విడాకులు – కారణాలు

ప్రస్తుతం విడాకులకు ప్రధానంగా జీవితం గురించి భార్యాభర్తలకు సరైన అవగాహన లేకపోవడం. కోడలి పట్ల అత్తమామలు, ఆడపడుచుల వేధింపులు. ఇచ్చిన కట్నం చాలదని, ఇంకా కట్నకానుకలు తీసుకురావాలని వేధింపులు. ఆడపిల్ల పుడితే వేధింపులు.

భార్యగానీ, భర్తకుగానీ రూప లావణ్యాలు లేవని భావించి, వేరే కారణాలు చూపి, విడాకులకు సిద్ధపడుతున్నారు. అక్రమ సంబంధాలు కూడా విడాకులకు కారణాలు అవుతున్నాయి.

మహిళల వైపు నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే భర్తలు విడాకుల వైపు మొగ్గుచూపుతున్నారు. తాగుడు, జూదం వంటి అలవాట్లు విడాకులకు దారి తీస్తున్నాయి.

ఆపగలమా?

ఆపవచ్చు. చిన్న చిన్న సమస్యలు అయితే ఇరువురికీ నచ్చచెప్పవచ్చు. దౌర్జన్యం, కుట్రపూరిత చర్యలు, భాగస్వామి వల్ల ప్రాణ హాని, నిత్యం అవమానకర ధోరణులు వుంటే నచ్చచెప్పినా ప్రయోజనం వుండదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ గౌరవం, కులప్రతిష్ఠ వంటి కట్టుబాట్లు చెబితే ఫలితం వుండదు. వివాహం చేసుకున్నపుడే వధూవరులు ఆలోచించాలి.

విరహం, తాపం, ప్రణయం

ఒక జంట కు వివాహము అయింది. ఆషాడ మాసం రావటంతో అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. ఆమె స్నేహితురాళ్లు ఆమె వివాహం గురించి అప్పటి సరదా ల గురించి గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన భర్త చిత్రపటాన్నీ తన గదిలో అద్దానికి అతికించి రాత్రి అతని పటాన్ని చూస్తూ నిద్రపోయింది. ఇది విరహం.

కొన్ని రోజులకు ఆయన వస్తున్న ట్లుగా ఉత్తరం వచ్చింది. ఆరోజు రాత్రి ఆమె ఆ పటంతో అయితే రేపు మీరు తప్పక వస్తారుగా అని అడుగుతూ ఆ పటాన్ని అలాగే పట్టుకుని నిద్రలోకి జారుకుంది. ఇది తాపం.

తెల్లవారింది భర్త వచ్చాడు. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఇద్దరూ బయట చెట్టు కింద మంచము వేసుకుని కూర్చుని ఆ నెల రోజులు ఎంత కష్టం గా గడిచింది చెప్పుకున్నారు. ఇది ప్రణయం.

అమ్మాయి కి తొందరగా ఎందుకు పెళ్లి చెయ్యాలి

అమ్మాయికి త్వరగా వివాహం చేయాలని సమాజంలో ఎక్కువమంది తల్లిదండ్రులు ఆతృత పడుతుంటారు. దీనికి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, సంప్రదాయాలు కారణం.

సామాజికం

మనిషి సంఘజీవి. సంఘానికి భయపడతారు. గౌరవిస్తారు. నిత్యం వచ్చే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మీకెంతమంది పిల్లలు. ? ఇద్దరాడపిల్లలా. ఇంకా పెళ్లి చేయక పోవడమేమిటి.రోజులు బాగోలేదు. త్వరగా చేసేయండి. ఉచిత సలహా ఇచ్చి, వెళ్లిపోయారు. ఆ యజమానికి కంగారు మొదలవుతుంది.

ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు

నీ కాలంలో, మా కాలంలో చిన్నప్పుడే పెళ్ళిళ్ళయి పోయేవి. మీరెందుకు చేయరు. అమ్మాయి పెళ్లి చూసి చనిపోదామని ఉంది. నా కోరిక తీర్చవా?

చుట్టాల రొద

ఏమిటమ్మా వదినా! మన బంధువుల్లో. మీ అమ్మాయి వయసున్న వారందరికీ వివాహాలయ్యాయి. మీరేమో చదువులు, చట్టుబండలంటూ ఆలీశ్యం చేస్తున్నారు. ప్రమాదం సుమా.

ఇలా సామాజికంగా రకరకాల వత్తిళ్లతో అమ్మాయికి తొందరగా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు.

సంప్రదాయం

ఏ దేశమైనా ప్రజలు సంప్రదాయానికి విలువిస్తారు. మన దేశంలో ఇది మరీ ఎక్కువ. పూర్వకాలం నుంచి భారత దేశంలో చిన్నతనం నుంచే వివాహాలు చేయడం పరిపాటిగా వస్తోంది. శాస్త్రీయ దృక్పథం పెరగడం, స్త్రీ విద్య వికాసం, చట్టాల వల్ల యుక్త వయసులో పెళ్లిళ్లు చేయడం పెరిగింది. హిందూ వివాహ మంత్రాలు గమనిస్తే చిన్నతనంలోనే వివాహాలు జరిగిన తీరు అర్ధమవుతుంది. అందులో ఒకటి చూద్దాం. కన్యాదాన సమయంలో..

‘ అష్ట వర్షా భవేత్ కన్యా.’

కన్యాదాత, చిన్న వయసులో ఉన్న తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తాడు. కన్యాశుల్కం ఎక్కువగా వున్న రోజుల్లో కడుపులో వున్న శిశువును ఆడపిల్లగానే భావించి అమ్మేసే వారు. ఈ విషయం ‘ కన్యాశుల్కం’నాటకం ఆనాటి బాల్యవివాహాలకు అద్దం పడుతోంది.

ఆర్ధిక పరిస్థితులు

నిజానికి ఓ ఆడపిల్ల కన్న తల్లిదండ్రులకు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో, అంతకు మించి తర్వాత ఖర్చు చేయాల్సి వస్తుంది. పండుగలు, పురుడు, కాపురానికి పంపడం వంటి ఎన్నో ఖర్చులు అమ్మాయి తల్లిదండ్రులను కుంగదీస్తాయి. అందుచేత తమకు ఓపిక, ఆర్ధిక పరిస్థితి బాగుండగానే అమ్మాయికి వివాహం చేయాలని తల్లిదండ్రులు తొందర పడుతుంటారు.

అత్త – కోడలు

అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అత్త గారు కోడలి గారికి ప్రధమ విమర్శకురాలు. ఒక రకంగా ఆమె కోడలు చేసిన పనిని విమర్శనాత్మకంగా చూస్తుంది. కోడలు వేరే ఇంటిలో వేరే పద్దతులు నేర్చుకొని వస్తుంది. ఇంకా ఆమె అక్కడ పూర్తి స్వతంత్రురాలు. తల్లి చాటు బిడ్డ. తండ్రికి గారాల పట్టి. అందువల్ల కాఫీ తాగి స్నానానికి వెళ్ళటం, వంట చేసేప్పుడు రుచి చూడటం వగైరాలు. ఇవి తల్లి మందలించి ఊరుకుంటుంది. కానీ అత్తగారికి నచ్చకపోవచ్చు.

అత్తగారికి కోడలు పొద్దున్నే లేచి స్నానం అది చేసి తరువాత పూజ అయ్యాక కాఫీ తాగాలి, వంట చేసేప్పుడు జాగ్రత్తగా చేయాలి గాని, ఉప్పు సరిపోయిందా లేదా అని రుచి చూడటం లాటివి నచ్చవు.

ఆమె చేస్తే అది అవసరం అనుకోండి. ఎందుకంటే ఉప్పు కషాయం అయితే ఆమె కొడుకు అలుగుతాడు కదా. దాంతో ఆమె సహజంగా ఇవేమీ పద్ధతులు అని విమర్శిస్తుంది.

అంతటితో ఊరుకోకుండా పక్క వాళ్లకు ఎదురు వాళ్లకు చెప్తుంది. దాంతో కోడలు గారు పద్ధతి తెలియని మనిషి అని గడుగ్గాయి అని ఇరుగు పొరుగు అనుకుంటారు.

అదే అత్తగారు లేరనుకోండి, కోడలు గారు పక్కవాళ్ల కు ఆమె చేసిన స్వీట్, హాట్ ఇచ్చి రుచి చూడండి అంటుంది. వాళ్ళు అబ్బా ఈమె ఎంత మంచిది, ఎంత ఉత్తమురాలు అందరికి అన్ని ఇస్తుంది, అరమరికలు లేకుండా ఉంటుంది. అని ప్రశంసా పత్రం ఇస్తారు. వాళ్లకు కోడలు స్నానం చేసి స్వీట్ చేసిందా లేక పూజ అయ్యాక దేవుడికి నైవేద్యం పెట్టిందా అనే విషయాలు అవసరం లేదు, అవి చెప్పటానికి అత్తగారు ఏమో అక్కడ లేకపోయే.

ఇంకా కోడలు లేని అత్త గుణవంతురాలు ఎందుకంటే.

ఆమె గురించి చెప్పేందుకు కోడలు లేదు. ఆమె వయస్సు పెద్దరికం వల్ల అందరికి , వడియాలు పెట్టేపుడు పిండి గుడ్డ పైన వేయలా లేక పేపరు పైన వేయలా అనే విషయాలు చెప్తుంది. ఇంకా అడిగితే, కోడలు ని ప్రతిదానికీ అరవకూడదని, పాపం వేరే ఇంటి నుంచి వచ్చి నేర్చుకోవటానికి సమయం పడుతుందని చెప్తుంది. (అంటే ఆమెకు కోడలు లేదు గా, పక్క వాళ్లకు చెప్పటమే కదా) దాంతో పక్క వాళ్ళ కోడలు అబ్బా ఇమే ఎంత మంచిది, ఎంత సహన సంపద ఉంది, ఎంత గుణ మంతురాలు మా అత్తగారు కూడా ఉంది ఎందుకు, సూర్య కాంతనికి జిరాక్స్ కాపీ అనుకుంటుంది.

పెళ్లిళ్లు – కోరికలు

పెళ్లి అయినా వెంటనే భర్త అన్ని సౌకర్యాలు అమర్చాలి అని యువతులు ఆశిస్తూ ఉన్నారు. కారు తో సహా. ఇక యువకులు అయితే భార్య ఉద్యోగం చేసి సంపాదించాలని కొందరు ఆశిస్తే, కోరికలు తగ్గించు కుని ఉన్నంతలో సర్దుకు పోవాలని కొందరు ఆశిస్తారు. ప్రస్తుతo ఎక్కువ మంది యువతులు సమానత్వం ఆశిస్తున్నారు. స్వేచ్చను ఇది వరకు కంటే ఎక్కువ ఆశిస్తున్నారు.పెళ్లి అంటేనే సర్దుబాటు. సర్దు బాటు లేని సంసారం ఎక్కువ కాలం నిలబడ దని నా అభిప్రాయం.

పరిపక్వత ఉంటే వాస్తవానికి దగ్గరగా అలోచించగలరు. ఉద్యోగం చేసే యువతి ఆశించే దొకటి. ఉన్నత వర్గాల యువతీ, యువకుల ఆశలు వేరే. పెళ్లిళ్లు చాలా విఫలం అవుతున్నాయి. కారణం ఎమిటి? తీర్చలేని కోరికలు, అత్యాశలు కారణం. వాస్తవానికి దూరంగా అంచనాలు.

తక్కువ ఆశిస్తే ఎక్కువ పొందవచ్చు. మనం మన భాగస్వామి నుండి ఏమి ఆశిస్తున్నామో, మనం భాగస్వామి ఆశలు ఆలాగే ఉంటాయని అర్ధం చేసుకుంటే సమస్యలు తగ్గుతాయి. పెళ్లి గురించి చిన్న కొటేషన్, మనలో ఏ లక్షణాలు లేవో, ఆ లక్షణాలు ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి జయప్రదం అవుతుంది.

నవ వదు వరులు – సలహాలు – సూచనలు

సలహాలు

వివాహం అయిన మొదట్లోనే మీ మనసంతా కోసి అవతల వారికి ఇచ్చేయకండి. మెల్ల మెల్లగా ఒక్కో తెర తొలగి, ఒక్కో విషయం తెలుసుకుంటూ తెలుపుతూ ముందుకు సాగండి. మీ ఆవీ జీవీ అంతా పిండుకుని చెప్పినా అవతల వారికి అర్ధం ఔతుందని ఏమీ గ్యారంటీ లేదు. నిరుత్సాహం తప్ప ఇలా చేస్తే ఫలితం ఏమీ లేదు.

పెళ్లికి ముందే మాట్లాడుకున్నాం, నిర్ణయించుకున్నాం కనుక అలాగే జరగాలి జరుగుతుంది అని అనుకోకండి. పెళ్లికి ముందు అమ్మాయి అమెరికా వెళ్దాం అనచ్చు, పెళ్లయ్యాక ఇండియాలోనే ఉందామని అనుకోవచ్చు..పెళ్లికి ముందు పిల్లల ఇప్పుడే వద్దు అనుకోవచ్చు, పెళ్లయ్యాక వెంటనే కావాలి అనిపించవచ్చు. All decisions are and will always be subject to change. మీరు వారితో కలిసి ప్రయాణించడం, కలసిన మీ అభిప్రాయాలు, నిర్ణయాలు వల్ల కాక, కలిసి నడవాలి అనే మీ నిర్ణయం వలన మాత్రమే అయితే మంచిది.

మా అమ్మ ఇలా చేసేది, మా నాన్న ఇలా చేసేవారు లాంటివి మాట్లాడకూడదు. అంటే వాళ్ళని మర్చిపోవాలనో, గుర్తుతెచ్చుకోకూడదనో కాదు. పోల్చకూడదు అని. అమ్మా నాన్నలు చేసినట్టు మనకు ప్రపంచంలో ఎవరు చేయరు భార్య అయినా భర్త అయినా. అందుకే వాళ్ళతో పోల్చి పక్క వాళ్ళ నించి ఆశించకండి.భార్య అమ్మ ఎలా అవుతుంది. భర్త తండ్రి ఎలా అవుతాడు.

సాధారణంగా పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలు ఇంట్లో వున్నా సమయంలో తమ ఇంటి వాళ్ళ నుంచి ఫోన్ వస్తే పక్కవారిని ఎక్కడిక్కక్కడే వొదిలేసి బాల్కనీ లోకో, లేకపోతే ఇంటి బయటకి పోయి మాట్లాడుతుంటారు . అలా చేయడం వల్ల మీ భాగస్వామి తాను వేరు మీ కుటుంబం వేరు అని, లేకపోతే తన మీద మీరు ఏమైనా చెప్తున్నారు ఏమో అని ఓ అని ఊహించుకుని బాధపడిపోతుంటారు . ఇలాంటివి వారు బయటకు చెప్పటం బహు అరుదు.

కాబట్టి ఇక మీదట ఇద్దరు ఇంట్లో వున్నపుడు ఫోన్ వస్తే ముందు మీ భాగస్వామిని ఫోన్ ఎత్తి మాట్లాడమని ప్రోత్సహించండి కావాలంటే “తాను స్నానం చేస్తున్నాడు/చేస్తున్నది” అని చెప్పి ఒక పది నిముషాలు మాట్లాడే విధంగా చేయండి. తద్వారా ఇరువురికి తమ భాగస్వామి యొక్క కుటుంబంతో చక్కటి సాన్నిహితం కలుగుతుంది. కలగకపోయిన అధమపక్షం దూరం లేక అపార్థం వంటివి జరగవు. ఒక సదభిప్రాయం కలుగుతుంది.

తల్లి తండ్రులకి ఊరికే రోజుకో పది సార్లు ఫోన్ చేసి మా అయన ఇలా అన్నారు, మా ఆవిడ ఇలా చేసింది లాంటివి చెప్పకూడదు.

స్నేహితులతో పూస గుచ్చినట్టు మన ఇంట్లో విషయాలు అన్నీ చెప్పెయ్యకూడదు.

బంధం నిలవాలంటే

ఒకరి మీద ఒకరికి నమ్మకం విశ్వాసం చాలా అవసరం. ముందు తరాలవారు సాధారణంగా తెలిసిన వారిని బంధుత్వం కలిసిన వారితోనే వివాహాలు జరపడం వలన భార్యభర్తలు ఒకరికొకరు తెలిసి వారి స్వభావం కూడా తెలిసేది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబాలు కావడం వల్ల ఇబ్బందులొస్తే సర్దుబాటు చేయడం జరిగేది. కాలానుగుణంగా పరిస్థితులను బట్టి ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలయ్యాయి. తల్లిదండ్రులు ఇరువురు సంపాదనాపరులైతే కుటుంబాలుసాఫీగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడిచే పరిస్థితులొచ్చాయి. ప్రేమ వివాహాలు కులమత దేశ భాషల బేధాలను చెరిపి ఇరువురిని ఒకటిగా చేస్తున్నాయి. విద్య ఇరువురి సమానమైతే హక్కుల గురించి పోరాటాలు బలమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో భార్యభర్తలు ఒకరి మీద మరొకరు నమ్మకం కలిగుండడం తమ వైపు నుండి బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం చాలా ముఖ్యం. ఇరువురి వైపు నుండి సర్దుబాటు చేయడానికి మిత్రులు తప్ప మిగిలిన వారి ప్రమేయం లేకపోవడం సున్నితంగా ఆలోచించడం చాలా అవసరం. దానితో బంధం గట్టి పడి తమతమ బాధ్యతలు గుర్తుంచుకునేలా చేస్తుంది.

సూచనలు

పెళ్లి లో ప్రేమ కన్నా బాధ్యత కే ప్రాముఖ్యత ఎక్కువ. నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తాను అని మన మంత్రాలలో ఉండదు..అసలు ప్రేమ అన్న పదం వేదాలలో ఉందో లేదో… నేను నిన్ను ఎప్పుడూ విడువను, అతిక్రమించను అనే ఉంటుంది మన మంత్రాలలో. ప్రేమ ఒక భావన అది ఎప్పుడైనా ఎలాగైనా మారచ్చు. భావనలు, ఉద్వేగాలూ మారిపోతాయి. బాధ్యతలు అంత తేలికగా వదిలేవు కావు.

పెళ్లికి కావలసినది Compatability కాదు, companionship.

మేనరికం

భారతీయ వివాహ సంబంధాల ఆచారాల్లో మేనమామ కూతురు, అక్క కూతురిని చేసుకోవడం ‘మేనరికం ‘ అంటారు. ఇవి ఆచార సమ్మతమైన వివాహ సంబంధాలు. మేనత్త కూతుర్ని చేసుకోవడం ‘ ఎదురు మేనరికం ‘ అంటారు. మేనమామ కూతుర్ని చేసుకోవచ్చు. అక్క కూతుర్ని చేసుకోవచ్చు. మన సంప్రదాయం ప్రకారం మేనత్త కూతుర్ని చేసుకోరాదు.

ఈ మూడు వరసల్లో ఏది చేసుకున్నా, ఆ దంపతులకు పుట్టే సంతానం అవకరాలతో జన్మిస్తారని వైద్య శాస్త్రం చెబుతోంది. అవకరాలు లేకుండా పుట్టిన సందర్భాలు బాగానే వున్నాయి. ఒక తరం వరకూ కొంత పరవాలేదు. కానీ రెండు మూడు తరాలవారు మేనరికాలు చేసుకుంటే, ఖచ్చితంగా అవకరాలతో పిల్లలు పుడతారనడానికి చాలా దృష్టాంతరాలున్నాయి. బయటి సంబంధాలు చేసుకుంటే, ఆస్తులు బయటకు వెళ్లిపోతాయని చాలా మంది మేనరికాల వైపు మొగ్గు చూపుతున్నారు. బయటి అమ్మాయి, అబ్బాయి అలవాట్లు, ప్రవర్తన, సంప్రదాయం ఎలా ఉంటాయోనని భయపడి దగ్గర సంబంధాలు చేసుకోవడం పరిపాటి అవుతోంది.

రెండు మూడు తరాల్లో మేనరికాలు చేసుకుని, అవకరాలతో బిడ్డలు పుట్టడం, వారిలో చాలా మంది చనిపోవడం, వంశమే నిర్వీర్యం అయిన కుటుంబాలు ఎన్నో నేడు తప్పు చేశామని కుమిలిపోతున్నాయి. కాబట్టి, మేనత్త కూతురే కాదు, మేనమామ కూతురు, అక్కకూతురు సంబంధాలు కలుపుకోక పోవడమే శ్రేయస్కరం.

మేనత్త కూతురిని చేసుకోరాదనే నియమం వెనుక పెద్దల దూరదృష్టి ఉందనిపిస్తోంది. ఈ మేనత్త తన తల్లికి ఆడపడుచు కదా! ‘ ఆడ పడుచు అర్ధ మొగుడు ‘ అనే సామెత ఉందిగా. ఆమె తన వదిన గారిని కష్టాలు పెట్టడమో, అధికారం చెలాయించడమో చేసి వుండొచ్చు. ఇపుడు ఆమె కూతుర్ని తన కొడుకుకు చేసుకుంటే, పాతకక్షతో వచ్చిన అమ్మాయిని కష్టాలు పెడుతుందని… ఇలాంటి ఆచారం సృష్టించి వుంటారు.

మేనరికపు పెళ్లిళ్లా, జర ఆలోచించండి!

Consanguineous Marriage Risk And Doubts - Sakshi

మేనరికపు పెళ్లిళ్లు లేదా రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహాలు జరిగితే… వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో అంగవైకల్యాలు, ఆరోగ్య సమస్యలు ఎందుకొస్తాయో తెలుసుకుందాం. సంక్షిప్తంగా చెప్పాలంటే… బిడ్డకు తల్లి నుంచి 23, తండ్రి నుంచి∙23 క్రోమోజోములు వస్తాయి. ఈ క్రోమోజోములు తల్లిదండ్రుల నుంచి పుట్టబోయే బిడ్డలకు వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తాయి. కాసేపు దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాదని అనుకుందాం.

అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపభూయిష్టంగా ఉందనుకుంటే… తల్లి తాలూకు మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అవుతుంది. అదే తల్లిలో ఉండే లోపభూయిష్టమైన అదే తరహా జన్యువును తండ్రి తాలూకు జన్యువు డామినేట్‌ చేసి, బిడ్డలో లోపం రాకుండా చూస్తుంది. కానీ ఇద్దరూ ఒకే కుటుంబాలకు సంబంధించిన వారైతే ఒకవేళ ఇద్దరిలోనూ సదరు సమాచారాన్ని తీసుకెళ్లే జన్యువులో లోపం ఉందనుకుందాం. అప్పుడు దాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్‌ జన్యువు ఏదీ లేకపోవడంతో బిడ్డలో జన్యుపరమైన లోపం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.

పెళ్లి – భవిష్యత్తు బాధ్యతలు

పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తంతు అయినా, ఇద్దరి కుటుంబాలు, ఆ సభ్యుల భవిష్యత్తు కూడా వీరు ఇద్దరి పై ఆధార పడి ఉంటుంది. అమ్మాయి కేవలం భర్తను మాత్రమే దృష్టిలో పెట్టుకుని లేదా భర్తకు మాత్రమే చెందినది భావించడం ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం. అమ్మాయికి తన తల్లిదండ్రులు ఎంత ముఖ్యులతో, వారు శారీరకంగా , మానసికంగా బాగుండాలని ఎంతగా కోరుకోరుకుంటుందో, అబ్బాయి కూడా అంతే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అత్తమామల సేవ కోసమే అమ్మాయిజీవితం గడపాలని కోరుకునే వారి ఆలోచన లో ఎంత తప్పు ఉందో, పెళ్లి చేసుకున్న అబ్బాయి పట్ల తప్ప మరెవరి బాధ్యత తనది కాదని భావించడం కూడా అంతే తప్పు. అటువంటి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం లో తన బాధ్యత, అవసరం ఉందని అమ్మాయి తెలుసుకోవాలి.

అమ్మాయి అత్తవారింటికి ఎంత కొత్తో అత్తవారికి అమ్మాయి కూడా అంతే కొత్త కనుక కొన్ని అభిప్రాయ బేధాలు, అలవాట్ల లోని తేడాలు వల్ల, ఇరు వైపుల జరిగే చిన్న చిన్న తప్పుల్ని ఇద్దరు వదిలేస్తూ ఉండాలి. అమ్మాయి తన అమ్మగారింట్లో ఉండే వ్యక్తుల్ని ఎలా అయితే వారి ఇష్టాయిష్టాలు, గుణ దోషాలతో వారిని వారుగా స్వీకరిస్తూ ప్రేమించిందో అదే విధంగా అత్తవారింట్లో వారిని స్వీకరించే దృక్పథాన్ని అలవరచు కోవాలి. అలా స్వీకరించే మనస్తత్వం లేక పోవడం వల్లనే ఎన్నో కుటుంబాలలో చిన్న విభేదాలు ఆధారంగా అత్తమామలకు , కోడలికి పొసగక కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది.

క్రమంగా వారు శారీరికంగా బలహీనులు అయ్యాక వృద్దాశ్రమాలకు చేరే అగత్యం వస్తోంది. కుటుంబ కలహాలు ,వాటి కారణాలు నివారణ పై దృష్టి పెట్టిన న్యాయవాదులు, మానసిక శాస్త్రవేత్త లు ఈ విషయం తెలియజెప్పడం కోసమే పెళ్లికి ముందు కౌన్సిలింగ్ జరగాలని సూచిస్తున్నారు అంటే స్వీకరించడం అనే ఒక గుణం ఎంత తక్కువ గా ఉందో దాని తాలూకు పర్యవసానాలు ఎంత బాధాకరం గా ఉన్నాయో ఊహించ వచ్చు.

వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చెయ్యాలంటారు

వెయ్యి అబధ్ధాలు అనేది అతిశయోక్తి మాత్రమే. సాధారణంగా ఎవరూ సమస్త సద్గుణసంపన్నులు కారు.ప్రతి వధువు, వరుని లోఏదో ఒక చిన్న లేక పెద్ద లోపం ఉంటుంది. కానీ వారు వైవాహిక జీవితానికి పనికి వస్తారు.ఇలా సంప్రదింపులు జరిపే టపుడు 99 విషయాలు నిజమే.చెబుతారు.ఏదో ఒక విషయాన్ని కప్పిపుచ్చుతారు. .ఇది కొంత వరకు సమర్ధనీయమే.కానీ చదువు, ఉద్యోగం. లేదా.ఆరోగ్య విషయాలలో అబధ్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు.

ఈమధ్య ఇలాంటి వి కొన్ని చూస్తున్నాము.ITC లో ఉద్యోగం. అని చెబుతారు. పెళ్ళయిన తర్వాత తెలిసిందేమిటంటే అతను ITC లో చిన్న కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఇలాగే ఒక అబ్బాయి దుబాయ్ లోఉద్యోగం చేస్తున్నాడు అని నమ్మించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అతను దుబాయ్ వెళ్లి పోయాడు.ఎన్నాళ్ళకు భార్యకు వీసా.పంపించ లేదు.చివరకు ఎంక్వైర్ చేస్తే అతను అక్కడ ఒక అధ్యాత్మిక కేంద్ర ము లో పని చేస్తున్నాడు. అతనికి జీతం ఏమి ఉండదు ఎక్కువగా. వసతి,భోజనం మాత్రమే కల్పిస్తారు.అతని కుటుంబసభ్యుల ను తీసుకుని వచ్చేందుకు అనర్హుడు.

ఇలా కావాలని అబధ్ధాలు ఆడినవారు తమ చర్యను సమర్ధించుకొనేందుకు పుట్టించిన సామెత.

వివాహం vs సహజీవనం

వివాహం అనేది ఒక వ్యవస్థ- ఏ దేశంలో అయినా దాని మూలాలు, భూమికి, గొడ్డుకీ ప్రతిగా వారసుడిని ఇచ్చి, పనికి వచ్చే పిల్లలను కనిచ్చే ఒక ఆడమనిషిని ఇవ్వడంతో మొదలయ్యింది. కాల క్రమేణా ఆ వ్యవస్థ రూపాంతరం చెందింది. ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఆడవారికి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు కాబట్టి, నచ్చినా నచ్చకున్నా, వివాహాలలో ఉండేవారు. విడాకులు అనే చట్టం మన దేశానికి వచ్చి గట్టిగా 75 ఏళ్ళు కాలేదు, అంత మాత్రం చేత మన వ్యవస్థ అద్భుతమని, న భూతో న భవిష్యత్ అని 90ల లో వచ్చిన తెలుగు సినిమా డైరెక్టర్ లాగా మనం భుజాలు తట్టేసుకో అక్కర్లేదు.

సహజీవనం అనగానే ప్రతి ఒక్కరూ ఊహించుకునేది, ఇవాళ ఒకరితో, రేపు ఇంకొకరితో అని, మన ఆలోచన అక్కడితో ఆగిపోతుంది, అటువంటి ఆలోచన ఉన్న వారు పెళ్ళి చేసికొని, సమాజానికి భయపడి ఉంటారే తప్ప తమకీ తమ మనసుకు విలువ ఇవ్వరు. నేను పెళ్ళి చేసుకున్నాను కాబట్టి నేను గొప్ప, వాళ్ళు నాకంటే భిన్నంగా ఉన్నారు కాబట్టి వారు కుక్కలతో సమానం.. ఇలా ఉంటాయి మాటలు..

ఏ వ్యవస్థ అయినా, అందులోని మనుషులని బట్టే ఉంటుది… అది పెళ్ళైనా, సహజీవనం అయినా..

పెళ్లికి, దానంతట దానికే ఏ గొప్పతనం ఉండదు మనం ఆపాదిస్తే తప్ప.. అలాగే సహజీవనానికి కూడా.. దానంతట దానికి ఏ అవలక్షణం ఉండదు మనం ఆపాదిస్తే తప్ప! మన వివాహ వ్యవస్థలో లోపాలు— ప్రేమ రాహిత్యం, వర కట్నం, ఆడవారిని తక్కువగా చూడడం, గృహహింస

అలానే, సహజీవనం లో కూడా లోపాలు ఉంటాయి.. అని మనం ఉండదలచిన వ్యక్తిని బట్టి, మనని బట్టి ఉంటాయి.. అంతే కానీ, భారతీయులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని పెళ్ళి గొప్పదైపోదు.. పాశ్చాత్య దేశాల వారు సహజీవనం చేస్తున్నారు కాబట్టి అది చెడ్డదీ అయిపోదు.

జీవితంలో పెళ్లి చేసుకోకపోతే వచ్చే సమస్యలు

మీ గురించి ఆలోచించే వ్యక్తి వుండరు, ఇప్పుడు అమ్మ నాన్న ఇంకా మీ సహోదరులు ఉండొచ్చు ఏమో మరి భవిష్యత్తులో వీళ్ళు గతిస్తే మీ గురించి ఆలోచించే వారు, పట్టించుకునే వారు ఉండరు. పెళ్లి అయితే మీ పనుల్ని పంచుకునే భాగస్వామి ఉంటుంది. శారీరక శ్రమ కొద్దిగా తగ్గుతుంది. పెళ్లి చేసుకోకపోతే, వయస్సుతో పాటు శ్రమ కూడా పెరుగుతుంది.

మనలో పరిపక్వత పెరగడానికి చాలా సమయం పడుతుంది. అదే పెళ్లి చేసుకుంటే త్వరగా వస్తుంది. పెళ్లి చేసుకోకపోతే మనలో విశాలత్వం, సూక్ష్మత్వం, మృదు స్వభావం ఇవి అన్ని లోపిస్తాయి,

గుండెని ఆకాశంలా పరచడం,

కంటి చూపుని సీతాకోకపై నిలపడం

విశాలత్వం, సూక్ష్మత్వం…

రెండు కలవాడు మనిషి.

పెళ్ళి ఏ వయస్సులో చేసుకోవాలి

పెళ్ళి అనేది కేవలం ఒక తంతు కాదు. వైవాహిక జీవితం సవ్యంగా సాగాలి అంటే ఆర్ధిక, మానసిక, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందరికీ చిన్న వయస్సులోనే ఆర్ధికబలం చేకూరదు. అలానే మానసిక సంసిద్ధత ఉండదు. భయాలు, అపోహలు ఉంటాయి. కొందరి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి.

జీవితంలో పెళ్ళంటూ చేసుకోవాలి కాబట్టి కానిచ్చేద్దాం అని చేసుకోకూడదు. అది ఎవరికీ మంచిది కాదు. అన్ని రకాలుగా ఆలోచించుకుని, ఒక బాధ్యతాయుతమైన వైవాహిక జీవితానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నప్పుడే చేసుకోవాలి.

అలానే 24-28 ఏళ్ళ వయస్సులో చేసుకోవటంలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని నా అభిప్రాయం.

  1. అన్నింటికంటే ముఖ్యమైనది దంపతులకు జీవితాన్ని కాస్త ఆస్వాదించే సమయం, వెసులుబాటు ఉంటుంది. వయస్సు మీద పడ్డాక పెళ్ళి చేసుకుంటే సంతానమే మొదటి ప్రియారిటీగా ఉంటుంది.
  2. ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు కనుక వీలైనన్ని విహారయాత్రలకు, ప్రయాణాలకు వెళ్ళొచ్చు.
  3. కెరీర్‌లో కూడా ప్రాధమిక స్థాయిలో ఉంటే ఒత్తిడి తక్కువగా ఉండి ఒకరికొకరు సమయం ఇవ్వగలుగుతారు. దాని వల్ల ఒకరినొకరు బాగా అర్ధం చేసుకునే వీలుంటుంది.
  4. 24-28 వయస్సులో ఉంటే ఇంకా పూర్తిగా తల్లిదండ్రుల నీడ నుండి బయటకి రాకపోవటం వల్ల, పూర్తిగా ఇండిపెండెంట్ లైఫ్‌కి అలవాటు పడి ఉండరు. నా జీవితానికి నేనే రాజు/రాణి, నా మాట వినాల్సిందే అనే పట్టుదల ఉండే అవకాశాలు తక్కువ. ఆ స్థితిలో కొత్త వ్యక్తులను త్వరగా జీవితంలోకి ఆహ్వానించగలుగుతారు.

30లోకి వచ్చినవాళ్ళు కెరీర్‌లో ఒక స్థాయికి వచ్చేసి, ఆర్ధికంగా స్థిరపడి, వీలైతే సొంత ఇల్లు కొనేసుకుని ఉంటారు. అప్పటికి ఒక నిర్ధిష్టమైన జీవితానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఎంతలా అంటే ఎన్నింటికి తినాలి, ఎన్నింటికి పడుకోవాలి, ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, తాగేసిన టీ కప్ ఎక్కడ పెట్టాలి, ఇంటిలో కుక్కలు, మొక్కలు ఉండాలా? వద్దా?

ఇలా ప్రతి విషయంలోనూ నిశ్చితమైన అభిప్రాయాలు ఏర్పడి ఒక ఇండిపెండెంట్ జీవితానికి అలవాటు పడిపోయుంటారు. అలాంటి స్థితిలో తమ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తిని ఆహ్వానించటం అంత తేలిక కాదు. మన అభిప్రాయాలతో ఎదుటి వారిని బేరీజు వేస్తూ ఉండటం వల్ల ఎప్పటికీ వారికి దగ్గరకాలేము. అలానే కొత్తగా మన జీవితంలో అడుగుపెట్టాలనుకునే వాళ్ళకి మన ఇష్టాలు, పద్దతులు ఆంక్షలుగా కనిపించి భయపెడతాయి.

ఏది ఏమైనా పెళ్ళికి మానసిక సంసిద్ధతే అవసరమైనది. అలా ఇరువురు సిద్ధపడి చేసుకుంటే వయస్సు పెద్ద సమస్య కాదు.

వివాహ జీవితాన్ని దెబ్బతీసే అత్యంత చిన్న చిన్న విషయాలు ఏమిటి? ఈ విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

వివాహ జీవితం చాలా అందమైనది మరియు ముఖ్యమైనది. మానవ మనుగడ కోసం మరియు మన సుఖం కోసం వివాహం అనే ఒక బలమైన వ్యవస్థను మనం (అనగా మన మానవ జాతి) ఏర్పాటుచేసుకున్నాము. మానవుడు మనిషిగా పరిణామం చెందుతూ, మనలో ఉన్న యానిమల్ ఇన్స్టిక్స్ తో వచ్చే ఇబ్బందులను హేతుబద్దంగా అధ్యయనం చేసి వివాహం యొక్క నియమాలను, వివాహ చట్టాలు మన సుఖం కోసం లేదా మనుగడ కోసం మనం ఎర్పరుచుకున్నాం. వివాహ జీవితం ఎంత అందమైనదో, అంతే కఠినమైనది. ఇద్దరు ఆలోచనలు, వ్యక్తిత్వాలు, బాధ్యతలు, కలసికట్టుగా జీవితాంతం ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ప్రేమ ఆప్యాయతల మధ్య ప్రయాణం సాగించాలి అంటే ఎంతో ఓర్పు, సహనం అవసరం. ఈ ప్రయాణం మధ్యలో అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఎన్నో చిన్ని చిన్న కారణాలు పెద్దవిగా మారి దంపతులు విడిపోవడానికి కారణాలవుతున్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం,

వివాహ జీవితంలో తొందరగా అడుగు పెట్టే మహిళలకు, అంటే లేత(18–24) వయసులోనే వివాహం జరగడం, అది కూడా తమకంటే మరీ ఎక్కువ వయసు ఉన్న భర్తను చేసుకోవడం ద్వారా వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు రావడం తరుచుగా జరుగుతుంది. దీని ముఖ్య కారణం ఇద్దరి ఆలోచనల మధ్య చాలా ఎక్కువ వ్యత్యాసం ఉండడంతో వచ్చే మనస్పర్థాలు. ఆడపిల్లలకు సొంత నిర్ణయాలు మరియు ఒక బంధాన్ని నిలబెట్టుకునే పరిపక్వత కొన్ని సార్లు రాకముందే వారికి పెళ్లి చేయడంతో కొంత వివాహ జీవితంలో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్. వారి ఆలోచనావిధానం గురించి ఒకరికొకరు మనసువిప్పి మాట్లాడుకోవటం, తమ అభిప్రాయాలను మరియు కొరికలను నిర్భయంగా పంచుకోవటం చాలా ముఖ్యం. అదేవిదంగా ఆడపిల్లలకు మరియు మగవారికి పూర్తి పరిపక్వత వచ్చిన తరువాత వారికి మనసుకు నచ్చిన వారితో పెళ్లి జరిపించడం ఒక మార్గంగా కనిపిస్తుంది.

గత మూడు దశాబ్దకాలం నుండి మన దేశం లో వేగంగా మారుతున్న పరిస్థితులు, ఉదాహరణకు మార్కెట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు, ఆధునిక పట్టణ జీవనా విధానం, తీరికలేని జీవనం మన వివాహ జీవితం లో చాలా మార్పులను తీసుకొచ్చింది. భార్య భర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వలన, ఇద్దరు కలిసి విలువైన సమయమును గడపకపోవడం వలన కూడా వివాహ జీవితం లో చాలా సమస్యలకు దారి తీస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గం, భార్య భర్తలు తమ వివాహ జీవితం ఎప్పటికపుడు విశ్లేషకుంటూ ముందుకు సాగడం మరియు కమ్యూనికేట్ చేసుకోవడం.

ఇక భార్య భర్తలు వృత్తి పరంగా మంచి స్థాయిలో ఉన్నాకూడా, సమాన గౌరవం ఇచ్చిపుచ్చు కోకపోవడం ద్వారా కొంత ఈగో సమస్యలు ఎక్కువయ్యి దాంపత్య జీవితంలో ఆటుపోట్లు ఎదురుకుంటున్నారు . దీనికి ముఖ్యంగా ఇరువురి దంపతులు వారు వృత్తిపరంగా ఎంత స్థాయిలో ఉన్నా కూడా, ఇంట్లో ఇద్దరు సమానమే అని గుర్తించకపోవడం. ఎల్లపుడు ఒకరినిఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగడం వివాహ జీవితంలో చాలా ముఖ్యం.

భర్త మరియు భర్త తరుపున కుటుంబంలో (కొన్ని తక్కువ సంఖ్యలో భార్య తరుపున కుటుంబంతో) వారి జోక్యం ఎక్కువగా ఉండడం వలన దంపతుల మధ్య ఎక్కువగా సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. వర కట్నం, అర్ధాంగి మీద ఎక్కువ అంచనాలు, కుటుంబంలో మనస్పర్థాలు వంటి సమస్యలు చిలికి చిలికి గాలివాన లా మారి వివాహ జీవితం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ముందుగా భార్య భర్తలు వివాహ జీవితంలోకి అడుగు పెట్టాక వారిరువురు తమ దాంపత్యజీవితం లోకి మూడో వ్యక్తిని రానివ్వకుండా చూసుకోవడం వారి బాధ్యత. పెద్దల దగ్గర సలహాలు తీసుకోవచ్చు కానీ ఒకరు దాంపత్య జీవితం మీద మూడో వ్యక్తి పెత్తనం ఉండకుండా చూసుకోవడం కూడా దంపతుల బాధ్యతే!

పితృస్వామ్య భావజాలం ఇంకా మన సమాజంలో ఉండడం, దాని పర్యవసానాలుగా భర్త భార్యను బానిసగా చూడడం, సమాన హక్కు ఉందని గుర్తుంచకపోవడం చాలా సమస్యలకు దారితీస్తుంది అలాగే భార్య భర్తనుండి ఎక్కువ అంచనాలతో అనేకమైనటువంటివి ఆశించడం వివాహ జీవితంలో సమస్యలుగా కనపడుతున్నవి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు తమ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు హేతుబదంగా విశ్లేషించుకుని, అవసరమైతే ఫ్యామిలీ కౌన్సిలర్స్ ని సంప్రదించి తమ ఆలోచన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది!

ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, ఆరోగ్య సమస్యలు, సెక్స్ జీవితంలో ఇబ్బందులు, అధికంగా ఉండే వ్యసనాల వలన చాలా దంపతుల మధ్య చిన్ని చిన్న సమస్యలు పెద్దవిగా మారి దాపత్య జీవితం మీద తీవ్రమయిన ప్రభావం చూపుతాయి. ఆర్థికంగా మన స్థాయిని బట్టి మన జీవన విధానాన్ని సాగించడం, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం (ఇది మన యానిమల్ ఇంస్టింక్ట్ ద్వారా కొన్ని సార్లు జరిగే అవకాశం ఉన్నా, మనం వివాహ బంధానికి కట్టుబడి, మన దాoపత్య జీవితం లో ఉన్నా ప్రేమ ఆప్యాయతతో అధిగమించవచ్చు), ఆరోగ్య సమస్యలు రాకుండా రోజు కొంత వ్యాయామం, మన ఆరోగ్యం పట్ల శ్రద్ద, సెక్స్ జీవితం గురించి కమ్యూనికేషన్, ఇబ్బందులు ఉంటె డాక్టర్ల సహాయంతో అధిగమించ వచ్చు.

ఒక సమస్యను చిన్నగా ఉన్నపుడే గ్రహించి, దాన్ని ఓపికతో, హేతుబదంగా పరిష్కరించుకుంటే వివాహజీవితం సాఫీగా సాగుతుంది.

GLOBAL OPINIONS ABOUT MARRIAGE

After marriage, husband and wife become two sides of a coin, they just can’t face each other, but still they stay together.
– Al Gore

By all means marry. If you get a good wife, you’ll be happy. If you get a bad one, you’ll become a philosopher.
– Socrates

Wife inspires us to great things and prevent us from achieving them.
– Mike Tyson

I had some words with my wife, and she had some paragraphs with me.
– Bill Clinton

There’s a way of transferring funds that is even faster than electronic banking. It’s called marriage.
– Michael Jordan

A good wife always forgives her husband when she’s wrong.
– Barack Obama

When you are in love,
wonders happen.
But once you get married, you wonder, what happened.

  • Steve Jobs

And the best one is…

Marriage is a beautiful forest where Brave Lions are killed by Beautiful Deers.

  • Brad Pitt

Husband and the Wife are Two Halves of a Whole

Over the past years, equality in marriages has been picking up pace among the married couples. Earlier, back in the ages, a constitution of marriage used to get fame where the code of conduct stated that the breadwinner of the family will always be a man only. Globally, equality in marriages used to be seen over the past few decades. Gender inequality was visible and used to grow other types of inequality between a married couple.
From the outset, the emphasis focused on accomplishing equivalent opportunities and chances for women in the paid workforce. Lately, attention has concentrated on the disparities among married couples in the sharing of the obligations of unpaid work at their homes. Without a doubt, a late Gallup Poll of 1,234 haphazardly chose grown-ups from over the nation found that 57% of the populace presently says that the perfect marriage is one in which both the husband and the wife have occupations and share in the responsibilities of their children’s upbringing and thinking about the home (DeStefano and Colasanto, 1990). The developing enthusiasm for these issues among the general public is resembled by an expanding number of researches of equality by social researchers. Those keen on the psychology of equity have explored the degree to which fairness, as contrasted and different standards of equity, is related to the dependability of connections and the relative fulfilment of the two accomplices.
Family sociologists have been interested in issues of family power and in recognizing the components that add to shifting degree of fulfilment and mental prosperity in dual-earner relationships. These investigations show that, in spite of the developing open underwriting of uniformity, most relationships keep on being unequal. Incomprehensibly, the same writer gives developing proof of the advantages of fairness. Progressively equivalent connections are related with more noteworthy fulfilment for both accomplices and with improved mental prosperity, especially, it appears, for ladies. Why, at that point, does disparity continue? A few clarifications have been offered, yet none appears to enough clarify the disparities of marriage.
Equality in marriage implies individuals grumbling about their rights being disregarded. In the past, numerous rights have been perceived that are presently underestimated. This specific theme – uniformity in marriage – could emerge from any number of gatherings in the public arena. It could be ladies whining that they need to do the vast majority of the housework. It could be men complaining that Western courts will side with the mother if separation happens between them. It could also be individuals who need to wed somebody of similar sex, griping that their privileges are being abused by conventional marriage rehearses. Last but not the lease, It could be women activists grumbling that marriage brings out and stresses numerous distinctions in expectations of the people.
Equality in a marriage means that both the husband and the wife are two halves of a whole, with equal rights and responsibilities. It must be positioned on the possibility that, as people, we are equivalent; no better, or more terrible, than the other.

అరుంధతి-వశిష్ట జంట నక్షత్రాలు

మన భారతదేశ జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం: Important to know our culture::

వివాహ మహోత్సవ సంధర్భంలోనే భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారా అన్నట్లుంది ఈ ప్రక్రియ:: ఒక సారి చూడండి..
5,000 – 7,000 ఏళ్ళ క్రితమే జంట నక్షత్రాల గురించి మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులకు తెలుసు. అందుకే మన ఆధునిక శాస్త్రజ్ఞులు కనుగొన్న15వ అత్యంతకాంతివంతమైన నక్షత్రాన్ని మన వారు ఎప్పుడోగుర్తించగలిగారు.. మనము దీనినే జ్యేష్టా నక్షత్రం అంటున్నాము… ఇప్పుడు సైన్సు ఇది భూమి కంటే 40,000 రెట్లు పెద్దద(జ్యేష్టమ)ని గుర్తించగలిగింది.. ఈ జంట నక్షత్రాలను అరుంధతి-వశిష్ట నక్షత్రాలు అని పిలుచుకుంటున్నాం.. ఈ జంట నక్షత్రాలను మరింత ముందుకు తీసుకువెళ్ళి మన వివాహంలో ఒక తంతుకు కూడా ముడి పెట్టారు.. మామూలుగా అయితే ఒక గ్రహం వేరొక గ్రహం చుట్టూ మాత్రమే తిరుగుతాయి.. కానీ ఈ జంట నక్షత్రాలు మాత్రం ఒకదానిచుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి.. ఇంకా చెప్పాలంటే దస్తీ బిస్తీ అని తిరుగుతూ ఆడుతూ ఉంటాం చూడండి అలాగన్న మాట.. దీనినే ఒకరకంగా హోమగుండం చుట్టూ ఒకరి వేలు పట్టుకుని మరొకరు తిరిగినట్లుగా చూపుట, వివాహానంతరం ఈ జంట నక్షత్రాలను చూపుటలో భార్యా భర్తల మధ్య సoబంధం ఇలాచూపారేమోనని ఒక అభిప్రాయం.
అయితే 5,000 ఏళ్ళ క్రితమే ఎటువంటి టెలిస్కోప్ లు లేకుండా ఈ నక్షత్రాల భ్రమణ పద్దతులను అధ్యయనం చేయగలిగారంటే నిజంగా అద్బుతమే…