ఎం.బి.ఎ……….హోటల్ మేనేజ్‌మెంజ్ అండ్…… హాస్పాలిటీ……. ఇంజనీరింగ్……ఐటి అండ్ కంప్యూటర్ సైన్స్……….జనరల్ మేనేజ్మెంట్ & బిజినెస్………ఫిజియో థెరపీ ………….మెడిసన్ & లైఫ్ సైన్సెస్ సోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ……….. లా………..మాస్ కమ్యునికేషన్ అండ్ మీడియా
ఇక్కడ అధిక విద్యాలయాలు ప్రవేశాల కోసం TOFFEL, IELTS స్కోరు తప్పనిసరి అనటంలేదు. కాకపోతే ఇంటర్మీడియ్ /ప్లస్2లోని ఇంగ్లీషు మార్కులు ఉత్తమంగా ఉండాలి.GRE అవసరంలేదు. మంచి IELTS స్కోరు 6- 7.5 బాండ్స్ మధ్య. ఇక్కడ విద్యాలయాలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి.
ఇక్కడ ఏడాదిలోని మాస్టర్ పూర్తిచేసే ఫాస్ట్‌ట్రాక్ విధానం విద్యార్థులను ఆకర్షిస్తుంది, మేనేజ్మెంట్, ఫార్మసీ కోర్సులు చేసేందుకు చాలామంది ఈ దేశం పట్ల ఆసక్తి చూపిస్తుంటారు. ఐ.టి. ఇంజనీరింగుకు మంచి డిమాండ్ వుంది. సైన్సెస్, బయోటెక్నాలజీ కోసం వెళ్ళేవారు పరిమితంగానే ఉంటున్నారు. కోర్సు తరువాత రెండేళ్ళపాటు ఓపెన్ వర్క్ పర్మ్ట్ కలిసోచ్చే అంశం.
అక్కడి పౌండ్ విలువ మన రూపాయల్లో రూ.70కి (ఒక పౌండ్ విలువ) పైగా ఉండటంతో యువతరం ఆ దేశంవైపు మొగ్గుచైపుతుంది. వీసా నిబంధనలను సైతం సులభతరం చేయడంతో చాలామంది లండన్ విద్యాసంస్థల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Category: Education in Abroad
కెనడాలో విద్యాభ్యాసం
నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలపరంగా విద్యార్థులు ఈ దేశంలో చదవటానికి మొగ్గు చూపుతున్నారు.
కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ పీజీ కోర్సులు ఇక్కడ ప్రాచుర్యం పొందాయి.
ప్రశాంతమైన వాతావరణం, ప్రామాణిక విద్యతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి ర్యాంకింగ్ పొందిన విశ్వవిద్యాలయాలు కెనడా విశిష్టతలు. ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 1,80,000 మంది విద్యార్థులు ఇక్కడికి విద్యాభ్యాసానికి వెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళుతున్నవారి సంఖ్యా వేలల్లో ఉంది.
విశ్వవిఖ్యాతి చెందిన 200 ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో 10% ఇక్కడే ఉన్నాయి. 2019గానూ క్యూఎస్ నిర్వహించిన ‘వరల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ’ల్లో కెనడాకు చెందినవే 26కుపైగా ఉన్నాయి. ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ రంగాల్లో పరిశోధనాత్మక బోధనతో కూడిన ప్రోగ్రామ్‌లు ఆకర్షిస్తున్నాయి.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజు సుమారుగా రూ.13.45 లక్షలు, పీజీ కోర్సులకు రూ. 8.68 లక్షలు, ఎంబీఏకు రూ.15.65 లక్షలు, ఎంబీఏ (ఎగ్జిక్యూటివ్) కోర్సుకు రూ.27.72 లక్షలు ఉంటుంది. ఎంచుకున్న ప్రదేశాన్ని బట్టి దైనందిన ఖర్చుల్లో తేడాలుంటాయి. సాధారణంగా నగరాన్ని బట్టి ఒక్కో విద్యార్థికి నెలకు రూ. 42,730 నుంచి రూ. 64,100 వరకూ అవుతాయి. పెద్ద పట్టణాల్లో అయితే నెలకు రూ.55,000 నుంచి రూ.66,000 వరకూ ఉంటుంది. కానీ యూనివర్సిటీలో నివాస సదుపాయం ఏర్పరచుకున్నవారికి తక్కువ ఖర్చు అవుతుంది.
(calucations…as per 2018)
ఏ కోర్సులకు గిరాకీ?
కంప్యూటర్ సైన్స్, ఐటీ కోర్సులు, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులకు ఎక్కువ గిరాకీ ఉంది. చాలామంది హెల్త్‌కేర్, ఒకేషనల్ కోర్సులను చేయడానికీ ఆసక్తి చూపుతున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, మెడిసిన్ సంబంధిత కోర్సులు, జాగ్రఫీ, మేథమేటిక్స్లకూ డిమాండ్ ఉంది. ఇక్కడ 100కుపైగా యూనివర్సిటీలున్నాయి. ఒక్కో కోర్సుకు ఒక్కో యూనివర్సిటీ పేరు. వరల్డ్ ర్యాంకింగ్స్ ప్రకారం అయితే..
యూనివర్సిటీ ఆఫ్ టోరంటో
యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ
యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా
మెక్‌గిల్ యూనివర్సిటీ
మెక్ మాస్టర్ యూనివర్సిటీ
యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్
యార్క్ యూనివర్సిటీ ప్రముఖమైనవి. పబ్లిక్ ఫండెడ్, ప్రైవేటు రెండు రకాల విద్యాసంస్థలున్నాయి. మొత్తంగా నాలుగు రకాల విద్యాసంస్థలు- టెక్నికల్/ కెరియర్ కాలేజీలు, కమ్యూనిటీ కాలేజీలు అండ్ టెక్నికల్ సంస్థలు, యూనివర్సిటీ కళాశాలలు, యూనివర్సిటీలు అందుబాటులో ఉన్నాయి.
మూడు సార్లు ప్రవేశాలు
ఏటా మూడు సార్లు (ఫాల్, స్ప్రింగ్, సమ్మర్ ఇన్టేక్స్) విద్యార్థులను తీసుకుంటారు. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఫాల్ ఇన్‌టేక్ సెప్టెంబరులో మొదలై డిసెంబరు వరకూ సాగుతుంది. దీనిలో చేరనివారు స్ప్రింగ్ (వింటర్) ఇన్‌టేక్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిలో తరగతులు జనవరిలో ప్రారంభమై, సెమిస్టర్ మే వరకూ కొనసాగుతుంది. ఇక ఏప్రిల్- మే నెలల్లో మొదలయ్యే సమ్మర్ ఇన్‌టేక్‌లో పరిమితమైన కళాశాలలూ, కోర్సులూ మాత్రమే ఉంటాయి. చాలా కళాశాలలు ఏడాది పొడవునా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తుండటం విశేషం.
దరఖాస్తు ప్రక్రియ కనీసం ఆరు నెలల ముందు నుంచే ప్రారంభమవుతుంది. మంచి సంస్థలో ప్రవేశం పొందాలనుకునేవారు తరగతులు ప్రారంభం కావడానికి కనీసం 10-12 నెలల ముందే దరఖాస్తు చేసుకోవాలి. చాలావరకూ కోర్సులు, ప్రోగ్రామ్‌లు ఫాల్ ఇన్‌టేక్‌లో ఉన్నవి స్ప్రింగ్ ఇన్‌టేక్‌లో ఉండాలనేం లేదు. కాబట్టి, దరఖాస్తు చేసుకోవడానికి ముందు కోరుకున్న కోర్సు అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి.
అందుబాటులో ఉన్న కోర్సులు
సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్, మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్. బ్యాచిలర్ డిగ్రీ/ అడ్వాన్స్డ్ డిప్లొమా/ డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సులు చదవడానికి సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తిచేసినవారు అర్హులు. మాస్టర్ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్/ డిప్లొమా చదవడానికి 16 ఏళ్ల విద్య లేదా బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి. బిజినెస్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధిత రంగంలో 2-3 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.
ఇమిగ్రేషన్
చదువు పూర్తయ్యాక అదే దేశంలో స్థిరపడాలనే కోరిక చాలామందిలో కనిపిస్తోంది. ఏటా ఈ దేశం రెండు లక్షల మందికి ఇమిగ్రేషన్ అవకాశం కల్పిస్తోంది. 15 నుంచి 18 నెలలు ఇక్కడ ఉన్నవారెవరైనా పర్మనెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కనీస అర్హత పాయింట్లు- 67ను సాధించాల్సి ఉంటుంది. ఇక్కడ స్థిరపడాలనుకునేవారికి రెండు అవకాశాలున్నాయి.
1. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ స్కీం: కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ స్కీం (సీఈఈ)లో తగిన నైపుణ్యాలు, పని అనుభవం ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు/ నిపుణులు స్థిరపడవచ్చు. ఇందుకు కావాల్సిన ప్రధాన అర్హత- ఇక్కడి సంస్కృతిని ఆకళింపు చేసుకోడానికీ, దేశ ఆర్థికవ్యవస్థకు సాయపడటానికీ సుముఖంగా ఉండటం. నైపుణ్యాలు, విద్య, భాషా సామర్థ్యం, పని అనుభవం, ఇతర అంశాల ఆధారంగా కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ (సీఆర్ఎస్) పాయింట్లు ఇస్తారు. కనీసం 440 పాయింట్లు ఉంటే ఈ పథకం వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తయినవారికి అదనపు పాయింట్లు లభిస్తాయి.
2. పీజీ వర్క్ పర్మిట్: స్థానిక సంస్థ నుంచి డిగ్రీ లేదా ప్రోగ్రామ్ స్టడీ చేస్తున్నవారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అందుబాటులో ఉంటుంది. ఈ తరహా వర్క్ పర్మిట్ నిర్ణీత మొత్తంలో పనిచేసిన తరువాత కెనడియన్ పర్మనెంట్ రెసిడెన్సీగా మార్పు చెందుతుంది.
స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్
విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో అడ్మిషన్ ప్రక్రియను వేగవంతం చేయటానికి విదేశీ విద్యార్థుల కోసం ‘స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్’ (ఎస్డీఎస్) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.
దీనివల్ల ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ తగ్గటమే కాకుండా వీసా ప్రక్రియ కూడా త్వరగా పూర్తవుతుంది. ఎస్డీఎస్ ప్రకారం… విద్యార్థులకు ఐఈఎల్టీఎస్ స్కోరు 6.5 ఉండాలి. వీరు ఏడాదికయ్యే దైనందిన జీవన వ్యయం (దాదాపు రూ.5.34 లక్షలు) మొత్తాన్నీ, ఏడాది కాలపు ట్యూషన్ ఫీజునూ బ్యాంకు అకౌంటులో డిపాజిట్ చేయాల్సివుంటుంది.
విద్యార్థుల క్షేమం దృష్ట్యా ఇక్కడి క్యాంపస్‌లు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. విశ్వవిద్యాలయాలు, సంస్థలు రోజు పొడవునా అందుబాటులో ఉండే సొంత సెక్యూరిటీ వ్యవస్థను కలిగివున్నాయి. అర్హత గల విద్యార్థి తన ఆసక్తి మేరకు క్యాంపస్‌లోగానీ, ఆఫ్క్యాంపస్లోగానీ పని చేసి, ఆదాయం పొందవచ్చు. వారానికి 20 గంటల చొప్పున, సెమిస్టర్ సెలవుల్లో ఫుల్ టైం ఉద్యోగాలను చేసుకునే వీలుంది. అయితే వీరు వర్క్ పర్మిట్ పొందడం తప్పనిసరి. క్యాంపస్‌లో పని చేయాలనుకునే వారికి మాత్రం అవసరముండదు. ఫుల్ టైం విద్యార్థులై ఉండాలి.
ప్రామాణిక పరీక్షల స్కోరు
ఐఈఎల్టీఎస్
కెనడాలోని అన్ని కోర్సులకూ ఈ స్కోరు తప్పనిసరి. ఎస్డీఎస్ స్కీం కింద కనీసం 6.5 స్కోరు సాధించాల్సి ఉంటుంది. కోర్సునుబట్టి అడిగే స్కోరులో మార్పు ఉంటుంది.
టోఫెల్
కొన్ని సంస్థలు ఈ స్కోరును అంగీకరిస్తున్నాయి. సాధించాల్సిన కనీస స్కోరు 80.
జీమ్యాట్
ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ అకౌంటెన్సీ, మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునేవారికి ఈ స్కోరు తప్పక ఉండాలి. అడ్మిషన్ పొందాలంటే కనీసం 500కుపైగా స్కోరు సాధించి ఉండాలి.
జీఆర్ఈ
తప్పనిసరేం కాదు. కొన్ని సంస్థలు మాత్రం ఈ స్కోరును అడుగుతున్నాయి. బిజినెస్, ఇతర మాస్టర్స్ ప్రోగ్రాములకు ఎక్కువగా ఈ స్కోరును అడుగుతున్నారు. టెక్నలాజికల్ కోర్సులకు మాత్రం 300కుపైగా స్కోరు ఉండాలి.
ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం
హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పాలిటి………….ఇంజనీరింగ్……….ఎం.బి.ఎ. ……….ఫిజియో థెరపి ………..మెడిసన్ & లైఫ్ సైన్సెస్……………….ఐటి అండ్ కంప్యూటర్ సైన్స్ …………..ఏవియేషన్ …………..సోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ……….. ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్………….మెడికల్ రేడియాలజీ
ఆస్ట్రేలియాలో ఇమ్మిగ్రేషన్ విభాగం వారు TOFFEL అనుమతించటం లేదు కాబ్టి IELTS పరీక్ష రాయటం తప్పనిసరి దానిలో స్కోరు తక్కువ వచ్చినప్పటికి, ఈ దేశంలో చదవటానికి అర్హత లభిస్తుంది. పరిగణనలోకి తీసుకునే స్కోరు 5. 5.5 జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునేవారు ఆస్ట్రేలియా వైపు మొగ్గుచూపుతారు.
దాడుల నేపధ్యంలో ఈ దేశానికి వెళ్ళేవారి సంఖ్య తగ్గినా ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే విద్యార్థులు చదువుల కోసం ఈ దేశానికి వెళుతున్నారు. ఇక్కడ జనాభా చాలా తక్కువ. రెండున్నర కోట్లు మాత్రమే. భూభాగం మనదేశం కంటే చాలారెట్లే పెద్దది. ఇక్కడి డాలర్ సైతం యూ.ఎస్. డాలర్‌తో పోటీ పడుతుంది. ఇవన్నీ మనవాళ్లని ఆకట్టుకునే అంశాలే. ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఐ.టి, వైద్యం చదివేందుకు వెళుతుంటారు.
ఉద్యోగాలకోసం ట్రేడ్ వర్కర్స్ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ స్థిరపడేందుకు మొగ్గుచూపుతుంటారు. నిరుద్యోగులకు వారి అర్హతలను బట్టి వెయ్యినుండి ఐదువేలవరకు నాన్ ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇక్కడ ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఈ దేశంలో అడుగుపెట్టేందుకు నిబంధనలు అంత సులభంగా ఉండవు. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఓవర్సీస్ హెల్త్ కవర్ వుండాల్సిందే. అక్కడ అన్ని మందులు దొరకవు. ఇక్కడనుండి తీసుకు వెళ్ళాల్సిందే.
నాణ్యమైన విద్య మాత్రమే కాకుండా చక్కని జీవనశైలి కావాలనుకునే విద్యార్థులకు గమ్యంగా ఎంచుకునే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. ఈ మద్య విద్యారంగంలో ఆస్ట్రేలియా ప్రాభవం కొంత తగ్గినప్పటికీ ప్రాచుర్యం మాత్రం అలాగే ఉంది.
ప్రపంచంలో నివాసయోగ్యమైన ద్రేశాల్లో అత్యుత్తమమైన వాటి జాబితాను తయారుచేస్తే దానిలో ఆస్ట్రేలియా తప్పనిసరిగా చోటు చేసుకుంటుంది. విద్యార్థులు ప్రామాణిక విద్య నేర్చుకోవానికి, విద్యాపరంగా అభివృద్ధి చెందానికి ఆసక్తి ఉంటే వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడానికీ ఆకర్షణీయమైన అవకాశాలున్న దేశమిది. ఇక్కడి వాతావరణం దాదాపు భారత్ తరహాలోనే ఉంటుంది. ఆస్ట్రేలియాలో చదవటానికి ఎక్కువమంది మొగ్గుచూపటానికి ఇదో ముఖ్య కారణం. రాజధాని కాన్బెర్రాతో పాటు, సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్ టోన్, పెర్త్, ఆడిలైడ్, డార్విన్, హోబర్ట్ ఇక్కడి ప్రధాన నగరాలు. ఈ దేశంలో జనాభా చాలా తక్కువ. అందులోనూ అందమైన తీరప్రాంతం పొడవునా జనజీవనం అధికంగా కనిపిస్తుంది.
ఆస్ట్రేలియా ప్రత్యేకతలు : అక్కడ చదువుకునే విద్యార్థుల్లో వినూత్న ఆలోచనాపథం, సృజనాత్మకత, స్వతంత్ర దృక్పథం పెంపొందుతాయనేది ప్రాచుర్యంలో ఉన్న అభిప్రాయం. బృందంలో పనిచేసే నేర్పు, ప్రభావశీలంగా భావప్రకటన, ప్రాయోగిక నైపుణ్యాలు మేధో సామర్ధ్యం, ఇవన్నీ మెరుగుపరుచుకుంటేనే అంతర్జాతీయ స్థాయిలో నెగ్గుకురాగలం. నాణ్యమైన విద్య మాత్రమే కాకుండా చక్కని జీవనశైలి కావాలనుకునే విద్యార్థులకు గమ్యంగా ఎంచుకునే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి
ఆధునిక కాలంలో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను నూతన బోథన పద్ధతుల ద్వారా అందిచంటం ఆస్ట్రేలియా ప్రత్యేకత. అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, బహుళ సంస్కృతులకు కేంద్రంగా ఉండటం ఇక్కడి విద్యాసంస్థల విశిష్టత. విదేశీ విద్యార్థులు ఎంచుకోవడానికి విస్తృతమైన స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. నవీన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి, పరిశోధనలకు వీలు ఏర్పడుతుంది.
ఆస్ట్రేలియా వివిధ సంస్కృతుల కేంద్రం కావటం వలన ఏ దేశానికి చెందినవారైనా ఇక్కడ సర్ధుకుపోగలరు. ఏడాదికి మూడుసార్లు ఆస్ట్రేలియాలో అడ్మిషన్ల సీజన్లు ఉంటాయి. అవి జులై, నవంబరు, ఫిబ్రవరి. అతి పెద్దది జులై ఇన్‌టేక్.
ప్రధాన నగరాల్లో, విశ్వవిద్యాలయాల్లో అత్యధికంగా కాస్మాపాలిటన్ వాతావరణం కనిపిస్తుంది. అక్కడి జీవనశైలి, ఆహార విహారాలపై అంతర్జాతీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. విదేశీ విద్యార్థులకు ఇది అనుకూలాంశం.
ఆఫ్ క్యాంపస్‌లోనూ అవకాశం
అమెరికాలో పార్ట్ టైమ్ ఉద్యోగాలను క్యాంపస్‌లో చేయటానికి మాత్రమే అనుమతిస్తారు. ఆఫ్ క్యాంపస్‌లో చేయడం చట్ట వ్యతిరేకం. కానీ ఆస్ట్రేలియాలో మాత్రం పార్ట్‌టైమ్ ఉద్యోగాలను ఆఫ్ క్యాంపస్‌లో కూడా చేసే వీలుంది. విదేశీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించే విషయం ఇది. మాస్టర్స్ కోర్సు చదివిన తర్వాత రెండేళ్ళ వర్క్ పర్మిట్ ఇస్తారు.
ఉన్నత స్థాయి బోధన
ఎన్నో అత్యున్నత ర్యాంకులున్న విశ్వవిద్యాలయాలు ఆస్ట్రేలియా ఇక్కడున్నాయి. 41కు పైగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ విద్యాసంస్థలే ఎక్కువ. చాలా యూనివర్సిటీల బ్రాంచీలకు విదేశాల్లో శాటిలైట్ క్యాంపసులున్నాయి. ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న ప్రసిద్ధ పరిశోధన కేంద్రాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవటం వల్ల విద్యార్థులకు శ్రేష్ఠమైన విద్యను అందింస్తాయి.
నాలుగు రకాల డిగ్రీ కోర్సులు.….
అండర్ గ్రాడ్యుయేట్:
ఈ బ్యాచిలర్ డిగ్రీల్లో చేరటానికి 18 సంవత్సరాలు నిండివుండాలి. కనీస ఆంగ్ల పరీక్ష ఐఈఎల్టీఎస్ లేదా టోఫెల్, పీటీఈలో స్కోర్లుండాలి. ఇంటర్లో కనీసం 65 శాతం అవసరం. అయితే 60 శాతం కంటే తక్కువున్నవారు ఫౌండేషన్స్, డిప్లొమా ప్రోగ్రాముల్లో చేరవచ్చు. రిసర్చ్ మాస్టర్స్:
దీనిలో చేరాలంటే బ్యాచిలర్ డిగ్రీ (ఆనర్స్) లేదా మాస్టర్స్ ప్రిలిమినరీ సంవత్సరం, పరిశోధన ఆధారిత గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా తగినంత పరిశోధనానుభవం ఉండాలి.
ప్రొఫెషనల్ మాస్టర్స్:
బ్యాచిలర్ డిగ్రీ, వృత్తిపరమైన అనుభవం లేదా సంబంధిత వృత్తిపరమైన విస్తృత అనుభవం ఉన్నవారు చేరవచ్చు.
టీఏఎఫ్ఈ సర్టిఫికెట్లు (ఒకేషనల్ శిక్షణ, విద్య):
అత్యంత నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో చేరాలనుకునేవారికి ఈ డిగ్రీలు ఉపయోగం. యూనివర్సిటీ డిగ్రీ చదువులకు కూడా ఇదో ప్రత్యామ్నాయ మార్గం.
స్కిల్డ్ ఆక్యుపేషన్ లిస్ట్ (ఎస్ఏఎల్)
మారుతున్న సామాజిక ఆర్థిక అవసరాలను బట్టి ప్రతి ఆరు నెలలకోసారి ఈ జాబితాను తయారుచేసి విడుదల చేస్తారు. దీనిలో ఉన్న కోర్సుల్లో ప్రవేశాలు పొందినవారికి అర్హతలను బట్టి వీసా సులభంగా మంజూరవుతుంది. సంబంధిత కోర్సుల్లో చదివి అక్కడే స్థిరపడటానికి అవకాశం ఉండటం ఆస్ట్రేలియాలో పెద్ద అనుకూలాంశం.
2017లో రూపొందించిన జాబితాలో పదికి పైగా ఇంజినీరింగ్ వృత్తులు చోటుచేసుకున్నాయి. కెమికల్, మెటీరియల్స్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, అగ్రికల్చరల్, బయోమెడికల్, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కంప్యూటర్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ ఇంజినీర్లు. ఇతరాలు: ఐసీటీ ప్రాజెక్ట్ మేనేజర్, ఐసీటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్, సిస్టమ్స్ అనలిస్ట్, అనలిస్ట్ ప్రోగ్రామర్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్, ఇంజినీరింగ్ మేనేజర్, మేనేజ్మెంట్ అకౌంటెంట్, అకౌంటెంట్ (జనరల్).
పీజీ….
మాస్టర్స్ డిగ్రీ చేయాలంటే ఆస్ట్రేలియన్ బ్యాచిలర్ డిగ్రీతో సమానమైన అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసివుండాలి. వీరు ఆస్ట్రేలియాలో కోర్సు పూర్తిచేయటానికి ట్యూషన్ ఫీజు, దైనందిన ఖర్చుల కోసం తగినన్ని ఆర్థిక వనరులు కలిగివుండటం తప్పనిసరి. మాస్టర్స్ చేయటానికి ఏడాదికి 8.20 లక్షల నుంచి 15.36 లక్షల వరకూ యూనివర్సిటీని బట్టి ట్యూషన్ ఫీజు ఉంటుంది. ఇక నివాసం, ఇతర దైనందిన ఖర్చులకు 10.39 లక్షలు అవసరం.(2018 లెక్కల ప్రకారం)
విద్యార్థి వీసా పొందటానికి….
ఏడాది ట్యూషన్ ఫీజు, జీవన వ్యయం, ప్రయాణ ఖర్చులకు సరిపోను డబ్బున్నట్టు ఆధారాలతోపాటు ఓవర్సీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. – విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం కనీసం 5.12 లక్షల రూపాయిలు ఉన్నట్టు ఆధారాలు చూపాలి.
ప్రతి దరఖాస్తునూ వివరంగా పరిశీలిస్తారు. సంతృప్తికరంగా తగిన సమాధానాలు ఇస్తే వీసాను మంజూరు చేస్తారు.
ఇంగ్లిష్ భాషా పరీక్షలు
ఆస్ట్రేలియాలో ఆంగ్లంలో బోధించే ప్రోగ్రాములు 60 వేలకు పైగా ఉన్నాయి. అందుకే అక్కడి యూనివర్సిటీలు తమ కోర్సుల్లో చేరబోయే విద్యార్థులకు మంచి ఆంగ్ల భాషా సామర్థ్యాలుండాలని ఆశిస్తాయి. అన్ని విశ్వవిద్యాలయాలూ అధికారికమైన మూడు ఆంగ్ల పరీక్షల స్కోర్లను ఆమోదిస్తాయి. వీటిలో ఏదో ఒక దానిలో స్కోరు ఉండాలి. దీ ఐఈఎల్టీఎస్ (అకడమిక్ మాడ్యూల్): ఓవరాల్ స్కోరు 6.5 (బ్యాండ్ కనీసం 6.0) దీ టోఫెల్ ఇంటర్నెట్: టెస్ట్ స్కోరు 79. సెక్షన్లవారీగా కనీసం ఉండాల్సిన స్కోర్లు: లిసనింగ్: 19, స్పీకింగ్: 19, రీడింగ్: 18, రైటింగ్: 22 దీ పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ (పీటీఈ): ఓవరాల్ స్కోరు 50-64 (సెక్షన్‌వారీ స్కోరు కనీసం 46-58) ఏ కోర్సులకు ప్రాధాన్యం : హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పాలిటీ, ఇంజినీరంగ్, ఎం.బి.ఎ. ఫిజియోధెరపీ, మెడిసన్ అండ్ లైఫ్ సైన్సెస్, ఐ.టి, అండ్ కంప్యూటర్ సైన్స్, ఏవియేషన్, స్పోర్ట్స్ మరియు స్పోర్ట్స్ మేనేజ్మెంట్ , ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్, మెడికల్ రేడియాలజీ.
మనదేశ విద్యార్థులు ఆస్ట్రేలియాలో ఎక్కువగా చేరుతున్న కోర్సులు బిజినెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, సైన్స్ హాస్పిలిటీ, మొదలైనవి. ఇక్కడ విద్యార్థులకు అత్యధిక అవకాశాలు అందించే డిగ్రీ కోర్సులు.. బిజినెస్ కోర్సుల నుంచి కంప్యూటర్ సైన్స్, ట్రేడ్స్, ఎడ్యుకేషన్ వరకూ అన్ని స్థాయిల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా విద్యా సంస్థలు అందించే డిగ్రీలను అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ గుర్తిస్తోంది. దీనివల్ల ఏ భారతీయ విశ్వవిద్యాలయంలోనైనా తర్వాతి చదువులకూ ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతుంది. ఆస్ట్రేలియా వ్యాప్తంగా వివిధ వొకేషనల్ విద్య, శిక్షణ కళాశాలల్లో చాలామంది విదేశీ విద్యార్థులు చెరుతున్నారు. నాణ్యమైన విద్యాసంస్థలూ, కోర్సులు అందుబాటులో ఉండానికి అక్కడి ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది. దీని ప్రకారం విద్యాసంస్థలన్నీ అక్రిడిటేషన్ పొందివుండాలి. అంతార్జతీయ విద్యార్థులకు అందించే కోర్సులన్నీ తప్పని సరిగా అనుమతి పొందివుండాలి. కామన్వెల్త్ రిజిష్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కోర్సెస్ ఫర్ ఓవర్సీస్ స్టూడెండ్స్లో లిస్టయివుండాలి. విద్యార్థులకు అందించే అర్హతలు ఆస్ట్రేలియన్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్‌కు తగివుండాలి.
ప్రవేశానికి ఏం కావాలి? కోర్సుల అవసరాలను బట్టి వివిధ దేశాలు, అక్కడి విశ్వవిద్యాలయాల్లో ఒక్కోరకమైన ప్రవేశ అర్హతను నిర్ధేశిస్తున్నాయి. ఆస్ట్రేలియా దేశంలో ఇమిగ్రేషన్ విభాగాం వారు టోఫెల్‌ను అనుమతించటం లేదు. కాబట్టి ఇక్కడ చదవదలిచిన విద్యార్థులు IELTS పరీక్ష రాయటం తప్పనిసరి. దానిలో స్కోరు తక్కువ వచ్చినప్పటికీ ఈ దేశాల్లో చదవటానికి ప్రవేశం లభిస్తుంది. పరిగణనలోకి తీసుకునే స్కోరు : 5-5.5. ఇన్టేక్స్ : ఇక్కడ ఇన్‌టేక్ రెండు సీజన్లలో జరుగుతుంది. ఇక్కడి విద్యాసంస్థల ప్రధానమైన ఇన్‌టెక్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి/మార్చి తొలిభాగంలో జరుగుతుంది. జులై/ఆగస్టు నెలల్లో మరో ఇన్‌టేక్ ఉంది. కోర్సుల్లో ఈ ఇన్‌టేక్‌లో కూడా ఎక్కువమందే చేరతారు. మే, అక్టోబరు, నవంబరుల్లో ప్రారంభమయ్యే కోర్సులు కూడా ఉన్నాయి.
. ఉపకారవేతనాలు : ఎక్కువమంది అంతర్జాతీయ విద్యార్థులు పూర్తి ఫీజును చెల్లించేవారే అయితే ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం, విద్యాసంస్థలు, ఇతర సంస్థలెన్నో ఉపకారవేతనాలు అందిస్తున్నాయి. వొకేషనల్ విద్య శిక్షణ, స్టూడెండ్ ఎక్సేంజెస్, అండర్ గ్రాడ్యుయేట్ పీజీ స్టడీ రిసర్చ్లలో ఈ వెసులుబాటు లభిస్తుంది.
ధరఖాస్తు సమయంలో : ఆస్ట్రేలియా విద్యాభ్యాసం కోసం చేసే దరఖాస్తుల్లో సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు జాబితా : బ్యాచిలర్ ఆఫ్ మాస్టర్ (యూనివర్సిటీ) టెన్త్ (ప్రిన్సిపల్ అటెస్టు చేసినది సీల్డ్ కవర్లో) 10+2 /డిప్లోమో (ప్రిన్సిపల్ అటెస్ట్ చేసినది సీల్డ్ కవర్లో). బ్యాచిలర్స్/మాస్టర్స్ విడి మార్క్ షీట్లు. కన్సాలిడిడేటెడ్/ప్రొవిజనల్/ డిగ్రీ/కోర్సు కంప్లీషన్.IELTS స్కోరు. రికమెండేషన్ లెటర్ (అవసరమైతే) స్టేట్ మెంట్ ఆఫ్ పర్పస్ (అవసరమైతే). లేదా రెస్యూమ్. ఎక్ప్పీరియన్స్ లెటర్ (ఉంటే). పాస్‌పోర్ట్ జెరాక్స్ (తొలి, చివరి పేజీలు) ఎక్స్ట్రా కరిక్యులర్ సర్టిఫికెట్ల (ఉంటే). పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
ఆస్ట్రేలియాకు చెందిన అంతర్జాతీయ విద్యారంగ నాణ్యత, పోటీలను పెంచేందుకు విద్యార్ధి వీసా ప్రోగ్రాంను సమీక్షించడానికి డిసెంబర్ 2010లో అక్కడి ప్రభుత్వం మైకేల్ నైట్ ను నియమించింది. ఆ సమీక్షకు సంబంధించిన మొత్తం 41 సిఫార్సులను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదించింది.
సిఫార్సులలో కొన్ని : బ్యాంకు ఖాతాలో ఉండాల్సిన ఫైనాన్సియల్ రిక్వైర్మెంట్ 70-80 వేల డాలర్లనుండి 36,000 డాలర్లకు తగ్గించింది. క్రితం విద్యార్థులు ఖాతాలో చూపించే నిధులు 3 నెలల క్రితంవి అయి ఉండాలి. ప్రస్తుతం తాజా డిపాజిట్లు కూడా చెల్లుతాయి. ఇంకా మిగతా పూర్తి వివరాలకోసం ఈ క్రింది సైట్ ను దర్శించండి.
http://www.immi.gov.au/students/_pdf/2011-knight-review.pdf
అమెరికాలో విద్యాభ్యాసం
ఇంజనీరింగ్…..పి.హెచ్.డి………ఐ టి అండ్ కంప్యూటర్ సైన్స్….ఎం.బి.ఎ………సోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ………..ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్…………బయో టెక్నాలజీ………ఫిజియో థెరపీ………….హోటల్ మేనేజ్‌మెంజ్ అండ్………..హాస్పాలిటీ పరిశోధనలు, ఉత్తమశ్రేణి విద్యానైపుణ్యానికి అమెరికా వీలు కల్పిస్తుంది.
అమెరికా వెళ్ళాలనుకునే వారికి ఆ దేశ సమచారం లభించే లైబ్రరీ ఉస్మానియా యూనివర్శిటి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్. జి.ఆర్.ఇ., టోఫెల్ పరీక్షల వివరాలు తెలుసుకోవచ్చు. ఓ.యూలో వున్న ఈ కేంద్రం నుండి ఆ దేశ సమాచారం, కోర్సుల వివరాలు, ఫీజులు, వసతుల సమాచారం గురించి ఎన్నో పుస్తకాలు అందుబాటులో వున్నాయి.రాతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తే కళాశాలల సమాచారం తెప్పించి అందజేస్తారు.
వివరాలకు ఫోన్ : 040-27098609.
పరిశోధనలు, ఉత్తమశ్రేణి విద్యా నైపుణ్యానికి యు.ఎస్.ఎ వీలు కల్పిస్తుంది. ప్రపంచంలో పేరున్న విశ్వవిద్యాలయాలు ఇక్కడ చాలా వున్నాయి. చదువుకుంటునే చట్టబద్ధంగా పార్ట్‌టైమ్ పనిచేసే అవకాశం కల్పిస్తారు. వర్శిటీ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ అనుమతితో పని చేసుకోవచ్చును.స్కాలర్షిప్ వస్తుంది. రీసెర్చ్ సహాయం క్రింద కొంత వస్తుంది, ఎఫ్-1 వీసా (స్టూడెంట్ వీసా) ఉన్నవారందరికి ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రధానంగా రెండేళ్ళ మాస్టర్ కోర్సుల కోసం అమెరికా వెళ్తుంటారు. ఎం.ఎస్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మెకానికల్, మేనేజ్మెంట్ కోర్సులు అభ్యసించేందుకు చాలామంది అమెరికా వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ రెండేళ్ళపాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. కోర్సు పూర్తయ్యాక ఏడాదిపాటు హెచ్-1 వీసా క్రింద వర్క్ పర్మిట్ ఇస్తారు. ఈ కాలంలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు హాజరవ్వటం ఉద్యోగం వెతుక్కోవటం చేసుకోవచ్చు.
ఈ దేశంలో ఇంజనీరింగ్, సైన్సులలో మాస్టర్స్ కోర్సులన్నింకీ GRE, Toffel, IELTS స్కోర్లు అవసరం. ఈ పరీక్షల స్కోర్లు లేకుండా ప్రవేశాలను అందించే విద్యాసంస్థలు లేకపోలేదు. కానీ ఈ పరీక్షలకు హాజరై మంచి స్కోరు సంపాదించటం మంచిది. మంచి GRE స్త్రష్ట్రజూ స్కోరు 1000-1200 మధ్య. మంచి Toffel స్కోరు80-95 మద్య. మేనేజ్మెంట్ కోర్సులలో చేరే విద్యార్థులకు GRE బదులు GMAT స్కోరు అవసరమవుతుంది. (మంచి స్కోరు (500-650 మద్య) చాలా విద్యాలయాలు పని అనుభవం కూడా అడుగుతున్నాయి. TOFFEL తప్పనిసరిగా ఉండాల్సిందే.
యు.కె వీసా ఎలా పొందాలి
యు.కె లో వీసా ప్రక్రియ యు.ఎ.యస్.తో పోలిస్తే తేలికగా ఉంటుంది . విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరవ్వనవసరం లేదు. వారు అన్ని డాక్యుమెంట్లతో కలిపి పూర్తి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.7-15 రోజుల్లో ప్రక్రియ ముగుస్తుంది
దరఖాస్తులు ఆన్లైన్లో భర్తిచేసి సమర్పించటం కోసం తేదీ, సమయం, అపాయంట్ మెంట్ తీసుకోవాలి. యు.కెలో చదవానికి వీసా కోసం, న్యూపాయింట్స బేస్డ్ సిస్టమ్‌కు చెందిన Tier 4 – students క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలి. వీసా దరఖాస్తుఫారం, వీసా సమాచారం పత్రాలు లభించే లింకు :
http::/ http://www.ukba.homeoffice.gov.uk/ visas-immegration
దరఖాస్తు ఫీజు 255 పౌండ్లు.(2016)
ఆర్థిక సామర్థ్యం నిరూపణకు: వీసా దరఖాస్తు తేదీ నాటికి నిధులు కనీసం 28 రోజుల క్రితానివి అయి ఉండాలి. సేవింగ్సు లేదా కరెంట్ అకౌంట్లో లభ్యమయ్యేలా ఉండాలి. అకౌంట్ విద్యార్థి పేరు మీదగానీ, స్పాన్సర్+విద్యార్థి పేర ఉమ్మడి అకైంట్ గానీ ఉండాలి 2009 ఆగస్టు 21 నుండి నిధులు తల్లిదండ్రుల పేర కూడా నిధులు చూపవచ్చని వెసులుబాటు కల్పించారు. ఫిక్సెడ్ డిపాజిట్లుంటే వాటి లభ్యత గురించి బ్యాంకులు నిర్థారణ లేఖ ఇవ్యాల్సి వుంటుంది. గరిష్టంగా 28 రోజుల లోపల నగదుగా మారేలా ఉండాలి. విద్యారుణం తీసుకునివుంటే బ్యాంకు మంజూరు లేఖ లేదీ నెలరోజులలోపుదై ఉండాలి. రుణ ఒప్పండం లేదా నియమనిబంధనల కాపీ కూడా జతచేయాలి. ఒకవేళ వీసా మంజూరుపై ఆధారపడే రుణ మంజూరు ఉండి వుంటే యు.కె. ప్రయాణించే సమయానికి రుణం పొందవచ్చు
నిధులు ఇలా చూపాలి : లండన్‌లో విద్యాభ్యాసమైతే : మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు+7200 పౌండ్లు (గరిష్టంగా 9 నెలలు) విద్యాభ్యాసం లండన్ వెలుపల అయితే : మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు: +5,400 పౌండ్లు (గరిష్టంగా 9నెలలు)
అవసరమైన డాక్యుమెంట్ల జాబితా :
1. VFAF 9 + అపెండిక్స్ 8 ఫార్మ్ (టయర్ 4-విద్యార్థి) గైడెన్స్ నోట్స్
2. పాస్‌పోర్టు
3. ఒకపాస్పోర్టు సైజ్ ఫోటో (45×35 మి.మీ.కలర్ ఆర్నెల్ల లోపుది)
4. బయోమెట్రిక్ వివరాలు
5. వీసా ఫీజు 255 పౌండ్లు (సమానమైన రూపాయలు. డీడీ రూపంలో) (2016)
6 విశ్వవిద్యాలయం నుంచి లేఖ. అన్ని డాక్యుమెంట్ల ఒరిజినల్ మరియు ఫోటో కాపి.
7. విశ్వవిద్యాలయం నుంచి బేషరతు ప్రతి.
8. ATAS సర్టిఫికెట్ (అవసరమైతే)
9.వసతి ట్యూషన్ రుసుము చెల్లింపు రసీదులు
10.బ్యాంకు స్టేట్ మెంట్లు – స్పాన్సర్లందరి నుంచి గత 28 రోజుల ఒరిజినల్స్)
11. టెన్త్ నుంచి చివరి డిగ్రీ వరకూ మార్క్షీట్లు
12. స్పాన్సర్‌కు సంబంధించిన అఫిడవిట్ – 20 రూపాయుల నాన్ జ్యూడిషయల్ స్టాంప్ పేపర్‌పై
13. వర్క్ అనుభవం సర్టిఫికెట్
14. ఫిక్సెడ్ డిపాజిట్ల రసీదులు (అవసరమైతే)
15. బ్యాంకు రుణ మంజూరు లేఖ (అవసరమైతే)
న్యూజిలండ్ వీసా పొందటం ఎలా
నిధుల బదిలీ పథకం (ఫండ్స్ ట్రాన్స్ఫర్) వంటి కొత్త వీసా నిబంధనలు అమల్లోకి వచ్చాక న్యూజిలాండ్ వీసా ప్రక్రియ ఎంతో సరళంగా మారింది. కానీ విద్యార్థులు టెలిఫోనిక్ ఇంటర్వ్యూకు తప్పనిసరిగా హాజరవ్యాల్సి వుంటుంది. పూర్తి దరఖాస్తులను సమర్పించాక వీసా ప్రక్రియ 3-8 వారాలపాటు నడుస్తుంది. సమాచారం, పత్రాల కోసం చూడాల్సిన లింకు:
http://www/immegration.gov.nz/migrant/general/formsandfees/formsandguides/study/htm
వీసా దరఖాస్తు ఫీజు : రూ.9000 (2017)
నిధులు ఇలా చూపవచ్చు : మొత్తం ట్యూషన్ ఫీజు + జీవనవ్యయం (10,000 డాలర్లు సంవత్సరానికి)
వీసాకు అవసరమైన డాక్యుమెంట్లు : దరఖాస్తు ఫారం (INZ 1012) అనుబంధ దరఖాస్తు ఫారం. హామీదరఖాస్తు ఫారం. హామీదారు సంతకం చేసిన ఫైనాన్సియల్ అండర్ టేకింగు (1014). పాస్‌పోర్ట్ కాపీ అన్ని పేజీలు+ఒరినల్ పాస్‌పోర్టు.
దరఖాస్తు ఫీజు రూ.9000 (న్యూ ఢిల్లీలో చెల్లెలా ì(Immigration New Zealand పేరిట డ్రాఫ్ట్). విద్యార్థి నేపధ్యం వివరాలు తెలిపే స్టేట్ మెంట్ ఆఫ్ పర్పస్ (విద్యార్థి ఈ కోర్సు ఎందుకు చదవాలనుకుంటున్నాడు. అతడి కెరియర్ లక్ష్యాలు, కోర్సు ఫీజు ఎలా చెల్లించగలుగుతాడు).
విద్యా సంస్థనుంచి ఆఫర్ లెటర్. ఫైనాన్సియల్ డాక్యుమెంట్లు : ఆరునెలల బ్యాంకు స్టేట్ మెంట్లు 6 మాసాల నాటి ఫిక్స్డ్ డిపాజిట్లు. విద్యారుణాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. తపాలా కార్యాలయ అకౌంట్స్. నేషనల్ సేవింగ్సు సర్టిఫికెట్స్.
విద్యాపరపైన సర్టిఫికెట్లు :IELTS స్కోర్ రిపోర్టు. వార్షిక ఆదాయ రుజువు (ఐటి రిటర్న్స్) ఎంఆర్ఓ ద్రువపత్రం. వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ (అవసరమైతే). పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, మెడికల్స్ ఎక్స్‌రే (ఫామ్). ఐదు పాస్ పోర్టు ఫోటోలు. స్పాన్సర్ది, విద్యార్ధిదీ అఫిడవిట్లు. మరో విధానంలో కూడా ఫైలింగు చేయవచ్చు. ఫండ్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద వీసా కోసం ఎలాంటి నిధులూ చూపించనక్కరలేదు. విద్యార్థి తన లేదా తల్లిదండ్రుల అకౌంట్ లో నేరుగా డిపాజిట్ చేయవచ్చు (తాజా డిపాజిట్లను అనుమతిస్తారు. ఒరిజనల్ డాక్యుమెంట్లు లేకపోతే వాటిని తప్పనిసరిగా నోటరైజ్ చేయాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా వీసా సమాచారం
ఆస్ట్రేలియా వీసా ఇంటర్వ్యూకు విద్యార్ధి హాజరయ్యే అవసరం లేదు. డ్రాప్‌బాక్స్ వీసా పద్ధతిగా దీన్ని చెప్పవచ్చు విద్యార్ధి అన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తే న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హైకమీషన్ వాటిని ప్రాసెస్ చేస్తుంది.
దరఖాస్తులు అన్లైన్లో పంపించే ఈ-వీసా పద్ధతికూడా ఉంది. దీనిలో ఆస్ట్రాలియాలోని ఆడిలైడ్‌లో దరఖాస్తులను ప్రాసెస్ చేస్తారు. డ్రాప్‌బాక్సు పద్ధతే ఎక్కువ ప్రాచుర్యం పొందినది, ఎక్కువమంది ఉపయోగిస్తున్నది.
నిధుల లభ్యత మార్గాలు ఈ రూపంలో: 1. ఫిక్సెడ్ డిపాజిట్లు – 3 నెలల కంటే ముందువి /6 నెలలవి.
2. బ్యాంకు బ్యాలన్సులు 3 నెలలకంటే ముందువి/6 నెలలకు.
3. విద్యారుణాలు : అంగీకృత ఆర్థిక సంస్థల నుంచి.
4. తపాలా డిపాజిట్లు ఏడాది కంటే పాతవి.
5. ప్రావిడెట్ ఫండ్ : విత్ డ్రా చేసుకోగలిగిన మొత్తం – తల్లిదండ్రులవి మాత్రమే.
6. వ్యక్తిగత రుణం/డిమాండ్ రుణం : అంగీకృత మార్గాల నుంచి.
నిధులను ఈ మార్గాల ద్వారా చూపవచ్చు. అయితే అది విద్యార్థి చదివే కోర్సు స్థాయిని బట్టి ఉంటుంది. విద్యార్థి బ్యాచిలర్, మాస్టర్స్ చదవబోతుంటే అతడు అసెస్మెంట్ లెవలెల్ 3 కిందకి వస్తాడు.
3 నెలల కింది నిధులను చూపించవచ్చు. ఏవరినైనా స్పాన్సర్‌గా పెట్టుకోవచ్చు. విద్యార్థి డిప్లొమా చదువుతుంటే అతడు అసెస్మెంట్ లెవెల్ 4 కిందకి వస్తాడు. నిధులను 6 నెలల కిందివి చూపించాల్సివుంటుంది. రక్త సంబంధీకులు మాత్రమే స్పాన్సర్లుగా ఉండాలి.
వీసాకు అవసరమయ్యే నిధులు : కోర్సుకు ట్యూషన్ ఫీజు: + జీవనవ్యవం (ఏడాదికి 18000 డాలర్లు) + ప్రయాణ, ఇతర ఖర్చులు (200 డాలర్లు) కోర్సు వ్యవధికి తగ్గట్టుగా విద్యార్థి నిధులు చూపాల్సి వుంటుంది. స్సాన్సర్ల నుంచి తగిన ఆదాయం కూడా చూపాలి. వీసా సమాచారం కోసం చూడాల్సిన లింకు: http://www.immi.gov.au/students