ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో)

ఎస్బీఐ పీవో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్(పీవో) కొలువుల భర్తీకి క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు లభిస్తుంది. మూడు దశల్లో జరిగే పీవో ఎంపిక ప్రక్రియలో.. ప్రిలిమ్స్, మెయిన్, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రిలిమ్స్ను 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి గంట. ప్రశ్నపత్రంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ విభాగాలు ఉంటాయి. సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. మెయిన్ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో 250 మార్కులకు జరుగుతుంది. ఆబ్జెక్టివ్ పరీక్షలో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్,…

Read More

ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగం సాధించడానికి మార్గం ఏమిటి? అర్హతలు, కెరీర్‌ అవకాశాల గురించి తెలపండి?

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు దీటుగా ప్రైవేటు బ్యాంకులు విస్తరిస్తున్నాయి. విస్తృత ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో ఎంట్రీ లెవల్లో విభిన్న హోదాలతో ఖాళీలు ఉంటున్నాయి. ఈ పోస్టుల్లోకి నియామకాల కోసం సొంతంగా ప్రకటనలివ్వడంతోపాటు ప్లేస్‌మెంట్స్‌ ద్వారా తమకు సరిపడే అభ్యర్థులను బ్యాంకులు నియమించుకుంటున్నాయి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.కొన్ని బ్యాంకులు ప్రైవేటు విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని.. బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. ముఖ్యంగా ప్రొబేషనరీ ఆఫీసర్‌ స్థాయి పోస్ట్‌ల భర్తీకి ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ కోర్సుకు ఎంపిక అవ్వాలంటే.. ఆన్‌లై¯Œ  పరీక్షల్లో  అర్హత సాధించి.. గ్రూప్‌ డిస్కషన్స్, ఇంటర్వ్యూల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. విజయవంతంగా…

Read More

బ్యాం‘కింగ్’ కొలువుల ఎంపిక విధానం, ప్రిపరేషన్ గెడైన్స్..

ఆకర్షణీయమైన వేతనాలు.. సుస్థిరమైన కెరీర్.. ఎదిగేందుకు అపార అవకాశాలు.. తక్కువ వడ్డీకే సులువైన గృహ, వాహన రుణ సదుపాయం.. ఇలా ఎన్నో సౌకర్యాలు బ్యాంకింగ్ రంగంలో పనిచేసే ఉద్యోగుల సొంతం! ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఏటా నియామకాలు చేపడుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్లు) వంటివి క్రేజీ కొలువులు!! వీటితోపాటు మార్కెటింగ్, టెక్నికల్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఆపరేషన్స్, హెచ్‌ఆర్, లా ఆఫీసర్లు, చార్టర్డ్ అకౌంటెంట్స్, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, ఐటీ ఆఫీసర్లు వంటి స్పెషలిస్ట్ ఆఫీసర్(ఎస్‌వో) ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో..బ్యాంకింగ్ రంగంలో కొలువులు.. ఎంపిక విధానాలు.. పరీక్షల తీరుతెన్నులు.. సిలబస్ విశ్లేషణ.. ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం..! ఎస్‌బీఐ ఎంపిక ప్రక్రియ : దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ. క్లర్క్, పీవో పోస్టుల…

Read More

రిక్రూట్‌మెంట్ కింగ్.. బ్యాంకింగ్

ప్రతిభకు పెద్దపీట వేసే రంగాల్లో బ్యాంకింగ్ ఒకటి. ఇందులో ప్రవేశించిన వారు సామర్థ్యం, అనుభవం ఆధారంగా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చు. ఇంటర్ అర్హతతోనే బ్యాంక్‌ల్లో క్లర్క్ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. డిగ్రీతో పీఓగా కెరీర్ ప్రారంభించొచ్చు. క్లర్క్, పీఓ ఏ హోదాలో చేరినప్పటికీ డిపార్ట్‌మెంటల్ పరీక్షల ద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవడం సులువే. తాజాగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ ఐబీపీఎస్ నిర్వహించే కామన్ పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సర్వీసెస్ (ఐబీపీఎస్) జాతీయ స్థాయిలో కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తోంది. ఏటా రెండుసార్లు పీఓ/మేనేజ్‌మెంట్ ట్రైనీస్, క్లరికల్ కేడర్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఈ స్కోర్‌కు ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది. దీని ఆధారంగా ఆ సమయంలో ఉద్యోగాల…

Read More