ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌

ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో ఉప విభాగం ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌, భూ వాతావరణంలో పయనించే విమానాలు (ఎయిర్‌ క్రాఫ్ట్స్‌) కు సంభంధించి శాస్త్రసాంకేతిక అంశాలను ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌గా చెప్పుకోవచ్చు.
విమానాలు, హెలికాప్టర్లు, సంబంధిత రంగాలలో కెరీర్‌ కోసం ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ చాలు. వాణిజ్య విమానాలు మొదలుకుని క్షిపణులు, యుద్ధ విమానాలు, స్పేస్‌ షటిల్స్‌, స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ వెహికల్స్‌, హెలికాప్టర్లు, హోవర్‌క్రాఫ్ట్‌ డిజైన్‌, అమలు, పరిశోధన, నిర్మాణంలోనూ ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ పాత్ర ఉంటుంది. ఏరోస్పేస్‌ ఇంజనీర్‌, ఏరోనాటికల్‌ ఇంజనీర్‌కు సంబంధించి వివిధ యూనివర్సిటీల కరికులమ్‌ ఒకేలా ఉంటుంది. అయితే, కొన్ని తేడాలు ఈ రెండు కోర్సులలో ఉన్నాయి, స్ట్రక్చరల్‌ డిజైన్‌, నేవిగేషనల్‌ గైడెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఇన్ స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా ప్రొడక్షన్‌ మెథడ్స్‌ లేదా ప్రత్యేకించి ఒక ప్రొడక్ట్‌ అంటే మిలిటరీ ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ , ప్రయాణికుల విమానాలు, హెలికాప్టర్లు, ఉపగ్రహాలు, రాకెట్స్‌ వంటి వాటిలో స్పెషలైజేషన్‌ చేయవచ్చు.
ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను పక్కనపెడితే, ఎయిర్‌ ట్రావెల్‌ పెరిగిందన్నది నిజం. దాంతో ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ ముందు వరుసలోకి వచ్చింది, సంబంధిత ప్రొఫెషనల్స్‌ అవసరమూ పెరిగింది. సాయిధ దళాలకు తోడు ప్రభుత్వ విభాలైన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ, రక్షణ మంత్రిత్వ శాఖ, పర్యావరణ విభాగం, రవాణా రీజియన్స్‌ అలాగే డిఫెన్స్‌ ఎవల్యూషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ, డిఫెన్స్‌ ప్రొక్యుర్‌మెంట్‌ ఏజెన్సీ, రెగ్యులేటరీ అథారిటీలైన సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ, ఎయిర్‌లైన్‌ ఆపరేటర్స్‌, టెక్నికల్‌ సర్వీసును అందించే స్మాల్‌ అండ్‌ మీడియం ఎంప్లాయర్స్‌ దగ్గర, ఏరో స్పేస్‌ పరిశ్రమకు అవసరమైన స్పెషలిస్ట్‌ ఉత్పత్తులను అందించేవారి వద్ద ఉపాధి లభిస్తుంది.
ప్రైవేటు ఎయిర్‌లైనర్ల వద్ద కూడా అవకాశాలు ఉంటాయి. ఉంటాయి. ఏరోస్పేస్‌ అంటే విస్తృతంగా ఉంటుంది. ఏరోనాటిక్స్‌, అస్ట్రోనాటిక్స్‌ సైతం కలగలసి ఉంటాయి. ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ పరిధి పరిమితంగా ఉంటుంది. ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌లో భాగంగా సంబంధిత మెటీరియల్స్‌, ఇంజన్లు, బాడీ షేపు, స్ట్రక్చర్స్‌ పరిశోధన కూడా మిళితమై ఉంటుంది. స్ట్రక్చరల్‌ డిజైన్‌, నేవిగేషనల్‌ గైడెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కమ్యునికేషన్‌, ప్రొడక్షన్‌ వంటి విభాగాల్లో స్పెషలైజేషన్‌ చేయవచ్చు.
యూరప్‌, అమెరికాతో పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ భారత దేశంలోనూ ఏరోస్పేస్‌ పరిశ్రమ పురోగతి వేగం అందుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఇస్రో, డి ఆర్‌ డి ఓ, హెచ్‌ ఎ ఎల్‌, ఎన్‌ ఎల్‌ వంటి సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయి.
గ్లోబల్‌ ఎయిర్‌లైన్‌ ఆపరేటర్స్‌ అలాగే ఎయిర్‌క్రాఫ్ట్‌ కంపెనీలు రంగంలోకి వస్తుండటం విశేషం. అదే విదేశాల్లో పనిచేయానుకుంటే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలోని నాసాలో ఎక్కువ శాతం మంది భారతీయ ఇంజనీర్లు ఉన్నారు. బోయింగ్‌ మోకడోనెల్‌ డగ్లస్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. డిమాండ్‌కు సంబంధించి ఈ రెండూ చాలు.

AERONAUTICAL ENGINEERING (ఏరోనాటికల్ ఇంజనీరింగ్)

Overview
Aeronautical / Aerospace Engineering is one of the highly ambitious and challenging fields of study in engineering and technology with a very broad range for career growth. Aeronautical Engineering Courses impart versatile training to students in the areas of science, design, construction of aeroplanes and space vehicles and uses computer technology in the design space extensively. It has always been a popular and one of the most sought after career options with mainly four areas of specialization, viz., Aerodynamics, Aircraft Structures, Aircraft Propulsion and Aircraft Systems. Aeronautical engineers have always been in great demand. With booming commercialization and global economy, the demand will be much higher in the coming years, both in India and abroad.

As Dr. A.P.J. Abdul Kalam told a group of students, it is true that there is a great future for Aeronautical Engineering. With the advent of the open market system Aeroplane Companies are coming to India and as a result, India is a global partner in the design and manufacture of Aeroplanes. Thus, demand of Aeronautical Engineers in India will increase further and the future is very bright for the Aeronautical Engineers. There will be a sharp increase in the number of jobs of various specializations in the aerospace and aviation industries for aeronautical engineers and great room for personal growth and development and the increase in demand for aerospace engineers is likely to remain high in the future as there is a boom in world travel and aviation and aircraft industries. Many government, defense and space agencies are also on the look out for aeronautical engineers to develop the future flying vehicles and systems.

Eligibility: Based on EAMCET ranks, students are admitted in AP Engineering colleges. For admission into NITs and IITs, JEE main and advanced are necessary.

Higher Education: B.Tech Aeronautical engineering students can continue their higher education with M.Tech and later PhD.

Specializations: Structural design, Navigation guidance and control systems, Instrumentation and communication or production methods, military aircraft, passenger plane, helicopter, satellite, rockets.

Benefits of Aerospace ProgrammesSome of the direct benefits of Indian programmes were design and production of civil and defence aircraft and Communication and Earth-observation satellites self-sufficiency in defence missiles. These programmes have accelerated the development of Electronics, Material Science and Production Technology and gave fillip to science studies like cosmic ray studies, lunar studies, etc.,

Job Prospects: Aeronautical engineers are in good demand by airlines, aircraft manufacturing units, air turbine production plants and in design and development programmes for the aviation industry, etc.

Top organizations offering jobs
Some of the Aeronautical and Aerospace Organization in India are:

 • Hindustan Aeronautics Limited (HAL), Bangalore, Koraput, Nasik, etc.
 • National Aerospace Laboratories (NAL), Bangalore,
 • Aeronautical Development Establishment (ADE), Bangalore,
 • Gas Turbine Research Establishment (GTRE), Bangalore,
 • Defence Research and Development Laboratory (DRDL), Hyderabad,
 • Indian Space Research Organization (ISRO), Bangalore, Thiruvananthapuram, Sriharikota, Ahmedabad etc.

Private companies like Tata Advanced Systems, Infosys, InfoTech, Mahindra Satyam etc.

Aeronautical Engineering colleges in India
Indian Aeronautical education took birth at IISc Bangalore in 1942 with a single teacher (Dr V. M. Ghatge). It was later developed into a full-fledged department.

Other important institutes offering the course are IIT Kanpur (with U. S. Aid ), IIT Kharagpur, IIT Madras (with aid from GDR and now from France) and lIT Bombay (with USSR aid); they started giving graduate and post-graduate instruction in Aeronautics and conducting research leading to Ph. Ds as well as R & D projects.

Besides these national institutions, first degree level courses are also available at Madras Institute of Technology (since 1949) and at Punjab Engineer¬ing Col1ege at Chandigarh (since 1964). Though both these institutions are controlled by respective State Governments, MIT has developed into a P. G. Centre with the aid of Union Ministry of Education. Latest in this chain was the Birla Institute of Technology, Ranchi, which started giving courses on rockets and missiles. Some of the other institutes are Bengal Engineering and Science University, Howrah, West Bengal, Manipal Institute of Technology, Manipal, Karnataka, Amrita School of Engineering, Coimbatore, Tamil Nadu.

In addition to these formal educational institu¬tions, special purpose institutions are also available for training manpower for special jobs. Prominent among these are (i) Air Force Technical College (AFTC), Jalahalli, Bangalore (for IAF), (ii) Institute of Armament Technology, Poona, (iii) Staff College, HAL., Bangalore, (iv) Air Force Pilots’ College, Jodhpur, (v) Training Schools of Air India.

• What is the difference between Aeronautical Engineering vs Aerospace Engineering?

Aeronautical engineering and aerospace engineering are similar disciplines that are often confused, yet there are significant differences between the two disciplines. Here are some of the similarities.
 • Both use similar technology.
 • Both disciplines require similar knowledge and skill sets.
 • Both careers focus on flight.
 • Both disciplines require the candidate to earn a typical degree in engineering before pursuing an advanced degree in aeronautical engineering or aerospace engineering.
 • Both programs require study in aerodynamics, flight stability, aircraft control, and basic engineering.
 • Salaries are similar.
There is one major difference between the aeronautical and aerospace engineering. Aeronautical engineering focuses mostly on flight and flight activities with an atmosphere while aerospace engineering may also include activities within an atmosphere, but it also focuses on space applications where there is no atmosphere.
• How to Become an Aeronautical Engineer?
To become an aeronautical engineer, an individual must earn a bachelor’s degree program in aeronautical engineering or aerospace engineering. These programs generally take four to five years to complete and must be accredited by the Accreditation Board for Engineering and Technology. Because there are so many similarities and such an overlap between aeronautical engineering and aerospace engineering, many colleges are melding the programs together by offering double majors.
 
 • Aeronautical engineers can specialize in various areas.
 • Flight mechanics and control systems
 • Structural design
 • Manufacturing and maintenance
 • Aerodynamics
 • Instrumentation and communication
During the final year of college, the student participates in lab studies and design courses. Before the graduate can work as a licensed engineer, he or she must pass two engineering examinations. Passing the first exam, the Fundamentals of Engineering (FE) exam, allows the candidate to work as an engineer in training (EIT). After passing this exam and obtaining four years of on-the-job training the engineer can take the Professional Engineer (PE) exam.
List of World’s Top 10 Institution for Aeronautical Engineering:-
1. Massachusetts Institute of Technology (MIT)
2. School of Aerospace Engineering of Georgia institute of technology
3. University of Michigan Ann Arbor
4. School of Aeronautics and Astronautics of Purdue Institute West Lafayette
5. California Institute of Technology
6. University of Maryland College park
7. The University of Illinois at Urbana Campaign
8. Stanford University
9. University of Texas at Austin
10. Virginia Tech

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏరోనాటికల్ ఇంజనీర్లకు మంచి డిమాండ్ ఉంది.  ఎయిర్ ట్రాఫిక్ పెరగడం, రక్షణ రంగంలో పెట్టుబ డులు పెరుగుతుండడం, ప్రయివేట్ రంగ  కార్యకలాపాలకు అవకాశం ఇవ్వడం వంటి నిర్ణయాలతో ఏరోనాటికల్ ఇంజనీర్లకు ఆయా విభాగాల్లో అవకాశాలు మెరుగవుతున్నాయి.

పౌర, రక్షణ అవసరాలకు ఉపయోగించే ఎయిర్‌క్రాఫ్టుల డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ తదితరాలను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా విద్యార్థులు నేర్చుకుంటారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఫిజిక్స్, మ్యాథ్స్‌లను అడ్వాన్స్‌డ్ స్థాయిలో అధ్యయనం చేస్తారు.

అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 10+2 ఉత్తీర్ణత.
గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులు: బీటెక్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్/బీఈ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్.
ఉన్నత విద్య: ఎంటెక్/ఎంఈ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్.

 • ఎంటెక్/ఎంఈ ఇన్ ఏవియానిక్స్.


ఇన్‌స్టిట్యూట్‌లు:

 1. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, హైదరాబాద్.
 2. మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్.
 3. హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, చెన్నై.
 4. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, బెంగళూరు.
 5. మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెన్నై.
 6. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫర్మేషన్, టెక్నాలజీ(ఐఐఏఈఐటీ), పుణె.
 7. సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఏరోనాటికల్/ఏరోస్పేస్/ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్(సీఐఐఏఈ), డెహ్రాడూన్.
 8. ఇండియన్ అకాడమీ ఆఫ్ ఏరోనాటికల్ టెక్నాలజీ, లక్నో.


అవకాశాలు:  ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమ, అంతరిక్ష పరిశోధన సంస్థలు, హెలికాప్టర్ కంపెనీలు, శాటిలైట్ మాన్యుఫాక్చరింగ్, రక్షణ దళాలు, ఏవియేషన్ సంబంధిత ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే అవకాశం ఉంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సైతం మంచి నైపుణ్యం కలిగిన ఏరోనాటికల్ ఇంజనీర్లను నియమించుకుం టున్నాయి.

జాబ్ ప్రొఫైల్: ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు ఉద్యోగపరంగా అసిస్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్, అసిస్టెం ట్ టెక్నికల్ ఆఫీసర్, ఏరోస్పేస్ డిజైన్ చెకర్, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్, ఎయిర్క్రాఫ్ట్ ప్రొడక్షన్ మేనేజర్, థర్మల్ డిజైన్ మేనేజర్  వంటి కొలువులు సొంతం చేసుకోవచ్చు.

ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌ను పూర్తిచేసుకున్న వారు దేశంలోని ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్ జెట్, పవన్ హన్‌‌సతోపాటు ఇతర ప్రైవేటు చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు అందుకునే వీలుంది. విమాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)కు.. బెంగళూరు, నాసిక్, కోరాపుట్, లక్నో, హైదరాబాద్ తదితర చోట్ల ఉన్న కేంద్రాల్లో ఏరోనాటికల్ ఇంజనీర్లకు కెరీర్ అవకాశాలు కల్పిస్తోంది. అలాగే రక్షణ రంగంలో.. నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలు.. అత్యాధునిక విమానాలు, విమాన పరికరాల నిర్వహణ కోసం టెక్నికల్ బ్రాంచ్‌లోకి ఏరోనాటికల్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని క్షిపణుల అభివృద్ధి, ప్రయోగాలు, డిజిటల్ కార్యక్రమాల్లో వేగం కనిపిస్తోంది. కాబట్టి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న ప్రతిభావంతులు డీఆర్‌డీవో (డిఫెన్‌‌స రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) లేబొరేటరీలు, నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్ (ఎన్‌ఏఎల్), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్‌ల్లో అవకాశాలు పొందొచ్చు. ఎంటెక్ పూర్తిచేస్తే ఈ ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగం లభించడం మరింత సులువవుతుంది. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ ఉద్యోగానికైనా సంబంధిత సబ్జెక్టు నాలెడ్‌‌జతోపాటు సదరు జాబ్‌కు అవసరమైన నైపుణ్యాలు ఉంటేనే ఆఫర్ లెటర్ చేతికందుతుంది.