పాకశాస్త్ర ప్రవీణులు

కలినరీ ఆర్ట్స్‌ వంట చేయడం గొప్పకళ. ఇప్పుడు ఈ కళ ఎన్నో రకాల కోర్సులకు, ఉద్యోగాలకూ కేంద్రంగా మారింది. కాకాహోటల్‌ నుంచి కార్పొరేట్‌ కిచెన్‌ వరకు ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. మంచి వేతనాలను వస్తాయి.
ఆహార రంగానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ ఆదరణ తగ్గదు. దాన్ని ఇంకాస్త అందంగా, ఆకర్షణీయంగా అందించడంలో ప్రధాన పాత్ర పోషించేది- కలినరీ ఆర్ట్స్‌. ఆకలిగా ఉన్నప్పుడు కంటికెదురుగా ఘుమఘుమల ఆహారముంటే ఎవరికైనా నోరూరుతుంది.
ఆహారాన్ని వివిధ రంగులతో, కొత్త రుచులతో అందించే ప్రయత్నం చేసేవారు కలినరీ ఆర్టిస్టులు. అంటే… కుక్‌లూ, చెఫ్‌లూ. ఆహారాన్ని వండటం, డిజైన్‌ చేయడం, ఆకర్షణీయంగా అందించడం వంటివన్నీ కలినరీ ఆర్ట్స్‌లో భాగంగా ఉంటాయి. ప్రాంతీయ సంస్కృతికి ప్రాధాన్యమిస్తూనే ఆహారంలో ఆధునికతనూ, కొత్త ఆవిష్కరణలనూ జొప్పించాల్సి ఉంటుంది.
కలినరీ ఆర్ట్స్‌కు ఆదరణ పెరగడంతో ఆహార పరిశ్రమ ముఖచిత్రమే మారిపోయింది. అందుకే ఈ రంగంలో నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లతోపాటు మరెన్నో అవకాశాలను అందించగల రంగమిది. అవకాశాలను అందుకోవాలంటే నైపుణ్యాలను సంపాదించడం తప్పనిసరి.
ఇప్పుడు పోటీ పెరిగిపోతుండటంతో నిపుణులకు దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ తప్పనిసరి అవుతోంది. కెరియర్‌లో పై స్థాయికి ఎదగాలన్నా ఇది ప్రామాణికమవుతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నో సంస్థలు నిపుణులను తయారు చేస్తున్నాయి.
మనదేశంలో బ్యాచిలర్‌ డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కోర్సులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ తత్సమాన విద్యను పూర్తిచేసుండాలి. ఏ గ్రూపు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ పరంగా 50%పైగా మార్కులను సాధించి ఉండాలి.
అందుబాటులో ఉన్న కోర్సులు..
బీఏ ఇన్‌ కలినరీ ఆర్ట్స్‌: మూడేళ్లు, నాలుగేళ్ల వ్యవధి గల కోర్సులున్నాయి. దీనిలో కుకింగ్‌, ఫుడ్‌ శాంప్లింగ్‌, సెన్సరీ ఇవల్యూషన్‌, సర్వింగ్‌ అండ్‌ టేస్టింగ్‌ల గురించి బోధిస్తారు. మొత్తంగా కుకింగ్‌, దాని సంబంధిత అంశాలపైనే కోర్సు ఉంటుంది. తరగతి బోధనతోపాటు కిచెన్‌ ట్రైనింగ్‌ సెషన్లుంటాయి.
బీబీఏ ఇన్‌ కలినరీ ఆర్ట్స్‌ కోర్సు వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లుంటాయి. కిచెన్‌ వర్క్‌తోపాటుగా ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఫుడ్‌ హ్యాండ్లింగ్‌, హైజీన్‌ అండ్‌ ఫుడ్‌ సేఫ్టీ స్టాండర్స్‌ గురించి తెలుసుకుంటారు.
బీసీటీ అండ్‌ సీఏ బ్యాచిలర్‌ ఆఫ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ కలినరీ ఆర్ట్స్‌నే ఈవిధంగా వ్యవహరిస్తారు. కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఫుడ్‌ ప్రొడక్షన్‌, కేటరింగ్‌, బేకింగ్‌, కలినరీ ఆర్ట్స్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ మ్యాచింగ్‌, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌లను బోధిస్తారు. వీరికీ కిచెన్‌ ట్రైనింగ్‌ ఉంటుంది.
బీఎస్‌సీ ఇన్‌ కేటరింగ్‌ అండ్‌ కలినరీ ఆర్ట్స్‌ కాలవ్యవధి మూడేళ్లు. కుకింగ్‌కు సంబంధించిన అన్ని అంశాలపై కోర్సు దృష్టిసారిస్తుంది. ఫుడ్‌ ప్రొడక్షన్‌, టేస్టింగ్‌, కేటరింగ్‌, బేకింగ్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ మ్యాచింగ్‌ మొదలైన అంశాలపై బోధన సాగుతుంది. సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్స్‌
చెఫ్‌, కలినరీ ఆర్ట్స్‌, ఫుడ్‌ ప్రొడక్షన్‌, కేటరింగ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లున్నాయి. వీటి కాలవ్యవధి సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య పూర్తి చేసినవారు అర్హులు. కొన్ని సంస్థలు పదో తరగతి ఉత్తీర్ణులైనవారినీ తీసుకుంటున్నాయి.
రానున్న పదేళ్లలో ఈ రంగం రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అంచనా. 2020 నాటికి దేశంలో ఈ రంగం 104 శాతం వృద్ధితో 482 బిలియన్‌ డాలర్లను అందుకోనుంది. ఇదో నైపుణ్యాధారిత పరిశ్రమ. మంచి నైపుణ్యాలను ప్రదర్శించినవారికి ఆదరణ ఉంటుంది. వివిధ సంస్థలు వివిధ ప్రొఫైళ్లలోకి వీరిని ఎంచుకుంటున్నాయి. చెఫ్‌, కుక్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ కంట్రోలర్‌, రెస్టారెంట్‌ కన్సల్టెంట్స్‌ అండ్‌ డిజైనర్స్‌, ఫుడ్‌ స్టైలిస్ట్‌, ఫుడ్‌ క్రిటిక్స్‌, ఫుడ్‌ బ్లాగర్స్‌, కమర్షియల్‌ ఫుడ్‌ మ్యానుఫాక్చరర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ప్రొఫెషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, కేటరింగ్‌ మేనేజర్‌, న్యూట్రిషనిస్ట్‌ మొదలైనవి వాటిలో కొన్ని. హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, రిసార్టులు, బిస్రో, బేకరీల్లో వీరికి అవకాశాలుంటాయి. వీరికి విదేశాల్లోనూ మంచి అవకాశాలున్నాయి. అక్కడి కేసినోస్‌, ఏర్‌లైన్‌ సంస్థలు, హాస్పిటళ్లు వీరిని మంచి వేతనాలతో ఎంచుకుంటున్నాయి. సొంతంగా ఫుడ్‌ ట్రక్‌, రెస్ట్టారెంట్‌, కేటరింగ్‌ల్లో వ్యాపారాన్నీ ప్రారంభించుకోవచ్చు.
ఐటీసీ హోటల్స్‌, హయత్‌, ఒబెరాయ్‌ హోటెల్స్‌, ప్రముఖ రిసార్టులు, తాజ్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌, స్టాండ్‌ అలోన్‌ రెస్టారెంట్స్‌, ఏర్‌లైన్స్‌ వీరిని ఎంచుకుంటున్నవాటిలో ఉన్నాయి.
ప్రారంభంలో ట్రెయినీ చెఫ్‌గా చేరుతారు. వీరికి ప్రముఖ సంస్థల్లో ప్రారంభజీతం నెలకు రూ.25,000 చెల్లిస్తున్నారు. సాధారణ సంస్థల్లో రూ.10,000 నుంచి రూ.20,000 వరకు వేతనం ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ జీతభత్యాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. ఈ రంగంలో ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌లకు అత్యధికంగా లక్షల్లో వేతనం ఉంటుంది.
డిప్లొమా స్థాయిలో..
బేసిక్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌కు కాలవ్యవధి ఏడాది కాగా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌లకు రెండేళ్లు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ తత్సమాన విద్యను పూర్తిచేసుండాలి. ఏ గ్రూపు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు 50%పైగా మార్కులను అడుగుతున్నాయి. అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌కు ఇంటర్మీడియట్‌తోపాటు బేసిక్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ను పూర్తిచేయడమూ తప్పనిసరే. దీనిలో ఇంకా.. ఫుడ్‌ ప్రొడక్షన్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ సర్వీస్‌, బేకరీ అండ్‌ కాన్‌ఫెక్షనరీ, కలినరీ ఆర్ట్స్‌ అండ్‌ పేస్ట్రీ స్టడీస్‌ వంటి కోర్సులూ అందుబాటులో ఉన్నాయి.
పీజీ డిప్లొమా ఇన్‌ కలినరీ ఆర్ట్స్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి డిప్లొమా ప్రోగ్రామ్‌. కోర్సు కాలవ్యవధి ఏడాది. డిగ్రీ స్థాయిలో కలినరీ విభాగం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, టూరిజం మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసినవారు అర్హులు.
అందిస్తున్న ప్రముఖ సంస్థలు – ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌, తిరుపతి
– కలినరీ అకాడమీ ఆఫ్‌ ఇండియా, హైదరాబాద్‌
– ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కలినరీ ఆర్ట్స్‌, హైదరాబాద్‌
వెల్‌కమ్‌ గ్రూప్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మణిపాల్‌
-సింబయాసిస్‌ స్కూల్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌, పుణె –
-ఐటీఎం స్కూల్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌, ముంబయి
-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఔరంగాబాద్‌
-ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌, న్యూదిల్లీ
-అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కలినరీ అండ్‌ లాంగ్వేజ్‌ ఆర్ట్స్‌, గోవా
– ఐటీఎం స్కూల్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌, బెంగళూరు, చెన్నై
– ఏఐఎంఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌, బెంగళూరు
ప్రవేశం
సంస్థలు అడ్మిషన్‌కు సంబంధించి ప్రకటనలు విడుదల చేస్తాయి. వాటి ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు ఆంగ్ల మాధ్యమం వారైతే నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి తీసుకుంటున్నాయి. తెలుగు మాధ్యమం వారైతే ఇంగ్లిష్‌కు సంబంధించి ఆప్టిట్యూడ్‌ పరీక్షను రాయాల్సి ఉంటుంది. మరికొన్ని సంస్థలు ప్రత్యేకంగా రాతపరీక్షను నిర్వహిస్తున్నాయి. రాతపరీక్షతోపాటు గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్న సంస్థలూ ఉన్నాయి.
ఫీజు వివరాలు సాధారణంగా ఏడాదికి రూ.50,000 నుంచి రూ.7 లక్షల వరకూ ఉంటుంది. ఎంచుకున్న కోర్సు, సంస్థను బట్టి ఫీజుల్లో మార్పులుంటాయి.

హోటల్‌ మేనేజ్‌మెంట్‌

పీజీ స్థాయిలో
హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకు సంబంధించి ప్రస్తుతం పీజీ స్థాయిలో పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్‌. వైఎస్‌ఆర్‌ ఎన్‌ఐటీహెచ్‌ఎంలో ఎంబీఏ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సు ఉంది. దీంతోపాటు అమిటీ యూనివర్సిటీ, సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌వంటి పలు ఇన్‌స్టిట్యూట్‌లలో పీజీ స్థాయిలో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సు అందుబాటులో ఉంది. క్యాట్, సీమ్యాట్, మ్యాట్, ఎక్స్‌ఏటీ స్కోర్ల ఆధారంగా వీటిలో ప్రవేశం కల్పిస్తారు. ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు సొంతంగా నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి  ప్రవేశం పొందొచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి హోటల్స్, ఎయిర్‌ పోర్ట్స్, ట్రావెల్‌ ఏజెన్సీలలో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రారంభంలో ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ మేనేజర్, ఆపరేషన్స్‌ మేనేజర్, కీ అకౌంట్స్‌ మేనేజర్‌ వంటి హోదాలతో కెరీర్‌ ప్రారంభించొచ్చు. ఈ రంగంలో స్థిరపడాలనుకుంటే కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంటరాక్షన్‌ స్కిల్స్‌ వంటి పర్సనల్‌ స్కిల్స్‌ తప్పనిసరి. అదే విధంగా ఇంగ్లిష్‌తోపాటు ఏదైనా ఫారెన్‌ లాంగ్వేజ్‌ నైపుణ్యం కూడా సొంతం చేసుకున్న వారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ట్రావెల్ అండ్ టూరిజం లో అవకాశాలు

ఈ కోర్సు లో చేరాలి అని అనుకునే వారు ప్రవేశ పరీక్షను రాయాలి బి బి ఏ కోర్స్ ఇన్ చేయాలనుకుంటే ప్రవేశ పరీక్ష గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో 70 శాతం రాత పరీక్ష గ్రూప్ డిస్కషన్ కు 15 శాతం మరియు ఇంటర్వ్యూ కూడా 15 శాతం వెయిటేజీ ఉంటుంది ఒకవేళ కోర్సుకు అటువంటి పరీక్షలలో స్కోర్లు ఉంటే వారికి రాత పరీక్ష మినహాయింపు గా ప్రకటించారు

బి బి ఏ , ఎంబీఏ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్లేస్మెంట్ సహకారం కూడా ఈ సంస్థ అందిస్తుంది క్యాంపస్ ప్లేస్మెంట్ సౌకర్యం ఇక్కడ ఉంది అభ్యర్థులకు థామస్ కుక్ మెక్మైట్రిప్ హాలిడే ఇన్, ఐఆర్సీటీసీ హ్యాపీ టూర్ యాత్ర డాట్ కామ్ వంటి ట్రావెల్ మరియు టూరిజం కంపెనీల్లో అవకాశాలు లభిస్తాయి

ఈ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 30 జూన్ మరియు ప్రవేశ పరీక్ష 19 జూలై గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూలు 20- 31 జూలై మరిన్ని మరింత సమాచారం కొరకు iittmsouth.org లో పొందవచ్చు

మొత్తం బి బి ఏ కోర్సు మూడు సంవత్సరాలు ఈ మూడేళ్లకు కలిపి ఫీజు 2,79,350 రూపాయలు అదే ఎంబీఏ కోర్సు అయితే ఫీజు రెండేళ్లకు 3,39,850 రూపాయలు. ఎక్కడా ప్రవేశం పొందిన వారికి అనేక రకాల స్కాలర్షిప్లు అందుకునే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్లను పొందవచ్చు మరియు ఏపీ ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లకు మెరిట్ స్కాలర్ షిప్ ను పొందవచ్చు దానికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్కాలర్ షిప్ ఐఐటీఎమ్ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా మంజూరు చేయడం జరుగుతుంది

బి బి ఏ టూరిజం అండ్ ట్రావెల్ కోర్సు ప్రవేశం రాయాలి అనుకుంటే ఇంటర్మీడియట్ లో కనీసం 50 శాతం మార్కుల తో ఉత్తీర్ణులై ఉండాలి. ఒక వేళ రిజర్వ్డ్ కేటగిరి అయితే 40 శాతం మార్కులు ఉంటే సరి పోతుంది కాకపోతే ఈ కోర్సు లో చేరాలనుకుంటే నెల్లూరు లో మొత్తం 75 సీట్లు మాత్రమే ఉన్నాయి జనరల్ కేటగిరి ఓబిసి కేటగిరీ అభ్యర్థులు వయస్సు 22 మించకూడదు అదే రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఐదేళ్లు మినహాయింపు ఉంది.

ఎంబీఏ కోర్సు రెండేళ్లు ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ చేయాల్సి చేయాలనుకునే వాళ్లకు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉన్న వారే అర్హులు ఈ ఏడాది చివరి పరీక్షలు రాసిన వారు మరియు రాయబోతున్న వారు కూడా అర్హులే కాకపోతే వయసు 27 ఏళ్లు మించకూడదు రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఐదేళ్ళ సడలింపు ఉంటుంది నెల్లూరు నియర్ భువనేశ్వర్ నోయిడా క్యాంపస్ లో అన్నీ కలిపి 750 సీట్లు మాత్రమే ఉన్నాయి.

అభ్యర్థులు తమ కెరీర్ను టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ రంగం వైపు మక్కువ ఉంటే కొత్తగా ఏర్పడిన ఈ సంస్థకు సంస్థలో చేరడం మంచిదే. ఇదే సంస్థ పీజీ కోర్సులను కూడా అందిస్తోంది కనుక ఇక్కడ చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంది మరియు క్యాంపస్ క్యాంపస్ ప్లేస్మెంట్లు సౌకర్యం ఉంది కనుక ఏ సమస్య ఉండదు.

నేను ప్రముఖ చెఫ్‌గా కెరీర్‌లో స్థిరపడాలనుకుంటు న్నాను. హాస్పిటాలిటీ రంగంలో రాణించాలంటే.. ఎలాంటి నైపుణ్యాలుండాలి.. కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయి.. ఇంటర్మీడియెట్ తర్వాత చదవాల్సిన కోర్సుల వివరాలు తెలపండి?.

ప్రస్తుత ప్రపంచంలో వంట కేవలం సంప్రదాయ వంటగదికే పరిమితం కాకుండా.. ఎంతో మంది ఔత్సాహిక యువతకు కెరీర్‌గా మారుతోంది. ఆధునికత, సృజనాత్మకత జోడించి రుచికరంగా, కళాత్మకంగా చేసిన వంటకాలతో భోజన ప్రియులను మొప్పించడంలోనే చెఫ్ నైపుణ్యాలు దాగి ఉంటాయి. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సమర్థులైన ప్రొఫెషనల్ చెఫ్‌ల అవసరాలను తీర్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్, క్యాటరింగ్ టెక్నాలజీ తదితర సంబంధిత రంగాల్లో పలు విద్యాసంస్థలు అనేక రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ, వంట పద్ధతులపై ఆసక్తి ఉన్నవారు చెఫ్ కోర్సులను ఎంచుకోవచ్చు. కలినరీ(పాకశాస్త్ర) లేదా చెఫ్ కోర్సుల్లో పోషకాహారం, ఆయా వంటకాల తయారీ పద్ధతులతో పాటు ఇతర నిర్వహణ అంశాలపై నా శిక్షణ ఇస్తారు. దేశంలోని హోటల్ మేనేజ్‌మెంట్ విద్యా సంస్థ లు బ్యాచిలర్ స్థాయిలో కలినరీ కోర్సులను, టూరిజం అండ్ హాస్పి టాలిటీ మేనేజ్‌మెంట్, హాస్పిటా లిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులను అందిస్తున్నారు. హాస్పిటా లిటీ, హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో పెరుగుతున్న మానవ వనరుల అవసరాన్ని గుర్తించిన పలు ఇన్‌స్టిట్యూట్‌లు.. ఇంటర్మీడియెట్ అర్హతగా పీజీ, యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్, కోర్సులను సైతం అందిస్తున్నాయి.

కోర్సులను అందించే ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్

 • కేంద్ర పర్యాటక శాఖ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాల జీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్-హైదరాబాద్: హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఎస్సీ ప్రోగ్రామ్‌తోపాటు ఫుడ్ ప్రొడక్షన్‌లో స్వల్పకాలిక కోర్సులు కూడా అందిస్తోంది. బీఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ)లో ఉత్తీర్ణత సాధించాలి. అర్హత: ఇంటర్మీడియెట్.
 • వెబ్‌సైట్: http://www.ihmhyd.org/
 • ఎన్‌ఐటీహెచ్‌ఎం: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్.. టూరిజం అండ్ హాస్పి టాలిటీ ఎంబీఏ, బీబీఏ; అలాగే బీఎస్సీ హాస్పి టాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు లను అందిస్తోంది. బీఎస్సీ, బీబీఏ కోర్సులకు 10+2 అర్హత; ఎంబీఏ కోర్సుకు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 • వెబ్‌సైట్: http://www.nithm.ac.in
 • స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్, తిరుపతి: ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ద్వారా బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ఆఫర్ చేస్తోంది. దీంతోపాటు ఫుడ్ ప్రొడక్షన్‌లో స్వల్పకాలిక కోర్సులు కూడా అందిస్తోంది. వెబ్‌సైట్: http://www.sihmtpt.org
 • అలాగే కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ కలినరీ ఆర్ట్స్ (పాకశాస్త్రం)లో ఎంబీ ఏ, బీబీఏల తోపాటు డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, డిప్లొ మా ఇన్ ఎఫ్ అండ్ బీ సర్వీస్, డిప్లొమా ఇన్ బేకరీ అండ్ కన్‌ఫెక్షరీ, క్రాఫ్ట్ కోర్సు ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, క్రాఫ్ట్ ఇన్ ఎఫ్ అండ్ బీ సర్వీస్‌లను అందిస్తోంది. వెబ్‌సైట్: http://www.ici.nic.in

కెరీర్ అవకాశాలు:
కలినరీ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఏదైనా హోటల్‌లో జూనియర్ చెఫ్‌గా అవకాశాలు పొందొ చ్చు. ప్రారంభ దశలో ఎక్కువ పనిగంటలు, తక్కువ వేతనాలు ఉన్నప్పటికీ సవాలుగా స్వీకరించాలి. చెఫ్ కెరీర్‌లో విజయం సాధించా లంటే.. ముఖ్యంగా చేసే పనిని అమితంగా ప్రేమించగల గాలి. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. పెద్ద పెద్ద హోటళ్లలో కిచెన్ విభాగంలో అసిస్టెంట్ చెఫ్, చెఫ్, చీఫ్ చెఫ్స్ వంటి కొలువులు కీలకం. వీరికి ప్రారంభంలోనే నెలకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు వేతనం లభిస్తుంది. చెఫ్‌గా కెరీర్‌లో పేస్ట్రీ చెఫ్, సాస్ చెఫ్, ఫిష్ చెఫ్, వెజిటబుల్ చెఫ్, మీట్ చెఫ్, ప్యాంట్రీ చెఫ్, ఫ్రై చెఫ్, గ్రిల్ చెఫ్ తదితర స్పెషలైజేన్లు అందుబాటులో ఉన్నాయి.

ఉపాధి గ్యారెంటీ – హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం

హోటల్ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం.. కొంచెం ఆసక్తి ఉంటే చాలు జీవితంలో స్థిరపడొచ్చు. కోర్సు పూర్తై వెంటనే కొలువు దొరికే కెరీర్‌లివి. కొంచెం శ్రమిస్తే లగ్జరీ లైఫ్‌నూ సొంతం చేసుకోవచ్చు. పర్యాటకం, ఆతిథ్యం.. విస్తరిస్తున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. కేవలం పదోతరగతి అర్హతతోనే వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

హోటల్ మేనేజ్‌మెంట్..
సేవా రంగంలో శరవేగంగా పురోగమిస్తున్న పరిశ్రమ. దశాబ్దం క్రితం వరకు మెట్రో సిటీలకే పరిమితమైన స్టార్ హోటళ్లు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తున్నాయి. దాంతో నిపుణులైన మానవ వనరుల ఆవశ్యకత ఏర్పడుతోంది. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తవగానే ఉద్యోగంలో చేరాలనుకునేవారికి.. కష్టపడే ఉత్సాహవంతులకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలకు కొదవలేదు. ప్రభుత్వ, ప్రయివేట్ రంగంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు హోటల్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సులతోపాటు సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లు కూడా అందిస్తున్నాయి.

జాతీయ స్థాయిలో…నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ దేశ వ్యాప్తంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ)ను నిర్వహిస్తోంది. దీనికి ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. వయోపరిమితి 22 ఏళ్లు. ఎంపికైనవారికి మూడేళ్ల వ్యవధితో బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు అందిస్తుంది. జేఈఈతో 51 సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో 21 ఇన్‌స్టిట్యూట్‌లకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్ హోదా ఉంది. 12 ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని సంస్థలు. మిగతా 18 ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు. వీటిలో సుమారు 7741 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌కు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు ఉంది.

జేఈఈ.. పరీక్ష ఇలా:పరీక్షలో మొత్తం ఐదు విభాగాల్లో, మూడు గంటల్లో అభ్యర్థి ప్రతిభను పరీక్షిస్తారు. విభాగాల వారీ…

 • న్యూమరికల్ ఎబిలిటీ అండ్ సైంటిఫిక్ ఆప్టిట్యూడ్ 30
 • రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30
 • జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30
 • ఇంగ్లిష్ లాంగ్వేజ్ 60
 • ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ 50

ప్రశ్నలు అడుగుతారు.

కోర్సు స్వరూపమిదే:జేఈఈ ద్వారా ప్రవేశం లభించే బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సు మొత్తం ఆరు సెమిస్టర్లుగా ఉంటుంది. కోర్సు వ్యవధి మూడేళ్లు. దీన్ని ఎన్‌సీహెచ్‌ఎంసీటీ, ఇగ్నో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మొత్తం కోర్సులో ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వీసెస్; ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్ అండ్ హౌస్ కీపింగ్ వంటి హోటల్ పరిశ్రమ సంబంధిత అంశాలపై ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌కు అధిక ప్రాధాన్యమిస్తూ శిక్షణ సాగుతుంది.
వెబ్‌సైట్: http://nchmct.org

ఉపాధి అవకాశాలు:ప్రముఖ సంస్థల్లో బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తిచేసిన విద్యార్థులకు వంద శాతం ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. తాజ్ గ్రూప్, ఒబెరాయ్, ఐటీసీ, లీలా, హయాత్ హోటల్స్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి పోటీ పడుతుంటాయి. ఎయిర్ లైన్స్, రైల్వేలు, క్రూస్ లైన్స్, గెస్ట్‌హౌసెస్, టూరిజం సెంటర్స్‌లో కూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధిత హాస్టళ్ల(ఐఆర్‌సీటీసీ, రైల్వేలు)లో అవకాశాలు ఉంటాయి. దీనికితోడు రిటైల్ రంగం, ఎమ్మెన్సీలు, బీపీఓల్లో కూడా అవకాశాలు లభిస్తాయి. కెరీర్ పరంగా ప్రారంభంలో హోటల్, హాస్పిటాలిటీ పరిశ్రమలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా అడుగుపెట్టొచ్చు. ఈ క్రమంలో కిచెన్ మేనేజ్‌మెంట్, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్; గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్ వంటి విభాగాల్లో ప్రవేశించొచ్చు. వీటితోపాటు షిప్పింగ్, క్రూయిజ్ లైన్స్, టూరిజం సంస్థల్లో కూడా అవకాశాలు అపారం. బీఎస్సీ హోటల్ మేనేజ్‌మెంట్ చదివిన వాళ్లు సాధారణ డిగ్రీతో లభించే యూపీఎస్సీ, ఏపీపీఎస్‌సీ, రైల్వేలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థలకూ దరఖాస్తు చే సుకోవచ్చు.

ఉన్నత విద్య:మనదేశంలో ఉన్నత విద్య నభ్యసించాలనుకునే వారు ఎమ్మెస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్‌మేనేజ్‌మెంట్ కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, ఢిల్లీకి దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్‌ల్లో ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఆసక్తి ఉంటే విదేశాల్లో ఇంటర్న్‌షిప్‌తో సహా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా చేయొచ్చు.

స్పెషలైజేషన్లు కూడా:బీఎస్సీ కోర్సులో స్పెషలైజేషన్ సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఫుడ్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజ్‌మెంట్, అకామడేషన్ మేనేజ్‌మెంట్…లాంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఈ సదుపాయం బెంగళూరు, చెన్నై, గోవా, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మొదటి, రెండు సెమిస్టర్లలో పొందిన మార్కుల ఆధారంగా స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. స్పెషలైజేషన్‌ను ఎంచుకున్నప్పటికీ మొదటి మూడు సెమిస్టర్లు అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. నాలుగో సెమిస్టర్ నుంచి ఎంచుకున్న స్పెషలైజేషన్‌కు సంబంధించిన సబ్జెక్టులపై బోధన సాగుతుంది. ఇలా మూడేళ్లు పూర్తయ్యాక ఇగ్నో నుంచి బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ లభిస్తుంది.

మన రాష్ట్రంలో…మన రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ …బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌తోపాటు పలు ఇతర హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తోంది.
కోర్సు: బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్
కాల వ్యవధి: మూడేళ్లు. అర్హత: ఇంటర్
వయసు: 22ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 25

కోర్సు: క్రాఫ్ట్‌మన్‌షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్
కాల వ్యవధి: ఏడాదిన్నర-ఫుల్‌టైమ్
అర్హత: పదో తరగతి
వయసు: 22 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది)

కోర్సు: క్రాఫ్ట్‌మన్‌షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్
కాల వ్యవధి: 24 వారాలు(ఫుల్ టైమ్)
అర్హత: పదో తరగతి
వయసు: 22 సంవత్సరాలు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది)

కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ అకామెడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్
కాల వ్యవధి: ఏడాదిన్నర అర్హత: డిగ్రీ
వయసు: 25 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది)
వెబ్‌సైట్: www.ihm-hyd.org

హోటల్ మేనేజ్‌మెంట్.. ప్రధాన విభాగాలుహోటల్ మేనేజ్‌మెంట్ రంగాన్ని ప్రధానంగా నాలుగు విభాగాలుగా పేర్కోవచ్చు. అవి…
ఫుడ్ ప్రొడక్షన్: ఈ విభాగంలో ఆహారం తయారు చేస్తారు.
ఫుడ్ అండ్ బెవెరేజ్ సర్వీస్(ఎఫ్ అడ్ బీ): ఈ విభాగంలో హోటల్‌లో అతిథుల అవసరాల్ని గుర్తించి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తారు.

ఫ్రంట్ ఆఫీస్: అతిథులను సాదరంగా ఆహ్వానించి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటంలో ఫ్రంట్ ఆఫీస్‌ది కీలక పాత్ర.

హౌస్ కీపింగ్: అతిథులు హోటల్ రూంలో దిగినప్పటి నుంచి ఖాళీ చేసి వెళ్లేవరకూ… హోటల్‌ను సొంత ఇల్లులా సకల సౌకర్యాలు కల్పించడం హౌస్‌కీపింగ్ బాధ్యత.

టూరిజంపచ్చని ప్రకృతిని చూసి పరవశించని మనసుండదు. జల జల జారే జలపాతాల జల్లుల్లో తడిసి ముద్దవని తనువుండదు. అందుకే.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. హిమాలయాల నుంచి భీమిలి కొండల వరకు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న భారతావనిలో పర్యాటక రంగం పరిఢవిల్లుతోంది. అనునిత్యం పర్యాటకులతో కళకళలాడుతోంది. దీంతో ‘అతిథి దేవో భవ’ అంటూ పర్యాటకులకు సేవలందించే వారి కోసం అన్వేషణ సాగుతోంది. ఈ రంగాన్ని వృత్తిగా మలచుకున్న వారికి అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. సెలవు రోజైతే చాలు, ఏ పర్యాటక ప్రాంతమైనా కిక్కిరిసిపోతోంది. ఆయా ప్రాంతాల్లోని హోటళ్లు, రిసార్టులు దాదాపు 70 శాతం ఆక్యుపెన్సీ రేషియాని సాధిస్తున్నాయి. ఈ స్థాయిలో వస్తున్న కస్టమర్లను మళ్లీ మళ్లీ ఆకట్టుకోవాలంటే.. చక్కని సేవలందించడమే మార్గం. అందుకోసం సుశిక్షితులైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతోంది.

మీ సేవలో…గతంలో వేర్వేరుగా ఉన్న టూరిజం, హాస్పిటాలిటీ విభాగాలు ఇప్పుడు దాదాపు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. వచ్చిన పర్యాటకుల ‘సైట్ సీయింగ్’ బాధ్యతలను టూరిజం విభాగం నిర్వర్తిస్తే.. వారికి చక్కని మర్యాదలు చేస్తూ.. సేవలందించడం హాస్పిటాలిటీ విభాగం విధి. ఈ రెండిటిలో పట్టాలు చేతిలో పట్టుకున్న వారికి అనేక విభాగాల్లో అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రభుత్వ పర్యాటక శాఖ, ట్రావెల్ ఏజెన్సీలు, ఎయిర్‌లైన్స్, టూర్ ఆపరేటర్లు, హోటల్స్‌లో ఉద్యోగం ఖాయం. వీటితోపాటు అనుబంధ విభాగాలైన ఎయిర్‌లైన్ కేటరింగ్, ల్యాండ్రీ, టూరిజం ప్రమోషన్ అండ్ సేల్స్‌లోనూ స్థానం సంపాదించవచ్చు. ఇలా అవకాశాలు అందిపుచ్చుకున్న వారు.. కార్గో, టికెటింగ్, వీసా, పాస్‌పోర్ట్ తదితర చట్టబద్ధ నిబంధనల పైనా చక్కని అవగాహన సాధించాలి. దీనివల్ల ఆయా ప్రాంతాలకు కొత్తగా వచ్చే అతిథులను అప్రమత్తం చేసి వారి పర్యటనను సుఖవంతం చేయడానికి వీలవుతుంది. తాము విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయి విషయ పరిజ్ఞానం పొందడమూ ఎంతో ముఖ్యం.

ఏ కోర్సులు…ప్రస్తుతం మన దేశంలో పలు యూనివర్సిటీలు గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయిలో టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కోర్సులను అందిస్తున్నాయి. ఆరు నెలలు, సంవత్సర వ్యవధితో స్వల్ప కాలిక సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులకూ పలు విద్యా సంస్థలు తెరదీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ అనుమతి పొందిన రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకైతే భవిష్యత్తు తిరుగుండదు. ఈ కోర్సును ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, ఇతర ప్రముఖ వర్సిటీలు అందిస్తున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులకు నేరుగా మేనేజిరియల్ స్థాయి అవకాశాలు తలుపు తడతాయి. దీంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) కూడా ట్రావె ల్, టూరిజం, కార్గో ఇండస్ట్రీ అవసరాల కోసం సర్టిఫికెట్ కోర్సులకు రూపకల్పన చేసింది.

టూరిజం:టూరిజం విభాగంలో ప్రవేశించాలనుకునేవారికి రిజర్వేషన్, కౌంటర్ స్టాఫ్, టూర్ ప్లానర్స్, టూర్ గైడ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఎయిర్‌లైన్స్ విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్స్, కస్టమర్ సర్వీసెస్ విభాగాల్లో అవకాశాలు పొం దవచ్చు. టూర్ ఆపరేటింగ్ సంస్థల్లో మార్కెటింగ్ సిబ్బందిగా, గైడ్లుగా స్థానం సంపాదించవచ్చు. హోటళ్లలోనైతే అవకాశాల వెల్లువే.

హాస్పిటాలిటీ:హాస్పిటాలిటీలో కేటరింగ్, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, బుక్ కీపింగ్, రెస్టారెంట్, తదితర శాఖల్లో ఎన్నెన్నో అవకాశాలు. ఈ రంగంలో స్థిరపడటానికి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని విద్యాసంస్థలు హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ ప్రత్యేక అంశంగా సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.

స్థిరపడాలంటే:ఈ రంగంలో స్థిరపడాలనుకుంటే సహనం ఎంతో అవసరం. చెరగని చిరునవ్వుతో, అలసట కనిపించనీయకుండా అతిథులకు సేవలందించేలా అభ్యర్థులు తమను తాము మలచుకోవాలి. దీంతోపాటు వారితో చక్కగా మెలిగేలా సాఫ్ట్‌స్కిల్స్ పెంపొందించుకోవాలి. అభ్యర్థులు స్వయంగా ప్రైవేట్‌గానైనా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ తీసుకోవాలి.

ఆదాయం.. అద్భుతం:చక్కని విషయ పరిజ్ఞానం ఉన్న వారికి ఆదాయం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు వేతనంతో పాటు ఏడాదికోమారు సిబ్బంది కుటుంబాలకు ఉచిత ప్రయాణ సదుపాయాలు, గమ్య స్థానాల్లో ఉచిత వసతి వంటి సదుపాయాలను కూడా అందజేస్తాయి. మధ్యస్థాయి ఉద్యోగాల్లో ప్రవేశించే వారికి ప్రారంభంలో కనీసం రూ. 15 వేల నెల జీతం గ్యారంటీ.

మన రాష్ట్రంలో ఎన్‌ఐటీహెచ్‌ఎం…టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్’ దేశవ్యాప్తంగా ప్రముఖంగా నిలిచింది. 2001లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన ఈ సంస్థ.. టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తోంది. వీటిలో ప్రవేశానికి ప్రతి ఏటా జూన్, జులై నెలల్లో ప్రకటన విడుదల చేస్తారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసే ఈ ఇన్‌స్టిట్యూట్‌లో అడుగుపెట్టేందుకు దేశవ్యాప్తంగా పోటీ నెలకొంటోంది. దేశంలోనే తొలిసారి టూరిజం అండ్ హాస్పిటాలిటీ స్పెషలైజేషన్‌తో ఎంబీఏను అందిస్తున్న సంస్థ ఇది. ఇక్కడ చదివినవాళ్లకు ఉపాధి గ్యారెంటీ అనడం అతిశయోక్తి కాదు.