మీ ఇంటికి ఈ కలర్స్ వేస్తే ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు

jpg (10)

ఇంట్లో ఉండే ప్రదేశాల్లో, సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇవి మీ మానసిక స్థితి సరిగ్గా ఉంచడంలో సాయం చేస్తాయి. మీరు వాడే కలర్స్‌ మీ ఇంటి రూపాన్నే మార్చేస్తాయి. కావున మీరు ఎక్కువగా ఉండే స్థలాన్ని (ప్రధానంగా ఇల్లు) ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చూసుకోవడం మంచిది. పెరుగుతున్న వయస్సు మీ పిల్లలపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, మీ ఇంటి కోసం సూచించదగిన ఉత్తమమైన కలర్స్ గురించి తెలుసుకోండి.

పసుపు..

ఈ రంగు మీ స్థలాన్ని కాంతివంతం చేస్తుంది. మీ మానసిక స్థితిని నిలకడగా ఉంచుతుంది. ఇది సూర్యరశ్మిలా, మీ శక్తిని పెంచడంతో పాటు మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

నీలం..

నీలం అత్యంత ప్రశాంతమైన రంగు అని మీలో చాలా మందికి తెలుసు. ఇది మానసికంగా మీకు విశ్రాంతి ఇవ్వడంతో పాటు, మీ ఇంట్లో మీ చుట్టూ పాజిటీవ్‌నెస్‌ని నింపడానికి సాయపడుతుంది. నీలిరంగు చూసేందుకు ఆహ్లాదంగా కనిపిస్తుంది.

ఆకుపచ్చ..

మీరు ఆందోళనలను తగ్గించాలనుకుంటే ఇది అద్భుతమైన కలర్ అని చెప్పొచ్చు. ఇది మీ మనస్సుని హ్యాపీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది.

samayam telugu

తెలుపు..

మీ ఇంటి పెయింటింగ్ విషయానికి వస్తే మీకు సజెస్ట్ చేస్తున్న మరో కలర్ తెలుపు. తాజాదనాన్ని, స్పష్టతని కూడుకుని ఉంటుంది. తెలుపు శాంతం, ప్రశాంతతకి మరో పేరుగా ఉంటుంది.

పింక్..

ఈ రంగు చూసేందుకు ప్రశాంతంగా ఉండడమే కాకుండా, మిమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రతికూల భావాలను దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. పిల్లల గదిని డిజైన్ చేసేటప్పుడు, పింక్ వంటి లేత రంగులను ఎంచుకోండి.

గ్రే..

ఈ రంగు చూసేందుకు నీరసంగా, బోరింగ్‌గా కనిపిస్తుంది. కానీ, గ్రే కలర్, తెలుపు, లేదా బ్లూతో కలిపినప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ రంగు ఇంట్లో విశ్రాంతి వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది.