కృత్రిమ మేధ (ARTIFICIAL INTELLIGENCE)

భవిష్యత్తు కృత్రిమ మేధదే..! కృత్రిమ మేధతో మానవాళికి మునుపెన్నడూ ఎరుగని రీతిలో మంచో, చెడో.. ఏదో ఒకటి కచ్చితంగా జరుగుతుంది. దేనికైనా మనుషులం సిద్ధం కావల్సిందే..! – ఇది ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ వ్యాఖ్య!! రైలింజన్.. ప్రపంచ గమనాన్నే పరుగులెత్తించింది..! పెన్సిలిన్.. వైద్యం తీరుతెన్నులను సమూలంగా మార్చేసింది..!! కంప్యూటర్.. మనిషి జీవన గతిని తిప్పేసింది..! ఇప్పుడు వీటన్నింటినీ తలదన్నే సరికొత్త టెక్నాలజీ శరవేగంగా దూసుకొస్తోంది.. అదే కృత్రిమ మేధస్సు..! మనిషి మెదడులాగా ఆలోచిస్తూ.. నేర్చుకుంటూ.. తర్కిస్తూ.. నిర్ణయాలు తీసుకుంటూ.. తనకు తానుగా పనిచేసే యంత్రాలకు, పరికరాలకు, వ్యవస్థలకు ప్రాణం పోస్తోంది. మెరుపు వేగంతో ముందుకొస్తున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే అవకాశాలు అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. అసలు ఏఐ అంటే ఏమిటి.. ఉన్న ఉద్యోగాలు పోతాయా.. కొత్త కొలువులు వస్తాయా… ఏఐకి అనుగుణంగా మారడం ఎలాగో…

Read More