Thought of the day

పిల్లలు అద్దంలాంటి వారు,

ఎందుకంటే మనం శాయశక్తులా దాచటానికి

ప్రయత్నం చేసే నిజాన్ని గ్రహించగలిగే

అసమాన సామర్థ్యాన్ని, వారు కలిగి ఉంటారు.

Thought of the day

మన లక్ష్యసాధన కొరకు

మన సామర్థ్యంపై ఆత్మవిశ్వాసం కలిగి

ఉండుట ఒక ముఖ్యమైన విషయం.

Thought of the day

అహం ఒక కాలబిలం (కృష్ణ బిలం) వంటిది.

అది మన చైతన్యం మీద గురుత్వాకర్షణ శక్తి వంటి

బలంగా లాగిపట్టి ఉంచే శక్తిని కలిగిఉండి,

దాని విస్తరణను నిరోధిస్తుంది. 

Thought of the day

సరైన విధంగా ధ్యానం చేసినప్పుడు,

అది నీలో ఒక స్థితిని సృష్టిస్తుంది.

ఆ స్థితే నీలో మార్పును తీసుకువచ్చేది.

Thought of the day

ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చే బదులు,

ఇతరులను గౌరవించడం పట్ల దృష్టి సారిద్దాం. 

Thought of the day

విధి యొక్క మొట్టమొదటి సూత్రం ఏమిటంటే,

మనం దానిని కేవలం వర్తమానంలో మాత్రమే మార్చగలం.

Thought of the day

ధ్యానించే హృదయంలో

ప్రేమ మహోన్నతంగా ప్రకాశించినప్పుడు,

అది స్పృశించేది ఏదైనా ఉన్నతంగా పరివర్తన చెందుతుంది.

Thought of the day

లక్ష్యసాధన వైపు మనం వేసే ప్రతి చిన్న అడుగుతో,

మన సంకల్పశక్తి మరింత బలపడుతుంది.

Thought of the day

అన్ని సవాళ్లను ఆనందంగా

చిరునవ్వుతో అంగీకరించి,

ఆ తర్వాత వెలువడే అందాన్ని చూడు

Thought of the day

ప్రేమ మరియు భక్తితో నిండిన

హృదయంతో ప్రార్థించినప్పుడు,

దాన్ని వినిపించుకోకపోవడమనేది ఎన్నడూ జరుగదు.

Thought of the day

కోపాన్ని బాహ్యంగా వ్యక్తపరచకుండా,

దాన్నినువ్వు మారేందుకు,

నీ వైపుకు మళ్ళించు.

Thought of the day

ప్రేమతో ప్రియమైన వారికి స్వేచ్ఛనివ్వండి.

పంజరం నుండి ఎగిరిపోయే పక్షి

కూడా వెనుకకు మరలి వస్తుంది.

Thought of the day

మీరు ఎవరిలోనైనా లోపాన్ని కనుగొంటే,

దాని నుండి వారి విముక్తి కొరకు ప్రార్థించండి.

Thought of the day

మితత్వాన్ని అలవరుచుకొనడానికి

మన జీవితంలోని బాహ్య, అంతరంగ జీవన విధానాలు

రెండింటి పైనా ప్రత్యేక శ్రద్ధను ఉంచవలెను.

Thought of the day

నీతో నువ్వే ఒకటిగా లేకపోతే,

ఇతరులతో కలసి ఒక జట్టుగా ఎలా పని చేయగలవు?

మొదట నీ హృదయంతో పని చేయటం నేర్చుకో,

తరువాత జట్టుగా,

ఆ తరువాత ఒకే హృదయంతో పని చేయటం నేర్చుకో

Thought of the day

మానవులమైన మనందరం అపరిపూర్ణులమే.

ఇద్దరు అపరిపూర్ణ వ్యక్తులు

పరస్పరం ప్రతిస్పందించినప్పుడు

సహజంగానే ఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది.

Thought of the day

భరోసాతో కూడిన నిశ్శబ్దత

మరియు సమయోచిత అప్రమత్తత

ఉన్నప్పుడే హృదయం మాట్లాడుతుంది.

Thought of the day

పున్నమి చంద్రుడు

ఎంత అందంగా ఉన్నప్పటికీ,

అతడు సూర్యుడు లేకుండా మనలేడు కదా!

Thought of the day

ధ్యానంలో వలే మనస్సును

ఒక ఉన్నతమైన ఆలోచనపై స్థిరంగా నిలుపుటే,

మన మనఃక్రియలను నియంత్రించుటకు

యోగ్యమైన పద్ధతి. 

Thought of the day

యథార్థమైన ప్రేమ ఏది?

అది ప్రేమికుడు, ప్రియురాలు,

ప్రేమల త్రయము అదృశ్యమైన ఒక స్థితి.

Thought of the day

మరింత ఎక్కువగా ప్రేమిస్తే,

ప్రేమను ఏ మాత్రము కోల్పోకుండా,

మరింత ఎక్కువ ప్రేమను పొందుతారు.

Thought of the day

ప్రభావవంతమైన ధ్యానం,

ధ్యానించే వారిని అధిచేతనత్వపు

అనంత ఆకాశపు ఎత్తులకు,

ఉపచేతనా సముద్రపు లోతులకు నడిపించి,

విజ్ఞుడిగా ఆవిర్భవింప చేయాలి.

ఈ విధంగా మన చైతన్యం పరిణామం చెందుతుం ది.

Thought of the day

యోగం ఒక ఉపకరణం,

సమర్థవంతమైన వ్యక్తిత్వమే

దాని ఉత్పత్తి.

Thought of the day

మన మధ్యన ఐక్యత

లేకుంటే, వ్యక్తిగత

పురోభివృద్ధికి అర్థం ఏమిటి?

Thought of the day

మరింత వినమ్రుడిగా

తయారగుటవలన,

చైతన్యం అనంతంగా

విస్తరించే అవకాశమున్నది.

Thought of the day

ధ్యానంలో, మన చైతన్యం

మన అంతరంగపు లోలోతుల్లోకి,

మన అస్తిత్వపు మూలం వైపుగా కదులుతుంది.

Thought of the day

ఎదిగే పిల్లలు మొక్కలవంటి వాళ్ళు –

వారి ఎదుగుదలకు ప్రేమ మరియు

సూర్యరశ్మితో పాటు స్వేచ్ఛ కూడా అవసరం.

Thought of the day

మన సాధనల ఫలితంగా అంతర్గత ప్రశాంతత,

తేలికదనము సహజంగా ప్రాప్తిస్తే,

అప్పుడు మన ఆధ్యాత్మిక శిక్షణ ప్రభావవంతమైనది.

Thought of the day

మీరు ఎవరిలోనైనా ఏదైనా తప్పు కనుగొంటే,

దాని నుండి వారి స్వేచ్ఛ కోసం ప్రార్థించండి.

Thought of the day

మానవుని ఆత్మ,

అతనిలోని విచక్షణాశక్తికి

అనుగుణంగా నిర్మలమై ఉంటుంది. 

Thought of the day

విశ్రాంతిగా ఉన్నదేదైనా ప్రశాంతంగా,

స్థిరంగా ఉన్నదని అంటాం.

అత్యంత సూక్ష్మమైన

సహజత్వం యొక్క పేరే ప్రశాంతత.

Thought of the day

సమర్పణ మరియు ఓర్పు

మొదలైన వాటి శిక్షణా క్షేత్రమే గృహం.

ఇది తపస్సు మరియు

త్యాగం యొక్క గొప్ప రూపం.

Thought of the day

ఆధ్యాత్మికత అంటే

కాలంలో పురోగతి లేదా ప్రయాణం కాదు,

అది అనంతకాలంలో యాత్ర.

Thought of the day

మన ప్రకంపనా క్షేత్రం నిర్మలంగా,

సరళంగా అయ్యే కొద్ది,

మనం మరింతగా గమనించి,

శోధించి, ఉపచేతన, చేతన,

అధిచేతనల ప్రతిచ్ఛాయ అంతటికీ విస్తరించగలం.

Thought of the day

సమాధి అంటే సృష్టికి పూర్వం

అస్తిత్వంలో ఉన్న

సంపూర్ణ సమతుల్యస్థితి