నిమ్మ ఆకులతో ప్రయోజనాలు

నాలుగు తాజా నిమ్మ ఆకుల్ని ఒక గ్లాసు వేడినీటిలో మూడుగంటలు నానబెట్టి తాగితే.. నిద్రలేమి, గుండెదడ, నరాల బలహీనత వంటివి తగ్గుతాయి. వేడినీటిలో మరిగించకూడదు. కేవలం నానబెట్టాలి. నీళ్లను వేడిచేసి దించేయాలి. అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్‌ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి. 

మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నిమ్మ ఆకుల్ని నలిపి.. ఆ వాసన పీలిస్తే మంచిది. మనసు వెంటనే ఆహ్లాదకరంగా మారుతుంది.

నిమ్మ ఆకుల్లో యాంటీబ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకనే నిమ్మను పలు రూపాల్లో సౌందర్య ఉత్పత్తులలో వాడుతున్నారు. నిమ్మ ఆకుల పేస్టును ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవచ్చు. దీనికి కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల ముఖ పర్చస్సు పెరుగుతుంది. ముఖం మీదున్న మచ్చలు, మొటిమలను కూడా పోగొడతాయివి. 

నిమ్మ ఆకుల్ని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. పళ్లలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు ఆరోగ్యంగా మారతాయి. స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకుల్ని వేసుకుని స్నానం చేస్తే చర్మ ఆరోగ్యం బావుంటుంది. 

నిమ్మ ఆకుల్ని హ్యాండ్‌వాష్‌లా  వాడవచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు పూసుకుంటే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. 

వికారం పోవడానికి నిమ్మ ఆకుల్ని వాడవచ్చు. 

అశ్వగంధ, శిలాజిత్‌ల ఆరోగ్య ప్రయోజనాలు

అశ్వగంధ, శిలాజిత్‌ల ను ఆయుర్వేదంలో ముఖ్యంగా వీర్య వృద్ధికి ఉపయోగిస్తారు. వీటి వల్ల శారీరక సామర్థ్యం పెరిగి శ్రంగార సమస్యల కూడా తగ్గుతాయి. నేడు మగవారిలో ఎంతగానో వేదించే సమస్యలలో ఒకటి అంగస్తంభన సమస్య. కానీ అశ్వగంధ, శిలాజిత్‌ల ను వాడటం వల్ల ఈ సమస్యను సులువుగా తగ్గించుకోవచ్చు.

రోజూ అశ్వగంధ పొడి ఒక అర స్పూన్ పాలలో కలిపి రాత్రి పూట తాగండి. ఇలా ఒక 90 రోజులు చేయడం వల్ల వీర్య వృద్ధి కలిగి, అంగస్తంభన సమస్యలు కూడా దూరం అవుతాయి. లేదా శిలాజిత్‌ 250ంగ్ టాబ్లెట్ను రాత్రి పూట పాలతో తీసుకోండి. వీటి వాడకం వల్ల శరీరంలోని ఇంకా ఎన్నో రుగ్మతలను కూడా తగ్గించుకోవచ్చు.

మెడిసినల్ హెర్బ్స్

1. అలోవెరా:

కిచెన్ లో పనిచేసేటప్పుడు చిన్న చిన్న కాలిన గాయాలు సహజం. అటువంటి మైనర్ ప్రాబ్లెమ్స్ ను డీల్ చేయడానికి మీ గార్డెన్ లో ఉన్న అలోవెరా ప్లాంట్ ఉపయోగపడుతుంది. నిజానికది మంచి ఆప్షన్. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉన్నాయి. అలోవెరా జెల్ కాలిన గాయాలను సూత్ చేస్తుంది. అంతేకాక ఇన్ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ అరికడుతుంది. డ్యామేజ్ నుంచి త్వరగా కోలుకునేందుకు స్కిన్ హీలింగ్ ను ప్రమోట్ చేస్తుంది. 2007లో బర్న్స్ అనే జర్నల్ లో పబ్లిష్ ఐన ఓ స్టడీ అలొవెరా అనేది బర్న్స్ ను ప్రభావవంతమైన ట్రీట్మెంట్ అని వెల్లడించింది. ఫస్ట్ నుంచి సెకండ్ డిగ్రీ బర్న్స్ కు ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుందని స్పష్టం చేసింది.

ఎలా వాడాలి?

అలోవెరా మొక్కనుంచి ఆకును తీసుకుని జెల్ ను తీసుకోవాలి. ఈ స్వచ్ఛమైన జెల్ ను కాలిన గాయంపై అప్లై చేయాలి. వారం పాటు ఈ ప్రాసెస్ ను రోజూ పాటించాలి.

2. సేజ్:

విపరీతమైన దగ్గు బాధిస్తోందా? ఐతే, గార్డెన్ లోకి వెళ్లి కొంత సేజ్ ను తీసుకోండి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి నిరంతర దగ్గుతో అనుసంధానమై ఉన్న లక్షణాల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే హోపింగ్ కాఫ్ నుంచి కూడా రిలీఫ్ ను అందిస్తాయి. సేజ్ అనేది దగ్గును తగ్గించడంతో పాటు గొంతు నొప్పిని, లో ఫీవర్ని, ఇరిటేషన్ని అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ లో ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గిస్తుంది. హీలింగ్ ప్రాసెస్ ను వేగవంతం చేస్తుంది.

1. ఒక టీస్పూన్ తాజా సేజ్ ఆకులను తీసుకోవాలి. ఎండినవైనా పరవాలేదు. వీటిని కప్పుడు నీళ్ళల్లోకి తీసుకుని బాగా మరిగించాలి. పదినిమిషాలపాటు మరిగించాలి. ఆ తరువాత స్టవ్ ను ఆఫ్ చేయాలి. టీ ను వడగట్టి తేనెను కలపాలి. దీన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగాలి.

2. తాజా సేజ్ లీవ్స్ ను బాగా కడిగి ఒక గ్లాస్ జార్ లో పెట్టాలి. అందులో ఒక కప్పుడు తేనెను కూడా కలపాలి. దీన్ని మూతతో క్లోజ్ చేయాలి. వారం పాటు దీన్ని అలాగే ఉంచాలి. ఆ తరువాత ఈ లిక్విడ్ ను ఒక టేబుల్ స్పూన్ తీసుకుని వెచ్చటి నీళ్ళల్లో కలపాలి. టేస్ట్ కోసం తేనెను కలిపితే మరిన్ని సూతింగ్ ప్రాపర్టీస్ కూడా యాడ్ అవుతాయి. దీన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగాలి. గర్భిణీలు దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.

3. థైమ్:

గొంతునొప్పి ఎంతో అసౌకర్యం కలిగిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ ను పడిపోయేలా చేస్తుంది. ఈ లక్షణాలను తగ్గించి ఇమ్యూనిటీను బూస్ట్ చేసేందుకు గార్డెన్ లో ఉన్న థైమ్ హెల్ప్ ను మీరు కోరాలి. క్రష్ చేసిన థైమ్ లీవ్స్ తాజావి అయినా లేదా ఎండినవైనా రెండు టీస్పూన్లను తీసుకుని వాటిని కప్పుడు బాయిలింగ్ వాటర్ కు కలపాలి. కవర్ చేసి వాటిని పదినిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత వడగట్టాలి. ఈ టీను వేడివేడిగా తీసుకోవాలి.

4. పెప్పెర్మింట్:

తలనొప్పి సాధరణ సమస్యగా మారిపోయింది. టెన్షన్ తలనొప్పి లేదా మైగ్రైన్ తలనొప్పి వంటివాటికి పెప్పెర్మింట్ మంచి సొల్యూషన్ గా పనిచేస్తుంది. కప్పుడు మరిగే నీటిలో ఒక టీస్పూన్ ఎండిన పెప్పెర్మింట్ ను కలపాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూతతో కవర్ చేసి పదినిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత వడగట్టి కాస్తంత తేనెను కలపాలి. ఈ టీను స్లోగా తాగితే తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే, కాసిన్ని తాజా పెప్పర్మింట్ ఆకులను నీళ్ళల్లో మరిగించి ఆ స్టీమ్ ను ఇంహేల్ చేస్తే తలనొప్పి మటాష్.

5. చమోమైల్:

విరేచనాల వల్ల బాత్రూంకు ఎన్నో సార్లు ట్రిప్ వేయాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలో ఉన్న పోషకాలు ఎన్నో కోల్పోతాము. చమోమైల్ తో అప్సెట్ స్టమక్ సమస్యను సాల్వ్ చేయడం సులభం. ఒక టీస్పూన్ ఎండిన చమోమైల్ ఫ్లవర్స్ ను కప్పుడు హాట్ వాటర్ లోకి తీసుకోవాలి. ఐదునిమిషాల పాటు ఇవి వేణ్ణీళ్ళల్లో ఉండాలి. ఆ తరువాత వడగట్టి కాస్తంత తేనెను కలిపి తాగాలి. అప్సెట్ స్టమక్ కు సంబంధించిన లక్షణాలు తగ్గిపోయేవరకు ఈ రెమెడీ ను పాటించాలి. రోజుకు రెండు లేదా మూడు సార్లు ఈ టీ తాగాలి.

6. తులసి:

ఒత్తిడనేది జీవితంలో ఓ భాగమైపోయింది. ఇది శారీరక అలాగే మానసిక ఆరోగ్యంపై ప్రభావంచూపుతోంది. స్ట్రెస్ ను ఫైట్ చేయడానికి తులసి ఆకులను ప్రయత్నించవచ్చు. ఇది సహజసిద్ధమైన యాంటీ స్ట్రెస్ ఏజెంట్ గా పనిచేస్తుంది. పది నుంచి పన్నెండు తాజా తులసి ఆకులను రోజులో ఒకటీ లేదా రెండు సార్లు నమిలితే స్ట్రెస్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తులసి ఆకులను కప్పుడు బాయిలింగ్ వాటర్ లో కలిపి ఐదు నిమిషాలపాటు మరిగిస్తే తులసి టీ రెడీ అవుతుంది. వడగట్టి దీనిలో తేనెను కలిపి స్లోగా సిప్ చేయాలి. రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగాలి.

7. లెమన్ బామ్:

తగినంత నిద్ర ఉంటే ఆరోగ్యసమస్యలు దూరంగా ఉంటాయి. నిద్రలేమి వల్ల కూడా అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉంటాయి. నిద్రలేమికి మీ గార్డెన్ లో ఉన్న లెమన్ బామ్ హెల్ప్ చేస్తుంది. కొన్ని సెంచరీలుగా నిద్రకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈ హెర్బ్ ను వాడుతున్నారు.
రెండు టీస్పూన్ల తాజా లెమన్ బామ్ ను లేదా ఒక టీ స్పూన్ ఎండిన లెమన్ బామ్ ను కప్పుడు హాట్ వాటర్ లోకి తీసుకోవాలి. ఐదు నుంచి పదినిమిషాలపాటు మరిగించాలి. ఆ తరువాత వడగట్టాలి. ఈ టీను ఉదయం పూట ఒకసారి నిద్రపోయే ముందు ఒకసారి తాగితే నిద్రానాణ్యత ఇంప్రూవ్ అవుతుంది.

8. ప్లాంటైన్:

ప్లాంటైన్ లో లభించే టానిన్స్ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తాయి. పెయిన్ మరియు ఇన్ఫ్లమేషను తగ్గిస్తాయి. దురదను కూడా తగ్గిస్తాయి. కొన్ని ప్లాంటైన్ లీవ్స్ ను తీసుకుని పేస్ట్ ను తయారు చేయండి. ఈ పేస్ట్ ను గాయాలపై అప్లై చేయండి. ఆరాక వార్మ్ వాటర్ తో కడగండి. ఈ రెమెడీను రోజులో కొన్ని సార్లు పాటిస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.

9. క్యాలెండులా:

ఈ ఫ్లవర్ పెటల్స్ లో స్కిన్ సూతింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ. ఇవి క్విక్ రిలీఫ్ ను అందిస్తాయి. ఇన్సెక్ట్ బైట్స్ తో పాటు ర్యాషెస్, ఎగ్జిమా, డ్రై స్కిన్ మరియు గాయాల నుంచి రిలీఫ్ ఇస్తాయి. కొన్ని క్యాలెండులా ఫ్లవర్స్ ను గ్రైండ్ చేసి పేస్ట్ ను తయారుచేయాలి. ఈ పేస్ట్ ను ఇరిటేటెడ్ స్కిన్ పై అప్లై చేయాలి. ఆరాక, వెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఈ రెమెడీను రోజులో ఎన్నో సార్లు పాటించాలి.

10. రోజ్ మేరీ:

మెల్లగా మతిమరుపు ప్రారంభమైన సూచనలు మీరు గమనిస్తున్నారా? ఐతే, రోజ్ మేరీ ను మీరు తప్పక వాడాలి. నర్థంబ్రియా యూనివర్సిటీ వారు కండక్ట్ చేసిన స్టడీలో రోజ్ మేరీ మెమరీను బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుందని తేలింది. రోజ్ మేరీ ఆరోమా కలిగిన రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ మెమరీ టెస్ట్ లో బెటర్ రిజల్ట్స్ ను పొందారని స్టడీ వెల్లడిస్తోంది.

Centella … సరస్వతీ ఆకు

సరస్వతీ ఆకును ‘సెంటెల్లా’, ‘గోటుకోలా’, ‘ఫౌంటేన్ ఆఫ్ యూత్’ అని రకరకాలుగా పిలుస్తారు. సంస్కృతంలో దీన్ని మండూక పర్ణి అంటారు. దీని శాస్త్రీయ నామం ‘సెంటెల్లా ఏషియాటికా’. ఇది మన ఆసియా ఖండానికి చెందిన మొక్క.
సరస్వతీ ఆకు తడినేలలో పెరిగే బహువార్షికం. నేలమీద పాకే కాండంతో, ప్రతి కణుపు వద్దా వేర్లతో అల్లుకుపోతుంది. ఈ మొక్క తేమగా ఉండే నేలలో, చల్లని వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. ఇది చిన్నగా ఆరు అంగుళాలు మించని ఎత్తులో నేలమీద నుంచి మొదలై విసనకర్ర ఆకారపు ఆకులతో ఉంటుంది. ఈ ఆకులు లేతాకుపచ్చ రంగులో ఉంటాయి. ఎండ కంటే కొద్దిపాటి నీడ సరస్వతీ ఆకుకు అనువుగా ఉంటుంది. నీడ ఎక్కువైనా దీనికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంట్లో పెంచుకునేటప్పుడు అంత తేమ నేలలు ఉండవు కాబట్టి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంటే సరిపోతుంది. దీనికి నేల సారవంతంగా, నీరు నిలవకుండా తేమగా ఉండాలి కాబట్టి కంపోస్టు, కోకోపీట్, ఇసుక కలిపిన మట్టి మిశ్రమం అనువుగా ఉంటుంది. దీనికి చీడపీడల ప్రమాదం దాదాపు లేనట్లే. రసాయన ఎరువులు కాకుండా జీవామృతం లేదా ఇతర సేంద్రియ ఎరువులు వాడటం మంచిది.
వెడల్పు కుండీల్లో… సరస్వతీ ఆకు చక్కని గ్రౌండ్ కవర్లా పనిచేస్తుంది. ఇది వేలాడే కుండీల్లో/చెట్ల కింద నీడలో పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది. లోతు తక్కువగా, వెడల్పుగా ఉండే కుండీల్లో పెంచుకుని వరండాల్లోనూ, బాల్కనీల్లోనూ అమర్చుకోవచ్చు. మిశ్రమ అమరికల్లో గ్రౌండ్ కవర్గా వాడుకోవచ్చు. బాట పక్కన బోర్డరు మొక్కల మొదట్లో కూడా నాటుకోవచ్చు.
ఆయుర్వేదంలో దశాబ్దాలుగా దీన్ని మెదడుకు సంబంధించిన మందుగా వాడుతున్నారు. జ్ఞాపకశక్తి, తెలివి పెరగడానికి విరివిగా ఉపయోగిస్తారు. జలుబూ, జ్వరం, విరేచనాలూ, కామెర్లు.. మూర్ఛ, మూత్రకోశ వ్యాధులు, నిద్రలేమీ- ఒకటేమిటి దీన్ని సర్వరోగనివారిణిగా నమ్ముతారు. ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా దీని ఔషధ విలువలకు ప్రాచుర్యం లభిస్తోంది.
పోషకాలూ ఎక్కువే… సరస్వతీ ఆకులో పోషక విలువలు కూడా ఎక్కువే. దీనిలో అనేక విటమిన్లూ, ఖనిజ లవణాలూ, శరీరానికి ఉపయోగపడే రసాయనాలు ఉంటాయి. దీన్ని సలాడ్గా కూడా వాడతారు. బర్మా, శ్రీలంకా, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో దీని వాడకం ఎక్కువ. శ్రీలంకలోనైతే దీని ఆకులను ఇతర ఆకుకూరలతోపాటు మార్కెట్లో అమ్ముతుంటారు.
అతిగా వద్దు… సరస్వతీ ఆకుకు ఇన్ని సుగుణాలున్నా దీన్ని అదేపనిగా వాడకూడదు. ఆరువారాలు వాడిన తరువాత కొంత విరామం ఇచ్చి తిరిగి వాడుకోవచ్చు. అలాగే కాలేయ సంబంధ వ్యాధులున్నవారు వైద్యుల సలహా మేరకు ఈ ఆకులను వాడటం మంచిదట. కణుపు మొక్కలను విడదీసి నాటుకుని సరస్వతీ ఆకును సులువుగా ప్రవర్థనం చేయొచ్చు. అయితే కలుషితమైన నీటిలో పెరిగినప్పుడు ఆ కాలుష్య కారక రసాయనాలను గ్రహించుకునే శక్తి దీనికి ఎక్కువ. అందువల్ల అలాంటి ప్రాంతాల నుంచి మొక్కలను సేకరించుకోవద్దు.

రోజ్ మేరీ

sరోజ్ మేరీ పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్న పొద. వంటలలో కొత్తిమీరలాగా దీన్ని ఎక్కువగా వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటలలో సువాసనకు వాడినా, శాకాహార వంటల్లోనూ, బ్రెడ్ లు, సూపులలోనూ కూడా విరివిగా వాడతారు. హెర్బల్ టీ కూడా తయారు చేస్తారు.
రోజ్ మేరీ శాస్త్రీయనామం రోజ్ మారినస్ అఫిషినాలిస్. బూడిదరంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదులలాంటి సన్నని ఆకులతో సుకుమారమైన సువాసనగల ప్రకాశవంతమైన నీలిరంగు పూలతో అందంగా ఉంటుంది. దాదాపు మూడు అడుగుల ఎత్తువరకు పెరిగే చిన్నపొద.నీరు నిలవని ఇసుక నేలలో చల్లటి వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. దీనికి ఆరునుంచి ఎనిమిది గంటలపాటు ప్రకాశవంతమైన వెలుతురు అవసరం. అలాని ఎండ తీవ్రత ఎక్కువ ఉండకూడదు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. మన దగ్గర సూటిగా ఎండపడని చోట నాటుకుంటే మంచిది. మట్టి మిశ్రమంలో ఇసుక, కోకోపిట్ పాళ్ళు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎండాకాలంలో కొబ్బరిపీచుతో మొక్క చుట్టూ కప్పితే తేమ ఉండి వేళ్లకు చల్లగా ఉంటుంది.
రెండు రకాల్లో…
రోజ్ మేరీ నెమ్మదిగా పెరుగుతుంది. ఆకు పచ్చిదైనా, ఎండుదైనా కూడా వంటలలో వాడతారు. ఆకు కోసేటపుడు గ్రీవం పైన తుంచుకుంటే చిగుళ్ళు తొందరగా వస్తాయి. దీన్ని నచ్చిన ఆకృతిలో కత్తిరించుకోవచ్చు.
ఒకసారి నాటిన రోజ్ మేరీలోని రెండు రకాలలో అఫిషినాలిస్ పొదలాగా పెరిగితే, ప్రోస్ట్రేటస్ కొద్దిగా సాగుతుంది. ప్రోస్ట్రేటస్ రకం రాక్ గార్డెన్ లోనూ, వేలాడే తొట్లలోనూ పెంచుకోవటానికి కూడా బాగుంటుంది. వంటలలో వాడటానికి మాత్రం రెండూ ఒకేలాగా ఉంటాయి.
సేంద్రియ ఎరువులు వాడితే ….
రోజ్ మేరీ ఆకులు పసుపు పచ్చగా మారుతుంటే, కుండీ మార్చే సమయం దగ్గరపడిందని సంకేతం. ఏడాదికొకసారి కుండీ మార్చుకోవాలి. దీన్ని వంటల్లో వాడతాం కనుక వర్మీకం పోస్టు అవసరం. వేరుసెనగ పిండి వంటి సేంద్రియ ఎరువుని మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. దీనికి రసం పీల్చే పురుగులు, పిండి, పొలుసు పురుగుల బెడద ఎక్కువ. అలాగే బూడిద తెగులు, వేరుకుళ్ళు కూడా ఆశించవచ్చ. నీరు నిలవని మట్టి మిశ్రమంలో నాటి, గాలి సరిగా తగిలేలా చూసుకుంటే మంచిది. వేప, వెల్లుల్లి, మిరపవంటి కషాయాలు చల్లుతూ ఉండాలి. జిగురుగా ఉండే స్టిక్కీ ట్రాపులను (మార్కెట్ లో దొరకుతాయి) మొక్కల మధ్య తగిలిస్తే వీటిని నివారించవచ్చు.
ఔషధ గుణాలు
రోజ్ మేరీకి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పుల నివారణకు వాడతారు. ఈ నూనెనను తలకు మర్ధన చేస్తే బట్టతల వచ్చే అవకాశం తగ్గుతుందని అంటారు. రోజ్ మేరీని కలపడం వలన ఒమేగా – 3 ఫ్యాటీ ఆసిడ్లు ఉండే నూనెలు (అవిసె నూనె) వంటివి త్వరగా పాడైపోకుండా ఉంటాయట. దీనిని రూమ్ ఫ్రెషనర్ గా ఫెర్ఫూమ్స్ లోనూ వాడతారు. జ్గ్నాపకానికీ, ప్రేమకు సంకేతంగా భావిస్తారు కూడా రోజ్ మేరీనీ కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్ధనం చేయవచ్చు. గింజలతో పెంచడం కొంచెం కష్టం. ఈ మొక్క మన దగ్గర కంటే పూణే, బెంగుళూరు నర్సరీలలో సులువుగా దొరకుతుంది.

Anti Mosquito Plants……దోమలను దూరంగా ఉంచే మొక్కలు

బంతిమొక్కలు :
బంతిమొక్కల ఆకులూ, పూలలో ఉండే పైరిత్రమ్ అనే పదార్ధం ఘూటైన వాసనతో దోమల్ని, కీటకాలను తరిమి కొడుతుందట. వీటిని కుండీలలో పెంచి కిటికీల దగ్గరా, గుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు. కానీ వీటికి ఎండ తప్పనిసరిగా తగలాలి.. అంతే కాదు టొమాటో మొక్కలమీద పెరిగే కీటకాలను నిరోధిస్తుంది కనుక టొమాటో తోటలలో కూడా పెంచుకోవచ్చు.
అగిరేటమ్ :
తెలుపు లేదా ఊదారంగు పూలు పూసే ఈ మొక్కను తెలుగులో కంపురొడ్డ, పోకబంతి అంటారు. గడ్డి మొక్కలు లాగా పెరిగే ఈ మొక్కల్లోని కౌమారిన్ ను వాణిజ్యపరంగా తయారుచేసే మస్కిటో రిఫెల్లెంట్లలో ఎక్కువగా వాడతారు. ఈ మొక్కలను కుండీలలో పెంచుకుంటే దోమల తాకిడి తగ్గవచ్చు.
లెమన్ బామ్ :
హార్స్ మింట్ లేదా బీబామ్ అని పిలుస్తాతరు. వీటి ఘూటైన వాసన దోమల్ని ఆమడ దూరం తరిమేస్తుందని అంటారు. ఈ మొక్కలు చాలా త్వరగా పెరుగుతాయి. నీటి ఎద్దడి తట్టుకుంటాయి. విత్తనాలు నేల మీదపడి వాటంతట అవే మొలకెత్తుతాయి. మీ తోటలో దోమల బెడదలేకుండా కాసేపు హాయిగా కూర్చోవాలంటే మీ కుర్చీ దగ్గర రెండు, మూడు మొక్కలు నాటండి. వీటి ఆకులతో మంచి ఔషధ కషాయాన్ని చేసుకుని త్రాగవచ్చు. వీటి పూలు తేనెటీగలను, సీతాకోక చిలుకల్ని ఆహ్వానిస్తాయి.
కాట్నిప్ :
ఔషధ మొక్కగా ప్రాచుర్యం పొందిన మొక్క దోమల్ని చక్కగా తరిమేయగలదట. ఆకుల్లో సహజంగా ఉండే నెపెటాలాక్టోన్ నూనె, మస్కిటో రిపెల్లెంట్ల కన్నా పదిరెట్లు ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. గడ్డిమొక్కలా పెరిగే ఈ మొక్క మీతోటలో ఉంటే హాయిగా పనిచేసుకో వచ్చు.
రోజ్ మేరి :
ఈ మొక్కగాని ఇంట్లో ఉంటే దోమలను తరిమి కొట్టటమే కాకుండా వంటలు రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే మంచి వాసనతో ఉండే మొక్క రెమ్మలను సూపులలో, కూరలలో వాడుతూ ఉంటారు. ఈ మొక్కలకు నీళ్ళ అవసరం కూడా పెద్దగా ఉండదు. ఈ మొక్కలను తోటలో చక్కగా పెంచుకోవచ్చు.
పుదీనా :
పుదీనాలో చాలా రకాలున్నాయి. ఏ రకమైన వీటి ఆకులలో ఉండే నూనెలంటేనే దోమలకు మంట. అందుకే వీటిని ఎక్కువగా కుండీలలో పెంచుకుంటే దోమల బాధనుండి ఉపశమనం లభిస్తుంది.
సిట్రొనెల్లా :
దీనినే తెలుగులో కామంచి కసు అంటారు. మస్కిటో రిపెల్లంట్ అని కూడా పిలిచే ఈ మొక్కకు దోమలు కాస్తా దూరంగానే ఉంటాయి. అయితే చాలా మంది ఈ మొక్కలనుండి వచ్చే సువాసనకోసం పెంచుతారు. గుమ్మంకిరు వైపులా ఈ మొక్కలను పెంచుకోవటం వలన సువాసనగా ఉంటుంది. అయితే ఈ ఆకులు త్రుంచి రుద్దినపుడే ఎక్కువగా వాసన వస్తుంది. ఇందులోని సిట్రొనెల్లా పదార్థాన్ని రిపెల్లంట్ కొవ్వొత్తులలో మరియు సబ్బులలో వాడతారు.
ఇంకా వెల్లుల్లి, లవంగమొక్క, వెనీలా, టీ, లావెండర్, యూకలిప్టస్, సేజ్ బ్రష్, ఫైనాపిల్ మొక్కలకు దోమలను అడ్డుకునే గుణం ఉంది. ఈ ఆకులను నలిపి ఒంటికి రుద్దుకున్నా దోమలు కుట్టకుండా ఉంటాయి.

Air Freshner Plants …. గాలిని శుద్ధి చేసే మొక్కలు

ఆలోవెరా (కలబంద) మొక్క :
ఈ మొక్కలు గాలిలోని హానికారక ఫార్మాల్డి హైడ్, బెంజిన్లాంటి పదార్ధాల శుద్ధికి ఎంతో ఉపయోగ పడుతుంది. కొత్తగా పెయింట్లు వేసిన ఇళ్లకూ ఇది మంచిది. సాధరణ మొక్కలకు భిన్నంగా ఇది రాత్రిపూట కార్పన్ డై ఆక్సైడ్ ను తీసుకొని అధిక మొత్తంలో ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. అందువలన పడక గదులలో వీటిని పెట్టుకోవచ్చు.
పీస్ లిల్లీలు :
ఈ మొక్కలు శ్వాస ఇబ్బందులను కలిగించే ట్రైక్లోరో ఇధిలీన్, అమ్మోనియాలను గాలి నుంచి తొలగించేందుకు సహకరిస్తాయి.
క్రిస్మస్ కాక్టస్ చెట్లు :
ఎరుపు, తెలుపూ,నీలం ఇలా రకరకాల రంగులలో చెట్టునిండా పూలతో మనకు కనిపించే క్రిస్మస్ కాక్టస్ చెట్లు గాలిలోని విషపూరితాలను తొలగిస్తాయి.
అరేకాపామ్, బాంబూపామ్ :
ఒక్క ఎయిర్ ప్యూరిఫైర్ కొనేబదులు ఈ మొక్కలు కొని ఇంటిలో పెంచుకుంటే సహజమైన సువాసనతో కళకళలాడు తుంటాయి.

రుద్రాక్ష చెట్లు

రుద్రాక్ష చెట్లు అని ఫేక్ పిక్చర్స్ వస్తున్నాయి…..

అసలైన రుద్రాక్షలను గుర్తించడం ఎలా??
రుద్రాక్షలు చెట్లకి పళ్ళలాగా ఉంటాయి. వాటిలోపల టెంకలాగా గట్టిగా ఉండేవి మనం చూసే, వాడే రుద్రాక్షలు. రుద్రాక్షలు పండుగా మారాక నీలం రంగులో ఉంటాయి. అవి ఎండిపోయాక గట్టి బెరడుగా రుద్రాక్షపై అంటుకోపోయి చిన్న సైజ్ కార్క్ బాల్ లా ఉంటుంది.
వేడి నీళ్ళలో వేసి నానబెట్టి వాటిని జాగ్రత్తగా పై బెరడును చెక్కి బ్రష్ వంటి దాంతో తీసి శుభ్రం చేస్తే మనం వేసుకునే రుద్రాక్ష వస్తుంది. అంతే తప్ప మనం వేసుకునే రుద్రాక్షలు తిన్నగా చెట్టుకి అలానే కాసెయ్యవు.
ఆ రుద్రాక్షల లోపల ఎన్ని ముఖాల రుద్రాక్షైతే అన్ని అరలుంటాయి. ఆ అరల్లో చిక్కుడు గింజలలాగా నున్నగా ఉండే గింజలుంటాయి. నిజానికి ఆ గింజలు ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలను విడుదల చేస్తాయి. రుద్రాక్ష నాణ్యత దాని బరువు మీద ఆధారపడి ఉంటుంది. పురుగులు, పుచ్చులు ఉన్నవైనా చాలా పాత రుద్రాక్షలైనా తేలికగా అయిపోయాయి అంటే వాటిలోపల ఉండే గింజలు కుళ్ళిపోవడం, కుళ్ళిపోయి ఎండిపోవడం లేదా ఎండిపోవడం జరిగిందని గుర్తు.
కొత్తగా వచ్చిన పంటలోని రుద్రాక్ష ఐతే బరువుగా ఉండి నీళ్ళలో వేస్తే మునుగుతుంది. కొన్నేళ్ళ క్రితంది ఐతే నీళ్ళలో తేలుతుంది.
చాలా రుద్రాక్షలు పరిశీలిస్తే ఏది నిజమో ఏది నిజమైనది కాదో గుర్తు పట్టేయవచ్చు.
రుద్రాక్ష మధ్యలో రంధ్రం సన్నగా ఉన్నదని కొందరు పెద్ద రంధ్రం చేయిస్తారు. దాని వల్ల ఆ రుద్రాక్షలోపల ఉండే గింజకు దెబ్బ తగిలి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల గుళ్ళ బైట
రూ.50-100 కి అమ్మే రుద్రాక్ష మాలలు ఈ కోవవే. కర్రా మాల్ అంటారు వీటిని, పాతబడిపోయిన ఎర్ర రంగు వేసిన రుద్రాక్షలు ఇవి ఎక్కువగా పంచ ముఖియే ఉంటాయి. ఒక లారీడు రుద్రాక్ష పంట దింపితే ఒక సంచీడు ఇతర ముఖాల రుద్రాక్షలు లభిస్తాయి. మిగతా అన్నీ పంచముఖి, నాలుగు ఆరు ముఖాలు కూడా పంచముఖి అంత కాకున్నా దానిలానే విరివిగా లభ్యంలో ఉంటాయి. కాబట్టి వీటిపైన రంపాలతో గీతలు గీసి ఎక్కువ ముఖాల రుద్రాక్షలుగా అమ్మేస్తుంటారు. గమనించుకోవాలి.
రుద్రాక్షకి స్వతహాగా రంధ్రముంటుంది. సృష్టిలో రుద్రాక్ష వంటిది మరొకటి లేదు. ఒక్క రుద్రాక్షకు మాత్రమే మధ్యలో రంధ్రం ఉంటుంది. ఇంక ఏకాయకి, పండుకి, గింజకీ దేనికీ ఇలా ఉండదు. అలా ఉండి ఎటువంటి బలవంతపు శక్తినీ ప్రయోగించి రంధ్రము చేయనవసరంలేకుండా ఒక దండలాగా ఏర్పడడానికి సిద్ధంగా మధ్యలో రంధ్రంతో ఉంటుంది. మనం కూడ
మన జీవితాన్ని ఆ పరమేశ్వరునికి దండలాగా సమర్పించ యోగ్యమైన దానిగా గడపాలని సూచిస్తుంది.
*తస్మాత్ జాగ్రత్త*
కార్క్, బోన్స్, ప్లాస్టిక్, ఫైబర్ మెటీరియల్తో రుద్రాక్షలు ముఖ్యంగా ఏకముఖి (చంద్రముఖి) రుద్రాక్షని కవచం అని టీవీల్లో కొన్ని షాపుల్లో అమ్మేస్తున్నారు. అప్పట్లోనే వాళ్ళమీద యుద్ధం చేసి కొంత ఆపడం జరిగింది.