Software companies – Types

సాఫ్ట్వేర్ కంపెనీలు రెండు రకాలు.

  1. సర్వీస్ ఆధారిత(service based)
  2. ప్రొడక్ట్ ఆధారిత( product based)

సర్వీస్ బేస్డ్ కంపెనీలకు ఉదాహరణ TCS, WIPRO etc లాంటివి. వీటిల్లో పని చేయడానికి పెద్ద నైపుణ్యాలు కలిగి ఉండనవసరం లేదు. వాళ్లకు కేవలం సిస్టమ్స్(systems) ను చూస్కోగలగాలి. ఇలాంటి కంపెనీలకు సొంత ప్రొడక్ట్ ఏమి ఉండదు. వీళ్ళ దగ్గరకు క్లయినట్లు(clients) వస్తారు, వాళ్లు ఆడిగినట్టు కంపెనీ సాఫ్ట్వేర్ తయారుచేసి ఇస్తుంది. మొత్తంగా ఈ కంపెనీలలో పని చేసేవారికి పెద్దగా ఆలోచన చేసేది అంతగా ఉండదు ఎందుకంటే క్లయింట్ ముందుగా వారికి కావాల్సిన అవసరాలు(requirements) ముందే ఇచ్చేస్తారు.

అదే ఇంకో వైపు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు వేరు. నేటి కాలంలో ప్రతి పరిశ్రమలో(industry) టెక్నాలజీ వచ్చేసింది. బ్యాంకులు, ఆసుపత్రులు, ఈ-కామర్స్ మొ|| పెద్ద పెద్ద సంస్థలకు వాటి సొంత వెబ్సైట్లు, యాప్ ఉంటాయి. ఉదాహరణకు ఆమెజాన్, ప్లిప్కార్ట్, స్పాటిపై మొ|| వీళ్ళు తమ కార్యాలను బయట వాళ్ళకి అప్పగించడానికి ఇప్ట పడురు ఎందుకంటే అప్పుడు వాళ్ళ యొక్క విభిన్నత కొర పడుతుంది. కనుక వారు వారి సొంత టెక్నాలజీ విభాగము ను ఏర్పాటు చేసుకుంటారు. వీటి కోసం గొప్ప నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం వెతుకుతారు. ఈ వెతుకులాటలో కంపెనీలు IIT, NIT లకు మొదటి ప్రాధాన్యం ఇస్తాయి. ఎందుకటే ఇవి మన దేశం యొక్క ప్రతిష్ఠాత్మాకమైన విద్యా సంస్థలు కనుక.

సాఫ్ట్వేర్ ఇంజినీర్ హెల్తీ గా ఉండాలంటే ఫాల్లో అవ్వాల్సిన అలవాట్లు

శారీరక వ్యాయామం

మన శరీరం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేది దీనికోసమే.ఒక గంట ఏదో ఒకటి అలవాటు చేసుకోండి. మీ వీలును బట్టి. ఉదయం చేయడానికే ప్రాముఖ్యత ఇవ్వండి. వ్యాయామశాలో , ప్రకృతి నడకో , యోగానో, సూర్య నమస్కారాలో , ఏదైనా ఆటనో పొద్దునే అలవాటు చేసుకోండి. ఆఫీసులో అపుడపుడు కొన్ని నిమిషాలు నిలుచుని పని చేసుకోండి. అమెరికా లాంటి దేశాలలో ఇలా నించొని చేసుకోవడానికి వీలుగా డెస్క్ సెటప్ ఉంటుంది. స్ట్రెచ్ లు చేస్తూ ఉండండి. కళ్లకు, చేతులకు ముఖ్యంగా విరామం ఇస్తూ ఉండండి.

ఆలోచనల స్థిమితం

సాప్ట్వేర్ లో పని అంతా మెదడుదే.. పొద్దస్తమానూ లేదా రాత్ర్రి పడుకునే వరకూ ఏదో పని తలపులతో నింపేయకండి. దానికి పని కాకుండా వేరే ఏదైనా మీకు నచ్చిన ఒక్క ఆలోచనతో స్థిమిత పరచండి. చదవడమో , రాయడమో ఏదో మీకు నచ్చిన విషయంపై తదేక దృష్టి సారించండి. వేరే ఇతర ఆలోచనలు ఉండకూడదు ఇంక ఈ సమయంలో. ధ్యానం / ప్రాణాయామం చాలా మరకు ఉపయోగపడతాయి. గైడెడ్ మెడిటేషన్ లు చాలా ఉన్నాయి ఆన్లైన్లో..

నిద్ర

దయచేసి దీనిని ముఖ్యమైనదానిగా గుర్తించండి.మత్తుమందులేకుండా గాఢంగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. పడుకునే గంట ముందు ఐనా స్కీన్ ను చూడటం ఆపగలిగితే కొంత సాయం చేయొచ్చు.

విరామాలు

పని మద్యలో విరామాలు తప్పనిసరి చేస్కోండి. గంటల తరబడి మన మెదడుకి పని చెప్పడం మన శరీరంపై తెలియని అలసటను కలుగజేస్తుంది. కుటుంబంతో గడపడం కూడా రిలీఫ్ ను ఇస్తుంది.

ఆహారం

మీ శరీరం మీకోసం మీకలల సాధన కోసం పనిచేయడానికి తగినంత వనరులు దానికి ఇవ్వడం మన కనీస భాధ్యత. తగినంత మంచి నీరును తాగుతూ ఉండండి. పౌష్టిక ఆహారాన్ని , రక్త ప్రసరణకు ఉపయోగపడేవాటిని తప్పకుండా మీ భోజనంలో ఉండేలా చూసుకోండి. తక్కువ శారీరక శ్రమ కావున దానికి తగ్గట్టు మన ఆహార అలవాట్లను అలవాటు చేసుకుంటే మంచిది. పండ్లు, డ్రై ప్రూట్స్ తీసుకుంటే మంచిది.

మరిచిపోకండోయ్ ఈ కంప్యూటర్ పనితనం మన శరీరాలకు శతాబ్దాలుగా వచ్చినది కాదు. దీనికి తగ్గట్టు మన జీవనశైలి మార్చుకోవలసి వస్తుందిని గుర్తుంచుకోండి.