పాకశాస్త్ర ప్రవీణులు

కలినరీ ఆర్ట్స్‌ వంట చేయడం గొప్పకళ. ఇప్పుడు ఈ కళ ఎన్నో రకాల కోర్సులకు, ఉద్యోగాలకూ కేంద్రంగా మారింది. కాకాహోటల్‌ నుంచి కార్పొరేట్‌ కిచెన్‌ వరకు ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. మంచి వేతనాలను వస్తాయి.ఆహార రంగానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ ఆదరణ తగ్గదు. దాన్ని ఇంకాస్త అందంగా, ఆకర్షణీయంగా అందించడంలో ప్రధాన పాత్ర పోషించేది- కలినరీ ఆర్ట్స్‌. ఆకలిగా ఉన్నప్పుడు కంటికెదురుగా ఘుమఘుమల ఆహారముంటే ఎవరికైనా నోరూరుతుంది.ఆహారాన్ని వివిధ రంగులతో, కొత్త రుచులతో అందించే ప్రయత్నం చేసేవారు కలినరీ ఆర్టిస్టులు. అంటే… కుక్‌లూ, చెఫ్‌లూ. ఆహారాన్ని వండటం, డిజైన్‌ చేయడం, ఆకర్షణీయంగా అందించడం వంటివన్నీ కలినరీ ఆర్ట్స్‌లో భాగంగా ఉంటాయి. ప్రాంతీయ సంస్కృతికి ప్రాధాన్యమిస్తూనే ఆహారంలో ఆధునికతనూ, కొత్త ఆవిష్కరణలనూ జొప్పించాల్సి ఉంటుంది.కలినరీ ఆర్ట్స్‌కు ఆదరణ పెరగడంతో ఆహార పరిశ్రమ ముఖచిత్రమే మారిపోయింది. అందుకే ఈ రంగంలో…

Read More