Archiology… Art Restoration/Conservation…. ఆర్ట్‌ రెస్టొరేషన్‌/కన్జర్వేషన్‌

పాత కట్టడాలకు మెరుగులు దిద్దిటం, తిరిగి పూర్వ రూపానికి తేవటం… దీన్ని ఆర్ట్‌ రెస్టొరేషన్‌ అంటారు. శతాబ్దాల నాటి కట్టడాలు కాలుష్యం తదితర కారణాలతో ప్రాభవాన్ని కోల్పోకుండా కాపాడుకోవడానికి వచ్చిన కొత్త కొలువులు.
చారిత్రక చార్మినార్‌, శతాబ్దాలనాటి తాజ్‌మహల్‌, విఖ్యాత విరూపాక్ష దేవాలయం… ఇలా ఎన్నో గొప్ప గొప్ప నిర్మాణాల మౌలిక స్వరూపం చెక్కుచెదరకుండా కాపాడటానికి కొన్ని కోర్సులు ఉన్నాయి. వీటిలో ప్రాచీన కళారూపాల పునరుద్ధరణకు, పరిరక్షణకు నిపుణులను తయారవుతారు. ఆర్ట్‌ రెస్టొరేషన్‌/కన్జర్వేషన్‌ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెంచుకుంటున్న కెరియర్‌గా ఎదుగుతోంది.రాతన కట్టడాలూ, అలనాటి శిల్పాలూ, చిత్రాలూ, పరికరాలూ, ఆయుధాలూ, ఆభరణాలూ.. ఏవైనా తరతరాల వారసత్వ సంపద. మ్యూజియాలకు వెళితే వందల, వేల సంవత్సరాల నాటి కళాఖండాలు కనువిందు చేస్తాయి. .
సాధారణంగా ఏ వస్తువులైనా, నిర్మాణాలైనా కాలం గడిచే కొద్దీ శిథిల స్థితికి చేరుతుంటాయి. అలాంటప్పుడు వేల ఏళ్ల క్రితం చెక్కబడిన మళ్లీ జీవం పోస్తూ ప్రస్తుత, భవిష్యత్‌ తరాలు తిలకించేలా భద్రంగా అందించేదే ఆర్ట్‌ రెస్ట్టొరేషన్‌. ఇదో శాస్త్రం, కళ! ఈ రంగంలో ప్రతిభ చూపేవారు ఆర్ట్‌ రిస్టోరేషన్‌ నిపుణులు. .
ఉష్ణోగ్రత, తేమలో మార్పులు, కాలుష్యం వంటి వాతావరణ ప్రభావాల కారణంగా వివిధ కళాఖండాలు అందాన్ని కోల్పోతుంటాయి. కొన్నిసార్లు క్షీణదశకూ చేరుకుంటాయి. అలాంటివాటిని శుభ్రం చేయడం, బాగుచేయడం, తిరిగి పాతరూపానికి తీసుకురావడం ఆర్ట్‌ రెస్టొరేటర్ల పని. కళాఖండాలు, కట్టడాలకు సంబంధించి.. సపోర్ట్‌ రెస్టొరేషన్‌ (చెక్కకు సంబంధించినవి), గ్రౌండ్‌ రెస్టొరేషన్‌, సర్ఫేస్‌ రెస్టొరేషన్‌, స్కల్‌ప్చర్‌ రెస్టొరేషన్‌ (విగ్రహాలు, శిల్పాలకు సంబంధించినవి), మెటల్‌ రెస్టొరేషన్‌ వంటి వివిధ విభాగాలుంటాయి. .
పెయింటింగ్‌ల నుంచి శిల్పాలూ, రాతప్రతుల వంటి వాటిపైనా వీరు పనిచేస్తారు. ప్రధానంగా కళాఖండాల మాతృక స్వభావం దెబ్బతినకుండా, తాజాగా కనిపించేలా చూస్తారు. ఇందుకు పలు రకాల పద్ధతులను అవలంబిస్తారు. సంప్రదాయాలకూ, ప్రాచీనతకూ విలువనిచ్చే మనదేశంలో వీరికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. .
పురాతన సంపదను కాపాడుకోవాలన్న స్పృహ పెరుగుతుండటంతో ఆర్ట్‌ రెస్టొరేటర్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. విగ్రహాలు, చరిత్ర, కళాఖండాలపై ఆసక్తి ఉన్నవారు దీన్ని ఎంచుకుంటే ఈ కెరియర్‌లో మెరుగ్గా రాణించగలుగుతారు. ఇందుకు తగ్గట్టుగానే ఎన్నో సంస్థలు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి. .
కోర్సుల వివరాలు…. ప్రముఖ సంస్థల్లో సర్టిఫికెట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, పీజీ డిప్లొమా, డాక్టోరల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్‌ రెస్టొరేషన్‌ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునేవారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తిచేసి ఉండాలి. ఆర్కియాలజీ, ప్రాచీన, మధ్యయుగ చరిత్ర, ప్రపంచ చరిత్ర మొదలైన సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలో చదివివుండాలి. మంచి పర్సంటేజీలో ఉత్తీర్ణత సాధించి ఉండటమూ తప్పనిసరి. వివిధ కళల పట్ల పరిచయం, పరిజ్ఞానం ఉంటే మేలు. .
సర్టిఫికెట్‌/ షార్ట్‌టర్మ్‌ కోర్సులు వ్యవధి సాధారణంగా మూడు వారాల నుంచి మూడు నెలలు ఉంటుంది. .
అందిస్తున్న సంస్థలు: .
– లియోన్‌ లెవీ ఫౌండేషన్‌ సెంటర్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ స్టడీస్‌, నాగ్‌పుర్‌ – నేషనల్‌ రిసెర్చ్‌ లేబొరేటరీ ఫర్‌ కన్జర్వేషన్‌ ‌ – నేషనల్‌ మ్యూజియమ్‌, న్యూదిల్లీ ‌ – నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా, దిల్లీ – నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కన్జర్వేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (ఐసీసీఐ) – పీజీ కోర్సులు కాలవ్యవధి రెండేళ్లు. ఎంఏ కన్జర్వేషన్‌, మాస్టర్‌ ఇన్‌ కన్జర్వేషన్‌, ప్రిజర్వేషన్‌ అండ్‌ హెరిటేజ్‌ మేనేజ్‌మెంట్‌, ఎంఏ కల్చరల్‌ హెరిటేజ్‌ అండ్‌ కన్జర్వేషన్‌ కోర్సులు.
అందిస్తున్న సంస్థలు:
– నేషనల్‌ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ – దిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ రిసోర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, దిల్లీ – ఉత్కల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కల్చర్‌, ఒడిశా పీజీ డిప్లొమా కాలవ్యవధి- ఏడాది.
అందిస్తున్న సంస్థలు:
– కర్ణాటక యూనివర్సిటీ (మైసూరులోని రీజనల్‌ కన్జర్వేషన్‌ లేబొరేటరీ, మైసూరుతో కలిసి పీజీ డిప్లొమా ఇన్‌ కన్జర్వేషన్‌ అండ్‌ హెరిటేజ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అందిస్తోంది)
– ఛత్రపతి శివాజీ మహరాజ్‌ వాస్తు సంగ్రహాలయ, ముంబయి (పీజీ డిప్లొమా ఇన్‌ మ్యూజియం అండ్‌ కన్జర్వేషన్‌ను అందిస్తోంది)
పీహెచ్‌డీ
అందిస్తున్న సంస్థలు – నేషనల్‌ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ
– సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజ్‌, ముంబయి కన్సర్వేషన్‌ అండ్‌ ప్రిజర్వేషన్‌ ఆఫ్‌ మెటీరియల్‌ కల్చర్‌ కోర్సును అందిస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల పార్ట్‌ టైం డిప్లొమా కోర్సు
– ద బిల్ట్‌ హెరిటేజ్‌ స్టడీస్‌ అండ్‌ కన్జర్వేషన్‌ లైమ్‌ ప్లాస్టర్‌, స్టకో, స్టోన్‌, మెటల్‌, వుడ్‌, గ్లాస్‌, సెరామిక్‌లలో మెటీరియల్‌ కన్జర్వేషన్‌ కోర్సులను అందిస్తోంది.
– ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ హెరిటేజ్‌ (ఐఎన్‌టీఏసీహెచ్‌) ఆర్ట్‌ రెస్టొరేషన్‌పై ఏటా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌ 27, 28 తేదీల్లో న్యూదిల్లీలో వీటిని నిర్వహిస్తున్నారు.
– డెక్కన్‌ కాలేజ్‌, పుణె డిప్లొమా ఇన్‌ హెరిటేజ్‌ సైట్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సైంటిఫిక్‌ కన్జర్వేషన్‌ కోర్సును అందిస్తోంది. కోర్సు కాలవ్యవధి- ఏడాది.
– యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌ పీజీ డిప్లొమా ఇన్‌ మ్యూజియాలజీ, టూరిజం, హెరిటేజ్‌ కోర్సును అందిస్తోంది. కోర్సు కాలవ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లుంటాయి.
ఈ కోర్సులను ఎంచుకోవాలనుకునేవారికి ఉండాల్సిన లక్షణాలు…
చరిత్ర, సంస్కృతి, వారసత్వం గురించిన అవగాహన, ఆసక్తి .ప్రతిదాన్నీ సూక్ష్మంగా, క్షుణ్ణంగా పరిశీలించే లక్షణం. గంటల తరబడి పనిచేయగలిగే ఓపిక. సైన్స్‌ నేపథ్యం ఉంటే మంచిది, వివిధ రకాల కళారూపాలపై పరిజ్ఞానంజకొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే మనస్తత్వం, త్వరగా స్పందించే గుణం.
సంబంధిత ఇంటర్న్‌షిప్‌లు, ఫీల్డ్‌ అనుభవం ఉన్నవారికి మంచి ఉద్యోగావకాశాలుంటాయి. సాధారణంగా రెస్టొరర్‌ కింద అప్రెంటిస్‌గానే కెరియర్‌ మొదలవుతుంది. ప్రాక్టికల్‌ పరిజ్ఞానం ఈ రంగంలో తప్పనిసరి. మొదట్లో మనదేశంలో వీరి సంఖ్య చాలా పరిమితంగా ఉండేది. గ్యాలరీలు, మ్యూజియాలు కొన్ని మాత్రమే ఉండేవి. ఆర్ట్‌ సంబంధ పరిశ్రమలు పుంజుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా మన కళాఖండాలకు ఆదరణ పెరిగింది. దీంతో దీనిపై దృష్టిసారించేవారి సంఖ్యా పెరిగింది. గ్యాలరీల సంఖ్య క్రమంగా వృద్ధి చెందుతూ ఆర్ట్‌ రెస్టొరర్లు, కన్జర్వర్లకు ఆదరణ పెరుగుతోంది. ఆర్ట్‌ గ్యాలరీలు, మ్యూజియాలు తమకంటూ ప్రత్యేకమైన నిపుణులను ఎంపిక చేసుకుంటున్నాయి. తమ వద్దకు వచ్చే వస్తువులూ, కళాఖండాలూ అసలైనవో నకిలీవో తెలుసుకోవడానికీ వీరిని ఉపయోగించుకుంటున్నాయి.
ఆక్షన్‌ సంస్థలు కూడా వీరిని ఎంచుకుంటున్నాయి. ఆర్ట్‌ వస్తువుల నిర్వహణ, వాటి పరిరక్షణ సంబంధిత విషయాల్లో మ్యూజియాల్లోని క్యూరేటర్లకు సాయపడతారు. ఆర్కియాలజీ, ప్రైవేటు ఆర్ట్‌ సంస్థలు, ఆర్ట్‌ డీలింగ్‌, ఆర్ట్‌ జర్నలిజం, టీచింగ్‌ సంస్థలూ వీరిని ఎంచుకుంటున్నాయి. సొంతంగా వ్యాపారాన్నీ నిర్వహించుకోవచ్చు. దిల్లీ, లఖ్‌నవూల్లోని నేషనల్‌ మ్యూజియం సెంటర్లు, ఐఎన్‌టీఏసీహెచ్‌ మొదలైనవి వీరిని ఎక్కువగా ఎంచుకుంటున్నాయి.
విదేశాల్లోనూ వీరికి ఆదరణ ఉంది. జీతభత్యాలు: సంస్థ, అనుభవం బట్టి జీతభత్యాల్లో తేడాలుంటాయి. కొన్ని సంస్థలు ప్రాజెక్టు ఆధారంగా ఎంపిక చేసుకుంటాయి. ఇవి ఇండివిడ్యువల్‌ ప్రాజెక్టుల పద్ధతిలో తీసుకుంటాయి.
కొన్ని గ్యాలరీలు కూడా కొన్నిసార్లు ఇదే పద్ధతిని అనుసరిస్తాయి. చాలావరకూ సంస్థలు శాశ్వత ఉద్యోగులుగానే తీసుకుంటాయి. అభ్యర్థులు తమ ఆసక్తి మేరకు ఈ రెండింట్లో ఏదో పద్ధతిలో ఉద్యోగంలో చేరొచ్చు. నైపుణ్యాధారిత కెరియర్‌ కావడంతో జీతాలు బాగానే ఉంటాయి. విదేశాలకు ఎంపికైతే ఇంకాస్త ఎక్కువ జీతాలను పొందే వీలుంటుంది.
మనదేశంలో ప్రారంభ వేతనం ఏడాదికి రూ.2,40,000 నుంచి రూ.3,60,000 ఉంటుంది.
విదేశాల్లో అయితే ప్రారంభ వేతనం ఏడాదికి 25,000 డాలర్ల నుంచి 60,000 డాలర్ల వరకూ ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ వేతనంలో మంచి మార్పును అందుకోవచ్చు.

జ్యూయెలరీ డిజైనింగ్

జ్యూయెలరీ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సు పూర్తి చేయడానికి ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు.
స్వల్పకాల వ్యవధి కోర్సులో ప్రవేశానికి ఇంటర్‌ పాసైనవారు అర్హులు.
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లలో డిగ్రీ, డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
జ్యూయెలరీ డిజైనింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన తర్వాత దేశంలోని పేరున్న ఆభరణాల సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేయవచ్చు. లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయవచ్చు.
కోర్సులను అందిస్తున్న కొన్ని సంస్థలు
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెమ్స్‌ అండ్‌ జ్యూయెలరీ, న్యూదిల్లీ, ముంబయి
జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ముంబయి
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జ్యూయెలరీ, ముంబయి
పెరల్‌ అకాడమీ ఆఫ్‌ ఫ్యాషన్‌, దిల్లీ, జయపుర, ముంబయి, నొయిడా
ఆర్క్‌ అకాడమీ ఆఫ్‌ డిజైన్‌, జయపుర
సొలిటైర్‌ డైమండ్‌ ఇన్‌స్టిట్యూట్‌, గోల్కొండ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైమండ్స్‌, హైదరాబాద్‌
పని వివరాలు
రాళ్లను కట్‌ చేయడం, చెక్కడం, సానబెట్టడం, విలువైన లోహాలు, రాళ్ల నాణ్యతను పరీక్షించడంలో శిక్షణ ఇస్తారు. లోహాలకు వివిధ రంగులు అద్దడం, విద్యుత్‌ సాయంతో ఒక లోహంపై వివిధ లోహాలను పూత పూయడం, లోహాలపై ఎనామిల్‌ పూత వేయడం, డిజైన్‌కు అనుగుణంగా లోహాలపై రాళ్లను పొందిగ్గా అమర్చడం, కంప్యూటర్‌ సహాయంతో నగల డిజైన్లు, నగలను తయారు చేయడంలో శిక్షణ ఇస్తారు. అధునాతన పద్ధతుల్లో విలువైన లోహాలతో నగలు రూపొందించడం నేర్పిస్తారు.
బంగారం, రత్నాభరణాల డిమాండ్‌ దృష్ట్యా ఈ కోర్సు పూర్తిచేసిన వారికి దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలూ పెరుగుతున్నాయి.
ఒకటి లేదా రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సు పూర్తి చేయడానికి సుమారు రూ.65,000 నుంచి 1,80,000 వరకు ఖర్చవుతుంది. తక్కువ కాలవ్యవధి ఉన్న కోర్సు పూర్తిచేయడానికి రూ.15,000 నుంచి 65,000 వరకు ఖర్చవుతుంది.
వేతనాలు: మొదట్లో రూ. 10,000 వరకు సంపాదించవచ్చు. అనుభవం పెరిగితే నెలకు రూ.20,000 వరకు వేతనం పొందవచ్చు. డిజైనర్లుగా మంచి పేరు తెచ్చుకున్నవాళ్లు నెలకు లక్ష రూపాయల వరకూ సంపాదించవచ్చు. ఫ్రీలాన్సర్‌గా పనిచేసేవారి ఆదాయం పూర్తిగా సృజనాత్మకత, మార్కెట్లో నైపుణ్యాలను ప్రదర్శించే నేర్పు మీద ఆధారపడుతుంది. ప్రముఖ ఆభరణాల సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఆభరణాల తయారీ, డిజైన్‌ చేసే సంస్థలు, జ్యూయెలరీ షాప్‌లు, షోరూమ్‌లో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. మార్కెట్లో పరిచయాలను పెంచుకోవడం, అప్పుడప్పుడూ జరిగే ఎగ్జిబిషన్లు, ట్రేడ్‌ ఫెయిర్లకు హాజరుకావడం ద్వారా ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పేరొందిన జ్యూయెలరీ సంస్థ లేదా డిజైనర్‌ దగ్గర ఇంటర్న్‌షిప్‌ చేసినా అనుభవం సంపాదించవచ్చు.
అందుబాటులోని కోర్సులు?
జ్యూయెలరీ డిజైన్‌ ఫౌండేషన్‌ కోర్సు, ఇండస్ట్రీ ఓరియంటెడ్‌ డిజైన్‌, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌, స్టయిల్స్‌ ఆఫ్‌ జ్యూయెలరీ డిజైన్‌, జ్యూయెలరీ డిజైన్‌ డిప్లొమా, జ్యూయెలరీ టెక్నాలజీ డిప్లొమా – బేసిక్‌, డిప్లొమా ఇన్‌ జ్యూయెలరీ డిజైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, జ్యూయెలరీ ఇన్‌ ఆర్గనైజ్డ్‌ రిటైల్‌ అండ్‌ లైఫ్‌స్టయిల్‌ మేనేజ్‌మెంట్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ జ్యూయెలరీ సీఏడీ టెక్నాలజీ-రైడో-3డి, సర్టిఫికెట్‌ ఇన్‌ జ్యూయెలరీ సీఏడీ టెక్నాలజీ-ఇన్నోవేట్‌-మ్యాట్రిక్స్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ డైమండ్‌ గ్రేడింగ్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ జెమాలజీ (ఇంటర్‌ పాసైనవారు అర్హులు). జ్యూయెలరీ టెక్నాలజీ డిప్లొమా – అడ్వాన్స్‌, డైమండ్స్‌ అండ్‌ డైమండ్‌ గ్రేడింగ్‌, కలర్డ్‌ జెమ్‌స్టోన్‌ ఐడెంటిఫికేషన్‌ అండ్‌ డిప్లొమా ఇన్‌ జెమాలజీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ జ్యూయెలరీ మేనేజ్‌మెంట్‌, మాస్టర్‌ మెడల్‌ మేకింగ్‌్ (ఈ కోర్సులకు డిగ్రీ పాసైనవారు అర్హులు).
కొన్ని సంస్థలు దూరవిద్యా కోర్సులనూ అందిస్తున్నాయి.

రూరల్ డెవలప్‌మెంట్ కోర్సు

అలహాబాద్‌లోని గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్… రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంబీఏ అందిస్తోంది.అర్హత: ఏదైనా డిగ్రీ., ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.gbpssi.nic.in
 
 గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్
 (ఐఆర్‌ఎంఏ), రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
 అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.irma.ac.in
 
రాంచీలోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ (ఎక్స్‌ఐఎస్‌ఎస్), రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.xiss.ac.in
 
ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.  వెబ్‌సైట్: www.ignou.ac.in
 
అనంతపురంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ కోర్సు అందిస్తోంది. 
అర్హత: ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.skuniversity.org
 
వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ కోర్సును అందిస్తోంది.అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ.
వెబ్‌సైట్: www.sdlceku.co.in

మెటీయోరాలజీ కోర్సు

ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం

 • కోర్సు: ఎంఎస్సీ (మెటీయోరాలజీ)
 • అర్హత: బీఎస్సీ (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్)
  ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
 • కోర్సు: ఎంటెక్ (అట్మాస్ఫియరిక్ సైన్స్)
 • అర్హత: మెటియోరాలజీ/ఫిజికల్ ఓషనోగ్రఫీ/ ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ.

వెబ్‌సైట్:  www.andhrauniversity.edu.in

సావిత్రీబాయి ఫూలే పుణె యూనివర్సిటీ

 • కోర్సు: ఎంటెక్ (అట్మాస్ఫియరిక్ సైన్స్)
 • అర్హత: బీఈ/బీటెక్ (మెకానికల్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్/కంప్యూటర్/సివిల్/అగ్రికల్చరల్/ఎన్విరాన్‌మెంటల్/కెమికల్/ ఏరోస్పేస్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/బయోమెడికల్/ ఇంజనీరింగ్ ఫిజిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్.
  వెబ్‌సైట్: www.unipune.ac.in
 • కోర్సు: ఎంఎస్సీ (అట్మాస్ఫియరిక్ సైన్స్)
 • అర్హత: బీఎస్సీ/బీఈ/బీటెక్. గ్రాడ్యుయేషన్ స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి.

కెరీర్ అవకాశాలు: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇండియన్ మెటీయోరాలజీ డిపార్ట్‌మెంట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇస్రో, డీఆర్‌డీఓ తదితర ప్రభుత్వ సంస్థలు మెటీయోరాలజీ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి.

సోషియాలజీ కోర్సులు

ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే సబ్జెక్టు సోషియాలజీ. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్టుగా అందుబాటులో ఉంది. అంతేకాకుండా సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ తదితర ప్రముఖ విద్యాసంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు పీజీ స్థాయిలో సోషియాలజీని అందిస్తున్నాయి. ఐఐటీలు కూడా సోషియాలజీని కోర్ సబ్జెక్టుగా లేదా ఇంటర్ డిసిప్లినరీ కోర్సుగా పలు స్థాయిల్లో (ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ) అందుబాటులో ఉన్నాయి. సోషియాలజీలో ఉమెన్ డెవలప్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్, ట్రైబల్ డెవలప్‌మెంట్ తదితర స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా అద్భుత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారు అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో అధ్యాపకులుగా అవకాశాలను దక్కించుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) విభాగాల్లో, ప్రభుత్వ పథకాల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. ఆఫీస్‌లో వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ కల్పించడం ద్వారా ఉద్యోగులతో మరింత ప్రభావవంతంగా పని చేయించుకునేందుకు ఎంఎన్‌సీలు కూడా సోషియాలజీ అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వాలు సామాజిక అభివృద్ధి కోణంలో విద్య, ఆహార భద్రత, ఆరోగ్యం తదితర విషయాల్లో వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సక్రమంగా అంది, సత్ఫలితాలు వచ్చేలా చేసే సుశిక్షితులైన నిపుణుల అవసరం ఉంది. ఈ క్రమంలో సోషియాలజీలో కోర్సులు పూర్తిచేసిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలో నెలకు కనీసం రూ.20 వేల వేతనం ఖాయం. సోషియాలజీలో కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు స్వయం ఉపాధి దిశగా ఆలోచించవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా, కమ్యూనిటీ కౌన్సిలర్లుగా మారొచ్చు.

వైల్డ్‌లైఫ్ బయాలజీ

కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు..1. నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్స్-బెంగళూరు.కోర్సు: ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్ బయాలజీ అండ్ కన్జర్వేషన్.
అర్హత: కోర్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.ncbs.res.in

2. ఏవీసీ కాలేజ్, మయిలదుతరై, తమిళనాడు.
కోర్సు: ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్ బయాలజీ.
అర్హత: లైఫ్‌లెన్సైస్ లేదా లైఫ్‌సైన్స్ అనుబంధ సబ్జెక్టులతో ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.avccollege.net

3. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుణె.కోర్సు: ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ యాక్షన్.
అర్హత: ప్యూర్ లేదా లైఫ్ సెన్సైస్‌లో బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ (ఏ బ్రాంచ్ అయినా) ఉత్తీర్ణులు అర్హులు. వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్‌లో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉన్న ఇతర డిగ్రీ అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://ieer.bharatividyapeeth.edu

4. గవర్న్‌మెంట్ ఆర్ట్స్ కాలేజ్, ఉదగమండలం, తమిళనాడు
కోర్సు: ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్.
అర్హత: బీఎస్సీ ఇన్ లైఫ్‌సెన్సెస్.
వెబ్‌సైట్: www.govtartscollegeooty.org.in

5. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-డెహ్రాడూన్.కోర్సు: ఎంఎస్సీ వైల్డ్‌లైఫ్ సైన్స్.
అర్హత: డిగ్రీ.
వెబ్‌సైట్: www.wii.gov.in

కెరీర్:

 • భారత్ సమృద్ధి జీవవైవిధ్యానికి నిలయం. అయితే ఆర్థిక లక్ష్యాలను చేరుకునే క్రమంలో దేశంలో వన్యప్రాణులు, వాటి ఆవాసాలకు ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో తక్షణం వాటి సక్రమ శాస్త్రీయ నిర్వహణపై దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తరుణంలో సంబంధిత నైపుణ్యాలున్న మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది.
 • వైల్డ్‌లైఫ్ కోర్సులు పూర్తిచేసిన వారికి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, జంతుప్రదర్శన శాలలు; జాతీయ, అంతర్జాతీయ జీవావరణ సంబంధిత సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం కావొచ్చు.

జాబ్ ప్రొఫైల్స్: వైల్డ్‌లైఫ్ టెక్నీషియన్, వైల్డ్‌లైఫ్ సైంటిస్ట్, ఎన్విరాన్‌మెంటల్ కన్సల్టెంట్, జూ క్యూరేటర్ తదితర హోదాలు ఉంటాయి.

మొబైల్ యాప్ డెవలప్‌మెంట్

ప్రస్తుతం చదివిన డొమైన్‌తో సంబంధం లేకుండా.. అన్ని రకాల కోర్సులు పూర్తిచేసిన వారికి చక్కటి ఉపాధి కల్పిస్తున్న విభాగం.. మొబైల్ యాప్ డెవలప్‌మెంట్. పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్స్ వినియోగం.. మొబైల్ గేమ్స్‌కు యువత ఆదరణతోపాటు.. యాప్ ఆధారిత సేవలవైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న నేపథ్యంలో యాప్ డెవలపర్స్‌కు మంచి డిమాండ్ నెలకొంది. దీనికి సంబంధించి ప్రత్యేక కోర్సులు, శిక్షణ ద్వారానే యాప్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలు సొంతమవుతాయి. ముఖ్యంగా యాప్ డెవలప్‌మెంట్ విభాగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటే.. సీ, సీ++, ఆబ్జెక్టివ్ సి వంటి కంప్యూటర్ లాంగ్వేజ్‌ల ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎంతో ముఖ్యం.

 • ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు సహా పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు యాప్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్ సైతం యాప్ డెవలప్‌మెంట్‌పై శిక్షణనిస్తున్నాయి. ఉడెమీ, ఎడ్యురేక, ఎడెక్స్ తదితర ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్స్‌లో సైతం ఆన్‌లైన్ విధానంలో మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా గూగుల్, ఒరాకిల్ సంస్థలు అందిస్తున్న సర్టిఫికేషన్ కోర్సులు కూడా పూర్తి చేయొచ్చు. వీటిని పూర్తి చేసుకుంటే మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
 • ఈ రంగంలో రాణించేందుకు.. సాంకేతిక నైపుణ్యాలతోపాటు క్రియేటివిటీ, అడాప్టబిలిటీ స్కిల్స్ కూడా ఉండాలి. అప్పుడే వినియోగదారుల అవసరాలు, మార్కెట్‌లో నెలకొన్న డిమాండ్‌కు అనుగుణంగా యాప్స్‌ను డెవలప్ చేసే నైపుణ్యం లభిస్తుంది.
 • నైపుణ్యాలున్న అభ్యర్థులకు నెలకు రూ.18వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం అందుతోంది. స్వయం ఉపాధి కోణంలోనూ యాప్ డెవలపర్స్‌కు అవకాశాలు విస్తృతం. సొంతంగా యాప్‌ను డెవలప్ చేసే ముందు దానికి సంబంధించి మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగడం ఎంతో అవసరం. ఫ్రీలాన్సింగ్ విధానంలో పనిచేస్తూ ఆదాయం పొందే అవకాశం ఉంది.

న్యూట్రిషన్ అండ్ డైటీషియన్

ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంలో, పోషకాహార లేమివల్ల సంభవించే వ్యాధులపై అవగాహన కలిగించడంలో న్యూట్రిషనిస్టులు, డైటీషియన్‌ల పాత్ర చాలా కీలకం. ఒక వ్యక్తి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయంగా ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి.. ఎంత మోతాదులో తీసుకోవాలి.. ఎన్నిసార్లు తీసుకోవాలి.. తదితర సూచనలను ఈ న్యూట్రిషన్, డైటిటిక్స్ నిపుణులు ఇస్తారు. శస్త్ర చికిత్స తర్వాత రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు అవసరమయ్యే ఆహారాన్ని వీరే సిఫార్సు చేస్తారు. స్థూలకాయంతో బాధపడుతున్నవారితోపాటు మధుమేహం, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న రోగుల ఆహార అలవాట్లకు అనుగుణంగా వైద్యుల సూచనలకు అనుగుణంగా ఆహార నియమాలను రూపొందించడంలోనూ వీరి పాత్ర కీలకం. దాంతో పోషకాహార అవసరాన్ని, ఆవశ్యకతను తెలిపే న్యూట్రిషన్, డైటీటిక్స్ నిపుణులకు ఆదరణ పెరుగుతోంది. న్యూట్రిషన్, డైటీషియన్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఆసుపత్రులతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ, ఫిషరీస్, బేబీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్స్ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్. 
కోర్సులు:
1. బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్
2. ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్
3. పీజీ డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్.
4. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.osmania.ac.in

పొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం- Oహెదరాబాద్.
  కోర్సులు:
 ఎంఎస్సీ(హోం సైన్స్)-ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://pjtsau.edu.inచూడొచ్చు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్- హైదరాబాద్.
 కోర్సులు:
ఎంఎస్సీ- అప్లయిడ్ న్యూట్రిషన్)
పీజీ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ న్యూట్రిషన్
ఎంఎస్సీ-స్పోర్‌‌ట్స న్యూట్రిషన్.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://www.nin.res.in

ఆంధ్రా విశ్వవిద్యాలయం- విశాఖపట్నం.

 కోర్సులు:
ఎంఎస్సీ – ఫుడ్స్
న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.andhrauniversity.edu.in

ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ-గుంటూరు.
  కోర్సు: ఎంఎస్సీ(హోంసైన్స్)-ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్.
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : https://angrau.ac.in

వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి.
 కోర్సు: ఎంఎస్సీ(హోమ్ సైన్స్)-న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్.
 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.svuniversity.edu.in

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, సర్టిఫికెట్ ఇన్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్ కేర్, సర్టిఫికెట్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులను దూర విద్య విధానంలో అందిస్తోంది. వివరాలకు http://www.ignou.ac.inవెబ్‌సైట్ చూడొచ్చు.

డా.బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌ను దూరవిద్య విధానంలో అందిస్తోంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.braouonline.in

ఫిట్‌నెస్ రంగంలో అపార అవకాశాలు-అందుకునేందుకు మార్గాలు…

ప్రస్తుతం ఆహారపు అలవాట్లు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు, జీవనశైలి కారణాలతో.. అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
Career guidance అందుకే ప్రతి ఒక్కరూ ఫిజికల్‌గా ‘ఫిట్’గా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువతలో ‘ఫిట్‌నెస్’కు ప్రాధాన్యం ఇచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫిట్‌నెస్ సెంటర్లకు, జిమ్‌లకు వెళ్లడం నేడు సర్వసాధారణంగా మారింది. దాంతో సరికొత్త కెరీర్ మార్గంగా నిలుస్తోంది.. ఫిట్‌నెస్ రంగం! ఈ నేపథ్యంలో… ఫిట్‌నెస్ రంగంలో అవకాశాలు, వాటిని అందుకునేందుకు మార్గాల గురించి తెలుసుకుందాం…

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. శారీరకంగా ఫిట్‌గా ఉంటేనే మానసిక ధృడత్వం సాధ్యం అవుతుంది. మానసికంగా బలంగా ఉంటేనే లక్ష్య సాధనలో ముందడుగు పడుతుంది. కాని ప్రస్తుతం జంక్‌ఫుడ్, జీవన శైలి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతోంది. ఇది గమనించిన యువత, మధ్యవయస్కులు ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారు. కొందరు సిక్స్ ప్యాక్ అంటుంటే.. మరికొందరు యోగా, మెడిటేషన్‌వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొంతమంది న్యూట్రిషన్‌పై దృష్టిసారిస్తున్నారు. ఇలా వివిధ మార్గాల్లో ఫిట్‌నెస్ పెంచుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకోసం జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

వృద్ధి బాట:
వాస్తవానికి దేశంలో ఫిట్‌నెస్ రంగం ఏటేటా వృద్ధి బాటలో పయనిస్తోంది. గతంలో ఫిట్‌నెస్ సెంటర్లు కేవలం మెట్రో నగరాలకే పరిమితమయ్యేవి. కానీ.. ప్రస్తుతం అవి ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు సైతం విస్తరిస్తున్నాయి. దేశ ఫిట్‌నెస్ రంగం ఏటా సగటున 9శాతం నుంచి 10శాతం వృద్ధి సాధిస్తున్నట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 908 మిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఉన్న భారత ఫిట్‌నెస్ రంగం.. 2022 నాటికి 1,296 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం ఫిట్‌నెస్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇటీవల పాఠశాల స్థాయిలో ‘ఫిట్ ఇండియా.. ఫిట్ స్కూల్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక- భారత జనాభాలో 24శాతం మంది పురుషులు, 43శాతం మంది మహిళలు శారీరకంగా చురుగ్గా లేరని(ఫిజికల్‌గా ఇన్‌యాక్టివ్) పేర్కొంది.

కార్పొరేట్ సంస్థలు సైతం :
నేటి పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాయి. ఫలితంగా ఒత్తిడి పరిస్థితుల్లో సైతం సమర్థంగా విధులు నిర్వహించే మానసిక దృఢత్వం లభిస్తుందని భావిస్తున్నాయి. అందుకే సంస్థల కార్యాలయాల్లో జిమ్‌లు, ఫిట్‌నెస్ క్లబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఫిట్‌నెస్ శిక్షణలో సర్టిఫికెట్ పొందిన వారిని ట్రైనర్స్‌గానియమించుకుంటున్నాయి. ఇలా..వ్యక్తుల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు..ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టడంతో అవకాశాల పరంగా ఎమర్జింగ్ కెరీర్‌గా మారుతోంది. ఫిట్‌నెస్ రంగంలో ఉపాధి పొందిన వారు నెలకు రూ. పది వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్జించే అవకాశముంది.

ఉపాధి వేదికలు :

 • ఫిట్‌నెస్ సెంటర్స్/జిమ్స్,హెల్త్‌కేర్ సెంటర్స్
 • హాస్పిటల్స్
 • హోటల్స్/ టూరిస్ట్ క్లబ్స్
 • కార్పొరేట్ కంపెనీలు.

స్వయం ఉపాధి :
{పస్తుతం ఫిట్‌నెస్ రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు సైతం పొందొచ్చు. ఫిట్‌నెస్ కల్చర్ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడమే ఇందుకు కారణం. ఫిట్‌నెస్ ట్రైనింగ్ నిపుణులు సొంతంగా ఫిట్‌నెస్ సెంటర్లను నెలకొల్పి ఆదాయార్జనకు మార్గం వేసుకోవచ్చు.
అవసరమైన నైపుణ్యాలు :
ఫిట్‌నెస్ రంగంలో రాణించాలనుకునే వారికి -సంబంధిత శిక్షణ సర్టిఫికెట్
 • కమ్యూనికేషన్ స్కిల్స్
 • సహనం, ఓర్పు
 • వ్యక్తుల అవసరాలను గుర్తించగలిగే నైపుణ్యం తప్పనిసరి.


ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులు :
ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా చక్కటి ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని శిక్షణ కేంద్రాల్లో ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల్లో ఫిజికల్ ఫిట్‌నెస్‌ను ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తున్నారు. వీటితోపాటు పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఫిట్‌నెస్ కోర్సులు అందిస్తున్నాయి.
అవి…

 • నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్-పాటియాల
 • సాల్ట్ లేక్ యూనివర్సిటీ – కోల్‌కత
 • నేషనల్ స్పోర్ట్స్ సౌత్ సెంటర్, యూనివర్సిటీ క్యాంపస్-బెంగళూరు
 • లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్- తిరువనంతపురం
 • హెచ్‌వీపీఎం – అమరావతి (మహారాష్ట్ర)
 • ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సెన్సైస్ – ఢిల్లీ
 • వీటితోపాటు ఠఛ్ఛీఝడ, ఠఛ్చీఛిజ్టీడ వంటి సంస్థలు ఆన్‌లైన్ విధానంలో ఫిజికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన(మజిల్ బిల్డింగ్, పైలేట్స్, టీచర్ ట్రైనింగ్ తదితర) కోర్సులు అందిస్తున్నాయి.
 • పలు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో బీపీఈడీ కోర్సు కరిక్యులంలో ఫిజికల్ ఫిట్‌నెస్ అంశాన్ని బోధిస్తున్నారు.
 • వీటితోపాటు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపుపొందిన పలు ప్రైవేట్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు సైతం శిక్షణ ఇస్తున్నాయి.
ఉద్యోగాలు ఇవే..
1
. ఫిట్‌నెస్ ట్రైనర్: జిమ్/ఫిట్‌నెస్ సెంటర్‌కు వచ్చే వ్యక్తులకు వారి ఆసక్తి, అవసరానికి అనుగుణంగా సంబంధిత శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి మజిల్ బిల్డింగ్ కోసం ఫిట్‌నెస్ సెంటర్‌కు వెళితే.. దానికి సంబంధించి ఎక్సర్‌సైజ్‌ల గురించి చెప్పడం, శిక్షణ, పర్యవేక్షించడం చేయాల్సి ఉంటుంది.
2. గ్రూప్ ఫిట్‌నెస్/జిమ్ ఇన్‌స్ట్రక్టర్స్: జిమ్‌కు వచ్చే వ్యక్తులందరికీ ఒకే సమయంలో ఫిట్‌నెస్‌పై శిక్షణనివ్వడం జిమ్ ఇన్‌స్ట్రక్టర్స్ పని. ఇతనికి ఫిట్‌నెస్ సెంటర్/జిమ్ స్థాయిని బట్టి నెలకు రూ.10వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది.
3. పర్సనల్ ట్రైనర్: ఫిట్‌నెస్ సెంటర్/జిమ్‌కు వచ్చిన సదరు వ్యక్తికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం పర్సనల్ ట్రైనర్ బాధ్యత. వీరికి నెలకు సగటున రూ.40వేల వరకు అందుతుంది.
4. ఏరోబిక్ ఇన్‌స్ట్రక్టర్: ఏరోబిక్స్ ఎక్సర్‌సైజ్‌కు సంబంధించి ప్రత్యేక శిక్షణనిచ్చే వారే ఏరోబిక్ ఇన్‌స్ట్రక్టర్స్. వీరికి నెలకు రూ.40 వేల వరకు వేతనం లభిస్తుంది.
5. ఫ్లోర్ ట్రైనర్: ఫిట్‌నెస్ సెంటర్‌లో ఒక ఫ్లోర్ మొత్తంలోని వ్యక్తులకు నిర్దిష్ట ఎక్సర్‌సైజ్‌లను సూచిస్తూ, అందుకు సహకరించడం ఫ్లోర్ ట్రైనర్ విధులు. వీరికి నెలకు రూ.20వేల వరకు వేతనం లభిస్తుంది.
6. వెయిట్ అండ్ లైఫ్ స్టయిల్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్: ఇటీవల కాలంలో కీలకంగా మారుతున్న ఉద్యోగం ఇది. ఊబకాయం ఉన్న వ్యక్తులకు అవసరమైన ఎక్సర్‌సైజ్‌ల గురించి చెప్పడం, అదే విధంగా డైట్ ప్లాన్ సూచించడం వంటివి కన్సల్టెంట్ విధులు.
7. మజిల్ బిల్డింగ్ ట్రైనర్స్: ప్రత్యేకంగా మజిల్ బిల్డింగ్‌పై ఆసక్తి కలిగిన వారికి శిక్షణ, పర్యవేక్షణ చేసే శిక్షకులే మజిల్ బిల్డింగ్ ట్రైనర్స్. వీరికి ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతోంది. నెలకు రూ.50వేల వరకు అందుకునే అవకాశముంది.
8. యోగా ఇన్‌స్ట్రక్టర్: ఫిట్‌నెస్ సెంటర్లలో యోగా ఇన్‌స్ట్రక్టర్లు అవసరం పెరుగుతోంది. సహజసిద్ధంగా దేహదారుఢ్యం పొందాలనుకునే వ్యక్తులు ఫిట్‌నెస్ సెంటర్లకు వెళుతున్నారు. ఇలాంటి వారి కోసం ఫిట్‌నెస్ సెంటర్ యాజమాన్యాలు యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించుకుంటున్నాయి.
9. ఫిట్‌నెస్ క్లబ్ మేనేజర్: ఫిట్‌నెస్ రంగానికి సంబంధించి కీలకమైన కొలువు.. ఫిట్‌నెస్ క్లబ్ మేనేజర్. ఇతను ఫిట్‌నెస్ సెంటర్ పర్యవేక్షణ, అవసరమైన పరికరాల కొనుగోలు వ్యవహారాలు చూడాల్సి ఉంటుంది.
10. ఫిట్‌నెస్ డెరైక్టర్: ఒక రకంగా ఇది ఫిట్‌నెస్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధిత కొలువు. మొత్తం ఫిట్‌నెస్ క్లబ్ కార్యకలాపాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.50 వేల వరకు వేతనం లభిస్తుంది.

ముఖ్యాంశాలు..

 • ఇంటర్మీడియెట్, డిగ్రీతోనే ఫిట్‌నెస్ కోర్సుల్లో చేరొచ్చు.
 • నిర్దిష్ట సర్టిఫికెట్‌తో ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
 • నెలకు రూ.10వేల నుంచి రూ.50వేల వరకు వేతనం లభిస్తుంది.
 • {పభుత్వ, ప్రైవేటు రంగంలో పలు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు
 • సీఐఐ స్పోర్ట్స్ కమిటీ అంచనాల ప్రకారం- 2024కి దేశంలో అయిదింతలు కానున్న ఫిట్‌నెస్ రంగం.
 • 2022 నాటికి 1,296 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ఏటా సగటున 9 నుంచి 10 శాతం వృద్ధి సాధిస్తుందని పేర్కొంటున్న అధికారిక గణాంకాలు.

పర్సనల్ ట్రైనర్స్‌కు డిమాండ్ :
 {పస్తుతం ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా పర్సనల్ ట్రైనర్స్‌కు డిమాండ్ నెలకొంది. పర్సనల్ ట్రైనర్‌గా రాణించాలంటే.. వ్యక్తిగతంగా ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. మొత్తంగా ఫిట్‌నెస్ కెరీర్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. శాయ్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో సర్టిఫికేషన్స్ పూర్తి చేసిన వారికి ప్రముఖ ఫిట్‌నెస్ సెంటర్లలో ఉద్యోగం ఖాయం.

‘గ్రాఫిక్ డిజైనింగ్’

ప్రస్తుత పోటీ ప్రపంచంలో వినియోగదారులను ఆకట్టుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా వస్తువు కస్టమర్స్ దృష్టిలో పడాలంటే..అది ఆకర్షణీయంగా ఉండాలి. అందుకు మార్గం.. గ్రాఫిక్ డిజైనింగ్. నేడు మీడియా నుంచి ప్యాకేజింగ్ వరకూ.. అన్ని రంగాల్లో గ్రాఫిక్ డిజైనింగ్ తప్పనిసరిగా మారింది. దీంతో నైపుణ్యం కలిగిన గ్రాఫిక్ డిజైనర్లకు అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు.
Career guidance దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం…

వినియోగదారులను కట్టిపడేసేలా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రకటనలు, బ్రోచర్లు, మ్యాగజీన్‌లు, కార్పొరేట్ నివేదికల కోసం ప్రొడక్ట్ డిజైన్‌లు, లే అవుట్‌లను రూపొందించే వారే గ్రాఫిక్ డిజైనర్‌లు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ వీరికి డిమాండ్ ఏర్పడుతోంది. ప్రపంచీకరణ, ఈ కామర్స్, డిజిటల్ మీడియా విప్లవంతో మార్కెట్‌లో వస్తువుల విక్రయానికి ప్రకటనలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఉత్పత్తులను ఎంత ఆకర్షణీయంగా రూపొందించి, మార్కెట్‌లోకి తీసుకెళ్లగలిగితే అంతగా డిమాండ్ పెరుగుతుంది.

ఉద్యోగ అవకాశాలు :అడ్వర్‌టైజింగ్, ప్రొడక్ట్ డిజైన్, లోగో డిజైన్, మీడియా, వెబ్‌సైట్లు, పోర్టళ్ల డిజైనింగ్ వంటి వాటిలో అవకాశాలున్నాయి. ప్యాకేజింగ్ సంస్థల్లో, డిజైన్ స్టూడియోల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్ డిజైనర్లకు ప్రకటనలు, ఇన్ఫర్మేషన్, ఎన్విరాన్‌మెంట్ డిజైన్, ప్రింట్, పబ్లికేషన్ ఇండస్ట్రీ, మల్టీమీడియా, సోషల్ మీడియా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఇంటరాక్టివ్ మీడియా డిజైనర్స్, అడ్వర్‌టైజింగ్- కమ్యూనికేషన్, ప్యాకేజింగ్ డిజైనర్, క్రియేటివ్ ప్రొడక్ట్ వంటి విభాగాల్లో సొంతంగా పనిచేసుకోవడంతోపాటు మరికొంతమందికి ఉపాధిచూపించవచ్చు. నగరాలతోపాటు ద్వితీయశ్రేణి పట్టణా ల్లోనూ డిజైన్ స్టూడియోలు ఏర్పాటవుతున్నాయి. ఆసక్తి ఉంటే సొంతంగా స్టూడియోను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక సినిమాలు, టీవీ సీరియళ్లలో కూడా వీరికి ఆఫర్లు అందుతున్నాయి

జాబ్ ప్రొఫైల్స్ : 
గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో గ్రాఫిక్ డిజైనర్, ప్రొడక్ట్ డిజైనర్, వెబ్ డిజైనర్, లోగో డిజైనర్, లేఅవుట్ ఆర్టిస్ట్, మల్టీ మీడియా డిజైనర్, క్రియేటివ్ డెరైక్టర్, ఆర్ట్ డెరైక్టర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి.

అర్హతలు : 
గ్రాఫిక్ డిజైనింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరొచ్చు. డిప్లొమాలో చేరాలంటే.. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తిచేయొచ్చు. పీజీలో చేరడానికి గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి.

అవసరమైన స్కిల్స్ :

 • అకడమిక్‌గా ఎన్ని అర్హతలున్నా.. నైపుణ్యం లేకుంటే ఈ రంగంలో రాణించలేరు. గ్రాఫిక్ డిజైనర్‌గా రాణించాలనుకునే వారికి సృజనాత్మకత తప్పనిసరి. దాంతోపాటు సంబంధిత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్, టోపోగ్రఫీ, ఫోటోగ్రఫీ, ఇలస్ట్రేషన్స్, అడోబ్ క్రియేటివ్ యాప్స్, ఇంటరాక్టివ్ మీడియా, కోడింగ్ తదితర నైపుణ్యాలుంటే కెరీర్‌లో రాణించేందుకు అవకాశం ఉంటుంది.
 • గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే.. సృజనాత్మకతే ఏకైక సాధనం. క్లయింట్లకు సంతృప్తిని కలిగించే ఔట్‌పుట్ ఇస్తే అవకాశాలకు,ఆదాయానికి లోటుండదు. అందుకోసం వినియోగదారుల అభిరుచులను తెలుసుకొనే నేర్పు ఉండాలి. మార్కెట్‌లో ఎక్కడ అవకాశాలు లభిస్తాయో తెలుసుకోవాలి. ప్రారంభంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటే కెరీర్‌లో త్వరగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ డిజైన్ ట్రెండ్స్‌ను నిశితంగా పరిశీలిస్తూ స్కిల్స్ పెంచుకోవాలి. ఈ రంగంలో ఫ్రీలాన్స్ డిజైనర్‌గా కూడా పనిచేసుకోవచ్చు.

వేతనాలు : గ్రాఫిక్ డిజైనర్లకు ప్రారంభంలో నెలకు రూ.20వేల నుంచి రూ.30వేల వేతనం లభిస్తుంది. కనీసం ఐదేళ్లపాటు పనిచేసి నైపుణ్యాలు, అనుభవాన్ని పెంచుకుంటే నెలకు రూ.50 వేలకు పైగానే అందుకోవచ్చు.

 కోర్సులను అందిస్తున్న సంస్థలు
 గ్రాఫిక్ డిజైన్‌కు సంబంధించి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాల్లో గ్రాఫిక్ డిజైనింగ్‌పై అవగాహన పెంచుకునే వీలుంది. ముఖ్యంగా జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్ వంటి సంస్థలు అందించే కోర్సులు ఉపయుక్తమని చెప్పొచ్చు.

ఈ కామర్స్

ఈ-కామర్స్… ఆన్‌లైన్ షాపింగ్.. నేడు మన దైనందిన జీవితంలో భాగం! బిర్యానీ నుంచి యాపిల్ ఫోన్ వరకూ.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ-కామర్స్ సైట్లను.. ఆశ్రయిస్తున్న వైనం! ఇంటి దగ్గరికే తమకు నచ్చిన వస్తువులను ఈ-కామర్స్ సంస్థలు అందిస్తుండటమే ఇందుకు కారణం! దాంతో గత కొంతకాలంగా ఈ-కామర్స్ రంగం కళకళలాడుతోంది! ముఖ్యంగా ఫుడ్, రిటైల్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్స్, హోమ్ అప్లయన్సెస్ వంటి విభాగాల్లో.. ఈ-కామర్స్ దూసుకుపోతోంది!! ఇదే ఇప్పుడు యువతకు కొలువుల కల్పతరువుగా మారింది. పలు సంస్థల అంచనాల ప్రకారం-ఈ కామర్స్‌లో రానున్న మూడేళ్లలో అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల సంఖ్య దాదాపు పది లక్షలు. ఈ నేపథ్యంలో.. ఈ-కామర్స్ రంగంలో లభించే కొలువులు.. సరికొత్త జాబ్ ప్రొఫైల్స్.. అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం…
Career Guidance‘రానున్న అయిదేళ్లలో భారత్‌లో మిలియన్ ఉద్యోగాలను కల్పిస్తాం’-ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ‘సీఈవో జెఫ్ బెజోస్’ చేసిన తాజా ప్రకటన. ఇది ఒక్క అమెజాన్ సంస్థకు సంబంధించి భవిష్యత్తు నియామకాల ప్రణాళిక మాత్రమే. దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, పేటీఎం వంటి వాటి నియామక ప్రణాళికలను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ సంఖ్య రానున్న అయిదేళ్లలో దాదాపు 20 లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణుల అంచనా. నియామకాల పరంగా ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ అంచనాలు, డెలాయిట్ సంస్థ నివేదికలు, ఇతర సంస్థల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటే.. 2022 నాటికి ఈకామర్స్ రంగం పది లక్షలకు పైగా కొలువులకు వేదికగా నిలవనుంది. ఈ-కామర్స్ కార్యకలాపాలపై నియంత్రణ విధించాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నప్పటికీ.. ఈ- కామర్స్ సంస్థలకు పెరుగుతున్న ఆదరణే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు 2021 చివరి నాటికి ఈ-కామర్స్ మార్కెట్ విలువ 84 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా.

ముఖ్యంగా ఆ అయిదు :ఈ-కామర్స్, ఆన్‌లైన్ సేల్స్ కార్యకలాపాల పరంగా అయిదు విభాగాలు పురోగమన బాటలో నడుస్తూ.. యువత ఉపాధికి ఊతమవివ్వనున్నాయి. రిటైల్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, టికెటింగ్ అండ్ ట్రావెలింగ్, క్లాసిఫైడ్ జాబ్ పోర్టల్స్, హైపర్‌లోకల్స్ విభాగాల్లో నియామకాల సంఖ్య ఊపందుకోనుంది. ఇప్పుడు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అనేక ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఉద్యోగ అన్వేషణలో ఉన్న అభ్యర్థుల కోసం కొత్త జాబ్ పోర్టల్స్ ఏర్పాటవుతున్నాయి. వీటి నిర్వహణకు సమర్థవంతమైన నిపుణుల అవసరం ఉంటుంది. దాంతో ఆయా విభాగాల్లో ఎంట్రీ లెవల్ నుంచి ఉన్నత స్థాయి వరకూ.. కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.

లాజిస్టిక్స్ విభాగం :ఉద్యోగాల కల్పన విషయంలో ముందంజలో నిలుస్తున్న మరో ఈ కామర్స్ విభాగం.. లాజిస్టిక్స్. ముఖ్యంగా రిటైల్ ఈ-కామర్స్ సెగ్మెంట్‌లో లాజిస్టిక్స్ పాత్ర ఎంతో కీలకం. ఒక వస్తువును వినియోగదారుడు ఆర్డర్ చేసినప్పటి నుంచి అతని చేతికి చేరే వరకూ.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా డెలివరీ చేయడమే లాజిస్టిక్స్ నిపుణుల ప్రధాన బాధ్యత. కాబట్టి లాజిస్టిక్స్‌లో భారీ సంఖ్యలో సిబ్బంది నియామకానికి ఈ-కామర్స్ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ప్రొడక్ట్ డిజైన్ టు మార్కెటింగ్ :ఈ-కామర్స్ సంస్థల్లో ప్రస్తుతం ప్రొడక్ట్ డిజైన్ మొదలు బ్రాండింగ్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, ఫైనాన్స్.. ఇలా పలు విభాగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సంస్థలు బ్రాండింగ్, మార్కెటింగ్‌కు ప్రాధాన్యమిస్తూ.. ఇందుకు సంబంధించి ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, సీఆర్‌ఎం, మార్కెటింగ్ విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫిన్‌టెక్ సంస్థల్లో ఫైనాన్స్ నిపుణుల అవసరం పెరుగుతోంది. అలాగే ప్రస్తుతం ఈ-కామర్స్ రంగంలో అందుబాటులో ఉన్న జాబ్ ప్రొఫైల్స్‌ను చూస్తే.. సంప్రదాయ డిగ్రీ కోర్సులు మొదలు టెక్ గ్రాడ్యుయేట్ల వరకూ.. అన్ని రకాల అర్హతలున్న వారికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పదో తగరతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకూ.. ప్రతి ఒక్కరికీ అవకాశాలకు వేదికగా ఈ-కామర్స్ రంగం నిలుస్తోంది. ఎంబీఏ చేసిన వారికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి.

ఏఐ నిపుణులకు డిమాండ్ :ఈ-కామర్స్ రంగంలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దాంతో ఏఐ, మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలున్న వారి కోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు.. ఐఐటీలు వంటి టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించి ఏఐ నిపుణుల నియామకాలు చేపడుతున్నాయి. రోబోటిక్ స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యం లభిస్తోంది.

డేటా అనలిటిక్స్ :ఈ-కామర్స్ రంగంలో వినియోగదారుల డేటాను క్రోడీకరించి వారికి అవసరమైన పర్సనలైజ్డ్ ప్రొడక్ట్స్‌ను గుర్తించడం కీలకంగా మారింది. అందుకే వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్‌ల గురించి తెలియజేసి.. వారిని ఆకట్టుకోవడం ద్వారా వ్యాపార కార్యకలాపాలు విస్తరించేలా సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈకామర్స్ విభాగాల్లో కొలువుల పరంగా డేటా అనలిటిక్స్ నిపుణులకు ఇటీవల కాలంలో ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా డేటాఅనలిటిక్స్, డేటాసైన్స్ విభాగాల్లో ప్రత్యేక కోర్సులు, సర్టిఫికేషన్లు చేసిన వారికి ఈ-కామర్స్ సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లోనే డేటా అనలిస్ట్‌లకు రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.

పదో తరగతి అర్హతతోనే..ఈ-కామర్స్ సంస్థల్లో ఆన్‌లైన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్; ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం; డెలివరీ అసోసియేట్స్; ప్యాకర్స్; లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్స్; ఫోన్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్స్; కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్; వేర్‌హౌస్ సూపర్‌వైజర్స్/మేనేజర్స్, డెలివరీ హబ్ మేనేజర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ప్యాకర్స్,ఫోన్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్/కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు పదోతరగతి మొదలు సంప్రదాయ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకూ అందరూ అర్హులే. కోర్ సెక్టార్‌లోని లాజిస్టిక్స్, డేటా అనలిస్ట్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాలకు సంబంధిత అర్హతలున్న వారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రారంభంలో 15వేల వేతనం దక్కుతోంది. నైపుణ్యాలుంటే కోర్ విభాగాల్లో నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం అందుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్స్, డెవలపర్స్ :కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ-కామర్స్ సంస్థల్లో ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, ప్రోగ్రామర్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. కోడింగ్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ లాంగ్వేజ్ నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌గా, ఎగ్జిక్యూటివ్స్‌గా సంస్థలు నియమించుకుంటున్నాయి. ఎంట్రీ లెవల్‌లోనే సగటున రూ. నాలుగు లక్షల వార్షిక వేతనం అందుతోంది.

వెబ్ డెవలపర్స్ :ఈ-కామర్స్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్న మరో విభాగం.. వెబ్ డెవలప్‌మెంట్. ఏ సంస్థ అయినా వినియోగదారులను ఆకట్టుకోవాలంటే.. ముందుగా సదరు సంస్థ వెబ్‌సైట్ ఆకర్షణీయంగా ఉండాలి. ఇందుకోసం వెబ్ డిజైనర్స్, డెవలపర్స్, వెబ్ పేజ్ అడ్మినిస్ట్రేటర్స్‌కు డిమాండ్ నెలకొంది. వీరికి ప్రారంభంలో రూ.మూడు లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది.

కోర్సులు :

 • ఈ-కామర్స్ రంగంలో లభిస్తున్న కొలువులు, వాటికి అవసరమైన అర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్న ఇన్‌స్టిట్యూట్‌లు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి.
 • ప్రముఖ బీ-స్కూల్స్ తాము అందిస్తున్న పీజీ ప్రోగ్రామ్‌లలో ఈ-కామర్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తున్నాయి.
 • కోర్ టెక్నాలజీస్ పరంగా బీటెక్ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఏఐఎంఎల్‌కు సంబంధించి కోర్సును అందిస్తున్నాయి.
 • ఐఐఎంలు, ఐఐటీల్లో సైతం ఏఐఎంఎల్, డేటాసైన్స్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్‌కు సంబంధించి ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈ-కామర్స్ సంస్థ.. ఏడాది వ్యవధిలో పీజీ డిప్లొమా ఇన్ ఈ-కామర్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఆన్‌లైన్ విధానంలో అందిస్తోంది.
 • వీటితోపాటు పలు ప్రముఖ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ సంస్థలు సైతం ఈ విభాగాల్లో ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి.

స్టార్టప్‌లకు ప్రోత్సాహం..స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామని తాజాగా కేంద్ర బడ్జెట్‌లో పేర్కొనడంతో ఈ-కామర్స్ రంగానికి మరింత ఊతం లభించనట్లు అయింది. స్టార్టప్ కంపెనీల్లో దాదాపు సగం సంస్థలు ఈ-కామర్స్ లేదా బీటుబీ, బీటుసీ విధానంలో ఆన్‌లైన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇదే ఈ-కామర్స్ రంగంలో లక్షల ఉద్యోగాల కల్పనకు కారణమవుతోంది. మొత్తంగా చూస్తే రానున్న మూడేళ్లలో ఈ-కామర్స్ రంగం యువతకు కొలువుల కామధేనువుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ రంగంలోని నిపుణులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ రంగంలో కొలువులు దక్కించుకోవడానికి అవసరమైన కోర్సులు, కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ-కామర్స్ నియామకాలు.. ముఖ్యాంశాలు

 • రానున్న మూడేళ్లలో పది లక్షలకు పైగా ఉద్యోగాలు.
 • ఏఐ, ఎంఎల్; డేటా అనలిటిక్స్ విభాగంలో దాదాపు మూడు లక్షల కొలువులు.
 • ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం విభాగాలకు పెరుగుతున్న డిమాండ్.
 • సీఆర్‌ఎం, ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ తదితర జాబ్స్‌కు ప్రారంభంలో రూ.రెండు లక్షల వార్షిక వేతనం.
 • కోర్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్‌లో సగటున రూ.నాలుగు లక్షల వార్షిక వేతనం.
 • వెబ్ డెవలపర్స్, వెబ్ అడ్మినిస్ట్రేటర్స్‌కు రూ.2.5 లక్షల సగటు వార్షిక వేతనం
 • ఐఐఎంలు, ఐఐటీలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లో ఏఐఎంఎల్, డేటాసైన్స్ విభాగాల్లో కోర్సులు.

ఈ-కామర్స్ ఉద్యోగాలు..అవసరమైన నైపుణ్యాలు

 • సంబంధిత విభాగంలో అకడమిక్ నైపుణ్యం
 • మార్కెట్ పరిస్థితులను విశ్లేషించే సామర్థ్యం
 • వినియోగదారుల అభిరుచులను గుర్తించే లక్షణం
 • సరికొత్త నైపుణ్యాలను సొంతం చేసుకోగలగడం
 • కమ్యూనికేషన్ స్కిల్స్
టెక్నికల్ విభాగాల్లో డిమాండ్ :ఈ-కామర్స్ రంగంలో లక్షల సంఖ్యలో కొలువులు లభిస్తాయనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇతర విభాగాలతో పోల్చితే టెక్నికల్ విభాగాల్లో మంచి వేతనాలు సొంతం చేసుకోవచ్చు. మార్కెటింగ్, ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించిన నైపుణ్యాలతో ఈకామర్స్ కొలువులు దక్కించుకోవచ్చు. ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఎస్‌ఈఎం, ఎస్‌ఈఓ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. కొలువులు లభిస్తాయి.

‘డ్రోన్’ రంగంలో విసృత ఉపాధి అవకాశాలు

ఇప్పుడు డ్రోన్‌ల గురించి తెలియని వారంటూ లేరు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే! సాంకేతికత పురోభివృద్ధితో ఆయిల్, గ్యాస్, నిర్మాణం, మైనింగ్, అగ్రికల్చర్.. ఇలా అన్ని రంగాలకు డ్రోన్‌లు విస్తరిస్తున్నాయి.
Current Affairsడ్రోన్‌ల అవసరం, వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించిన డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) డ్రోన్ నూతన పాలసీ తీసుకొచ్చింది. దీంతో డ్రోన్‌ల వినియోగం మరింత విస్తృతమైంది. ఫలితంగా కెరీర్ అవకాశాలు సైతం పెరుగుతున్నాయి. పదో తరగతి నుంచి ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పట్టభద్రుల వరకూ.. అర్హతలకు తగ్గ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. డ్రోన్‌ల రంగంలో కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం…

2025 నాటికి డ్రోన్ రంగంలో.. లక్ష కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని తాజా అంచనా. ఇదే సమయంలో డ్రోన్ టెక్నాలజీ, వాణిజ్య అనువర్తనాల మార్కెట్ 2020 నాటికి 7,127 మిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న డ్రోన్ విధానం.. పలు నిబంధనలతో డ్రోన్‌ల వినియోగాన్ని అనుమతిస్తోంది. రానున్న రోజుల్లో వాణిజ్య, వ్యాపార రంగాల్లోనూ డ్రోన్‌లను వినియోగించేలా విధాన మార్పులు జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే మరిన్ని రంగాలకు డ్రోన్ సేవలు విస్తరించడం ఖాయం.

ఆర్‌పీఏఎస్ : 
డ్రోన్‌ల‌ను సాంకేతిక పరిభాషలో ఆర్‌పీఏఎస్ (రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్)గా పేర్కొంటారు. డీజీసీఏ కూడా ఆర్‌పీఏస్ పేరుతోనే పాలసీ తీసుకొచ్చింది. ఇప్పటికే పలు కంపెనీలు డ్రోన్‌లు తయారుచేస్తుంటే.. మరికొన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. డ్రోన్‌లను రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వాటిని ఆపరేట్ చేసేందుకు పైలట్ల అవసరం తప్పనిసరి. ఇక్కడ పైలట్ అంటే..నిర్దేశిత ప్రాంతంలో కూర్చుని రిమోట్ ద్వారా గాలిలో ఎగురుతున్న డ్రోన్ కదలికలను నియంత్రించే వ్యక్తి. ఆర్మీలో వినియోగించే డ్రోన్‌లను యూఏవీ(అన్‌మ్యాన్‌డ్ ఏరియల్ వెహికల్స్) అంటారు.

డ్రోన్‌ పైలట్ :
పదోతరగతి అర్హత, ఇంగ్లిష్‌లో పరిజ్ఞానం ఉంటే చాలు.. ‘డ్రోన్’ పైలట్‌గా కెరీర్ అవకాశాలు దక్కించుకోవచ్చు. ఇందుకోసం డీజీసీఏ నిర్దిష్టంగా నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం డ్రోన్ ఆపరేటర్ డీజీసీఏ నుంచి రిమోట్ పైలట్ లెసైన్స్ పొందాలి. దీని కోసం ముందుగా డీజీసీఏ గుర్తింపు పొందిన ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నుంచి కనీసం అయిదు రోజులపాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణలో భాగంగా రేడియో టెలిఫోనీ టెక్నిక్స్, ఫ్లయిట్ ప్లానింగ్ అండ్ ఏటీసీ ప్రొసీజర్స్, డీజీసీఏ రెగ్యులేషన్స్, తదితర విమానయాన సంబంధిత టెక్నికల్ అంశాల్లో థియరీ, ప్రాక్టికల్ శిక్షణ పొందుతారు. ప్రస్తుతం ఈ విభాగంలో దేశంలో ఐఐడీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్స్) ఒక్కటే డీజీసీఏ గుర్తింపు పొందింది.

లెసైన్స్ ఎగ్జామ్ :
డీజీసీఏ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత.. డ్రోన్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించాలంటే.. డీజీసీఏ లెసైన్స్ తప్పనిసరి. లెసైన్స్ పొందేందుకు డీజీసీఏ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డ్రోన్ పైలట్ లెసైన్స్ లభిస్తుంది.

 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్స్(ఐఐడీ)
 • మావన్ డ్రోన్ అకాడమీ
 • ఇండియన్ అకాడమీ ఆఫ్ డ్రోన్స్
 • నేషనల్ డ్రోన్ స్కూల్
 • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ వంటి సంస్థలు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తున్నాయి.

టెక్ విద్యార్థులకు :
ఉపాధి పరంగా టెక్నికల్ విద్యార్థులు డ్రోన్‌ల రంగంలో ప్రయోజనం పొందుతున్నారు. ముఖ్యంగా డ్రోన్‌ల తయారీ కోణంలో ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. డ్రోన్‌ల డిజైన్, మోడలింగ్, 3డి ప్రింటింగ్, అసెంబ్లింగ్, ప్రోగ్రామింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

అనలిస్ట్‌ల అవసరం : 
డ్రోన్‌  కెమెరాలు పంపే చిత్రాలను విశ్లేషించి.. సంస్థలకు నివేదికలు ఇవ్వాల్సిన క్రమంలో అనలిస్ట్‌ల అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా ల్యాండ్ సర్వేయింగ్, మైనింగ్ వంటి రంగాలకు సంబంధించిన అంశాల్లో అనలిస్ట్‌ల అవసరం ఎక్కువగా ఉంటోంది.

పలు జాబ్ ప్రొఫైల్స్ :
డ్రోన్‌/యూఏవీ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-డ్రోన్ అండ్ రోబోటిక్స్, డ్రోన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ పెలైట్ జాబ్, మైక్రో రోబోట్ అండ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ మెకానికల్ డిజైన్ ఇంజనీర్, డ్రోన్ ఆపరేటర్, యూఏవీ టెస్ట్ పెలైట్, ఆటోమేషన్ ఇంజనీర్.

స్టార్టప్ ప్రోత్సాహం :
మరోవైపు స్వయం ఉపాధి పరంగానూ డ్రోన్‌లు సరికొత్త వేదికలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్‌ల తయారీ సంస్థలను స్టార్టప్‌లుగా ఏర్పాటు చేసేందుకు అవకాశముంది. ఇప్పటికే మన దేశంలో దాదాపు 150కిపైగా డ్రోన్ తయారీ సంస్థలున్నాయి. మరోవైపు ఈ స్టార్టప్ ఔత్సాహికులకు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి ఆర్థిక సహకారం కూడా లభిస్తోంది. ఇప్పటికే డ్రోన్‌ల తయారీలో నిమగ్నమైన ఇండియాఫోర్జ్ సంస్థకు 23.77 మిలియన్ డాలర్ల ఫండింగ్ అందింది. అదే విధంగా ఆరవ్ అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్‌కు ఏడున్నర లక్షల డాలర్లు, డిటెక్ట్ టెక్నాలజీస్‌కు ఏడు లక్షల డాలర్లు, క్రోన్ సిస్టమ్స్‌కు 6.6 లక్షల డాలర్లు, ద్రోణ ఏవియేషన్ సంస్థకు ఒక లక్ష డాలర్ల ఫండింగ్ లభించింది. వీటిని దృష్టిలో పెట్టుకుంటే.. భవిష్యత్తులోనూ డ్రోన్ స్టార్టప్ సంస్థలకు ఫండింగ్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పొచ్చు.

విదేశీ అవకాశాలు :
డ్రోన్‌ల వినియోగంలో ప్రస్తుతం అమెరికా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో భారత్ నిలుస్తోంది. భారత్‌లో 2021 నాటికి 50వేల మంది డ్రోన్ పైలట్ల అవసరం ఏర్పడనుందని అంచనా. డ్రోన్ పైలట్లకు విదేశాల్లోనూ డిమాండ్ నెలకొంది. అసోసియేషన్ ఆఫ్ అన్ మ్యాన్డ్ వెహికిల్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ అంచనాల ప్రకారం-2025 నాటికి అంతర్జాతీయంగా లక్ష మంది డ్రోన్ పైలట్ల అవసరం ఏర్పడనుంది.

భవిష్యత్‌లో మార్పులు :
ప్రస్తుత కొత్త డ్రోన్ పాలసీ కొన్ని రంగాలకే అనుమతిచ్చినప్పటికీ.. భవిష్యత్తులో మరిన్ని రంగాల్లోనూ డ్రోన్‌ల వినియోగానికి అనుమతిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ-కామర్స్, హెల్త్‌కేర్, ట్రావెల్ రంగాల్లో డ్రోన్‌ల వాడకానికి అనుమతిచ్చే వీలుంది. ఇప్పటికే ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబెర్ దుబాయ్‌లో గత ఏడాది డ్రోన్ ట్యాక్సీని ఆవిష్కరించింది. ఇదే తరహాలో ఫ్రాన్స్‌లో డ్రోన్ అంబులెన్స్ పేరుతో ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించారు. అదే విధంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. ప్రైమ్ నౌ పేరుతో డ్రోన్ డెలివరీ వ్యవస్థను ప్రారంభించి అమెరికాలో పేటెంట్ కూడా సొంతం చేసుకుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే.. భవిష్యత్తులో కచ్చితంగా ఇతర రంగాల్లోనూ ముఖ్యంగా సర్వీస్ సెక్టార్‌లోనూ డ్రోన్‌ల వినియోగానికి అనుమతి ఇవ్వొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పదో తరగతితోనే..
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, కెరీర్ అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటే.. వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి డ్రోన్ రంగం చేరుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పదోతరగతి అర్హతతో కెరీర్‌లో స్థిరపడే అవకాశాన్ని డ్రోన్‌లు కల్పిస్తున్నాయి. ఇప్పటికే అగ్రికల్చర్, మైనింగ్ రంగాల్లోని పలు సంస్థలు నిపుణులైన డ్రోన్ పైలట్లు లేకపోవడంతో.. తమ సంస్థల్లోని ఉద్యోగులకే డ్రోన్ ఆపరేటింగ్‌లో శిక్షణ ఇప్పించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

వేతనాలు :
ప్రస్తుతం ఆయా రంగాల్లో నెలకొన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. డీజీసీఏ లెసైన్స్ పొందిన డ్రోన్ పైలట్‌లకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే కనీసం రూ.25వేల జీతం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. సొంతంగా డ్రోన్ కలిగుంటే రోజుకు రూ.ఏడు వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది.

ఉపాధి వేదికలు ఇవిగో..
ఫొటోగ్రఫీ : 
డ్రోన్‌ పైలట్లకు ఎక్కువగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఫొటోగ్రఫీ, సినిమా రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. కారణం.. ఇటీవల కాలంలో సినీ రంగం, ఎలక్ట్రానిక్ మీడియాలో డ్రోన్ కెమెరాలతో షూటింగ్ చేయడం పెరుగుతోంది. అదే విధంగా భారీ సభలు, వేడుకలను డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీయడం పరిపాటిగా మారింది. సినిమా రంగంలో డ్రోన్ పైలట్‌లకు రూ.20 వేల-రూ.30 వేలు వేతనం లభిస్తోంది.
అగ్రికల్చర్ :
డ్రోన్‌ల నార్మలైజ్డ్ డిఫరెన్స్‌ వెజిటేషన్ ఇండెక్స్ మ్యాప్(ఎన్‌డీవీఐ) ద్వారా భూమిలో ఎక్కడ మొక్క బాగా పెరుగుతుందో గుర్తించడంతోపాటు ప్రతి మొక్క ఎంత బాగా పెరిగిందో కూడా తెలుసుకోవచ్చు. కొత్త సాఫ్ట్‌వేర్ డ్రోన్ పైలట్లు సేకరించిన ముడి డేటాను రైతులకు వారి భూమిపై సంభావ్య ప్రాంతాలను సూచించే నివేదికలను రూపొందించడానికి, సమస్యను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించగలదు.
రియల్ ఎస్టేట్ :
ప్రాపర్టీ ఏరియల్/గ్రౌండ్ ఫోటోలు, వీడియోలు తీసి అమ్మకాల పరంగా మంచి వాతావరణాన్ని సృష్టించేందుకు రియల్ ఎస్టేట్‌లో డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అనేక మంది డ్రోన్ పైలట్‌లు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో ఫ్రీలాన్సర్స్‌గా పనిచేస్తున్నారు.
రవాణా రంగం :రవాణా రంగంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తనిఖీలకు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. తద్వారా తక్కువ ఖర్చు, స్వల్వ వ్యవధిలో తనిఖీలను చేపడుతున్నారు. సాధారణంగా సిబ్బంది ట్రాక్‌పై తిరుగుతూ రైల్వే ట్రాక్‌ను తనిఖీ చేస్తుంటారు. నిర్దిష్ట ప్రాంతంలో ట్రాక్‌ను సర్వే చేసి వాటి వివరాలను రైల్వే టెక్నికల్ విభాగానికి పంపుతారు. రోజుల వ్యవధి పట్టే ఈ కార్యకలాపాలను డ్రోన్‌ల సహాయంతో గంటల్లోనే పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

వైరాలజీ (Virology)

వైరస్ను గడగడలాడించే వైరాలజిస్ట్

గతంలో జికా, ఎబోలా.. తాజాగా కరోనా(కొవిడ్–19)!! ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వైరస్లు ప్రబలుతూ మానవాళి ఉనికినే ప్రశ్నిస్తున్నాయి..! ఇలాంటి ప్రాణాంతక వైరస్ల గుట్టు విప్పి.. వాటిని నియంత్రించే మందులను, వ్యాక్సిన్లను కనిపెట్టే శాస్త్రవేత్తలే.. వైరాలజిస్ట్లు!! వైరస్లను అధ్యయనం చేసే శాస్త్రం… వైరాలజీ. వైరస్లు మానవాళిని గడగడలాడిస్తే.. వైరాలజిస్టులు వైరస్లకు దడపుట్టిస్తారు.
Career guidance

వైరాలజిస్టులు వైరస్లపై అధ్యయనం చేస్తారు. వైరస్ ఇన్ఫెక్షన్ల చికిత్స, నియంత్రణ, పరిశోధనల్లో పాల్గొంటూ.. ప్రజల ప్రాణాలను కాపాడుతారు. కరోనా వంటి వైరస్ల ఉధృతి కారణంగా ప్రస్తుతం వైద్య రంగంలో వైరాలజిస్టుల పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో.. వైరాలజీ అంటే ఏమిటి? వైరాలజిస్టుల విధులు, అందుబాటులో ఉన్న కోర్సులు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం..
మెడికల్ మైక్రోబయాలజీలో వైరాలజీ ఓ విభాగం. వైరాలజిస్టులు ప్రోటీన్ కవచం కలిగిన సబ్ మైక్రోస్కోపిక్, పారాసైటిక్ పార్టికల్స్, వైరస్లను పోలిన క్రియాజనకాలను అధ్యయనం చేస్తారు. వీటితోపాటు వైరస్ల నిర్మాణం, వర్గాలు, పరిణామక్రమం, ఆవాస కణాలకు సోకే–అక్కడి నుంచి వ్యాప్తి చెందే క్రమం, కణాలు, రోగనిరోధక శక్తిపై వైరస్ల ప్రభావం, వ్యాధి కారణాలు, దాన్ని కట్టడిచేసే విధానాల గురించి అధ్యయనం చేస్తారు.
ఎన్ఐవీ..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), రాక్ఫెల్లర్ ఫౌండేషన్ సహకారంతో పుణేలో 1952లో వైరస్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీనికే 1972లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) హోదా కల్పించారు. దేశంలో వైరస్లపై పరిశోధనలు చేసే ప్రముఖ ఇన్స్టిట్యూట్.. ఎన్ఐవీ. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలకు ఎన్ఐవీ నోడల్ సెంటర్గా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా వైరస్ల అధ్యయనానికి సంబంధించి డబ్ల్యూహెచ్వో సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ సెంటర్గానూ గుర్తింపు పొందింది.
ఎన్ఐవీ 2005 నుంచి పుణెలోని సావిత్రిబాయి ఫులే విశ్వవిద్యాలయం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ విభాగానికి అనుబంధంగా రెండేళ్ల ఎంఎస్సీ వైరాలజీ కోర్సును ఆఫర్చేస్తోంది. దేశంలో అతికొద్ది ఇన్స్టిట్యూట్లే ఈ కోర్సును అందిస్తున్నాయి. ఎన్ఐవీ ఈ కోర్సును అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తుండటం విశేషం. ఎన్ఐవీలో ఆధునిక మాలిక్యులర్ వైరాలజీ, ఇమ్యునాలజీ పరిశోధనకు అత్యాధునిక మౌలిక వసతులు ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, యానిమల్ ఎక్స్పెరిమెంటల్ బీఎస్ఎల్–3, బీఎస్ఎల్–4 సదుపాయాలను కలిగుండటం ఎన్ఐవీ ప్రత్యేకత.

అర్హతలు:
కనీసం 60శాతం మార్కులతో ఎంబీబీఎస్/బీవీఎస్సీ/బీఎస్సీ (బయోటెక్నాలజీ/బోటనీ/కెమిస్ట్రీ/కెమికల్ లేబొరేటరీ సైన్స్/లైఫ్సైన్సెస్ /మైక్రోబయాలజీ/జువాలజీ) ఉత్తీర్ణులు ఎంఎస్సీ వైరాలజీలో ప్రవేశానికి అర్హులు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సరిపోతుంది.

ప్రవేశ పరీక్ష:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) అందించే ఎమ్మెస్సీలో ప్రవేశం పొందేందుకు ఎంట్రెన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇది 200 మార్కులకు జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు.

ఉన్నత అవకాశాలు
బోధన, పరిశోధన, హెల్త్కేర్ రంగాలకు అవసరమైన సుశిక్షితులైన వైరాలజిస్టులను అందించే ఉద్దేశంతో ఎన్ఐవీ ఎంఎస్సీ వైరాలజీ కోర్సుకు రూపకల్పన చేసింది. దీంతో ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను అందుకోవడంలో ముందు వరుసలో నిలుస్తున్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా ఎన్ఐవీ ఏటా క్యాంపస్ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేస్తోంది. ఇదే సమయంలో దేశీయ అవసరాలను తీర్చేలా కృషి చేస్తోంది.
తాజాగా ఎన్ఐవీ బయోసేఫ్టీ, బయో సెక్యూరిటీకి సంబంధించిన సిలబస్ను సమూలంగా మార్పుచేసింది. దీంతో ఇక్కడ చదివిన విద్యార్థులు అన్ని పాథోజెనిక్ వైరస్లు లేదా ఆర్గానిజమ్స్ లేబొరేటరీల్లో పనిచేయగలిగే నైపుణ్యాలను కలిగుంటారు. ఎన్ఐవీలో ఎంఎస్సీ వైరాలజీ చదివిన విద్యార్థుల్లో ప్రస్తుతం 47శాతం మంది పీహెచ్డీలో చేరుతున్నారు. తద్వారా పరిశోధనల్లో నిమగ్నమవుతున్నారు. భారత్లో 35శాతం మంది, విదేశాల్లో 4శాతం మంది కొలువులు దక్కించుకుంటున్నారు.

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం..
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1988లో వైరాలజీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎంఎస్సీ వైరాలజీ, పీహెచ్డీ వైరాలజీ కోర్సులను అందిస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎస్వీయూసెట్ ద్వారా ఎంఎస్సీ వైరాలజీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇప్పటికే వర్సిటీలో ఆయా కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులు గేట్, సీఎస్ఐఆర్ నెట్లలో ప్రతిభ చూపి.. ఎయిమ్స్, టీఐఎఫ్ఆర్, ఇక్రిశాట్ తదితర జాతీయ స్థాయి పరిశోధనా ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశం పొందారు.
మణిపాల్ వర్సిటీ: మణిపాల్ యూనివర్సిటీ రెండేళ్ల వ్యవధితో ఎంఎస్సీ క్లినికల్ వైరాలజీ కోర్సును అందిస్తోంది. మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్(మెట్) ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మే 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
అమిటీ వర్సిటీ: నోయిడాలోని అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ ఇమ్యునాలజీ.. రెండేళ్ల వ్యవధితో ఎంఎస్సీ వైరాలజీ కోర్సును ఆఫర్చేస్తోంది. లైఫ్ సైన్సెస్లో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఇంటర్లోనూ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఉపాది వేదికలు..
ఎంఎస్సీ వైరాలజీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాది అవకాశాలు కల్పిస్తున్న సంస్థలు.. » ఆక్టిస్ బయలాజిక్స్ » భారత్ బయోటెక్ » హిందుస్థాన్ యూనిలీవర్ » నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ »నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడెక్టివ్ హెల్త్ » సెరుమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా » టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ » వేంకటేశ్వర హ్యాచరీస్ తదితర సంస్థలతోపాటు అనేక మంది బెల్జియం, కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇండియా, ఇటలీ, సింగపూర్, థాయ్లాండ్, అమెరికాల్లోని వర్సిటీలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో రీసెర్చ్ విభాగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్http://www.niv.co.in

ఫిన్‌టెక్‌ (Financial Technology)

ఫిన్‌టెక్‌.. డిజిట‌ల్ రంగంలో కొలువులు

ఫైనాన్షియల్‌ టెక్నాలజీ.. సంక్షిప్తంగా ఫిన్‌టెక్‌! ఇది ఇటీవల కాలంలో ఎంతో సుపరిచితంగా మారింది. నేటి డిజిటల్‌ యుగంలో ఫిన్‌టెక్‌ సంస్థల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతోంది. లోన్స్‌ మొదలు మ్యూచువల్‌ ఫండ్స్‌ వరకు.. డిజిటల్‌ విధానంలో కార్యకలాపాలు నిర్వహించుకునేలా.. వినియోగదారులకు సేవలం దిస్తున్నాయి ఫిన్‌టెక్‌ సంస్థలు! దాంతో ఫిన్‌టెక్‌ రంగం ఇప్పుడు యువతకు సరికొత్త కెరీర్‌గా వేదికగా నిలుస్తోంది.
Edu news బ్యాచిలర్‌ డిగ్రీ నుంచి టెక్నికల్, ప్రొఫెషనల్‌ కోర్సుల అభ్యర్థుల వరకు.. వారి అర్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది ఫిన్‌టెక్‌ రంగం! ఈ నేపథ్యంలో…. ఫిన్‌టెక్‌ ఉద్యోగాలు, అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం…
డిజిటల్‌ యుగం.. ఏ రంగంలో చూసినా.. టెక్నాలజీ ఆధారిత సేవలు. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్స్‌తో.. వ్యక్తులు తమకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కాలు కదపకుండా చక్కబెట్టుకునే అవకాశం లభిస్తోంది. రుణాలు తీసుకోవడం మొదలు.. బీమా చెల్లింపులు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు.. ఇలా అన్నిరకాల సేవలు స్మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో జరిగిపోతున్నాయి. ఇదంతా సాధ్యమయ్యేలా చేస్తున్నాయి ఫిన్‌టెక్‌ సంస్థలు. మొబైల్‌ బ్యాంకింగ్, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ తరహా సేవలు అందించడంలో ముందుంటున్నాయి.
యాప్స్‌ ఆధారంగా.. ఒకే విండోఫిన్‌టెక్‌ సంస్థలు అందించే సేవలు అధికంగా మొబైల్‌ యాప్స్‌ రూపంలో∙ఉంటున్నాయి. ఉదాహరణకు ఇన్సూరెన్స్‌ పేమెంట్స్, అసెట్‌ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన పలు రకాల సేవలను ఫిన్‌టెక్‌ సంస్థలు యాప్స్‌ ఆధారంగా వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇప్పుడు మనందరికీ సుపరిచితమైన మొబైల్‌ వ్యాలెట్‌లు, ఆన్‌లైన్‌ పీర్‌ టు పీర్‌ లెండింగ్‌ వంటివి ఫిన్‌టెక్‌ సేవల పరిధిలోకే వస్తాయి.
మిలియన్‌ డాలర్ల రంగం..
దేశంలో ఐదారేళ్ల క్రితమే ఫిన్‌టెక్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రంగం ఏటేటా శరవేగంగా వృద్ధి చెందుతోంది. దేశంలో ఫిన్‌టెక్‌ రంగం ఈ ఏడాది 1520 మిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. 2023 నాటికి ఈ విలువ 2,580 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రధానంగా డిజిటల్‌ పేమెంట్స్, ఆల్టర్నేటివ్‌ ఫైనాన్సింగ్, పర్సనల్‌ ఫైనాన్స్, ఆల్టర్నేటివ్‌ లెండింగ్‌ల విభాగాల్లో ఫిన్‌టెక్‌ సంస్థల సేవలు విస్తరిస్తున్నాయి.
వినియోగదారులు..
ఫిన్‌టెక్‌ సేవల వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. గతేడాది డిజిటల్‌ పేమెంట్స్‌ విభాగంలో∙513.84 మిలియన్ల మంది ఫిన్‌టెక్‌ సంస్థల ద్వారా సేవలు పొందారు. వీరిసంఖ్య 2023 నాటికి 625.53 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఫిన్‌టెక్‌ సేవలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలోపెట్టుకొని కొత్త సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో దాదాపు రెండున్నర వేలకు పైగా సంస్థలు ఫిన్‌టెక్‌ విభాగంలో సేవలందిస్తున్నాయి. ఆయా సంస్థలకు నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది.

రెండు లక్షల ఉద్యోగాలు..
రానున్న రెండేళ్లలో ఫిన్‌టెక్‌ రంగంలో దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ రంగంలో లభించే ఉద్యోగాల వివరాలు… » కస్టమర్‌ ఎక్విజిషన్‌ » ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ » బిగ్‌డేటా అనలిటిక్స్‌ » అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ » ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ » సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్స్‌ » హార్డ్‌వేర్‌ నెట్‌వర్కింగ్‌ » యూఐ/యూఎక్స్‌ డిజైనర్‌ » ప్రొడక్ట్‌ మేనేజర్‌ » ప్రొడక్ట్‌ ఇంజనీర్‌ » సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ » సోషల్‌ మీడియా మేనేజర్స్‌.

ఫిన్‌టెక్‌ సేవలు
ఫిన్‌టెక్‌ సంస్థలు ప్రధానంగా ఆరు విభాగాల్లో వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. అవి.. –డిజిటల్‌ లెండింగ్, –పేమెంట్‌ సర్వీసెస్, –సేవింగ్స్‌ అండ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్, –రెమిటెన్సెస్, –పాయింట్‌ ఆఫ్‌ సేల్, –ఇన్సూరెన్స్‌. ప్రస్తుతం డిజిటల్‌ పేమెంట్స్, ఆన్‌లైన్‌ సర్వీసెస్‌కు విపరీతమైన ప్రాధాన్యం కనిపిస్తోంది. గత ఏడాది ఫిన్‌టెక్‌ రంగంలో 20శాతం వృద్ధి నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. వచ్చే మూడేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని.. కేవలం నగరాలు, పట్టణాలే కాకుండా.. గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆల్టర్నేటివ్‌ లెండింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్, ఇన్సూర్‌ టెక్‌ పేరుతో ఫిన్‌టెక్‌ సంస్థలు తమ సేవలను ఈ ఏడాది చివరికి రెట్టింపు చేసే యోచనలో ఉన్నట్లు డెలాయిట్‌ సర్వేలో తేలింది.
ఉద్యోగ విభాగాలు
నాస్‌కామ్, మ్యాన్‌పవర్‌ గ్రూప్, డెలాయిట్‌ వంటి సంస్థలు కొన్ని రోజుల క్రితం నిర్వహించిన సర్వే ప్రకారం– ఫిన్‌టెక్‌ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్న ముఖ్యమైన విభాగాలు.. » సాఫ్ట్‌వేర్‌ –51 శాతం, » సేల్స్‌ అండ్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ 16 శాతం » కోర్‌ ఫైనాన్స్‌–11శాతం  » ప్లానింగ్‌ అండ్‌ కన్సల్టింగ్‌–4 శాతం » టాప్‌ మేనేజ్‌మెంట్‌ –4 శాతం. ఇటీవల కాలంలో ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ప్రకటించిన 2020–21 బడ్జెట్‌లో సైతం ఫిన్‌టెక్‌ సంస్థలకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ సంస్థల సంఖ్య సైతం పెరిగే అవకాశం ఉంది.
స్టార్టప్స్‌
ఫిన్‌టెక్‌ సంస్థల్లో సగటున 150 నుంచి 200 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ల్లో ఒక్కో సంస్థలో కనీసం పది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఫిన్‌టెక్‌ రంగంలో పరోక్ష ఉపాధి అవకాశాలు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి సంస్థలో కోర్‌ విభాగంలో ఒక కొలువుకు కొనసాగింపుగా అయిదు ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంటే.. ఒక ప్రొడక్ట్‌ డిజైన్‌ స్థాయిలో ఒక నిపుణుడు ఉంటే.. ఆ తర్వాత దాన్ని వినియోగదారులకు చేర్చే వరకు ఐదు మంది ఉద్యోగుల అవసరం ఉంటుంది.
ప్రోత్సాహకాలు
ఫిన్‌టెక్‌ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా దోహదం చేస్తున్నాయి. పేమెంట్‌ బ్యాంక్స్‌కు అనుమతి ఇవ్వడం.. పేటీఎం, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలు పేమెంట్‌ బ్యాంక్స్‌ను ఏర్పాటు చేసి.. డిజిటల్‌ సేవలు అందిస్తుండటం తెలిసిందే. ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ మొబైల్‌ ఆధారిత బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి రావడం కూడా ఫిన్‌టెక్‌ రంగంలో ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పిస్తోంది.
అర్హతలు
ఇంజనీరింగ్, టెక్నికల్‌ డిగ్రీలతోపాటు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ కోర్సులు పూర్తిచేసుకుంటే.. ఫిన్‌టెక్‌ రంగంలో కొలువులు దక్కించుకోవచ్చు. అదే విధంగా డేటా అనలిటిక్స్, బిగ్‌డేటా, రోబోటిక్స్‌ వంటి అంశాలను అకడమిక్‌ స్థాయిలోనే అభ్యసిస్తే మెరుగైన అవకాశాలు లభిస్తాయి. మరోవైపు సంప్రదాయ డిగ్రీ కోర్సుల ఉత్తీర్ణులు కస్టమర్‌ సపోర్ట్‌ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
నైపుణ్యాలు
ఫిన్‌టెక్‌ సంస్థల్లో కొలువులు ఖాయం చేసుకోవాలంటే.. ప్రస్తుతం అవసరమవుతున్న ప్రధాన నైపుణ్యాలు.. » ఐఓఎస్‌ డెవలప్‌మెంట్‌ » ఆండ్రాయిడ్‌ డెవలప్‌మెంట్‌ » సైట్‌ రిలయబిలిటీ ఇంజనీరింగ్‌(ఎస్‌ఆర్‌ఈ) » ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ నాలెడ్జ్‌ » అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌(ఏపీఐ) » బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ. వీటిని పెంపొందిం చుకోవడానికి అభ్యర్థులు అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేషన్‌ కోర్సులను పూర్తిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
వేతనాలు ఆకర్షణీయం..
ఫిన్‌టెక్‌ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. కోర్‌ టెక్నాలజీ సంబంధిత విభాగాల్లో.. ఏఐ ఇంజనీర్స్, డిజైనర్స్‌కు రూ.50వేల వరకు వేతనం లభిస్తోంది. ఇక యాప్‌ డెవలపర్స్, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం విభాగాల్లో రూ.30వేల వరకు వేతనం ఖాయం. మార్కెటింగ్, సేల్స్‌ విభాగాల్లో పనిచేసే వారికి రూ.20 వేల నెల వేతనం అందుతోంది.
ఉద్యోగాన్వేషణ..
ప్రస్తుతం ఫిన్‌టెక్‌ సంస్థల్లో నియామకాలు కొనసాగుతున్నాయి. కానీ.. వీటి గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండట్లేదు. ఫిన్‌టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాన్వేషణకు అనువైన సాధనం.. జాబ్‌ పోర్టల్స్‌. జాబ్‌ పోర్టల్స్‌లో తమకు ఆసక్తి ఉన్న విభాగంలోని ఫిన్‌టెక్‌ సంస్థల్లో ఉద్యోగాల గురించి తెలుసుకోవచ్చు.
ఫిన్‌టెక్‌.. ముఖ్యాంశాలు
రెండేళ్లలో దాదాపు రెండు లక్షల కొత్త ఉద్యోగాలు.
ఏఐ, ఎంఎల్‌ నిపుణులు, యాప్‌ డెవలపర్స్‌కు డిమాండ్‌.
అంతేస్థాయిలో ఎస్‌ఈఎం, ఎస్‌ఈఓలకు అవకాశాలు.
నెలకు రూ. 20 వేల నుంచి రూ. 70 వేల వరకు వేతనం.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో దాదాపు రెండున్నర వేల ఫిన్‌టెక్‌ సంస్థలు.

ఫ్రీలాన్సింగ్‌

కార్పొరేట్‌ కంపెనీల్లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా చేరకుండా.. ఒకే సమయంలో అనేక కంపెనీలకు తమ∙సేవలను అందిస్తూ.. తమకు ఇష్టమున్నప్పుడే పనిచేస్తూ.. స్వయం ఉపాధిని పొందడమే ఫ్రీలాన్సింగ్‌! ఫ్రీలాన్సర్‌లు ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తూ.. పనికి తగ్గ ఆదాయం ఆర్జిస్తారు.

ఇటీవల కాలంలో మిలీనియల్స్‌లో ఫ్రీలాన్సింగ్‌ ట్రెండ్‌ బాగా నడుస్తోంది. కంపెనీలు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకో తెలుసుకుందాం…!!
స్వేచ్ఛగా పనిచేసే సౌలభ్యం..
కంపెనీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ఉద్యోగస్తులు స్థిర పని, నిర్దేశిత పనివేళలు, నిర్ణీత ఆదాయం పొందుతారు. కానీ ఎటువంటి నిర్ణీత సమయం, నిబంధనలు, బాస్‌ల బాదరబందీ లేకుండా.. స్వేచ్ఛగా పనిచేసే సౌలభ్యం ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలలో ఉంటుంది. ప్రస్తుతం చాలామంది ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలవైపు ఆసక్తి చూపడానికి కారణం కేవలం పని సౌలభ్యం కోసం మాత్రమే కాదు. ప్రీలాన్సింగ్‌ విధానంలో.. ఏదో ఒక సంస్థ కోసం మాత్రమే పని చేయడం కాకుండా.. ఒకే సమయంలో అనేక కంపెనీలకు పనిచేస్తూ.. తమ నైపుణ్యాల్ని, ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుంటుంది. విభిన్న అవకాశాలు పొందడానికి ఫ్రీలానర్స్‌ ఉద్యోగం తోడ్పడుతుంది. కంపెనీలలో ఒకే రంగానికి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి. నచ్చిన విభాగాన్ని ఎంపిక చేసుకొనే అవకాశం ఉండదు. కానీ ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలలో అన్ని రంగాలకు సంబంధించిన పనులు ఉంటాయి. ఇష్టమైనది ఎంచుకొని పనిచేయవచ్చు.
ఫ్రీలాన్సింగ్‌ వైపు మొగ్గు..
అమెరికా వంటి విదేశాల్లో ఫ్రీలాన్స్‌ ఉద్యోగాల విధానం ఎప్పటి నుంచో ఉంది. మన దేశంలో మాత్రం ఇలాంటి ధోరణి ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే.. ఒత్తిడి తక్కువ, ఇష్టమున్నప్పుడు పనిచేయొచ్చు. ఎక్కువ పనిచేస్తే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం యువత కంపెనీలలో ఉద్యోగం చేయడం కంటే.. ఫీలాన్స్‌ ఉద్యోగాలు చేయడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

ఫ్రీలాన్సింగ్‌కు కారణాలు

ఫ్రీలాన్సింగ్‌లో ఇంటి నుంచే పనిచేసే సౌలభ్యం ఉంటుంది. సౌకర్యవంతంగా, నచ్చిన సమయంలో పని చేయవచ్చు. ఒప్పందం మేరకు నిర్దేశిత గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేస్తే సరిపోతుంది.
స్థిరమైన ఆదాయ ప్రవాహం ఉండాలంటే.. ఫ్రీలాన్సర్‌లు మంచి క్లయింట్‌లను ఏర్పాటుచేసుకోవాలి. మంచి ప్రాజెక్టులు రావాలంటే.. ఫ్రీలాన్స్‌ సర్వీసు ప్రొవైడర్లతో సత్సంబంధాలు కొనసాగించాలి. దీనివల్ల మంచి క్లయింట్‌లను పొందడమే కాకుండా.. ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే వీలుంటుంది.
ఫ్రీలానర్స్‌గా పనిచేస్తున్నప్పుడు ప్రాజెక్టులలో కొత్త ఆలోచనలను అమలు చేసే స్వేచ్ఛ ఉంటుంది. ఇది వృత్తిలో ఉన్నతికే కాకుండా.. వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకునేందుకు కూడా దోహదపడుతుంది.
ఫ్రీలాన్సింగ్‌.. దీర్ఘకాలిక, స్వల్పకాలిక అవకాశాలను అందిస్తుంది. 9 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేసే ఉద్యోగాల మాదిరిగా కాకుండా.. ఫ్రీలానర్స్‌గా ఉండటం వల్ల ఎప్పడు పనిచేయాలో, ఎంత సేపు పనిచేయాలో నిర్ణయించుకోవచ్చు. అవసరం, పని లభ్యత ఆధారంగా దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రాజెక్టులు చే యవచ్చు. ఒకవేళ 4–5 గంటలు మాత్రమే పనిచేయాలనుకుంటే.. అలాంటి సందర్భాల్లో స్వల్పకాలిక ప్రాజెక్టులు ఎంచుకుంటే సరిపోతుంది.
ఫ్రీలాన్సర్‌లకు బాస్‌ ఎవరూ ఉండరు. ఇందులో రాణించేందుకు నిజాయితీ, సమయస్ఫూర్తి, నిబద్ధత తప్పనిసరి. అదే సమయంలో పని ప్రామాణికత, విశ్వసనీయత, నాణ్యతకు కట్టుబడి ఉండటం చాలా అవసరం. ఫ్రీలాన్సింగ్‌ స్వతంత్రంగా ఎదగడానికి సహాయపడుతుంది.
శాశ్వత ఉద్యోగులకంటే…
కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు యాజమాన్యాలు స్థిర మైన పని వేళలు, నిర్ణీత వేతనాలు అందిస్తాయి. నేడు, అనేక చిన్న, పెద్ద కంపెనీలు శాశ్వత ఉద్యోగులను నియమించుకోవడం కంటే అవుట్‌సోర్సింగ్‌ విధానం వైపు మొగ్గుచూపుతున్నాయి. దీనివల్ల మానవ వనరులు, మౌలిక వసతులపై వ్యయం తగ్గుతుంది. కాబట్టి ఈ మారుతున్న ధోరణికి అనుగుణంగా నైపుణ్యాలు మెరుగుపరచుకుంటే.. ఫ్రీలాన్సింగ్‌లో రాణించే అవకాశం ఉంది.

మ్యూజియాలజి

ఏదైనా పాతకాలం వస్తువు, పెయింటింగ్‌ చరిత్ర తెలియాలంటే.. మ్యూజియానికి వెళ్లాల్సిందే! ఆయా పురాతన వస్తువులను సేకరించడానికి, వాటి చరిత్రను అధ్యయనం చేసి ప్రదర్శనలో ఉంచడానికి మ్యూజియాలజిస్టులు ఎంతో కృషి చేస్తారు.
SalarJung

ఈ పురావస్తు ప్రదర్శనశాల నిర్వహణకు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు దేశంలోని పలు యూనివర్సిటీలు ప్రత్యేకమైన కోర్సులు సైతం అందిస్తున్నాయంటే.. దీని ప్రాముఖ్యత ఎంతో అంచనా వేయవచ్చు. మ్యూజియం ప్రాధాన్యత, డాక్యుమెంటేషన్, రీసర్చ్, మ్యూజియం నిర్వహణ వంటివన్నీ మ్యూజియాలజీ కిందకు వస్తాయి. మ్యూజియం సంరక్షణ, పరిపాలన సైతం మ్యూజియాలజిస్టుల విధుల్లో భాగమే.
ఆసక్తికరమైన రంగం :
మ్యూజియాలజీ కోర్సులో భాగంగా పురావస్తు శాస్త్రం, చరిత్ర, పరిశోధన, ఆర్కైవింగ్‌ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారు మ్యూజియాలజిస్ట్‌గా రాణించే వీలుంది. ప్రభుత్వ మ్యూజియంలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రయివేట్‌ మ్యూజియాల్లో, ఆర్ట్‌ గ్యాలరీల్లో ఉపాధి లభిస్తుంది. చరిత్ర, చారిత్రక వస్తువుల సేకరణ, పరిరక్షణపై ఆసక్తి ఉన్న విద్యార్థులు మ్యూజియాలజీ కెరీర్‌ను ఎంచుకోవచ్చు.

క్యూరేటర్‌:
మ్యూజియం పర్యవేక్షణలో ప్రధానమైనది పురాతన వస్తువుల సేకరణ, సంరక్షణ, ప్రదర్శనల నిర్వహణ. ఇందులో క్యూరేటర్‌ది కీలక పాత్ర. ప్రదర్శనకు పురాతన వస్తువులను గుర్తించడం, వాటికి లేబులింగ్‌ చేయడం, వాటి చరిత్రను జత చేయడం వంటి బాధ్యతలను క్యూరేటర్‌ నిర్వహిస్తారు. ప్రతి వస్తువు చరిత్రతోపాటు రికార్డులను రూపొందించడం కూడా వీరి విధుల్లో భాగమే. అందుకే మ్యూజియం నిర్వహణలో ప్రధాన భూమిక క్యూరేటర్లదేనని చెప్పొచ్చు.

మ్యూజియం ఎడ్యుకేషనిస్ట్‌ :
పురాతన వస్తువులు, నిర్మాణాల చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి చరిత్రను సవివరంగా చెప్పే సౌలభ్యం మ్యూజియాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మ్యూజియానికి వచ్చే సందర్శకులకు అర్థమయ్యే రీతిలో అక్కడి వస్తువుల చరిత్రను వివరించే వారే‡ ‘మ్యూజియం ఎడ్యుకేషనిస్ట్‌లు. వీరు సందర్శకులకు ఆయా పురాతన వస్తువులు గురించి పూర్తి అవగాహన కల్గించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా అవసరాన్ని బట్టి పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణనిస్తారు. ఉపన్యాసాలు ఇవ్వడం, మోషన్‌ పిక్చర్స్, ఫిల్మ్‌ ట్రిప్స్, ప్రచురణలు మొదలైనవి కూడా వీరు చూసుకుంటారు.
కో ఆర్డినేటర్స్‌– కన్సల్టెంట్స్‌ :
చరిత్రకు సంబంధించిన విషయాలను ప్రజా సమూహానికి చేరవేసేందుకు అనువైన వేదిక ప్రదర్శనలు(ఎగ్జిబిషన్స్‌). ఈ ప్రదర్శనల్లో కో ఆర్డినేటర్లు తమ బృందాన్ని సమన్వయం చేసుకుంటూ.. ప్రదర్శనల తీరుతెన్నులను పర్యవేక్షిస్తుంటారు. ఎగ్జిబిషన్‌ల నిర్వహణ వ్యూహాలు, ప్రణాళికలు, వాటికి రూపకల్పన, అవసరమైన సమాచారం అందించడం, ప్రోత్సాహం వంటి అంశాలను కన్సల్టెంట్స్‌ చూసుకుంటారు.
కోర్సులు– అర్హతలు :
మ్యూజియం నిర్వహణ, పరిపాలన విభాగాల్లో ఉద్యోగాల కోసం డిగ్రీ తర్వాత సంబంధిత కోర్సులు పూర్తిచేయాలి. పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఎంఏ హిస్టరీ లేదా ఎంఎస్సీ మ్యూజియాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల తర్వాత ఆయా సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేయవచ్చు. మ్యూజియాలజీకి సంబంధించిన పలు ఇనిస్టిట్యూట్స్‌ కోర్సులను అందిస్తున్నాయి.
ఇన్‌స్టిట్యూట్స్‌ :
నేషనల్‌ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌(న్యూఢిల్లీ): కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ డీమ్డ్‌ యూనివర్సిటీ.. ఎంఏ మ్యూజియాలజీ, ఎంఏ ఆర్ట్‌ హిస్టరీ, ఎంఏ కన్జర్వేషన్‌ కోర్సులను అందిస్తోంది. పోస్టు గ్రాడ్యుయేషన్‌ తర్వాత పీహెచ్‌డీ సైతం చేయవచ్చు. ఇక్కడ చదివేందుకు విదేశీ విద్యార్థులు సైతం ఆసక్తి చూపడం విశేషం.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌www.nmi.gov.in

కల్‌కత్తా యూనివర్సిటీ: ఈ వర్సిటీ ఎంఏ/ఎంఎస్సీ మ్యూజియాలజీ కోర్సును అందిస్తోంది. ఇక్కడి మ్యూజియాలజీ విభాగంలో డాక్టరేట్, పోస్ట్‌ డాక్టోరల్‌ స్థాయిలో పరిశోధనలు చేయవచ్చు. ఈ విద్యాసంస్థ అందించే కోర్సులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ జరిగే పరిశోధనలకు అంతర్జాతీయంగా మంచి పేరుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌http://www,caluniv,gov.in

బనారస్‌ హిందూ యూనివర్సిటీ(వారణాసి): దేశంలోని పురాతన విశ్వవిద్యాల యాల్లో ఒకటి బనారస్‌ హిందూ యూనివర్సిటీ. ఈ వర్సిటీ ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో పలు ప్రొఫెషనల్‌ కోర్సులను అందిస్తున్నారు. వీటికి దేశవ్యాప్తంగా మంచి గుర్తిపు ఉంది. ఈ విభాగం ఎంఏ మ్యూజియాలజీ(రెండేళ్లు) ప్రొఫెషనల్‌ కోర్సును అందిస్తోంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌http://www.bhu.ac.in

అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ(యూపీ): ఈ వర్సిటీ మ్యూజియాలజీ కోర్సును అందిస్తోంది. తొలుత ఏడాది కాలపరిమితిగల డిప్లొమా కోర్సుతో ప్రారంభించి.. ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో ఎంఎస్సీ మ్యూజియాలజీని అందిస్తున్నారు. ఇందులో ఎంఫిల్‌/ డాక్టరేట్‌ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌http://www.amu.ac.in

తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ సైతం ఎంఏ ఆర్కియాలజీ పూర్తి చేసినవారి కోసం ఏడాది కాలపరిమితి గల పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మ్యూజియాలజీ కోర్సును అందిస్తోంది.

అవకాశాలు :
మ్యూజియాలజీ కోర్సులు పూర్తిచేసినవారికి అవకాశాలకు కొదవ లేదు. ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. సొంతంగా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మ్యూజియాల్లో తరచు జరిగే ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాల్లో పాలుపంచుకోవచ్చు. ప్రయాణాలు ఇష్టపడేవారికి కూడా ఈ కెరీర్‌ అనువుగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ఆయా చోట్ల దొరికే పురాతన వస్తు సంపదను సేకరించడం వంటివి చేయవచ్చు. దేశంలో దాదాపు 700కు పైగా చిన్నాపెద్దా మ్యూజియాలు ఉన్నాయి. మ్యూజియాలజీలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేసిన వారికి వీటిలో తొలి ప్రాధాన్యం ఉంటుందని నిపుణలు చెబుతున్నారు!!

కామెంటేటర్

స్పోర్ట్స్, గేమ్స్ ఇష్టపడని వాళ్లెవరుంటారు..! కొంతమంది క్రికెట్ను ప్రాణంగా ప్రేమిస్తే… మరికొంతమంది ఫుట్బాల్ను ఆసక్తిగా చూస్తుంటారు. క్రికెట్నే తీసుకుంటే విరాట్ కోహ్లీ ఎంతలా ఆకట్టుకుంటాడో… కామెంటేటర్ సైతం ఆటగాళ్లు ఆడే షాట్ల వర్ణన, విశ్లేషణతో వీక్షకులను రంజింపచేస్తుంటాడు. క్రికెట్ కామెంటరీలో సునీల్ గవాస్కర్, హర్షా భోగ్లే, సంజయ్ మంజ్రేకర్, రమీజ్ రాజా తదితరులు ప్రాచుర్యం పొందగా…ఫుట్బాల్లో పీటర్ డ్యూరీ, డేరెక్ రే, జిమ్ బెగ్లింగ్ తదితరులు పేరు గడించారు. కామెంటేటర్గా స్థిరపడాలంటే.. ముందుగా కావాల్సిన ప్రాథమిక అర్హత… మంచి కంఠస్వరం. దీంతోపాటు కనీసం బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ఆట గురించి క్షుణ్నంగా తెలుసుండాలి. వీటితోపాటు ఆయా జట్ల ఆటతీరు, ప్లేయర్ల గణాంకాలు కంఠస్తా వచ్చుండాలి. బిజినెస్ కమ్యూనికేషన్, మాస్ మీడియా, రేడియో/టీవీ బ్రాడ్ కాస్టింగ్లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది కామెంటేటర్లుగా స్థిరపడుతున్నారు.

టాయ్ డిజైనింగ్

భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా టాయ్ డిజైనింగ్ రంగం విస్తరిస్తోంది. ఆట వస్తువులు, ఇతర ఆకర్షణీయ బొమ్మల రూపకల్పన, తయారీ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారిని టాయ్ డిజైనర్స్ అంటారు. టాయ్ డిజైనింగ్కు సంబంధించి ఎలాంటి పూర్తిస్థాయి కోర్సులు అందుబాటులో లేవు. కొన్ని స్వల్పకాలిక కోర్సులు మాత్రం టాయ్ డిజైనర్గా స్థిరపడేందుకు కావాల్సిన నైపుణ్యాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం అనేక పెద్ద కంపెనీలు టాయ్స్ తయారుచేస్తున్నాయి. దీంతో ఉద్యోగ అవకాశాల పరంగానూ టాయ్ డిజైనర్లకు ఆశాజనక పరిస్థితులుæ కనిపిస్తున్నాయి.
టాయ్స్ పట్ల ఆసక్తి, ఇష్టాన్ని టాయ్ డిజైనర్ కావాల్సిన ప్రాథమిక అర్హతలుగా పేర్కొనవచ్చు. టాయ్ డిజైనర్లు అందరినీ ఆకట్టుకునే టాయ్స్ను రూపొందించేలా ఆలోచించాలి. ఇందులో భాగంగా సీఏడీ, హ్యాండ్ డిజైన్స్పై పట్టు సాధించడం తప్పనిసరి. దీంతోపాటు కంప్యూటర్ ఆధారిత డ్రాఫ్టింగ్, డ్రాయింగ్, ఆర్కిటెక్చర్ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. డిజైనర్లకు టాయ్స్ తయారీకి అవసరమైన మెటీరియెల్స్పై అవగాహన ఉండాలి. ఫైన్ ఆర్ట్స్ కోర్సులు పూర్తి చేసిన వారు టాయ్ డిజైనర్స్గా స్థిరపడవచ్చు.

బార్టెండర్

మీరెప్పుడైనా పబ్కు లేదా బార్కి వెళ్లారా..! వెళ్లని వారు.. టీవీలు, సినిమాల్లోనైనా ఆయా దృశ్యాలను చూసి ఉంటారు. రంగు రంగుల మద్యం సీసాలను ఒక చేత్తో గాల్లోకి ఎగరేస్తూ, మరో చేత్తో పట్టుకుంటూ.. చూపరులను ఆశ్చర్యపరిచే వ్యక్తులనే బార్ టెండర్లు అంటారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో కార్పొరేట్ సంస్కృతి వేగంగా విస్తరిస్తుండటంతో బార్టెండర్లకు గిరాకీ పెరుగుతోంది.
కోర్సులు: ప్రస్తుతం మన దేశంలో బార్ టెండింగ్లో స్వల్పకాలిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ రంగంలో ఉన్నతస్థాయికి చేరాలనుకొనే వారు గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ కోర్సులను పూర్తి చేయొచ్చు.
నైపుణ్యాలు: బార్టెండర్గా కెరీర్లో రాణించేందుకు » చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ » కొత్త వ్యక్తులతో కలిసిపోయే స్వభావం » ఆత్మవిశ్వాసం ఉట్టిపడే బాడీ లాంగ్వేజ్ » నిత్యం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం » బేవరేజెస్పై పరిజ్ఞానం » కొత్త కొత్త కాక్టెయిల్స్, మాక్టెయిల్స్ను సృష్టించగలిగే నైపుణ్యాలు ఉండాలి.
వేతనాలు: స్టార్ హోటళ్లు, పబ్బుల్లో బార్టెండర్లకు అధిక వేతనాలు లభిస్తాయి. ప్రారంభంలో నెలకు రూ.15 వేలు వరకు అందుతుంది. అనుభవం ఆధారంగా రూ.50 వేలు నుంచి రూ.80 వేల వరకు అందుకోవచ్చు.

మర్చెంట్ నేవీ

సముద్రంపై సాహసం.. మర్చెంట్ నేవీ

ఇంటర్మీడియెట్ విద్యార్థుల్లో సైన్స్ గ్రూప్ల వారు ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల వైపు ఆకర్షితులవుతున్నారు.
Career guidanceకామర్స్ విద్యార్థులు సీఏ, సీఎస్, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులను ఎంచుకుంటున్నారు. మరికొంతమంది తమకు ఆసక్తి ఉన్న డిగ్రీ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా తక్కువ మందికి మాత్రమే సాహసాలు చేయడమంటే ఇష్టం. ఇలాంటి వారికి సరిగ్గా నప్పే కోర్సు..‘మర్చెంట్ నేవీ’. వీరు సముద్రయానం ద్వారా ఓడల్లో ఖండాలు, దేశాలు చుట్టిరావడంతోపాటు అత్యధిక వేతనాలు సైతం అందుకునే వీలుంది. మర్చెంట్ నేవీలో చేరేందుకు అర్హతలు, కోర్సులు, కెరీర్ స్కోప్పై ప్రత్యేక కథనం…
మర్చెంట్ నేవీ అంటే…
సరుకుల రవాణాకు రోడ్డు మార్గం, వాయు మార్గం, జల మార్గాలను ఉపయోగిస్తారు. దేశంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, భూ సరిహద్దు దేశాలకు సరుకును లారీలు లేదా గూడ్స్ రైళ్లలో తరలిస్తారు. చాలాదూరంలో ఉన్న విదేశాలకు అవసరాన్ని బట్టి వాయు మార్గాన్ని వినియోగిస్తారు. వాయు మార్గం చాలా ఖర్చుతో కూడుకున్నది. అన్నింటి కంటే సులువుగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తం సరుకుని సుదూర తీరాల్లోని విదేశాలకు తరలించే అవకాశం ఒక్క జల మార్గం ద్వారానే సాధ్యమవుతుంది. అంటే.. సముద్ర తీరం ఉన్న అన్ని ఖండాలు, దేశాలకు భారీ స్థాయిలో సరుకును చేరవేసేందుకు పురాతన కాలం నుంచి వినియోగంలో ఉన్న మార్గం ఇదే. ఓడల ద్వారా వ్యాపార, వాణిజ్య సరుకుల రవాణా కార్యకలాపాలను నిర్వహించేదే.. ‘మర్చెంట్ నేవీ’. అంతర్జాతీయ వాణిజ్యానికి మర్చెంట్ నేవీ వెన్నుముకగా చెప్పవచ్చు. ఈ ఓడలపై పని చేసే వివిధ విభాగాల సిబ్బంది ఒక దేశం నుంచి మరో దేశానికి సరుకులను చేరవేస్తారు.
కోర్సులు…
మర్చంట్ నేవీలో కెరీర్ అవకాశాలు కోరుకునే అభ్యర్థులకు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ పలు కోర్సులు అందిస్తోంది. యూజీ స్థాయిలో నాలుగేళ్ల బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్; ∙బీటెక్ నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్‡ ఇంజనీరింగ్; ∙మూడేళ్ల బీఎస్సీ నాటికల్ సైన్స్; ∙మూడేళ్ల బీబీఏ లాజిస్టిక్స్, రిటైల్స్ అండ్ ఈ కామర్స్; ∙మూడేళ్ల బీఎస్సీ షిప్ బిల్డింగ్ అండ్ రిపైర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. అలాగే పీజీ స్థాయిలో రెండేళ్ల ఎంటెక్ మెరైన్ ఇంజనీరింగ్; రెండేళ్ల ఎంటెక్ నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్; రెండేళ్ల ఎంటెక్ డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్; రెండేళ్ల ఎంబీఏ పోర్ట్ అండ్ షిప్మేనేజ్మెంట్; రెండేళ్ల ఎంబీఏ ఇంటర్నే షనల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్; రెండేళ్ల ఎంఎస్సీ కమర్షియల్ షిప్పింగ్ అండ్ లాజిస్టి క్స్లో అడ్మిషన్ పొందొచ్చు. వీటితోపాటు ఒక ఏడాది కాల వ్యవధి గల డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్, ఒక ఏడాది కాల వ్యవధి గల పోస్ట్గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ సైతం అందుబాటులో ఉన్నాయి.
కోర్సుల్లో ప్రవేశం..
మర్చంట్ నేవీకి సంబంధించి కోర్సులను అందించడంలో మంచి పేరున్న కేంద్రీయ విశ్వ విద్యాలయం.. ‘ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ’. దీనికి కోచి, చెన్నై, కోల్కతా, ముంబయి పోర్ట్, నవీ ముంబయి, విశాఖపట్నంలో క్యాంపస్లు ఉన్నాయి. అంతేకాకుండా దీనికి అనుబంధంగా దేశవ్యాప్తంగా పలు ఇన్స్టిట్యూట్లు డిగ్రీస్థాయి, డిప్లొమా స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.
ఐఎంయూ సెట్
 • ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీలో ప్రవేశాలకు ఏటా ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆసక్తి,అర్హతలున్న విద్యార్థులు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎంయూ సెట్) ద్వారా ప్రవేశాలు పొందొచ్చు.
 • బీటెక్, బీఎస్సీ కోర్సులకు ఇంటర్ ఎంపీసీ విద్యా ర్థులు, బీబీఏ కోర్సుకు ఏదైనా ఇంటర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ స్థాయి కోర్సులకు నిర్ధేశిత అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకో వచ్చు. జూన్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి.. ర్యాంక్ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఐదు రకాల కొలువులు
మర్చెంట్ నేవీలో ప్రధానంగా ఐదు రకాల ఉద్యోగాలు ఉంటాయి. అవి.. డెక్ ఆఫీసర్స్..వీరినే నేవిగేషన్ ఆఫీసర్స్ అంటారు. అలాగే ఎలక్ట్రో– టెక్నికల్ ఆఫీసర్(ఈటీఓ), ఇంజనీర్స్, జీపీ రేటింగ్స్, క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ క్రూ.
ఉద్యోగాలు–అర్హతలు
మర్చెంట్ నేవీలో జీపీ రేటింగ్స్ ఉద్యోగానికి పదో తరగతి అర్హత సరిపోతుంది. డెక్ ఆఫీసర్స్, టెక్నికల్ ఆఫీసర్, ఇంజనీరింగ్ కొలువులకు ఇంటర్ ఎంపీసీతోపాటు సంబంధిత కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. మంచి దేహదారుఢ్యంతోపాటు మానసికంగానూ దృఢంగా ఉండాలి. కంటి చూపులోపం ఉండరాదు. విజన్ 2.5 ప్లస్/మైనస్ వరకు ఉన్నవారు కూడా అర్హులే. మెడికల్ టెస్ట్ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.
వేతనాలు
 • మర్చెంట్ నేవీ కోర్సులు పూర్తిచేసినవారికి దేశ, విదేశీ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కంపెనీ, సీనియారిటీని బట్టి వేతనాలు ఉంటాయి. వాస్తవానికి మర్చెంట్ నేవీ ఉద్యోగులు ఏడాదిలో సుమారు ఎనిమిది నెలలు విధుల్లో ఉంటారు. ఉద్యోగాన్ని బట్టి దేశీయ కంపెనీల్లో వేతనం నెలకు రూ.30 వేల నుంచి రూ.8లక్షల వరకు ఉంటుంది. వీరి వేతనాలకు ఎలాంటి పన్ను ఉండదు. అదే విదేశీ కంపెనీల్లో మరింత ఎక్కువ వేతనం లభిస్తుంది. ఏ పోస్టులో చేరినా ఆరు లేదా ఏడేళ్లలో చీఫ్ ఆఫీసర్గా ఎదిగే అవకాశం ఉంది. సమర్థవంతంగా పనిచేసేవారికి ఇంకా ముందే పదోన్నతి లభిస్తుంది.
 • పూర్తి వివరాలకు వెబ్సైట్ : www.imu.edu.in

అద్భుతమైన కెరీర్

మర్చెంట్ నేవీలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. తక్కువ సమయంలోనే అధిక వేతనాలు ఈ రంగంలో పొందవచ్చు. కోర్సు చేసినవారికి ఏడాదిపాటు ఓడలపై శిక్షణ ఉంటుంది.  అప్పుడే వారికి నెలకు కనీసం 1000 డాలర్లు చెల్లిస్తారు. కార్గో షిప్పులు కంటే గ్యాస్, ఆయిల్ తరలించే షిప్పుల్లో పనిచేసేవారికి వేతనాలు 30 శాతం అధికంగా ఉంటాయి. చీఫ్ ఆఫీసర్ స్థాయి వారు తమ కుటుంబాలను షిప్పుల్లో తీసుకెళ్లే వెసులుబాటు కూడా ఉంది. సాహసంతోపాటు మంచి వేతనాలు కోరుకునేవారు మర్చెంట్ నేవీలో చేరవచ్చు.

ఇంటర్తోనే ఐటీ కొలువు కావాలంటే ఈ కోర్సులో చేరాల్సిందే..!

ఇంటర్ పూర్తయిందా.. వెంటనే ఐటీ కొలువులో చేరాలనుందా.. అదే సమయంలో ఉన్నతవిద్యకు కూడా వెళ్లాలనుందా..?! అందుకు అనువైన కోర్సు.. హెచ్సీఎల్ అందిస్తున్న టెక్బీ ఎర్లీ కెరియర్ ప్రోగ్రామ్. హెచ్సీఎల్ టెక్బీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
Career guidanceఈ నేపథ్యంలో.. సదరు కోర్సు ప్రత్యేకత, దరఖాస్తుకు అవసరమైన అర్హతలు, ఎంపిక ప్ర్రక్రియ గురించి తెలుసుకుందాం…
హెచ్సీఎల్ టెక్బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్.. ఇంటర్ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరాలనుకునే అభ్యర్థుల కోసం రూపకల్పన చేసిన ప్రోగ్రామ్ ఇది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు హెచ్సీఎల్లో ఎంట్రీ లెవల్ ఐటీ జాబ్కు సరితూగేలా 12 నెలల శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్సీఎల్లో పూర్తి స్థాయి ఉద్యోగిగా పనిచేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో ఉద్యోగం చేస్తూనే బిట్స్–పిలానీ, లేదా సస్త్ర యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు. టెక్బీ ప్రోగ్రామ్కు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.10,000 స్టైపెండ్ చెల్లిస్తారు. అనంతరం పూర్తి స్థాయి ఉద్యోగిగా చేరాక రూ.2–2.20 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.
శిక్షణ..
 • హెచ్సీఎల్ టెక్బీ ప్రోగ్రామ్ అభ్యర్థులను హెచ్సీఎల్ ప్రాజెక్టులపై పనిచేసేందుకు సన్నద్ధులను చేస్తుంది.
 • శిక్షణలో భాగంగా ఒక ప్రొఫెషనల్ ఐటీ ఉద్యోగిగా మారేందుకు అవసరమైన ఐటీ ఫండమెంటల్స్ను బోధిస్తారు.
 • అభ్యర్థులకు కంపెనీ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాక్సెస్ లభిస్తుంది. ఇందులో కంపెనీ విధులకు సంబంధించిన చర్చలు, ఆన్లైన్ అసెస్మెంట్లు, అసైన్మెంట్స్, కేస్ బేస్డ్ సబ్మిషన్స్ ఉంటాయి.
 • అభ్యర్థులకు టెక్నాలజీ సర్వీసెస్కు సంబంధించిన ఐటీ సర్టిఫికెట్ పొందవచ్చు.

ఉద్యోగ వివరాలు..

 • శిక్షణను పూర్తి చేసకున్న అభ్యర్థులకు హెచ్సీఎల్ సంస్థలో ఉద్యోగిగా అవకాశం కల్పిస్తారు.
 • ఆఫర్ అందుకున్నవారు అప్లికేషన్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సపోర్ట్, డిజైన్ ఇంజనీర్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
 • హెచ్సీఎల్ హెల్త్కేర్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్, హెల్త్ చెకప్స్ తదితర సౌకర్యాలు లభిస్తాయి.

అర్హత..

 • 2019లో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.
 • అలాగే 2020లో ఇంటర్ పూర్తి చేసుకోనున్న/ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
 • అభ్యర్థి ఇంటర్లో మ్యాథమెటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ను చదివుండాలి.

ఫీజు…

 • ప్రోగ్రామ్ ఫీజు ట్యాక్స్లతో కలిపి రూ.2.20 లక్షల వరకు ఉంటుంది.
 • అభ్యర్థులకు బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తారు.
 • శిక్షణ సమయంలో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు పొందిన వారికి 100 శాతం ఫీజు మాఫీ చేస్తారు. అలాగే 85–90 శాతం మార్కులు పొందిన వారికి 50 శాతం ఫీజు మాఫీ చేస్తారు.
 • దరఖాస్తులకు చివరి తేది: 30 జూన్ 2020
 • పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.hcltechbee.com

రూరల్‌ మేనేజ్‌మెంట్‌/డెవలప్‌మెంట్‌ కోర్సులు

Career guidanceదేశంలో నేటికీ 60 శాతం మంది ప్రజలు గ్రామాల్లోనే జీవిస్తున్నారు. అందుకే పల్లె ప్రాంతాల ప్రగతికి ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఇందులో స్వచ్ఛంద సంస్థలు సైతం పాల్పంచుకుంటున్నాయి. కార్పొరేట్‌ కంపెనీలు, బ్యాంకులు, ఎన్‌జీవోలు, వివిధ సంస్థలు సామాజిక బాధ్యతగా గ్రామీణ ప్రాంతాలను దత్తత తీసుకొని.. అభివృద్ధి కార్యక్రమాల్లో తమ వంతు చేయూత అందిస్తున్నాయి. అయితే దేశంలోని గ్రామాలన్నీ ఒకే తీరుగా లేవు. కాబట్టి వాటి అవసరాలు ఒకేలా ఉండవు. దాంతో స్థానిక అవసరాలు, సమస్యలు గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు నిపుణుల అవసరం ఏర్పడింది. పల్లె ప్రాంతాల ప్రగతికి అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి.. సుశిక్షితులైన మానవ వనరులను సిద్ధం చేసే కోర్సులే.. ‘రూరల్‌ మేనేజ్‌మెంట్‌/డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాములు’. ఈ నేపథ్యంలో.. రూరల్‌ డవలప్‌మెంట్‌ /మేనేజ్‌మెంట్‌ కోర్సులు, కెరీర్‌ అవకాశాల గురించి తెలుసుకుందాం..
గ్రామీణాభివృద్ధే ధ్యేయం…రూరల్‌ మేనేజ్‌మెంట్‌/డెవలప్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు గ్రామాల్లోని సమస్యలపై అవగాహన ఏర్పడుతుంది. స్థానికంగా ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలి.. అందుకు అవసరమైన వనరులు ఏమిటి? ఆయా సమస్యలను ఎలా పరిష్కరించాలి తదితర అంశాలపై శిక్షణ పొందుతారు. కోర్సులో భాగంగా గ్రామీణ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు సంస్థాగత నైపుణ్యాలను పెంపొందించేలా కోర్సు బోధన కొనసాగుతుంది.
కోర్సులు..ఇంటర్మీడియెట్‌ తర్వాత రూరల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంది. కొన్ని స్టేట్‌ యూనివర్సిటీలు డిగ్రీలో రూరల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సబ్జెక్టును అందిస్తున్నాయి. అలాగే డిగ్రీ తర్వాత పీజీ/పీజీ డిప్లొమా/డిప్లొమా కోర్సుల్లో చేరే వీలుంది. ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు పీజీ స్థాయిలో∙రూరల్‌ మేనేజ్‌మెంట్‌/రూరల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
డిప్లొమా/డిగ్రీ కోర్సులు..
 • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌.
 • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌.
 • పీజీ డిప్లొమా ఇన్‌ సçస్టయినబుల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌.
 • పీజీ డిప్లొమా ఇన్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌.
 • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ ఫైనాన్స్‌.
 • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ మార్కెటింగ్‌.
 • బీఏ రూరల్‌ డెవలప్‌మెంట్‌.
 • బ్యాచిలర్‌ ఆఫ్‌ రూరల్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌.
 • పీజీ స్థాయిలో రూరల్‌ డెవలప్‌మెంట్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌లో.. ఎంఏ, ఎంబీఏలో చేరొచ్చు. ఆ తర్వాత అభ్యర్థులు తమ ఆసక్తిని బట్టి ఎంఫిల్, పీహెచ్‌డీ సైతం పూర్తిచేయవచ్చు.
అర్హతలు..
అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణులు అర్హులు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా పీజీ డిప్లొమా/ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
ప్రవేశ విధానం..పీజీ డిప్లొమా ఇన్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌/రూరల్‌ డవలప్‌మెంట్, ఎంబీఏ రూరల్‌ మేనేజ్‌మెంట్‌/రూరల్‌ డవలప్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దేశంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు ప్రత్యేక ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తుండగా.. మరికొన్ని విద్యా సంస్థలు క్యాట్‌/గ్జాట్‌/మ్యాట్‌/జీమ్యాట్‌/ఆత్మా/సీమ్యాట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ప్రముఖ సంస్థలు..
 • దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు రూరల్‌ మేనేజ్‌మెంట్‌/ రూరల్‌ డెవలప్‌మెంట్‌æ కోర్సులను అందిస్తున్నాయి. పేరున్న విద్యా సంస్థలు అందిస్తున్న ఈ కోర్సులు అధిక డిమాండ్‌ ఉంది. అవి..
 • నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(ఎన్‌ఐఆర్‌డీ)– హైదరాబాద్‌
 • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌(ఐఆర్‌ఎంఏ) – గుజరాత్‌
 • టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(ముంబై, హైదరాబాద్, తుల్జాపూర్, గౌహతి)
 • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)– కల్‌కత్తా
నైపుణ్యాలు..
రూరల్‌ మేనేజ్‌మెంట్‌/డవలప్‌మెంట్‌ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు వ్యక్తిత్వ పరంగా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పల్లె ప్రజల పట్ల సానుభూతి (ఎంపతి), గ్రామీణ ప్రాంత ప్రజా సమూహాలతో కలిసి పనిచేసే సహనం, ఒప్పించే నేర్పు, మంచి కమ్యూనికేషన్స్‌ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, స్నేహశీలత ఉండాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగస్వాములం కావాలనుకునే అమిత ఆసక్తి గలవారు ఈ కోర్సులను ఎంచుకోవచ్చు.
కెరీర్‌..
 • దారిద్య్రరేఖకు దిగువున నివసిస్తున్న కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రారంభిస్తున్నాయి. వీటిని సక్రమంగా అమలు చేయడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రూరల్‌ డెవలప్‌మెంట్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తి చేసిన వారిని నియమించుంటున్నాయి. దీంతో ఈ కోర్సులకు డిమాండ్‌ పెరిగింది.
 • రూరల్‌ డెవలప్‌మెంట్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసిన వారు ఇటు ప్రభుత్వ రంగంతోపాటు, అటు ప్రైవేటు రంగంలోనూ కొలువులు దక్కించుకోవచ్చు.
 • ప్రధాన్, కేర్, సేవా, సేవా మందిర్, నంది ఫౌండేషన్, తదితర జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేయవచ్చు. ఆసక్తి ఉంటే సొంత ఎన్‌జీఓ స్థాపించుకోవచ్చు.
 • ఈ కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రామీణ సహకార సంస్థలు, వ్యవసాయాధార వ్యాపార సంస్థలు, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ వ్యవసాయ ఉత్పత్తుల మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో పనిచేయవచ్చు.
 • పేరున్న ఇన్‌స్టిట్యూట్స్‌లో కోర్సులో ఉండగానే ఆయా కళాశాలల్లో జరిగే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా కార్పొరేట్‌ కంపెనీలు సోషల్‌ రెస్పాన్సిబిలిటీ స్కీమ్‌ను అమలు చేసేందుకు రూరల్‌ మేనేజ్‌మేంట్‌/డెవలప్‌మెంట్‌ కోర్సులు చేసిన అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఇందులో టాటా టెలీ సర్వీసెస్, అమూల్, మాన్‌శాంటో, నాబార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఆదిత్య బిర్లా గ్రూప్, హీరో గ్రూప్, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి కంపెనీలతోపాటు జాతీయ అంతర్జాతీయ ఎన్‌జీఓలు సైతం ఉన్నాయి.
వేతనాలు..
రూరల్‌ మేనేజ్‌మెంట్‌/డెవలప్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సు చేసినవారికి ఆకర్షణీయ వేతన ప్యాకేజీలు లభిస్తున్నాయి. గత ఏడాది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ఎన్‌ఐఆర్‌డీ–హైదరాబాద్‌ విద్యార్థులకు సగటు వార్షిక వేతనం లక్షల్లోనే అందినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
నూరు శాతం ప్లేస్‌మెంట్స్‌..రూరల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఎన్‌ఐఆర్‌డీలో ఏడాది కాలపరిమితి గల పీజీ డిప్లొమా కోర్సు, రెండేళ్ల పీజీ కోర్సులు అందిస్తున్నాం. ఇక్కడ ఇప్పటిదాకా తొమ్మిది వందల మంది కోర్సు పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ అత్యున్నత స్థాయిలో సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు కోర్సులో ఉండగానే క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఎంపిక చేసుకుని సెర్ప్‌ వంటి సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అంతేకాదు యూఎన్‌డీపీ వంటి అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. రెండు మూడేళ్ల అనుభవం ఉన్న వారికి అంతర్జాతీయ ఏజెన్సీ కేపీఎంజీ వంటి వాటిల్లో ఆఫర్స్‌ లభిస్తున్నాయి. మరికొంత మంది విద్యార్థులు ఇక్కడ కోర్సు పూర్తికాగానే విదేశాల్లో ఉన్నత విద్యకు వెళుతున్నారు.

ఈవెంట్ మేనేజ్‌మెంట్

నేటి కార్పొరేట్ యుగంలో బర్త్ డే పార్టీ నుంచి మ్యారేజ్ ఫంక్షన్ వరకు అదిరిపోయే విధంగా నిర్వహించాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు. దీన్ని సమర్థంగా నిర్వహించేవారే ఈవెంట్ మేనేజర్లు. ఎడ్యుకేషన్ ఈవెంట్స్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్ వరకు.. కార్పొరేట్ నుంచి ప్రొడక్ట్ లాంచింగ్, సెమినార్లు, వర్క్‌షాప్స్, సినిమా అవార్డుల ప్రదానం, సన్మానాలు, సత్కారాలు.. ఇలా అనేక కార్యక్రమాలను డిజైన్ చేయడానికి.. చాలా మంది ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దాంతో సంబంధిత రంగంలో కోర్సు పూర్తి చేసిన వారికి అవకాశాలు పెరిగాయి.చాలా సంస్థలు ఈవెంట్ మేనేజ్‌మెంట్ విభాగంలో సర్టిఫికెట్ నుంచి డిప్లొమా, పీజీ డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

వెడ్డింగ్ ప్లానర్..
పెద్ద పెద్ద పంక్షన్లు, పార్టీలను బాగా ఆస్వాదిస్తారా! వాటి నిర్వహణలో తగిన అనుభవం ఉందా! బేరసారాలు చేయడంతోపాటు ఇతరులను కలుపుకుని పనిచేయగలరా! మీ సమాధానం అవును అయితే.. మీరూ వెడ్డింగ్ ప్లానర్గా మారొచ్చు! ఆయా అంశాల్లో ఆసక్తి కలిగిన ఎంతో మంది వెడ్డింగ్ ప్లానర్స్, బ్రైడల్ కన్సల్టెంట్స్గా స్వయం ఉపాధి పొందుతున్నారు. స్వయం ఉపాధి పట్ల ఆసక్తి లేని వారు వెడ్డింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఉద్యోగులుగా చేరొచ్చు.
గత కొంత కాలంగా ప్రజల ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ, బిజినెస్ రంగాల్లోని వారు, ఇతర పెద్ద ఉద్యోగాల్లోని వారు నెలకు లక్షల్లో ఆర్జిస్తున్నారు. వీరి వద్ద కావాల్సినంత డబ్బుయితే ఉంటుంది.. కానీ, సమయమే ఉండట్లేదు. వీరంతా దొరికిన కొద్ది సమయాన్ని ఉల్లాసంగా గడిపేందుకే ఇష్టపడుతున్నారు. ఇప్పుడిదే ఈవెంట్ మేనేజర్లకు వరంగా మారింది. పెళ్లి, పుట్టిన రోజు, గృహప్రవేశం, ఫేర్వెల్, ఫ్రెషర్స్ పార్టీ.. ఇలా శుభకార్యం ఏదైనా.. ఈవెంట్ మేనేజర్ల వైపే చూస్తున్నారు. దాంతో వెడ్డింగ్ ప్లానర్స్కు అవకాశాలు లభిస్తున్నాయి.


ఆఫర్ చేస్తోన్న సంస్థలు-కోర్సులుది ఇన్‌స్టిట్యూట్ నేషనల్ అకాడెమీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్

 • ఎంబీఏ(ఈవెంట్ మేనేజ్‌మెంట్)
 • బీబీఏ (ఈవెంట్ మేనేజ్‌మెంట్)
 • డిప్లొమా, పీజీ డిప్లొమా (ఈవెంట్ మేనేజ్‌మెంట్)
  వెబ్‌సైట్: www.naemd.com

ఏపీజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ.కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ కార్పొరేట్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.apeejay.edu

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్-గుర్గావ్కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
వెబ్‌సైట్: www.inlead.in

మాస్‌కో మీడియా-నోయిడాకోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్
వెబ్‌సైట్: www.masscomedia.com

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్-ముంబైకోర్సు: పీజీ డిప్లొమా/డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
వెబ్‌సైట్www.www.niemindia.com

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ఫ్యూచర్ మేనేజ్‌మెంట్-చండీగఢ్కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
వెబ్‌సైట్: www.itftindia.com

అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ (అమిటీ యూనివర్సిటీ)-న్యూఢిల్లీవెబ్‌సైట్: www.amity.edu/aiem

అర్హతలు: డిప్లొమాకు 10+2 లేదా ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పీజీ డిప్లొమా/ఎంబీఏ కోర్సుకు గ్రాడ్యుయేషన్ తప్పనిసరి.

అవకాశాలు: ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, కార్పొరేట్ హౌస్‌లు, స్టార్ హోటల్స్, రేడియో స్టేషన్స్, రిసార్ట్స్, క్లబ్స్, అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీలు, మీడియా హౌసెస్, మూవీ/టీవీ ప్రొడక్షన్ హౌసెస్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు, మ్యూజిక్ పరిశ్రమ, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఫ్యాషన్ హౌస్‌ల్లో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అనుభవం ఆధారంగా సొంతంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా స్థాపించుకోవచ్చు.

ఎంట్రీ లెవల్: కెరీర్ ప్రారంభంలో.. జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయాలి. తర్వాత స్కిల్స్, అనుభవం ఆధారంగా సీనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ఈవెంట్ అసిస్టెంట్ వంటి వివిధ హోదాల్లో స్థిర పడొచ్చు. ఈ హోదాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ రంగంలో ఉన్నత స్థానమైన.. ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి కూడా చేరుకొవచ్చు.

వేతనాలు: ప్రారంభంలో జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌కు నెలకు రూ.15-20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం, హోదాను బట్టి నెలకు దాదాపు రూ.30-50 వేల వరకు సంపాదించవచ్చు. ఈవెంట్ మేనేజర్/ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు దాదాపు రూ.2-4 లక్షల వరకు అందుకోవచ్చు.

కావల్సిన స్కిల్స్: ఈ రంగంలో రాణించాలంటే. సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం, సమయస్ఫూర్తి అవసరం. అంతేకాకుండా విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు సాగించాల్సి ఉంటుంది కాబట్టి ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. బడ్జెట్ కు సంబంధించి అప్రమత్తంగా వ్యవహరించాలి. కాబట్టి సదరు స్కిల్స్ కూడా ఉండాలి. రిస్క్ మేనేజ్‌మెంట్ స్కిల్స్, ఈవెంట్‌ను విజయవంతం చేసే క్రమంలో ప్రచారాన్ని కల్పించడానికి మీడియా మేనేజ్‌మెంట్ స్కిల్స్ వంటి అంశాలు కూడా అవసరమే.

టాప్ రిక్రూటర్స్: విజ్‌క్రాఫ్ట్, లాక్మే, ఫిల్మ్‌ఫేర్ మీడి యా హౌస్, పర్సెప్ట్ డీ మార్క్, సీఎన్‌బీసీ, డీఎన్‌ఏ నెట్‌వర్క్, సర్వీస్ ఇంటర్నేషనల్, 360 డిగ్రీస్, హెల్ప్ ఏజ్ ఇండియా, ఇంటర్‌ఫేస్, రెడ్ ఈవెంట్స్, లైట్ అండ్ రిఫ్‌లెక్షన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఫుడ్ ఆర్ట్, ఈవెంట్ క్రాఫ్టర్, షోమేకర్స్ ఇండియా, ఓపస్ మీడియా, ఈవెంట్ గురు, నక్షత్ర, గ్లోబల్ నెక్సస్, ఇంటర్‌ఫేస్ తదితర సంస్థలు.

ఫైర్ ఇంజనీరింగ్

బహుళ అంతస్తులు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణాలు.. భారీగా విస్తరిస్తున్న పారిశ్రామిక రంగం.. మరోవైపు.. సేఫ్టీ మెజర్స్, కొత్త నిబంధనలు వంటి కారణాలతో కెరీర్ పరంగా అవకాశాలకు వేదికగా నిలుస్తున్న విభాగం ఫైర్ ఇంజనీరింగ్. ఇంటర్ అర్హతతో ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులెన్నో ఉన్నాయి. వాటితో అవకాశాలూ సొంతం చేసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా వివిధ సంస్థలు ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్‌లో ఇంటర్మీడియెట్ అర్హతగా పలు కోర్సులు బోధిస్తున్నాయి. ఈ కోర్సులకు విద్యార్హతలేకాకుండా నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. ధైర్య సాహసాలు, సమయస్పూర్తి కూడా అవసరమే. ఇంజనీరింగ్ సూత్రాలను ఉపయోగించి అగ్నిప్రమాదాలను నివారించి, ఆస్తి, ప్రాణ, పర్యావరణ నష్టం జరగకుండా చూడడమే ఫైర్ ఇంజనీరింగ్.

కోర్సు స్వరూపం: కోర్సులో స్థూలంగా.. ఫైర్ ఇంజనీరింగ్ సైన్స్, ఫైర్ ప్రివెన్షన్ అండ్ ప్రొటెక్షన్, ఫైర్ ఎక్స్‌టింక్షన్ సైన్స్, ఫైర్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్, సేఫ్టీ మేనేజ్‌మెంట్, సేఫ్టీ ఇంజనీరింగ్, లాస్‌కంట్రోల్ అండ్ సేఫ్టీ లాస్, ఇండస్ట్రియల్ హైజిన్ అండ్ హెల్త్, ఫైర్ ఫైటింగ్ డ్రిల్, ప్రాక్టికల్ ఫీల్డ్ ట్రైనింగ్ అంశాలు ఉంటాయి.

ఉద్యోగాలిక్కడ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఫైర్ ఇంజనీర్లకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఫైర్ సర్వీసెస్, ఆర్కిటెక్చరల్ అండ్ బిల్డింగ్ డిజైన్, ఇన్సూరెన్స్ అసెస్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇండస్ట్రీ, రిఫైనరీస్, బాట్లింగ్ ప్లాంట్స్, టెక్స్‌టైల్స్, విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించే, అగ్నిప్రమాదాలకు అవకాశమున్న ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ యూనిట్‌ల్లో ఫైర్ ఇంజనీర్లకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. దాంతోపాటు స్థానిక ప్రభుత్వ విభాగాలు, ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ ఫైర్ ఇంజనీర్లకు జాబ్స్ లభిస్తాయి. ప్రారంభంలో రూ.12000 జీతంలోపాటు ఇతర అలవెన్సులూ పొందొచ్చు. ఫైర్ ఇంజనీర్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్న గల్ఫ్ లాంటి దేశాల్లో ప్రారంభంలోనే నెలకు రూ.50,000 వరకు పొందొచ్చు.

ఫైర్ ఇంజనీరింగ్ కోర్సులను అందించే కాలేజీలునేషనల్ ఫైర్ సర్వీస్ కాలే జ్-నాగ్‌పూర్కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్(ఫైర్)అర్హత: బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
ప్రవేశం: జాతీయ స్థాయి పరీక్ష ద్వారా.

కోర్సు పేరు: సబ్ ఆఫీసర్స్అర్హత: 10+2

కోర్సు పేరు: డివిజనల్ ఆఫీసర్స్అర్హత: 10+2 పాసై ఉండాలి. నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ లేదా తత్సమానం నుంచి ఫైర్ సర్వీస్‌లో డిప్లొమా ఉండాలి. డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి.
వెబ్‌సైట్: https://nfscnagpur.nic.in

యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్-డెహ్రాడూన్కోర్సు పేరు: బీటెక్(ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్)కోర్సు కాలపరిమితి: నాలుగేళ్లు
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 10+2లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
ప్రవేశం: ఈ సంస్థ నిర్వహించే ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్/ఏఐఈఈఈ
వెబ్‌సైట్: https://www.upes.ac.in

హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్అర్హత: ఏదైనా డిగ్రీ

కోర్సు పేరు: డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్అర్హత: పదోతరగతి

కోర్సు పేరు: సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్అర్హత: ఎవరైనా చేరొచ్చు
వెబ్‌సైట్: www.hifehyd.com

కాలేజ్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్, ఔరంగాబాద్కోర్సు పేరు: పోస్ట్ హెచ్‌ఎస్‌సీ డిప్లొమా ఇన్ ఫైర్ సర్వీస్ ఇంజనీరింగ్అర్హత: పదో తరగతి

కోర్సు పేరు: అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీఅర్హత: పదో తరగతి

కోర్సు పేరు:పోస్టు డిప్లొమా ఇన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్అర్హత: పదో తరగతి

కోర్సు పేరు: ఫైర్ ఇంజనీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్అర్హత: పదో తరగతి

కోర్సు పేరు: ఇండస్ట్రియల్ సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్అర్హత: పదో తరగతి

కోర్సు పేరు: ఫైర్ ఇంజనీరింగ్(ఫైర్‌మాన్)అర్హత: పదో తరగతి

కోర్సు పేరు: ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్అర్హత: పదో తరగతి

కోర్సు పేరు: ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్అర్హత: పదో తరగతి

వెబ్‌సైట్: www.fireengg.in

ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్కోర్సులు:

 • సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
 • సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫైర్ ఫైటింగ్
 • డిప్లొమా కోర్స్ ఫర్ సీనియర్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ సూపర్‌వైజర్
 • డిప్లొమా కోర్స్ ఇన్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్
 • పార్ట్ టైమ్ కోర్స్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అండ్ ఫైర్ ఫైటింగ్
 • డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్‌మెంట్
  వెబ్‌సైట్: www.dife.in

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్కోర్సు పేరుఎంబీఏ సేఫ్టీ మేనేజ్‌మెంట్అర్హత: ఏదైనా డిగ్రీ

కోర్సు పేరు:
 సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఫైర్ సేఫ్టీ (సీసీఎఫ్‌ఎస్)
అర్హత: పదో తరగతి

కోర్సు పేరు: డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ (డీఎఫ్‌ఎస్)అర్హత: పదోతరగతి

కోర్సు పేరు: డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్వినాన్‌మెంట్అర్హత: పదో తరగతి

కోర్సు పేరు:అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ(ఏడీఎఫ్‌ఎస్)అర్హత: డిప్లొమా/బీఈ/బీటెక్

కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ(పీజీడీఎఫ్‌ఎస్‌ఈ)అర్హత: ఏదైనా డిగ్రీ

కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంట్(పీజీడీహెచ్‌ఎస్‌ఈ)అర్హత: బీఎస్‌సీ/డిప్లొమా/బీఈ/బీటెక్

వెబ్‌సైట్: www.nifesmindia.net

రైల్వేలో జాబ్

ఎస్‌సీఆర్‌ఏ… ఫ్రీగా బీటెక్+రైల్వేలో ఇంజనీర్ జాబ్

స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ (ఎస్‌సీఆర్‌ఏ) ద్వారా ఇంటర్మీడియెట్ ఎంపీసీతోనే రైల్వేలో ఉన్నత కెరీర్‌కు బాట వేసుకోవచ్చు. పైసా ఖర్చులేకుండా మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేయొచ్చు. పైగా కోర్సు చదువుతూనే నెలనెలా స్టైపెండ్ కూడా అందుకోవచ్చు. కోర్సు పూర్తై వెంటనే రైల్వేలో మెకానికల్ ఇంజనీర్‌గా చే రిపోవచ్చు. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులకు ఉన్న సువర్ణావకాశం ఎస్‌సీఆర్‌ఏ.
యూపీఎస్‌సీ నిర్వహించే అత్యున్నత పరీక్షల్లో స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ (ఎస్‌సీఆర్‌ఏ) ఒకటి. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులకు ఉన్న సువర్ణావకాశంగా ఎస్‌సీఆర్‌ఏను చెప్పుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుతో పాటు నెలకు రూ.9100 స్టైపెండ్ కూడా చెల్లించడం విశేషం. ఎంపికైన అభ్యర్థులకు బీహార్‌లోని జమల్‌పూర్ వర్క్‌షాప్‌లో శిక్షణ ఉంటుంది. సెలవుల్లో వర్క్‌షాప్ ట్రైనింగ్ సెషన్ బిట్ మెస్రాలో నిర్వహిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారికి బిట్-మెస్రా డిగ్రీ ప్రదానం చేస్తుంది. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్ సబ్జెక్టులపై పట్టుంటే ఎస్‌సీఆర్‌ఏలో నెగ్గడం తేలికే. ఎందుకంటే.. ఈ పరీక్షలో 400 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఇంటర్మీడియట్ సిలబస్ నుంచే అడుగుతారు.

రాత పరీక్ష ఇలా:ఇందులో పశ్నలన్నీ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటాయి. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు. ఇంగ్లిష్ మాద్యమం. తప్పు సమాధానానికి మార్కుల్లో కోత ఉంటుంది. రాత పరీక్షలో మూడు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 200 మార్కులు.

పేపర్-1: జనరల్ ఎబిలిటీ టెస్ట్ (ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, సైకలాజికల్ టెస్ట్). వ్యవధి 2 గంటలు. మార్కులు 200.
పేపర్-2: ఫిజికల్ సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ). వ్యవధి 2 గంటలు. మార్కులు 200.
పేపర్-3: మ్యాథమేటిక్స్. వ్యవధి: 2 గంటలు, మార్కులు: 200
పర్సనాలిటీ టెస్ట్: 200 మార్కులు (రాత పరీక్షలో ఎంపికైనవారికి మాత్రమే)

సిద్ధంకండిలా:

 • అభ్యర్థికి ఇంగ్లిష్‌లో పరిజ్ఞానం, ఆంగ్లాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడో పరిశీలించేవిధంగా ఇంగ్లిష్‌పై ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్ యూసేజ్, ఒకాబులరీ ఎక్సర్‌సైజ్‌లు ప్రాక్టీస్ చేయూలి.
 • జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజికల్ జాగ్ర ఫీ, పాలిటీ, హిస్టరీ, సోషల్ ప్లానింగ్, సోషల్ వెల్ఫేర్, ఎకనామిక్స్, పంచవర్ష ప్రణాళికలు అంశాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి.
 • ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ పుస్తకాలు చదివితే జీకే ప్రిపరేషన్ చాలావరకు పూర్తైట్లే.
 • ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంశాలకోసం ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకాలు క్షుణ్నంగా చదివితే సరిపోతుంది.
 • వీలైనన్ని మోడల్ ప్రశ్నలు సాధన చేయూలి.

స్టైపెండ్:
నెలకు రూ.9100 చొప్పున కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు పాటు చెల్లిస్తారు. ప్రతి ఆరు నెలలకూ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు. మంచి పనితీరు కనబర్చని వారిని మధ్యలో తొలగిస్తారు. కనీసం మూడేళ్లపాటు రైల్వేలో పనిచేస్తామని ఒప్పందపత్రాన్ని రాయాలి.

ప్రొబేషన్:విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారిని మూడేళ్లు ప్రొబేషన్‌లో ఉంచుతూ రైల్వేలో మెకానికల్ ఇంజనీర్‌గా నియమిస్తారు. ఇప్పుడున్న స్కేల్ ప్రకారం ప్రొబేషన్‌లో నెలకు రూ.30,000కు పైగా సంపాదించొచ్చు. దీంతోపాటు రైల్వే ఏసీ కోచ్‌లో ఉచితంగా కుటుంబమంతా ప్రయూణించొచ్చు కూడా. ఎస్‌సీఆర్‌ఏకు ఎంపికైనవారు భవిష్యత్తులో రైల్వే బోర్డ్ చైర్మన్ లాంటి అత్యున్నత పదవి కూడా చేపట్టొచ్చు. డివిజినల్ ఇంజనీర్, జోనల్ చీఫ్ ఇంజనీర్.. ఇలాంటి హోదాలు ఎంపికైన అందరికీ దక్కుతాయి.

అర్హతలివీ…విద్యార్హత: ప్లస్ టూ/ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.
వయోపరిమితి: కనీసం పదిహేడేళ్లకు తక్కువ కాకుండా 21 ఏళ్లు మించకుండా ఉండాలి. (పరీక్ష నిర్వహించే సంవత్సరం ఆగస్ట్ 1 నాటికి). ఎస్సీ, ఎస్టీలకు గరిష్టంగా ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోసడలింపులుంటాయి.
సీట్లు: ఖాళీలపై ఆధారపడి ఉంటాయి. సుమారు 50 వరకూ ఉండొచ్చు.
ప్రకటన: రెండేళ్లకొకసారి ఫిబ్రవరి/మార్చిలో
నిర్వహణ: యూపీఎస్‌సీ
పరీక్ష: జూలై/ఆగస్ట్

మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: 
హైదరాబాద్, విశా ఖపట్నం, తిరుపతి
వెబ్‌సైట్: www.upsc.gov.in

కెరీర్‌గా… ఫొటోగ్రఫీ

Education News.ఫొటోగ్రఫీ
సృజనాత్మకతను జోడించే నైపుణ్యం ఉంటే.. ఫొటోగ్రఫీ ని ఆసక్తికరమైన కెరియర్‌గానూ మలచుకోవచ్చు. కేవలం వ్యక్తుల, సంస్థల జ్ఞాపకాలను పదిలపరచటానికే పరిమితమవకుండా కొన్ని రంగాల్లో ఫొటోగ్రఫీ ఎంతో కీలకంగా మారింది. సహజంగానే ఆ ప్రత్యేక అంశాల్లో డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సులు ప్రవేశపెట్టబడ్డాయి. ఒక ఫొటో మాటల్లో చెప్పలేనిదానికి రూపాన్నిస్తుంది. రాసిన విషయానికి బలం చేకూర్చి విశ్వసనీయతను సమకూర్చుతుంది. వార్తాపత్రికలోనో, మేగజీన్‌లోనో కొన్ని పేరాలతో నిండి ఉన్న సమాచారం కంటే.. ఒక ఫొటో ఎక్కువమందిని ఆకర్షిస్తుంది. విషయాన్ని కూడా ఇంకాస్త ఎక్కువగా అర్థమయ్యేలా చేస్తుంది. పెద్ద ఫంక్షన్లనేకాదు.. ప్రతి చిన్న విజయాన్నీ, విషయాన్నీ ఫొటోల రూపంలో భద్రపరచుకుంటున్నారు. కమ్యూనికేషన్‌, మీడియా రంగాలు విస్తరిస్తుండటంతో ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లకు గిరాకీ ఏర్పడింది. కొంచెం సృజనాత్మకంగా ఆలోచించగల శక్తి తోడైతే ఉత్తమ ఉపాధి మార్గమూ అవుతుంది. ఆసక్తి, కొద్దిగా కొత్తగా ఆలోచించగల నేర్పుతోపాటు, ప్రాథమిక ఫొటోగ్రఫీ పరిచయముంటే వారి నైపుణ్యాలకు మెరుగులు అద్దేలా సంస్థలు కొన్ని కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. కేవలం ఫొటోగ్రఫీకి సంబంధించిన కోర్సులనే అందించే సంస్థలున్నాయి.
ఫొటోగ్రఫీలో సర్టిఫికేషన్‌, డిప్లొమాతోపాటు డిగ్రీ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయ ఫొటోగ్రఫీ కోర్సులను అందించే సంస్థలు చాలా ఉన్నాయి. వీటిలో కొన్ని ప్రత్యేకంగా, కొన్ని విభిన్నమైన అంశాల్లో కోర్సులను అందిస్తున్నాయి. వీటికి కనీస విద్యార్హత ఇంటర్‌/ తత్సమాన విద్యను పూర్తిచేసుండాలి.
ఫోరెన్సిక్‌-నేరపరిశోధనలో
ఏదైనా నేరం జరిగినపుడు పోలీసులతోపాటు ఫొటోగ్రాఫర్లు రావడాన్ని గమనిస్తుంటాం. వాళ్లు వివిధ కోణాల్లో నేరం జరిగిన ప్రదేశాన్నీ, అనుమానాస్పదంగా అనిపించిన వాటినీ ఫొటోలు తీస్తుంటారు. వీరే ఫోరెన్సిక్‌ ఫొటోగ్రాఫర్లు. నేరాన్ని పరిష్కరించడంలో వీరిదీ ప్రధాన పాత్రే. నేర పరిశోధనలో నేరం జరిగిన తీరును అంచనా వేయడానికీ, విశ్లేషించడానికీ అవసరమైన పత్రాలను సమకూర్చుకోవడంలో పోలీసులు వీరి సాయం తీసుకుంటారు. నేరం జరిగినచోట సాక్ష్యాలను సేకరించడం, అక్కడి పత్రాలను ఫొటోల రూపంలో సేకరించడం, బాధితులు పడివున్న తీరు, పాదముద్రలు, రక్తపు మరకలు విస్తరించిన తీరు ఇతర సాక్ష్యాలను విజువల్‌ రికార్డు రూపంలో భద్రపరుస్తారు.
ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించే అలవాటుండి, నేర పరిశోధనపై ఆసక్తి ఉన్నవారికి ఇది బాగా ఉపయోగకరం. తీసే ఫొటోలకు వాస్తవికత, ఉపయోగం ఉండాలని భావించేవారు ఈ కెరియర్‌ను ఎంచుకోవచ్చు. ఫోరెన్సిక్‌ ఫొటోగ్రాఫర్‌ తీసే ఫొటోలను కేసు ఛేదనల్లో, కోర్టు కేసుల్లో సాక్ష్యాలుగానూ ఉపయోగిస్తారు. అయితే వీటికి కేవలం సాధారణ నైపుణ్యాలు సరిపోవు. వేలిముద్రలను స్పష్టంగా తీసివ్వగల డిజిటల్‌ ఇమేజింగ్‌ నైపుణ్యాలూ అవసరమవుతాయి. వీటి గురించి తప్పక నిపుణుల దగ్గర శిక్షణ అవసరం. క్రిమినాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నేపథ్యం ఉన్నవారికి ఇది మరింత లాభిస్తుంది.
కోర్సులు అందిస్తున్న సంస్థలు:
ఇంటర్నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ (ఐఎఫ్‌ఎస్‌), పుణె ‌
ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫొటోగ్రఫీ ఎక్సలెన్స్‌, అహ్మదాబాద్‌
టీజీసీ, దిల్లీ, జయపుర ‌
రచనా సంసద్‌ ఇన్‌స్టిట్యూట్‌, ముంబయి.
వీరిని సాధారణంగా పోలీసుశాఖ, పరిశోధన సంస్థలు, డిటెక్టివ్‌ ఏజెన్సీలు ఉద్యోగులుగా తీసుకుంటాయి.
కోర్సు:ఫొటోగ్రఫీకి సంబంధించి ఆరు నెలల షార్ట్‌టర్మ్ కోర్సులతోపాటు డిప్లొమా, సర్టిఫికెట్, బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు పదో తరగతి అర్హతతో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రం 10+2/ఇంటర్మీడియెట్ అర్హతతో బ్యాచిలర్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

స్పెషలైజేషనులఇతర కోర్సులకు భిన్నంగా ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉండడం ఫొటోగ్రఫీలో ప్రధాన ప్రత్యేకత. ఫొటో జర్నలిజం, కమర్షియల్ ఫొటోగ్రఫీ, అడ్వర్టైజింగ్, ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, ఇండస్ట్రియల్ ఫొటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, ఏరియల్ ఫొటోగ్రఫీ, సైంటిఫిక్ ఫొటోగ్రఫీ.. ఇలా పలురకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఫ్యాషన్ ఫొటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పట్ల చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

స్కిల్స్:ఫొటోగ్రఫీలో రాణించాలనుకునే వారికి సృజనాత్మకత ముఖ్యం. దృశ్యాన్ని అందంగా చిత్రీకరించడంలో కీలకమైన బ్యాక్‌గ్రౌండ్ కలర్స్, లైటింగ్ వంటి అంశాల్లో చక్కని అవగాహన ఉండాలి. సాంకేతికంగా ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.

ఉన్నత విద్య:డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీని చేసినవారు బీఎఫ్‌ఏ చేయొచ్చు. బీఎఫ్‌ఏ పూర్తిచేస్తే ఎంఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ చేయొచ్చు. మన రాష్ట్రంలో జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎంఎఫ్‌ఏ కోర్సును ఆఫర్ చేస్తోంది. ప్రవేశపరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఇంకా మనదేశంలో అనేక యూనివర్సిటీలు ఎంఎఫ్‌ఏ ఫొటోగ్రఫీ కోర్సును అందిస్తున్నాయి.

అవకాశాలు:ఫొటోగ్రఫీ కోర్సు చేసిన వారికి అవకాశాలకు కొదవేలేదు. ఫొటో జర్నలిస్ట్‌లకు వివిధ పత్రికలు, టీవీ ఛానెళ్లల్లో అవకాశాలుంటాయి. ఎంచుకున్న స్పెషలైజేషన్స్‌ను బట్టి వివిధ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, ఇండస్ట్రియల్ హౌస్‌లు, సైంటిఫిక్ జర్నల్స్, ఫ్యాషన్ హౌస్‌లు, ప్రభుత్వ సంస్థలు తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్, డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి అంతర్జాతీయ మీడియా హౌసుల్లో కూడా పని చేసే సౌలభ్యం ఉంటుంది. సొంతంగా స్టూడియోలను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా కూడా పని చేయొచ్చు.

వేతనాలు:ఏదైనా సంస్థల్లో ప్రారంభంలో కనీసం రూ. 8000 వేతనంగా పొందొచ్చు. పనితీరు, అనుభవాన్ని బట్టి నెలకు రూ.20,000 సంపాదించడం సులువే. సొంతంగా ఫొటో స్టూడియోలు నిర్వహించొచ్చు. వివిధ కార్యక్రమాలకు ఫొటోలు తీయడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందొచ్చు.

ఫొటోగ్రఫీని వివిధ స్థాయిల్లో ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:మన రాష్ట్రంలో..
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్
కోర్సు: బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)అర్హత: ఇంటర్మీడియెట్
వెబ్‌సైట్: www.jnafau.ac.in

శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ – హైదరాబాద్.
కోర్సు:బీఎఫ్‌ఏ (ఫొటోగ్రఫీ)అర్హత: ఇంటర్మీడియెట్

ఇతర సంస్థలు:నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్
కోర్సు: రెండేళ్ల వ్యవధితో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫొటోగ్రఫీ డిజైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
అర్హత: సంబంధిత అంశంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.nid.edu

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ -ముంబై
కోర్సు: ఫ్యాషన్ ఫొటోగ్రఫీలో ఆరు నెలల పార్ట్‌టైం డిప్లొమా కోర్సును అందిస్తోంది.
వెబ్‌సైట్: https://photoinstutenip.com

ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం-చెన్నై
కోర్సు: ఫొటో జర్నలిజం ఒక అంశంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజంను ఆఫర్ చేస్తోంది.
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.asianmedia.org https://www.asianmedia.org

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణే
వెబ్‌సైట్: www.ftiindia.com

సెయింట్ జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్-ముంబై
వెబ్‌సైట్: www.xaviercomm.org

అవకాశాల్లో కింగ్.. ఔట్‌సోర్సింగ్

Education Newsపెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేకుండా ఇంటర్మీడియెట్ అర్హతతోనే ఐదంకెల జీతం సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (బీపీఓ). ఇంగ్లిష్ భాషపై పట్టు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు బీపీఓలో చేరొచ్చు.
ఒక కంపెనీ తన నాన్ కోర్ వ్యవహారాలను వేరే దేశానికి బదిలీచేసి తక్కువ వ్యయానికే అక్కడి నుంచి ఐటీ ఆధారిత సేవలను అందుకోవడాన్నే బీపీవో అంటారు. దీన్నే ఐటీ ఎనాబిలిడ్ సర్వీసెస్(ఐఈటీఎస్) అని కూడా పేర్కొంటారు. ఇంగ్లిష్ మాట్లాడే యువత, కంప్యూటర్‌పై విస్తృత అవగాహన, తక్కువ ఖర్చుకే మానవ వనరుల లభ్యత, అనుకూలమైన టైమ్ జోన్, నాణ్యమైన పనితీరుతో బీపీవో కార్యకలాపాలకు భారత్ ప్రధాన కేంద్రమైంది.

భారత్-బీపీవో రంగం:కాల్ సెంటర్లు:కాల్ సెంటర్ అనేది సేవల కేంద్రం. ఇక్కడ ఫోన్లు, ఇంటర్నెట్, విస్తృతమైన డేటాబేస్, వాయిస్ ఆధారిత, వెబ్ ఆధారిత సమాచారంతో సుశిక్షితులైన మానవ వనరుల ద్వారా దేశ విదేశాల్లోని వినియోగదారులకు వివిధ సేవలు అందుతాయి. బ్యాంకింగ్, తయారీ రంగం, మార్కెట్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్స్, సేల్స్, ఆర్డర్ డెస్క్, కస్టమర్ సర్వీసెస్, హెల్ప్ డెస్క్, ఎమర్జెన్సీ డిస్పాచ్, క్రెడిట్ కలెక్షన్స్, ఫుడ్ సర్వీసెస్, ఎయిర్‌లైన్/హోటల్ రిజర్వేషన్స్ వంటి అన్ని రంగాల్లోనూ.. కాల్ సెంటర్లు ఉన్నాయి.

భవిష్యత్ అవకాశాలు:నాస్‌కామ్ అంచనాల ప్రకారం- బీపీవో పరిశ్రమలో వ్యాపార అవకాశాలున్న విభాగాలు..
కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్: ఇందులో టెక్నికల్ హెల్ప్, హెల్ప్ డెస్క్ కార్యకలాపాలుంటాయి. ఉద్యోగులు కార్పొరేట్, ఇతర క్లయింట్లకు సేవలు అందిస్తారు. ఇందులో కస్టమర్‌తో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.

మార్కెటింగ్ సర్వీసెస్: ఇందులో ప్రధానంగా సేల్స్, మార్కెటింగ్ ఉంటాయి. ఇది టెలిమార్కెటింగ్. కంటెంట్ డెవలప్‌మెంట్, కన్సల్టెన్సీ ప్రధానంగా ఉంటాయి. సేల్స్ ప్రక్రియలో భాగంగా ఫోన్ ద్వారా ఆర్డర్లు ఇచ్చే వినియోగదారులకు సేవలు అందుతాయి.

హ్యూమన్ రీసోర్స్ సర్వీసెస్: ఇందులో పేరోల్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్/ట్రైనింగ్, రిక్రూటింగ్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్, కంటింజంట్ వర్క్ ఫోర్స్ మేనేజ్‌మెంట్, వర్క్‌ఫోర్స్ అనాలసిస్ అవుట్ సోర్స్ అవుతాయి.

ఫైనాన్స్, అకౌంటింగ్ సర్వీసెస్: 
ఇది ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కార్యకలాపాలతో మొదలైన ప్పటికీ క్లయింట్‌లు తమ బిజినెస్ నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఫైనాన్షియల్ అనాలసిస్ సొల్యూషన్స్ కూడా అందించే అవకాశముంది.

ఇంజనీరింగ్ సర్వీసెస్: ప్రొడక్ట్, లేదా సేవల ఉత్పత్తిలో టెక్నికల్ కన్సల్టెన్సీని అందించడం దీనిలో ప్రధాన విధి. ఇందులో ప్రధానంగా రీసెర్చ్, డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, ప్రొడక్ట్ డిజైన్, టెస్టింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డాక్యుమెంటేషన్, ఇంజనీరింగ్ అనాలసిస్ ఉంటాయి.

లాజిస్టిక్స్: ఇందులో సప్లై చైన్ మేనేజ్‌మెంట్ ప్రధానం. ఇన్వెంటరీ కాస్ట్‌ను తగ్గించడం, డెలివరీ షెడ్యూల్‌ను మెరుగుపర్చడం దీని ప్రధాన ఉద్దేశం. ఇన్‌వాయిస్ కలెక్షన్, పేమెంట్ ప్రాసెసింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ రూట్ ఆప్టిమైజేషన్, వేర్‌హౌసింగ్, ఇన్‌వెంటరీ కంట్రోల్ సేవలు కూడా ఉంటాయి.

హెల్త్‌కేర్: మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ సేవలతో ఇది ప్రారంభమైంది. తాజా ట్రెండ్ డిసీజ్ మేనేజ్‌మెంట్, మెడికల్ ఇమేజింగ్ సేవలు.

ఫ్రెషర్స్‌కు జాబ్ ప్రొఫైల్స్: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ అనలిస్ట్, వాయిస్ ట్రైనర్, ప్రాసెస్ ట్రైనర్,సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, టెలీ కాలర్,కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ప్రాసెస్ అసోసియేట్,కాన్ఫరెన్స్ ఎగ్జిక్యూటివ్,టెలిమార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్…లాంటి హోదాలుంటాయి

వేతనాలు: చాలామంది తాజా గ్రాడ్యుయేట్లకు బీపీవో జాబ్ ఆకర్షణీయంగా మారడానికి ప్రధాన కారణం..పే ప్యాకేజ్. ఎమ్మెన్సీల్లో సాధారణంగా ప్రారంభ వేతనం నెలకు 20,000 వరకూ ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. రాత పరీక్షలో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఉంటాయి. ఇంటర్వ్యూలో ఇంగ్లిష్‌లో సరిగా మాట్లాడుతున్నారా లేదా అనేది పరీక్షిస్తారు. టెక్ సపోర్ట్‌కి రైటింగ్ స్కిల్స్, కస్టమర్ కేర్‌కి యాక్సెంట్ ప్రధానంగా గమనిస్తారు.

స్కిల్స్:

 • ఇంగ్లిష్‌పై గట్టి పట్టుండాలి.
 • కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్పీడ్, మార్కెటింగ్ నైపుణ్యాలు, కస్టమర్ల ప్రవర్తనపై అవగాహన అవసరం.
 • డేటాబేస్‌లోకి సమాచారాన్ని వేగంగా చేర్చగలగడం, తిరిగి తీసుకోవడం తెలియాలి.
 • సమస్యలను విశ్లేషించే సామర్థ్యాలుండాలి.
 • మంచి కమ్యూనికేషన్‌తోపాటు లిజనింగ్ స్కిల్స్ కూడా చాలా అవసరం.
 • ఓపిగ్గా వినడంతోపాటు కస్టమర్‌ను ఒప్పించగలిగే నైపుణ్యాలుండాలి.

టాప్ బీపీఓ కంపెనీలు: డెల్, జీఈ, ఐబీఎం, డెలాయిట్, హెచ్‌పీ, అసెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో….

అసెంచర్‌తో కలిసి ఇగ్నో 6 నెలల ఆన్‌లైన్ బీపీవో శిక్షణ కోర్సును ప్రారంభించింది.
వెబ్‌సైట్: www.ignou.ac.in


జెన్‌ప్యాక్ట్‌తో కలిసి నిట్… యూఎన్‌ఐక్యూయూఏ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్www.niituniqua.com