Constitution

బెయిల్‌ vs పెరోల్‌

ఒక వ్యక్తిపైన ఏదైనా నేరం ఆరోపించబడి, ప్రాథమిక సాక్ష్యాధారాలతో పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఇంకా నేరం ఋజువుకాని ఆ వ్యక్తిని పోలీసు కస్టడీ లేక జ్యుడిషియల్ కస్టడీలో ఉంచకుండా వదిలిపెట్టమని కోర్టు ఇచ్చే ఆదేశం “బెయిల్”. పోలీసుల కస్టడీలో అనుమానితుడిని ఉంచవలసిన నేర తీవ్రత ఆ కేసులో లేదని, అతడిని స్వేచ్ఛగా వదిలితే పారిపోవడమో, సాక్షులను/సాక్ష్యాలను ప్రభావితం చేయడమో జరగదని కోర్టు నమ్మితే ఎవరి పూచీకత్తుమీదనైనా, కొంత డబ్బు కోర్టులో జమచేసి బెయిల్ పొందవచ్చు. బెయిల్ సమయంలో …

బెయిల్‌ vs పెరోల్‌ Read More »

తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు

మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతోపాటు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ, వారికి తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. హిందూ వారసత్వ చట్టంలో 2005 సవరణ ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిలో సంపూర్ణ హక్కు ఉంటుందని తేల్చి …

తండ్రి ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కు Read More »

Available for Amazon Prime