ఎంటెక్

ఐఐటీల్లో ఎంటెక్ సీటు కావాలంటే సీఓఏపీలో నమోదు కావాల్సిందే!

గేట్లో మంచి పర్సంటైల్ వచ్చిందా.. ఐఐటీల్లో ఎంటెక్ చేయాలనుకుంటున్నారా.. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు వైపు మనసు లాగుతోందా.. అయితే మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంటెక్ సీటు, లేదా ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లో కొలువు దక్కాలంటే.. కామన్ ఆఫర్ యాక్సప్టెన్స్ పోర్టల్ (సీఓఏపీ)లో నమోదు చేసుకోవాల్సిందే!! కరోనా లాక్డౌన్ కారణంగా తాజాగా సీఓఏపీ షెడ్యూల్లో మార్పులు జరిగాయి.
Current Affairsఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా సీఓఏపీ పోర్టల్లో దరఖాస్తు విధానం, అర్హతలు, ప్రయోజనాలపై ప్రత్యేక కథనం..
ఐఐటీల్లో ఎంటెక్ ప్రవేశాలకు గేట్ స్కోరు ఆధారంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కో ఐఐటీకి వేర్వేరుగా దరఖాస్తు చేసుకునే క్రమంలో విద్యార్థులు తమ ప్రాథమ్యాల పరంగా రాజీ పడే ఆస్కారం ఉంది. ఈ క్రమంలోనే కామన్ ఆఫర్ యక్సప్టెన్స్ పోర్టల్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం 21 ఇన్స్టిట్యూట్లు, ఒక పీఎస్యూ సీఓఏపీలో భాగస్వాములుగా ఉన్నాయి.
ఐఐటీలన్నీ…
ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ ఐఎస్ఎం ధాన్బాద్, ఐఐటీ భిలాయ్, భువనేశ్వర్, బాంబే, ఢిల్లీ, గోవా, గువహటి, హైదరాబాద్, ఇండోర్, జో«ద్ఫూర్, కాన్పూర్, ఖరగ్పూర్, మద్రాస్, మండి, పాలక్కడ్, పాట్నా, రూర్కీ, రోపార్, తిరుపతిలతోపాటు పీఎస్యూ ఎన్పీసీఐఎల్.. సీఓఏపీలో భాగస్వామ్య ఇన్స్టిట్యూట్లుగా ఉన్నాయి.
ప్రత్యేకతలు…
 • సీఓఏపీలో భాగస్వామ్య ఇన్స్టిట్యూట్లు, పీఎస్యూలు తమ ఆఫర్లను ఒకే సమయంలో సీఓఏపీ పోర్టల్లో పొందుపరుస్తాయి.
 • రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఆయా ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశాలు లేదా పీఎస్యూలో జాబ్ ఆఫర్ వివరాలను సీఓఏపీ ద్వారా తెలుసుకోవచ్చు.
 • అభ్యర్థులు ఎంటెక్ కోర్సులో ప్రవేశానికి లేదా పీఎస్యూ కొలువు దక్కించుకొనేందుకు సదరు ఇన్స్టిట్యూట్ లేదా పీఎస్యూకి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి.
 • సీఓఏపీలో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఇన్స్టిట్యూట్లు అందిస్తున్న ఆఫర్లను తెలుసుకొని.. విద్యార్థులు తమ ప్రాథమ్యాల మేరకు చాయిస్ను ఎంచుకోవచ్చు.
 • సీఓఏపీ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం.
 • భాగస్వామ్య ఇన్స్టిట్యూట్లు తమ ఎంటెక్ అప్లికేషన్ పోర్టల్లో సీఓఏపీ రిజిస్ట్రేషన్ నంబర్ను తప్పనిసరి చేశాయి. కాబట్టి ఔత్సాహికులు సీఓఏపీలో తప్పక నమోదుచేసుకోవాలి.
సీఓఏపీ–2020 అర్హతలు
గేట్ 2018, 2019, 2020లల్లో అర్హత సాధించిన అభ్యర్థులు సీఓఏపీలో నమోదు చేసుకోవచ్చు. వీరు సీఓఏపీ ప్రక్రియలో పాల్గొంటున్న ఇన్స్టిట్యూట్లో ఎంటెక్లో కాని లేదా పీఎస్యూలో జాబ్ కోసం కాని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్…
అభ్యర్థులు సీఓఏపీ రిజిస్ట్రేషన్ కోసం కింది వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. అవి..» పేరు, గేట్ రిజిస్ట్రేషన్ నంబర్ » వ్యాలిడ్ గేట్ స్కోరు, పుట్టిన తేదీ » ఇ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ » గేట్ పేపర్ కోడ్.
రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకున్న అభ్యర్థులు సీఓఏపీ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్, పీఎస్యూ ఆఫర్స్కు సంబంధించిన వివరాలను పొందేందుకు అర్హులు. ఇన్స్టిట్యూట్లు, పీఎస్యూలు సీఓఏపీ రిజిస్ట్రేషన్ నంబర్తో ట్యాగ్ చేసి ఆఫర్స్ను అందిస్తాయి.
రౌండ్లు– తేదీలు
కింది టైమ్ విండో రౌండ్లలో.. అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఆఫర్లు చూసుకోవడంతోపాటు, ఏ ఇన్స్టిట్యూట్లో, ఏ ప్రోగ్రామ్లో చేరాలో నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తుంది.
మెయిన్ రౌండ్లు
 • రౌండ్ 1: మే 27–28
 • రౌండ్ 2: జూన్ 3–4
 • రౌండ్ 3: జూన్ 10–11
 • రౌండ్ 4: జూన్ 17–18
 • రౌండ్ 5: జూన్ 24–25
రౌండ్ 1 నుంచి రౌండ్ 4 వరకు అభ్యర్థులు ఆఫర్కు సంబంధించి యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్, రిటైన్ అండ్ వెయిట్, రిజెక్ట్ అండ్ వెయిట్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అయితే రిటైన్ అండ్ వెయిట్ ఆప్షన్ను రెండుసార్లు మాత్రమే వినియోగించుకోగలరు. రౌండ్ 5 నిర్ణయాత్మక రౌండ్గా ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ లేదా రిజెక్ట్ ఆప్షన్ను మాత్రమే వినియోగించే అవకాశం ఉంటుంది.
అదనపు రౌండ్లు
 • రౌండ్ ఎ: జూలై 1–2;
 • రౌండ్ బి: జూలై 8–9;
 • రౌండ్ సీ, డీ తేదీలను ప్రకటించాల్సి ఉంది.
 • అడ్మిషన్ తేదీ నాటికి ఉన్న ఖాళీల ఆధారంగా ఈ రౌండ్లు నిర్వహిస్తారు. ఇవి పూర్తిగా నిర్ణయాత్మకమైనవి. ఇందులో యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్, రిజెక్ట్ ఆప్షన్స్ను మాత్రమే అభ్యర్థులు వినియోగించుకోగలరు.
 • పూర్తి వివరాలకు వెబ్సైట్: http://coap.iitm.ac.in

సీఓఏపీ ఎఫ్ఏక్యూస్
 »అభ్యర్థి సీఓఏపీలో నమోదు చేసుకోవడం తప్పనిసరా?
తప్పనిసరే. సీఓఏపీ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్లన్నీ ఎంటెక్ కోర్సులో ప్రవేశాలకు సీఓఏపీ రిజిస్ట్రేషన్ నంబరును అడుగుతున్నాయి. ఇన్స్టిట్యూట్స్ అందించే ఆఫర్స్లో ది బెస్ట్ ఎంచుకోవాలంటే.. సీఓఏపీలో రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. అలా కాని పక్షంలో ఆయా ఆఫర్ల గురించి తెలుసుకునే అవకాశాన్ని అభ్యర్థులు కోల్పోతారు.
 2018, 2019ల్లో సీఓఏపీలో రిజిస్టర్ చేసుకున్నాను, తిరిగి మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలా..?
అవును.. మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలి. 2018, 2019 రిజిస్ట్రేషన్లు.. సీఓఏపీ–2020కి వ్యాలిడ్ కావు.
 »సీఓఏపీ ద్వారా పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఎంటెక్/ పీఎస్యూల్లో జాబ్కు దరఖాస్తు చేసుకునే వీలుందా..?
లేదు. సీఓఏపీ అనేది ఎంటెక్ అడ్మిషన్/జాబ్ అప్లికేషన్ పోర్టల్ కాదు. ఎంటెక్లో ప్రవేశానికి, పీఎస్యూలో జాబ్ కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా ఆయా ఇన్స్టిట్యూట్, పీఎస్యూకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
»ఎవరెవరు సీఓఏపీ–2020 పోర్టల్లో దరఖాస్తుకు అర్హులు.
2018, 2019, 2020 సంవత్సరాల్లో గేట్లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
 సీఓఏపీలో ఆఫర్ స్టేటస్ను ఎలా తెలుసుకోవాలి..?
అభ్యర్థులు షెడ్యూల్ డేట్స్లో సీఓఏపీలోకి లాగిన్ అయి.. ఆఫర్లను చూసి.. నిర్ణయాన్ని పేర్కొనవచ్చు. అదేవిధంగా ఆఫర్ స్టేటస్ను కూడా తెలుసుకోవచ్చు.
 »అభ్యర్థి ఆఫర్ను అంగీకరించిన తర్వాత ఏం చేయాలి?
ఆఫర్ను యాక్సెప్ట్ అండ్ ఫ్రీజ్ చేసిన తర్వాత అభ్యర్థులు సంబంధిత ఇన్స్టిట్యూట్ ఎంటెక్ అడ్మిషన్ పోర్టల్కి వెళ్లి వివరాలను పూర్తిచేయాల్సి ఉంటుంది.
 »అభ్యర్థి ఒకే సమయంలో మల్టిపుల్ ఆఫర్స్ను ఎంచుకొనే అవకాశం ఉందా..?  ఆయా ఇన్స్టిట్యూట్లు అందించే మల్టిపుల్ ఆఫర్స్లో నుంచి అభ్యర్థి రౌండ్కు ఒక ఆఫర్ను మాత్రమ ఎంచుకొనే అవకాశం ఉంది.
 »రిటైన్ అండ్ వెయిట్ ఆప్షన్స్ ద్వారా మల్టిపుల్ ఆఫర్స్ను ఎంచుకొనే అవకాశం ఉందా?
లేదు. అభ్యర్థి ఒక రౌండ్కు ఒక ఆఫర్ను మాత్రమే రిటైన్ అండ్ వెయిట్ ద్వారా ఎంచుకొనే అవకాశం ఉంటుంది. మిగిలిన ఆఫర్లన్నింటినీ రిజెక్ట్గానే పరిగణిస్తారు.

గేట్ స్కోర్, ఇంటర్వ్యూ

Graduate Aptitude Test in Engineering (GATE) is an all India examination administered and conducted jointly by the Indian Institute of Science and seven Indian Institutes of Technology on behalf of the National Coordination Board – GATE, Department of Higher Education, Ministry of Human Resource Development (MHRD), Government of India.

GATE  Score as the 1st selection criterion
The GATE is conducted for admission into Masters Degree in IITs and IISc. However, the scenario has changed now as major companies are using it as a platform to identify the suitable engineers/researchers in various areas. GATE score is the first step in these companies to filter the candidates in their selection process. They have made it mandatory for the students to have GATE score in the concerned subject for which the companies are seeking to recruit. Fifteen Public Sector Units (PSUs) have signed a MoU with IIT Bombay to receive the official GATE 2013 results for employment purpose. Major PSUs like HPCL, GAIL, Powergrid, NTPC, BEL, BHEL, NALCO, CONCOR, DDA, MECL, BPCL, Indian Oil are recruiting trainees through GATE score

Essential Qualification:Full time B.E./ B.tech/ B.Sc (Engg) from recognized University/ Institute in respective engineering disciplines with Minimum 65% or Equivalent CGPA
OR
AMIE in respective engineering branches with Minimum 65% marks

Note: Companies also accept Graduation in other related engineering disciplines. For details, see complete notification.

Selection ProcessThe Selection Process consists of GATE  score, Group Discussion & Personal Interview.

Eligible candidates will have to appear for the respective Engineering (EE) paper of GATE Exam – 2013 for which he/ she intends to apply. Candidates shall be short-listed for Group Discussion & Personal Interview based on their score in GATE Exam  and as per the criteria decided by the Management.

Candidates who qualify in the Group Discussion & Personal Interview as per the criteria decided by the Management will only be adjudged suitable for empanelment. The Offer of Appointment shall be issued to the suitable candidates in the order of merit and based on the requirement.

High Pay:Selected candidates will be placed in the high pay scale varying from company to company

 • Powergrid: During Training: Rs. 7 lakhs per annum and After Training: Rs 12.67 lakhs per annum
 • BHEL: Rs 8 Lakhs to Rs 9 Lakhs per annum
 • BEL: Rs.16400-3%-40500/ per month
 • NTPC: Rs. 24900-3%-50500 at a basic pay of Rs. 25650/-
 • HPCL: During Training: consolidated stipend of Rs. 33, 000 per month and After Training: Rs. 24,900 – 50,500 per month
 • GAIL: Pay scale of Rs.24900 – 50500/-
 • BPCL: Scale of Pay – 24,900 – 50500

How to Apply

 1. Candidates have to register themselves and appear for GATE  in respective Engineering Discipline.
 2. A separate notification with details regarding number of vacancy in each category, important dates related tosubmission of online application, date of interview etc. shall be available in the companies’ website.
 3. Candidates have to register themselves online at companies’ website with details of their GATE registration number and other required information.

ఐఐటీ, పీఎస్యూ.. ఇంటర్వ్యూల్లో రాణించండిలా..!
గేట్ ఫలితాలొచ్చాయి. పరీక్షలో సత్తా చాటిన విద్యార్థుల ముందిప్పుడు రెండు మార్గాలున్నాయి. అందులో ఒకటి, పీఎస్యూ (ప్రభుత్వ రంగ సంస్థలు) కొలువుల్లో స్థిరపడటం.. కాగా రెండోది, ఐఐటీల్లో ఎంటెక్ లో చేరి ఉన్నత విద్యనభ్యసించడం!!
Edu news

ఈ రెండు మార్గాల్లోనూ గేట్లో స్కోర్ తో పాటు ఇంటర్వ్యూ సైతం కీలకంగా నిలుస్తోంది. గేట్.. ఎంటెక్ లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష! గేట్ స్కోర్ ఆధారంగా ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్యూ) ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. అందుకే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో గేట్ కి హాజరవుతుంటారు. ఈ నేపథ్యంలో.. గేట్ ర్యాంకర్స్కు ఉపయోగపడేలా పీఎస్యూ ఇంటర్వ్యూలు.. ఐఐటీల్లో ఎంటెక్ ప్రవేశ ఇంటర్వ్యూలు.. వాటిలో విజయం కోసం ఏ విధంగా సన్నద్ధం కావాలో తెలుసుకుందాం…
పీఎస్యూ ఇంటర్వ్యూ
పీఎస్యూలు (అధిక శాతం) కేవలం గేట్ స్కోర్ ద్వారానే నియామకాలు ఖాయం చేయడం లేదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తున్నాయి. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. గేట్ స్కోర్, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపిన వారికి ఆఫర్ లెటర్లు ఇస్తున్నాయి.
పిలుపు రావాలంటే..
పీఎస్యూలు దరఖాస్తు చేసుకున్న వారందరినీ ఇంటర్వ్యూలకు ఆహ్వానించడం లేదు. పలు అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తున్నాయి.
» గేట్ స్కోరు
» అందుబాటులో ఉన్న ఖాళీలు
» గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ (65 శాతానికి తగ్గరాదు)
» వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇంటర్వ్యూ కాల్ లెటర్లు పంపిస్తున్నాయి.
వెయిటేజీ..
పీఎస్యూలు(అధిక శాతం) గేట్ స్కోర్కు 80–85 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. ఇంటర్వ్యూకు 15 శాతానికి తగ్గకుండా వెయిటేజీ లభిస్తోంది. ఈ వెయిటేజీల పరంగా పీఎస్యూల మధ్య వ్యత్యాసాలున్నాయి.
ఇవే కీలకం..
పర్సనల్ ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ నాలెడ్జ్పై ప్రశ్నలు అడుగుతారు. ప్రాజెక్ట్ వర్క్, మినీ ప్రాజెక్ట్స్, ఇంట‌ర్న్ షిప్ ద్వారా అభ్యర్థులు సొంతం చేసుకున్న నైపుణ్యాలను పరీక్షిస్తారు. అభ్యర్థుల అప్టిట్యూడ్, అటిట్యూడ్ను అంచనా వేస్తారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం, సంస్థ పట్ల ఉన్న ఆసక్తి.. దానికి గల కారణాలు.. భవిష్యత్తు లక్ష్యాల కోణంలో ప్రశ్నలు అడుగుతారు.
విజయానికి…
 • పర్సనల్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే.. సబ్జెక్ట్ పరిజ్ఞానంతోపాటు సమకాలీన అంశాలపైనా అవగాహన ఉండాలి. కాబట్టి అభ్యర్థులు బీటెక్ సబ్జెక్టులతోపాటు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న నాన్ టెక్నికల్ అంశాలపైనా దృష్టిపెట్టాలి.
 • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులంతా ఆయా పీఎస్యూ ప్రొఫైల్ను క్షుణ్నంగా తెలుసుకోవాలి. సదరు పీఎస్యూ ఏయే రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది, దాని పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి.
ఆత్మవిశ్వాసం, వస్త్రధారణ..
పీఎస్యూ ఇంటర్వ్యూ ప్యానెల్లో టెక్నికల్ నిపుణులు, హెచ్ఆర్ బృందం కలిపి మొత్తం నాలుగు నుంచి ఎనిమిది మంది వరకు ఉంటారు. వీరంతా అభ్యర్థులను పలు అంశాల్లో పరీక్షిస్తారు. కాబట్టి ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా వస్త్రధారణపై దృష్టిపెట్టాలి. ఫార్మల్ ప్యాంటు, షర్టు, బ్లేజర్ ధరించి ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. ఇన్షర్ట్ తప్పనిసరి. అలాగే ఇంటర్వ్యూ సమయంలో ఆత్మవిశ్వాసంతో మెలగాలి. ముఖంపై చిరునవ్వు చెదరకుండా చూసుకోవాలి.
బేసిక్స్ కీలకం..
ఇంటర్వ్యూలో బేసిక్స్ కీలకంగా నిలుస్తాయి. అభ్యర్థికి సబ్జెక్టుపై ఉన్న పట్టును పరీక్షించేలా టెక్నికల్ నిపుణులు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు బీటెక్ స్పెషలైజేషన్లోని బేసిక్స్ను ఔపోసన పట్టాలి.
కంపెనీ ఎందుకు?
‘మా కంపెనీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు’, ‘మా కంపెనీ గురించి మీకేం తెలుసో చెప్పగలరా…’?! పీఎస్యూ ఇంటర్వ్యూల్లో తప్పక ఎదురయ్యే ప్రశ్నలు ఇవి!! కాబట్టి ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులంతా సదరు పీఎస్యూ నేపథ్యం, కార్యకలాపాల గురించి తప్పక అధ్యయనం చేయాలి. దీంతోపాటు అదే పీఎస్యూను ఎంచుకోవడానికి సహేతుక కారణాలు చెప్పగలగాలి.
ప్రాజెక్ట్, ఇంట‌ర్న్ షిప్..
బీటెక్లో చేసిన ప్రాజెక్ట్ వర్క్, ఇంట‌ర్న్ షిప్ గురించి ప్రశ్నలు అడుగుతారు. ప్రాజెక్ట్ వర్క్ ఫైడింగ్స్,  ఇంట‌ర్న్ షిప్ లో ఏయే అంశాలను నేర్చుకున్నారనే విషయాన్ని పరిశీలిస్తారు. దీంతోపాటు కరెంట్ అఫైర్స్పైనా ప్రశ్నలు ఎదురవుతాయి.
వేతనాలు..
పీఎస్యూల్లో కొలువు సొంతం చేసుకున్న అభ్యర్థులకు ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. గెయిల్ వంటి కంపెనీల్లో వేతనం రూ.60వేల నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని పీఎస్యూలు.. సర్వీస్ బాండ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగాన్ని ఖరారు చేసుకున్న అభ్యర్థులు నిర్దిష్ట కాలంపాటు సంస్థలో పనిచేస్తామని.. అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యవధి రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు ఉంటోంది.
ఐఐటీ ఇంటర్వ్యూ ఇలా..
ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎస్సీల్లో ఎంటెక్ ప్రవేశం పొందాలంటే.. ఇంటర్వ్యూలోనూ ప్రతిభ చూపాల్సిందే. ఇంటర్వ్యూల్లో ప్రధానంగా అభ్యర్థి ఆలోచనలు–స్పష్టత, తార్కిక కోణం, సబ్జెక్ట్ నాలెడ్జ్ వంటి అంశాలను పరిశీలిస్తారు.
సీఏఓపీ–2020
ఐఐటీల్లో ఎంటెక్లో చేరాలనుకునే అభ్యర్థులు ముందుగా కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్(సీఏఓపీ)–2020లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో రిజిస్టర్ చేసుకున్నవారికే ఐఐటీల్లో ఎంటెక్ ప్రవేశాలు లభిస్తాయి. దీంతోపాటు ఎన్పీసీఐఎల్లో కొలువులు దక్కించుకోవాలన్నా.. సీఏఓపీలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
కీలక అంశాలు..ఎంటెక్ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల్లో అనేక అంశాలను పరిశీలిస్తారు. ముఖ్యంగా.. » సబ్జెక్టు నాలెడ్జ్ » సబ్జెక్టుల్లోని కోర్ అంశాలపై అవగాహన » స్పష్టమైన ఆలోచనలు » కమ్యూనికేషన్ స్కిల్స్ » వ్యక్తిత్వం, అటిట్యూడ్, సంఘటనల పట్ల స్పందించే తీరు » ఆలోచనా దృక్పథం వంటివి. వీటితోపాటు డ్రెస్ కోడ్, ఇంటర్వ్యూ రూమ్లోకి ప్రవేశించే తీరు, కూర్చునే విధానం, బాడీ లాంగ్వేజ్, మాట తీరు, ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థి ప్రవర్తన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఇంటర్వ్యూ ప్రశ్నలు
» సంబంధిత స్పెషలైజేషన్/అకడెమిక్స్కు సంబంధించిన అంశాలు
» కెరీర్ ప్లానింగ్, ఇండస్ట్రీ, రీసెర్చ్
» ఇంటర్న్షిప్, వర్క్ ఎక్స్పీరియెన్స్, –జాబ్ ప్రొఫైల్(ఉద్యోగం చేసుంటే), ప్రాజెక్ట్ వర్క్ తదితర అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతారు. ఉదాహరణకు..
» ఎంటెక్లో ఎందుకు చేరాలనుకుంటున్నారో చెప్పండి?
» ఈ స్పెషలైజేషనే ఎందుకు ఎంచుకున్నారు?
» ఐదేళ్ల తర్వాత మీ కెరీర్ ఎలా ఉంటుందని అంచనా వేస్తున్నారు?
» మీ భవిష్యత్ లక్ష్యాలేంటి? వంటి ప్రశ్నలు ఎదురవుతాయి.
కోర్ అంశాలపైనే…
సీఏఓపీ రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులను ఐఐటీలు ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నాయి. ప్రవేశాల పరంగా ఇది ప్రధాన మార్గం. ఇక రెండో మార్గంలో అభ్యర్థులు నేరుగా ఐఐటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్లు మిగిలిపోయిన సమయంలో ఈ విధానాన్ని అనుసరిస్తారు. గేట్లో తక్కువ మార్కులు సాధించిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నేరుగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఐఐటీలు ఇంటర్వ్యూలతోపాటు అదనపు టెస్టు(రాత పరీక్ష) నిర్వహించి ప్రవేశాలను ఖరారు చేస్తాయి. ఇక ఇంటర్వ్యూ పరంగా కోర్ అంశాలు కీలకంగా నిలుస్తాయి. ఇంటర్వ్యూ ఆసాంతం కోర్ అంశాల చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు సబ్జెక్టుపై ఎక్కువ దృష్టిపెట్టాలి.


ప్రభుత్వరంగ సంస్థల్లో ‘గేట్’ స్కోర్ ద్వారా ఉద్యోగాలు-2020

గేట్.. ఐఐటీలు, నిట్‌లు వంటి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష! కానీ, మరే ఇతర ఆప్టిట్యూడ్ టెస్టుకు లేని ప్రత్యేకత దీని సొంతం!! గేట్ కేవలం ఉన్నత విద్యకే కాకుండా.. ఉన్నతస్థాయి ఉద్యోగాలకూ బాటలు వేస్తుంది.
Gate-jobs-pscదేశంలోని ప్రభత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు) గేట్ స్కోరు ఆధారంగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. ప్రస్తుతం పలు పీఎస్‌యూల్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపయోగపడేలా పీఎస్‌యూల నియామక ప్రక్రియ, అర్హతలు, ప్రిపరేషన్ విధానంపై ప్రత్యేక కథనం..

గేట్ స్కోరు ఆధారంగా పీఎస్‌యూలు గ్రాడ్యుయేట్, ట్రైనీ ఇంజనీర్స్‌తోపాటు పలు ఎంట్రీ లెవల్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. కొలువుల భర్తీకి సంబంధించి పీఎస్‌యూలు ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. వీటిలో అత్యధికం గేట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దరఖాస్తుకు అవకాశం కల్పిస్తున్నాయి. అధిక శాతం పీఎస్‌యూలు నియామకాల పరంగా తాజా గేట్ స్కోరును పరిగణలోకి తీసుకుంటుండగా.. మరికొన్ని గతేడాది స్కోరును కూడా అనుమతిస్తున్నాయి.

కటాఫ్ స్కోరు :

పీఎస్‌యూల్లో కొలువులు దక్కించుకొనే క్రమంలో అభ్యర్థులు ముందుగా గేట్‌లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది. అత్యధిక పీఎస్‌యూలు గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల జాబితా రూపొందిస్తున్నాయి. హరియాణా పవర్ యుటిలిటీస్ వంటి కంపెనీలు గేట్ స్కోరు ఆధారంగా నేరుగా నియామకాలు జరుపుతున్నాయి.

జీడీ/ఇంటర్వ్యూ :పీఎస్‌యూలు గేట్ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్(జీడీ), ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలను ఖరారు చేస్తున్నాయి. మొదట దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాతి దశలో జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వీటికి తుది జాబితా ఎంపికలో నిర్దేశిత వెయిటేజీ లభిస్తోంది. అలా గేట్ స్కోర్‌తోపాటు మలిదశలోనూ ప్రతిభ చూపిన వారికి ఆఫర్ లెటర్ అందుతోంది.

80 శాతం వెయిటేజీ :పీఎస్‌యూలు(అధిక శాతం) గేట్ స్కోర్‌కు 80-85 శాతం వెయిటేజీ ఇస్తున్నాయి. తర్వాత దశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్‌కు గరిష్టంగా పది శాతం; పర్సనల్ ఇంటర్వ్యూకు పది శాతం చొప్పున వెరుుటేజీ ఇస్తున్నారుు. వెయిటేజీల పరంగా పీఎస్‌యూల మధ్య వ్యత్యాసాలున్నాయి.

గ్రూప్ డిస్కషన్:పీఎస్‌యూలు గేట్ కటాఫ్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్(జీడీ)కు ఆహ్వానిస్తాయి. ఇందులో అభ్యర్థులను ఐదు నుంచి పది మందితో కూడిన బృందాలుగా ఏర్పాటు చేసి.. వారికేదైనా ఒక టాపిక్ ఇచ్చి చర్చించమంటారు. గ్రూప్ డిస్కషన్‌కు 20 నుంచి 30 నిమిషాల సమయం కేటాయిస్తారు.

పర్సనల్ ఇంటర్వ్యూ :
గ్రూప్‌ డిస్కషన్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో అభ్యర్థి వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ నాలెడ్‌‌జలను పరిశీలించేలా ప్రశ్నలు అడుగుతారు. ప్రాజెక్ట్ వర్క్, మినీప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్ ద్వారా అభ్యర్థులు ఎలాంటి నైపుణ్యాలు పొందారనే విషయాన్ని పరీక్షిస్తారు. దీంతోపాటు అభ్యర్థుల ఆప్టిట్యూడ్, ఆటిట్యూడ్‌లను అంచనా వేస్తారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగం, సంస్థ పట్ల ఉన్న ఆసక్తి.. దానికి గల కారణాలు.. భవిష్యత్తు లక్ష్యాల కోణంలో ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ దశ పూర్తయిన తర్వాత గేట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల వెయిటేజీని క్రోడీకరించి.. తుది జాబితా రూపొందిస్తారు.

విజయానికి…మలిదశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే.. సబ్జెక్ట్ పరిజ్ఞానంతోపాటు సమకాలీన అంశాలపైనా అవగాహన ఉండాలి. కాబట్టి ఔత్సాహికులు బీటెక్ సబ్జెక్టులతోపాటు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న నాన్ టెక్నికల్ అంశాలపైనా దృష్టిపెట్టాలి. గేట్ ప్రిపరేషన్ సమయంలోనే కోర్ కాన్సెప్టులపై పట్టు సాధించడం పీఎస్‌యూ ఇంటర్వ్యూల పరంగా లాభిస్తుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులంతా సదరు పీఎస్‌యూ ప్రొఫైల్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. సంస్థ ఏయే రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది, దాని పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి.

ఆకర్షణీయ వేతనాలు :
పీఎస్‌యూలు గేట్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు ఆకర్షణీయ వేతనాలు అందిస్తున్నాయి. గెయిల్ వంటి కంపెనీల్లో కనీస వేతనం రూ. 60 వేల నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని పీఎస్‌యూలు.. సర్వీస్ బాండ్ విధానాన్ని అమలు చేస్తున్నారుు. ఇందులో భాగంగా ఉద్యోగాన్ని ఖరారు చేసుకున్న అభ్యర్థులు నిర్దిష్ట కాలం పాటు సంస్థలో పనిచేస్తామని పేర్కొంటూ.. అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యవధి రెండేళ్ల నుంచి మూడేళ్ల వరకు ఉంటోంది.

నోటిఫికేషన్స్‌పై దృష్టి:
పీఎస్‌యూలు అభ్యర్థుల ప్రయోజనార్థం నియామక ప్రక్రియ షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటిస్తున్నారు. కొన్ని పీఎస్‌యూలు సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో నోటిఫికేషన్లు విడుదల చేసి.. షెడ్యూల్, ఎంపిక ప్రక్రియ వివరాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. మరికొన్ని పీఎస్‌యూలు జనవరి, ఫిబ్రవరిల్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. పీఎస్‌యూ ఉద్యోగాల ఔత్సాహికులు గేట్ ప్రిపరేషన్‌తోపాటు ఆయా పీఎస్‌యూల నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.

అర్హత పరీక్షపైనా..పీఎస్‌యూ ఔత్సాహికులు కేవలం గేట్‌పైనే దృష్టిపెడితే సరిపోదు. అర్హత పరీక్ష(బీటెక్)లో నిర్దిష్ట పర్సంటేజీ సాధించటంపైనా దృష్టిసారించాలి. ఎందుకంటే.. పీఎస్‌యూలు అర్హత పరీక్షలో కనీసం 65శాతం మార్కులు, 27ఏళ్ల గరిష్ట వయోపరిమితిని అమలుచేస్తున్నాయి. ఈ విషయంలో రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు మార్కులతోపాటు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు లభిస్తాయి.

దరఖాస్తుల ప్రక్రియ  :
గేట్ 2020కి సంబంధించి ఇప్పటికే కొన్ని పీఎస్‌యూలు దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేశాయి. మరికొన్ని కంపెనీల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
వాటి వివరాలు…

ఎన్‌పీసీఎల్: దరఖాస్తుకు చివరితేదీ ఏప్రిల్ 9, 2020
ఓఎన్‌జీసీ: ఏప్రిల్ చివరి వారం

గత కటాఫ్ మార్కులు :
అందుబాటులో ఉన్న ఖాళీలు.. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పీఎస్‌యూలు కటాఫ్‌ను నిర్ణయిస్తున్నారు. కొన్నేళ్లుగా పీఎస్‌యూ ఔత్సాహికుల సంఖ్య పెరుగుతోంది. దానికి అనుగుణంగా గేట్ స్కోర్ కటాఫ్ కూడా పెరుగుతూ వస్తోంది.

గేట్-2019కు సంబంధించి ప్రముఖ పీఎస్‌యూల కటాఫ్ మార్కులు/పర్సంటైల్ వివరాలు..ఎన్‌పీసీఐఎల్ :
మెకానికల్: జనరల్ 836, ఓబీసీ 786, ఎస్సీ 648, ఎస్టీ 561, పీడబ్ల్యూడీ 561.
కెమికల్: జనరల్ 790, ఓబీసీ 694, ఎస్సీ 585, ఎస్టీ 512, పీడబ్ల్యూడీ 512.
ఎలక్ట్రికల్: జనరల్ 819, ఓబీసీ 738, ఎస్సీ 584, ఎస్టీ 584, పీడబ్ల్యూడీ 584.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: జనరల్ 853, ఓబీసీ 762, ఎస్సీ 581, ఎస్టీ 581, పీడబ్ల్యూడీ 581.
కంప్యూటర్ సైన్స్: జనరల్ 876, ఓబీసీ 810, ఎస్సీ 709, ఎస్టీ 715, పీడబ్ల్యూడీ 709.

ఎన్‌టీపీసీ :
ఎలక్ట్రికల్: జనరల్ 68.33, ఓబీసీ 63, ఎస్సీ 51.67, ఎస్టీ 45.33, పీడబ్ల్యూడీ 26.33.
మెకానికల్: జనరల్ 77.28, ఓబీసీ 73.24, ఎస్సీ 63.54, ఎస్టీ 55.72, పీడబ్ల్యూడీ 35.85.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: జనరల్ 51.67, ఓబీసీ 46.67, ఎస్సీ 33.67, ఎస్టీ 33, పీడబ్ల్యూడీ 22.33.
మైనింగ్: జనరల్ 63, ఓబీసీ 53.33, ఎస్సీ 38.67, ఎస్టీ 30.67.

ఓఎన్‌జీసీ :
జియాలజిస్ట్: జనరల్ 498, ఓబీసీ 220, ఎస్సీ 274, ఎస్టీ 205.
జియోఫిజిసిస్టు: సర్ఫేజ్- జనరల్ 636, ఓబీసీ 474, ఎస్సీ 328, ఎస్టీ 198. వెల్స్-జనరల్ 593, ఓబీసీ 423, ఎస్సీ 361, ఎస్టీ 215.
కెమిస్టు: జనరల్ 615, ఓబీసీ 450, ఎస్సీ 381, ఎస్టీ 248.

సెయిల్ :కెమికల్: జనరల్ 73.74, ఓబీసీ 69.37, ఎస్సీ 61.54, ఎస్టీ 61.59.
మెకానికల్: జనరల్ 83.53, ఓబీసీ 79.01, ఎస్సీ 70.84, ఎస్టీ 65.53.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: జనరల్ 73.72, ఓబీసీ 66.5, ఎస్సీ 58.24, ఎస్టీ 55.98.
మెటలర్జీ: జనరల్ 68.33, ఓబీసీ 60.08, ఎస్సీ 55.04, ఎస్టీ 47.35. మైనింగ్: జనరల్ 80.09, ఓబీసీ 76.46, ఎస్సీ 67.98, ఎస్టీ 66.

ఈసీఐఎల్ :
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: జనరల్ 45.67, ఓబీసీ 35, ఎస్సీ 36.67, ఎస్టీ 39.67.
కంప్యూటర్స్: జనరల్ 52.67, ఓబీసీ 32.67, ఎస్సీ 43.67, ఎస్టీ 37.67.
మెకానికల్: జనరల్ 80.65, ఓబీసీ 76.07, ఎస్సీ 74.59, ఎస్టీ 66.16.

Masters Programme after B. Tech

Very few are interested towards higher studies. Investing in higher education will yield long-term benefits. As B. Tech is a bachelor level course in Technology, one cannot take it as the last and final qualification degree, especially in the present time when the market is full of competition all around. Mere earning a bachelor’s degree cannot give you a job, in the present era. There are more applicants than the number of jobs available, and hence it is very essential for everyone to be specialized in their respective field. Doing post graduation not only gives an additional degree but also it enhances your intellectual and maturity levels. It makes you specialist in a particular area or field so that you will be suitable for specific job.

If one decides to do post graduation then there arises a question, weather to do M. Tech or M.S. or MBA. This decision completely depends on the person and his or her personal interest.

Earn money and live fast-
 MBA/MS
Earn respect and live peacefully- M.Tech.

If one is more interested in engineering line and want to work in their trade line and want to make a career with engineering projects, then without delay one should go for M. Tech. It will help them in getting a better rank and post in the same line in which they were working or wanted to work after the completion of their B. Tech degree. People who pursue M. Tech are more into the teaching field. Those people must prepare for entrance exams like GATE/ PGCET etc. To face these exams one must prepare from 3rd year itself.

Entrance ExamsGATE: Conducted by one of seven Indian Institutes of Technology in rotation, Graduate Aptitude Test in Engineering (GATE) is an annual exam for admission to M. Tech and M.S. programmes in most engineering institutes in India. It is regarded as a benchmark test for engineering graduates in India. This examination is coordinated by a committee, comprising of Indian Institute of Science, Bangalore and seven Indian Institutes of Technology on behalf of the National Coordinating Board – GATE, Department of Education, and Government of India. The pattern and syllabus are usually based on a candidate’s B. Tech or BE syllabus. Minimum eligibility for appearing in this exam is usually a B. Tech, BE, B. Arch or M.Sc. The exam is usually conducted on second Sunday of February.

12, 00,728 candidates registered for GATE 2013 and 9, 84,855 candidates (82.02%) appeared for the exam. This indicates the level of competition that students have to face for the exam.

List of GATE papers: Aerospace Engineering, Instrumentation Engineering, Agricultural Engineering, Mathematics, Architecture and Planning, Mechanical Engineering, Biotechnology, Mining Engineering, Civil Engineering, Metallurgical Engineering, Chemical Engineering, Physics, Computer Science and Information Technology, Production and Industrial Engineering, Chemistry, Textile Engineering and Fibre Science, Electronics and Communication Engineering, Engineering Sciences, Electrical Engineering, Life Sciences, Geology and Geophysics.

Pattern of the Exam: In all the papers, there will be a total of 65 questions carrying 100 marks, out of which 10 questions carrying total of 15 marks are in General Aptitude (GA). The remaining of 85% of the total marks is devoted to the syllabus of the paper.

Question Paper Pattern:
GATE would contain questions of four different types in various papers:
 • Multiple choice questions carrying 1 or 2 marks each
 • Common data questions, where two successive questions use the same set of input data
 • Linked answer questions, where the answer to the first question in the pair is required to answer its successor
 • Numerical answer questions, where the answer is a number, to be entered by the candidate.