After M.P.C

ఇంజనీరింగ్ vs   డిగ్రీ పస్తుతం బీటెక్, బ్యాచిలర్ డిగ్రీలో ఏది బెస్ట్ అంటే.. జాబ్ మార్కెట్ కోణంలో బీటెక్‌కే తొలి ప్రాధాన్యం అని చెప్పొచ్చు. బీటెక్‌లో మీరు ఎంపిక చేసుకునే బ్రాంచ్ కూడా కెరీర్ పరంగా కీలకం. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. బీటెక్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచ్‌ల విద్యార్థులకు జాబ్ మార్కెట్‌లో కొంత ప్రాధాన్యం ఉంటోంది. ఈ బ్రాంచ్‌ల విద్యార్థులు అకడమిక్స్‌కే పరిమితం కాకుండా.. తాజా ట్రెండ్స్‌కు అనుగుణంగా నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. బీటెక్ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3-డి డిజైన్ ప్రింటింగ్ తదితర అంశాలపై అవగాహన పొందాలి. ఇలాంటి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. బీటెక్‌లో ఏ బ్రాంచ్‌లో చేరినా ఉద్యోగం పొందడం సులభమే. ఈ విద్యా సంవత్సరంలో బీటెక్‌లో చేరాలనుకుంటే.. సీఎస్‌ఈ…

Read More

గ్రేట్ కెరీర్‌కు కేరాఫ్ ఎంపీసీ

జియాలజిస్టుగా విలువైన గనులను కనుక్కోవాలనుందా? ఐఫోన్ సృష్టికర్త స్టీవ్‌జాబ్స్‌ను మించిన గుర్తింపును కోరుకుంటున్నారా? ప్రపంచంలోనే అపర కుబేరుడిగా కీర్తికెక్కిన బిల్‌గేట్స్‌లా పేరు తెచ్చుకోవాలనుందా? లేదా సివి రామన్‌లా నోబెల్ బహుమతిని పొందాలనుందా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ‘ఎస్’ అయితే మీరు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూపును ఎంచుకోవాలి.పదో తరగతి తర్వాత… ఏంటి? అనే ప్రశ్న ఎదురైతే ఎన్నో కోర్సులు.. ఐటీఐ, పాలిటెక్నిక్, హోటల్ మేనేజ్‌మెంట్, సెట్విన్ కోర్సులు, స్వయం ఉపాధినందించే వివిధ కోర్సులు పదో తరగతి పాసైన విద్యార్థికి స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కువ మంది చూపు మాత్రం ఇంటర్మీడియెట్‌లో చేరి ఎంపీసీ గ్రూప్‌ను ఎంచుకోవడం. ఈ గ్రూప్‌కు ఉన్నటువంటి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మరే గ్రూప్‌కు లేవంటే అతిశయోక్తి కాదు! ఈ నేపథ్యంలో ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ను తీసుకున్న విద్యార్థికి ఉండే అవకాశాల విశ్లేషణ..ఎంపీసీ గ్రూప్…

Read More