేల అయిదు వందల షాపులు (రెస్టారెంట్స్‌ను కలుపుకొని), అడ్వెంచర్‌ గేమ్స్, అమ్యూజ్‌మెంట్‌ పార్క్స్, మ్యూజియంలు, టీ కొట్లు, కెఫ్టీరియాలతోపాటు నాటకాలు, న్యత్యాలకు వేదికలూ కొలువుతీరి ఉన్నాయి. అయితే దేశాలకు ప్రాతినిధ్యం వహించే వాటిని దుకాణాలు అనకుండా పెవిలియన్స్‌ అంటారు. అలా అన్నిట్లోకి ఇండియాదే అతి పెద్ద పెవిలియన్‌. మన దేశానికి సంబంధించి 250 షాపులున్నాయక్కడ. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటిగంట దాకా ఉంటుంది. 92 దేశాలకు చెందిన పదివేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తుంటారు. 1997లో ప్రారంభమైన ఈ గ్లోబల్‌ విలేజ్‌కి 2021 సిల్వర్‌ జుబ్లీ ఇయర్‌. ఈ పాతికేళ్లలో ఒక్క ఏడు కూడా విరామం తీసుకోలేదు. ప్రతి సోమవారం మహిళలు, ఫ్యామిలీ స్పెషల్‌గా ఉంటుందీ గ్లోబల్‌ విలేజ్‌. 

దుబాయ్ పార్కులు
అబుదాబి నుంచి దుబాయ్ కు వెళ్లే షేక్ జాయెద్ రహదారి పక్కన ఈ పార్కులు ఉన్నాయి. మోషన్ గేట్, లెగో ల్యాండ్, బాలీవుడ్ పార్కు మూడింటినీ కలిపి దుబాయ్ పార్కులు అంటారు. బాలీవుడ్ పార్కు అంతా హిందీ సినిమాలోకం. సల్మాన్, అమితాబ్ డూప్ల నృత్యాలు ఆకట్టుకుంటాయి
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లవచ్చు.

What are the mind-blowing facts about Dubai?

1. According to the Guinness Book of World Records, the Dubai Mall is the largest mall in the world in terms of total area

2. The Palm Islands in Dubai are some of the world’s largest man-made islands.

3. There are no rivers in the entire country.

4. Because of a growth boom in 2009, much of Dubai was not connected to the city’s sewer system yet. Excrement and waste had to be hauled away in trucks.

5. The world’s largest indoor theme park is in Abu Dhabi. It is owned by Ferrari and is home to the Formula Rossa, the world’s fastest roller coaster.

6. In order to keep up with the kinds of cars that people drive in the UAE, the police force uses Lamborghinis, Bentleys, and Ferraris.

7. In the UAE, if you want to drink alcohol (even in your own home) you need to get a license.

8. Abu Dhabi is building a city that will be entirely powered by solar energy (Masdar City).

9. From a total populace of over 9 million individuals, only 1.4 million are people. The others tend to be employees from overseas (usually Asia) which have visited make their particular fortunes. This means almost 90percent of this populace is international.

10. Abu Dhabi has the majority of the Chrysler Building in New york.

11.Dubai, United Arab Emirates – 1980´s and today.

మానస సరోవరం మరియు కైలాస పర్వత యాత్ర

mansarovar

సాక్షాత్తు శివుడు కొలువైన ఆ కైలాస పర్వతాన్ని, దేవతల సరస్సుగా భావించే మానస సరోవరాన్నీ చూడాల్సిందే తప్ప వర్ణించటం వీలుకాదు.
మానస సరోవరం, కైలాస శిఖరం రెండూ టిబెట్‌లోనే ఉన్నాయి.
భారతీయులకు, నేపాలీలకు, టిబెటన్లకు మానససరోవరం ఓ పవిత్రవైన స్థలం. మానససరోవరంలోని మంచినీరు ప్రపంచంలోనే స్వచ్ఛమైన జలంగా పేరుపొందినది. ఈ సరోవరంలో తిరిగే తెల్లని హంసలు చూపరులకు కనువిందు చేస్తాయి.
టిబెట్‌ ఓ ఎత్తైన పీఠభూమి. ప్రస్తుతం టిబెట్ చైనా వారి ఆక్రమణలో ఉన్నది. అక్కడ పగలు ఎండా, రాత్రి చలీ విపరీతంగా ఉంటాయి.
మానససరోవరం వెళ్లాలంటే ముందుగా నేపాల్ లోని లఖ్‌నవూకి వెళ్లాలి. అక్కడి నుండి ట్రావెల్‌ ఏజెన్సీ వాళ్లు నేపాల్‌ గంజ్‌కు తీసుకువెళతారు. నేపాల్‌ గంజ్‌ కు నాలుగు గంటల రోడ్డు ప్రయాణం. అన్ని సౌకర్యాలూ ఉన్న హోటల్‌ గదులు ఇక్కడ ఉంటాయి.. నేపాల్‌ గంజ్‌లో శక్తిపీఠంగా పిలవబడే భాగేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది.
దేవలోకం!
మానస సరోవరంలోని పవిత్ర జలాలను తాకాలనే సంకల్పం ఉంటే సరిపోదు. ఓపిక, సహనం ఉండాలి. కష్టాలను తట్టుకోవాలి. ఊహించని వాతావరణ పరిస్థితులు, మంచుగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఎగుడు దిగుడు పర్వతాల మీదుగా యాత్రంతా సాహసోపేతంగా సాగిపోతుంటుంది
టిబెట్‌ పీఠభూమిలోని సరస్సులన్నీ ఉప్పునీటి సరస్సులే కాని.. మానస సరోవరం మాత్రం పూర్తిగా మంచినీటి సరస్సే. దీనికి సమీపంలో ఉన్న రాక్షస్‌తాళ్‌ కూడా ఉప్పునీటి సరస్సే.
మానస సరోవర్‌ లోతు 300 అడుగులు. పరిధి సుమారు 90 కిలోమీటర్లు. ఉపరితల విస్తీర్ణం 320 చదరపు కిలోమీటర్లు. ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఇదొకటి.
మానస సరోవరం… ఆసియాలోని పలు దేశాలకు జీవనదులైన.. సింధు, సట్లెజ్‌, బ్రహ్మపుత్ర, కర్నాలి (గంగానదికి ఉపనది) పుట్టినిల్లు.
అక్కడనుండి హిల్‌సా అనే గ్రామానికి వెళ్లవలసి ఉంటుంది. ఈ గ్రామం సముద్ర మట్టానికి 3640 మీ. ఎత్తులో నేపాల్‌కీ టిబెట్‌కీ సరిహద్దులో ఉంది. చుట్టూ కొండలూ వాటిమధ్యలోంచి పారే సెలయేర్లూ… ఆ ప్రదేశం ఎంతో మనోహరంగా ఉంటుంది.
ఈ వాతావరణంలో ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌ కారణంగా తలనొప్పి వస్తుంది. అది తగ్గాలంటే డయామాక్స్‌ మాత్రలు వేసుకోవాలి.
మానస సరోవరం!
తరువాత హిల్‌సా నుంచి సరిహద్దు దాటి చైనాలోకి వెళ్లాల్సి ఉంటుంది. యాత్రా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ చేస్తారు. ఈ యాత్రకు పాస్‌పోర్టు తప్పనిసరి. ప్రభుత్వంతోబాటు ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి, మన పాస్‌పోర్టును వాళ్లకు పంపిస్తే, వాళ్లే చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. అదే గతంలో అయితే ప్రభుత్వం మాత్రమే కైలాసమానస సరోవర యాత్రను నిర్వహించేది.
చైనా ఇమిగ్రేషన్‌ చాలా కఠినం. అక్కడినుండి నాలుగు చెక్‌పాయింట్లు దాటి తకలా కోట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ తకలా కోట్‌ సముద్ర మట్టానికి 4025 మీ. పైన ఉంది. అక్కడ మన రూపాయల్ని చైనా యెన్‌ల్లోకి మార్చుకోవాలి. మళ్లీ ఓ చెక్‌ పాయింట్‌ దాట వలసి ఉంటుంది. దారిలో ముందుగా రాక్షస స్థల్‌ అనే ప్రాంతం వస్తుంది. ఇది రావణాసురుడు సృష్టించుకున్న ఓ పెద్ద సరోవరం అని చెబుతారు.
ఇది మానస సరోవరానికి పడమర దిక్కుగానూ కైలాసానికి దక్షిణంగానూ ఉంటుంది.
అక్కడి నుంచి మానస సరోవరం 23కి.మీ. దూరంలో ఉంది.. నీలం రంగులో ఎంతో ప్రశాంతంగా ఉంటుందీ సరస్సు. సుమారు 88 కి.మీ. చుట్టుకొలత ఉంటుంది. మానససరోవరంలో స్నానం చేయటం ఓ అదృష్టంగా భావిస్తారు.
సరోవరంలో నీరు చాలా చల్లగా తేటగా మెరుస్తుంటాయి. టూర్ నిర్వాహకులు సమీపంలోనే సుమారు 20 అడుగుల దూరంలోనే గుడారాలు వేసి వసతి ఏర్పాట్లు చేస్తారు.

రాత్రివేళలో రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో ఈ సరోవరానికి దేవతలూ గంధర్వులూ యక్షులూ స్నానాలు చేయడానికి వస్తారనీ వీళ్లు నక్షత్ర కాంతి మాదిరిగా కనిపిస్తారనీ పురాణాల్లో చెబుతుంటారు. ఈ సమయంలో చూస్తే సరోవరానికి అవతలి వైపునా సరోవరం మధ్యలోనూ ఆకాశంలోంచి సరోవరంలోకి దిగుతున్నట్లు నక్షత్ర కాంతులు కనిపిస్తాయి.
తరువాత చూడవలసినది కైలాస పర్వతం ఈ దారిలో యమ ద్వారం వస్తుంది. ఇక్కడ వచ్చిన వారు అందరూ తమ పితృదేవతల్ని స్మరించుకుని, నమస్కరిస్తారు. అక్కడి నుంచే కైలాస పర్వత దర్శనం చేసుకోవచ్చు. కైలాస పర్వతంమీద మాత్రమే మంచు కనిపిస్తుంది. పక్కనే అదే ఎత్తులో ఉన్న కొండలమీద ఎలాంటి మంచూ కనిపించదు. ఎంతో చిత్రంగా అనిపిస్తుంది.
కైలాస పర్వతం చుట్టూ పరిక్రమణ చేస్తే దేవతల లోయనీ, శివస్థల్‌, గౌరీకుండ్‌… వంటి ప్రదేశాలన్నీ కనిపిస్తాయంటారు.

కైలాసగిరి.

Image

ఈ పర్వతం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకు, టిబెట్‌లోని ప్రధాన మతాచారమైన బోన్‌లకు, జైనులకు కూడా అత్యంత పవిత్రమైనది. ప్రపంచ దేశాల నుంచి ఏటా వేలమంది యాత్రికులు, పర్యాటకులు కైలాస, మానస సరోవర సందర్శనకు వస్తుంటారు.

కైలాస పర్వతంపై ప్రత్యేక కోణంలో సూర్యుని వెలుగు పడినప్పుడు కైలాస పర్వతం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది… అలా కొన్ని క్షణాల పాటు మాత్రమే కనిపిస్తుంది… ఇది కూడా కొన్ని ప్రత్యేక రోజులలో మాత్రమే… అలాంటి సమయంలో కైలాస పర్వతాన్ని దర్శించడం… అదృష్టం…    

ఈ రోజు వరకు ఎవరూ కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేదు?  

హిందూ మతంలో కైలాస పర్వతం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది, ఎందుకంటే ఇది శివుని నివాసంగా పరిగణించబడుతుంది. అయితే దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని ఎత్తైన శిఖరం అయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటివరకు 7000 మందికి పైగా ప్రజలు అధిరోహించారు, ఇది 8848 మీటర్ల ఎత్తులో ఉంది, కానీ, ఈ రోజు వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు, దాని ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే 2000 మీటర్లు తక్కువ అంటే 6638 మీటర్లు. ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది.   మీడియా నివేదికల ప్రకారం, ఒక పర్వతారోహకుడు తన పుస్తకంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడని వ్రాశాడు, కాని ఈ పర్వతం మీద ఉండడం అసాధ్యం, ఎందుకంటే అక్కడ శరీర జుట్టు మరియు గోర్లు వేగంగా పెరగడం ప్రారంభిస్తాయి. ఇది కాకుండా, కైలాస పర్వతం కూడా చాలా రేడియోధార్మికత కలిగి ఉంది.   కైలాస పర్వతం ఎక్కలేకపోవడం వెనుక చాలా కథలు ఉన్నాయి. శివుడు కైలాస పర్వతం మీద నివసిస్తున్నాడని, అందువల్ల జీవించే వ్యక్తి అక్కడికి చేరుకోలేడని కొంతమంది నమ్ముతారు. కైలాస శిఖరాన్ని మరణం తరువాత మాత్రమే లేదా ఎప్పుడూ పాపం చేయని వ్యక్తి మాత్రమే అధిరోహించగలడు.   కైలాష్ పర్వతం మీదుగా కొంచెం ఎక్కిన వెంటనే ఆ వ్యక్తి దిక్కులేనివాడు అవుతాడని కూడా నమ్ముతారు. దిశ లేకుండా ఎక్కడం అంటే మరణం మీద విందు చేయడం, అందుకే ఇప్పటివరకు ఏ మానవుడు కైలాస పర్వతం ఎక్కలేదు.   1999 లో, రష్యన్ శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వతం క్రింద ఒక నెల పాటు ఉండి దాని పరిమాణం గురించి పరిశోధించింది. ఈ పర్వతం యొక్క త్రిభుజాకార ఆకారం సహజమైనది కాదని, మంచుతో కప్పబడిన పిరమిడ్ అని శాస్త్రవేత్తలు తెలిపారు. కైలాస పర్వతాన్ని “శివ పిరమిడ్” అని కూడా పిలుస్తారు.   ఈ పర్వతం ఎక్కడానికి బయలుదేరిన వారెవరైనా చనిపోయారు, లేదా ఎక్కకుండా తిరిగి వచ్చారు.   2007 లో, రష్యన్ అధిరోహకుడు సెర్గీ సిస్టికోవ్ తన బృందంతో కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించాడు. సెర్గీ తన అనుభవాన్ని ఇలా వివరించాడు: “కొంత దూరం ఎక్కడం నా తలపై మరియు మొత్తం జట్టులో తీవ్రమైన నొప్పిని కలిగించింది. అప్పుడు మా అడుగులు సమాధానం ఇచ్చాయి. నా దవడ కండరాలు సాగడం ప్రారంభించాయి, మరియు నాలుక స్తంభింపజేసింది. నోటి నుండి శబ్దాలు రావడం ఆగిపోయింది. ఎక్కేటప్పుడు, ఈ పర్వతం ఎక్కడానికి నేను సరిపోనని గ్రహించాను. నేను వెంటనే టేకాఫ్ చేయడం మొదలుపెట్టాను, అప్పుడు నాకు విశ్రాంతి వచ్చింది.   “కల్నల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు, అతను ఇలా వివరించాడు:” నేను శిఖరానికి చేరుకోవడానికి కొంచెం మార్గం చూసిన వెంటనే, మంచు కురుస్తుంది. మరియు ప్రతిసారీ నేను బేస్ క్యాంప్‌కు తిరిగి రావలసి వచ్చింది. “అప్పుడు చైనా ప్రభుత్వం కొంతమంది అధిరోహకులను కైలాస శిఖరాన్ని ఎక్కమని కోరింది. అయితే ఈసారి ప్రపంచం మొత్తం ఈ చైనా చేష్టలను  వ్యతిరేకించడంతో చైనా ప్రభుత్వం ఈ పర్వతం ఎక్కడం మానేసింది. అతను ఎక్కడానికి ప్రయత్నిస్తాడు, అతను ఎక్కలేకపోతున్నాడు, అతని గుండె మారుతుంది. గాలిలో ఏదో భిన్నంగా ఉంటుంది. మీ జుట్టు మరియు గోర్లు 2 రోజుల్లో పెరుగుతాయి, ఇది 2 వారాలలో పెరుగుతుంది. కనిపిస్తోంది. వృద్ధాప్యం ముఖం మీద కనిపించడం ప్రారంభిస్తుంది. కైలాస శిఖరం ఎక్కడం క్రీడ కాదు.   29,000 అడుగులకు పెరిగిన తర్వాత కూడా ఎవరెస్ట్ ఎక్కడం సాంకేతికంగా సులభం. కానీ కైలాస పర్వతం ఎక్కడానికి మార్గం లేదు. నిటారుగా ఉన్న రాళ్ళు మరియు మంచుకొండలతో చేసిన కైలాష్ పర్వతాన్ని చేరుకోవడానికి మార్గం లేదు. అతి పెద్ద అధిరోహకులు కూడా ఇలాంటి కష్టతరమైన రాళ్ళను ఎక్కడానికి మోకరిస్తారు.ప్రతి సంవత్సరం లక్షలాది మంది కైలాష్ పర్వతం చుట్టూ కక్ష్యలోకి వస్తారు. మార్గంలో, మానస సరోవరంను కూడా సందర్శిస్తాడు, కాని ఈ రోజు వరకు ఒక విషయం మిస్టరీగా మిగిలిపోయింది. ఈ పర్వతం తగినంతగా తెలిస్తే, ఈ రోజు వరకు ఎవరూ ఎందుకు ఎక్కలేదు?

కైలాస శిఖరం ఉత్తరభాగం దగ్గరగా

మానససరోవరం చూడాలంటే ఆరోగ్యవంతులై ఉండాలి. అక్కడి వాతావరణానికి తట్టుకోవాలి. 4000 మీటర్ల ఎత్తులో శ్వాస అందటం కష్టంగా ఉంటుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి రావచ్చు. డాక్టర్ సలహాతో మందులు దగ్గర ఉంచుకోవటం తప్పనిసరి
పగలు తేలికైన నూలు దుస్తులూ రాత్రివేళలో ధరించడానికి ఉన్ని దుస్తులూ కావాలి. ముఖ్యంగా కైలాస పర్వత పరిక్రమణ చేయాలనుకునేవాళ్లు సన్‌స్క్రీన్‌తోబాటు, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులూ బ్యాండేజీలూ దగ్గర ఉంచుకోవాలి. యాత్రకు అవసరమైన మందులూ, థెర్మల్‌ దుస్తులూ, నూలుదుస్తులూ, షూ, గ్లోవ్స్‌… అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వంవారు నిర్వహించే అన్ని శారీరక వైద్య పరీక్షలలో నెగ్గాలి. ఉబ్బసం, సైనస్, అంగవైకల్యం, గుండెజబ్బులు, మధుమేహం ఉన్నవారిని అనుమతించరు.
కేంద్ర ప్రభుత్వంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా కైలాస యాత్ర జరుగుతుంది.
పాస్‌పోర్టు, ఫొటోలు, ఇతర వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది చాలా సుదీర్ఘంగా, సంక్లిష్టంగా సాగే ప్రక్రియ. జూన్‌లో జరిగే యాత్రకు మార్చిలోనే గడువు ముగుస్తుంది. యాత్రికులను కంప్యూటర్‌ లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. రూ. 1,60,000 చెల్లించాలి. మొత్తం ఖర్చు రూ.2 లక్షలు దాటుతుంది. (2018)
ప్రైవేటు యాత్రా సంస్థలు కైలాసయాత్ర మొదలుపెట్టాక యాత్రికుల సంఖ్య పెరిగింది. వీరు ఎక్కువగా నేపాల్‌ మీదుగా యాత్ర నిర్వహిస్తుంటారు. ప్యాకేజీ ధరలు రూ.1.80 లక్షల నుంచి 2.50 లక్షల వరకు ఉన్నాయి.
అన్ని యాత్రలలాగే మానస సరోవరం వెళ్లాలంటే కుదరదు. తప్పనిసరిగా పాస్ పోర్ట్ ఉండాలి. ప్రభుత్వ అనుమతులు తప్పని సరి. చైనా ప్రభుత్వ అనుమతి కూడా తప్పనిసరి. ఈ అనుమతులు యాత్రా నిర్వాహకులు లేక ప్రభుత్వం వారే తీసుకుంటారు. భారతప్రభుత్వం వారు మరియు ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఈ యాత్రలు నిర్వహిస్తారు. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారత ప్రభుత్వం ద్వారా వెళ్లాలంటే పూర్తి వివరాలకోసం ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి. లేక మీకు దగ్గరలోని యాత్రా నిర్వాహకులను సంప్రదించండి.
How to apply Manasarovar-Click here