ఎండా కాలంలో ఇంటిని చల్లగా ఉంచడం ఎలా?

 • ఇంటి పైన కూల్ సిమెంట్ వేయొచ్చు… రెండు కోటింగ్స్ వేస్తే బాగా పనిచేస్తుంది.
 • సూర్యుడు అస్తమించిన తరువాత తలుపులు, కిటికీలు తీసి ఉంచండి.
 • వంట కూడా సాయంత్రం 6 గంటలకల్లా పూర్తి చేసేయండి. వంట గది, బాత్రూం లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించి ఇంట్లోని వేడిని బయటకు పంపించండి.
 • ఫ్రిడ్జ్ ని వంట గదిలోనే పెట్టండి. ఫ్రిడ్జ్ మోటార్ చాలా వేడిగా ఉంటుంది, చాలా మంది దానిని హల్ లోనో, బెడ్రూమ్ లోనో పెడతారు, దాని వల్ల బెడ్రూమ్ లేదా హల్ లో ఉష్ణోగ్రత పెరుగుతుంది.
 • సాయంత్రం ఇంట్లో నేల ను నీటితో తుడవడం, కడగడం లాంటివి చేయవచ్చు.
 • ఇండోర్ ప్లాంట్స్ పెంచవచ్చు.
 • సాయంత్రం పూట ఇంట్లో, బయట ఉన్న మొక్కలకు నీళ్ళు పోయడం.
 • మధ్యాహ్నం గోనె సంచులు నీటిలో తడిపి, కిటికీలకు కట్టవచ్చు. లేదా కిటికీలకు sun protection sheets ఉపయోగించవచ్చు.
 • ఒక పెద్ద గిన్నె లో ఐస్ ముక్కలు తీసుకొని, సీలింగ్ ఫ్యాన్ కింద పెట్టవచ్చు. లేదా పెడల్స్టర్ ఫ్యాన్ ఎదురుగా పెట్టవచ్చు.
 • ఇంట్లో ఉన్న లైట్స్, ఫ్యాన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయెన్సెస్ అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించండి. అవి కూడా వేడిని ఉత్పత్తి చేస్తాయి
 • ఎయిర్ కూలర్ ఉపయోగించొచ్చు. పర్యావరణానికి ఎటువంటి హానీ జరగదు.
 • మిట్ట మధ్యాహ్నం ఎండ వేడిమి ఇంటిలోకి రాకుండా వెదురు చాపలు (bamboo mats) ఉపయోగించవచ్చు.

ఇక్కడ సమస్య ఏమిటంటే ఇంటిని చల్లపరచడం ఎంత ముఖ్యమో… మనం చల్లగా ఉండడం కూడా అంతే ముఖ్యం ఈ ఎండా కాలం లో…. కాటన్ దుస్తులు ధరించండి, పడుకోబోయే ముందు చల్లని నీటితో స్నానం చేయండి, చలువ పానీయాలు ఎక్కువ తాగండి, ఈ కాలం లో పరుపు కన్నా నేల చాలా సౌకర్యం గా ఉంటుంది పడుకోవడానికి.

వర్షాకాలం లో ఇంట్లో వచ్చే నల్ల చీమల బెడద వదిలించుకోవడం ఎలా

ఇదివరకటి రోజుల్లో ఇంట్లో గచ్చు చేసో లేదా నాపరాళ్ళు పరచో ఉంటే ఆ గచ్చుపగిలిన చోటో లేద బండలమధ్యనో కొంత ప్లేస్ చేసుకొని చీమలు మనమీద దండయాత్ర చేసేవి. అలాంటపుడు వాటి ఆరిజిన్ కనిపెట్టి అక్కడ కాస్త గమేక్సి పౌడర్ నో లేదా మరేదైనా చీమలు రాకుండా ఉండుటకు ఏదో కొట్టేస్తే వాటి బెడద వదిలేది. కానీ ఇపుడు అపార్ట్మెంట్స్ లోనూ… మామూలు ఇళ్ళలో కూడా ఆ సౌకర్యంలేదు, మార్బుల్ ఫ్లోర్ వెట్రిఫైడ్ టైల్స్ ఉన్నా ఎక్కడ నుండి వస్తాయో తెలీదు కానీ ఒకసారి దాడి మొదలెట్టాక స్వీటూ, హాటు, అన్నం, పప్పు, ఫర్నిచర్, లాప్ టాప్ అని తేడా లేకుండా ఎడతెరిపి లేకుండా ఎక్కాడపడితే అక్కడ తిరిగేస్తాయ్. అయితే ఇప్పటి మోడ్రన్ యుగంలో మార్కెట్లో అందుబాటులో ఉండే పెస్టిసైడ్స్ వాడటం వల్ల మార్బల్స్ లేదా టైల్స్ దెబ్బతింటాయి.

కాబట్టి, నేచురల్ మార్గాల్లో చీమలను వదిలించుకోవడానికి కొన్ని సులభ మార్గాలున్నాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలుండవు. మరి ఆ చిట్కాలేంటో ఒక సారి చూద్దాం… 1. వెనిగర్: వెనిగర్ నేచురల్ చీమల నివారణ మందులు. వెనిగర్ ను కొద్దిగా స్ప్రే బాటిల్లో వేసి చీమలు తిరిగే ప్రదేశంలో స్ప్రే చేయాలి . ఇలా క్రమం తప్పకుండా రెండు మూడు రోజులు చేస్తే చీమలు తిరిగి చేరవు. 2. సోప్ వాటర్ : చీమను నివారించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. మరియు చీలను వదిలించుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం . సోప్ వాటర్ లో కొద్దిగా హాట్ వాటర్ మీక్స్ చేసి వాటి మీద స్ప్రే చేయాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 3. చాక్ పీస్: చాక్ పీస్ తో గీసిన గీత దాటి అవి లోపలికి రాలేవు. అందుకు కారణం మాత్రం తెలియదు. ఇది ఒక అద్భుతమైన ఉపాయం. కాబట్టి, చీమలు ప్రవేశించే ప్రదేశం నుండి అవి తిరిగే ప్రదేశం వరకూ చాక్ పీస్ తో రౌండ్స్ లేదా గీతలు గీయండి. తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. 4. బేబీ పౌడర్: చీమలను నివారించడానికి ఇది ఒక సురక్షితమైన మరియు సులభమైన హోం రెమెడీ .కొద్దిగా బేబీ పౌడర్ ను చీమలున్న ప్రదేశంలో చిలకరించాలి. ఇలా చేయడం వల్ల ఇది చీమలు ఇంట్లోకు రాకుండా నివారిస్తుంది. 5. నిమ్మరసం: నిమ్మరసం ఉపయోగించి చీమలు ఇంట్లోకి రాకుండా నేచురల్ గా నివారించుకోవచ్చు. అంతే కాదు ఇది ఇంట్లో మంచి సువాసనను కలిగిస్తుంది . నిమ్మరసంలోని యాసిడ్ చీమలను ఇంట్లోకి రానివ్వకుండా చేస్తుంది . ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. 6. కాఫీ గింజలు: చీమలకు కాఫీ వాసనంటే పడదు. కాబట్టి మీరు ఉపయోగించిన కాఫీ గింజలను లేదా కాఫీ పౌడర్ ను చిలకరించినా చాలు చీమలు రాకుండా నివారించుకోవచ్చు. 7. కార్న్ మీల్: కార్న్ మీలు వేయడం వల్ల చీమలు వాటిని తినడం వల్ల జీర్ణించుకోలేక అవి నశింపబడుతాయి. 8. ఉప్పు: చీమలు ఉప్పును నాశనం చేయలేవు కానీ, సాల్ట్ వాటర్ ను డియోడరెంట్ గా ఉపయోగించడం వల్ల ఇంట్లోకి రాకుండా చేయవచ్చు లేదా అవి తిరిగే ప్రదేశంలో చల్లినా ఆ ప్రదేశంలో తిరగకుండా ఉంటాయి.