ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌

నిర్మాణాల ప్లానింగ్, డిజైనింగ్‌ల అధ్యయనమే.. ఆర్కిటెక్చర్. అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, ఎయిర్‌పోర్టులు, స్టేడియాలు, స్కూళ్ల నిర్మాణంలో ఆర్కిటెక్చర్‌ల పాత్ర ఎంతో కీలకం. దీంతో ఆర్కిటెక్చర్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇంటర్ ఎంపీసీ అర్హతతో ఆర్కిటెక్చర్ కోర్సులో ఆరంగేట్రం చేయొచ్చు.కోర్సు పేరు: బీఆర్క్/బీప్లానింగ్ కోర్సు కాలవ్యవధి: ఐదేళ్లు అర్హత: అకడెమిక్ స్థాయిలో ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టడానికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూపుతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైతే బీఆర్క్‌కు అర్హత ఉన్నట్లే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ కోర్సును అందిస్తున్నాయి. అవి నిర్వహించే ప్రవేశ పరీక్షల ఆధారంగా సీటు సొంతం చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలు:నాటా: ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్‌లో ప్రవేశం కల్పించే అన్ని ఎంట్రెన్స్‌ల్లో ‘నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా)’ అత్యంత ప్రముఖమని చెప్పొచ్చు. దీన్ని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఆర్కిటెక్చర్, అకాడమిక్ కౌన్సెల్…

Read More