సైన్స్‌ పరిశోధనల కోర్సులు

నేడు హాట్‌ కెరీర్‌లుగా నిలుస్తున్న ఇంజనీరింగ్, ఐటీ రంగాలకు మూలం సైన్స్‌. పరిశోధన రంగానికి ఆయువు పట్టు సైన్స్‌. ఉద్యోగాల కల్పనలో సైన్స్‌ కోర్సులది ఎప్పుడూ ముందు వరుసే! సైన్స్‌ పరిశోధనలతోనే ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా సైన్స్‌ పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని టాప్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో చదివితే.. ఉజ్వల కెరీర్‌కు ఎర్రతివాచీ పరిచినట్లే! ఈ నేపథ్యంలో దేశంలోని టాప్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, అవి అందిస్తున్న కోర్సులు, ప్రవేశ ప్రక్రియలపై ప్రత్యేక కథనం… ఐఐఎస్సీ సైన్స్‌ విద్య, పరిశోధనలకు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) తలమానికంగా నిలుస్తోంది. ఓ వైపు సైన్స్‌లో వినూత్న కోర్సులు అందిస్తూనే.. మరోవైపు పరిశోధనల్లోనూ దూసుకెళ్తోంది. దీంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి ముందు వరుసలో నిలుస్తోంది. కోర్సులు: అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్, పోస్టుగ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్,…

Read More