సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన ‘ఎవర్ గివెన్’ షిప్‌ను బయటికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
దీనికి రోజులు లేదంటే వారాలు కూడా పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ షిప్ తైవాన్‌లోని ‘ఎవర్గ్రీన్ మెరైన్’ అనే సంస్థకు చెందినది. సూయజ్ కాలువలోని దక్షిణపు ఒడ్డువైపున ఇది ఇసుకలో కూరుకుపోయింది. ఇది కాలువకు అడ్డంగా ఉండటంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన అనేక నౌకలు ఆగిపోయాయి. దీంతో సరకు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోజుకు సుమారు 9.6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 70 వేల కోట్ల నష్టం జరుగుతోందని అంచనా వేస్తున్నారు.
నౌక చుట్టూ ఉన్న ఇసుకను తవ్వుతున్నారు.
కాలువ రెండు తీరాలను తాకుతూ షిప్ ఆగిపోవడంతో దానిని బైటికి తీసుకురావడం కష్టమవుతోందని క్యాంప్‌బెల్ యూనివర్సిటీ మారిటైమ్ హిస్టరీలో నిపుణుడు సాల్ మెర్కోగ్లియానో అన్నారు.
ఎవర్ గివెన్‌లాంటి పెద్ద ఓడలు ప్రయాణించేందుకు వీలుగా 2015లో సూయజ్ కెనాల్‌ను విస్తరించారు.
ఇంగ్లాండ్ ని వేల్స్ ని కలిపితే బ్రిటన్ అంటారు. బ్రిటన్ కి స్కాట్లాండ్ ని కలిపితే గ్రేట్ బ్రిటన్. గ్రేట్ బ్రిటన్ కి నార్త్ ఐర్లాండ్ కలిపితే యునైటెడ్ కింగ్డమ్
China erected a construction that is so massive that it slows the rotation of the earth!
The 3 Gorges Dam is capable of building the inflowing Yangtze River up 175 meters (575 foot) above sea level. This humongous wall of water eventually alteres the Earth’s moment of inertia causing the rotation to become slower. The construction of the dam redistributed billions of tons of water to a higher altitude, which is the same principle in effect with figure skaters when they close their arms in a jump to spin faster. It also makes the earth slightly more round in the middle and flat on the poles.
NASA has calculated that the dam slows the rotation by 0.06 microseconds, which is six hundredths of a millionth of a second. While that doesn´t sound much, think about what any other manmade building that can claim to have an effect on the planets rotation that is actually measurable? As a matter of fact, other influences constantly make our planets rotation slightly change pace, event slike earthquakes, the moon, or even the climate change e.g in the arctic.
However, a hundredth of a microsecond is not much and one would need to build tens of thousands of similar sized dams to make a change in time perceptible to humans. When it comes to cosmic measures though the tinest and the largest are worth to be observed and since this is manmade it´s truly a feat for the ages.
The 3 Gorges Dam in Hubei province was the world’s largest electricity-generating plant of any kind til 2016 when it got surpassed by the Itaipu Dam, located between Brasil and Paraguay. The 3 Gorges Dam still produces more energy though. It was first ideated in 1919 but building start not earlier than in 1994 and eventually put in operation in 2003.
When the project was constructed, almost1.2 million people were forced to relocate and find new homes. Actually to government build new settlements around the dams area. Eventually 140 villages, 13 cities, and 1,600 settlements including historic sights were lost when the dam was put in operation.
Where there is shadow ther eis light too so you now find 6,400 plant species, 3,400 insect species, 300 fish species, and more than 500 terrestrial vertebrate species in the proximity of the dams ecosystem.
Use material: Concrete and steel – It was enough steel to build Eiffel tower 63 times!
These Countries are extended in two contients….. so, they are called as Trans Continental Countries…
Country Name Egypt…………….. Extended in Africa and Asia Country Name Turkey……………… Extended in Africa and Asia Country Name Russia ………………. Extended in Asia and Europe Country Name Kazakistan ………. Extended in Asia and Europe Country Name Gergoia…………….. Extended in Asia and Europea Country Name Azerbaizan ………. Extended in Asia and Europe Country Name Panama ……………. Extended in North and South America Country Name Greece…………… Extended in Asia and Europe Country Name Indonesia ………. Extended in Asia and Australia Country Name Chile…………………. Extended in South America and Antarkita
These Countries are not Independent countries so, they are treated as territories only. And they are depended on another country
Territory….Anguilla ……. Depended on….. UK Territory…. Aruba ………. Depended on….. Netherlands Territory…. Bermuda ………. Depended on….. UK Territory…. Bonaire ………. Depended on….. Netherlands Territory…. Virgin Islands ………. Depended on….. UK Territory…. Cayman Islands ………. Depended on….. UK Territory…. Clipperton Island ………. Depended on….. France Territory…. Curacao ………. Depended on….. Netherlands Territory…. Martinique ………. Depended on….. France Territory…. Depended on….. UK Territory…. Navassa Island ………. Depended on….. USA Territory….Puerto Rico ………. Depended on….. USA Territory…. Saba ………. Depended on….. Netherlands Territory…. Saint Barthelemy ………. Depended on….. France Territory…. Saint Martin ………. Depended on….. France Territory…. Saint Pierre and Miquelon ………. Depended on….. France Territory…. Sint Eustatius ………. Depended on….. Netherlands Territory…. Sint Maarten ………. Depended on….. Netherlands Territory…. Turks and Caicos Islands ………. Depended on….. UK Territory…. US Virgin Islands ………. Depended on….. USA
Capital Buenos Aires ………. Language Spanish ………. Currency Peso ………. Calling Code + 54 ………. Religion Catholicisim
అర్జెంటీనా
దక్షిణ అమెరికాలో దక్షిణ భాగాన ఉన్న స్వతంత్ర రాజ్యం అర్జెంటీనా. వెండి ఖనిజం ఎక్కవగా లభ్యత ఉండడంతో ఈ దేశానికి అర్జెంటీనా అనే పేరు వచ్చింది. ఈ దేశ విస్తీర్ణం 27,66,890 చ.కి.మీ. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఐరీస్. ఈ దేశంలో అధికార భాష స్పానిష్. ప్రజలు ఎక్కువగా క్రైస్తవ మతస్తులు. యూరోపియన్ జాతుల వారు 85 శాతం మంది, మెస్టిజోలు 15 శాతం మంది ఉన్నారు. ఈ దేశంలో వెండి పుష్కలంగా లభిస్తుంది. బంగారం, యూరేనియం, అంటిమనీ, జింకు అర్జెంటీనాలో లభించే ఇతర ఖనిజాలు ఈ దేశంలో ఉన్న పంపా మైదానాలు ఎక్కువ సారవంతం కావటం వలన రైతాంగం రసాయనిక ఎరువుల అవసరం లేకుండా పంటలు పండిస్తారు. నిమ్మ, నారింజ, మొక్కజొన్న, చెరకు, సోయా, పొద్దు తిరుగుడు, ద్రాక్ష, జొన్న, బంగాళాదుంపలు, రైధాన్యం, గోధుమలను పండిస్తారు. గొర్రెల పెంపకం ఉంది. ఇక పరిశ్రమలలో జవుళీ పరిశ్రమ, మాంసం, తోలు, ఉన్ని, కలపసామాగ్రి, గాజు, ఇనుము, బొగ్గు, పెట్రోలు, వెండి, బంగారుం, యురేనియం, సీసం మొదలగు పరిశ్రమలు ఉన్నాయి.
Country : Bolivia
Capital Sucre, La Paz ………. Language 37 languages ………. Currency Boliviano ………. Calling Code + 591 ………. Religion Roman Catholic
బొలీవియా
బొలీవియా దేశం దక్షిణ అమెరికా ఖండపు మధ్య ప్రాంతంలో ఉంటుంది. ఎరుపు రంగు సైనికుల ధైర్యానికి సూచిక, ఆకుపచ్చరంగు సారవంతమైన లక్షణానికి, పసుపు ఖనిజ సంపదకు గుర్తు. బొలీవియా రాజధాని సుక్రె, జనాభా 1,14,10,651, విస్తీర్ణం 10,98,581 చదరపు కిలోమీటర్లు, భాషలు స్పానిష్, క్వెచువా, అయిమారా, కరెన్సీ బొలీవియానొ ఈ దేశంలో 30 అధికారిక భాషలున్నాయి. ఆగస్ట్ 6, 1825 సంవత్సరంలో స్పెయిన్ దేశం నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశం క్రిస్టియన్ దేశం. ప్రజలలో 95 శాతం మంది రోమన్ కేధలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రెండు నగరాలు ఈ దేశంలోనే ఉన్నాయి. ఒకటి పోటోస్, రెండోది లా పాజ్నగరం. లాపాజ్‌కు దగ్గర్లో ఉండే ‘కమినో డె లాస్యుంగస్రోడ్డు’ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. ఈ రహదారిపై ఏటా వందలాది ప్రమాదాలు జరుగుతాయి. ప్రపంచంలోనే ఎత్తయిన ‘టిటికాకా’ సరస్సు ఈ దేశంలోనే ఉన్నది. సముద్ర మట్టానికి 3,810 మీటర్ల ఎత్తున్న ఈ సరస్సును దాటడానికి ఆరు గంటల సమయం పడుతుంది. అత్యంత లోతైన సరస్సుల్లో ఇదీ ఒకటి. . ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఇనుప ఖనిజాల నిల్వలు ఉన్నాయి. మొట్టమొదటి అధ్యక్షుడు సైమన్బొలీవర్పేరు మీదుగా ఈ దేశానికి బొలీవియా అని పెట్టారు.ప్రపంచంలోనే అతి పెద్ద సీతాకోక చిలుకల సంరక్షణ కేంద్రం ఇక్కడే ఉంది. అత్యంత తడిగా ఉండే ప్రాంతమిది. ఎందుకంటే ఏడాదిలో భారీగా ఎనిమిది మీటర్లకుపైగా వర్షపాతం కురుస్తుంది. . ‘సలార్డి ఉయుని’ పేరిట ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు క్షేత్రం ఉంది. ఉప్పు ఎడారిగా పిలిచే ఈ ప్రదేశం 11 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు 64 మిలియన్‌టన్నుల ఉప్పు ఉంటుంది. పాలాసియోడి సాల్పేరిట ఇక్కడ అచ్చంగా ఉప్పుతో కట్టిన హోటల్ఉంటుంది. ఈ వింతప్రాంతాన్ని చూడ్డానికి ఏటా లక్షల్లో సందర్శకులు వస్తుంటారు. . సోయాబీన్స్, కాఫీ, కోకో, ప్రత్తి, మొక్కజొన్న, చెరకు, వరి, బంగాళాదుంపలు పండిస్తారు.కలప లభ్యత కలదు. సహజవాయివు, పెట్రోలియం, జింక్, టంగ్ స్టన్, వెండి, ఇనుము, సీసం, బంగారం, కలప, హైడ్రోపవర్ సహజ సంపదలు.
Country : Brazil
Capital Brasília ………. Language Portuguese ………. Currency Real ………. Calling Code + 55 ………. Religion Roman Catholism
బ్రెజిల్..
బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖంఢంలోని ఒక స్వతంత్ర గణ రాజ్యం. లాటిన్ అమెరికా దేశాలలో పెద్దది. పోర్చుగల్ వలసరాజ్యంగా ఉండి 1889 సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 85,11,965 చ.కి.మీ. రాజధాని బ్రసీలియా నగరం. వీరి అధికార భాష పోర్చుగీసు. ప్రజలు మెస్టిజో, రెడ్ ఇండియన్ తెగలవారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. పూర్వ రియోడిజ నీరోలో ఉండే రాజధానిని కొత్తగా నిర్మించిన బ్రసీలియాకు 1960 సంవత్సరంలో మార్చారు. ఈ దేశంలో అమెజాన్ నది పెద్దది. దీని పరివాహక ప్రాంతం ఎక్కువ. బ్రూనో నది, గ్రాండ్ నది, మదీరా నది, నీగ్రో నది, పారణ నది, ఫ్రాన్సిస్కో నది, టాపోజీస్ నది, టోకాన్టిన్స్ నది, ఉరుగ్వే నది, జింగూనది ఇతర జలవనరులు. దేశంలో ఎక్కువభాగం కీకారణ్యాలతో కూడి ఉంది. సాగునేల ఎక్కువ. ఇంత ఎక్కువగా సహజసంపద ఉన్నప్పటికీ ప్రజలు ఐదింట ఒక భాగాన్నే ఉపయోగించుకుంటారు. అయినప్పటికీ బ్రెజిల్ ఆహారోత్పత్తిలో ప్రపంచంలోనే ఆగ్రస్థానంలో ఉంది. వరి, చెరకు, పొగాకు, సోయా చిక్కడు, రబ్బరు, అనాస పండ్లు, నారింజ పండ్లు, కోకో, కాఫీ, ప్రత్తి, మొక్కజొన్న, కర్రపెండలం, చిక్కుడు, అరటి పండ్లు వ్వవసాయ ఉత్పత్తులు. ఆహార ఉత్పత్తులలో బ్రెజిల్ స్వయం సమృద్దిన సాధించింది. పశువుల పెంపకం ప్రజలకు ప్రధాన జీవనోపాధి. బంగారం, పారిశ్రామిక వజ్రాలు, ఇనుపరాయు, మాంగనీస్, కాగితం, రబ్బరు, ఉక్కు, జవుళీ, టైర్లు, రైలు ఇంజనులు, గృహ పరికరాలు, తోలు సామాగ్రి, రసాయనిక ద్రవ్వాలు, మోటారు కార్లు, సిమెంట్ మొదలగునవి పరిశ్రమలు. జలవిద్యుత్ ఎక్కువ. సామీక్పాలో, బెలోహారి జంటో నగరాలు పారిశ్రామిక కేంద్రాలు.
Country : Chile
Capital Santiagoa ………. Language Spanish ………. Currency Peso ………. Calling Code + 56 ………. Religion Roman Catholic
చిలీ
దక్షిణ అమెరికాలోని చిలి ఒక స్వతంత్ర దేశం. ఈ ఖండంలోని పశ్చిమ భాగాన పసిఫిక్ మహా సముద్రాన్ని ఆనుకుని ఉన్న పొడుగాటి చీలికగా ఆండీస్ పర్వతశ్రేణిని ఆనుకుని ఈ దేశం వ్యాపించి ఉన్నది. లాటిన్ అమెరికా దేశాలు అన్నిటిలోనూ అత్యంతం పారిశ్రామిక ప్రగతి సాధించిన దేశం చిలి. చిలీ దేశ విస్తీర్ణం 7,56,945 చ.కి.మీ. వీరి భాష స్పానిష్. చిలీ రాజధాని సాంటియాగో. వీరి కరెన్సీ చీలీ పెస్కోలు. 86 శాతం మంది జనాభా క్రైస్తవులే. వీరు రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు 15వ శతాబ్దంలో స్పానిష్ వారు ఈ దేశానికి రాకపోకలు ప్రారంభించి మెల్లగా ఇక్కడ ఉన్న ఇన్కా జాతివారి మీద ఆధిపత్యం సాధించి దేశాన్ని ఆక్రమించుకున్నారు. సుమారుగా 300 సం.లు స్పానిష్ పాలనలో ఈ దేశం ఉంది. ఓహిగిన్స్ నాయకత్వంలో ఫ్రెంచ్ వారిని ఎదిరించి 1818 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకున్నారు. ఇనుప రాయి, రాగి, నైట్రేట్ ఖనిజ సంపదలు ఈ దేశంలో పుష్కలంగా ఉన్నాయి. చిలీ రాగి ఖనిజం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. సోడియం నైట్రేట్ ను ప్రపంచానికంతటికి ఎగుమతి చేస్తుంది చిలీ. బంగారం, సీసం, వెండి, జింకు, పెట్రోలియం లభిస్తాయి. చిలీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం. పచ్చిక బయళ్లు పుష్కలంగా ఉండటం చేత పందుల పెంపకం, గొర్రెల పెంపకం ఎక్కువ. బార్లీ, వరి, రై ధాన్యం, పొద్దు తిరుగుడు, గోధుమ, పుగాకు, బఠానీలు, చిక్కుడు, బంగాళా దుంపలు, ఓట్ ధాన్యం, బాగా పండుతాయి.
Country : Colombia
Capital Bogotá ………. Language Spanish ………. Currency Pesco ………. Calling Code + 57 ………. Religion Roman Catholic
కొలంబియా
కొలంబియా… దక్షిణ అమెరికాలోని వాయువ్యభాగంలో ఉన్నదీ దేశం. తూర్పున వెనుజులా, బ్రెజిల్, దక్షిణాన ఈక్వెడార్, పెరూ, ఉత్తరాన కరీబియన్ సముద్రం, వాయువ్యంలో పనామా, పశ్చిమాన పసిఫిక్ మహా సముద్రం ఉంటాయి. మొత్తం ఐదు దేశాల సరిహద్దుల్ని పంచుకుంటుంది. కొలంబియా రాజధాని బొగట్టా. రాజధాని బొగొటా ప్రపంచంలోని ఎత్తయిన రాజధాని నగరాల్లో ఒకటి. సముద్రమట్టానికి 8,360 అడుగుల ఎత్తులో ఉంటుందిది. వీరి భాష స్పానిష్. ఇక్కడ చాలా స్థానిక భాషలున్నాయి. కానీ 99 శాతం మంది జనాభా స్పానిష్లోనే మాట్లాడతారు. ఈ దేశ వైశాల్యం 11,38,910 చ.కి.మీ. వీరి కరెన్సీ కొలంబియన్ పెస్కో. వీరు రోమన్ కేథలిక్ క్రైస్తవాన్ని పాటిస్తారు. స్పెయిన్ నుంచి ఈ దేశం 1813లో పూర్తి స్వాతంత్య్రంసంపాదించుకుంది. మన దగ్గర ఎదిగే పిల్లలంతా పాలు తాగినట్టు ఇక్కడి చిన్నారులు కాఫీ తాగుతారు. రోజూ భోజనం తర్వాత పిల్లల కోసం ప్రత్యేకంగా చేసిన ‘కాఫీ కాన్ లేచే’ ఇస్తారు. ఆభరణాల్లో వాడే పచ్చరాళ్ల గనులు ఇక్కడ చాలా ఎక్కువ. అందుకే ఈ దేశం పచ్చరాళ్లను ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. అంతేకాదు… ప్రపంచదేశాలు వాడే కాఫీ పొడిలో 12 శాతం ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడి వీధుల్లో కొంతమంది ‘బయ్యింగ్ మినిట్స్’ అంటూ బోర్డులు పెట్టుకుంటారు. కాలాన్ని ఎలా అమ్ముతారబ్బా అనుకోకండి. అంటే వాళ్ల సెల్ఫోన్ల ద్వారా మనకు నచ్చిన చోటుకి మాట్లాడుకుని డబ్బులు చెల్లించాలన్నమాట. ఈ దేశంలో 70 శాతం మంది జనాభా పట్టణాలు, నగరాల్లో నివసిస్తారు. ఈ దేశంలో మొత్తం 300 బీచ్ లుంటాయి. మంచి సందర్శక ప్రాంతాలివి. మూడింట ఒకవంతు అమెజాన్ అడవి విస్తరించి ఉందిక్కడ. ఈ దేశంలో 1,800 జాతుల పక్షులు కనిపిస్తాయి. కొలంబియా చట్టం ప్రకారం టీవీల్లో, రేడియోల్లో రోజూ ఉదయం, సాయంత్రం ఆరుగంటలకు జాతీయ గీతం ప్రసారం చేయాలి. సాధారణంగా నది నీళ్లు ఒక రంగులోనే కనిపిస్తాయి. కానీ కొలంబియాలోని ఓ నది పంచవన్నెలతో పలకరిస్తుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు వంటి రకరకాల రంగుల్లో కనువిందు చేస్తుంది. చూడగానే ‘ఇదేదో ప్రకృతి గీసిన పెయింటింగ్‌లా ఉంటుంది’ ప్రపంచంలోని అందమైన నదుల్లో ఒకటిది. నది పేరు కేనో క్రిస్టేల్స్. ఇక్కడి సెరెనియా డి లా మెకెరెనా పర్వత శ్రేణిలో ఉంటుందిది. ప్రకృతి అందాలన్నీ కనిపించే ఈ నదిలో రంగులు ఎలా వచ్చాయి అంటే… ఈ నది అడుగు భాగం వేల సంవత్సరాల క్రితం క్వార్ట్జ్ అనే రాయితో ఏర్పడిందట. ఈ రాయిపై జులై నుంచి నవంబరు మధ్య కాలంలో రంగు రంగుల మెకెరెనియా క్లెవెజెరా అనే నాచు పెరుగుతుంది. ఈ నాచే నదికి వర్ణాల్ని తెచ్చిపెడుతుంది. ఈ వర్ణాల అందాల వల్ల ఈ నదినే ‘లిక్విడ్ రెయిన్బో’ అనే పేరుతోనూ పిలుస్తారు. కాఫీ, వరి, అరటి, పొగాకు, మొక్కజొన్న, చెరకు, నూనె గింజలు, కోకోవా బీన్స్, కూరగాయలు పండిస్తారు. పెట్రోలియం, సహజవాయు, బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం, వెండి, ఎమరాల్డ్స్, హైడ్రోపవర్ సహజ సంపదలు
Country : Ecuador
Capital Quito ………. Language Spanish ………. Currency US Dollar ………. Calling Code + 593 ………. Religion Roman Catholic
ఈక్వడర్…
1822 సంవత్సరంలో ఈ దేశం స్పెయిన్ దేశం నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. 1830 వ సంవత్సరంలో ఈ దేశం గ్రాన్ కొలంబియా గ్రూప్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. 1970 లలో ఈ దేశం మిలటరీ పాలనలో ఉన్నపుడు దేశంలో అశాంతి నెలకొంది. ఈక్వడార్ రాజధాని క్విటో. ఈ దేశ వైశాల్యం. 2,83,560 చ.కి.మీ. వీరి భాష స్పానిష్ (అధికార). వీరి కరెన్సీ అమెరికన్ డాలర్. ఈ దేశం క్రిస్టియన్ దేశం. 95 శాతం మంది రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు. అ దేశం మధ్య ఆండీస్ పర్వత శ్రేణులున్నాయి. దానికి అటు, ఇటూ అమెజాన్ నదీలోయలు, మైదానాలున్నాయు. ప్రసిద్ద జీవశాస్త్రజ్ఞుడు చార్లెస్ డార్విన్ పరిణామ సిద్దాంతాన్ని ప్రవచించి, పరిశోధనలు జరిపిన గాలపగోస్ దీవులు ఈక్వడార్ కు చెందినవే. వరి, గోధుమ, కాఫీ, బార్లీ, అరటి, కోకో, చెరకు, ప్రత్తి ముఖ్యమైన పంటలు. రాగి, బంగారం, పెట్రోల్, గంథకం,ఖనిజాలు సహజ సంపదలు. సిమెంట్, నూలు వస్త్రాలు ఔషధాలు,టాగ్వా గింజలు ఎగుమతి చేస్తారు. కలప, చేపలు లభిస్తాయి.
Country : Guyana
Capital Georgetown ………. Language English ………. Currency Guyanese dollar ………. Calling Code + ………. Religion Christian(57.4)
గుయానా…
1500 సంవత్సరంలో మొట్టమొదటిగా డచ్ వారు ఈ దేశంలో అడుగు పెట్టారు. తరువాత 1796వ సంవత్సరలో బ్రిటీష్ వారు ఈ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. 1966 సంవత్సరంలో ఈ దేశం బ్రిటన్ నుండి స్వాతంత్రం సంపాదించుకుని 1970 సంవత్సరంలో రిపబ్లికన్ దేశంగా అవతరించింది. ఈ దేశ వైశాల్యం 2,14,970 చ.కి.మీ. ఈ దేశ రాజధాని జార్జ్ టౌన్. వీరి భాషలు . English, Amerindian dialects, Creole, Hindi, Urdu. ఈ దేశ కరెన్సీ. ఈ దేశ ప్రజలలో క్రిస్టియన్స్ 50 శాతం మంది, హిందువులు 35 శాతం మంది, ముస్లింలు 10 శాతం మంది, 5 శాతం మంది ఇతర మతస్తులు ఉన్నారు. చెరకు, వరి, గోధుమలు, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, కోళ్లపరిశ్రమ, పాలపరిశ్రమలు కలవు. బాక్సైట్, బంగారం, వజ్రాలు, కలప, రొయ్యలు, చేపలు సహజ సంపదలు.
Country : Paraguay
Capital Asunción ………. Language Spanish/Guarani ………. Currency Guarani ………. Calling Code + 595 ………. Religion Christian
పరాగ్వే..
పరాగ్వే దక్షిణ అమెరికాలోని స్వతంత్ర దేశం. ఈ దేశానికి ఉత్తరాన బొలీవియా,బ్రెజిల్, తూర్పున అర్జెంటీనా దేశాలు ఉన్నాయి. 1537 సంలో స్పానిష్ వారు ఈ దేశానికి వచ్చి అసన్ సియాన్ నగరాన్ని ఏర్పరచారు. అప్పటినుండి అసన్ సియాన్ స్పానిష్ వారి కాలనీగా మారింది. 1811 సం.లో స్పానిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశ విస్తీర్ణం 4,06,752 చ.కి.మీ. రాజధాని నగరం అసన్ సియాన్. వీరి అధికార భాష స్పానిష్. వీరి కరెన్సీ Guarani. ప్రజలు క్రైస్తవ మతస్తులు. మెస్టిజో, అమెరికన్ ఇండియన్ జాతులకు చెందినవారు. పరాగ్వే నది, పరవా నది ప్రధానమైన జలవనరులు. ప్రత్తి ప్రధానమైన పంట. వ్యవసాయపరంగా అభివృద్ది చెందుచున్న దేశం. కర్రపెండలం, చిలగడ దుంపలు, సోయా చిక్కుడు, చెరకు, పొగాకు, వరి, నారింజ అరటి వ్యవసాయ ఉత్పత్తులు. పశువుల పెంపకం ప్రజల జీవనోపాధి. రాజధాని అసన్ సియాన్ పర్యాటక ప్రదేశం. ఇసుకరాయి సరస్సు విహార స్థలం మరియు ఎన్కార్నేషన్ ప్రాచీన శిధిలాలు ఉన్న గుట్ట.
Country : Peru
Capital Lima ………. Language Spanish/ ………. Currency Sol ………. Calling Code + 51 ………. Religion Catholic
పెరూ….
పసిఫిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వత శ్రేణిలోని స్వతంత్రదేశం పెరూ. ఒకప్పుడు పెరూ దేశం ఇన్కా అనబడే రెడ్ ఇండియన్ల స్థానం. 16వ శతాబ్ధంలో స్పేనిష్ వారిచే ఆక్రమించబడి 1821 సంవత్సరంలో స్వతంత్ర గణరాజ్యంగా రూపొందింది. ఈ దేశ విస్తీర్ణం 12,81,215 చ.కి.మీ. పెరూ రాజధాని లీయా. వీరి అధికార భాష స్పేనిష్, క్వెచువా. వీరి కరెన్సీ సాల్. ప్రజలు కేథలిక్ క్రైస్తవమతాన్ని పాటిస్తారు. . ఆల్పాకా, నీకూనా, లామా వంటి అపూర్వమైన జంతుజాలం ఈ దేశంలో కనిపిస్తాయి. అభయారణ్యాలలో ఈ జంతువులు రక్షించబడుచున్నవి. . అమెజాన్ నదికి ప్రారంభలో ఉన్న మారణన్ నది, నాపోనది, ఉకాయాలీ నది ఈ దేశ తూర్పు మైదానాలలో ప్రవహిస్తున్నాయి. ఆండీస్ కొండల నుంచి ప్రవహించే వాగులు వలన సముద్రతీరంలో సేద్యం చేస్తున్నారు. ప్రత్తి, చెరకు, కాఫీ, వరి, బంగాళా దుంపలు మొక్కజొన్న, అరటి, కర్రపెడలం వ్యవసాయ పంటలు. మొక్కజొన్నకు ఆదిమ స్థానం పెరూ దేశమే. రెడ్ ఇండియన్ జాతులకు మొక్కజొన్న ముఖ్య ఆహారం . మత్సపరిశ్రమ ఎక్కువగా ఉన్నది. వెండి, రాగి, బంగారం, ఇనుపరాయి, సీసం, గంధకం. ఫాస్పేట్ ఖనిజాలు ఈ దేశంలో లభిస్తాయి . చించాదీవులలో పిట్టల రెట్ట భారీ రాసులలో లభిస్తుంది. దీనిని పొలాలకు ఎరువుగా వేస్తారు. పెరూ రైతాంగం రసాయనిక ఎరువులు పెద్దగా వాడరు.
Country : Suriname
Capital Paramaribo ………. Language Dutch ………. Currency Surinamese dollar ………. Calling Code + 597 ………. Religion Christian/Hindu
సురినేమ
సురినేమ్ ఒకప్పుడు ‘డచ్ గియాన’గా పిలవబడేది. సురినేమ్‌కు తూర్పులో ఫ్రెంచ్ గుయానా, పశ్చిమంలో గుయానా, దక్షిణంలో బ్రెజిల్ ఉన్నాయి. ‘కింగ్డమ్ ఆఫ్ ది నెదర్ల్యాండ్స్’లో 1954లో భాగమైంది సురినేమ్.పారమరిబో దేశరాజధాని. పారమరిబో… దేశంలోని పెద్ద పట్టణం మరియు దేశరాజధాని. దేశంలో అధికార భాష డచ్తో పాటు… స్రనన్ టోంగో, హిందీ, భోజ్‌పూరి, ఇంగ్లిష్, సర్నమి, హక్కా… మొదలైన భాషలు కూడా మాట్లాడతారు. వీరి కరెన్సీ సురినామ్ డాలర్. ఈ దేశ ప్రజలలో హిందువులు 27 శాతం, ప్రొటెస్టంట్లు 25 శాతం, రోమన్ కేథలిక్స్ 22, ముస్లింలు 20 శాతం మంది కలదు దక్షిణ అమెరికాలోని చిన్నదేశాలలో సురినేమ్ ఒకటి. 1975లో నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఈ దేశానికి సహజ వనరులే ఆయువు పట్టు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో… స్వాతంత్య్రం పట్ల నమ్మకం కంటే అపనమ్మకమే ప్రజల్లో ఎక్కువగా ఉండేది. దీంతో వేలాది మంది ప్రజలు దేశాన్ని విడిచి నెదర్లాండ్స్‌కు వెళ్లారు. మరోవైపు ప్రభుత్వ అసమర్థత, అక్రమాల మీద ప్రజలకు విముఖత వచ్చింది. దీనివల్లే 1980లో తలెత్తిన సైనిక తిరుగుబాటును ప్రజలు స్వాగతించారు. 1980-1987 వరకు దేశంలో మిలటరీ పాలన కొనసాగింది. రాజకీయ ప్రత్యర్థులను మిలటరీ ప్రభుత్వం చంపేయడంతో నెదర్లాండ్స్ తన సహకారాన్ని ఆపింది. ఈ ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆ తరువాత సాధారణ ఎన్నికలు జరగడం, కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడంలాంటివి జరిగినప్పటికీ 1990లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగింది. అయితే అంతర్జాతీయ రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ఇదే సంవత్సరం మే నెలలో ఎన్నికలు జరిగాయి. ‘న్యూ ఫ్రంట్ ఫర్ డెమొక్రసీ అండ్ డెవలప్మెంట్’, ‘సురినేమ్ లేబర్ పార్టీ’లు మెజార్టీ స్థానాలను గెలుచుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పరిపాలన పరంగా సురినేమ్ పది జిల్లాలుగా విభజించబడింది. జీవవైవిధ్యంలో సురినేమ్ మంచి స్థాయిలో ఉంది. దేశంలో 150 రకాల క్షీరదాలు, 650 రకాల పక్షిజాతులు, 350 రకాల చేపజాతులు ఉన్నాయి. జీవవైవిధ్యంలో ‘సెంట్రల్ సురినేమ్ నేచర్ రిజర్వ్’ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చోటు సంపాదించింది. సురినేమ్‌లో ఎన్నో నేషనల్ పార్క్‌లు ఉన్నాయి. 16 శాతం భూభాగంలో నేషనల్ పార్క్‌లు, సరస్సులు ఉన్నాయి. సురినేమ్ సంస్కృతిలో వైవిధ్యం ఉంది. దీనిపై ఆసియా, ఆఫ్రికాల ప్రభావం బలంగా ఉంది. దేశంలో ప్రసిద్ధిగాంచిన సంగీతం ‘కసెకో’. దీనిపై ఆఫ్రికన్, యురోపియన్, అమెరికాల సంగీత శైలుల ప్రభావం కనిపిస్తుంది. దేశంలో 60 శాతం మందికి డచ్ అధికార భాష. ‘డచ్ లాంగ్వేజ్ యూనియన్’లో సురినేమ్‌కు సభ్యత్వం ఉంది. దక్షిణ అమెరికా దేశాలలో డచ్ మాట్లాడే ఏకైక దేశం సురినేమ్. హోటల్ ఇండస్ట్రీ సురినేమ్ ఆర్థికవ్యవస్థకు కీలకంగా మారింది. ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా రావడానికి కారణం… జీవవైవిధ్యం. కోమెన్విజిన్ జిల్లాలో జులెస్ బ్రిడ్జీకీ పర్యాటక పరంగా గుర్తింపు ఉంది. సురినేమ్‌లో బహుళ పార్టీ వ్యవస్థ అమలులో ఉంది. సంకీర్ణప్రభుత్వాలే ఎక్కువ. ‘నేషనల్ పార్టీ ఆఫ్ సురినేమ్’, ‘ప్రోగ్రెసివ్ రిఫామ్ పార్టీ’, ‘సురినేమ్ లేబర్ పార్టీ’, ‘నేషనల్ డెమొక్రటిక్ పార్టీ’, ‘డెమొక్రటిక్ నేషనల్ ప్లాట్‌ఫాం’… మొదలైనవి దేశంలో ప్రధానమైన పార్టీలు. ఒకవైపు ఉన్నత జీవనప్రమాణాలు, మరోవైపు రాజకీయ, ఆర్థిక సవాళ్లతో సురినేమ్ సంస్కృతిపరంగానే కాదు జీవవైవిధ్యం దృష్ట్యా కూడా చెప్పుకోదగిన దేశంగా ప్రపంచ పటంలో నిలిచింది. బాక్సైట్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో సురినేమ్ ఒకటి. దేశంలో ప్రాచుర్యం పొందిన ఆట… ఫుట్‌బాల్. దేశ తొలి అధ్యక్షుడు జోహన్ ఫెరియర్. రాజధానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రౌన్స్బెర్గ్ పక్షులధామంగా పేరుగాంచింది. రెయిన్‌ఫారెస్ట్ సంరక్షణలో ముందున్న దేశాలలో సురినేమ్ ఒకటి. రైస్, అరటి, పామ్ కెర్నెల్ అనే ఒక రకమైన నూనె గింజలు, కొబ్బరి, అరటి, వేరుశెనగ వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, కోడి మాంసం, రొయ్యలు, అటవీ ఉత్పత్తులు లభిస్తాయి. కలప, హైడ్రోపవర్, చేపలు, రొయ్యలు, బాక్సైట్, బంగారం, కాపర్, ప్లాటినమ్, ఇనుప ఖనిజం సహజ సంపదలు.
Country : Uruguay
Capital Montevideo ………. Language Spanish ………. Currency Uruguayan peso ………. Calling Code + 598 ………. Religion Christian
ఉరుగ్వే
ఉరుగ్వే దక్షిణ అమెరికా ఖంఢంలోని చిన్న స్వతంత్ర రాజ్యం. 1680 సం.లో పోరుచగల్, స్పెయిన్ దేశాల వలసరాజ్యంగా ఉండేది. 1828 సం.లో బ్రెజిల్ దేశం నుండి స్వాతంత్ర్యం పొందింది. ఉరుగ్వే విస్తీర్ణం 1,76,215 చం.కి.మీ. ఉరగ్వే రాజధాని మాంటి వీడియో. అధికార భాష స్పానిష్. స్పానిష్ ఇటాలియన్ (క్రైస్తవం) సంకరజాతి ప్రజలు 86 శాతం మంది, మెస్టిజోలు 14 శాతం మంది ఉన్నారు. వీరి కరెన్సీ ఉరుగ్వేయన్ పెస్కోలు. పచ్చికబయళ్లు పుష్కలంగా ఉండటం వలన పశువుల పెంపకం, గొర్రెల పెంపకం ఎక్కువ. ఈ దేశ దక్షిణ ప్రాంతంలో గోధుమ పండిస్తారు. ఇంకా వరి, చెరకు, మొక్కజొన్న, జొన్న, బార్లీ, నారింజ, ఓట్ ధాన్యం కూడా పండిస్తారు. ఈ దేశంలో లభించే ముఖ్యమైన ఖనిజ సంపదలో గ్రానైట్, సున్నపురాయి ముఖ్యమైనవి.
Country : Venezuela
Capital Caracas ………. Language Spanish ………. Currency Bolívar fuerte[ ………. Calling Code + 58 ………. Religion Christian
వెనిజులా
పూర్వం ఈ దేశం స్పెయిన్పాలనలో ఉండేది. 15 ఏళ్ల పోరాటాల అనంతరం 1821లో పూర్తి స్వతంత్రం పొందింది. వెనిజులా రాజధాని కరాకస్ జనాభా 3.1 కోట్లు ఈ దేశ విస్తీర్ణం : 9,16,445 చ.కి.మీ. వీరి కరెన్సీ వెనిజులన్బొలివర్. భాష స్పానిష్. ఈ దేశం క్రిస్టియన్ మతానికి రెందినది. ప్రజలలో 96 శాతం మంది రోమన్ కేథలిక సంప్రదాయాన్ని పాటిస్తారు. జెండాలోని ఎరుపు, పసుపు రంగులు ధైర్యానికి, నీలం స్వతంత్ర వెనిజులాకి గుర్తులు. మధ్యలో ఎనిమిది తెల్లటి నక్షత్రాలు విప్లవానికి ప్రతీక. వెనిజులాలో నీటికంటే చమురే చవక. సౌదీ అరేబియా తరువాత చమురు నిక్షేపాలు అధికంగా ఉన్న దేశం ఇది. మొన్న మొన్నటి వరకు ఇక్కడ లీటరు సబ్సిడీ పెట్రోల్ధర ఒక రూపాయిలోపే! దక్షిణ అమెరికా ఖండంలో విస్తరించి ఉన్న అతిపెద్ద అడవి అమెజాన్‌లో కొంత భాగం ఈ దేశంలోనూ ఉంది. ప్రపంచంలో ఎక్కువ జీవజాతులు ఉన్న దేశాల్లో వెనిజులా ఏడోది. అ దేశంలో వాతావరణం స్థిరంగా ఉండదు. ఏడాదిలో 160 రాత్రులపాటు మెరుపులు, పిడుగులు వస్తూనే ఉంటాయి. తుపానులూ కూడా ఎక్కువగా వస్తాయి. . వెనిజులా అనే పదం… వెనిజోలియా (బుల్లి వెనిస్) అనే ఇటాలియన్పదం నుంచి వచ్చింది. అక్కడి మారాకైబోలో ఉన్న సరస్సులో ప్రాచీనులు కర్రలుపాతి దానిపైనే ఇళ్లు కట్టుకున్నారు. అది వెన్నిస్‌ను పోలినట్టు ఉండటంతో దీనికి వెనిజులా అని పేరొచ్చింది. . ప్రపంచంలోనే ఎత్తయిన ఏంజెల్జలపాతం ఇక్కడిదే. దీని పొడవు 3,212 అడుగులు. ఇది నయాగరా జలపాతం కంటే పదిహేడు రెట్లు ఎత్తయినది. ప్రపంచంలో ఎక్కువసార్లు అందాలపోటీల్లో గెలిచిన అమ్మాయిలు ఈ దేశానికి చెందినవారే. . ఇక్కడున్న ‘శాన్‌ఆంటోనియా జైలు’ చిత్రంగా ఉంటుంది. ఈ జైలుని, దానికి ఆనుకుని ఉన్న బీచ్‌ని చూసేందుకు ఇక్కడికి ఎక్కువ మంది పర్యటకులు వస్తుంటారు. వారందరికీ ఇక్కడి ఖైదీలు నోరూరించే వంటకాలు చేసి పెడతారు. వివిధ స్టాళ్లను నడుపుతారు. ఇక్కడ ఖైదీలు కుటుంబంతో సహా ఉండే వీలుంది. వారికిక్కడ టీవీలు, ఏసీలు, ఈత కొలను, క్రీడా మైదానాలు, నైట్క్లబ్లాంటి సకల సౌకర్యాలు ఉంటాయి. మరణశిక్షను రద్దు చేసిన ఆధునిక దేశమిది. 1863లోనే ఈ నిర్ణయం తీసుకుంది. . రాజధాని కరాకస్‌లో ఓ అమెరికన్టీవీ షోకోసం కట్టి, అసంపూర్తిగా వదిలేసిన 45 అంతస్తుల ఆకాశ హర్మ్యం ఒకటుంది. దాన్ని 2007లో మురికివాడల్లోని ప్రజలుండేందుకు కేటాయించారు. దీంతో ఎత్తయిన మురికివాడగా ఈ భవనం గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు దానిలో 3000 మంది జనం నివసిస్తున్నారు. ఇందులోనే చిన్నచిన్న దుకాణాలూ ఉన్నాయి. . ఈ దేశంలో ఏకంగా 25000 ఆర్కిడ్‌పూల జాతులున్నాయి. ఈ దేశ జాతీయ పుష్పం పేరు ‘ఫ్లోర్దే మయో ఆర్కిడ్’. ప్రపంచంలోనే అతిపెద్ద స్మారక విగ్రహం ఇక్కడే ఉంది. దీని పేరు విర్జెన్డిలాపాజెన్ట్రుజిల్లో.
Capital St. John’s ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + -267 ………. Religion Christian ఈ దేశం Antigua and Barbuda అనే రెండు మానవ నివాసాలు కలిగిన దేశం. ఇతర దీవులు ఉన్నాయి కానీ వాటిలో ఎవరూ నివసించరు. కరేబియన్ సముద్రంలో ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలకు మధ్యలో ఉన్నది. ఈ దేశంలో మొట్టమొదటిగా సిబోని అనే తెగల ప్రజలు నివసించారు. వీరిని స్టోన్ ప్రజలు అనికూడా అంటారు. తరువాత అమెరికాలోని వెనిజులాకు చెందిన అరావాక్స్ అనే తెగ వారు ఇక్కడికి వలస వచ్చారు.వీరు మొక్కజొన్న, పైనాపిల్, ప్రత్తి, పొగాకు పంటలను సాగుచేశారు. ఈ దేశ రాజధాని సెయింట్ జాన్స్. ఈ దేశ కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్స్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ఇంకా ప్రాంతీయ భాషలు మాట్లాడుతారు. ఈ దేశం నవంబర్ 1వ తేదీ, 1981 సంవత్సరంలో అమెరికా నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. ప్రత్తి, పొగాకు, కూరగాయలు, అరటి, కొబ్బరి, మామిడి, చెరకు వ్యవసాయ పంటలు. ఆహ్లాదకరమైన ఈ దేశ వాతావరణం విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. పర్యాటకం ప్రధాన ఆదాయ వనరు.
Country : Bahamas
Capital Nassau ………. Language English ………. Currency Bahamian dollar ………. Calling Code + -241 ………. Religion Christian
బహమాస్ దీవులు
ఉత్తర అమెరికాలో వెస్ట్ ఇండీస్ కు ఉత్తరంగా దీవులతో కూడిన స్వతంత్ర రాజ్యం బహమాస్. పూర్యం చుట్టుప్రక్కల దీవుల నుండి Lucayans అనే తెగ ప్రజలు వచ్చి బహమాస్ దీవులలో స్థిరపడ్డారు. 1492 సంవత్సరంలో క్రిస్టఫర్ కొలంబస్ బహమాస్ దీవులలో సాన్ సాల్వడార్ అనే దీవిలోకి వచ్చాడు. కానీ అతనితో పాటు స్మాల్ పాక్స్ అనే వ్యాధిని కూడా వ్యాపింపజేయటం వలన ఈ దీవులలోని సగం మంది ప్రజలు స్మాల్ పాక్స్ వలన మరణించారు. తరువాత స్పానిష్ బానిసవర్తకులు Lucayans తెగలవారిని తమ బంగారు గనులలో పనిచేయటానికి బానిసలుగా మార్చారు. తరువాత 25 సంవత్సరాలు ఈ తెగ ప్రజలు వలసపోవటం కానీ, చనిపోవటం కానీ జరగటం వలన ఈ తెగ పూర్తిగా అంతరించిపోయింది. తరువాత 1647 కొంతమంది శరణార్ధులు (Religious Refugees) ఈ దీవులకు వచ్చి స్థిరపడడ్డారు. 1717 సంవత్సరంలో ఈ దీవులు బ్రిటీష్ వారి కాలనీగా మారినపుడు ఎక్కువ మంది శరణార్ధులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. రహస్య ప్రదేశాలు ఉండటం వలన మరియు ఓడలు ప్రయాణించే మార్గానికి దగ్గరలో ఉండటం వలన బహమాస్ దీవులు సముద్రపు దొంగలకు స్థావరంగా మారాయి. 1973 జూలై 10వ తేదీన బహమాస్ స్వాతంత్రం సంపాదించుకుంది. తరువాత ఈ దీవులు ఆర్ధికపరంగా సేవలందించే ప్రాంతంగాను, పర్యాటక పరంగానూ అభవృద్ధి చెందింది. బహమాస్ లో 2000 చిన్న దీవులు, 700 ఒకమాదిరి దీవులు కలవు. కానీ వీటిలో 30 దీవులు మాత్రమే ప్రజలు నివసించటానికి యోగ్యమైనవి. ఆండ్రస్ దీవి అన్నిటికంటే పెద్ద దీవి. ప్రావిడెన్స్ దీవిలో జనసాంద్రత ఎక్కువ. ఈ దేశ విస్తీర్ణం 13,939 చ.కి.మీ. రాజధానా నస్సావూ. అధికార భాష ఇంగ్లీష్. ప్రజలలో 84 శాతం మంది నీగ్రో జాతివారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. వీరి కరెన్సీ బహమాస్ డాలర్స్. ఇక్కడ పండ్లు, కూరగాయలు ఎక్కువగా పండుతాయి. మత్య్స పరిశ్రమ అభివృద్ధి చెందింది. బహమాస్ దీవులు ప్రకృతి సౌంర్యానికి పేరుపొందాయు. వీదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకం ద్వారా ఎక్కువ ఆదాయం ఈ దేశానికి వస్తుంది.
Country : Barbados
Capital Bridgetown ………. Language English ………. Currency Barbadian dollar ………. Calling Code + -245 ………. Religion Christian
బార్బడోస్…
దక్షిణ అమెరికాకు ఈశాన్యంగా 400 కి.మీ. దూరంలో కరేబియన్ దీవులకు తూర్పున ఉన్న స్వతంత్ర రాజ్యం. రాజవంశీయుల పాలనలో ఉన్న దేశం కూడా. రాజకీయంగా, ఆర్ధికంగా బలపడిన దేశం. ప్రజల జీవన విధానం కూడా ఉన్నతంగా ఉంటుంది. 1625 సంవత్సరంలో జనవాసాలు లేని ఈ ప్రాంతంలో బ్రిటీష్ నావికులు అడుగు పెట్టారు. తరువాత 1627 సంవత్సరంలో ఇంగ్లాండ్ ప్రజలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. ఈ దీవిని వ్యవసాయ యోగ్యంగా మార్చి చెరకు పండించటానికి ఆఫ్రికా నుండి బానిసలను దిగుమతి చేసుకున్నారు. 1966 వ సంవత్సరంలో ఈ దేశం బ్రిటీష్ వారినుండి పూర్తి స్వాతంత్రం సంపాదించుకుంది. తరువాత చెరకు ఎక్కువగా ఎగుమతి దేశంగానూ, పర్యాటకపరంగానూ అభివృద్ధి చెందింది. ఈ దేశ విస్తీర్ణం 430 చ.కి.మీ. ఈ దేశ రాజధాని బ్రిడ్జ్ టౌన్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలలో 92 శాతం మంది నీగ్రోలు. వీరి కరెన్సీ బార్బేడియన్ డాలర్. ప్రజలు ఎక్కువ మంది క్రైస్తవ మతస్తులు. చెరకు ఎక్కువగా పండుతుంది. మొక్కజొన్న, నిమ్మ, నారింజ జాతుల పండ్లు వ్యవసాయ ఉత్పత్తులు. రొయ్యలు, పంచదార, రమ్ము, సారాయి ఎగుమతులు. పెట్రోలియం, సహజవాయువు, చేపలు ఈ దేశ సహజ వనరులు. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన బీచ్ లు ఉండటం వలన విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. పర్యాటకం వలన అధిక ఆదాయం వస్తుంది.
Country : Belize
Capital Belmopan ………. Language English ………. Currency Belize dollar ………. Calling Code + 501 ………. Religion Roman Catholics
బెలిజి…
బెలీజి దేశం మయాన్ నాగరికతకు సంబంధించిన దేశం. 1500 బి.సి లోనే మయాన్లు ఈ దేశానికి వలస వచ్చారు. 1840 సంవత్సరంలో ఈ దేశం బ్రిటీష్ వారి కాలనీగా మారింది. అందుకే ఈ దేశాన్ని అప్పట్లో బ్రిటీష్ హోండూరస్ గా పిలిచేవారు. 1973 లో తిరిగి బెలిజీగా పిలువబడింది. సెప్టెంబర్ 21, 1981 సంవత్సరంలో బ్రిటీష్ వారినుండి స్వాతంత్యం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 22,965 చ.కి.మీ. రాజధాని బెల్మోపాన్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు క్రైస్తవ మతానికి చెందినవారు. ఈ దేశం నిమ్మ, నారింజపండ్లను ఎక్కువగా పండించి ఎగుమతి చేస్తుంది. చెరకు, ద్రాక్ష, కొబ్బరి ఇతర ఎగుమతులు. కలప కూడా లభిస్తుంది. ఆహార పదార్ధాలను దిగుమతి చేసుకుంటారు. కలప, చేపలు, హైడ్రోపవర్ సహజ వనరులు. వ్యవసాయ యోగ్యమైన భూములు కలవు.
Country : Canada
Capital Ottawa ………. Language English/French ………. Currency Canadian dollar ………. Calling Code + 1 ………. Religion Christian
కెనడా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వైశాల్యంగల దేశం కెనడా. కెనడా రాజధాని ఒట్టావా ఈ దేశ జనాభా 3,60,48,521 (2018) దేశ విస్తీర్ణం 99,84,670 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు ఆంగ్లం మరియు ఫ్రెంచ్, వీరీ కరెన్సీ కెనడియన్ డాలర్. కెనడా క్రిస్టియన్ దేశం. కెనడా జాతీయ పతాకం 1:2 పొడవు వెడల్పుతో ఉంటుంది. మధ్యలో తెలుపు రంగులో ఎర్రని మేపుల్ ఆకు, అటూ ఇటూ ఎర్రని రంగులు ఉంటాయి. తెలుపు రంగు శాంతి, నిజాయితీని, ఎరుపు రంగు ధైర్యం, శ్రమ, బలాన్ని సూచిస్తే మేపుల్ ఆకు కెనడా ప్రకృతికి చిహ్నం. కెనడా అనేది ‘కెనట’ అనే పదం నుంచి వచ్చింది. స్థానిక భాషలో దీనర్థం ఆవాసం’, లేదా గ్రామం అని. ప్రపంచం మొత్తంగా ఉన్న అడవుల్లో 10 శాతం కెనడాలోనే ఉన్నాయి. కెనడాలో 55 వేలకుపైగా కీటక జాతులు ఉన్నాయి. కెనాడాలో దాదాపు 30 వేల సరస్సులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సరస్సుల్లో ఇది అరవై శాతం. ఎక్కువ మంది విద్యావంతులున్న దేశంగా కూడాఈ దేశానికి పేరుంది. ప్రపంచంలోనే అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దు యూఎస్, కెనడాల మధ్య ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన తీర రేఖగల దేశం. ఏకంగా 2,02,080 కిలోమీటర్ల పొడవుంటుంది. ప్రపంచంలోనే అతి పొడవైన వీధి ఇక్కడే ఉంది. పేరు యంగ్ స్ట్రీట్. సుమారు 2,000 కిలోమీటర్ల పొడవుంటుంది. టోరంటో స్థాపకుడు జాన్ గ్రేవ్స్ సిమ్కో తన స్నేహితుడూ, ప్రాచీన రోమన్ రహదారుల నిపుణుడైన జార్జ్ యంగ్ పేరు మీదుగా ఈ వీధికి పేరు పెట్టారు. యంగ్ సబ్ వే మార్గం కెనడాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి భూగర్భ మెట్రో సిస్టమ్. గోధుమలు, బార్లీ, నూనె గింజలు, పొగాకు, పండ్లు, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. ఇనుప ఖనిజం, నికెల్, రాగి, జింక్, బంగారం, సీసం, వెండి, పోటాష్, వజ్రాలు ఈ దేశంలో లభించే సహజ వనరులు. బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు కూడా లభిస్తుంది.
Country : Costa Rica
Capital Costa Rica ………. Language Spanish ………. Currency Costa Rican colón ………. Calling Code + 506 ………. Religion Christian
కోస్టారికా
కోస్టారికా మద్య ఉత్తర అమెరికాలోని ఒక చిన్న స్వతంత్ర రాజ్యం. ఈ దేశానికి ఉత్తరాన నికరగ్యా, దక్షిణాన పనామా దేశాలున్నాయి. మూడు వందల సంవత్సరాల పాటు స్పెయిన్ వలస రాజ్యంగా ఉండి 1821 సంవత్సరలో స్వతంత్ర దేశంగా అవతరించింది. కోస్టారికా వైశాల్యం 51, 100 చ.కి.మీ. . దీని రాజధాని శాన్ జోన్స్. వీరి అధికార భాష స్పానిష్, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ప్రజలు అధికశాతం క్రిస్టియన్స్,స్పెయిన్ నుండి వలస వచ్చినవారే. రెడ్ ఇండియన్ లతో సంకరమైన యూరోపియన్ ప్రజలను మెస్టిజోలు అంటారు. రెవాన్టా, జోన్, శాన్ జోన్, శానాపిక్వీ నదులు ఈ దేశంలో కలవు. కగూనా డా అరెవల్, సరస్సులు ప్రధాన జలవనరులు. కోకో, కాఫీ, అరటిపండ్లు ఎక్కువగా పండిస్తారు. అబాకా, హెంప్ నార, రబ్బరు, ప్రత్తి, చెరకు, వాణిజ్య పంటలు. వరి, మొక్కజొన్న దేశ అవసరాలకు సరిపడా పండిస్తారు. బంగారం, ఉప్పు ఈ దేశంలో లభించే ఖనిజ సంపద. పశువుల పెంపకం కూడా ఎక్కువగా ఉంది.
Country : Cuba
Capital Havana ………. Language Spanish ………. Currency Pesco ………. Calling Code + 53 ………. Religion Christian
క్యూబా
క్యూబా ఉత్తర అమెరికాకు ఆగ్నేయ దిశలో ఉన్న వెస్ట్ ఇండీస్ దీవులలోని ఒక అందమైన ద్వీప సముదాయం. క్యూబా దీవి కాకుండా చిన్న, పెద్ద దీవులు కలిపి 1600 దాకా ఉన్నాయి. 400 సంవత్సరాలు స్పెయిన్ ఆధీనంలో ఉండి 1898 సం.లో అమెరికా సహాయంతో స్వాతంత్ర్య పోరాటం మొదలు పెట్టింది. 1902 సంవత్సరంలో అమెరికా సైనిక ప్రభుత్వం ఏర్పడింది. 1930 ప్రాంతంలో మరలా బాటిస్టా అనే నియంత పాలనకు గురైంది. 1959 సం.లో ఫిడల్ కాస్ట్రో నాయకత్వంలో విప్లవం చెలరేగి సోషలిస్ట్ ప్రభుత్వ ఏర్పడింది. కాస్త్రో ప్రధాని అయ్యాడు. ధేశంలో ఒకే ఒక రాజకీయ పక్షం క్యూబా కమ్యునిస్ట్ పార్టీ. కాస్ట్రో అలీన దేశాల నాయకులలో ఒకరు. క్యూబా రాజధాని హవానా. దేశ వైశాల్యం 1,10,861 చ.కి.మీ. వీరి అధికార భాష స్పానిష్. వీరి కరెన్సీ క్యూబన్ పెస్కోలు. క్యూబా క్రిస్టియన్ దేశం. చెరకు, పొగాకు, సిట్రస్ జాతి పండ్లు, కాఫీ, వరి, బంగాళా దుంపలు, బీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు. పశుపోషణ కలదు. కోబాల్ట్, నికెల్, ఇనుపఖనిజం,రాగి, క్రోమియం, కలప, పెట్రోల్, సిలికా సహజ సంపదలు. వ్యవసాయ యోగ్యమైన భూమి కలదు.
Country : Dominica
Capital Roseau ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + -766 ………. Religion Christian
డొమినికా
ఇది చాలా చిన్న దేశం. భారతదేశంలోని హైదరాబాద్ కన్నా కొంచె పెద్దది. పర్వతాలతో కూడిన చిన్న ద్వీప దేశం. తూర్పున అట్లాంటిక్ సముద్రం, పశ్చిమాన కరేబియన్ సముద్రం, ఉత్తరాన ఫ్రెంచ్ ద్వీపాలు గ్వాడెలూప్, మదక్షిణాన మార్టనిక్యూ ఉన్నాయి. డొమినికా అంటే లాటిన్ భాషలో ఆదివారం అని అర్ధం. నవంబర్ 3, 1978 సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. 1980 సంవత్సరంలో Mary Eugenia Charles తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైంది డొమినికా రాజధాని రోసియా. ఇదే ఈ దేశంలో పెద్ద నగరం కూడా. ఎక్కువశాతం జనాభా ఇక్కడే నివసిస్తారు. వీరి భాష ఆంగ్లం. వీరి కరెన్సీ తూర్పు కరేబియన్ డాలర్. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది ఈ దేశ జాతీయ పక్షి సిసేరియో ప్యారెట్. ఈ పక్షి ఈ దేశంలోనే మాత్రం కనిపిస్తుంది. కాఫీ, పంచదారలు ఎగుమతి చేయటం ద్వారా ఈ దేశానికి ఆదాయం వస్తుంది. ఇంత చిన్న దేశంలో 365 నదులు, చాలా జలపాతాలు, అందమైన ఇసుక తీరాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన రెండో వేడినీటి సరస్సు ఈ దేశంలోనే ఉంది. దీని పేరు బాయిలింగ్ సరస్సు.క్రిస్టఫర్ కొలంబస్ ఈ ద్వీపదేశాన్ని 1493లో దర్శించాడు. అతి ఎత్తయిన పర్వతం మోరెన డియాబ్లటిన్. ఈ పర్వతం సుమారు 5 వేల అడుగుల ఎత్తు ఉంటుంది. వీరి జీవన విధానం ప్రత్యేకమైనది. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ. అగ్నిపర్వతాలు కూడా ఇక్కడ ఎక్కువ. అవి ఎప్పుడూ చురుకుగా ఉంటాయి. చెట్లు, జంతుసంపద ఎక్కువ. అందువలనే ఈ దేశాన్ని కరేబియన్ సముద్రాపు సహజ సంపద ద్వీపం అని పిలుస్తారు. అరటిపండ్లు, నిమ్మజాతి పండ్లు, మామిడి కాయలు, కొబ్బరి కాయలు, కొకోవా, భూమిలో పండే దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు కలప. హైడ్రో పవర్, వ్యవసాయ భూములు కలవు.
Country : Dominican Republic
Capital Santo Domingo ………. Language French ………. Currency Peso ………. Calling Code + -808 ………. Religion Christians
డొమినికన్ రిపబ్లిక్
వెస్ట్ ఇండీస్ దీవులలో ఒక స్వతంత్ర దీప దేశం ఇది. ఒకప్పుడు స్పెయిన్ దేశ అధీనంలో ఉండేది. 1844 స్వాతంత్రం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 48,443 చ.కి.మీ. వీరి భాష స్పానిష్. రాజధాని శాంతో డొమినింగో. ప్రజలు ములత్తో జాతికి చెందినవారు 74 శాతం మంది, తెల్లవారు 16 శాతం మంది, నీగ్రోలు 11 శాతం మంది ఉన్నారు. ప్రజలలో ఎక్కువమంది రోమన్ కేథలిక్ క్రైస్తవం పాటిస్తారు. వీరి కరెన్సీ డొమినికన్ పెక్సోలు. చెరకు, కాఫీ ఎక్కువగా పండించి ఎగుమతి చేస్తారు. ప్రత్తి, పొగాకు, కోకో, వరి, బీన్స్, టమాటో, మొక్కజొన్న ఇతర పంటలు. పశుమాంసం, పాలు, గ్రుడ్లు ఇతర ఉత్పత్తులు. నికెల్, బాక్సైట్, బంగారం, వెండి ఖనిజ నిక్షపాలు దొరకుతాయి
Country : El Salvador
Capital San Salvador ………. Language Spanish ………. Currency US Dollar ………. Calling Code + 503 ………. Religion Christian
ఎల్ సాల్వడర్…..
ఎల్ సాల్వడర్ మధ్య అమెరికాలోని ఒకస్వతంత్ర రాజ్యం. మొట్టమొదటగా ఎల్ సాల్వడర్ లో అమెరికన్ జాతివారైన పోకోమన్స్, లెంకాస్ మరియు పిపెల్స్ అనే తెగలవారు నివసించేవారు. తరువాత యూరోప్ నుండి స్పానిష్ వారు ఇక్కడకు వచ్చారు. 1821 సంవత్సరంలో ఈ దేశానికి స్పెయిన్ నుండి స్వాతంత్రం లభించింది. కానీ ఈ దేశంలో అంతర్యుద్ధం, అశాంతి వలన 1980లో చాలా మంది చనిపోయారు. 1992 సంవత్సరంలో తిరుగుబాటుదారులతో జరిగిన శాంతి ఒప్పందం వలన కొంతవరకు శాంతి నెలకొన్నది. ఈ దేశ విస్తీర్ణం 21,041 చ.కి.మీ. రాజధాని సాన్ సాల్వడార్, వీరి భాష స్పానిష్. వీరి కరెన్సీ US Dollars. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. 83 శాతం మంది రోమన్ కేథలిక్ శాఖను అనుసరిస్తారు. పర్వత పానువులలో కాఫీ పండిస్తారు. వరి, మొక్కజొన్న, చెరకు, చిక్కుడు, ప్రత్తి జొన్న, వరి, బీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు. పశువుల పెంపకం కలదు. పాలు, రొయ్యలు ఇతర ఉత్పత్తులు. నేలబొగ్గు, రాగి, ఇనుము, సీసం, జింక్ మొదలగునవి ఖనిజ నిక్షేపాలు. ఆల్కాహాల్, సిగరెట్లు, సిమెంట్, నూలు వస్త్రాలు, హెనెక్వినార, తోలు సామాగ్రి పరిశ్రమలు ఉన్నాయి.
Country : Grenada
Capital St. George’s ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + -472 ………. Religion Christian
గ్రెనడా
దక్షిణ అమెరికాకు ఉత్తరంగా కరేబియన్ సముద్రంలో ఉన్న చిన్న ద్వీప దేశం గ్రెనడా. దీవులలో కారియాక్ దీవి అన్నిటికంటే పెద్దది. సెంట్ జార్జ్ దీనిలో జనాభా ఎక్కువ. 1974 సం.లో ఈ దేశం స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 345 చ.కి.మీ. రాజధాని సెంట్ జార్జీస్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు ఫ్రెంచ్, ఆఫ్రికన్ పేష్యో భాషలు కూడా మాట్లాడుతారు. . నీగ్రో జాతి ప్రజలు ఎక్కువ. కొద్ది మంది మిశ్రమ జాతుల వారున్నారు. ఎక్కువ భాగం ప్రజలు క్రైస్తవులు. కొబ్బరి, నారింజ, ప్రత్తి, సుగంధ ద్రవ్యాలు, చెరకు, అరటిపండ్లు, మామిడి, కందమూలాలు, అవకాడో పండ్లు, జాజికాయలు, జాపత్రి, కోకో, ప్లమ్ పండ్లు ఎక్కువగా పండించి ఎగుమతి కూడా చేస్తారు. వ్యవసాయ ప్రధానమైన దేశం ఇది.
Country : Guatemala
Capital Guatemala City ………. Language Spanish ………. Currency Quetzal ………. Calling Code + 502 ………. Religion Christian
గౌతమాల…
గౌతమాల మధ్య అమెరికాలోని ఒక స్వతంత్ర రాజ్యం. గౌతమాల పురాతనమైన మాయా సంస్కృతికి చెందిన దేశం. మాయా సంస్కృతి శక్తివంతమైన మరియు ఆధునిక సంస్కృతికి చెందినది. 250 AD నుండి 900 AD వరకు ఈ సంస్కృతి ప్రాచుర్యం పొందింది. అప్పట్లో కట్టిన పిరమిడ్లను నేటికి కూడా చూడవచ్చు. 14 శతాబ్ధంలో యూరోపియన్లు ఈ ప్రాంతంలో అడుగు పెట్టినప్పటికి మాయా సంస్కృతి అంతరించింది. 1524 సంవత్సరంలో ఈదేశం స్పెయిన్ కాలనీగా మారింది. 1821 సంవత్సరంలో స్పెయిన్ నుండి ఈ దేశం స్వాతంత్రం పొందింది. ఈ దేశ విస్తీర్ణం 1,08,889 చ.కి.మీ. రాజధాని గౌతమాలా నగరం. వీరి అధికార భాష స్పానిష్. వీరి కరెన్సీ quetzal (GTQ), US dollar. ప్రజలు క్రైస్తవ మతానికి చెందినవారు. మాయన్ ఇండియన్లు మాయన్ భాష మాట్లాడుతారు. అట్టిలాన్ సరస్సు, ఇజాబల్ సరస్సు, రియోడలా పాశన్ నది, రియో యూసుమాసింటా నది, రియో మొగాటాగౌ నది, రియోగ్వాసలాటే నది, సాలినాస్ నది సమాలా నది, పోలో చిక్ నది, అమాటిన్ సరస్సు, పెట్లిన్ సరస్స ముఖ్యమైన జలాధారాలు. కాఫీ ప్రధాన వాణిజ్య పంట. అమెరికాకు కాఫీ ఎగుమతి చేస్తుంది. వరి, ప్రత్తి, అరటిపండ్లు, చెరకు, గోధుమలు, మొక్కజొన్న వ్యవసాయ ఉత్పత్తులు.ఫసిఫిక్ తీరంలో పశువుల పెంపకం సాగిస్తారు. ఆహారపానీయాల తయారీ, జవుళీ, హస్తకళలు ప్రజల జీవనోపాదులు. పెట్రోల్, నికెల్, అరుదైన కలప, చేపలు, హైడ్రోపవర్ సహజ సంపదలు.
Country : Haiti
Capital Port-au-Prince ………. Language French/ Haitian Creole ………. Currency Haitian gourde ………. Calling Code + 509 ………. Religion Christian
హెయ్‌టీ
హెయ్‌టీ… కరేబియన్ద్వీపమైన హిస్పానియోలా భూభాగాన్ని పంచుకునే రెండు దేశాల్లో చిన్న దేశం. 1492లో క్రిస్టఫర్కొలంబస్మొదటిసారిగా ఈ దేశంలో అడుగుపెట్టాడు. 1804 జనవరి 1న ఫ్రాన్స్‌నుంచి స్వాతంత్య్రం పొందింది. 1804 – 1915 మధ్యలో 70 మందికిపైగా నియంతలు పరిపాలించారీ దేశాన్ని. అంటే ఈ 111 సంవత్సరాల వ్యవధిలో నియంతలదే అధికారం. హెయ్‌టీ రాజధాని పోర్టా ప్రిన్స్జనాభా: 1,06,04,000. దేశం విస్తీర్ణం 27,750 చదరపు కిలోమీటర్లు భాష: ఫ్రెంచ్, హెయ్టియన్క్రియోల్కరెన్సీ హెయ్టియన్గౌర్డే. ఈ దేశం క్రిస్టియన్ దేశం కరేబియన్ప్రాంతంలో అత్యధికంగా పర్వతాలున్న దేశమిది. అందుకే దీనికి ‘ల్యాండ్ఆఫ్ది మౌంటెన్స్’ అని పేరు. ఇక్కడ 8 వేల అడుగుల ఎత్తయిన పర్వత శిఖరాలుంటాయి. ప్రపంచ పురాతన జెండాల్లో ఈ దేశ జెండా ఒకటి. వివిధ జాతుల ఏకతను ఈ పతాక రంగులు సూచిస్తాయి. నీలం రంగు ఆఫ్రికా నుంచి వచ్చిన నల్ల జాతీయుల మూలాలకు గుర్తు. ఇక్కడ స్థిరపడిన విభిన్న ప్రాంత ప్రజలకు ఎరుపు రంగు చిహ్నం. దేశంలో 53 శాతం మందికి మాత్రమే చదవడం, రాయడం వచ్చు. 1950 నుంచి ఇక్కడి స్త్రీలకు ఓటు హక్కు వచ్చింది. 1915 అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్హెయ్టీ దేశంలో శాంతియుత పరిస్థితుల్ని తీసుకురావడం కోసం తమ నావికదళాన్ని పంపారు. 2010లో ఇక్కడ వచ్చిన భారీ భూకంపం రెండు లక్షల మందికిపైగా ప్రజల్ని పొట్టన పెట్టుకుంది. ఎన్నో నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఈ దేశంలోని విద్యార్థుల్లో 10 శాతం మంది మాత్రమే ఉన్నత పాఠశాలలో చేరుతారు. మిగిలిన వారంతా ప్రాథమిక పాఠశాలతోనే చదువు ఆపేస్తారు. పర్యటక రంగం ఇక్కడ అత్యధికంగా లాభాల్ని తెచ్చిపెట్టే పరిశ్రమ. దేశ దేశాల నుంచి లక్షల్లో సందర్శకులు వస్తుంటారు. ఇక్కడ 15 ఏళ్లలోపు పిల్లలు 20 శాతం మంది కంటే తక్కువగా ఉంటారు. కాఫీ, చెరకు, మామిడి పండ్లు, వరి, కర్రపెండలం దుంపలు పండుతాయి బాక్సైట్, రాగి, బంగారం, మార్పుల్స్ సహస సంపదలు
Country : Honduras
Capital Tegucigalpa ………. Language Spanish ………. Currency Lempira ………. Calling Code + 504 ………. Religion Roman Catholic
హోండూరాస్….
హోండూరాస్ మధ్య అమెరికాలోని స్వతంత్ర గణ రాజ్యం. ఒకప్పుడు స్పెయిన్ వలస రాజ్యం. 250 AD నుండి 900AD వరకు మయాన్ సంస్కృతి ఇక్కడ వర్ధిల్లింది. 1821వ సంవత్సరంలో స్పెయిన్ నుండి స్వాతంత్రం పొందింది. ఈ దేశ విస్తీర్ణం 1,12, 088 చ.కి.మీ.. ఈ దేశ రాజధాని టెగుసిలల్ఫా. వీరి అధికార భాష స్పానిష్. వీరి కరెన్సీ lempira. 80 శాతం మంది ప్రజలు మెస్టిజో అనే సంకరజాతులవారు, రెడ్ ఇండియన్ లతో సంకరణం చెందిన స్పెయిన్ దేశీయులు, నీగ్రో జాతివారున్నారు. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. ప్రజలు రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు . పటూకా నది, అగౌన్ నది, సికో నది, గేయాసీ నది, ఉలా నది జలాధారాలు. . హోండూరాస్ అరటిపండ్ల దేశంగా ప్రసిద్ధి చెందినది. అరటిపండ్లను ఎక్కువగా పండించి ఎగుమతి చేస్తారు. అరటిపండ్ల ఎగుమతికి వీలుగా రైల్వే వ్యవస్ధ కూడా ఉన్నది. . కాఫీ, పొగాకు, మొక్కజొన్న, ప్రత్తి, వరి, చెరకు ప్రధానమైన పంటలు. . వెండి లభ్యత ఉంది. కలప పరిశ్రమ, ఆహారపానీయాలు, సిగరెట్ల తయారీ, బీరు, సారాయి, సిమెంట్, పంచదార, నూలు వస్త్రాలు ముఖ్యమైన పరిశ్రమలు.
Country : Jamaica
Capital Kingston ………. Language English ………. Currency Jamaican dollar ………. Calling Code + -875 ………. Religion Christian
జమైకా
జమైకా కరీబియన్సముద్రంలో ఉన్న పెద్ద ద్వీప దేశాలలో మూడవది . సార్వభౌమ దేశమే అయినా లాంఛన చక్రవర్తిగా బ్రిటన్ఎలిజబిత్వ్యవహరిస్తారు. 1494 సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఈ దేశ ఉనికిని కనుగొన్నాడు. ఈ రాజధాని కింగ్స్టన్. దేశ జనాభా 29,50,210 . ఈ దేశ విస్తీర్ణం 10,991 చదరపు కిలోమీటర్లు వీరి భాష ఆంగ్లం. కరెన్సీ జమైకన్డాలర్. ఈ దేశం క్రిస్టియన్ దేశం. . ఈ దేశ జెండాలోని నలుపు రంగు కష్టాలను అధిగమించడానికి సూచన అయితే, బంగారువర్ణం సహజ సంపదకూ, సూర్యకాంతికీ గుర్తు, ఆకుపచ్చ రంగు ఆశాభావానికీ, వ్యవసాయ వనరులకూ సూచన. 1962 సం. ఆగస్ట్ 6 తేదీన జమైకా గ్రేట్ బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ప్రపంచంలోనే అత్యధిక చర్చిలున్న ప్రాంతమిది. 1600 చర్చిలతో గిన్నిస్రికార్డుకెక్కింది. ఉత్తర అమెరికా, కెనడాల తర్వాత అత్యధిక శాతం ప్రజలు ఆంగ్లం మాట్లాడేది ఇక్కడే. 116 దేశాల్లోని ప్రజలు వీసా లేకున్నా జమైకాకు వెళ్లవచ్చు. ఇలా అనుమతి లభించిన దేశాల్లో భారతదేశం కూడా ఉంది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సీతాకోక చిలుక ‘స్వాలోటేల్’ నివాసం ఈ దేశమే. ఇక్కడ కేవలం ఎనిమిది జాతుల పాములు ఉంటాయి. అవి కూడా విషరహితమైనవి. 1872లో చెరకు తోటలను ధ్వంసం చేస్తున్న ఎలుకల్ని చంపడానికి ఈ ప్రాంతానికి ముంగిసల్ని తీసుకొచ్చారట. ఎలుకలతో పాటు అవి పాముల పని కూడా పట్టడంతో ఈ దీవిలో పాముల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రఖ్యాత పరుగుల వీరులు ఉస్సేన్‌బోల్ట్, యోహాన్బ్లేక్లు ఇక్కడి వారే. 200కి పైగా ఆర్కిడ్‌పూల జాతులున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా అరటి పండ్లని ఎగుమతి చేసే దేశం ఇదే. జేమ్స్బాండ్సృష్టికర్త ఇయాన్ఫ్లెమింగ్జమైకాలోనే ‘గోల్డెన్‌ఐ’ పేరిట సొంత ఇల్లు కట్టుకున్నారు. ప్రాచుర్యం పొందిన ‘రెగే’ సంగీత శైలి పుట్టింది ఇక్కడే. ఈ ద్వీపదేశం చిన్నదే అయినా పర్యటకానికి పేరు పొందింది. ఏటా పదిలక్షలకు పైగా పర్యాటకులు వస్తుంటారు.
Country : Mexico
Capital Mexico City ………. Language Spanish ………. Currency Peso ………. Calling Code + 52 ………. Religion Roman Catholism
మెక్సికో
మెక్సికో రాజధాని మెక్సికో నగరం. మెక్సికో నగరం ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల నగరాల్లో ఒకటి. దేశ జనాభా 11,95,30,753 ఈ దేశ విస్తీర్ణం 19,72,550 చదరపు కిలోమీటర్లు. వీరి భాష స్పానిష్. అధికారిక భాషలు 68. కరెన్సీ మెక్సికన్పెసో. కరెన్సీ నోట్లపై బ్రెయిలీ లిపిలో గుర్తులు ఉంటాయి మెక్సికో జనాభాపరంగా పదకొండో అతిపెద్ద దేశం, వూబకాయులు అధికంగా గల దేశం. ఈ దేశం క్రిస్టియన్ దేశం. దేశంలో 89 శాతం మంది ప్రజలు రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు ఈదేశ జెండాలోని పచ్చ, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండి మధ్యలో ‘కోట్ఆఫ్ఆర్మ్స్’ ఉంటుంది. ఆకుపచ్చ ఆశావహ దృక్పథానికి, తెలుపు ఐక్యతకు, ఎరుపు రంగు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగానికీ ప్రతీకలు. అమెరికాలో ఇప్పుడు అతిపెద్ద రాష్ట్రం టెక్సాస్. అది 1836లో మెక్సికో నుంచి విడివడి స్వతంత్రం ప్రకటించుకుంది. తర్వాత 1845లో అమెరికాలో కలిసిపోయింది. అమెరికా, మెక్సికోలది ప్రపంచంలోనే అతి పెద్ద రెండో సరిహద్దు రేఖ. దీని నుంచి చాలా మంది మెక్సికన్లు సరిహద్దులు దాటి అక్రమంగా అమెరికాకు వలస వెళుతుంటారు. ఈ దేశం మొత్తానికి ఒకే ఒక ఆయుధాల దుకాణం ఉంది. మిగిలినవన్నీ అమెరికా నుంచి అక్రమంగా దిగుమతి అవుతాయి. ఏటా అమెరికా, మెక్సికో సరిహద్దులో రెండు దేశాలకూ ఒక వాలీబాల్మ్యాచ్జరుగుతుంది. ఈ కోర్టు సగభాగం ఆ దేశంలో, సగ భాగం ఈ దేశంలో ఉంటుంది. .పిరమిడ్లనగానే అందరికీ ఈజిప్టు గుర్తొస్తుందిగానీ ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ఉన్నది మాత్రం ఇక్కడి చోలులాలోనే. ఇక్కడి కళాకారులు తమ కళారూపాల్ని ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా కూడా పన్ను చెల్లించవచ్చు. పాప్‌కార్న్, చాక్లెట్లను ప్రపంచానికి పరిచయం చేసింది ఈ దేశమే. మిరపకాయ పుట్టింది కూడా ఇక్కడే. మెక్డొనాల్డ్స్బర్గర్లపై వాడే నువ్వుల్లో 75శాతం ఇక్కడే సాగవుతాయి. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో ఒకప్పుడు మెక్సికోదే. 1848లో ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం తర్వాత అది అమెరికా సొంతమైంది. 1945లో ఇక్కడొక రైతు పొలంలో అకస్మాత్తుగా అగ్ని పర్వతం బయటకు పుట్టు కొచ్చింది. ఒక్కవారంలోనే ఐదంతస్తుల భవనమంత, ఏడాదిలోగా 1,100 అడుగుల ఎత్తు పెరిగిపోయింది. అస్సలు జుట్టు లేకుండా ఉండే జోలోటిజ్క్యుంట్లి జాతి శునకాలు ఇక్కడివే. ఇది ఈ దేశ జాతీయ శునకం కూడా ‘వాల్కెనో రేబిట్’ అనేది ఇక్కడ మాత్రమే కనిపించే అరుదైన కుందేలు. ప్రపంచంలో ఉన్న జీవ జాలంలో 10 నుంచి 12శాతం ఇక్కడే ఉంది. ఇక్కడ మొత్తం రెండు లక్షలకు పైగా జీవులు ఉన్నాయి. 67జాతీయ పార్కులు కూడా ఉన్నాయి. మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్, వరి, ప్రత్తి, కాఫీ, పండ్లు, టమాటోలు పండిస్తారు. పశుమాంసం, కోళ్ల పరిశ్రమ, పాల ఉత్పత్తులు ఇతరాలు. పెట్రోలియం, వెండి, రాగి, బంగారం, జింక్, సహజ వాయివు, కలప ఈ దేశంలో లభించే సహజ సంపదలు.
Country : Nicaragua
Capital Managua ………. Language Spanish ………. Currency Córdoba ………. Calling Code + 505 ………. Religion Roman Catholicism
నికరాగ్వా
నికరాగ్యా మధ్య అమెరికాలోని అతిపెద్ద దేశాలలో ఒకటి. ఈ దేశానికి ఉత్తరాన హోండూరస్, తూర్పున కరేబియన్ సముద్రం, దక్షిణాన కోస్టారికా, పశ్చిమాన ఫసిఫిక్ సముద్రం సరిహద్దులు. దేశ రాజధాని మనగ్యా. ఈ దేశ విస్తీర్ణం 1,30,375 చ.కి.మీటర్లు. వీరి భాష స్పానిష్ ఈ దేశ కరెన్సీ కర్డోబా. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. ప్రజలలో 72.9 శాతం మంది రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు. 15 శాతం మంది ఎవాంజిలికల్ సంప్రదాయాన్ని పాటిస్తారు 1821 సంవత్సరలో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశానికి మధ్య అమెరికా ఉష్ణమండల స్వర్గం అనిపేరు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు నికరాగ్యా. మధ్య అమెరికాలోని ప్రఖ్యాత నృత్యం పాలో డి మాయో పుట్టింది ఇక్కడే. ఇక్కడి ప్రపలు స్పానిష్, ఆంగ్ల భాషలతో పాటు కొన్ని స్థానిక భాషలను, వేల సంవత్సరాలనాటి మయాన్ భాషను కూడా మాట్లాడతారు. నికరగ్యాకు భారతదేశానికి అవినాభావ సంభందం ఉన్నది. భారతదేశం నుండి నికరాగ్యాకు వలస వచ్చిన తెగ పేరు నికరా. అగ్యా అంటే స్పానిష్ భాషలో నీళ్లు అని అర్థం. వీటి మీదే ఈ దేశానికి నికరగ్యా అనే పేరు వచ్చింది. మధ్య అమెరికా మొత్తంలో అతి ప్రాచీనమైన నగరం ఉన్నది ఈ దేశంలోనే. దీని పేరు రూయిన్స్ ఆఫ్ లియోన్ వైజో. ఇది 1500 వందల సంవత్సరాల క్రితం నాటిది. లేక్ నికరాగ్వా అతి పెద్దదైన సహజసిద్ధమైన సరస్సు. ఇందులో 430 అగ్నిపర్వత ద్వీపాలున్నాయి. అంతేకాకుండా ఇది మంచి పర్యాటక ప్రాంతం. తాగునీటిని ఎంతో మందికి అందిస్తుంది. కాఫీ, అరటిపండ్లు, చెరకు, ప్రత్తి, వరి, మొక్కజొన్న, పొగాకు, నువ్వులు, సోయాబీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, కోళ్ల పరిశ్రమ, పందిమాంసం, పాల ఉత్పత్తులు ఇతరాలు. బంగారం, వెండి, రాగి. టంగ్ స్టన్, జింక్, సీసం, కలప, చేపలు సహజ వనరులు.
Country : Panama
Capital Panama City ………. Language Spanish ………. Currency Balboa ………. Calling Code + 507 ………. Religion Roman Catholicism
పనామా…
మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. కోస్టారికా, కొలంబియా, అట్లాంటిక్ సముద్రం(కరేబియన్ సముద్రం), పసిఫిక్ మహా సముద్రాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ అధికారిక భాష స్పానిష్ అయినా ఇంగ్లిష్ ఎక్కువగా మాట్లాడతారు. వీరి అధికారిక కరెన్సీ బాల్బో. ఒక బాల్బో ఒక అమెరికన్ డాలర్‌కు సమానం. అయితే దీనికి బదులు ఇక్కడ అమెరికా డాలరే చలామణీలో ఉంటుంది. రాజధాని పనామా సిటీ మరియు అత్యంత పెద్ద నగరం కూడా. దీనిలోనే వర్షాధార అడవులూ ఉన్నాయి. ఇలాంటి అడవులున్న రాజధాని నగరం ప్రపంచంలో ఇదొక్కటే.దేశ విస్తీర్ణం 75,417 చ. కిలోమీటర్లు. ప్రజలలో రోమన్ కేథలిక్ సంప్రదాయాన్ని 85 శాతం మంది, 15 శాతం మంది ప్రొటెస్టంట్ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ దేశం రెండు స్వాతంత్య్ర దినోత్సవాల్ని జరుపుకొంటుంది. పదహారో శతాబ్దం నుంచి 1821 వరకూ స్పెయిన్ వారి అధీనంలో ఉండి అప్పుడు స్వతంత్రం పొందింది. మళ్లీ కొలంబియా పాలకుల చేతుల్లోకి వెళ్లి 1903లో స్వతంత్రాన్ని పొందింది. వస్తురవాణా ఓడలు, పెట్రోలియంని శుద్ధి చేసి ఎగుమతి చేయడం, పర్యాటకం..పనామా ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి. దాదాపుగా 1500మైళ్ల తీర రేఖ ఉంది. ఈ దేశం ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. అధ్యక్షుడిని ఎన్నుకోడానికి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. పనామా ఉష్ట మండల దేశం. ఎత్తయిన పర్వతాలు, అందమైన ఇసుక బీచ్‌లతో ఉంటుంది. విదేశీయులూ ఇక్కడ ఇళ్లు కొనుక్కునేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే స్థానిక చట్టాల ప్రకారం ఇక్కడ విదేశీయులు ఎవరైనా ఇళ్లు కొనుక్కోవచ్చు. పెట్టుబడులూ పెట్టొచ్చు. రెండు మహా సముద్రాల మధ్యలో అతి సన్నగా ఉన్న ఇక్కడి. భూభాగం పొడవు 80 కిలోమీటర్లు. ఇక్కడ ఉన్న చోట నుంచే పసిఫిక్ మహా సముద్రంలోంచి సూర్యోదయాన్ని అట్లాంటిక్ మహా సముద్రంలో సూర్యాస్తమయాన్ని వేరువేరు సమయాల్లో చూడవచ్చు. ఇలాంటి దృశ్యం కనిపించే దేశం ప్రపంచంలో ఇదొక్కటే. నట్ కార్వింగ్ ఇక్కడ ప్రసిద్ధి చెందిన కళ. చిన్న గింజలపై రకరకాల ఆకారాలు చెక్కి వాటిని అమ్ముతారు. సముద్ర జీవులు, మాంసం, గుడ్డు, గోధుమపిండిని ఉపయోగించి చేసుకునే వంటల్ని ఇక్కడ ఎక్కువగా తింటారు. గుడ్డు ఆమ్లెట్లో మాంసం కూరి చేసే ఫ్రైడ్ యోకాని వీరు ఇష్టంగా తింటారు ఈ దేశంలో ప్రధానంగా రెండే కాలాలు. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకూ డ్రై సీజన్ అని, మే నుంచి నవంబర్ వరకూ రెయినీ సీజన్ అనీ పిలుస్తారు. అయితే వర్షపాతం అధికం. చాలా సార్లు హారికేన్ల తాకిడి వల్ల ఎక్కువగా నష్టపోతుంటుంది. ఇక్కడ పది వేలకుపైగా మొక్క జాతులు, పద్నాలుగు వందల రకాల ఆర్కిడ్లు, పదిహేను వందల రకాలకుపైగా వృక్ష జాతులూ ఉన్నాయి. మొత్తం 976 పక్షి జాతులు ఉన్నాయి. అమెరికా, కెనడాల్లో ఉన్న పక్షిజాతుల సంఖ్య కంటే ఇదే ఎక్కువట. అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రాల మధ్య కృత్రిమంగా నిర్మించినదే పనామా కాలువ. ఈ రెండు సంద్రాల మధ్యలో ఓడల ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ దేశం గుండా ఈ కాలువను ఏర్పరచారు. రెండు మహా సముద్రాల మధ్య దీని ద్వారా ఓడలు తిరుగుతాయి. ఈ కాలువ పై మూడు లాకులు ఉన్నాయి. ఓడలు వచ్చినప్పుడల్లా వాటి గేట్లను పైకెత్తుతారు. దీని నుంచి వెళ్లేందుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది. ఈ దారి తెరుచుకున్నప్పుడు అంటే 1914లో ఏడాదికి వెయ్యి ఓడలు దీని ద్వారా ప్రయాణించేవి. అయితే 2012 లెక్కల ప్రకారం ఆ సంఖ్య ఇప్పుడు ఎనిమిది లక్షల పై చిలుకుకు చేరింది. ఈ కాలువ ద్వారా వెళ్లే ఓడలన్నీ ఈ దేశానికి టోల్ కట్టాల్సి ఉంటుంది. ఓడను బట్టి, ప్రయాణికుల సంఖ్యను బట్టి టోల్ ఫీజు నిర్ణయిస్తారు. ఈ టోల్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కోట్లలో కూడా ఉంటాయి. అరటిపండ్లు, వరి, మొక్కజొన్న, కాఫీ, చెరకు కూరగాయలు పండిస్తారు. పశు సంపద కలదు. రాగి, మహాఘని అడవులు, రొయ్యలు, హైడ్రోపవర్ సహజ సంపదలు.
Country : Saint Kitts and Nevis
Capital Basseterre ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + +1 869 ………. Religion Christian
సెయింట్ కిట్స్ – నెవిస్
ఈ దేశం కరేబియన్ సముద్రంలో ఉన్న రెండు చిన్న దీవులు. జనభా పరంగా, వైశాల్యం పరంగా ఉత్తర అమెరికాలో చిన్నవి. 1493 సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఈ దీవుల ఉనికిని కనిపెట్టాడు. 1623 సంవత్సరంలో ఇంగ్లీష్ వారు ఈ దీవులలో ప్రవేశించి దీనిని బ్రిటీష్ కాలనీగా మార్చారు. కరేబియన్ దీవులలో మొదటి బ్రిటీష్ కాలనీ ఇదే. తరువాత ఈ దీవుల మీద ఆదిపత్యం కోసం బ్రిటీష్ మరియు ఫ్రెంచ్ వారి మద్య చాలా సంవత్సరాల పాటు ఖర్షణ జరిగింది. కానీ ఈ దీవుల మీద బ్రిటీష్ వారి ఆధిపత్యం కొనసాగింది. చివరకు 1983 సంవత్సరంలో ఈ దీవులు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొన్నాయి. ఈ దేశ విస్తీర్ణం269 చ.కి.మీ. రాజధాని బస్సే-టెర్రే. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు నీగ్రోజాతికి చెందినవారు 90 శాతం మంది ఉన్నారు. భారతీయులు 3 శాతం మంది, సంకరజాతులు 5 శాతం మంది ఉన్నారు. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. 76 శాతం మంది క్రైస్తవాన్ని అనుసరిస్తారు. వీరి కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్. చెరకు, కొబ్బరి, పండ్లు, వేరుశెనగ, చేమదుంపలు, వరి,అరటి, ప్రత్తి పంటలను సాగుచేస్తారు. పశుపోషణ, మత్స్యపరిశ్రమలు కలవు. పంచదార, మొలాసిస్ ముఖ్యమైన పరిశ్రమలు. వ్యవసాయ యోగ్యమైన భూములు కలవు.
Country : Saint Lucia
Capital Castries ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + +1 758 ………. Religion Roman Catholic
సెయింట్ లూసియా…
సెయింట్ లూసియా కరేబియన్ సముద్రంలో ఒక ద్వీపదేశం. మొదటగా అమెరికన్లు ఈ దీవులలో నివాసం ఏర్పరుకున్నారు. తరువాత ఈ దీవి కరీబియన్ల అధికారంలోకి వెళ్లింది. 15, 16 వ శతాబ్ధాలలో స్పానిష్ వారు కూడా ఈ దీవులలోకి వచ్చారు. 1815 సంవత్సరంలో బ్రిటీష్ వారు ఈ దీవులకు వచ్చి పంచదార పరశ్రమను స్తాపించారు. 1979 సంవత్సరలో ఈ దేశం తెల్ల వారి నుండి పూర్తి స్వాతంత్రం సంపాదించుకుంది. ఈ దేశ రాజధాని కాస్త్రీస్. ఈ దేశ వైశాల్యం 617 చ.కి.మీ. వీరి భాష ఇంగ్లీష్. ఫ్రెంచ్ పెష్యో. ప్రజలు నీగ్రో జాతికి చెందినవారు. ఇది క్రైస్తవ మతానికి చెందిన దేశం. అరటి, మామిడి, కొబ్బరి, చిలగడ దుంపలు, నారింజ, కోకో, అల్లం, కూరగాయలు ముఖ్యమైన పంటలు. అరటి పండ్లను ఎగుమతి చేస్తారు. పశువుల పెంపకం చేపల వేట. ప్రజల జీవనోపాధి. కాగితం, బోర్డు, పానీయాలు, ఆటవస్తువులు ముఖ్యమైన పరిశ్రమలు.
Country : Saint Vincent and the Grenadines
Capital Kingstown ………. Language English ………. Currency East Caribbean dollar ………. Calling Code + +1 784 ………. Religion Christian
సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్…
కరేబియన్ సముద్రంలోని వెస్ట్ ఇండీస్ లో ఉన్న ఒక ద్వీపదేశం ఇది. 1979 సంవత్సరంలో స్వాతంత్రం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 369 చ.కి.మీ. ఈ దేశ రాజధాని కింగ్స్ టౌన్. వీరి భాష ఇంగ్లీష్. వీరి కరెన్సీ ఈస్ట్ కరేబియన్ డాలర్. 74 శాతం మంది నీగ్రో జాతులకు చెందినవారు. ఇది క్రిస్టియన్ దేశం. అరటి, కొబ్బరి, చిలకడ దుంపలు, అరటి వ్యవసాయ ఉత్పత్తులు. గొర్రెలు, మేకలు, పశువుల పెంపకం కలదు. హైడ్రోపవర్, వ్యవసాయ భూములు సహజ సంపదలు.
Country : Trinidad and Tobago
Capital Port of Spain ………. Language English ………. Currency Trinidad and Tobago Dollar ………. Calling Code + +1 (868) ………. Religion Christian/Hindu
ట్రినిడాడ్ మరియు టుబాగో….
వెస్ట్ ఇండీస్ దీవులలో ప్రధానమైన ద్వీప దేశం ఇది. ఒకప్పుడు బ్రిటీష్ వారి వలసరాజ్యం. 1962 సంవత్సరంలో స్వాతంత్రం సంపాదించుకొని 1976 సం.లో గణతంత్ర రాజ్యంగా మారింది. ఈ దేశ విస్తీర్ణం 5,124 చ.కి.మీ. రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్. వీరి భాష ఇంగ్లీష్. ప్రజలు నీగ్రో జాతి వారికి చెందినవారు. రెడ్ ఇండియన్స్ కూడా ఉన్నారు. కేధలిక్స్ 26 శాతం మంది హిందువులు 22.5 శాతం మంది మిగతా వారు అనేక జాతులకు చెందినవారు. ఈ దేశంలో క్రిస్టియన్స్ మరియు హిందువులు దాదాపు సమానంగా ఉన్నారు. చెరకు, నిమ్మ, కోకో, వరి, కాఫీ, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. కోళ్ల పరిశ్రమ కలదు. పెట్రోలియం, సహజవాయివు, ఆస్పాల్ట సహజ వనరులు. అందమైన ప్రకృతి దృశ్యాలతో విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న పర్యాటక దేశం.
Country : United States of America
Capital Washington, D.C. ………. Language English ………. Currency United States dollar ………. Calling Code + 1 ………. Religion Christian
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ప్రపంచంలోనే ఆగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికా ఉత్తర అమెరికా ఖండంలోని దేశం. మొత్తం 50 రాష్ట్రాలతో ఉండే ఈ దేశానికి ఉత్తర దిశలో కెనడా, దక్షిణ దిశలో మెక్సికో దేశాలు భూ సరిహద్దులు. దీన్ని అమెరికా అనీ, యూఎస్ఏ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనీ పిలుస్తారు. ఈ దేశం ఒకప్పుడు బ్రిటీష్ కాలనీ 1776 సంవత్సరంలో గ్రేట్ బ్రిటన్ నుండి స్వాతంత్రం సంపాదించుకుం. అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి. జనాభా 32,53,65,189. వైశాల్యం 98,33,520 చదరపు కిలోమీటర్లు. వైశాల్యపరంగా ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశమిది. కరెన్సీ డాలర్. ఈ దేశంలో ఎక్కువగా ఆంగ్లమే మాట్లాడుతారు. ప్రభుత్వం కూడా ఈ భాషనే వాడుతుంది. కానీ ఈ దేశానికి అధికారిక భాష మాత్రం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది. ఈ దేశం మొత్తంలో ఎక్కువమంది జనాభా ఉన్న రాష్ట్రం న్యూయార్క్. . ప్రఖ్యాత నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాను 1492లో ఈ దేశం యొక్క ఉనికిని కనుగొన్నాడు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘న్యూ వరల్డ్’ అని పిలుచుకునేవారు. కొలంబస్ను అనుసరించిన మరో నావికుడు ‘అమెరిగో వెస్పు’ ఈ ప్రాంతం గురించి చాలా పుస్తకాలు రాశారు. ఆయన పేరుమీదుగానే ఈ దేశానికి ‘అమెరికా’ అనే పేరు స్థిరపడింది. . దక్షిణ కరోలినా తీరంలో మొత్తం కోతులతో నిండిన ఒక ద్వీపం ఉంది. పిజ్జా ఇక్కడి వారి ఇష్టమైన ఆహారం. వీరు ఒక్క రోజులో తినే పిజ్జాలు 100 ఎకరాల్లో సరిపోతాయి. ప్రతి సెకనుకు 100 పౌండ్ల చాక్లెట్లు తినేస్తారు దాదాపు 46 కిలోలు. అమ్యూజ్మెంట్ పార్కులో ఉండే ఫెర్రిస్ వీల్ ను ఈ దేశానికి చెందిన జార్జ్ వాషింగ్టన్ గాలె ఫెర్రిస్ అనే ఆయన కనిపెట్టారు. విద్యుద్దీపం, ఏసీ, విమానం వంటి ఎన్నో ప్రముఖ ఆవిష్కరణలయ్యింది ఈ దేశంలోనే. వీటితో పాటు జిప్, ట్రాఫిక్ సిగ్నల్, మైక్రోఓవెన్, ఎల్ఈడీ లైట్లు పుట్టిందీ ఇక్కడే. నయాగరా జలపాతం, మిస్సిసీపీ నది అమెరికా పేరు వినగానే గుర్తొచ్చే ప్రకృతి అందాల ప్రాంతాలు. అమెరికా అనగానే లిబర్టీ విగ్రహం గుర్తుకు వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ లిబర్టీ విగ్రహం స్వేచ్ఛను చాటుతుంది. దీన్ని ఫ్రాన్స్ బహుమతిగా ఇచ్చింది. యు.ఎస్.ఎ. ఏర్పడి వందేళ్లయిన సందర్భంగా రూపు దిద్దుకున్న ఈ విగ్రహాన్ని 1886లో నిల బెట్టారు. దీనిని ప్రఖ్యాత శిల్పి ఆగస్టీ బార్థోల్డి రూపొందించారు జీన్ ప్యాంట్ కనిపెట్టబడింది అమెరికాలోనే. లేవీ స్ట్రాస్, జాకోబ్లు తయారు చేశారు. గట్టిగా ఉండే డెనిమ్ వస్త్రంతో 1873లో మొదటి జీన్స్ దుస్తులు తయారు చేశారు. అమెరికాకు అలస్కా రాష్ట్రాన్ని 1867లో రష్యా అమ్మింది. రెండు సెంట్లకు ఒక ఎకరం చొప్పున. ఈ దేశంలోని రాష్ట్రాల్లో అలస్కానే పెద్దది.
Capital Canberra ………. Language English ………. Currency Australian Dollar ………. ……… Calling Code +. 61 ………. Religion Christian
ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా ఖండం భూభాగాలతో పాటు టస్మానియా మరెన్నో ద్వీపాలతో ఉన్న దేశం. ఈ దేశానికి సరిహద్దులు పపువా, న్యూగినియా, ఇండోనేషియా, తూర్పు తిమోర్ , సాలమన్ ద్వీపాలు, పనాటూ, న్యూజిలాండ్ దేశాలు.ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రా. ఈ దేశ విస్తీర్ణం 76,92, 024 చ. కి.మీటర్లు. వీరి కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. అధికారిక భాష ఆంగ్లం. ఆస్ట్రేలియా క్రిస్టియన్ దేశం. విస్తీర్ణపరంగా చూస్తే ప్రపంచంలో ఆరో పెద్ద దేశం. ఈ దేశంలో క్రీయాశీలక అగ్నిపర్వతం ఒక్కటికూడా లేదు. ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాములు 15 జాతులలో 10 రకాలు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. పర్యాటకపరంగా అతి పెద్ద సముద్రతీరం కలిగి ఉన్న దేశం ఆస్ట్రేలియా. పదివేలకు పైగా బీచ్ లు ఉన్నాయి. ఆస్ట్రేలియా అనగానే వెంటనే కంగారులు గుర్తుకు వస్తాయి. ఇక్కడ ఉన్న కంగారులలో 60 జాతులున్నాయి. ఈ దేశ జనాభాకన్నా కంగారుల సంఖ్యే ఎక్కువ. గొర్రెల పెంపకం కూడా ఇక్కడా ఎక్కువే. 150 మిలియన్ల గొర్రెలున్నాయి. ఇవి కూడా ఈ దేశ జనాభాకన్నా ఎక్కువే. ప్రపంచంలోనే అతి పెద్ద గోల్ఫ్ మైదానం ఉన్నది. దీని పొడవు 850 మైళ్లు. గోధుమలు, బార్లీ, చెరకు, పండ్లు పండిస్తారు. పశువుల పెంపకం, గొర్రెల పెంపకం, కోళ్లపెంపకం కలదు. బాక్సైట్, బోగ్గు, ఇనుప ఖనిజం, బంగారం, వెండి, యురేనియం, నికెల్, టంగ్ స్టన్, జింక్, వజ్రాలు, సహజవాయువు, పెట్రోల్ సహజ. నిక్షేపాలు.
Country : Fiji
Capital Suva ………. Language English ………. Currency Fijian Dollar ………. ……… Calling Code +. 679 Religion Christian/Hindu
ఫిజీ దీవులు….
‘ఫిజీ’ అనే ఈ ద్వీప దేశం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. మొత్తం 322 ద్వీపాల సమూహంతో ఈ దేశం ఏర్పడింది. 332 ద్వీపాల్లో 110 ద్వీపాల్లో మనుషులు నివసించడం లేదు. ఆస్ట్రేలియాకు ఈశాన్య దిశలో.. దక్షిణ అమెరికాకు పశ్చిమ దిశలో ఉన్న పసిఫిక్ మహా సముద్రం నడుమ ఈ ద్వీపాలున్నాయి. ఇక్కడ నివసించే జనాభాలో 38 శాతం మంది భారతీయులే. దేశ సాంప్రదాయాలను ఇక్కడ పక్కగా పాటిస్తారు. హిందూ దేవాలయాలను చాలా చోట్ల చూడవచ్చు. ఫిజీ రాజధాని సువా. ఇక్కడ ఇంగ్లీష్, బు ఫిజీ, హిందీ భాషలు మాట్లాడతారు. దేశ వైశాల్యం 18,270 చ.కి.మీ. 52 శాతం మంది క్రిస్టియన్లు, 38 శాతం మంది హిందువులు, 8 శాతం మంది ముస్లింలు ఈ దేశంలో కలరు. బ్రిటీష్ వారి నుంచి విముక్తి పొందినా.. ఆ దేశం జెండాలను మార్చలేదు. ఇక్కడ ఇంకా క్వీన్ ఎలిజిబెత్ -2 చిత్రాలు ఉన్న నోట్లు, నాణాలనే నగదుగా వాడుతున్నారు. ఇక్కడ చాలామంది ప్రజలు ఇండియా, ఇండో-ఫిజిన్స్. వీరంతా ప్రధాన ఐలాండ్ విటి లెవులో నివసిస్తున్నారు. ఫిజీలో హిందూ, క్రిస్టియన్ జనాభా ఎక్కువ 1874లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ దీవులను ఆక్రమించింది. ఈ దేశంలో చెరకు తోటల్లో పనిచేసేందుకు భారతీయ కూలీలను ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కడ భారత సంతతి జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. 1970లో బ్రిటీషు ప్రభుత్వం ఫిజీకి స్వాతంత్ర్యాన్నిచ్చింది. అప్పటి నుంచి ఈ దేశాన్ని ‘రిపబ్లిక్ ఆఫ్ ది ఫిజీ ఐలాండ్స్’ అని పిలుస్తున్నారు. ఇక్కడ ‘బులా’ అంటే ‘హలో’ అని అర్థం. అక్కడ అడుగుపెట్టే పర్యటకులను స్థానికులు ‘బులా’ అని పలకరిస్తారు. ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. ఈ ద్వీపంలోని విటీ ద్వీపంలో దాదాపు 8,00,000 మంది ప్రజలు జీవిస్తున్నారు. చూట్టు సముద్రం.. మధ్యలో కొండలు, తీర ప్రాంతాలతో ఫిజీ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడి ప్రజలు FIJIని ‘ఫన్ ఇన్ జంగిల్ ఐలాండ్’ అంటారు. . ఫీజిలోని నది ప్రాంతంలో ఉన్న శ్రీ శివ సుబ్రహ్మణ్య ఆలయం ఇక్కడికి వచ్చే భారతీయ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఫీజీలో స్థిరాస్తి వ్యాపారాలనేవి కనిపించవు. ఎందుకంటే అక్కడ 80 శాతం భూములు గ్రామ సంఘాల ఆధీనంలోనే ఉంటాయి. కేవలం పది శాతం స్థలాలను మాత్రమే విక్రయాలు, కొనుగోలుకు అనుకూలంగా ఉంటుంది. మిగతావి నివాస స్థలాలు. ఇక్కడ మట్టి రూపంలో ఉండే ద్రవాన్ని జాతీయ డ్రింక్‌గా తాగుతారు. చూసేందుకు ఇది బురద రూపంలో ఉంటుంది. ఈ ద్రవం తాగితే ఒత్తిడి, ఇన్సోమ్నియా, తలనొప్పి తగ్గుతుంది. ఇక్కడి ప్రజలు ఇక్కడ రగ్బీ ఆడతారు. ప్రజలు ఎక్కువగా మాంసం, చేపలను ఆహారంగా తీసుకుంటారు. ఫిజీకి కేవలం విమానాల్లో మాత్రమే వెళ్లాలి. భారతదేశంలోని ముంబయి నుంచి ఫిజీకి విమానాలు అందుబాటులో ఉన్నాయి. చెఱకు, కొబ్బరికాయలు, కర్రపెండలం దుంపలు, వరి, బంగాళా దుంనలు, అరటికాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పశువులు, పందులు, గుర్రాలు, గొర్రెలను పెంచుతారు. కలప, బంగారం, చేపలు సహజ సంపదలు
Country : Kiribati
Capital Tarawa ………. Language English/Gilbetese ………. Currency Kiribati dollar/Australian dollar ………. ……… Calling Code +. 686 Religion Christian
కిరిబటి
కిరిబటి… పసిఫిక్సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీప దేశం. 33 దీవులతో ఉండే ఈదేశంలో 21 దీవుల్లో మాత్రమే జనాలుంటారు. ఈ దేశం భారతదేశంలోని హైదరాబాద్‌కన్నా కాస్త పెద్దగా ఉంటుంది. దేశం మొత్తంలో లక్ష మందికి పైగా ప్రజలుంటారంతే. కిరిబటి రాజధాని తరవా. ఈ దేశ విస్తీర్ణం 811 చదరపు కిలోమీటర్లు వీరి అధికార భాషలు ఆంగ్లం, గిల్బర్టీస్. కరెన్సీ ఆస్ట్రేలియన్డాలర్. రాజధాని తరవా, గిల్బర్టే దీవుల్ని 1941లో మొదటి సారిగా జపనీయులు కనిపెట్టారు. జనాభా మొత్తంలో 90 శాతం మంది గిల్బర్టే ద్వీపంలో ఉంటారు. 1979 జులై 12వ తేదీన బ్రిటీష్ వారినుండి ఈ దేశం స్వాతంత్ర్యం సంపాదించుకుంది, దేశ ప్రజలలో 52 శాతం మంది క్రిస్టియన్లు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పగడపు దీవులతో (కోరల్‌రీఫ్స్) ఉన్న దేశం ఇదే. దేశంలో సగం పగడపు దీవులే ఉంటాయి. ఈ దేశంలో సముద్రమట్టానికి ఎక్కువ ఎత్తులో ఉన్న ఏకైక ద్వీపం బనబా. ఇది 266 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ దేశంలోని దీవుల్లో చాలావరకు సముద్ర మట్టానికి మూడు నుంచి ఆరు అడుగుల ఎత్తులో మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 1999లో టెబువా తరవా, అబనువా అనే చిన్నద్వీపాలు మునిగిపోయాయి కూడా. మరో 50 ఏళ్లలో ఈ దేశం కూడా మునిగిపోతుందని అనుకుంటున్నారంతా. అందుకే ఈ దేశ ప్రజల్ని వేరే దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దేశంలో క్రిస్మస్దీవి వైశాల్య పరంగా ప్రపంచంలో అతి పెద్దది. ఈ దీవుల్లో క్రీస్తుపూర్వం 3000, క్రీస్తుశకం 1300 మధ్య కాలంలో మైక్రోనీషియన్స్అనే జాతి వారుండేవారట. కిరిబటి ప్రముఖ వేడుక ఏటా మార్చినెలలో జరిగే యప్డే ఫెస్టివల్. చేపల ఎగుమతి, పర్యాటకం ద్వారా ఈ దేశానికి ఆదాయం వస్తుంది.
Country : Marshal Islands
Capital Majuro ………. Language Marshallese/English ………. Currency US Dollar ………. ……… Calling Code +. 692 Religion Christian
మార్షల్ ఐల్యాండ్స్…..
పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపరాజ్యం మార్షల్ ఐల్యాండ్స్. 1986 అక్టోబర్ 21న స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ రాజధాని మజురో. మార్షలీస్ వీరి అధికార భాష. వీరి కరెన్సీUS డాలర్స్. ఈ దేశ విస్తీర్ణం 11,854 చ.కి.మీ. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. కొబ్బరి, టమాటోలు, మెలన్, టారో దుంపలు, పండ్లు వ్యవసాయ ఉత్పత్తులు. పందులు, కోళ్లను పెంచుకుంటారు. కొబ్బరి ఉత్పత్తులు, సముద్రపు ఉత్పత్తులు, సముద్రపు మినరల్స్ వీరి సహజ సంపదలు.
Country : Micronesia
Capital Palikir ………. Language English ………. Currency US Dollars ………. ……… Calling Code +. 691 Religion No Religion
మాక్రోనేసియా…
మాక్రోనేసియా పశ్చిమ పసిఫిక్ సముద్రతీరాన గల 600 దీవులతో ఏర్పడిన దేశం. ఈ దేశ రాజధాని పాలికిర్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు మాట్లాడే ఇతర భాషలు Trukese, Pohnpeian, Yapese, Kosrean, Ulithian, Woleaian, Nukuoro, Kapingamarangi. ఈ దేశ కరెన్సీ అమెరికన్ డాలర్స్. ఈ దేశ ప్రజలలో రోమన్ కేథలిక్స్ 50 శాతం, ప్రొటెస్టంట్లు 47 శాతం, ఇతరులు 3 శాతం మంది కలరు. ఈ దేశ వైశాల్యం 702 చ.కి.మీ. 1986 నవంబర్ 3న ఈ దేశం స్వాతంత్ర్యం సంపాదించుకుంది. నల్లమిరియాలు, కొబ్బరి, కర్రపెండలం, ఉష్టమండలానికి సంబంధించిన పండ్లు, కూరగాయలు, బంగాళాదుంపలు వ్యవసాయ ఉత్పత్తులు. పందుల పెంపకం, కోళ్లపెంపకం కలదు. చేపలు విరివిగా దొరకుతాయి. అడవులు, సముద్రపు ఉత్పత్తులు, పాస్ఫేట్ సహజసంపదలు.
Country : Nauru
Capital Yaren ………. Language Nauruan/English ………. Currency Australian dollar ………. ……… Calling Code +. 674 Religion Christian
Country : New Zealand
Capital Wellington ………. Language English ………. Currency New Zealand dollar ………. ……… Calling Code +. 64 Religion Christian
న్యూజిల్యాండ్….
ఆస్ట్రేలియాకు ఆగ్నేయ దిశలో దాదాపు 2000 కి.మీ దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీపరాజ్యం. న్యూజీల్యాండ్ రాజధాని వెల్లింగ్ టన్. వీరి అధికార భాష ఇంగ్లీష్. దేశ విస్తీర్ణం 2,67,515 చ. కి.మీటర్లు. కరెన్సీ న్యూజీల్యాండ్ డాలర్స్. ఆక్లాండ్, క్రీస్ట్ చర్చ్ ఇతర ముఖ్యపట్టణాలు. న్యూజీల్యాండ్ క్రిస్టియన్ దేశం. న్యూజిల్యాండ్ ప్రజల ప్రధాన వృత్తి పాడి పరిశ్రమ. గొర్రెలను పెంచి ఉన్ని, మాంసాన్ని ఎగుమతి చేస్తారు. అనేక రకాల పాల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మత్స్యపరిశ్రమ చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. జవుళీ పరిశ్రమ మొటారు కారుల తయారీ, కాగితం పరిశ్రమలు ఉన్నాయి. గోధుమ, బార్లీ, బంగాళాదుంపలు, మొక్కజొన్న, ఓట్ ధాన్యం పండిస్తారు. జలవిద్యుత్ ఉత్పత్తి ఎక్కువ. పారిశ్రామికంగా అభివృద్ది చెందిన దేశం.
Country : Palau
Capital Ngerulmud ………. Language English, Palauan ………. Currency US Dollar ………. ……… Calling Code +. 680 Religion Christian
పలావ్
పలావ్ ఫిలిఫైన్స్ కు ఆగ్నేయ దిశలో 500 మైళ్ల దూరంలో ఉన్న ద్వీపరాజ్యం. 200 ద్వీపాల సమూహం. 1994 సంవత్సరంలో అమెరికా నుండి స్వాతంత్ర్యం పొందినది. ఈ దేశ రాజధాని Koror. వైశాల్యం 458 చ.కి.మీ. ప్రజలలో ఎక్కువ మంది రోమన్ కేథలిక్స్ మరియి ప్రొటెస్టంట్లు. వీరి కరెన్సీ అమెరికన్ డాలర్స్. వీరి అధికార భాష Palauan. కొబ్బరి, కర్రపెండలం, చిలకడ దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు. చేపలు దొరకుతాయి. అడవులు, సముద్రపు ఉత్పత్తులు, బంగారం, మినరల్స్ సహజ సంపదలు. ఈ దేశం పర్యాటక పరంగా కూడా పేరుపొందినది. ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలతో కనువిందు చేస్తుంది. పర్యాటకం ద్వారా ఈ దేశానికి ఆదాయం వస్తుంది.
Country : Papua New Guinea
Capital Port Moresby ………. Language Hiri Motu Tok Pisin ………. Currency Papua New Guinean ………. ……… Calling Code +. 675 Religion Christian
పపువా న్యూ గినియా
పపువా న్యూగినియా ఒక దీవి. ప్రజలు 850 భాషలకు పైనే మాట్లాడుతారు. అంటే ప్రపంచ భాషల్లో పదో వంతు భాషలు మాట్లాడేది ఇక్కడే. అధికారిక భాష ఆంగ్లమే అయినా ఎక్కువగా స్థానిక భాషలే చలామణిలో ఉంటాయి. ఈ దేశ రాజధాని పొర్ట్మెర్సిబ్ జనాభా 80,83,700 (2018) ఈ దేశ విస్తీర్ణం 4,62,840 చదరపు కిలోమీటర్లు కరెన్సీ పపువా న్యూ గినియా కినా(పీజీకే). పట్టణాల్లో ఉండేవారు కేవలం పద్దెనిమిది శాతం మందే. 1933 వరకు సముద్రపు గవ్వల్ని కరెన్సీగా వాడేవారు. ఎక్కువమంది క్రిస్టియన్లు. జెండాలో బంగారు వర్ణంలో ఉండే ప్యారడైజ్పక్షి బొమ్మ స్థానిక గిరిజనులకు చిహ్నం. 1971లో ఈ జెండాను 15 ఏళ్ల సుసాన్అనే అమ్మాయి రూపొందించింది. ప్రపంచంలోనే తొలిసారిగా వ్యవసాయం చేసిన దేశాల్లో ఇదీ ఒకటి. సుమారు ఆరున్నర వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ పంటలు పండించిన ఆధారాలున్నాయి. ఇక్కడి ‘కుక్’ అనే వ్యవసాయ క్షేత్రం పురాతనమైనది. ప్రపంచ వారసత్వపు జాబితాలో చేర్చారు. ఇక్కడ బర్డ్ఆఫ్ప్యారడైజ్పక్షులతో పాటు 750కి పైగా ఇతర పక్షి జాతులున్నాయి. ప్రపంచంలోనే విషపూరితమైన పక్షి హుడెడ్పితోహు ఈ ప్రాంతానికి చెందినదే. కాఫీ, కోకో, టీ ఆకులు, చెరకు, బంగాళా దుంపలు, పండ్లు, రబ్బర్, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు బంగారం, రాగి, వెండి, సహజవాయులు ఈ దేశంలో లభించే ఖనిజ నిక్షేపాలు.
Samoa
Capital Apia ………. Language Tala ………. Currency Samoan/English ………. ……… Calling Code +. 685 Religion Christian
సమోవా
సమోవా పసిఫిక్ సముద్రానికి దక్షిణ దిశలో ఉన్న ద్వీపరాజ్యం. ఈ దేశం రెండు భాగాలుగా విభజింపబడింది. తూర్పు సమోవాను అమెరికన్లు ఆక్రమించారు. ఈ ప్రాంతాన్ని అమెరికన్ సమోవా అంటారు. పశ్చిమ భాగాన్ని జర్మన్లు ఆక్రమించారు. దీనిని జర్మన్ సమోవా అంటారు. 1962 సంవత్సరంలో సమోవా స్వతంత్రదేశంగా అవతరించింది. సమోవా రాజధాని అపివా. దేశ వైశాల్యం 2,944 చ.కి.మీ. వీరి అధికార భాష సమోవాన్ మరియు ఇంగ్లీష్. వీరి కరెన్సీ తాలా. ఈ దేశం క్రిస్టియన్ దేశం. కొబ్బరి, అరటి, టారో దుంపలు(చేమదుంపలు), కాఫీ, కోకోవా, చిలకడ దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు.
Country : Solomon Islands
Capital Honiara ………. Language English ………. Currency Solomon Islands dollar ………. ……… Calling Code +. 677 Religion Christian
సోలమన్ ఐలాండ్స్
పసిఫిక్ మహా సముద్రంలో దక్షిణాన ఉన్న ద్వీపదేశం సోమన్ ఐల్యాండ్స్. ఆస్ట్రేలియాకు ఈశాన్యంవైపు ఉండే దీవులివి. పవునా న్యూగినియా, వనాటూలు పొరుగు దేశాలుగా ఉన్నాయి. దీనిలో దాదాపుగా వెయ్యి ద్వీపాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఆరు. అవి చోయ్‌సల్, గౌడాల్‌కెనాల్, మలైటా, మకైరా, న్యూజార్జియా, శాంటాఐస్‌బల్‌లు. ఈ దేశం 1978లో గ్రేట్ బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందింది. సోలమన్ ఐలాండ్స్ రాజధాని హోనియారా ఈ దేశ విస్తీర్ణం 28,400 చదరపు కిలోమీటర్లు జనాభా 5,23,000. (2018) వీరి అధికార భాష ఆంగ్లం . కరెన్సీ సోలమన్ ఐలాండ్స్ డాలర్. ఒక సోలమన్ ఐలాండ్స్ డాలర్ దాదాపుగా మన కరెన్సీలో ఎనిమిది రూపాయలకు సమానం వీరి అధికారిక భాష ఆంగ్లమే అయినా దాన్ని మాట్లాడేవారు దాదాపుగా ఒకటి నుంచి రెండు శాతం మంది మాత్రమే. ఇక్కడ 120 వరకు స్థానిక భాషలున్నాయి. వాటిల్లోనే వీరు ఎక్కువగా సంభాషణలు జరుపుతారు. స్థానికుల్ని మెలనేషియన్లు అంటారు. వీరే ఇక్కడ 94.5శాతం మంది ఉంటారు. మిగిలినవారిలో చైనీయులు, యూరోపియన్లు, మైక్లోనేషియన్లు ఉన్నారు. రాజధాని హోనియారా ఇక్కడి గౌడాల్‌కెనాల్ ద్వీపంలో ఉంది. ఈ దేశంలో అత్యంత ఎత్తయిన చోటుకూడా ఈ ద్వీపంలోనే ఉంది. దాన్ని ఉల్ట్రాపీక్ అని పిలుస్తారు. ఇది సముద్రమట్టానికి 2300మీటర్ల ఎత్తులో ఉంది. దేశంలో 90శాతం దట్టమైన అడవులే. ఎత్తయిన పర్వతాలు, లోయలు, పగడపుదిబ్బలకు ఈ దేశం పెట్టిందిపేరు. ఈ దేశం ఉష్ణమండల ప్రాంతం. డిసెంబర్ నుంచి మార్చి వరకు వేడిగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి నవంబరు వరకు చల్లగా ఉంటుంది. ఈ దేశానికి 5,313 కిలోమీటర్ల తీర రేఖ ఉంది. దాదాపు 30,000సంవత్సరాల క్రితం పపువా న్యూగినియా నుంచి కొందరు వచ్చి తొలిసారిగా ఇక్కడ స్థిరపడ్డారని చెబుతారు. ఈ దేశానికి మిలటరీనే లేదు. కేవలం 500మంది గల పోలీసుదళం ఉంది. సరిహద్దుల్లో కాపలానూ వారే కాస్తారు. నివాసాలకోసం ఇక్కడ కృత్రిమంగా ద్వీపాలనూ ఏర్పాటు చేసుకుంటారు. రాళ్లను ఒకదగ్గరకు చేర్చికదలకుండా చేసి వాటిపై నివాసాలు ఏర్పరుచుకుంటారు. చదువు ఎవరికీ నిర్బంధం కాదు. ఇక్కడి ఆర్నవన్ ద్వీపాలు అంతరించిపోతున్న హౌకిస్బిల్ తాబేళ్లకు నెలవులు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు నీటి మడుగుల్లో ఒకటైన మరోవో ఇక్కడి న్యూజార్జియా దీవిలో ఉంది. 700చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. పగడపు దిబ్బలుండటంతో దీన్ని సంరక్షిత ప్రాంతంగా చేశారు. పగడపు దిబ్బలతో ఏర్పడ్డ ప్రపంచంలోనే అతిపెద్ద దీవి ఈస్ట్ రెన్నెల్స్ ఇక్కడే ఉంది. ఈ దేశంలో 61రకాల ఉభయచరాలు, 163 రకాల పక్షులు, 53 రకాల క్షీరదజాతులున్నాయి. దాదాపుగా 230 రకాల ఆర్కిడ్లు, ఇతర ఉష్ణమండల పూలు కనిపిస్తాయి. కొకొవా, కొబ్బరి, వరి, బంగాళాదుంపలు, పామ్తోటల్ని ఎక్కువగా సాగు చేస్తారు. పశువులు, పందుల్ని పెంచుతారు. కలప, చేపలు, పామాయిల్‌లను ఎక్కువగా ఎగుమతి చేస్తారు. చైనా, థాయిలాండ్, జపాన్, న్యూజీలాండ్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాలతో ఎక్కువగా వ్యాపార సంబంధాలున్నాయి. బంగారం, సీసం, జింకు, నికెల్లు ఇక్కడ ఎక్కువగా దొరికే ఖనిజాలు.
Country : Tonga
Capital Nukuʻalofa ………. Language Nukualofa ………. Currency Paʻanga ………. ……… Calling Code +. 676 Religion Christian
టాంగా…
పసిఫిక్ మహాసముద్రానికి దక్షిణాన ఉన్న ఈ దేశం 176 ద్వీపాలతో ఉన్న దేశం. 1800 సంవత్సరంనుండి ఈ దేశంలో క్రైస్తవమతం వ్యాప్తి చెందినది. ఈ దేశ వైశాల్యం 748 చ.కి.మీ. దేశ రాజధాని Nuku’alofa . 1970 సంవత్సరంలో ఈ దేశం బ్రిటీష్ వారినుండి స్వాతంత్ర్యం పొందింది. టోంగన్ మరియు ఇంగ్లీష్ వీరి భాషలు. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. వీరి కరెన్సీ pa’anga. వీరి కొబ్బరి, అరటి, వెనీలా బీన్స్, భూమిలో పండే దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు. ఉష్ణమండలపు సముద్రతీరాలు, వర్షాధార అడవులు, అగ్నిపర్వతాలు ఈ దేశంలో ఉన్నాయి. పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశం టాంగా. పర్యాటక పరంగా ఈ దేశానికి అధిక ఆదాయం సమకూరుతుంది.
Country : Tuvalu
Capital Funafuti ………. Language Tuvaluan/ English ………. Currency Tuvaluan dollar ………. ……… Calling Code +. 688 Religion Christian
తువాలూ
తువాలూ… చాలా చిన్న దేశం. విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతి చిన్నవైన వాటికన్‌సిటీ, మోనాకో, నౌరు దేశాల తర్వాతి స్థానం దీనిదే. నాలుగో అతి చిన్న దేశమన్నమాట. ఇది ఆస్ట్రేలియాకు ఈశాన్యాన పసిఫిక్‌మహా సముద్రంలో ఉంటుంది. ఈ ద్వీప దేశంలో మొత్తం తొమ్మిది దీవులు. వీటిలో అయిదు పగడపు దీవులు. ఈ ద్వీప దేశానికి ‘ఎలైస్దీవులు’ అనే పేరూ ఉంది. ఈ దేశ రాజధాని ఫునాఫుతిలో మాత్రమే దేశ జనాభాలో 56 శాతం మంది నివసిస్తారు. తువాలూ రాజధాని ఫునాఫుతి జనాభా: 10,045. విస్తీర్ణం 26 చదరపు కిలోమీటర్లు. వీరి భాషలు తువాలూయన్, ఆంగ్లం. కరెన్సీ తువాలూయన్, ఆస్ట్రేలియన్డాలర్లు, తువాలూ బ్రిటిష్సామ్రాజ్యంలో ఎక్కువ కాలం ఉన్నందుకు జెండా పై భాగంలో ఎడమవైపున్న యూనియన్ జాక్ సూచిక, తొమ్మిది నక్షత్రాలు తొమ్మిది ద్వీపాలకు గుర్తు. బ్రిటిష్సామ్రాజ్యం నుంచి ఈ దేశం 1978లో స్వాతంత్య్రం పొందింది. ఈ దేశంలో రోడ్లన్నీ కలిపితే ఎనిమిది కిలోమీటర్ల పొడవే ఉంటాయి. ఒక దీవి నుంచి మరో దీవికి వెళ్లడానికి కూడా పడవల్లో వెళ్లాల్సిందే. దేశం మొత్తంలో ఒకే ఒక విమానాశ్రయం ఉంటుంది. ఎక్కువ మంది వ్యవసాయం, చేపలు వేటాడటం మీదే ఆధారపడతారు. కొబ్బరిని ఎక్కువగా సాగుచేస్తారు. రెండో ప్రపంచయుద్ధం సమయంలో జపాన్‌తో పోరాటం జరుపుతున్నప్పుడు ఈ దీవులే అమెరికా సైనిక స్థావరాలుగా ఉండేవట. మూడు వేల సంవత్సరాల క్రితం పాలినేషియన్లు ఇక్కడికి మొదటిసారిగా వలస వచ్చారట. సముద్రం మధ్యలో దూరంగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య చాలా తక్కువ. ఏడాది మొత్తంలో రెండు వేలమంది లోపే సందర్శిస్తారట. ఇక్కడ ‘కిలికిటి’ అనే ఆట ఆడుకుంటారు. ఇది అచ్చు మనం ఆడుకునే క్రికెట్ఆటలానే ఉంటుంది..
Country : Vanuatu
Capital Port Vila ………. Language Bislama/French/English ………. Currency Vanuatu vatu ………. ……… Calling Code +. 678 Religion Christian
వనౌతు…
పసిఫిక్ మహాసముద్రంలోని స్వతంత్ర గణ రాజ్యం వనౌతు. 1774 సంవత్సరంలో కెప్టెన్ కుక్ ఈ దేశాన్ని సందర్శించి న్యూహెబ్రిడీన్ అని పేరు పెట్టాడు. ఫ్రెంచ్ మరియు బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పెత్తనం సాగించారు. తరువాత ఈ దేశం 1980 పంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకొని వనౌతుగా మారింది. ఈ దేశంలో 80 చిన్న, చిన్న దీవులు, 13 పెద్దదీవులు ఉన్నాయి. పెద్ద దీవి పేరు ఎస్పిరితూ సాంతో. ఒకప్పుడు యూరోప్ దేశానికి చెందిన దొంగ నావికులకు స్థావరంగా ఉంది. 1906 సం. లో ఫ్రెంచ్ వారి ఆధీనంలోకి వచ్చింది. వనౌతూ రాజధాని విలా, ఈ దేశ విస్తీర్ణం 12,190 చ.కి.మీ. వీరి అధికార భాషలు ఇంగ్లీష్ మరియు పిడ్జిన్. వీరి కరెన్సీ వాటు. ప్రజలు మెలనీషన్ జాతులకు చెందినవారు. ప్రజలలో 82 శాతం మంది క్రైస్తవ మతానికి చెందినవారు. కొబ్బరి, కాఫీ, కోకో, కందమూలాలు, వేరు సెనగ, అరటి, మొక్కజొన్న, ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. పందుల పెంపకం ఎక్కువ. మత్య్యపరిశ్రమ కలదు. మాంగనీస్ ఖనిజాన్ని జపాన్ కు ఎగుమతి చేస్తారు.
Capital Tiranna ………. Language Albanian ………. Currency Lek ………. Religion Islam/Christianity ………. Calling Code +. 355
అల్బేనియా
Albenia….అల్బేనియా అల్బేనియా.. ఐరోపా ఖండంలోని చిన్న ద్వీపకల్ప దేశం . దీనికి గ్రీస్, మాసిడోనియా, కొసోవో, మాంటినేగ్రో దేశాలు.. అడ్రియాటిక్ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఎన్నో జాతులు పరిపాలించినా తన భాష, సంస్కృతులను మాత్రం పదిలంగా కాపాడుకుంది అల్బేనియా. భౌగోళిక అందాలు ఈ చిన్న దేశానికి కొండంత గుర్తింపును తెచ్చాయి. ఇది చాలామటుకు పర్వతాలతో నిండి ఉంది. వాటిల్లో అల్బేనియన్ ఆల్ఫ్స్ కూడా ఉన్నాయి. అల్బేనియా రాజధాని తిరానా. దేశ జనాభా 29,94,667 (2018). ఈ దేశ విస్తీర్ణం 28,748 చదరపు కిలోమీటర్లు కరెన్సీ అల్బేనియన్ లెక్ ఒక అల్బేనియన్ లెక్ మన రూపాయల్లో 60 పైసలకు సమానం. వీరి అధికారిక భాష అల్బేనియన్స్థానికుల్లో 70 శాతం మంది ముస్లింలు, 17శాతం మంది క్రైస్తవులున్నారు. మిగిలిన కొద్ది శాతం ఇతర మతాలవారు. తరతరాలుగా ఎన్నో జాతుల దండయాత్రకు గురైన అల్బేనియా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు చాలా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఒట్టోమన్ సుల్తాన్లు అల్బేనియాను నాలుగు శతాబ్దాలు పరిపాలించారు. పన్నుల పెంపు, నిర్బంధ సైనిక శిక్షణ మొదలైన కారణాలతో తలెత్తిన ‘అల్బేనియన్ తిరుగుబాటు’ ఉద్యమం ఆ దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి దారి తీయడమే కాదు… ఒట్టోమన్ సామ్రాజ్యం బలహీనమైన విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. 1912లో ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి విముక్తి పొందింది అల్బేనియా. 1944-1946ల మధ్య ‘డెమోక్రటిక్ గవర్నమెంట్ ఆఫ్ అల్బేనియా’గా, 1946-1976ల మధ్య ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా’గా అల్బేనియా ఉనికిలో ఉంది. 1944 నుంచి రష్యా, చైనా కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఇది 1991లో ఎట్టకేలకు స్వతంత్ర దేశంగా మారింది. పార్టీల్ని ఏర్పాటు చేసుకుని ప్రజాస్వామ్య దేశమయ్యింది. ఐరోప ఖండంలో ప్రకృతి విపత్తుల వల్ల చాలా నష్టం కలిగే దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ పుట్టిన వారు ఇక్కడి కంటే బయటి దేశాల్లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. మాసిడోనియా, గ్రీస్, టర్కీ, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్…లాంటి దేశాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. కమ్యూనిస్ట్ నాయకుడు ఎన్వెర్ హోజా 1967లో అల్బేనియాను ‘ప్రపంచంలో తొలి నాస్తికదేశం’గా ప్రకటించాడు. ‘డెమొక్రటిక్ పార్టీ’ స్థాపన ఆ దేశ రాజకీయ చరిత్రలో మరో ముఖ్య ఘట్టం. దేశంలో డెబ్భైశాతం కొండలే. అల్బేనియాలో ఎత్తైన పర్వతం కొరబ్. 9,068 అడుగుల ఎత్తున్న ఈ పర్వతం అల్బేనియా, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియాలకు సరిహద్దుగా ఉంది. ఆగ్నేయంలో ఉన్న ఒహ్రిడ్ సరస్సు యూరప్‌లోని ప్రాచీనమైన, లోతైన సరస్సులలో ఒకటి. 1979లో యునెస్కో ‘వరల్డ్ హెరిటేజ్ సైట్’ జాబితాలో చోటు చేసుకుంది. చిన్న దేశమైన అల్బేనియా జీవవైవిధ్యంలో మాత్రం విశాలమైనది. 3000 రకాల భిన్నమైన జాతుల మొక్కలు ఈ దేశంలో పెరుగుతాయి. 353 పక్షుల జాతులు అల్బేనియాలో ఉన్నాయి. ఒకప్పుడు సోషలిస్ట్ దేశంగా పేరుగాంచిన అల్బేనియా ఆ తరువాత పెట్టుబడిదారి దారిలో నడిచింది. దేశంలో విదేశీ పెట్టబడులు పెరిగాయి. ఒకప్పుడు కరెంట్ కష్టాలు ఎదుర్కొన్న అల్బేనియా ఇప్పుడు విద్యుత్‌ను ఎగుమతి చేసే స్థాయికి చేరింది . వ్యవసాయ ప్రధానమైన ఈ దేశంలో సహజ వాయువు, పెట్రోలియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. పర్యాటకపరంగా కూడా అల్బేనియాకు ప్రాధాన్యత ఉంది. జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం పర్యాటకరంగం నుంచే వస్తుంది. ఒట్టోమన్ పాలనలో సుదీర్ఘకాలంగా ఉండడం వలన… మిగిలిన యురోపియన్ దేశాలతో పోల్చితే అల్బేనియా కళారూపాలలో భిన్నత్వం కనిపిస్తుంది. ప్రస్తుతం అల్బేనియా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపులో ఉంది. తల అడ్డంగా ఊపడం అనేది ‘ఇష్టం లేదు’ అనే భావానికి సూచనగా భావిస్తాం. కానీ అల్బేనియాలో మాత్రం రివర్స్. తల అడ్డంగా ఊపడం అనేది ‘నాకు ఆమోదమే’ అని చెప్పడం! నిలువునా ఊపితే ‘నాకు ఇష్టం లేదు’ అని తెలియచేయటం. అల్బేనియా ప్రధాన క్రీడ ఫుట్‌బాల్.అల్బేనియాను స్థానికంగా ‘షిక్విపేరియా’ అని పిలుచుకుంటారు. దీని అర్థం ‘డేగల భూమి’. దేశవ్యాప్తంగా ఏడు లక్షల వరకు బంకర్లు ఉన్నాయి. ఈ దేశ జాతీయ పుష్పం రెడ్పాపీ ఫ్లవర్. ఇక్కడ 3,250కిపైగా పూలజాతుల మొక్కలున్నాయి. వీటిలో 30శాతం ఎంతో అరుదుగా ఐరోపాలో మాత్రమే కనిపించేవి. ఈ దేశంలో చాలా ఎక్కువగా మిలటరీకి సంబంధించిన పాత బంకర్లు కనిపిస్తాయి. మొత్తంమీద ప్రతి 5.7చదరపు కిలోమీటర్లకొక బంకరుందని లెక్కలు తేల్,రు. మొత్తం 7,50,000 బంకర్లున్నాయట. గతంలో కమ్యూనిస్టు పాలకుల కాలంలో శత్రువుల నుంచి రక్షణ కోసం వీటినిలా నిర్మించారంటారు. వీటిలో కొన్ని పాతబడిపోతే మరికొన్నింటిలో మ్యూజియాలు, కేఫ్ల్లాంటి వాటిని నడుపుతున్నారు. కొందరు ఇళ్లుగానూ వీటిని వాడేసుకుంటున్నారు. ఇక్కడ రవాణా సౌకర్యాలు చాలానే అధ్యాన్నంగా ఉంటాయి. దేశం మొత్తం మీద కేవలం నాలుగే విమానాశ్రయాలున్నాయి. 677కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయి. బస్సులు ఉంటాయిగానీ వాటికి ఒక నియమిత టైమే లేదు. డ్రైవర్ల ఇష్టప్రకారం బస్సులు బయలుదేరతాయి. జనాభా సంఖ్య 29 లక్షలకు పైగా ఉన్నారు. అయినా ఇక్కడ వాడే కార్ల సంఖ్య మాత్రం మూడు వేల లోపే. పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాల వారు మాత్రం తప్పకుండా కార్లు వాడతారు. భారతదేశంలోని కోల్‌కతా మురికివాడల్లోని వారికి సేవలందించిన మదర్ థెరెసా పుట్టింది ఈ దేశంలోనే. ఆదర్శవంతమైన మహిళగా ఆమెపై ఇక్కడివారంతా అభిమానాన్ని చూపిస్తారు. జనాభా మొత్తంలో 60శాతం మంది వ్యవసాయం చేస్తారు. ఈ దేశంలో సుమారు 200 రకాలకు పైగా సంప్రదాయ దుస్తులు ఉన్నాయి. ఈ దేశం అందమైన బీచ్‌లకు, భిన్న సంస్కృతులకు సంబంధించిన రుచికరమైన ఆహార పదార్థాలకు పెట్టింది పేరు. ఇళ్ల ముందు ఎక్కడ చూసినా ఎక్కువగా దిష్టి బొమ్మలు కనిపిస్తాయి. ఇందుకు కొన్ని రకాల టెడ్డీబేర్లనూ వీరు వాడతారు. కొందరు వీటి వల్ల తమకు అదృష్టం కలుగుతుందని నమ్ముతారట. దాదాపుగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లోని ప్రజలూ ఎక్కువగా సాయంత్రపు నడకను ఇష్టపడతారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ చుట్టుపక్కల వారితో కలిసి సరదాగా రోడ్ల మీద నడుస్తారు. ఈ సాయంత్రపు నడక ఇక్కడ అధికారికం. దీన్ని ఇక్కడ క్షిరో అని పిలుస్తారు. ఈ సమయంలో కొన్ని గంటలపాటు టౌన్లలో కార్లలాంటి వాహనాల్ని లోపలికి అనుమతించరు. రహదారుల్ని ఖాళీగా ఉంచడానికే ఈ ఏర్పాటు.
Andorra
Capital Lavella ………. Language Catalan ………. Currency Euro ………. Religion Catholic ………. Calling Code +. 376
అండోరా… యూరప్‌లోని ఒక చిన్న దేశం. ఇది పైరెనీస్పర్వతాలకు తూర్పున ఉంటుంది. స్పెయిన్, ఫ్రాన్స్‌దేశాలు సరిహద్దులు. జెండాలోని రంగులన్నీ ఫ్రాన్స్, స్పెయిన్దేశాల నుంచి పొందిన స్వాతంత్య్రానికి గుర్తులు. నీలం, ఎరుపు ఫ్రాన్స్‌నుంచి, ఎరుపు, పసుపు స్పెయిన్‌నుంచి తీసుకున్నారు. అండోరా అనే పదం అరబిక్భాషలోని అల్దురా అనే పదం నుంచి వచ్చిందట. దీనర్థం ‘ముత్యం’ అని. ఈ దేశ రాజధాని అండోరా లా వెల్లా యూరప్మొత్తంలో ఎత్తయిన రాజధాని. సముద్రమట్టానికి 3,356 అడుగుల ఎత్తులో ఉంటుంది. అండోరా రాజధాని అండోరా లా వెల్లా జనాభా 85,470 (2018) దేశ విస్తీర్ణం 467.63 చదరపు కిలోమీటర్లు. కరెన్సీ యూరో, అధికారిక భాషలు కాటలాన్, స్పానిష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ ప్రజలు ఫ్రెంచ్కూడా ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇక్కడ అక్షరాస్యత రేటు ఎక్కువ. ఈ దేశం మంచి పర్యాటక ప్రాంతం. గత ఏడాది కోటి మందికిపైగా పర్యాటకులు వస్తారు ఈ దేశానికి. దేశంలో కేవలం 2 శాతం భూమిని వ్యవసాయానికి ఉపయోగిస్తారు. ఎక్కువ భాగం ఆహారం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ దేశంలో విమానాశ్రయాలు, రైల్వే లైన్లు లేవు. రోడ్డు మార్గం ఎక్కువగా వాడుతారు. ప్రపంచంలో సురక్షితమైన దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ దొంగతనాలు చాలా చాలా తక్కువ. జేబు దొంగలు అసలు ఉండరట. ఈ దేశ సైనికులకు కేటాయించే బడ్జెట్ స్వచ్ఛంద విరాళాలపై ఆధారపడి ఉంటుంది కుటుంబ యజమానిగా ఉండే మగవారి దగ్గర ఆత్మరక్షణ కోసం చట్ట ప్రకారం తుపాకీ ఉండొచ్చు.
Austria
Capital Vienna ………. Language Austrian/German ………. Currency Euro ………. Religion Roman Ctholic ………. Calling Code +. 43
ఆస్ట్రియా
మధ్య యూరోప్ లోని చిన్న దేశం ఆస్ట్రియా. ప్రాచీన చరిత్ర గల దేశం. రోమన్లు, షార్లమాన్లు, ఓటొ, హేప్స్ బర్గ్ లు మొదలైన వారు ఈ దేశాన్ని పరిపాలించారు. ఆస్ట్రియా రాజధాని వియన్నా. ఈ దేశ విస్తీర్ణం 83,857 చ.కి.మీ. వీరి అధికారిక భాష జర్మన్. వీరి కరెన్స యూరోలు. ప్రజలు క్రైస్తవ మతం పాటిస్తారు. ఈ దేశం యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశం మెట్టేర్నేక్ నాయకత్వంలో విప్లవం జరిగింది. కానీ తరువాత ఆస్ట్రియా హంగేరీ సమాఖ్యలో చేరటం జరిగింది. 1918 సం.లో మరలా విడిపోయి స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ దేశం సుప్రసిద్ధ, పాశ్చాత్య వాగ్గేయకారులు మొజర్ట్, షాన్ బెర్గ్, షూబెర్ట్ వంటి వారికి జన్మస్థానం. ఆస్ట్రియా వాస్తు, శిల్ప సందదలకు పేరుపొందినదేశం. వియన్నాలోని శిల్ప కళాసంపద ప్రపంచవ్యాప్తంగా పేరుపొందినది. ఆల్ఫ్ పర్వతశ్రేణులు ఉన్న ఈ దేశం కొండలతో నిండి ఉంటుంది. ఖనిజ సంపద ఎక్కువే కానీ నాణ్యత ఉండదు. లిగ్నేట్, బొగ్గురాయి, రాగి, గ్రాఫైట్, ఇనుము, సీసం, చమురువాయివు, జింకు, ఉప్పు ముఖ్య ఖనిజాలు. ఆస్ట్రియాలో జలవనరులు ఎక్కువగా ఉన్నాయి. జలవిద్యుత్ ను పొరుగు దేశాలకు అమ్ముతుంది. బార్లీ, రై ఓట్స్, బీట్ రూట్ లను ఎక్కువగా పండిస్తారు. పశువుల పెంపకం కూడా ఎక్కువే. సిమెంట్, రసాయనిక ద్రవ్యాలు, కర్రసామాను, విద్యుత్ పరికరాలు, ఉక్కు, తోలు సామాగ్రి, మోటారు కార్లు, కాగితపు గుజ్జు వస్త్రపరిశ్రమ ముఖ్యమైనవి.
Belarus
Capital Minsk ………. Language Belorasian/Russia ………. Currency Belorusian Ruble ………. Religion Orthodox ………. Calling Code +. 375
బెలారస్
బెలారస్ లో 10,000 సంవత్సరాల క్రితమే ప్రజలు నివసించినట్లు చారిత్రిక ఆధారాలు లభించాయి. ఆదునిక బెలారస్ విషయంలో 13 వ శతాబ్ధంలో గ్రాండ్ డచ్ ఆఫ్ లిధూనియాలో భాగంగా ఉంది. 1795 సంవత్సరంలో రష్యాచేత ఆక్రమించబడి రష్యా విచ్చిన్నం వరకు ఆ దేశంలో భాగంగా ఉంది. 1991 లో స్వతంత్ర దేశంగా అవతరించింది. బెలారస్ రాజధాని మిన్స్క్. ఈ దేశ వైశాల్యం 2,07,600 చ.కి.మీ. వీరి భాష బెలారసియన్ మరియు రష్యన్. వీరి కరెన్సీ బెలారసియన్ రూబుల్. ఈ దేశం క్రిస్టియన్ దేశం. గింజ ధాన్యాలు, బంగాళాదుంపలు, కూరగాయలు, అవిశలు వ్యవసాయ ఉత్పత్తులు. పాడి, పశుమాంసం లభిస్తాయి. కొద్దిగా సహజవాయివు, ఆయిల్, గ్రనైట్, డోలమైట్, లైమ్ స్టోన్, చాక్, ఇసుక సహజసంపదలు.
Belgium
Capital Brussels ………. Language Dutch/French/German ………. Currency Euro ………. Religion Roman Catholism ………. Calling Code +. 387
బెల్జియం
యూరోప్ ఖండంలో చిన్న దేశాలలో బెల్జియం ఒకటి. రాజ్యాంగాన్ని ఏర్పరుచుకుని రాజవంశీయులు పరిపాలిస్తున్న దేశం. 1830 సంవత్సరంలో నెదర ల్యాండ్స్ నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశానికి ఉత్తర సముద్రాన్ని ఆనుకుని 60 కి.మీ సముద్ర తీరం ఉంది. బెల్జియం విస్తీర్ణం 30,518 చ.కి.మీ. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్. వీరి అధికార భాషలు డచ్ మరియు ఫ్రెంచ్ భాషలు. ఈ దేశ కరెన్సీ యూరోలు. ఈ దేశంలో జనసాంద్రత ఎక్కువ. బ్రెజిల్ క్రైస్తవ దేశం అంట్ వేర్ప్ రేవు పట్టణం. లిగాజ్, నాల్ సెయింట్, చార్లెరోయి పారిశ్రామిక పట్టణాలు. ఘెంట్, లవువెయిన్, లీగే ప్రముఖ పట్టణాలు. ఉత్తర ప్రాంతంలో సారవంతమైన బంకమన్ను నేలలో వ్యవసాయం చేస్తారు. ఈ ప్రాంతన్ని ఫ్లాండర్స్ అంటారు. ఇక్కడ పల్లపు మైదానాలను పోల్డర్లు అంటారు. మధ్య మైదానాలు కూడా సారవంతమైనవే. లీ నది, మాసీ నది, సంబ్ర్ నది, జేర్తె నది, సమోలా నదులు బెల్జియంలో ప్రధాపమైన నదులు, జలాధారాలు. సాగునీటికి సమస్య లేదు. కళలు, సంగీతం, నిర్మాణాలు బెల్జియం ప్రజల జీవితంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. గోధుమ, ఓట్ ధాన్యం, బీటు దుంపలు, ఫ్లాక్స్, రై ధాన్యం, హెంప్ నార, చికోరీ , బంగాళా దుంపలు పండిస్తారు. జింక్, మార్బుల్ రాయి, స్లేట్ క్వారీలు కూడా కలవు. కాడ్, హెర్రింగ్, అయిస్టర్ చేపలు ఎక్కువగా దొరకుతాయి. ఓస్టెండ్ ప్రాంతం మత్స్య పరిశ్రమకు పేరుగాంచింది. పారిశ్రామిక దేశంగా బెల్జియం పేరుపొందింది. సాకర్ ను ఈ దేశ ప్రజలు ఎక్కువగా ఆడతారు. ఇనుప ఖనిజాలు, నేలబొగ్గు లభ్యత లేనందువలన వీటిని దిగుమతి చేసుకొని కర్మాగారాలు నడుపుతున్నారు. వీటిలో గాజు పరిశ్రమ ప్రముఖమైనది. జవుళీ, సంగీత పరికరాలు, పొయానో, ర్గాన్, కలప సామాగ్రి, తోలు వస్తువులు, మార్గరీన్, వెనార్, పంచదార, కిటికీల రంగు గాజు పలకలు, వజ్రాలను సానపెట్టడం, సారా బట్టీలు ప్రధానమైన పరిశ్రమలు.
Bosnia & Herzegovina
Capital Sarejovina ………. Language Bosnian/Croatian/Serbion ………. Currency Convertable Mark ………. Religion Not Available ………. Calling Code +. 387
బోస్నియా మరియు హెర్జ్ గోవేనియా
Bosnia and Herzegovina….బోస్నియా మరియు హెర్జ్ గోవేనియా ఒకప్పుడో బోస్నియా రోమన్ సామ్రాజ్యంలో భాగం. రోమన్ సామ్రాజ్య పతనం తరువాత బోస్నియాగా అవతరించింది. కానీ 1463 సంవత్సరంలో అట్టోమన్ల టర్కీలచే ఆక్రమించబడింది. వీరి తరువాత ఆస్టినా-హంగరీ తరువాత యుగోస్లోవియా లో భాగంగా ఉంది. ఏప్రియల్ 5, 1992 సంవత్సరంలో స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ దేశ రాజధాని Sarajevo . ఈ దేశ వైశాల్యం 51,129 చ.కి.మీ. వీరి భాషలు బోస్నియన్, క్రోయోసియా, సెర్బియన్. వీరి కరెన్సీ మార్కా. 40 శాతం ముస్లింలు, రోమన్ కేథలిక్స్ 15 శాతం మంది, ఆర్ధోడక్స్ 31 శాతం మంది ఇతర మతస్తులు 14 శాతం మంది ఉన్నారు. గోధుమలు, మొక్కజొన్న, పండ్లు, కూరగాయలు పండిస్తారు. బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్, రాగి, సీసం, జింక్, కోబాల్ట, మాంగనీస్, నికెల్, జిప్సం, ఉప్పు, అడవులు సహజసందలు.
Bulgeria
Capital Sofia ………. Language Bulgarian ………. Currency Bulgarian LIV ………. Religion Orthodox ………. Calling Code +. 359
బల్గేరియా….
బల్గేరియా…. బల్గేరియా దేశం ఐరోపా ఖండం లోనిది. ఈ దేశానికి ఉత్తరాన రొమేనియా, పశ్చిమాన సెర్బియా, మాసిడోనియా, దక్షిణాన గ్రీస్, టర్కీ దేశాలు సరిహద్దులు. తూర్పున నల్ల సముద్రం ఉంటుంది. ఐరోపా మొత్తంలో దేశం ఏర్పడ్డాక పేరు మారకుండా ఉన్న ఏకైక దేశమిది. క్రీస్తు శకం 681 నుంచి ఈ దేశం పేరు బల్గేరియానే. బల్గేరియా రాజధాని సోఫియా. జనాభా 72,02,198 (2018) . దేశ విస్తీర్ణం 1,10,994 చదరపు కిలోమీటర్లు వీరి భాష బల్గేరియన్ వీరి కరెన్సీ లెవ్.ఈ దేశం ఆర్ఢోడాక్స్ తెగకు దేశం. తరువాత ముస్లింలు, క్రిస్టియన్స్ కొద్దిశాతం మంది ఉన్నారు. ప్రాచీన బల్గేరియా క్యాలెండర్‌ను ప్రపంచంలోనే అత్యంత కచ్చితమైన క్యాలెండర్‌గా 1976లో యునెస్కో పేర్కొంది. జెండాలోని పాన్స్లేవిక్రంగుల్లోని ఎరుపు, తెలుపు రంగుల్ని స్వీకరించారు. ఆ రంగుల్లో మూడోదైన నీలం స్థానంలో రష్యన్త్రివర్ణాల్లోని ఆకుపచ్చ రంగును జెండాలో ఉంచారు. ప్రపంచంలో పురాతనమైన బంగారు నిధి దొరికింది ఇక్కడే. 294 సమాధుల్లో ఆరువేల ఏళ్ల నాటి మూడువేల బంగారు వస్తువులు లభించాయి. ఈ దేశ విస్తీర్ణంలో అత్యధికంగా మూడింట ఒక వంతు అడవులే. ఇక్కడ రోజాపూలను ఎక్కువగా సాగుచేస్తారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న రోజ్ఆయిల్మొత్తంలో 85 శాతం ఈ దేశంలోనే తయారవుతుంది. పుట్టిన రోజుల కన్నా ఇక్కడి ప్రజలు నామ కరణం రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే బర్త్‌డే కంటే మించి ఏటా నేమ్డేస్ని ఘనంగా చేసుకుంటారు. ‘కాదు’ అని తెలపడానికి తలను అటూ ఇటూ అడ్డంగా తిప్పటం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ‘అవును’ అని చెప్పడానికి పైకీ కిందకీ తిప్పుతారు. కానీ ఈ దేశంలో దీనికి వ్యతిరేకం. అడ్డంగా వూపితే అవుననీ, పైకీ కిందకీ ఆడిస్తే కాదనీ అర్థం. యుద్ధంలో ఒక్కసారి కూడా ఓటమిపాలవ్వని ఘనత బల్గేరియా సైన్యానిది. మొదటి ఎలక్ట్రానిక్కంప్యూటర్ని తయారుచేసింది ఈ దేశానికి చెందిన జాన్విన్సెంట్అటనసోఫ్. తొలి డిజిటల్గడియారాన్ని తయారు చేసిన పీటర్పెట్రోఫ్కూడా బల్గేరియా వాసే. ప్రపంచంలోనే తొలి మిలటరీ పైలట్మహిళ రైనా కసబోవా ఈ దేశస్థురాలే.
Croatia
Capital Zagreb ………. Language Croatian ………. Currency Kuna ………. Religion Christian ………. Calling Code +. 385
క్రొయేషియా
క్రొయేషియా రాజధాని జాగ్రెబ్. విస్తీర్ణం 56,594 చదరపు కిలోమీటర్లు వీరి భాష క్రొయేషియన్ దేశ కరెన్సీ కునా. ఈ దేశం మధ్య ఐరోపా, ఆగ్నేయ ఐరోపా, మధ్యధరా సముద్రాల కూడలిలో ఉంది. ఈ దేశం మొత్తంలో వెయ్యి ద్వీపాలున్నాయి. వీటిలో 50 దీవులు నివాసయోగ్యం కానివి. ప్రజలు ఎక్కువ మంది రోమన్ కేధలిక్ మతాన్ని అనుసరిస్తారు. ఆర్ఢోడక్స్, ముస్లింలు కొద్దిమంది ఉన్నారు. జెండాలోని తెలుపు రంగు శాంతికి, నిజాయితీకి గుర్తు, ఎరుపు రంగు దృఢత్వానికి, ధైర్యానికి సూచిక, నీలం రంగు విధేయత, న్యాయానికి చిహ్నం. ప్రపంచంలోనే అతి చిన్న పట్టణం ఇక్కడే ఉంది. పేరు హమ్. ఇక్కడ 17 నుంచి 23 మంది మాత్రమే ఉంటారు ఇక్కడ 16 ఏళ్లకు కూడా ఓటు వేసే హక్కు లభిస్తుంది. కానీ వారికి ఉద్యోగం ఉంటేనే! దేశ రాజధాని జాగ్రెబ్‌లో ‘బ్రోకెన్ రిలేషన్షిప్స్’ పేరిట ఓ వింత మ్యూజియం ఉంది. విడిపోయిన అయిదున్నర కిలోమీటర్ల పొడవైన స్టోన్ వాల్స్ కోట గోడను చూడ్డానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడుండే ‘కోపాకీ రిట్ నేచర్ పార్కు’ ఐరోపా మొత్తంలో అతిపెద్ద తడినేలల రక్షిత ప్రాంతం. హుందాతనానికి గుర్తుగా భావించే ‘టై’ని కనిపెట్టింది ఈ దేశంలోనే. ఈ దేశంలోనే ‘స్లావోల్జబ్ పెన్కల’ అనే ఆవిష్కర్త 1906లో బాల్‌పాయింట్ పెన్నును తయారు చేశారు. ప్రముఖ విద్యుత్తు ఉపకరణాల ఆవిష్కర్త నికోలా టెస్లా వూరు ఇక్కడే ఉంది. టెస్లా మ్యూజియంగా మలిచిన ఈయన ఇంటికి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. మూడో వంతు అడవులే ఉన్నాయి.ఇక్కడి ‘బ్రాక్’ అనే దీవిలో ఉన్న ‘జ్లాట్నిరాట్’ బీచ్ వింతగా ఉంటుంది. గాలివాటాన్ని బట్టి ఇది రంగుల్నీ, ఆకారాన్నీ మార్చుకుంటూ ఉంటుంది. భారతదేశంలోని ఓరుగల్లును పరిపాలించిన రుద్రమదేవి పాలన గురించి రాసిన నావికుడు మార్కోపోలో పుట్టింది క్రొయేషియాలోనే. ‘డాల్మేషియా కుక్క జాతి’ ఇక్కడిదే. ఇక్కడి డాల్మేషియా ప్రాంతంలో పుట్టింది కాబట్టి దీనికీ పేరొచ్చింది. గోదుమలు, మొక్కజొన్న, పంచదార దుంపలు, బార్లీ, పొద్దుతిరుగుడు గింజలు, ద్రాక్ష, సోయా, బంగాళాదుంపలు మొదలగు పంటలు పండిస్తారు. పాడిపరిశ్రమ ఉంది. ఆహార పదార్ధాలు, రసాయనాలు, ట్రాన్స్ పోర్ట్ పరికరాలు ఎగుమతి చేస్తారు. బాక్సైట్, ఆయిల్, తక్కువ నాణ్యతగల ఇనుపఖనిజం, జిప్సం, సెలికా, మైకా మొదలగుని సహజసంపదలు.
Czech Republic
Capital Prayue ………. Language Czech ………. Currency Czech Krona ………. Religion Non-Religions ………. Calling Code +. 420
ఛెక్ రిపబ్లిక్
మధ్య యూరప్ లోని ఒక దేశం. దీనికి ఈశాన్య దిశలో పోలండ్, పశ్చిమాన జర్మనీ, దక్షిణాన ఆస్ట్రియా మరియు తూర్పున స్లొవేకియా దేశాలు సరిహద్దులుగా గలవు. ఈ దేశ రాజధాని మరియు పెద్దనగరం ప్రేగ్. వీరి అధికార భాష ఛెక్ ఈ దేశ వైశాల్యం 78,866 చ.కి.మీ. కరెన్సీ పేరు కొరూనా. ఈ దేశంలో 75 శాతం మంది ప్రజలు ఏ మతానికి చెందిని వారు కాదు. ఆర్ధిక పరంగా అభివృద్ధి చెందిన దేశం ఛెక్ రిపబ్లిక్. జనవరి 1, 1993 సంవత్సరంలో జకోస్లోవియా దేశం నుండి విడిపోయి ఛెక్ రిపబ్లిక్ గా అవతరించింది. గోధుమలు, బంగాళా దుంపలు, పంచదార దుంపలు పండిస్తారు. కోళ్ల పరిశ్రమ ఉంది. గ్రాఫైట్, బొగ్గు, కలప మొదలగు సహజవనరులు లభిస్తాయి.
Denmark
Capital Copenhagen ………. Language Danish ………. Currency Danish Krone ………. Religion Church of Denmark ………. Calling Code +. 45
డెన్మార్క్
యూరప్ లోని ఉత్తర సముద్రం, బాల్టిక్ సముద్రాల మధ్య ఉన్న డెన్మార్క్ అభివృద్ధి చెందినదేశం. డెన్మార్క్ ను ఆనుకున్న ఉన్న 480 చిన్న దీవులు, ఆర్క్ టిక్ వలయంలోని గ్రీన్ ల్యాండ్, ఫాడో దీవులు కూడా డెన్మార్క్ కు చెందినవే. డెన్మార్క్ విస్తీర్ణం 43,092 చ.కి.మీ. రాజధాని కోపెన్ హెగ్. వీరి అధికార భాష డేనిష్. కరెన్సీ డానిష్ క్రోన్. డెన్మార్క్ రాజవంశ పాలనలో ఉంది. ఎన్నికైన పార్లమెంట్ కూడా ఉంది. డెన్మార్క్ వ్యయసాయ ప్రధానమైన దేశం. పాడిపరిశ్రమకు ప్రసిద్ధి చెందినది. సహకారోద్యమం విస్తృతంగా ఉన్న దేశం. 1866 సం.లో మొదటి సహకార సంస్థ స్థాపించబడినది. నౌకా నిర్మాణం, యంత్ర సామాగ్రి ఉత్పత్తి ముఖ్యమైన పరిశ్రమలు. కోపెన్ హగ్ హార్బరులో నల్ల రాతిలో చెక్కిన అందమైన మెర్ మెయిడ్ శిలా విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బార్లీ, గోధుమలు, బంగాళాదుంపలు, పంచదార దుంపలు వ్యవసాయ ఉత్పత్తులు. పందుల పెంపకం, పాడిపరిశ్రమలు కలవు. పెట్రోల్, సహజవాయువు, చేపలు, ఉప్పు మొదలగు సహజసంపదలు లభిస్తాయు.
Estonia
Capital Tallin ………. Language Estonian ………. Currency Euro ………. Religion Christian ………. Calling Code +. 372
ఎస్తోనియా…
ఎస్తోనియా ప్రజలు పురాతన కాలం నుండి స్వతంత్రంగా జీవించారు. తరువాత ఈ దేశం డెన్మార్, స్వీడన్, రష్యా, జర్మనీ దేశస్తుల చే 1200 సంవత్సరం తరువాత ఆక్రమించబడింది. 1940 వ సంవత్సరంలో ఎస్తోనియా బలవంతంగా సోవియట్ యూనియన్ లో కలపబడింది. 1991 సంవత్సరంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్న తరువాత ఎస్తోనియా స్వతంత్ర దేశంగా అవతరించింది. 2004 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశంగా చేరింది. ఈ దేశ రాజధాని టాల్లిన్. ఈ దేశ వైశాల్యం 45,226 చ.కి.మీ. వీరి అధికార భాష ఎస్తోనియా. తరువాత రష్యాభాష కూడా 37 శాతం మంది ప్రజలు మాట్లాడుతారు. ప్రజలు ఎక్కువమంది క్రిస్టియన్ మతానికి చెందినవారు. వీరి కరెన్సీ ఎస్తోనియన్ క్రోన్. బంగాళాదుంపలు మరి కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పాల ఉత్పత్తులు, చేపలు, పశుసంపద ఇతర జీవనోపాధులు. ఫాస్పేట్, లైమ్ స్టోన్, ఇసుక, డోలోమైట్, క్లే, పీట్, వ్యయసాయ యోగ్యమైన భూములు సహజ సంపదలు.
Finland
Capital Helsink ………. Language Finnish ………. Currency Euro ………. Religion Chrisian ………. Calling Code +. 358
ఫిన్లాండ్
ఐరోపా ఖండంలో ఉండే ద్వీపకల్ప దేశం ఫిన్లాండ్. దీనికి స్వీడన్, నార్వే, రష్యా సరిహద్దులు. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి. జనాభా 55,09,717 (2018) విస్తీర్ణం 3,38,424చదరపు కిలోమీటర్లు. వీరి అధికారిక భాషలు ఫినిష్, స్వీడిష్ కానీ 63శాతం మంది ఆంగ్లం మాట్లాడగలరు. దేశ కరెన్సీ యూరో. దేశ జనాభాలో 84శాతం మంది పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటారు. డిశెంబర్ 6, 1917 సంవత్సరంలో రష్యానుండి స్వాతంత్ర్య పొందింది . ఈ దేశంలోనే 1,87,888 సరస్సులున్నాయి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సరస్సులున్న దేశంగాఈ దేశానికి ప్రపంచ రికార్డు ఉంది. సైమా ఇక్కడ అత్యంత పెద్ద సరస్సు. ఐరోపాలో అయితే నాలుగోది. మంచి నీళ్లలో బతికే అత్యంత అరుదైన ఫ్రెష్‌వాటర్ సీళ్లు దీనిలో వందలాదిగా ఉన్నాయి. దేశంలో 78శాతం అడవులే ఈ దేశం పరిధిలో ఉన్న సముద్రంలో చుట్టూ అంతా కలిపి 1,79,584 ద్వీపాలున్నాయి. దీనికి ‘ల్యాండ్ ఆఫ్ మిడ్నైట్ సన్’ అనే పేరుంది. ఎందుకంటే ఈ దేశంలో పావు వంతు ఆర్కిటిక్ వలయంలో ఉంది. అందుకే ఇక్కడ వేసవిలో దాదాపు 73 రోజులు సూర్యుడు అస్తమించడు. అలాగే చలికాలంలో 51 రోజుల పాటు సూర్యుడు ఉదయించడు. అతి వేగంగా కారు నడిపి ఎవరైనా పట్టుబడితే ఇక్కడ శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది. దాదాపుగా రెండు లక్షల డాలర్లు అంటే మన రూపాయల్లో కోటికి పైగా జరిమానా విధిస్తారట. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వాటర్ టన్నెల్ ఉన్నది ఇక్కడే. పేరు పైజాన్ వాటర్ టన్నెల్. ఇది మంచి నీళ్లను దక్షిణ ఫిన్లాండ్కి సరఫరా చేస్తుంది. క్రిస్మస్ సందర్భంగా చాలా చోట్ల శాంతాక్లాజ్ వేషాల్లో క్రిస్మస్ తాతల్లా వేషాలేసుకుంటుంటారు. అసలైన శాంతాక్లాజ్ పేరు సెయింట్ నికోలస్. ఆయన ఇక్కడి లేప్ల్యాండ్లో నివసించేవారు. వీరికి అత్యంత ఇష్టమైన పానీయం కాఫీ. ప్రతి వ్యక్తీ ఇక్కడ ఏడాదికి సగటున 12 కేజీల కాఫీ పొడిని వాడేస్తాడు. కాఫీని ఇంత పెద్ద ఎత్తున వాడే దేశాల్లో ఇదే మొదటిది. బ్రెడ్‌ని ఇక్కడి భోజనంలో ఎక్కువగా వాడతారు. లోపల అన్నం నింపి పైకి బ్రెడ్ ఉండే కరేలియన్ పేస్ట్రీ ఇక్కడి సంప్రదాయ వంటకం. చేపలు, మాంసాల్ని ఎక్కువగా తింటారు. ఇక్కడ ఎక్కువగా దొరికే బిల్బెర్రీలనూ పండ్ల డెసర్ట్ల్లో ఎక్కువగా వాడతారు. ఇక్కడ సరదాగా ఆనందించడానికీ చిత్రమైన ఛాంపియన్‌షిప్‌లు పెడుతుంటారు. అందులో చాలా ప్రాచుర్యం పొందింది ‘వైఫ్ కేరియింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్’. ఇంకా దోమల్ని వేటాడటం, బురదనేలలో ఫుట్‌బాల్, రబ్బరు బూట్లు విసరడం, మొబైల్ ఫోన్ గిరాటేయడంలాంటి చిత్ర విచిత్రమైన పోటీలన్నీ ఉంటాయి . ప్రపంచంలోనే చాలా మంచి విద్యా వ్యవస్థ ఈ దేశానిది. ఇప్పుడు ఇక్కడ వంద శాతం అక్షరాస్యత ఉంది. ఇక్కడ ఏడాదిలో బడులు దాదాపు 180 రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఆడుతూ పాడుతూనే పిల్లలు పాఠాలు నేర్చుకుంటారు. ఇక్కడ యూనిఫాంలు, ర్యాంకులు ఏమీ ఉండవు. ఇక్కడి ఉపాధ్యాయుల బోధనా పద్ధతులూ అంతే ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ఈ విద్యా విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. తొమ్మిదో తరగతికి వచ్చే వరకు అసలు పరీక్షలే ఉండవు. 9 తరువాత కచ్చితంగా పరీక్ష పాసైతేనే పై చదువులకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్లో మనం ఏమన్నా బ్రౌజ్ చేసుకోవాలంటే క్రోమ్, ఫైర్ఫాక్స్, ఒపేరా అంటూ ఏదో ఒక బ్రౌజర్‌లోకి వెళ్లిపోతాం. మరి ప్రపంచంలోని మొదటి బ్రౌజర్ తయారయ్యింది ఇక్కడే. దాని పేరు ‘ఎర్విస్’. హెల్సింకిలో విద్యార్థులే దీన్ని తయారుచేశారు. అయితే దాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడానికి వీలుగా పెట్టుబడులు తొందరగా సమకూరలేదు. ఆ లోపుగానే మొజైక్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇంటర్నెట్‌ని మొదటిసారిగా ప్రజలు వాడుకునేందుకు వీలు కలిపించింది కూడా ఈ దేశమే. నోకియా సంస్థ పుట్టింది ఇక్కడే. ఎప్పుడంటే 1865లోనే. ఇక్కడున్న నోకియన్‌విర్టా నది పేరు మీదుగా దీనికీ పేరొచ్చింది. లినక్స్ ఓఎస్, ఎస్.ఎం.ఎస్‌లు పుట్టింది ఇక్కడే. బార్లీ, గోధుమలు, బంగాళా దుంపలు ఎక్కువగా పండిస్తారు. పాడి, చేపల పరిశ్రమలు కలవు. కలప ఇనుప ఖనిజం, రాగి, జింక్, క్రోమైడ్, నికెల్, బంగారం, వెండి సహజ సంపదలు.
France
Capital Paris ………. Language French ………. Currency Euro ………. Religion Christian ………. Calling Code +. 33
ఫ్రాన్స్
పశ్చిమ యూరోప్ లోని ప్రముఖ దేశం ఫ్రాన్స్. జర్మనీ, ఇటలీ దీనికి సరిహద్దులు. సుదీర్ఘమైన చరిత్ర గల దేశం. ఒకప్పడు రాజులు పాలించి దేశం. 1789-1793 సం.ల మధ్య కాలంలో ఫ్రెంచ్ విప్లవం ఫలితంగా ప్రజాతంత్ర దేశంగా ఆవిర్భబించింది. తరువాత కొంతకాలం నెపోలియన్ వంటి నియంతలు కూడా పాలించారు. ఫ్రాన్స్ దేశ విస్తీర్ణం 5,43,965 చ.కి.మీ. రాజధాని పారిస్. వీరి అధికార భాష ఫ్రెంచ్. ప్రజలు సౌందర్యోపాసకులు. సుఖ జీవనాన్ని కోరుకుంటారు. వీరు వంటలు ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందినవి. ఫ్రాన్స్ ఆర్ధికపరంగా సంపన్నమైన దేశమే కాక బలమైన సైనిక సంపత్తి గల దేశం కూదా. ఫ్రాన్స్ లోని రైన్ నదీలోయ సారవంతమయినదే కాకుండా పడవ ప్రయాణాలకు సౌకర్యం గల నది. గారొన్నే నదీ ప్రాంతం సారాయికి అనువైన ద్రాక్షా తోటల పెంపకానికి అనువైన ప్రాంతం. 1050 కి.మీ. నడివిగల లోయిరే నది ఫ్రాన్స్ లో పెద్దనది. ఆల్ప్, జూరా కొండలలో పారే ఏరులున్న ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలు. రైన్ నది సాగు నీటిని అందిస్తుంది. రైస్ నదీ ప్రాంతంలోని రివీరా పర్యాటక ప్రాంతం కూడా. గోధుమ రే ధాన్యం, బీటు పంచదార దుంపలు,ద్రాక్ష, మొక్కొన్న, బంగాళాదుంపలు, రేప్ సీడ్, పొద్దు తిరుగుడు, ఆపిల్, కూరగాయలు, పీచ్, ఓట్ ధాన్యం పండిస్తారు. వీటిని భారీగా ఇతరదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. పాల ఉత్పత్తులు, మాంసం కూడా ఎగుమతి చేస్తారు. పీతలు, హెర్రింగ్ చేపలు, గండుమీను, గండు రొయ్యలు, మేకరిల్, అయిస్టర్ చేపలు, సార్డీన్ చేపలు ఎక్కువగా దొరకుతాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం ఫ్రాన్స్. విమానాల తయారీ, మోటారు కార్ల తయారీ, యంత్రసామాగ్రి, విద్యుత్ పరికరాలు, కలప సామాగ్రి, ఇనుము, ఉక్కు, ఆభరణాలు, అత్తర్లు, జవుళీ, మధ్యం, కాగితం, అల్యూమినియం పరిశ్రమలు ఉన్నాయి. చరిత్ర ప్రసిద్ది పొందిన డెకార్డే, వాల్టేర్, విక్టర్ హూయగో, జోన్-ఆఫ్-ఆర్క్, నెపోలియన్, మోనాసా వంటి గొప్పవారికి జన్మనిచ్చిన దేశం ఫ్రాన్స్. ఫ్రాన్స్ దేశం పర్యాటక దేశం కూడా. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఐఫీల్ టవర్ ఫ్రాన్స్ లోనే ఉంది.
Germany
Capital Berlin ………. Language German ………. Currency Euro ………. Religion Christian(60%) ………. Calling Code +. 49
జర్మనీ
జర్మనీ దేశం యూరోప్ ఖంఢం మధ్యలో కలదు. ఈ దేశంలోని ప్రజలలో ప్రతి పదిమందిలో ఒకరు విదేశీయులే. జర్మనీ దేశం కళలకు ముఖ్యంగా క్లాసికల్ సంగీతానికి ప్రసిద్ధి చెందినది. రెండవ ప్రపంచ యుద్దంలో(అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో) జర్మనీ పరాజయం పాలై దారుణంగా నష్టపోయింది. ఈ యుద్ధం తరువాత జర్మనీ తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ రెండు దేశాలుగా విడిపోయింది. క్రమ క్రమంగా పశ్చిమ జర్మనీ యూరోప్ లోనే ఆర్ధికంగా బలమైన దేశంగా రూపొందింది. 1989 వ సంత్సరంలో తూర్పు జర్మనీ మరియు పశ్చిమ జర్మనీ కలసిపోయాయి. పశ్చిమ జర్మనీ తూర్పు జర్మనీ అభివృద్ధికి బిలియన్స్ డాలర్స్ ఖర్చు పెట్టింది. జర్మనీ రాజధాని బెర్లిన్ వీరి అధికార భాష జర్మన్. ఈ దేశ వైశాల్యం 3,49,334 చ.కి.మీ. జర్మనీ క్రిస్టియన్ దేశం. వీరి కరెన్సీ యూరోలు. బంగాళా దుంపలు, గోధుమలు, బార్లీ, పండ్లు, క్యాబేజీ వ్యవసాయ ఉత్పత్తులు. పశువులు, పందులు, కోళ్ల పెంపకం కలదు. బొగ్గు, లిగ్నేట్, సహజవాయువు, ఇనుప ఖనిజం, యూరేనియం, పొటాష్, సాల్ట్, కలప, వ్యవసాయ యోగ్యమైన భూములు సహజ సంపదలు.
Greece
Capital Athens ………. Language Greek ………. Currency Euro ………. Religion Greek Orthodox ………. Calling Code +. 30
.గ్రీస్…
గ్రీస్ లేదా గ్రీక్ ఐరోపా ఖండంలో ఉన్న ఓ చిన్నదేశం. రాజధాని నగరం ఏథెన్స్. కరెన్సీ యూరోలు. వీరి అధికారిక భాష గ్రీక్. చాలా మంది ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఐరోపాలోని ప్రాచీన భాషలలో గ్రీక్ ఒకటి. గ్రీకులలో ఎక్కువ భాగం గ్రీక్ ఆర్ధడెక్స్ చర్చి మతస్థులు. తరువాత ముస్లిం మైనారిటీలు ఉన్నారు. . గ్రీస్ దాదాపు తమిళనాడు రాష్ట్రం అంత ఉంటుంది. ఈ దేశ భూభాగంలో దాదాపు 80 శాతం పర్వతాలే. సూర్యరశ్మి ఎక్కువ కాలం ఉంటుంది ఈ దేశంలో. శాంతాక్లాజ్ గా పేరుపడిన శాంతానికోలస్ ఇక్కడివాడే. తెల్లటి గడ్డంతో ఉండే ఇతను పేదలకు, పిల్లలకు ఏదో విధంగా సహాయపడేవాడు. గణితాన్ని కనుగొన్నది ఈ దేశస్థులే అంటారు. ఇక్కడ నివసించే ప్రజలు 98 శాతం మంది స్థానికులే. మిగతా రెండు శాతం మంది మాత్రమే బయటనుండి వచ్చి స్థిరపడినవారు. 18 సంవత్సరాలు నిండినవారు ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. ఓటు వేయకపోవటం నేరం. గ్రీస్ ఓ ద్వీపకల్ప సముదాయం. మొత్తం 2000 వేల ద్వీపాలు ఉన్నాయి. కానీ వీటిలో 170 ద్వీపాలలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు.గ్రీకు యువకులు కచ్చితంగా 18 నెలలపాటు సైన్యంలో పనిచేయవలసిందే. క్రీస్తుపూర్వం 776 సంవత్సరంలో మొదటి ఒలింపిక్స్ జరిగింది ఇక్కడే. పర్యాటకం ద్వారా ఈ దేశానికి అధిక ఆదాయం చేకూరుతుంది. ఇక్కడి ప్రజలకంటే పర్యాటకులే ఎక్కువగా ఉంటారు. ప్రపంచం మొత్తంలో పూరావస్తు ప్రదర్శనశాలలు ఉన్నది గ్రీస్ దేశంలోనే. గ్రీసు దేశానికి 9000 మైళ్ల సముద్రతీర రేఖ ఉన్నది. గోధుమలు, మొక్కజొన్న, బంగాళా దుంపలు, బార్లీ, బీట్ దుంపలు, పొగాగు వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, డైరీ ఉత్పత్తులు కలవు. లిగ్నేట్, పెట్రోల్, ఇనుప ఖనిజం, బాక్సైట్, లీడ్, జింక్, నికెల్, సాల్ట్ మొదలగునవి సహజ సంపదలు కలవు కొద్ది సైన్యంతో ప్రపంచంలో అనేక దేశాలు జయించిన అలెగ్జాండర్ గ్రీస్ దేశంలోని మాసిడోనియా రాజ్యాని చెందిన వాడు.
Hungary
Capital Budapest ………. Language Hungarian ………. Currency Forint ………. Religion Christian ………. Calling Code +. 36 మధ్య యూరోప్ లోని సోషలిస్ట్ దేశం హంగేరి. ఇది కమ్యూనిస్ట్ దేశం. హంగేరీ విస్తీర్ణం 93,031 చ.కి.మీ. రాజధాని బుడాపెస్ట్. వీరి అధికార భాష మాగ్యార్. దేశ కరెన్సీ ఫోరింట్. ప్రజలు మాగ్యార్, ఫిన్నిష్- ఉగ్రిక్ మరియు టర్కిష్ జాతులకు చెందినవారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. రోమన్ కేధలిక్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. హంగేరీ జానపద సంగీతం వీనుల విందుగా ఉంటుంది. డాన్యూట్, తిస్జా నదులు ప్రధానమైన నదులు. మైదానాలు సారవంతమైనవి. బాలాటన్ సరస్సు ప్రాంతం సారవంతమైనది. ద్రాక్ష, మొక్కజొన్న, రైధాన్యం, ఓట్స్, పంచదార తయారుచేసే బీట్ దుంపలు, ఉల్లిపాయలు, పండ్లు, బంగాళా దుంపలు, పొద్దు తిరుగుడు, గోధుమలు ప్రధానమైన వ్యవసాయ ఉత్పత్తులు. గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమ, చేపల పరిశ్రమలున్నాయి. బాక్సైట్, మాంగనీస్, యురేనియం, నేలబొగ్గు, ఇనుపరాయి, లిగ్నైట్, డోలమైట్, చమురు వాయివు పెట్రల్ ఖనిజ నిక్షేపాలున్నాయి, సిమెంట్, రసాయనిక ద్రవ్యాలు, ధాతు సామాగ్రి, యంత్ర సామాగ్రి తయారీ ప్రధాన పరిశ్రమలు.
Iceland
Capital Reykjavik ………. Language Icelandic ………. Currency Icelandic Krona ………. Religion Church of Iceland ………. Calling Code +. 354
ఐస్ లాండ్ …..
ఐరోపాలోని ఈ దేశం ప్రశాంతమైన దేశం ఐస్ లాండ్. రాజధాని రెక్ జావిక్. వీరి అధికార భాష ఐస్ లాండిక్. కరెన్నీ ఐస్ లాండిక్ క్రోనా. విస్తీర్ణం 39 వేల 682 చ.మైళ్లు. ఎక్కువమంది క్రిస్టియన్లు కాని మత స్వాతంత్ర్యం ఉంది. వీరి జాతీయ క్రీడ హ్యాండ్ బాల్. 1 డిసెంబర్ 1918 సంవత్సరంలో డెన్మార్క్ నుండి ఈ దేశం స్వాతంత్ర్య పొందింది. ఈ దేశ ప్రజలలో ఎక్కువ మంది లూధరన్ చర్చ్ మతాన్ని అనుసరిస్తారు. ఈ దేశానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేవు. ఐస్ లాండ్ లో నేరాల శాతం కూడా చాలా తక్కువ. అందు చేతనే ఇక్కడి పోలీసుల చేతుల్లో తుపాకులు కనబడవు. సమాజం స్నేహపూరితం. చేపలు, రొయ్యలు ఉత్పత్తుల ద్వారా వీరికి అధిక ఆదాయం సమకూరుతుంది. ఇక్కడి ప్రజలలో 97.6 శాతం మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తారు. వీరు ఎక్కువగా సినిమాలు చూస్తారు. వందశాతం అక్షరాస్యత ఉన్న దేశం ఐస్ ల్యాండ్. ఈ దేశంలో రైళ్లు లేవు అంతా భూమార్గమే. అందమైన జలపాతాలు, సముద్రాతీరాలు, అగ్నిపర్వతాలు ఐస్ ల్యాండ్ లో కనిపిస్తాయి. ఐస్ ల్యాండ్ పేరుకు తగ్గట్టుగానే వేసవిలో కూడా ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు మించదు. విచిత్రంగా వేసవికాలంలో కూడా 24 గంటలూ ఎండ ఉంటుంది బంగాళా దుంపలు. కూరగాయలు పండిస్తారు. చేపల పరిశ్రమ, పాల ఉత్పత్తుల పరిశ్రమలున్నాయి.
Ireland
Capital Dublin ………. Language English/Irish / ………. Currency Euro ………. Religion Christianity ………. Calling Code +. 353
ఐర్లాండ్
ఐర్లాండ్… ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఓ ద్వీపదేశం. చుట్టూ నీళ్లే సరిహద్దులు. ఐర్లాండ్ రాజధాని డుబ్లిన్. విస్తీర్ణం 70,273 చదరపు కిలోమీటర్లు . వీరి అధికార భాషలు ఐరిష్, ఆంగ్లం. దేశ కరెన్సీ యూరో ఈ దేశ జాతీయ చిహ్నం హార్ప్. ఇదో సంగీత వాద్యం. ఈ దేశంలో రెండు భాగాలుంటాయి. ఒకటి రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్. రెండోది ఉత్తర ఐర్లాండ్. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌కు పూర్తి స్వాతంత్య్రం వచ్చింది కానీ ఉత్తర ఐర్లాండ్ ఇంకా యూకేలో భాగమే. అమెరికా వైట్ హౌస్ డిజైనర్ జేమ్స్ హోబన్ ఈ దేశానికి చెందినవాడే. ఇక్కడ ఎక్కువ మంది సర్ నేమ్ ఓ(O),మ్యాక్(MAC)లతో మొదలవుతుంది. మ్యాక్ అంటే ‘సన్ ఆఫ్’ అని, ఓ అంటే ‘గ్రాండ్సన్ ఆఫ్’ అని అర్థమట. ఇక్కడి హుక్ లైట్ హౌస్ ప్రపంచంలో చాలా కాలంగా పనిచేస్తున్న లైట్ హౌస్‌గా చెబుతారు. చరిత్రలో నిలిచిపోయిన టైటానిక్ ఓడను తయారుచేసింది ఈ దేశంలోని బెల్ఫాస్ట్లోనే. జ్వరం వస్తే డాక్టర్ దగ్గర ఇంజక్షన్ ఇప్పించుకుంటాం కదా. ఆ హైపోడెర్మిక్ సిరంజీని కనిపెట్టింది ఇక్కడే. డుబ్లిన్లో ‘రొటుండా’ అనే ఆసుపత్రిని 1745లో ఏర్పాటుచేశారు. ప్రపంచంలోనే ఎక్కువకాలంగా ప్రసూతి సేవలందిస్తున్న ఆసుపత్రి ఇది. కాఐర్లాండ్లో పాములే ఉండవు. కారణం పాములు శీతల రక్త జీవులు (కోల్డ్‌బ్లడెడ్ యానిమల్స్). ఇవి అత్యంత చలిని తట్టుకోలేవు. వేల ఏళ్ల క్రితం హిమానీ నదాల వల్ల ఐర్లాండ్ అంతా గడ్డకట్టుకుపోయి ఉండేదట. దీంతో పాములు ఉండేవి కావు. ఇప్పుడు కూడా చుట్టూ సముద్రం, ఎప్పుడూ చల్లగా ఉండటంతో పాములు అస్సలుండవన్నమాట. ఈ దేశం ఎక్కువగా బంగాళా దుంపల్ని ఎగుమతి చేస్తుంది. టర్నిప్ దుంపలు, బంగాళా దుంపలు, బార్లీ, గోధుమలు, పశు మాంసం, పాల ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు. సహజవాయువు, రాగి, జింక్, బేరైట్, జిప్సం, డోలోమైట్, లైమ్ స్టోన్ సహజ వనరులు.
Italy
Capital Rome ………. Language Italian ………. Currency Euro ………. Religion Christianity ………. Calling Code +. 39
ఇటలీ….
ఇటలీ ఐరోపా ఖండంలోని ఒక పేరుపొందిన దేశం. మధ్యధరా సముద్రం మధ్యభాగంలో ఉన్నది. ఫ్రాన్స్, స్విట్జర్ ల్యాండ్, ఆస్ట్రియా, స్లోవేనియా, సాన్ మారినో, వాటికన్ సిటీలు ఈ దేశ సరిహద్దులు. ఇటలీకి పశువుల నేల అనే అర్ధం వస్తుంది. ఇటలీ దేశ రాజధాని రోమ్. విస్తీర్ణం 3,01, 338 చదరపు కిలోమీటర్లు. వీరి భాష ఇటాలియన్. వీరి కరెన్సీ యూరో. ఇటలీలో 90 శాతం మంది ప్రజలు రోమన్ కేధలిక్స్. ధర్మామీటర్, వయోలిన్, టెలిఫోన్ ఈ దేశస్థులు కనిపెట్టినవే. ఇటలీలో 3వేలకు పైగా మ్యూజియంలు ఉన్నాయి. ప్రపంచలోనే అత్యధికంగా ఈ దేశంలో ఎలివేటర్లు ఉన్నాయి. ప్రపంచంలోనే పురాతన విశ్వవిద్యాలయంగా పేరుపొందిన రోమ్ విశ్వవిద్యాలయాన్ని 1303 సంవత్సరంలో ఏర్పాటు చేసారు. ప్రపంచంలోనే పొడవైన సొరంగ మార్గాలలో ఇటలీలో ఉన్న ‘లాట్స్ చ్ బెర్గ్ బెసె టన్నెల్ ఒకటి. దీని నిర్మాణానికి 17 సంవత్సరాలు పట్టిందట. పర్యాటకపరంగా ఈ దేశం ప్రసిద్ధి చెందినది. రోమ్, నప్లెస్, మిలాన్ నగరాలు ఇటలీలో అందమైన నగరాలుగా పేరుపొందినవి. పీసా, వెనిస్ నగరాలు కూడా అందమైనవే. లీవింగ్ టవర్ ఆఫ్ పీసా గొప్ప పర్యాటక ప్రాంతం. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే దేశాలలో ఇటలీ అయిదో దేశం. దేశంలోని 5 భాగాలలో నాలుగవ వంతు పర్వతాలే. ఏటా సుమారుగా అయిదు కోట్లమంది ఈ దేశాన్ని సందర్శిస్తారు. నియంత జూలియస్ సీసర్, క్రిస్టోఫర్ కొలంబస్, ప్రముఖ చిత్రకారుడు మైఖేల్ ఏంజిలో, ముస్సోలినీ, మార్కోపోలో ఈ దేశానికి చెందినవారే. మెర్కురీ, పోటాష్, జింక్, మార్బుల్ బెరైట్, సహజవాయువు, క్రూడ్ ఆయిల్ ఈ దేశంలో లభించే సహజ వనరులు. పండ్లు, కూరగాయలు, ద్రాక్ష, బంగాళాదుంపలు, బీట్ దుంపలు, సోయా, చిరుధాన్యాలు వ్యవసాయ ఉతప్పత్తులు.
Kosova
Capital Pristina ………. Language Albanian/Serbian ………. Currency Euro ………. Religion Islam ………. Calling Code +. 383
కొసావో
కొసావో సెర్బియాలోని భూభాగం. 2008 సంవత్సరంలో సెర్బియా నుండి విడిపోయి స్వతంత్రదేశంగా ప్రకటించుకుంది. అమెరికా మరియు కొన్ని యూరోపియన్ దేశాలు మొత్తం 113 దేశాలు కోసావాను స్వతంత్ర దేశంగా గుర్తించాయి. కానీ చాలా దేశాలు కొసావోను స్వతంత్ర దేశంగా గుర్తించలేదు అన్బేనియన్ మరియు సెర్బియన్ ఈ దేశ అధికార భాషలు. ఈ దేశం అధికారికంగా ఏ మతానికి చెందనప్పటికీ ప్రజలలో అధికశాతం మంది ముస్లింలు. చాలా కొద్దిమంది క్రిస్టియన్లు కలరు. కొసావో రాజధాని ప్రిస్టీనా. ఈ దేశ వైశాల్యం 10, 908 చ.కి.మీ. ఈ దేశ కరెన్సీ యూరోలు. కొసావో పర్యాటకపరంగా పేరుపొందినది. బాల్కనో ద్వీపాన్ని పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు. పర్యాటకం ద్వారా అధిక ఆదాయం ఈ దేశానికి వస్తుంది.
Latvia
Capital Riga ………. Language Latvian ………. Currency Euro ………. Religion Christian ………. Calling Code +. 371
లాట్వియా….
10వ శతాబ్ధంలో బాల్టిక్ తెగల వారు లాట్వియాలో స్వతంత్ర ప్రభుత్వాలు ఏర్పరుచుకున్నారు. 11 వ శతాబ్దంలో జర్మన్ల ప్రభావం ఈ దేశంపై పడింది. తరువాత 1721 సంవత్సరంలో లాట్వియా రష్యా అధికారంలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్దంలో జర్మనీ లాట్వియాలో చాలా ప్రాంతాలను ఆక్రమించుకుంది. మూడువంతుల ప్రజలు జర్మన్స్ మరియు రష్యన్స్ చేత చంపబడ్డారు. . 1991 సంవత్సరంలో రష్యా విచ్ఛినం అయిన తరువాత లాట్వియా స్వతంత్ర దేశంగా అవతరించింది. 2004 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ లో చేరింది. . లాట్వియా రాజధాని రీగా. దేశ వైశాల్యం 64,589 చ.కి.మీ. వీరి అధికార భాష లాట్వియన్. రష్యన్ భాషను 37 శాతం ప్రజలు మాట్లాడుతారు. వీరి కరెన్సీ లాట్వియన్ లాట్. లాట్వియా క్రిస్టియన్ దేశం. ప్రజలు లూధరన్స్, లూధరన్ కేథలిక్స్, రష్యన్ ఆర్ధోడెక్స్ పంప్రదాయాలను పాటిస్తారు. . గింజ ధాన్యాలు, షుగర్ బీట్, బంగాళా దుంపలు, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పశుమాంసం, పందిమాంసం, పాలు, చేపలు ఇతర ఉత్పత్తులు. . లైమ్ స్టోన్, కలప, డోలోమెట్, వ్యవసాయ యోగ్యమైన భూములు సహజ సంపదలు.
Liechtenstein
Capital Vaduz ………. Language German ………. Currency Swiss Franc ………. Religion Roman Catholism ………. Calling Code +. 423
లిచెన్ స్టెయిన్
ఈ దేశం యూరోప్ ఖండంలో స్విట్జర్ లాండ్, ఆస్ట్రియా దేశాల మధ్య రైస్ నది మీద ఉన్న చాలా చిన్న రాజ్యం. 1866 సం.లో స్థాపించబడిన ఈ దేశాన్ని రాజవంశీయులు పాలిస్తున్నారు. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంలో కలదు. ఈ దేశ విస్తీర్ణం 160 చ.కి.మీ. రాజధాని వాడుజ్. వీరి అధికార భాష జర్మన్. ప్రజలు 87 శాతం మంది రోమన్ కేధలిక్ క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నారు. బార్లీ, గోధుమ మొక్కజొన్న పంటలు పండిస్తారు. పాడి పరిశ్రమ కూడా ఉంది. ఆర్దికవ్యవస్థ పరిశ్రమల మీద ఆధారపడి ఉంది. ఈ దేశానికి సైన్యం లేదు. రెండు ప్రపంచ యుద్ధాలలో తటస్తంగా ఉంది. జవుళీ, యంత్రసామాగ్రి, ఎలక్ట్రానిక్ సామాగ్రి, మైక్రోస్కోపులు, ఆహార పదార్ధాలు, ధాతు సామాగ్రి, హై వాక్యూమ్ పంపులు, తోలు సామాగ్రి తయారీ మొదలగునవి ప్రధాన పరిశ్రమలు.
Lithuania
Capital Vilnius ………. Language Lithuanian ………. Currency Euro ………. Religion Roman Cath.Church ………. Calling Code +. 370
లిధువేనియా…
1990 సంవత్సరలో సోవియట్ రష్యా విచ్చిన్నం తరువాత లిధువేనియా స్వాతంత్ర్య రాజ్యంగా అవతరించింది. ఐరోపా ఖంఢంలోని బాల్టిక్ సముద్రానికి ఆగ్నేయ దిశలో ఉన్న తీరంలో ఉన్న మూడు దేశాలలో లిధువేనియా ఒకటి. 2004 సంవత్సరంలో యూరోపియన్ సమాఖ్యలో సభ్యదేశంగా చేరింది. ఈ దేశం పూర్వచరిత్ర ప్రకారం బాల్టిక్ జాతి ప్రజలు మెదట్లో ఇక్కడ నివసించారు. ఈ దేశ రాజధాని వెల్ నూయిస్. వీరి అధికార భాష లిధువేనియన్ తరువాత రష్యన్, పోలిష్ భాషలు చాలా కొద్దిమంది మాట్లాడుతారు. ఈ దేశ వైశాల్యం 65,200 చ.కి.మీ. వీరి కరెన్సీ లిటాస్. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. ప్రజలలో 79 శాతం మంది రోమన్ కేధలిక్ సంప్రదాయాన్ని పాటిస్తారు. ధాన్యాలు, బీట్ దుంపలు, బంగాళాదుంపలు, కూరగాయలు పండిస్తారు. పశుమాంసం, పాలు, గుడ్లు, చేపలు ఇతర ఉత్పత్తులు. వ్యవసాయ యోగ్యమైన భూములున్నాయి.
Luxembourg
Capital Luxembourg City ………. Language Luxembourgish ………. Currency Euro ………. Religion Roman Catholic ………. Calling Code +. 352
లక్సెమ్ బర్గ్
యూరోప్ లో పశ్చమ జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న చిన్న రాజ్యం లక్సెమ్ బర్గ్. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాజ్యం. రాజ్యంగాన్ని ఏర్పరుచుకుని రాజవంశీయు పరిపాలిస్తున్న దేశం. ఈ దేశ విస్తీర్ణం 2,586 చ.కి.మీ. రాజధాని లక్సెమ్ బర్గ్. వీరి అధికార భాష Luxembourgish. జర్మనీ మరియు ఫ్రెంచ్. ప్రజలు ఇంగ్లీష్ , జర్మన్ భాషలు కూడా మాట్లాడుతారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. ఎస్బీ సుర్ ఆల్ జెట్టీ, డిఫర్ డాంగే, డుడులాంగే ప్రముఖ పట్టణాలు. సాగునేల ప్రధానంగా ఉన్న ప్రాంతాన్ని బాన్ వేన్ అంటారు. ఈ నేలలు నదుల తీరాన, కొండలతోనూ, పీఠభూమితోనూ నిండి ఉన్నాయి. అతెర్త్ నది, ఆల్జత్తే నది, మొసల్లే నది, మారే నదులు బాన్ వేన్ ప్రాంతంలో ప్రవహిస్తున్న ముఖ్యనదులు. గోధుమ, బార్లీ, ఓట్ ధాన్యం, బంగాళా దుంపలు, ద్రాక్ష ప్రధానమైన పంటలు. ఇనుప రాయి పుష్కలంగా దొరకుతుంది. పశువుల పెంపకం, పందుల పెంపకం ప్రజల ఇతర జీవనోపాధులు. ఉక్కు ప్రధాన పరిశ్రమ. ద్రాక్ష సారాయి పరిశ్రమ కూడా ఉంది. ఈరోపియన్ ఆర్ధిక సంఘంలో సభ్యత్వం కలిగి అంతర్జాతీయ వాణిజ్యాన్ని సాగిస్తుంది.
Macedoniea
Capital Skopje ………. Language Macedonian ………. Currency Macedonian Dinar ………. Religion Eastreran Orthodox ………. Calling Code +. 389
మాసిడోనియా
మాసిడోనియా దేశం ఆసియా నుండి యూరోప్ దేశాలకు ప్రయాణించే వర్తకులకు మరియు ఆక్రమణ దారులకు కేంద్రంగా ఉండేది. క్రీస్తు పూర్వం 356లో మాసిడన్ ఫిలిప్-2 మాసిడోనియన్ లో చాలా ప్రాంతాలను ఏకం చేసాడు. ఇతని కుమారుడు అలెగ్జాండర్ ది గ్రేట్ మాసిడోనియన్ ను మహాసామ్రాజ్యంగా విస్తరింపచేశాడు. గ్రీకుల తరువాత ఈ దేశాన్ని రోమన్లు, అట్టోమన్లు 1912 సంవత్సరందాకా పాలించారు. రెండవ ప్రపంచయుద్దం తరువాత ఈ దేశం యుగోస్లోవియాలో భాగంగా ఉంది. 1991 సంవత్సరంలో యుగోస్లోవియా నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. మాసిడోనియా రాజధాని Skopje . ఈ దేశ వైశాల్యం 25,333 చ.కి.మీ. వీరి భాష మాసిడోనియన్, అల్బేనియన్ మరియు టర్కిష్, రోమా, సెర్బియన్. వీరి కరెన్సీ మాసిడోనియన్ దీనార్లు. ప్రజలలో ఎక్కవ మంది క్రిస్టియన్లు తరువాత 33 శాతం మంది ముస్లింలు కలరు. ద్రాక్ష, ద్రాక్షా సారాయి, పొగాకు, కూరగాయలు వ్యవసాయ ఉత్పత్తులు. పాలు, గ్రుడ్లు లభిస్తాయి. రాగి, సీసం, జింక్, నాణ్యతలేని ఇనుప ఖనిజం, మాంగనీస్, నికెల్, లైమ్ స్టోన్, బంగారం, వెండి, జిప్సం, కలప, టంగ్ స్టన్ సహజ సంపదలు. వ్యయసాయ యోగ్యమైన భూమి కలదు.
Malta
Capital Valletta ………. Language Maltese/English ………. Currency Euro ………. Religion Roman Catholism ………. Calling Code +. 356 మాల్టా ద్వీప దేశం మధ్యధరా సముద్రంలో ఐరోపా, ఉత్తర ఆఫ్రికా మధ్యలో ఉంది. ఇది కొన్ని ద్వీపాల సమూహం. ఇందులో ప్రధానమైన ద్వీపం మాల్టాతో పాటు గోజో, కోమినో అనే చిన్న ద్వీపాలు, నివాసయోగ్యం లేని అతిచిన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. విస్తీర్ణం, జనాభా పరంగా ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఇదీ ఒకటి. ప్రాచీనులు దీన్నే ‘మెలిటా’గా పిలిచేవారు. అంటే తేనె ద్వీపమని అర్థం. ఈ దేశ రాజధాని వాలెట్టా. ఇది ప్రముఖ చారిత్రక నగరం. ఈ దేశ జనాభా 4,45,426 (2018) దేశ విస్తీర్ణం 316 చ.కి.మీ. వీరి భాషలు ఆంగ్లం, మాల్టీస్. ఈ దేశ కరెన్సీ యూరో. ఈ దేశం శతాబ్దాల తరబడి పరాయి దేశాల పాలనలో ఉంది. 1964 సంవత్సరంలో మాల్టా స్వాతంత్ర్యం పొందింది. 2004 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశంగా చేరింది. ఈ దేశ ప్రజలలో 98 శాతం మంది రోమన్ కేధలిక్స్(క్రిస్టియన్స్). జెండాలో ఎరుపు, తెలుపు రంగులతో ఉండే ఈ దేశ పతాకం యూకే దేశ చిహ్నంతో ఉండటం వల్ల ప్రత్యేకమైందిగా భావిస్తారు. ఇక్కడ 1980లో ‘పొపెయే’ అనే చిత్రం కోసం అందమైన ఇళ్లతో ఒక గ్రామాన్ని నిర్మించారు. ‘పొపెయే విలేజ్’గా పిలిచే ఈ గ్రామం మంచి పర్యాటక ప్రాంతం. వాలెట్టా దగ్గర్లో ఉండే ‘గ్రాండ్హార్బర్’ ప్రపంచంలోనే సహజంగా ఏర్పడిన లోతైన నౌకాశ్రయం. . ఇక్కడుండే గ్యాన్టిజ, అయిదు వేల ఏళ్లనాటి హగర్కిమ్దేవాలయాలు ఈజిప్టు పిరమిడ్ల కన్నా పురాతనమైనవి. ఇక్కడ పడవలకు మెరిసే రంగులతో కళ్ల బొమ్మలు వేస్తారు. సముద్రపు చెడును, దురదృష్టాన్ని పోగొట్టడానికే ఈ ఆచారం. గోజో ద్వీప దేశంలో ‘అజూరే విండో’ అనే సున్నపురాయి తోరణం ప్రసిద్ధి చెందినది. ఇది ఎన్నో సినిమాల్లో కనిపిస్తుంటుంది. . బంగాళ దుంపలు, కేలిఫ్లవర్, ద్రాక్ష, గోధుమలు, బార్లీ, టమాటోలు, సిట్రస్ జాతి పండ్లు పండిస్తారు. పందుల పెంపకం, కోళ్ల పెంపకం, పాడిపరిశ్రమలు కలవు. . లైమ్ స్టోన్, సాల్ట్, వ్యవసాయ యోగ్యమైన భూములు సహజ సంపదలు.
Moldava
Capital Chisinau ………. Language Romanian ………. Currency LEU ………. Religion Orthodox Christian ………. Calling Code +. 373
మాల్డోవా
మాల్డోవా ఆసియా మరియు తూర్పు యూరోప్ ఖంఢాలకు వచ్చేదారి పోయే దారిగా ఉండటం వలన గ్రీక్స్, రోమన్స్, హాన్స్, బల్గర్స్ మరియు మంగోల్ ల దాడికి గురై వీరి ఆధీనంలోకి వెళ్లింది. 14వ శతాబ్ధంలో మాత్రం కొద్ది కాలం పాటు స్టీఫెన్ ద గ్రేట్ ఆధ్వర్యంలో స్వతంత్రంగా వ్యవహరించింది. కానీ 16వ శతాబ్ధంలో అట్టోమన్ల చేత ఆక్రమించబడింది. రూసో, టర్కిష్ యుద్దంలో ఈ దేశం రెండుగా విభజించబడి తూర్పు భాగం రష్యా వారి ఆధీనంలోకి పశ్చిమభాగం టర్కీవారి చేతిలోకి వెళ్లిపోయాయి. 1918 సంలో రష్యావారి ఆధీనంలో ఉన్న భాగం రోమేనియా చేతిలో వెళ్లింది. 1944 ప్రాంతంలో తిరిగి ఈ ప్రాంతాన్ని రష్యావారు ఆక్రమించారు. 1991 సంవత్సరంలో రష్యా విచ్చిన్నం తరువాత మాల్డోవా స్వాతంత్ర్యం ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ దేశ రాజధాని Chisinau . ఈ దేశ వైశాల్యం 33,843 చ.కి.మీ. వీరి భాషలు మాల్డోవన్, రష్యా మరియు గగాజ్. వీరి కరెన్సీ మాలడేవియన్ లియూ. ఈ దేశం క్రిస్టియన్ దేశం. ఈస్ట్రన్ ఆర్ధోడాక్స్ శాఖకు చెందినవారు. కూరగాయలు, పండ్లు, గింజ ధాన్యాలు, పొద్దు తిరుగుడు గింజలు, పొగాకు వ్యవసాయ ఉత్పత్తులు. ఎద్దుమాంసం. పాలు ఇతర ఉత్పత్తులు. లిగ్నేట్, ఫాస్పరేట్, జిప్సం, లైమ్ స్టోన్ సహజ సంపదలు. వ్యయసాయ యోగ్యమైన భూములున్నాయి.
Monoco
Capital Monoco ………. Language French ………. Currency Euro ………. Religion Roman Catholicism ………. Calling Code +. 377 ప్రపంచంలోని చిన్న దేశాలలో మొనాకో ఒకటి. రాజవంశీయుల పాలనలో ఉంది. ఫ్రాన్స్ దేశానికి ఆగ్నేయ దిశ మూలగా మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉన్నది. ఈ దేశ విస్తీర్ణం కేవలం 1.9 చ.కి.మీ. 1993 సంవత్సరంలో మొనాకో యునైటెడ్ నేషన్స్ లో ఓటుహక్కు గల దేశంగా గుర్తించబడ్డది. ఈ దేశ ప్రజలలో 90 శాతం మంది రోమన్ కేథలిక్ శాఖకు చెందినవారు. రాజధాని మొనాకో. అధికార భాషలు ఫ్రెంచ్, మొనాగాస్క్యే. ప్రజలు క్రైస్తవులు. మాంటి కార్లో, మొనాకో విల్లీ, ఫాంటకవీయిల్లీలా కొండలమీద పక్కపక్కనే ఉన్న పట్టణాలు. కేజినో జాదగృహాలు, పెద్ద హోటళ్ళు, దుకాణాలు ఈ పట్టణంలో ఉన్నాయి. మాంటీ కార్టో ర్యాలీ, మొనాకో గ్రాండ్ ప్రిక్స్, మోటారు కార్ల ర్యాలీ, జూద గృహాలు అంతర్జాతీయంగా పేరుపొందాయి. పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తారు. ఈ జూద గృహాలలో జేమ్స్ బాండ్ సినిమాలు కూడా చిత్రీకరించ బడ్డాయి. రసాయనిక ద్రవ్యాలు, పాల ఉత్పత్తులు, పొగాకు పరిశ్రమ, పర్యాటకం మొనాకో ఆర్థిక వ్యవస్థలు మూలం. ఈ దేశానికి సహజసంపదలు, వ్యవసాయ ఉత్పత్తులు గాని లేవు.
Montenegro
Capital Podgorica ………. Language Montenegrin ………. Currency Euro ………. Religion Muslim/Christian ………. Calling Code +. 382
మౌంటెనాగ్రో
ఐరోపా ఖండంలో ఉన్న చిన్న దేశం మౌంటెనాగ్రో. క్రొయేషియా, బోస్నియా అండ్ హర్జెగోవీన్యా, సెర్బియా, కొసోవో, అల్బేనియా దేశాలు, అడ్రియాటిక్ సముద్రం దీనికి సరిహద్దులు. మౌంటెనాగ్రో రాజధాని పోడ్గొరీసా అతి పెద్ద నగరం కూడా రాజధాని పోడ్గొరీసానే. ఈ దేశ విస్తీర్ణం 13,812 చదరపు కిమీ జనాభా 6,42,550 (2018) ఈ దేశ కరెన్సీ యూరో వీరి అధికారిక భాష మౌంటెనాగ్రిన్. సెర్బియా నుంచి 2006 జూన్ 3న స్వతంత్రం పొందింది. ఈ దేశం పేరుకు అర్థం ‘నల్ల పర్వతం’. ఇక్కడ భూభాగంలో కొంత శాతం నల్లని పర్వతాలు అడవులతో నిండి ఉంటాయి. అందుకే దీనికీ పేరొచ్చింది. దేశంలో 44.6శాతం మౌంటెనాగ్రియన్లు ఉన్నారు. ఇంకా సెర్బియన్లు, బోస్నియక్లు, అల్బేనియన్లు, క్రోట్లు…ఇలా చాలా జాతుల వారు నివసిస్తున్నారు. ప్రజలు ఆర్ఢోడాక్స్, రోమన్ కేధలిక్, ముస్లిం మతస్తులు. ఇక్కడ జనాభాలో 25 నుంచి 54ఏళ్ల మధ్య వారు 47శాతం మంది ఉన్నారు. 99శాతం అక్షరాస్యత ఉంది, 64శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. దాదాపుగా 60శాతం భూమి సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ అతి ఎత్తయిన ప్రాంతం ‘బొబోటొవ్ కుక్’. ఉల్సిన్జ్ మున్సిపాలిటీ దగ్గరున్న బీచ్ ఐరోపాలోని పొడవాటి ఇసుక బీచ్‌ల్లో ఒకటి. ఇది మొత్తం 12.5కిలో మీటర్లుంటుంది. హార్స్‌బ్యాక్ రైడింగ్, కైట్ సర్ఫింగ్, బీచ్సాకర్, వాలీబాల్ క్రీడలకు ఇది ప్రసిద్ధి. 60శాతం మంది జనాభా ఇంటర్నెట్‌ని వాడుతున్నారు. 250కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయి. ఇక్కడ మిట్రోవిసా అనే గ్రామంలో ఒక ఆలివ్ చెట్టుంది. దీన్ని ప్రపంచంలోనే అతి పురాతన ఆలివ్ చెట్టుగా చెబుతారు. దాదాపుగా 2000 ఏళ్ల కిందటిది. ఐరోపాలో అధికంగా పొడగరులున్న దేశమిది. సరాసరిన చూస్తే ఇక్కడి మౌంటెనాగ్రియన్లంతా దాదాపుగా ఆరడుగుల ఎత్తుంటారు. ఐరోపాలో మొదటిగా కారు వాడిన దేశమిదే. సెర్బియా, ఇటలీ, జర్మనీ, క్రొయేషియా, హంగేరీలతో ఈ దేశానికి ఎక్కువగా వ్యాపార సంబంధాలున్నాయి. ఇక్కడున్న తారా అనే నది చాలా స్వచ్ఛమైన నీరు కలిగిందిగా ప్రసిద్ధికెక్కింది. వాటిని ఫిల్టర్ అవసరం లేకుండానే తాగవచ్చంటారు. ఇది ఈ దేశంలో 110 కిలోమీటర్లు ప్రయాణించి బోస్నియా అండ్ హర్జెగోవీన్యాలోకి ప్రవహిస్తుంది. చాలా ప్రాంతాల్లో రెండు దేశాల మధ్యా విభజన రేఖగానూ ఉంటుంది. ఈ నదీపరివాహక ప్రాంతంలో ఉన్న లోయను ఐరోపా ఖండంలోనే అతి లోతైన లోయగా చెబుతారు. ఇది 1300 మీటర్ల లోతున ఉంటుంది. దీనిలోనే ‘దుర్మిటర్ నేషనల్ పార్క్’ ఉంది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఏడులక్షల్లోపే జనాభా ఉన్న ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. ఎందుకంటే దీనికి ఆనుకుని అడ్రియాటిక్ సముద్రం ఉంది. మొత్తం 118 మైళ్ల తీర రేఖ ఉంటే 120 అందమైన బీచ్‌లున్నాయి. వరల్డ్ టూరిజం అండ్ ట్రావెల్ కౌన్సిల్ మంచి పర్యాటక దేశాల జాబితాలో దీని పేరును మొదటే పొందుపరిచింది. ఇక్కడ 360రోజులు చక్కటి వాతావరణం ఉంటుంది. చలికాలం మాత్రం మంచు ఎక్కువ. దీంతో స్కీయింగ్, ఐస్ స్కేటింగ్ల కోసం ఇక్కడకు వచ్చేవారి సంఖ్యా అధికమే. స్టీల్, అల్యూమినియంలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలూ ఎక్కువే. 40 శాతం భూమిలో అడవులే ఉన్నాయి. వాటి ఉత్పత్తులతో ఇక్కడ కార్పెట్లు, చెక్క శిల్పాలు తయారవుతాయి. సిరామిక్ వస్తువుల్నీ తయారుచేసి ఎగుమతి చేస్తారు. ఫిలిగ్రీ జ్యూవెలరీ ఇక్కడ ఎక్కువగా తయారవుతుంది. గింజ ధాన్యాలు, పొగాకు, బంగాళా దుంపలు, సిట్రస్ జాతి పండ్లు, ద్రాక్షలను పండిస్తారు.
Netherlands
Capital Amsterdam ………. Language Dutch/Russian/English ………. Currency Euro ………. Religion Irreligion ………. Calling Code +. 31
నెదర్లాండ్స్
పశ్చిమ యూరోప్ లో ఉత్తర సముద్రాన్ని ఆనుకుని రైన్ నదీ ముఖద్యారాన్ని ఆనుకుని ఉన్న సంపన్న దేశం నెదర్లాండ్స్. రాజవంశీయులు రాజ్యాంగాన్ని ఏర్పాటుచేసుకొని పాలిస్తున్న దేశం. ఈ దేశ విస్తీర్ణం 41,863 చ.కి.మీ. రాజధాని ఆమ్ స్టర్ డామ్ . వీరి భాష డచ్. కరెన్సీ యూరోలు. ఆమ్ ప్టరక్ డాం, రోటర్ డాంలు ప్రధాన నగరాలు ఈ దేశంలో సారవంతమైన నేలలున్న ప్రాంతం పోల్డరు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 7 మీటర్ల దిగువున ఉన్నది. డైకు నిర్మాణాల ద్వారా ఈ ప్రాంతం సముద్రపు ముంపు కాకుండా రక్షిస్తుంటారు. వ్యవసాయంలో యంత్రాలను ఎక్కువగా వాడుతుంటారు. బార్లీ, ఓటు ధాన్యం, పంచదార బీటు దుంపలు, గోధుమ, తులిప్ పువ్వులు పండిస్తారు, మత్స్య పరిశ్రమ భారీ స్థాయిలో సాగుతుంది. చమురు వాయువు, పెట్రోల్, ఉప్పు ఖనిజ నిక్షేపాలు. పారిశ్రామికంగా ఈ దేశం అభివృద్ధి చెందినది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఉక్కు, జువుళీ, ఇనుము, ఆహార పదార్ధాలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. అమ్ స్టర్ డామ్ పట్టణం వజ్రపరిశ్రమకు ప్రధాన కేంద్రం. రాటర్ డామ్ పట్టణం పెద్ద రేవు పట్టణం.
Norway
Capital Oslo ………. Language Norwaygian ………. Currency Norwaygian Krone ………. Religion Evangelical Luthern ………. Calling Code +. 47
నార్వే
యూరోప్ ఖండంలో వాయువ్య దిశలో ఉన్న దేశం నార్వే. రాజ్యంగం ఏర్పరుచుకుని రాజవంశీయులు ఈ దేశాన్ని పాలిస్తున్నారు.ఈ దేశంలో మే, జూన్, జులై నెలలో సూర్యుడు అస్తమించడు. నవంబర్ నెల చివరినుండి జనవరి చివరి వరకు సూర్యుడు ఉదయించడు. అర్ధరాత్రి ‘‘ఆరోరా బొరియాలిస్ ’’ అనే కంతులు ఈ దేశంలో కనిపిస్తాయి. ఈ దేశ విస్తీర్ణం3,23,878 చ.కి.మీ. రాజధాని అస్లో. వీరి అధికార భాష నార్విజియన్. పర్వతాలు ఎక్కువగా ఉన్న ఈ దేశంలో సహజసంపద పుష్కలంగా లభిస్తుంది. బార్లీ, ఓట్స్, రై ధాన్యం, బంగాళా దుంపలు పండిస్తారు. గండుమీను చేపలు, హెర్రింగ్, టూనా, సీల్ చేపలు, మేకరిల్, సాల్మన్ చేపలు లభిస్తాయి. అడవులనుండి లభ్యమయ్యే కలపతో కలపగుజ్జు తయారీ, కాగితం తయారీ, ప్లైవుడ్ మొదలైన పరిశ్రమలు ఉన్నాయి. జలవిద్యుత్ పుష్కలంగా ఉత్పత్తి కావటం వలన ఫ్యాక్టరీలకు ఇంధనం కొరత లేదు. నార్వే పశ్చిమ తీరం వెంటబడి ఫియోర్డ్ లనే ఎత్తయిన కొండశిఖరాలు కనిపిస్తాయి.
Poland
Capital Warsaw ………. Language Polish ………. Currency Polish Zloty ………. Religion Roman Catholicism ………. Calling Code +. 48
పోలాండ్
ఐరోపా ఖంఢంలోని తొమ్మిదవ పెద్ద దేశం పోలండ్. ఇక్కడ ప్రజలను పోల్స్ అంటారు. ఈ పేరుమీదు గానే ఈ దేశానికి పోలండ్ అనే పేరు వచ్చింది. పోలండ్ 1918వ సంవత్సరంలో రష్వా నుండి స్వాతంత్ర్యం పొందింది. 1922 సంవత్సరం నుండి ప్రజాస్వామ్య దేశంగా మారింది. దేశ రాజధాని వర్సావ్. వీరి భాష పోలిస్. దేశ కరెన్సీ పోలిష్ వీరి భాష పోలీష్ కొంచెం కష్టమైనది ఇతరులు నేర్పుకోవటానికి కష్టపడాలి. దేశ విస్తీర్ణం 3,12,679 చ.కి.మీటర్లు ప్రజలలో ఎక్కువ మంది రోమన్ కేధలిక్ వర్గానికి చెందినవారు పోలండ్ లో అక్షరాస్యతా 90 శాతం. మళ్లీ వీరిలో 50 శాతం మంది డిగ్రీ వరకు చదువుకున్నవారే. ఇక్కడున్న వైల్జ్ కా ఉప్పుగని ప్రాచీనమైన గనులలో ఒకటి. 13వ శతాబ్ధంలో ఉప్పు సేకరణ మొదలు పెట్టారు. 2007 వరకు ఉప్పును సేకరించారు. 178 మైళ్లున్న ఈ ఉప్పుగని ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా మారింది. ఐరోపా మొత్తం మీద యూదులు ఎక్కువగా ఈ దేశంలోనే ఉన్నారు. బొగ్గు నిల్వలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మరో 500 సంవత్సరాలకు సరిపడా వీరి అవసరాలకు బొగ్గు సరిపోతాయని అంటారు. పసుపు రంగులో ఉండే అంబర్ రత్నాలను ఎక్కువగా ఎగుమతి చేస్తారు. వీరి ఆహారం, సూప్, మాంసం, బేక్ చేసిన పదార్ధాలు. బంగాళా దుంపలు, పండ్లు, కూరగాయలు, గోధుమలు పండిస్తారు. పందుల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ల పెంపకం కలవు.
Portugal
Capital Lisbon ………. Language Portugese ………. Currency Euro ………. Religion Roman Catholic ………. Calling Code +. 351
పోర్చుగల్
ఐరోపా ఖండంలో చిన్న దేశం పోర్చుగల్. దాదాపు కోటి మంది జనాభా మాత్రమే ఉన్నారు. స్పెయిన్, అట్లాంటిక్ మహా సముద్రాలు సరిహద్దులు. దేశంలో మూడు వంతుల్లో ఒక వంతు భూమిలో అడవులే ఉన్నాయి. పోర్చుగల్ రాజధాని లిస్పన్. వీరి కరెన్సీ యూరో. వీరి అధికారిక భాష పోర్చుగీసు. ఈ దేశ వైశాల్యం 92,391 చ.కి.మీటర్లు. దేశ ప్రజలలో 94 శాతం మంది రోమన్ కేధలిక్ శాఖను అనుసరిస్తారు. మిగతా వారు ప్రొటెస్టెంట్లు. ఈ దేశం క్రిస్టియన్ దేశం ప్రపంచవ్యాప్తంగా ఈ భాషను 23కోట్లమందికి పైగా మాట్లాడుతున్నారని అంచనా. ఈ భాష ఈ దేశానికే కాదు మరో తొమ్మిది దేశాలకూ అధికారిక భాషే. ప్రపంచంలో ఇంగ్లిష్, స్పానిష్ తర్వాత ఎక్కువ మంది మాట్లాడేది ఈ భాషే. తాజా లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ పురుషుల కంటే స్త్రీల ఆయుష్షు ఆరేళ్లు ఎక్కువ. ఐరోపా ఖండంలో ఉన్న రాతి గుహల్లో అతి అరుదైనది ‘ద బెనాగిల్ కేవ్’. ప్రపంచంలోని తొలి పది అతి చల్లని గుహల్లో ఇదీ ఒకటి. సముద్ర తీరంలో ఉండే ఈ గుహ వింతగా ఉంటుంది. పైన ఆకాశం కనిపించేలా ఓ రంధ్రం ఉండి చుట్టూ గోడలతో మూసుకుని ఉన్నట్టు ఉంటుంది. వాటి మధ్య ఉన్న ఖాళీల నుంచి సముద్రపు అలలు లోపలికి వస్తుంటాయి. దీంతో గుహ లోపల ఉండే ఈ బీచ్‌లో సరదాగా గడిపేందుకు చాలా మంది వస్తుంటారు. ఇది పోర్చుగల్ దక్షిణ భాగంలో బెనాగిల్ అనే ఓ చిన్న పల్లెలో ఉంది. ఈ వూరి పేరు మీదనే ఈ గుహనూ పిలిచేస్తారు. పునరుత్పాదక(రెన్యుబుల్) వనరుల నుంచి ఎక్కువగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందీ దేశం. వీళ్ల అవసరాల్లో 70శాతం విద్యుత్ ఇలాగే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో సర్ఫింగ్కి అతి అనువైన సముద్ర తీరం ఈ దేశానిదేనంటారు. ఏడాది పొడవునా ఇక్కడ అలలు సర్ఫింగ్కి అనుకూలంగా ఉంటాయట. ప్రజా రవాణా కోసం స్ట్రీట్ కార్లను 1890 నుండి వాడేస్తున్నారు. ఇంటికి ఆహ్వానించిన అతిథులకి పూలు, చాక్లెట్లను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం వీరికి ఉంది. పదమూడు సంఖ్యను దురదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. . ఈ దేశ రాజధాని లిస్బన్లో 1732లో ఓ పుస్తకాల దుకాణం ప్రారంభించబడింది. దీని పేరు లివ్రారియా బెర్ట్రండ్.ఈ దుకాణం ఇప్పటికీ జనాదరణ పొందుతూనే ఉంది. ప్రపంచంలోనే అతి ప్రాచీన పుస్తకాల దుకాణంగా దీన్ని చెబుతారు. అతి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఇక్కడున్న కోయింబ్రా ఒకటి. 1290వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. ఐరోపా ఖండంలో అతి పొడవైన వంతెన ఇక్కడే ఉంది. దాని పేరు ‘వాస్కోడీగామా బ్రిడ్జ్’. 17కిలోమీటర్ల పొడవుంటుంది. చరిత్రలో అతి పెద్ద భూకంపంగా చెప్పుకునే ‘గ్రేట్ లిస్బన్ ఎర్త్‌క్వేక్’ 1755లో ఇక్కడ వచ్చింది. రిక్టరుస్కేలుపై 9 తీవ్రతతో నమోదైన భూకంపం. ఆ వెంటే సునామీ వచ్చింది. ఏకంగా పది వేల మందికి పైగా ప్రాణాలొదిలారు. ఇక్కడ తృణ ధాన్యాల్ని ఎక్కువగా పండిస్తారు. ఇవే కాకుండా బంగాళాదుంపలు, ద్రాక్ష, బాదం,ఆలివ్, టమాటాలనూ సాగుచేస్తారు. గొర్రెలు, బాతులను పెంచుతారు. చేపలు, కోళ్ల పరిశ్రమ, పాడి పశువుల పెంపకం కలదు. ఇతర దేశాలకు టామాటా పేస్ట్‌ని ఎక్కువగా ఎగుమతి చేసే దేశం ఇదే. ఇనుప ఖనిజం, రాగి, జింక్, టంగ్ స్టన్, వెండి, బంగారం, యురేనియం, జిప్సం, సాల్ట్ సహజ సంపదలు.
Romania
Capital Bucharest ………. Language Romanian ………. Currency Romanian LEU ………. Religion Eastern Orthodox ………. Calling Code +. 40
రుమేనియా
సోషలిస్ట్ రిపబ్లిక్ దేశం రుమేనియా. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండటంతో రుమేని అని పేరు వచ్చింది. ఈ దేశం నల్ల సముద్రాన్ని ఆనుకుని ఉంది. 1859లో ఏర్పాటైన ఈ దేశం 1940 సం.లో కమ్యూనిస్ట్ ల పాలనలోకి వచ్చింది. సోవియట్ ప్రాబల్య అప్పట్లో ఎక్కువగా ఉండేది.ప్రస్తుతం సోవియట్ జోక్యం లేదు. ఈ దేశ విస్తీర్ణం 2,37,500 చ.కి. మీ. రాజధాని బుఖారెస్ట్. వీరి అధికార భాష రోమేనియన్. ప్రజలలో రోమన్ ల వారసులు 88 శశాతం మంది ఉన్నారు. రోమేనియన్ ఆర్తడక్స్ క్రైస్తవమతాన్ని పాటిస్తారు. ట్రాన్స్ లేనియా పర్వతశ్రేణి పీఠభభూమి వలయాకారంలో విస్తరించి ఉంది. డాన్యూబు నది పప్రధానమైనది. ఈ నది 1400 కి.మే ప్రవహించి నల్ల సముద్రంలుతుంది. జ్యూనరి, ఓల్తుత్ , పూత్, ఆర్గేసుల, అయిలోమితా, సిరెతోల్ నదులు ప్రధానమైన నదులు. పర్వతాలు ప్రకృతి సౌందర్యంతో అలరిస్తాయి. ఈ దేశంలో 2500 సరస్సులు, తటాకాలు ఉన్నాయి. నేలకూడా సారవంతమైనది. చక్కటి పచ్చిక బయళ్లు ఉన్నాయి. అటవీ సంపద ఉంది. పెట్రోల్, సహజవాయువు, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా లభిస్తాయి. బాక్సైట్, నేలబొగ్గు, సీసం, రాగి, బంగారం, ఇనుపరాయి, వెండి, జింకు లోహాలు ఈ దేశంలో లభించే ఇతర ఖనిజాలు. గోధుమ, మొక్కజొన్న, రైధాన్యం, పండ్లు, బంగాళాదుంపలు, పంచదార బీటు దుంపలు, సమిష్టి వ్యయసాయ క్షేత్రాలలో సాగుచేస్తారు. యంత్ర సామాగ్రి, దుస్తుల తయారీ, ఆహార దినుసులు, డీజెల్ రైలు ఇంజన్లు, సహజ వాయువు, పెట్రోల్, పెట్రో రసాయనికాలు, ఎరువులు ముఖ్యమైన పరిశ్రమలు.
San Marino
Capital San Marino ………. Language Italian ………. Currency Euro ………. Religion Roman Catholic ………. Calling Code +. 378
సాన్ మారినో
సాన్ మారినో చాలా ప్రాచీనమైన దేశం యూరోప్ లో క్రీ.శకం 321 సంవత్సరం నుండి ఈ దేశ చరిత్రకు ఆధారాలున్నాయి.. అసినైన్ పర్వత శ్రేణులలో ఉంది. చుట్టూరా ఇటలీ భూభాగమున్నది. ఈ దేశ వైశాల్యం 61 చ.కి.మీ. రాజధాని సాన్ మారినో. వీరి అధికార భాష ఇటాలియన్. ప్రజలు క్రైస్తవ మతస్తులు. 95 శాతం మంది రోమన్ కేధలిక్స్. గోధుమ, ద్రాక్షా, ఆలివ్ పంటలను పండిస్తారు. పింగాణీ, ఆహాపదార్ధాలు, సిమెంట్, తోలు, ఉన్ని ప్రధాన పరిశ్రమలు. పర్వాటక దేశం కావటం వలన పర్యాటకుల ద్వారా విదేశీ ద్రవ్యం లభిస్తుంది.
Serbia
Capital Belgrade ………. Language Serbian ………. Currency Serbian Dinar ………. Religion Eastern Orthodox ………. Calling Code +. 381
సెర్బియా
ఐరోపా ఖండంలో చుట్టూ భూభాగం గల దేశం సెర్బియా. హంగేరీ, రొమేనియా, బల్గేరియా, మెకడోనియా, క్రొయేషియా, బోస్నియా, మోంటెన్గ్రో, అల్బేనియాలు సరిహద్దులుగా ఉన్నాయి. రాజధాని బెల్గ్రేడ్. పెద్ద నగరం కూడా. వీరి కరెన్సీ సెర్బియన్ దినార్. ఒక సెర్బియన్ దినార్ మన రూపాయి కంటే తక్కువే. దాదాపుగా 64పైసలు దేశ విస్తీర్ణం 88,361 చదరపు కిలోమీటర్లు జనాభా 70,58,322 అధికారిక భాష సెర్బియన్ ఐరోపాలోని అతి ప్రాచీన నగరాల్లో బెల్గ్రేడ్ ఒకటి. ఏడు వేల ఏళ్ల క్రితం నుంచే ఇక్కడ ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇప్పుడు ఆర్థిక, సాంస్కృతిక రాజధానిగానూ పేరొందింది. ప్రాచీన కాలంలో ఉన్న రోమన్ రాజ్యంలో సెర్బియా ఒక భాగం. మొత్తం 18 మంది రోమన్ చక్రవర్తులు పుట్టినచోటు ఈ దేశమేనని చెబుతారు. వారి రాజధాని నగరాల్లో నాలుగు ఇప్పటి సెర్బియాలోనే ఉన్నాయి. 70 లక్షలకు పైగా జనాభాకు 90లక్షలకు పైగా ఫోన్లున్నాయి. జనాభా వృద్ధి రేటు మాత్రం తిరోగమనంలో ఉంది. నలభైలక్షల మందికి పైగా ఇంటర్నెట్‌ని వాడుతున్నారు. మొత్తం భూభాగంలో 31శాతానికిపైగా అడవులున్నాయి. 57శాతంలో పంటలు పండిస్తారు. ఇక్కడి వారందరికీ ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. ప్రపంచ వ్యాప్తంగా సెర్బియన్ల ఆతిథ్యానికి చాలా మంచి పేరుంది. ‘అతిథి దేవోభవ’ భారతీయ సంప్రదాయంలాగే అతిథుల్ని దేవుడిలాగే భావించాలని వీరు నమ్ముతారు. విదేశాల్నించి రోగులు ఇక్కడ ఆసుపత్రులకు రావడానికి ఇదీ ఒక కారణం. అలాగే ఇక్కడ ఎవరింటికైనా అతిథిగా వెళితే ఏదో ఒక బహుమతి ఇవ్వకుండా మాత్రం పంపించరు. చాక్లెట్లు, పువ్వుల దగ్గర నుంచి ఏదో ఒకటి బహూకరిస్తారు. ఇంటికొచ్చిన అతిధిని చాలా గౌరవంగా చూస్తారు. వారు నోరు తెరిచి ఏదీ అడగకుండానే అన్నీ అందివ్వాలనుకుంటారు. ఇక్కడి ప్రజలు కాఫీని ఎక్కువగా ఇష్టపడతారు. కాఫీ తాగేందుకూ పక్కవారిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. స్నేహితులంతా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు టీ తాగినట్లు వీళ్లు కాఫీ తాగుతారు. బస్సుల్లో గర్భిణులకు రిజర్వ్డ్ సీట్లుంటాయి. ప్రపంచంలో మంచి గడియారాలన్నింటినీ స్విట్జర్లాండ్ ఎక్కువగా తయారు చేస్తుంటుంది. అయితే స్విస్ వారికంటే 600ఏళ్ల ముందు నుంచే సెర్బియన్లు గడియారాల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ప్రజలంతా చూసుకోవడానికి వీలుగా మొదటి మెకానికల్ గడియారాన్ని రష్యాలో 1404లో తయారు చేశారు. దాన్ని చేసింది మాత్రం సెర్బియా దేశస్థుడు లేజర్. సెర్బియా సహజసిద్ధమైన ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఆకాశాన్ని తాకే పర్వతాలు, వాటిపై గడ్డి మైదానాలతో చూడచక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రాంతాన్ని డెవిల్స్ టౌన్ అని స్థానికులు పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ మట్టితో స్తంభాల మాదిరిగా ఏర్పడిన నిర్మాణాలు ఉంటాయి. పొడవుగా ఉండే ఇవి 220కిపైగా ఉన్నాయి. ఇవి నేల కోత వల్ల ఏర్పడ్డ చిత్రమైన నిర్మాణాలు. అయితే వీటిని దెయ్యాలే ఇలా నిర్మించాయంటూ స్థానికులు చెబుతారు. ఎర్రగా చూడగానే నోరూరిపోయేలా ఉండే రాస్బెర్రీలు ఇక్కడ అధికంగా పండుతాయి. చమురు, గ్యాస్, బొగ్గు, ఇనుపఖనిజం, కాపరు, జింకు, బంగారం, వెండి, మెగ్నీషియం, సున్నపురాయి, మార్బుల్, ఉప్పు సహజ సంపదలు.
Slovakia
Capital Bratislava ………. Language Slovak ………. Currency Euro ………. Religion Roman Ctholics ………. Calling Code +. 421
స్లోవాకియా
స్లోవాకియా 9 వ శతాబ్ధంలో గ్రేట్ మోరావియా సామ్రాజ్యంలో ఒక భాగం. మోరావియా సామ్రాజ్య పతనానంతరం స్లోవాకియా హంగేరియన్ సామ్రాజ్యంలో అనేక సంవత్సరాల పాటు భాగంగా ఉంది. మొదటి ప్రపంచయుద్ధం తరువాత స్లోవాకియా చెకోస్లోవియాలో భాగమైంది. 1993 వ సంవత్సరంలో ఈ దేశం స్వాతంత్రం సంపాదించుకుంది. 2004 సంవత్సరంలో యూరోపియన్ యూనియన్ సమాఖ్యలో సభ్యత్వం తీసుకుంది. ఈ దేశ రాజధాని Bratislava. ఈ దేశ వైశాల్యం 48,845 చ.కి.మీ. వీరి అధికార భాష స్లోవాక్. తరువాత హంగరీ, రోమా, యుక్రేనియన్ భాషలు మాట్లాడుతారు. వీరి కరెన్సీ స్లోవాక్ కోరూనా. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. రోమన్ కేథలిక్స్, ప్రొటెస్టంట్స్ తెగలకు చెందిన వారు. గింజ ధాన్యాలు, బంగాళా దుంపలు, సుగర్ దుంపలు, పండ్లు వ్యవసాయ ఉత్పత్తులు. కోళ్లపరిశ్రమ ఉంది. అటవీ ఉత్పత్తులు లభిస్తాయి. బ్రౌన్ కోల్, లిగ్నేట్, రాగి, మాంగనీస్ ఖనిజ నిక్షేపాలు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది.
Slovenia
Capital Ljubljana ………. Language Slovene ………. Currency Euro ………. Religion Roman Catholism ………. Calling Code +. 386
స్లోవెనియా…
స్లోవెనియా…హబ్స్ బర్గ్ సామ్రజ్యం వారి పాలనలో 1300 సంవత్సరం నుండి 1918 సంవత్సరంలో మొదటి ప్రపంచయుద్దం జరిగే వరకు ఉంది. తరువాత సెర్బ్ లో ఆ తరువాత యుగోస్లేవియాలో భాగమైంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత స్లోవేనియా స్వతంత్రరాజ్యంగా అవతరించింది. ఈ దేశ రాజధాని Ljubljana . ఈ దేశ వైశాల్యం 20,273 చ.కి.మీ. వీరి భాష స్లోవేనియన్ (91 శాతం) సెర్బో క్రోషియన్ భాష కూడా మాట్లాడుతారు. వీరి కరెన్సీ టోలార్. ఈ దేశం క్రిస్టియన్ దేశం. బంగాళా దుంపలు, సుగర్ దుంపలు, మొక్కజొన్న, ద్రాక్ష వ్యవసాయ ఉత్పత్తులు. గొర్రెలను పెంచుతారు. కోళ్లపరిశ్రమ కలదు. లిగ్నేట్, బొగ్గు, సీసం, జింక్, పాదరసం, యురేనియం, వెండి ఖనిజ నిక్షేపాలు.
Spain
Capital Madrid ………. Language Spanish ………. Currency Euro ………. Religion Roman Catholism ………. Calling Code +. 34
స్పెయిన్
పశ్చిమ యూరోప్ లో రష్యా, ఫ్రాన్స్ తరువాత పెద్ద దేశాలలో మూడవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. నీపోడీ ఎస్పానా స్పెయిన్ దేశపు అధికార నామం. రాజ్యాంగం ద్వారా రాజవంశీయులు పరిపాలిస్తున్న దేశం. స్పెయిన్ దేశ విస్తీర్ణం 5,04,783 చ.కి.మీ. రాజధాని మాడ్రిడ్ బార్సిలోనా. వేలెన్షియా, సెవిల్లా, జారాగో జా ఇతర ముఖ్యమైన పట్టణాలు. వీరి అధికార భాష స్పానిష్.ప్రజలలో ఎక్కువమంది స్పానిష్ జాతులు, కాటాలిన్ గాలీషియన్ బాస్క్ తెగల వారు నివసిస్తున్నారు. వీరిలో 97 శాతం మంది రోమన్ కేధలిక్స్. కొంతకాలం ఫ్రాంకో నియంత పరిపాలనలో ఉంది (1930-75). స్పానిష్ వారు సాహసవంతులైన నావికులుగా పేరుపొందారు. అమెరికా ప్రాంతంలో కాలు మోపిన మొదటి యూరోపియన్ కొలంబస్ స్పెయిన్ దేశస్తుడు. మటడార్ అనే గిత్త(ఎద్దు)లతో పోరాడే క్రీడకు స్పెయిన్ పేరు పొందింది. ప్రధానమైన నది టాగస్ పశ్చిమంగా 900 కి.మీ పయనించి పోర్చుగల్ లో ప్రవేశిస్తుంది. మెసెతా పెద్ద పీఠభూమి. గ్వాడెల్ క్వివిర్ నది 640 కి.మీ. మేర ప్రవహించి అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంది. 1950 సం.రానికి ముందు స్పెయిన్ దేశం ఆర్ధికంగా వెనుకబడి ఉంది. తరువాత పారిశ్రామిక ప్రగతి సాధించింది. ఆలివ్, నారింజ, సారాయికి పనికి వచ్చే ద్రాక్షా, గోధుమ ప్రధానమైన పంటలు. బార్లీ, గజనిమ్మ, ఉల్లి పాయలు, మొక్కజొన్న, నారింజ, రైధాన్యం, బీటు దుంపలు, బంగాళా దుంపలు ఇతర పంటలు. కాంటాబ్రియన్ పర్వతాలలో నాణ్యమైన ఇనుప ఖనిజం, నాసిరకం నేలబొగ్గు, రాగి, పాదరసం, పోటాష్, సీసం, జింకు, పైరిటీస్, టైటానియం, మాంగనీస్ లభిస్తాయి. మోటారు కార్ల తయారీ, నౌకానిర్మాణాలకు స్పెయిన్ దేశం పేరుపొందింది.సహజ వాయివు, పెట్రోల్ ఉత్పత్తులు, సిమెంట్ర, రసాయినిక ద్రవ్యాలు, దుస్తులు, పానీయాలు, ఉక్కు, పాదరక్షలు, రవాణా వాహనాలు, విద్యుత్ యంత్రాలో ఇతర పరిశ్రమలు. పర్యాటక పరమైన దేశం కావటం వలన ఆర్ధికంగా కూడా బలపడింది. తీరప్రాంతాలలో పర్యాటకులకు తగిన వసతులున్నాయి. రాజులకు సంబంధించిన కట్టడాలు, గిత్తల పోరాటాలు వీరి సాంస్కృతిక సంబరాలు విదేశీ యాత్రికులకు ప్రత్యేక ఆకర్షణలు. ధరలు అన్ని తరగతుల వారికి అందుబాటులో ఉంటాయి.
Sweden
Capital Stockholm ………. Language Swedish ………. Currency Swedish Krona ………. Religion Lutheran Christianity ………. Calling Code +. 46
స్వీడన్
యూరోప్ లో ఉత్తర దిశలో ఉన్న ఒక సంపన్న దేశం స్వీడన్. సోవియట్ రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్ తరువాత నాలుగవ పెద్ద దేశం కూడా. క్రీ.శ. 1434 సం.నుండి రాజ్యాంగం ప్రకారం రాజవంశీయులు పాలిస్తున్న దేశం. స్వీడిష్ భాషలో ఈ దేశం పేరు కొనున్గారికెట్ స్వెరిగే. ఉత్తరాన ఆర్కిటిక్ వలయం విస్తరించి ఉన్నది. దక్షిణాన, తూర్పున బాల్టక్ సముద్రం, పశ్చిమాన నార్వేదేశం సరిహద్దులు కలిగి ఉంది. స్వీడన్ విస్తీర్ణం 4,49,732 చ.కి.మీ. రాజధాని స్టాక్ హోం. అధికార భాష స్వీడిష్. ప్రజలు నార్డిక్ జాతికి చెందినవారు. క్రైస్తవ మతాన్ని పాటిస్తారు. గోటెబర్గ్, మాల్మో, ఉప్పలా, ఓరెబో, నోర్కోసింగ్ ఇతర ప్రధాన పట్టణాలు ప్రపంచంలోనే ఈ దేశం కలప, కలప గుజ్జు, కాగితం తయారీలో ఆగ్రస్థానం వహిస్తుంది. ఫిర్, పైన్, స్ర్పూస్ వృక్షజాతులు ఎక్కువ. హిమనదులు, చెరువులు, సరస్సులు చాలా ఉన్నాయి కానీ అతి శీతల దేశం కావటంతో భూమి వ్యవసాయానికి పనికి రాదు. ఐనా దేశానికి కావలిసిన బార్లీ, ఓటు, రై ధాన్యం, బంగాళాదుంపలు, బీటు దుంపలు, గోధుమ సాగుచేస్తున్నారు. పాడిపరిశ్రమ, ఆవులు, పందుల పోషణ ఎక్కువగా ఉంది. కొనిఫెరస్ అడవుల సంపద పుష్కలంగా ఉంది. జలవిద్యుత్ కూడా ఎక్కువగా ఉంది. రాగి, సీసం, బంగారం, జింకు, ఇనుపరాయి, యురేనియం ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. యంత్రపు పనిముట్లను తయారు చేయటానికి ఉపయోగపడే ఉక్కు తయారీ ఈ దేశం ప్రసిద్ధి చెందినది. కాడ్ చేప, హెర్రింగ్, మెకెరెల్, సాల్మన్ చేపలు లభిస్తాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం స్వీడన్. విమానాలు, మోటారు కార్లు, వ్యవసాయపు పనిముట్లు, బాల్ బేరింగులు, విద్యుత్ యంత్రసామాగ్రి, ఎరువులు, గాజు, కాగితంలో రకాలు, నౌకా నిర్మాణం, ఉక్కు సామాగ్రి ఇంకా అనేక ఎగుమతులకు సంబంధించి పరిశ్రమలు స్వీడన్ లో ఉన్నాయి. సుప్రసిద్ధ నోబుల్ బహుమానం రూపకర్త రాబర్ట్ నోబుల్ స్వీడన్ దేశానికి చెందినవాడే.
Switzerland
Capital Bern ………. Language German/French/ ………. Currency Swiss Franc ………. Religion Christianity ………. Calling Code +. 41
స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్. జనాభా 83,41,000 దేశ విస్తీర్ణం: 41,285 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, రోమన్ష్ కరెన్సీ స్విస్ ఫ్రాంక్. చతురస్రాకారంలో ఉండే జెండా వాటికన్‌సిటీ, స్విట్జర్లాండ్‌లకు మాత్రమే ఉంది. మొత్తం ఎరుపు రంగులో ఉండి మధ్యలో తెల్లని ప్లస్ గుర్తు ఉంటుంది. అది వీరి సేవా దృక్పథానికి ప్రతీక. ఈ దేశంలో చలి ఎక్కువ. శీతకాలం -20 డిగ్రీలు కూడా నమోదవుతుంది. సంతోషంగా జీవించేందుకు ఇది చక్కటి దేశం. ‘వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్’లో డెన్మార్క్ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది. స్విట్జర్లాండ్ దేశంలో అతి పెద్ద నగరం జ్యురిచ్. 60 శాతం భూభాగంలో ఆల్ప్స్ పర్వతాలే ఉన్నాయి. మోంటే రోసా అన్నింటికంటే ఎత్తైనది. ఏకంగా 24 పర్వతాలు 4000 మీటర్లకంటే ఎత్తున్నాయి. 1500కు పైగా సరస్సులున్నాయి. జనాభాలో 25 శాతం మంది విదేశీయులే. స్విట్జర్లాండ్‌లో పిల్లలకు ఇష్టం లేని పేరుతో తల్లిదండ్రులు పిలవకూడదు. అది చట్టరీత్యా నిషిద్ధం. పార్లమెంటులో పాసై చట్టమైన దాన్ని దేన్నైనా అక్కడి ప్రజలు కోర్టులో సవాల్ చెయ్యొచ్చు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ ఆయుర్దాయం ఉన్న పురుషులు స్విస్‌వారే. 1971 వరకు ఇక్కడి మహిళలకు ఓటు హక్కు లేదు. కుక్కల్ని పెంచుకోవాలంటే పన్ను కట్టాల్సిందే. వాటిని ఎలా చూసుకోవాలన్న దానిపై ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సిందే. 18 ఏళ్లు దాటిన స్విస్ యువకులు తప్పకుండా మిలటరీలో పని చేయాల్సిందే. మహిళలకు ఈ నిబంధన లేదు. ఏడాదికి సరాసరిన ఒక్కొక్కరూ 11 కేజీల చాక్లెట్లు తినేస్తారు. ఎక్కువ చాక్లెట్‌ను ఎగుమతి చేసే దేశాల్లో ఇదొకటి. ప్రజా అవసరాల కోసం వాడే విద్యుత్తులో సగం జల విద్యుత్ ప్లాంట్ల నుంచే వస్తుంది. బెర్న్ నగరంలో లో 100కు పైగా ఫౌంటెన్లు ఉన్నాయి. అందుకే దీన్ని ‘సిటీ ఆఫ్ ఫౌంటెన్స్’ అంటారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రెడ్‌క్రాస్ పుట్టిందిక్కడే. ఇక్కడి జెనీవాలో దీన్ని 1863లో ప్రారంభించారు. ఇక్కడ అందరికంటే ఎక్కువ జీతం వచ్చేది ఉపాధ్యాయులకే. జపాన్ తర్వాత సమయానికి రైళ్లు నడిచేదిక్కడే. బస్సుల్లో డ్రైవర్లే టిక్కెట్లిస్తారు. ప్రపంచంలోనే పొడవైన గొత్తర్డ్ సొరంగం(రైల్వే టన్నెల్) ఉన్నదిక్కడే. దీని పొడవు 57 కిలోమీటర్లు. అందులో 2.3 కిలోమీటర్లు ఆల్ప్స్ పర్వతాల కింద నుంచే ఉంది. ఇటు నుంచి అటు ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించేందుకు 45 నిమిషాలపైనే సమయం పడుతుంది. అప్పటికప్పుడు పొడి కలుపుకుని తాగే ఇన్స్టెంట్ కాఫీకి జన్మస్థలం ఈ దేశమే. 1938లో నెస్లే సంస్థ నెస్కెఫే పేరుతో దీన్ని తయారు చేసింది. ఇక్కడి అరావూ రైల్వే స్టేషన్ వద్ద పెద్ద గడియారం ఉంది. ఐరోపాలో అది రెండో అతిపెద్దది. తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు పండిస్తారు. మాంసం, కోడిగుడ్లు ఇతర ఉత్పత్తులు.
Turkey
Capital Ankara ………. Language Turkish ………. Currency Turkish Lira ………. Religion Islam ………. Calling Code +. 90
టర్కీ……
టర్కీ దేశం ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉంటుంది. దేశమంతా కలిపినా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం కన్నా కాస్త పెద్దగా ఉంటుంది. టర్కీ ఎనిమిది దేశాల సరిహద్దులున్న దేశం. టర్కీ రాజధాని అంకారా… దేశ విస్తీర్ణం 7,83,356 చ.కి.మీ భాషలు టర్కిష్. వీరి కరెన్సీ టర్కిష్ లీరా. ఇస్తాంబుల్‌నగరం దేశం మొత్తంలో అతి పెద్దది. ప్రపంచంలో రెండు ఖండాల్లో విస్తరించి ఉన్న ఏకైక నగరం ఇదే. జెండాలో నక్షత్రం, నెలవంక ఇస్లాం మతానికి గుర్తు, ఎరుపు రంగు 17వ శతాబ్దంలో ఈ దేశాన్ని పాలించిన ఒట్టోమన్రాజ్యానికి చిహ్నం. ఒట్టోమన్రాజ్యం పతనం తర్వాత 1923లో ఆధునిక టర్కీ ఏర్పడింది టర్కీ పక్షి నిజానికి ఈ దేశానికి చెందినది కాదు. అమెరికాకు చెందింది. కానీ తొలిసారిగా టర్కీలో కనిపించడంతో పొరపాటున ఈ పేరు పెట్టారు. ప్రాచీన ప్రసిద్ధ ట్రాయ్ నగరం ఇక్కడిదే. ఆస్పెండోస్ రోమన్ ప్రదర్శనశాల ఎంతో ప్రాచీనమైంది. వార్షిక వేసవి ఉత్సవం ఇప్పటికీ నిర్వహిస్తారు. దీన్ని 15వేల మంది ఇక్కడ కూర్చుని చూస్తారు. ఒట్టోమన్రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లోనే 14 వందల ప్రజా మరుగుదొడ్లు నిర్మించారు. ప్రముఖ రచయిత్రి అగాథా క్రిస్టీ ‘మర్డర్ఆన్ది ఓరియంట్ఎక్స్ప్రెస్’ను ఇస్తాంబుల్‌లోనే రచించారు. నాలుగు వేల దుకాణాలతో ఉండే ఇక్కడి ‘గ్రాండ్బజార్’ ప్రపంచంలోనే అతి పురాతమైన పేద్ద దుకాణ సముదాయం. ఇస్తాంబుల్‌లో పెద్ద ఎత్తున మంచు కురుస్తూ ఉంటుంది. అందుకే ఇది పర్యటకుల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఇక్కడి కప్పడోసియా భూగర్భ నగరాలు మంచి సందర్శక ప్రాంతాలు. వీటి నిర్మాణానికి వందల ఏళ్లు పట్టింది హాలండ్‌కు చిహ్నమైన తులిప్పూలు టర్కీవే. ఇస్తాంబుల్నుంచి నెదర్లాండ్స్‌కు ఎగుమతి అయ్యాయివి. దాదాపు 11వేల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో పంటలు పండించినట్టు ఆధారాలున్నాయి. 16, 17 శతాబ్దాల్లో ఇక్కడ కాఫీ తాగడం నేరంగా ఉండేది. కాఫీ కేంద్రాల్లో రాజకీయ విప్లవ కార్యకలాపాలు జరుగుతున్నాయనే కారణంతో వాటిని అరికట్టడానికి ఒట్టోమన్సుల్తాన్ఈ నిబంధన పెట్టారు. కార్లు, విమానాలు, ఎలక్ట్రానిక్స్, దుస్తులు ఎక్కువగా ఎగుమతి చేస్తుందీ దేశం.
Ukraine
Capital Kiev ………. Language Ukranian ………. Currency Ukranian/Hryunia ………. Religion Orthodox(65%) ………. Calling Code +. 380 ఉక్రేయిన్… ఆధునిక కాలంలో ఉక్రేయిన్ పోలెండ్ ఆ తరువాత రష్యాలో భాగంగా ఉండేది. రష్యావారి బారి నుండి ఉక్రేనియన్లు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వచ్చారు. రష్యా వారు వీరిని అనేక బాధలకు గురిచేసారు. జోసఫ్ స్టాలిన్ ఉక్రేయన్ల మీద ఆధిపత్యం నిలుపుకోవటం కోసం లక్షలాది మంది ఉక్రేనియన్లను చంపించాడు. తరువాత రెండవ ప్రపంచయుద్ధంలో జర్మన్ నాజీలు ఒక మిలియన్ ఉక్రేనియన్లను హతమార్చారు. 1991 సంవత్సరంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఉక్రనియన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ దేశ రాజధాని Kyiv . ఈ దేశ వైశాల్యం 6,03,700 చ.కి.మీ. వీరి భాష ఉక్రేనియా తరువాత రష్యన్ భాష . ఈ దేశ కరెన్సీ hryvnia గింజ ధాన్యాలు, షుగర్ దుంపలు, పొద్దు తిరుగుడు దుంపలు, కూరగాయలు పండిస్తారు. పశుమాంసం, పాలు ఇతర ఉత్పత్తులు. ఇనుప ఖనిజం, బొగ్గు, మాంగనీస్, సహజవాయువు, ఆయిల్, సల్ఫర్, గ్రాఫైట్, టైటానియం, మేగ్నీషియమ్, నికెల్, పాదరసం, కలప సహజసంపదలు. వ్యయసాయ యోగ్యమైన భూమి ఉంది.
United Kingdom
Capital London ………. Language English ………. Currency Pound Sterling ………. Religion Christian ………. Calling Code +. 44
గ్రేట్ బ్రిటన్
ప్రపంచ ప్రసిద్ధి పొందిన దేశం గ్రేట్ బ్రిటన్. యూరోప్ లో పశ్చిమదిశలో ఉంది. దీనినే యునైటెడ్ కింగ్ డమ్ అని కూడా పిలుస్తారు. ఫ్రాన్స్ దేశానికి బ్రిటీష్ దీవులకు మధ్య ఇంగ్లీష్ ఛానల్ కలదు. ఈ దేశ విస్తీర్ణం 2,44,110 చ.కి.మీ. రాజధాని లండన్ నగరం. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు క్రైస్తవులు. బర్మింగ్ హామ్, గ్లాస్కో, లీడ్స్, షెఫీల్డ్, లివర్ పూల్, బ్రాడ్ ఫర్డ్, మాంచెస్టర్, ఎడిన్ బర్గో, బ్రిస్టల్ మొదలగునవి బ్రిటన్ లో ప్రధాన దేశాలు. వేల్స్, స్కాట్ లాండ్, ఐర్లాండ్, మాన్ దీవి, ఛానల్ దీవులను కలిపి యునైటెడ్ కింగ్ డమ్ గా పిలుస్తారు. బ్రిటీష్ వారు నైపుణ్యం కలిగిన నావికులు. సుదూర ప్రాంతాలకు సముద్రమార్గంలో నావలలో ప్రయాణించి అనేక రాజ్యాలను ఆక్రమించి తమ రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశం కూడా అందులో ఒకటి. అనేక వలస రాజ్యాలు స్థాపించి ఒకప్పుడు రవి అస్తమించని రాజ్యం అని పేరు పొందింది బ్రిటన్. 17వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు వీరి ప్రాబల్యం కొనసాగింది. ప్రపంచ దేశాలలో ఎక్కువ దేశాలు వీరి దేశం కంటే పెద్ద దేశాలు కూడా భారతదేశం, చైనాతో సహా వీరి దురాక్రమణకు గురయ్యాయి. చాలా దేశాలు వీరి కుయుక్తుల వలన వారి సంప్రదాయాలను, ఆచారాలను కోల్పోయాయి. భారతదేశం నుండి అపార సంపద, శిల్పసంపద దోచుకుని పోయారు. వాటిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం కూడా ఒకటి క్రమంగా ఈ దేశాలన్నీ స్వాతంత్ర్యం సంపాదించుకోవటంతో ప్రస్తుతం ఈ దేశం నామమాత్రంగా మిగిలింది. కానీ ఇంగ్లీష్ భాష మరియు వీరి సంప్రదాయాలు చాలా దేశాలలో పాదుకొనిపోయాయి. ఎలిజబెత్ – 1, విక్టోరియా మహారాణుల కాలంలో ఈ దేశం బాగా విస్తరించింది. డిజ్రేలీ, గ్లాడ్ స్టన్, చాంబర్లేన్, లాయిడ్ జార్జ్, విన్ స్టన్ చర్చిల్ వంటి ప్రతిభావంతులైన వారు ప్రధాన మంత్రులుగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. షేక్స్ పియర్, మిల్టన్ వంటి పేరుపొందిన కవులకు ఈ దేశం జన్మస్థానం. 18వ శతాబ్దంలో ఆవిరి యంత్రం ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవానికి బీజం పడింది ఈ దేశంలోనే. ప్రపంచానికి గ్రీనిచ్ కాలమానం పరిచయం చేసింది కూడా ఈ దేశమే. గ్రేట్ బ్రిటన్ లో ధేమ్స్ నది పెద్దది. దీని పొడవు 346 కి.మీ. సెవర్న్ మరియు ఉత్తర ఐర్లాండ్ లోని లఫ్ నీగ్ సరస్సు జలవనరులు. బ్రిటీష్ మ్యూజియం ప్రపంచ ప్రసిద్ధి పొందిన మ్యూజియం. ఆక్సఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ యూనివర్శిటీలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. బర్మింగ్ హామ్, షెఫీల్డ్, లివర్ పూల్, మాంచెష్టర్, లీడ్స్, బ్రిస్టల్ ప్రధానమైన పారిశ్రామిక కేంద్రాలు. లండన్ నగరం కూడా పారిశ్రామిక కేంద్రం. ఇనుప ఖనిజం, సుద్ద, బంకమన్ను, సున్నపురాయి, ఉప్పు ఖనిజ నిక్షేపాలు. మాటారు కార్లు, విమానాలు, నౌకలు, జవుళీ, కాగితం, ధాతు పరిశ్రమలు, విద్యుత్ యంత్రాలు, కంప్యూటర్లు, శాస్ర్తీయ పరికరాలు, ప్లాస్టిక్ గాజు, ఆహార పదార్ధాలు మొదలగు వాటికి లండన్ నగరం అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. బార్లీ, ఓట్స్, బంగాళా దుంపలు, ఓట్స్, మొక్కజొన్న, బీట్ దుంపలు ప్రధానంగా పండిస్తారు. కోళ్ల పరిశ్రమ, పశుపోషణ పందుల పోషణ, గొర్రెల పెంపకం ఎక్కువ.
Vaticn City
Capital Vatican city ………. Language Italian ………
వాటికన్ సిటి…
ప్రపంచంలోనే అతి చిన్న దేశాలలో వాటికన్ సిటి ఒకటి. ఈ దేశ వైశాల్యం కేవలం 100 ఎకరాలు. రోమ్ (ఇటలీ)నగరం మధ్యలో ఉన్నది. ఇది ఒక మతపరమైన దేశం క్రైస్తవమతంలోని రోమన్ కేధలిక్ చర్చి తెగ వారికి ప్రధాన కేంద్రం. ఈ నగరం చుట్టూ గోడ కట్టబడి ఉన్నది. ఈ నగరం కేధలిక్స్ చర్చ్ వారికి చెందినది మరియు కేధలి చర్చ్ వారిచే పరిపాలించబడుచున్నది. ఈ దేశ కరెన్సీ యూరోలు. ఈ దేశ జనాభా కేవలం 1000 మంది మాత్రమే (2019 లెక్కలను అనుసరించి.) 1929 సంవత్సరంలో ఈ దేశం ఏర్పడింది.St. Peter;s Basilica కట్టడం మతపరమైన కట్టడాలలో ప్రపంచంలోనే అతి పెద్ద కట్టడం. ఇక్కడ రోమన్ కేధలిక్ సంప్రదాయాన్ని అనుసరించే క్రైస్తవుల మతగురువు బిషప్ (బిషప్ ఆఫ్ రోమ్) నివసిస్తారు. ఈదేశానికి టెలిఫోన్, తపాలాకార్యాలయం సొంత వ్యవస్ధలు కలవు. రేడియో వ్యవస్థ, బ్యాంక్ కూడా కలవు. ఇక్కడ ఉన్న రోమన్ కేధలిక్ చర్చ్ ప్రపంచ ప్రసిద్ధి గాంచినది మరియు రోమన్ కేధలిక్స్ కు పుణ్యక్షేత్రం. వాటికన్ మ్యూజియం, సిస్టేన్ చాపెల్ భవనం ప్రసిద్ధి చెందినవి.
Capital Algiers ………. Language Arabic/Berbere ………. Currency Dinar ……….
Calling Code + 213 ………. Religion Islam
అల్జీరియా
ఉత్తర ఆఫ్రికాలోని స్వతంత్ర రాజ్యం అల్జీరియా. ఒకప్పుడు ఫ్రెంచ్ వారి వలస రాజ్యం. 1962 సం.లో తీవ్రమైన విప్లవం ద్వారా స్వాతంత్ర్యం సాధించుకొంది. అల్జరియా రాజధాని ఆల్ జీర్. అల్జీరియా దేశ విస్తీర్ణం 23,81,741 చ.కి.మీ. వీరి భాష అరబిక్. ప్రజలు ఎక్కువమంది సున్నీ ఇస్లాం మతస్థులు. పండ్లు, ధాన్యం, ద్రాక్ష పండిస్తారు. సారాయి పరిశ్రమ ఉంది. పెట్రోలు, ఇనుము, ఫాస్పేట్, బొగ్గు, చమురు వాయివు ఇతర పరిశ్రమలు. ఈ దేశంలో అట్లాస్ శ్రేణి నుండి వచ్చే చెల్ప్ నది పెద్దది. 720 కి.మీటర్లు మేర ఈ దేశంలో ప్రవహిస్తుంది. కెబిర్, సాకిల్, సెబేస్, సిగ, పిఫ్నా ఇతర జల వనరులు.
Angola
Capital Luanda ………. Language Portugese ………. Currency Luanda ……….
Calling Code + 244 ………. Religion Christian
అంగోలా
అంగోలా రాజధాని లువాండా. దీనిని ‘ప్యారిస్ ఆఫ్ ఆఫ్రికా’ అని పిలుస్తుంటారు. అధికార భాష పోర్చుగీస్ కరెన్సీ క్వాంజా ప్రధాన భాష పోర్చుగీస్ అయినా బంటు, కికోంగో మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా మాట్లాడతారు. అభివృద్ధిపథంలో దూసుకుపోవడానికి అవసరమైన వనరులు ఉన్నప్పటికీ అశాంతి కారణంగా అభివృద్ధికి దూరంలో ఉండాల్సి వచ్చింది అంగోలా. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈ దేశం సుదీర్ఘకాలం పాటు పోర్చుగీసువారి వలస దేశంగా ఉంది. తమ ప్రయోజనాల కోసం ఈ భూభాగాన్ని వాడుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు పోర్చు గీసు పాలకులు. పదిహేడు, పద్దెనిమిది శతాబ్దాల్లో అంగోలా … పోర్చుగీసు పాలకులకు ‘బానిసలు విరివిగా దొరికే ప్రాంతం’గానే ఉండిపోయింది. ఇక్కడి నుంచి బానిసలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. తరువాత కాలంలో ఈ బానిస వ్యాపారం రద్దయిపోయి… తిరుగుబాటు ఉద్యమాలు వెల్లువెత్తాయి. గెరిల్లా యుద్ధం మొదలైంది. పోర్చుగీసు రాజ్యంపై సాయుధపోరాటానికి దిగిన వివిధ దళాల మధ్య ఐక్యత లేకపోగా ఒకరిపై ఒకరు దాడులకు దిగేవాళ్లు. ఈ అనైక్యత తరువాతి కాలంలో దేశంలో సామాజిక అశాంతికి దారి తీసింది. పోర్చుగల్ నుంచి 1975లో స్వాతంత్య్రం పొందింది అంగోలా. స్వాతంత్య్రం వచ్చిన మాటేగానీ శాంతి లేదు. దేశంలో అంతర్యుద్ధం తీవ్రరూపం దాల్చింది. రాజ్యాధికారం కోసం ‘పీపుల్స్ మూవ్ మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అంగోలా’, ‘నేషనల్ యూనియన్ ఫర్ ది టోటల్ ఇండిపెండెన్స్ ఆఫ్ అంగోలా’ల మధ్య పోరు జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే సంతోషాన్ని ఈ పోరు మాయం చేసింది. దేశం అతలా కుతలం అయింది. దేశంలో శాంతిని నెలకొల్ప డానికి 1991లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ అది 1992లో విఫలమైంది. తిరిగి 1994లో కాల్పల విరమణ ఒప్పందం కుదిరింది. 1998లో ఈ ఒప్పదం విఫలమైంది. చాలాకాలం పాటు కొనసాగిన అంతర్యుద్ధం 2002లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం భారీగా జరిగింది. అయినప్ప టికీవెనక్కి తగ్గకుండా యుద్ధశిథిలాల్లో నుంచి లేచి తనను తాను పునర్నిర్మించుకుంటూ కొత్త అడుగులు వేసింది. 2010లో దేశంలో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. పాలనాపరంగా చెప్పాలంటే… అంగోలా 8 ప్రావిన్సులుగా, 163 మున్సిపాలిటీలుగా విభజితమైంది. చాలాకాలం పాటు వలస దేశంగా ఉండడం వల్ల అంగోలా కళాసంస్కృతులపై పోర్చుగీసు ప్రభావం కనిపిస్తుంది. అంగోలా, నమీబియా సరిహద్దుల్లో ఉన్న రౌకెనా జలపాతం ప్రకృతి అందాలకు ప్రతిబింబం. విస్తారమైన ఖనిజ సంపద, పెట్రోలియం నిల్వలు ఉండటంతో తన ఆర్థికవ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు అంగోలా అంటే అశాంతి. ఇప్పుడు మాత్రం అభివృద్ధి! అంగోలాలో ఆదరణ ఉన్న క్రీడ బాస్కెట్‌బాల్. అంగోలాలో సుంబే సంగీతం ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ‘సుంబే మ్యూజిక్ ఫెస్టివల్’ ఘనంగా జరుగుతుంది. చమురు, వజ్రాలు ప్రధాన ఆర్థిక వనరులు. చైనాకు ఎగుమతి అయ్యే చమురులో అత్యధిక భాగం అంగోలా నుంచే ఎగుమతి అవుతుంది. అంగోలాలో అతి ఎత్తయిన పర్వతం… సెర్రా మౌంటెన్. దీని ఎత్తు 2,306 మీటర్లు. అంగోలాలో మరణాల రేటు ఎక్కువ.‘డ్రెడ్లాక్ హెయిర్ స్టయిల్’ ఇక్కడే పుట్టింది. అంగోలా అందాలరాశి లైలా లోపెజ్ 2011లో ‘మిస్ యూనివర్స్’ కిరీటాన్ని గెలుచుకుంది.
Benin
Capital Porto-Novo ………. Language French ………. Currency West African CFA franc (XOF) ………. Calling Code + 229 ………. Religion Christian/Muslim
బెనిన్ బెనిన్… ఆఫ్రికా ఖండంలోని దేశం. రాజధాని పోర్టో నోవొ. జనాభా 1,08,79,829 ఈ దేశ విస్తీర్ణం 1,14,763 చదరపు కిలోమీటర్లు. వీరి భాష ఫ్రెంచ్. కరెన్సీ పశ్చిమ ఆఫ్రికన్ సీఎఫ్ఏ ఫ్రాంక్ ప్రజలు ఫ్రెంచ్ తర్వాత ఫాన్, యోరుబా భాషల్ని ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ దేశానికి పశ్చిమాన టోగో, తూర్పున నైజీరియా, ఉత్తరాన బుర్కినాఫాసో, నైజర్ దేశాలు సరిహద్దులు. దక్షిణాన అట్లాంటిక్ మహా సముద్ర భాగమైన గినియా అఖాతం ఉంది. ఈ దేశ జెండాలోని ఎరుపు రంగు ధైర్యానికి, పసుపు రంగు సంపదకు, ఆకుపచ్చ ఆశకి గుర్తులు. రాజధాని పోర్టోనోవొలో 17వ శతాబ్దం మొదట్లో బానిసల వ్యాపారం ఎక్కువగా జరిగేది. అందుకే ఈ తీరాన్ని బానిసల తీరంగా పిలిచేవారు. ఇక్కడి నుంచి బానిసల్ని నౌకల్లో వేరే ప్రాంతాలకు రవాణా చేయడం ద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది. బెనిన్ 1960 ఆగస్టు ఒకటిన ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందింది. 1975 నవంబరు నుంచి ఈ దేశాన్ని బెనిన్ అని పిలువబడుతుంది. 1990లో నియంతృత్వ పాలన నుంచి బహుళ పార్టీలున్న ప్రజాస్వామ్య దేశంగా మారింది. ఈ దేశంలోఎడమ చేతితో తినడం కానీ, ఎడమ చేతితో ఇతరులకు ఏదైనా ఇవ్వడం కానీ చేయకూడదు. అలా చేస్తే అమర్యాదగా భావిస్తారు. ఈ దేశానికే దహోమి అని మరో పేరు. 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఇది దహోమి రాజ్యంగా ఉండేది. ఈ దేశప్రజలప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ దేశ జాతీయ క్రీడ సాకర్. దేశంలో 31 శాతం భూభాగాన్ని వ్యవసాయానికి ఉపయోగిస్తారు. 40 శాతం అడవులతో నిండి ఉంటుంది. ఇక్కడ నేరాలు తక్కువే. కానీ దొంగతనాలు ఎక్కువ. అందుకే ప్రతి ఇంటి యజమానీ రాత్రి వేళల్లో వాచ్‌మేన్‌ను తప్పక పెట్టుకుంటారు. ఒకరితో మాట్లాడే ముందూ, వీడ్కోలు చెప్పిన తరువాత కరచాలనం చేయడం వీరి సంప్రదాయం. ప్రజలు ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడరు. అవి దుర్వినియోగం అవుతాయని భావిస్తారు. రాజధాని పోర్టోనోవొని అడ్జటేజ్, హగ్బోనౌ అని కూడా పిలుస్తారు. దేశం మొత్తంలో పెద్ద నగరం కొటోనౌ. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం చెక్కతో చెక్కిన ముసుగులకు ప్రసిద్ధి.
Botswana
Capital Gaborone ………. Language English ………. Currency Pula ……….
Calling Code + 267 ………. Religion Christian
బోట్స్ వానా
బోట్స్ వానా ఆఫ్రిరా ఖండం దక్షిణ భాగంలో తూర్పున ఉన్న ఒక స్వతంత్ర దేశం. ఈ దేశానికి దక్షిణాన దక్షిణాఫ్రికా, పశ్చిమాన సమీబియా, ఉత్తరా జింబాబ్యే దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. 1966 సంవత్సరానికి ముందు ఈ దేశం పేరు బెచువానీ ల్యాండ్. ఈ దేశం అవినీతి రహితమైనది మరియు మానవ హక్కులు పాటించే దేశం కూడా. ఈ దేశ విస్తీర్ణం 581,730 sq km.వీరి అధికార భాష ఇంగ్లీష్. మరియు సెట్స్ వానా భాష కూడా మాట్లాడుతారు. ఈ దేశంలో క్రిస్టియన్లు ఎక్కువ తరువాత స్థానిక మతాలను అవలంభించే వారున్నారు. వీరి కరెన్సీ పేరు పులా. ఈ దేశ విస్తీర్ణం 5,81,730 చ.కి.మీ. దేశ రాజధాని గాబోరెనే. వీరి అధికార భాష ఇంగ్లీష్. బోట్స్ వానా ప్రజలు ఆదిమ జాతులవారు. త్య్యానా తెగవారు 75 శాతం మంది, షోనా తెగవారు 12 శాతం మంది, శాన్ తెగవారు 4 శాతం, ఖోయిఖోయిన తెగవారు 3 శాతం మంది కలరు. కలహారీ ఎడారి ఈ దేశం అంతా వ్యాపించి ఉంది. ఉత్తర దిశలో అంగోలా దేశం నుండి ఓకోవాన్గో నది న్గామి ల్యాండ్ ప్రాంతంలోనికి ప్రవహిస్తుంది. నిద్రా వ్యాధిని కలుగ చేసే ట్సీట్సీ ఈగ బెడదకు భయపడి ఈ ప్రాంతంలో ఎవరూ నివసించరు. బొబ్బర్లు, మొక్కజొన్న, చిక్కుళ్ళు, ప్రత్తి, జొన్న, వేరుశెనగ, చిరు ధాన్యాలు, పొగాకు ప్రధానమైన పంటలు.. గొడ్డుమాంసం కోసం పశువులను పెంచుతారు. మేకలను కూడా పెంచుతారు. రాగి, ఆస్ బెస్టాస్, వజ్రాలు, నికెల్, నేలబొగ్గు, మాంగనీస్ ఖనిజ నిక్షేపాలు లభిస్తాయి. పరిశ్రమలు తక్కువ. ప్రపంచంలోనే వజ్రాలు ఎక్కువగా లభించే దేశం బోట్స్ వానా. వజ్రాలను త్రవ్వి ఎగుమతి చేసి విదేశీ ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు.
Burkina Faso
Capital Ouagadougou ………. Language French ………. Currency West African CFA franc (XOF) ………. Calling Code + 226 ………. Religion Islam/Christian
బర్కీన ఫాసో
రాజధాని వాగడూగో . విస్తీర్ణం 2,74,200 చదరపు కిలోమీటర్లు.భాష ఫ్రెంచ్. కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ సీఎఫ్ఏ ఫ్రాంక్ బర్కీన ఫాసో పశ్చిమ ఆఫ్రికా ఖండంలోని దేశం. చుట్టూ భూభాగాలే ఈ దేశ సరిహద్దులు. మాలి, నైగర్, బెనిన్, టోగో, ఘనా, ఐవరీ కోస్ట్ దేశాలు దీనికి సరిహద్దులు. బర్కీన ఫాసో అంటే ‘ల్యాండ్ ఆఫ్ ఆనెస్ట్ పీపుల్’ అని అర్థం. ఈ దేశం ఆఫ్రికా ఖండంలో సురక్షితమైన దేశాల్లో ఒకటి. 19వ శతాబ్దం చివరి వరకూ మోస్సీ రాజ్యం పాలనలో ఉండేదీ దేశం. ఆ తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చి ఈ దేశాన్ని తమదంటూ ప్రకటించి రాజధానిని ఏర్పాటు చేశారు. ఆగస్టు 5, 1960న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందింది. మొదట్లో ఈ దేశాన్నే ‘అప్పర్ వోల్టా’ అని పిలిచేవారు. 1984 నుంచి బర్కీన ఫాసోగా పేరు మార్చారు. ఇక్కడ 60 స్థానిక తెగలున్నాయి. ప్రతి తెగకూ ప్రత్యేక భాషా సంప్రదాయాలు ఉన్నాయి. అతిపెద్ద తెగ మోస్సీ. ఆఫ్రికా పేద దేశాల్లో ఇదీ ఒకటి. డ్రమ్, సంగీత కళలు ఇక్కడి సంస్కృతిలో భాగం. పీనట్స్, పత్తి, ఆవాల్ని ఎక్కువగా పండిస్తారు. రకరకాల సహజవనరులు ఇక్కడి ప్రత్యేకత. మాంగనీస్, సున్నపు రాయి, ప్యూమిక్, ఉప్పు… మొదలైనవి. పాడిపంటలు ఎక్కువే ఈ దేశంలో . ప్రపంచంలో పురాతనమైన నగరాల్లో ఈ దేశ రాజధాని ‘వాగడూగో’ ఒకటి. ‘డబ్ల్యూ’ అనే ఉద్యానవనం ఈ దేశంతో పాటు బెనిన్, నైగర్ దేశాల మధ్య విస్తరించి ఉంటుంది. ఈ దేశంలో ఓ రకమైన సిల్క్ లైనింగ్ క్లాత్‌ని పందుల చెవుల నుంచి తయారుచేస్తారు. సాకర్, హ్యాండ్‌బాల్, సైక్లింగ్, బాస్కెట్ బాల్, బాక్సింగ్ బర్కీన ఫాసో దేశంలో ప్రధాన క్రీడలు. బంగారం.. ఈ దేశం ఎగుమతి చేసేవాటిల్లో ప్రధానమైంది. దీని తర్వాత పత్తి, జంతువుల ఉత్పత్తులు ఉంటాయి. 497 జాతుల పక్షులున్నాయీ దేశంలో. ఏనుగులు, సింహాలు, చిరుతపులులు ఎక్కువ. వృక్షజంతు సంపదల సంరక్షణ కోసం ప్రత్యేక ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ రెండు సంవత్సరాలకోసారి ‘స్పిరిట్ ఆఫ్ మాస్క్’ అనే పండగ జరుగుతుంది. చిత్ర విచిత్రమైన వేషాల ధరించి వేసుకుని అంతా సంబరాలు జరుపుకుంటారు.
Burindi
Capital Bujumbura ………. Language French/Kirundi ………. Currency Burundian franc ………. Calling Code + 257 ………. Religion Christian
బురుండి…
బురుండీ తూర్పు ఆఫ్రికాలోని ఒక చిన్న స్వతంత్ర దేశం. ఈ దేశ విస్తీర్ణం 27,834 చ.కి.మీ. రాజధాని బుజుబూరా. వీరి అధికార భాషలు రుండీ, ఫ్రెంచ్. వీరి కరెన్సీ బురుండియన్ ఫ్రాంక్ లు. ప్రజలలో రుండీ తెగ వారు 97 శాతం మంది ఉన్నారు. హూట్టూ, టూట్సీ త్వాపిగ్మీ ఇతరజాతులవారు నివసిస్తున్నారు. ప్రజలు క్రైస్తవ మతస్తులు. కొద్దిమంది ఆదిమ జాతుల వారు ఉన్నారు. ప్రపంచంలోని బీద దేశాలలో బురుండీ ఒకటి ఈ దేశానికి నైరుతి దిశగా టాంగానీక్వా సరస్సు, ఈ శాన్యంగా కోహాహా సరస్సు, రువేరు సరస్సు, రుసిజీ నది, రువేరున్జీ నది, రూవూబూ నదులు ఉన్నాయి. ఇవే ఈ దేశానికి ప్రదాన జనవనరులు. అరటి, చిరుగడం, కర్రపెండలం, కందమూలాలు, వేరుశెనగ చిరుధాన్యాలు, పామ్ గింజలు, ప్రత్తి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. పశుపోషణ, కోళ్లపెంపకం, గొర్రెలు, మేకల పెంపకం ప్రజలకు జీవనాధారాలు. కయొలిన్ మన్ను, సున్నం, బంగారం ప్రదాన ఖనిజాలు ఇక్కద దొరకుతాయి. మద్యపానీయాలు, సిగరెట్లు, పాదరక్షలు ప్రధాన పరిశ్రమలు.
Country : Cape Verde
Capital Praia ………. Language Portugese ………. Currency Cape Verdean escudo ………. Calling Code + 238 ………. Religion Christian
కేప్ వర్డే
ఆఫ్రికాకు పశ్చిమంలో కేప్ వర్డ్ దేశం ఉంది. ఈ దేశం 1975 సం.నికి ముందు పోర్చుగీసు వలస రాజ్యం. 1975 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశంలో 10 పెద్ద దీవులు, 5 చిన్న దీవులు ఉన్నాయి. భూమి సారవంతమైనది కాదు. ఆహార పదార్ధాలు పూర్తిగా దిగుమతి చేసుకోవలసిందే. ఈ దేశ విస్తీర్ణం 4,033 చ.కి.మీ. . దీని రాజధాని ప్రాయా. వీరి అధికార భాష పోర్చుగీసు. ప్రజలలో సంకర జాతులకు చెందిన వారు ఎక్కువ. నీగ్రో జాతుల వారు కూడా ఎక్కువగా ఉన్నారు. ప్రజలు ఎక్కవ మంది క్రైస్తవంలో రోమన్ కేథలిక్స్. కాఫీ, వేరుశెనగ , చేపలు, ఉప్పు ఎగుమతి చేస్తున్నారు. కొబ్బరి, చెరకు, మొక్కజొన్న వ్యవసాయ ఉత్పత్తులు.
Cameroon
Capital Yaoundé ………. Language French/English ………. Currency Central African CFA franc ………. Calling Code + 237 ………. Religion Christian
కామెరూన్
ఆఫ్రికా పశ్చిమ తీరాన ఉన్న స్వతంత్ర దేశం కామెరూన్. 1960 సం.లో స్వాతంత్ర్యం పొందింది. కామెరూన్ రాజధాని యవాన్ డా. వీరి భాషలు ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్. వీరి కరెన్సీ సెంట్రల్ ఆఫ్రికన్ CFA Franks. నీగ్రో ఆదిమ జాతుల వారూ, బంటూ జాతివారూ అధికంగా ఉన్నారు. ఈ దేశ విస్తీర్ణం 4,75,458 చ.కి.మీ. ఈ దేశంలో ప్రజలు క్రైస్తవ మతస్థులు. సనగా నది, బెన్యూ నదులు ప్రధానమైన నీటి వనరులు. కోకో, కర్రపెండలం, అరటి, కాఫీ, ప్రత్తి, మొక్కజొన్న, పామ్ నూనె గింజలు, జొన్న, తేయాకు, పొగాకు, వేరు శెనగ ప్రధానమైన పంటలు. కలప, రబ్బరు అడవుల నుండి సేకరిస్తారు. అల్యూమినియం తయారీ, రసాయనిక ద్రవ్వాలు ముఖ్యమైన పరిశ్రమలు.
Central African Republic (CAR)
Capital Bangui ………. Language French/Sango ………. Currency Central African CFA franc ………. Calling Code + 236 ………. Religion Christian
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ….
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ చుట్టూ భూభాగాలే కలదేశం. ఈ దేశ రాజధాని Bangui. దేశ వైశాల్యం 6,22,984 చ.కి.మీ. వీరి అధికార భాషలు ఫ్రెంచ్ మరియు సాంఘో. వీరి కరెన్సీ CFA Franc. ఈ దేశం ఫ్రాన్స్ నుండి 13 ఆగస్ట్ 1960 సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందింది. కానీ అప్పటినుండి దేశంలో స్థిరత్యం లేదు. జనాభా పరంగా అభివృద్ది చెందని దేశం. ఈ దేశానికి చుట్టూ చాద్, సూడాన్, కాంగో, కామరూన్ దేశాలు కలవు. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. వజ్రాలు, బంగారం, యురేనియం, కోబాల్డ్, కలప మరియు ఆయిల్ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ ఈ దేశ అభివృద్ధి చెందలేదు. ఆరోగ్యపరంగా కూడా వెనుకబడిన దేశం. ప్రత్తి, కాఫీ గింజలు, పొగాకు, చేమదుంపలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, అరటి వ్యవసాయ ఉత్పత్తులు. వ్యవసాయ యోగ్యమైన భూములు చాలా కలవు.
Chad
Capital N’Djamena ………. Language French/Arabic ………. Currency Central African CFA franc ………. Calling Code + 235 ………. Religion Muslim/Christian
చాద్
చాద్.. మధ్య ఆఫ్రికాలో ఉంది. ఈ దేశానికి సముద్ర తీరం లేదు. అన్ని పక్కలా ఇతర దేశాల భూభాగమే ఉంటుంది. ఉత్తరాన లిబియా, తూర్పున సూడాన్, దక్షిణాన సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ ఉన్నాయి. అలాగే కామెరూన్, నైజర్ దేశాలూ ఈ దేశానికి సరిహద్దులు. చాద్ రాజధాని అన్జమేనా. జనాభా 1,36,70,084. ఈ దేశ విస్తీర్ణం 12,84,000 చదరపు కిలోమీటర్లు. భాషలు ఫ్రెంచ్, అరబిక్ ఇవి కాక ఈ దేశంలో 100 భాషలు మాట్లాడతారు. ఫ్రెంచ్ ఎక్కువ మాట్లాడే దేశాల్లో దీని స్థానం 21. కరెన్సీ మధ్య ఆఫ్రికా ఫ్రాంక్ ఇక్కడి చాద్ అనే సరస్సు ఆఫ్రికాలోనే రెండో అతి పెద్దది. ప్రపంచంలో పదిహేడో అతి పెద్ద సరస్సు ఇది. దీని పేరు మీదుగానే ఈ దేశానికీ పేరొచ్చింది. ఇక్కడ పెళ్లి చేసుకునే ముందు అబ్బాయి, అమ్మాయి వాళ్ల పొలంలో మూడు సంవత్సరాలు పని చేయాలి. అత్తింటివారి కోసం చిన్న గుడిసె, ఈత చాపలు తయారుచేయాలి. పిల్లలు పుట్టిన వెంటనే తల్లి వేరే ప్రదేశానికి వెళ్లకూడదు. అలా వెళితే దుష్టశక్తుల ప్రభావం పడుతుందని నమ్ముతారు. ఇక్కడ సహజవనరులు ఎక్కువ. పెట్రోలియం, యురేనియం, బంగారం, సున్నపురాయి అధికంగా దొరుకుతాయి. ఈ దేశ జాతీయ మ్యూజియంలో 9వ శతాబ్దానికి చెందిన కళారూపాల్ని చూడొచ్చు. ఈ దేశ జెండాలో నీలం రంగు ఆకాశానికీ, నమ్మకానికీ సూచిక. పసుపు రంగు సూర్యుడికి చిహ్నం. ఎరుపు అగ్నికీ, ఐకమత్యానికీ గుర్తు. చాద్ లో క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుంచి ప్రజలు నివసిస్తున్నారు. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దంలో బెర్బర్లు ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ఈ దేశం ఫ్రెంచ్ కమ్యూనిటీలో స్వయం ప్రతిపత్తి గల రిపబ్లిక్‌గా 1946లో అవతరించింది. 1960లో ఫ్రాన్స్ నుంచి పూర్తి స్వాతంత్య్రం పొందింది. చాద్ లోని జకోమా నేషనల్ పార్కులో 226 జాతుల పక్షుల్ని గుర్తించడం జరిగింది.
Comoros
Capital Moroni ………. Language Comorian Arabic French ………. Currency Comorian franc ………. Calling Code + 269 ………. Religion Islam
కొమరోజ్
కొమరోజ్… హిందూ మహాసముద్రంలో ఉన్న సార్వభౌమ ద్వీప దేశం. ఈ దేశానికి వాయవ్యంలో టాంజానియా, తూర్పున గ్లోరియోస్ ద్వీపాలు, నైరుతీలో మడగాస్కర్, పశ్చిమాన మొజాంబిక్ ఉంటాయి. చిన్నాపెద్దా అగ్నిపర్వతాలతో నిండి ఉంటుందీ దేశం. ఈ ద్వీప దేశం చాలా చిన్నది. మన దేశంలోనే చిన్నదైన గోవా రాష్ట్రం కన్నా చిన్నది. ఈ దేశ రాజధాని మొరోని. వీరి భాషలు కోమోరియన్, అరబ్ మరియి ఫ్రెంచ్. వీరి కరెన్సీ కొమోరియన్ ఫ్రాంక్స్. కొమరోజ్ ముస్లిం దేశం. ‘కొమరోజ్’ అరబిక్ పదం నుంచి వచ్చింది. దీనర్థం చంద్రుడు. ఈ దీవుల్లో మొదటిసారిగా అడుగుపెట్టింది పాలీనీషియన్లు, మెలనీషియన్లు, మలయాలు, ఇండోనేషియన్లు. వీరంతా క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దానికి ముందే ఇక్కడికొచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. చిన్నచిన్న దీవులతో ఉన్న ఈ ద్వీప దేశంలో గ్రాండీ కొమరీ, మొహెలీ, అన్జోన్, మయొట్టీ అనే నాలుగు ముఖ్యమైన దీవులుంటాయి. వీటిల్లో మయొట్టీ ద్వీపం ఇంకా ఫ్రాన్స్ అధీనంలోనే ఉంది. ఈ దేశం 1975 జులైలో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందింది. సువాసన నూనెల్లో ఉపయోగించే ‘ఇలాంగ్ ఇలాంగ్’ అనే నూనెల్ని ప్రపంచం మొత్తంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందీ దేశం. ఈ ద్వీప వాతావరణంలో మాత్రమే నివసించే ప్రత్యేకమైన 20 పక్షి జాతులు ఇక్కడుంటాయి. మాంగూస్ లెమర్లు మడగాస్కర్తో పాటు ఈ దేశంలో మాత్రమే కనిపిస్తాయి. బియ్యం, పెట్రోలియం ఉత్పత్తులు, సిమెంట్, ఇతర ఆహార పదార్థాల్ని ఈ దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ ఎక్కువగా లవంగాలు, కొబ్బరి, అరటి పండ్లు, ఇతర సుగంధ ద్రవ్యాల్ని పండిస్తారు.
Democratic Republic of the Congo
Capital Kinshasa ………. Language French, Lingala ………. Currency Congolese franc ………. Calling Code + 243 ………. Religion Christian
కాంగో
ఈ దేశం తాజా సర్వేల ప్రకారం అవినీతికి, అంతర్యుద్ధాలకు పేరుపొందినది. ఈ అంతర్యుద్ధాల వలన లక్షలాది ప్రజలు ఆహార కొరత, పోషకాహారలోపం వలన బాధపడ్డారు. యుద్దాలలో లక్షలాది ప్రజలు మరణించారు. ఈ దేశం విశాలమైనది మరియు అపారమైన ఆర్ధిక వనరులు కల దేశం. 1960, జూన్ 30వ తేదీన బెల్జియం దేశం నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశ రాజధాని Kinshasa . ఈ దేశ కరెన్సీ Congolese franc ఈ దేశ వైశాల్యం 2,345,410 చ.కి.మీ. వీరి ప్రధాన భాషలు French, Lingala, Kiswahili, Kikongo, Tshiluba. ఈ దేశం క్రిస్టియన్ దేశ్ మరియు కొద్ది సంఖ్యంలో ఇస్లాం మతస్తులున్నారు. కాఫీ, చెరకు, పామ్ నూనె గింజలు, రబ్బర్, టీ, క్వినైన్ ధాన్యం, అరటి, మెక్కజొన్న, కర్రపెండలం, పండ్లు వ్యవసాయ ఉత్పత్తులు. కోబాల్ట్, రాగి, టాంటాలమ్. పెట్రోలియమ్, బంగారం, వెండి, జింక్, వజ్రాలు, మాంగనీస్, యురానియమ్, మాంగనీస్ ఈ దేశంలో లభించే ఖనిజ నిక్షేపాలు. ఈ దేశం గొప్ప జీవ వైవిధ్యం కల దేశం. ఈ దేశంలోని ఐదు జాతీయ పార్కులు జంతుసంపదకు పేరుపొందినవి మరియు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి. పెద్ద చింపాంజీలు, కోతులు ఇక్కడ మాత్రమే కనబడతాయి.
Republic of the Congo
Capital Brazzaville ………. Language French ………. Currency Central African CFA franc ………. Calling Code + 242 ………. Religion Christian కాంగో దేశం ఆఫ్రికా ఖండంలో ఒక గణతంత్ర దేశం. ఈ దేశం ఫ్రెంచ్ ఈక్విటోరియల్ ఆఫ్రికాలో ఒక ప్రాంతంగా ఉండేది. 1969 సం.లో స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశ విస్తీర్ణం 3,42,000 చ.కి.మీ. దేశ రాజధాని బ్రజవెల్లీ. వీరి అధికార భాష ఫ్రెంచ్.వీరి కరెన్సీ Central African CFA franc. ప్రజలు కంగో, తేకే, మ్మోషీ, సాంగా, పూనూ, మాక, పిగ్మీ ఆదిమ జాతులకు చెందినవారు. వస్తుజాలానికి కూడా ప్రాణం లేకపోయినా ఆత్మ ఉందని వీరు విశ్వసిస్తారు. ఎక్కువ మంది క్రైస్తవులు. కొద్దిగా ముస్లింలు కూడా ఉన్నారు. వైరానది, శ్టాన్లీ మడుగు (కృత్రిమంగా ఏర్పాటు చేయబడిన సరస్సు), కాంగో నది, కంగో ఉపనదులు సనగా, ముబాంగీ నదులు జలవనరులు. ఈ పరిసర ప్రాంతాలు సారవంతమైనవి. వరి మొక్కజొన్న, అరటి, కర్రపెండలం, పామ్ నూనె గింజలు, చిలకడదుంపలు, కంద లను ఎక్కువగా పండిస్తారు. కాంగోలోని సహజసంపదలు పోటాష్ ఖనిజం. అడవుల నుండి వచ్చే ఒకామ్ మహాఘని, లింబా కలప ముఖ్యమైనవి.
Cote d’Ivoire
Capital Yamoussoukro (political) ………. Language French ………. Currency West African CFA franc ………. Calling Code + 225 ………. Religion Islam/Christianity
ఐవరీ కోస్ట్
ఐవరీ కోస్ట్ ఆఫ్రికా ఖండానికి పశ్ఛిమతీరంలో సింధుశాఖను ఆనుకుని ఉన్న చిన్న స్వతంత్ర దేశం. ఈ దేశం సాధికార నామం కోటెడ్ ఐవరీ. 1893 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1960 వ సం.లో ఈ దేశానికి స్వాతంత్ర్యం లభించింది. ఈ దేశ విస్తీర్ణం 3,20,763 చ.కి.మీ. ఐవరీ కోస్ట్ దేశానికి రెండు రాజధానులు ఉన్నాయి అభిడ్జాన్ ఆర్ధికపరంగానూ, యమోస్క్రో రాజకీయపరంగానూ రాజధానులు. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీ West African CFA Franc. ఇస్లాం మతస్తులు ఎక్కువ తరువాత క్రైస్తవ మతస్తులు ఉన్నారు నీగ్రో తెగల వారు ఎక్కువగా ఉన్నారు. వీరు 60 మాండలిక భాషలు మాట్లాడుతారు. బండమా, కావల్లీ, కోమో, సస్సాంధ్ర, నదులు ప్రధానమైన జలవనరులు. బండమా నది పొడవు 800 కి.మీ. కానీ ఈ నది కొండల గుండా ప్రవహించడం వలన కేవలం 60 కి.మీ. మాత్రమే పడవ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఉష్ణమండల అడవులు ఎక్కువ. కాఫీ, కోకో పంటలు ఎక్కువగా పండుతాయి.
Djibouti
Capital Djibouti City ………. Language French/Arabic ………. Currency Djiboutian franc ………. Calling Code + 253 ………. Religion Islam
జిబౌటి
హార్న్ ఆఫ్ ఆఫ్రికా దేశాలలో ఒకటి… జిబౌటి. ఈ దేశ రాజధాని జిబౌటి నగరం. ఫ్రెంచ్, అరబిక్ వీరి భాషలు. మూడింట రెండు వంతుల మంది దేశరాజధానిలోనే నివసిస్తారు. ఫ్రెంచ్, అరబ్బీలతో పాటు సోమాలి, అఫర్లను మాట్లాడతారు. వీరి కరెన్సీ Djiboutian franc. జిబౌటి ముస్లిం దేశం. దేశంలో అక్షరాస్యత 68 శాతం. ఈ దేశానికి ఉత్తరంలో ఎరిట్రియా, దక్షిణంలో ఇథియోపియా, ఆగ్నేయంలో సోమాలియా దేశాలు సరిహద్దులు. సుదీర్ఘకాలం పాటు ఫ్రెంచ్ పాలనలో ఉంది జిబౌటి. 1966 ఆగస్ట్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు చార్లెస్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు స్వాతంత్య్రం కావాలంటూ నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. ‘ఫ్రెంచ్ అధీనంలో ఉంటారా? స్వాతంత్య్రం కావాలా?’ అనే అంశంపై ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ లూయిస్ సాగెట్ రెఫరెండం నిర్వహించారు. 60 శాతం మంది ఫ్రెంచ్ పాలనలోనే ఉండడానికి మొగ్గు చూపారు. కానీ నిరసనలు ఆగలేదు. స్వాతంత్య్రకాంక్ష ఏదో ఒక ఉద్యమ రూపంలో వ్యక్తమవుతూనే ఉండేది. చివరకు 1977లో ఫ్రెంచ్ పాలన నుంచి స్వాతంత్య్రం పొందింది జిబౌటి. ఒకవైపు స్వాతంత్య్ర సంబరాలు, దేశంలోని నాన్ సోమాలి అఫార్స్-సోమాలి ఇస్సాస్ మధ్య ఉన్న విభేదాలు… దేశప్రగతికి అడ్డుపడతాయనే అంచనా ఉండేది. అయితే స్వాతంత్య్రానంతరం ఈ రెండు వర్గాల మధ్య ‘అధికార మార్పిడి’ ఫార్ములా విజయవంతంగా అమలుకావడంతో… ఆ అనుమానాలు, అంచనాలేవీ నిజం కాలేదు. 1991లో దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆ తరువాత జరిగిన చర్చలతో శాంతియుత వాతావరణం ఏర్పడింది. 820 రకాల మొక్కలు, 360 రకాల పక్షులు, 66 రకాల క్షీరదాలు ఉన్న జిబౌటి జీవవైవిధ్యానికి కొంగు బంగారంగా నిలిచింది. గోడ పర్వతాల్లోని ‘డే ఫారెస్ట్ నేషనల్ పార్క్’ జీవవైవిధ్యానికి మరో ప్రత్యేకతగా నిలిచింది. జిబౌటిలో సంగీతానికి మంచి ప్రాచుర్యం ఉంది. మొదట్లో ఇతర ప్రాంతాల ప్రభావం ఉన్నప్పటికీ ఆ తరువాత తనదైన శైలితో ప్రత్యేకతను నిలుపుకుంది. జిబౌటి కవిత్వానికి ఘనమైన చరిత్ర ఉంది. వంద పంక్తుల కవిత ‘గబె’కు జిబౌటి సాహిత్యంలో ప్రత్యేకత ఉంది. కొద్దిపాటి వర్షపాతం వల్ల పండ్లు, కూరగాయలు మాత్రమే పండుతాయి. వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా ఇతరదేశాల నుండి దిగుమతి చేసుకుంటారు. అంతర్యుద్ధం తాలూకు ప్రతికూల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడినప్పటికీ, ఆ తర్వాత రాజకీయ స్థిరత్వం ఏర్పడడంతో పరిస్థితి కుదుటపడింది. స్వాతంత్య్రనంతరం జిబౌటి ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నిరుద్యోగం, పేదరికం సమస్యలు సవాళ్లుగా నిలిచాయి. ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ ‘సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో చోటు చేసుకుంది. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్న దేశాలలో జిబౌటి ఒకటి. రాజధాని జిబౌటి ఆఫ్రికా ఖండంలోని చిన్న పట్టణాలలో మూడవది. ఫ్రెంచ్, ఇస్లాం సంప్రదాయం, సంస్కృతుల ప్రభావం భవననిర్మాణ కళలో కనిపిస్తుంది. ఉప్పునీటి సరస్సు లక్ అసల్ ‘ఉప్పు’ గృహ అవసరాలకు ఉపయోగపడడమే కాదు వాణిజ్యానికి కూడా ఉపయోగపడుతుంది. జిబౌటిలో మాత్రం క్రిస్మస్ను జనవరి 7న జరుపుకుంటారు. సూర్యోదయం తరువాత ట్యాక్సీ రేట్లు పెరుగుతాయి. నిర్మాణాలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, సాల్ట్మైనింగ్, పెట్రోలింగ్ రిఫైనరీ… మొదలైనవి దేశంలో ప్రధాన పరిశ్రమలు.
Egypt
Capital Cairo ………. Language Egyptian Arabic ………. Currency Egyptian pound ………. Calling Code + 20 ………. Religion Muslim
ఈజిప్ట్ ఈజిప్ట్ రాజధాని కైరో, విస్తీర్ణం 10,10,407 చదరపు కిలోమీటర్లు. జనాభా: 9,16,70,000 (2019 సం) ఈ దేశ కరెన్సీఈజిప్షియన్ పౌండ్. వీరి భాష అరబిక్. మధ్యప్రాచ్య దేశాల్లో ఎక్కువ జనాభా ఉన్న దేశం ఇది. జనాభాలో 90 శాతం మంది ముస్లింలే. ఈజిప్ట్ అనగానే గుర్తొచ్చేవి పిరమిడ్లే. ఆ ప్రాంతాన్ని పాలించిన రాజులు, వారి కుటుంబాల్లో చనిపోయిన వారి శరీరాల్ని భద్రపరిచేందుకు వీటిని నిర్మించేవారు. 130కి పైగా పిరమిడ్లు ఉన్నాయిక్కడ. ఇక్కడున్న పిరమిడ్లన్నింటిలో ఖుఫు పిరమిడ్ అతి పెద్దది. అన్నింటికీ నాలుగు తలాలు ఉంటే దీనికి ఎనిమిది తలాలుంటాయి. దీన్నే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అని కూడా అంటారు. దీని పొడవు 460 అడుగులు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఇదే పెద్దది. టోలెమిక్ రాజవంశంలో చివరిగా ఈజిప్టును పరిపాలించిన రాణి క్లియోపాత్ర. అందగత్తె అయిన ఆమె అంతర్యుద్ధంతో రగిలిపోతున్న రాజ్యంలో శాంతిని నింపి చరిత్రలో నిలిచిపోయింది ఈ దేశంలో పిల్లుల్ని పూజిస్తారు. గతంలో వాటిని చంపడం నేరం. ప్రమాదవశాత్తూ అలా జరిగినా ఇక్కడ కఠిన శిక్షలుండేవి. వాటిని తమ అదృష్ట దేవతలుగా భావించేవారు. ప్రాచీన కాలంలోనే ఈ దేశంలో రాసేందుకు లిపి ఉంది. వారు అప్పట్లోనే రాళ్లతో తయారు చేసిన తలగడల్ని వాడేవారు. మనం ఇప్పుడు ఆడే బోర్డ్గేమ్లు వారికి రెండు వేల ఏళ్ల క్రితమే ఉన్నాయి. ప్రపంచంలోనే పాత చొక్కా ఇక్కడ దొరికింది. ఇది 5000 ఏళ్ల క్రితం నాటిదట. కాగితం, కలం, తాళాల్ని తొలుత వీరే తయారుచేశారు. ఎప్పటి నుంచో వీరు టూత్‌పేస్ట్‌ని కూడా తయారుచేసుకుని ఉపయోగించేవారు. పడవల్ని మొట్టమొదట తయారుచేసిందిక్కడే. క్రీ.పూ. 3000 సంవత్సరాల్లోనే వీరు వాటిలో ప్రయాణించి వ్యాపారాలు చేసేవారు. అతి పొడవైన నైలు నది ఈ దేశంలోనే కాకుండా పది దేశాల్లో ప్రవహిస్తోంది. దీని పరీవాహక ప్రాంతాల్లోనే పంటలు పండిస్తారు. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ కావడంతో మిగిలిన ప్రాంతాలు ఎడారుల్ని తలపిస్తాయి. ఇక్కడి అలెగ్జాండ్రియాలో ఓ గ్రంథాలయం ఉంది. అంతర్జాల వెబ్సైట్లలో ఉండే ప్రతి వెబ్సైట్ పేజీలు ఇందులో ఉంటాయిట. 1996లో దీన్ని ప్రారంభించారు. ప్రపంచంలో అంతర్జాలాన్ని ఎక్కువగా వాడే దేశాల్లో ఇది 21వ స్థానంలో ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లు, 2000 మందికి పైగా దేవుళ్లను కొలిచేవారు. స్త్రీలు, పురుషులు మేకప్ వేసుకునేవారు. సూర్యరశ్మి నుంచి రక్షణ కోసం కళ్ల దగ్గర రాగి లేదా సీసంతొ తయారు చేసిన నల్లటి రంగు వేసుకునేవారు. మరుగుజ్జులు ఈ దేశంలో గౌరవింపబడతారు. వారిని చులకనగా చూడరు. పెళ్లిళ్ల సమయంలో ఉంగరాలు మార్చుకునే సంప్రదాయం ఇక్కడిదే.
Equatorial Guinea
Capital Malabo ………. Language Spanish/French/Portuguese ………. Currency Central African CFA franc ………. Calling Code + 240 ………. Religion Christian
ఈక్వటోరియల్ గినియా…
మధ్య ఆఫ్రికాలో ఉన్న చిన్న స్వతంత్రదేశం ఈక్వటోరియల్ గినియా. ఈ దేశం ముఖ్యంగా రెండు భాగాలుగా ఉంది. మొదటిది Rio Muni భూభాగం. రెండవది ఐదు ద్వీపాలు ఆఫ్రికాలో మానవ హక్కుల ఉల్లంఘనకు పేరుపొందిన దేశం. ఈ దేశ వైశాల్యం 28,051 చ.కి.మీ. వీరి అధికార భాష స్పానిష్ మరియు ఫ్రెంచ్ ఇతర భాషలు pidgin English, Fang, Bubi, Ibo. ఈ దేశ రాజధాని మలాబో. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. వీరి కరెన్సీ CFA Franc. 12 అక్టోబర్, 1968 సంవత్సరంలో స్పెయిన్ నుండి స్వాతంత్యం పొందింది. కాఫీ, కోకోవా, రైస్, చేమదుంపలు, అరటికాయలు, కర్రపెండలం, పామ్ నూనె గింజలు వ్యవసాయ ఉత్పత్తులు. పెట్రోలియం, సహజవాయువు, కలప, బాక్సైట్, బంగారం, వజ్రాలు ఈ దేశంలో లభించే ఖనిజ నిక్షేపాలు.
Eritrea
Capital Asmara ………. Language Tigrinya ………. Currency Nakfa ………. Calling Code + 291 ………. Religion Christian/Muslim
ఎరిట్రియా
ఎరిట్రియా ఈశాన్య ఆఫ్రికాలోని ఒక స్వతంత్ర దేశం. సూడాన్, ఇధోపియా, జిబౌటి దేశాలు సరిహద్దులుగా కలవు. ఈశాన్యంలో రెడ్ సీ సముద్ర తీరం కలదు. ఈ దేశాన్ని Horn of Africa అని అంటారు. 1885 సంవత్సరంలో ఇటాలియన్స్ చే ఆక్రమించబడింది. తరువాత ఈ దేశం ఇధోపియాలో కలపబడింది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం 1993 సంవత్సరంలో ఇధోపియా నుండి స్వాతంత్యం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 1,21,320 చ.కి.మీ. ఈ దేశ రాజధాని ఆస్మారా. వీరి భాషలు Afar, Arabic, Tigre and Kunama, Tigrinya, other Cushitic వీరి కరెన్సి nakfa . ఈ దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు అధిక సంఖ్యలో కలరు. జొన్న, ఆకుకూరలు, కూరగాయలు, మొక్కజొన్న, ప్రత్తి, పొగాకు వ్యవసాయ ఉత్పత్తులు. గొర్రెల పెంపకం, పశువుల పెంపకం కలదు. చేపలు లభిస్తాయి. బంగారం, పొటాష్, జింక్, రాగి, ఉప్పు, చేపలు సహజ సంపదలు.
Ethiopia
Capital Addis Ababa ………. Language Amharic ………. Currency Birr ………. Calling Code + 251 ………. Religion Christian/Islam
ఇధోపియా ఈ దేశం ఆఫ్రికా ఖంఢంలో ఈశాన్యంలో ఉంది. పర్వతాలు ఎక్కువ. ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాలలో ఎక్కువ ఉష్ణోగ్రతతో వాతావరణం పొడిగా ఉంటుంది. ఈ దేశానికి 2000 సం.రాల చరిత్ర ఉంది. ఈ దేశ విస్తీర్ణం 12,23,500 చ.కి.మీ. ఇధోపియా రాజధాని అడిస్ అబాబా. వీరి అధికార భాష అంబారిక్. వీరి కరెన్సీ బిర్ లు. 40కి పైగా మాండలిక భాషలు ఇక్కడి ప్రజలు మాట్లాడతారు. క్రైస్తవ మతస్థులు ఎక్కువ. తరువాత కొద్ది శాతం మంది ముస్లిం జనభా ఉన్నారు. ప్రకృతిపరంగాఈ దేశం సుందర దృశ్యాలతో కనువిందు చేస్తుంది. చర్చ్ లు, రాతి కట్టడాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఏనుగులు, జిరాఫీలు, చిరుతపులులు, సింహాలు, కంచర గాడిదలు, ఖడ్గమృగాలను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి నదులు లోతైన లోయల గుండా ప్రవహిస్తాయి. బ్లూ నైలు నది ప్రధానమైనది. కాఫీని ప్రధానంగా ఈ దేశం ఎగుమతి చేస్తుంది. చెరకు, బార్లీ, నూనె దినుసులు, గోధుమ, ప్రత్తి, బంగాళా దుంపలు, చిరుధాన్యాలు ఈ దేశంలో పండిస్తారు. తోళ్లు కూడా ఎగుమతి చేస్తారు. బంగారం, ప్లాటినం వంటి ఖరీదైన ఖనిజ సంపద కల దేశం.
Gabon
Capital Libreville ………. Language French ………. Currency Central African CFA franc ………. Calling Code + 241 ………. Religion Christian.
గాబన్…
15 వ శతాబ్ధంలో పోర్చుగీస్ వారు ఈ దేశాన్ని సందర్శించి ఈ దేశానికి gaba అని పేరు పెట్టారు. తరువాత ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీష్ వారు ఈ దేశానికి వచ్చారు. అప్పటి నుండి ఈ దేశం బానిసలు ఎక్కువగా లభించే దేశంగా పేరుపొందింది. 1885 సంవత్సలో ఫ్రెంచ్ వారు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1960, 17 ఆగస్ట్ న ఈ దేశం ఫ్రెంచ్ వారినుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ వైశాల్యం 2,67,667 చ.కి.మీ. దేశ రాజధాని లిబ్రవిల్లే. వీరి కరెన్సీ Communaute Financiere Africaine franc వీరి అధికార భాష ఫ్రెంచ్. Fang, Myene, Nzebi, Bapounou, Eschira, Bandjabi ఇతర భాషలు. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. కోకోవా, కాఫీ, చెరకు, రబ్బర్, పామ్ నూనె గింజలు వ్యవసా ఉత్పత్తులు. పశువులను పెంచుకుంటారు. చేపల లభ్యత కలదు. పెట్రోలియం, సహజవాయువు, యురేనియం, వజ్రాలు, బంగారం, యురేనియం, కలప సహజ సంపదలు.
Gambia
Capital Banjul ………. Language English ………. Currency Dalasi ………. Calling Code + 220 ………. Religion Islamic
గాంబియా ఆఫ్రికా పశ్చిమ తీరాన ఉన్న చిన్న పేద దేశం గాంబియా. ఈ దేశ విస్తీర్ణం 10,689 చ.కి.మీ. రాజధాని బాన్జూల్. పులానీ, డిమోలా, మాలిన్కే, పూలోఫ్, సోనిన్కే అనే అయిదు నీగ్రో తెగలవారున్నారు. ప్రజలు ఆదిమ భాషలలో మాట్లాడతారు. వీరి అధికార భాష ఇంగ్లీష్. వీరి కరెన్సీ Dalasi. . గాంబియా ఇస్లామిక్ దేశం. 475 కి.మీ పొడవున్న ప్రవహిస్తున్న గంబియా నది ఈ దేశానికి ప్రధాన జలవనరు మరియు నౌకా మార్గం కూడా. వరి, వేరుశెసగ, బొప్పాయి, పామ్, అరటి, కర్రపెండలం, మొక్కజొన్న పంటలు పండుతాయి. పశువులు, మేకలు, గొర్రెల పెంపకం ఎక్కువ. ఖనిజ సంపద, పరిశ్రమలు ఈ దేశంలో లేవు.
Ghana
Capital Accra ………. Language English ………. Currency Ghana cedi ………. Calling Code + 233 ………. Religion Christian/Muslim
ఘనా
పశ్చిమ ఆఫ్రికాలో స్వతంత్ర దేశం ఘనా. ఒకప్పటి బ్రిటీష్ వలసరాజ్యం. టోగోలాండ్, గోల్డ్ కోస్ట్ దేశాలతో కలసి సుక్రుమా నాయకత్వంలో స్వతంత్ర ప్రతిపత్తిని 1957 సం.లో సంపాదించుకుంది. ఘనా విస్తీర్ణం 2,38,533 చ.కి.మీ. ఘనా రాజధాని ఆక్రా. వీరి అధికార భాష ఇంగ్లీష్. వీరి కరెన్సీ ఘనా సెడి. ప్రజలు నీగ్రోలు క్రైస్తవ మతస్తులు. గినీ సింధుశాఖ నుండి క్వాహూ పీఠభూమి వరకు వ్యాపించి ఉన్న పెద్ద మైదానంలో జనసాంద్రత ఎక్కువ. పీఠభూమికి రెండు వైపులా వోల్టా నది, బ్లాక్ వోల్టానది ప్రవహిస్తున్నాయి. ప్రానది, టానో నదులు, వోల్టా సరస్సులు ప్రధాన జలవనరులు. వోల్టా సరస్సు మానవ నిర్మితమైనది. కోకో పంటకు ఘనా పేరు పొందినది. రబ్బరు, కాఫీ, కొబ్బరి, అరటి, పామ్ గింజలు, షీగింజలు వ్యవసాయ ఉత్పత్తులు. బంగారాన్ని త్రవ్వి శుద్ధి చేసి ఎగుమతులు చేసే దేశాలలో ఘనా ప్రధానమైనది. బాక్సైట్, మాంగనీస్, వజ్రాలు లభిస్తాయి. కలప సమృద్ధిగా లభిస్తుంది.
Guinea
Capital Conakry ………. Language French ………. Currency Guinean franc ………. Calling Code + 224 ………. Religion Muslim
గిని
పశ్చిమ ఆఫ్రికాలో అట్లాంటిక్ సముద్రతీరాన ఉన్న స్వతంత్ర రాజ్యం గిని. అందమైన దృశ్యాలతో నిండి ఉన్న లోయలు, జలపాతాలతో కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలు ఈ దేశ సొంతం. గినీ వీస్తీర్ణం 2,45,857 చ.కి.మీ. ఈ దేశ రాజధాని కోనాక్రీ. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీ Guinean franc. ఆదిమ జాతి ప్రజలు స్థానిక మాండలిక భాషలు మాట్లాడతారు. గిని ముస్లిం దేశం. . 1849 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు ఈ దేశాన్ని ఆక్రమించారు. 1858 సంవత్సరంలో స్వతంత్ర ప్రతిపత్తి గల దేశంగా రూపొందింది. నైజర్ నది ఈ దేశానికి జలవనరులను అందిస్తుంది. వరి, పామ్, చిరుధాన్యాలు, మొక్కజొన్న, వేరుసెనగ, అనాస, చిలకడ దుంపలు, టారో కందమూలం, అరిటి, కర్రపెండలం, నిమ్మజాతి పండ్లు ఎక్కువగా సాగులో ఉన్నాయి. . బంగారం, ఇనుపరాయి, వజ్రపు గనులు, బాక్సైట్ ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అల్యూమినియం పరిశ్రమ ప్రధానమైనది.
Guinea-Bissau
Capital Bissau ………. Language Portuguese ………. Currency West African CFA franc ………. Calling Code + 245 ………. Religion Islam/Christian
గిని-బిస్సా
పశ్చిమ ఆఫ్రికాలో సెనెగల్, గినీ దేశాల మధ్య ఉన్న స్వతంత్ర దేశం గిని-బిస్సా. ఒకప్పుడు పోర్చుగీసు వలస రాజ్యం. ఈ దేశ విస్తీర్ణం 36,125 చ.కి.మీటర్ల. రాజధాని బిస్సా. వీరి అధికార భాష పోర్చుగీసు. ఆదిమ జాతుల ప్రజలు – బలాంటే, పులానీ, మాలిన్కే, మాండ్యాకో, పీపిల్ మొదలైన జాతులకు చెందినవారు. వీరి కరెన్సీ West African CFA franc దేశ ప్రజలలో ఎక్కువ మంది ముస్లిం మతస్తులు తరువాత క్రైస్తవులు. ఈ దేశం మైదానాలతో, పీఠభూములతో నిండి ఉంది. వరి, కర్రపెండలం, జొన్న, వేరుసెనగ, కొబ్బరి, అరటిపండ్లు, చిరుధాన్యాలు, మొక్కజొన్నలు, పామ్ ఆయిల్. జీడిమామిడి, చెరకు, బొప్పాయి పండ్లు, అపరాలు పంటలు పండించి ఎగుమతి చేస్తారు.
Kenya
Capital Nairobi ………. Language English and Kiswahili ………. Currency Kenyan shilling (KES) ………. Calling Code + 254 ………. Religion Christian
కెన్యా
హిందూ మహా సముద్రాన్ని ఆనుకుని ఆఫ్రికా ఖండంలో భూమద్య రేఖ మీద ఒక స్వతంత్ర్య దేశం కెన్యా. 1963 సంవత్సరంలో బ్రిటీష్ వారినుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశ విస్తీర్ణం 5,82,646 చ.కి.మీ. రాజధాని నైరోబీ. వీరి అధికార భాషలు స్వాహిలీ మరియు ఇంగ్లీష్. వీరి కరెన్సీ కెన్యా షిల్లింగ్. . క్రైస్తవ మతస్తులు ఎక్కువ. ఆదిమ జాతి మతస్థులు, ముస్లింలు కొద్ది శాతం మంది నివసిస్తున్నారు. కిసుమూ, నాకూరు, మచాకోస్ ప్రధాన పట్టణాలు. మొంబాస ప్రధాన రేవు పట్టణం. . అతి నది, టానా నది, న్గిరో, టుక్వాతీవ్ పెద్ద నదులు. మాగదే, విక్టోరియా సరస్సులు కూడా జనవనరులు. కోస్తాతీర ప్రాంతం సారవంతమైనది. జీడిమామిడి, కొబ్బరితోటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. . కెన్యా వ్యవసాయ ప్రధానమైన దేశం. కాఫీ, తేయాకు, సిసాల్ నార, వాటిల్ బెరడు, పైరత్రామ్, కర్రపెండలం, మొక్కజొన్న, ప్రత్తి, గోధుమ, వరి, చెరకు పండిస్తారు. పశుపెంపకం , పాడి పరిశ్రమలు కూడా ఉన్నాయి. . రాగి, సోడా యాష్, ఉప్పు, సున్నపురాయి ఈ దేశంలో లభ్యమయ్యే ఖనిజాలు. అడవుల నుండి కలప కూడా లభిస్తుంది. పర్యాటక దేశం కూడా. అభయారణ్యాలలో ఉన్న ఏనుగులు, జీబ్రాలు, గాజిల్ వంటి జంతువులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
Lesotho
Capital Maseru ………. Language Sortho/English ………. Currency Lesotho loti ………. Calling Code + 266 ………. Religion Christian
లెసోతో
లెసోతో… ఆఫ్రికా ఖండంలో అన్ని దిక్కులా దక్షిణ ఆఫ్రికా దేశం భూభాగం ఉండటం ఈ దేశపు ప్రత్యేకత. లెసోతో ప్రజలు ఏ దిశలో వెళ్లినా సరిహద్దులు దాటినా దక్షిణ ఆఫ్రికా భూభాగంలో అడుగుపెట్టాల్సిందే. లెసోతో చాలా చిన్న దేశం. మన దేశంలోని కేరళ రాష్ట్రం కన్నా చిన్నగా ఉంటుంది. లెసోతో సార్వభౌమాధికార దేశమే అయినా లాంఛనంగా ఓ చక్రవర్తి ఉంటారు. లెసోతో రాజధాని మసేరు. ఈ దేశ విస్తీర్ణం 30,355 చ.కి.మీ. వీరి కరెన్సీ లోటీ. అధికార భాషలు భాషలు సెసోతో మరియు ఇంగ్లీష్. ఈ దేశం 1966లో యూకే నుంచి స్వాతంత్య్రం పొందింది. లెసోతో మొత్తం జనాభాలో ఎక్కువ మంది రాజధాని మసేరులోనే నివసిస్తుంటారు. అక్షరాస్యత శాతం 82. ఈ దేశ జెండాలోని నీలం రంగు వర్షానికి, తెలుపు శాంతికి చిహ్నాలు. ఆకుపచ్చ సంపదకు గుర్తు. మధ్యలో ఉండే నలుపు టోపీ స్థానిక ప్రజలకు లను సూచిస్తుంది దేశ భూభాగంలో 80శాతం సముద్రమట్టం కన్నా 1,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎక్కడ చూసినా కొండలు, లోయలే కనిపిస్తాయి. చేతికి అందినట్లుండే మేఘాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు కనిసిస్తాయి. ఇక్కడి ‘ఆఫ్రిస్కై రిసార్ట్’ సముద్రమట్టానికి ఏకంగా 3,050 మీటర్ల ఎత్తులో ఉంటుంది. లేసోతో బీద దేశం. జలవనరులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. గడ్డితో చేసిన ప్రత్యేకమైన టోపీలు ఇక్కడ ప్రసిద్ధి. ‘బసోతో టోపీ’లుగా పిలిచే ఇవి ఈ ప్రాంతంలోని వివిధ పర్వతాల రూపాల్లో తయారవుతాయి. ఈ దేశంలోని ‘కాట్సే డ్యామ్’ ఆఫ్రికా మొత్తంలో ఎత్తయిన ఆనకట్ట. ఇది దక్షిణ ఆఫ్రికా, లెసోతో దేశాలు కలిపి నిర్మించిన ప్రాజెక్టు. ఇక్కడి నుంచి నీళ్లను దక్షిణ ఆఫ్రికాకు సరఫరా చేస్తారు. లేసోతోను ‘పర్వతాల రాజ్యం’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడి భూభాగంలో మూడింట రెండో వంతు పర్వతాలే ఉంటాయి కాబట్టి. ఈ దేశం క్రిస్టియన్ దేశం. ఇక్కడ 90 శాతం మంది క్రైస్తవులే. ఈ దేశంలో వజ్రాల గనులు, జల వనరులు అధికం. ఉన్ని, దుస్తులు, పాదరక్షలు ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ‘లెవిస్’ జీన్స్ ఇక్కడ ఎక్కువగా తయారవుతాయి. దేశ ప్రజలలో ఎక్కువ మంది వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడతారు. ఈ దేశంలో ‘మలెట్సన్యనె’ అనే ఒకే ధార గల జలపాతం మంచి పర్యటక ప్రాంతం. ఇది 192 మీటర్ల ఎత్తు నుంచి కిందకు జాలువారుతుంది. కంబళిని ఈ దేశ ప్రజలు సంప్రదాయ దుస్తులుగా భావిస్తారు. ఈ సంప్రదాయం మరే దేశంలోనూ కనిపించదు. రకరకాల రంగులతో పూర్తిగా ఉన్నితో వీటిని తయారు చేసుకుంటారు. చలి నుంచి రక్షణ కోసమే కాకుండా కంబళిని హోదాకు గుర్తుగా భావిస్తారు.
Liberia
Capital Monrovia ………. Language English ………. Currency Liberian dollara ………. Calling Code + 231 ………. Religion Christians
లైబీరియీ
లైబీరియా పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఒకదేశం. వర్షపాతపు అడవులతో జంతుసంపదకు మరియు వృక్షసంపదకు పేరు గాంచినది. 235 వృక్షజాతులు కలవు. ఈ దేశ వైశాల్యం 1,11,370 చ.కి.మీ. వీరి అధికార భాష ఇంగ్లీష్. కానీ దేశంలో 20 శాతం మంది ప్రజలు మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడగలరు, వ్రాయగలరు. ఆదిమజాతివారు దాదాపు 20 స్థానిక భాషలలో మాట్లాడుతారు. 26 జులై, ఈ దేశం ఏ ఇతర దేశాలతో ఆక్రమించబడలేదు. ఈ దేశ రాజధాని మన్రోవియా. వీరి కరెన్సీ లైబీరియన్ డాలర్. క్రిస్టయన్లు 40 శాతం మంది, ముస్లింలు 20 శాతం మంది స్థానిక మతస్తులు 40 శాతం మంది కలరు. రబ్బర్, కాఫీ, కోకోవా, రైస్, కర్రపెండలం, నూనె గింజలు, చెరకు, అరటి వ్యవసాయ ఉత్పత్తులు. గొర్రెలను, మేకలను పెంచుతారు. ఇనుప ఖనిజం, కలప, వజ్రాలు, బంగారం ఖనిజ నిక్షేపాలు
Libiya
Capital Tripoli ………. Language Arabic ………. Currency Libyan dinar ………. Calling Code + 218 ………. Religion Islam
లిబియా…
ఉత్తర ఆఫ్రికాలో మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని ఉన్న సోషలిస్ట్ రాజ్యం లిబియా. ఒకప్పుడు ఇటలీ వలస రాజ్యంగా ఉండి 1949 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ రాజధాని నగరం ఆల్జూపూర్. వీరి అధికార భాష అరబ్పీ.ఈ దేశ కరెన్సీ లిబియన్ దీనార్లు. ప్రజలు లిబియన్ అరబ్బీ, బెల్ బెర్ జాతులకు చెందిన వారు. ఈ దేశం ముస్లిం దేశం. ఈ దేశస్తులు సున్నీ ఇస్లాం మతాన్ని పాటిస్తారు. ఈ దేశ వైశాల్యం 17,75,000 చ. కి.మీ. ఈ దేశంలో వాయువ్యాన ఉన్న కోస్తా మైదానం, ఈశాన్యంలో ఉన్న మిట్ట ప్రాంతాలు సారవంతమైన నేలలు. లిబియా దక్షిణ భాగమంతా సహారా ఏడారి. అక్కడక్కడా ఉన్న ఒయాసిస్సుల ప్రాంతాలలో నేల సారవంతమైనది. ఆగ్నేయంలో ఉన్న ఆల్ కుఫ్రా వద్ద ఉన్న సరస్సు అవసరమైన పంటనీటిని అందిస్తుంది. సముద్ర మట్టానికి 2286 మీ. ఎత్తున్న బెట్టే పర్వత శిఖరాగ్రం లిబియాలో మిక్కిలి ఎతైనది. గోధుమ, ఆలివ్, పుచ్చకాయలు, బంగాళా దుంపలు, బార్లీ, ఉల్లి, ఖర్జూరం, టమాటోలు, నారింజ, ద్రాక్ష ప్రధానమైన పంటలు. ఒంటెలు, గాడిదలు ఈ దేశంలో ఎక్కువగా ఉన్నాయి. గొర్రెలు, మేకలను పెంచుతారు. జిప్సం, ఉప్పు ఖనిజాలు లభిస్తాయి. పెట్రోల్ నిక్షేపాలు ఉన్నాయి. పెట్రో ఎగుమతికి ప్రసిద్ధిగాంచినది. పెట్రోల్ ఎగుమతులు ఈ దేశానికి ప్రధాన ఆర్ధిక వనరు. జవుళీ, మత్స్య పరిశ్రమలు ముఖ్యమైనవి. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ గా నమోదైన పట్టణం ఆల్ ఆజియిహా లిబియాలోనే ఉన్నది.
Madagascar
Capital Antananarivo ………. Language Malagasy French ………. Currency Malagasy ariary ………. Calling Code + 261 ………. Religion Traditional/Christian/Muslim
మడగాస్కర్..
మడగాస్కర్ పెద్ద ద్వీపదేశం. ప్రపంచంలోనే నాలుగవదైన పెద్ద ద్వీపదేశం. మొదటి మూడు గ్రీన్ ల్యాండ్, న్యూ గినియా, బోర్నియో. 1960 సంవత్సరంలో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అంతకు ముందు ఫ్రెంచ్ వారి వలస రాజ్యం. ఆఫ్రికా తూర్పు తీరానికి 500 కి.మీ. దూరంలో ఉంది. ఈ దేశ విస్తీర్ణం 5,87,041 చ.కి.మీ. ఈ దేశ రాజధాని అంతనా నరీవ్. వీరి అధికార భాష మలగాసీ. తరువాత ఫ్రెంచ్ కూడా మాట్లాడుతారు. వీరి కరెన్సీ Malagasy ariary … ప్రజలు క్రైస్తవ, ముస్లిం మతాలను అనుసరిస్తారు. స్థానిక సంప్రదాయ మతస్తులు కూడా ఉన్నారు. ఈ దేశంలో కనపడే జంతువులు, పక్షులు ఈ దేశానికే ప్రత్యేకం. ఈ దేశం ఆర్ధికంగా బీద దేశం. విద్యాపరంగా కూడా వెనుకబడి ఉన్నది బెమరీవూ నది, బెట్సుబోకా నది, మాంగో నదులు ప్రదాన జలవనరులు. ఇవి కాక సరస్సులు, తటాకాలు కూడా ఉన్నాయి. వరి వీరి ముఖ్య ఆహార పంట. కర్రపెండలం, మొక్కజొన్న, చెరకు, బంగాళా దుంపలను ఎక్కువగా పండిస్తారు. కాఫీ ముఖ్యమైన ఎగుమతి పంట మడగాస్కర్ వెనిల్లాకు ప్రపంచ ప్రసిద్ది గాంచినది. పొగాకు, లవంగాలు వాణిజ్య పంటలు. మైకా, నికెల్, రాగి క్రోమైట్ ఈ దేశంలో లభించే ఖనిజ నిక్షేపాలు.
Malawi
Capital Lilongwe ………. Language English ………. Currency Kwacha ………. Calling Code + 265 ………. Religion Christian
మలావీ…
ఆఫ్రికాలోని దక్షిణ భాగంలో న్యాసా సరస్సుకు ఆనుకుని ఉన్న స్వతంత్ర్యదేశం మలావీ. 1964 సంవత్సరంలో బ్రిటీష్ వారినుండి స్వాంతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 1,14,484 చ.కి.మీ.. రాజధాని నగరం లిలోన్వే. వీరి అధికార భాష ఇంగ్లీష్. ఇంకా మారానీ, టోంగా, చెనా, తుంబుగా భాషలు కూడా మాట్లాడుతారు. వీరి కరెన్సీ Kwacha మలావి క్రైస్తవ మతానికి చెందిన దేశం. ముస్లిం మతస్తులు కూడా ఉన్నారు. మొక్కజొన్న వీరి ప్రధాన ఆహారం. న్యాసా సరస్సు, షీర్వా సరస్సు, బూవా నది, షీరే నది ప్రధాన జలవనరులు. కానీ పంటలకు అనుకూలమైన నేలలు లేక పోవటంలో వ్యవసాయపరంగా మలావీ అభివృద్ధి చెందలేదు. చెరకు, కాఫీ, ప్రత్తి, వేరుశెనగ, తేయాకు, పొగాకు పంటలను పండిస్తారు. టీ, పంచదార, ప్రత్తి. పొగాకు ఎగుమతులమీద దేశ ఆర్ధిక వ్యవస్థ ఆధారపడి ఉన్నది. మలావీ సరస్సు మత్స్యపరిశ్రమకు అనుకూలమైనది. ఈ దేశానికి ఖనిజ సంపదలు లేవు. పరిశ్రమలు కూడా తక్కువే. ఆర్ధికంగా వెనుకబడి దేశం మలావీ. కానీ పర్వత పానువులలో ఉన్న సుందరమైన వృక్ష సంపద, సరస్సులు, ప్రకృతి దృశ్యాలు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
Mali
Capital Bamako ………. Language French ………. Currency West African CFA franc ………. Calling Code + 223 ………. Religion Islam
మాలీ…
మాలీ పశ్చిమ ఆఫ్రికాలోని ఒక స్వతంత్ర దేశం. ఆఫ్రికాలో పెద్ద దేశం. ఇది 1960 సంవత్సరంలో ఫ్రెంచ్ వారి నుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 12,40,192 చ.కి.మీ. రాజధాని నగరం బామాకో. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీ West African CFA franc . మలావీ ముస్లిం దేశం. ప్రజలు నీగ్రో జాతి వారు. బావి నది, నైజర్ నదులు ఈ దేశం దక్షిణాన ప్రవహిస్తున్నాయి. ప్రత్తి, మొక్కజొన్న, వరి, చిరుధాన్యాలు, షియా నూనె గింజలు, పండ్లు పండిస్తారు. పశువుల పెంపకం, ఒంటెల పెంపకం ప్రధాన వృత్తి. నదులలోని చేపలు పట్టి ఎండబెట్టి ఎగుమతి చేస్తుంటారు. పదును చేసిన తోలు కూడా ఎగుమతి చేస్తారు.
Mauritania
Capital Nouakchott ………. Language Arabic ………. Currency Ouguiya ………. Calling Code + 222 ………. Religion Islam
మారిటానియా..
పశ్చిమ ఆఫ్రికాలో స్వతంత్ర రాజ్యం మారిటానియా. ఒకప్పుడు ఫ్రెంచ్ వలస రాజ్యంగా ఉండేది. 1958 సంవత్సంలో స్వాతంత్ర్యం సాధించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 10,30,700 చ.కి.మీ. రాజధాని నగరం నౌవాక్ చోట్. వీరి అధికార భాష అరబ్బీ.వీరి కరెన్సీ Mauritanian ouguiya ప్రజలు నీగ్రోలు. 99 శాతం మంది ఇస్లాం మతానికి చెందినవారు. వీరు దేశ దిమ్మరులు. ఒంటె రోమాలతో చేసి గుడారాలను వేసుకొని జివిస్తుంటారు. సహారా ఎడారి ఈ దేశానికి చుట్టూర ఉంది. అక్కడక్కడా ఒయాసిస్సులు ఉన్నారు. దక్షిణ దిశలో సెనెగల్ నది సరిహద్దుగా ఉన్నది. ఈ నదిని ఆనుకుని సారవంతమైన మైదానం ఉన్నది. వరి, చిరుధాన్యాలు, కందమూలాలు, పుచ్చకాయలు, అపరాలు పండిస్తారు.. ఖర్జూరం, వేరుసెనగ అరబిక్ బంక వాణిజ్య ఉత్పత్తులు. రాగి, ఇనుపరాయి ఖనిజాలు లభిస్తాయి. కలప లభిస్తుంది. పశుపోషణ కూడా ఉంది.
Mauritius
Capital Port Louis ………. Language English ………. Currency Mauritian rupee ………. Calling Code + 230 ………. Religion Hindu(52)/Christian/Islam
మారిషస్
మారిషస్… ఆఫ్రికా ఖండతీర ప్రాంతంలో హిందూ మహాసముద్రంలో ఉండే ఓ ద్వీప దేశం. ఈ దేశ రాజధాని పోర్ట్ లూయిస్. వీరి అధికార భాష ఏమీ లేదు ఈ దేశంలో మారిషస్ క్రియోల్, ఫ్రెంచ్, భోజ్‌పురీ, ఆంగ్లం, హిందీలతో పాటు మన తెలుగు కూడా మాట్లాడతారు. మారిషస్ రాజధాని: పోర్ట్ లూయిస్ అతి తక్కువ జనాభా సుమారు13,50,000.(2018) విస్తీర్ణం: 2,040 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు: ఆంగ్లం, ఫ్రెంచ్ మారిషస్ కరెన్సీ: మారిషియన్ రుపీ లక్షల ఏళ్ల క్రితం భూగర్భంలోని అగ్నిపర్వతాల విస్ఫోటనాల వల్ల ఈ ద్వీపం ఏర్పడింది. మొదటిసారిగా ఇక్కడ అడుగుపెట్టింది పోర్చుగీసు వారు. ఇక్కడ భారత్, ఆఫ్రికా,చైనా దేశాల సంతతివారు ఎక్కువగా ఉంటారు. . ఇప్పుడు అంతరించి పోయిన డోడో అనే పక్షులు ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే ఉండేవి. . ఈ దేశం1968లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందింది. . మారిషస్ పర్యాటక దేశం కూడా. ఈ ద్వీప దేశాన్ని చూడ్డానికి దేశదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ప్రముఖ రచయిత మార్క్ ట్వైన్ ఈ దేశం గురించి‘ముందు మారిషస్ ఏర్పడింది ఆ తర్వాతే స్వర్గం తయారైంది అని అన్నారు. . ఇక్కడ ముఖ్యమైన పర్యటక ప్రాంతం ఛామరెల్లోని ‘ఏడు రంగుల నేల’. తక్కువ ప్రదేశంలోని ఇక్కడి ఇసుక వేరువేరు రంగుల్లో భలేగా కనిపిస్తుంది. ఇది అగ్నిపర్వతాల ప్రభావంతోనే ఏర్పడింది. ఈ ఐలాండ్‌లో క్రూరమృగాలు ఉండవు. ఇక్కడ కనిపించే పాములు కూడా విషపూరితమైనవి కావు. ఈ ద్వీపం చుట్టూ ఉండే కోరల్ రీఫ్స్ ఉష్ణోగ్రతల నుంచి, షార్కు, జెల్లీఫిష్ వంటి జలచరాల నుంచి సందర్శకుల్ని కాపాడుతుంటాయి. దేశం మొత్తం జనాభాలో రాజధాని పోర్ట్ లూయిస్‌లోనే 40 శాతం మంది నివసిస్తారు. మారిషస్ అనే పేరు ఒకప్పటి రాజకుమారుడు మారిస్ డె నాసో పేరు మీదుగా వచ్చింది. ఇక్కడి మొత్తం వ్యవసాయ భూమిలో 90 శాతం చెరకునే పండిస్తారు. రెండు చేతులతో బహుమతి తీసుకోవడం గౌరవంగా భావిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. కుడి చేతితో మాత్రమే బహుమతి తీసుకోవాలి.
Morocco
Capital Arabic / Berber ………. Language Rabat ………. Currency Moroccan dirham ………. Calling Code + 212 ………. Religion Muslim
మొరాకో
ఆఫ్రికా ఖండంలో ఉత్తరాన ఉన్న చిన్న దేశం మొరాకో. అట్లాంటిక్ మహా సముద్రంతో దీనికి పొడవైన తీర రేఖ ఉంది. మధ్యధరా, అట్లాంటిక్ సముద్రాలు రెండింటితోనూ ఇది సరిహద్దుల్ని పంచుకుంది. ప్రపంచంలో ఇటువంటి దేశాలు దీనితో పాటుగా మూడే ఉన్నాయి. మొరాకో రాజధాని రాబాట్ అయినా ఇక్కడ అతి పెద్ద నగరం మాత్రం కాసాబ్లాంకా. ఫెజ్, అగదిర్, ఉజ్దా…లూ ఇతర ముఖ్యమైన నగరాలు. ఈ దేశ రాజధాని రాబాట్ జనాభా 3,38,48,242 (2018) ఈ దేశ విస్తీర్ణం: 7,10,850 చదరపు కిలోమీటర్లు వీరి అధికారిక భాషలు అరబిక్, బెర్బర్. ఈ దేశ కరెన్సీ మొరాకన్ దిర్హామ్ ఈ దేశం ముస్లిం దేశం. మూడు కోట్లకు పైగా ఉన్న జనాభాలో 99 శాతం సున్నీ ముస్లింలే. మిగిలిన ఒక శాతం యూదులు, క్రైస్తవులు ఉన్నారు. చరిత్ర ఆధారాల్ని బట్టి చూస్తే 2.6మిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడ మనుషులే లేరు. తర్వాత్తర్వాతే రోమన్లు, ఇతర సంచార జాతి వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. మొరాకో ఆగ్నేయ భాగంలో సహారా ఎడారి ఉంటుంది. అయితే దీని సరిహద్దుల విషయంలో ఈ దేశానికి మారుటేనియా, అల్జేరియాలతో వివాదాలున్నాయి. ఎత్తయిన పర్వతాలు, ఎడారి ప్రాంతం, సముద్ర తీరాలు, పచ్చిక మైదానాలు, దట్టమైన అడవులు… ఇలా అన్ని రకాల భూ స్వరూపాల్నీ ఇక్కడ ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్, అరబ్ లీగ్‌ల్లో సభ్యత్వం కలిగిన దేశమిది. గొర్రెమాంసంతో చేసే హరీరా సూప్ ఇక్కడ ప్రముఖ వంటకం. ఎక్కువగా రంజాన్ నెలలో దీన్ని చేసుకుంటారు. ఆహారంలో బ్రెడ్‌ను ప్రధానంగా వాడతారు. గ్రీన్ టీ వీరి జాతీయ పానీయం. ఈ దేశంలో ప్రధానంగా రెండు రకాల పర్వతాలున్నాయి. ఒకటి అట్లాస్, రెండు రిఫి. అట్లాస్ పర్వతాలు ఇక్కడి భూభాగాన్ని విభజిస్తాయి. అందుకే వీటికి ‘ద బ్యాక్ బోన్ ఆఫ్ మొరాకో’ అనే పేరుంది. ఇవి విభజించిన ప్రాంతాల్నే మిడిల్ అట్లాస్, యాంటీ అట్లాస్, హై అట్లాస్‌లుగా పిలుస్తారు. హై అట్లాస్‌లో ఈ పర్వతాలపైనే చిన్న చిన్న గ్రామాలుంటాయి. బెర్బర్ ప్రజలు వీటిపై ఇళ్లు కట్టుకుని జీవనం సాగిస్తుంటారు. ఈ చిన్న దేశంలో రకరకాల వాతావరణాలు కనిపిస్తాయి. మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో వేసవిలోనూ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండవు. చల్లగానే ఉంటుంది. అదే ఈ దేశ దక్షిణ ప్రాంతాల్లో మాత్రం 30డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత ఉంటుంది. జులై, ఆగస్టు, సెప్టెంబరుల్లో ఇక్కడ ఎండలు మండిపోతాయి. సహారా ఎడారికి ఆనుకుని ఉండే ప్రాంతాల్లో ఎప్పుడూ దాని మీదుగా గాలులు వీస్తూ ఉంటాయి. ఇక్కడ వాతావరణం పొడిగా రాత్రిళ్లు చలిగా ఉంటుంది. మొరాకో పర్యాటక దేశం కూడా. పర్యాటకం వల్లా ఈ దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. ఏటా కోటి మందికి పైగా పర్యాటకులు ఈ దేశాన్ని చూడటానికి వస్తారు. అట్లాస్, రిఫి పర్వతాలు అడ్వంచర్ టూరిజంకి ప్రసిద్ధి. వీటిపై రిసార్టులు, షాపింగ్ సెంటర్లు ఉన్నాయి. సహారా ఎడారి ప్రాంతాన్ని డెసర్ట్ టూరిజం హబ్‌గా మార్చారు. ఆఫ్రికా దేశాల్లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఈ దేశానిది ఐదో స్థానం. దేశ ఆర్థిక అభివృద్ధికి సహజ వనరులే ప్రధానం. ఇక్కడ పాస్పేట్ ఎక్కువగా లభిస్తుంది. పాస్పేట్ ను క్రిమి సంహారకాలు, ఎరువుల్లో ఎక్కువగా వాడతారు. కోబాల్ట్, బారైట్, సీసం.. తదితరాల లభ్యత ఎక్కువగా ఉంది. నారింజ, బత్తాయిలాంటి నిమ్మజాతి పండ్లు, ఆలివ్, టమాటాలు ఎక్కువగా పండుతాయి. లెదర్, వస్త్రాల్నీ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇక్కడ వాడే విద్యుత్ చాలా మటుకు బొగ్గుతోనే తయారవుతుంది. మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తుంది.
Mozambique
Capital Maputo ………. Language Portuguese ………. Currency Mozambican metical ………. Calling Code + 258 ………. Religion Christian/Muslim
మొజాంబిక్…
మొజాంబిక్ తూర్పు ఆఫ్రికాలోని స్వతంత్ర్య దేశం. ఉత్తర దిశలో టాంజానియా, పశ్చిమాన మలావీ, జాంబియా, బోట్స్ వానా, జింబాబ్యే, దక్షిణాఫ్రికా, దక్షిణ దిశలో స్వాజిలాండ్, తూర్పున హిందూ మహాసముద్రం ఉన్నాయి. ఈ దేశం పోర్చుగల్ నుండి 1975 సంవత్సరంలో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ దేశ రాజధాని నగరం మాపుటో. ఈ దేశ విస్తీర్ణం 7,99,380 చ.కి.మీ. మలావీ, షోనా, మాకొండే., షోనా జాతి ప్రజలు ఉన్నారు. వీరి అధికార భాష పోర్చగీస్. వీరి కరెన్సీ Mozambican metical . ఈ దేశంలో ప్రధానంగా క్రైస్తవులు, ముస్లింలు ఉన్నారు. పశ్చిమ దిశలో మలావీ సరస్సు ఉంది. జాంబజీ నది, సావే నది, లింపోపో నది. ఢిఫాంట్స్ నది తూర్పుగా ప్రవహించి హిందూ మహాసముద్రంలో కలుస్తున్నాయి. జీడిమామిడి, కొబ్బరి, సిసాల్ నార, జొన్న, వరి, చెరకు, తేయాకు, మొక్కజొన్న, కర్రపెండలం, అరటి పండ్లు, వేరుసెనగ, చిరుగడం వ్యవసాయ ఉత్పత్తులు. ఖనిజ సంపద పుష్కలంగా లభిస్తుంది. నేలబొగ్గు, వజ్రాలు, బాక్సైట్ ఉన్నాయి. బెరిల్, టాంటలైట్ ఖనిజాలు ఎక్కువగా లభిస్తున్నవి.
Namibia
Capital Windhoek ………. Language English ………. Currency Namibian dollar ………. Calling Code + 264 ………. Religion Christian
నమీబియా..
నమీబియా ఉత్తర ఆఫ్రికాలోని ఒక దేశం. పశ్చిమదిశలో అట్లాంటిక్ మహాసముద్రం కలదు. అంగోలా, జాంబియా, బోట్స్ వానా, జింబాబ్వే,దక్షిణ ఆఫ్రికా దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. నమీబియాలో మొదటిగా శాన్ ఆటవిక తెగల ప్రజలు నివసించారు. వీరి ప్రధాన వృత్తి. తరువాత 14వ శతాబ్ధంలో బంటూ జాతి ప్రజలు ఈ ప్రాంతానికి వలస వచ్చారు. 1990 వ సంవత్సరంలో దక్షిణ ఆఫ్రికా నుండి స్వాతంత్ర్యం పొందింది. నమీబియా రాజధాని Windhoek వీరి కరెన్సీ నమీబియన్ డాలర్. ఈ దేశ వైశాల్యం 8,25,418 చ.కి.మీ. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. క్రిస్టియన్లు 90 శాతం మంది, 10 శాతం స్థానిక మతస్తులు ఉన్నారు. వీరి అధికార భాష ఇంగ్లీష్ కానీ కేవలం 7 శాతం మంది మాత్రమే మట్లాడుతారు. 60 శాతం ప్రజలుWindhoek మాట్లాడుతారు. చిరుధన్యాలు, జొన్న, వేరుసెనగ, ద్రాక్ష వ్యవసాయ ఉత్పత్తులు. పశుసంపద కలదు. చేపలు కూడా దొరకుతాయి. వజ్రాలు, రాగి, యురేనియం, సీసం, లిధియం, కాడ్మియం, జింక్, ఉప్పు సహజ సంపదలు.
Niger
Capital Niamey ………. Language French ………. Currency West African CFA franc ………. Calling Code + 227 ………. Religion Islam
నైజర్…
ఒకప్పుడు ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న ఈ రాజ్యం 1970 సం.లో స్వాతంత్రం సంపాదించుకుంది. దేశం విశాలమైనది కానీ సహజ సంపదలు ఎక్కువగా లేని దేశం. జనసాంద్రత కూడా తక్కువే. అల్జీరియా, లిబియా, చాద్, నైజీరియా, బెనిన్ దేశాలు సరిహద్దులుగా కల దేశం. ఈ దేశంలో ప్రవహించే చేజర్ నది పేరు వలన ఈ దేశానికి నైజర్ అనే పేరు వచ్చింది. ఈ దేశం ముస్లిం దేశం. 85 శాతం ప్రజలు సున్నీ ఇస్లాంను అనుసరిస్తారు. ఈ దేశ విస్తీర్ణం 11,86,408 చ.కి.మీ. రాజధాని నగరం నియామే. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీWest African CFA franc. ఈ దేశానికి ఉత్తరాన సహారా ఎడారి ఉంది. నైరుతీ దిశలో ప్రవహించే నైజర్ నది ఒక్కటే ప్రధాన జలవనరు. తుమ్మ చెట్లు, ఈత చెట్లు, తాటిచెట్లను పెంచుతారు. ప్రత్తి, వేరుసెనగ ప్రధానమైన పంటలు. ఇవి కాక వరి, జొన్న, అపరాలు, కందమూలాలు, గోధుమ, పొగాకు, మొక్కజొన్న ఇతర పంటలు. పశువుల పెంపకం ప్రజలకు ప్రధాన జీవనాధారం. తగరం, యురేనియం, నెట్రాన్, రాతి ఉప్పు ప్రధాన ఖనిజ సంపదలు.
Nigeria
Capital Abuja ………. Language English ………. Currency Naira ………. Calling Code + 234 ………. Religion Christian/Islam
నైజర్…
పశ్చిమ ఆఫ్రికాలోని ఒక స్వతంత్ర దేశం నైజీరియా. 1960 సంవత్సరంలో బ్రిటీష్ వారినుండి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. కళల పరంగా ఈ దేశం పేరు పొందింది. పికాసో వంటి సుప్రసిద్ధ కళాకారులను ప్రభావితం చేసిన దేశం. విభిన్నమైన భౌగోళిక పరిస్థితులు గల దేశం ఈ దేశ విస్తీర్ణం 9,23,768 చ.కి.మీ. రాజధాని నగరం లావోస్. వీరి అధికార భాష ఇంగ్లీష్. ప్రజలు నీగ్రో వర్గానికి చెందినవారు. ఈ దేశం ఇస్లాం మతానికి చెందినది. వీరి కరెన్సీ నైరాలు. ఇక్కడ ప్రజలు వందలాది స్థానిక భాషలు మాట్లాడుతారు నైజీరియాలో సహజసంపదలు ఎక్కువగా ఉన్నాయి. నైజర్ నది ఎక్కువగా ఈ దేశంలోనే ప్రవహిస్తున్నది. దీని ఉపనది బెన్యూ కూడా ఎక్కువ ప్రాంతంలో ప్రవహిస్తున్నది. చాద్ సరస్సులో కదూనా-కోమాదుగు మోజ్ నది నైజీరియాలోనే ఉన్నది. నైజీరియా వ్యవసాయ ప్రధానమైన దేశం. అరటిపండ్లు, వరి, మొక్కజొన్న, కర్రపెండలం, వరి, చిరుధాన్యాలు, దుంపజాతులను పండిస్తారు.ప్రత్తి. కోకో, పామ్ గింజలు. వేరుసెనగ, రబ్బరు వాణిజ్య పంటలు. ముఖ్యంగా కోకో, వేరుసెనగ, పామ్ గింజల నూనెకు నైజీరియా పేరు గాంచినది. కలప ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి. కొంబైట్ అనే ఖనిజం ఉత్పత్తి ఎక్కువ. నేలబొగ్గు, బంగారం, ఇనుపరాయి, సీసం, సున్నపురాయి, జింకు ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి. పెట్రోల్ నిక్షేపాలు, సహజవాయువు పుష్కలంగా ఉన్నాయి.
Rwanda
Capital Kigali ………. Language Kinyarwanda/English/French ………. Currency Rwandan franc ………. Calling Code + 250 ………. Religion Roman Catholica
రువాండా
ఆఫ్రికా మద్యలో భూమద్య రేఖ మీద ఉన్న స్వతంత్ర దేశం రువాండా. ఈ దేశ రాజధాని కిగాలీ. వీరి అధికార భాష ఫ్రెంచ్, కిన్యార్వాండ్ . వీరి కరెన్సీ రువాండ్ ఫ్రాంక్. రువాండ్ రోమన్ కేధలిక్ కు చెందిన క్రిస్టియన్ దేశం. వబగసేరా సరస్స, కీవూ సరస్సు, తేమా సరస్సు, కాగేరా నది, అకన్యారూ నది, రూజీజీ నది, వ్యబరోన్గో నదులు ముఖ్య జలాధారాలు. నీటి వనరులున్నప్పటికీ ప్రజలు తమకు అవసరమైనంత వరకే ఆహారపు పంటలు పండిస్తారు. జొన్న, మొక్కమొన్న, కర్రపెండలం, కందమూలాలు, బంగాళాదుంపలు కొద్దిగా పండిస్తారు. కాఫీ విరివిగా పండించి ఎగుమతి చేస్తారు వీరు పండించే రోబుస్టా రకం ఇన్ స్టంట్ కాపీ తయారు చేయటానికి పనికి వస్తుంది. తేయాకు, పొగాకు ఇతర వాణిజ్య పంటలు. జిరేనియా, పైరద్రామ్ ఓషదులకూడా పండించి ఎగుమతులు చేస్తున్నారు. పశువుల పెంపకం మీద జనం ఆధారపడతారు. తగరపు రాయి, టంగ్ స్టన్, టాంటలైట్, బెరిల్ ఖనిజ నిక్షేపాలు లభిస్తాయి. తోళ్లు ఎగుమతి చేస్తారు. రువాండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దేశం.
Sao Tome and Principe
Capital São Tomé ………. Language Portuguese ………. Currency Dobra ………. Calling Code + 239 ………. Religion Roman Catholic Sao Tome and Principe… ఈ దేశం పశ్చిమ ఆఫ్రికా తీరంలో చిన్న చిన్న దీవులు, అగ్నిపర్వతాలతో ఉన్నది. 1400 వ సంవత్సరం నుండి పోర్చుగల్ వారు ఈ దేశంలో ప్రవేశించి స్థానిక ప్రజలను బానిసలుగా మార్చి చెరకుపంటను సాగుచేసారు. అప్పటినుండి బానిసల ఎగుమతి రాజ్యంగా మారింది. 1975 సంవత్సరంలో పోర్చుగల్ నుండి స్వాతంత్ర్యం పొందింది ఈ దేశ రాజధాని సావో టామీ. ఈ దేశ వైశాల్యం 1, 001 చ.కి.మీ. అధికార భాష పోర్చుగీస్. వీరి కరెన్సీ డోబ్రా. ఈ దేశం క్రిస్టియన్ దేశం. కోకోవా, కొబ్బరి, దాల్చిన చెక్క, మిరియాలు, కాఫీ, అరటిపండ్లు, బొప్పాయి, బీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు. కోళ్లపెంపకం కలదు. చేపలు లభిస్తాయి. చేపలు హైడ్రో పవర్ సహజ సంపదలు.
Senegal
Capital Dakar ………. Language French ………. Currency CFA franc ………. Calling Code + 221 ………. Religion Islam పశ్చిమ ఆఫ్రికాలో అట్లాంటిక్ ను ఆనుకుని ఉన్న స్వతంత్ర దేశం సెనెగల్. ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉండి మాలీ సమాఖ్యలో భాగమై తరువాత 1960 సం.లో స్వతంత్ర రాజ్యం అయినది. ఈ దేశ విస్తీర్ణం 1,96,722 చ..కి.మీ.. ఈ దేశ రాజధాని డాకర్. వీరి అధికార భాష ఫ్రెంచ్. వీరి కరెన్సీ CFA franc ప్రజలు నీగ్రో జాతులకు చెందినవారు. సెనెగల్ ముస్లిం దేశం. ఎక్కువ మంది సున్ని ముస్లింలు. తరువాత కొద్ది సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. సెనెగల్ దేశాన్ని గేట్ వే ఆఫ్ ఆఫ్రికా అంటారు. సీవే నది, సాలూమ్ నది, గాంజీనది, కసామాన్సే నది ప్రధాన జలవనరులు. వేరుసెనగ ప్రధాన వ్యవసాయోత్పత్తి. 72 శాతం వేరుశెనగను ఎగుమతి చేస్తారు. వరి, జొన్న, మొక్కజొన్న, చిక్కుడు, కర్రపెండలం, బంగాళాదుంప, చిరుగడం, చెరకు, ప్రత్తి పంటలను పండిస్తారు. గొర్రెలు, మేకలను పెంచుతారు. . జిర్కోనియం, కాల్షియం, ఫాస్పేట్ ఈ దేశ ఖనిజ సంపదలు. టూనా చేపలు దొరకుతాయి. . సిమెంట్, జవుళీ, వీరు, సారాయి, వేరుసెనగ ఉత్పుత్తులు ప్రధాన పరిశ్రమలు.
Seychelles
Capital Victoria ………. Language English/French/Seychellois Creole ………. Currency Seychellois rupee ………. Calling Code + 248 ………. Religion Christian
సీషెల్లీస్
సీషెల్స్ ఆఫ్రికా ఖండానికి చెందిన దేశం. హిందూ మహాసముద్రం మధ్యలో 115 ద్వీపాల సమూహం సీషెల్స్. హనీమూన్ డెస్టినేషన్‌గా ఈ ద్వీపదేశానికి మంచి పేరుంది. అందమైన తీరాలు, అత్యద్భుతమైన జలపాతాలు, అడవులు, పర్వతాలతో పర్యావరణ కేంద్రంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ద్వీపదేశం 1500 సంవత్సరంలో యూరోపియన్స్ చే కనిపెట్టబడినది. 1903 నుండి బ్రిటీష్ కాలనీగా ఉండి1976 సంవత్సరంలో బ్రిటీష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశ రాజధాని విక్టోరియా. ఈ దేశ వైశాల్యం 455 చ.కి.మీ. క్రెడోల్ మరియు ఇంగ్లీష్ వీరి భాషలు. ఈ దేశం క్రిస్టియన్ దేశం. కొబ్బరి, దాల్చిన చెక్క, వెనీలా, చిలకడ దుంపలు, కర్రపెండల అరటి వ్యవసాయ ఉత్పత్తులు. కోళ్లపెంపకం కలదు. చేపలు, కొబ్బరి, దాల్చిన చెక్క చెట్లు సహజ సంపదలు సీషెల్లీస్ పర్యాటక దేశం
Sierra Leone
Capital Freetown ………. Language English ………. Currency Leone ………. Calling Code + 232 ………. Religion Islam
సియారా లియోన్
సియారా లియోన్… పశ్చిమ ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం. గిని, లైబేరియా, అట్లాంటిక్ సముద్రం ఈ దేశానికి సరిహద్దులు. సియారా లియోన్ రాజధాని ఫ్రీటౌన్. దేశ విస్తీర్ణం 71,740 చ. కిలోమీటర్లు. వీరి అధికార భాష ఆంగ్లం ఈ దేశ కరెన్సీ లియోన్. ఈ చిన్న దేశంలో ఉన్న 16 తెగల ప్రజలకు ప్రత్యేకమైన భాషలున్నాయి. మెండె, టెమ్నె, క్రియో ముఖ్యమైన స్థానిక భాషలు. ఈ దేశ అధికారిక భాష ఆంగ్లమే అయినా ప్రతి ఒక్కరూ కనీసం రెండు నుంచి మూడు భాషల వరకు మాట్లాడతారు. రాజధాని నగరం ఫ్రీటౌన్‌లో కాటన్ ట్రీ పేరుతో పెద్ద వృక్షం ఉంది. బానిసత్వం నుంచి విముక్తి చెంది ఆఫ్రికన్లు తెచ్చుకున్న స్వాతంత్య్రానికి గుర్తు ఇది. ఈ దేశంలో ఖనిజసంపదలు ఎక్కువ. ముఖ్యంగా వజ్రాల గనులు చాలానే ఉన్నాయి. ప్రపంచంలో వజ్రాలు అత్యధికంగా ఉత్పత్తి చేసే పది దేశాల్లో ఇదీ ఒకటి. భిన్న సంస్కృతులు, ఫ్యాషన్లకు నిలయమిది. అందుకే ‘ది లిటిల్ జ్యువెల్’ అని పిలుస్తారు. ఆఫ్రికా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ రకాల జాతుల ప్రజలు దాదాపు 2500 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఇక్కడ నివాసాలు ఏర్పర్చుకున్నారని చెబుతుంటారు. క్రీస్తు శకం 1000వ సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నారిక్కడ. ఈ దేశం 1961 ఏప్రిల్ 27న బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. సియారా లియోన్ అనేది ‘సెర్రా లియో’ అనే పోర్చుగీస్ పదం నుంచి వచ్చింది. దీనర్థం ‘లయన్ మౌంటెన్ రేంజ్’. బ్రిటన్ అధీనంలోనే ఇక్కడ ‘ది సియారా లియోన్ పోలీసు వ్యవస్థ 1894లో ఏర్పాటైంది. దక్షిణ ఆఫ్రికాలోని ప్రాచీన పోలీసు దళాల్లో ఇదీ ఒకటి. వజ్రాలతోపాటు కొబ్బరి, కాఫీని ఎక్కువగా ఎగుమతి చేస్తుందీ దేశం. రకరకాల వ్యాధులు ఈ దేశాన్ని దడపుట్టిస్తుంటాయి. రేబీస్, డెంగ్యూ, మలేరియా, ఎల్లో ఫీవర్, టైఫాయిడ్.. లాంటివి. ఆ మధ్య అందర్నీ భయపెట్టిన ఎబోలా వైరస్ వల్ల ఇక్కడ 2014లో పదహారు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. . ఈ దేశం ముస్లిం దేశం. మొత్తం జనాభాలో 60 శాతం మంది ముస్లింలు, 10 శాతం క్రైస్తవులు, మిగతా 30 శాతం మంది స్థానిక తెగల ప్రజలున్నారు. . ప్రజల ప్రధాన ఆహారం బియ్యం. దీంతో రకరకాల పద్ధతుల్లో పదార్థాల్ని తయారుచేసుకుంటారు. ప్రజల ప్రధాన ఆహారం బియ్యం. దీంతో రకరకాల పద్ధతుల్లో పదార్థాల్ని తయారుచేసుకుంటారు ఇక్కడ ప్రధాన సందర్శక ప్రాంతాలు బీచ్‌లు, పర్వతాలు, ద్వీపాలు, సంరక్షణ కేంద్రాలు. ఏటా లక్ష మందికిపైగా పర్యాటకులు వస్తుంటారు. ఈ దేశంలో జెయింట్ స్నెయిల్స్ని చూడొచ్చు. ఏడు అంగుళాల పొడవు, మూడున్నర అంగుళాల వెడల్పుతో ఉంటాయీ పెద్ద నత్తలు.
Somalia
Capital Mogadishu ………. Language Somali/Arabic ………. Currency Somali shilling ………. Calling Code + 252 ………. Religion Muslim
సోమాలియా
ఆఫ్రికా ఖండంలో వెనుకబడిన చిన్నదేశం సోమాలియా. పడమరన ఇధోపియా, వాయువ్యంలో డిజిబౌట్, నైరుతిలో కెన్యా, మిగిలిన వైపుల హిందూ మహాసముద్రం ఈ దేశానికి సరిహద్దులు . 1960 సంవత్సరంలో బ్రిటన్, ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్వం పొందింది. సోమాలియా రాజధాని మొగాదిషు. ఈ దేశ కరెన్సీ సోమాలి షిల్లింగ్. సోమాలి, అరబిక్ భాషలు మాట్లాడతారు. ఈ దేశం ప్రపంచంలొనే అతి బీద దేశం వ్యవసాయం ఇక్కడి ప్రజలకు ముఖ్య జీవనాధారం. మొక్కజొన్న, అరటి పండిస్తారు. ఇక్కడ ప్రధాన నదులు షిబెల్లే మరియు జుబే. కానీ ఈ దేశంలో బీదరికం ఎక్కువ కావటంతో ఆకలి చావులు కూడా ఎక్కువే. అక్షరాస్యత కూడా తక్కువే. దీనితో ఈ దేశంలోని చాలా మంది పౌరులు సముద్రపు దొంగలుగా మారారు. ఈ మార్గంలో ప్రయాణించే ఓడలను దోచుకుంటూ లేక ఓడలను స్వాధీనం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. మనం తరచుగా పత్రికలలో ఈ వార్తలను చూస్తుంటాము వీరి డబ్బు విలువ కూడా చాలా తక్కువ. మన రూపాయకి 11 సోమాలి షిల్లింగ్ లు వస్తాయి. రవాణా, పాలు, మాంసానికి ఎక్కువగా ఒంటెలపైనే ఆధారపడతారు. ఇక్కడ అతి ఎత్తైన పర్వత ప్రాంతం షింభిరిస్, ఇది సముద్ర మట్టానికి 2,416 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉండే లమాదయా జలపాతం అచ్చం పిల్లలు జారే జారుడు బల్లలాగే ఉంటుంది. సోమాలియాలో సముద్రతీరం ఎక్కువ. బీచ్ లు కూడా ఎక్కువే. కానీ విదేశీ పర్యాటకులు ఇక్కడకు రావటానికి భయపడతారు. ఎందుకంటే బీదరికం కారణంగా దోపిడీలు, నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి.
South Africa
Capital Pretoria (executive) ………. Language 11 languages ………. Currency South African rand ………. Calling Code + 27 ………. Religion Christian
South Sudan
Capital Juba ………. Language English ………. Currency South Sudanese pound ………. Calling Code + 211 ………. Religion Christian/Muslim
సౌత్ సూడాన్…
సౌత్ సూడాన్ మధ్య ఆఫ్రికాలో ఉన్న స్వతంత్ర దేశం. 2011, జులై 9 వ తేదీన ఈ దేశం సుడాన్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. కెన్వా, ఉగాండా, సెంట్రల్ ఆఫ్రికా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో సరిహద్దులు కలవు. ప్రపంచంలోని బీద దేశాలలో ఈ దేశం కూడా ఒకటి. ఇంగ్లీష్ వీరి భాష. ఈ దేశ రాజధాని జూబా. 6,19,745 చ.కి.మీ. ఈ దేశ వైశాల్యం. వీరి కరెన్సీ సూడనీస్ పౌండ్. ఈ దేశం క్రిస్టియన్ మతానికి చెందినది. ఏనుగులు, సింహాలు, కోతులు, చింపాంజీలు, జిరాఫీలు ఈ దేశంలో పరిరక్షించబడుతున్నాయి. జొన్న ఇక్కడి ప్రధాన వ్యవసాయ పంట. తరువాత మొక్కజొన్న, రైస్, చిరు ధాన్యాలు, కర్రపెండలం పండిస్తారు. వేరుసెనగ వాణిజ్య పంట.
Sudan
Capital Khartoum ………. Language Arabic/English ………. Currency Sudanese pound ………. Calling Code + 249 ………. Religion Islam
సూడాన్…
ఆఫ్రికాలోని ఈశాన్య ప్రాంతంలోని స్వతంత్రదేశం సూడాన్. క్రీ.పూర్యం 1500 సం.లో కుష్ నాగరికత వర్ధిల్లిన ప్రాంతం. 19వ శతాబ్ధంలో బ్రీటీష్ వారి పాలనలో ఉన్నది. 1895 సం.లో స్వాంతంత్ర్యం సాధించుకుంది. ఈ దేశానికి ఉత్తరదిశలో ఈజిప్ట్, దక్షిణ దిశలో జెయిరీ, ఉగాండా పశ్చిమాన సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, చాద్, లిబియా, తూర్పున ఇధోపియా, రెడ్ సీ ఉన్నాయి. ఆఫ్రికా ఖంఢంలో మరియు అరబ్ దేశాలలో పెద్ద దేశం ఈ దేశ వైశాల్యం25,03,890 చ.కి.మీ. దేశ రాజధాని ఖార్దూమ్ నగరం. వీరి అధికార భాష అరబ్బీ మరియు ఇంగ్లీష్. వీరి కరెన్సీ సూడానీస్ పౌండ్లు. ఈ దేశం సున్నీ తెగకు చెందిన ఇస్లాం దేశం. తరువాత క్రైస్తవులు 7 శాతం మంది ఉన్నారు. ప్రజలు నదులు, నీరు ఉన్న చోట నివసించటానికే ఇష్టపడతారు. ఉత్తరంలో లిబియా ఎడారి, సహారా ఎడారులున్నాయి. వైట్ నైల్ నది, ఆల్ అరబ్ నది, నాసర్ సరస్సులు సూడాన్ దక్షిణ భాగంలో ఉన్నాయి. గోధుమ, చిరుధాన్యాలు, మొక్కజొన్న, పుచ్చకాయలు, కర్రపెండలం, పెండలం, నువ్యులు, వేరుసెనగ, వరి, చెరకు, పొగాకు, జొన్నలు పండిస్తారు. జొన్న సూడాన్ ముఖ్య ఆహారపు పంట. మిర్చి, పొడుగుపింజ ప్రత్తి వ్యవసాయ ఉత్పత్తులు. జిగురు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. పశుపోషణ ప్రజలకు జీవనాధారం. బంగారం, క్రోమైట్, ఇనుపరాయి, మాంగనీస్, మాగ్నైసైట్, రాగి, పెట్రలోల్ ఖనిజ నిక్షేపాలు. పంచదార, సిమెంట్, జవుళీ, పాదరక్షల పరిశ్రమలు ఉన్నాయి.
Swaziland
Capital Mbabane ………. Language Swaji/English ………. Currency South African rand Swazi lilangeni ………. Calling Code + 268 ………. Religion Christian
స్వాజిల్యాండ్…
మూడు వైపులా దక్షిణ ఆఫ్రికా సరిహద్దులుగా ఉన్న స్వాజిల్యాండ్ రాజవంశీయుల పాలనలో ఉంది. నాలుగో వైపు తూర్పున మొజాంబిక్ దేశం కలదు. బ్రీటీష్ రక్షణలో ఉన్న ఈ దేశం 1968 సం.లో స్వాతంత్రం సాధించుకుంది. ఈ దేశ విస్తీర్ణం 17,364 చ.కి.మీ. రాజధాని నగరం మ్బామేనే. వీరి అధికార భాష స్వాజీ మరియు ఇంగ్లీష్. వీరి కరెన్సీ South African Rand Swazi lilangen. ఈ దేశం క్రైస్తవ మతానికి చెందినది. అత్యధికులు క్రైస్తవ మతస్తులు. మిగిలిన వారు ఆదిమ జాతుల వారుHIV/AIDS ఈ దేశానికి ప్రధాన సమస్య. ఈ దేశంలో ప్రాధమిక విద్య ఉచితం. కానీ తప్పనిసరి కాదు. Incwala అనే సాంస్కృతిక ఉత్సవం ఈ దేశస్తులు జరుపుకునే ముఖ్యమైన పండగ. రాజుగారి గౌరవార్ధం మరియు పంటలు దిగుబడి వచ్చిన సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారు. చెరకు ప్రధానమైన పంట. మొక్కజొన్న, నారింజ జాతులు, కందమూలాలు, అపరాలు, ప్రత్తి పంటలను పండిస్తారు. కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు పెంచుతారు.కలప లభిస్తుంది. . విలువైన వజ్రాలు. ఆస్బెస్టాస్ ఖనిజాలు లభిస్తాయి. ఇనుపరాయి ఎగుమతి చేస్తారు. కాగితం, రసాయినిక ద్రవ్యాలు, ఆహార పానీయాలు, కర్ర సామాగ్రి, ధాతు సామాగ్రి, జవుళీ మొదలగు పరిశ్రమలు ఉన్నాయి.
Tanzania
Capital Dodoma ………. Language None de jure ………. Currency Tanzanian shilling ………. Calling Code + 255 ………. Religion Christian/Muslim
టాంజానియా
ఆఫ్రికా ఖండంలో తూర్పువైపున ఉన్న దేశం టాంజానియా. కెన్యా, ఉగాండా, రువాండా, బురుండి, కాంగో, జాంబియా, మలావి, మొజాంబిక్, హిందూ మహా సముద్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది. టాంజానియా రాజధాని డొడోమా. విస్తీర్ణం 9,45,087 చదరపు కిలోమీటర్లు కరెన్సీ టాంజానియన్ షిల్లింగ్ అధికారిక భాష స్వాహిలి. అయితే ఇంగ్లిష్ కూడా ఎక్కువగా మాట్లాడతారు. 120కి పైగా ఆఫ్రికా తెగల వారు ఈ ఒక్కదేశంలోనే ఉంటారు. . మూడొంతుల్లో ఒకవంతు క్రైస్తవ, మరో వంతు ముస్లిం మతస్థులు ఉన్నారు. మిగిలిన ఒక్కశాతంలో ఆఫ్రికన్ వారూ ఉన్నారు. సాధారణంగా చాలా దేశాల్లో నగరాల్లోనే జనాభా ఎక్కువగా ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం 90శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తారు. ఇక్కడి తీర ప్రాంత పట్టణం జంజిబర్ తూర్పు ఆసియా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. పూర్వం అరబ్బులు, పోర్చుగీసు వ్యాపారులు ఇక్కడి వారిని బానిసలుగా చేసుకుని వ్యాపారాలు చేసుకునేవారు. 1890 నుంచి బ్రిటన్ వాళ్లు జంజిబర్ని ఆక్రమించి పాలించడం మొదలుపెట్టారు. ఇప్పుడు టాంజానియాలోని ప్రధాన భూభాగమైన టంగాన్యికా జర్మనీ అధీనంలో ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం పూర్తయిన తర్వాత 1964లో ఈ రెండు ప్రాంతాలు కలిసి స్వతంత్ర టాంజానియాగా ఏర్పడ్డాయి. ఇక్కడ 30 శాతం భూమిలో జాతీయ12 పార్కులు , 38 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కలవు. రకరకాల అడవి మృగాలు ఇక్కడ దాదాపుగా నలభై లక్షలకు పైగా ఉన్నాయి. చదరపు కిలోమీటరుకు అత్యధిక సంఖ్యలో మృగాలున్న దేశాల్లో ఇది మొదటిది. ఎక్కువ సంఖ్యలో ఏనుగులున్న దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడి రువాహ్ నేషనల్ పార్కులో వీటి సంఖ్య అత్యధికం. ప్రపంచంలోనే అతి పెద్ద పీతల జాతైన కోకోనట్ క్రాబ్లు ఈ దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. టాంజానీయాలో లోని రెండు ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన పర్యాటక ప్రాంతాలు. అవి ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారో మరియు Serengeti లాంటి జాతీయ పార్కులు. మనం క్రికెట్ అంటే ఎక్కువగా ఇష్టపడినట్లు వీరంతా ఫుట్‌బాల్, బాక్సింగ్, రగ్బీలను ఇష్టపడతారు. వర్షాకాలం మొదలుకాగానే ఇక్కడి నుంచి 20 లక్షలకుపైగా వన్యమృగాలు కెన్యాకు వలస వెళతాయి. దీన్నే ‘ది గ్రేట్ మైగ్రేషన్’ అంటారు. చిరుతలు చెట్లెక్కడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడి లేక్ మన్యారా నేషనల్ పార్కులో చెట్లెక్కే సింహాల జాతి ఉంది. ఇలాంటివి ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఇవి పైకెక్కడమే కాదు అచ్చం కోతుల్లా అక్కడే నిద్రిస్తాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కలపగా చెప్పుకునే మ్యాపింగో చెట్టు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని సంగీత వాయిద్యాల తయారీలో ఎక్కువగా వాడతారు. అందుకే ‘మ్యూజిక్ ట్రీ ఆఫ్ ఆఫ్రికా’గా పిలుస్తారు. ఈ ఖండంలో ఎక్కువ సరస్సులు ఉన్నది కూడా ఈ దేశంలోనే . వాటిల్లో లేక్ విక్టోరియా, లేక్ తాగన్యికా, లేక్ నైసా ప్రధానమైనవి. ప్రపంచంలోనే అతి పొడవైన నైలు నది ఈ దేశంగుండా ప్రవహిస్తుంది. ఈ ఖండంలో దక్షిణాఫ్రికా, ఘనాల తర్వాత అధికంగా బంగారం ఉత్పత్తి చేసే మూడో దేశమిది. ప్రపంచంలోనే అతి పెద్ద అగ్ని పర్వత బిలం ఇక్కడ ఉంది. 19కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉండే నగోరొంగోరో అగ్నిపర్వత బిలం 600 మీటర్ల లోతు ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారో ఉన్నదిక్కడే. శిఖరం వరకూ ఇది 19,441 అడుగుల ఎత్తుంటుంది. ఇది 5,510కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. దీని చుట్టూ చాలా రకాల నేలలు కనిపిస్తాయి. ఓవైపు పంటలు పండే భూమి, మరోవైపు వర్షాధార అడవులు, ఇంకోవైపు ఆల్ఫన్ ఎడారి. ఈ దేశంలో అత్యంత ఎత్తయిన ప్రాంతం కూడా దీని శిఖరమే.
Togo
Capital Lomé ………. Language French ………. Currency West African CFA francWest African CFA franc ………. Calling Code + 228 ………. Religion Christian పశ్చిమ ఆఫ్రికాలోని చిన్న దేశం టోగో. ‘టోగో’ అంటే ఎవ్ భాషలో ‘నీటి మీద ఉన్న ఇల్లు’ అని అర్థం. ఈ దేశానికి పశ్చిమాన ఘనా, తూర్పులో బెనిన్, ఉత్తరాన బర్కిన ఫాసో దేశాలు ఉన్నాయి. అధికార భాష ఫ్రెంచ్‌తో పాటు ఎవ్, మిన, డగోంబ… మొదలైన ఆఫ్రికన్ భాషలు కూడా దేశంలో మాట్లాడతారు. ఈ దేశ వైశాల్యం 56,785 sq km. వీరి అధికార భాష ఫ్రెంచ్. క్రిస్టియన్స్ మరియు మస్లింలు ఎక్కువగా ఉన్నారు. దేశీయమైన తెగలు వారు కూడా ఉన్నారు. వీరి కరెన్సీ CFA (Communaute Financiere Africaine) franc. పదకొండు, పదహారవ శతాబ్దాల మధ్యలో రకరకాల తెగల ప్రజలు టోగో భూభాగంలోకి ప్రవేశించారు. 18వ శతాబ్దంలో బానిసల కొనుగోలు వ్యాపారానికి టోగో అతి పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. 1884లో టోగోల్యాండ్ను తన అధీనంలోకి తెచ్చుకుంది జర్మనీ. ఎన్నో తెగల ప్రజలు నివసించే టోగోలో జనాభా పరంగా ‘ఎవ్’ తెగ ఆధిక్యత ఎక్కువ. దేశంలో 70 శాతం మందికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. జర్మనీ అధీనంలో ఉన్న టోగోల్యాండ్ ను ఫ్రెంచ్, బ్రిటిష్ దళాలు 1914లో ఆక్రమించుకున్నాయి. మూడింట ఒక వంతు బ్రిటిష్ వారి అధీనంలో, రెండు వంతులు ఫ్రాన్సు అధీనంలో ఉండిపోయింది టోగోల్యాండ్. ఫ్రాన్సు నుంచి 1960లో స్వాతంత్య్రం పొందింది టోగోల్యాండ్. పరిపాలన పరంగా టోగోను 5 విభాగాలుగా విభజించారు. అవి 1. సవనెస్ 2. కర 3. సెంట్రల్ 4. ప్లెటక్స్ 5. మారిటైమ్. ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన టోగోల్యాండ్కు తొలి అధ్యక్షుడు సిల్వెనస్ ఒలింపియో. 1963లో జరిగిన సైనిక తిరుగుబాటులో సిల్వెనస్ హత్యకు గురయ్యాడు. సాయుధ దళాల నాయకుడిగా గాసింబే అధికారాన్ని హస్తగతం చేసుకోవడంతో దేశంలో నియంతృత్వ పాలన మొదలైంది. రాజకీయ పార్టీలన్నీ నిషేధించబడ్డాయి. మూడు దశాబ్దాలకు పైగా తన నియంతృత్వంతో టోగోను పాలించాడు గాసింబే. ఈ నియంత మరణించిన తరువాత కొడుకు ఫారే గాసింబే దేశ అధ్యక్ష పదవిని చేపట్టాడు. రాజకీయ పార్టీల మీద ఉన్న నిషేధాన్ని తొలగించడం, ప్రజాస్వామ్య అనుకూల రాజ్యాంగాన్ని ఆమోదించడంలాంటి చర్యలు చేపట్టినా… దేశంలో నియంతృత్వం మాత్రం పోలేదు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో టోగో నియంతృత్వ పాలకులపై అంతర్జాతీయంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీలతో టోగోకు బలమైన చారిత్రక, సాంస్కృతిక బంధాలు ఉన్నాయి. సాంస్కృతిక, చారిత్రక విలువల మాట ఎలా ఉన్నా… రాజకీయ అశాంతి కారణంగా అభివృద్ధికి దూరంగా జరిగి… ఆఫ్రికాలోని ఒక పేదదేశంగా మాత్రమే ఉండిపోయింది టోగో. టోగోలో ఎన్నో చిన్న సరస్సులు ఉన్నాయి. వీటిలో పెద్ద సరస్సు పేరు టోగో. జాతీయ జెండాలోని పచ్చటి భాగాలు ఆశ, వ్యవసాయానికి సూచికలు. ఫ్రెంచ్ అధీనంలోని ‘టోగోల్యాండ్’ 1960లో ‘టోగో’గా మారింది. దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రధాన ఉత్పత్తులు ఫాస్ఫేట్, కోకో, పత్తి. రాజధాని లోమ్లో పెద్ద వూడూ మార్కెట్ ఉంది. ఫాస్ఫేట్ ఉత్పత్తిలో టోగో ప్రపంచంలో నాలుగవ స్థానంలో ఉంది. దేశంలో ప్రసిద్ధ ఆట ఫుట్‌బాల్. యునెటైడ్ నేషన్స్, ఆఫ్రికన్ యూనియన్. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికా… మొదలైన వాటిలో టోగోకు సభ్యత్వం ఉంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఇతర దేశాలతో పోల్చితే టోగో పర్యాటకరంగంలో ముందంజలో ఉంది.
Tunisia
Capital Tunis ………. Language Arabic ………. Currency Tunisian dinar ………. Calling Code + 216 ………. Religion Muslims
టూనీజియా
టూనీజియా… ఉత్తర ఆఫ్రికా లోని ఒక చిన్న దేశం. అల్గేరియా, లిబియా దేశాలు, మధ్యధరా సముద్రం దీనికి సరిహద్దులు. ఫ్రాన్స్ నుంచి మార్చి 20, 1956లో ఈ దేశం స్వాతంత్య్రం పొందింది. టూనీజియా రాజధాని టూనీస్ దేశ విస్తీర్ణం 1,63,610 చ. కిలోమీటర్లు. వీరి అధికార భాష అరబిక్. ప్రజలు ఫ్రెంచ్ భాష కూడా మాట్లాడుతారు. కరెన్సీ టూనీజియన్ దినార్. ఒక టూనీజియన్ దినార్ మన కరెన్సీలో దాదాపు 27 రూపాయలకు(2018) సమానం.ఈ దేశం ముస్లిం మతానికి చెందినది. ఈ దేశంలో ముస్లిం జనాభా ఎక్కువ. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి సహారా ఈ దేశంలోనూ కొంత భాగం విస్తరించి ఉంటుంది. పెట్రోలియం, గనులు, పర్యాటకం, వస్త్ర, పాదరక్షల పరిశ్రమలు అధికం. వేడి, పొడి వాతావరణం ఉంటుందిక్కడ. ఇక్కడ మత్మాతా అనే ప్రాంతంలో ప్రజలు ఇప్పటికీ భూగర్భ ఇళ్లలో నివసిస్తున్నారు. వేడి, బలమైన ఎడారి గాలుల్నించి తప్పించుకోవడం కోసమే గుహల్లాంటి ఈ భూగర్భ ఇళ్లని నిర్మించుకున్నారట. ఈ ఇళ్లు 23 అడుగుల లోతు, 33 అడుగుల వెడల్పుతో ఉంటాయి. ప్రపంచం మొత్తంలో గుహల్లో నివసించే ట్రాగ్లోడైట్స్ జాతి ప్రజలు అత్యధికంగా ఉండేది ఇక్కడే. ఈ దేశం పర్యాటక దేశం కూడా. అందమైన సముద్ర తీరాలు పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. ఇక్కడి అడవుల్లో జంతువులు ఎక్కువ. పులులు, సింహాలు, చిరుతపులులు, హైనాలు, జింకలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. స్టార్ వార్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ సినిమాల షూటింగ్‌లకు పెట్టింది పేరిది సిది బో సైద్ అనే పట్ణణం మంచి సందర్శక ప్రాంతం. ఇక్కడ కట్టడాలన్నీ నీలం, తెలుపు రంగులతో ఉంటాయి. ఈ దేశంలో ఓ మంచి ఆకర్షణ ‘రోజ్ ఆఫ్ ది సహారా డిజర్ట్’ అనే పువ్వు. ఉప్పు, ఇసుకతో ఎడారిలో తయారవుతుంది. అక్వేరియాల్లో అలంకరణ కోసం ఉపయోగిస్తారు దీన్ని. ఇక్కడి జాతీయ వంటకం ‘కాస్కాస్’. దీన్ని మాంసం, కూరగాయలతో చేస్తారు. టమాటా, షుగర్ బీట్, బాదం, ఆలివ్‌లు, ఖర్జూర పండ్లు ఎక్కువగా పండుతాయి.
Uganda
Capital Kampala ………. Language English/Swahili ………. Currency Ugandan shilling ………. Calling Code + 256 ………. Religion Christian
ఉగాండా
ఉగాండా అనే పేరు బుగాండా రాజ్యం పేరు మీదుగా వచ్చింది. 1962లో బ్రిటిష్ పరిపాలన నుంచి స్వాతంత్య్రం పొందింది. ఉగాండా… తూర్పు ఆఫ్రికాలోని ఓ దేశం. ఉత్తరాన దక్షిణ సూడాన్, తూర్పున కెన్యా, దక్షిణాన టాంజానియా, పశ్చిమాన కాంగో దేశాలు దీనికి సరిహద్దులు. ఉగాండాను ‘ఆఫ్రికా ముత్యం’ అనే ముద్దు పేరుతో పిలుస్తారు. చుట్టూ భూభాగాలతో ఉన్న దేశాల్లో ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. ప్రజలు నీగ్రో వర్గానికి చెందినవారు. ఇక్కడ స్థానికంగా మాట్లాడే భాషల సంఖ్య 30 కన్నా ఎక్కువ. వీరి అధికార భాషలు ఇంగ్లీష్ మరియు స్వాహేలి. ఈ దేశంలో క్రిస్టియన్లు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ దేశ కరెన్సీ ఉగాండా షిల్లింగ్స్. దేశ రాజధాని కంపాలా. ఈ దేశ వైశాల్యం 241,038 sq km. యువజనాభా ఎక్కువున్న దేశాల్లో ఇదొకటి. జనాభా మొత్తంలో 70 శాతం మంది 25 సంవత్సరాల లోపున్నవారే. (2018) ఈ దేశ జెండాలోని నలుపు, పసుపు, ఎరుపు రంగులు ఉగాండా ప్రజలకూ, సూర్యకాంతికీ, ప్రజల మధ్య ఉండే సోదరభావానికీ సూచికలు. ఈ దేశంలో ఎక్కడపడితే అక్కడ నడవడానికి వీలు ఉండదు. కొన్ని ప్రదేశాల్లో నడకకు అనుమతించరు. చాలా వూళ్లలో ప్రయాణికుల కోసం ‘బోడా బోడా’ అనే మోటార్ సైకిల్ టాక్సీలు ఉంటాయి. ఇవి అత్యంత వేగంగా దూసుకెళుతూ కొత్త వారిని చాలా భయపెట్టేలా ఉంటాయి. ప్రపంచంలో అతి పొడవైన నైలు నది పుట్టింది ఈ దేశంలోనే. గొరిల్లాలకు ఈ దేశం పేరు పొందినది. ప్రపంచం మొత్తంలో ఉన్న 880 మౌంటెన్ గొరిల్లాల్లో సగం ఈ దేశంలోనే ఉన్నాయి. ఉగండాలో జలవనరులు ఎక్కువ. వర్షం పుష్కలంగా కురుస్తుంది. వైట్ నైల్ నది, విక్టోరియయా సరస్సు,, ఆల్ బర్ట్ సరస్సు నీటివనరులు. ఉగాండా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. కర్రపెండలం, మొక్కజొన్న, జొనన, వరుశెనగ, కు, గగాకు, కాఫీ, అరటి, ప్రత్తి, బంగాళా దుంపలు, తేయాకు మొదలగునవి ఇక్కడ పండిస్తారు. పశుపోషణ కూడా ఎక్కువ. ఈ దేశ ప్రజలు చెట్లను ఎక్కువగా ఇష్టపడతారు. చెట్లను నరికివేస్తే, తప్పకుండా మూడు మొక్కలు నాటాల్సిందే. రకరకాల అరటిపండ్లు పండుతాయి. అనాస పండ్లకు ఈ దేశం ప్రసిద్ధి. ఉగాండా మంచి పర్యాటక ప్రాంతం కూడా. ఏటా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య పది లక్షలకుపైనే. ఇక్కడ ఆడవాళ్లు పొట్టి దుస్తులను వేసుకోవడం తప్పుగా భావిస్తారు. తీవ్రమైన ప్రయత్నాల వలన HIV/AIDS నుండి విజయం పొందిన దేశం ఉగాండా.
Zambia
Capital Lusaka ………. Language English ………. Currency Zambian kwacha ………. Calling Code + 260 ………. Religion Christian
జాంబియా
Zambia…..జాంబియా… దక్షిణ ఆఫ్రికాలోని చిన్న దేశం.భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే దేశం. ఉత్తరం వైపున కాంగో, టాంజానియా, తూర్పున మలవి, మొజాంబిక్, జింబాబ్వే, బోట్స్ వానా, దక్షిణాన నమీబియా, పడమర అంగోలా దేశాలు కలిగి ఉన్నది.. జాంబేజీ నది ఈ దేశం గుండా ప్రవహించటం వలన ఈ దేశానికి జాంబియా అనే పేరు వచ్చింది. ఈ నది మీద నిర్మించిన కరీబా డాం ప్రపంచంలోని పెద్ద డాంలలో ఒకటి. ఇక్కడ జల విద్యుత్ కుడా ఉత్పత్తి జరుగుతుంది. కరీబా డాం జాంబియా, జింబాబ్వే ఉమ్మడి నిర్వహణలో ఉంది. రెండుదేశాలకు పంటనీటిని అందిస్తుంది. కాంగో నది, కపూయీ నది, లౌపులా నది మేట్వారు సరస్స ప్రధాన జలవనరులను అందిస్తాయి. 1964 కి ముందు ఈ దేశాన్ని ఉత్తర రొడేషియా అని పిలిచేవారు. 1964లో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. జాంబియా రాజధాని లుసాకా…వీరి భాష ఆంగ్లం. కరెన్సీ…జాంబియన్ క్వాచా. స్థానిక భాషలు… బెంబ, . నియాంజ, లోజి, బోంగా, లుండా, లువలే, కవొండే అనేవి. ఈ దేశం క్రిస్టియన్ దేశం. క్రిస్టయన్ల తరువాత కొద్దిగా ముస్లింలు, హిందువులు, స్థానిక మతాల వారు ఉన్నారు. ఈ దేశ వైశాల్యం 752,614 sq kmజ. ప్రజలలో 70 శాతం మంది ఆదిమ తెగలకు చెందిన నీగ్రోలు. వీరు ఎనిమిది మాండలిక భాషలను మాట్లాడుతారు. జాంబియా విస్తీర్ణం7,52,614 చ.కి.మీ. జాంబియా ప్రకృతి వింతలకు పేరు. వందలాది నదులు, అందమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందిన దేశం. ఈ దేశంలో వేటాడటం… చెట్లను నరకటం నిషిద్ధం. ఈ దేశంలో ఇనుము, రాగి గనులు ఎక్కువ. ఈ దేశంలో ఎక్కువమంది జనం పట్టణ ప్రాంతాలలోనే నివసిస్తారు. అడవి జంతువులు ఎక్కువ… ఏనుగులు, చిరుతలు, అడవి దున్నలు, ఖడ్గమృగాలు, జిరాఫీలు, హైనాలు, జీబ్రాలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. ప్రపంచంలతోనే అతి పెద్ద జలపాతంగా పేరుపొందిన విక్టోరియా జలపాతం ‘విక్టోరియా ఫాల్స్’ ఈ దేశంలోనే ఉంది. ఈ జలపాతం వెడల్పు 5,600 అడుగులు. రాగి ఖనిజం పుష్కలంగా లభించడం చేత ఈ దేశం సుసంపన్నమైంది. పొగాకు, ప్రత్తి, మొక్కజొన్న, కర్రపెండలం, వేరుసెనగ, చిరుధాన్యాలు, చెరకు మొదలగు పంటలు పండిస్తారు. రాగి, సీసం, జింకు గనులున్నాయి. మాంగనీసు, కోబాల్టు, యురేనియం నిక్షేపాలు కూడా కలవు. కరీబా సరస్సు ప్రాంతంలో నేలబొగ్గు గనులు కలవు. కపూయీ జాతీయ పార్క్ మంచి పర్యాటక ప్రాంతం.
Zimbabwe
Capital Harare ………. Language 16 languages ………. Currency United States dollar ………. Calling Code + 263 ………. Religion Christian
జింబాబ్వే…
ఈ దేశం 1980 సంవత్సరంలో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. 2000 సంవత్సరం వరకు ఈ దేశం కరవుతో బాధపడింది. ఈ దేశ ప్రజలు కూడా ఆహారం లేక బాధపడ్డారు. ఈ దేశ రాజధాని హరారే. దేశ వైశాల్యం 3,90,580 చ.కి.మీ. వీరి కరెన్సీ జింబాబ్వేనియన్ డాలర్. వీరి అధికార భాష ఇంగ్లీష్. Shona, Sindebele (the language of the Ndebele ఇతర భాషలు. ఈ దేశం క్రిస్టియన్ దేశం. . మొక్కజొన్న, పత్తి, పొగాకు, గోధుమలు, కాఫీ, చెరకు, వేరుసెనగ వ్యవసాయ ఉత్పత్తులు. మేకలు, గొర్రెలు, పందులు పెంచుకుంటారు. . బొగ్గు, క్రోమియం, బంగారం, నికెల్, రాగి, ఇనుప ఖనిజం, ప్లాటినం సహజ సంపదలు.
Capital Kabul ………. Language - Pastho-dari ………. Currency - Afgani ……….
Calling code + 93 ………. Religion Islam
అఫ్గానిస్థాన్....
ఆసియా ఖండం మధ్యలో ఉన్న స్వతంత్ర దేశం. ఈ దేశానికి చుట్టూ భూభాగాలే. ఇరాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, తజికిస్థాన్, చైనా దేశాలు దీనికి సరిహద్దులు. అఫ్గానిస్థాన్‌లో తీవ్రమైన అంతర్యుద్ధాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువ. .అఫ్గానిస్థాన్ విదేశీదాడులతోనూ దారుణంగా నష్టపోయిందీ. ఇప్పటికీ (2019) రాజకీయ కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. ఈ దేశస్థులు సంస్కృతికి ప్రాముఖ్యం ఇస్తారు. ఇక్కడ సాహిత్యానికి ప్రాధాన్యం ఉంటుంది. ఇసుక నేలలు ఎక్కువ. .ఇక్కడి ప్రజల్లో 99 శాతం మంది ఇస్లాం మతస్థులే. 1919లో ఆగస్టు 19న బ్రిటన్ నుంచి ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. .
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ . ఈ దేశ విస్తీర్ణం 6,52,864 చదరపు కిలోమీటర్లు వీరి భాషలు: పష్తూ, దారి (పర్షియన్) అఫ్గానిస్థాన్ కరెన్సీ అఫ్గానీ. ఈ దేశంలో 14 తెగలున్నాయి. తీవ్రంగా విద్యుత్తు కొరత ఉన్న దేశాల్లో ఇదీ ఒకటి. ఈ దేశంలో శుక్రవారం దుకాణాలకు, వ్యాపారాలకు సెలవు. .
అఫ్గానిస్థాన్ అంటే అఫ్గానుల ప్రదేశం అని అర్థమట. .
ఈ దేశ జాతీయ ఆట ‘బుజ్కెషి’. దీన్నే గోట్ గ్రాబింగ్ అని కూడా అంటారు. ఈ ఆట కాస్త ప్రమాదకరంగా ఉంటుంది. రెండు జట్లుగా ఉండే ఈ ఆటలో గుర్రపు సవారీ చేస్తూ మేకను పట్టుకోవాలి. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ ఆట ప్రాచుర్యంలో ఉంది. .
వాతావరణం : ఇక్కడ వేసవి కాలంలో చాలా వేడిగానూ... చలికాలంలో చాలా చల్లగానూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిన్న భూకంపాలు తరచూ వస్తుంటాయి. పర్యావరణ మార్పుల వల్ల గడిచిన 20 ఏళ్లలో ఎక్కువ మొత్తంలో అడవులు నశించాయి.
దేశంలో కొత్త సంవత్సరాన్ని‘నౌరోజ్’ అంటారు. మార్చి 21న చేసుకుంటారీ వేడుక. ఒక దగ్గర చేరి వేడుకలు చేసుకుంటారు. భారీ జెండాలను ఎగరవేస్తారు. .
ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడతారు. వరి, జొన్న, ప్రత్తి, సుగంధ ద్రవ్యాలు, గోధుమ, పుగాకు పండిస్తారు. సహజవాయువులు, చమురు ప్రధాన వనరులు. .
ఎక్కువగా పుచ్చకాయ, దానిమ్మ, ద్రాక్ష, ఖుబానీ (యాప్రికాట్) పండ్లను ఎగుమతి చేస్తుందీ దేశం. అఫ్గానిస్థాన్ రగ్గులకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అక్షరాస్యత మగ వారిలో 52 శాతం, ఆడవారిలో 24 శాతం ఉందీ దేశంలో. .
ఇక్కడి ‘బమియన్’ గుహలు ఎంతో ప్రాచీనమైనవి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఆయిల్ పెయింటింగ్స్‌కి నిలయమివి. ఈ పెయింటింగ్స్... క్రీస్తుపూర్వం 650 ఏళ్లనాటివి. ప్రపంచంలో అతిపెద్ద బుద్ధ విగ్రహాలు ఇక్కడే ఉండేవి. ఈ బమియన్ బుద్ధ విగ్రహాలను తాలిబాన్లు 2001లో ధ్వంసం చేశారు.
మంచు చిరుత, ఎగిరే ఎర్ర ఉడత వంటి ప్రత్యేకమైన జీవుల్ని ఈ దేశంలో చూడవచ్చు.
Armenia
Capital Yerevam ………. Language Armenian ………. Currency Dram ……….
Calling Code + 374 ………. Religion Christian
అర్మేనియా
అర్మేనియా పూర్తిపేరు రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా. రాజధాని యెరెవన్. అధికార భాష ఆర్మేనియన్ కరెన్సీ డ్రామ్. అక్షరాస్యత 99 శాతం. నాగరికత తొలి ఆనవాళ్లను కథలు కథలుగా చెప్పే దేశం. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తరువాత సొంత దారి వెదుక్కొని తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటున్న దేశం... ఆర్మేనియా అనే పేరుకు ఏ అర్థం ఉన్నా... ఆర్మేనియా అంటే ఆణిముత్యంలాంటి దేశం!
రాజధాని యెరెవన్లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఒపెరా హౌస్ ఉంది. ‘టూరిస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ’గా ఆర్మేనియాకు మంచి పేరు ఉంది.
ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అర్మేనియా జనాభా ప్రస్తుతం 30 (2019) లక్షలు కాగా, అందులో సగం నగరంలోనే నివసిస్తున్నారు. చిత్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో నివసించే అర్మేనియన్ల సంఖ్య 80 లక్షలు. ఆది నుంచీ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవడంతో ఈ దేశం నుంచి ప్రజలు దఫదఫాలుగా వలస వెళ్లిపోయారు.
బైబిలు ప్రకారం- జలప్రళయం సమయంలో నోవా అనే పెద్దాయన కొన్ని ప్రాణులను నౌకలో ఉంచి రక్షించగా, ఆ నౌక అరారత్ కొండల్ని చేరిందని అర్మేనియన్లు నమ్ముతారు. అలా అప్పటినుంచీ అక్కడ నివసిస్తోన్న అర్మేనియన్లు ఓ ప్రత్యేక సంతతిగా గుర్తింపు పొందారు. ఆ దేశంలో 97 శాతం మంది అర్మేనియన్లే. మిగిలిన కొద్దిశాతంలో కుర్దులూ, రష్యన్లూ, ఉక్రెయినీలు ఉన్నారు. అందుకే ఒకే తెగకు చెందిన దేశం ప్రపంచంలో ఇదొక్కటే.
అరారత్ పర్వతాల ఒడిలో ఉన్నట్లు ఉండే అర్మేనియా దేశానికి తీర ప్రాంతం లేదు. టర్కీ, జార్జియా, ఇరాన్, అజర్బైజాన్ దేశాల మధ్యలో ఉన్న ఈ దేశానికి అక్కడి పర్వత ప్రాంతాల్లో దొరికే రాగి, బంగారం, తగరం... వంటి ఖనిజాలే ప్రధాన ఆదాయ వనరులు. ఒకప్పుడు దేశంలో భాగంగా ఉండి, జాతీయ చిహ్నంగా ఉన్న అరారత్ పర్వతాలు ప్రస్తుతం టర్కీలో ఉన్నాయి. కానీ ఇప్పటికీ అర్మేనియన్లు వాటినే తమ జాతీయ చిహ్నంగా భావిస్తారు.
లేక్ సెవాన్
లేక్ సెవాన్ మంచినీటి సరస్సు. ఇది సముద్రమట్టానికి 6,250 అడుగుల ఎత్తులో ఉన్న రెండో అతిపెద్ద మంచినీటి సరస్సు. మొదటిది లాటిన్ అమెరికాలోని టిటికాకా సరస్సు. ఇది బొలీవియాలో ఉంది. యెరవాన్ నుంచి సెవాన్కి 80 కిలోమీటర్లు. దాదాపు రెండు గంటల ప్రయాణం. ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉండటంతో చల్లగా ఉంటుంది చలి, వర్షం, ఎండ... ఇలా వెంటవెంటనే వాతావరణం మారిపోతుంది. వేసవి జూన్ నుంచి సెప్టెంబర్. అప్పుడు కూడా ఉష్ణోగ్రతలు 22 - 36 డిగ్రీల సెల్సియస్‌కి మించవు.
గార్ని... ఓ పురాతన ఆలయం!
ఇది అర్మేనియా రాజుల వేసవి విడిది. అక్కడే క్రీ.పూ. నాటి అర్మేనియా దేవాలయం ఉంది. 2100 సంవత్సరాలనాటి ఆ నిర్మాణాన్ని చూడాలంటే మాత్రం 2 డాలర్ల రుసుము చెల్లించాలి. ఆ దేశంలో మిగిలిన ఏ సందర్శనీయ స్థలానికీ రుసుము లేదు, యునెస్కో గుర్తింపు ప్రదేశాలకు తప్ప. ఆలయం లోపల ఓ రాతిపీఠం మాత్రం ఉంది. ఈ నిర్మాణం చుట్టూ ఉండే 24 స్తంభాలు 24 గంటలని సూచిస్తాయట. ఆ దేశంలో గ్రీకు, రోమన్ శైలిలో నిర్మించిన ఏకైక నిర్మాణం ఇది. దొరికిన ఆధారాల ప్రకారం క్రీ.పూ. 77వ సంవత్సరంలో నిర్మించారనేది ఓ అంచనా. అయితే ఇది ఆలయం కాదనీ కేవలం సమాధి మాత్రమే అన్న మరో చారిత్రక వాదన ఉంది. దీనికి పక్కనే నేలమాళిగలో రోమన్ పవిత్ర స్నానానికి సంబంధించిన గదులు ఉన్నాయి. గెగార్డ్ చర్చి
ఇందులో మూడు వేర్వేరు చర్చిలు ఉన్నాయి. చిత్రంగా ఇవన్నీ ఒకే రాతిలో తొలిచిన నిర్మాణాలు. వెలుతురుకోసం వెంటిలేటర్లు నిర్మించబడ్డాయి. డ్రైనట్స్ని ఒకలాంటి హల్వాలో ముంచి తయారుచేసిన సుజుక్ అనే క్యాండీలని ఇక్కడ అమ్ముతారు. మంచి పోషకభరితమైన ఈ క్యాండీలని యుద్ధ సైనికులు వెంట తీసుకెళ్లేవారట
క్రీస్తు ప్రధాన శిష్యులైన దాడియస్, బొర్లోలోమేవ్ల ప్రభావంతో క్రీ.శ. 301 సంవత్సరంలోనే అర్మేనియన్లు క్రైస్తవమతాన్ని స్వీకరించారు. తద్వారా ప్రపంచంలోనే మొదటి అధికారిక క్రైస్తవ మత దేశంగా ఇది గుర్తింపు పొందింది.
Azerbaijan
Capital Baku ………. Language Azerbaijani ………. Currency Azerbaijan Dinar
Calling Code + 994 ………. Religion Islam
అజర్బైజాన్
అజర్బైజాన్ అధికార నామం ‘రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్’. రాజధాని ‘బకూ’. 95 శాతం మంది ముస్లింలు. అజర్‌బైజానీ భాషలో ఎన్నో మాండలికాలు ఉన్నాయి.
పాక్షికంగా తూర్పు యూరప్‌లోనూ, పశ్చిమ ఆసియాలోనూ ఉన్న దేశం అజర్బైజాన్. 1920లో సోవియెట్ యూనియన్‌లో విలీనమైన ఈ దేశం... సోవియెట్ పతనానికి ముందు 1991 ఆగస్ట్ 30న స్వతంత్రదేశంగా అవతరించింది. 95 శాతం ముస్లిం జనాభా ఉన్న అజర్బైజాన్... ఆర్థికాభివృద్ధి, అక్షరాస్యతలో ఉన్నత స్థానంలో ఉంది. ఆధునిక విశ్వవిద్యాలయాలు ఉన్న ముస్లిం దేశాల్లో దీనిది రెండో స్థానం.
పురాతన అశ్వజాతికి చెందిన కారాబాక్ గుర్రం వేగానికి, ఆవేశానికి, సౌందర్యానికి పేరుగాంచింది. ఇది అజర్బైజాన్ జాతీయ జంతువు.
అధికార భాష అయిన అజర్బైజానీతో పాటు 12 వరకు స్థానిక భాషలు ఈ దేశంలో మాట్లాడతారు. జీవవైవిధ్యంలో అజర్బైజాన్ ముందు వరుసలో ఉంది. 106 జాతుల జంతువులు, 97 జాతుల చేపలు, 363 జాతుల పక్షులు ఈ దేశంలో ఉన్నాయి. బోలెడన్ని పురాతన నదులు, సరస్సులు ఉన్నాయి. ‘కురా’ ‘ఆరిస్’ నదులు అన్నిటికంటే ముఖ్యమైనవి.
ఆయిల్, గ్యాస్, బంగారం, ఇనుము, టైటానియం, మాంగనీస్... మొదలైన నిధులు ఉన్న సుసంపన్నమైన దేశం అజర్బైజాన్. దేశంలో 54 శాతం వ్యవసాయ భూములే. వాటిలో చెరకు, పత్తి, పొగాకు మొదలైనవి పండిస్తారు. పాల సంబంధిత, మద్య ఉత్పత్తులు ఈ దేశ ప్రధాన ఉత్పత్తులు. విలువైన వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా స్వదేశంలోనే తయారుచేసుకునే ప్రయత్నాలు కూడా ప్రస్తుతం(2019) జరుగుతున్నాయి.
అజర్బైజాన్ 1991లో స్వతంత్రదేశంగా అవతరించిన తరువాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, ఇస్లామిక్ డెవెలప్మెంట్ బ్యాంక్, ఆసియన్ డెవెలప్మెంట్ బ్యాంకు మొదలైన వాటిలో సభ్యత్వం తీసుకుని ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సైనిక వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
ఒకప్పుడు అజర్బైజాన్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉండేది. సోవియెట్ యూనియన్ పతనం, ఆ తరువాత జరిగిన కొన్ని పరిణామాలతో పర్యాటక రంగం దెబ్బతిని ఆకర్షణ కోల్పోయింది. 2000 సంవత్సరం నుంచి మాత్రం పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. పర్యాటక ఆదాయం పెరిగింది. అందుకే పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. భౌగోళిక విశిష్టత, అసాధారణ ప్రకృతి సంపదకు తోడు కళ, చారిత్రక, సాంస్కృతిక సంపద కూడా ఈ అగ్నితేజ దేశానికి అరుదైన ఆభరణాలు
అజర్బైజాన్ రాజ్యాంగం ఏ మతాన్నీ ‘అధికార మతం’గా ప్రకటించలేదు. మాజీ ప్రపంచ చెస్ చాంపియన్ గ్యారీ కాస్పరోవ్ అజర్బైజాన్ రాజధాని ‘బకూ’లో జన్మించారు. చమురు నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల అజర్‌బైజాన్‌కు ‘ద ల్యాండ్ ఆఫ్ ఫైర్’ అని పేరు.
రాజధాని ‘బకూ’కు 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గొబుస్తాన్ నేషనల్ పార్క్’లో వందలాది రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. దేశంలో నూతన సంవత్సర వేడుకలను ‘నౌరోజ్’ పేరుతో జరుపుకుంటారు.
పరిపాలనా సౌలభ్యం కోసం అజర్‌బైజాన్‌ను పది ‘ఎకనామిక్ రీజన్’లుగా విభజించారు. ‘కురా’ అనేది అజర్బైజాన్లో పొడవైన నది. అజర్బైజాన్ ప్రజల ప్రీతిపాత్రమైన పానీయం ‘టీ’.
Bahrain
Capital Manama ………. Language Arabic ………. Currency Bahraini Dinar
Calling Code + 973 ………. Religion Islam
బహ్రేన్
33 చిన్న చిన్న దీవులతో ఉన్న బహ్రేన్ అరేబియా సింధుశాఖలో ఉన్నది. రాజవంశీయుల పాలనలో ఉంది. 1971 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. అనేక దీవుల సముదాయం బహ్రేన్. ఈ దీవులలో బహ్రేన్ పెద్దదీవి. ఈ దీవి పేరుతోనే ఈ దేశానికి బహ్రేన్ అనే పేరు వచ్చింది. బహ్రేన్ రాజధాని మనామా. వీరి అధికార భాష అరబ్బీ. విస్తీర్ణం 690 చ.కి.మీ. ప్రజలు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతారు. ప్రజలలో అరబ్బులు 68 శాతం, పర్షియన్, ఇండియన్, పాకీస్తానీయులు 25 శాతం మంది ఉన్నారు. ప్రజలలో 85 శాతం మంది ముస్లింలే.
అపారంగా ఉన్న పెట్రోలు నిక్షేపాల వలన చమురు ఎగుమతులతో ఈ దేశం సుసంపన్నంగా మారింది.
ఖర్జూరం, పండ్లు, కూరగాయలు, వ్యవసాయోత్పులు. పశుపోషణ, కోళ్ల పెంపకం కూడా ఉన్నాయి. ప్రజల జీవన ప్రమాణం చాలా ఎక్కువ.
Bangladesh
Capital Dhaka ………. Language Bengali ………. Currency Taka
Calling Code + 880 ………. Religion Islam
బంగ్లాదేశ్
బంగ్లాదేశ్... భారతదేశానికి పొరుగు దేశం. ఉత్తర, తూర్పు, పడమర దిక్కుల్లో భారత దేశ సరిహద్దుల్ని, ఆగ్నేయంలో మయన్మార్ దేశాలు ఉన్నాయు ఈ దేశానికి దక్షిణ దిశలో బంగాళాఖాతం ఉంటుంది.
బంగాలదేశ్ రాజధాని ఢాకా. దేశ విస్తీర్ణం: 1,47,610 చదరపు కిలోమీటర్లు. వీరి అధికారిక భాష బెంగాలీ. వీరి కరెన్సీ: టాకా. 1947 సంవత్సరానికి ముందు ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ స్వతంత్రరాజ్యంగా లేదు. 1947 సం.లో భారతదేశం నుండి విడిపోయిన పాకిస్తాన్ లో భాగంగా ఉండేది. తరువాత పాకిస్తాన్ నుండి విడిపోయి స్వతంత్రదేశంగా అవతరించింది
ఈ దేశ జెండాలో ఆకుపచ్చ రంగు దేశంలోని గ్రామాలకు, ఎరుపు రంగు వృత్తం స్వేచ్ఛకు గుర్తులు.
- పాఠకుల సంఖ్య జనాభాలో 15 శాతమే ఉన్నప్పటికీ ఇక్కడ 2,000 దినపత్రికలు, వార, మాసపత్రికలు ప్రచురితమవుతాయి.
- నాలుగు వేల ఏళ్ల క్రితం నాటి ప్రాచీన నాగరికత ఇక్కడిది. కొన్ని అధ్యయనాల ప్రకారం రాతి యుగంలోనే క్రీస్తుపూర్వం 20వేల సంవత్సరాల క్రితమే నాగరికత అభివృద్ధి చెందిందని చెబుతారు.
- బంగ్లాదేశ్ అంటే కంట్రీ ఆఫ్ బెంగాల్ అని అర్థం.
సగానికి పైగా జనాభా వృత్తి వ్యవసాయమే. రాజధాని ఢాకా 1608 సంవత్సరంలో ఏర్పడింది. కోటీ డెబ్బై లక్షల జనాభాతో ప్రపంచంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఒకటి. తీరం వెంబడి మాంగ్రూవ్ అడవులు ఎక్కువగా ఉంటాయి. స్వాతంత్య్రం పొందిన మార్చి 26ను జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దేశంలో భవన నిర్మాణానికి అవసరమైన రాయి లేదు. అందుకని ఇటుకల్నే ఎక్కువగా వాడుతారు. ఇటుక బట్టీలు దేశం పొడవునా విరివిగా ఉంటాయి. జనాభా పరంగా ప్రపంచంలో ఈ దేశం ఎనిమిదో స్థానంలో ఉంది. 200 ఎకరాల్లో నిర్మించిన ఇక్కడి జాతీయ పార్లమెంటరీ భవనం ఆ తరహా నిర్మాణాల్లో పెద్దది.
కబడ్డీ ఈ దేశ జాతీయ ఆట. మన జాతీయ గీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూరే ఈ బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాశారు. ప్రకృతి వైపరీత్యాలు తీవ్రంగా సంభవిస్తాయిక్కడ. తరచూ తుపాన్లు, వరదలు వచ్చి ప్రాణ,ఆస్తి నష్టం కల్గజేస్తుంటాయి. ప్రపంచ ప్రఖ్యాత రాయల్ బెంగాల్ టైగర్ ఈ దేశ జాతీయ జంతువు. ఈ పులి గాండ్రింపు మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందిట.
ఇక్కడి కాక్స్స్ బజార్‌లోని తీరానికి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా ఉన్న సముద్ర తీరంగా పేరు. ఇది 120 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. బంగ్లాదేశ్ జనాలు ఎప్పుడోగానీ నవ్వరు. అలా అనీ వీరు స్నేహంగా ఉండరని కాదు. ఎక్కువగా నవ్వితే పరిపక్వతలేని వారిగా భావిస్తారని వారి ఉద్దేశం. ఇక్కడి మహస్థన్గాహ్ అనేది బంగ్లాదేశ్ అతి పురాతమైన ప్రాచీన నగరం. ఈ దేశ కరెన్సీ టాకా. బెంగాలీలో కరెన్సీ అని దీనర్థం.
Bhutan
Capital Thimphu ………. Language Dzwongkha ………. Currency Ngultrum Indian Rupe Calling Code + 975 ………. Religion Buddhisim
భూటాన్
భూటాన్ దక్షిణ ఆసియాలో ఒక చిన్నదేశం. ఈ దేశానికి చుట్టూ భూభాగాలే సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణ, తూర్పు, పడమర దిశలలో భారతదేశం, ఉత్తరాన టిబెట్ సరిహద్దులుగా కలిగి ఉంది.
భూటాన్ రాజధాని థింపూ. దేశ విస్తీర్ణం 38, 394 చదరపు కిలోమీటర్లు. వీరి అధికారక భాషలు జోంఖా మరియు ఇంగ్లీష్. వీటితో పాటు దేశం మొత్తం మీద 24 భాషలు మాట్లాడుతారు. వీరి కరెన్సీపేరు గల్ ట్రామ్. భూటాన్ లో విద్య, వైద్యం ఉచితం. పర్యాటకులకు కూడా వైద్యం ఉచితం. ఈ దేశంలో పొగాకు అమ్మకాలు నిషిద్ధం. వీరి అధికారిక మతం బౌధ్దం.
పర్యావరణ పరంగా భూటాన్ ను ప్రత్యేకం చెప్పుకోవాలి. దేశ వైశాల్యంలో 60 శాతం అడవులు కలిగి ఉండాలన్నది ఈ దేశ రాజ్యాంగ నిబంధంన మొక్కలను కానుకలుగా ఇవ్వటం వీరి ఆచారం.
ఈ దేశంలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ మొత్తాన్ని ఇక్కడి చెట్లు పీల్చుకున్నా కూడా ఇంకా కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకునే శక్తి ఇక్కడి చెట్లకు ఉంది. అందుకే ఈ దేశాని కార్బన్ నెగెటివ్ దేశంగా పేర్కొంటారు.
భూటాన్‌లో స్థూల జాతీయ ఉత్పత్తి కన్నా ప్రజల ఆనందానికి ప్రాముఖ్యతనిస్తారు. ఏటా ప్రజల ఆనందాన్ని మాత్రమే లెక్కిస్తారు. అందుకే సంతోష సూచిక ఉంటుంది.దీనినే గ్రాస్ నేషనల్ హ్యాపినెస్ అంటారు.
భూటాన్ లో 1999 వరకూ టివీ, మరియు అంతర్జాలం నిషేధం.1974లో మొదటిసారిగా ఇతర దేశాల పర్యాటకులను అనుమతించటం జరిగింది. 1999 సం. నుండి ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.
భూటాన్ లో మాత్రమే తల మేక లాగా, శరీరం జడల బర్రెలాగా కనిపించే టకిన్ అనే జంతువు భూటాన్ జాతీయ జంతువు.
Brunei
Capital Bandar Seri Begawan ………. Language Malay ………. Currency Brunei Dollar Calling Code + 673 ………. Religion Islam(Sunni)
బ్రూనై...
బ్రూనై... పసిఫిక్ మహా సముద్రంలో ఆసియా ఖండానికీ ఆస్ట్రేలియాకు మధ్య ఉన్న బోర్నియో అనే ద్వీపంలో ఉందీ దేశం. ఈ ద్వీపం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ద్వీపం. ఈ ద్వీపంలో బ్రూనైతో పాటు ఇండోనేషియా, మలేసియా దేశాలూ ఉన్నాయి.
బ్రూనై రాజధాని బందర్ సెరీ బగవాన్ జనాభా: 4,17,200 (2019)
బ్రూనై విస్తీర్ణం: 5,765 చదరపు కిలోమీటర్లు. వీరి అధికారిక భాష: మలయ్. అధికార భాషతో పాటు స్థానికులు అధికంగా ఇంగ్లిష్, చైనీస్ కూడా మాట్లాడుతారిక్కడ. బ్రూనై కరెన్సీ బ్రూనై డాలర్
బ్రూనై జెండా….. పసుపు, నలుపు, తెలుపు చారల్లో ఉండే బ్రూనై జెండా మీద ఇస్లాం, రాజరికానికి సంబంధించిన గుర్తులుంటాయి.
ఇక్కడ ప్రధాన వనరులు పెట్రోలు, సహజ వాయువు. వీటి వల్ల వచ్చే సంపదతోనే ఈ దేశం ప్రపంచంలోని ధనిక దేశాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. బ్రూనై సహజ వాయువులు, చమురు ఉత్పత్తుల్ని ఎక్కువగా ఎగుమతి చేస్తుంది.
ఈ దేశంలో చదువు, వైద్యం ఉచితం. స్కూలు నుంచి విశ్వవిద్యాలయాల్లో పెద్ద చదువుల వరకూ వర్తిస్తుందిది. వ్యక్తిగత ఆదాయ పన్నులూ ఉండవు ఇక్కడ. ఈ దేశంలో అక్షరాస్యత శాతం 92.7
దాదాపు 600 సంవత్సరాల నుంచి ఈ దేశం మీద సుల్తానులదే పెత్తనమంతా. ఒకే కుటుంబానికి చెందిన రాజవంశం పాలన సాగిస్తోంది. పార్లమెంటు ఉన్నా అధికారాలన్నీ సుల్తానువే!
ఈ దేశ సుల్తాన్ ప్రపంచంలోని ధనిక రాజుల్లో ఒకడు. ఈయన ఐదు వేలకు పైగా కార్లను సేకరించాడు.
ఇక్కడ సొంత వాహనాల సంఖ్య చాలా ఎక్కువ. ప్రతి ఇద్దరిలో ఒకరికి తప్పకుండా కారు ఉంటుందట.
14వ శతాబ్దం నుంచీ బ్రూనై.. సుల్తానుల పాలనలోనే ఉన్నా ఇతర రాజ్యాల దాడులు, దేశంలో అంతర్యుద్ధాల వల్ల నెమ్మదిగా బలహీన పడింది. ఇదే సమయంలో బ్రిటన్ 1846లో బ్రూనైని ఆక్రమించింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత బ్రూనై నిధానంగా నిలదొక్కుకుంది. బ్రిటిష్ పాలనలో ఉంటూనే విద్య, వైద్యం లాంటి వసతులకి ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు బ్రూనై సుల్తానులు. చివరకు ఈ దేశానికి స్వాతంత్య్రం జనవరి 1, 1984లో వచ్చింది. కానీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఫిబ్రవరి 23న చేసుకుంటారు.
ఇక్కడ అడవుల్ని కాపాడ్డానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఇప్పటికీ ఈ దేశంలో 70 శాతానికి పైగా భూభాగంలో అడవులు నిక్షేపంగా ఉన్నాయి
ఈ దేశంలో ఆడవాళ్లు, మగవాళ్లు షేక్ హేండ్ ఇచ్చుకోరు.
బెలలాంగ్ ట్రీ ఫ్రాగ్ అనే ఓ వింత కప్ప ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఈ దేశంలో మాత్రమే ఉండే ప్రత్యేకమైన 35 రకాల మొక్కలూ ఉన్నాయి.
యురోపియన్ దేశాలు, అమెరికా, ఐస్ లాండ్, మలేసియా, న్యూజిలాండ్, నార్వే, యూఏఈ, సింగపూర్, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్ వంటి కొన్ని దేశాల ప్రజలను వీసా లేకుండానే బ్రూనై అనుమతిస్తుంది.
Cambodia
Capital Phonam Penh ………. Language Khmer ………. Currency Riyal
Calling Code + 855 ………. Religion Theravada Buddhism
కంపూచియా (కంబోడియా)
కంపూచియా లేక కంబోడియా ఆగ్నేయ ఆసియాలోని ఒక చిన్న స్వతంత్ర దేశం. ఈ దేశానికి పూర్వ నామం క్మేర్ రిపబ్లిక్, రాజధాని నామ్ పెన్. పూర్యం కాంభోజ రాజ్యం అనే పేరుతో కూడా పిలిచేవారు. కంపూచియా విస్తీర్ణం 18,035 చ.కి.మీ. వీరి అధికార భాష క్మెర్ (కంబోడియా భాష). వీరి కరెన్సీ రియాల్. రాజధాని నగరం నామ్ పెన్. పూర్వం హిందూ సామ్రాజ్యమైనా ప్రస్తుతం ఈ దేశంలో బౌద్దమతం ప్రచారంలో ఉంది. 90 శాతం మంది ప్రజలు హీనయాన బౌద్దశాఖకు(తెరవాడ బుద్ధిజం) చెందినవారే.
ఈ దేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్రతో సంబంధం కలిగి ఉంది. పూనాన్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండి క్రీ.శకం 7వ శతాబ్దం వరకు గొప్ప వైభవంతో వెలుగొందింది.
8వ శతాబ్ధం నుండి 14వ శతాబ్దం వరకూ భారతదేశంతో సత్సంబంధాలు కలిగి హిందూ బౌద్ద రాజ్యంగా ప్రాచుర్యం పొందింది. అప్పట్లో కంపూచియా రాజధాని అంగ్ కోర్ వాట్, ఆనాటి క్మెర్ చక్రవర్తులు నిర్మించిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంగ్ కోర్ వాట్ దేవాలయం, వాస్తు శిల్పసంపద నేటికీ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన అంగ్ కోర్ వాట్ దేవాలయంలో నిర్మించిన శిల్పాలలో భారతదేశ దేవతల రూపాలు గోచరిస్తాయి.
1100 సంవత్సరం నాటికి నేటి లావోస్, ధాయ్ లాండ్, వియత్నాంలు కంపూచియాలో భాగంగా ఉండేవి.
తరువాత కంపూచియా పతనమైనపుడు రాజధానినిని నామ్ పెన్ కు తరలించారు.
19 వ శతాబ్దంలో కంపూచియాను ఫ్రెంచ్ వారు ఆక్రమించుకున్నారు. ద్వితీయ ప్రపంచ యుద్దం తరువాత 1953వ సం.లో ఫ్రెంచ్ వారి నుండి స్వాతంత్ర్యం పొందింది.
మికాంక్ నది కంపూచియాకు ప్రధాన జలవనరులను అందిస్తుంది. భూమి కూడా సారవంతమైనది. వరి, రబ్బరు, సోయా చిక్కుడు ప్రధానమైన పంటలు. పశుసంపద కూడా ఎక్కువే.
సిమెంట్, కాగితం, పైవుడ్, జవుళీ, మత్యపరిశ్రమలు ముఖ్యమైనవి.
China
Capital Beijing ………. Language Chineses ………. Currency Renminbi
Calling Code + 86 ………. Religion Multi Religions
చైనా
తూర్పు ఆసియాలో చైనా పెద్ద దేశం. కెనడా మాత్రమే ఆసియాలో చైనా కంటే పెద్ద దేశం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఇదే. br/> చైనా విస్తీర్ణం 95,72,900 చ.కి.మీ. చైనా రాజధాని బీజింగ్. వీరి అధికార భాష మాండలిన్. జనాభా మొత్తంలో 70శాతం మంది మాండరిన్ భాష మాట్లాడుతారు. కరెన్సీ.... చైనీస్ యువాన్ చైనా ప్రజలు మంగోలాయిడ్ వర్గానికి చెందిన వారు. ప్రజలు కన్ ఫ్యూషియస్, బౌద్ధ, టావో బోధనలను పాటిస్తారు. మత ప్రచారం చైనాలో నిషిద్ధం. .
క్రీ.పూర్వం 1500 సంవత్సరం నుండి చైనాకు చరిత్ర ఉంది. అప్పట్లో షాంగ్ వంశీయులు పాలించేవారు. క్రీ.పూర్వం 202-220 సం. మద్య హాన్ రాజవంశీయుల పాలనలో చైనా శక్తివంతమైన దేశంగా రూపొందింది. క్రీ.శ 7వ శతాబ్దంలో చైనీయులు ముద్రణా పద్దతిని కనిపెట్టారు. వీరి కాలం నాటి చీనా యాత్రికుడు ఇత్సింగ్ భారతదేశానికి వచ్చాడు. తరువాత చైనాను సుంగ్ రాజవంశం, యాన్ రాజవంశం, మింగ్ రాజవంశం వారు పరిపాలించారు. ఇంత పెద్ద దేశం కూడా బ్రిటీష్ వారి ఆక్రమణకు గురైంది. 1912 సం.లో చైనా స్వతంత్ర దేశం ఐనది.
వీరి జెండాలో ఎరుపు రంగు కమ్యూనిస్ట్ విప్లవానికి సూచిక ఇక్కడి ప్రజల సంప్రదాయ రంగు కూడా. పెద్ద నక్షత్రం కమ్యూనిజానికి గుర్తు. నాలుగు చిన్న నక్షత్రాకారాలు సామాజిక తరగతులను సూచిస్తాయి. చైనీయులు ఎరుపు రంగును సంతోషానికి గుర్తుగా భావిస్తారు. అందుకే రకరకాల పండగల్లోనే కాదూ... ప్రత్యేక సందర్భాల్లో, వివాహం లాంటి వేడుకల్లోనూ ఉపయోగిస్తారు ఎరుపు రంగును ఉపయోగిస్తారు. 1928 సం.లో ఛాంగ-కై-షేక్ చైనాలోని అన్ని ప్రాంతాలను ఏకం చేసాడు. 1946-49 సంవత్సరాల మద్యకాలంలో మావో నాయకత్వంలో అంతర్యుద్ధం జరిగి నియంతృత్వ ప్రభుత్వం ఏర్పడింది. 1949 సం.లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిన తరువాత చౌ ఎన్ లై ప్రధాని కావటం జరిగింది. అప్పటి నుండి చైనా కమ్యునిస్ట్ దేశమే. .
ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ మనకు తెలిసిందే
గ్రేట్ వాల్ ఆఫ్ చైనాగా పేరు పొందిన ఈ గోడ చైనాలోనే ఉంది. ఈ గోడ హాన్ రాజవంశీయుల కాలంలో నిర్మించబడింది. . దాదాపు 2600 ఏళ్ల నాటి నిర్మాణమిది. ఏటా ఇక్కడికి ఐదు కోట్ల మంది పర్యాటకులు వస్తుంటారు. హుయాంగ్ హై. యాంగీట్జూ, గ్రాండ్ కెనాల్ నదులు జలాధారాలు. ఇంకా సియాంగ్ నది, చాలా సరస్సులు చైనాకు నీటి వనరులను అందిస్తున్నాయి. గోబీ ఎడారి చైనా ఉత్తర భాగంలో ఉన్నది.
చైనాలో వ్యవసాయ ఉత్పత్తులలో వరి పంట ప్రధానమైనది. తరువాత గోధుమ, సోయా చిక్కుడు, పొగాకు, చెరకు, చిరు ధాన్యాలు, వేరుసెనగ, మొక్కజొన్నలను పండిస్తారు. గొర్రెలను, పందులను పెంచుతారు. పశువుల పెంపకం తక్కువగా ఉంది. మత్స్య సంపద ఎక్కువ.
టాయిలెట్ పేపర్, మనకెంతో ఇష్టమైన గాలిపటాలు పుట్టింది చైనాలోనే. చైనాలో విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొడితే ఏడేళ్ల శిక్ష విధిస్తారు. 2009 వరకు చైనాలో ఫేస్బుక్, ట్విట్టర్ వాడటం నిషిద్ధం. ప్రపంచంలోని 70 శాతం ఆట బొమ్మలు తయారయ్యేది ఇక్కడే. ఎగుమతుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది చైనా. దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది.
అతి ఎత్తయిన భవంతులు ఎక్కువగా ఉండటమే కాదు.. చైనాలో ప్రతి ఐదు రోజులకు సగటున ఓ ఆకాశహర్మ్యం లేస్తోంది. ప్రపంచంలోనే పురాతన, పొడవైన కాలువ ‘చైనా గ్రాండ్ కెనాల్’. దీని పొడవు 1,794 కిలోమీటర్లు. చైనాలో పెద్దవారి కోసం ప్రత్యేక చట్టం ఉంది. వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే శిక్షలు పడతాయ్!
కొన్ని పెద్ద దేశాల్లో టైమ్ జోన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ పెద్ద దేశమైన చైనాలో మాత్రం ఒక్కటే ‘బీజింగ్ స్టాండర్డ్ టైమ్ జోన్’ ఉంది. అంటే ఈ దేశమంతా ఒకే సమయం ఉంటుంది. అందువల్లే ఇక్కడి పడమర రాష్ట్రాల్లో సూర్యుడు 10 గంటలకు ఉదయిస్తాడు.
దాదాపు 1400 సంవత్సరాల క్రితం డబ్బుగా కాగితపు నోట్లని మొదటిసారిగా వాడింది చైనాలోనే.
సముద్ర ప్రయాణాల్లో ఓడలకు దారి చూపించే దిక్సూచి (కంపాస్), మొట్ట మొదటి ముద్రణాయంత్రం, వూగే వంతెనలు, తుపాకీ మందు, ముడుచుకునే గొడుగుల్ని తయారు చేసింది కూడా చైనీయులే. దాదాపు 1400 సంవత్సరాల క్రితం. సంఖ్యాపరంగా ప్రపంచంలోని మొత్తం పందుల్లో సగం చైనాలోనే ఉన్నాయి. చైనాలో కొంత మంది పోలీసులు కుక్కలకు బదులు పెద్ద బాతుల్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే కుక్కల్లానే వీటికి దొంగల్ని గుర్తించే శక్తి ఉందట. ప్రపంచంలో ఉన్న పాండాలన్నీ ఇక్కడివే. దాదాపు 1400 సంవత్సరాల క్రితం. నేల బొగ్గు, ఇనుపరాయి, తగరం, సీసం వంటి ఖనిజాలు లభ్యమవుతాయి. అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కువ. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిన దేశం చైనా. అన్ని రకాల యంత్రసామాగ్రి, ఆటబొమ్మలు, మొబైల్స్, ప్లాస్టిక్ బొమ్మల ఎగుమతితో ప్రపంచాన్ని ముంచెత్తుతుంది.
Cyprus
Capital Nicosia ………. Language Greek/Turkish Currency Euro
Calling Code + 357 ………. Religion Greek Orthodox
సైప్రస్
ఆసియా, ఆఫ్రికాకి, యూరప్ ఖండాలకు చాలా సమీపంలో ఉన్న స్వతంత్ర దేశం సైప్రస్. మధ్యధరా సముద్రానికి తూర్పు వైపున ఉంది. క్రీ.పూర్వం 7000 ఏళ్లనాటి నుండే ఈ దేశంలో నాగరికత వర్థిల్లినట్లు చరిత్ర తెలుపుతుంది. ఇంత వైభవం కల దేశం కూడా 1960 సం.లో స్వాతంత్ర్యం సంపాదించుకుంది.
ఈ దేశాన్ని గ్రీక్ భాషలో ‘కైప్రియారీ డెమోక్రటిక్’ అని పిలుస్తారు. సైప్రస్ లో కొంత భూభాగం టర్కీ ఆక్రమణలో ఉంది. సైప్రస్ విస్తీర్ణం 5,896 చ.కి. మాత్రమే.. రాజధాని నగరం నికోసియా. వీరి అధికార భాషలు గ్రీక్, టర్కిష్. పైప్రస్ ప్రజలంతా గ్రీక్ జాతికి చెందినవారే. వీరు గ్రీక్ ఆర్తడాక్స్ క్రైస్తవ మతాన్ని పాటిస్తారు.
ఓహియారి జోస్, సెరికిస్, పెడియోస్ నదులు మరియు కౌకియా సరస్సులు సైప్రస్ కు ప్రధాన నీటివనరులు. గోధుమ, బార్లీ, బంగాళాదుంపలు, గ్రేప్ ఫ్రూట్స్, ద్రాక్ష, గజనిమ్మ, నారింజ మొదలగునవి వ్యవసాయ ఉత్పత్తులు.
రాగి ఇనుపరాయి, జిప్సమ్, ఆస్బెస్టాస్, ఈ దేశం అని ఖనిజ సంపదలు.
సిమెంట్, ద్రాక్షా సారాయి, జవుళీ, పాదరక్షలు, దుస్తులు, కలప సామాగ్రి, ఆలివ్ నూనె, సమెంట్ సైప్రస్ లోని ముఖ్యమైన పరిశ్రమలు. ప్రాచీన నాగరికత చెందిన శల్పాలు, కళాఖండాలు ఎక్కువగా ఉన్న దేశం సైప్రస్. ఈ దేశం పర్యాటకంగా కూడా పేరు పొందింది.
Georgia
Capital Tbilisi ………. Language Georgian ………. Currency Georgian Lori
Calling Code + 995 ………. Religion Georgean Orthodox
జార్జియా
జార్జియా 1991 సం. ఏప్రియల్ లో సోవియట్ రష్యా నుండి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. జార్జియా రాజధాని Tbilisi ఈ దేశ వైశాల్యం 69,700 చ.కి. వీరి భాష జార్జియన్. ఈ దేశ కరెన్సీ జార్జియన్ లోరీలు. ప్రజలు జార్జియన్ ఆర్ధడెక్స్ (సాంప్రదాయ క్రిస్టియన్ మతం) మతాన్ని అనుసరిస్తారు.
జార్జియా దేశానికి రష్యా, టర్కీ, ఆర్మేనియా, అజర్ బైజాన్ లు సరిహద్దు దేశాలు. జార్జియా పర్యాటక ప్రాంతంగా పేరుపొందింది. పర్యాటక పరంగా గణనీయమైన ఆదాయం ఈ దేశానికి వస్తుంది. ఈ దేశంలో 2000 మినరల్ జలప్రవాహాలు, సాంస్కృతిక, చారిత్రాత్మక కట్టడాలు వేలసంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఖుటసిలోని బగ్రాటి కేథడ్రల్, గెలాటీ త్సఖేతరీ, స్వనేటి చారిత్రాత్మక స్మారక చిహ్నాలు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తింపబడ్డాయి.
జార్జియా దేశంలో చిన్నపిల్లలకు ప్రాధమిక విద్య తప్పనిసరి. జార్జియాలో టీ తోటలు ఎక్కువగా ఉన్నాయి. పొగాకు, పంచదార దుంపలు పండిస్తారు.
India
Capital Delhi ………. Language Hindi/Telugu/ Tamil/Malayam/ Punjabi…
Currency Indian Rupees Calling Code + 91 Religion Hindu/Muslim/ christian/Sikh
భారతదేశం
భారత దేశం ఆసియాలోని పెద్ద దేశాలలో ఒకటి నూటఇరవై కోట్లకు పైగాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. (మొదటిది చైనా) వైశాల్యములో ప్రపంచంలో ఏడవది.
ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మరియు అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటి. భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం. భారతదేశ కరెన్సీ రూపాయలు. భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న భాషలు హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళం, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, ఒరియా ఇంకా అనేక భాషలు మాట్లాడుతారు. దేశంలో గుర్తించ బడిన భాషలు 22. ఇంకా గుర్తింపు లేని అనేక భాషలు కలవు. హిందూ, సిక్, ముస్లిం, క్రిస్టియన్ ఇంకా అనేక మతాల వారు ఐకమత్యంతో నివసిస్తున్నారు.
భారతదేశం అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం. ఇండియా రాజధాని ఢిల్లీ. భారతదేశం 29 రాష్ట్రాలు మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక ఫెడరల్ రాజ్యాంగ గణతంత్రం.
దక్షణాసియాలో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉన్న దేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారులు కలవు. దక్షిణాన హిందూ మహాసముద్రం, నైరుతిన అరేబియా సముద్రం, మరియు ఆగ్నేయాన బంగాళాఖాతం, ఉత్తరదిశలో హిమాలయ పర్వతాలు ఎల్లలుగా ఉన్నాయి. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది
పురాతన నాగరికతలకు పుట్టిల్లు. అనేక వేల సంవత్సరాల చరిత్ర కల దేశం. హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కుమతాలకు భారత దేశమే జన్మస్ధానం.
ఇంత పెద్ద దేశంలో రాజుల మధ్య ఐకమత్యం లేక పోవటం వలన గజనీ, ఘోరీ, అలగ్జాండర్, తురుష్కల దండయాత్రలకు గురై నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రంతో పాటు అపార సంపద కొల్లగొట్టబడినది. తరువాత రాజులలో ఐకమత్యం లేక పోవటం వలన ఇంత పెద్ద దేశాన్ని కూడా 18 వ శతాబ్దం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అక్రమంగా ఆక్రమించటం వలన భారతదేశం బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 1857 సం. సిపాయిల తిరుగుబాటు తరువాత 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా యునైటెడ్ కింగ్డమ్ నుండే పాలించబడింది. మహాత్మా గాంధీ నాయకత్వాన స్వాతంత్ర్యం కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 ఆగస్ట్ 15 వ తేదీన ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి .భారత దేశాన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశంగా భావిస్తారు ప్రపంచంలో అతిపెద్ద సైన్యం కలిగి ఉన్న మూడవ దేశం.
భారత దేశ జాతీయ పతాకము త్రివర్ణ పతాకము. జాతీయ చిహ్నం మూడు తలల సింహపు బొమ్మ. జాతీయ గీతం జనగణమన.... జాతీయ గేయం వందేమాతరం....
ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వరి, గోధుమ, పొగాకు, ప్రత్తి, అపరాలు, చిరుధాన్యాలు, చెరకు, పొద్దు తిరుగుడు గింజలు, వేరుశెనగ, కాఫీ, తేయాకు ముఖ్యమైన పంటలు. పాడి పరిశ్రమ, పశువుల పెంపకం కూడా ఎక్కువగా ఉంది. గంగ, గోదావరి, యమున, కావేరి, కృష్ణ ఇంకా అనేక జీవనదులు మరియు చిన్న చిన్న నదులు కలవు. అపారమైన జలరాశులున్న సరస్సులు చెరువులు కలవు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ ఇంకా అనేక చారిత్రాత్మక నిర్మాణాలు కలవు. ప్రపంచలోనే పేరు పొందిన జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహుదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్ వంటి వారికి జన్మనిచ్చిన దేశం.
ఆద్యాత్మికంగా కూడా పేరు పొందినది భారతదేశం. వేదాలు, భారతం, భాగవతం, రామాయణం, భగవద్గీత ఆవిర్భవించిన దేశం. బౌద్ధమతం, సిక్కుమతం, జైనమతం ఆవిర్భవించిన దేశం కూడా.
రమణ మహర్షి, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ఆదిశంకరాచార్యులు మొదలగు ఆధ్యాత్మిక గురువులకు జన్మస్థానం భారతదేశం. ప్రపంచ ప్రసిద్ది చెందిన కోహినూర్ వజ్రం, నెమలి సింహానం భారతదేశానికి చెందినవే. భారత దేశం మంచి పర్యాటక దేశం కూడా. ప్రకృతి దృశ్వాలతో, లోయలతో, పచ్చదనంతో ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నాయి. భారత దేశం పర్యాటక పరంగా కూడా పేరుపొందిన దేశం.
Indonesia
Capital Jakartha Language Indonesian/Javanese/Malay
Currency Indonesian Rupiah Calling Code + 62 ………. Religion Islam
ఇండోనేషియా... ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప దేశం. ఆగ్నేయ ఆసియాలోని ఈ ద్వీప దేశంలో మొత్తం 17,800 ద్వీపాలుంటాయి. ఇందులో సగం ద్వీపాలకు ఇంకా పేర్లే లేవు. హిందూ, పసిఫిక్ సముద్రాల మధ్య ఉన్నది.
ఇండోనేషియా రాజధాని జకార్తా. దేశ విస్తీర్ణం 19,04,569 చదరపు కిలోమీటర్లు. ఇక్కడి అధికార భాష ఇండోనేషియన్ ఐనప్పటికీ ఇక్కడి ప్రజలు దాదాపు 600 భాషలు, మాండలికాల్లో మాట్లాడుతారు. ఈ దేశ కరెన్సీ రుపయా
వీరి జెండాలోని ఎరుపు రంగు మనిషి రక్తానికి, తెలుపు రంగు ఆత్మకు గుర్తులు.
ఈ దేశం ఎన్నో అరుదైన జీవజాతులకు నిలయం. 2010లో ఇక్కడ 200 రకాల కొత్త జీవుల్ని గుర్తించారు. జవన్ రైనో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.
ప్రపంచంలో రెండో అతి పెద్ద తీర ప్రాంతం ఉండేది ఈ దేశానికే. ప్రపంచంలో అతి పెద్ద బంగారు గని ‘గ్రాస్బెర్గ్’ ఇక్కడిదే. మూడో అతి పెద్ద రాగి గని కూడా ఈ దేశంలోనే ఉంది.
జీవవైవిధ్యంలో రెండో స్థానంలో ఉందది. అతి పెద్ద బల్లి జాతికి చెందిన ‘కొమడో డ్రాగన్’ ఈ దేశ జాతీయ జంతువు. ఈ దేశంలో సగభాగం అడవులతో నిండి ఉంటుంది.
ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ‘రాఫ్లీసియా ఆర్నాల్డి’ని ఇక్కడ చూడొచ్చు. ఈ పూల రేకులు ఒకటిన్నర అడుగుల పొడవు, అంగుళం మందంతో ఉంటాయి.
తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగే పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఈ దేశమూ ఓ భాగం. మొత్తం 400 అగ్ని పర్వతాలుంటే వాటిలో 150 క్రియాశీలకమైనవి. ప్రపంచంలో ఇలాంటి ప్రమాదకర అగ్నిపర్వతాల్లో 75 శాతం ఇక్కడే ఉన్నాయి.
ఇక్కడ ఓ ప్రత్యేకమైన అగ్నిపర్వతం ఉంటుంది. దీని నుంచి వచ్చే అగ్నిజ్వాలలు నీలం రంగులో ఉంటాయి.. అతి పెద్ద బుద్ధుడి గుడి ‘బొరొబుడుర్’ ఉన్నది ఇక్కడే. 504 బుద్ధుని విగ్రహాలతో ఉంటుందీ ఆలయం.
తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్పోటనాలు జరిగే ఫసిఫిక్ కు చెందిన ’రింగ్ ఆఫ్ ఫైర్‘ ప్రాంతంలో ఈ దేశం కూడా ఒకభాగమే. మొత్తం 400 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిలో 150 పర్వతాలు క్రియాశీలకమైనవి అంటే పేలటానికి ఆస్కారమున్నవి. ప్రపంచంలోని ఇలాంటి అగ్నిపర్వతాలలో 75 శాతం ఇక్కడే ఉన్నాయి.
అతి పెద్ద గుడి ‘బోరోబుడుర్ ఈ దేశంలోనే ఉన్నది. ఈ దేవాలయంలో 504 బుద్ధ విగ్రహాలు ఉన్నాయి.
ఇండోనేషియాలో వ్యభిచారాన్ని గౌరవం, నైతికతలకు భంగం కలిగించే నేరంగా పరిగణిస్తారు. అయినా సరే, ఇండోనేషియా సెక్స్ టూరిజంలో ముందుండటం గమనార్హం. ఈ వ్యభిచారాలకు ఆన్ లైన్ సోషల్ మీడియాలే వేదికలు. ఈ దేశంలో కూడా మైనర్లను బలవంతంగా వ్యభిచారంలోకి లాగుతున్నారు. అయితే, ఇక్కడి చట్టాలు వారికి ఎలాంటి రక్షణ కల్పించలేక చేతులెత్తేశాయి.
Iran
Capital Tehran ………. Language Persian ………. Currency Riyal
Calling Code + 98 ………. Religion Islam
ఇరాన్
ఇరాన్ దేశాన్ని పూర్వకాలంలో పర్షియా అని పిలిచేవారు. అస్సీరియా నాగరికత వర్ధిల్లిన దేశం. పారసీక భాషలో ఇరాన్ ను కేష్వారే షా ఇన్ షాయే అంటారు. రాజుల ప్రభుత్య పాలన సాగుతుంది. వీరి అధికార భాష పారసీకం. ఈ దేశ విస్తీర్ణం 16,43,503 చ.కి.మీ. ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఇది ముస్లిం దేశం. షియా ముస్లింలు 83 శాతం మంది ఉన్నారు. ఫాట్ ఆల్ అరబ్ నది దీని ఉపనదులు కారూన్, సెఫిడ్, అత్రైక్ నదులు జలవనరులు. పెట్రోల్ ఖుజిస్తాన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంది.
బార్లీ, గోధుమ, నల్లమందు, తేయాకు, పొగాకు, మొక్కజొన్న, ట్రగాకాంత్ జిగుర్లు, ఖర్జూరం మొదలైనవి పండిస్తారు. .
నేలబొగ్గు, ఆర్సనిక్, రాగి, ఇనుము, పెట్రోల్, గంధకం ఖనిజ సంపదలు. తివీచీ నేత, సిమెంట్, సిగరెట్, పట్టు, జవుళీ పరిశ్రమలు ఉన్నాయి. .
భారతదేశాన్ని మొగలాయిలు పాలిస్తున్న చివరి దశలో ఇరాన్ రాజు నాదిర్షా భారతదేశంలోని ఢిల్లీ, లాహోర్ పట్టణాల మీద దురాక్రమణ చేసి అపార ధనరాసులను, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రాన్ని, నెమలి సింహాసనాన్ని దోచుకుపోయాడు.
Iraq
Capital Baghdad ………. Language Arabic/Kurdish ………. Currency Iraqi Dinar
Calling Code + 964 ………. Religion Islam
ఇరాక్
పర్షియన్ సింధుశాఖ ముఖ ద్వారంలోని స్వతంత్ర దేశం. ఇది అరబ్ దేశం. అరబ్బీలో ఇరాక్ ను ఆల్-జు-మ్హూరియా ఆల్ – ఇరాఖియా అంటారు. యాఫ్రటీస్ నదీ లోయలలో క్రీ.పూర్వం 3000 సంవత్సరాల క్రితం వెలసిన బాబిలోనియా, అస్సీరియా, సుమేరు నాగరికతలతో వర్థిల్లిన దేశం. ఈ దేశాన్నే పూర్వకాలంలో మెసపొటేమియా అని అంటారు.
ఈ దేశ విస్తీర్ణం 4,38,317 చ.కి.మీ. రాజధాని బాగ్దాద్. వీరి అధికార భాష అరబ్బీ మరియు కుర్దిష్. ఈ దేశం ముస్లిం దేశం. ముస్లింలలో షియా తెగల వారు 54 శాతం, సున్నీలు 42 శాతం మంది ఉన్నారు. వీరి కరెన్సీ ఇరాకీ దీనార్ లు.
టైగ్రీస్, యూఫ్రటీస్ నదులు ఈ దేశంలో ప్రవహిస్తున్నాయి. బార్లీ, వరి, చిరుధాన్యాలు, గోధుమ, ప్రత్తి, ఖర్జూరాలు, పొగాకు ఈ దేశంలో పండుతాయి. ఉన్ని, నూలు బట్టల పరిశ్రమలు ఉన్నాయి. పెట్రోలు లభిస్తుంది.
Israel
Capital Jerusalem ………. Language Hebru/Arabic ………. Currency New Shekel
Calling Code + 972 ………. Religion Jewish(Yuudu)/ Muslim
ఇజ్రాయెల్
ఈ దేశానికి ప్రాచీన చరిత్ర లేదు. ప్రపంచంలో చెల్లా చెదురుగా ఉన్న యూదులంతా కలసి 1948 సం.లో ఈ ప్రాంతానికి చేరి ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారు. బైబిల్ నాటి పాలస్తీనా యూదుల రాజ్యం కానీ పలు దాడులకు గురై యూదులు చెల్లాచెదురై ప్రపంచం నలుమూలలకు వెళ్లిపోయారు. మతద్వేషానికి కూడా గురైయ్యారు. 1800 సంవత్సరం నుండి తమ జన్మభూమికై పోరాటం సాగించి చివరకు 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ ను ఏర్పరచుకొని స్వతంత్ర ప్రతిపత్తిని సాధించగలిగారు.
వీరికి దేశభక్తి, జాతీయ భావం ఎక్కువ. దీనితోనే ఈ దేశ పౌరులంతా కష్టించి పనిచేసి తమ దేశపు ఆర్ధిక స్థాయిని పెంచుకోవటం జరిగింది. దీనితో ఈ ప్రపంచంలోనే అత్యధిక జీవన ప్రమాణాలను అందుకోగలిగారు.
ఈ దేశ విస్తీర్ణం 20, 700 కి.మీ. దేశ రాజధాని జెరుసలేం. ఇజ్రయెల్ లోని ఇతర ప్రధాన పట్టణాలు టెల్ అవీస్, యఫో, హైఫా, హోలాన్, బట్ యామ్. ఇజ్రాయెల్ లో అధికార భాష హిబ్రూ..అరబిక్. వీరి కరెన్సీ న్యూ షెకెల్. ప్రజలలో యూదు మతస్థులు ఎక్కువ. ముస్లిం మతస్థులు కొద్ది శాతం మంది ఉన్నారు.
మృతసముద్రం ఇజ్రయెల్ లోనే ఉంది. ఈ దేశంలో నీటి ఎద్దడి ఎక్కువ. కానీ వీరు శాస్త్రవిజ్ఞానంతో సముద్రపు నీటిని శుద్ధిచేసి మంచినీరుగా మార్చి నారింజ జాతి పండ్లను పండించి ఎగుమతి చేస్తున్నారు.
పాడిపరిశ్రమ పాడిపరిశ్రమ, కోళ్ల పరిశ్రలు ఎక్కువ. జవుళీ. వజ్రాలు , రాగి, ఖనిజం, మొదలగు పరిశ్రమలు ఉన్నాయి.
Japan
Capital Tokyo ………. Language Japanese ………. Currency Japanese Yen ……….
Calling Code + 81 ………. Religion
జపాన్
తూర్పు ఆసియాలో ద్వీపరాజ్యం జపాన్. ఫసిఫిక్ మహా సముద్రంలో ఉన్నది. జపాన్ రాజధాని టోక్యో. వీరి అధికార భాష జపనీస్. ఈ దేశ కరెన్సీ జపనీస్ యెన్ లు. ఈ దేశ వైశాల్యం 3,77,815 చ.కి.మీ. జపాన్ ప్రజలు మంగోలాయిడ్ వర్గానికి చెందినవారు. షింటో బౌద్ధ మతం, జెన్ బుద్ధిజం, టావూ మతాలను వీరు అనుసరిస్తారు
జపాన అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది రెండవ ప్రపంచయుద్ధం, హీరోషిమా, నాగసాకీలు. రెండవ ప్రపంచయుద్ధంలో అమెరికా ఈ రెండు నగరాలపై హైడ్రోజన్ బాంబులు ప్రయోగించటం వలన ఈ రెండు నగరాలు సర్వనాశనమైనవి. నాటి దారుణ సంఘటనలను నేడు కూడా చూడవచ్చు. రెండవ ప్రపంచం యుద్ధంలో దారుణంగా దెబ్బతిన్న జపాన్ కేవలం 50 సంవత్సరాల వ్యవధిలో ఆర్దికంగా, పారిశ్రామికంగా పురోగతి సాధించింది
13 వ శతాబ్ధంలో కుబ్లయ్ ఖాన్ సామ్రాజ్యంలో జపాన్ అంతర్భాగంగా ఉండటం వలన జపాన్ గురించి మార్కోపోలో వ్రాతల ద్వారా యూరోపియన్లకు తెలిసింది.
జపాన్ హూన్షూ, హూకియాడో, క్యూషియాడో, ఝికాకో అనే నాగులు దీవులు కలిపిన దేశం. జపాన్ లో భూకంపాలు ఎక్కువ. ఏడాదికి షుమారు 15,000 సార్లు భూమి కంపిస్తూ ఉంటుంది.1964 సం.లో పెద్ద భూకంపం వచ్చి షుమారు 1,40,000 మంది చనిపోయారు.
టోక్యో, యోకాహామా, ఒసాకా, నాగోయా, సపోరా, క్యోటూ, ఫూకౌకా, కవసాకి, హీరోషిమా, కీటా, క్యూషూ లు పెద్ద నగరాలు.
జపాన్ లో రైతాంగం అభివృద్ధి చెందినది. వరి ప్రధానమైన పంట. ఇంకా బార్లీ, పోగాకు, తేయాకు, బార్లీ, క్యాబేజి, బంగాళాదుంపలు, ముల్లంగి, సోయా చిక్కుళ్లు ఇతర వ్యవసాయ ఉత్పుత్తులు.
పారిశ్రామికంగా అభవృద్ధి చెందిన దేశం. ఎలక్ర్టానిక్ పరికరాలు, కార్లు, కంప్యూటర్స్ తయారీలో ముందంజలో ఉన్నది.
Jordan
Capital Amman ………. Language Arabic ………. Currency Jordianian Dinan ……….
Calling Code + 962 ………. Religion Islam
జోర్డాన్
ఇజ్రాయేల్ కు పొరుగు దేఁశమైన జోర్డాన్ ఆసియాలో రాచరిక పాలనలో ఉన్న స్వతంత్ర దేశం.. మానవుని పుట్టుకకు ఆదిమ సాథనం జోర్డాన్ అంటారు. జోర్డాన నదీ పశ్చామ తీరాన జ్యూడ్, ఇజ్రాయేల్ దేశాలు ఉన్నాయి.
ఈ దేశ విస్తీర్ణం 89,206 చ.కి.మ. రాజధాని అమ్మాన్. అధికార భాష అరబ్బీ. వీరి కరెన్సీ జోర్డియన్ దీనార్ లు. జోర్డాన్ ముస్లిం దేశం. ప్రజలు సున్నీ శాఖ ముస్లింలు.
చాల్డియన్ లు, ఈజిఫ్షియన్ లు, ఫిలిస్టీన్, అస్సరీయన్ లు సర్షియన్ లు దాడులు జరిపి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పరిపాలించారు. అలెగ్జాండర్ కూడా క్రీ.పూర్యం 332 లో ఈ దేశాన్ని జయించాడు.
జోర్డాన్ లో ఏడారి భాగం ఎక్కువ. పశ్చిమ జోర్డాన్ లోని నది లోయ ప్రాంతం సారవంతమైనది. గోధుమ, బార్లీ, నారింజ జాతులు, చిక్కడు ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు గొర్రెల పెంపకం, మేకల పెంపకం కూడా సాగిస్తున్నారు.
పొటాష్, ఫాస్పేట్ ఖనిజాలు ప్రధానమైన ఎగుమతులు. ఈ దేశం పర్యాటక దేశం కావటంతో విదేశీ ద్రవ్యాన్ని కూడా ఆర్జిస్తుంది.
Kazakhstan
Capital Astana ………. Language Kazak/Turkey ………. Currency Tenj ……….
Calling Code + 7 ………. Religion Islam/Christian
కజకిస్తాన్
1991 సంవత్సరానికి ముందు కజకిస్తాన్ అఖంఢ రష్యాలో ఒక భాగం. 1991సం.లో రష్యా విచ్ఛినం అయిన తరువాత చివరిగా స్వాతంత్ర్యం ప్రకటించుకున్న దేశం.
ఈ దేశ రాజధాని ఆస్తానా. వీరి భాషలు కజక్ మరియు టర్కీ రష్యన్ భాష కూడా ఇక్కడి ప్రజలు మాట్లాడుతారు. ఈ దేశ కరెన్సీ టుంజ్ లు. 76 శాతం మంది ముస్లింలు 24 శాతం మంది క్రిస్టియన్ లు ఈ దేశంలో ఉన్నారు. .
రష్యా, కిర్గిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు చైనాలు కజకిస్తాన్ కు సరిహద్దు దేశాలు. .
బార్లీ, పత్తి, గోధుమలు, వరి పండిస్తారు. పశుపోషణ కూడా కలదు. యూరేనియమ్, క్రోం, లీడ్, రాగి, మాంగనీస్, బొగ్గు, మొదలగు ఖనిజ సంపదలు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్ మరియు సహజవాయువు పుష్కలంగా లభిస్తాయి. పెంపుడు జంతువుల మాంసం, రోట్టెలు, బ్లాక్ టీ, పాలు వీరికి ఇష్టమైన ఆహారాలు.
Kuwait
Capital Kuwait City ………. Language Arabic ………. Currency Kuwait Dinar
Calling Code + 965 ………. Religion Islam
కువైట్
కువైట్ పశ్చమ ఆసియాలోని ఒక చిన్న దేశం. 17,820 చదరపు కిలీమీటర్ల వైశాల్యం కలిగి ఉన్నది. కువైట్ అరబిక్ దేశం. ఈ అరబిక్ దేశం మొత్తం 9 దీవుల సముదాయం. రాజధాని కువైట్ నగరం. వీరి భాష అరబ్బీ. వీరి కరెన్సీ పేరు కువైటీ దీనార్స్. ఇవి వివిధ దేశాల కరెన్సీ కన్నా చాలా విలువైనవి. ఒక కువైట్ దీనార్ దాదాపు 211 భారతదేశపు రూపాయలకు సమానం (2017 మారకపువిలువ ప్రకారం). పెట్రోల్ నిల్వలు అపారంగా ఉన్న సంపన్న దేశం.
కువైట్ కు ఉత్తర, పశ్చిమ దిశలలో ఇరాక్ దేశం మరియు దక్షిణ దిశలో సౌదీ అరేబియా దేశాలున్నాయి.
కువైట్ లో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతం. అంతే కాదు అత్యధిక ఉష్ణోగ్రత గల దేశం. జూన్ మరియు ఆగష్ట్ నెలలో వేడి విపరీతంగా ఉంటుంది. దాదాపు 50 సెల్సియస్ డిగ్రీలు దాటుతుంది. సంవత్సరమంతా ఇసుక తుఫానులు వస్తుంటాయి.
కువైట్ 1961 సంవత్సరంలో బ్రిటన్ నుండి స్వాతంత్ర్వం పొందింది. వీరి ప్రధాన ఆదాయం ఇంధన వనరుల ద్వారా వస్తుంది. ప్రపంచదేశాలలో వాడే పెట్రోలియ