


We have requirements for Diploma / ITI Trainees. Interested can come to our Hyundai Factory for further process between 06th to 09th July 2020 at 8.00 AM.
You may refer your Friends / Relatives / Known persons by forwarding this message.
Location : Hyundai Motor India Limited, Irungattukottai, Sriperumbudur
Eligibility: Diploma & ITI
Stipend & Incentive: Diploma Rs. 17,500 & ITI Rs. 16,000
Facility: Uniform, Food, Transport Free & other training benefits
Documents required: All original certificates
Contact: 8 AM to 3 PM [04447105871 / 04447105056 / 04447105956 / 04447105118]
A & T Centre
Human Resources
ఐటీఐ
ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటీఐ)ని ఎంచుకోవడం ద్వారా విద్యార్థి పదోతరగతి తర్వాత ఒకటి, రెండేళ్ల కాలవ్యవధిలో సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. అదీ అతి తక్కువ వ్యయంతోనే. దీనివల్ల చిన్న వయసులోనే ఉపాధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే సాంకేతిక విద్యారంగంలోనే ఉన్నత స్థాయి కోర్సులూ చేయవచ్చు. టెన్త్ తర్వాత ఒకటి రెండేళ్ల పాటు కష్టపడి ఐటీఐ కోర్సులు చేస్తే, మంచి ఉపాధి అవకాశాలు ముంగిట్లో ఉంటాయి. ఏ కోర్సు చేయాలో తెలివిగా ఎంచుకోవడమే విద్యార్థుల వంతు.
కేంద్రప్రభుత్వ కార్మిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఐటీఐలను ప్రారంభించింది. నిరుద్యోగితను తగ్గించడం, మానవ వనరుల నైపుణ్యాలను పెంచి పరిశ్రమకు అందించడం దీని లక్ష్యాలు. క్రాఫ్ట్స్‌మెన్ ట్రైనింగ్ స్కీం (సీటీఎస్) కింద 1950లో ఐటీఐలను స్థాపించింది. 14-40 ఏళ్ల మధ్య వయస్కులు ఐటీఐల్లో శిక్షణ పొందడానికి అర్హులు. ఎక్కువ భాగం ట్రేడ్లలో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థికి కేంద్ర ప్రభుత్వ శ్రామిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రెయినింగ్ (ఎన్.సి.వి.టి.) సర్టిఫికెట్ అందిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉపాధి కల్పనలో ఈ సర్టిఫికెట్ ఉన్న విద్యార్థులకే ప్రాధాన్యమిస్తాయి.
సాంకేతిక నైపుణ్యాన్ని సాధించాలనుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది ఐటీఐలవైపే మొగ్గు చూపుతారు. ప్రస్తుతం ఆధునిక పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్సులను రూపొందించడంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. దీంతో బహుముఖ నైపుణ్యాలను పెంచుకునే అవకాశం విద్యార్థులకు లభిస్తోంది. ఏడాది, రెండేళ్ల కాలవ్యవధి ఉండే ఈ కోర్సులు (ట్రేడ్లు) పూర్తి చేస్తే స్వయం ఉపాధికి ఢోకా ఉండదు. కొన్ని రకాల కోర్సులకు వందశాతం ఉపాధి అవకాశాలు ఉండగా, మరి కొన్ని కోర్సుల వల్ల వచ్చే ఉద్యోగాలకు సీజనల్‌గా గిరాకీ ఉంటుంది. రాష్ట్రంలో 138 ఐటీఐలు (ప్రభుత్వ ఆధ్వర్యంలోనివి), 600 పైగా ఐటీసీలు (ప్రైవేటు రంగంలోనివి) ఉన్నాయి.
ట్రేడ్ ల వివరాలు
ఐటీఐల్లో ఇంజినీరింగ్ కోర్సులు (ట్రేడ్లు) రెండేళ్లు, ఏడాది
నాన్-ఇంజినీరింగ్ ట్రేడ్లు ఏడాది, ఆరునెలల కాలపరిమితితో ఉన్నాయి. వాటి వివరాలు..
ఇంజినీరింగ్ (రెండేళ్ల కాలవ్యవధి):
అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్), డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టం, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టం మెయిన్టెనెన్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్ (కెమికల్)
రేడియో-టీవీ మెకానిక్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), మెయిన్టెనెన్స్ మెకానిక్ మిషన్ టూల్, మెరైన్ ఫిట్టర్, మోటార్ వెహికల్ మెకానిక్, టర్నర్, వెజల్ నావిగేటర్, వైర్మన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్), మెకానిక్ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్.
ఇంజినీరింగ్ (ఏడాది) ట్రేడ్లు:
పెయింటర్ (జనరల్), మెకానిక్ (డీజిల్), మౌల్డర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, శానిటరీ హార్డ్‌వేర్ ఫిట్టర్, సైంటిఫిక్ గ్లాస్ అండ్ నియాన్ సైన్స్, షీట్‌మెటల్ వర్కర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్).
నాన్ ఇంజినీరింగ్ (ఏడాది) ట్రేడ్లు:
బుక్‌బైండింగ్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కటింగ్ అండ్ స్యూయింగ్, డ్రెస్మేకింగ్, హార్టికల్చర్, లిథో- ఆఫ్సెట్ మెషిన్ మైండర్, మాసన్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, ప్లంబర్, ప్రి ప్రిపరేటరీ స్కూల్ మేనేజ్మెంట్ (అసిస్టెంట్), స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్), వెల్డింగ్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్).
నాన్ఇంజినీరింగ్ 6 నెలల ట్రేడ్లు: డ్రైవర్ కమ్ మెకానిక్ (ఎల్ఎంవీ), హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్.
సీఓఈ ట్రేడ్లు:
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రొడక్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, ఆటోమొబైల్స్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, లెదర్, అపెరల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్‌కండిషనింగ్, ఫ్యాబ్రికేషన్ (ఫిట్టింగ్, వెల్డింగ్), ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్ మెషినరీ, కన్స్ట్రక్షన్ ఉడ్ వర్కింగ్, ప్రాసెస్ ప్లాంట్ మెయిన్టెనెన్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టూరిజం, బ్యాంబూ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, టెక్స్టైల్ టెక్నాలజీ.
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎలాంటి రుసుమూ లేకుండా ప్రభుత్వం ఏడాది, రెండేళ్ల కోర్సుల్లో శిక్షణనిస్తోంది. ప్రైవేటుగా (ఐటీసీల్లో అయితే) ఫీజులు వసూలు చేస్తున్నారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంటుంది.
ఐటీఐలకు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. పదేళ్ల కిందట ఏటా 10 వేల మంది విద్యార్థులు ఐఐటీల్లో చేరేవాళ్లు. ప్రస్తుతం ఏటా సుమారు లక్షమంది విద్యార్థులు చేరుతున్నారని అంచనా. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు కనీసం రూ.5000 నుంచి రూ.8000 వరకు నెలవారీ వేతనాలతో ఉపాధి పొందడానికి అవకాశాలు ఇప్పుడు బాగా ఉన్నాయి.
దరఖాస్తు చేయటం ఎలా
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఐటీఐ ట్రేడ్‌లో చేరాలనుకుంటే సమీపంలోని ఐటీఐకి వెళ్లి ప్రిన్సిపాల్‌ను నేరుగా సంప్రదించవచ్చ
* విద్యార్థులు తమ జిల్లాలోని ప్రిన్సిపాల్ లేదా కన్వీనర్ ద్వారా నేరుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగాలు
పదో తరగతి పూర్తి చేయడమనేది విద్యార్థి దశలో ఓ ముఖ్యమైన ఘట్టం. టెన్త్ తర్వాత పై చదువులు పూర్తి చేయడానికి ఆర్థిక స్తోమత లేదా ఆసక్తి లేనివారు పదో తరగతి అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొన్ని రకాల ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశముంది.
ఇరవై ఏళ్లు కూడా నిండకుండానే ప్రభుత్వంలోని ముఖ్యమైన విభాగాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం వల్ల భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. స్థిరమైన జీవితం ఏర్పరుచుకోవడానికి చిన్న వయసులోనే తొలి అడుగులు వేయవచ్చు.
పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగావకాశాలను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో ఏర్పడే క్లరికల్, ఆఫీసర్ తదితర హోదా పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటోంది. టెన్త్, ఇంటర్, ఆపై అర్హతలకు తగినవిధంగా నియామక ప్రకటనలు జారీ చేస్తోంది. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వే మొదలైన విభాగాలు వివిధ రకాల పోస్టుల భర్తీకి ప్రకటనలు ఇస్తున్నాయి.
సుస్థిర కెరీర్ ప్రగతి దిశగా చేసే ప్రయాణంలో పదో తరగతి తొలి సోపానం. ఇక్కడ మనం వేసే అడుగే మన జీవితాన్ని, భవిష్యత్తును, కెరీర్‌ను నిర్ణయిస్తుంది. ఒకవేళ ఇక్కడ తప్పటడుగు వేస్తే జీవితాంతం సర్దుకుపోతూ గడపాల్సిందే. అందుకే ఇప్పుడు తీసుకునే నిర్ణయం తెలివైనదై ఉండాలి. మన ఆసక్తికి అనుగుణంగా మన కెరీర్‌ను ఎంపిక చేసుకునేదై ఉండాలి. భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దేదై ఉండాలి. మంచి వేతనం, ఎదుగుదల, పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టేదై ఉండాలి. అందుకే ఇప్పుడు వేసే అడుగు పదిలంగా వేయాలి. పెద్దలు, చదువుకున్నవారి వద్ద నుంచి మంచి సలహాలు, సూచలను తీసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. పదో తరగతి పాసైనప్పటి నుంచి ఏ కోర్సులో చేరాలి? ఎందులో చేరితే అవకాశాలు ఎలా ఉంటాయి? ఏ కోర్సు కష్టంగా ఉంటుంది? ఏ కోర్సు చదివితే జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు? ఇలా ఎన్నో ప్రశ్నలు మనల్నే కాకుండా మన తల్లిదండ్రులకు కూడా ఎదురవుతుంటాయి.
పాలిటెక్నిక్కోర్సులు -విభాగాలు
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు వీలుకల్పిస్తున్నాయి. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు వేస్తున్నాయి.
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
మూడేళ్ల కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్కండీషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచ్‌లున్నాయి.
మూడున్నరేళ్ల కోర్సులు: కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటివి.
కెరీర్:పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి ఈ-సెట్ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు వెలువడుతుంటాయి. డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.
వేతనాలు: చేరిన సంస్థనుబట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది.
పాలిటెక్నిక్‌తో బహుళ అవకాశాలుఅనేక రంగాలు విస్తరిస్తూ ఉండడంతో పాలిటెక్నిక్ అర్హతతో విధులు నిర్వర్తించే సూపర్వైజరీ పోస్టుల సంఖ్య పెరుగుతున్నా… విద్యార్థులు అవగాహన లేమితో వదులుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్నో ఆధునిక కోర్సులు వస్తున్నాయి. వాటిని పూర్తిచేస్తే ఎన్నో అవకాశాలుంటాయి. మూడేళ్ల కోర్సులో థియరీ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంచుకుంటే బీటెక్ అభ్యర్థులతో దీటుగా పోటీ పడే సామర్థ్యం కూడా లభిస్తుంది.
వ్యవసాయ పాలిటెక్నిక్‌లు
గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌లు ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్‌లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి.. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు.
అర్హత, ప్రవేశాలు: పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) ప్రకారం కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.
అవకాశాలు: వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటివాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ప్రారంభంలో రూ.15వేల వరకు వేతనం లభిస్తుంది.
విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరాలి? ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? అందుబాటులో ఉన్న కోర్సులేంటి? పదో తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలేమైనా ఉన్నాయా? టెన్త్ తర్వాత ఏమేం చేయవచ్చో మన విద్యార్ధుల కోసం తెలియజేస్తున్నాం. పదవ తరగతి తరువాత ….
ఇంటర్మీడియట్
సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, ఇంటర్మీడియట్తోనే మొదలవుతుంది.
ఇంటర్లో ఏయే గ్రూపులు ఉంటాయి? ఏ గ్రూపు చదివితే ఎలాంటి ఫలితం ఉంటుంది? గ్రూపులను ఎలా ఎంచుకోవాలి? ఇంటర్ తర్వాత ఏం చేయాలి?”…
గ్రూపు ఎంపికలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండేందుకు అందిస్తున్న పూర్తి సమాచారమిది.
• విద్యార్థులు కాస్త తక్కువస్థాయిలోనైనా సాంకేతిక నైపుణ్యం సాధించడానికి ఐటీఐ, దీర్ఘకాలిక సాంకేతిక కోర్సులు చేయాలంటే ఇంటర్ వృత్తి విద్యాకోర్సులు, సాంకేతిక విద్యలో డిప్లొమా కోసం పాలిటెక్నిక్ రంగాలను ఎంచుకోవచ్చు.
• ఉన్నత విద్యలోకి ప్రవేశించేందుకు మాత్రం సాధారణ ఇంటర్మీడియట్ వైపు మొగ్గు చూపుతారు. విద్యారంగానికి ఇది రహదారి లాంటిది.
• ఉన్నత విద్యకు వారధి లాంటి ఇంటర్మీడియట్లో గ్రూపును ఎంచుకోవడమే ప్రధానమైన అంశం. ఎందుకంటే ఈ గ్రూపుమీదే మిగిలిన విద్య అంతా ఆధారపడి ఉంటుంది. విద్యార్థిజీవితాన్ని నిర్దేశించే కీలకమైన మలుపు కూడా ఈ కోర్సే. గ్రూపును ఎంచుకోవడంలో తప్పటడుగు ఏ మాత్రం పనికిరాదు. విద్యార్థులు ఇంటర్లో చేరేముందు వివిధ గ్రూపుల గురించి తెలుసుకుని, వారు ఏ రంగంలో రాణించగలరో ముందే ఒక నిర్ధరణకు రావాలి.
విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరేముందు ………….
విద్యార్థి ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు ముందే పూర్తి అవగాహన సంపాదించాలి. అంతకంటే ముందు తన సామర్థ్యాన్ని, తెలివితేటలను అంచనా వేసుకుని గ్రూపును ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి తెలివితేటలు, అభిరుచి, సామర్థ్యం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు, అధ్యాపకులు కూడా ఏ గ్రూపులో చేరాలనే విషయమై అతడికి సలహా ఇవ్వాలి.
ఇంటర్మీడియట్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. కానీ ఏడెనిమిది కాంబినేషన్లలో మాత్రమే చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. కాలేజీలూ వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి.
కొన్ని ముఖ్యమైన గ్రూపులు * ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
* బీపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
* సీఈసీ (కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్)
* ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్)
* హెచ్ఈసీ (హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్)
వీటిలో ఏ గ్రూపు ఎంచుకోవాలో నిర్ణయించుకునే ముందు విద్యార్థి వివిధ కోణాల్లో ఆలోచించాలి. ముందుగా ‘తన అభిరుచి, సామర్థ్యం, తెలివితేటలు ఏమిటి? లక్ష్యం ఏమిటి? ఆ తర్వాత తన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న గ్రూపును ఎంచుకోవాలి.
ఎంపీసీ ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తీసుకునే గ్రూపు ఇది. రాష్ట్రంలో ఎంసెట్ రాయాలనుకునేవారు;
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ తదితర రంగాల్లో ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి ఎంపీసీ పునాది.
జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి పరీక్ష (జేఈఈ – మెయిన్) రాసేందుకు ఈ గ్రూపులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.
బిట్స్‌పిలానీల్లో ప్రవేశానికి జరిగే ‘బిట్‌శాట్’ రాసేందుకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు.
ఎంసెట్: ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థికి నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో సీటు వస్తుంది. సుమారు 27 ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో ప్రవేశానికి ఎంసెట్ పునాదిలాంటిది.
బి.ఎస్సి. ఇంటర్మీడియట్ తర్వాత బి.ఎస్సి.లో చేరాలనుకుంటే మ్యాథ్స్-ఫిజిక్స్-కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్-ఫిజిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-స్టాటిస్టిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-జియాలజీ, మ్యాథ్స్-ఎలక్ట్రానిక్స్-జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, మర్చంట్ నేవీ, డైరీ టెక్నాలజీ, సుగర్ టెక్నాలజీ, జియాలజీ-ఫిజిక్స్-కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్…. ఇలా వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులున్నాయి.
బైపీసీ
డాక్టర్‌గా లేదా వైద్యసంబంధిత ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బీపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చరల్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూప్ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బయోలాజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్మీడియట్ చేస్తే ఉన్నత విద్యావకాశాలకూ కొదవ లేదు. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఆస్ట్రానమీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫుడ్‌టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టికల్చర్, హోంసైన్స్, మాలిక్యులార్ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్‌పాథాలజీ తదితర రంగాల్లో అవకాశాలుంటాయి. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ ఈ శతాబ్దపు పరిశోధనా రంగాలుగా పేర్కొనవచ్చు. రానున్న యుగం బయాలజీదే.
వైద్య విభాగంలో AIIMS, JIPMER, MGIMS, BHU లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ప్రవేశం కోసం బయాలజీ విద్యార్థులు ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇక మన రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష తప్పనిసరి. తద్వారా రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశం పొందవచ్చు. గత అయిదేళ్లతో పోలిస్తే మెడికల్ సీటుకు పోటీ తగ్గింది. బీపీసీ ఆధారిత కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని బయాలజీలో చేరే విషయాన్ని ఆలోచించాలి. మొత్తంమీద వెంటనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలను ఎంచుకోవచ్చు.
ఎంఈసీ, సీఈసీ
సేవారంగం వైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన ఎంఈసీ; కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు; ఇన్స్యూరెన్స్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునే వారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు.
గణనీయంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం ప్రధానపాత్ర పోషిస్తోంది. దీంతో కామర్స్ విద్యార్థులకు ఎంతో గిరాకీ పెరిగింది. మ్యాథమేటిక్స్, కామర్స్ సబ్జెక్టులు రెండూ అధ్యయనం చేయడం మరింత మెరుగైన ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుంది. సీఏ, ఐసీడబ్ల్యూఏ, బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ రంగాల్లో ఉన్నత విద్యకూ అవకాశం ఉంది. ఈ రంగాలపై గత అయిదారేళ్లుగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఇంటర్లో కామర్స్ ఒక సబ్జెక్టుగా గ్రూపులు ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.
ఆర్ట్స్ గ్రూపులు
పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. తర్వాత ఈ గ్రూపులకు ఆదరణ తగ్గింది. అయితే, ఇంజినీరింగ్ కోర్సులు చేసినవారిలో ఎక్కువమంది ఉపాధికి చేరువ కాకపోవడం, ఐటీ రంగానికి కష్టకాలం రావడం లాంటి కారణాలతో మళ్లీ ఆర్ట్స్ గ్రూపుల ప్రాధాన్యం పెరుగుతుంది. కార్పొరేట్ జూనియర్ కళాశాలలూ యూపీఎస్సీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ నుంచే శిక్షణనిస్తూ ఉండటం జరుగుతుంది.
యూపీఎస్సీ నిర్వహించే కొన్ని పోటీ పరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ గ్రూపుల్లో చేరతారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్ (సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీ భాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా ఎన్నెన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. కొరియన్, చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది.
వృత్తివిద్య(ఇంటర్మీడియట్)
ఉన్నత విద్యకు సాధారణ ఇంటర్మీడియట్ వారధిలాంటిదైతే, ఉపాధికి ఇంటర్మీడియట్ వృత్తి విద్యాకోర్సులు నిచ్చెనల్లాంటివి. పదోతరగతి తర్వాత డాక్టర్, ఇంజినీర్ వృత్తుల్లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియట్లో బీపీసీ, ఎంపీసీ చదువుతారు. పోటీ పరీక్షలను, కొన్ని రకాల వృత్తులను దృష్టిలో ఉంచుకునే వారు సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూపుల్లో చేరతారు. రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ వృత్తివిద్యాకోర్సులకు మరింత ప్రయోజనాన్ని కల్పించే దిశగా అధికారులు కొత్త రూపునిచ్చారు.ఈ కోర్సులకు అవసరమైన సిలబస్‌ను పూర్తి స్థాయిలో రూపొందించారు. ఇప్పటివరకూ ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలే లేని ఈ కోర్సులకు తొలిసారిగా పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నారు. రాష్ట్రంలో వృత్తి విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు.
పాలిటెక్నిక్ కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చరల్ అస్టిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ (సాండ్విచ్), ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, స్పెషల్ డిప్లొమా కోర్సెస్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్(షుగర్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(ఆయిల్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(పెట్రోకెమికల్స్), కెమికల్ ఇంజనీరింగ్(ప్లాస్టిక్స్ అండ్ పాలి మర్స్).
ప్రయోజనాలు ఎన్నో
గ్రామీణ విద్యార్థులపాలిట వరం:
పాలిటెక్నిక్ కోర్సులు.. గ్రామీణ, మధ్యతరగతి విద్యార్థులకు మంచి అవకాశం. తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ వైపు అడుగులు వేసేందుకు వీలుకల్పించే అద్భుత అవకాశం ఇది. రాష్టంలోని పాలిటెక్నిక్‌లను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రయివేట్ పాలిటెక్నిక్ కాలేజీలు, మహిళా పాలిటెక్నిక్ కళాశాలలు అని మూడు రకాలుగా పేర్కొనవచ్చు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో మహిళల స్వయం ఉపాధికి ఉపయోగపడే కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఏ కోర్సుకు క్రేజ్:ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమాకు క్రేజ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. ఈ బ్రాంచ్‌లో డిప్లొమా చేసి, అవసరమైన కంప్యూటర్ కోర్సులు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ కోర్సులు ఎవర్ గ్రీన్‌గా పేరు సాధించాయి. వీటిని పూర్తి చేస్తే జాబ్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంది.
స్వయం ఉపాధి:మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ వంటి విభాగాల్లో డిప్లొమా పూర్తి చేసిన వారు స్వయం ఉపాధి ద్వారా కూడా స్థిరపడొచ్చు. కంప్యూటర్స్ చేసిన వారు ఇంటర్నెట్ కేఫ్ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా హార్డ్‌వేర్ స్పేర్స్ సంబంధిత వ్యాపారం చేసుకోవచ్చు. మెకానికల్ డిప్లొమా పూర్తిచేసినవారు టూవీలర్, ఫోర్ వీలర్ మెకానిక్ రంగంలో కూడా దిగవచ్చు. ప్యాకేజింగ్, ప్రింటింగ్ యూనిట్లు స్థాపించుకోవచ్చు. ఇందుకు ఆర్థిక సంస్థల సహకారం కూడా పొందవచ్చు.
కోర్సులు.. కెరీర్ స్కోప్
డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపా ర్ట్మెంట్,రహదారులు, భవనాలు,రైల్వేస్, సర్వే, డ్రాయిం గ్, వాటర్ సప్లైయ్, ప్రభుత్వ, ప్రయివేట్ రంగ విభా గాలుకాంట్రాక్టర్గా, డ్రాఫ్ట్స్మెన్గా.. స్వయం ఉపాధి.
కంపెనీలు: డీఎల్ఎఫ్, యూనిటెక్, జైపీ అసోసియేట్స్, మైటాస్, జీఎంఆర్ ఇన్ఫ్రా, పుంజ్‌లాయిడ్, ల్యాంక్ ఇన్ఫ్రా.
కెరీర్: సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థుల కెరీర్ సైట్ ఇంజనీర్‌గా మొదలై.. ఇంజనీర్లు, సీనియర్ ఇంజనీర్లు, మేనేజర్లుగా పనిచేసి కంపెనీ జనరల్ మేనేజర్ స్థాయి వరకూ ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ఏయిర్, డీడీ, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రా నిక్స్ ఇండస్ట్రీస్,రేడియో, టీవీ సర్వీసింగ్‌లో స్వయం ఉపాది,సేల్స్, సర్వీస్‌లో సెల్ఫ్ఎంప్లాయిమెంట్.
కంపెనీలు: భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐడియా సెల్యులార్, టాటా
కమ్యూనికేషన్స్, బీఎస్ఎన్ఎల్.కెరీర్: ట్రైనీ ఇంజనీర్‌గా మొదలై.. స్కిల్స్‌తో సర్వీస్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్, ప్రొడక్ట్ ఇంజనీర్, సీనియర్ ప్రొడక్ట్ డవలప్మెంట్ ఇంజనీర్, డిపార్ట్మెంట్ మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: కంప్యూటర్ మెయిన్టెనెన్స్, సాఫ్ట్వేర్ డవలప్మెంట్, కంప్యూటర్ ట్రైనింగ్, కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్‌లో స్వయం ఉపాధి.
కంపెనీలు: ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, పొలారీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి టాప్ కంపెనీలతోపాటు ఇతర సాప్ట్వేర్ డవలప్మెంట్, ట్రైనింగ్ సంస్థల్లో జాబ్స్ లభిస్తాయి.
కెరీర్: జూనియర్ ప్రోగ్రామర్‌తో మొదలై సాఫ్ట్వేర్ ప్రోగ్రా మర్, సీనియర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ స్థాయికి చేరుకోవచ్చు.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, డీసీఎల్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్, డిపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్‌లో మెయిన్టెనెన్స్ స్టాఫ్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లు, వైరింగ్ కన్సల్టెన్సీ వైండర్లుగా స్వయం ఉపాధి.
కంపెనీలు: సీమెన్స్, సుజ్లాన్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, టాటా పవర్, ఎన్‌హెచ్‌పీసీ, నెవైలీ లిగ్నైట్.
కెరీర్: జూనియర్ ఇంజనీర్ ట్రైనీగా మొదలై.. అనుభవంతో సూపర్ వైజర్, ఇంజనీర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు.
డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ప్రభుత్వ రంగ సంస్థలుప్రభుత్వ, ప్రయి వేట్ విభాగాలు మెషినరీ, ట్రాన్స్‌పోర్టు, ప్రొడక్షన్, సేల్స్‌కు సంబంధించిన వర్క్‌షాపులు, గ్యారేజీలు, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో సేల్స్,మెకానికల్ ఇంజనీరింగ్ అనుబంధ విభాగాల్లో స్వయం ఉపాధి.
కంపెనీలు: ఓల్టాస్, ఏసీసీ లిమిటెడ్, బీఓఎస్ సీహెచ్, హిం దుస్థాన్ యూనిలెవెల్ లిమిటెడ్, మారుతి సుజుకి, ఇన్ఫోటెక్.
కెరీర్: పారిశ్రామిక రంగం బాగా అభివృద్ధి చెందడంతో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ విభాగంలో డిప్లొమా అభ్యర్థి ట్రైనీగా చేరి… 7-8 ఏళ్లలో స్కిల్స్, ఉన్నత విద్యతో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: ఏపీఎస్ఆర్టీసీ,ఆటోమొబైల్ కంపెనీల షోరూంలకు సంబంధించిన ట్రాన్స్‌పోర్టు విభాగాలు, ఆటోమొబైల్స్ సర్వీసింగ్‌లో స్వయం ఉపాధి.
కంపెనీలు: సుజ్కీ, టయోటా, టాటా, ఫియాట్, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్, ఎల్ఎంఎల్, యమ హా వంటి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు..
కెరీర్: సర్వీస్ ఇంజనీర్ ట్రైనీగా మొదలై స్కిల్స్, హార్డ్‌వర్క్, ఉన్నత విద్యతో సర్వీస్ ఇంజనీర్, డిప్యూటీ సర్వీస్ ఇంజనీర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: మైన్స్(ఓపెన్‌కాస్ట్, అండర్‌గ్రౌండ్), ఎస్.సి.సి.ఎల్, ఎన్.ఎం.డి.సి
కంపెనీలు: సింగరేణి కాలరీస్, ఎన్ఎండీసీ, ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్, ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాల వ్యవధి: మూడేళ్లు
ఉద్యోగాలెక్కడ: అన్ని సాఫ్ట్వేర్ డవలప్మెంట్ యూనిట్లలో..
కంపెనీ: ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, పొలారీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కెరీర్: జూనియర్ ప్రోగ్రామర్‌గా చేరి స్కిల్స్‌తో ప్రోగ్రామర్, సీనియర్ ప్రోగ్రామర్ స్థాయికి ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ కాల వ్యవధి: మూడున్నరే ళ్లు
ఉద్యోగాలెక్కడ: టెక్స్టైల్ మిల్స్,క్లాత్ ఎక్స్‌పోర్టు ఇండస్ట్రీస్.
కంపెనీలు: విమల్, రేమండ్స్, అరవింద్ మిల్స్, బాంబే డయింగ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, లక్ష్మీ మిల్స్.
కెరీర్: ప్రాసెస్ ఇంజనీర్, టెక్నికల్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, సూపర్ వైజర్, ప్రొడక్షన్ కంట్రోల్ విభాగాల్లో కెరీర్‌ను ఎంచుకొని ఉన్నత స్థాయికి ఎదగొచ్చు.
డిప్లొమా ఇన్ సిరామిక్ టెక్నాలజీ కాల వ్యవధి: మూడున్నరేళ్లు
ఉద్యోగాలెక్కడ: రిఫ్రాక్టరీ, బ్రిక్ క్లిన్స్, సిమెంట్,గ్లాస్ అండ్ సిరామిక్ అండ్ శానిటరీవేర్ ఇండస్ట్రీస్.
కంపెనీలు: ఏసీసీ లిమిటెడ్, గుజరాత్ అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్.
కెరీర్: అభ్యర్థి సిరామిక్ టెక్నాలజీ, సిరామిక్ డిజైనర్స్ ఫీల్డ్‌లను ఎంచుకోవచ్చు. వీటిల్లో జూనియర్ ఇంజనీర్‌గా మొదలై.. ప్రాసెస్ ఇంజనీర్, సీనియర్ సిరామిక్ ప్రాసెస్ ఇంజనీర్ స్థాయికి ఎదగొచ్చు.
ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్
ఇది ఒకరకంగా సివిల్ ఇంజినీరింగ్‌కు కొనసాగింపే! ఈ కోర్సులో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్, పర్యవేక్షణ మొదలైనవాటి గురించి అధ్యయనం చేస్తారు. స్థలాన్ని తక్కువ శ్రమ, మార్పులతో ఎక్కువ ప్రయోజనకరంగా మార్చడం తెలుసుకుంటారు. ప్రధానంగా బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన ముఖ్యమైన మెటీరియల్ ప్రాథమిక సమాచారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్కు అవసరమైన సామగ్రి గురించిన పరిజ్ఞానం లభిస్తుంది. ఈ కోర్సు ఎంచుకుని, పూర్తిచేసినవారికి.. డిజైన్- డ్రాయింగ్ డిపార్ట్మెంట్లలో, ఆర్కిటెక్చర్లో డ్రాఫ్ట్‌మెన్‌గా ఉపాధి అవకాశాలుంటాయి. మున్సిపల్ ఆఫీసుల్లో లైసెన్స్డ్ డిజైనర్‌గానూ చేరొచ్చు.
కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్
కామర్స్, కంప్యూటర్, బేసిక్ అకౌంటింగ్‌ల కలయికగా ఈ కోర్సు ఉంటుంది. ఆఫీస్ ప్రొసీజర్స్, అకౌంటింగ్ ప్రొసీజర్స్, ఆటోమేషన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లను/ సాఫ్ట్వేర్లను ఉపయోగించడం ద్వారా ఆఫీసు వర్క్‌లో ముఖ్య పాత్ర దీనికి ఉంటుంది. స్టెనోగ్రఫీ, డేటా ఎంట్రీ, అకౌంటింగ్, టైప్ రైటింగ్ కూడా కోర్సులో భాగంగా నేర్పుతారు. ఈ కోర్సును ఎంచుకుని, పూర్తిచేసినవారు.. ప్రభుత్వ శాఖల్లో స్టెనో, టైపిస్ట్, కంప్యూటర్ ఆపరేటర్లుగా చేరొచ్చు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ మంచి అవకాశాలుంటాయి. చిన్న బిజినెస్ ఆంత్రపెన్యూర్షిప్నూ ప్రారంభించుకోవచ్చు. పైచదువులను అభ్యసించాలనుకుంటే బీకాం ఐఐవైఆర్, సీఏ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎస్, ఎంబీఏ కోర్సుల్లో కొనసాగించొచ్చు.
ప్యాకేజింగ్ టెక్నాలజీ
ప్యాకేజింగ్‌కు ఎన్నో సంవత్సరాలుగా గిరాకీ ఉంది. ఇది ఉత్పాదనకూ, సరఫరాకూ మధ్య వారధిగా ఉంటోంది. ప్యాకేజింగ్ లేకుండా వస్తువును చెడిపోకుండా రవాణా చేయడం కష్టమే. పైగా ఈరోజుల్లో మోడర్న్ ప్యాకేజింగ్ టెక్నిక్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆన్లైన్లో కొనుగోళ్లు పెరుగుతుండటంతో కొత్త రీతిలో టెక్నాలజీని ఉపయోగించి మరింత అందంగా, ఆకర్షణీయంగా కస్టమర్‌కు వస్తువును అందించడంపై సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. ఈ కోర్సులో స్టోరేజీ, వస్తువుపై అట్టపై ఉండాల్సిన ప్రింటింగ్లతోపాటు వస్తువును సరిగా, క్షేమంగా ప్యాక్ చేయడం వంటివాటిపై అధ్యయనం చేస్తారు. వీరికి ఆరు నెలల పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తిచేసినవారికి ఫార్మాస్యూటికల్, ఫుడ్, బెవరేజ్, పేపర్, ప్లాస్టిక్ మొదలైనవాటికి సంబంధించిన అన్ని ప్యాకేజింగ్ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలుంటాయి. బీటెక్- మెకానికల్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, మెకానికల్ మెరైన్ ఇంజినీరింగ్, మెకట్రానిక్స్ కోర్సుల్లో ఉన్నత చదువులు చేయొచ్చు.
బయో మెడికల్ ఇంజినీరింగ్
ఈ కోర్సులో ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలతో అనుసంధానంగా ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి తెలుసుకుంటారు. వైద్య పరిశ్రమలో వివిధ రోగ నిర్ధారణ, థెరపీలకు సంబంధించిన సంస్థల్లో వీరికి మంచి అవకాశాలుంటాయి. వైద్యరంగంలో ఎలక్ట్రానిక్స్‌కు కొనసాగింపు ఇది. మెడికల్, దాని సంబంధిత రంగాల్లో ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి కోర్సు. అయితే వీరికి మార్కెట్లోకి కొత్తగా వస్తున్న టెక్నాలజీలపై ఆసక్తి ఉండాలి. వీరికి ఏడాది పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసినవారికి మెడికల్ రిసెర్చ్ సంస్థలు, ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలుంటాయి. బీటెక్-ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీమాటిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌ల్లో వీరు ఉన్నత చదువులు చదవొచ్చు.
మైనింగ్ ఇంజినీరింగ్
ఇది సైన్స్, టెక్నాలజీల మేలు కలయిక. ఈ కోర్సును ఎంచుకున్నవారు కఠిన, ప్రతికూల వాతావరణంలో పనిచేయడానికి సుముఖంగా ఉండగలగాలి. కొంత పై స్థాయికి చేరుకున్నాక కంట్రోల్ రూంలో చేయొచ్చు. సివిల్ ఇంజినీరింగ్‌లో భాగమైన సర్వేయింగ్, డ్రాయింగ్, జియాలజీ సైన్స్‌లో ఎర్త్ సైన్స్‌కు సంబంధించిన అంశాలను లోతుగా చదువుతారు. కెమిస్ట్రీ కూడా ఒక భాగంగా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఖనిజాలు దొరుకుతాయో కనిపెట్టడం, తరువాత ఆచరించాల్సిన ప్రాథమిక విధులు మొదలైనవి తెలుసుకుంటారు. ఖనిజాలు, వాటిని వెలికి తీసేప్పుడు, తీసిన తర్వాత, రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైనవి ఈ కోర్సులో భాగం. కోర్సు పూర్తిచేసిన వారికి ఓపెన్ కాస్ట్, అండర్‌గ్రౌండ్ మైనింగ్‌లు, ఎస్సీసీఎల్, ఎన్‌ఎండీసీల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కోర్సు అనంతరం కావాలనుకుంటే బీటెక్-మైనింగ్ ఇంజినీరింగ్, మైనింగ్ మెషినరీ ఇంజినీరింగ్‌ల్లో చదువు కొనసాగించొచ్చు.
గార్మెంట్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ
అప్పటికే అందుబాటులో ఉన్న వస్త్రాన్ని కాస్ట్యూమ్స్‌గా రూపొందించడం ఈకోర్సులో భాగంగా నేర్చుకుంటారు. డిజైనింగ్‌లో సైంటిఫిక్, ఇంజినీరింగ్ సూత్రాలను ఉపయోగించడం, ఫైబర్, టెక్స్టైల్, అపరెల్ ప్రాసెసెస్, ప్రొడక్ట్స్, మెషినరీపై పట్టు ఏర్పరచుకుంటారు. డిజైన్స్, ప్రింటింగ్లు, లేఅవుట్లు, కలర్ కాంబినేషన్ల పరిజ్ఞానం ఏర్పరచుకుంటారు. దీనిలో మూడు, మూడున్నర ఏళ్ల వ్యవధి గల కోర్సులున్నాయి. మూడున్నరేళ్ల కోర్సు ఎంచుకున్నవారికి ఏడాదిపాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. వీరికి టెక్స్టైల్ మిల్లులు, వస్త్ర దిగుమతి పరిశ్రమలు, ఫిలిం, ఫ్యాషన్ టెక్నాలజీ, షోరూమ్ అవుట్లెట్లలో అవకాశాలుంటాయి. వర్క్ ఫ్రం హోం చేసుకునే వీలూ ఉంటుంది. వీరికి ఎక్కువగా ప్రైవేటు రంగంలో అవకాశాలున్నాయి. కన్సల్టెంట్లుగా కూడా చేయవచ్చు. ఫ్యాషన్ సంబంధిత కోర్సుల్లో గ్రాడ్యుయేషన్, బీటెక్- టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, పెట్రోకెమికల్ ఇంజినీరింగ్, పెట్రోలియమ్ ఇంజినీరింగ్/ టెక్నాలజీల్లో ఉన్నత చదువులు అభ్యసించొచ్చు.
ఇంటర్లో సీఈసీ పూర్తిచేసిన విద్యార్థులు బీకాం రెగ్యులర్, బీకాం కంప్యూటర్స్‌తో పాటు బీబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చు.
|
|
పదోతరగతి పూర్తయ్యాక.. ఎటువైపు అడుగు వేయాలని ఆలోచించే విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి మార్గం.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు! మూడు మూడున్నరేళ్లకే ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసే అవకాశం ఉండటం పాలిటెక్నిక్ కోర్సుల ప్రత్యేకత. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆర్థిక స్తోమతకు అనుగుణమైన ఫీజులతో తక్కువ వ్యవధిలోనే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. అంతేకాదు చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు.
పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్యకూ అవకాశం ఉన్నా, మూడేళ్లకల్లా ఉపాధి సాధించాలనుకునేవారు ఎక్కువగా పాలిటెక్నిక్ డిప్లొమాపైనే ఆధారపడతారు. పాలిటెక్నిక్‌లో ఏయే బ్రాంచ్‌లు ఉంటాయి? ఏ బ్రాంచ్‌లో చేరితే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేదా ఉన్నత విద్యావకాశాలుంటాయో చూద్దామా . పదోతరగతి పూర్తయ్యాక మూడేళ్లకే ఇంజినీరింగ్ డిప్లొమా పొందాలనుకునే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులు అత్యంత అనువైనవి. డబ్బు, సమయం వృథా కాకుండా సాంకేతిక విద్యార్హత సాధించడానికి ఉపకరిస్తాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తోంది పాలిటెక్నిక్. పదోతరగతి పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీ అందుకోవాలంటే రెండేళ్లు ఇంటర్మీడియట్, నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదవాలి. ఆర్థికంగా స్థోమత లేనివాళ్లు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పదోతరగతి తర్వాత మూడేళ్లకే సాంకేతిక విద్యలో డిప్లొమా పొందడానికి పాలిటెక్నిక్ వైపు మొగ్గు చూపుతారు. మరోవైపు పారిశ్రామిక రంగం ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన విద్యార్థులతో దీటుగా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్థులకూ ప్రాధాన్యం ఉంటుంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్లేస్మెంట్ అవకాశాలు పెరుగుతున్నాయి. గ్రామీణ, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు చక్కటి అవగాహనతో పని చేయడం, ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి రావడం లాంటి కారణాలతో పారిశ్రామిక రంగం పాలిటెక్నిక్ విద్యార్థులకు అవకాశాలు పెంచింది. సివిల్, మెకానికల్ లాంటి ప్రాథమిక తరహా కోర్సులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చేసిన వారితో పోలిస్తే, పాలిటెక్నిక్ చేసిన వారికి ఉపాధి అవకాశాలూ ఎక్కువే. |
![]() చిన్న వయసులోనే సాంకేతిక విద్యను పూర్తిచేసుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చక్కటి మార్గం. సాంకేతిక విద్యపై ఆసక్తి ఉండి, కెరీర్ పరంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనుకునే వారికి ఉత్తమమైన మార్గం పాలిటెక్నిక్. వాస్తవానికి ఇంజనీరింగ్ డిగ్రీ(బీఈ/బీటెక్) అందుకోవాలంటే.. పదో తరగతి తర్వాత రెండేళ్ల ఇంటర్మీడియట్, అనంతరం నాలుగేళ్ల ఇంజనీరింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. కానీ పాలిటెక్నిక్‌తో మూడేళ్లకే ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసుకోవచ్చు. మరోవైపు ప్రాక్టికల్ నాలెడ్జ్ దృష్ట్యా సంస్థలు డిప్లొమా విద్యార్థులకు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ప్రవేశం ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాల నుకునే విద్యార్థులు ఆయా‡రాష్ట్ర ప్రభుత్వం నిర్వ హించే పాలీసెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. పాలీసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. ప్రవేశాలు కల్పిస్తారు. మూడేళ్ల కోర్సులు
సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అప్త్లెడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ (సుగర్ టెక్నాలజీ), ప్రింటింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్. మూడేన్నరేళ్ల కోర్సులు
మెటలర్జికల్, టెక్స్టైల్ టెక్నాలజీ, కెమికల్, కెమికల్(ఆయిల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్), సిరామిక్, లెదర్ టెక్నాలజీ, లెదర్ గూడ్స్ అండ్ ఫుట్‌వేర్ టెక్నాలజీ. స్పెషల్ డిప్లొమా కోర్సులు
స్పెషల్ డిప్లొమా కోర్సులు ఎలక్ట్రానిక్ స్పెషౖలñ జేషన్కు సంబంధించినవి. వీటిలో ముఖ్యంగా కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజ నీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ వీడియో ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌లో స్పెషల్ డిప్లొమా కోర్సులు
ఎంబెడెడ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజినీరింగ్, టీవీ అండ్ సౌండ్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్. రాష్ట్రవ్యాప్తంగా 248 పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 70620 సీట్లున్నాయి. వీటికోసం ఏటా రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది పోటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉన్నత విద్య
డిప్లొమా పూర్తిచేసిన తర్వాత విద్యార్థుల ముందు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి,ఉద్యోగంలో చేరడం, కాగా రెండోది ఉన్నత విద్య(బీటెక్). విద్యార్థులు తమ ఆసక్తి, ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ఉద్యోగం లేదా ఉన్నత విద్యలో ఏదైనా ఒక మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆయా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్(ఈసెట్–ఎఫ్‌డీహెచ్) ద్వారా బీటెక్/ బీఈలో చేరే అవకాశం లభిస్తుంది. లేటరల్ ఎంట్రీ వి«ధానంలో డైరెక్ట్‌గా ఇంజనీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందవచ్చు. నైపుణ్యాలు ఎక్కువ
పదో తరగతి తర్వాత ఇంటర్ పూర్తి చేసి.. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థుల కంటే.. ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులయ్యే వారికి ప్రాక్టికల్ నైపుణ్యాలు ఎక్కువగా లభిస్తాయనే అభిప్రాయం ఉంది. కారణం.. డిప్లొమా స్థాయిలో ప్రాక్టికల్‌కు అధిక ప్రాధాన్యం ఉండటమే. డిప్లొమా చేసిన తరువాత అవకాశాలు
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఉండే అవకాశాలను ప్రధానంగా రెండు విధాలుగా విభజించవచ్చు. అవి: ఉద్యోగం, ఉన్నత విద్య. ఉద్యోగం: ఇందులోనూ రెండు మార్గాలున్నాయి. ఒకటి స్వయం ఉపాధి; రెండోది ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థల్లో ఉద్యోగం పొందడం. ప్రైవేటు వ్యాపార సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలున్నాయి. విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి. బ్రాంచిల ఆధారంగా ఉద్యోగావకాశాలున్న రంగాలు:
డిఫెన్స్ సంస్థల్లో... |
ఎంపీసీ: ఇంజనీర్‌గా కెరీర్లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) గ్రూపులో చేరొచ్చు. గణితంపై ఆసక్తి ఉండి, వివిధ సూత్రాలను వేగంగా అన్వయించే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఎంపీసీ సరైన గ్రూప్. ఐఐటీ, నిట్లు, టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించాలంటే ఇంటర్లో చేరిన రోజు నుంచి లక్ష్యం దిశగా కృషిచేయాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, బిట్‌శాట్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం కృషిచేయాలి. ఇంజనీరింగ్ కెరీర్‌పై ఆలోచన లేని వారు, ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి, తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనలు దిశగా వృత్తి జీవితాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.
బైపీసీ: మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండి, విశ్లేషణాత్మక నైపుణ్యాలున్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ). వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తొలుత పూర్తిచేయాల్సిన గ్రూప్ ఇది. దీని సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టపడి చదివే తత్వం ప్రధానం. ఈ గ్రూప్‌లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత అవసరం. బైపీసీ తర్వాత ఎంసెట్, ఎయిమ్స్, జిప్మర్, సీఎంసీ పరీక్షల ద్వారా ఎంబీబీఎస్‌లో చేరి డాక్టర్‌గా స్థిరపడటం సుదీర్ఘ ప్రక్రియే. రెండేళ్ల పాటు ఇంటర్ చదివి.. ఎంబీబీఎస్, పీజీ కోర్సు చేయాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా బైపీసీలో చేరడంపై నిర్ణయం తీసుకోవాలి.
సీఈసీ, ఎంఈసీ: వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారికి సరైన గ్రూపులు సీఈసీ, ఎంఈసీ. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కామర్స్‌లో నైపుణ్యాలున్న వారికి అవకాశాలు పలకరిస్తున్నాయి. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు అనుకూలమైన గ్రూప్‌లు సీఈసీ, ఎంఈసీ. ఏ కోణంలో చూసినా ఇవి అవకాశాలకు వేదికగా నిలుస్తున్నవే.
హెచ్ఈసీ: సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్నవారికి సరైన గ్రూప్ హెచ్ఈసీ. ఇంటర్ హెచ్ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యాపరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు జాబ్‌ఓరియెంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందుబాటు లో ఉన్నాయి. ఉన్నతవిద్య మాత్రమే కాకుండా ఉన్నతోద్యోగాల దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగం ఖాయం.
అర్హత: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కోర్సులు: క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెన్స్‌షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించొచ్చు. అంతేకాకుండా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం కూడా ఇంటర్ వొకేషనల్ గ్రూపుల్లో టెక్నికల్ గ్రూప్ ఉత్తీర్ణులకు లభిస్తుంది.
కెరీర్: బ్రాంచ్కనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి దిశగా వెళ్లొచ్చు.
ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యమైనవి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు. వీటిని పూర్తిచేసింది తడవు తక్షణ ఉపాధి లభిస్తుంది.వీటిలో ముఖ్యమైనవి:ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:కరిక్యులం:వర్క్‌షాప్ టెక్నాలజీ, బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్, ఆటో ట్రాన్స్మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఆటో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్..
ఉద్యోగావకాశాలు: ఆటో మెకానిక్, వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్/మ్యానుఫ్యాక్చర్ రిప్రెజెంట్, ఇన్సూరెన్స్ అండ్ లాస్ అసెసర్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, ఆటో ఎలక్ట్రీషియన్.
మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:ఉద్యోగావకాశాలు: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మెకానికల్ విభాగాలు; ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; రిఫ్రిజిరేషన్, ఎయిర్కండీషనింగ్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్; వర్క్‌షాప్ టెక్నీషియన్; పవర్ప్లాంట్ల టెక్నీషియన్; సోలార్ సిస్టమ్ టెక్నీషియన్.
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:ఉద్యోగావకాశాలు:ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అసెంబ్లీస్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ టెస్టర్-రిపైరర్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ సేల్స్ అండ్ సర్వీస్.
ఎలక్ట్రికల్ టెక్నీషియన్:ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రిక్ ఉపకరణాల అసెంబ్లర్, టెస్టర్, ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, రిపైరర్, వైండర్/రివైండర్ (మోటార్), సేల్స్‌మ్యాన్.
పారామెడికల్..
పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు పారామెడికల్ కోర్సులు సత్వర ఉపాధి కల్పిస్తాయి. రెండేళ్ల డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ(డీఎంఎల్టీ), ఆప్తాల్మామిక్ అసిస్టెంట్ కోర్సు; ఏడాది వ్యవధితో కార్డియాలజీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్ తదితర డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బైపీసీ గ్రూప్‌తో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీఎస్సీ(నర్సింగ్), పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్టీ తదితర కోర్సుల్లో చేరొచ్చు. వీటితోపాటు ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, పెర్ఫ్యూజన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వ్యాస్కులర్ టెక్నాలజీ, అనెస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియటర్ డిగ్రీ, ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తి చేయడం ద్వారా హాస్పిటల్స్‌లో ఆయా విభాగాల్లో టెక్నీషియన్స్‌గా స్థిరపడొచ్చు. పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(కేఎన్ఆర్యూహెచ్ఎస్), ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.
ఐటీఐ/ఐటీసీ
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రియ ల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి.
అర్హత: ఐటీఐ/ఐటీసీలలోని ట్రేడ్లలో పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో చేరవచ్చు.
కోర్సులు: ఐటీఐ/ఐటీసీలలో మూడు నెలలు మొదలుకొని మూడేళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర కోర్సులున్నాయి.
కెరీర్: కోర్సు పూర్తయ్యాక అప్రెంటీస్ చేయొచ్చు. ఈ సమయంలో విద్యార్థి వేతనం(స్టైఫండ్) లభిస్తుంది. వివిధ కో ర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగావకాశాలుంటాయి. రైల్వే, ఆర్మీ, పోలీసు, పారా మిలిటరీ తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. స్వ యం ఉపాధి దిశగా కూడా అడుగులు వేయొచ్చు. ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారు ప్రవేశ పరీక్ష ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం పొందొచ్చు.
స్వయం ఉపాధి దిశగా..ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్థిక ఇబ్బందు లు ఎదురైతే స్వయంఉపాధి దిశగా కూడా ఎన్నో సంస్థలు స్వల్పకాలిక శిక్షణ కోర్సులను అందిస్తున్నాయి. సెట్విన్, స్వామిరామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వంటి సంస్థలు ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అవసరమైన ఎన్నో కోర్సులను అతి తక్కువ రుసుముకే అందిస్తున్నాయి. ఆయా సంస్థలు అందించే కోర్సుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్, సెల్‌ఫోన్ రిపేరింగ్, ట్రాక్టర్ డ్రైవింగ్, ఫుట్‌వేర్ డిజైన్, స్టోర్ కీపర్, హౌస్ కీపింగ్, గార్మెంట్ తయారీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, పుట్టవంటి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియెట్ కీలక దశ. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తొలి అడుగులు పడేది ఇక్కడే. ఇటీవలే ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. రెండేళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఇప్పుడు తీసుకునే నిర్ణయంపైనే భవిష్యత్తు గమనం ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ పూర్తి చేసిన వారిలో అధిక శాతం మంది ఇంజనీరింగ్ వైపు.. బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మంది మెడిసిన్ వైపు ఆసక్తి చూపుతున్నారు.
|
![]() కామర్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ వంటి కోర్సులు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. సదరు కోర్సులో మెరుగ్గా రాణించి మంచి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. చక్కటి కెరీర్లో స్థిరపడొచ్చు. ఈ నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్‌లో గ్రూప్‌ల వారీగా భవిష్యత్తు అవకాశాలపై విశ్లేషణ..
ఎంపీసీతో.. బీఎస్సీ:
ఇంజనీరింగ్‌లో కోరుకున్న కాలేజీలో, బ్రాంచ్‌లో ప్రవేశం లభించకుంటే… ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయం.. సంప్రదాయ డిగ్రీ కోర్సుగా భావించే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ). బీఎస్సీలోనూ పలు కొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌కు సరితూగేలా బీఎస్సీలో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ వంటి కాంబినేషన్లతో గ్రూప్ సబ్జెక్ట్‌లు ఎంచుకునే అవకాశముంది. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్‌కు చక్కటి ప్రత్యామ్నాయంగా బీఎస్సీని పలువురు విద్యార్థులు ఎంచుకుంటున్నారు.
ఐఐఎస్సీ–బెంగళూరు.. దేశంలోనే పేరున్న విద్యాసంస్థ.. నాలుగేళ్ల వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రీసెర్చ్) ప్రోగ్రామ్‌లో ప్రవేశం కల్పిస్తోంది. దీనిలో బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఎనిమిది సెమిస్టర్లుగా జరిగే ఈ కోర్సులో చివరి సెమిస్టర్లో పూర్తిగా రీసెర్చ్ ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన(కేవీపీవై)/జేఈఈ–మెయిన్/జేఈఈ–అడ్వాన్స్డ్/నీట్ –యూజీ ద్వారా ప్రవేశం పొందొచ్చు.
మరో ప్రతిష్టాత్మక సంస్థ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్) క్యాంపస్‌ల్లో.. బీఎస్, బీఎస్–ఎంఎస్(డ్యూయల్ డిగ్రీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన(కేవీపీవై)/జేఈఈ–అడ్వాన్స్డ్/స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ చానల్–ఐఐఎస్ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా వీటిలో ప్రవేశించొచ్చు. ఉద్యోగ అవకాశాలు
ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థులు వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకునే వీలుంది. ప్రధానంగా యూపీఎస్సీ–నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ) అండ్ నేవల్ అకాడమీ(ఎన్ఏ) ఎగ్జామినేషన్ ద్వారా త్రివిధ దళాల్లో(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ఉన్నత ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. అకడమిక్ శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ నుంచి డిగ్రీ పట్టాలు చేతికందుతాయి. శిక్షణ సమయంలో ఆకర్షణీయ స్టైపెండ్ కూడా లభిస్తుంది. రక్షణ దళాల్లో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ విధానంలోనూ.. ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులు అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవల్(ఎస్ఎస్సీ–సీహెచ్ఎస్ఎల్) ఎగ్జామినేషన్ ద్వారా చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ కొలువులను చేజిక్కించుకోవచ్చు. |
బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్(బీవీఎస్సీ), బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ తదితర కోర్సుల్లో చేరడం ద్వారా.. బైపీసీ విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు.
ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా ‘ఆయుష్’ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల బీహెచ్ఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ(బీయూఎంఎస్); బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్(బీఎన్‌వైఎస్) తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలకు కొదవలేదు.
బీ ఫార్మసీ, ఫార్మా–డి కోర్సులు పూర్తిచేసిన వారికి ఫార్మాస్యూటికల్, క్లినికల్ రీసెర్చ్ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. వీటి తర్వాత డాక్టోరల్ కోర్సులు పూర్తిచేసి రీసెర్చ్ లేబొరేటరీల్లో అత్యున్నత హోదాలు అందుకోవచ్చు.
ఇంటర్మీడియెట్ బైపీసీ తర్వాత గ్రాడ్యుయేషన్ కోర్సులు అనగానే గుర్తుకొచ్చేది.. బీఎస్సీ(బీజెడ్సీ–బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ). ప్రస్తుత ఆధునిక అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల గ్రూపు సబ్జెక్టులతో బీఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది. బీఎస్సీ (బోటనీ, కెమిస్ట్రీ; న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్), బీఎస్సీ (ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్) వంటి కోర్సులను పలు కళాశాలలు అందిస్తున్నాయి. ఆసక్తిని బట్టి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ తదితర సబ్జెక్టులున్న గ్రూప్‌లను కూడా ఎంపిక చేసుకోవచ్చు.
ఫార్మసీ కోర్సులు:బైపీసీ విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఫార్మసీ కోర్సులు. బీఫార్మసీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మా-డి), డిప్లొమా ఇన్ ఫార్మసీ.. ఇలా మూడు స్థాయిల కోర్సులకు బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. బీఫార్మసీ, ఫార్మా-డికి ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇవి పూర్తి చేసుకున్న వారికి ఫార్మాస్యుటికల్ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి.
విభిన్న కోర్సులు: బైపీసీ విద్యార్థులకు మరెన్నో ప్రత్యామ్నాయ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ, డైరీటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీ (బీజెడ్సీ)తోపాటు బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్,బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రోబయాలజీ తదితర లైఫ్ సెన్సైస్ కోర్సుల్లో చేరే వీలుంది.
మెడికల్, పారామెడికల్: బైపీసీ విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ సెన్సైస్ తదితర మెడికల్ కోర్సులనూ ఎంచుకోవచ్చు. వీటితోపాటు.. పారామెడికల్ కోర్సులుగా పేర్కొనే ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఆప్టోమెట్రీ, మెడికల్‌ల్యాబ్ టెక్నీషియన్లలో డిప్లొమా, పీజీ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేస్తే.. ప్రభుత్వ వైద్య విభాగాలతోపాటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా.. నర్సింగ్ కూడా చక్కటి అవకాశాలు కల్పిస్తోంది. ప్రస్తుతం బైపీసీ ఉత్తీర్ణులకు డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ స్థాయిల్లో నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కెరీర్ అవకాశాలు: బైపీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉన్న కెరీర్ అవకాశాలను పరిశీలిస్తే.. బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్సులో ప్రవేశం కల్పిస్తుంది. దీనిద్వారా నాలుగేళ్లపాటు శిక్షణనిచ్చి బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్‌తోపాటు ఇండియన్ ఆర్మీకి చెందిన హాస్పిటల్స్‌లో పర్మనెంట్ హోదాలో ఉద్యోగం ఖరారు చేస్తుంది.
సీఈసీ/ఎంఈసీ….
సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్(సీఈసీ); మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్(ఎంఈసీ) గ్రూపుల్లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారికి ఉన్నత విద్య, ఉపాధి మార్గాలకు కొదవలేదు. అన్ని రంగాలూ ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉండడం, ఆర్థిక వనరుల సక్రమ నిర్వహణపైనే కంపెనీల విజయం ఆధారపడి ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కామర్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న బీకామ్, ఎంబీఏ కోర్సులు కూడా ఉన్నత కెరీర్‌కు దారి చూపుతున్నాయి. విద్యార్థులు ఏ కోర్సులో చేరినా.. ఉజ్వల కెరీర్ సొంతం కావాలంటే.. నైపుణ్యాలను పెంచుకోవాలి
సీఏ, సీఎస్, సీఎంఏ: కామర్స్ విభాగంలో ప్రొఫెషనల్ కోర్సులు.. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ), కంపెనీ సెక్రటరీ(సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ). ఇతర గ్రూపుల వారూ ఈ కోర్సుల్లో చేరొచ్చు. సీఈసీ, ఎంఈసీ గ్రూపుల విద్యార్థులకు ఈ కోర్సులు మరింత అనుకూలమనే అభిప్రాయం ఉంది. ప్రతి కోర్సులోనూ ఉండే మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. కార్పొరేట్ సంస్థల్లో అకౌంటింగ్, ఫైనాన్స్, జనరల్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ విభాగాల్లో ఆఫీసర్ హోదాతో కెరీర్ ప్రారంభించొచ్చు.
ఇంటర్ సీఈసీ/ఎంఈసీ విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో బీకామ్ కోర్సు అందుబాటులో ఉంటుంది. బీకామ్(కంప్యూటర్ అప్లికేషన్స్) వంటి కోర్సులు పూర్తిచేయడం ద్వారా ఉన్నతవిద్య/ఉద్యోగం పరంగా మంచి అవకాశాలుంటాయి.
ఉద్యోగావకాశాలు: కామర్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన వారికి తక్షణం ఉపాధి కల్పించే అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కోర్సులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ట్యాలీ, వింగ్స్, ఫోకస్, పీచ్ట్రీ వంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కోర్సుల సర్టిఫికెట్స్ సొంతం చేసుకుంటే.. సంస్థల్లో జూనియర్ స్థాయిలో అకౌంటెంట్స్‌గా కొలువు సాధించే అవకాశం ఉంది.
జీఎస్టీతో జాబ్స్: ప్రస్తుతం జీఎస్టీ అమలవుతున్న నేపథ్యంలో కామర్స్ విద్యార్థులకు ఇది కూడా కలిసొచ్చే అంశంగా మారుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేయడం ద్వారా ఆయా కంపెనీల్లో జీఎస్టీ కన్సల్టెంట్స్గా వ్యవహరించొచ్చు.
హెచ్ఈసీ.. పోటీ పరీక్షలకు మేటి
హెచ్ఈసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య పరంగా బీఏలో చేరొచ్చు. బీఏలో చదివే సబ్జెక్టులపై పట్టుసాధించడం ద్వారా పలు పోటీ పరీక్షల్లో ముందుండేందుకు ఆస్కారం లభిస్తుంది. అత్యున్నత సివిల్ సర్వీసెస్ నుంచి గ్రూప్-4 వరకూ.. అన్ని పోటీ పరీక్షల్లోనూ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర సబ్జెక్ట్‌లు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని హెచ్ఈసీ విద్యార్థులు ఇంటర్మీడియెట్‌తోపాటు బీఏ స్థాయిలోనూ చదువుతారు. కాబట్టి హెచ్ఈసీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిగతా అభ్యర్థులతో పోల్చితే కొంత ముందంజలో నిలుస్తారని చెప్పొచ్చు.
‘లా’: హెచ్ఈసీ విద్యార్థులకు అందుబాటు ఉన్న ముఖ్య కోర్సు.. లా. జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్, రాష్ట్ర స్థాయిలో జరిపే లాసెట్ ద్వారా అయిదేళ్ల బీఏఎల్ఎల్బీ కోర్సులో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. లా కోర్సులో కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కార్పొరేట్ లా తదితర కొత్త సబ్జెక్టులు ప్రవేశపెడుతున్నారు. ఆయా సబ్జెక్టుల అధ్యయనం ద్వారా ‘లా’ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు.. న్యాయవాద వృత్తికే పరిమితం కాకుండా.. కార్పొరేట్ కొలువులు సైతం సొంతం చేసుకునే వీలుంది.