ఇకపై రెండేళ్లకే ఎంసీఏ పట్టా

మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్‌‌స(ఎంసీఏ)… డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కంప్యూటర్ విద్యనభ్యసించాలనుకునేవారికి చక్కటి అవకాశం. సాఫ్ట్‌వేర్ రంగంలో కెరీర్‌ను సుస్థిరం చేసుకునేందుకు చక్కటి ప్రత్యామ్నాయ మార్గం ఎంసీఏ. ఇప్పటివరకు మూడేళ్లుగా ఉన్న ఎంసీఏ కోర్సు కాలవ్యవధిని రెండేళ్లకు కుదిస్తూ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎంసీఏ కోర్సు వివరాలు, తాజా మార్పులు, ప్రవేశ విధానం, అవకాశాలపై ప్రత్యేక కథనం… ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నిపుణుల కొరత తీర్చడానికి 1990వ దశకంలో మూడేళ్ల ఎంసీఏ కోర్సును ప్రవేశపెట్టారు. లేటెస్ట్ అప్లికేషన్స్ డెవలప్‌మెంట్, లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సును రూపొందించారు. అందుబాటులో ఉన్న పలు సాఫ్ట్ వేర్‌ టూల్స్ ఆధారంగా ఒక అప్లికేషన్‌ను వేగంగా, సమర్థంగా నిర్వహించేలా విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ కోర్సు ప్రధానోద్దేశం. ఎంసీఏలో…

Read More