ఎంఎస్సీ మ్యాథమెటిక్స్

ఏ కెరీర్‌కు అయినా మ్యాథమెటిక్స్ సబ్జెక్టు మంచి పునాది. మ్యాథ్స్ నైపుణ్యంతో ఏ పోటీ పరీక్షలోనైనా తేలిగ్గానే నెగ్గొచ్చు. ఎందుకంటే… మ్యాథ్స్ విద్యార్థికి లాజికల్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలు, నిర్ణయాత్మక సామర్థ్యం అలవడుతుంది. ఈ స్కిల్స్‌తో బ్యాంక్ పీవోస్, క్లర్క్స్, ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, యూపీఎస్సీ వంటి పరీక్షలకు హాజరుకావచ్చు.ఆయా పోటీ పరీక్షల్లో రాణించేందుకు మ్యాథమెటిక్స్‌పై పట్టు ఎంతగానో దోహదపడుతుంది. వీటితోపాటు మ్యాథ్స్ అభ్యర్థులు ఐటీ రంగంలోనూ ప్రవేశించొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం హాట్ కెరీర్స్‌గా మారిన డేటాసైంటిస్ట్, డేటా అనలిటిక్స్ ఉద్యోగాలకు మ్యాథ్స్ స్కిల్స్ తప్పనిసరి. ఎంఎస్సీ మ్యాథ్స్ చదువుతూనే జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వివిధ కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడంతోపాటు, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు బీమా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మార్కెటింగ్ రంగాల్లో అవకాశాలు అందుకోవచ్చు. పరిశోధనలపై ఆసక్తి ఉంటే.. ప్రభుత్వ రంగంలోని ఇస్రో, డీఆర్‌డీవో, టీఐఎఫ్‌ఆర్ వంటి సంస్థల్లో సైంటిస్ట్‌గా చేరొచ్చు.

ఎకనామిక్స్‌లో ఉన్నత విద్యా కోర్సులు, కెరీర్ అవకాశాలు

ప్రపంచీకరణ, ఎల్లలు లేని వాణిజ్యం కారణంగా బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్ (బీఏ) పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్లో అవకాశాలు విస్తృతమవుతున్నాయి. వాస్తవానికి బీఏ ఎకనామిక్స్ విద్యార్థులు మూడేళ్లు/నాలుగేళ్ల (ఆనర్స్) బ్యాచిలర్ కోర్సులో భాగంగా ఎకనామిక్స్‌తోపాటు హిస్టరీ, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర సబ్జెక్టుల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టులను ఎంచుకొని చదవాల్సి ఉంటుంది. బీఏ ఎకనామిక్స్ తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్ చేయడం ద్వారా ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ఉన్నత విద్య:

 • ఎంఏ ఎకనామిక్స్
 • ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్
 • ఎంఎస్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్
 • మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


ఉద్యోగావకాశాలు:బీఏ ఎకనామిక్స్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు. దీంతోపాటు యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్రాల స్థాయిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు జరిపే గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు మొగ్గుచూపుతారు. బీఏ ఎకనామిక్స్ తర్వాత ఎకనామిక్స్‌లో పీజీ కూడా పూర్తిచేస్తే.. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌కు సన్నద్ధమయ్యే వీలుంది. సబ్జెక్టుపై పట్టు, ప్రతిభ కలిగిన అభ్యర్థులు ఆర్థిక నిపుణులుగా రాణించొచ్చు. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), నీతి ఆయోగ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వంటి విభాగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. దీంతోపాటు బోధన రంగంలోనూ అవకాశాలకు కొదవలేదు. ఎకనామిక్స్‌లో ఉన్నత విద్య తర్వాత ప్రైవేటు రంగంలో రీసెర్చ్ అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్, ఎకనామిక్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు.

ఉపాధి కల్పిస్తున్న రంగాలు:

 • ఎకనామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్
 • అనాలసిస్ అండ్ ఫోర్‌కాస్టింగ్ సంస్థలు
 • స్టాక్‌ఎక్ఛేంజ్‌లు
 • బ్యాంకులు, ఇతర క్రెడిట్ యూనిట్లు
 • మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు
 • కంప్యూటర్, టెలీ కమ్యూనికేషన్ సంస్థలు
 • గవర్న్‌మెంట్ డిపార్ట్‌మెంట్స్ అండ్ స్టాటిస్టికల్ రీసెర్చ్ సంస్థలు..


టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు:

 1. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఎంఏ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
  వెబ్‌సైట్:
   www.jnu.ac.in/main
 2. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ (ఐజీఐడీఆర్) ఎంఎస్సీ ఎకనామిక్స్‌ని ఆఫర్ చేస్తోంది.
  వెబ్‌సైట్:
   http://www.igidr.ac.in
 3. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ).. ఎంఏ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
  వెబ్‌సైట్:
   http://econdse.org
 4. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ (తిరువనంతపురం).. ఎంఏ అప్లయిడ్ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
  వెబ్‌సైట్:
   http://www.cds.edu
 5. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంఏ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
  వెబ్‌సైట్:
   www.uohyd.ac.in
 6. మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్.. ఎంఏ జనరల్, పైనాన్షియల్, అగ్రికల్చర్, అప్లైడ్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్, ఎన్విరాన్‌మెంటల్ వంటి స్పెషలైజేషన్లను ఆఫర్ చేస్తోంది.
  వెబ్‌సైట్:
   www.mse.ac.in
 7. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ).. ఎంఎస్-క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
  వెబ్‌సైట్:
   www.isical.ac.in  

హిస్టరీతో కెరీర్ అవకాశాలు

హిస్టరీ.. అవకాశాలను అందించడంలో ఇతర సబ్జెక్టులకు తీసిపోదు! కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో హిస్టరీది కీలక పాత్ర. కొంతకాలంగా బీటెక్ నేపథ్యంతో సివిల్స్ సాధిస్తున్న వారి వివరాలను పరిశీలించినా హిస్టరీ ఆప్షనలే ముందు వరుసలో ఉంటోంది. బీఏ హిస్టరీ పూర్తిచేసిన వారికి ఉన్నత విద్య పరంగా భిన్న మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఆసక్తి మేరకు ఆయా కోర్సులను ఎంచుకోవచ్చు.

బోధనావకాశాలు..

 • టీచింగ్‌పై ఆసక్తి ఉన్న బీఏ గ్రాడ్యుయేట్లు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) వైపు అడుగులు వేయొచ్చు. బీఈడీ అనంతరం డీఎస్సీలో ప్రతిభతో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించొచ్చు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు వేతనాలు బాగానే ఉన్నాయి.
 • ఎంఏ (హిస్టరీ) పూర్తిచేసిన అభ్యర్థులు యూజీసీ.. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)లో అర్హత సాధించడం ద్వారా లెక్చరర్ కొలువులను అందుకోవచ్చు. నెట్‌లో ప్రతిభకనబరిచిన వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) లభిస్తుంది.


ఉన్నత విద్య :ఉన్నత విద్యకు సంబంధించి సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఉన్నన్ని స్పెషలైజేషన్లు బీఏ హిస్టరీ విద్యార్థులకు ఉండవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది నిజం కాదు. హిస్టరీ ఆప్షనల్‌గా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉన్నత విద్య దిశగా భిన్న రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలను అందుకోవచ్చు. ఉదాహరణకు ఎంఏ మ్యూజియాలజీని తీసుకుంటే.. దీన్ని హిస్టరీ గ్రాడ్యుయేట్లకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సుగా చెప్పొచ్చు. ఈ కోర్సులో మ్యూజియంల చరిత్ర, డాక్యుమెంటేషన్, ప్రజెంటేషన్, ఇంటెర్‌ప్రిటేషన్, మ్యూజియం ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్; కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ మ్యూజియం తదితరాలను అధ్యయనం చేస్తారు.
జాబ్ ప్రొఫైల్స్: ఎగ్జిబిషన్ కన్సల్టెంట్, డిప్యూటీ క్యూరేటర్, టీచర్ అండ్ లెక్చరర్, మ్యూజియం గైడ్, ఇంటీరియర్ ఆర్ట్స్ డిజైనర్, కన్జర్వేటర్

ఎంఏ ఆర్కియాలజీ:
వైవిధ్య భరిత కెరీర్‌ను కోరుకునే వారికి ఎంఏ ఆర్కియాలజీ చక్కటి ఎంపిక. ఈ కోర్సులో ఆర్కియాలజీకి సంబంధించిన ప్రాథమిక పద్ధతులు, ఇండియన్ ఆర్కిటెక్చర్, రీసెర్చ్ మెథడాలజీ, ఎర్లీ ఇండియన్ ఆర్ట్ వంటి అంశాల గురించి నేర్చుకుంటారు. ఎంఏ ఆర్కియాలజీ చేస్తే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ), దాని అనుబంధ విభాగాల్లో అవకాశాలను అందుకోవచ్చు.
జాబ్ ప్రొఫైల్స్: హెరిటేజ్ మేనేజర్, లెక్చరర్ అండ్ టీచర్, హెరిటేజ్ కన్జర్వేటర్, ఆర్కై విస్ట్, గైడ్, డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్, ఇన్ఫ ర్మేషన్ మేనేజర్, హిస్టారియన్, లైబ్రరీ సిస్టమ్స్ అనలిస్ట్.

పోటీలో విజయానికి చరిత్ర !కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏ పోటీ పరీక్ష అయినా.. హిస్టరీ లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. దీన్నిబట్టి పోటీ పరీక్షల్లో హిస్టరీ ప్రాధాన్యమేంటో అర్థంచేసుకోవచ్చు. దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసులను అందిపుచ్చుకునేందుకు వీలుకల్పించే సివిల్స్‌లో చరిత్ర కీలకపాత్ర పోషిస్తోంది. సివిల్స్ ప్రిలిమ్స్‌లో కీలకమైన జనరల్ స్టడీస్ పేపర్ కోసం హిస్టరీని ప్రత్యేక దృష్టితో చదవాల్సి ఉంటుంది. సివిల్స్ మెయిన్స్‌లో జనరల్ స్టడీస్ పేపర్-1 కోసం ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రాష్ర్ట స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షల్లోనూ హిస్టరీ కీలకంగా నిలుస్తుంది. కేవలం సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలే కాకుండా ఎస్‌ఎస్‌సీ, రైల్వే తదితర పరీక్షల్లోనూ హిస్టరీకి ప్రాధాన్యం లభిస్తోంది.

చరిత్రతో ఉన్నత అవకాశాలు..హిస్టరీ.. మానవ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, భాషా పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. చరిత్రను విస్మరిస్తే మానవజాతి గతాన్ని కోల్పోయినట్లే! ప్రస్తుతం ఆర్కియాలజీ, మ్యూజియాలజీ, లింగ్విస్టిక్స్ వంటి స్పెషలైజేషన్లు ఉపాధి కల్పనలో ముందుంటున్నాయి. వీటిని పూర్తిచేసిన వారికి కెరీర్ పరంగా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. పోటీ పరీక్షల విషయానికొస్తే హిస్టరీ లేనిదే ప్రశ్నపత్రమే ఉండదని చెప్పొచ్చు. సివిల్స్ విజేతల్లో హిస్టరీ ఆప్షనల్‌ను ఎంచుకున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. దీన్నిబట్టి సరైన ప్రణాళికతో హిస్టరీని చదవడం ద్వారా విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు.

ఆర్గానిక్ కెమిస్ట్రీ

ఉద్యోగ అవకాశాలు

 1. కెమిస్ట్రీ విద్యార్థులకు ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా కెమికల్ లేబొరేటరీస్, క్లినికల్ లేబొరేటరీస్, హెల్త్‌కేర్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, ఫోరెన్సిక్ ల్యాబ్స్, ఫెర్టిలైజర్ కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో కెమిస్ట్, ఫార్మా అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, క్లినికల్ రీసెర్చ్ స్పెషలిస్ట్, రేడియాలజిస్ట్, ఫార్మాస్యుటికల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. వీరికి నెలకు రూ.25వేల వరకు వేతనం లభిస్తుంది.  
 2. పీజీ ఉత్తీర్ణతతో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో సేంద్రీయ వ్యవసాయ ఎరువుల కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, ప్యాకేజ్డ్ ఫుడ్ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. అదే విధంగా రీసెర్చ్ ల్యాబ్స్‌లోనూ కెరీర్ సొంతం చేసుకోవచ్చు. మీ విషయంలో కోర్సు ఉత్తీర్ణత తర్వాత బాగా గ్యాప్ వచ్చినందున.. ముందుగా ఈ విభాగంలో తాజా పరిణామాలపై దృష్టిసారించండి. తాజా నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషిచేయాలి. ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇప్పుడు పలు కొత్త పద్ధతులు అమలవుతున్నాయి. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్, బయో సిరామిక్స్ వంటి షార్ట్ టర్మ్ కోర్సులు చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు.

బీకామ్

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీకామ్ పూర్తిచేశాను. ఇప్పుడు నాకు అందుబాటులో ఉన్న ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల గురించి చెప్పండి?

బీకామ్ తర్వాత ఉన్నత విద్య పరంగా ఎంకామ్‌లో చేరొచ్చు. ఈ కోర్సు అన్ని వర్సిటీలు, కాలేజీల్లో అందుబాటులో ఉంది. ఇందులో ప్రవేశాలకు వర్సిటీలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాయి. సదరు ఎంట్రెన్స్ టెస్టులో మంచి ర్యాంకు పొందితే క్యాంపస్ కాలేజీల్లో ఎంకామ్ పూర్తి చేసే అవకాశం దక్కుతుంది. ఎంకామ్‌లో చేరడం ఇష్టం లేని వాళ్లు ఎంబీఏ వైపు వెళ్లొచ్చు. దీనికి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఐసెట్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. ఎంబీఏ, ఎంకామ్ చదివే ఆర్థిక స్థోమత లేకుంటే.. టాలీ, అకౌంటింగ్ తదితర షార్ట్‌టర్మ్ కోర్సులను నేర్చుకోవచ్చు. ఎంకామ్ పూర్తి చేసిన వారికి అకౌంట్స్, బోధనా రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఎంబీఏ పూర్తిచేసిన వారికి ఫైనాన్స్, మార్కెటింగ్‌తోపాటు పలు విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

ఆస్ట్రానమీ

విశ్వం, విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతల అధ్యయనాన్ని ఆస్ట్రానమీ అంటారు. ఆస్ట్రోనమిస్ట్లు నక్షత్రాలు ఎలా పుడతాయి..వాటి ప్రత్యేకతలు తదితర అంశాలతోపాటు పలు ఖగోళ అంశాలపై అధ్యయనం, పరిశోధనలు చేస్తుంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్లో ప్రతిభావంతులైన అభ్యర్థులు ఆస్ట్రానమీ వైపు వెళ్తే మంచి భవిష్యత్ ఉంటుంది. ఆస్ట్రానమీని కెరీర్గా ఎంచుకోవాలనుకొనే వారు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదవాలి. అనంతరం డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్, ఆస్ట్రానమీ సబ్జెక్టులతో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ(బీఎస్సీ లేదా బీటెక్)ని అభ్యసించవొచ్చు. కొన్ని యూనివర్సిటీలు ఆస్ట్రోఫిజిక్స్ స్పెషలైజేషన్ను అందిస్తున్నాయి. ఇది ఫిజిక్స్, ఆస్ట్రానమీల కలయికగా ఉంటుంది. అనంతరం సంబంధిత సబ్జెక్టుల్లో రెండేళ్ల పీజీ, తదనంతరం పీహెచ్డీని పూర్తి చేస్తే ఆస్ట్రానమిస్ట్గా చక్కటి కెరీర్ను సొంతమవుతుంది.

పీజీ కోర్సులు..

 • ఎంఎస్సీ ఆస్ట్రానమీ
 • ఎంఎస్సీ ఆస్ట్రోఫిజిక్స్
 • ఎంఎస్సీ ఇన్ మెటీరియాలజీ
 • పీహెచ్డీ ఇన్ ఆస్ట్రానమీ
 • పీహెచ్డీ ఇన్ ఆస్ట్రోఫిజిక్స్
 • పీహెచ్డీ ఇన్ అట్మాస్ఫియరిక్ సైన్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్.

ఉద్యోగాలు

ఆస్ట్రోనమర్స్, రీసెర్చర్స్ సైంటిస్ట్, లెక్చరర్, ఆస్ట్రోఫిజిస్ట్, టూల్ డిజైనర్స్ అండ్ ఆపరేటర్స్, .

ప్రముఖ ఇన్స్టిట్యూట్లు

 • ఐఐటీ–బాంబే
 • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్
 • ఢిల్లీ యూనివర్సిటీ
 • ప్రెసిడెన్సీ కాలేజ్(కోల్కతా)
 • కోచిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
 • ఐఐటీ–ఢిల్లీ.

బీకామ్ (కంప్యూటర్స్)

డిగ్రీలో బీకామ్ (కంప్యూటర్స్) చదివాను. తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ చేయాలనుకుంటున్నాను. నాకు ఎలాంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయో తెలపండి?

 ఏ వ్యాపారానికైనా  ఫైనాన్స్ విభాగం జీవనాడి లాంటిది. ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసిన వారికి కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. ఫైనాన్స్ను కెరీర్గా ఎంచుకోవాలనుకునేవారు అకౌంటింగ్, ఫైనాన్స్, టాక్సేషన్లతోపాటు కాలానుగుణంగా స్టాటిస్టిక్స్, ఎకనోమెట్రిక్స్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. చాలామంది ఫైనాన్స్ను అకౌంటింగ్, టాక్సేషన్కు సంబంధించిన ఒక అంశంగానే భావిస్తారు. కానీ వాస్తవానికి ఫైనాన్స్ పరిధి చాలా విస్తృతమైనది.

 ప్రస్తుత పరిస్థితుల్లో ఫైనాన్స్ రంగంలో స్థిరపడాలంటే.. ఫైనాన్స్కు సంబంధించిన కొత్త సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్ పద్ధతులను కూడా నేర్చుకోవాలి. ఇటీవల కాలంలో క్రేజీగా నిలుస్తున్న ఫిన్టెక్(ఫైనాన్షియల్ టెక్నాలజీ)పై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే విభిన్న నైపుణ్యాలతో మంచి సంస్థలో కెరీర్ ప్రారంభించడానికి సాధ్యమవుతుంది.

 కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ప్రవేశించాలంటే…అదనపు సర్టిఫికేట్ కోర్సులనూ అభ్యసించాల్సి ఉంటుంది. ఉదాహరణకు క్యాపిటల్ మార్కెట్స్లో చేరాలనుకునేవారు సెబీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ అందించే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, డెరివేటివ్స్ అండ్ సెక్యూరిటీస్ ఆపరేషన్స్, రిస్క్మేనేజ్మెంట్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

లైబ్రరీ సైన్స్

లైబ్రరీ సైన్స్ కోర్సులో చేరేందుకు కనీస అర్హత..ఇంటర్మీడియెట్. ఇంటర్ అర్హతతో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేయొచ్చు. కోర్సు కాల వ్యవధి ఆరు నెలలు. లైబ్రరీ సైన్స్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్(బీఎల్ఐఎస్సీ) కోర్సు అందుబాటులో ఉంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు. కోర్సు వ్యవధి సంవత్సరం. దీంతోపాటు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్(పీజీడీడీఐఎం), మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్(ఎంఎల్ఐఎస్సీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. టిస్, ఉస్మానియా, కాకతీయ, శ్రీ కృష్ణదేవరాయ, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు లైబ్రరీ సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. వీటితోపాటు దేశంలో పలు ఇన్స్టిట్యూట్లు, వర్సిటీలు లైబ్రరీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

బీఎస్సీ కంప్యూటర్ సైన్స్

ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిగ్రీ స్థాయి కోర్సుల్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఒకటి. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసినవారు ఉద్యోగావకాశాల పరంగా హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేయవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ వంటి లేటెస్ట్ టెక్నాలజీపైనా అవగాహన పెంచుకొని అవకాశాలకు దక్కించుకోవచ్చు. ఆయా కోర్సులను ఎంచుకునే ముందు నిజంగా ఆసక్తి ఉందా.. బలాలు, బలహీనతలు, నైపుణ్యాలు అంచనా వేసుకోవాలి. బీఎస్సీ కంప్యూటర్స్సైన్స్తోపాటే అదనంగా జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న పలు సాఫ్ట్వేర్ సర్టిఫికేషన్స్, స్కిల్ డవలప్మెంట్ కోర్సులు పూర్తి చేసుకోవడం ద్వారా మెరుగైన అవకాశాలు సొంతం చేసుకునే వీలుంది.

బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులకు ఉపయోగపడే పలు కోర్సులు: » 3డి యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ » అడ్వాన్స్›డ్ డిప్లొమా ఇన్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ » సర్టిఫికేషన్ ప్రోగ్రామింగ్ ఫర్ నెట్వర్క్ ప్లానింగ్ అండ్ ఆప్టిమైజేషన్ » సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఫర్ టెలికమ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ » సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ » డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ » హెచ్సిఈ+(హార్డ్వేర్ కోర్సు) » ఐహెచ్టి సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్ » ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ » మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్ ఇంజనీర్(ఎంసీఎస్ఈ) » రెడ్ హాట్ సర్టిఫైడ్ ఇంజనీర్ (ఆర్హెచ్సీఈ) » రోబోటిక్స్ కోర్సులు » ఎస్ఏపీ కోర్సులు » వెబ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్.

ఉన్నత విద్య పరంగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చు

సాఫ్ట్‌వేర్ కొలువు…ఇలా సులువుగా సాధించండి !

ఐటీ కంపెనీల్లో కొలువు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌తోనే సాధ్యమని భావిస్తున్నారా?! మీ కాలేజీలో క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించకుంటే.. ఇక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కల్లేనని ఆందోళన చెందుతున్నారా..?!
 • Edu newsబీటెక్/బీఈ వంటి అర్హతలున్న వారికే ఐటీ ఉద్యోగం లభిస్తుందనే భావనలో ఉన్నారా? అయితే.. ఇప్పుడు వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు! ఎందుకంటే.. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సంస్థలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ టెస్ట్‌ల్లో సత్తాచాటితే చాలు.. ఐటీ జాబ్ సొంతమవుతుంది! టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలు ఆన్‌లైన్ టెస్టుల ద్వారా యంగ్ టాలెంట్‌కు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్న ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లతో ప్రయోజనాలు, ఆయా పరీక్షల తీరుతెన్నుల గురించి తెలుసుకుందాం…‘ఐటీ కంపెనీల్లో కాలు పెట్టాలంటే క్యాంపస్ డ్రైవ్స్‌లో సత్తా చాటితేనే సాధ్యం. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు అవకాశం లేకుంటే..ఐటీ కొలువు కష్టమే’-ఇది సాధారణంగా వినిపించే అభిప్రాయం. అయితే గత కొంతకాలంగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలు ఆఫ్ క్యాంపస్ విధానంలో యంగ్ టాలెంట్‌ను గుర్తించి ఆఫర్లు ఇస్తున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి ఆఫ్-క్యాంపస్ విధానంలో ఆన్‌లైన్ టెస్టుల ద్వారా కొలువులిచ్చే విధానానికి ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ శ్రీకారం చుట్టింది. అదే బాటలో విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, ఐబీఎం, క్యాప్ జెమినీ వంటి పేరున్న సంస్థలు సైతం ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తద్వారా మారుమూల ప్రాంతంలోని సాధారణ కాలేజీలో చదివిన విద్యార్థులైనా ప్రతిభ ఉంటే.. ఐటీ రంగంలో అవకాశం అందుకోవచ్చు.ట్రెడిషనల్ టు టెక్నికల్:
  ఐటీ సంస్థల్లో కొలువు అంటే బీటెక్ వంటి సాంకేతిక కోర్సులు చదివిన వారికే అనే అభిప్రాయం నెలకొంది. కానీ దీనికి భిన్నంగా బీఏ/బీఎస్సీ/బీకాం వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సుల అభ్యర్థులు సైతం ఐటీ కొలువులిచ్చే ఆన్‌లైన్ టెస్ట్‌లకు హాజరయ్యేందుకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం… బేసిక్ స్కిల్స్ ఉన్న గ్రాడ్యుయేట్లను నియమించుకొని.. కొంత శిక్షణనిస్తే సంబంధిత విభాగాల్లో సమర్థంగా రాణిస్తారనిఐటీ సంస్థలు భావిస్తుండటమే.

  కోర్ టు సర్వీసెస్ :
  ఐటీ కంపెనీలు నిర్వహిస్తున్న ఆఫ్-క్యాంపస్ ఆన్‌లైన్ టెస్ట్‌లలో విజయం సాధించి తదుపరి దశల్లోనూ సత్తా చాటితే.. అర్హతలకు అనుగుణంగా ఆయా విభాగాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఉదాహరణకు టీసీఎస్, విప్రోలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఇవి కేవలం ఐటీ సంబంధిత సర్వీసులే కాకుండా.. ఇతర సేవలు సైతం అందిస్తున్నాయి. దాంతో టెక్నికల్ అర్హతలుంటే కోర్ ఐటీ విభాగంలో.. సంప్రదాయ డిగ్రీ అభ్యర్థులైతే..బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్ తదితర విభాగాల్లో నియమిస్తున్నాయి.

  కోడింగ్, ప్రోగ్రామింగ్‌పై దృష్టి :
  ఆన్‌లైన్ టెస్ట్‌లు నిర్వహిస్తున్న ఐటీ సంస్థలు తొలి దశలో ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను అభ్యర్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలు, క్వాంటిటేటివ్ స్కిల్స్‌ను పరీక్షించే మార్గంగానే భావిస్తున్నాయి. ఆ తర్వాత దశలో నిర్వహించే టెక్నికల్ రౌండ్‌లో చూపిన ప్రతిభను కీలకంగా పరిగణిస్తున్నాయి. అందుకే ఈ దశలో ఆన్‌లైన్ కోడింగ్ టెస్ట్‌ను, ప్రోగ్రామింగ్ టెస్ట్‌లను నిర్వహిస్తున్నాయి. అప్పటికప్పుడు ఏదైనా ఒక టాస్క్‌ను ఇచ్చి దానికి కోడింగ్, ప్రోగ్రామింగ్ రాయాలని అడుగుతున్నారు. కాబట్టి విద్యార్థులు కోడింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్‌పై పట్టు సాధించి ఎంపిక ప్రక్రియకు ఉపక్రమించాలి.

  టీసీఎస్:
  నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ :

  ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ.. టీసీఎస్ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్ష.. టీసీఎస్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్(టీఎన్‌క్యూటీ). దీనికి సంప్రదాయ డిగ్రీ విద్యార్థులు హాజరుకావచ్చు. ముఖ్యంగా బీఏ/బీకాం/బీఎస్సీ కోర్సుల విద్యార్థులు సాఫ్ట్‌వేర్ కొలువు సొంతం చేసుకునేందుకు మంచి మార్గం ఇది. ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. టీఎన్‌క్యూటీలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులోనూ ప్రతిభ చూపితే కొలువు ఖాయం అవుతుంది. ఎంపికైన వారిని కాగ్నిటివ్ బిజినెస్ ఆపరేషన్‌‌స(సీబీఓ), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్‌‌స (బీఎఫ్‌ఎస్‌ఐ), లైఫ్ సెన్సైస్ విభాగాల్లో శిక్షణ అందించి శాశ్వత ప్రాతిపదికన నియమించుకుంటారు.
               ఈ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో 50 ప్రశ్నలతో ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీ (10 ప్రశ్నలు); రీడింగ్ కాంప్రహెన్షన్ (4 ప్రశ్నలు); లాజికల్ రీజనింగ్ (12 ప్రశ్నలు); క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (12 ప్రశ్నలు); డేటాఇంటర్‌ప్రిటేషన్ (12ప్రశ్నలు) విభాగాల్లో ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. అభ్యర్థుల్లోని విశ్లేషణ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షలో నిర్ణీత స్కోర్ పొందిన వారికి తదుపరి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులోనూ ప్రతిభ చాటి తుది జాబితాలో నిలిస్తే.. సంస్థకు చెందిన బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్; ఫైనాన్షియల్ సర్వీసెస్; ట్రావెల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ; ప్రీ సేల్స్; లైఫ్ సెన్సైస్ అండ్ హెల్త్‌కేర్; మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సెన్సైస్; టెలికం తదితర విభాగాల్లో ఎంట్రీ లెవల్‌లో ఉద్యోగం సొంతమవుతుంది.
  వివరాలకు వెబ్‌సైట్: https://www.tcs.com/careers/tcsfutureforwardcareersdrive2020
  విప్రో :
  నేషనల్ లెవల్ టాలెంట్ హంట్ :

  ప్రముఖ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ సంస్థ విప్రో టెక్నాలజీస్.. ఎలైట్ ఎన్‌టీహెచ్ పేరుతో ఆన్‌లైన్ టెస్టు నిర్వహిస్తోంది. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు. పదో తరగతి నుంచి బీటెక్ వరకు 60 శాతం మార్కులు సాధించాలి. ఈ పరీక్షలో విజయం సాధించి.. తర్వాత దశల్లో నిర్వహించే టెక్నికల్, హెచ్‌ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలలో నెగ్గిన వారికి ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా రూ.3.5 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ లభిస్తుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా కంపెనీలో అడుగుపెట్టిన అభ్యర్థులు.. ఆ తర్వాత సంస్థ ‘టర్బో ఛాలెంజ్’ పేరుతో నిర్వహించే కోడింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే వేతనం రూ. 3.5 లక్షల నుంచి రూ. 6.5 లక్షలకు పెంచుతారు.
               ఇందులో ఆప్టిట్యూట్ టెస్ట్, రిటెన్ కమ్యూనికేషన్ టెస్ట్, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్.. ఇలా మొత్తం మూడు విభాగాల్లో పరీక్ష జరుగుతుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్(వెర్బల్) ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. రిటెన్ కమ్యూనికేషన్ టెస్ట్‌లో ఎస్సే రైటింగ్ టెస్ట్ ఉంటుంది. నిర్దిష్ట అంశంపై వ్యాసం రాయాల్సి ఉంటుంది. అలాగే ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్‌లో కోడింగ్‌కు సంబంధించి రెండు ప్రోగ్రామ్‌లు రాయాలి. మొత్తం మూడు విభాగాలకు కలిపి పరీక్ష సమయం 140 నిమిషాలు.
  వివరాలకు వెబ్‌సైట్: https://careers.wipro.com

  ఐబీఎం ఆఫ్-క్యాంపస్ డ్రైవ్:
  ఐబీఎం ఫ్రెషర్స్ నియామకానికి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్‌ను నిర్వహిస్తోంది. దీనిద్వారా ఎంట్రీ లెవల్‌లో అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ పోస్టుల్లో నియామకాలు చేపడుతోంది. ఇందుకోసం ఆన్‌లైన్ టెస్ట్‌లను నిర్వహిస్తోంది. బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసుకునే విద్యార్థులు అర్హులు. అదే విధంగా 2018, 2019 సంవత్సరాల్లో ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో కాగ్నిటివ్ ఎబిలిటీ గేమ్స్, లెర్నింగ్ ఎబిలిటీ అసెస్‌మెంట్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్, కోడింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కొలువు ఖరారు చేసుకున్న వారికి రూ. నాలుగు లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.
  వివరాలకు వెబ్‌సైట్https://www.ibm.com/in-en

  ఇన్ఫోసిస్ టెస్ట్:
  ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్.. ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ పేరుతోబీటెక్ ఫ్రెషర్స్‌కు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తోంది. బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ /ఎమ్మెస్సీ/ఎంసీఏ.. విద్యార్థులు అర్హులు. కళాశాలలను మూడు గ్రేడ్(ఏ, బీ, సీ)లుగా వర్గీకరించి.. ఏ గ్రేడ్ కాలేజ్‌లకు ఒక విధమైన ఎంపిక ప్రక్రియ;బీ,సీ గ్రేడ్ కాలేజీలకు ఇంకో విధమైన ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తోంది. ఏ-గ్రేడ్ కళాశాలల విద్యార్థులకు రాత పరీక్ష, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. బీ,సీ-గ్రేడ్ కళాశాలల విద్యార్థులకు రాత పరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిల్లో ప్రతిభ చూపిన వారికి సంస్థలో ఎంట్రీ లెవల్ కొలువులను ఖరారు చేస్తోంది.
            రాత పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ (15 ప్రశ్నలు), లాజికల్ ఎబిలిటీ(10 ప్రశ్నలు), ఇంగ్లిష్ (40 ప్రశ్నలు) విభాగాలపై పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత దశలో టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల కంప్యూటర్ లాంగ్వేజ్ స్కిల్స్, కోడింగ్ నైపుణ్యాలు, జావా తదితర టెక్నికల్ అంశాలపై ప్రతిభను పరీక్షిస్తారు. హెచ్‌ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలో అభ్యర్థులకు ఉద్యోగం పట్ల ఉన్న ఆసక్తి, వ్యక్తిగత నైపుణ్యాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌ను పరిశీలిస్తారు.
  వివరాలకు వెబ్‌సైట్https://infytq.infosys.com

  సీటీఎస్ ఆఫ్-క్యాంపస్ టెస్ట్:కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (సీటీఎస్) ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ పేరుతో ఆన్‌లైన్ టెస్టు నిర్వహిస్తోంది. బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా అంతకుముందు రెండేళ్లలో ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తుకు అర్హులు. సదరు కోర్సుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. మొత్తం మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అవి.. ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ రౌండ్, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో నిర్దిష్ట స్కోర్ సాధించిన అభ్యర్థులకు తర్వాత దశలో టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూ జరుగుతుంది.ఇందులోనూ ప్రతిభ చూపిన వారికి చివరగా హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది.
  వివరాలకు వెబ్‌సైట్: https://careers.cognizant.com

  ప్రతిభను ప్రోత్సహించేందుకే :
  ఆన్‌లైన్ టెస్ట్‌లు నిర్వహించి ఆఫ్-క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ చేపట్టడానికి కారణం.. యంగ్ టాలెంట్ ఎక్కడ ఉన్నా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశమే. చాలామంది విద్యార్థులకు తమలో ప్రతిభ ఉన్నప్పటికీ.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ లేని కారణంగా అవకాశాలు అందుకోలేకపోతున్నారు. జాబ్ మార్కెట్‌లోకి ఉద్యో గాన్వేషణలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఆన్‌లైన్ టెస్ట్‌లు ఉపయోగపడతాయి.

పొలిటికల్ సైన్స్ విద్యార్థుల కెరీర్‌కు మార్గాలు…

పొలిటికల్ సైన్స్‌కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటోలను పొలిటికల్ సైన్స్‌కు ఆద్యులుగా చెబుతారు. అరిస్టాటిల్‌ను రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. ఆధునిక పొలిటికల్ సైన్స్ మాత్రం 19వ శతాబ్దంలో ఒక అకడెమిక్ సబ్జెక్టుగా రూపుదిద్దుకుంది.
Career guidance
మన దేశంలో బీఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు కోర్సులో భాగంగా రాజ్యాంగం, రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం గురించి అధ్యయనం చేస్తారు. వీటితోపాటు ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సమస్యలు, యుద్ధాలు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వంటి అంశాలను పొలిటికల్ సైన్స్ విద్యార్థులు అభ్యసిస్తారు. త్వరలో బీఏ పొలిటికల్ సైన్స్ కోర్సును పూర్తిచేసుకోనున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న కెరీర్ మార్గాల గురించి తెలుసుకుందాం…
 
సివిల్ సర్వీసెస్:
బీఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు కోర్సులో చేరినప్పటి నుంచి సివిల్ సర్వీసు పరీక్షలతోపాటు, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు నిర్వహించే గ్రూప్స్ పరీక్షలు రాయాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. పొలిటికల్ సైన్స్ విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ పరీక్షల ప్రిలిమ్స్, మెయిన్‌లో ఉండే జనరల్ స్టడీస్ అంశాలపై త్వరగా పట్టుసాధించగలరు. తద్వారా మిగతా అభ్యర్థుల కంటే వీరు పోటీలో ముందు నిలిచే అవకాశం ఉంటుంది. వీరు సివిల్స్, గ్రూప్స్‌లో విజేత లుగా నిలవడం ద్వారా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో ఉజ్వల కెరీర్, ఉద్యోగ భద్రతకు అవకాశం లభిస్తుంది.
జర్నలిజం :
{పస్తుతం యువతకు ఆకర్షణీయ వేతనాలతో విస్తృతంగా అవకాశాలు కల్పిస్తున్న రంగం మీడియా. వార్తా పత్రికలతోపాటు ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా రోజు రోజుకూ విస్తరిస్తుండటంతో మీడియా ఉద్యోగాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. బీఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు సమాజంలోని సమస్యలను అవగాహన చేసుకోవడంతోపాటు సునిశితంగా విశ్లేషించే నైపుణ్యం కలిగి ఉంటారు. మీడియాలో ప్రచురిస్తున్న, ప్రసారం అవుతున్న వార్తలు, వార్తా కథనాల్లో ఎక్కువగా రాజకీయాలు, సామాజిక సమస్యలకు సంబంధించినే. కాబట్టి పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు జర్నలిజం ఉత్తమ కెరీర్‌గా చెప్పొచ్చు. పొలిటికల్ సైన్స్‌తో రిపోర్టర్లు, సబ్‌ఎడిటర్లు, న్యూస్ రీడర్లు, యాంకర్లుగా రాణించే అవకాశముంది.
టీచింగ్ :
బీఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులు ఆసక్తి ఉంటే బోధన రంగంలోనూ ప్రవేశించొచ్చు. స్కూల్ స్థాయిలో, కాలేజీలో, యూనివర్సిటీల్లో రాజనీతి శాస్త్రం బోధించే వారికి డిమాండ్ ఉంది. పాఠశాల స్థాయిలో టీచర్‌గా కెరీర్ ప్రారంభించేందుకు బీఏ పొలిటికల్ సైన్స్ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో లెక్చరర్‌గా చేరేందుకు బీఏ తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్, యూజీసీ నెట్ అర్హత, ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి అర్హతలు ఉండాలి.
సోషల్ వర్‌‌క :
రాజకీయాల్లో చేరకుండా, సివిల్ సర్వీసు ఉద్యోగం లేకుండా.. సమాజ సేవకు సరైన మార్గంగా నిలుస్తోంది సోషల్ వర్‌‌క. పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లు ఎన్‌జీవోల(నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్) ద్వారా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల ద్వారా సమాజ సేవలో పాల్గొనవచ్చు. తద్వారా అటు సంతృప్తితోపాటు ఇటు ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకునే వీలుంది. బీఏ పొలిటికల్ సైన్స్ తర్వాత ఎంఏ సోషల్ వర్క్ పూర్తి చేసుకుంటే.. సమాజ సేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం లభిస్తుంది. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్, అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ వంటి సంస్థలు అందిస్తున్న కోర్సులు సోషల్ సర్వీస్ కెరీర్‌కు ఉపయుక్తమని చెప్పొచ్చు.
పొలిటికల్ సైంటిస్ట్ :
బీఏ పొలిటికల్ సైన్స్ అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో మార్గం… పొలిటికల్ సైంటిస్ట్. వీరు ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలు.. సమాజంపై చూపే ప్రభావాన్ని వివిధ కోణాల్లో లోతుగా అధ్యయనం చేస్తారు. అందుకే దేశంలోని అనేక సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థలు సైతం పొలిటికల్ సైంటిస్ట్‌ల సేవలు కోరుతున్నాయి. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ కోసం బీఏ పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లు ప్రయత్నించొచ్చు. ఆ అనుభవంతో వివిధ అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.

డేటాసైన్స్

కళ్లు చెదిరే ప్యాకేజీలతో…ఈ ఏడాదిలో 1.5 లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు!

కళ్లు చెదిరే ప్యాకేజీలతో…ఈ ఏడాదిలో 1.5 లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు!

ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో మంచి ఉద్యోగం అందుకోవాలంటే.. ఏ కోర్సులో చేరాలి..ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి.. ఏ విభాగంలో ఉద్యోగావకాశాలెక్కువ?! ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానమే.. డేటాసైన్స్! 2020లో డేటాసైన్స్ విభాగంలో అదిరిపోయే అవకాశాలు లభిస్తాయని అంచనా..!
Career guidance ఇటీవల కాలంలో.. ఈ రంగం.. ఆ రంగం.. అనే తేడా లేకుండా అన్నింటా డేటాసైన్స్ దూసుకుపోతోంది. ఇదే విషయం పలు సర్వేల్లో స్పష్టమైంది. ఇప్పటికే ఎమర్జింగ్ కెరీర్‌గా వెలుగొందుతున్న డేటాసైన్స్.. 2020లో మరింత హాట్‌ఫేవరెట్‌గా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. డేటాసైన్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..

కళ్లు చెదిరే ప్యాకేజీలు :
డేటాసైన్స్.. దీన్నే డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ అని కూడా పిలుస్తారు. ఈ విభాగంలో పనిచేసే నిపుణులను డేటాసైంటిస్ట్‌లుగా పిలుస్తారు. డేటాసైన్స్ నిపుణులకు కళ్లు చెదిరే ప్యాకేజీలు లభిస్తున్నాయి. 2019లో డేటాసైంటిస్టులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో సగటున రూ.13.56 లక్షల ప్యాకేజీ లభించింది. మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో సగటున రూ.11.8 లక్షల వేతనం, హెల్త్‌కేర్‌లో సగటున రూ.11.8 లక్షల వేతనం అందింది. ప్రస్తుతం దేశంలో డేటాసైన్స్ విభాగం మానవ వనరుల కొరత ఎదుర్కొంటోంది. 2020లో కొత్తగా 1.5లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య 62 శాతం అధికం. ఉద్యోగాల కల్పనకు సంబంధించి బీఎఫ్‌ఎస్‌ఐ రంగంముందు వరుసలో నిలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో తయారీ, ఆరోగ్యం, ఐటీ, ఈ-కామర్స్ రంగాలు నిలవనున్నాయి. తాజాగా ఈడీ-టెక్ నిర్వహించిన సర్వేలో బీఎఫ్‌ఎస్‌ఐ రంగం అత్యధిక వేతనాలు అందిస్తున్నట్లు వెల్లడైంది.

2020 డేటాసైన్స్‌దే…
ప్రస్తుతం ఏ విభాగం తీసుకున్నా.. డేటా భారీగా ఉత్పత్తి అవుతోంది. వ్యాపారం, సేవల విభాగాల్లో నిమగ్నమైన కంపెనీలకు అవసరమైన డేటాను సేకరించడం, విశ్లేషించడం కష్టంగా మారుతోంది. దీంతో ఆయా కంపెనీలకు డేటాసైన్స్ నిపుణుల అవసరం తప్పనిసరిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో డేటాసైన్స్ నిపుణులకు 2020 సంవత్సరం ఆశాజనకంగా ఉండనుందనే వార్తలు ఔత్సాహికులకు ఉత్సాహానిస్తున్నాయి. దేశంలో డేటాసైన్స్ నిపుణులకు భారీ డిమాండ్ నెలకొంది. అర్హులైన అభ్యర్థులు లేనికారణంగా 2019లో ఏకంగా 97,000 కొలువులు ఖాళీగా మిగిలిపోయాయి. కాబట్టి ఇప్పటికే డేటాసైన్స్ రంగంలో ఉన్నవారితోపాటు కొత్తగా ఈ రంగంలో ప్రవేశించాలనుకొనే వారు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకొనే అవకాశం ఉంది.

కావాల్సిన నైపుణ్యాలు ఇవే..
డేటాసైన్స్ అభ్యర్థులకు తెలుసుకోవాలనే తృష్ణ, కష్టపడే తత్వం ఉండాలి. అదే విధంగా నూతన టెక్నాలజీలు, అల్గారిథమ్స్‌పై ఆసక్తి పెంచుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఉన్న వారు డేటాసైన్స్‌లో రాణిస్తారు. మ్యాథ్స్‌లో పట్టు, కోడింగ్‌పై అవగాహన పెంచుకోవడం డేటాసైన్స్ కొలువుకు చాలాఅవసరం. ఇందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే రాణించగలరనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. అనేకమంది నాన్ ఇంజనీరింగ్ నేపథ్యంతోనూ డేటాసైన్స్‌లో ప్రతిభ చూపుతున్నారు.

అగ్రగామి భారత్ :మ్యాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, రిటైల్, టెలికం, ఆయిల్ అండ్ గ్యాస్, ఎయిర్‌లైన్, ఇ-కామర్స్… ఇలా అన్ని రంగాల్లో సంస్థల నిర్వహణకు డేటా కీలకంగా మారింది. దీంతో సదరు కంపెనీలు డేటా బృందాలను పటిష్టం చేయడంపై దృష్టిపెట్టాయి. ప్రస్తుతం డేటాసైన్స్‌లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా కొనసాగుతోంది. మన దేశంలో కోడింగ్ పరిజ్ఞానం కలిగిన యువత పెద్ద సంఖ్యలో ఉండటం వల్లే ఇది సాధ్యమైంది.

కొలువులు ఇక్కడ..?
ప్రముఖ కంపెనీలన్నీ డేటాసైన్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. వాటిలో కొన్ని…
1. యాక్సెంచెర్
2. ఆటోస్
3. ఏంజెల్ బ్రోకింగ్
4. హెచ్‌డీఎఫ్‌సీ
5. డెలాయిట్
6. షాదీ.కామ్
7. క్రెడిట్ విద్య
8. ఐబీఎం
9. ఆదిత్య బిర్లా
10. ఈగెన్ టెక్నాలజీస్
11. డేటా ఫార్చూన్
12. విజ్‌మైండ్స్
13. ఇన్ఫోటెక్ బ వాల్యూడెరైక్ట్.

కోర్సులు ఇవే… కోర్సులు ఇవే…

 • రెగ్యులర్ కోర్సులతో మూక్స్ విధానంలోనూ డేటాసైన్స్ కోర్సులు పూర్తి చేయొచ్చు. ఆన్‌లైన్ విధానంలో కోర్సెరా, ఈడీఎక్స్, ఉడెమీ, ఎంయూనివర్సిటీ తదితర వేదికలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు పలు ప్రయివేటు ఇన్‌స్టిట్యూట్‌లు డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను అందిస్తున్నాయి.
 • జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బిజినెస్, మార్కెట్ సంస్థల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో.. డేటాసైన్స్ నిపుణులు, రీసెర్చర్ల అవసరం పెరుగుతోంది. ఐఐటీలు సైతం బీటెక్‌లో డేటాసైన్స్ స్పెషలైజేషన్‌ను ప్రారంభించాయి.
 • డేటాసైన్స్‌కు సంబంధించి ప్రాథమిక స్థాయిలో సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌లో మ్యాథ్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివిన సైన్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటిలో చేరవచ్చు. అలాగే మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌తో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు డేటాసైన్స్ పీజీ డిప్లొమా కోర్సులో చేరేందుకు అర్హులు.
 • ఎంపీసీ గ్రూపుతో ఇంటర్ పూర్తి చేసిన వారు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సులో చేరవచ్చు. బీఎస్సీ(మ్యాథ్స్), బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ సంబంధిత) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు రెండేళ్ల వ్యవధిలోని ఎమ్మెస్సీ బిగ్ డేటా అనలిటిక్స్‌లో చేరేందుకు అర్హులు.
 
కోర్సులు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు ఇవే..:1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్-కేరళ(ఐఐటీఎంకే)
2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)- బెంగళూరు
3. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ
4. ఐఐటీ హైదరాబాద్
5. ఐఐఐటీ ఢిల్లీ
6. ఐఐటీ ఖరగ్‌పూర్
7. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీ-డాక్).
సవాళ్లు..

 • డొమైన్ నాలెడ్జ్‌తోపాటు అనుబంధ నైపుణ్యాలైన మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, పైథాన్, ఎస్‌క్యూఎల్, ఎస్‌ఏఎస్, బిగ్‌డేటా టూల్స్‌పై పట్టున్న వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అభ్యర్థులు ఆయా నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడం మేలు.
 • డేటాసైంటిస్టులకు డిమాండ్ పెరుగుతున్నా.. దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లు ఆ స్థాయిలో కోర్సులు నిర్వహించడం లేదు. అంతేకాకుండా డేటాసైన్స్ డొమైన్‌లో అర్హత కలిగిన ఫ్యాకల్టీ కొరత ఎక్కువగా ఉంది.
 • ప్రస్తుతం డేటాసైన్స్ ఔత్సాహికుల్లో కనిపిస్తున్న ప్రధాన లోపం మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌ను సరిగ్గా అనువర్తించలేకపోవడం. సింటాక్స్ స్థాయిలో మెషిన్‌లెర్నింగ్ నేర్చుకొని మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌పై దృష్టిపెట్టకపోవడంతో ఈ సమస్య వస్తోంది. కాబట్టి అభ్యర్థులు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌పై దృష్టిసారించాలి.

సైన్స్‌ పరిశోధనల కోర్సులు

నేడు హాట్‌ కెరీర్‌లుగా నిలుస్తున్న ఇంజనీరింగ్, ఐటీ రంగాలకు మూలం సైన్స్‌. పరిశోధన రంగానికి ఆయువు పట్టు సైన్స్‌. ఉద్యోగాల కల్పనలో సైన్స్‌ కోర్సులది ఎప్పుడూ ముందు వరుసే! సైన్స్‌ పరిశోధనలతోనే ఆవిష్కరణలు సాధ్యమవుతాయి.
Edu news

జాతీయంగా, అంతర్జాతీయంగా సైన్స్‌ పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని టాప్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో చదివితే.. ఉజ్వల కెరీర్‌కు ఎర్రతివాచీ పరిచినట్లే! ఈ నేపథ్యంలో దేశంలోని టాప్‌ సైన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, అవి అందిస్తున్న కోర్సులు, ప్రవేశ ప్రక్రియలపై ప్రత్యేక కథనం…
ఐఐఎస్సీ
సైన్స్‌ విద్య, పరిశోధనలకు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) తలమానికంగా నిలుస్తోంది. ఓ వైపు సైన్స్‌లో వినూత్న కోర్సులు అందిస్తూనే.. మరోవైపు పరిశోధనల్లోనూ దూసుకెళ్తోంది. దీంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి ముందు వరుసలో నిలుస్తోంది.
కోర్సులు:
అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్, పోస్టుగ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్స్, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌.
చిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(రీసెర్చ్‌): ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు ఇందులో చేరేందుకు అర్హులు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు అదనంగా బయాలజీ, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌లను చదవిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పరీక్షలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. కోర్సుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి–ఏప్రిల్‌ మధ్య జరుగుతుంది.

పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులు:
పీజీ స్థాయిలో మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంటెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్, మాస్టర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, ఎంటెక్‌ (స్పాన్సర్డ్‌).. కోర్సులు అందిస్తోంది. –బీటెక్‌/బీఈ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్‌ గేట్‌ స్కోరు కలిగిన అభ్యర్థులు ఎంటెక్‌లో ప్రవేశాలకు అర్హులు. బీఈ/బీటెక్‌/ బీడీఈఎస్‌/బీఆర్క్‌ ఉత్తీర్ణత, వ్యాలిడ్‌ గేట్, సీడ్‌ స్కోరు కలిగిన అభ్యర్థులు మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పీజీ రీసెర్చ్‌ ప్రోగ్రామ్స్‌:
ఐఐఎస్సీ బెంగళూరు ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌లో సైతం ప్రవేశం కల్పిస్తోంది. ఇందులో చేరేందుకు జామ్‌ స్కోర్‌ తప్పనిసరి. జామ్‌లో మ్యాథ్స్, మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌ పేపర్‌లో క్వాలిఫై అయిన బీఈ/బీటెక్‌ అభ్యర్థులు మ్యాథమెటికల్‌ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
జామ్‌లో బయోటెక్నాలజీ పేపర్‌లో క్వాలిఫై అయిన బీఈ/బీటెక్‌ అభ్యర్థులు బయోలాజికల్‌ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
జెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్‌ సైన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంటెక్‌(రీసెర్చ్‌)/పీహెచ్‌డీ, –ఎక్స్‌టర్నల్‌ రిజిస్ట్రేషన్‌ ప్రోగ్రామ్‌(ఈఆర్‌పీ) సైతం అందుబాటులో ఉన్నాయి.
వెబ్‌సైట్‌: www.iisc.ac.in

నైపర్‌
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైపర్‌).. ఫార్మా విద్య, పరిశోధనలకు ప్రసిద్ధిగాంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు నైపర్‌లు ఉన్నాయి. ఇవి పలు స్పెషలైజేషన్స్‌తో పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. నైపర్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు.
అర్హతలు:
60 శాతం మార్కులతో బీఫార్మసీతోపాటు వ్యాలిడ్‌ జీప్యాట్‌ స్కోరు లేదా 6.75 సీజీపీఏ(10పాయింట్ల స్కేల్‌లో) ఉండాలి. ఫైనలియర్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు నైపర్‌ మాస్టర్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక:
నైపర్‌ జేఈఈ మెరిట్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి ఎంఎస్‌(ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్‌(ఫార్మా) కోర్సుల్లో ప్రవేశాలను ఖరారు చేస్తారు. ఎంబీఏ ఫార్మా(హైదరాబాద్, ఎస్‌.ఎ.ఎస్‌.నగర్‌) సీట్లను ఎంట్రన్స్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలలో పొందిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. ఎంట్రన్స్‌ టెస్టుకు 85శాతం, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
పరీక్ష విధానం:
మాస్టర్స్, ఎంబీఏ(ఫార్మా) కోర్సులకు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నలు.. బీఫార్మసీ, ఎంఎస్సీ స్థాయిలో ఉంటాయి.
పీహెచ్‌డీ
సీఎస్‌ఐఆర్‌/యూజీసీ/ఐసీఎంఆర్‌/డీబీటీ/ డీఎస్‌టీ నెట్‌–జేఆర్‌ఎఫ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం:
ప్రవేశ పరీక్షను 85 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 170 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌లో కెమికల్‌ సైన్సెస్, బయలాజికల్‌ సైన్సెస్, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగాలు ఉంటాయి. ప్రశ్నలను ఎంఎస్‌(ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్‌(ఫార్మా), ఎంవీఎస్‌సీ, ఎండీ, ఎంఎస్సీ సిలబస్‌ నుంచి అడుగుతారు. వీటితోపాటు ప్రతి విభాగంలో ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
వెబ్‌సైట్‌www.niperhyd.ac.in
ఐసీటీ
కెమికల్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ టెక్నాలజీ, అప్లయిడ్‌ కెమిస్ట్రీ, ఫార్మసీ, బయోటెక్నాలజీ అండ్‌ బయోప్రాసెసింగ్‌ విభాగాల్లో ముంబైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐసీటీ) అత్యుత్తమంగా నిలుస్తోంది. కెమికల్‌ ఇంజనీరింగ్‌తోపాటు ఏడు స్పెషలైజేషన్స్‌లో బీటెక్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. వీటిలో 70 శాతం సీట్లను మహారాష్ట్ర విద్యార్థులకు, 30 శాతం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు.
కోర్సులు ఇవే:
మాస్టర్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజనీరింగ్,–మాస్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ(ఎంఫార్మసీ) ∙మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంటెక్‌) ∙ఎంఈ(ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌) ∙ఎంఎస్సీ(కెమిస్ట్రీ, ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, టెక్స్‌టైల్‌ కెమిస్ట్రీ), –పీహెచ్‌డీ, ∙పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ కెమికల్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌.
ప్రవేశాలు:
బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో సీట్లను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు ద్వారా భర్తీ చేస్తారు. గేట్‌/జీప్యాట్‌ స్కోరు ఆధారంగా మాస్టర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.ictmumbai.edu.in
ఐసర్‌
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐసర్‌లు) సైన్సు విద్య, పరిశోధనల్లో జాతీయ ప్రాధాన్య సంస్థలుగా వెలుగొందుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు ఐసర్‌లు ఉన్నాయి. వీటిలో ప్రవేశం పొందితే సైన్సు పరిశోధన, బోధన–ఇతర అనుబంధ రంగాల్లో చక్కటి కెరీర్‌ సొంతమవడం ఖాయం.
కోర్సులు:
బీఎస్‌–ఎంఎస్‌(డ్యూయల్‌ డిగ్రీ): ఈ కోర్సును సైన్స్‌ పట్ల ఆసక్తి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఏడు క్యాంపస్‌లలో 1400కుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. బయలాజికల్‌ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు వ్యవధి ఐదేళ్లు. సైన్సు గ్రూపుతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన వారు ప్రవేశాలకు అర్హులు.
బీఎస్‌ డిగ్రీ: ఐసర్‌ బోపాల్‌.. ఎకనామిక్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ సైన్సెస్‌లో నాలుగేళ్ల బీఎస్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇందులో ప్రవేశానికి ఇంటర్‌ లేదా తత్సమాన స్థాయిల్లో మ్యాథ్స్‌ను తప్పనిసరిగా చదివుండాలి. ఇంజనీరింగ్‌ విభాగంలో 60 సీట్లు, ఎకనామిక్స్‌ విభాగంలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రవేశాలు :ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వీటితోపాటు కేవీపీవై, జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ విధానాల్లోనూ ప్రవేశాలు పొందవచ్చు.
పరీక్ష విధానం:
పరీక్ష 60 ప్రశ్నలతో మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటుంది. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ నుంచి 15 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.
సిలబస్‌:
ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎన్‌సీఈఆర్‌టీ ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సర పుస్తకాలను చదవాలి.
ముఖ్యతేదీలు:
దరఖాస్తుకు చివరితేదీ: 30 ఏప్రిల్‌ 2020
హాల్‌టిక్కెట్లు జారీ: 18 మే 2020
ఐసర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌: 31 మే 2020
వెబ్‌సైట్‌: http://www.iiseradmission.in
సీసీఎంబీ
ఆధునిక జీవశాస్త్ర పరిశోధనలో హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) ప్రముఖంగా నిలుస్తోంది. సీసీఎంబీ… సెల్‌ బయాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, జెనిటిక్స్, డెవలప్‌మెంటల్‌ బయాలజీ, ప్లాంట్‌ మాలిక్యులర్‌ బయాలజీ, కన్జర్వేషన్‌ బయాలజీ, ఎకాలజీ, ప్రొటీన్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఫంక్షన్, బయాలజీ ఆఫ్‌ మైక్రోమాలిక్యూల్స్, బయాలజీ ఆఫ్‌ ఇన్ఫెక్షన్, ఎపిజెనిటిక్స్, క్రొమాటిన్‌ బయాలజీ అండ్‌ బయోఇన్ఫర్మాటిక్స్‌ స్పెషలైజేషన్స్‌లో పీహెచ్‌డీని అందిస్తోంది. ఏటా అక్టోబర్‌లో అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 సెంటర్లలో ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్‌www.ccmb.res.in
జేఎన్‌సీఏఎస్‌ఆర్‌
సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లలో ప్రపంచస్థాయి పరిశోధన, శిక్షణలను అందించేందుకు 1989లో జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌(జేఎన్‌సీఏఎస్‌ఆర్‌)ను స్థాపించారు. ప్రస్తుతం దాదాపు 300 మంది జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పీహెచ్‌డీ చేస్తున్నవారే కావడం గమనార్హం. పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, ఎంఎస్‌ ఇంజనీరింగ్‌/ఎంఎస్‌ రీసెర్చ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు గేట్‌/జెస్ట్‌/జీప్యాట్‌/యూజీసీ /సీఎస్‌ఐఆర్‌–నెట్‌ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో క్వాలిఫై అయ్యిండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వేసవి ప్రారంభంలో ఇంటర్వ్యూలు నిర్వహించి.. తుది ఎంపిక చేపడతారు. కొన్ని కోర్సుల్లో జనవరిలోనూ ప్రవేశాలు చేపడతారు. జేఎన్‌సీఏఎస్‌ఆర్‌లో పైకోర్సులతోపాటు కెమిస్ట్రీలో మాస్టర్స్‌ పోగ్రామ్‌ను సైతం ఆఫర్‌చేస్తోంది. కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు, వ్యాలిడ్‌ జామ్‌ స్కోర్‌ కలిగిన అభ్యర్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో నుంచి కొంత మందిని ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
వెబ్‌సైట్‌www.jncasr.ac.in
టీఐఎఫ్‌ఆర్‌
టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌).. టాటా ట్రస్ట్‌ సహకారంతో 1945లో ఏర్పాటైంది. దీని ప్రధాన క్యాంపస్‌ ముంబైలో ఉండగా.. పుణె, బెంగళూరు, హైదరాబాద్‌లలో సెంటర్స్‌ ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, కంప్యూటర్‌సైన్స్, సైన్స్‌ ఎడ్యుకేషన్‌లలో పరిశోధనలకు టీఐఎఫ్‌ఆర్‌ పేరుగాంచింది.
కోర్సులు:
నేచురల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ–పీహెచ్‌డీ, ఎంఎస్సీ కోర్సులను టీఐఎఫ్‌ఆర్‌ అందిస్తోంది. పీహెచ్‌డీ కోర్సు వ్యవధి ఐదేళ్లు, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ–పీహెచ్‌డీ ఆరేళ్లు, ఎంఎస్సీ రెండేళ్లుగా ఉంది. ఈ కోర్సుల్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు చేసుకున్నవారిలో టాప్‌ ఒకటిన్నర శాతం మందికే టీఐఎఫ్‌ఆర్‌లో ప్రవేశాలు లభిస్తుంటాయి. దీన్ని బట్టి టీఐఎఫ్‌ఆర్‌కు ఉన్న క్రేజ్‌ను అర్థంచేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌: https://www.tifr.res.in
సీఎంఐ
చెన్నై మ్యాథమెటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఐ) 1989లో ఏర్పాటైంది. మ్యాథ్స్‌ బోధన, పరిశోధనలో సీఎంఐకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. మ్యాథ్స్, కంప్యూటర్‌ సైన్స్‌లో సీఎంఐ పలు కోర్సులను అందిస్తోంది.
కోర్సులు:
బీఎస్సీ(హానర్స్‌) ఇన్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ∙బీఎస్సీ(హానర్స్‌) ఇన్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ ఫిజిక్స్‌ ∙ఎంఎస్సీ మ్యాథ్స్‌ ∙ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ ∙ఎంఎస్సీ డేటాసైన్స్, ∙పీహెచ్‌డీ (మ్యాథమె టిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఫిజిక్స్‌).
రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీహెచ్‌డీలో ప్రవేశాలకు జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎం ఫెలోషిప్‌కు ఎంపిక తదితరాలు తప్పనిసరి. ప్రస్తుతం సీఎంఐ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
దరఖాస్తు సమాచారం:
దరఖాస్తుకు చివరి తేదీ: 11 ఏప్రిల్‌ 2020
హాల్‌ టిక్కెట్లు జారీ: 1 మే 2020
ప్రవేశ పరీక్ష తేదీ: 15 మే 2020
వెబ్‌సైట్‌www.cmi.ac.in

మెరుగైన కెరీర్‌కు-బీఎస్సీ/బీకామ్/బీఏ

ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీలతో ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరని వాళ్లు సంప్రదాయ కోర్సులైన బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సుల్లో చేరి రాణించొచ్చు. డిగ్రీ తర్వాత ఎంఎస్సీ/ఎంకాం/ఎంఏలతో పాటు ఎంబీఏ, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ చేరొచ్చు. బీఎడ్ చేసి ఉపాధ్యాయ వృత్తిలోనూ రాణించొచ్చు. పీజీ తర్వాత పీహెచ్‌డీ చేస్తే బోధన, పరిశోధనా రంగాల్లో రాణించొచ్చు లేదంటే పోటీ పరీక్షల కోసం ప్రయత్నించొచ్చు.
కెరీర్ విత్ కామర్స్బీకామ్…
సీఈసీతో నేరుగా సంప్రదాయ బీకాంలో చేరిపోవచ్చు. ఇది మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సు. ఇతర డిగ్రీలతో పోల్చితే స్వయం ఉపాధి దిశగా మార్గం వేసే కోర్సు బీకాం. వ్యాపార లావాదేవీలు రోజురోజుకీ విస్తృతమవుతున్న తరుణంలో.. అకౌంటింగ్ కార్యకలాపాలు తప్పనిసరవుతున్నాయి. వీటి నిర్వహణకు కామర్స్ పట్టభద్రుల అవసరం తప్పనిసరి. ప్రతి కంపెనీకి అకౌంటెంట్ ల అవసరం ఉంటుంది. కాబట్టి బీకాం పూర్తిచేసిన వారికి అకౌంటెంట్ ఉద్యోగం ఖాయం. దాంతోపాటు ఇతర విభాగాల్లోనూ వుంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సీఈసీ పూర్తయ్యాక ఉపాధి చూసుకొని.. రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లే అవకాశం లేకపోతే డిస్టెన్‌‌సలో బీకాం పూర్తిచేయొచ్చు. అలాంటి వారికోసం మన రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు జాబ్ మార్కెట్‌లో బాగా డిమాండ్ ఉన్న బీకాం కంప్యూటర్‌‌సను సైతం అందిస్తున్నాయి.

 • ఆచార్య నాగార్జున వర్సిటీ-సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. బీకాం(కంప్యూట ర్స్)ను డిస్టెన్స్ విధానంలో అందిస్తోంది.
  అర్హత: ఇంటర్, లేదా తత్సమానం.
  వెబ్‌సైట్: www.anucde.com
 • ద్రవిడియన్ యూనివర్సిటీ-డెరైక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కుప్పం(చిత్తూరు జిల్లా) కూడా దూర విద్యావిధానంలో బీకాం (కంప్యూటర్స్) కోర్సుందిస్తోంది.
  అర్హత: ఇంటర్ లేదా తత్సమానం
  వెబ్‌సైట్: www.dravidianuniversity.ac.in
 • బీకాం చదువుతూ సీఏ, ఐసీడబ్ల్యుఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులనూ పూర్తిచేయొచ్చు.
 • బీకాం పూర్తై తర్వాత ఎంకాం, ఆ తర్వాత పీహెచ్‌డీ చేయొచ్చు. వ్యాపార సంస్థలు, బోధనా రంగాల్లో స్థిరపడొచ్చు.

మేనేజ్‌మెంట్ కోర్సులు:
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనేక యూనివర్సిటీలు ఇంటర్ అర్హతతో గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీబీఎం, బీబీఏ కోర్సులను అందిస్తున్నాయి. బీబీఎం అంటే.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్. బీబీఏ అంటే.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సంస్థల నిర్వహణలో కీలక పాత్ర పోషించే మేనేజ్‌మెంట్ విభాగాల్లో … ఈ కోర్సులు పూర్తి చేసిన వారి అవసరం ఎంతో ఉంటుంది. బీబీఎం, బీబీఏ పూర్తయ్యాక దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐఎంలతోపాటు వివిధ బిజినెస్ స్కూళ్లలో చేరేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్), మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్)లు రాయాలి. వీటిల్లో ర్యాంకు ఆధారంగా వివిధ బిజినెస్ స్కూళ్లలో అడ్మిషన్ లభిస్తుంది. మన రాష్ట్రంలో ఎంబీఏలో చేరేందుకు ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఐసెట్) రాయాలి.

ఇంటర్- ఎంపీసీ/బైపీసీఇంటర్ ఎంపీసీతో బీఎస్సీ ఆప్షన్స్…

 • మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
 • మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్
 • మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్
 • మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్
 • మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్

ఎంఎస్సీ:
ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రంలో ఆయా యూనివర్సిటీలు నిర్వహించే పీజీ సెట్‌ల ద్వారా ఎంఎస్సీలో అడ్మిషన్ లభిస్తుంది. రెండేళ్ల ఎంఎస్సీ పూర్తయ్యాక టీచింగ్, లేదా రీసెర్చ్ రంగంవైపు మళ్లొచ్చు. పీహెచ్‌డీ పూర్తిచేస్తే ఈ రెండు రంగాల్లోనూ అత్యున్నతంగా రాణించొచ్చు.

ఎంబీఏ:బీఎస్సీ లేదా ఏదైనా డిగ్రీ చదివిన వాళ్లకు మరో ముఖ్య పీజీ ఆప్షన్ ఎంబీఏ. జాతీయ స్థాయి క్యాట్, మ్యాట్‌లే కాకుండా మన రాష్ట్రంలోనైతే ఐసెట్ రాసి ఎంబీఏ చేయొచ్చు. ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, తదితర విభాగాల్లో కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల్లో జాబ్స్ సొంతం చేసుకోవచ్చు.

ఎంసీఏ:రాష్ట్రంలో ఎంసీఏలో చేరేందుకు మార్గం.. ఐసెట్. ఐఐటీ-రూర్కీతోపాటు నిట్లలోనూ ఈ కోర్సు అందుబాటులో ఉంది. మూడేళ్ల ఎంసీఏ పూర్తిచేసుకోవడం ద్వారా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడొచ్చు.

బీఈడీ:బీఎస్సీ విద్యార్థులు టీచింగ్‌లో ప్రవేశించాలంటే.. బీఈడీ చేయడం ఉత్తమ మార్గం. ఇది ఏడాది కోర్సు. దీన్ని పూర్తిచేసుకున్నాక డీఎస్సీ రాసి స్కూల్ అసిస్టెంట్‌లుగా స్థిరపడొచ్చు.

మీడియా, మాస్ కమ్యూనికేషన్:డిగ్రీ పూర్తయ్యాక మీడియా, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో భారీ జీతాలతో ఉద్యోగం పొందొచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ:ఇంటర్మీడియెట్ ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థులు.. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో చేరొచ్చు. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా ఆయా వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ఆధారంగా వీటిలో చేరొచ్చు. ఐదేళ్ల కోర్సు వ్యవధిలో.. మొదటి మూడేళ్లు పూర్తయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ కూడా విద్యార్థుల చేతికందుతుండటం ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల ప్రత్యేకత.

బైపీసీ విద్యార్థులకు…బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, బయోఇన్ఫర్మాటిక్స్, కెమిస్ట్రీ…ఇలా భిన్న సబ్జెక్టులతో బీఎస్సీలో చేరొచ్చు.

బయోటెక్నాలజీ:బైపీసీ విద్యార్థులు గణితంలో బ్రిడ్‌‌జ కోర్సు ఉత్తీర్ణులైతే.. మన రాష్ర్టంలో బయోటెక్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులు. ఇవి దాదాపు ప్రైవేట్ కళాశాలల్లోనే ఉన్నాయి. ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో అతిస్వల్ప సంఖ్యలో సీట్లు ఉన్నాయి. ఇంటర్ బైపీసీ విద్యార్థులు డిగ్రీలో బయోటెక్నాలజీని ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇదే అంశంలో పీజీ చేయొచ్చు. ఢిల్లీలోని జేఎన్‌యూ బయోటెక్నాలజీలో పీజీ కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తుంది. దీనిద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు ప్రముఖ సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఎంఎస్సీ బయోటెక్ పూర్తిచేసి, పీహెచ్‌డీ చేస్తే ప్రముఖ పరిశోధన సంస్థల్లో మంచి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

బయోఇన్ఫర్మాటిక్స్:ఇందులో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు, డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి నైపుణ్యం, అనుభవాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ.50,000 వరకు జీతం లభిస్తుంది.

నానోటెక్నాలజీ:నానో టెక్నాలజీ.. మెడిసిన్, ఎలక్ట్రానిక్స్ శక్తి ఉత్పాదన, రోబోటిక్స్‌లో ఉపయోగపడుతుంది. నానో టెక్నాలజీలో డిగ్రీ, పీజీ కోర్సులు అందించే కేంద్రాలు: ఎంజైమ్ బయోసెన్సైస్- బెంగళూరు; ఏఐఎన్‌టీ- నోయిడా; యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జీవీకే బయో కాంప్లెక్స్- హైదరాబాద్, బిట్స్- పిలానీ క్యాంపస్.

లెక్చరర్‌‌సగా:బోటనీ, జువాలజీ, జెనెటిక్స్…ఇలా ఎందులోనైనా పీజీ పూర్తయ్యాక పీహెచ్‌డీ చేసి యూనివర్శిటీలు, పీజీ కళాశాలల్లో లెక్చరర్‌‌స, రీడర్‌‌సగా, ప్రొఫెసర్‌‌సగా ఎదగొచ్చు.

సివిల్ సర్వీసెస్:డిగ్రీలో చదివిన సబ్జెక్టులను ఆప్షన్లుగా ఎంచుకొని సివిల్ సర్వీస్, ఐఎఫ్‌ఎస్‌లో మంచి ర్యాంకులు సాధించిన వారెందరో ఉన్నారు.

ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు
బీఏ-ఎంఏఇంటర్‌లో హెచ్‌ఈసీ పాసయ్యాక సంప్రదాయ కోర్సులవైపు మళ్లాలనుకుంటే.. డిగ్రీలో బీఏలో చేరొచ్చు. బీఏ పూర్తిచేసిన తర్వాత ఎకనామిక్స్, పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ… ఇలా బీఏలో తీసుకున్న ఆప్షన్లను బట్టి ఆయా సబ్జెక్టుల్లో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ వరకూ ఉన్నత విద్యను కొనసాగించొచ్చు. జాతీయ స్థాయిలో జేఎన్‌యూలో ఎంఏ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది.

ఎంఏ ఎకనామిక్స్:బీఏ తర్వాత జేఎన్‌యూలో, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎంఏ ఎకనమిక్స్ కోర్సు పూర్తిచేస్తే జాబ్ మార్కెట్‌లో మంచి అవకాశాలు దక్కించుకోవచ్చు. ఈ కోర్సులు పూర్తిచేయడం ద్వారా స్టాక్‌మార్కెట్ ఉద్యోగాలతోపాటు మీడియాలోనూ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. అకడెమిక్ రంగంపై ఆసక్తి ఉంటే… ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేసి అధ్యాపక వృత్తిలో ఉన్నతంగా రాణించొచ్చు.

బీఏ-ఎంబీఏబీఏ పూర్తయ్యాక బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరిపోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే అన్ని మేనేజ్‌మెంట్ పీజీ కోర్సులకూ బీఏ విద్యార్థులు అర్హులే.

బీఈడీగ్రాడ్యుయేషన్(బీఏ) తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేందుకు అవకాశం కల్పించే కోర్సు… బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ). ఈ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎడ్‌సెట్. ఎడ్‌సెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా బీఈడీలో ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించొచ్చు.

‘లా’ కోర్సులు:‘లా’… విద్యార్థుల క్రేజీ కోర్సుగా మారుతోంది. ప్రముఖ ‘లా’ కాలేజీల్లో విద్యనభ్యసించిన వారు హాట్ కేక్‌ల్లా అవకాశాలు సొంతం చేసుకోవడమే దానికి కారణం. లా నేడు బహుముఖ అవకాశాలు కల్పిస్తుండటం.. మన దేశంలో అంతర్జాతీయ స్థారుు ప్రమాణాలతో.. నేషనల్ లా స్కూల్, నల్సార్ వంటి లా స్కూల్స్ ఏర్పాటవడం కూడా అందుకు ప్రధాన కారణాలు. ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రవేశ పరీక్షల ద్వారా లా కోర్సులో చేరొచ్చు. వున రాష్ట్రంలో లాసెట్ ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు. జాతీయ స్థారుులోని పదకొండు లా స్కూల్స్ అత్యంత ఉన్నత ప్రమాణాలతో న్యాయవాద విద్యను అందిస్తున్నారుు. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (సీఎల్‌ఏటీ- క్లాట్)లో ర్యాం కు ఆధారంగా వీటిలో ప్రవేశం లభిస్తుంది.
వెబ్‌సైట్: www.clat.ac.in

బీబీఏ:ఆర్ట్స్ విద్యార్థులు బీబీఏ కోర్సులోనూ చేరొచ్చు. ఆ తర్వాత ఎంబీఏ చదువుకోవచ్చు.

జ్యుయలరీ డిజైన్ కోర్సులు:ప్లెర్ అకాడెమీ ఆఫ్ ఫ్యాషన్, ఢిల్లీ … జ్యుయలరీ డిజైనింగ్‌లో నాలుగేళ్ల వ్యవధితో బీఏ(ఆనర్స్) కోర్సును అందిస్తోంది. 50 శాతం మార్కులతో 10+2 పూర్తిచేసిన వారు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.pearlacademy.com

 • ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఢిల్లీ… జ్యుయలరీ డిజైనింగ్ డిప్లొమాను అందిస్తోంది. 10+2 పూర్తిచేసిన వారు అర్హులు.
  వెబ్‌సైట్: www.iiftindia.net
 • జ్యుయలరీ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, నోయిడా జ్యుయలరీ డిజైన్ అండ్ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా కోర్సు; ఏడాది వ్యవధి సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
  వెబ్‌సైట్: www.jdtiindia.com

మీడియా, మాస్ కమ్యూనికేషన్
డిగ్రీ పూర్తయ్యాక మీడియా, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తిచేసుకోవడం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక అవకాశాలను భారీ జీతాలతో సొంతం చేసుకోవచ్చు.

హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్హెచ్‌ఈసీ తర్వాత బీఏతో విస్తృత ఉద్యోగావకాశాలు కల్పించే హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరొచ్చు. దేశంలో, రాష్ట్రంలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సులను అందిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్(ఎంబీఏ) కోర్సులో…క్యాట్/మ్యాట్/ఐసెట్‌లలో స్కోర్, గ్రూప్‌డిస్కషన్ ఆధారంగా ప్రవేశం పొందొచ్చు.
వెబ్‌సైట్: www.nithm.ac.in

ఫైన్ ఆర్ట్స్10+2 అర్హతతో.. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్.. పెయింటింగ్ స్పెషలైజేషన్‌తో అందించే బీఎఫ్‌ఏలో చేరొచ్చు.
వెబ్‌సైట్: www.jnafau.ac.in

ఆంధ్రాయూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, విశాఖపట్నం… పెయింటింగ్ స్పెషలైజేషన్స్‌తో బీఎఫ్‌ఏను అందిస్తోంది. 10+2 అర్హతతో ఆంధ్రా యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏయూసెట్) ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

పోటీ పరీక్షలు:నియామక పరీక్షల్లో బీఏ విద్యార్థులు ముందంజలో ఉంటారు. దీనికి కారణం సమకాలీన, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై వీరికి పట్టుండటమే. సమాజ స్థితిగతులను అవగతం చేసుకునే అవకాశం వీరికి బాగా దక్కుతుంది. బీఏనే కదా.. పరీక్ష ముందు చదివితే పాసవుతాంలే..’ అనుకునే ధోరణిని విడనాడి.. సివిల్స్, గ్రూప్స్‌ను టార్గెట్‌గా చేసుకుంటే వుంచి అవకాశాలు సొంతం చేసుకోవ చ్చు.
వెబ్‌సైట్లు: www.upsc.gov.inwww.apspsc.gov.in