Watermelon Plants… పుచ్చ కాయల మొక్కలు

తీపి రుచి గల ఎర్రటి కండభాగం గల పుచ్చకాయల జన్మస్థలం ఆఫ్రికా దేశంలోని ఉష్ణమండల ప్రాంతాలు. ప్రస్తుతం పుచ్చకాయలను ప్రపంచమంతటా సాగు చేస్తున్నారు. ఇవి Cucurbitace జాతికి చెందిన మొక్కలు.పుచ్చకాయలను 4000 సంవత్సరాల నుండే సాగుచేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఇవి తీగజాతికి చెందినవి. నేలమీద వ్యాపించే తీగలకు పుచ్చకాయలు కాస్తాయి. పుచ్చకాయలు పండించాలంటే నీటి వసతి ఎక్కువగా ఉండాలి. మరియు నేల కూడా ఎక్కువగా ఉండాలి. ఎండ ఎక్కువ ఉండాలి. మంచి రకం పుచ్చవిత్తనాలను సేకరించి నేరుగా నేలలో నాటవచ్చు. .పుచ్చకాయలలో విటమిన్ A మరియు విటమిన్ C లు ఉంటాయి. ఒకప్పుడు పుచ్చకాయలు వేసవి కాలంలో లభించేవి. ప్రస్తుతం అక్టోబర్ నెల నుండి మార్కెట్ లో లభిస్తున్నాయి.

Read More

Sapodilla Fruit Trees… సపోటా పండ్ల చెట్లు

సంవత్సరమంతా పచ్చటి ఆకులతో ఉండే ఈ చెట్ల జన్మస్థలం దక్షిణ మెక్సికో, సెంట్రల్ అమెరికా మరియు కరేబియన్ దీవులు. సపోటా చెట్లు Sapotacea కుటుంబానికి చెందినవి. ఈ చెట్ల ఎత్తు మధ్యస్తంగా ఉండి నెమ్మదిగా పెరుగుతాయి.ఈ చెట్ల కలప ఎరుపు రంగులో ఉండి ధృఢంగా ఉంటుంది. సపోటా కాయలు కోలగా లేక గుండ్రంగా ఉంటాయి.ఈ కాయల ఉపరితలం గరుకుగా ఉండి లేత బ్రౌన్ కలర్ లో ఉంటాయి. సపోటా కాయలలో రెండు నుండి ఐదు నల్లని మెరిసే గింజలు ఉంటాయి. సపోటాలలో గుజ్జు ఒకరకమైన తీపి వాసనతో దగ్గర దగ్గర బ్రౌన్ షుగర్ వాసన కలిగి ఉంటుంది. సపోటాలు పక్యానికి రాగానే కోసి మాగపెడతారు. చెట్టునే ఉంచితే ఎంతకాలమైన మగ్గవు.సపోటా చెట్లను విత్తనాల ద్వారా, కొమ్మల గ్రాఫ్టింగ్ ద్వారా ఉత్పత్తి చేస్తారు.

Read More

Pomegranate fruit tree…… దానిమ్మ పండ్ల చెట్లు

దానిమ్మ చెట్ల జన్మస్థానం ఇరాన్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలు. పూర్వకాలం నుండి దానిమ్మ చెట్లను భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, చీలీ దేశాలలో పెంచుతున్నారు. దానిమ్మ చెట్లు Lythracea చెట్ల జాతికి చెందినవి. దానిమ్మ చెట్లు దాదాపు 23 అడగుల ఎత్తు దాకా పెరుగుతాయి..దానిమ్మ కాయల గింజలలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ కె లు ఉన్నాయి. మరియు వీటిలో అరిగే పీచు (dietary fibre) పుష్కలంగా లభిస్తుంది. దానిమ్మ కాయలు గుండ్రంగా గట్టి తొక్కతో ఉంటాయి. ఈ తొక్కను తీయాలంటే చాకును ఉపయోగించాల్సిందే. దానిమ్మ గింజలు మాత్రం లేత ఎర్రరంగులో మెరుస్తూ జ్యూసీగా, తీపిరుచిని కలిగి ఉంటాయి.

Read More

పైన్ యాపిల్ పండ్ల చెట్లు

పైనాపిల్ జన్మస్థలం అమెరికాలోనీ ఉష్టమండల ప్రాంతాలు. అమెరికా నుండే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. ఇవి Bromeliaceae చెట్ల జాతికి చెందినవి.పైన్ యాపిల్ పండ్లను మాంసాహార వంటకాలలోనూ, చేపల, కూరగాయల వంటకాలలోనూ కలిపి వాడతారు. సిట్రస్ జాతికి చెందిన ఈ పండ్ల ఉపరితలం సన్నని ముళ్లతో గట్టిగా ఉంటుంది. ఈ ఉపరితలాన్ని పూర్తిగా చాకుతో తొలగించుతారు. లోపలి భాగం కొంచెం పుల్లగా, తీయగా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఈ భాగాన్నే తింటారు. ఈ భాగాన్నే ముక్కలుగా చేసి డబ్బాలలో ప్యాకింగ్ చేసి అమ్ముతారు. ఈ పండ్లను వైన్ తయారీలో ఉపయోగిస్తారు.పైన్ యాపిల్ మొక్కను నాటిన రోజు నుండి 15 నుండి 20 నెలలలోపు ఎదిగి దిగుబడి వస్తుంది. ఈ చెట్లు మూడు నుండి నాలుగున్న అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా పండే ఈ పంటలో…

Read More

Papaya Trees…బొప్పాయి చెట్లు

బొప్పాయి చెట్లు చాలా త్వరగా పెరుగుతాయి. చెట్లు నాటిన తర్వాత ఇంచుమించు ఓ ఏడాదిలోనే కాయలుకాస్తాయి. మొదట్లో ఈ కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయలు పండాక పసుపు రంగులోకి మారిపోతాయి. బొప్పాయి జీవిత కాలం సుమారు 5 సంవత్సరాలు. బొప్పాయి చెట్లలో మగవి, ఆడవి రెండు రకాలుంటాయి. 16 నుంచి 33 అడుగుల ఎత్తు దాకా పెరుగుతుంది. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. బొప్పాయి కాండం మీద లేక పచ్చి కాయ మీద గాటుపెడితే పాలు కారుతుంటాయి. వీటి భాగాలన్నింట్లో ఉండే పపైన్ అనే ఎంజైమే దీనికి కారణం బొప్పాయిని ఆంగ్లంలో పపాయ అని పిలుస్తారు. ఇంకా పాపా, ట్రీ మెలన్ పప్వ అంటూ వేరే పేర్లూ ఉన్నాయి. బొప్పాయిది కారికేసి కుటుంబం. మెక్సికో బొప్పాయి పుట్టిల్లు . అక్కడి నుంచి ఇతర ప్రాంతాల్లోకి వ్యాపించింది.…

Read More

Orange Fruit Tree…కమలా పండ్ల చెట్లు

ఆరెంజ్ ఫ్రూట్ గా పిలువబడే కమాలా కాయలు సిట్రస్ జాతికి చెందిన Rutacea జాతికి చెందినవి. ఆరెంజ్ చెట్ల మూలం ఆఫ్రికా ఖంఢంలోని తూర్పు తీర ప్రాంతాలు.ఈ పండ్ల లోపల భాగం తొనలతో ఉండి జ్యూసీగా తీయగా పుల్లగా ఉంటాయి. వీటి మందమైన తోలు చర్మంలాగా ఉండి చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఈ తొక్కల నుండి నూనెను తయారు చేస్తారు.ఈ చెట్లు 20 అడుగుల ఎత్తుదాకా పెరుగుతాయి. ఈ చెట్ల ఆకులు 365 రోజులు పచ్చగా ఉంటాయి. ఈ చెట్ల పూలు 5 రేకలు కలిగి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఆరెంజ్ తొనలను నేరుగా తింటారు మరియు ఆరెంజ్ డ్రింక్స్ కూడా తయారు చేస్తారు. ఈ చెట్ల జీవితకాలం సుమారు 50 నుండి 80 సంవత్సరాల దాకా ఉంటుంది. ఈ చెట్లను నర్సరీల నుండి కొనవచ్చు.

Read More

Mango Trees…మామిడి చెట్లు

చిన్న పిల్లల నుండి పెద్దలు దాకా మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు. మామిడి చెట్లను ప్రపంచమంతా పెంచుతున్నా కూడా ఇవి ఉష్ణమండల పంటలు. వీటి జన్మస్థలం తూర్పు ఆసియా, మయన్నార్, భారతదేశాలుగా చెబుతారు. మామిడి చెట్లు 50 నుంచి 60 అడుగుల ఎత్తు పెరుగుతుంది. మామిడి కాయలు సీజనల్ ఫ్రూట్స్ అనగా ఒక ప్రత్యేకమైన కాలం(వేసవి కాలం) లో మాత్రమే లభిస్తాయి(సుమారుగా ఏప్రియల్ నెల నుండి జులై నెల వరకు)మామిడి కాయలలో అనేక రకాలున్నాయి. బంగినిపల్లి, పెద్ద రసాలు, చిన్నరసాలు, చిత్తూరు (కలెక్టర్) మామిడి, పునాస, ముంతమామిడి(కొబ్బరి మామిడి), గులాబీలు సాధారణంగా అందరికి తెలిసినవి. మామిడి చెట్లను అంట్లు కట్టి తయారు చేస్తారు. విత్తనాలు నాటితే నాటిని విత్తనం రకం కాకుండా వేరే రకం చెట్టు మెలకెత్తవచ్చు.మామిడి కాయలలో విటమిన్ ఎ, సి, డిలు పుష్కలంగా ఉంటాయి.…

Read More

Lemon Tree…నిమ్మకాయ చెట్టు

నిమ్మ పుట్టిల్లు దక్షిణ ఆసియా. కానీ ఇండోనేషియా, భారత దేశంలోని అసోంలో మొదటిసారిగా పండించారని చెబుతారు. ఆ తర్వాత ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి.ప్రస్తుతం నిమ్మను ఎక్కువగా మెక్సికోలో పండిస్తున్నారు. ఆ తరువాత భారత్ చైనా, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలలో నిమ్మను ఎక్కువగా పండిస్తున్నారునిమ్మ చెట్టు దాదాపు 16 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. పొదలా ఉండే చిన్నపాటి చెట్టు ఇది. నిమ్మ ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అంచుల్లో కాస్త వంకర తిరిగి కనిపిస్తాయి. నిమ్మ ఆకులు కూడా సువాసనగా ఉంటాయి. ఈ చెట్లకు తెల్లని పూలు గుత్తులుగా పూస్తుంటాయి. కమ్మని వాసన వెదజల్లుతాయి.నిమ్మకాయలు చెట్టుకు కాసినపుడు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పండిన తరువాత లేత పసుపు రంగులోకి మారతాయి. ఈ కాయలు తెల్లని చిన్న గింజలతో పుల్లని రసంతో ఉంటాయి. సంవత్సరం అంతా…

Read More

Guava Trees….జామచెట్లు

జామ చెట్లు ఉష్ణమండలానికి చెందిన చెట్లు. ప్రపంచమంతా జామను పండిస్తున్నా వీటి జన్మస్థలం అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతం. ఇవి మిర్టాసియా కుటుంబానికి చెందినవి. జామ చెట్లను విత్తనాలు మరియు గ్రాఫ్టింగ్ పద్ధతుల ద్వారా పెంచుతారు. జామ కాయలను నేరుగా తినటానికే కాక జెల్లీలు, జామ్ తయారీలో కూడా వాడతారు.జామ ఆకులు పచ్చగా సుమారుగా ఒకటి నుండి మూడు అంగుళాల వెడల్పుతో ఉంటాయి. వీటిపూలు చాలా చిన్నగా ఉంటాయి. తెల్లగా నాలుగు రేకలతో ఉంటాయి. ఈ పూలే జాయకాయలుగా మారుతాయి. జామకాయలు గుండ్రంగా లేక కోలగా ఉంటాయి. జామకాయ పైభాగం ఆకుపచ్చగా ఉండి లోపలి కండభాగం తెల్లగా లేక లేత గులాబీ రంగులో ఉంటుంది.జామకాయలు సంవత్సరమంతా కాస్తాయి. కానీ వర్షాకాలం ముగిసిన తరువాత వీటి దిగుబడి ఎక్కువగా ఉంటుంది.జామ కాయలలో A,B,C విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

Read More

Goose Berry Tree …ఉసిరి చెట్టు

ఉసిరి చెట్లు ప్రపంచంలో చాలా ప్రాంతాలలో పెరుగుతాయి. అయితే ఇండోనేషియా… ఉసిరి చెట్లను ఎక్కువగా పెంచే దేశాల్లో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఈ చెట్లను ఎక్కువగా పెంచుతారు.ఉసిరి చెట్లలోచాలా రకాలు ఉన్నాయి . ఎక్కువగా బలవంత్ నీలమ్ అమ్రిత్ కాంచన్ కృష్ణ, చక్కియా, బనారసి ఉసిరి జాతుల్ని పెంచుతుంటారు. ఉసిరి కాయలలో రెండు రకాలున్నాయి. చిన్న చిన్న కాయలను తినే ఉసిరి అంటారు. వీటిని పిల్లలు, పెద్దలు ఉప్పు, కారం అద్దుకుని ఇష్టంగా తింటారు. ఇవి పులుపు, కొంచెం వగరు రుచితో ఉంటాయి. చ్వవనప్రాస తయారీలో రాతి ఉసిరిని వాడతారు. .మరోరకం కాయలు కొంచెం పెద్దగా గుండ్రంగా, గట్టిగా ఉంటాయి. వీటిని రాతి ఉసిరి అంటారు. వీటి నేరుగా తింటానికి కొంచెం కష్టపడాలి. బాగా పుల్లగా, వగరుగా ఉంటాయి. వీటిని ఎక్కువగా…

Read More

Dates Tree….ఖర్జూరం

ఖర్జూరం చెట్టు నాటినప్పటి నుండి మూడవ సంవత్సరం నుండి దిగుబడి మొదలవుతుంది. గాలిలో తేమ తక్కువగా ఉండే ఉష్టప్రాంతాలలోని అన్నిరకాల నేలలోనూ ఈ చెట్లు ఎదుగుతాయి. Arecaceae చెట్ల జాతికి చెందినదిఖర్జూర పంటకు చీడపీడలు తక్కువే. ఒకో చెట్టుకు 300 నుంచి 500 వందల కిలోల దాకా దిగుబడి వస్తుంది. ఈ చెట్లు 75 అడుగుల దాకా ఎదుగుతుంది. ఈ చెట్ల జీవితకాలం 150 సంవత్సరాలు అంటారు. ఈ చెట్టులోని ప్రతిభాగం విలువైనదే. కాండంను కలపగా వాడతారు. పొడవైన వీటి ఆకులను బుట్టలు తయారు చెయటానికి ఉపయోగిస్తారు.ఈ చెట్ల జన్మస్థానం ఇరాక్ దేశమని చెబుతారు. మరియు ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లోని ఎడారి ప్రాంతాలలో ఖర్జూర చెట్లను ఎక్కువగా సాగుచేస్తారు. ఇంకా పాకిస్తాన్, ఇండియా, మెక్సికో దేశాలలో కూడా ఈ చెట్లను పెంచుతున్నారు. ఈజిప్ట్, ఇరాన్,…

Read More

Custard Apples….సీతాఫలం చెట్టు

శీతకాలంతో పాటు సీతాఫలం పండ్లు కూడా వస్తాయి. సీతాఫలాలను షుగర్ యాపిల్, కస్టర్డ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. వీటి శాస్త్రీయ నామం అన్నోనా స్క్వామోసా. అనోనేసి కుటుంబానికి చెందినవి. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లోనే ఈ చెట్లు పెరుగుతాయి. రకరకాల ఇసుక నేలలలోనూ, కొండప్రాంతాలలోనూ ఈ చెట్లు పెరుగుతాయి. దక్షిణ అమెరికా దేశాలతో పాటు భారతదేశంలోనూ ఎక్కువగా ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి.ఈ చెట్లకు చిన్న చిన్న కొమ్మలుంటాయి. సుమారు 10 నుంచి 26 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ చెట్లకు రెండేళ్లు వచ్చినప్పటి నుంచే పూత పూస్తుంది. తర్వాత నుంచి మధురమైన పండ్లుకాస్తాయి.ఈ పండ్లు గుండ్రంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. లోపల నల్లని కోల ఆకారంలోని గింజలతో తెల్లని గుజ్జుతో ఉంటాయి. ఈ గుజ్జు తియ్యగా రుచిగా ఉంటుందిసీతాఫలాలో విటమిన్ సి, విటమిన్ బీ6,…

Read More

Coco Nut Trees….కొబ్బరి చెట్లు

కొబ్బరి చెట్లలో రెండు రకాలున్నాయి. మొదటిది పొట్టిరకం చెట్లు. రెండవవి పొడుగు చెట్లు. కొబ్బరి చెట్లు నాటిన 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలో కొబ్బరి కాయలు కాయటం మొదలవుతుంది. ఒక్కో కొబ్బరి చెట్టుకు 50 నుండి 100 కాయల వరకు దిగుబడి ఉంటుంది.కొబ్బరి చెట్లు ఉష్ణమండలపు చెట్లు. ఎండ ఎక్కువగా తగిలే ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. పొడుగు కొబ్బరి చెట్లు 80 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇసుక నేలలోనూ, సముద్రతీర ప్రాంతాలలోనూ, అన్నిరకాల నేలలోనూ కొబ్బరి చెట్లు పెరుగుతాయి.కొబ్బరి కాయలలో రెండు రకాలున్నాయి. మొదటి రకం కొబ్బరి బోండాలు. వీటిలో కొబ్బరి నీరు నిండుగా ఉండి తాగటానికి ఉపయెగిస్తారు.రెందవ రకం కొబ్బరి కాయల వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఈ కొబ్బరి కాయలను సాధారణంగా దేవాలయాలలో, ఇండ్లలో పూజలు చేసేటపుడు కొడతారు. ఈ కొబ్బరి కాయలనుండే…

Read More

Cahew Apple Tree.. … జీడి చెట్టు

జీడి చెట్ల జన్మస్థానం బ్రెజిల్ దేశం. 16వ శతాబ్ధంలో పోర్చుగీసు నావికుల ద్వారా తూర్పు ఆఫ్రికా మరియు భారతదేశానికి తేబడ్డాయి. ప్రస్తుతం వీటిని వ్యాపార పరంగా బ్రెజిల్, భారతదేశాలలో ఎక్కువగా ఈ చెట్లను పెంచుతున్నారు. జీడి చెట్లు సుమారు 40 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. ఈ చెట్లు ఎక్కువగా సముద్రతీరాలలోనూ, ఇసుక నేలలోనూ పెరుగుతాయి.అత్యధికంగా ప్రొటీన్లు గల జీడి పప్పును నేరుగా తినవచ్చు. మాంసాహార, శాఖాహార వంటకాలలో ఉపయోగిస్తారు. జీడి చెట్లనుండి జీడికాయలు కాస్తాయి. ఈ జీడికాయల కింద జీడిగింజలు ఏర్పడతాయి. వీటిలోని జీడిపప్పు ఉంటుంది. ఈ జీడికాయలు పండిన తరువాత జీడిగింజలను వేరుచేస్తారు. జీడికాయను నేరుగా తింటారు. కానీ వీటి అడుగుభాగాన్ని కొద్దిగా తొలగించి తినాలి లేని ఎడల గొంతులో నస వస్తుంది. ఇంకా ఈ పండ్లను బెవరేజెస్, జామ్ లు, జెల్లీల తయారీలో ఉపయోగిస్తారు.ఇక…

Read More

Black Plum Tree….నేరేడు చెట్టు

నేరేడు చెట్టుకు గిన్నె చెట్టు అనే మరో పేరూ ఉంది. ఇంగ్లీషు భాషలో మలబార్‌ ప్లమ్‌, జావా ప్లమ్‌, బ్లాక్‌ ప్లమ్‌.. అంటూ అంటారు. ఈ చెట్లను ఎక్కువగా పండ్ల కోసమే పెంచుకుంటారు.నేరేడు చెట్టు శాస్త్రీయ నామం షైజీజియం క్యుమిని. ఇంకా మిర్టేసి కుటుంబానికి చెందినది. ఉష్ణ మండల ప్రాంతాల్లో ఈ చెట్లు పెరుగుతాయి. భారత్ తోపాటు శ్రీలంక, పాకిస్థాన్ ఇండోనేషియాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఇంకా ఫిలిప్పీన్స్ మయన్మార్ ఆస్ట్రేలియా, ఫిజి, చైనాలోనూ కొద్దిగా ఈ చెట్లు కనబడుతాయి.ఆషాఢం మాసంనుండి నేరేడు పండ్లు మార్కెట్ లో లభిస్తాయి.నేరేడు చెట్లు చాలా త్వరగా పెరుగుతాయి. దాదాపు 90 అడుగుల వరకూ పెరుగుతాయి. ఆకులు దళసరిగా ఉంటాయి. నేరేడు చెట్లు నీరులేని కరవు పరిస్థితుల్లోనూ తట్టుకుని బతకగలదు. ఈ చెట్ల జీవితకాలం వంద సంవత్సరాలు.నేరేడు కాయ ఏర్పడినపుడు పచ్చగా ఉంటుంది.…

Read More

Banana Plants…అరటి మొక్కలు

సాధారణంగా అరటి మొక్కను అరటి చెట్టు అంటారు. కానీ ఇది చెట్టు కాదు. ఒక రకంగా మొక్కే. ఈ మొక్కకు ప్రత్యేకంగా కాండం అంటూ ఉండదు! ఆకుల భాగాలే పొరలుపొరలుగా కలిసిపోయి కాండంగా మారతాయి. అరటి శాస్త్రీయ నామం… మూసా అక్యునిమిటా(అడవి అరటి). అరటి పండ్లను సంస్కృతంలో రంభాఫలం, కదలీఫలం అనీ హిందీలో ఖేలా, ఇంగ్లిష్ లో బనానా అంటారు.అరటి మొక్కలు సాధారణంగా.. 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.. వీటికి సీజన్ అంటూ లేకుండా.. సంవత్సరం పొడవునా పంట వస్తుంది. అరటి మొక్కకు చాలా బరువున్న అరటిగెలలు కాస్తాయి. కానీ తుపానులు, బలమైన గాలులకు తట్టుకోలేవు. పడిపోతాయి. అరటి మొక్కలో అన్ని భాగాలు పనికివస్తాయి. పచ్చి అరటి కాయలు, పువ్వులు, మొవ్వ (లేతకాండం)ను కూడా కూరలుగా వండుకుంటారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరటిలో చాలా రకాలు…

Read More

ఆవకాడో చెట్టు

అవకాడో పండును వెన్నపండు, అలగేటర్పియర్ అని కూడా అంటారు. ఈ పండు జన్మస్థానం మధ్య మెక్సికో ప్రాంతం. ఈ పండు శాస్త్రీయ నామం పెర్సీ అమెరికానా.. ఈ చెట్టు సుమారు 66 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అవకాడో చెట్లు సారవంతమైన ఎర్రనేలల్లో పెరుగుతాయి. ఈ పండ్లను క్రీస్తుపూర్వం 10 వేల సంవత్సరాల నుంచే తింటున్నారు. భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా.. ఇప్పుడిప్పుడే ఈ చెట్లను పెంచుతున్నారు విత్తనం నాటిన 4 నుంచి 6 సంవత్సరాలకు కాయలు కాస్తాయి చొక్వెట్ హాస్ గ్వెన్ లుల, పింకర్టన్ రీడ్ బెకాన్ బ్రాగ్డెన్ ఏట్టింగర్ వీటిలోని రకాలు. ఇందులో కొన్నికాయలు ఆకుపచ్చగా, కొన్ని నలుపురంగులో ఉంటాయి. నలుపు రంగులో కనిపించే హాస్ ఆకుపచ్చ రంగులో కనిపించే గ్వెన్రకాలు ఎక్కువగా సాగుచేస్తున్నారు. పండు మధ్యలో ఒకేఒక గింజ ఉంటుంది. వీటిని కొన్ని ఔషధాల…

Read More

Almond Tree…బాదం చెట్లు

బాదం చెట్లు 13 నుంచి 33 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటి జీవిత కాలం సుమారు 25 సంవత్సరాలు. బాదం ఆకులు మూడు నుంచి ఐదు అంగుళాల పొడవు ఉంటాయి. ఈ చెట్లకు సూర్యరశ్మి, నీళ్లు ఎక్కువగా కావాలి. ఇసుక, బంకమట్టి నేలలో పెరుగుతాయి.ఆంగ్లంలో ఆల్మండ్ ట్రీ అంటారు . ఈ చెట్లు రోసేసి కుటుంబానికి చెందినవి. ప్రునస్ డల్సిస్ ఈ చెట్ల శాస్త్రీయ నామం. ఇవి ఎక్కువగా మధ్య ఆసియా దేశాల్లో పెరుగుతాయి. తరువాత అమెరికా, స్పెయిన్, ఇటలీ, మొరాకో, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ పెరుగుతాయిబాదం ఆకులతో విస్తరాకులు కూడా తయారు చేస్తారు. 80శాతం బాదం అమెరికాలోనే పండుతుందిదాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత నుంచి బాదం చెట్లకు కాయలు కాస్తాయి. అవి పండాక పగలగొడితే వచ్చేదే బాదం పప్ఫు. బాదం పప్పు…

Read More