ఎకనామిక్స్‌లో ఉన్నత విద్యా కోర్సులు, కెరీర్ అవకాశాలు
ప్రపంచీకరణ, ఎల్లలు లేని వాణిజ్యం కారణంగా బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్ (బీఏ) పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్లో అవకాశాలు విస్తృతమవుతున్నాయి. వాస్తవానికి బీఏ ఎకనామిక్స్ విద్యార్థులు మూడేళ్లు/నాలుగేళ్ల (ఆనర్స్) బ్యాచిలర్ కోర్సులో భాగంగా ఎకనామిక్స్‌తోపాటు హిస్టరీ, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర సబ్జెక్టుల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టులను ఎంచుకొని చదవాల్సి ఉంటుంది. బీఏ ఎకనామిక్స్ తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్ చేయడం ద్వారా ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.ఉన్నత విద్య: ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ ఎంఎస్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగావకాశాలు:బీఏ ఎకనామిక్స్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు. దీంతోపాటు యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్రాల స్థాయిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు జరిపే గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు…
Read More
You must be logged in to post a comment.