దేశంలో మేటి లా ఇన్స్టిట్యూట్లు ఇవే..!

ఆధునిక దేశాల్లో చట్టం, న్యాయవిద్య, అభివృద్ధి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. న్యాయవిద్య కేవలం న్యాయవాదులను తయారుచేయడానికే పరిమితం కాదు..! భవిష్యత్ సమాజ రూపకల్పనలో కీలక ఉపకరణంగా కూడా ఉపయోగపడుతుంది. కానీ, ఎక్కువమంది విద్యార్థులు న్యాయవిద్య అనగానే వెనకంజ వేస్తుంటారు. లాతో కెరీర్లో స్థిరపడటానికి చాలా సమయం పడుతుందని భావిస్తుంటారు. వాస్తవానికి ప్రస్తుతం న్యాయవిద్యలోనూ కొత్త, కొత్త స్పెషలైజేషన్స్ అందుబాటులోకొచ్చాయి. నేడు లా విద్యార్థులకు కార్పొరేట్ రంగంలో ఉజ్వల అవకాశాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. 2019 ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్)లో నిలిచిన లా ఇన్స్టిట్యూట్లు.. అందిస్తున్న కోర్సులు, ప్రవేశ విధానాల గురించి తెలుసుకుందాం.. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఆర్డీ) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) 2015 నుంచి మొత్తం తొమ్మిది కేటగిరీల్లో దేశీయ ఇన్స్టిట్యూట్లకు ర్యాంకులను ప్రకటిస్తోంది. కరోనా…

Read More

‘లా’తో భవిత ఇలా..

నేటి యువత మనస్ఫూర్తిగా మొగ్గుచూపే మరో కోర్సు… లా! ఆర్థిక సరళీకరణల నేపథ్యంలో.. ప్రభుత్వ రెగ్యులేటరీ పాత్ర, మారుతున్న ఆర్థిక, సాంఘిక పరిస్థితులు ‘లా’ గ్రాడ్యుయేట్స్‌కు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయ్!!నియంత్రణలు తొలగి, విదేశీ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడంతో బిజినెస్ ‘లా’కు డిమాండ్ పెరిగింది. దాంతోపాటు ‘లా’తో సంబంధమున్న బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, టాక్సేషన్, టెలికాం, ఇన్సూరెన్స్, పవర్, సివిల్ ఏవియేషన్, పోర్ట్స్, షిప్పింగ్, మీడియా, మేథో సంపత్తి హక్కులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ), రియల్ ఎస్టేట్, స్పెషల్ ఎకనమిక్ జోన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డాటా ప్రొటక్షన్ చట్టాలు వంటి విభాగాల్లో పెనుమార్పులు సంభ వించాయి. ఇది న్యాయ విద్యను అభ్యసించిన అభ్యర్థులకు వరంగా మారింది. దాంతో ‘లా’ మళ్లీ క్రేజీ కోర్సుగా మారిపోయింది!! న్యాయవిద్యకు ప్రపంచవ్యాప్తంగా ఉజ్వల భవిష్యత్తు ఇప్పుడు. గ్లోబలైజేషన్ యువ…

Read More