పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించేందుకు చివ‌రి తేదీ జూన్ 30

గతంలో మార్చి 31 వరకు ఉన్న గడువును ఈ నెల చివరి వరకు కరోనా మహమ్మారి కారణంగా పొడగించింది. ఇంకో సారి ఈ గడువును పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేల ఈ గ‌డువు లోపు లింక్ చేయ‌క‌పోతే రూ.1000 ఆల‌స్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్‌ను ప్రవేశపెట్టింది. ఇంత‌వ‌ర‌కు పాన్‌- ఆధార్‌‌ లింక్ చేయ‌ని వారు ఈ నెలాఖ‌రు లోపు లింక్ చేయ‌డం మంచిది. పాన్ కార్డుతో, ఆధార్‌ను ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..  పాన్ కార్డును ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి? మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్ సైట్ ఓపెన్ చేయండి.  ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి, పోర్టల్ హోమ్‌పేజీలోని ‘లింక్ ఆధార్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.  తర్వాత మరో క్రొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. …

Read More