నర్సింగ్‌ కోర్సులు

నర్సింగ్‌ విద్యాసంస్థను ఎంపిక చేసుకోవడానికి ముందు.. ఆ సంస్థకు భారతీయ నర్సింగ్‌ మండలి నుంచి గానీ, రాష్ట్ర నర్సింగ్‌ మండలి నుంచిగానీ గుర్తింపు, అనుమతులున్నాయా? లేవా? అనేది కచ్చితంగా సరిచూసుకోవాలి. – ఇందుకోసం నర్సింగ్‌ మండలి అధికారిక వెబ్‌సైట్‌లో http://www.indiannursingcouncil.org చూడొచ్చు.
– నర్సింగ్‌ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి కనీసం 100 పడకలది ఉండాలి.
– విద్యాభ్యాస సమయంలోనే ఆసుపత్రుల్లో అనుభవపూర్వక శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ తరహా ఏర్పాట్లు కళాశాల నిర్వహిస్తుందా? లేదా? చూసుకోవాలి.
– వసతిగృహాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాల, పరిపాలన విభాగం, 24 గంటల నీళ్ల సరఫరా, కఠినమైన భద్రత, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలి.
నర్సింగ్‌ విద్యను ఐదు విభాగాలుగా విభజిస్తారు. ఇందులో పై స్థాయి నుంచి చూసుకుంటే..
ఎంఎస్సీ నర్సింగ్‌
పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌
బీఎస్సీ నర్సింగ్‌
జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కోర్సు (జీఎన్‌ఎం)
యాగ్జ్జిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (ఏఎన్‌ఎం)
ఏ స్థాయి నర్సింగ్‌ కోర్సును పూర్తిచేసినా కెరియర్‌ వృద్ధి చాలా బాగా ఉంటుందని నిపుణులు అభిప్రాయం. మనదేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సాధారణంగా అన్ని విభాగాల్లోనూ ఈ కోర్సుల ప్రవేశ ప్రకటనలు జులై- ఆగస్టు మాసాల్లోనే వెలువడుతాయి. ఏఎన్‌ఎం: దీనికి ఇంతకుముందు 10వ తరగతి అర్హతగా ఉండేది. 2012 నుంచి ఇంటర్మీడియట్‌ను కనీస అర్హతగా నిర్ణయించారు. రెండేళ్ల కోర్సు ఇది. ఇంటర్‌లో ఏ గ్రూపు వారైనా చేరొచ్చు. క్షేత్రస్థాయిలో, గ్రామీణంలో ఎక్కువగా అవకాశాలుంటాయి.
జీఎన్‌ఎం: ఇంటర్మీడియేట్‌ అర్హత. మూడేళ్ల డిప్లొమా కోర్సు ఇది. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం బైపీసీ విద్యార్థులకు మాత్రమే అర్హత. ప్రైవేటు కళాశాలల్లో ఏ గ్రూపువారికైనా ప్రవేశం ఉంటుంది. ఈ కోర్సు పూర్తిచేసినవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో స్టాఫ్‌ నర్సులుగా పనిచేస్తుంటారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరిన జీఎన్‌ఎం విద్యార్థులకు నెలకు రూ.1500 ఉపకార వేతనం లభిస్తుంది. ప్రతి ఏడాదికీ రూ.200 చొప్పున పెరుగుతుంది.
3. బీఎస్సీ నర్సింగ్‌: ఇంటర్మీడియట్‌లో బైపీసీ తప్పనిసరిగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు రెండింటిలోనూ బైపీసీ అభ్యర్థులే అర్హులు. నాలుగేళ్ల కోర్సు ఇది. బీఎస్సీ విద్యార్థులకు కూడా నెలకు ఉపకార వేతనం రూ.1500 చొప్పున లభిస్తుంది. ఏటా రూ.200 చొప్పున పెరుగుతుంది. తెలంగాణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో డా. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో సీట్లు భర్తీ చేస్తారు.
పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌: జీఎన్‌ఎం చేసినవారు ఒక సంవత్సరం అనుభవంతో దీనికి అర్హులు. రెండేళ్ల వ్యవధి రెగ్యులర్‌ కోర్సు ఇది. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దూరవిద్య విధానంలో అభ్యసిస్తే మాత్రం మూడేళ్లు. తెలంగాణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో డా. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో సీట్లు భర్తీ చేస్తారు.
5. ఎంఎస్సీ నర్సింగ్‌: బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసినవారు అర్హులు. రెండేళ్ల కాలవ్యవధి ఉండే కోర్సు ఇది. గతంలో ప్రవేశపరీక్షను నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంఎస్సీ నర్సింగ్‌ సీట్లను భర్తీ చేసేవారు. తెలంగాణలో తొలిసారిగా ఎలాంటి ప్రవేశపరీక్ష లేకుండానే.. గత ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్‌ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాల కోర్సులకు రిజర్వేషన్ల నిబంధనలను, ప్రతిభను ప్రాతిపదికగా చేసుకునే సీట్లను భర్తీ చేస్తున్నారు. తెలంగాణలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో డా. ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో సీట్లు భర్తీ చేస్తారు.
స్పెషలిస్టు కోర్సులు
– ఎంఎస్సీ నర్సింగ్‌లో స్పెషలిస్టు విద్యకు అవకాశాలున్నాయి.
-మెడికల్‌, సర్జికల్‌ నర్సింగ్‌, సామాజిక వైద్యం (కమ్యూనిటీ హెల్త్‌), మానసిక వైద్యం, శిశు ఆరోగ్యం, స్త్రీ వైద్యంలో ప్రత్యేకంగా నర్సింగ్‌ కోర్సులున్నాయి.
-ఇవి కాకుండా ఐసీయూ, ఆర్థోపెడిక్‌, నవజాత శిశు సంరక్షణ (నియోనాటల్‌), ప్రసవాలు.. తదితర విభాగాల్లోనూ ఒక సంవత్సరం కోర్సు ఉంటుంది.
-జీఎన్‌ఎం, బీఎస్సీ తర్వాత.. ఈ డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు.
-స్పెషాలిటీ కోర్సులు చేసినవారు ప్రత్యేకంగా ఆ విభాగాల్లోనే నైపుణ్యం సంపాదించి, అందులోనే సేవలందిస్తుంటారు.
నర్సింగ్‌ విద్యాభ్యాసంలోనే సైకాలజీ, సోషియాలజీ సబ్జెక్టులుంటాయి.

నర్సింగ్

వైద్యులు చికిత్స చేసిన తర్వాత రోగులు త్వరగా కోలుకోవాలంటే.. నర్సింగ్ సేవలు చాలా అవసరం. రకరకాల శారీరక, మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులకు సేవలందించే వారే.. నర్సులు. నర్సులు నిరంతరం రోగుల పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా ఇస్తారు.

శస్త్రచికిత్సల సమయంలో ఆపరేషన్ థియేటర్లు, క్లినికల్ లేబొరేటరీల్లో వైద్యపరికరాలను అందుబాటులో ఉంచడంతోపాటు డాక్టర్లకు సహాయకులుగా సేవలు అందిస్తారు. రోగి కోలుకున్నాక కూడా కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. ఆలాంటప్పుడు ఆయా రోగులను చూసుకునేది నర్సులే. ఒక్క మాటలో చెప్పాలంటే.. వైద్య సేవల గుండె చప్పుడు నర్సింగ్ అని భావించొచ్చు. ఇలాంటి ఉన్నతమైన సేవల కెరీర్ నర్సింగ్.
ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ (ఏఎన్ఎం)..
నర్సింగ్లో కెరీర్ కోరుకునే అభ్యర్థుల కోసం వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి, అభిరుచిని బట్టి వివిధ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఆయా కోర్సును బట్టి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్సీ) అర్హతలను నిర్దేశించింది. త్వరగా ఉద్యోగంలో చేరాలనుకునేవారు ‘ఏఎన్ఎం’(ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ) కోర్సు ఎంచుకోవచ్చు. ఏఎన్ఎం కోర్సు కాల పరిమితి రెండేళ్లు. ఇందులో చేరేందుకు అర్హత 10+2/ ఇంటర్మీడియెట్(ఏదైనా గ్రూప్) ఉత్తీర్ణత. ఓపెన్ స్కూలింగ్లో చదివినవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి కనీస వయసు 17 ఏళ్లు ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ లభిస్తుంది. వీరికి హోమ్ నర్స్, మిడ్వైఫ్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్, సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్, కమ్యూనిటీ హెల్త్ నర్సు, ఐసీయూ నర్స్ వంటి విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ కోర్సు తర్వాత ఏదైనా పోస్ట్ బేసిక్ స్పెషాలిటీ(ఏడాది డిప్లొమా) కోర్సు కూడా పూర్తిచేస్తే.. మంచి ఉద్యోగంతోపాటు మెరుగైన వేతన ప్యాకేజీ సైతం లభిస్తుంది.
స్పెషలైజేషన్లు..
కార్డియో థొరాసిక్ నర్సింగ్, క్రిటికల్ కేర్ నర్సింగ్, అత్యవసర – విపత్తు నర్సింగ్, నియోనాటల్ నర్సింగ్, న్యూరో నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, అడ్మిని స్ట్రేషన్, ఆంకాలజీ నర్సింగ్, ఆపరేషన్ రూమ్ నర్సింగ్, ఆర్థోపెడిక్ అండ్ పునరావాస నర్సింగ్, మిడ్వైఫరీ ప్రాక్టీషనర్, సైకియాట్రిక్ నర్సింగ్.

Education News

జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం)..
ఇది మూడున్నరేళ్ల జీఎన్ఎం డిప్లొమా కోర్సు. ఏఎన్ఎం కంటే మెరుగైనదిగా చెప్పవచ్చు. ఇంటర్మీ డియట్ బైపీసీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ల ప్రకారం çకనీస మార్కుల సడలింపు ఉంది. ఇంటర్ అర్హతతో ఏఎన్ఎం పూర్తి చేసిన వారు సైతం జీఎన్ఎం కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) అనుమతినిచ్చింది. 17 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవ చ్చు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. వీరు అనాటమీ అండ్ ఫిజియాలజీ, బయోలాజికల్ సైన్స్, మైక్రోబయాలజీ, బిహేవియరల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, నర్సింగ్ ప్రాథమిక అంశాలు, ప్రథమ చికిత్స వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. కోర్సులో భాగంగా ఆరు నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది.

ఉద్యోగ అవకాశాలు..
జీఎన్ఎం కోర్సు పూర్తిచేసినవారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా క్లినికల్ నర్స్ స్పెషలిస్ట్, లీగల్ నర్స్ కన్సల్టెంట్, ఫోరెన్సిక్ నర్సింగ్, సీనియారిటీని బట్టి నర్సింగ్ కాలేజీల్లో టీచర్ అండ్ జూనియర్ లెక్చరర్, మిడ్వైఫరీ నర్స్, ఎమర్జెన్సీ రూమ్ నర్స్గా నియమించుకుంటారు.
బీఎస్సీ నర్సింగ్(బేసిక్)..
బీఎస్సీ నర్సింగ్ కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. ఇంటర్మీడియెట్ బైపీసీలో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. 17ఏళ్లు నిండి ఉండాలి. ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఇది ఒకటి. హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్, రైల్వేస్, ఎయిర్వేస్, డిఫెన్స్, ఇండస్ట్రీస్ తదితర విభాగాల్లో బీఎస్సీ నర్సింగ్ చేసినవారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అంతేగాక, బోధనా రంగంలోకి వెళ్లాలనుకుంటే పీజీ, పీహెచ్డీ కూడా చేయవచ్చు. బీఎస్సీ నర్సింగ్(బేసిక్) తర్వాత ఉద్యోగంలో చేరిపోవచ్చు లేదా ఎంఎస్సీ నర్సింగ్ చేయొచ్చు.
పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్..
ఇంటర్మీడియెట్ బైపీసీతో జీఎన్ఎం కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరేందుకు అర్హులు. దీంతోపాటు స్టేట్ నర్సెస్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్లో ‘రిజిస్టర్డ్ నర్స్ మిడ్వైఫ్’గా నమోదు చేసుకోవడంతోపాటు జీఎన్ఎంగా రెండేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. ఈ కోర్సును రెగ్యులర్గా చేయాలనుకుంటే రెండేళ్లు, జీఎన్ఎంగా ఉద్యోగంలో ఉన్నవారు దూరవి ద్యా విధానంలో మూడేళ్లలో పూర్తి చేయవచ్చు.

ఎమ్మెస్సీ నర్సింగ్..
ప్రధానంగా నర్సింగ్ కాలేజీల్లో బోధనా వృత్తిని చేపట్టాలనుకునే వారు ఎమ్మెస్సీ నర్సింగ్ను ఎంచుకుంటారు. కోర్సు కాల పరిమితి రెండేళ్లు. ఈ పీజీ కోర్సులో ప్రసూతి అండ్ గైనకాలజీ, చైల్డ్ హెల్త్, సైకియాట్రిక్(మెంటల్ హెల్త్), మెడికల్ సర్జికల్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ విభాగాలలో స్పెషలైజేషన్ చేయవచ్చు. ఎమ్మెస్సీ నర్సింగ్ చేసినవారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. నర్సింగ్ సూపరింటెండెంట్, టీచింగ్ కాలేజీల్లో లెక్చరర్స్ వంటి ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. ఎమ్మెస్సీ నర్సింగ్ తర్వాత ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్నవారు ఎంఫిల్ నర్సింగ్(రెగ్యులర్గా ఏడాది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో రెండేళ్లు) కోర్సులో చేరొచ్చు. ఆ తర్వాత పీహెచ్డీ చేయవచ్చు.

కళాశాలలు–ఫీజులు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం–ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 80 కళాశాలలు(5 గవర్నమెంట్ కళాశాలలు), శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో 78 కళాశాలలు(4 గవర్నమెంట్ కాలేజీలు) ఉన్నాయి. తెలంగాణలోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలో మొత్తం 8 ప్రభుత్వ నర్సింగ్(బీఎస్సీ/పోస్ట్ బీఎస్సీ/ ఎమ్మెస్సీ) కాలేజీలు, 107 ప్రైవేటు నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలల్లో ఫీజు వేర్వేరుగా ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్కు ఏడాదికి సుమారు రూ.లక్ష వరకు ఫీజు ఉంటుంది. జీఎన్ఎంకు రూ.25 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉంటుంది. ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సు ఫీజు ఏడాదికి రూ.1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉంటుంది.
వేతనాలు..
నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు వారి నైపుణ్యం, అనుభవం ఆధారంగా వేతనాలు లభిస్తాయి. ప్రారంభ వార్షిక వేతనం సరాసరి రూ.2.50 లక్షల వరకు ఉంటుంది. ఐదేళ్ల అనుభవం సొంతం చేసుకున్నాక రూ.5 లక్షల వరకు పొందవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఉన్న ఖాళీలను బట్టి నోటిఫికేషన్ ద్వారా ఏఎన్ఎం, స్టాఫ్నర్స్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. విదేశాల్లో సైతం నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ అధికంగా ఉంది. వాస్తవానికి నర్సింగ్ కోర్సులు పూర్తి చేసినవారి ఉపాధికి డోకా లేదు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ప్రయివేట్ రంగంలో అవకాశాలకు కొదవలేదు.
నర్సింగ్ కోర్సులు..
ఏఎన్ఎమ్(సర్టిఫికెట్ ఇన్ ఆక్సిలరీ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ)– 2ఏళ్ల కోర్సు.
జీఎన్ఎం(డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ)– మూడున్నరేళ్ల కోర్సు.
బీఎస్సీ నర్సింగ్(బేసిక్)– నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సు.
బీఎస్సీ నర్సింగ్(పోస్ట్ బేసిక్)– రెండేళ్ల బ్యాచిలర్ కోర్సు.
ఎంఎస్సీ నర్సింగ్–రెండేళ్ల పీజీ కోర్సు.
డిమాండ్ ఉన్న ప్రొఫెషనల్ కోర్సు..
నర్సింగ్ అనేది ప్రొఫెషనల్ కోర్సు. దీనికి దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. కోర్సు పూర్తి కాగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో మంచి వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. చాలావరకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే నియామకాలు జరిగిపోతున్నాయి. విదేశాల్లో సైతం మన నర్సింగ్ ప్రొఫెషనల్స్ను నియిమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. బీఎస్సీ నర్సింగ్ ఉంటే.. ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసే అవకాశం లభిస్తుంది. సహనం, సేవా దృక్పథం, వృత్తిపరమైన మెళకువలు ఉన్నవారికి ఆకాశమే హద్దని చెప్పొచ్చు. విదేశాల్లో స్వతంత్రంగా ప్రాక్టీస్ చేసేందుకు లైసెన్స్ కూడా ఇస్తున్నారు. ఈ విధానం మన దేశంలోనూ అమలు చేసే దిశగా ప్రయత్నం జరుగుతోంది.


మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (ఎంఎన్‌ఎస్): ఇందులో చేయూలంటే.. ఇంటర్(బైపీసీ)లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. వయస్సు 17 నుంచి 24 ఏళ్లు. పెళ్లికాని యువతులు, భర్త నుంచి విడాకులు తీసుకున్నవారు, వితంతువులు అర్హులు. రాత పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. కోర్సు పూర్తయ్యాక 4 లేదా ఐదేళ్లు మిలిటరీ హాస్పిటల్‌లో పనిచేస్తామని బాండ్ రాయూలి. ఈ కోర్సును దేశవ్యాప్తంగా 16 సంస్థలు అందిస్తున్నారుు. మన రాష్ట్రంలో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.

విదేశాల్లోనూ అవకాశాలు:నర్సింగ్ కోర్సులు చేసినవారికి రాష్ట్ర, కేంద్ర స్థారుులో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులే కాకుండా అనేక విదేశీ అవకాశాలు కూడా ఉన్నాయి. వుుఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో నర్సుల కొరత ఎక్కువగా ఉండటంతో ఆ అవసరాలు తీర్చేందుకు భారత్ ప్రధాన వేదికగా వూరుతోంది. ఈ క్రవుంలో అమెరికా, యుూకే, కెనడా, ఆస్ట్రేలియూ, ఐర్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలు వున దేశంలో నర్సింగ్ ఉత్తీర్ణులకు ప్రధాన గవ్యూలని చెప్పొచ్చు. వాటిలో అవకాశాలు సొంతం చేసుకోవాలంటే.. అక్కడి ప్రభుత్వాలు నిర్వహించే అర్హత పరీక్షలు రాయూలి. ఉదాహరణకు అమెరికాలో నర్స్‌గా స్థిరపడాలంటే కమిషన్ ఆన్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఫారిన్ స్కూల్స్ (సీజీఎఫ్‌ఎన్‌ఎస్) నిర్వహించే నేషనల్ కౌన్సిల్ లెసైన్సర్ ఎగ్జామినేషన్ ఫర్ రిజిస్టర్డ్ నర్సెస్ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్- ఆర్‌ఎన్)లో ఉత్తీర్ణత సాధించాలి. అదేవిధంగా కెనడాలో అడుగుపెట్టాలంటే.. కెనడియున్ రిజిస్టర్డ్ నర్స్ ఎగ్జామినేషన్ (సీఆర్‌ఎన్‌ఈ)లో ఉత్తీర్ణత తప్పనిసరి. వీటితోపాటు గల్ఫ్ దేశాలు కూడా భారీఎత్తున భారత నర్సింగ్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారుు. నర్సింగ్‌కు సంబంధించి పరిజ్ఞానంతోపాటు ఇంగ్లిష్ భాషపై పట్టుంటే ఎంతో సులువుగా విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. అమెరికాలో ప్రారంభంలోనే నెలకు ఐదు వేల డాలర్ల వేతనం లభిస్తోంది.

కెరీర్:ముఖ్యంగా నర్సింగ్ పూర్తిచేసినవాళ్లకు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలు, ప్రైవేటు క్లినిక్‌లు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, వివిధ ప్రయివేటు పరిశ్రమల్లోని ఇండస్ట్రియల్ హౌసెస్‌లు, వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, రైల్వేల్లోని ఆరోగ్య విభాగాల్లో డిమాండ్ ఉంది.

ఎంఎస్సీ నర్సింగ్:ఈ కోర్సులో ప్రవేశానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏటా జూలై/ఆగస్టులలో ప్రకటన విడుదల చేస్తుంది. 55 శాతం మార్కులతో బీఎస్సీ(నర్సింగ్) లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులు దీనికి అర్హులు. పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 కాలేజీల్లో ఎంఎస్సీ నర్సింగ్ అందుబాటులో ఉంది.

ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు:నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్)
మెడి కల్ సర్జికల్ నర్సింగ్, పీడియాట్రిక్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, సైకియాట్రిక్ నర్సింగ్ స్పెషలైజేషన్లతో ఎంఎస్సీ నర్సింగ్ అందిస్తుంది.
అర్హత: నర్సింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ(10+2+4 విధానంలో).
వెబ్‌సైట్: www.nims.ap.nic.in

శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్) -తిరుపతి: ఈ సంస్థ కూడా ఎంఎస్సీ నర్సింగ్ కోర్సు ఆఫర్ చేస్తుంది.
వెబ్‌సైట్: https://svimstpt.ap.nic.in

Nursing Courses

B.Sc. Nursing
Nurses are the bridges between patients and doctors. They are the second-rung medical professionals who coordinate the entire medical treatment. The undergraduate programme in nursing i.e. B.Sc. Nursing is a four-year course and the basic eligibility is pass in Intermediate with BiPC.
 
General Nursing Midwifery
General Nursing Midwifery (GNM) is a three and half year course. Those who have completed Auxiliary Nurse Midwife (ANM) would be given lateral entry in the second year of the course. In our state, about 234 colleges are offering this course and the pass of Intermediate with BiPC is the eligibility.
 
Military Nursing Service
Those who have completed their Intermediate (BiPC) with 45% marks are eligible for this course. Unmarried, divorced and widowed women within the age group of 17 and 24 years are eligible for this programme. Admission into this course will be made based on the candidate’s performance in the entrance exam. After completion of course, the graduates shall work in the military hospitals for at least 5 years.
 
 
Career Prospects
Nursing graduates can find opportunities in government, private and corporate hospitals, nursing homes, private clinics, old age homes, schools, industrial houses, different central and state government organisations, departments and healthcare division of Railways.
 
Opportunities Abroad
Employment opportunities are available for the nursing graduates not only in India, but also in abroad. Shortage of nurses in the developed countries has become a boon for Indians. Countries such as USA, UK, Canada, Australia, Ireland, New Zealand and Singapore are recruiting nurses from India.
 
To seize these opportunities, the nursing graduates have to sit for the exams conducted by respective governments. For example, those who would like to settle in USA shall clear the National Council Licensure Examination for Registered Nurses (NCLEX -RN) conducted by the Commission on Graduates of Foreign Schools (CGFNS). Likewise, those who are interested in Canada shall clear Canadian Registered Nurse Examination (CRNE).
 
Besides these countries, Gulf nations are also recruiting Indian nurses in a big number. The nursing graduates with mastery over English language can easily find the foreign opportunities. In US, they can get a monthly salary of US $ 5,000.
 
Besides the opportunities, the profession also gives a lot of job satisfaction.