డబుల్‌ డైమండ్‌ గొర్రె

ఈ గొర్రె రేటు ఎంతో తెలిస్తే మనం నిజంగా నోరెళ్ల బెడతాము. ఓ గొర్రె ఇంత ఖరీదా? అని కచ్చితంగా అనుకుంటాం. గురువారం స్కాట్‌లాండ్‌, లనార్క్‌లో జరిగిన స్కాటిష్‌ లైవ్‌స్టాక్‌ వేలంలో డబుల్‌ డైమండ్‌ అనే గొర్రె ఏకంగా 3.5 కోట్ల రూపాయల ధర (£3,65,000) పలికింది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెగా పేరు సంపాదించింది. అంతకు ముందు 2,31,000 స్టెర్లింగ్‌ పౌండ్లపై ఉన్న‌ రికార్డును డైమండ్‌ బ్రేక్‌ చేసింది. డైమండ్‌ తర్వాతి స్థానంలో 68 వేల స్టెర్లింగ్‌ పౌండ్‌లతో హెక్సెల్‌ డ్జాంగో అనే గొర్రె నిలిచింది. చెషైర్‌, స్టాక్‌పోర్టుకు చెందిన  ప్రముఖ బ్రీడర్‌ చార్లీ బోడెన్‌కు చెందిన గొర్రెలలో డైమండ్‌ ఒకటి. టెక్సెల్‌ జాతికి చెందిన ఈ గొర్రెలు నెదర్లాండ్‌లోని టెక్సెల్‌ ప్రాంతానికి చెందినవి. యూకేలో వీటిని మాంసం కోసం ఎక్కువగా బ్రీడింగ్‌ చేస్తూ ఉంటారు. మామూలుగా…

Read More

పెరట్లో వన రాజా కోళ్ల పెంపకం

గత రెండు దశాబ్దాలుగా కోళ్ల పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరిస్తోంది. ముఖ్యంగా మాంసం, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉండటానికి ఇదే కారణం. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతోపాటు ఇతర కుటుంబాలు కూడా పెరటి కోళ్లను పెంచుకుంటారు. పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి, పెట్టుబడి పెట్టిన కొద్ది కాలంలోనే లాభాలు రావటం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడటం వంటి అనేక కారణాలున్నాయి. నాటు కోళ్లకు గిరాకీ పెరుగుతుండడంతో పెరటి కోళ్ల పెంపకానికి ఈ మధ్య రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. పెరట్లో పెంపకానికి వనరాజా కోళ్లు అనువైనవన్న సంగతి తెలిసిందే. వనరాజా కోళ్ల విశిష్టతలు► వివిధ రంగుల ఈకలు ఉండటం వలన నాటు కోళ్లను పోలి ఉంటాయి.► వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ.► పొడవైన కాళ్లు ఉండటం వలన త్వరగా కదలగలవు. కుక్కల బారి…

Read More