IIM Ahmedabad

అహ్మదాబాద్ దిగగానే, అక్కడి వారికి IIM అంటే తెలియదు – మేనేజ్మెంట్ వస్త్రపూర్ అనాలి.

అది మొత్తం సుమారు 67 ఎకరాల కాంపస్ లో 39 ఎకరాల కొత్త కాంపస్, ఒక పెద్ద రోడ్ కింద అండర్ పాస్ (underpass) ద్వారా కలుప/అతుకబడి ఉన్నది – pic below source: google images

ఆ విధంగా, విద్యా వత్సరం మొదలు అవటానికి ఒక నెల ముందే campus కు కొందరు వెళ్తారు. కేవలం, IIT, NIT, Engineer లే కాక, డాక్టర్లు, లాయర్లు, కామర్స్, వ్యవసాయ డిగ్రీ, పని అనుభవం ఉన్న వారు, చివరికి IPS, IRS ఆఫీసర్లు కూడా ఇక్కడ PGP కోర్స్ చేయడానికి వస్తారు. పక్క క్లాస్ లో కూర్చున్నది ఒక రాష్ట్ర స్థాయి లేక జాతీయ స్థాయి ఇంటర్ బోర్డ్స్ లేక IIT-JEE వంటి టాప్ ర్యాంకర్స్, సర్వ సాధారణం.

దిన చర్య:

క్లాసు 9 కి అయితే, 8.50 కే లేచి, Dorm నుంచి ముఖం కడిగి, బట్టలు మార్చి, న్యూ క్యాంపస్, old campus la మధ్య క్లాస్ ఎక్కడయితే అక్కడికి పరుగులు పెట్టడం. దారిలో Dorm 20 పక్కనే బయట పరుగు వీరుల కోసమే పెట్టీ ఉంచిన sandwich లు అందుకుని పరుగు continue చేయడం. లక్ బావుంటే, ప్రొఫెసర్ మంచి వాడయితే క్లాస్ రూం తలుపులు తెరిచి ఉంటాయి. లేక పోతే ఇక అంతే. క్లాస్ రూం లో వచ్చి పడ్డాం. ఖాళీ వెతుక్కుని కుర్చోటం. కబుర్లు చెప్పే వాళ్ళు, నిద్రలు పోయేవాల్లు, టాపిక్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అన్ని రకాలూ!

ప్రొఫెసర్ వస్తారు. వెనకే TA. Lecture bay లో వారి మూడ్ ఎలా ఉంటుందో! ప్రొఫెసర్ ఈ రోజు టాపిక్ చెప్పాలని అనుకోలేదు. ఇక స్టూడెంట్ నీ పిలిచి చెప్పమని, ఆ స్టూడెంట్ ప్లేస్ లో ప్రొఫెసర్ కూర్చున్నారు. IIM A నా మజాకా! ఆ స్టూడెంట్ లెక్చర్ అదరగొట్టేశాడు. ప్రొఫెసర్ కొన్ని సందేహాలు అడిగారు. కొంత చెప్పలేక పొతే, అందుకుని, వారు వివరించారు. కొందరు స్టూడెంట్స్ మరి కొన్ని సందేహాలు అడిగారు. TA (teaching associate) నిశ్శబ్ధం గా CP (class participation) note చేసుకుంటున్నారు.

తరువాత ఇంకో క్లాస్. ఈ సారి ప్రొఫెసర్ లెక్చర్ బే లోంచి చెప్పారు. మధ్యలో నలుగురికి cold calling అయింది. నీళ్లు నమిలిన ఒకడ్ని, బయటకు పొమ్మన్నారు. వాడు చక్కగ పోయాడు. వాడు IIT D student. రాత్రి వరసబెట్టి సినిమాలు చూసి, ఈ రోజు టాపిక్ లైట్ తీసుకొన్నాడు. ఈ topics వాడికో లెక్క కాదు. ఒక బ్రేక్. డబ్బులున్న వాడు, బయటకెళ్ళి తిన్నాడు, తాగాడు. ఇంకా డబ్బులున్న వాడు, అమ్మాయిలకు కూడా sponsor చేశాడు.

Next ఇంకో క్లాస్. కొంత మంది స్టూడెంట్స్ ఏవో లెక్కలు వేసుకుని ( minimal attendance), వెళ్లి పోయారు. మిగతా వారున్నారు. ఈ సారి case study. ఇచ్చి సాల్వ్ చేయమన్నారు. కొందరు చేశారు. మరి కొందరు బద్దక భాడవలు చేయల. కొందరు పక్కోడి దాన్లో కాపీ. TA అంతా చూసి నోట్ చేస్తూనే ఉన్నారు. ప్రొఫెసర్ ఒకరిద్దరి సొల్యూషన్ చూసి, మిగతా వారిని, అసైనమెంట్ submit చేయమన్నారు. ఇక్కడ students కు భయ పడే ప్రొఫెసర్స్ ఉంటారేమో కానీ సాధారణంగా, స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ నీ గౌరవిస్తారు, భయపడరు. ఇక్కడ ఎవడైనా, సబ్జెక్టు లో గొప్ప వాడే!

MANAC (mgmt acctg) కానీ, OM (ops mgmt), EE (Entr Econ), HR, any subject ఒక్కసారి చెప్తే అందేసుకునే వాళ్ళే ఎక్కువ. అందుకే కొందరు ప్రొఫెసర్స్ స్టూడెంట్స్ కి సబ్జెక్టు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. లంచ్ టైం. Mess కి వెళ్లే సరికి టెన్షనే. బయట surprise test notice ఉంటే! ఇక పరుగులే! ఆ రోజు టెస్ట్ ఉన్నది అంటే, mess దాదాపు సగం ఖాళీ.

టెస్ట్ ఏదో కెలికి, వచ్చే సరికి, mess మూత. ఇక TANSTAAFL (there’s no something as a free lunch) ఉందిగా. అక్కడేదో కొని, తిని, Dorm కి పయనం. దారిలో ఎవరన్న దోస్త్ లు కనిపిస్తే, వాళ్ళతో ముచ్చట్లు.

ఇక Dorm కి వెళ్ళి 2,3 గంటలు నిద్ర. మెల్లగా groups, assignment హడావుడి మొదలు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి లేడీస్ హాస్టల్ లో కానీ, బాయ్స్ dorm లో కానీ, Louis Khan ఓపెన్ ప్లేస్ లో కానీ, మంచి ప్లేస్ చూస్కుని, మొదలు. కొందరు కబుర్లు చెప్తారు, కొందరు bunk కొడతారు. ఒకడో ఇద్దరో గ్రూప్ work పూర్తి చేసేస్తారు.

అక్కడి నుంచి ఇక పిచ్చాపాటీ. కొందరు టెన్నిస్, క్రికెట్, TT, football ఆడుకోటానికి వెళ్తారు. కొందరు mess ki, కొందరు girl friend ఉంటే కలిసి బయటకి డిన్నర్ కి, అలా. ఏమీ లేనోల్లు, mess నుంచి Dorm కెళ్ళి, ఇక ఆ చిత్రాలు చూడటం. కొందరు బుధ్ధిగా లైబ్రరీలో ఉన్న reading room కి వెళ్ళి ఇక పిడి కొట్టడం. అన్ని రకాలూ!

రాత్రి 2 కి మెల్లగా ఒక్కొక్కరు నిద్ర కి… కొందరు 4, 5. ఒక్కో సారి Dorm కి alumni రావటం, ఏదోకటి sponsor చేయటం (వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, etc) కొన్ని మంచి కబుర్లు చెప్పటం. ఒక్కో సారి గెస్ట్ lectures by famous people- మంత్రులు కావచ్చు, అజీమ్ Premji, Infosys Narayana Murthy కావచ్చు. చాల మంది స్టూడెంట్స్ లైట్ తీసుకుంటారు. ఒక్కోసారి అటెండెన్స్ కోసం ప్రొఫెసర్ లు పాట్లు పడుతుంటారు.

ఇవి కాక వార్షిక ఉత్సవాలు, ఇతర ఐఐఎం ల నుంచి వచ్చే వారు, ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులు, వారి భాషణలు. SAC (students affairs committee) head చాల బలవంతుడు. ఇవి కాక Placecom (placement committee). వేరే బోల్డు క్లబ్స్ ఉంటాయి. అభిరుచిని బట్టి చేరటం.

ఇక సమ్మర్ placements. చాల మంది విదేశాలకు వెళ్తారు. బాగా చేస్తే, 2nd year కూడా పూర్తి అయ్యాక, వచ్చి జాబ్ లో చేరిపొమ్మని ఆఫర్ కూడా ముందే ఇచ్చేస్తారు. Internship లో కూడా పెద్ద జీతాలు, కళ్లు చెదిరే సౌకర్యాలు. ఇక Dorm లో birthday bumps, dorm names, subtle రాగింగ్ (మనకు తెలియదు రాగింగ్ చేస్తున్నారని, మరిపుడు ఉందో లేదో), గుప్త చిత్రాలు, గుప్త పార్టీలు, స్నేహితులు, ఎన్నో.

Indian Institute of Management Calcutta (IIM Calcutta or IIM-C)

Indian Institute of Management Calcutta (IIM Calcutta or IIM-C) is a public business school located in Joka, Kolkata, West Bengal, India. It is the 1st Indian Institute of Management to be established in India.

INTRODUCTION _-

ESTABLISHED _- 28 Nov 1961

CAMPUS SIZE _- 135 acres

POPULAR COURSES _- MBA/PGDM, Excutive MBA/PGDM, Certificate courses, MDP,

RANKINGS_

#INFRASTRUCTURE _-

#CUT Off _-

#FEE STRUCTURE _-Programme fee for the academic year 2021-22 will be Indian Rupees 27,00,000/- (non-refundable) or equivalent US$ for one year, payable in four instalments.

This amount includes tuition fees and cost of course material, books, accommodation and economy airfare of study tours organized by IIMC.

#PLACEMENTS _The institute conducted the final placement drive for it’s 55th PGP batch, and witnessed the participation of over 444 students, with 27% female and 73% male students. The process saw the participation of 150 recruiters raising 498 offers for the batch of 444 students, providing students opportunities for dream offers.

Under the MBAEx program, IIMC witnessed the perfect season of placements for its 13th batch with a top salary of INR. 77.60 LPA, an average salary of INR. 26.24 LPA, and a median salary of INR 24.41 LPA, an increase of 6.13% over the class of 2019.

#RECRUITERS _-

life at IIM Indore

The IIM Indore campus is set on a hill, a hill called ‘Prabandh Shikhar ‘. The campus is in three ‘levels’ which are at three different heights around the hill. The Sports Complex, Mess-3 and student hostels are all situated on Level-3 i.e. at the lowest level. More student hostels, Mess-1, Mess-2 & everything happening is on Level-2. Level-1 has the Academic Block, the Learning Centre and the Old Auditorium.

A Typical Day

The classes begin at the early hour of 8:45 AM and all are expected to be punctual since there is a premium to be paid for tardiness. As a result, there is a mad scramble in the mess as well as on the way up to the academic block. Not only does one have to be on time, but also be prepared for class by having studied the readings that have been circulated in advance. The 75-minute long sessions, punctuated by 15 minute tea breaks occupy most of the days.

Students’ Activities Council (SAC)

One of the most distinctive features of the campus is that students run most of the things. The Students’ Activities Council (SAC) is the channel through which the student body carries out most of its endeavours.

 • The student body runs its very own shop known as the PI shop, which caters to the daily needs of the students. Not only does it stock basic groceries, it also provides hands-on experience on running a business – a true learning experience as far as management is concerned.
 • In addition, the students run a fast food and juice joint called Juices and More, more commonly known as JAM. Known for its freshly prepared juices and fast food, JAM is also the place where most of students meet up in the evenings, have conversations, watch cricket matches and generally relax.

Academic Infrastructure

IIM Indore participants are being trained and educated by excellent teachers, including both visiting and regular faculty members. The Institute also has efficient staff members, taking care of the Institute’s administration. The academic facilities include:

Learning Centre (Library), 01 Computer Lab, 01 Finance Lab, 28 Syndicate Rooms, 35 Lecture Theaters, 103 Faculty Cabins.

The Institute also has two auditoriums, each having an amphitheater. The Auditorium-1 (old auditorium) has 300-seating capacity while Auditorium-2 (new auditorium) has 800-seating capacity, which is situated at the Sports Complex.

Sports Facility

IIM Indore has state-of-the- art Sports Complex, having the best sports facilities for both indoor as well as outdoor sports. Apart from Auditorium-2, the Sports Complex has the following facilities:

1 Meditation, Aerobics and Yoga Room, 1 Steam Bath Area, 1 Cardio Zone Area, 1 Banquet Hall, 1 Event Court, 1 Cricket Stadium, 1 Football Ground, 1 Cafeteria, 1Table Tennis Court, 2 Volleyball Courts, 1 Billiards, 2 Swimming Pools, 1 Squash Court, 2 Gymnasiums, 1 Lawn Tennis Court, 3 Basketball Courts, 1 Sauna Bath Area, 6 Badminton Courts.

The Institute has been availing services of experienced certified fitness instructors who bring a wide range of expertise to the Fitness Centre. The fitness trainers provide cardiovascular training, strength training, flexibility training, yoga and aerobics training.

Hostel Block Facility

Each of the blocks has a square in the center where basketball/badminton courts with artificial turf are maintained, with some blocks also having lawns in the square. Each hostel block has a common room where facilities such as wall-mounted televisions with DTH connection, table-tennis tables, dart game and carrom and chess games are available.

The individual rooms are furnished with teak cots and mattress, a computer table, chairs, closets and shelves. All rooms have full-time internet connectivity with direct lines to the main LAN. The housekeeping staff is available throughout the week to take care of cleaning of rooms, corridors and rest rooms on a daily basis.

IIM Indore Learning Centre (LC)

The IIM Indore Learning Centre (LC) with its modern collection of knowledge resources and innovative information services; fills an essential role for students, faculty, and the surrounding community in their intellectual pursuits. It is a hybrid library with the state-of-the-art technological applications, holding knowledge resources predominantly related to management and allied subjects. The entire LC collection including the CD-ROM databases and the online databases are made available through Institute’s network.

Life at IIM Bangalore

A 100-acre oasis in south Bangalore, the Indian Institute of Management Bangalore (IIMB), with its all-stone architecture, lush verdant woods and landscaped gardens, provides an idyllic environment to engage in management studies, academics and learning. IIMB has world-class infrastructure that facilitates excellence in teaching, research, consulting and other professional activities.

Each day brings its own new set of experiences and whether you’re a night owl or an early bird, there’s never anything routine about it!

Hot spots on campus

 • L Square – the quadrangle between the hostel. Parties, events and even basketball matches are hosted here.
 • The best time is early mornings. A walk in the woods is a refreshing way to clear up your mind. The serene streets are well-lit throughout and a Chai is your best companion during your night-walks.
 • There are over 15 benches inside the campus, away from the crowd. These are the best places to sit down and relax. Watch the birds, flowers, trees, orange night sky, and the occasional stars.
 • A mess to watch television, some cafes and the EPGP lounge with meeting rooms.

IIMB offers opportunities to interact with and learn from accomplished people. Business leaders, representatives of government and non-government organizations, artists and intellectuals regularly visit our campus on invitation to deliver talks and presentations that provide insights to the careers and personal attributes of these role-models.

Clubs and Committees

There are more than 30 clubs and committees on campus each related to different areas. They conduct their own selection process for selecting Junior Coordinators from first-year students. Each club conducts many workshops, events, debates, competitions, etc.

Some clubs from IIMB collide with clubs from other IIMs to conduct a common competition. It creates a competitive spirit and we get to know people from different campuses and how things work differently from our campus. Students in the first year are advised to apply for clubs of their interest.

Library and Classrooms

Infrastructure in the campus is par with the world-class institute. Classes have projectors and a good quality sound system. The structure of classes is such that each student is visible to the professor.

Spacious and extremely well stocked the library is regularly updated with the latest journals and newsletters. It also provides access to online databases like Bloomberg. Its services are subscribed to by working professionals too. The library is full of books, journals, research papers, publications, etc.

Computing Facilities

IIMB is the only fully Wi-Fi enabled campus amongst comparable institutes. The Computer Centre is available for use 24 hours. Printer facility is provided in the computer centre as well as in the hostel blocks. High speed Internet, highly resourceful intranet, sharing software, and internal messenger make all work easier and quicker.

Hostels

The spacious, beautiful and well maintained hostel blocks provide single room accommodation to all students. Each room is equipped with a bed and mattress, a table, a chair, a whiteboard with a clipboard, an almirah, tube lights, fans and shelves to keep books. Bathrooms are common with a washing machine facility.

There are 2 kinds of blocks. Old blocks and new blocks. Old blocks don’t have a balcony attached to the room. Also, the old block rooms are smaller in size. But the true hostel feels come in old hostel blocks.

Sports complex

The sports infrastructure at the campus is impressive. Be it Yoga, Zumba, swimming, or Badminton, the sports complex is only a stone’s throw away. If you’re someone who hasn’t played a sport/game in years, these amazing facilities should help you get some physical activity. This includes facilities for soccer, cricket, tennis, basket ball, volley ball, throw ball, badminton, indoor games etc. These facilities have had a role to play in the institute having a strong sporting culture.

Life Outside the Campus

Bangalore, arguably Asia’s fastest growing cosmopolitan city, is described as one of India’s best places to live in. Many Student spend most of the time inside the campus only. Nevertheless, there are 2 malls within a radius of 3 kilometers. You can go there for movies or shopping. There are many good restaurants in nearby JP Nagar and Koramangala area.

So Finally

The Institute provides a range of opportunities outside the classroom as well – be it industry interaction, cultural activities, sports competitions or entrepreneurial pursuits. With three major fests being organised every year, the campus becomes more lively and a happening place full of energy and euphoria.

గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ ఆడ్మిషన్‌ టెస్టు(జీమ్యాట్‌) VS గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్‌(జీఆర్‌ఈ)

విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్స్‌ పొందేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోర్‌ గురించి ఆందోళన చెందుతుంటారు. ఈ రెండిట్లో ఏ స్కోరు ఎలాంటి కోర్సులో చేరేందుకు ఉపయోగపడుతుంది?! విదేశీ వర్సిటీలు ఎక్కువగా దేన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి.. వంటి ప్రశ్నలు అభ్యర్థులకు ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో.. ఔత్సాహికులకు ఉపయోగపడేలా జీమ్యాట్, జీఆర్‌ఈ ప్రత్యేకతలు–ప్రయోజనాలు, రెండింటి మధ్య వ్యత్యాసాలు, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలపై ప్రత్యేక కథనం..

సారూప్యతలు!
విస్తృత కోణంలో చూస్తే రెండు పరీక్షలూ ఒకేలా కనిపిస్తాయి. రెండూ మాస్టర్స్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్షలే..! పరీక్ష ప్యాట్రన్‌లోనూ అనలిటికల్‌ రైటింగ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, వెర్బల్‌ రీజనింగ్‌ వంటి సారూప్యతలు ఉన్నాయి. జీమ్యాట్, జీఆర్‌ఈలు ప్రధానంగా అభ్యర్థుల్లోని క్రిటికల్‌ థింకింగ్, అనలిటికల్‌ రైటింగ్, వెర్బల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ నైపుణ్యాలను పరీక్షిస్తాయి. వీటిని ఏడాది పొడవునా నిర్వహిస్తారు. జీమ్యాట్, జీఆర్‌ఈ స్కోరుకు ఐదేళ్ల గుర్తింపు ఉంటుంది. ఇన్ని సారూప్యతలు ఉన్నప్పటికీ.. ప్రిపరేషన్, స్కిల్‌ టెస్టులు, ఇన్‌స్టిట్యూ ట్ల యాక్సప్టెన్సీ, వర్క్‌ ఎక్స్‌పీరియెన్స్‌ పరంగా రెండింటి మ«ధ్య స్పష్టమైన వ్యత్యాసాలున్నాయి.

మేనేజ్‌మెంట్‌ కోర్సులు..
జీమ్యాట్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లోని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. జీమ్యాట్‌ స్కోరుతో మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఎంబీఏ), పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం), మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ ఫైనాన్స్, మాస్టర్స్‌ ఇన్‌ అకౌంటింగ్, ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

జీఆర్‌ఈతో మాస్టర్స్‌..
ప్రపంచవ్యాప్తంగా వేల ఇన్‌స్టిట్యూట్స్‌ జీఆర్‌ఈ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వీటిలో సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్, లా, హ్యుమానిటీస్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఉన్నాయి. జీఆర్‌ఈ ప్రధానంగా అమెరికా, కెనడా వంటి దేశాల్లోని గ్రాడ్యుయేట్‌ స్కూల్స్‌లో మాస్టర్స్, డాక్టోరల్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు ఉద్దేశించింది. అదేవిధంగా జీఆర్‌ఈ స్కోరు ఆధారంగా పలు ఇన్‌స్టిట్యూట్స్‌ ఫెలోషిప్‌నకు విద్యార్థులను ఎంపిక చేస్తున్నాయి. జీఆర్‌ఈ జనరల్‌ టెస్టుతోపాటు బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీల్లో సబ్జెక్టు వారీ టెస్టులు అందుబాటులో ఉన్నాయి.

బీ–స్కూల్స్‌ ఓటు దేనికి!
బిజినెస్‌ స్కూల్స్‌లో ఎక్కువ శాతం జీమ్యాట్‌ స్కోర్‌తోనే ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇప్పడిప్పుడే కొన్ని బిజినెస్‌ స్కూల్స్‌ జీమ్యాట్‌ స్థానంలో జీఆర్‌ఈ స్కోరును పరిగణలోకి తీసుకుంటున్నా… వాటి సంఖ్య కేవలం 15 శాతానికి మించదు. కాబట్టి బిజినెస్‌ ప్రోగ్రామ్‌ లక్ష్యంగా సీరియస్‌గా ప్రిపేరయ్యే అభ్యర్థులు జీమ్యాట్‌కు హాజరవ్వడం లాభిస్తుంది. ఎంఎస్‌ వంటి మాస్టర్స్, డ్యూయల్‌ డిగ్రీ కోర్సులను లక్ష్యంగా పెట్టుకున్న వారు జీఆర్‌ఈకి ప్రిపేరవడం మంచిది. నిర్దిష్టంగా కొన్ని ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే.. సదరు ఇన్‌స్టిట్యూట్‌లు ఏ స్కోరును పరిగణలోకి తీసుకుంటున్నాయో తెలుసుకొని పరీక్షను ఎంచుకోవాలి.

ఏది సులభం..
జీమ్యాట్, జీఆర్‌ఈల్లో ఏది సులభం, ఏది క్లిష్టం అనే అంశం పూర్తిగా అభ్యర్థి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. జీఆర్‌ఈలో క్వాంటిటేటివ్‌ విభాగం సులభంగా ఉంటుంది. ఓ స్థాయి క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌తో జీఆర్‌ఈలో రాణించొచ్చు. జీమ్యాట్‌ క్వాంటిటేటివ్‌ విభాగం కఠినంగా ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్‌ స్కిల్స్‌ బలంగా ఉన్న వారు జీమ్యాట్‌ ఎంచుకోవడం లాభిస్తుంది. వొకాబ్యులరీలో బలహీనంగా ఉన్న అభ్యర్థులు జీఆర్‌ఈలో ఇబ్బంది పడతారు. ఎందుకంటే.. జీఆర్‌ఈలో టెక్ట్స్ కంప్లీషన్స్, సెంటెన్స్‌ ఈక్వివ్యాలెన్స్‌ క్వశ్చన్స్, వర్డ్‌ యూసేజ్‌ టెస్టింగ్‌ వంటివి ఉంటాయి. కొన్నేళ్లుగా హ్యుమానిటీస్‌ కోర్సులు చదివిన వారికి ఈ విషయంలో ప్రయోజనం ఉంటుంది.

సిలబస్‌..

 • జీమ్యాట్‌ వెర్బల్‌ విభాగంలో.. రీడింగ్‌ కాంప్ర హెన్షన్, ప్యాసేజ్‌ నుంచి కంక్లూజన్‌ డ్రా చేయడం, క్రిటికల్‌ రీడింగ్, సెంటెన్స్‌ కరెక్షన్‌ కీలక అంశాలుగా ఉంటాయి.
 • జీఆర్‌ఈ వెర్బల్‌లో.. రీడింగ్‌ కాంప్రహెన్షన్, టెక్స్‌›్ట కంప్లీషన్, సెంటెన్స్‌ ఈక్వివ్యాలెన్స్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
 • జీమ్యాట్‌ క్వాంటిటేటివ్‌ విభాగంలో.. ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డేటా సఫీషియెన్సీలపై ప్రశ్నలు అడుగుతారు.
 • జీఆర్‌ఈలో ఆల్‌జీబ్రా, అర్థమెటిక్, డేటా అనాలసిస్, జామెట్రి నుంచి ప్రశ్నలు వస్తాయి.
 • జీమ్యాట్‌ రైటింగ్‌కు సంబంధించి వాదనలోని (ఆర్గ్యుమెంట్‌) ముఖ్యాంశాలను గుర్తించడం, విశ్లేషించడం చేయాలి. ఐడియాలను స్పష్టంగా, క్రమపద్ధతిలో వెల్లడించాలి. సందర్భ సహిత ఉదాహరణలు, కారణాలను పేర్కొనాలి.
 • జీఆర్‌ఈ రైటింగ్‌లో సంక్లిష్టమైన ఆలోచనలను స్పష్టంగా, సమర్థంగా చెప్పాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన ఉదాహరణలు, కారణాలను పేర్కొనాలి. ఆధారాలతో క్లెయిమ్స్‌ను పరిశీలించాలి చేయాలి.

ముఖ్యాంశాలు..

 • జీఆర్‌ఈతో పోల్చితే జీమ్యాట్‌ క్వాంటిటేటివ్‌ క్వశ్చన్స్‌ క్లిష్టంగా ఉంటాయి. ఈ అంశంలో జీమ్యాట్‌ కోసం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.
 • జీమ్యాట్‌తో పోల్చితే జీఆర్‌ఈ వెర్బల్‌ విభాగంలో క్లిష్టమైన పదాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ భాషపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న అభ్యర్థులే ఇందులో అధిక మార్కులు పొందగలరు.
 • బిజినెస్‌ స్కూల్‌్ లో చదువు పూర్తి చేసుకొని మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ రంగంలోని కంపెనీలకు వెళ్లినప్పుడు కొన్ని సంస్థలు జీమ్యాట్‌ స్కోరు అడుగుతున్నాయి.

జీమ్యాట్‌–పరీక్ష విధానం

విభాగంప్రశ్నలుసమయం
అనలిటికల్‌ రైటింగ్‌ అసెస్‌మెంట్‌130 నిమిషాలు
ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌1230 నిమిషాలు
క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌3162 నిమిషాలు
వెర్బల్‌ రీజనింగ్‌3665 నిమిషాలు


జీఆర్‌ఈ –పరీక్ష తీరు

విభాగంప్రశ్నలుసమయం
అనలిటికల్‌ రైటింగ్‌2 టాస్కులు60 నిమిషాలు
వెర్బల్‌ రీజనింగ్‌–12030 నిమిషాలు
వెర్బల్‌ రీజనింగ్‌–22030 నిమిషాలు
క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌2035 నిమిషాలు

Life at FMS Delhi

The Faculty of Management Studies (FMS) is a part of one of the most coveted universities in the world- The University of Delhi. MBA from FMS is a dream that many aspirant carry, but very few attain. Established in 1954, the institute was incepted with focus on management education and not just on business management.

When one thinks of FMS, the first thing that strikes their mind is the exceptionally low fees and the tremendous Return on Investment (ROI) that one can get when they enter this college. But FMS is way more than this.

Academics

At FMS, you will soon realize there is no scope to get bored, you will always be on your toes, rushing to classes, attending guest lectures, submitting assignments, preparing case studies and what not. Academics at FMS is not only about classrooms whiteboard or the powerpoint presentations, but it is also about field trips, group tasks, individual/ group projects and bunking together that encourage you to think beyond FMS.

Apart from academics, life at FMS will be surrounded by various student societies that come with gripping events to keep you running around. The B-school basically drives you to participate in competitions and live projects that will help you explore the never-ending possibilities that exist for a B-school student.

Daily Routine

A normal day in the life of an FMS student starts around 8 am when he/she gets up and gets ready to attend the class which begins sharp at 9. There are 4 classes everyday with a duration of 1 hr each. Once or twice every week, the classes are followed by a Guest Lecture by eminent personalities from the industry who provide first-hand experience and great insights about the ever-changing business scenario.

Clubs and Annual Fest

Apart from academic matter, the college engages in a lot of co-curricular activities as well. The various club under the purview of cultural society, namely Nethra – The photography club, KALA – The fine arts club, Agamya – the literary and debate club has events all year around, enabling students to pursue their hobbies and interests in different fields.

FMS also holds its annual fest FIESTA, which receives a bludgeoning response from B-schools across North India.

Library

The Faculty of Management Studies (FMS) Library is an invaluable resource for students, researchers and faculties of business and management. The FMS library was found in the year of 1961. FMS has its main library at North Campus of the University. The library has over the years built a robust collection of over 50,000 books, over 100 journals (including 60 foreign journals), 12 news papers, and many other resources like thesis, student’s project reports, CDs, various reports, economic surveys reports, etc.The library, spread over 5178 sq. ft., also provides access to the best of business and management related digital resources through university network subscription to various databases consisting of scholarly and industry relevant content.

Life Outside the campus

Located in the heart of North Delhi, studying in FMS is going to be a different experience altogether. You will have access to major markets in Delhi; thanks to Delhi Metro, you can access famous markets like Connaught Place, Janpath, Sarojni Nagar and INA Market among others. Another major striking feature of life at FMS is the neighbouring pioneer colleges such as Kirori Mal College (KMC), St. Stephen College, Hans Raj College, Ramjas College and Miranda House to name a few. When at FMS, you will have the opportunity to visit these colleges during their fests seasons or for academic competitions/ events.

ఎంబీఏ

రెండేళ్ల కాలవ్యవధి గల కోర్సు మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ). ప్రథమ, ద్వితీయ సెమిస్టర్లలో విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ విద్య ప్రాథమిక విషయ పరిజ్ఞాన (కోర్‌) సబ్జెక్టులైన నిర్వహణ సూత్రాలు, హ్యూమన్‌ రిసోర్సెస్‌, స్టాటిస్టిక్స్‌, ఆర్థికశాస్త్రం, ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్‌ సబ్జెక్టులను అభ్యసిస్తారు. ప్రాథమిక సబ్జెక్టులు విద్యార్థులకు మేనేజ్‌మెంట్‌ భావనలు, సిద్ధాంతాల పట్ల పటిష్ట్టమైన పునాదిని వేస్తాయి. మొదటి ఏడాది పూర్తిచేసినవారు రెండో సంవత్సర ప్రవేశానికి ముందు స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
ఎంబీఏను ఎంచుకున్నవారు ముందు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఇది ఇతర పీజీ కోర్సుల్లా కాకుండా మల్టీ డిసిప్లినరీ కోర్సు. కాబట్టి, విద్యార్థి వివిధ కోణాల నుంచి ఆలోచించగల తత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అసలు విద్యార్థి ఎంబీఏ జీవితం కళాశాల ఎంపిక నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి మెరుగైన బి స్కూల్‌/ కళాశాలను ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, పూర్వవిద్యార్థుల నియామకాలు, కంపెనీల రిక్రూట్‌మెంట్‌ ఆధారంగా ఎంచుకోవాలి. విద్యార్థి చురుకుగా, వివిధ కమిటీల స్థాపనలో, కమిటీల్లో ఉదాహరణకు- ప్లేస్‌మెంట్‌ కమిటీ, మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌ కమిటీల్లో ఆక్టివ్‌ మెంబర్‌గా ఉండాలి.
మొదటి సంవత్సరం నుంచే విద్యార్థి పాఠాలతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలు, సమకాలీన అంశాలపట్ల అవగాహన పెంచుకోవాలి. డిబేెట్లు, క్విజ్‌ పోటీల్లో మొదటి నుంచీ చురుగ్గా పాల్గొనాలి. సీనియర్లు, కళాశాల పూర్వ విద్యార్థులతో సత్సంబంధాలు పెంచుకోవడం ద్వారా రిక్రూట్‌మెంట్‌లో ముందడుగు వేయొచ్చు. నెట్‌వర్క్‌ కూడా అభివృద్ధి చెందుతుంది. ఎంబీఏ విద్యార్థులకు నెట్‌వర్క్‌ ఎంతో అవసరం కూడా.
వినూత్న ధోరణులు
ఎంబీఏ విద్య ప్రపంచీకరణ, కొత్త పరిణామాలు, చట్టాలు, టెక్నాలజీ మేళవింపుతో కొత్త పోకడలు సంతరించుకుంటూనే ఉంటుంది. కొత్తగా ఈ రంగంలో డేటా అనలిటిక్స్‌/ డేటా సైన్స్‌ తమదైన ముద్ర వేస్తున్నాయి. వివిధ కొత్త స్పెషలైజేషన్లూ అందుబాటులోకి వస్తున్నాయి. మూక్స్‌ డిజిటల్‌ విస్ఫోటాన్ని ఎంబీఏలో సృష్టిస్తున్నాయి. ఈ రంగంలో ఆర్టిఫిషియల్‌ ఇంలిజెన్స్‌, డీప్‌ లర్నింగ్‌ టెక్నిక్‌లు నిర్ణయాలు తీసుకోవడంలో దోహదపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు ఈ రంగాల్లోనూ తమ ప్రతిభను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఇంటర్న్‌షిప్‌ల గురించి తెలుసుకుంటూ, తమకు తగ్గవాటిని చేస్తుండాలి.
సరికొత్త ఉద్యోగాలు పొందాలంటే..?
సానుకూల జీడీపీ అంచనాలు, స్టాక్‌ మార్కెట్ల బుల్‌ ట్రెండ్‌, అనుకూల వ్యాపారావకాశాల వల్ల ఇండస్ట్రీలో హైరింగ్‌ పెరిగింది. తరగతికే పరిమితం కాకుండా ఇంటర్న్‌షిప్‌లు, స్టార్టప్‌ల ద్వారా తమ కొత్త ఆలోచనలకు కార్యరూపం ఇవ్వొచ్చు. ఎంబీఏ చదివినవారు ఉద్యోగం చేయడానికే కాకుండా ఉద్యోగకల్పన ఇవ్వగల ఆలోచనలకూ పదును పెట్టగలగాలి. కార్పొరేట్‌ రంగంలో పైకి రావాలనుకునేవారు బృందంలో పనిచేసే నేర్పు, నాయకత్వ లక్షణాలతోపాటు తమ స్పెషలైజేషన్‌లో సాంకేతిక నైపుణ్యాలనూ అభివృద్ధి చేసుకోవాలి. బిజినెస్‌ అనలిస్ట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, డేటా అనలిస్ట్‌, ఆంత్రప్రెన్యూర్‌ అడ్వైజర్‌, అండర్‌ రైటర్‌, ప్రొడక్ట్‌ అనలిస్ట్‌ వంటి కొత్త తరహా ఉద్యోగాలకు ఎంబీఏ ప్రాతిపదికగా ఉంటోంది. ఈ ఉద్యోగాలకు అర్హత సంపాదించాలనుకునేవారు.. కోర్సు పూర్తయ్యేలోగా నిర్దిష్టంగా కొన్ని చేయాల్సి ఉంటుంది.
కంపెనీల్లో చోటు చేసుకుంటున్న మార్పులు, ప్రపంచీకరణ, అధిక పోటీతత్వం కారణంగా కొత్త/ నూతన తరహా ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి.
బిజినెస్‌ అనలిస్ట్‌గా ఉద్యోగాన్ని పొందాలనుకునేవారు ఆపరేషన్స్‌, మార్కెటింగ్‌ స్పెషలైజేషన్‌ను ఎంచుకుంటే మంచిది. ప్రొడక్ట్‌ అనలిస్ట్‌ అవ్వాలనుకునేవారు మార్కెటింగ్‌, కన్సల్టెన్సీ/ ఆపరేషన్స్‌ను ఎంచుకోవచ్చు. డిగ్రీలో ఇంజినీరింగ్‌ చదివినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, అండర్‌ రైటర్‌ ఉద్యోగాలు ప్రతి ఎంబీఏ ఫైనాన్స్‌ విద్యార్థి స్వప్నం. కానీ ఈ రోల్‌ను సాధించాలంటే టాప్‌ టైర్‌ బిజినెస్‌ స్కూల్స్‌ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ రంగంలో రాణించాలంటే సీఎఫ్‌ఏ, సీపీఏ, జీఏఆర్‌పీ వారు అందించే ఎఫ్‌ఆర్‌ఎం కోర్సులను చేయడం అవసరం.
డేటా అనలిస్ట్‌ కావాలనుకునేవారు డేటా అనలిటిక్స్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌లను ఎంచుకుని స్టాటిస్టిక్స్‌, బిగ్‌డేటా టూల్స్‌ అయిన ఆర్‌, పైథాన్‌, ఎస్‌ఏఎస్‌, మ్యాట్‌ల్యాబ్‌ వంటి టూల్స్‌పై పట్టు సాధించాలి.
ఆంత్రప్రెన్యూర్‌ అడ్వైజర్‌గా రాణించాలంటే కన్సల్టెన్సీ, మార్కెటింగ్‌ లేదా ఆపరేషన్స్‌ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి. సాధారణంగా అడ్వైజర్‌/ కన్సల్టెంట్‌ రోల్స్‌ టాప్‌ టైర్‌ ‘బి’ స్కూల్‌ విద్యార్థులకు దొరుకుతాయి. విద్యార్థి దశలోనే ఇంటర్న్‌షిప్‌ చేయడం, కొత్త టూల్స్ నేర్చుకోవడం ద్వారా తాము ఎంచుకున్న రంగంలో స్థిరపడొచ్చు.
ప్రముఖ స్కూల్సులో ఆధునిక స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రాధాన్యం దృష్ట్యా హెచ్‌సీయూ, ఐపీఈ, సీబీఐటీ లాంటి సంస్థల్లో వీటిని ప్రవేశపెడుతున్నారు. సాధారణ మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో చదివేవారు కూడా ఆన్‌లైన్‌ ద్వారా నూతన స్పెషలైజేషన్లకు సంబంధమున్న కోర్సులను అభ్యసించవచ్చు.
విభిన్న స్పెషలైజేషన్లు
మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌లే కాకుండా ఎంబీఏలో ఎన్నో విభిన్న, కొత్త స్పెషలైజేషన్లున్నాయి. వాటిలో కొన్ని..
అనలిటిక్స్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో అంకెలు, డేటా పాత్ర చాలా కీలకం. ప్రతి వ్యాపార సంస్థకూ వివిధ నిర్ణయాలు తీసుకోవడంలో డేటా కలెక్షన్‌, ఇంటర్‌ప్రిటేషన్‌, కండెన్సింగ్‌ ఆఫ్‌ డేటా చాలా విలువైంది. ఇటీవలి కాలంలో అనలిటిక్స్‌ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ రంగం అందిస్తున్న ఉన్నత వేతనాలు, విరివిగా ఉన్న ఉద్యోగావకాశాలే ఇందుకు కారణం.
గ్రాడ్యుయేషన్‌లో మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌సైన్స్‌, బీటెక్‌ చేసినవారు ఎంబీఏలో దీన్ని ఎంచుకోవడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అంకెలపట్ల మక్కువ, త్వరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, మేథమేటికల్‌ స్కిల్స్‌, చురుకుదనం, కోడింగ్‌ నైపుణ్యాలు గల అభ్యర్థులకు ఇది తోడ్పడుతుంది. యాడ్‌ఆన్‌ కోర్సులైన ఆర్‌ సాఫ్ట్‌వేర్‌, హడూప్‌, పైథాన్‌, బిగ్‌డేటా, అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టిక్స్‌ వంటి కోర్సులను కోర్స్‌ఎరా, ఎడెక్స్‌ వెబ్‌సైట్లలో నేర్చుకోవచ్చు.
ఎంబీఏ అనలిటిక్స్‌ పూర్తి చేసినవారికి డేటా అనలిస్ట్‌, డేటా సైంటిస్ట్‌, బిగ్‌డేటా కన్సల్టెంట్‌, డేటా ఆర్కిటెక్ట్‌, బిజినెస్‌ అనలిస్ట్‌ వంటి ఉద్యోగావకాశాలు ఉన్నతవేతనంతో దేశవిదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. 2020 నాటికి మనదేశంలో అయిదు లక్షలమంది డేటా అనలిస్టుల అవసరం ఉందని అంచనా.
బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌
దేశంలో బీమా, ఇన్సూరెన్స్‌ రంగాలు పరివర్తన దశలో ఉన్నాయి. గతంతో పోలిస్తే నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం, ఉద్యోగులకు మంచి జీతాలు రావడం వల్ల ప్రజల్లో పొదుపు పట్ల ఆసక్తి పెరిగింది. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, చలాకీగా పనిచేసే తత్వం, అంకెలపట్ల ఆసక్తి, కస్టమర్‌ మేనేజ్‌మెంట్‌, అమ్మకపు నైపుణ్యాలను విద్యార్థులు కలిగివుండాలి. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్స్‌, ఫండ్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, కార్పొరెట్‌ బ్యాంకింగ్‌, ట్రేడ్‌ ఫైనాన్స్‌ వంటి సబ్జెక్టులను విద్యార్థులు చదువుతారు.
ఉద్యోగావకాశాలపరంగా అభ్యర్థులకు పర్సనల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌, ఫండ్‌ మేనేజర్స్‌, బ్యాంకింగ్‌ స్పెషలిస్ట్‌, సిప్‌ అడ్వైజర్‌, రిస్క్‌ మేనేజర్‌, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌, స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ అభ్యర్థులకు అవకాశాలున్నాయి.
కన్సల్టింగ్‌
ప్రతి వ్యాపార సంస్థ తమ నిర్ణయాలను తీసుకునే క్రమంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి లేదా కన్సల్టెంట్‌ సలహాలు, సూచనలను తీసుకుంటుంది. కన్సల్టెంట్‌ సంబంధిత రంగంలో విశేష అనుభవం, జ్ఞానం, లోతుగా అధ్యయనం చేసే నేర్పరితనం, స్పష్టత, పోటీ తట్టుకుని వ్యాపారం చేయగలిగిన సామర్థ్యం, రిస్క్‌ మిటిగేషన్‌ వంటి నైపుణ్యాలు ఉండాలి. ఐటీ, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, టాక్స్‌, స్ట్రాటజీ, స్టార్టప్‌ కన్సల్టింగ్‌ వంటి వాటిల్లో తమకంటూ ఒక రంగంలో ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి. మంచి బిజినెస్‌ స్కూల్‌లో ఎంబీఏ కన్సల్టింగ్‌ చేసినవారికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన బూజ్‌, మెకిన్సే కన్సల్టింగ్‌, ఏటీ కార్నీ వంటి సంస్థలు ఎర్రతివాచీ పరుస్తున్నాయి.
ఆంత్రప్రెన్యూర్‌షిప్‌
ఉద్యోగం కాదు.. తమ ఆలోచనలను వ్యాపార రూపంలో కార్యరూపం దాల్చుకోవాలనుకునేవారు ఈ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చు. తద్వారా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ వ్యాపార నేపథ్యం, కొనసాగింపు, అభివృద్ధి చేయాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. దేశాభివృద్ధిలో ఆంత్రప్రెన్యూర్ల పాత్ర విడదీయలేనిది. మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఫండింగ్‌, ఏంజిల్‌ ఇన్వెస్టింగ్‌ వంటివి యువతను తమ సొంత సంస్థలు నెలకొల్పేలా ప్రేరేపిస్తున్నాయి.
సృజనాత్మకత, రిస్క్‌ టేకింగ్‌, పీపుల్‌ స్కిల్స్‌, దూరదృష్టి, అపజయాలకు కుంగిపోని మనస్తత్వం, పట్టుదల వంటి లక్షణాలున్నవారు దీన్ని ఎంచుకోవడానికి అర్హులు. దీన్ని పూర్తిచేసినవారు స్టార్టప్స్‌, కుటుంబ వ్యాపారం, సొంత సంస్థలను నెలకొల్పుకోవచ్చు.ఆంత్రప్రెన్యూర్‌గా రాణించవచ్చు.
రిటైలింగ్‌
వేగంగా మార్పులు చెందుతున్న రంగాల్లో రిటైలింగ్‌ మొదటి వరుసలో ఉంటుంది. విరివిగా ఉద్యోగావకాశాలూ అందిస్తున్నదీ రంగం. మనదేశంలో టాటా, బిర్లా, అంబానీ, అదానీలు రిటైలింగ్‌లో తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సేల్స్‌, అడ్వర్టైజింగ్‌, మార్కెట్‌ రిసెర్చ్‌, కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులకు అవకాశాలు పుష్కలం. వినియోగదారుడు కొత్తదనాన్ని ఎప్పుడూ కోరుకుంటాడు. ఆ కొత్తదనాన్ని అందించగలిగే నైపుణ్యం ఉన్నవారు ఈ రంగంలో రాణిస్తారు.
మర్చెండైజింగ్‌, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌, ఎక్స్‌పీరియన్స్‌ మేనేజ్‌మెంట్‌, స్టోర్‌ ఆప్టిమైజేషన్‌, కస్టమర్‌ సైకాలజీ వంటి సబ్జెక్టులను విద్యార్థులు అభ్యసిస్తారు. క్రియేటివ్‌ అడ్వర్టైజింగ్‌ హెడ్‌, రిటైల్‌ మేనేజర్‌, కస్టమర్‌ రిలేషన్‌ మేనేజర్‌, బ్రాండ్‌ స్పెషలిస్ట్‌ పోస్టులుంటాయి. ఈ-కామర్స్‌ రంగంలోనూ అవకాశాలుంటాయి. విద్యార్థులు సిక్స్‌ సిగ్మా, లీడ్‌ మేనేజ్‌మెంట్‌, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ వంటి యాడ్‌ ఆన్‌ కోర్సులను చేసి తమ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

క్యాట్ పరిక్ష

 Image result for cat aspirants
భారతదేశంలో ఎంబీఏ కోర్సుల్లో ఎన్రోల్ అయిన వారి సంఖ్య పెరగడం,  యువ గ్రాడ్యుయేట్లకు 100% ప్లేస్‌మెంట్లు మరియు  వేతన భారీ ప్యాకేజీలు  అనేక కొత్త ఐఐఎంలు మరియు ప్రైవేటు బిజినెస్స్ స్కూల్స్  పెరుగుదలకు  దారితీసింది. ప్రతిష్టాత్మక ఐఐఎంలు మరియు ఇతర మ్యానేజ్మెంట్  స్కూల్స్ లో చేరడానికి కామన్ అడ్మిషన్ టెస్ట్ లేదా క్యాట్ కోసం ఏటా లక్షలాది ఆశావాదులు(Aspirants)  దరఖాస్తు చేసుకుoటున్నారు.భారత దేశం లో అత్యంత క్లిష్టమైన(Tough) పరిక్షలలో CAT ఒకటి అందులో విజయం సాధించడం అంత సులువు కాదు.    
అనేక పెద్ద కంపెనీలలో    ప్లేస్‌మెంట్ కోసం ఎంబీఏ గ్రాడ్యుయేట్ల లబిస్తున్నప్పటికి  రిక్రూటర్లు తరచుగా మేనేజ్‌మెంట్ డొమైన్‌లో టాలెంట్ పూల్ లేకపోవడం గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. ఈ సమస్య పరిశ్రమ ఆధారిత విద్య మరియు శిక్షణ యొక్క నాణ్యతలో ఉంది. కోర్సు పూర్తయిన తరువాతరిక్రూటర్లు లేవనెత్తే ఉపాధియేతర (non-employability) సమస్య మరియు టైర్ 2 మరియు టైర్ 3 బి స్కూల్స్   – పరిశ్రమ కు అనుసంధానం కాకపోవడం వంటి పలు కారణాల వల్ల పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. అగ్రశ్రేణి ఐఐఎంలలో కూడా 100% ప్లేస్‌మెంట్ అనేది ఒక అపోహగా మిగిలిపోయింది. అధిక మొత్తాన్ని కోర్సు ఫీజుగా చెల్లించిన తరువాత కూడా చాలా మంది B-స్కూల్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారు..
ఇందుకు ప్రభుత్వం చాలా చేయాల్సి ఉంది. వాటిలో ఒకటి పాలసీ ఫ్రేమ్‌వర్క్ కోసం ప్రత్యేక రెగ్యులేటరీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం మరియు  గ్లోబల్ బిజినెస్ స్కూల్ యొక్క పారామితుల ప్రకారం PGDM కోర్సు ప్రవేశ పెట్టడానికి కొన్ని కనీస ప్రమాణాలను నిర్ణయిoచాలి. B-స్కూల్స్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను కల్పించడoతో పాటు  మ్యానేజ్మెంట్ డొమైన్ అభివృద్ధి చెందడానికి ఈ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించాలి.
కాబట్టి అధిక ఫీజ్ వసులు చేసే ఈ కళాశాలలో విద్యార్ధులు ప్రవేశించే ముందు  వారికి  ఈ రంగంలో నిజంగా ఆసక్తి ఉందొ, లేదో లేదా వారు అధిక వేతన ప్యాకేజీల కోసం  ఈ కోర్సును కోరుకుంటున్నారా అనేది  విశ్లేషించడానికి ప్రయత్నించాలి. ఈ సంస్థలలో చేరడానికి ముందు విద్యార్ధులు పిజిడిఎం కోర్సు యొక్క కఠినమైన నిర్మాణానికి (rigorous structure) తమను తాము  సిద్ధం చేసుకోవాలి.కేవలం  అకాడెమిక్ అర్హతలు మాత్రమే కాదుమంచి మేనేజర్ కావడానికి అవసరమైన ప్రతి రంగంలోనూ  విద్యార్థి ప్రావీణ్యం కలిగి ఉండాలని కోర్సు ఆశిస్తుంది. వ్యక్తిత్వ వికాసం, ఆంగ్లంలో బాగా ప్రావీణ్యతనాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలనిమంచి రచన మరియు మాట్లాడే నైపుణ్యాలువస్త్రధారణ మరియు అనేక ఇతర లక్షణాలను కలిగి ఉండాలని కోర్సు కోరుకొంటున్నది.
పని అనుభవం ఉన్న వ్యక్తికి పరిశ్రమపై ఉన్న అవగాహన కారణంగా ఫ్రెషర్ కంటే మంచి ఉద్యోగ ఆఫర్ లభించే అవకాశం ఉంది అయితే వాటితో పాటు మీ CV మరియు ప్లేస్‌మెంట్ల యొక్క HR రౌండ్‌లో విశ్వాసం కూడా ముఖ్యమైనవి. మీరు 24 గంటలు వ్యవధిలో కొన్ని శారీరక శ్రమలతో పాటు కఠినమైన తరగతులుక్షేత్ర పర్యటనలుప్రాజెక్టులు మరియు పనులను ఎటువంటి హడావిడి లేకుండా నిర్వహించగలరని అనుకుంటేఅప్పుడు MBA మీకు సరైన కోర్సు.
ఈ సంవత్సరం క్యాట్ ప్రవేశానికి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు దాదాపు 2 లక్షల మంది హాజరుకావచ్చు. 20 ఐఐఎంలు మరియు అనేక ఇతర బి-పాఠశాలల్లో 5000 సీట్లు కలవు. పేపర్ మూడు విభాగాలను కలిగి ఉంటుంది  అవి వెర్బల్ ఎబిలిటీ రీడింగ్ కంప్రహేన్షన్, డేటా వివరణ లాజికల్ రీజనింగ్ మరియు క్వాలిటేటివ్ ఎబిలిటీ (verbal ability & reading comprehension, data interpretation& logical reasoning and quantitative ability) MCQ  రూపంలో మొత్తం 100 ప్రశ్నలను కలిగి ఉంటాయి.
3 గంటల వ్యవధిలో దిన్ని ఆన్సర్ చేయాలి. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు ఇవ్వబడతాయిప్రతి తప్పు ఆన్సర్ కు –1 నెగటివ్ మార్క్  ఉంటుంది. విద్యార్థులు సిలబస్ మరియు మాక్ పేపర్‌ను పూర్తిగా అనేకసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఈ పరీక్షలో సమయ నిర్వహణ (time management) ప్రధాన పాత్ర పోషిస్తుంది.
 CAT లో బాగా స్కోర్ చేయాలంటేక్యాట్ మీ జ్ఞానం యొక్క లోతును పరీక్షించడానికి ఒక పరీక్ష కాదని గ్రహించాలిఅయితే ఇది మీ నిర్వహణ నైపుణ్యాలను(Manegirial skills) పరీక్షిస్తుంది. ప్రయత్నించే  మరియు వదిలివేసే  ప్రశ్నలకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు అన్ని విభాగాల మధ్య న్యాయంగా సమయం కేటాయించాలి. అంతేకాక ప్రేపరేషన్ సమయంలో కూడామీరు ప్రతి విభాగంలో మీ బలం మరియు బలహీనత ఉన్న ప్రాంతాలను గుర్తించాలి. రెగ్యులర్ మాక్స్(Mocks) మీకు ఇందులో సహాయపడతాయి.
ఆశావహులు (Aspirants) తాము ఏ రకమైన ప్రశ్నలను క్రమం తప్పకుండా తప్పులు చేస్తున్నారో విశ్లేషించాలిఇవి మొత్తం స్కోరులో నెగటివ్ గా ఉంటాయి. అప్పుడు ఆ టాపిక్స్ పైపైన చదవండి లేదా వాటిని వదిలివేయండి. మాక్ ఇవ్వడం కన్నా పోస్ట్ మాక్ విశ్లేషణ చాలా ముఖ్యం. ప్రతి మాక్ తరువాత అదే రోజున 3-4 గంటలు పేపర్ను విశ్లేషించాలి మరియు మెరుగుదల అవసమైన  ప్రాంతాలను గమనించండి. మీ క్యాట్ షెడ్యూల్ సమయంలో అదే స్లాట్‌లో మాక్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి
ది హిందూ లేదా హిందూస్తాన్ టైమ్స్ వంటి మంచి వార్తాపత్రికలు  చదవండి ముఖ్యంగా సంపాదకీయ పేజీప్రధాన ముఖ్యాంశాలు మరియు వ్యాపార పేజీ లో  మంచి ఆర్టికల్స్. ఇది ఖచ్చితంగా మీ గ్రహించే నైపుణ్యాలను పెంచుతుంది మరియు CAT యొక్క రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగంలో బాగా స్కోర్ చేయడానికి మీకు సహాయపడుతుంది. ఇంటర్నెట్‌లో క్యాట్  ప్రేపరేషణ్ పై  వివిధ ఓపెన్ ఫోరమ్‌లను అనుసరించండి.
ఐఐఎంలో చేరిన వారి ప్రేపరేషన్ వివరాలు తెలుసుకోండి. క్యాట్ లో  డేటా కోసం ఉత్తమమైన పుస్తకాల్లో ఒకటి అరుణ్ శర్మ పుస్తకం. క్యాట్ కోసం ప్రిపేర్ అవడం సంప్రదాయ ప్రేపరేషన్ కు భిన్నంగా ఉంటుంది. హార్డ్ వర్క్ దానితో పాటు ఎక్కువ స్మార్ట్ వర్క్ అవసరం. 

ఎంబీఏ ఇన్‌స్టిట్యూట్‌లు

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్-2019 ప్రకారం మేనేజ్‌మెంట్ విద్యలో ఐఐఎం బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ (టీఎల్‌ఆర్)లో 92.85(100), రీసెర్చ్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అండ్ కొలాబరేటివ్ పెర్ఫార్మెన్స్(ఆర్‌పీసీ)లో 55.03(100), గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్(ఓసీ)లో 98.35(100), ఔట్‌రీచ్ అండ్ ఇంక్లూజివిటీ(ఓఐ)లో 73.09(100), పెర్‌సెప్షన్‌లో100(100) స్కోరుతో ఐఐఎం-బి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తర్వాతి స్థానాల్లో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం కలకత్తా, ఐఐఎం లక్నో, ఐఐఎం ఇండోర్‌లు నిలిచాయి. ఐఐఎంలో ఎంబీఏ, పీజీడీఎం, పీజీపీఎం కోర్సులను అభ్యసించాలంటే.. జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాట్‌లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఐఐఎం, ఐఐటీలను పక్కనె బెట్టి చూస్తే జంషెడ్‌పూర్‌లోని గ్జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్, గుర్‌గావ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(ఎండీఐ), ముంబైలోని ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్, చెన్నైలోని గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, పుణెలోని సింబయాసిస్, ముంబైలోని నర్సిమోంజీ తదితర ఇన్‌స్టిట్యూట్‌లు టాప్‌లో నిలిచాయి.

విదేశాల్లో మేనేజ్మెంట్ విద్య కోసం జీమ్యాట్

విదేశాల్లో మేనేజ్మెంట్ విద్యనభ్యసించాలంటే మార్గం.. గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (జీమ్యాట్).
Career guidanceగ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్(జీఎంఏసీ) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. జీమ్యాట్ స్కోరు ఆధారంగా భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 110 దేశాల్లోని 2300కు పైగా ప్రముఖ యూనివర్సిటీలు/ఇన్స్టిట్యూట్లు మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుత కోవిడ్–19 కారణంగా జీమ్యాట్ ఆన్లైన్ ఎగ్జామ్ను అందుబాటుకి తెచ్చారు. ఈ నేపథ్యంలో.. జీమ్యాట్ పరీక్ష విధానం, ప్రయోజనాలు, ఆన్లైన్ ఎగ్జామ్ వివరాలపై ప్రత్యేక కథనం..
అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ తదితర దేశాల్లోని టాప్ ఇన్స్టిట్యూట్స్లో మేనేజ్మెంట్ కోర్సులను పూర్తిచేస్తే అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఇది కెరీర్ అవకాశాల పరంగా కలిసొస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు సదరు ఇన్స్టిట్యూట్స్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో విదేశీ యూనివర్సిటీల్లో ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి మార్గమైన జీమ్యాట్కు ఆదరణ పెరుగుతోంది.
కరోనా ప్రభావం..
ప్రస్తుత కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా జీమ్యాట్ పరీక్షా కేంద్రాలను జీఎంఏసీ మూసివేసింది. అభ్యర్థులు ఇంటి నుంచే పరీక్ష రాసుకోవడానికి వీలుగా జీమ్యాట్ ఆన్లైన్ ఎగ్జామ్ను ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ జూన్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. చైనా, ఇరాన్, క్యూబా, సుడాన్, స్లోవేనియా, ఉత్తర కొరియా మినహా ప్రపంచవ్యాప్తంగా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
జీమ్యాట్(టెస్ట్ సెంటర్) పరీక్ష విధానం..
జీమ్యాట్ టెస్ట్ సెంటర్లో నిర్వహించే పరీక్షలో.. వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటల 7 నిమిషాలు అయినప్పటికీ.. విరామం, పరీక్ష సూచనలతో కలిపి మొత్తం మూడున్నర గంటలుగా పేర్కొనవచ్చు.
విభాగం ప్రశ్నలు సమయం
వెర్బల్ రీజనింగ్ 36 65 ని.
క్వాంటిటేటివ్ రీజనింగ్ 31 62 ని.
ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ 12 30 ని.
అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్ 1 30 ని.
మొత్తం 80 3 గంటలు
వెర్బల్ రీజనింగ్..
ఈ విభాగంలో రీడింగ్ కాంప్రెహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, సెంటెన్స్ కరెక్షన్పై బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ప్రామాణిక రాత పూర్వక(యూఎస్) ఇంగ్లిష్లో ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తీకరించే పరిజ్ఞానం, రాతపూర్వక విషయాలను చదవి, అర్థం చేసుకోగల నైపుణ్యాలు, కారణాలను విశ్లేషించడం, వాదనలను అంచనా వేయడంలో.. అభ్యర్థి సామర్థ్యాన్ని ఈ విభాగంలో పరీక్షిస్తారు. క్లిష్టత స్థాయిపై ఆధారపడి, అభ్యర్థి సరైన సమాధానాలు రాసిన ప్రశ్నల సంఖ్య ఆధారంగా స్కోరు లభిస్తుంది.
క్వాంటిటేటివ్ రీజనింగ్..
ఈ విభాగంలో ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా సఫిషియెన్సీపై బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థుల గణితశాస్త్ర నైపుణ్యాలు, పరిమాణాత్మక సమస్యల పరిష్కార నైపుణ్యాలు, గ్రాఫికల్ డేటాను వివరించే సామర్థ్యాన్ని ఈ విభాగంలో పరీక్షిస్తారు. క్లిష్టత స్థాయి, అభ్యర్థి సరిగా సమాధానమిచ్చే ప్రశ్నల సంఖ్య ఆధారంగా∙స్కోరు కేటాయిస్తారు.
ఇంటిగ్రేటెడ్ రీజనింగ్..
ఈ విభాగం నుంచి మల్టీ సోర్స్ రీజనింగ్, గ్రాఫిక్స్ ఇంటర్ప్రిటేషన్, టు పార్ట్ అనాలసిస్, టేబుల్ అనాలసిస్ నుంచి బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. గ్రాఫిక్, న్యూమరిక్, వెర్బల్ డేటాను అవసరమైన సమాచారంగా మార్చగల సామర్థ్యాన్ని ఈ విభాగం పరీక్షిస్తుంది. రిలేషన్షిప్స్ ఏర్పడేలా ఇన్ఫర్మేషన్ను ఆర్గనైజ్ చేయడం, మల్టిపుల్ ఇంటర్రిలేటెడ్ సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను కూడా అంచనావేస్తుంది. అభ్యర్థి సరిగా సమాధానమిచ్చే ప్రశ్నల సంఖ్య ఆధారంగా స్కోరు లభిస్తుంది.
అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్..
ఈ విభాగంలో ఆర్గ్యుమెంట్ అనాలసిస్కు సంబంధించిన వ్యాసరూప ప్రశ్న ఇస్తారు. అభ్యర్థిలోని విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ను పరీక్షిస్తారు.
ఆన్లైన్ పరీక్షలో స్వల్ప మార్పులు:
 • జీమ్యాట్ ఆన్లైన్ ఎగ్జామ్లో అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్ సెక్షన్ను మినహాయించారు. ఈ ఆన్లైన్ పరీక్ష కాలవ్యవధి 2 గంటలు 45 నిమిషాలు.
 • పరీక్ష కేంద్రంలో నిర్వహించే జీమ్యాట్తో పోల్చితే.. జీమ్యాట్ ఆన్లైన్ పరీక్ష సిలబస్, స్కోరింగ్ విధానం, అల్గారిథమ్ తదితర అంశాల్లో ఎలాంటి మార్పు ఉండదు.
 • జీమ్యాట్ ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలనుకునే అభ్యర్థులు జీఎంఏసీ ప్రమాణాలకు అనుగుణంగా కంప్యూటర్ లేదా యాపిల్ మ్యాక్ను సమకూర్చుకోవాలి. కెమెరా, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ను ఏర్పాటు చేసుకోవాలి.
 • అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘించకుండా లైవ్ వీడియో ద్వారా క్రమశిక్షణాధికారి పర్యవేక్షిస్తారు.
 • పరీక్ష కోసం mba.comలో నమోదు చేసుకోవాలి.

జీమ్యాట్ స్కోరు..

 • జీమ్యాట్ మొత్తం స్కోర్లు 200 నుంచి 800 వరకు ఉంటాయి. వెర్బల్, క్వాంటిటేటివ్ స్కోర్లు 6 నుంచి 51 వరకు ఉంటాయి.
 • ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ స్కోర్లు 1 నుంచి 8 వరకు ఉంటాయి. అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్ స్కోర్లు 0 నుంచి 6 వరకు ఉంటాయి.
 • అధికారిక జీమ్యాట్ స్కోర్లు ఐదేళ్ల వరకు చెల్లుబాటు అవుతాయి.

జీమ్యాట్ అర్హత నిబంధనలు:

 • జీమ్యాట్ రాయాలనుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేయాలి.
 • వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
 • ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం, నైపుణ్యం తప్పనిసరి.
 • జీమ్యాట్ పరీక్ష రాయడానికి జీఎంఏసీ ఎలాంటి పని అనుభవాన్ని ప్రత్యేకించి పేర్కొనలేదు. కానీ టాప్ బీస్కూల్స్ ప్రవేశాల సందర్భంలో సాధారణంగా కనీసం 4–5 సంవత్సరాల పని అనుభవం ఉండాలని పేర్కొంటున్నాయి.
రిజిస్ట్రేషన్, పరీక్ష తేదీలు:జీమ్యాట్ పరీక్షను సంవత్సరం పొడవునా నిర్వహిస్తారు. ముందుగా mba.comలో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఫీజు చెల్లించి అందుబాటులో ఉన్న తేదీల్లో పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్ కోసం అందుబాటులో ఉన్న పరీక్ష విండోకు 24 గంటల ముందు వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జూన్ 15, 2020 వరకు ఆన్లైన్ ఎగ్జామ్ తేదీలు అందుబాటులో ఉన్నాయి. ఈ తేదీలను పొడిగించే అవకాశం ఉంది.
పరీక్ష కేంద్రాలు
 జీమ్యాట్ వందకి పైగా దేశాల్లోని టెస్టు సెంటర్లలో ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను మూసివేశారు. ఇప్పుడు ఇంట్లోనే ఉండి జీమ్యాట్ ఆన్లైన్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://mba.com

ఎంబీఏ, పీజీడీఎంతో మంచి ఉద్యోగ అవకాశాలు.. లక్షల్లో జీతాలు

మేనేజ్‌మెంట్ కోర్సులకు యువతలో ఎంతో క్రేజ్! కారణం.. దేశ విదేశాల్లో లభిస్తున్న అవకాశాలే!! ఏదైనా డిగ్రీతో మేనేజ్‌మెంట్ పీజీలో చేరొచ్చు.ముఖ్యంగా ఇంజనీరింగ్+ మేనేజ్‌మెంట్ పీజీ పూర్తిచేసిన వారి కెరీర్ ఉజ్వలంగా ఉంటుందనే అభిప్రాయం ఉంది.
Career guidance మేనేజ్‌మెంట్ పీజీ అనగానే గుర్తుకొచ్చే కోర్సులు.. ఎంబీఏ, పీజీడీఎం/పీజీపీఎం. ఈ రెండు కోర్సులు ఒకటే అని కొందరు.. కాదు వేర్వేరు అని మరికొందరు వాదిస్తారు. దాంతోపాటే ఎంబీఏలో చేరాలా..?! లేదా పీజీడీఎం/పీజీపీఎం ఎంచుకోవాలా అనే సందేహం విద్యార్థుల్లో మొదలవుతుంది. ఈ నేపథ్యంలో.. ఎంబీఏ, పీజీడీఎం/పీజీపీఎంల మధ్య తేడా.. ప్రత్యేకతలు, ప్రాధాన్యతల గురించి తెలుసుకుందాం..

ఎంబీఏ వర్సెస్ పీజీడీఎం

 • మేనేజ్‌మెంట్ కోర్సుల్లో తరచుగా వినిపించే పేర్లు.. ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్).. పీజీడీఎం (పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్).. పీజీపీఎం(పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్). ఎంబీఏ అంటే మాస్టర్ కోర్సు.. పీజీడీఎం/పీజీపీఎం అంటే డిప్లొమా కోర్సు అని చాలామంది భావిస్తుంటారు. వాస్తవానికి ఇవి రెండూ రెండేళ్ల కోర్సులే. అకడమిక్‌గా రెండూ సమానమే!
 • ఎంబీఏ: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, వాటికి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో ఎంబీఏ సర్టిఫికెట్ అందిస్తారు.
 • పీజీడీఎం/పీజీపీఎం: యూనివర్సిటీలతో సంబంధం లేకుండా ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) గుర్తింపుపొందిన కళాశాలలు, స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థలు పీజీడీఎం/పీజీపీఎం అందిస్తాయి. అందువల్ల వీటికి డిగ్రీ అని కాకుండా.. డిప్లొమా అని సర్టిఫికెట్ ఇస్తారు.
 • ఉద్యోగ నియామకాల్లో ఎంబీఏ, పీజీడీఎం రెండు కోర్సులు సమానమేనని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ప్రకటించింది.

కరిక్యులమ్ వేర్వేరు..

 • యూనివర్సిటీలు అందించే ఎంబీఏ కోర్సు కరిక్యులమ్ ముందుగానే రూపొందించి.. దానిని మాత్రమే బోధిస్తారు. పాఠ్యాంశాలను స్వేచ్ఛగా ఎప్పుడుపడితే అప్పుడు మార్చడానికి అవకాశం ఉండదు.
 • పీజీడీఎం కోర్సులు అందించే సంస్థలు స్వయంప్రతిపత్తి గలవి. వీటిలో ఐఐఎంలు, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఐఎస్‌బీ వంటి అగ్రశ్రేణి కళాశాలలు ఉన్నారుు. ఇవి ఏ యూనివర్సిటీకీ అనుబంధంగా ఉండకపోవడం వల్ల కరిక్యులమ్ తరచూ మార్చుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్, కంపెనీల అవసరాలకు అనుగుణంగా డిమాండ్‌ను బట్టి పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు మారుస్తుంటారు.

ప్రవేశాలు..

 • తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబీఏలో ప్రవేశానికి ఐసెట్‌లో ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.
 • స్వయం ప్రతిపత్తి గల ఐఐఎంలు, ఐఎస్‌బీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్), ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ వంటి సంస్థలు మేనేజ్‌మెంట్ పీజీ (పీజీడీఎం/పీజీపీఎం) కోర్సుల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా ఎంట్రన్‌‌స టెస్ట్ నిర్వహిస్తారుు. ఐఐఎంలు క్యాట్ స్కోర్, జీడీ, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారుు. మరికొన్ని సంస్థల్లో క్యాట్/మ్యాట్/జీమ్యాట్ స్కోర్ ఆధారంగా అడ్మిషన్ పొందొచ్చు.

ఫీజులు..

 • యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఫీజు స్వయం ప్రతిపత్తి బీస్కూల్స్‌తో పోల్చినప్పుడు తక్కువగానే ఉంటుంది. ప్రభుత్వ యూనివర్సిటీ కళాశాలలో ఎంబీఏ ఫీజు రూ.35వేల వరకూ ఉంటుంది. యూనివర్సిటీ అనుబంధ ప్రైవేటు కళాశాలల్లో సాధారణంగా రూ.60 వేలకు మించదు.
 • కానీ స్వయం ప్రతిపత్తి బీస్కూల్స్‌లో పీజీడీఎం/పీజీపీఎం కోర్సు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు వసూలు చేస్తారు. దేశంలో ఉన్న 20 ఐఐఎంలలో ఫీజు ఎక్కడా ఒకేరకంగా లేదు. ఐఐఎం అహ్మదాబాద్‌లో రూ.23 లక్షలు ఉంటే.. ఐఐఎం సిర్‌మూర్‌లో రూ10.30 లక్షలు ఉంది. ఐఎస్‌బీ-హైదరాబాద్‌లో పీజీపీఎం కోర్సుకు రూ.40 లక్షలకు పైగానే వ్యయం అవుతుంది.
ఉద్యోగ అవకాశాలు..
వాస్తవానికి ఉద్యోగ అవకాశాల పరంగా చూస్తే.. ఎంబీఏ.. పీజీడీఎం/పీజీపీఎం చేసినవారి మధ్య పెద్దగా ఎలాంటి వ్యత్యాసం లేదు. కార్పొరేట్ కంపెనీలు తమ అవసరాలకు తగ్గ నైపుణ్యాలున్న అభ్యర్థులను నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తాయి. ప్లేస్‌మెంట్స్ విషయానికి వస్తే కళాశాల బ్రాండ్, పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్, విద్యార్థుల నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలు ప్రభావితం చేస్తారుు.

వేతనాలు..

 • పీజీపీఎం/పీజీడీఎం లేదా ఎంబీఏ పూర్తిచేసిన వారిలో ఎవరికి అధిక వేతనాలు లభిస్తాయో చెప్పడం కష్టమే. ఐఐఎం-అహ్మదాబాద్‌లో చదివినవారికి, స్థానిక యూనివర్సిటీ కాలేజీలో చదివిన వారి వేతనాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. నియామకాల్లో ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఐఐఎం అహ్మదాబాద్‌కు ప్రాధాన్యం ఇస్తారుు. ఎంబీఏనా లేదా పీజీడీఎం/పీజీపీఎం కోర్సా అనేది కాకుండా… పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లో చదివి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో టాప్ కంపెనీలో అవకాశం దక్కించుకుంటే వేతన ప్యాకేజీ ఆకర్షణీయంగా ఉంటుంది.
 • గత ఏడాది ఐఎస్‌బీలో పీజీపీఎం చేసినవారికి దేశీయ కంపెనీ ఏడాదికి రూ.37 లక్షల ప్యాకేజీ ప్రకటించింది. ఇక్కడ జరిగిన 2019 క్యాంపస్ సెలక్షన్‌‌సలో 1194 మందిలో 886 మందికి సరాసరి వార్షిక వేతనం రూ.25.06 లక్షలుగా ఉంది. ఐఐఎం-కోల్‌కతాలో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఓ విద్యార్థి అత్యధికంగా రూ.75 లక్షల వేతనం అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లలో ఎంబీఏ చేసినవారు కూడా సగటున 8లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ వార్షిక వేతనం అందుకుంటున్నారు.
ఉన్నత విద్యకు ఎంబీఏ..
 మేనేజ్‌మెంట్ పీజీ తర్వాత ఎంఫిల్, పీహెచ్‌డీ చేయాలనుకుంటే మాత్రం ఎంబీఏ ఉత్తీర్ణులకే అవకాశం ఉంటుంది. విదేశాల్లో సైతం ఉన్నత విద్యను అభ్యసించాలంటే.. ఎంబీఏకే అక్కడి వర్సిటీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందువల్ల ఎవరైనా మేనేజ్‌మెంట్ పీజీ కోర్సు చేసి కార్పొరేట్ కొలువు దక్కించుకోవాలనుకుంటే ప్లేస్‌మెంట్స్ జరిగే బీస్కూల్స్‌లో పీజీడీఎం/పీజీపీఎంలో చేరొచ్చు. అలాగే దేశ విదేశాల్లో ఎంఫిల్, పీహెచ్‌డీ చేయాలనుకుంటే ఎంబీఏలో చేరడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

 ఏ కోర్సు ప్రత్యేకత దానిదే..
 మేనేజ్‌మెంట్ విద్యలో.. డిప్లొమా కోర్సుకు, పూర్తి స్థారుు డిగ్రీకి ఎంతో తారతమ్యం ఉంటుంది. డిప్లొమా కోర్సులు కంపెనీల అవసరాలకు అనుగుణంగా రూపొందించినవి. అవసరాలకు తగ్గట్టు డిమాండ్‌ను బట్టి ఈ కోర్సులు ఉంటారుు. కానీ ఎంబీఏ అలా కాదు.. దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. విదేశాల్లో మేనేజ్‌మెంట్‌లో ఉన్నత చదువులు చదవాలంటే.. ఈ రంగంలో ఫుల్‌టైమ్ పీజీ డిగ్రీ కోర్సు ఉండాల్సిందే. ఉన్నత విద్యకు వెళ్లాలంటే పీజీ డిప్లొమా కోర్సులు సరిపోవు. ప్లేస్‌మెంట్స్ సెలక్షన్‌‌సలో కంపెనీలు.. విద్యార్థుల అకడమిక్ గ్రేడ్ పారుుంట్స్,ఇంటర్న్‌షిప్ వంటి బ్యాక్ గ్రౌండ్ చూస్తారుు. మంచి కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేస్తే డిప్లొమా, పీజీ డిగ్రీలకు సమానమైన అవకాశాలు కల్పిస్తున్నారుు.

మేనేజ్‌మెంట్ కోర్సెస్ – ఎగ్జామ్స్

వ్యాపార వ్యూహాలన్నీ సమ్మిళితం చేసి రూపొందించిన కోర్సే ఎంబీఏ. ప్రపంచాన్ని నడిపిస్తోంది వర్తకమే. దీనికి సుశిక్షితులైన వర్తక నిర్వాహకుల భూమికే కీలకం. అందుకే ప్రపంచవ్యాప్తంగా మేనేజ్‌మెంట్ కోర్సులకు డిమాండ్ ఏర్పడింది. ఎక్కువ మంది విద్యార్థులు ఎంబీఏ/పీజీడీబీఏలో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వివిధ మేనేజ్‌మెంట్ కోర్సులు, పరీక్షల వివరాలు తెలుసుకుందాం.
వివిధ రకాల మేనేజ్‌మెంట్ కోర్సులు…మేనేజ్‌మెంట్ కోర్సుల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైంది ఎంబీఏ. కోర్సు వ్యవధి రెండేళ్లు. యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా దాని అనుబంధ కాలేజీలు నిర్వహించే కోర్సును ఎంబీఏ అంటారు. దీని తర్వాత ముఖ్యమైంది పీజీడీబీఏ. నేరుగా ఏఐసీటీఈ గుర్తింపుతో స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు, వాటి అనుబంధ కేంద్రాలు/కాలేజీలు నిర్వహించే కోర్సులను పీజీడీబీఏ అంటారు. ఈ రెండూ సమాన హోదా ఉన్న డిగ్రీలే. బీ స్కూల్స్ పీజీడీబీఏ డిగ్రీని ప్రదానం చేస్తాయి. ఇప్పుడు ఎంబీఏ/పీజీడీబీఏలో రకరకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఐటీలతోపాటు ఇంటర్నేషనల్ బిజినెస్, మీడియా మేనేజ్‌మెంట్, అడ్వర్టైజింగ్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్…ఇలా వందకు పైగా స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు రెండేళ్ల పాటు ఒకే అంశంలో స్పెషలైజేషన్‌తో ఎంబీఏ/పీజీడీబీఏ కోర్సులు రూపొందించాయి. ఎంబీఏ/పీజీడీబీఏ-హాస్పిటల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, రిటైల్ మేనేజ్‌మెంట్, ఏవియేషన్, ఇన్సూరెన్స్…ఇలా చాలా కోర్సులు అందిస్తున్నాయి.

కెరీర్ ఆప్షన్లు:మార్కెటింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, హెచ్‌ఆర్, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఉద్యోగాలుంటారుు. అన్ని కంపెనీలూ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంబీఏ విద్యార్థులను నియమిస్తున్నాయి. బ్యాంక్‌ల్లో అవకాశాలు పెరిగాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో మేనేజేరియల్ ఉద్యోగాలతోపాటు కొన్ని కోర్సులు పూర్తిచేస్తే టెక్నికల్ ఉద్యోగాలు కూడా సొంతం చేసుకోవచ్చు. ఎంబీఏ ఉద్యోగాల్లో ఎక్కువ మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో ఉంటాయి. ఆకట్టుకునే మాటతీరు, చొచ్చుకుపోయే స్వభావం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల్లో బాగా రాణించగలరు. ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఫార్మా, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్… ఇలా ప్రతి పరిశ్రమలోనూ ఎంబీఏ చదివినవాళ్లకు అవకాశాలు అపారం.

కాలేజీ ఎంపికలో…ఆ కాలేజీ ఎప్పుడు ఏర్పాటైంది? ఇప్పటిదాకా ఎన్ని బ్యాచ్‌లు బయటకొచ్చాయి? మొత్తం ఫ్యాకల్టీ సభ్యుల సంఖ్య? పీహెచ్‌డీ చేసిన ఫ్యాకల్టీ? ప్లేస్‌మెంట్ సెల్ ఉందా? గత రెండేళ్ల నియూమకాలు తీరు? ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి? మౌలిక సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ల్యాబ్స్, లైబ్రరీ, స్టూడెంట్ సిస్టమ్ రేషియో ఎంత? పూర్వ విద్యార్థులేమంటున్నారు? ఈ అంశాలను పరిశీలించి అవగాహనకు రావచ్చు.

స్పెషలైజేషన్ ఎంపికలో…ఈ విషయంలో విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను, వ్యక్తిత్వం, భవిష్యత్తు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. మార్కెట్ డిమాండ్ ప్రకారమో లేదా ఇతరుల సలహా మేరకో స్పెషలైజేషన్లు ఎంచుకోవడం సరికాదు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ సలహాలు తీసుకోవాలి. వీలైతే ఇప్పటికే ఆయా విభాగాల్లో స్థిరపడిన ఉద్యోగుల అభిప్రాయం స్వీకరించాలి. మార్కెట్ ట్రెండ్ బట్టి స్పెషలైజేషన్ ఎంచుకోవడం సరికాదు.

వివిధ మేనేజ్‌మెంట్ పరీక్షలుజీమ్యాట్ – గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ఎవరికోసం: విదేశాల్లో ఎంబీఏ చదవాలనుకునే వారికి
అర్హత: 16 ఏళ్ల ఎడ్యుకేషన్ (10+2 తర్వాత నాలుగేళ్ల డిగ్రీ అంటే బీటెక్ లాంటి కోర్సులు). మూడేళ్ల డిగ్రీ విద్యార్థులు పీజీ ఫస్ట్ ఇయర్ పూర్తిచేసి ఈ పరీక్ష రాయొచ్చు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా
పరీక్ష ఫీజు: 250 యూఎస్ డాలర్లు
పరీక్షలో: క్వాంటిటేటివ్, వెర్బల్, ఎనలిటికల్ రైటింగ్ అంశాలపై ప్రశ్నలుంటాయి.
ప్రవేశం: ప్రపంచ వ్యాప్తంగా 2000 బిజినెస్ స్కూళ్లలో

క్యాట్ – కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్నిర్వహణ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు
ప్రకటన: జూలై లేదా ఆగస్ట్‌లో
పరీక్ష: డిసెంబర్/జనవరిలో
అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్నవాళ్లూ అర్హులే.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా
పరీక్షలో: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రహెన్సన్ అండ్ వెర్బల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రశ్నలతీరు, ప్రశ్నపత్ర స్వరూపం ఏటా మారుతుంది.
ప్రవేశం: ఐఐఎంలే కాకుండా దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లన్నీ క్యాట్ స్కోర్ ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఈ స్కోరే ప్రామాణికం.

ఎక్స్‌ఏటీ-జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్
నిర్వహణ:జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్-జంషెడ్‌పూర్
అర్హత: ఏదైనా డిగ్రీ
రిజిస్ట్రేషన్ టైం: సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు
పరీక్ష: జనవరిలో
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా
రాత పరీక్షలో: 200 ప్రశ్నలు 3 సెక్షన్లలో ఉంటాయి. వెర్బల్/రీడింగ్ కాంప్రహెన్షన్; క్వాంటిటేటివ్/డేటా ఇంటర్‌ప్రిటేషన్/రీజనింగ్; జనరల్ అవేర్‌నెస్ అంశాలపై ప్రశ్నలడుగుతారు. 250-300 పదాల్లో ఇంగ్లిష్‌లో వ్యాసం రాయాలి.
ప్రవేశం: ఈ పరీక్ష స్కోర్ ద్వారా 60 బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశం లభిస్తుంది.

మ్యాట్-మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్నిర్వహణ: ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ).
అర్హత: ఏదైనా డిగ్రీ
ప్రకటన: ఏటా నాలుగు సార్లు
పరీక్ష: ఏడాదికి నాలుగు సార్లు
(ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్‌ల్లో)
ప్రశ్నపత్రంలో: పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్ స్కిల్స్, డేటా ఎనాలసిస్ అండ్ సఫిసియన్షీ, ఇంటెలిజన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ అంశాల్లో ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూల ద్వారా.
ప్రవేశం: దేశవ్యాప్తంగా 500 బీ స్కూళ్లలో

ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-ఐసెట్నిర్వహణ: ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్
ప్రకటన: మార్చిలో
అర్హత: 45 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా
రాత పరీక్షలో: 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మొత్తం 3 సెక్షన్‌లు. సెక్షన్-ఏ ఎనలిటికల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు; సెక్షన్-బీ మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు; సెక్షన్-సీ కమ్యూనికేషన్ ఎబిలిటీ-50 ప్రశ్నలు.
ప్రవేశం: రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఐసెట్ ర్యాంక్ ద్వారా అడ్మిషన్ లభిస్తుంది. మన రాష్ట్రంలో సుమారు 65,000 ఎంబీఏ సీట్లు ఉన్నాయి.

ఈమ్యాట్-ఎలక్ట్రానిక్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్అర్హత: ఏదైనా డిగ్రీ
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా
ప్రవేశం: దేశ వ్యాప్తంగా 48 బిజినెస్ స్కూళ్లలో

సింబయాసిస్ శ్నాప్ టెస్ట్నిర్వహణ: సింబయాసిస్ – పుణె
ప్రవేశం: సింబయాసిస్, అనుబంధ కళాశాలల్లో
ప్రకటన: నవంబర్‌లో
పరీక్ష: డిసెంబర్‌లో

ఆత్మా-ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏటీఎంఏ)అర్హత: ఎనీ డిగ్రీ
ప్రకటన: డిసెంబర్‌లో పరీక్ష: ఫిబ్రవరిలో
పరీక్షలో: ఎనలిటికల్ స్కిల్స్, క్వాంటిటేటివ్ స్కిల్స్, వెర్బల్ స్కిల్స్ అంశాలపై ప్రశ్నలుంటాయి.
ప్రవేశం: దేశ వ్యాప్తంగా 139 ఇన్‌స్టిట్యూట్‌ల్లో

మరికొన్ని పరీక్షలు:కొన్ని బిజినెస్ స్కూళ్లు ప్రత్యేకంగా వేటికవే పరీక్షల నిర్వహిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి…ఐఎస్‌బీ, నార్సీమోంజీ, ఐఐఎఫ్‌టీ, ఐబీశాట్, బిట్‌శాట్, ఎఫ్‌ఎంఎస్, ఐఆర్‌ఎంఏ, టిస్, మైకా, ఐఎస్‌ఎం, ఐఆర్‌ఎంఏ, నిఫ్ట్, ఐఎంటీ, ఎఫ్‌ఆర్‌ఐ, బీవీయూ, ఓపెన్‌మ్యాట్, సీమ్యాట్…మొదలైనవి.

దేశంలో టాప్ బీ-స్కూళ్లు….

 • ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్-హైదరాబాద్
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-అహ్మదాబాద్
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-బెంగళూరు
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-కోల్‌కతా
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ఇండోర్
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-కోజికోడ్
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-లక్నో
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-షిల్లాంగ్
 • జమ్నలాల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ముంబై
 • జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్-జంషెడ్‌పూర్
 • ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ఢిల్లీ
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్‌ట్రేడ్-న్యూఢిల్లీ
 • ఇండియన్ ఇన్‌స్టిట్యట్ ఆఫ్ టెక్నాలజీ-ముంబై
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఢిల్లీ
 • మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-గుర్‌గావ్
 • నార్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ముంబై
 • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్-ముంబై
 • ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్-ముంబై
 • సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ అండ్ హెచ్‌ఆర్‌డి-పుణె
 • సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్-పుణె
 • టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-ముంబై
 • ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్-న్యూఢిల్లీ
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్-కోల్‌కతా
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్
 • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ-ఘజియాబాద్
 • ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-న్యూఢిల్లీ
 • కేజే సోమయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-ముంబై
 • లాల్ బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-న్యూఢిల్లీ
 • ముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్-అహ్మదాబాద్
 • టీఏ పాయ్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-మణిపాల్
 • జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-భువనేశ్వర్
 • భారతీ దాశన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-త్రిచీ
 • ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్-ఢిల్లీ
 • డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పూర్
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్
 • ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్-చెన్నై
 • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్-ఆనంద్
 • నిర్మా యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-అహ్మదాబాద్
 • సిదన్హమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ -ముంబై
 • సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్-పుణె
 • బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ-నోయిడా
 • యూనివర్సిటీ ఆఫ్ పుణె-పుణె
 • గోవా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-గోవా
 • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్-హైదరాబాద్
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిఎమ్-కోల్‌కతా
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-రూర్కీ
 • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్-పుణె
 • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ-నాగపూర్
 • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టె క్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్-ముంబై
 • లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-చెన్నై
 • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-త్రిచీ
 • ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
 • సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికం మేనేజ్‌మెంట్-పుణె
 • యూనివర్సిటీ బిజినెస్ స్కూల్-చండీగఢ్
 • వెలింగ్‌కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-ముంబై