ఎంబీబీఎస్‌లో సీటు రాలేదా.. అయితే ఈ సమాచారం మీ కోసమే..

ఇంటర్‌లో బైపీసీ చదివే విద్యార్థుల ప్రధాన లక్ష్యం మెడిసిన్ (ఎంబీబీఎస్)లో చేరడం..! అందుబాటులో ఉన్న సీట్లు, పోటీ పడుతున్న విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే.. చాలా తక్కువ శాతం మందికి మాత్రమే ఎంబీబీఎస్‌లో ప్రవేశం లభిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయితే బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాచిలర్ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిద్వారా చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకునే వీలుంది. బీహెచ్‌ఎంఎస్ నుంచి బీఎస్సీ(బీజెడ్‌సీ) వరకూ… అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, కెరీర్ అవకాశాల వివరాలు ఇలా…
Career Guidanceబీఏఎంఎస్మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ కోర్సులో ఎంబీబీఎస్ మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పెడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు ఉంటాయి. ఉన్నత విద్య పరంగా ఎండీ ఆయుర్వేద, ఎంఎస్ ఆయుర్వేద కోర్సుల్లో చేరొచ్చు. అంతేకాకుండా ఎంబీబీఎస్‌లోని జనరల్ మెడిసిన్‌కు సరితూగే విధంగా కాయ చికిత్స కోర్సు.. జనరల్ సర్జరీకి సరితూగే శల్యతంత్ర కోర్సు పీజీ స్పెషలైజేషన్లుగా ఉండటం విశేషం.

యునానీ(బీయూఎంఎస్)ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో వైద్య సంబంధ కోర్సు.. బీయూఎంఎస్ (బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీయూఎంఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు పీజీ స్థాయిలో గైనకాలజీ, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, జనరల్ మెడిసిన్, ఫార్మకాలజీలకు సరితూగే ఎండీ, ఎంఎస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

బీహెచ్‌ఎంఎస్బ్యాచిలర్ ఆఫ్ హొమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీహెచ్‌ఎంఎస్).. గత కొన్నేళ్లుగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటోంది. ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్ కరికులంలో ఉండే అనాటమీ, ఫిజియాలజీలను బోధిస్తారు. దీన్ని పూర్తి చేసిన వారు ఉన్నత విద్య పరంగా మెటీరియా మెడికా, హొమియోపతిక్ ఫిలాసఫీ తదితర డిమాండింగ్ స్పెషలైజేషన్లలో చేరొచ్చు. బీహెచ్‌ఎంఎస్ అభ్యర్థులకు భవిష్యత్తులో కెరీర్ పరంగా ఎలాంటి ఢోకా ఉండదనే చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ల పరిధిలో పలు కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్ కోర్సు అందుబాటులో ఉంది.

బీఎన్‌వైఎస్బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలోప్రత్యామ్నాయంగా నిలుస్తున్న మరో కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ యోగిక్ సెన్సైస్(బీఎన్‌వైఎస్). ఈ కోర్సును పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా తదితర విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక కళాశాలలో అందుబాటులో ఉంది.

సీట్ల భర్తీఆయుష్ (ఆయుర్వేద, హొమియోపతి, యునానీ, నేచురోపతి అండ్ యోగా, సిద్ధ మెడిసిన్) కోర్సుల ఔత్సాహిక విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్- యూజీ (అండర్ గ్రాడ్యుయేషన్) పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. నీట్ స్కోర్ ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తెలంగాణలో కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్, ఏపీలో ఎన్‌టీఆర్ యూహెచ్‌ఎస్‌లు కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడతాయి.
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్స్: ntruhs.ap.inknruhs.telangana.gov.in

బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీవైద్య రంగంలో స్థిరపడాలనుకునే వారికి అందుబాటులో ఉన్న మరో చక్కటి ప్రత్యామ్నాయ కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. నాలుగున్నరేళ్ల వ్యవధిలో ఉండే ఈ కోర్సును పూర్తి చేస్తే ఫిజియోథెరపిస్ట్‌లుగా రాణించొచ్చు. స్వయం ఉపాధి అవకాశాలు కూడా సొంతం చేసుకోవచ్చు. ఆర్థోపెడిక్ సర్జరీలు జరిగిన వారికి ఫిజియోథెరపీ తప్పనిసరిగా మారుతోంది. కాబట్టి ఫిజియోథెరపీ కోర్సు చేసిన వారికి ఉపాధి పరంగా ఎలాంటి ఢోకా లేదని చెప్పొచ్చు.

పారా మెడికల్ కోర్సులుబైపీసీ విద్యార్థులకు సత్వర ఉపాధి అందించేవి.. పారా మెడికల్ కోర్సులు. వీటిలో బీఎస్సీ(నర్సింగ్),న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, పెర్‌ఫ్యూజన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వ్యాస్కులర్ టెక్నాలజీ, అనెస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ డిగ్రీ, ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సులు ముఖ్యమైనవి. వీటిని పూర్తి చేయడం ద్వారా హాస్పిటల్స్‌లో వివిధ విభాగాల్లో టెక్నీషియన్స్‌గా స్థిరపడొచ్చు. హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి పారామెడికల్ కోర్సులను భర్తీ చేస్తాయి.

బీవీఎస్‌సీడాక్టర్ హొదాతో పాటు కెరీర్ పరంగా ఉన్నత స్థానాలు అందుకునేందుకు బైపీసీ విద్యార్థుల ముందున్న మరో ప్రత్యేక ప్రత్యామ్నాయ కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్‌సీ). జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు, పశువుల గర్భధారణ పద్ధతులు తదితర అంశాల్లో నైపుణ్యం అందించే కోర్సు ఇది. దీన్ని పూర్తి చేస్తే పౌల్ట్రీ ఫారాలు, ప్రభుత్వ, ప్రైవేటు పశు వైద్య ఆస్పత్రులు, పశుసంవర్థక శాలలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శన శాలలు, డెయిరీ ఫామ్స్, గొర్రెల పెంపక కేంద్రాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్స్: www.tsvu.nic.inwww.SVVU.edu.in

అగ్రికల్చర్ బీఎస్సీఇది వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం తదితర నైపుణ్యాలను అందించే కోర్సు. దీన్ని పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాంకుల్లో సైతం రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ల విభాగంలో కొలువులు అందిపుచ్చుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.angrau.ac.inpjtsau.ac.in

హార్టికల్చర్ సైన్స్పర్యావరణంపై ఆసక్తి కలిగిన వారికి సరితూగే కోర్సు.. బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్. ఈ కోర్సును పూర్తి చేసుకున్న వారికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ సహా పలు బ్యాంకుల్లో అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ప్రైవేట్ డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో హార్టికల్చర్ గ్రాడ్యుయేట్లకు కొలువులు దక్కుతాయి. ఉన్నత విద్య పరంగా పీజీ స్థాయిలో ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరికల్చర్, ప్లాంటేషన్ అండ్ స్పైస్ క్రాప్ ప్రత్యేక అంశాలుగా ఎమ్మెస్సీ చదివేందుకు అవకాశం ఉంటుంది. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.drysrhu.edu.inskltshu.ac.in

బీఎఫ్‌ఎస్‌సీబ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ సంక్షిప్తంగా.. బీఎఫ్‌ఎస్‌సీ. ఇది చేపల పెంపకం, సేకరణకు సంబంధించి ప్రత్యేక పద్ధతులు అనుసరించేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సు. దీన్ని పూర్తి చేసిన వారికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు. తెలంగాణలో పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.svvu.edu.intsvu.nic.in

బీటెక్ – ఫుడ్ టెక్నాలజీప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో బైపీసీ విద్యార్థులకు కెరీర్ పరంగా బెస్ట్‌గా నిలుస్తున్న మరో కోర్సు.. బీటెక్-ఫుడ్ టెక్నాలజీ. ఇది ఆహార ఉత్పత్తుల తయారీ, నాణ్యత, ప్రాసెసింగ్ సంబంధిత నైపుణ్యాలు అందించే కోర్సు. దీన్ని పూర్తి చేయడం ద్వారా ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల్లో కొలువుదీరొచ్చు.

బీఎస్సీ(సీఏబీఎం)బీఎస్సీ(సీఏబీఎం).. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్. బైపీసీ విద్యార్థులకు కార్పొరేట్ కొలువులకు మార్గం వేసే కోర్సు ఇది. ఈ కోర్సు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అన్వయించడం, వాటిద్వారా లాభదాయకత పెరిగేలా చేయడానికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తుంది. దీన్ని పూర్తిచేసిన వారికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్రాప్ పొడక్షన్ కంపెనీల్లో మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

బీఎస్సీ అగ్రి-బయోటెక్ప్రస్తుత ఆధునిక పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన మరో కోర్సు.. బీఎస్సీ అగ్రికల్చర్ బయోటెక్నాలజీ. అగ్రి బయోటెక్‌గా పిలిచే ఈ కోర్సు ద్వారా టిష్యూ కల్చర్, జెనెటిక్ ఇంజనీరింగ్, మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ తదితర అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు.

బీఎస్సీ-న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్బైపీసీ విద్యార్థులకు కెరీర్ పరంగా మంచి అవకాశాలను అందిస్తున్న మరో కోర్సు.. బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ ఫుడ్‌సైన్స్. ఆహార పదార్థాల నాణ్యతతోపాటు ఎక్కువ కాలం మన్నే విధంగా ప్రాసెసింగ్ నైపుణ్యాలను అందించే ఈ కోర్సును పూర్తి చేసిన వారికి ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీస్, రీసెర్చ్ ల్యాబ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. అదే విధంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో, హొటల్స్‌లో డైటీషియన్స్ గా ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.

బీఎస్సీ (బీజెడ్‌సీ)బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న బ్యాచిలర్ డిగ్రీ కోర్సు… బీఎస్సీ(బీజెడ్‌సీ). ప్రస్తుతం ఈ కోర్సులోనూ వినూత్న స్పెషలైజేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. బయో టెక్నాలజీ, మైక్రోబయాలజీ తదితర కాంబినేషన్లతో బీజెడ్‌సీ గ్రూప్‌ను పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి.

సీట్ల భర్తీ ఇలా..వ్యవసాయ సంబంధ కోర్సులను తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ యూనివర్సిటీలు నిర్వహిస్తున్నాయి. ఎంసెట్(అగ్రికల్చర్ స్ట్రీమ్) ర్యాంకు ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల భర్తీ చేస్తాయి. సాధారణంగా ఈ ప్రక్రియ జూలై చివరి వారంలో ఉంటుంది.

ముఖ్యాంశాలు

 • ఆయుష్ కోర్సుల్లో సీట్ల భర్తీ – నీట్ స్కోర్ ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా జరుగుతుంది.
 • పారామెడికల్ కోర్సుల్లోని సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఏపీలో 2019 నుంచి ఎంసెట్ (ఏ అండ్ ఎం స్ట్రీమ్) ర్యాంకు ఆధారంగా పారా మెడికల్ సీట్ల భర్తీ జరుగుతోంది.
 • వెటర్నరీ సీట్లకు సంబంధిత యూనివర్సిటీలు ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తారు.
 • వ్యవసాయ సంబంధిత కోర్సులకు అగ్రికల్చర్ యూనివర్సిటీల ఆధ్వర్యంలో ఎంసెట్ (ఏ అండ్ ఎం స్ట్రీమ్) ఆధారంగా ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుంది.
 • ఆయుష్ మినహా అన్ని కోర్సులకు ఎంసెట్(ఏ అండ్ ఎం స్ట్రీమ్)లో ర్యాంకు తప్పనిసరి.

బైపీసీతో విభిన్న కోర్సులెన్నో..!

బైపీసీ అంటే.. ఎంబీబీఎస్, అగ్రికల్చరల్ కోర్సులేకాదు.. అత్యున్నత శిఖరాలకు ఎదగడానికి ఇంకా ఎన్నో మార్గాలున్నాయి. మెడిసిన్‌లో సీటు లభిస్తే.. మంచిదే! లేకున్నా… లైఫ్ సెన్సైస్‌తో ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, జెనెటిక్ ఇంజనీరింగ్, బాటనీ, జువాలజీలతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని… పీజీ, పీహెచ్‌డీలతో రీసెర్చ్, టీచింగ్ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు!!
బీఎస్సీలో లైఫ్ సెన్సైస్ కాంబినేషన్లుఉస్మానియా యూనివర్సిటీ అందిస్తున్నవి:

 • మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ; బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, జెనిటిక్స్, కెమిస్ట్రీ; బాటనీ, కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ; బాటనీ, కెమిస్ట్రీ,అప్లయిడ్ న్యూట్రిషన్; జువాలజీ, కెమిస్ట్రీ, అప్లయిడ్ న్యూట్రిషన్; కెమిస్ట్రీ, బాటనీ, బయోకెమిస్ట్రీ; కెమిస్ట్రీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ; కెమిస్ట్రీ, జెనిటిక్స్, బయోకెమిస్ట్రీ; కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ; బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్; బాటనీ, కెమిస్ట్రీ, క్లినికల్ న్యూట్రిషన్; మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, జెనిటిక్స్, బయోకెమిస్ట్రీ; బాటనీ, కెమిస్ట్రీ/జువాలజీ, జెనిటిక్స్; బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ; బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ; బయోఫిజిక్స్, జెనిటిక్స్, కెమిస్ట్రీ; కెమిస్ట్రీ, బాటనీ, జెనిటిక్స్.
 • ఆంధ్రాయూనివర్సిటీ… బాటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, హ్యుమాన్ జెనిటిక్స్, మెరైన్ లివింగ్ రీసోర్సెస్, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్‌ల్లో.. లైఫ్ సెన్సైస్ కోర్సులను అందిస్తోంది.
 • హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీ… బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ మైక్రోబయాలజీ, ప్లాంట్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, ఓషన్ అండ్ అట్మాస్పియరిక్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది. వీటిలో చేరేందుకు అర్హత సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్.
 • కాకతీయ యూనివర్సిటీ… బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనిటిక్స్, జువాలజీ, ఫిషరీ బయాలజీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ తదితర సబ్జెక్టుల్లో వివిధ స్థాయిల్లో కోర్సులను అందిస్తోంది.
 • శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పీజీ స్థాయిలో బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, అప్లయిడ్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
 • ఇంటర్ లేదా 10+2లో బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు వివిధ కాంబినేషన్లలో ఆయా లైఫ్ సెన్సైస్ సబ్జెక్టుల్లో డిగ్రీ పాసయ్యాక.. బయెటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, జెనెటిక్స్, ఫోరెన్సిక్ సైన్స్, క్లినికల్ రీసెర్చ్, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ వంటి కోర్సుల్లో పీజీ, పీహెచ్‌డీ వరకు ఉన్నత విద్య కొనసాగించవచ్చు. తద్వారా ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు.

బయోటెక్నాలజీబయూలజీ, టెక్నాలజీల కలరుుకతో రూపుదిద్దుకున్న బయోటెక్నాలజీ.. రీసెర్చ్ ఓరియెంటెడ్ సైన్స్. వారసత్వంగా సంక్రమించే వ్యాధులకు వ్యాక్సిన్లు, వైద్య, ఆరోగ్య అంశాలకు సంబంధించిన బయలాజికల్ ఇండికేటర్ల తయూరీ.. పరిశ్రమల వ్యర్థాలను బయూలాజికల్‌గా తొలగించడం వంటి విధులను బయోటెక్నాలజిస్ట్‌లు నిర్వహించాలి.

ప్రవేశం: మన రాష్ట్రంలో బ్యాచిలర్స్ స్థారుులో బీఎస్సీ(బయోటెక్నాలజీ), బీటెక్ (బయోటెక్నాలజీ) కోర్సులు అందుబాటులో ఉన్నారుు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైనవారు వీటికి అర్హులు. బీఎస్సీ (బయోటెక్నాలజీ), ఎంఎస్సీ కోర్సులను రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు నిర్వహిస్తున్నారుు. పీజీ కోర్సుల్లో ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌లాధారంగా ప్రవేశం ఉంటుంది.

ప్రముఖ సంస్థలు: దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఐఐటీలు. వీటిలో కొన్ని ఐఐటీలు నాలుగేళ్ల బీఈ/బీటెక్ స్థాయిలో బయోటెక్నాలజీ, బయోలాజికల్ సెన్సైస్ అండ్ బయోఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ అందిస్తున్నాయి. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయూలు, ఇతర ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ స్థారుులో కూడా బయోటెక్నాలజీ, దాని అనుబంధ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇక ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశం పొందాలంటే ఐఐటీ జారుుంట్ అడ్మిషన్ టు ఎంఎస్సీ(జామ్) పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి.

జేఎన్‌యూ పరీక్ష కూడా ప్రధానమే:పీజీ స్థారుులో బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణికంగా నిలుస్తున్న ‘గేట్’, ‘జామ్’లతో పాటు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) నిర్వహించే ఆల్ ఇండియూ బయోటెక్నాలజీ ఎంట్రన్స్ టెస్ట్‌కు కూడా ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకుల ప్రాతిపదికగా దేశంలోని దాదాపు 32 యూనివర్సిటీలు ఎంఎస్సీలో ప్రవేశం కల్పిస్తున్నారుు.

అవకాశాలు:ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆక్వాకల్చర్, బయోటెక్నాలజీ పరిశ్రమలు, కెమికల్, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో అవకాశాలు విరివిగా ఉంటాయి. రీసెర్చ్ సైంటిస్ట్, టీచర్, మార్కెటింగ్ మేనేజర్, బయోఇన్ఫర్మాసిస్ట్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌లుగా కెమికల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. బయోటెక్నాలజీ కంపెనీలు బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ ఉన్న వారిని కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లుగా నియమించుకుంటున్నాయి. ప్రభుత్వాలు నిర్వహించే పలు కాలేజీలు, యూనివర్సిటీలు, పరిశోధన సంస్థల్లో సైంటిస్ట్, అసిస్టెంట్స్‌గా బయోటెక్నాలజీ అభ్యర్థులకు అవకాశాలుంటాయి.

బయోఇన్ఫర్మాటిక్స్మాలిక్యులర్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్‌ల కలయికే.. బయోఇన్ఫర్మాటిక్స్. బయోటెక్నాలజీ పరిశోధనల వల్ల డేటా రూపంలో లభ్యమవుతున్న సమాచారాన్ని సాఫ్ట్‌వేర్ సహకారంతో నిక్షిప్తం చేసుకోవాలి. ఈ విధులను నిర్వర్తించేందుకు బయోఇన్ఫర్మాటిక్స్ చదివిన అభ్యర్థులు అవసరం. వివిధ వ్యాధులకు కారణాలు, వాటి నివారణకు ఉపయోగపడే నూతన ఔషధాలు, జీనోమ్ అసెంబ్లీ, ప్రొటీన్ స్ట్రక్చర్ వంటి అంశాలపై కూడా వీరు పరిశోధనలు చేస్తుంటారు.

అవకాశాలు:
 బయోఇన్ఫర్మాటిక్స్ చేసిన వారికి ఐటీ కంపెనీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ కంపెనీలు, వివిధ పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటాయి. పీజీ స్థాయిలో బయోఇన్ఫర్మాటిక్స్ ఎంఎస్సీ, ఎంటెక్ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఇందులో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు, అడ్వాన్‌‌స డిప్లొమా కోర్సులు, డిగ్రీ, పీజీ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి నైపుణ్యం, అనుభవాన్ని బట్టి నెలకు రూ. 10,000 నుంచి రూ.50,000 వరకు జీతం లభిస్తుంది.

ఎంఎస్సీ బయోఇన్ఫర్మాటిక్స్ కోర్సును అందిస్తోన్న సంస్థలు:ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లైడ్ బయోటెక్నాలజీ-బెంగళూరు; కోర్సు: ఎంఎస్సీ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ బయోటెక్నాలజీ; వెబ్‌సైట్: www.ibab.ac.in

బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి
కోర్సు: ఎంఎస్సీ బయోఇన్పర్మాటిక్స్వెబ్‌సైట్: www.bhu.ac.in

యూనివర్సిటీ ఆఫ్ పుణేకోర్సు: ఎంఎస్సీ బయోఇన్ఫర్మాటిక్స్వెబ్‌సైట్: www.unipune.ac.in

ఎంటెక్ (బయోఇన్ఫర్మాటిక్స్)ను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:ఐఐఐటీ-హైదరాబాద్; వెబ్‌సైట్: www.iiit.ac.in
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ;
వెబ్‌సైట్: www.uohyd.info

ఫోరెన్సిక్ సైన్స్నేర పరిశోధనలో ఆధారాలను సేకరించడంలో ఫోరెన్సిక్ సైన్స్ కీలక పాత్ర వహిస్తోంది. ఇష్టపడే వారికి చక్కని కెరీర్ ఫోరెన్సిక్ సైన్స్. ఈ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ నేర పరిశోధన సంస్థలు, సీబీఐ, ఐబీ, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌తోపాటు ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీల్లోను అవకాశాలుంటాయి. ఫోరెన్సిక్ సైన్స్‌లో.. జరిగిన సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించడానికి ఉపయోగించే టెక్నిక్స్,సేకరించిన వాటిని శాస్త్రీయంగా విశ్లేషించడం వంటి నేర పరిశోధనకు ఉపకరించే అంశాలు ఈ కోర్సులో ఉంటాయి.
విభాగాలు:ఫోరెన్సిక్ ఆర్కియాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ లింగ్విస్టిక్స్, ఫోరెన్సిక్ సిరియాలజీ, ఫోరెన్సిక్ కంప్యూటింగ్.

కోర్సులు: గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్, డిప్లొమా స్థాయిల్లో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు అందుబాటులో ఉంది. మెడిసిన్, ఆంత్రోపాలజీ, సైకాలజీ చేసిన వారికి కూడా ఆయా రంగాలకు చెందిన స్పెషలైజ్డ్ కోర్సులను ఎంచుకునే అవకాశం ఉంది.

స్కిల్స్: బృందంలో పని చేయగలగడం, వివిధ పద్ధతుల్లో సమాచారాన్ని సేకరించడం, పరిశోధనల పట్ల అభిరుచి, విశ్లేషణ సామర్థ్యం వంటి లక్షణాలు ఫోరెన్సిక్ సైన్స్ చదవాలనుకునేవారికి తప్పనిసరి.

ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:మన రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్, మాస్టర్ స్థాయిలో ఎంఎస్సీ(ఫోరెన్సిక్ సైన్స్)ను అందిస్తోంది. కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది.

ఉపాధికి గ్యారెంటీపారామెడికల్ కోర్సులు: బైపీసీ విద్యార్థులకు వెంటనే ఉపాధి కల్పించేవి పారామెడికల్ కోర్సులు. వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షల నిర్వహణ, రిపోర్టింగ్ చేయడం మెడికల్ ల్యాబ్‌టె క్నీషియన్ పని. కోర్సు పూర్తిచేసిన వెంటనే డయాగ్నోస్టిక్ సెంటర్‌‌సలో రూ.10,000 నుంచి రూ.15,000 వరకు వేతనంతో ఉద్యోగాలు లభిస్తాయి. మన రాష్ర్టంలో అనేక ప్రయివేట్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఈ కోర్సులున్నాయి. ఇంటర్‌లో మొత్తం మార్కులను బట్టి ఎన్‌టీఆర్‌యూ హెచ్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.

ఫిజియోథెరపి: వ్యాయామ పరికరాలను అవసరానికనుగుణంగా ఉపయోగించే శిక్షణ, ఎలక్ట్రోథెరపి, మాగ్నటోథెరపి, మసాజ్, దెబ్బతిన్న కండర పునరుత్పత్తికి, లిగమెంట్స్, టెండాన్ సమస్యల పరిష్కారానికి ఫిజియో థెరపిస్టులు అత్యవసరం. అమెరికాలో ఫిజియోథెరపికి మంచి డిమాండ్ ఉంది. మన రాష్ర్టంలోని 38 కాలేజీల్లో మొత్తం 1815 ఫిజియోథెరపి సీట్లు ఉన్నాయి. వీటిని ఇంటర్‌లో మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు.

నర్సింగ్: ఇంటర్‌లో మార్కుల ఆధారంగా నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. మన రాష్ట్రంలో సుమారు 9862 సీట్లు ఉన్నాయి. నర్సింగ్‌లో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్, రెండేళ్ల ఎంఎస్సీ నర్సింగ్, రెండేళ్ల డిప్లొమా కోర్సులు న్నాయి. డిప్లొమా వారికి రూ. 5000 నుంచి రూ.10,000.. డిగ్రీ ఉన్న వారికి రూ.15,000 నుంచి రూ. 20,000 నెలసరి వేతనాలు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో లభిస్తున్నాయి. నర్సింగ్ పూర్తిచేసినవారికి మన దేశంతో పాటు, అమెరికా, పశ్చిమ ఆసియాలలో మంచి వేతనాలు లభిస్తున్నాయి.

శానిటరీ ఇన్స్‌పెక్టర్: ఇది రెండేళ్ల కోర్సు. పంచాయితీరాజ్, మున్సిపాలిటీలలో ప్రభుత్వ ఉద్యోగావకాశాలు మెండు. హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్ పొందవచ్చు. రూ.10,000 నుంచి 20,000 వరకు జీతం లభిస్తుంది.

ఎక్స్ రే, రేడియాలజిస్టు: ఇవి మంచి ఉద్యోగ అవకాశాలున్న కోర్సులు. శరీర భాగాల స్కానింగ్, సిటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ నిర్వహించడానికి రేడియాలజీ విభాగంలో శిక్షణ ఇచ్చే రెండేళ్ల కోర్సు ఇది. ఇంటర్‌లో మార్కుల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. అనుభవాన్ని బట్టి రూ.10,000 నుంచి రూ.20,000 వేతనాలుంటాయి.

ఆప్టోమెట్రి: ఇది నాలుగేళ్ల కోర్సు. పూర్తయిన వెంటనే ఆప్టేషియన్ ఉద్యోగం లభిస్తుంది. బాస్ అండ్ లాంబ్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెటస్, హైదరాబాద్; ఏఐఐఎంఎస్, బీవీయూ, పూణె, ఇగ్నో, మధురై నేత్ర చికిత్సాలయం, అగర్వాల్ నేత్ర చికిత్సాలయం, ఎల్.వి.ప్రసాద్ నేత్ర చికిత్సాలయం దీన్ని నిర్వహిస్తున్నాయి.

జెనెటిక్స్జన్యువుల ద్వారా జీవుల్లోని మార్పులను అధ్యయనం చేసే శాస్త్రమే జెనెటిక్స్. ఇది బయోటెక్నాలజీ, మైక్రోబయూలజీలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇందులో హ్యూమన్ జెనెటిక్స్, మాలిక్యులర్ జెనెటిక్స్, మెడికల్ జెనెటిక్స్ వంటి ప్రత్యేకాంశాలు ఉంటారుు.

అవకాశాలు: ఈ కోర్సు పూర్తిచేసినవారికి హెల్త్‌కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్, అగ్రికల్చర్, బ్యూటీ కేర్, ఫార్మాస్యూటికల్, డెయి రీ, బయోటెక్నాలజీ రంగంతో ముడిపడి ఉన్న పరిశ్రమలు, విద్యా సంస్థలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో అవకాశాలుంటాయి. ఉస్మానియా, కాకతీయ, ఆంధ్రా యూనివర్సిటీలు జెనెటిక్స్ కోర్సును అందిస్తున్నాయి.

B.Sc.

New combinations at degree level
Most of the BiPC students would opt for BZC combination in their B.Sc. However, they have many more options to choose from. Several new subject combinations have been introduced to cater to the emerging needs of the industry. Particularly, the commercial and industrial expansion of microbiology, biochemistry, biotechnology and genetics has created the need for such introduction. These new combinations offer great opportunities to the students those who are inclined towards research and higher studies and resolved to make a bright career in the sciences.
 
Here are the details of those new combinations that are being offered by the universities in Andhra Pradesh:
 • Botany, Geology, Chemistry
 • Botany, Geology, Geography
 • Geography, Zoology, Geology
 • Geography, Geology, Chemistry
 • Chemistry, Zoology, Geology
 • Chemistry, Geology, Physics
 • Chemistry, Geology, Genetics
 • Microbiology, Zoology, Chemistry
 • Chemistry, Botany, Genetics
 • Microbiology, Genetics, Chemistry
 • Fisheries, Zoology, Chemistry
 • Botany, Chemistry, Forestry
 • Botany, Chemistry, Applied Nutrition
 • Zoology, Chemistry, Applied Nutrition
 • Botany, Applied Nutrition, Public Health
 • Botany, Zoology, Applied Nutrition
 • Chemistry, Applied Nutrition, Public Health
 • Chemistry, Botany, Biochemistry
 • Chemistry, Zoology, Biochemistry
 • Chemistry, Microbiology, Biochemistry
 • Chemistry, Genetics, Biochemistry
 • Botany, Chemistry, Genetics
 • Botany, Zoology, Genetics
 • Botany, Chemistry, Computer Applications
 • Botany, Chemistry, Clinical Nutrition Dietetics
 • Microbiology, Biochemistry, Chemistry
 • Microbiology, Genetics, Biochemistry
 • Microbiology, Chemistry, Computer Applications
 • Microbiology, Biotechnology, Chemistry
 • Biotechnology, Zoology, Chemistry
 • Botany, Seed Technology, Computer Applications
 • Biophysics, Genetics, Chemistry
Students can visit the websites of respective universities to learn more about the combinations that are being offered by them.
 
Zoology
Zoology is the branch of biology that studies different aspects of animal kingdom such as structure, embryology, evolution, classification, habits and distribution of the animals.
Most of the students those who complete masters in Zoology take up teaching positions. They are also eligible for the positions such as zoo curators, educators, biological lab technicians, animal behaviorists, rehabilitators and conservists in zoological parks, wildlife services, botanical gardens, nature reserves, different research organisations and national parks.
Chemistry
Chemistry studies the composition, properties and behavior of matter. This is the most sought after among the BiPC subjects. Students those who could make it to M.Sc. and Ph.D. levels can access the opportunities in both industry and academia. A good number of the students are settling down in teaching profession. Besides teaching, they can also join in pharmaceutical companies, research organisations, food processing industries, beverage companies and R&D divisions of the different industries as chemists.
Biotechnology
Biotechnology is the use of living systems and organisms to develop or make useful products, or any technological application that uses biological systems, living organisms to make or modify products or processes for specific use. It is a blend of biology and technology and includes subjects such as genetics, biochemistry, microbiology, biology, chemistry and engineering. This is a research-oriented subject.
Opportunities: At present medical biotechnology and agricultural biotechnology sectors are offering jobs to biotechnologists. About 70% of the revenue is being generated by medical biotechnology in the country. Companies like Shantha Biotech, Dr. Reddy’s Labs, Wockhardt are hiring the biotechnology graduates. The companies that are engaged in development and production of seeds, plantation and fertilizers are also hiring the biotechnologists.
Microbiology
Microbiology is the study of microscopic organisms, either unicellular (single cell), multicellular (cell colony), or acellular (lacking cells). It includes the disciplines such as virology, mycology, parasitology, bacteriology, among others. Students would be trained on the relationship between the microscopic organisms, humans and essential participants of human environment such as fauna and flora.
After bachelors degree, students can specialise in areas such as bacteriology, virology, mycology, parasitology, and become medical microbiologists, agricultural microbiologists, industrial microbiologists and general microbiologists.
After completion of studies, they can find jobs in research organisations, Pharma companies, food and beverage production units and government and private hospitals. Own diagnostic centres also can be started microbiology graduates.
Biochemistry
Biochemistry is also called as biological chemistry, is the study of chemical processes within, and relating to, living organisms. Over the last 40 years biochemistry has become so successful at explaining living processes that now almost all areas of the life sciences from botany to medicine are engaged in biochemical research. Today the main focus of pure biochemistry is in understanding how biological molecules give rise to the processes that occur within living cells, which in turn relates greatly to the study and understanding of whole organisms.
Biochemists can find opportunities, which have improved of late, in agriculture, medical and nutrition fields. Now, the government and private medical institutions, hospitals, agricultural and pharmaceutical companies are hiring them.
Forestry
Forestry is the science, art, and craft of creating, managing, using, conserving, and repairing forests and associated resources to meet desired goals, needs, and values for human benefit. Issues such as global warming, deforestation, disaster mitigation are also included in the curriculum.
After bachelor’s degree, students can opt for specialisations such as forest management, commercial forestry, forest economics, wood and science technology and wildlife sciences. Those who completed their postgraduate degrees in the aforementioned specialisations can find jobs in government departments, NGOs, corporate companies and industries. They are also eligible for Indian Forest Service exams.
Nutrition
Nutrition investigates the dietary habits of the people and nutritional values of different foods in a scientific manner. After B.Sc., students can opt for food sciences and nutrition specilisation in their M.Sc. Home Science.
They can later get into positions such as administrative dieticians, clinical dieticians and research dieticians. Generally, nutrition graduates would be hired hospitals and food and beverage companies. They also can go research and teaching.
Genetics
Genetics, a discipline of biology, is the science of genes, heredity, and variation in living organisms. This subject consists of specialisations such as human genetics, molecular genetics and medical genetics. The experts in this genetics can find employment in health care, food processing, horticulture and agriculture.
Botany
Botany or plant biology is a discipline of biology and the science of plant life. Those who have done masters in this subject mostly take up teaching positions. Besides that, they also can join in positions such as environment consultants, plant explorers, ecologists, park rangers, foresters, nursery mangers, plant biochemist, plant pathologist and farming consultants.
Higher Education after B.Sc.
After B.Sc., students can join in programmes such as M.Sc., integrated M.Sc.-Ph.D. and Ph.D.
M.Sc.
All most all the universities in our state are offering M.Sc. programmes in the aforestated combinations. Students can also do PG programmes from prestigious institutions such as IITs, IISc, IIITs and national institutes. They are also eligible for M.Sc. in Forensic Science.
M.Sc. in IITs
BSC students can pursue M.Sc. in prestigious Indian Institutes of Technology (IITs) upon securing rank in the Joint Admission Test for M.Sc. (IIT-JAM) conducted by the IITs. Based on the rank in this exam, students can join M.Sc., Joint M.Sc.-Ph.D. and M.Sc.-Ph.D. duel degree programmes in IITs. The JAM is conducted in 8 subjects and the entrance of some of the subjects also provides opportunity to join in other subjects. JAM notification is regularly issued in November/ December months.
The Programmes on Offer:
 • IIT-Bombay: Applied Geology, Biotechnology, Chemistry and M.Sc.-Ph.D. duel degree in Biotechnology.
 • IIT-Khargpur: Joint M.Sc.-Ph.D. programme in Chemistry.
 • IIT-Delhi: M.Sc. Chemistry.
 • IIT-Gauhati: M.Sc. Chemistry.
 • IIT-Kanpur: M.Sc. Chemistry.
 • IIT-Madras: M.Sc. Chemistry.
 • IIT-Roorkee: M.Sc. Biotechnology, Chemistry.
 • IIT-Hyderabad: M.Sc. Chemistry.

M.Sc. in AIIMS

The All India Institute of Medical Sciences (AIIMS), the prestigious medical institution in the country, has been offering M.Sc. programmes. Here are the details:
M.Sc., M. Biotech. (Anatomy, Biochemistry, Physiology and Pharmacology).
Eligibility: Pass of B.Sc./B.V.Sc./MBBS/BDS with minimum 60 % marks.
 
M.Sc (Perfusion Technology)
Eligibility: B.Sc. (Biology)/ B.Sc. (Perfusion Technology).
M.Sc. (Urology Technology).
Eligibility: B.Sc. with Biology as a main subject.
Admission into these programmes will be made based on the performance in the all-India entrance exam conducted by the institute. Entrance notification would be issued in the March and exam would be conducted in July.
For more details, log on to AIIMS website – www.aiims.edu
All-India Biotechnology Entrance Test
The Delhi-based Jawaharlal Nehru University conducts the All-India Biotechnology Entrance Test every year and the ranks of this test is being accepted by 32 prestigious universities and institutes including Hyderabad Central University for admission into their M.Sc. and PG Diploma programmes in Biotechnology.
National Institute of Virology
The NIV is one of the reputed virus research laboratories in the country, which works under the Indian Council for Medical Research (ICMR). The curriculum of M.Sc. (Virology) programme offered at NIV has been developed to cater to the needs of the industry and health sector.
Eligibility: B.Sc. (Microbiology, Zoology, Botany, Chemistry, Biochemistry, Biotechnology, Life Sciences)/ B.V.Sc./MBBS.
Admission will be given based on the student’s performance in the all-India entrance examination conducted by the institute, for which the notification is issued in every April.
Website: www.niv.co.in
M.Sc. in Forensic Science
The ever-expanding role of forensic science in solving cases has been well recognised. Forensic experts play an important role in collecting clues and samples from crime spot and analyzing to take the case to a logical end.
The M.Sc. programme in Forensic Science is being offered by Osmania University in Andhra Pradesh. The number of seats on offer is 24 and all of them are self-financed.
Here are the details of the other universities that are offering M.Sc. in Forensic Science:
Department of Forensic Sciences, Punjabi University.
Programme: M.Sc. Forensic Science
Eligibility: B.Sc./BDS/MBBS
Programme: Diploma in Forensic Science (Evening)
EligibilityB.Sc.
Department of Chemistry, Gujarat University.
Programme: M.Sc. Forensic Science
Eligibility: B.Sc. with minimum of 50% marks.
Department of Anthropology, University of Delhi.
Programme: PG Diploma in Forensic Science
Website: www.du.ac.in
Ph.D.
All the universities in the state are offering Ph.D. programmes in aforestated combinations. After Ph.D., one can take up the positions such as lecturer and assistant professor in colleges and universities and research associates and scientists in research organisations and departments. The starting salary ranges between Rs. 15,000 to Rs. 1 lakh based the candidate’s worth and the position that he is selected for.

Bioinformatics

This subject is resulted from the blend of Molecular Biology and Information Technology. It is about compilation and mining of the data prepared through biotechnological research. Informatics is a major subject of bioinformatics.
 
Courses Details:
Bioinformatics is offered in different bachelor’s and master’s programmes such as B.Sc. in Bioinformatics, B.Sc. in Biotech and Bioinformatics, Diploma in Bioinformatics, M.Sc. in Bioinformatics, PG Diploma in Bioinformatics and Advanced PG Diploma in Bioinformatics.
 
Bioinformatics National Certification Examination (BINC)
On behalf of the Department of Biotechnology, JNU conducts the BIMC every year. Those who have graduated with Science, Agriculture, Veterinary, Medicine, Pharmacy and Engineering subjects are eligible for this exam.
 
Opportunities: The bioinformatics specialists get opportunities in IT companies, pharmaceutical companies, healthcare, biotechnology and medical research organisations.
Following are the institutions that are offering PG programmes in Bioinformatics:
 
• Jawaharlal Nehru University, New Delhi.
• Birla Institute of Technology and Science, Pilani.
• Hyderabad Central University, Hyderabad.
• International Institute of Information Technology, Hyderabad.
• Indian Institute of Chemical Technology, Hyderabad.
• Amity Institute of Nano Technology, Noida.
• University of Pune, Pune.
• University of Mumbai, Mumbai.