ప్రేమ ఓ ఊహ – పెళ్ళి రియాలిటీ

9 , 10 వ తరగతి చదువుతున్న అమ్మాయిల దగ్గరనుండి ఇంటర్ , డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు కూడా కొంతమంది ఇలానే ఆటో డ్రైవర్లతోనూ , బైక్ మెకానిక్ లతోనూ లేదా తమతోపాటే చదువుకునే వ్యక్తితో ప్రేమలో ఉన్నామనుకొని ఇలా ఇంట్లో వాళ్ళకి చెప్పాపెట్టకుండా పెళ్ళిళ్ళు చేసేసుకోవడం , మరలా రెండంటే రెండే వారాల లోపు ” వాడితో కలిసి నేనుండలేనని ” తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేయడం.

ప్రేమకి ఓ అమ్మాయి , ఓ అబ్బాయి ఉంటే చాలు – కానీ పెళ్ళికి కుటుంబం ” కూడా ” ఉండాలి – వివాహానంతరం జీవితంలో చాలా అంశాలుంటాయి – అవి పెద్దల సపోర్ట్ లేకుండా ఇద్దరూ సమన్వయం చేసుకు జీవించడం చాలా కష్టం ” – కనుక తాత్కాలిక ఆవేశాలతో ఇటువంటి అనాలోచిత చర్యలు చేయకండి

ఇద్దరికీ తమకంటూ ఓ సొంత వ్యక్తిత్వం , జీవితం ఏర్పడ్డాక ఉండే జీవితం వేరు – అసలు మీ జీవితం పట్ల మీకే ఓ అవగాహన రాకుండా ఇంకోకరిని జీవితంలోకి ఆహ్వానించడం నిజంగా అర్ధం లేని చర్య , మహా మూర్ఖత్వం – జీవితం ఊహించినంత గొప్పగా అయితే ఉండదు ఇటువంటి చర్యలతో

ప్రేమలో ఉన్నప్పుడు ఆకర్షణ రియాలిటీని కప్పేస్తుంది – ఆకర్షణ పొరని పక్కనపెట్టి మనసును సమర్ధించుకోకుండా ఎదుటి వ్యక్తిలో మంచి చెడూ రెండూ సహేతుకంగా బేరీజు వేసుకొని కానీ రిలేషన్ లోకి వెళ్ళకండి

ప్రేమలో ఉన్నప్పుడు నచ్చిన అంశాలే పెళ్ళయ్యాక నచ్చకపోవడానికి ప్రధాన కారణాలవుతాయి కొన్నికొన్ని విషయాలలో

అవతలి వ్యక్తి ” ఇలా ఉంటున్నాడు / ఉంటుంది కాబట్టి ప్రేమిస్తున్నాను ” తరహా ఆలోచనతో బంధంలోకి ఎంటర్ అవ్వద్దు – అలా ఎదుటి వ్యక్తి ఇలా ఉంటే నచ్చుతాడని అనుకొని ఆ తర్వాత తర్వాత అలా లేకపోతే మీ expectation దెబ్బతిని అవే కారణాలు ఎదుటివ్యక్తిని ద్వేషించడానికో లేక మీరు బాధపడడానికో కారణాలవుతాయి – కనుక ఏవో కొన్ని గుణాలు ఎదుటి వ్యక్తిలో చూసి రిలేషన్ లోకి ఎంటర్ కావడం కన్నా ఎదుటి వ్యక్తి బలాలూ , బలహీనతలపై ఓ స్పష్టత ఏర్పడి ” రియాలిటీని కూడా సమన్వయం చేసుకోగలను ” అనే సన్నద్ధత ఉంటే కానీ బంధంలోకి వెళ్ళకపోవడమే మంచిది

ఇద్దరు ఒకే చూరు కింద నివసించాల్సి వస్తే ఎదురుకోవాల్సిన ” రియల్ లైఫ్ ” అంశాలు అనేకముంటాయి – వీటికన్నిటికీ ఆర్ధికపరమైన స్థిరత్వం చాలా అవసరం – మిమ్మల్ని మీరు పోషించుకునే స్థాయి కూడా కలగకుండా బంధంలోకి అప్పుడే వెళ్ళడం భవిష్యత్తులో చాలా ఇబ్బందులకి దారితీస్తుంది

మన ఆలోచనలు , మన చేతల ప్రతిఫలమే మన జీవితం.

ప్రేమలో విఫలం – సూచనలు

మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల బుర్ర పాడవుతుందే తప్ప పీకేదేమీ ఉండదనే ప్రాక్టికల్ నిజాన్ని గ్రహించడానికి ట్రై చేయండి … అలాగే మీ ఆ రిలేషన్ ముగిసేటప్పుడు కూడా కాస్త మెచ్యూర్డ్ పీపుల్లా బిహేవ్ చేయడానికి ప్రయత్నించండి … అంటే ఇంకెలాగో కలిసి బ్రతకడం‌ కుదరదని తెలిసినప్పుడు కనీసం అవతలి వ్యక్తికి భవిష్యత్తులో మీ విషయమై ఆలోచించినప్పుడు ఏ విధమైన బాధా లేకుండా ” నువ్వు లేకపోయినా నా లైఫ్ ని నేను బానే లీడ్ చేయడానికి ప్రయత్నిస్తాలే నాశనమేదీ చేసుకోకుండా ” అనే భావం కలిగేట్లు ప్రవర్తించండి… సాధ్యమైనంతవరకు ఒకరినొకరు నిందించుకోకుండా స్నేహితులుగానే విడిపోండి మనస్పూర్తిగా కారణాలు వివరించుకొని

దానివల్ల అవతలి వ్యక్తికి మీ పట్ల గిల్ట్ ఫీలింగ్ ఉండదు … మీకూ అకస్మాత్తుగా విడిపోవడం కన్నా ఇలా మాట్లాడుకొని విడిపోవడం వల్ల అంత పెయిన్ ఉండకపోవచ్చు

2. కొన్ని రోజులు Social Media కి దూరంగా ఉండండి ,, అలాగే తన తాలూకు మెమోరీస్ ఏవీ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించకండి… తన తాలూకు చాటింగ్ కాన్వర్జేషన్స్ కానీ ఫొటోస్ కానీ డెలీట్ చేసేయండి.. దీనివల్ల తనని మళ్ళా మళ్ళా తల్చుకుని తల్చుకుని బాధపడడం సగానికి పైగా తగ్గచ్చు..

3. సంగీతం అస్సలు వినకండి… అది హ్యాపీ మూమెంట్ కి సంబంధించినదైనా బాధాకరమైనదైనా మళ్ళీ పాత గాయాన్ని లేపేదిలా ఉండవచ్చు

4. సాధ్యమైనంతవరకూ ఒంటరిగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి… మీకిష్టమైన పని ఎక్కువగా చేయండి.. బోలెడన్ని వ్యాపకాలు కల్పించుకోండి… ఎక్కువగా మనుష్యులమధ్య గడపండి.. మూడీగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి.. మీకెంత బాదున్నా అది మొహంలో కనపడకుండా ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించండి.. అలాగే ప్రతీ ఫ్రెండ్ గ్రూప్ లో నాలా ఇలా ఒకడు జీవితం గురించి మాట్లాడుతున్నట్లు ఉంటాడుగా? అలాంటి వాడితో ఏదో ఏడుస్తూ సానుభూతి పొందడానికన్నట్లు మాట్లాడకుండా ఇలా విశ్లేషణాత్మకంగా మాట్లాడడానికి ప్రయత్నించండి.. అది కాస్త ఉపశమనమనిపించి మీరు మీ బాధనుంచి తొందరగా కోలుకోడానికి ఉపయోగపడవచ్చు.

5. ప్రేమలో విఫలమైతే చాలామంది సినిమాటిక్ గా మందు తాగడమో,, సిగరెట్లు తాగడం లాంటి వ్యసనాలకు అలవాటుపడుతున్నారు మన జనరేషన్ లో .. దానికన్నా మనసుని దిటవపరుచుకునేందుకు మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి.. అలాగే గడ్డాలు పెంచేసి సరైన తైలసంస్కారం లేకుండా జుట్టును వదిలేయకుండా చక్కగా క్లీన్ షేవ్ చేసుకుని అద్దంలో మిమ్మలని మీరు చూసుకుంటూ నవ్వడానికి ప్రయత్నించండి.. అలాగే శరీరాన్ని ఉత్తేజపరిచేలా ఏ జిం లోనో జాయిన్ అయ్యి చక్కగా వర్కవుట్స్ చేయండి..

6. వీలుకుదిరితే మానసిక ప్రశాంతత కొరకు మీ ఫ్రెండ్స్ తోనో,, లేదా మీ రిలేటివ్ తోనో దూరంగా ఏదో ఓ ప్రదేశానికి వెళ్ళి కాస్త ఈ రెగ్యులర్ ఫీల్ పోగొట్టుకోడానికి ప్రయత్నించండి,, దానివల్ల మనసు కాస్త రీ ఫ్రెష్ అవ్వచ్చు

” జీవితమెప్పుడూ ఒకరివల్ల ఆగదు,, ఒకరితోనే ఆగదు – సో పరిస్థితులెలాంటివెదురైనా బ్రతుకుపట్ల కుతూహలాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకండి “

#LifeGoesOn

వాలెంటైన్‌ డే – కలర్‌ డ్రెస్సింగ్

Colours and Their Meaning on Valentine Day - Sakshi

వాలెంటైన్‌ డే ను అర్ధవంతంగా, ఆనందంగా జరుపుకోవాలనే వారు ఈ రోజుకోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఆ రోజున నచ్చిన వారికి గులాబీలను, కానుకలు ఇచ్చి తమ ప్రేమను పంచుకుంటారు.

నీలం: ఈ రంగు డ్రెస్‌ను వాలెంటైన్‌ డే రోజున ధరిస్తే ‘ఎవ్వరితోనూ ప్రేమలో లేను’ అనే అర్ధమట. 

ఎరుపు: ఎలాంటి సందేహం లేకుండా ప్రేమకు చిహ్నంగా ఈ రంగును వాడుతూనే ఉంటారు. ఎరుపు రంగు డ్రెస్‌ ధరిస్తే ‘ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు’ అని గుర్తు అట. 

పచ్చ:  ‘ఆశ’ను చిగురంపజేసే సుగుణం ఆకుపచ్చ రంగుకు ఇచ్చేశారు. సో.. ఎదురుచూడండి అని చెప్పకనే చెబుతున్న విషయమట.

ఆరెంజ్‌ ప్రేమికుల రోజున నచ్చినవారికి ‘ప్రపోజ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు’ అన్నమాటట. 

నలుపు: హాట్‌ కలర్‌గా పేరున్న రంగు నలుపు. ఈ డ్రెస్‌లో ఎవరినైనా ఇట్టే కట్టిపడేయచ్చు. కానీ, ప్రేమికుల రోజున దీనిని ధరిస్తే మాత్రం ‘విఫల ప్రేమ’కు అర్ధమట. 

తెలుపు: ఈ రంగు ప్రేమికుల రోజున ఎదుటివారికి మనల్ని ఎలా పరిచయం చేస్తుందంటే.. మీకు ‘వేరొకరితో ‘పెళ్లికి నిర్ణయమైపోయింద’ని అర్ధమట.

పసుపు: ఎలాగూ ఈ రంగు గురించి తెలిసిందే సింపుల్‌గా ‘ఫ్రెండ్‌షిప్‌’ అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఈ రోజున కేవలం స్నేహానికే నా ప్రాముఖ్యత అని పసుపు రంగు డ్రెస్‌ ద్వారా తెలియజేయడం. 

బూడిద: ‘నా కెవ్వరిమీదా ఇంట్రస్ట్‌ లేదు’ అనే వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం గ్రే కలర్‌ ఇస్తుందట. 

పింక్‌: గులాబీ రంగును ప్రేమికుల రోజున ధరించారు అంటే మీరు ‘ప్రపోజల్స్‌కి సిద్ధం’గా ఉన్నారని అర్ధం వస్తుందట. అందుకని, పింక్‌ డ్రెస్‌ ధరించేవారు కొంచెం ఆలోచించుకోవాలట. 

పర్పుల్‌: వంగపండు రంగు అంటారు దీన్నే. ‘మొదటి చూపులోనే ఎవరితోనో ప్రేమలో పడ్డారు’ అని తెలిసిపోతుందట. 

పీచ్‌: ‘నాకు ఫ్రెండ్స్, పార్టనర్‌ లేరు’ అనే భావం వస్తుందట. ఎదుటి వారు కొంత జాలి కూడా చూపుతారట. అందుకని, పీచ్‌ కలర్‌ డ్రెస్‌ ధరించేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిదట. 

ప్రేమ – నిర్వచనం

పవిత్రమైనది, అగ్ని లాగా స్వచ్చమైనది, ప్రపంచాన్ని నడిపించేది ప్రేమే.

భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ , అల్లూరి సీతారామరాజు కి ఉన్నది అటువంటి ప్రేమ దేశం మీద

మదర్ థెరిస్సా, డొక్కా సీతమ్మ గారి వంటి వారికి ఉన్నది అటువంటి ప్రేమే – ప్రజల మీద

ప్రతి తల్లి దండ్రులకి ఉండేది కూడా అదే ప్రేమ – పిల్లల ప్రయోజకత్వం మీద

భార్య భర్తలకు ఉండేది అదే ప్రేమ – జీవిత భాగస్వామి మీద

ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలైన ప్రేమ ఇద్దరు పెళ్లి కానీ స్త్రీ పురుషుల మీద అంటే మాత్రం ఇక్కడ మనం కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకోవాలి. అది ప్రేమ, ఆకర్షణ, మొహం , లేక కామమా

ఒక అమ్మాయి అబ్బాయి మంచి స్నేహితులుగా ఉన్నారు అనుకుందాం, జీవితాంతం వారు మంచి స్నేహితులుగా ఉండవచ్చు. పెళ్ళే చేసుకొవలసిన పని లేదు. ఒక అమ్మాయి లేదా అబ్బాయి అందంగా ఉంటే చూడటం వేరు. ఎందుకంటే కళ్ల ముందు బిర్యానీ పెడితే ఆ వాసన కి ఎలా నోరు ఊరుతుందో ఎవరయినా కళ్ళముందు నుండి వెళితే మనం తెలియకుండానే చూస్తాం. ఎందుకంటే అవి హార్మోనులు. ఇపుడు ఆ నచ్చిన వారిని చూసి వెంబడించడం, ప్రతి రోజు సైటు కొట్టడం, ప్రేమించమని వేధించడం ఇవన్నీ వెకిలి పనులు తప్ప ప్రేమ కాదు. దురదృష్టవశాత్తు సినిమాలు నవలలు లో అమ్మాయిని లేదా అబ్బాయి వెంట పడటం, ప్రేమించాను అని చెప్పడమే ఫ్యాషన్ లేదా అర్హత లా చూపిస్తున్నారు. మన యువత కూడా అదే గొప్ప విషయం అనుకుంటున్నారు.

ఒకవేళ మనకి లేదా మనం ఎవరికి అయిన నచ్చితే వాటికి కొన్ని లక్షణాలు కూడా చూసుకుంటారు. అందం, ఆస్తి, చదువు, గుణం ఇలా ఏదైనా అయ్యుండొచ్చు. మరి అలా ఉన్న అందరినీ ప్రేమిస్తూ పోతామా?

చాలామంది నేను చాలా సెన్సిటివ్ అండి, వేటికి తట్టుకోలేను అంటారు. నిజానికి వాళ్ళు సెన్సిటివ్ కాదు, భయస్తులు. సెన్సిటివ్ అంటే రోడ్డు మీద ఒక కుక్క పిల్ల చలికి వణుకుటుంటే చిన్న క్లాత్ కప్పుతామా, దానికి రెండు బిస్కట్లు పెడతామా, వృద్ద యాచకులకు పిలిచి ఇంత అన్నం పెట్టామా.

ప్రేమ కి నిజానికి హద్దులు లేవు. అది ఒకరితో ఆగదు. జాలి ఉండే వ్యక్తి ప్రతి జీవి ని ప్రేమిస్తాడు. ప్రేమించుట అంటే ప్రేమని యిచ్చుట అంతే తప్ప తిరిగి ప్రేమించుట కాదు.

కొందరు సచిన్ ని, అమితాబ్ బచ్చన్ ని, మాధురి దీక్షిత్ ని, మహేష్ బాబు ని, స్వామి వివేకానంద ని, రతన్ టాటా ని కూడా ప్రేమిస్తారు. కానీ జీవితం లో ఒక్కసారైనా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఐ లవ్ యు అని చెప్పి నన్ను పెళ్లి చేసుకో అంటామా లేక ఇద్దరం డేటింగ్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అడుగుతామా ఈ పని మనకి ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళనే అడుగుతూ ఉంటాం. కారణం అందరికీ లవర్స్ ఉన్నారు , మనకి ఉండాలి అని.

ఖచ్చితంగా కొందరు ఉండే ఉంటారు. వాళ్ళది నూటికి నూరు శాతం ప్రేమే. అది కాకుండా ఒక కొత్త జోనర్ లో ఇపుడు అందరూ ఏదైతే ప్రేమ ప్రేమ అనుకుంటున్నారో అది మాత్రం ప్రేమ కాదు అని ఉద్దేశం.

కొందరు నిజాయితీ గా ప్రేమించుకున్నాం, కలిసి బ్రతుకుతున్నాం, పెళ్లి చేసుకున్నాం పెద్దల్ని ఎదిరించి అంటే , మరి మనల్ని ప్రేమించిన తల్లిదండ్రులనే బాధ పెట్టినపుడు వచ్చే వారిని మాత్రం ఏం సంతోషం గా చూసకోగలం.

రాధ కృష్ణులు కూడా ప్రేమికులే కదండీ అంటే ఇక్కడ రాధ కృష్ణుణ్ణి జీవితాంతం ఆరాధించింది తప్ప తననే పెళ్లి చేసుకోలేదు. త్యాగరాజు కూడా రాముణ్ణి అలానే ప్రేమించాడు. రామకృష్ణులవారు కాళీ మాతను అదే విధంగా ప్రేమించారు.

ప్రేమ కి ఉన్న చాలా పేర్లు

అనురాగం – తల్లిదండ్రులతో

భాద్యత – కుటుంబం మీద

కర్తవ్యం – ఉద్యోగం మీద

భక్తి – దేవుడిమీద

స్నేహం – మిత్రులతో

అభివృద్ది – దేశం మీద

రక్షణ – సైనికులకు

ప్రేమ – కోట్స్

నాకంటూ పెద్ద కలలేం లేవు. కానీ ఒక కల మాత్రం ఉంది. నువ్వూ నేనూ ఎప్పుడూ కలిసుండాలని!

ప్రేమగా, అద్భుతంగా నాప్రేమనంతా మాటల్లో చెప్పలేను. కానీ.. ఒక మాట మాత్రం చెప్పగలను.

ఈ జీవితంలో నిన్ను ప్రేమించినంతంగా ఇంకెవరినీ ప్రేమించలేను. కాదు.. కాదు.. ఈ జీవితంలో నిన్ను మాత్రమే ప్రేమించగలను’

ప్లటోనిక్ లవ్ (Platonic love)

ఆలుమగల మధ్య కల బంధం మొదట్లో కేవలం శారీరిక సంబంధ సుఖాల పట్లే కేంద్రీకరింపబడినా, సమయంగడిచే కొద్దీ వారి సంబంధం మానసికమౌతుంది. అప్పుడు వయసు మళ్ళిన తర్వాత శరీరం ఉడిగినా, వారు ఇంకా ప్రేమించుకుంటూనే ఉంటారు.. అయితే ఈ ప్రేమ మానసికం. నా ఉద్దేశ్యంలో పరిపక్వమైన ప్రేమను మనము పొందగలిగేదీ, ఇవ్వగలిగేదీ ఇప్పుడే. శారీరిక ఆకర్షణ అన్నది మొదట పునాది వేస్తుంది ..మానసిక పరిణితి ఆ పునాదుల మీద తర్వాతి దశకు మనలను చేరుస్తుంది.

ప్రేమ – సైకలాజికల్ భావాలు

ప్రేమ ఒక మధురమైన అనుభూతి. ఒక వస్తువు మీద ప్రేమ కలిగింది అంటే దానిని అపురూపం గా దాచుకుంటారు . మనుషుల్ని ప్రేమిస్తే ,సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ప్రేమిస్తున్నారు , ప్రేమని పొంది అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు కొంత మంది చాలా హుషారు గా వుంటారు. కొంత మంది నాకేంటి నేను సాధించాను అని చాలా గర్వంతో వుంటారు.

కొంత మంది పెళ్లి కుదిరింది అనుకోండి. రోజంతా మొబైల్ లో మాట్లాడుకుంటూ ,ప్రేమజంట లా ఫీల్ అవుతారు. పెళ్లి కట్నం మూలం గా, లేదా ఉద్యోగం మూలంగా జరుగుతోంది అని అసలు అనుకోరు. అది కూడా ప్రేమ గా భావిస్తారు. ప్రేమించడం వేరు , ప్రేమించుకున్నాం అని ఫీల్ అవ్వడం వేరుగా వుంటాయి.

నిజం గా ప్రేమ వుందా లేదా అన్నది పరిస్థితులు తెలుపుతాయి. ఒకమ్మాయి ఒకబ్బాయి నీ తెలివి తేటలు చూసి ప్రేమిస్తే ,ఆ అబ్బాయి రాంక్ బాగా లేకపోతే, నెమ్మదిగా గా రాంక్ వచ్చిన అబ్బాయిని చూసుకుని , ప్రేమను ఆ అబ్బాయి తో మొదలు పెడుతుంది. ఇక్కడ పరిస్థితులు మీద ఆధారపడింది ప్రేమ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి నీ అందం చూసి ప్రేమిస్తే ,ఇంకా అందమైన అమ్మాయి కనుక దొరికితే నెమ్మదిగా ఆ అమ్మాయితో ప్రేమాయణం మొదలు పెడతాడు. మొత్తానికి ఎవరైనా వాళ్ళ కు లభించే విధంగా వుంటేనే ఇలాంటి ప్రేమలు మొదలు పెడతారు.

అందాన్ని ప్రేమించాలంటే ,ప్రపంచ సుందరిని ప్రేమించ వచ్చు.కానీ లభించదు కనుక ఆ ప్రేమను దొరికే వాళ్ళ మీద ప్రయత్నిస్తారు. ప్రేమించారు కాబట్టి ప్రపంచ సుందరి కానక్కరలేదు. ప్రపంచ సుందరి ఎలాగూ దొరకదు అందుకు ప్రేమించడం మానెయ్యరు కదా. ఎవరో ఒకరు గంత కు తగ్గ బొంత అని తృప్తి పడతారు. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. ఏం చూసింది ప్రేమించింది…… అని హాశ్చర్య పోతారు జనాలు.

అంతకంటే అందమైన వాళ్ళు వుండ రా లోకం లో ? వుంటారు కానీ దొరకాలి కదా… సరిపెట్టు కొని ప్రేమిస్తారు. ఈ విధంగా పరిస్థితులు ప్రేమను మారుస్తూ వుంటాయి. ఇవేమీ ఆలోచించకుండా ,ప్రేమించి విఫలం అవుతారు కొంత మంది.

బావా మరదళ్ల ప్రేమ వుండేది.అది అందరికీ ఆమోదయోగ్యం గా వుండేది. నిజానికి బావా మరదళ్ళు సహ జీవనం చేసేవారు. ఒకరి గురించి ఒకరు ముందే తెలుసుకుని వుండేవారు.

బాల్య ప్రేమలు నుండి హైస్కూల్ ప్రేమ, కాలేజీ ప్రేమ, యూనివర్సిటీ ప్రేమ, కొంచెం లేటు గా PhD ప్రేమ, లాండ్ లైన్ ఫోన్ ప్రేమలు నుండి పేజర్ ,మొబైల్, వాట్స్ అప్ , ఫేస్బుక్ , ఇలా ఇంటర్నెట్ ప్రేమల వరకూ, ప్రక్కింటి ప్రేమ నుండీ గ్లోబలింటి వరకూ ప్రేమ విస్తరించింది.

కొంత మంది అమ్మాయిలు కానీ,అబ్బాయిలు కానీ వాళ్ళ అవసరాలు తీరే దాకా చుట్టూ ఏదో వంకన తిరుగు తారు. ప్రపోజ్ చేస్తే ఎలాంటి ఉద్దేశ్యం లేదు అని చెబుతారు. లేదా నాకు ఇష్టమే ,మా ఇంట్లో అడగమంటారు. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఇలా చెప్పరు. ప్రేమ చూపించి నప్పుడు ,ఇంట్లో వాళ్ళు గుర్తు వుండరు. ఈ లోగా ఎదుటి వారిని వాడుకుని ,వదిలేస్తారు. ఇది అబ్బాయిలు చేస్తే, అన్యాయం అంటారు. అమ్మాయి చేస్తే, అంత స్పందించరు. ఏది ఏమైనా అలా ఒకరిని ప్రలోభ పెట్టీ,మొహం చాటు వెయ్యడం వల్ల ,ఇంకొకరి తో ప్రేమాయణం మొదలు పెట్టడం వలన, తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఎలా గెలవాలో ప్రేమ కి తెలుసు.

ఫిబ్రవరి12 – కిస్‌డే

Happy Kiss Day: Types Of Kisses And Feelings With Your Loved One And Parents - Sakshi

స్‌.. అంటే ముద్దు పెట్టుకోవడం అని సింపుల్‌ తీసిపారేయడానికి లేదు. ముద్దువల్ల వ్యక్తులు పొందే అనుభూతి అనిర్వచనీయం. ఇది మనసుకు దగ్గరైన వారితో మాత్రమే పంచుకునే ఒక తియ్యని అనుభూతి. అందుకే వాలెంటైన్స్‌ వీక్‌లో​ లవర్స్‌ ఈరోజు ( ఫిబ్రవరి12)ను  కిస్‌డే గా సెలబ్రెట్‌ చేసుకుంటారు. అయితే  ఈ కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే  రోమాంటిక్‌ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి.

ప్రేమికులు తమ మనసులోని ప్రేమను, వారి లవర్‌కి కొంత రొమాంటిక్‌గా వ్యక్తపరచుకోవాలన్నప్పుడు కిస్‌ చేస్తారు. ఈ చర్యతో వారే తమ ప్రపంచమని మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు.  ఇలా చేయడం వలన ప్రేమించిన వారి పట్ల తమకున్న ప్రేమ, నమ్మకం, పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ప్రేమికులు గాఢంగా చుంబించుకోవడం వలన కొన్ని రకాల రసాయనాలు విడుదలై ఒత్తిడి తగ్గి వారి మధ్య ఒక బాండింగ్‌ క్రియేట్‌ అవుతుందని కొన్ని పరిశోధనల్లో కూడా వెల్లడైంది.

కిస్‌ చేస్తే.. 
తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గర తీసుకొని నుదుటి పైన కిస్‌ చేస్తారు.  ఈ చర్యతో వారిని ఆశీర్వదిస్తారు. ఒక్కొసారి పిల్లలు తమ వారు కిస్‌చేయడం వలన తామున్నమనే భరోసా ఏర్పడుతుందని అనుకుంటారు. చుంబించుకోవడం అనే చర్యవలన మానసిక ఆనందం కలిగి మాములు కన్నా5 ఏళ్ల ఆయుర్దాయం పెరుగుతొందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 

ఫిబ్రవరి11 – ప్రామిస్‌ డే

Happy Promise Day: 5 Promises To Strengthen Love With Your Loved One - Sakshi

ప్రా‘మిస్‌’..నేను జీవితాంతం వరకు నీతోనే ఉంటారు.. నిన్ను కెరింగ్‌గా చూసుకుంటాను.. నీతో ఎప్పటికి నిజాయితీగా ఉంటాను..ఇలాంటివి తరచుగా అందరినోట్లోను వింటూనే ఉంటాం. ప్రేమ నిజంగా పండాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ముఖ్యం..అందుకే మనం కోరుకున్న ప్రేమను ప్రామిస్‌ వేసి మరి చెప్తాం. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో ఈరోజు (ఫిబ్రవరి11)ను లవర్స్‌ ‘ప్రామిస్‌ డే’ గా జరుపుకొంటారు. 

పండంటి ప్రేమకు.. 
► ఇద్దరు మధ్యలో ప్రధానంగా ఉండాల్సింది నమ్మకం. ఈ పునాది ఎంత గట్టిగా ఉంటుందో వారి ప్రేమ    అంత ధృడంగా ఉంటుంది.
► పరిస్థితులు ఎలా ఉన్నా ఒకరికి మరొకరు తామున్నామనే భరోసా ఇచ్చుకొవాలి.
►  ప్రేమలో ఎదుటివారి లోపాలు, వారినుంచి తిరిగి ఆశించడం, డిమాండ్‌ చేయడం వంటివి ఉండవు.
►  ప్రేమ అన్నాక చిరుకోపాలు, తాపాలు సహజం.. వాటిని పెద్దగా పట్టించుకోకుండా పరిష్కరించుకోవాలి.
►  ప్రేమలో ఇరువురి ఇష్టాలను పరస్పరం గౌరవించుకోవాలి.

ఇక్కడ ప్రామిస్‌ మోటో మాత్రం ఒక్కటే.. తల్లిదండ్రులతో, బంధువులతో , మిత్రులతో మనం చేయగలిగేది మాత్రమే చెప్పాలి. ప్రతి ఒక్కరిలోను చిన్నపాటి లోపాలుండటం సహజం. అనవసర కోపాలకు పోకుండా, వాటిని పరిష్కరించుకుంటూ.. మనకు వారితో ఉన్న ప్రేమ కలకాలం నిలవాలని ‘ప్రామిస్‌’ వేసి మరికోరుకుందాం..

ప్రేమను వ్యక్తం చేయడం

Valentine Week: Ways To Express Love And Gift Ideas On Propose Day - Sakshi

ప్రేమికులు ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డేగా జరుపుకుంటారు. అయితే ఈ వారం రోజులను సంబరంగా చేసుకుంటారు. ఈ వారంలో వచ్చే రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. అలా రోజ్‌ డేతో మొదలయ్యే ప్రేమికుల హుషారు వాలేంటైన్స్‌ డేతో ముగుస్తుంది. ఫిబ్రవరి 7ను రోజ్‌ డే జరుపుకున్న ప్రేమికులు, ఈ రోజు ప్రపోజ్‌ డే జరుపుకుంటారు. ప్రేమించడం ఒక ఆర్ట్‌ అయితే ప్రేమను వ్యక్తం చేయడం మరో గొప్ప ఆర్ట్‌..! 

ఎలా ప్రపోజ్‌ చేస్తారో తెలుసుకుందాం.. 
ప్రేమించిన వారికి ఏ గిఫ్ట్‌ ఇస్తే ఇంప్రెస్‌ అవుతారో అని ఆలోచిస్తూ నానాతంటాలు పడుతుంటారు చాలా మంది. ఇందుకోసం  గ్రీటింగ్‌ కార్డులు, చాక్లెట్‌లు, గిఫ్ట్‌లు , పువ్వులు ఇలా రకారకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రేమికుల మోటో మాత్రం ఒక్కటే.. వీటిలో ఏదైనా వారికి సర్‌ప్రైజ్‌ అందించి మనసులో ఉన్న ప్రేమను చాటుకుంటారు. 

ఇందుకోసం ప్రేమించిన వారిని అనుసరించడం, వారి మిత్రులను కలవడం, వారి అభిరుచులు తెలుసుకోవడం వంటి చిన్నపాటి పోరాటాలు కూడా చేస్తారు. చివరికి వారికి నచ్చింది ఇచ్చి, ఆ కళ్లలో ఆనందం చూసి, వరల్డ్‌ కప్‌ గెలిచినంత సంబరపడతారు. అయితే ఈ ప్రపోజ్‌డేను కొత్తగా ప్రేమికులే కాకుండా , ఇప్పటికీ ప్రేమించి పెళ్లిచేసుకున్న దంపతులు ఈ రోజు ఒకరికొకరు ప్రత్యేక బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య బంధం మరింత దృఢపడుతుందని నమ్ముతారు.

సాహసాలకు సిద్ధపడతారు..
మొదటిసారిగా ఇద్దరూ కలుసుకున్న చోటులో కొంత మంది ప్రేమికులు ప్రపోస్‌ చేస్తే, మరికొందరు టీ-షర్ట్‌మీద ఆక్సెప్ట్‌ మై లవ్‌ అని రాసుకొని ప్రేమికుల ఎదుట వాలిపోతారు. ఒక్కోసారి తమకు తామే ఒక బహుమతిగా మారిపోయి గిఫ్ట్‌ బాక్స్‌గా తమ వారి దగ్గరికి వెళతారు. తమదైన శైలిలో ప్రేమ విషయం చెప్పేందుకు మరికొందరు జూలియట్లు ప్రేమించిన వారి వివరాలు తెలుసుకునేందుకు సాహసాలకు సిద్ధపడతారు. ఆక్రమంలో చుట్టుపక్కల వారితోను, మిత్రులతోను చివాట్లు కూడా తింటారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రేమికుల సమాచారం సేకరించి వారికి ఇష్టమైంది బహుమతిగా ఇవ్వడానికి ఆరాటపడతారు. 

వేలంటైన్ వీక్

ఫిబ్రవరి నెల ప్రేమికుల హృదయాలలో ఉత్సాహాన్ని తెస్తుంది. ఇది ప్రేమికుల నెల! ఈ నెలలో, 7 నుండి 14 వరకు, రోజ్ డేతో ప్రారంభమయ్యే వాలెంటైన్ వారాన్ని ప్రపంచం జరుపుకుంటుంది. ప్రతి రోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, కిస్ డే, మరియు హగ్ డే – మరియు చివరికి – వాలెంటైన్స్ డే!

  • రోజ్ డే

ఫిబ్రవరి 7 న జరుపుకుంటారు, రోజ్ డే వాలెంటైన్ వీక్ ప్రారంభానికి గుర్తుగా ఉంది. ఈ రోజు ప్రేమికులు తమ పాట్నర్కి‌‌ గులాబీలతో బుకే ‌ఇస్తారు. (ఎరుపు గులాబీలు అత్యంత ప్రాచుర్యం పొందాయి.) గులాబీలు తెచ్చే వాగ్దానం – తాజాదనం, సువాసన మరియు ప్రేమ యొక్క నిత్య సౌందర్యం.

  • ప్రపోజ్ డే

ఫిబ్రవరి 8 న జరుపుకుంటారు, అన్ని రకాల ప్రతిపాదనల కోసం ప్రపోజ్ డే. మీ ప్రేమను మీ ప్రేమతో అంగీకరించే రోజు ఇది. మీరు ప్రపోజ్ చేయాలనుకుంటే, బహుమతి, కొన్ని పువ్వులు, కేక్ మరియు ఆమె లేదా అతడు ఎప్పటికీ గుర్తుంచుకునే తేదీగా మార్చండి.

  • చాక్లెట్ డే

ఫిబ్రవరి 9 న జరుపుకుంటారు, చాక్లెట్ డే మీ బంధాన్ని ప్రేమతో మధురంగా ​​- చాక్లెట్లతో ప్రత్యేకంగా చేస్తుంది.

  • టెడ్డీ డే

ఫిబ్రవరి 10 న జరుపుకుంటారు, టెడ్డీ డే మనం తల్లిదండ్రులచే సురక్షితంగా మంచం పట్టడం వంటి చిన్ననాటి జ్ఞాపకాలను తెస్తుంది. టెడ్డి అనేది ఒక అందమైన జంతువు.ఇది అన్ని హాయిగా, తీపి విషయాలను గుర్తుకు తెస్తుంది. మీరు అప్పగించే టెడ్డిలా మీరు కూడా ఎప్పటికీ, హాయిగా మరియు హగ్గబుల్ గా (huggable) ఉంటారు అని మీ ప్రియమైన వ్యక్తికి తెలియజేయండి.

Happy Teddy Day: Find Out Why Your Loved One Loves Teddy Bears - Sakshi

ప్రేమించిన వారు ప్రతిక్షణం  మనతోనే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు! కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రేమికులు ఒకరిని విడిచి మరొకరు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ విరహ వేదనను టెడ్డీబేర్‌లు దూరం చేయగలవు. అందుకే ఈ టెడ్డీలకు వాలెంటైన్స్‌ వీక్‌లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. లవర్స్‌ ఈరోజును (ఫిబ్రవరి10) టెడ్డీబేర్‌ డేగా జరుపుకుంటారు.

మరోవైపు టెడ్డీబేర్‌లకు, అమ్మాయిలకు మధ్య చిన్ననాటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉంటుంది.  వారు రకారకాల బొమ్మలతో ఆడుకుంటుంటారు. ఒక్కరే ఉన్నప్పుడు టెడ్డీలతో సరదాగా గడుపుతారు. తల్లిదండ్రులతో సరదాగా ఇతర ప్రాంతాలకు వెళ్లినా పక్కనే టెడ్డీ ఉండాల్సిందే. చిన్నారి పాపలు కొన్నిసార్లు తమ టెడ్డీలకు ప్రాణం ఆపాదించి అందంగా ముస్తాబు చేసి తయారుచేసి సంతోషపడిపోతారు. బెడ్‌పైనే తమ పక్కనే పెట్టుకుని నిద్రపోతారు. 

ఇక ప్రేమికుల విషయానికొస్తే.. మనసుపడిన వారికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ప్రియుడు/ప్రియురాలు టెడ్డీని గిఫ్ట్‌గా ఇస్తుంటారు.  తమవారు గుర్తుగా ఇచ్చే టెడ్డీ బొమ్మలతో వారు లోన్లీ ఫీలింగ్‌ను కొంతవరకు దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమే కాకుండా కోపతాపాలకు కొన్నిసార్లు వేదిక అవుతుంటాయి. ప్రేమించినవారిపై అలకను, చిరుకోపాన్ని టెడ్డీలపై చూపించి వారు తెగ ఆనందపడిపోతారు.

  • ప్రామిస్ డే

ఫిబ్రవరి 11 న జరుపుకుంటారు, ప్రామిస్ డే నిబద్ధత యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఈ రోజున, మీరు స్థిరంగా వెళ్లడం, లేదా కలిసి ఉండటం మరియు ఆ వాగ్దానాన్ని ఎప్పటికీ పట్టుకుంటారు అని నమ్మకం కలిగించండి.

  • హగ్ డే

ఫిబ్రవరి 12 న జరుపుకుంటారు, హగ్ డే ప్రేమ యొక్క వెచ్చని, అందమైన వ్యక్తీకరణను అందిస్తుంది – పదాల కంటే ఎక్కువగా మాట్లాడే సౌకర్యవంతమైన కౌగిలింత. ఒక కౌగిలింత మీ సమస్యలన్నింటినీ ఆ కొద్ది నిమిషాలలో ఎగిరిపోయేలా చేస్తుంది, కాబట్టి ముందుకు సాగండి, మీ ప్రియమైన వ్యక్తికి సున్నితమైన కౌగిలింత ఇవ్వండి, వారు ప్రేమిస్తున్నారని తెలియజేయండి.

  • కిస్ డే

ఫిబ్రవరి 13 న జరుపుకుంటారు, ఈ రోజున, కొత్త ప్రేమికులు వారి మొట్టమొదటి నిబద్ధత ముద్దును పంచుకుంటారు.

  • ‌ప్రేమికుల రోజు

ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు, వాలెంటైన్స్ డే వాలెంటైన్ వీక్ ముగుస్తుంది. ప్రేమికులు తమ ప్రియమైనవారితో నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తూ, వారు కోరుకున్న విధంగా రోజును జరుపుకుంటారు. ఇది ఆనందం యొక్క రోజు, ప్రేమ కనుగొనడంలో ఆనందకరమైన ఉత్సాహం గల రోజు.