యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తున్న సాంగ్‌

Dynamite Song By BTS Breaks YouTube Record - Sakshi

కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్‌ మొదటి ఇంగ్లీష్ సింగిల్ “డైనమైట్” ను శుక్రవారం విడుదల చేసింది.  డైనమైట్‌ విడుదలయిన ఒక్కరోజులోనే అత్యధిక వీక్షణలు పొంది యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. డైనమైట్‌ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విడుదలయ్యింది. అయితే శనివారం ఉదయం 6.05 గంటలకు వరకు ఈ వీడియోను 86.4 మిలియన్ల మంది చూశారు. అంతకుముందు కూడా మరొక కొరియా పాప్ బ్యాండ్ బ్లాక్‌పింక్ చేసిన ట్రాక్ “హౌ యు లైక్ దట్” కూడా 86.3 మిలియన్ల వీక్షణలతో రికార్డ్‌ను సృష్టించింది. 

శనివారం యూట్యూబ్‌ ట్రెండింగ్‌ వీడియోలలో డైనమైట్‌ మొదటిస్థానంలో నిలిచింది. కేవలం ఇది మాత్రమే కాకండా డైనమైట్‌ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ వీడియో 3 మిలియన్లకు పైగా ప్రత్యక్ష వీక్షకులతో అత్యధికంగా వీక్షించిన యూట్యూబ్ ప్రీమియర్‌గా రికార్డును సృష్టించింది. అయితే, కొరియా పాప్ బ్యాండ్ ఈ ఘనతను సాధించడం ఇదేమీ తొలిసారి కాదు. అంతకుముందు విడుదలైన “బాయ్ విత్ లవ్” 24 గంటల్లో 74.6 మిలియన్ వీక్షణలను పొందింది. దీని గురించి బీటీఎస్‌ సంస్థ వారు మాట్లాడుతూ, ‘ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ కారణంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ సమయంలో ఒక ఇంగ్లీష్‌ పాటను రూపొందించి వారికి కొంత ఆనందాన్ని పంచాలనుకుంటున్నాం’ అని తెలిపారు. 

Explosion at Beirut, the capital city of Lebanon on 05-08-2020

Here are some before and after pictures of Beirut port, Entire contry is dependent on this port for imports.

the red circle is where the ammonia nitrate was being stored, alongside fireworks.

The shockwave was so powerful that very far areas in Lebanon heard the noise,

The sound of the explosion was even heard in Cyprus.

After:

Before:

Another one:

After

Before

Beirut Reels From Huge Blast - Sakshi

గోడౌన్‌లో వెల్డింగ్‌ పనులతో మంటలు

బీరూట్‌ : లెబనాన్‌ రాజధాని బీరూట్‌ను వణికించిన భారీ పేలుళ్లలో మృతుల సంఖ్య 100కు చేరింది. ఈ ఘటనలో నాలుగువేల మందికి పైగా గాయపడ్డారు.  పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో జనం వణికిపోయారు.  భయంతో ప్రజలు వీధుల వెంట పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఎరువులు, బాంబుల తయారీలో ఉపయోగించే 2750 టన్నుల అల్యూమినియం నైట్రేట్‌ను ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా ఆరేళ్లుగా పోర్టు ప్రాంతంలో నిల్వచేశారని అధ్యక్షుడు మేఖేల్‌ ఔన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్ర నిర్లక్ష్యమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు.

బాధ్యులపై చర్యలు

పేలుళ్లకు బాధ్యులను విడిచిపెట్టబోమని, వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ప్రధానమంత్రి హసన్‌ దియాబ్‌ హెచ్చరించారు. కాగా ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైందని అధికార వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచిన వేర్‌హస్‌లో వెల్డింగ్‌ పనులు చేపట్టడంతోనే పేలుళ్లు ప్రారంభమయ్యాయని భద్రతాధికారులతో పాటు మీడియా పేర్కొంది.  మరోవైపు దశాబ్ధాల తరబడి సాగిన అవినీతి, పాలనా వైఫల్యాలతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని లెబనాన్‌ ప్రజలు రాజకీయపార్టీలపై దుమ్మెత్తిపోస్తున్నారు. బీరూట్‌ పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించిన మేయర్‌ జమాల్‌ ఇతాని ఈ ప్రాంతం వార్‌ జోన్‌ను తలపిస్తోందని..తనకు మాటలు రావడం లేదని అన్నారు.పేలుళ్ల బీభత్సంతో కోట్లాది డాలర్ల నష్టం వాటిల్లిందని బీరూట్‌, లెబనాన్‌లకు ఇది కోలుకోలేని దెబ్బని వ్యాఖ్యానించారు.

ఇక ఈ ఘటనలో వంద మంది మరణించారని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లెబనాన్‌ రెడ్‌క్రాస్‌ హెడ్‌ జార్జ్‌ కెట్టాని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ పేలుళ్లలో మృతుల్లో అత్యధికులు పోర్ట్‌, కస్టమ్స్‌ ఉద్యోగులే ఉన్నారు.సెంట్రల్‌ బీరూట్‌లో భవనాలు దెబ్బతినగా, ఫర్నీచర్‌ వీధుల్లో పడిపోయింది. వీధులన్నీ గ్లాసు ముక్కలు శిధిలాలతో నిండాయి. పోర్టుకు సమీపంలోని కార్లు పల్టీలు కొట్టాయని స్ధానికులు పేలుళ్ల బీభత్సాన్ని గుర్తుచేసుకున్నారు. తాము ఇప్పుడు విపత్తు ప్రాంతంలో ఉన్నామని, పేలుళ్ల ధాటికి తన భవనం కదిలిందని డౌన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన బిలాల్‌ (60) చెప్పుకొచ్చారు. పేలుళ్ల ప్రభావం చూసి తాను భూకంపం అనుకున్నానని ఆయన పేర్కొన్నారు. 

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే హతం

Report Says Uttar Pradesh Gangster Vikas Dubey Died In Encounter - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో 8 మంది పోలీసుల కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్‌ ఆస్పత్రికి తరలించగా.. అతడు మరణించినట్లు తెలుస్తోంది. కాగా వికాస్‌ను పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం.

ఎనిమిది మందిని పొట్టనబెట్టుకుని
ఉత్తరప్రదేశ్‌లో నేర సామ్రాజ్యం నిర్మించుకున్న వికాస్‌ దూబేను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడి అనుచరులు.. పోలీసులపై కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. గత గురువారం జరిగిన కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. ఈ క్రమంలో వికాస్‌ అనుచరుడు దయా శంకర్‌ అగ్నిహోత్రిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అతడు సంచలన విషయాలు వెల్లడించాడు. పోలీసులు బిక్రూ గ్రామానికి వచ్చే ముందే వికాస్‌కు ఓ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందని అతడు వెల్లడించాడు. దీంతో అప్రమత్తమైన అతడు‌.. తన అనుచరులకు ఫోన్‌ చేసి 25-30 మంది.. పోలీసులను అడ్డుకునేలా పథకం రచించాడని తెలిపాడు.

ఎట్టకేలకు చిక్కి..
ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇక పోలీసులపై కాల్పులు జరిపిన అనంతరం వికాస్‌ రాష్ట్రం విడిచి పారిపోగా.. అతడి ఆచూకీ చెప్పిన వారికి నగదు బహుమతి ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. అయినప్పటికీ అతడి గురించి ఎటువంటి సమాచారం తెలియకపోవడంతో రూ. 50 వేల నుంచి 5 లక్షలకు రివార్డును పెంచారు. ఈ క్రమంలో ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాలి గుడిలో అతడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులు వికాస్‌ను అరెస్టు చేయగా.. అక్కడికి చేరుకున్న యూపీ పోలీసులు అతడిని ప్రత్యేక వాహనంలో శుక్రవారం ఉదయం కాన్పూర్‌కు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఎస్కార్ట్‌లోని వాహనం బోల్తా పడటంతో వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపారు. ఇక గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో దూబే అనుచరులు కార్తికేయ, ప్రవీణ్‌ అలియాస్‌ బవువా  హతమైన విషయం తెలిసిందే.

సరిహద్దు నుంచి యుద్ధ సందేశం

PM Narendra Modi Visit Ladakh - Sakshi

పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్‌ 370 తొలగింపు (కశ్మీర్‌), లాక్‌డౌన్‌ విధింపు వంటి అనుహ్య నిర్ణయాలతో దేశ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అదే పంథాను ఎంచుకున్నారు. భారత్‌-చైనా దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మూడోకంటికి కూడా తెలియకుండా కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పర్యటించి శుక్రవారం ఉదయం ఊహించని వార్తను దేశ ప్రజలకు వినిపించారు. ఎవరికీ ఎలాంటి సమాచారం లేకుండా సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జరనల్‌ ఎంఎమ్‌ నరవణేతో కలిసి మోదీ లేహ్‌ పర్యటనకు శ్రీకారం చుట్టారు. జూన్‌ 15న చోటుచేసుకున్న గల్వాన్‌ లోయ హింసాత్మక ఘటనలో గాయపడిన సైనిక జవాన్లను 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న భారత సైనిక స్థావరం నిములో పరామర్శించారు. అలాగే సరిహద్దు ప్రతిష్టంభనపై చైనా-భారత్‌ కమాండర్‌ స్థాయి సమావేశాల్లో పాల్గొన్న సైనిక అధికారులతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

గల్వాన్‌ హింసాత్మక ఘటనపై స్థానిక జవాన్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలోని తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భగా సరిహద్దులోని పరిస్థితిని సైనికాధికారులు మోదీకి వివరించారు. ఈ పరిణామం చైనాతో పాటు పాకిస్తాన్‌, నేపాల్‌ దేశాలు కొంత కంటగింపు లాంటిదేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. సరిహద్దు నుంచి మోదీ యుద్ధ సందేశాన్ని ఇచ్చారని చెబుతున్నారు. మొదట గల్వాన్‌ లోయలో యుద్ధ వాతావరణం తలపించడం, ఆ తరువాత ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు జరపడం భారత్‌ శాంతి మంత్రాన్ని ప్రతిపాదించినప్పటికీ చైనా పద్దతి మార్చుకోకపోవడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. సరిహద్దుల్లో భారతపై దురాక్రమణకు కాలుదువ్వుతున్న డ్రాగన్‌కు మూకుతాడు వేసేందుకు మోదీ ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా వారం కిందటే చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఎల్‌ఏసీ వెంట నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సైనిక సన్నద్ధతను సమీక్షించడానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ శుక్రవారం లద్దాఖ్‌ పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఆయన స్థానంలో హుటాహుటిన మోదీ లద్దాఖ్‌కు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాగా చైనా సరిహద్దుల్లో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి కాదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో ఓసారి పర్యటించారు. సియాచిన్‌కు వెళ్లిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు సైతం నెలకొల్పారు.

Image
Image
Interacted with the soldiers injured in Galwan clash with chinese army

సూర్యగ్రహణం

Annular solar eclipse on June 21 - Sakshi

ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ఆదివారం భారత్‌లో కనిపించి కనువిందు చేయనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సుదూరంగా వెళ్లడంతో పూర్తిగా సూర్యుడ్ని కప్పి ఉంచలేడు. 70శాతం మాత్రమే కప్పివేయడంతో ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుంది.

► 2020లో సంభవించే రెండు సూర్యగ్రహణాల్లో ఇది మొదటిది. ఇది పాక్షిక సూర్య గ్రహణమే. డిసెంబర్‌ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం.
► దేశంలో గుజరాత్‌లోని భుజ్‌లో మొదట కనిపిస్తుందని, అస్సాంలోని దిబ్రూగఢ్‌లో చివరిగా మధ్యాహ్నం 2:29 గంటలకు పూర్తవుతుందని నెహ్రూ ప్లానెటోరియంలోని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
► ఇవాళ్టి వార్షిక సూర్యగ్రహణంలో ఆకాశంలో అద్భుత దృశ్యమైన రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కనువిందు చేయనుంది. రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ప్రజలు దీనిని వీక్షించవచ్చును.

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌, డెహ్రాడూన్‌ తదితర ప్రాంతాల్లో సూర్యగ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుందని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డా.బి.జి.సిద్ధార్థ్‌ చెప్పారు. హైదరాబాద్‌తోపాటు మిగతా చోట్ల పాక్షికంగానే కనిపిస్తుందన్నారు. సూర్యగ్రహణాన్ని నేరుగా, ఎక్స్‌రే ఫిలిం, నల్లని గాజు ముక్కల ద్వారా చూడడం ప్రమాదకరమని తెలిపారు. వైద్యులు సూచించిన ఎక్లిప్స్‌ అద్దాలతోనే గ్రహణాన్ని చూడాలని సూచించారు. వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డుగా ఉంటుంది. దీంతో చంద్రుడి వెనుక సూర్యుడి వెలుపలి భాగం వలయాకారంలో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ వలయాన్ని ‘జ్వాలా వలయం’గా పిలుస్తారు. ఒక్కోసారి ఒక సెకను కంటే తక్కువ కాలంలోనే జ్వాలా వలయం మాయమవుతుంది. కొన్నిసార్లు 12 నిమిషాలకుపైగా కనిపిస్తుంది.
► రాజస్తాన్‌లో సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలో సిర్సా, రాటియా, కురుక్షేత్రలోనూ, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, చంబా, చమోలిŠ‡లో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ఒక్కనిమిషం వరకు కనిపిస్తుంది. 
► సెంట్రల్‌ ఆఫ్రికా, పాకిస్తాన్, దక్షిణ సెంట్రల్‌ చైనా, యూరప్‌లో కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోనూ సూర్యగ్రహణం కనిపిస్తుంది.
► సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే మనిషి కంటిలో రెటీనా దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తగినన్ని రక్షణ జాగ్రత్తలతో ఫిల్టర్‌ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ దృశ్యాన్ని చూడొచ్చు.

ఐరాస ఎన్నిక‌ల్లో భార‌త్ విజ‌యం

India elected non permanent member of UN Security Council - Sakshi

ఐరాసలో భారత్‌కు తాత్కాలిక సభ్యదేశ హోదా 
184 ఓట్లను గెలుచుకున్న భారత్‌
2021 జనవరి 1 నుండి రెండేళ్లపాటు
ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి తాత్కాలిక స‌భ్య‌త్వపు ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో భారత్‌కు మరోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. దీంతో రెండేళ్లపాటు (2021–22) భారత్ కొనసాగనుంది.‌ ఐరాసలో సభ్యదేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదోసారి. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్‌ గ్రూప్‌ నుంచి కేవలం భారత్‌ ఒక్కటే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించగా, కెనడా ఓటమిపాలైంది.

విషం చిమ్మిన చైనా..

India-China border clashes 20 Indian soldiers eliminates - Sakshi

తూర్పు లద్దాఖ్‌లో భారతీయ సైనికులపై రాళ్లు, రాడ్‌లతో దాడి
అమరులైన 20 మంది భారతీయ సైనికులు
ఎదురుదాడి చేసిన భారత సైన్యం
చైనాకు భారీగా ప్రాణ నష్టం; 43 మంది మరణించినట్లు సమాచారం
తప్పు భారత్‌దేనన్న చైనా; భారతీయ సైనికులే సరిహద్దు దాటారని వాదన
న్యూఢిల్లీ: ఇండో–చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్‌లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వారి దాడిలో తెలుగువాడైన ఒక కల్నల్, ఇద్దరు జవాన్లు అమరులైనట్లు మొదట ఆర్మీ ప్రకటించింది. కానీ, ఘర్షణలు పెద్ద ఎత్తున జరిగాయని, భారీగా మోహరించిన రెండు దేశాల సైనికులు కొన్ని గంటల పాటు ముఖాముఖి తలపడటంతో ఇరు వర్గాల సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారని అనంతరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

భారత్‌–చైనా సరిహద్దు ఊహాచిత్రం…
ఆ తరువాత, లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో 20 మంది భారతీయ సైనికులు అమరులైనట్లు మంగళవారం రాత్రి ఆర్మీ ప్రకటించింది. ఘటనాస్థలి నుంచి రెండు దేశాల సైనికులు వెనక్కు వెళ్లారని పేర్కొంది. చైనాకు కూడా భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 43 మంది చైనా సైనికులు భారత సైనికుల దాడిలో చనిపోయి ఉండొచ్చని సమాచారం. అయితే, ఐదుగురు చైనా సైనికులు చనిపోయారని, 11 మంది గాయపడ్డారని పేర్కొంటూ చైనా అధికార మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ సీనియర్‌ రిపోర్టర్‌ చేసినట్లుగా చెబుతున్న ట్వీట్‌ ఒకటి వైరల్‌ అయింది.
ప్రధాని సమీక్ష
ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెంటనే స్పందించారు. గాల్వన్‌ లోయ ప్రాంతంలో సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటన, తదనంతర పరిణామాలు, వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. అంతకుముందు, విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్యాంగ్యాంగ్‌ సొ, దెమ్చోక్, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, గాల్వన్‌ లోయ ప్రాంతాల్లో భారత బలగాల సంఖ్యను భారీగా పెంచాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఆ తరువాత, జై శంకర్, ఆర్మీ చీఫ్‌ నరవణెలతో రాజ్‌నాథ్‌ మళ్లీ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం పఠాన్‌కోట్‌ పర్యటనను ఆర్మీ చీఫ్‌ రద్దు చేసుకున్నారు. మరోవైపు, హోం మంత్రి అమిత్‌ షా కూడా ప్రధాని మోదీతో సమావేశమై చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు.
మే తొలివారం నుంచి..
మే 5వ తేదీ నుంచి చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దులకు భారీగా బలగాలను, ఆయుధ సామగ్రిని తరలించాయి. పలుమార్లు రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగి, గాయాల పాలయ్యారు. అనంతరం, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మేజర్‌ జనరల్‌ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక అవగాహన మేరకు రెండు దేశాలు తమ సైన్యాలను వెనక్కు తరలించడం ప్రారంభించాయి. ఆ క్రమంలోనే సోమవారం రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ ప్రారంభమై తీవ్రరూపు దాల్చిందని సైనిక వర్గాలు తెలిపాయి. దాడుల అనంతరం మంగళవారం ఇరుదేశాల సైన్యంలోని ఉన్నతాధికారులు ఘటనాస్థలంలో సమావేశమయ్యారని ఇండియన్‌ ఆర్మీ వెల్లడించింది.
ఫింగర్‌ ఏరియా కీలకం
ప్యాంగ్యాంగ్‌ సొ సరస్సు చుట్టూ ఫింగర్‌ ఏరియాలో భారత్‌ చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని, గాల్వన్‌ లోయలో దార్బుక్‌– షాయొక్‌– దౌలత్‌ బేగ్‌ ఓల్డీలను అనుసంధానించే భారత్‌ చేపట్టిన మరో రోడ్డు నిర్మాణాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్యాంగ్యాంగ్‌ సొ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం భారత్‌కు అత్యంత కీలకం. చైనా వ్యతిరేకతను పట్టించుకోకుండా, తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలోని సరిహద్దుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయాలని భారత్‌ కృత నిశ్చయంతో ఉంది. 2022 నాటికి చైనా సరిహద్దుల్లో 66 కీలక రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది.  
చైనా తీరు ఏకపక్షం
సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా చేసిన ప్రయత్నం కారణంగానే తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఉన్నత స్థాయిలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా గౌరవించి ఉంటే.. రెండు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కాదని పేర్కొంది. వాస్తవాధీన రేఖకు ఇవతలి(భారత్‌) వైపుననే భారత్‌ చేపట్టే అన్ని కార్యకలాపాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. చైనా నుంచి కూడా అదే తీరును ఆశిస్తున్నామంది.  
భారత్‌దే తప్పు: చైనా
జూన్‌ 15న భారత దళాలు వాస్తవాధీన రేఖను రెండుసార్లు దాటి వచ్చి, తమ సైనికులపై దాడులు చేసి రెచ్చగొట్టారని చైనా ఆరోపించింది. దాంతో రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ‘గతంలో అంగీకారానికి వచ్చిన ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని, తమ దళాలు సరిహద్దు దాటకుండా చూసుకోవాలని, పరిస్థితులు విషమించేలా ఏకపక్ష చర్యలకు దిగకుండా చూసుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియాన్‌ వ్యాఖ్యానించారు.
గాల్వన్‌ లోయ ప్రాంతం చైనాదేనని ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి కల్నల్‌ జాంగ్‌ షుయిలీ మంగళవారం పేర్కొన్నారు. ‘నాకందిన సమాచారం మేరకు అక్కడ జరిగింది ముఖాముఖీ పోరాటమే. కొందరు చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దుందుడుకుగా వ్యవహరించవద్దని, చైనా సంయమనాన్ని బలహీనతగా భావించవద్దని భారత్‌కు చెబుతున్నా. భారత్‌తో ఘర్షణను చైనా కోరుకోవడం లేదు. అలా అని మేమేం భయపడడం లేదు’ అని అధికార మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటర్‌ హు జీజిన్‌ ట్వీట్‌ చేశారు.  
చైనా దుందుడుకుతనం
గాల్వన్‌లోయతో పాటు తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్‌ సొ, దెమ్చోక్, దౌలత్‌ బేగ్‌ ఓల్డీల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో నెలరోజులకు పైగా సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలుమార్లు ప్యాంగ్యాంగ్‌ సొ సహా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దును దాటి చైనా దళాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. వాస్తవాధీన రేఖ సమీపానికి శతఘ్నులను, ఇతర ఆధునిక ఆయుధ సామగ్రిని భారీగా తరలించింది. సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో బాహాబాహీకి దిగిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చొరబాట్లను భారత్‌ తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే వెనక్కు వెళ్లాలని చైనాను హెచ్చరించింది.
ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్‌ 6న లేహ్‌లోని 14 కార్ప్స్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్, టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ల్యూ లిన్‌ల మధ్య  7 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆ తరువాత మేజర్‌ జనరల్‌ స్థాయి చర్చలు రెండు దఫాలుగా జరిగాయి. ఆ చర్చల్లో, ఉద్రిక్తతల ముందు నాటి యథాతథ స్థితి ఏర్పడాలని, చైనా దళాలు వెంటనే వెనక్కు వెళ్లాలని భారత్‌ డిమాండ్‌ చేసింది. రెండు దేశాలు తమ దళాలను క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయని శనివారం భారత ఆర్మీ చీఫ్‌ నరవణె తెలిపారు. చర్చలు ఫలవంతమయ్యాయని, గాల్వన్‌ లోయకు ఉత్తరం వైపు నుంచి భారత దళాల ఉపసంహరణ ప్రారంభమైందని చెప్పారు.
భారత్, చైనా సరిహద్దులు ఇలా ..
► భారత్, చైనా సరిహద్దుల్ని మూడు సెక్టార్‌ల కింద విభజించారు. వీటిలో పశ్చిమ సెక్టార్‌ ఎప్పుడూ ఉద్రిక్తతలకి, చొరబాట్లకి కేంద్ర బిందువుగా ఉంటోంది.
► కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి 1,597 కి.మీ. ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్‌ అంటారు.
► హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లో 545 కి.మీ. పొడవునా మధ్య సెక్టార్‌ ఉంది.
► తూర్పు సెక్టార్‌లో 1,346 కి.మీ. మేర సరిహద్దు ఉంది. సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు సరిహద్దుగా ఈ సెక్టార్‌ ఉంది.  
తెలుగువాడి వీర మరణం
చైనా సైనికులతో ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్‌ సంతోశ్‌ బాబు, మరో ఇద్దరు జవాన్లు మృతి చెందారని ఆర్మీ ప్రకటించింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోశ్‌ గాల్వన్‌ లోయ ప్రాంతంలో 16 బిహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. చనిపోయిన ఇద్దరు జవాన్లను హవల్దార్‌ పళని, సిపాయి ఓఝా అని ఆర్మీ తెలిపింది. ఈ ఘర్షణల సందర్భంగా కాల్పులు చోటు చేసుకోలేదని, తుపాకుల వంటి మారణాయుధాలను ఉపయోగించలేదని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు.
రాళ్లు, కర్రలు, ఐరన్‌ రాడ్‌లను ఉపయోగించినట్లు సమాచారముందన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. గాల్వన్‌లోయలోని ఒక ప్రాంతం నుంచి చైనా దళాలు వెనక్కు వెళుతుండగా, ఘర్షణ ప్రారంభమైందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మొదట కల్నల్‌ సంతోష్, కల్నల్‌తో పాటు ఉన్న సైనికులపై చైనా దళాలు దాడి చేశాయని, భారత్‌ ప్రతిదాడికి దిగడంతో ఘర్షణ తీవ్రరూపు దా        ల్చిందని వివరించాయి. గత ఐదు దశాబ్దాల్లో ఈ స్థాయి ఉద్రిక్తత రెండు దేశాల మధ్య నెలకొనలేదు.
చైనా టెంట్‌ను తొలగించమన్నందుకే..
న్యూఢిల్లీ:  భారత్‌–చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీసిన పరిణామం ఏమిటన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అధికార వర్గాల కథనం ప్రకారం.. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 అనే చోట చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) టెంట్‌ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. ఈ నెల ప్రారంభంలోనే ఈ టెంట్‌ వేసినట్లు సమాచారం. ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది.

వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్‌ ఏర్పాటు చేశారు. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. ఇనుప రాడ్లతో దాడికి దిగారు. భారత సైనికులు కూడా ధీటుగా బదులిచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 గాల్వన్, ష్యోక్‌ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్‌ కమాండర్‌ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు.
ఐరాస ఆందోళన
ఐక్యరాజ్యసమితి: భారత్‌–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటేరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన మంగళవారం పిలుపునిచ్చారు. ఉద్రిక్తతను చల్లార్చేందుకు భారత్‌–చైనా చర్యలు ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.

గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ

భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోశ్ బాబు వీరమరణం పొందారు.  ఆయనది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా. అత్యంత ధైర్యవంతుడు, ప్రతిభావంతుడైన సంతోశ్ గురించి ఆయన తల్లిదండ్రులు కీలక వివరాలు తెలిపారు.

samayam telugu
తల్లిగా బాధగా ఉంది.. కానీ, నా కుమారుడు దేశం కోసం అమరుడైనందుకు గర్వంగా ఉంది.. గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలో అమరులైన కల్నల్ సంతోశ్ బాబు తల్లి మంజుల చెబుతోన్న మాట ఇది. ఒక్కగానొక్క కుమారుడు దేశం కోసం ప్రాణాలు కోల్పోయాడు. అయినా.. ఆ తల్లిదండ్రుల్లో ధైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదు. వారిలో ఆ జవాన్ నింపిన ధైర్యం అలాంటిది. ఇండియన్ ఆర్మీ పవర్ అలాంటిది. తనకు మరణం ఏ సమయంలో, ఏ రూపంలో వచ్చినా కుంగిపోవద్దని తల్లిదండ్రులకు, భార్యకు ధైర్యం నూరిపోశాడు. తన కుమారుడు ఇచ్చిన బలంతోనే ఆ మాతృమూర్తి.. ఉబికివస్తున్న కన్నీళ్లను కూడా దిగమింగుకొని ధైర్యంగా నిల్చున్నారు. మీడియాతో మాట్లాడారు. తన కుమారుడి సాధించిన విజయాలను ఆ తల్లిదండ్రులు మీడియాతో చెప్పారు.. 

అమ్మా త్వరలో హైదరాబాద్ వచ్చేస్తా..

samayam telugu

‘అమ్మా.. హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయిందిగా, ఇంకో నెల రోజుల్లో వచ్చేస్తా’ అని తన కుమారుడు చెప్పాడని సంతోశ్ బాబు తల్లి తెలిపారు. చివరిసారిగా ఆదివారం (జూన్ 14) తనతో ఫోన్లో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. తన కుమారుడు ఇప్పటికే హైదరాబాద్ రావాల్సి ఉన్నా.. కరోనా లాక్‌డౌన్ వల్ల ఆలస్యమైందని, అక్కడికి రావాల్సిన బలగాలు ఇంకా చేరుకోకపోవడం వల్ల అక్కడే ఉండిపోయాడని ఆమె తెలిపారు. సంతోశ్ మరణవార్తతో ఆయన అత్తగారు కుప్పకూలిపోయారు. ఆమెను తరలించారు. సంతోశ్ సతీమణి తన పిల్లలతో ఢిల్లీలో ఉన్నారు. సంతోశ్ బాబు భార్య పేరు సంతోషి. వీరికి కుమార్తె అభిజ్ఞ (9), కుమారుడు అనిరుధ్‌ (4) ఉన్నారు.

నా కలను కొడుకు రూపంలో చూసుకున్నా..

samayam telugu

దేశం కోసం సైనికుడిగా పనిచేయాలని తనకు బలంగా ఉండేదని సంతోశ్ బాబు తండ్రి తెలిపారు. కొన్ని కారణాల వల్ల తాను ఆ అవకాశం పొందలేకపోయానని వివరించారు. బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన ఆయన సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు. ‘సైన్యంలో పనిచేయాలనేది నా కల. నా కలను కొడుకు రూపంలో చూసుకున్నాను. అతడిని ముందు నుంచే ఆ లైన్లో తయారు చేశాను. కోరుకుండ సైనిక్ స్కూల్లో చదివించాను. అతడి కోసం నేను 800 కి.మీ. ట్రాన్స్‌ఫర్ చేయించుకొని అక్కడికి వెళ్లాను’ అని ఆయన చెప్పారు.

రాళ్ల దెబ్బలు.. నిలువెల్లా గాయాలతో..

Col Santosh Babu Fought the Chinese in Galwan Valley and led his troops - Sakshi

కల్నల్‌ సంతోష్‌ బాబు వీరోచిత పోరాటం
వెల్లడించిన ఆర్మీ వర్గాలు
దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ ముద్దు బిడ్డ, సూర్యాపేట వాసి కల్నల్‌ సంతోష్‌బాబు వీరోచిత పోరాటం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. భారతీయ సైనికుల్ని ముందుండి నడిపించిన ఆయనలో నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని మరిచిపోని ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి జై కొట్టాలి. సంతోష్‌బాబు ఎంతటి తెగువ చూపించారో ఒక ఆర్మీ అధికారి జాతీయ చానెల్‌తో పంచుకున్నారు. కల్నల్‌ ఎలా ముందుకు సాగారంటే….
ఇండియన్‌ ఆర్మీ 16 బిహార్‌ బెటాలియన్‌కు సంతోష్‌ బాబు కమాండింగ్‌ ఆఫీసర్‌ (సీఓ)గా వ్యవహరిస్తున్నారు. జూన్‌ 6న ఇరుపక్షాల సైనికుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో గల్వాన్‌ లోయలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 దగ్గర నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని అంగీకారానికి వచ్చాయి. చైనా తన శిబిరాన్ని తీసేసి సైన్యాన్ని వెనక్కి పిలిచింది. కానీ హఠాత్తుగా జూన్‌ 14 రాత్రి మళ్లీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే సంతోష్‌ బాబు, చైనా కమాండింగ్‌ ఆఫీసర్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చాక మళ్లీ తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఆ తర్వాత చైనా సైనికులు వెనక్కి మళ్లారన్న సమాచారం అందింది. ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కల్నల్‌ స్వయంగా గల్వాన్‌ లోయకు బయల్దేరారు. ఇలాంటి పరిస్థితుల్లో మేజర్‌ ర్యాంకు అధికారిని పంపి పరిస్థితుల్ని పర్యవేక్షించాలని చెప్పి ఉండొచ్చు. కానీ సంతోష్‌బాబు ఆ పని చేయలేదు. డ్రాగన్‌ సైన్యం వెనక్కి వెళ్లి ఉండదన్న అనుమానంతో సైనికుల్ని తీసుకొని వెళ్లారు. అప్పటికే అక్కడ కొందరు చైనా సైనికుల కొత్త ముఖాలు కనిపించాయి. ఎంతో మర్యాదగానే కల్నల్‌ సంతోష్‌ బాబు వారితో సంభాషణ మొదలు పెట్టారు. మళ్లీ ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. దీనికి జవాబుగా సైనికులు సంతోష్‌ బాబుపై రాళ్ల వర్షం కురిపించారు. ఇరుపక్షాల మధ్య 30 నిమిషాల సేపు ఘర్షణలు జరిగాయి.
చైనా శిబిరాల్ని భారత జవాన్లు నాశనం చేశారు. ఈ దాడుల్లో సంతోష్‌బాబు తీవ్రంగా గాయపడినా వెనుకడుగు వేయలేదు. గాయపడిన ఇతర జవాన్లను వెనక్కి పంపేస్తూ తానే సింహంలా ముందుకు ఉరికారు. అంతలోనే అటువైపు నుంచి మరికొందరు ఇనుప రాడ్లతో, కొత్త తరహా ఆయుధాలతో భారతీయ సైనికులపై దాడి చేశారు. కల్నల్‌ అనుమానం నిజమైంది. చైనా పథకం ప్రకారమే సైన్యాన్ని అక్కడ దింపిందని అర్థమైంది. మళ్లీ ఇరువర్గాల మధ్య భీకర పోరు జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో పెద్ద రాయి వచ్చి కల్నల్‌ తలకి గట్టిగా కొట్టుకోవడంతో ఆయన గల్వాన్‌ నదిలో పడిపోయారు. పోరు ముగిశాక సంతోష్‌బాబుతో సహా చాలా మంది జవాన్లు నిర్జీవంగా నదిలో ఉన్న దృశ్యాలు అందరి గుండెల్ని పిండిచేశాయి. చాలాసేపు అక్కడ ఉద్విగ్న భరిత వాతావరణమే నెలకొందటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి వివరించారు.

భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోష్ కుమార్ భార్య సంతోషికి ప్రభుత్వం గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, ఇంటి స్థలం, రూ.5 కోట్ల నగదు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట వెళ్లి ఉత్తర్వులను ఆమెకు అందజేశారు. గ్రూప్-1 ఉద్యోగంలో భాగంగా సంతోష్ బాబు భార్య సంతోషి ఇకపై కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కనిపించనున్నారు. దీనికి సంబంధించి సంతోషిని ఆ ఉద్యోగంలో నియమిస్తూ సీఎస్ సోమేశ్‌ కుమార్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.

హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లో కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేరు మీద 711 గజాల స్థలం ఇస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంతోషికి రూ.4 కోట్ల చెక్కును, తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కును ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సంగతి తెలిసిందే.

హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య

MS Dhoni: Hero Sushant Singh Rajput Lifeless - Sakshi

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (34) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారో కారణాలు తెలియరాలేదు. కాగా గత ఆరు నెలలుగా సుశాంత్‌ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.  ‘కోయ్‌ పో చి’తో కెరీర్‌ను ఆరంభించిన సుశాంత్‌ ఆ తర్వాత ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’, ‘పీకే’, ‘డిటెక్టీవ్‌ బొమ్‌కేష్‌ బక్షి’, ‘ఎం.ఎస్‌.ధోనిః ద అన్‌టోల్డ్‌ స్టోరీ’, ‘రాబ్టా’, ‘వెల్‌కమ్‌ న్యూయార్క్‌’, ‘కేదార్‌నాథ్‌’, ‘సోంచారియా’, ‘చిచ్చోర్‌’, ‘డ్రైవ్‌’ తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు.

అలాగే బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఆయన చివరిగా నటించిన చిత్రం ‘దిల్‌ బేచారా’. కాగా బాలీవుడ్‌లో లాక్‌డౌన్ కార‌ణంగా ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న ప‌లువురు‌ టెక్నీషియ‌న్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.  మరోవైపు సుశాంత్‌ ఆత్మహత్య వార్తతో బాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ వార్త తమకు షాక్‌కు గురి చేసిందని, సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని బాలీవుడ్‌, టాలీవుడ్‌ చెందిన పలువురు ట్వీట్‌ చేశారు.

The actor’s net worth was around 59 crore INR. He reportedly used to charge between Rs 5-7 crore for a movie. He is the only Indian who had bought a piece of land on the moon.
A bike enthusiast, Sushant Singh Rajput owned a superbly expensive and stylish BMW K 1300 R motorcycle. He was also a proud owner of luxury sports car Maserati Quattroporte and a Land Rover Range Rover SUV.

The actor, Sushant Singh Rajput (34) had a duplex flat in Bandra, Mumbai where he used to pay around 2 lakh Rs per month as rent. The reason that he had chosen this place was that he loved the stargazing and that duplex had unrestricted access to its sprawling terrace, measuring 6,000 sqft. He had carefully chosen the sea side bungalow as it gave him an unhindered view of the sky.
Sushant had two servants living with him for cleaning and cooking purpose. The servants said, “He would spend the entire night gazing at stars with a powerful telescope and sets of powerful lenses.”
Here are some of the pictures of his house in Bandra.
The price of the telescope is rupees 80,00000 ( eighty lakh)

జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?

జార్జ్ ఫ్లాయిడ్

తెల్లజాతి పోలీసు కాళ్ల కింద నలిగి చనిపోయి, తన మరణంతో అమెరికా అంతటినీ కదిలించక ముందే.. ఆఫ్రో-అమెరికన్ అయిన జార్జి ఫ్లాయిడ్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు.
అతని జీవితంలో ఘనతలున్నాయి. 1992లో హ్యూస్టన్‌లో ఉంటున్నప్పుడు యేట్స్ స్కూల్‌ లయన్స్ జట్లు తరఫున టెక్సాస్‌ స్టేట్ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌లో ఫ్లాయిడ్‌ పాల్గొన్నారు. రన్నర్స్ అప్‌ టీమ్‌లో అతను సభ్యుడు.
అతని జీవితంలో పతనాలు కూడా ఉన్నాయి. 2007 సంవత్స్రరంలో ఒక దొంగతనం కేసులో ఫ్లాయిడ్‌ ఐదు సంవత్సరాల జైలు శిక్షను కూడా అనుభవించారు.
మిన్నీపోలిస్‌ నగరంలో మే 25న ఒక పోలీస్‌ కాళ్ల కింద నలిగి మరణించే నాటికి అతను ఓ సాదాసీదా అమెరికన్ పౌరుడు. వ్యక్తిగతంగా, సామాజికంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మెరుగైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి. దేశంలో లక్షమందికి పైగా చంపి, నాలుగు కోట్ల మందిని నిరుద్యోగులుగా చేసిన ఒక మహమ్మారి అమెరికాను చుట్టేస్తున్న సమయంలో ఆయన హత్యకు గురయ్యారు.
టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరంలో, నల్లజాతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ పుట్టి పెరిగారు. సిటీ సెంటర్‌కు ఈ ప్రాంతం దక్షిణ భాగంలో ఉంటుంది. ప్రముఖ సింగర్‌, లిరిక్‌ రైటర్‌ బెయాన్స్ కూడా అక్కడే పెరిగారు. కెనడాకు చెందిన ప్రముఖ ర్యాపర్‌ డ్రేక్‌ కూడా ఈ ప్రాంతంలోని వారి సంగీతాభిరుచిని తరచూ మెచ్చుకునేవారు. 1990లలో హూస్టన్‌లో ఉన్నప్పుడు ఫ్లాయిడ్‌ కూడా హిప్‌-హాప్‌ గ్రూపుల్లో తిరుగుతూ స్పిట్‌బార్స్‌లో పాలు పంచుకునేవారని చెబుతారు.
జార్జ్ ఫ్లాయిడ్
చాలా అమెరికన్‌ నగరాలలాగే హ్యూస్టన్‌లో కూడా పేదరికం, జాతి వివక్ష, ఆర్ధిక అసమానతలు కనిపిస్తాయి. ఫ్లాయిడ్‌ నివసించే మూడో వార్డులో ఇళ్ల స్థలాల విషయంలో తరచూ ఉద్రిక్తతలు, హింస చోటు చేసుకుంటుంటాయి. ”ఇక్కడికి వేరే ప్రాంతం వాళ్లను తీసుకొస్తే…”అమ్మో నేనింత పేదరికాన్ని ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోతారు” అని రోనీ లిల్లార్డ్ బీబీసీతో అన్నారు.
”ఇక్కడి వాళ్లలో చాలామంది ఇప్పటికీ 1920లో కట్టించిన చెక్క ఇళ్లలో నివాసం ఉంటుంటారు. పేదరికం నుంచి ఇక్కడ ఎవరూ తప్పించుకోలేరు” అని రికాన్సైల్‌ పేరుతో ర్యాపర్‌ షోలు నిర్వహించే లిల్లార్డ్ చెబుతున్నారు. క్యూనీ హోమ్స్ పేరుతో ఉండే కాలనీలో నివాసముంటున్నఫ్లాయిడ్‌ పేరు చుట్టుపక్కల చాలామందికి తెలుసు. క్యూనీ హోమ్స్‌ అంటే ఇటుకతో కట్టిన భవనాలు అని అర్ధం. ఆ బిల్డింగ్‌లలో ఉండేవారిని ‘బ్రిక్‌ బాయ్స్‌’ అంటారు.
ఆరడుగుల, ఆరంగుళాల పొడవున్న ఫ్లాయిడ్‌కు అథ్లెటిక్స్‌ కోసం పుట్టినట్లు కనిపిస్తారు. టీనేజ్‌లో ప్లాయిడ్‌ను స్నేహితులు ‘జెంటిల్‌ జెయింట్‌’ అని పిలిచేవారు. బాస్కెట్‌బాల్‌, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఆడటంలో ఆయన దిట్ట. ”నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని, 12 సంవత్సరాల వయసులోనే ఫ్లాయిడ్‌ 6 అడుగుల 2 అంగుళాల పొడవు ఉండేవారు” అని అతని చిన్ననాటి స్నేహితుడు, అతని టీమ్‌మేట్‌ జోనాథన్‌ వీల్‌ స్థానిక మీడియాతో అన్నారు. ”అంత పొడవున్న వ్యక్తిని అంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు” అని చెప్పారు.
జార్జ్ ఫ్లాయిడ్
జాన్‌ యేట్స్‌ హైస్కూలు ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడిన ఫ్లాయిడ్‌ 88వ నంబర్‌ జెర్సీ ధరించేవారు. ఆ తర్వాత సౌత్‌ ఫ్లోరిడా స్టేట్‌ కాలేజ్‌ బాస్కెట్‌బాల్‌ జట్టుకు ఎంపికయ్యారు. 1993 నుంచి 1995 వరకు అక్కడే జార్జ్‌ అక్కడే చదువుకున్నారని సీఎన్‌ఎన్‌ తెలిపింది. కొన్నాళ్ల తర్వాత టెక్సాస్‌ తిరిగి వచ్చి కింగ్స్‌విల్లేలోని ఏ అండ్‌ ఎమ్ యూనివర్సిటీలో చేరారు. కానీ డిగ్రీ పూర్తి చేయలేదు.
ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. డ్రగ్స్‌ సరఫరా, దొంగతనం కేసుల్లో అనేకసార్లు అరెస్టయ్యారు ఫ్లాయిడ్‌. మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ నేరంపై 2007లో కోర్టు ఫ్లాయిడ్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ”జైలు నుంచి విడుదలయ్యాక, మంచి మనిషిగా మారే క్రమంలో జార్జ్‌, స్థానికంగా పనిచేసే మత సంస్థ రిసరెక్షన్‌ హ్యూస్టన్‌లో చేరారు” అని అతని చిన్ననాటి మిత్రుడు లిల్లార్డ్‌ వెల్లడించారు. ” తాను మారడమే కాదు…తన చుట్టూ ఉన్న తన కమ్యూనిటీ వాళ్ల గురించి కూడా ఆలోచించేవారు” అని లిల్డార్డ్‌ అన్నారు.
తుపాకీ హింసను విడనాడాలంటూ ఫ్లాయిడ్‌ ఇచ్చిన సందేశపు వీడియోను 2017లో చిత్రీకరించినట్లు భావిస్తున్నారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ”మీరు ఇంటికి రండి” అంటూ చెడుదారి పట్టిన యువతకు సందేశం ఇచ్చారు ఫ్లాయిడ్‌. క్రైస్తవ మత సంబంధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి 2018లో ఫ్లాయిడ్‌ మిన్నెసోటాకు వెళ్లినట్లు అతని కుటుంబం హ్యూస్టన్‌ క్రానికల్‌ పత్రికకు వెల్లడించింది. ”సరికొత్త జీవితం ప్రారంభించాలనుకున్నారు” అని అతని క్లాస్‌మేట్ క్రిస్టోఫర్‌ హ్యారిస్‌ అన్నారు. ” తనలో వచ్చిన మార్పుపట్ల అతను చాలా సంతోషంగా ఉన్నారు” అని హ్యారిస్‌ వెల్లడించారు.
జార్జ్ ఫ్లాయిడ్
క్రైస్తవ మిషనరీ ‘సాల్వేషన్‌ ఆర్మీ’లో ప్లాయిడ్‌ కొన్నాళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. కొన్నాళ్లు లారీడ్రైవర్‌గా, ఓ డ్యాన్స్‌ క్లబ్‌లో బౌన్సర్‌గా కూడా పని చేశారు. అక్కడ ఆయన్ను ‘బిగ్‌ ఫ్లాయిడ్‌’ అని పిలిచేవారు. కోవిడ్‌ -19 సంక్షోభం కారణంగా వ్యాపారాలు దెబ్బతినడంతో చాలామంది అమెరికన్లలాగానే ఫ్లాయిడ్‌ కూడా ఇబ్బందుల్లో పడ్డారు.
అరెస్టయిన రోజున ఆయన 20 డాలర్ల నకిలీ నోటుతో సిగరెట్లు కొనడానికి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఫ్లాయిడ్‌ మరణంపై మొదలైన నిరసనలు అమెరికావ్యాప్తంగా హింసకు కారణమయ్యాయి. వివిధ నగరాల్లో వందలమందిని పోలీసులు అరెస్టు చేశారు. పలు రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్‌ పోలీసులు రంగంలోకి దిగి శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
”ఒక మంచి మనిషిని చంపేశారు” అని చెప్పిన ప్లాయిడ్‌ మిత్రుడు లిల్లార్డ్‌ కూడా నిరసన ప్రదర్శనల్లో హింసపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ” అతను క్షమాపణలకు కరిగిపోయే వ్యక్తి. ప్రజల మనిషి” అన్నారు లిల్లార్డ్‌. ”తాను చనిపోక ముందు కూడా తనలాంటి చాలామంది కష్టాల్లో ఉన్నారని అతనికి తెలుసు” అని లిల్లార్డ్‌ వ్యాఖ్యానించారు. ”ఈ ఆందోళన జార్జ్‌ ఫ్లాయిడ్‌ను దాటి పోయింది. ఇది ఒకరకంగా అమెరికా మీద అమెరికన్ల ఆక్రోశం” అని అభివర్ణించారు లిల్లార్డ్‌.