జలగ

జలగ ఎంత పనిచేసిందో తెలుసా? యువకుడికి నరకం చూపెట్టింది.. ఎలా?

జలగ ఒక పట్టాన వదలదు. పట్టుకుని లాగినా, రేకు పెట్టి గీకినా మనకే బాధ. ఇలాకాక తేలిగ్గా తీసే మార్గం ఒకటి ఉంది. జలగ మన చర్మాన్ని పట్టుకున్నప్పుడు ఉప్పు ని పట్టి లాగా వేయాలి. అలా పట్టి వేసిన రెండు నిమిషాలకి అది చర్మం నుండి ఊడి పడిపోతుంది . ఉప్పు వేయటం వెనక కారణం ఏంటంటే జలగ లో ఉన్న తేమ ని అంటె నీరు ని ఉప్పు పీల్చేస్తుంది. దానివల్ల జలగ చనిపోయి చిన్నగా అయి పడిపోతుంది.

చీరమేను

చీరమేను/సీరమేను/చీరమీను అనేది చిన్న చేప, చాకురొయ్యల కన్నా చాలా చిన్నగా, చూడగానే ఏదో సేమ్యాల్లా కనబడతాయి. ఇవి గోదావరిలో వరదల తర్వాత దసరా నుంచి దీపావళి మధ్యలో మాత్రమే దొరుకుతాయి. ఈ చేపలు వేళ్ళ సందుల్లో నుంచీ వలల్లోనుంచీ కూడా జారిపోయేంత చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని చీరలతో పట్టుకుంటారు. అందుకే ఈ చేపకి చీరమీను అని పేరు.

ముఖ్యంగా యానాం, ఎదురులంక, కోటిపల్లి గ్రామాల్లో ఇవి బాగా దొరుకుతాయి. సముద్రపు నీరు, నదిలోని నీరు సంగమం వద్ద ఏర్పడిన ఉప్పునీటిలో ఈ చేప జాతులను గమనించవచ్చు. లార్వా దశలో ఉన్నప్పుడు ఈ చేపలు ఎక్కువ ఆక్సిజన్‌ను పొందడానికి సముద్ర సంగమం వద్ద ఉప్పునీటి నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రక్రియలో, అవి మత్స్యకారులకు చిక్కుతాయి. సముద్రం అంతటా చల్లని తూర్పు గాలులు వీచినప్పుడు, చీరమీను గోదావరిలోకి వస్తుంది. ఇవి కేవలం ఒక నెల మాత్రమే ఇక్కడ దొరుకుతాయి. ఈ దశలో ఉన్నప్పుడు చాలా రుచిగా ఉంటాయని పులస చేప రుచికి సైతం గట్టి పోటీని ఇవ్వగలదని అంటారు గోదావరి వాసులు.

దీనిని మిగతా చేపల్లాగ పులుసు, కూర చేయరు. చింతకాయల తొక్కుతో పాటు వేయించి, ఆ తర్వాత వీటితో కూర కానీ వేపుడు కానీ వండుతారు. అలాగే మినప్పిండితో పాటు వీటిని కలిపి చీరమీను గారెలు కూడా వేసుకుంటారు. వీటి సీౙన్ వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడో ఉన్న చూట్టాలు కూడా ఎగురుకుంటూ వచ్చేస్తారు ఈ కూరని వండించు తినటానికి. అలాగే అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు కూడా వీటిని అప్పుడప్పుడు ఎగుమతి చేస్తుంటారు.

వీటిని యానాం, ముమ్మిడివరం చేపల మార్కెట్లలో బక్కెట్లలో, బిందెల్లో పోసి అమ్ముతారు. ఇంతకీ వీటి ధర ఎంతుంటుందో ఊహించగలరా? అరకిలో దాదాపు వెయ్యి రూపాయలు వరకూ ఉంటుంది. అంటే కిలో చేపల ధర రెండు వేలు. ఒకవేళ ఆ సంవత్సరం చేపల పట్టుబడి తక్కువుంటే కనుక వీటి ధర కిలో నాలుగు వేల వరకూ కూడా ఉంటుంది. బిందెడు చీరమీను పన్నెండు వేల వరకూ ఉంటుంది. 

తాజా చేపలను తెలుసుకొనే విధానం, చేపలలో రకాలు

ఆరోగ్యానికి ముఖ్యంగా మెదడుకు మేలు చేసేవి చేపలు…చేపలలో సముద్రపు చేపలు వేరు. మంచినీటి చేపల ఎముకలు గట్టిగా ఉంటే సముద్రపు చేపలు మెత్తటి ఎముకలతో ఉంటాయి. మంచినీటి చేపలలో మైక్రో న్యూట్రియంట్లు మరియు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. సముద్రపు చేపలలో ఇవి ఎక్కువ. అందుకే చెరువు చేపలకంటే సముద్రపు చేపలు మంచివి అంటారు నిపుణులు. విటమిన్లు ఖనిజాలు ఏ చేపలలోనైనా ఒకటే. చేపలు తినటం వలన రక్తనాళాలలో రక్తం గడ్డకట్టదు. ట్రైగ్లిజరేడ్లు తగ్గుతాయి. బిపిని కంట్రోల్ లో ఉంచుతాయి. చేపలు కొనే ముందు వాటి నాణ్యత, తాజాదనం పరీక్షించి కొనవలసి ఉంటుంది.
తాజా చేపలను తెలుసుకొనే విధానం :
01. చేపల మొప్పలు ఎత్తి చూసినపుడు లోపల ఎర్రగా గాని, పింక్ కలర్లో గాని కాంతివంతంగా ఉండాలి. ఎర్రగా కనపడటానికి రంగుకూడా వేస్తారు. కనుక జాగ్రత్తగా గమనించి కొనాలి.
02. చేపల ఉపరితలం మీద వేలుతో నొక్కినపుడు చొట్టపడకుండా గట్టిగా ఉండాలి. మెత్తగా ఉండరాదు వేలి నొక్కుడు పడరాదు. నొక్కుడు పడితే నిల్వ ఉన్న చేపగా భావించాలి. కొన్నిసార్లు చేపలు గట్టిగా ఉండటానికి ఫ్రాజెన్ చేస్తారు.(ఐస్)
03. కుళ్ళిన చేపలు చెడ్డవాసనతో ఉంటాయి. కుళ్ళిన చేపలను మంచి చేపలలో కలుపుతారు.
04. చేపల చర్మం తళ తళలాడుతూ ఎటువంటి మచ్చలు లేకుండా ఉండాలి. చేపల కళ్ళు మెరుస్తూ కాంతిగా ఉండాలి, వాడిన, ఎర్రగా లేక పీక్కుపోయిన కళ్ళతో ఉన్నవి తాజావి కాదు.
చేపలలో రకాలు… రోహ (శిలావతి), ఎర్రమట్ట, కోయంగ, మోసు, వాలుగ, పాలబొంత, వంజరం , మట్టగడిస, వానమట్ట, సవ్వలు, టేకుచేప, కట్టిపరిగ, పిత్తపరిగ, బొచ్చెలు, మెత్తాళ్ళు, పండుగప్పలు, సాల్మన్, కొరమీనులు ఇంకా ఎన్నో రకాలున్నాయి.

వీటిలో కొన్నిటి గురించి:

బొచ్చెలు 

botche fish

అందరికీ అందుబాటు ధరలో ఉండే ఈ చేపలు మంచినీటిలో పెరుగుతాయి. ముళ్ళు కొద్దిగా ఎక్కువ. మంచి రుచిగా ఉండి పోషకాలు కలిగి ఉంటాయి. రైతులు చెరువులలో పెంచుతారు. నదులలో దొరకే చేపలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరలా వీటిలో రాగండి, తెల్ల బొచ్చలు అనే రెండు రకాలుంటాయి.

మెత్తాళ్ళు

mettalu fish

చిన్న సైజులో ఉండే మెత్తాళ్ళను ఎక్కవగా ఎండబెట్టి చింతచిగురుతో కలిపి వండుకుంటారు. చిన్నవే కానీ పోషకాలు ఎక్కుగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ ఇంకా ఎన్నో వీటినుండి లభిస్తాయి. ఎండబెట్టిన వాటిలో ఉప్పు ఎక్కువగా ఉండటం వలన వీటిని వండే ముందు నీటిలో బాగా నానబెట్టి శుభ్రంగా కడిగి వాడటం మంచిది.

పండుగప్ప 

pandukappa  fish

బర్రమండి చేపలనే పండుగప్పగా కూడా పిలుస్తారు. వీటి ఖరీదు కొంచెం క్కువగా ఉంటుంది. పుట్టాక కొంతకాలం మగచేపలుగా ఉండి తరువాత ఆడచేపలుగా మారటం ఈ చేపలలో ఉండే ప్రత్యేక లక్షణం. ఉప్ఫు చేపగా కూడా లభిస్తుంది.

కొరమీను 

korameenu  fish

మంచినీటిలో మాత్రమే పెరిగే ఈ చేపలు నల్లగా తళతళలాడుతూ తల పాము తలను పోలి ఉంటుంది. ఒకటే ముల్లు కలిగి ఉండే ఈ చేపలకు డిమాండ్ మరియు ధరకూడా ఎక్కువే. శస్త్రచికిత్సలు జరిగిన తరువాత ఈ చేపను తినడం వల్ల గాయాలు, కోతలు త్వరగా మానుతాయంటారు.

బొమ్మిడాయిలు 

pulasa fish

చేపలలో బొమ్మిడాయిల రుచే వేరు. చింతకాయతో చేసే వీటిపులుసు తినాల్సిందేనంటారు. వేలంత లావుగా ఉండి చిన్నసైజు పాములులాగా ఉంటాయి. ఒకే సన్నని ముల్లుతో ఉంటాయి. వీటిలో మగచేపలు కొంచెం సన్నగా ఉంటాయి.

చందువాలు 

chanduva fish

వైట్ పాంప్రెట్, బటర్ ఫిష్, తెల్లచందువాలు, నల్లచందువాలుగా పిలువబడే ఈ చేపలు సముద్రాలలో మాత్రమే దొరకుతాయి. ఈ చేపలు జీర్ణకోశానికి మేలు చేస్తాయి. విటమిన్ ఎ, బి3, డి, ఇ విటమిన్లు వీటిలో ఎక్కువ. వీటిల్లో నల్లచందువాలు కూడా ఉంటాయి.

నూనెకవ్వలు : (సార్టెన్)ఈ చేపలలో ఔషధ గుణాలు ఎక్కువ. ఒమేగా 3, ఫ్యాటీ ఆమ్లాల శాతం చాలా ఎక్కువ. బీపిని కంట్రోల్ లో ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచివని నిపుణులు చెపుతారు. జీవప్రక్రియ వేగాన్ని ఈ చేపలలోని ప్రోటీన్లు తగ్గిస్తాయి. తద్వార క్యాలరీలు తగ్గుతాయి. డయాబెటిస్ వారికి కూడా మంచివి. ఓ చిన్నచేపనుంచి నాలుగు గ్లాసుల పాలలో ఉండే క్యాల్షియం లభిస్తుంది. వీటిల్లో ఎండుచేప రకాలలో పోషకాలు పెరగటంతో పాటు, రుచి కూడా పెరుగుతుంది. పిల్లల పెరుగుదలకు మంచిదంటారు నిపుణులు.

పులసచేపలు 

pulasa fish

చేపలలోనే రారాజు చేపలు పులసచేపలు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలలోనే దొరికే ఈ చేపలే అత్యంత ఖరీదైనవి. ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలలోనే గోదావరి నదిలోనే దొరకుతాయి. గొదావరికి వరద పోటెత్తే సమయంలో వరదనీరు సముద్రంలో కలిసే చోట ప్రవాహానికి ఎదురీదుతూ గోదావరి జలాల్లోకి వస్తాయి పులస చేపలు. వీటి శరీరం వెండిలా మెరుస్తుంది. చేప పరిమాణాన్నిబట్టి రెండు వేల నుండి ఆరువేల రూపాయల దాకా ధరపలుకుతాయి. ఈ చేపలలోని ఫ్యాటి అమ్లాలకు చెడు కొలస్ట్రాలును తగ్గించే గుణం కలదు.

సాల్మన్ చేపలు 

salmon

ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి సాల్మన్ చేపలు. ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థచే ధృవీకరించపడింది. ఈ చేపలలో ఫసిఫిక్, అట్లాంటిక్ అనే రెండు రకాలుంటాయి. వీటిలో ఆడచేపలు గుడ్లు పెట్టిన తరువాత మగచేపలు వాటిని పిల్లలయ్యేటట్లు చేస్తాయి. తరువాత ఆడ, మగ రెండు చేపలు చనిపోతాయి. సాల్మన్ చేపలలో ప్రొటీన్లు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డిలు పుష్కలంగా లభిస్తాయి. వీటి మాంసం ఎరుపురంగులో ఉంటుంది. కారణం వీటిలో ఉండే కెరటోనాయిడ్లు. తెల్ల మగచేపలనే ఇండియన్ సాల్మన్ చేపలంటారు. రవ్వచేపలని కూడా పిలుస్తారు.

పీతలు

Crabs Price Rises in West Godavari Rainy Season - Sakshi

పచ్చ రంగులో ఉన్న వీటికి సైజును బట్టి వ్యాపారులు ధర నిర్ణయించారు. చిన్న సైజువి ఒక్కోటి రూ.150, పెద్దవి గరిష్టంగా ఒక్కోటి రూ.వెయ్యి పలికాయి. సాధారణంగా పెద్దపీతలను వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేస్తారు. కరోనా వల్ల ఎగుమతు లు నిలిచిపోవడంతో ఇవి తణుకు, గూడెం మార్కెట్లకు వచ్చాయి. మనసు ఉండబట్ట లేని కొద్దిమంది మాత్రం కొనుగోలు చేశారు.  

కరిమీన్‌

MPEDA comes to aid production of Kerala most popular fish - Sakshi
కేరళ రాష్ట్ర చేప ‘కరిమీన్‌’కు మంచి కాలం వచ్చింది. ఈ చేప చర్మంపై గుండ్రటి చుక్కలు మాదిరిగా ఉండి కాంతులీనుతూ ఉంటాయి. అందుకే దీన్ని ఆంగ్లంలో పెర్ల్‌ స్పాట్‌ ఫిష్‌’ అని పిలుస్తూ ఉంటారు. దీని పేరు మన కొర్రమీను మాదిరిగా, రూపం చందువా మాదిరిగా ఉంటుంది. కరిమీన్‌ అత్యంత రుచికరమైన చేప. దీనితో చేసిన వంటకాలను కేరళీయులతోపాటు పర్యాటకులు లొట్టలేసుకుంటూ తింటారు. కిలో రూ. 500–600 దాకా పలుకుతుంది. విదేశాల్లోనూ గిరాకీ ఉంది. 
కేరళలో నదులు, వంకలు సముద్రంలో కలిసే అలెప్పీ తదితర ప్రాంతాల్లో ఈ చేపలు సహజసిద్ధంగా మత్స్యకారుల వలలకు పడుతూ ఉంటాయి. పశ్చిమ దిశగా పారే కర్ణాటక నదుల్లో, ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా కరిమీన్‌ కనిపిస్తూ ఉంటుంది. కేరళ బ్యాక్‌వాటర్స్‌లో స్థానికులు కరిమీన్‌ పిల్లలను పట్టుకొని, వాటిని కొందరు రైతులు చెరువుల్లో పెంచుతూ ఉంటారు. నీటిలో పెరిగే నాచు, మొక్కలు, కీటకాలను తిని కరిమీన్‌ పెరుగుతుంది. కరిమీన్‌ పిల్లలకు చాలా గిరాకీ ఉంది కాబట్టి, ఈ చేప పిల్లల కోసం చాలా మంది జల్లెడపడుతూ ఉంటారు. కాలక్రమంలో ఈ చేపల జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహక సంస్థ (ఎంపెడా) రంగంలోకి దిగింది. కరిమీన్‌ చేప పిల్లల ఉత్పత్తిని ప్రారంభించింది.

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

Fish Farming Special Story - Sakshi

నెలకు రూ. 25 వేల ఆదాయం! సాంద్ర చేపల పంజర సాగుతో నెలవారీ ఆదాయం రూ. 5.6 లక్షల మూల పెట్టుబడి.. ఇందులో 40–60% సబ్సిడీ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోదగిన రీసర్యు్యలేటరీ ఆక్వా చెరువు

రెండున్నర ఎకరాల చేపల చెరువులో సాగు చేసే చేపలను కేవలం 484 (22 “ 22) చదరపు అడుగుల పంజరాల(కేజ్‌ల)లో సాగు చేయడం ద్వారా.. నెల నెలా రూ. 25,750ల చొప్పున ఏడాదికి రూ. 3.09 లక్షల ఆదాయం పొందే ఇంటెన్సివ్‌ కేజ్‌ కల్చర్‌ పద్ధతిని కేరళలోని కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రూపొందించింది. పెరట్లో తక్కువ స్థలంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ పునర్వినియోగించే ఆక్వా సాగు పద్ధతి కావడంతో రోజుకు కేవలం వెయ్యి లీటర్ల నీరు మాత్రమే అవసరం అవుతుంది. 484 చదరపు అడుగుల పంజరాలలో చేపలు పెంచుతారు. అయితే, నీటి శుద్ధి పరికరాలకు, షేడ్‌నెట్‌ వేసుకోవడానికి మొత్తం 200 చదరపు మీటర్ల విస్తీర్ణం చోటు అవసరమవుతుంది. రైతులకు నెల నెలా చెప్పుకోదగిన ఆదాయం పొందే ఈ పద్ధతి ద్వారా నీటి వనరులకు తీవ్ర కొరత ఉండే జిల్లాల్లో కూడా యువతను ఆక్వా సాగులోకి ఆకర్షించడానికి  ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌.ఎఫ్‌.డి.బి.), జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ సంస్థ (ఎన్‌.ఐ.ఆర్‌.డి.పి.ఆర్‌.) ఆవరణలో ఈ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. రైతులు, యువత స్వయంగా వెళ్లి చూసి అవగాహన కలిగించుకోవచ్చు.

యూనిట్‌ వెల రూ. 5.6 లక్షలు
22 “ 22 చదరపు అడుగుల్లో ఒక రీ–సర్క్యులేటరీ ఆక్వాకల్చర్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడానికి రూ. 5.6 లక్షలు ఖర్చవుతుంది. జనరల్, ఒబిసి అభ్యర్థులకు 40%, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యుర్థులకు 60% మేరకు ఎన్‌.ఎఫ్‌.డి.బి. సబ్సిడీ ఇస్తుంది. మిగతా సొమ్ముకు బ్యాంకు రుణం పొందవచ్చు. పక్కపక్కనే మూడు కేజ్‌లను (ఈ మూడూ కలిపి 22 “ 22 చదరపు అడుగులే) ఏర్పాటు చేస్తారు. ఒక్కో కేజ్‌లో 45 రోజుల తేడాతో చేప పిల్లలను వదులుకుంటే.. 3 నెలల తర్వాత నుంచి ఏడాది పొడవునా దశల వారీగా చేపల దిగుబడి వస్తుందని, తద్వారా రైతుకు ప్రతి నెలా ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు వెయ్యి లీటర్ల నీరు చాలు..
మొదట్లో 90 వేల లీటర్ల నీరు నింపుతారు. గిఫ్ట్‌ తిలాపియా, జెల్ల (పంగాసియస్‌), కొర్రమేను (ముర్రెల్‌), కషిమీర (పెర్ల్‌ స్పాట్‌) వంటి చేప పిల్లలను వదులుతారు. రెండు వేల నుంచి మూడు వేల చేప పిల్లలను వదులుతారు. అనుదినం నీటిని శుద్ధి చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తారు. కాబట్టి రోజుకు 800–1,000 లీటర్ల మడ్డి నీటిని బయటకు తోడేసి, ఆ మేరకు మంచి నీటిని నింపాల్సి ఉంటుంది. ఈ మడ్డి నీరు పోషకాలతో కూడి ఉంటుంది. రోజూ చేపల వయసును బట్టి నీటిపై తేలాడే బలపాల (పెల్లెట్స్‌) మేత వేస్తారు. మేత అవశేషాలు, చేపల విసర్జితాలు కలిసిన ఈ నీటిలో నత్రజని వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషక జలాన్ని కూరగాయలు, ఇతర పంటలకు పారగట్టవచ్చు. ఇలా పెరిగే చేప పిల్లలు మూడు నెలల్లో మంచి సైజుకు పెరుగుతాయి. నీరు ఎప్పటికప్పుడు శుద్ధి అవుతూ ఉంటుంది కాబట్టి జబ్బుల సమస్య ఉండదు.
ప్రతి మూడు నెలలకు 1,620 కిలోల చేపల దిగుబడి వస్తుందని, కిలో రూ. 180 నుంచి 200 వరకు గిట్టుబాటవుతుందని నిపుణుల అంచనా. ప్రతి 3 నెలలకు రూ. లక్షా 40 వేల వరకు మేత, తదితర ఖర్చులు ఉంటాయి. ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే వారికి మొదటి 3 నెలలకు అవసరమైన పెంపకం ఖర్చు రూ. లక్షా 40 వేలను ఎన్‌.ఎఫ్‌.డి.బి. అందిస్తుందని అధికారులు తెలిపారు.
ప్రతి 3 నెలలకు రూ. 2.4 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఏడాదికి 4 పంటలు తీయవచ్చు. అంటే మొత్తం రూ. 7.29 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో రూ. 4.2 ఖర్చులు పోను నికరంగా రైతుకు రూ. 3.09 లక్షల(నెలకు రూ. 25,750 చొప్పున) నికరాదాయం వస్తుందని ఎన్‌.ఎఫ్‌.డి.బి., ఎన్‌.ఐ.ఆర్‌.డి. నిపుణులు అంచనా వేస్తున్నారు. కిలో రూ. 400 ధర పలికే కాట్‌ ఫిష్‌ను కూడా పెంచుకోవచ్చు.
ఎవర్ని సంప్రదించాలి?
తక్కువ స్థలంలో అధిక సాంద్రతలో చేపలను ఉత్పత్తి చేసే ఈ బాక్‌యార్డ్‌ రీ–సర్క్యులేటరీ ఆక్వాకల్చర్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయదలచుకునే వారు సబ్సిడీ, సాంకేతిక సహాయం కోసం హైదరాబాద్‌లోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌.ఎఫ్‌.డి.బి.) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (టెక్నికల్‌) ను 040–24000113 నంబరు లో సంప్రదించవచ్చు. లేదా హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఎన్‌.ఐ.ఆర్‌.డి.పి.ఆర్‌.కు చెందిన రూరల్‌ టెక్నాలజీ పార్క్‌లోని శేఖర్‌ను 98487 80277 నంబరులో సంప్రదించవచ్చు. ఈ రెండు చోట్లా ఈ కేజ్‌ కల్చర్‌కు సంబంధించిన నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. ఎవరైనా వెళ్లి చూడవచ్చు.
ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ జిల్లాలోనైనా ఈ పెరటి చేపల చెరువులను ఏర్పాటు చేసుకోవచ్చని.. అయితే, వీటిపై నీడ కోసం, పక్షుల నుంచి రక్షణ కోసం షేడ్‌నెట్‌ షెడ్‌ వేసుకోవడం తప్పనిసరి. 

పండుగప్ప..

పండుగప్ప 

pandukappa  fish

బర్రమండి చేపలనే పండుగప్పగా కూడా పిలుస్తారు. వీటి ఖరీదు కొంచెం క్కువగా ఉంటుంది. పుట్టాక కొంతకాలం మగచేపలుగా ఉండి తరువాత ఆడచేపలుగా మారటం ఈ చేపలలో ఉండే ప్రత్యేక లక్షణం. ఉప్ఫు చేపగా కూడా లభిస్తుంది.

పండుగప్ప.. హెక్టారు.. 15 టన్నులు!

Pandugappa fish production has become a viable option for farmers - Sakshi

దేశ విదేశీ మార్కెట్లలో మంచి గిరాకీ ఉండటమే కాకుండా.. మంచి నీటిలో, ఉప్పు నీటిలో, సముద్రపు నీటిలో కూడా పెరిగే అరుదైన చేప.. పండుగప్ప (సీబాస్‌). రొయ్యలకు ప్రత్యామ్నాయంగా రైతులు సాగు చేయదగిన సలక్షణమైన చేప ఇది.

ముళ్లు తీసేసిన పండుగప్ప మాంసం ముక్కలకు దేశీయ సూపర్‌ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంది. కిలో రూ. 400–500 వరకు పలుకుతోంది. విదేశాల్లో దీనికి ఉన్న డిమాండ్‌ సరేసరి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ ఎంపెడా ఇటీవల పండుగప్ప సాగులో అధిక దిగుబడి సాధించింది. ఉప్పునీటి చెరువులో హెక్టారుకు 15 టన్నుల పండుగప్ప చేపల దిగుబడి తీయడం విశేషం.
ఆక్వా సాగులో సరికొత్త ప్రయోగాలకు ‘రాజీవ్‌గాంధీ ఆక్వాకల్చర్‌ సెంటర్‌’(ఆర్‌.జి.సి.ఎ.)లు వేదికలుగా నిలిచాయి. ఎంపెడా ఆధ్వర్యంలో దేశంలోని అనేక చోట్ల ఆర్‌.జి.సి.ఎ.లు ఏర్పాటయ్యాయి. కృష్ణాజిల్లాలో కూడా ఒక ఆర్‌.జి.సి.ఎ. విభాగం ఉంది.
పాండిచ్చేరిలోని కరైకల్‌ వద్ద ఏర్పాటైన ఆర్‌.జి.సి.ఎ.లోని ప్రదర్శనా క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండుగప్పను సాగు చేసి, 10 నెలల్లో హెక్టారుకు 15 టన్నుల దిగుబడి సాధించారు. 1.5–2.0 సెం.మీ. చేప పిల్లలను చెరువులో వదిలారు. పది నెలల్లో ఒక్కోచేప 1200 గ్రాముల నుంచి 1500 గ్రాముల బరువు పెరిగాయి. తేలాడే పెల్లెట్లను మేతగా వేశారు. కిలో మేతకు 1.8 కిలోల దిగుబడి సాధించడం విశేషం. అన్నీ కలిపి కిలోకు రూ. 300 ఉత్పత్తి ఖర్చు అయింది. వ్యాపారులు చెరువు దగ్గరకే వచ్చి రూ. 420–450 ధర ఇచ్చి కొనుక్కెళ్లారు. రూ. 17 లక్షల లాభం వచ్చినట్లు ఎంపెడా అధికారులు ప్రకటించారు.

పండుగప్ప సాగుకు కీలకం నాణ్యమైన విత్తనం. తమిళనాడు నాగపట్నం జిల్లా తోడువాయి వద్ద గల ఆర్‌.జి.సి.ఎ.లోని హేచరీలో అత్యంత నాణ్యమైన పండుగప్ప విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నారు. ఇప్పటికే కోటి 80 లక్షల సీడ్‌ను ఉత్పత్తి చేసి రైతులకు అందించినట్లు ఎంపెడా చెబుతోంది. ప్రజలు మక్కువతో ఆరగించే పండుగప్ప చేపలను రొయ్యలకు బదులుగా ఆక్వా రైతులు సాగు చేయాలని ఎంపెడా సూచిస్తోంది.
పండుగప్ప విత్తనం కోసం ఆర్‌.జి.సి.ఎ. అధికారి పాండ్యరాజన్‌ను 94437 24422లో సంప్రదించవచ్చు. ఫాక్స్‌: 04364–264502
seabasshatchery@gmail.com.