ఎర్ర చందనం – లభించే ప్రాంతాలు

“ఆల్మగ్ ,రెడ్ సాండర్స్ రక్తచందనం,ఎర్ర చందనం” అనే పేర్లతో పిలవబడే ఈ వృక్ష శాస్త్రీయ నామం ” టీరో కార్పస్ శాంటాలినస్ (Ptero carpus Santalinus ). ఎనిమిది మీటర్ల (ఇరవయ్యారు అడుగులు)వరకు పెరిగే మొక్క. దక్షిణ తూర్పు కనుమల లో ఈ మొక్క పెరగటానికి ఎక్కువ అనువైన వాతావరణం ఉంటుంది. మొత్తం దక్షిణ భారత దేశమంతటా ఇది కనిపించినా శేషాచలం అడవులు దీనికి బాగా ప్రసిద్ధి. దీని కలపని ,మందుల్లో,సంగీత వాయిద్య తయారీకి,న్యూక్లియర్ రియాక్టర్ లలో ,కుర్చీల వంటి గృహోపకరణాలకి వాడతారు. చైనా లో క్వింగ్ కాలం లో దీన్ని జిటాన్ అనే వారట. IUCN(International Union for Conservation of Nature) వారు ఈ మొక్కని అంతరించే ప్రమాదం ఉన్నదిగా ప్రకటించారు .తర్వాత 2018 లో “అపాయం అంచున ఉన్నవి” (nearly threatened )…

Read More

Banyan tree మర్రి చెట్టు

మర్రి చెట్టు గొప్పదనాన్ని గుర్తించి భారత దేశం మర్రి చెట్టును దేశ జాతీయ వృక్షంగా ప్రకటించింది.పొడవైన ఊడలతో ఎంతో పెద్దగా ఉండే మర్రి చెట్టు బంగ్లాదేశ్‌, భారత్‌, శ్రీలంక దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫిగ్‌ చెట్లలో 750కిపైగా వృక్ష జాతులుంటాయి. అందులో మర్రి చెట్టును ఒకటి.ఈ చెట్టును వటవృక్షం అని కూడా పిలుస్తారు. ఇంకా బెంగాల్‌ ఫిగ్‌, ఇండియన్‌ ఫిగ్‌ అంటూ రకరకాల పేర్లు ఉన్నాయి. మర్రి చెట్టు శాస్త్రీయ నామం ‘ఫైకస్‌ బెంగాలెన్సిస్‌’. ఒకప్పుడు బాటసారులు, వ్యాపారులు ప్రయాణాలు చేస్తూ ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకునేవారు. ఆ వ్యాపారుల్నే బనియాలు అనే వారు. అలా ఈ చెట్లకు బనియన్‌ ట్రీ అనే పేరు వచ్చిందంటారు.ఈ చెట్ల విత్తనాలు చాలా చిన్నవి. చెట్లు మాత్రం మహావృక్షంగా మారిపోతాయి. మర్రి చెట్ల నీడలో దాదాపు పదివేల మంది…

Read More

Bamboo Plants….వెదురు

వెదురు వృక్ష (చెట్ల) జాతికి చెందినది కాదు, గడ్డి జాతికి చెందినది …వెదురును ఆంగ్లంలో బాంబూ అంటారు. ఈ మొక్కలు చెరకు గడలులాగా నిలువుగా పెరుగుతాయి చెరకు గడలకంటే లావుగా ఉంటాయి.వెదురు పోయేసి కుటుంబానికి చెందినది. ఉష్ణ మండల, ఉపఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆఫ్రికా, ఆసియా, అమెరికాల్లో వెదురు ఎక్కువగా పెరుగుతుంది. వెదురులో రెండు రకాలున్నాయి. ఒకటి రన్నింగ్ బాంబూ, రెండోది క్లాంపింగ్ బాంబూ. రన్నింగ్ బాంబూ బాగా పొడుగ్గా పెరుగుతుంది. పొడవైన వేర్లతో ఉంటుందిది. క్లాంపింగ్ బాంబూ పొట్టి వేర్లతో ఉంటుందివెదురులో ఇంచుమించు 1575 రకాల జాతులున్నాయి. కొన్ని జాతుల మొక్కలు చాలా ఎత్తు పెరుగుతాయి. మోసో అనే వెదురు మొక్క రోజులో ఒకటిన్నర అడుగుల ఎత్తు పెరుగుతుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగేవి వెదురు మొక్కలు. ఇవి గిన్నిస్ రికార్డులో ఎక్కాయి. వెదురులో ఒక్కో…

Read More

Indian Bael Tree … మారేడు చెట్టు

మారేడు, బిల్వవృక్షం చెట్లను ఇండియన్ క్విన్స్గోల్డెన్ యాపిల్ స్టోన్ యాపిల్ వుడ్, యాపిల్ అంటూ రకరకాల పేర్లూ ఉన్నాయి. ఎగెల్ మార్మలోస్ దీని శాస్త్రీయనామం(Aegle Marmelos). రూటేసి కుటుంబానికి చెందిన చెట్టు ఇది. సిట్రస్ జాతులైన బత్తాయి, నిమ్మ చెట్లు ఈ జాతివే.ఆధ్యాత్మికంగానూ, ఔషధగుణాలపరంగానూ ఈ వృక్షానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే శివరాత్రి రోజున శివుణ్ణి, వినాయక చవితి రోజున వినాయకుణ్ణి మారేడు ఆకులతో పూజిస్తారు. ఈ మారేడు దళాలు అంటే మహాదేవుడికి ఇష్టం. హిందువులంతా పవిత్ర వృక్షంగా భావిస్తుంటారు. అందుకే చాలా ఆలయాల్లో మారేడు మొక్కల్ని పెంచుతుంటారు. రుగ్వేదంలో ఈ చెట్టు ప్రస్తావన ఉందిఈ వృక్షానికి భారత దేశంతో పాటు, శ్రీలంక, నేపాల్ మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాల్ని పుట్టిళ్లుగా చెబుతారు. థాయ్‌లాండ్‌ ఆలయాల్లోనూ ఈ చెట్లు కనిపిస్తాయి. దాదాపుగా అన్ని రకాల వాతావరణాల్లోనూ, నేలల్లోనూ…

Read More

Peepal Tree…రావి చెట్టు

రావి చెట్టు శాస్త్రీయ నామం ఫైకల్ రెలీజియెసా.. రావిచెట్లును పిప్పల, అశ్వర్ధ వృక్షం అని కూడా పిలుస్తారు. రావి చెట్లు సుమారు 100 అడుగుల ఎత్తు పెరుగుతాయి. కొన్ని వందల సంవత్సరాల పాటు జీవిస్తుంది.పట్టణాలలో రావిచెట్లు ఎక్కువగా కనపడవు. పల్లెలలో దేవాలయాలలో, చెరువు గట్ల దగ్గర, ఊరి బయట, రోడ్ల వెంట రావి, మర్రిచెట్లు తప్పక ఉంటాయి.ఈ చెట్లు హిందువులకు, బౌద్ధులకు కూడా పవిత్రమైనదే. బౌద్ధమత స్ధాపకుడైన బుద్ధునికి జ్ఞానోదయమైనది రావిచెట్టు క్రిందే. అందుకే రావి చెట్టును బోధివృక్షం అని పిలుస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెట్లలో రావిచెట్టును నేను అని చెబుతాడు.రావిచెట్టుకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. ఈ పండ్లను కీటకాలు, పక్షులు ఆహారంగా తింటాయి. రావి ఆకులను ఒంటెలు, ఏనుగులు, పశువులకు మేతగా వేస్తారు.శ్రీలంకలోని అనురాధపురంలో 2000 సంవత్సరాల వయసున్న రావిచెట్టు ఉంది. ఈ చెట్టు…

Read More