వంశవృక్షం ఎలా తయారు చెయ్యాలి?

మన పూర్వీకుల చరిత్ర తెలుసు కోవాలనే జిజ్ఞాస మనకు ఉండటం సహజమే నంది.మన పెద్దలు చాలావరకు ఇలా రాసి పెట్టుకునేవారు.కొన్ని కులాల్లో తాత ,ముత్తాత పేర్లు స్మరించటం కొన్ని కార్యాలలో జరిగేది.కానీ మన పితృస్వామ్య పోకడల వల్ల పాపం ఆడవాళ్ళు తెర వెనుకే ఉంది పోయారు.నిజానికి వారే ఈ తర తరాల సంతానం కడుపులో పెట్టుకు మోసిన కుల దేవతలు.ఏమి చేద్దాం ,తప్పులు ఎంచటం పెద్ద పని కాదు కనుక మనం ఆ తప్పు చేయకుండా ఇలాంటి చార్ట్ ఒకటి వేసి మన పిల్లకి ఇస్తే ఆడ మగ అందరి కి సమన్యాయం చేసి మనల్ని కన్నఅమ్మలని స్మరించుకున్న వాళ్ళ మౌతాం .

భార్యా భర్తల మధ్య = గుర్తు, వారికి వారి పిల్లలకి మధ్య ___ గుర్తు పెట్టాలి.పైన బంధుత్వ పరిభాష స్థానం లో వారి వారి పేర్లను వేస్తె సరిపోతుంది

ఇందులో 1,2,3 అనే నంబర్లు వారి పుట్టుక క్రమాన్ని సూచిస్తాయి.అలా కాకుండా కుడి నుంచి ఎడమకు ఒకటే వరుస క్రమం చార్టు అంతా పాటించే విధానం లో ఆ విషయాన్ని రాస్తే మంచిది.

నేటి పిల్లల పెoపకం – సూచనలు

1.పిల్లలకు చిన్న బాల శిక్ష,పెద్దబాల శిక్ష నేర్పించండి.ఎంతో లోక జ్ఞానము వస్తుంది.

2. రామాయణం, భారతము,భాగవతంలో కథలను రోజూ చెబుతూ ఉండండి.ఇలా చేస్తే వారు సంస్కార వంతులు అయ్యే అవకాశం ఎక్కువ గా ఉన్నది.పెద్ద వాళ్ళను,స్త్రీలను ఎలా గౌరవించా లో బాగా తెలుస్తుంది.మన సమాజములో నేరాలు బాగా తగ్గుతా యి.

3.చిన్న పిల్లల కు ఒక వయసు వచ్చిన తర్వాత వారికి అన్ని పనులు నేర్పించండి.ఇలా చేస్తే వారు భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు వచ్చినా వారి కాళ్ళ మీద నిలబడ గలరు.ఇంకొకరికి సహాయము చేయగలరు.

4., యోగాభ్యాసము,ప్రాణాయామము మీరు చేయండి,పిల్లలకు నేర్పించండి.ఇవి సుదీర్ఘ జీవితం లో బాగా ఉపయోగిస్తాయి.

5.మనలను నిరంతరం కాపాడేది మందులు కావు . ప్రకృతి మనలను కాపాడుతూ ఉంటుంది. ఈ ప్రకృతి రహస్యములు తెలియాలి అంటే మీరు సకుటుంబంగా ఒక 15,రోజులు ఒక మంచి ప్రకృతి లేదా యోగాశ్రమములో గడపండి.ఖర్చు ఎక్కువ కాదు కానీ మీకు మీ పిల్లలకు అమూల్యమైన విజ్ఞానము లభిస్తుంది. విహార యాత్రకు వెళ్ళే బదులు చక్కగా అదే డబ్బుతో ఈ ఆశ్రమాలలో గడ పండి.ఈ ఆశ్రమాలు ఇప్పుడు అన్ని సౌర్యాలతో ఆకర్షణీయంగా ఉన్నవి.మీరు నాలుగైదు సార్లు వెళితే సమాజములో ఎంతో మందికి మంచి వైద్య సలహాలు ఇతర సలహాలు అందించ గల రు.

6.మీకు డబ్బు అవసరము పెద్దగా లేదనుకుంటే ఇల్లాలు గానే పిల్లలను చూసుకుంటూ కాలక్షేపము చేయండి.మాతృదేవోభవ అన్నారు.తల్లి దైవము తో సమానము.తల్లి పిల్లలకు మొదటి గురువు.తల్లి ఇంట్లో ఉంటే పిల్లలకు సంరక్షణ బాగుంటుంది.ఆత్మ స్థైర్యం బాగా ఉంటుంది పిల్లలకు.మంచి సంస్కార వంతులు అవుతారు.తల్లి చేసే సేవలను అంచనా వేస్తే ఆమె ప్రాథమిక పాఠశాల ప్రధనోపాధ్యాయు రాలితో సమానమైన సేవలు అందిస్తూ ఉంటుంది.ఇల్లాలు నిరుద్యోగి అనుకుంటే అది మన అవివేకమే. ఉద్యోగం చేయడం తప్పని సరి అయితే స్థాన చలనం లేని ఉద్యోగం చూసుకోండి.పదోన్నతుల కంటే పిల్లల భవిషత్తు కు ప్రాధాన్యము ఇవ్వండి.

ఆమె గురువే కాక,వైద్యురాలు, నర్సు, స్నేహితురాలు కూడా.ఆమె సేవలు వేరెవరూ చేయ లేరు.ఆమె సేవలు అమూల్యమైనవి.

ఇలా ఉంటే ప్రతి కుటుంబము ఆదర్శ కుటుంబము అయ్యే అవకాశాలు ఉన్నవి.ప్రతి కుటుంబము ఆదర్శంగా జీవిస్తే దేశమే ఆదర్శవంతమైన ది అవుతుంది.అంటే మన దేశ పురోభివృద్ధి లో నిజమైన భాగ స్వాములము అవుతాము.

ప్రేమ ఓ ఊహ – పెళ్ళి రియాలిటీ

9 , 10 వ తరగతి చదువుతున్న అమ్మాయిల దగ్గరనుండి ఇంటర్ , డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు కూడా కొంతమంది ఇలానే ఆటో డ్రైవర్లతోనూ , బైక్ మెకానిక్ లతోనూ లేదా తమతోపాటే చదువుకునే వ్యక్తితో ప్రేమలో ఉన్నామనుకొని ఇలా ఇంట్లో వాళ్ళకి చెప్పాపెట్టకుండా పెళ్ళిళ్ళు చేసేసుకోవడం , మరలా రెండంటే రెండే వారాల లోపు ” వాడితో కలిసి నేనుండలేనని ” తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేయడం.

ప్రేమకి ఓ అమ్మాయి , ఓ అబ్బాయి ఉంటే చాలు – కానీ పెళ్ళికి కుటుంబం ” కూడా ” ఉండాలి – వివాహానంతరం జీవితంలో చాలా అంశాలుంటాయి – అవి పెద్దల సపోర్ట్ లేకుండా ఇద్దరూ సమన్వయం చేసుకు జీవించడం చాలా కష్టం ” – కనుక తాత్కాలిక ఆవేశాలతో ఇటువంటి అనాలోచిత చర్యలు చేయకండి

ఇద్దరికీ తమకంటూ ఓ సొంత వ్యక్తిత్వం , జీవితం ఏర్పడ్డాక ఉండే జీవితం వేరు – అసలు మీ జీవితం పట్ల మీకే ఓ అవగాహన రాకుండా ఇంకోకరిని జీవితంలోకి ఆహ్వానించడం నిజంగా అర్ధం లేని చర్య , మహా మూర్ఖత్వం – జీవితం ఊహించినంత గొప్పగా అయితే ఉండదు ఇటువంటి చర్యలతో

ప్రేమలో ఉన్నప్పుడు ఆకర్షణ రియాలిటీని కప్పేస్తుంది – ఆకర్షణ పొరని పక్కనపెట్టి మనసును సమర్ధించుకోకుండా ఎదుటి వ్యక్తిలో మంచి చెడూ రెండూ సహేతుకంగా బేరీజు వేసుకొని కానీ రిలేషన్ లోకి వెళ్ళకండి

ప్రేమలో ఉన్నప్పుడు నచ్చిన అంశాలే పెళ్ళయ్యాక నచ్చకపోవడానికి ప్రధాన కారణాలవుతాయి కొన్నికొన్ని విషయాలలో

అవతలి వ్యక్తి ” ఇలా ఉంటున్నాడు / ఉంటుంది కాబట్టి ప్రేమిస్తున్నాను ” తరహా ఆలోచనతో బంధంలోకి ఎంటర్ అవ్వద్దు – అలా ఎదుటి వ్యక్తి ఇలా ఉంటే నచ్చుతాడని అనుకొని ఆ తర్వాత తర్వాత అలా లేకపోతే మీ expectation దెబ్బతిని అవే కారణాలు ఎదుటివ్యక్తిని ద్వేషించడానికో లేక మీరు బాధపడడానికో కారణాలవుతాయి – కనుక ఏవో కొన్ని గుణాలు ఎదుటి వ్యక్తిలో చూసి రిలేషన్ లోకి ఎంటర్ కావడం కన్నా ఎదుటి వ్యక్తి బలాలూ , బలహీనతలపై ఓ స్పష్టత ఏర్పడి ” రియాలిటీని కూడా సమన్వయం చేసుకోగలను ” అనే సన్నద్ధత ఉంటే కానీ బంధంలోకి వెళ్ళకపోవడమే మంచిది

ఇద్దరు ఒకే చూరు కింద నివసించాల్సి వస్తే ఎదురుకోవాల్సిన ” రియల్ లైఫ్ ” అంశాలు అనేకముంటాయి – వీటికన్నిటికీ ఆర్ధికపరమైన స్థిరత్వం చాలా అవసరం – మిమ్మల్ని మీరు పోషించుకునే స్థాయి కూడా కలగకుండా బంధంలోకి అప్పుడే వెళ్ళడం భవిష్యత్తులో చాలా ఇబ్బందులకి దారితీస్తుంది

మన ఆలోచనలు , మన చేతల ప్రతిఫలమే మన జీవితం.

విడాకులు – కారణాలు

ప్రస్తుతం విడాకులకు ప్రధానంగా జీవితం గురించి భార్యాభర్తలకు సరైన అవగాహన లేకపోవడం. కోడలి పట్ల అత్తమామలు, ఆడపడుచుల వేధింపులు. ఇచ్చిన కట్నం చాలదని, ఇంకా కట్నకానుకలు తీసుకురావాలని వేధింపులు. ఆడపిల్ల పుడితే వేధింపులు.

భార్యగానీ, భర్తకుగానీ రూప లావణ్యాలు లేవని భావించి, వేరే కారణాలు చూపి, విడాకులకు సిద్ధపడుతున్నారు. అక్రమ సంబంధాలు కూడా విడాకులకు కారణాలు అవుతున్నాయి.

మహిళల వైపు నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే భర్తలు విడాకుల వైపు మొగ్గుచూపుతున్నారు. తాగుడు, జూదం వంటి అలవాట్లు విడాకులకు దారి తీస్తున్నాయి.

ఆపగలమా?

ఆపవచ్చు. చిన్న చిన్న సమస్యలు అయితే ఇరువురికీ నచ్చచెప్పవచ్చు. దౌర్జన్యం, కుట్రపూరిత చర్యలు, భాగస్వామి వల్ల ప్రాణ హాని, నిత్యం అవమానకర ధోరణులు వుంటే నచ్చచెప్పినా ప్రయోజనం వుండదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ గౌరవం, కులప్రతిష్ఠ వంటి కట్టుబాట్లు చెబితే ఫలితం వుండదు. వివాహం చేసుకున్నపుడే వధూవరులు ఆలోచించాలి.

విరహం, తాపం, ప్రణయం

ఒక జంట కు వివాహము అయింది. ఆషాడ మాసం రావటంతో అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. ఆమె స్నేహితురాళ్లు ఆమె వివాహం గురించి అప్పటి సరదా ల గురించి గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన భర్త చిత్రపటాన్నీ తన గదిలో అద్దానికి అతికించి రాత్రి అతని పటాన్ని చూస్తూ నిద్రపోయింది. ఇది విరహం.

కొన్ని రోజులకు ఆయన వస్తున్న ట్లుగా ఉత్తరం వచ్చింది. ఆరోజు రాత్రి ఆమె ఆ పటంతో అయితే రేపు మీరు తప్పక వస్తారుగా అని అడుగుతూ ఆ పటాన్ని అలాగే పట్టుకుని నిద్రలోకి జారుకుంది. ఇది తాపం.

తెల్లవారింది భర్త వచ్చాడు. మధ్యాహ్నం భోజనం అయ్యాక ఇద్దరూ బయట చెట్టు కింద మంచము వేసుకుని కూర్చుని ఆ నెల రోజులు ఎంత కష్టం గా గడిచింది చెప్పుకున్నారు. ఇది ప్రణయం.

ప్రేమలో విఫలం – సూచనలు

మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల బుర్ర పాడవుతుందే తప్ప పీకేదేమీ ఉండదనే ప్రాక్టికల్ నిజాన్ని గ్రహించడానికి ట్రై చేయండి … అలాగే మీ ఆ రిలేషన్ ముగిసేటప్పుడు కూడా కాస్త మెచ్యూర్డ్ పీపుల్లా బిహేవ్ చేయడానికి ప్రయత్నించండి … అంటే ఇంకెలాగో కలిసి బ్రతకడం‌ కుదరదని తెలిసినప్పుడు కనీసం అవతలి వ్యక్తికి భవిష్యత్తులో మీ విషయమై ఆలోచించినప్పుడు ఏ విధమైన బాధా లేకుండా ” నువ్వు లేకపోయినా నా లైఫ్ ని నేను బానే లీడ్ చేయడానికి ప్రయత్నిస్తాలే నాశనమేదీ చేసుకోకుండా ” అనే భావం కలిగేట్లు ప్రవర్తించండి… సాధ్యమైనంతవరకు ఒకరినొకరు నిందించుకోకుండా స్నేహితులుగానే విడిపోండి మనస్పూర్తిగా కారణాలు వివరించుకొని

దానివల్ల అవతలి వ్యక్తికి మీ పట్ల గిల్ట్ ఫీలింగ్ ఉండదు … మీకూ అకస్మాత్తుగా విడిపోవడం కన్నా ఇలా మాట్లాడుకొని విడిపోవడం వల్ల అంత పెయిన్ ఉండకపోవచ్చు

2. కొన్ని రోజులు Social Media కి దూరంగా ఉండండి ,, అలాగే తన తాలూకు మెమోరీస్ ఏవీ గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించకండి… తన తాలూకు చాటింగ్ కాన్వర్జేషన్స్ కానీ ఫొటోస్ కానీ డెలీట్ చేసేయండి.. దీనివల్ల తనని మళ్ళా మళ్ళా తల్చుకుని తల్చుకుని బాధపడడం సగానికి పైగా తగ్గచ్చు..

3. సంగీతం అస్సలు వినకండి… అది హ్యాపీ మూమెంట్ కి సంబంధించినదైనా బాధాకరమైనదైనా మళ్ళీ పాత గాయాన్ని లేపేదిలా ఉండవచ్చు

4. సాధ్యమైనంతవరకూ ఒంటరిగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి… మీకిష్టమైన పని ఎక్కువగా చేయండి.. బోలెడన్ని వ్యాపకాలు కల్పించుకోండి… ఎక్కువగా మనుష్యులమధ్య గడపండి.. మూడీగా ఉండకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి.. మీకెంత బాదున్నా అది మొహంలో కనపడకుండా ఎదుటి వ్యక్తితో మాట్లాడడానికి ప్రయత్నించండి.. అలాగే ప్రతీ ఫ్రెండ్ గ్రూప్ లో నాలా ఇలా ఒకడు జీవితం గురించి మాట్లాడుతున్నట్లు ఉంటాడుగా? అలాంటి వాడితో ఏదో ఏడుస్తూ సానుభూతి పొందడానికన్నట్లు మాట్లాడకుండా ఇలా విశ్లేషణాత్మకంగా మాట్లాడడానికి ప్రయత్నించండి.. అది కాస్త ఉపశమనమనిపించి మీరు మీ బాధనుంచి తొందరగా కోలుకోడానికి ఉపయోగపడవచ్చు.

5. ప్రేమలో విఫలమైతే చాలామంది సినిమాటిక్ గా మందు తాగడమో,, సిగరెట్లు తాగడం లాంటి వ్యసనాలకు అలవాటుపడుతున్నారు మన జనరేషన్ లో .. దానికన్నా మనసుని దిటవపరుచుకునేందుకు మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి.. అలాగే గడ్డాలు పెంచేసి సరైన తైలసంస్కారం లేకుండా జుట్టును వదిలేయకుండా చక్కగా క్లీన్ షేవ్ చేసుకుని అద్దంలో మిమ్మలని మీరు చూసుకుంటూ నవ్వడానికి ప్రయత్నించండి.. అలాగే శరీరాన్ని ఉత్తేజపరిచేలా ఏ జిం లోనో జాయిన్ అయ్యి చక్కగా వర్కవుట్స్ చేయండి..

6. వీలుకుదిరితే మానసిక ప్రశాంతత కొరకు మీ ఫ్రెండ్స్ తోనో,, లేదా మీ రిలేటివ్ తోనో దూరంగా ఏదో ఓ ప్రదేశానికి వెళ్ళి కాస్త ఈ రెగ్యులర్ ఫీల్ పోగొట్టుకోడానికి ప్రయత్నించండి,, దానివల్ల మనసు కాస్త రీ ఫ్రెష్ అవ్వచ్చు

” జీవితమెప్పుడూ ఒకరివల్ల ఆగదు,, ఒకరితోనే ఆగదు – సో పరిస్థితులెలాంటివెదురైనా బ్రతుకుపట్ల కుతూహలాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకండి “

#LifeGoesOn

వాలెంటైన్‌ డే – కలర్‌ డ్రెస్సింగ్

Colours and Their Meaning on Valentine Day - Sakshi

వాలెంటైన్‌ డే ను అర్ధవంతంగా, ఆనందంగా జరుపుకోవాలనే వారు ఈ రోజుకోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఆ రోజున నచ్చిన వారికి గులాబీలను, కానుకలు ఇచ్చి తమ ప్రేమను పంచుకుంటారు.

నీలం: ఈ రంగు డ్రెస్‌ను వాలెంటైన్‌ డే రోజున ధరిస్తే ‘ఎవ్వరితోనూ ప్రేమలో లేను’ అనే అర్ధమట. 

ఎరుపు: ఎలాంటి సందేహం లేకుండా ప్రేమకు చిహ్నంగా ఈ రంగును వాడుతూనే ఉంటారు. ఎరుపు రంగు డ్రెస్‌ ధరిస్తే ‘ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు’ అని గుర్తు అట. 

పచ్చ:  ‘ఆశ’ను చిగురంపజేసే సుగుణం ఆకుపచ్చ రంగుకు ఇచ్చేశారు. సో.. ఎదురుచూడండి అని చెప్పకనే చెబుతున్న విషయమట.

ఆరెంజ్‌ ప్రేమికుల రోజున నచ్చినవారికి ‘ప్రపోజ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు’ అన్నమాటట. 

నలుపు: హాట్‌ కలర్‌గా పేరున్న రంగు నలుపు. ఈ డ్రెస్‌లో ఎవరినైనా ఇట్టే కట్టిపడేయచ్చు. కానీ, ప్రేమికుల రోజున దీనిని ధరిస్తే మాత్రం ‘విఫల ప్రేమ’కు అర్ధమట. 

తెలుపు: ఈ రంగు ప్రేమికుల రోజున ఎదుటివారికి మనల్ని ఎలా పరిచయం చేస్తుందంటే.. మీకు ‘వేరొకరితో ‘పెళ్లికి నిర్ణయమైపోయింద’ని అర్ధమట.

పసుపు: ఎలాగూ ఈ రంగు గురించి తెలిసిందే సింపుల్‌గా ‘ఫ్రెండ్‌షిప్‌’ అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఈ రోజున కేవలం స్నేహానికే నా ప్రాముఖ్యత అని పసుపు రంగు డ్రెస్‌ ద్వారా తెలియజేయడం. 

బూడిద: ‘నా కెవ్వరిమీదా ఇంట్రస్ట్‌ లేదు’ అనే వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం గ్రే కలర్‌ ఇస్తుందట. 

పింక్‌: గులాబీ రంగును ప్రేమికుల రోజున ధరించారు అంటే మీరు ‘ప్రపోజల్స్‌కి సిద్ధం’గా ఉన్నారని అర్ధం వస్తుందట. అందుకని, పింక్‌ డ్రెస్‌ ధరించేవారు కొంచెం ఆలోచించుకోవాలట. 

పర్పుల్‌: వంగపండు రంగు అంటారు దీన్నే. ‘మొదటి చూపులోనే ఎవరితోనో ప్రేమలో పడ్డారు’ అని తెలిసిపోతుందట. 

పీచ్‌: ‘నాకు ఫ్రెండ్స్, పార్టనర్‌ లేరు’ అనే భావం వస్తుందట. ఎదుటి వారు కొంత జాలి కూడా చూపుతారట. అందుకని, పీచ్‌ కలర్‌ డ్రెస్‌ ధరించేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిదట. 

పిల్లలని ప్రేమించడం ఎలా?

పిల్లలకి ప్రేమించడం మాత్రమే తెలుసు. వాళ్ళకి పగ, ద్వేషం లాంటివి తెలియవు. కోప్పడినప్పుడు బాధ పడతారు, ప్రేమగా దగ్గరకు తీసుకోగానే అన్నీ మర్చిపోతారు. మనం ఎంత ప్రేమ ఇస్తే అంతే ప్రేమ తిరిగి వస్తుంది.

పిల్లలని బాగా ప్రేమించండి, మీ ప్రేమ వాళ్ళకి అర్థం అయ్యే లాగా మీ పనులలో, మాటలలో చూపించండి. ఉదాహరణకి వాళ్ళు ఏదైనా బొమ్మ గీస్తే, చాలా బాగా వేసావు అని ముందే గమనించి చెప్పడం. వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయడం, వాళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడటం, ఎక్కువ సమయం వాళ్ళతో గడపడం, వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలుసుకోవడం వల్ల మీకు పిల్లలకి మధ్య బంధం బాగా బలపడుతుంది. అపుడు వాళ్ళ ప్రేమని మీరే గుర్తించగలరు.

ప్రేమ – నిర్వచనం

పవిత్రమైనది, అగ్ని లాగా స్వచ్చమైనది, ప్రపంచాన్ని నడిపించేది ప్రేమే.

భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ , అల్లూరి సీతారామరాజు కి ఉన్నది అటువంటి ప్రేమ దేశం మీద

మదర్ థెరిస్సా, డొక్కా సీతమ్మ గారి వంటి వారికి ఉన్నది అటువంటి ప్రేమే – ప్రజల మీద

ప్రతి తల్లి దండ్రులకి ఉండేది కూడా అదే ప్రేమ – పిల్లల ప్రయోజకత్వం మీద

భార్య భర్తలకు ఉండేది అదే ప్రేమ – జీవిత భాగస్వామి మీద

ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలైన ప్రేమ ఇద్దరు పెళ్లి కానీ స్త్రీ పురుషుల మీద అంటే మాత్రం ఇక్కడ మనం కొన్ని పచ్చి నిజాలు మాట్లాడుకోవాలి. అది ప్రేమ, ఆకర్షణ, మొహం , లేక కామమా

ఒక అమ్మాయి అబ్బాయి మంచి స్నేహితులుగా ఉన్నారు అనుకుందాం, జీవితాంతం వారు మంచి స్నేహితులుగా ఉండవచ్చు. పెళ్ళే చేసుకొవలసిన పని లేదు. ఒక అమ్మాయి లేదా అబ్బాయి అందంగా ఉంటే చూడటం వేరు. ఎందుకంటే కళ్ల ముందు బిర్యానీ పెడితే ఆ వాసన కి ఎలా నోరు ఊరుతుందో ఎవరయినా కళ్ళముందు నుండి వెళితే మనం తెలియకుండానే చూస్తాం. ఎందుకంటే అవి హార్మోనులు. ఇపుడు ఆ నచ్చిన వారిని చూసి వెంబడించడం, ప్రతి రోజు సైటు కొట్టడం, ప్రేమించమని వేధించడం ఇవన్నీ వెకిలి పనులు తప్ప ప్రేమ కాదు. దురదృష్టవశాత్తు సినిమాలు నవలలు లో అమ్మాయిని లేదా అబ్బాయి వెంట పడటం, ప్రేమించాను అని చెప్పడమే ఫ్యాషన్ లేదా అర్హత లా చూపిస్తున్నారు. మన యువత కూడా అదే గొప్ప విషయం అనుకుంటున్నారు.

ఒకవేళ మనకి లేదా మనం ఎవరికి అయిన నచ్చితే వాటికి కొన్ని లక్షణాలు కూడా చూసుకుంటారు. అందం, ఆస్తి, చదువు, గుణం ఇలా ఏదైనా అయ్యుండొచ్చు. మరి అలా ఉన్న అందరినీ ప్రేమిస్తూ పోతామా?

చాలామంది నేను చాలా సెన్సిటివ్ అండి, వేటికి తట్టుకోలేను అంటారు. నిజానికి వాళ్ళు సెన్సిటివ్ కాదు, భయస్తులు. సెన్సిటివ్ అంటే రోడ్డు మీద ఒక కుక్క పిల్ల చలికి వణుకుటుంటే చిన్న క్లాత్ కప్పుతామా, దానికి రెండు బిస్కట్లు పెడతామా, వృద్ద యాచకులకు పిలిచి ఇంత అన్నం పెట్టామా.

ప్రేమ కి నిజానికి హద్దులు లేవు. అది ఒకరితో ఆగదు. జాలి ఉండే వ్యక్తి ప్రతి జీవి ని ప్రేమిస్తాడు. ప్రేమించుట అంటే ప్రేమని యిచ్చుట అంతే తప్ప తిరిగి ప్రేమించుట కాదు.

కొందరు సచిన్ ని, అమితాబ్ బచ్చన్ ని, మాధురి దీక్షిత్ ని, మహేష్ బాబు ని, స్వామి వివేకానంద ని, రతన్ టాటా ని కూడా ప్రేమిస్తారు. కానీ జీవితం లో ఒక్కసారైనా వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఐ లవ్ యు అని చెప్పి నన్ను పెళ్లి చేసుకో అంటామా లేక ఇద్దరం డేటింగ్ కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అడుగుతామా ఈ పని మనకి ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళనే అడుగుతూ ఉంటాం. కారణం అందరికీ లవర్స్ ఉన్నారు , మనకి ఉండాలి అని.

ఖచ్చితంగా కొందరు ఉండే ఉంటారు. వాళ్ళది నూటికి నూరు శాతం ప్రేమే. అది కాకుండా ఒక కొత్త జోనర్ లో ఇపుడు అందరూ ఏదైతే ప్రేమ ప్రేమ అనుకుంటున్నారో అది మాత్రం ప్రేమ కాదు అని ఉద్దేశం.

కొందరు నిజాయితీ గా ప్రేమించుకున్నాం, కలిసి బ్రతుకుతున్నాం, పెళ్లి చేసుకున్నాం పెద్దల్ని ఎదిరించి అంటే , మరి మనల్ని ప్రేమించిన తల్లిదండ్రులనే బాధ పెట్టినపుడు వచ్చే వారిని మాత్రం ఏం సంతోషం గా చూసకోగలం.

రాధ కృష్ణులు కూడా ప్రేమికులే కదండీ అంటే ఇక్కడ రాధ కృష్ణుణ్ణి జీవితాంతం ఆరాధించింది తప్ప తననే పెళ్లి చేసుకోలేదు. త్యాగరాజు కూడా రాముణ్ణి అలానే ప్రేమించాడు. రామకృష్ణులవారు కాళీ మాతను అదే విధంగా ప్రేమించారు.

ప్రేమ కి ఉన్న చాలా పేర్లు

అనురాగం – తల్లిదండ్రులతో

భాద్యత – కుటుంబం మీద

కర్తవ్యం – ఉద్యోగం మీద

భక్తి – దేవుడిమీద

స్నేహం – మిత్రులతో

అభివృద్ది – దేశం మీద

రక్షణ – సైనికులకు

ప్రేమ – కోట్స్

నాకంటూ పెద్ద కలలేం లేవు. కానీ ఒక కల మాత్రం ఉంది. నువ్వూ నేనూ ఎప్పుడూ కలిసుండాలని!

ప్రేమగా, అద్భుతంగా నాప్రేమనంతా మాటల్లో చెప్పలేను. కానీ.. ఒక మాట మాత్రం చెప్పగలను.

ఈ జీవితంలో నిన్ను ప్రేమించినంతంగా ఇంకెవరినీ ప్రేమించలేను. కాదు.. కాదు.. ఈ జీవితంలో నిన్ను మాత్రమే ప్రేమించగలను’

అమ్మాయి కి తొందరగా ఎందుకు పెళ్లి చెయ్యాలి

అమ్మాయికి త్వరగా వివాహం చేయాలని సమాజంలో ఎక్కువమంది తల్లిదండ్రులు ఆతృత పడుతుంటారు. దీనికి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, సంప్రదాయాలు కారణం.

సామాజికం

మనిషి సంఘజీవి. సంఘానికి భయపడతారు. గౌరవిస్తారు. నిత్యం వచ్చే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మీకెంతమంది పిల్లలు. ? ఇద్దరాడపిల్లలా. ఇంకా పెళ్లి చేయక పోవడమేమిటి.రోజులు బాగోలేదు. త్వరగా చేసేయండి. ఉచిత సలహా ఇచ్చి, వెళ్లిపోయారు. ఆ యజమానికి కంగారు మొదలవుతుంది.

ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు

నీ కాలంలో, మా కాలంలో చిన్నప్పుడే పెళ్ళిళ్ళయి పోయేవి. మీరెందుకు చేయరు. అమ్మాయి పెళ్లి చూసి చనిపోదామని ఉంది. నా కోరిక తీర్చవా?

చుట్టాల రొద

ఏమిటమ్మా వదినా! మన బంధువుల్లో. మీ అమ్మాయి వయసున్న వారందరికీ వివాహాలయ్యాయి. మీరేమో చదువులు, చట్టుబండలంటూ ఆలీశ్యం చేస్తున్నారు. ప్రమాదం సుమా.

ఇలా సామాజికంగా రకరకాల వత్తిళ్లతో అమ్మాయికి తొందరగా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు.

సంప్రదాయం

ఏ దేశమైనా ప్రజలు సంప్రదాయానికి విలువిస్తారు. మన దేశంలో ఇది మరీ ఎక్కువ. పూర్వకాలం నుంచి భారత దేశంలో చిన్నతనం నుంచే వివాహాలు చేయడం పరిపాటిగా వస్తోంది. శాస్త్రీయ దృక్పథం పెరగడం, స్త్రీ విద్య వికాసం, చట్టాల వల్ల యుక్త వయసులో పెళ్లిళ్లు చేయడం పెరిగింది. హిందూ వివాహ మంత్రాలు గమనిస్తే చిన్నతనంలోనే వివాహాలు జరిగిన తీరు అర్ధమవుతుంది. అందులో ఒకటి చూద్దాం. కన్యాదాన సమయంలో..

‘ అష్ట వర్షా భవేత్ కన్యా.’

కన్యాదాత, చిన్న వయసులో ఉన్న తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకోమని అప్పగిస్తాడు. కన్యాశుల్కం ఎక్కువగా వున్న రోజుల్లో కడుపులో వున్న శిశువును ఆడపిల్లగానే భావించి అమ్మేసే వారు. ఈ విషయం ‘ కన్యాశుల్కం’నాటకం ఆనాటి బాల్యవివాహాలకు అద్దం పడుతోంది.

ఆర్ధిక పరిస్థితులు

నిజానికి ఓ ఆడపిల్ల కన్న తల్లిదండ్రులకు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో, అంతకు మించి తర్వాత ఖర్చు చేయాల్సి వస్తుంది. పండుగలు, పురుడు, కాపురానికి పంపడం వంటి ఎన్నో ఖర్చులు అమ్మాయి తల్లిదండ్రులను కుంగదీస్తాయి. అందుచేత తమకు ఓపిక, ఆర్ధిక పరిస్థితి బాగుండగానే అమ్మాయికి వివాహం చేయాలని తల్లిదండ్రులు తొందర పడుతుంటారు.

అత్త – కోడలు

అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అత్త గారు కోడలి గారికి ప్రధమ విమర్శకురాలు. ఒక రకంగా ఆమె కోడలు చేసిన పనిని విమర్శనాత్మకంగా చూస్తుంది. కోడలు వేరే ఇంటిలో వేరే పద్దతులు నేర్చుకొని వస్తుంది. ఇంకా ఆమె అక్కడ పూర్తి స్వతంత్రురాలు. తల్లి చాటు బిడ్డ. తండ్రికి గారాల పట్టి. అందువల్ల కాఫీ తాగి స్నానానికి వెళ్ళటం, వంట చేసేప్పుడు రుచి చూడటం వగైరాలు. ఇవి తల్లి మందలించి ఊరుకుంటుంది. కానీ అత్తగారికి నచ్చకపోవచ్చు.

అత్తగారికి కోడలు పొద్దున్నే లేచి స్నానం అది చేసి తరువాత పూజ అయ్యాక కాఫీ తాగాలి, వంట చేసేప్పుడు జాగ్రత్తగా చేయాలి గాని, ఉప్పు సరిపోయిందా లేదా అని రుచి చూడటం లాటివి నచ్చవు.

ఆమె చేస్తే అది అవసరం అనుకోండి. ఎందుకంటే ఉప్పు కషాయం అయితే ఆమె కొడుకు అలుగుతాడు కదా. దాంతో ఆమె సహజంగా ఇవేమీ పద్ధతులు అని విమర్శిస్తుంది.

అంతటితో ఊరుకోకుండా పక్క వాళ్లకు ఎదురు వాళ్లకు చెప్తుంది. దాంతో కోడలు గారు పద్ధతి తెలియని మనిషి అని గడుగ్గాయి అని ఇరుగు పొరుగు అనుకుంటారు.

అదే అత్తగారు లేరనుకోండి, కోడలు గారు పక్కవాళ్ల కు ఆమె చేసిన స్వీట్, హాట్ ఇచ్చి రుచి చూడండి అంటుంది. వాళ్ళు అబ్బా ఈమె ఎంత మంచిది, ఎంత ఉత్తమురాలు అందరికి అన్ని ఇస్తుంది, అరమరికలు లేకుండా ఉంటుంది. అని ప్రశంసా పత్రం ఇస్తారు. వాళ్లకు కోడలు స్నానం చేసి స్వీట్ చేసిందా లేక పూజ అయ్యాక దేవుడికి నైవేద్యం పెట్టిందా అనే విషయాలు అవసరం లేదు, అవి చెప్పటానికి అత్తగారు ఏమో అక్కడ లేకపోయే.

ఇంకా కోడలు లేని అత్త గుణవంతురాలు ఎందుకంటే.

ఆమె గురించి చెప్పేందుకు కోడలు లేదు. ఆమె వయస్సు పెద్దరికం వల్ల అందరికి , వడియాలు పెట్టేపుడు పిండి గుడ్డ పైన వేయలా లేక పేపరు పైన వేయలా అనే విషయాలు చెప్తుంది. ఇంకా అడిగితే, కోడలు ని ప్రతిదానికీ అరవకూడదని, పాపం వేరే ఇంటి నుంచి వచ్చి నేర్చుకోవటానికి సమయం పడుతుందని చెప్తుంది. (అంటే ఆమెకు కోడలు లేదు గా, పక్క వాళ్లకు చెప్పటమే కదా) దాంతో పక్క వాళ్ళ కోడలు అబ్బా ఇమే ఎంత మంచిది, ఎంత సహన సంపద ఉంది, ఎంత గుణ మంతురాలు మా అత్తగారు కూడా ఉంది ఎందుకు, సూర్య కాంతనికి జిరాక్స్ కాపీ అనుకుంటుంది.

పిల్లలను – కొట్టడం తిట్టడం చేయరాదు

దీని గురించి ఒక మంచి శ్లోకం ఉన్నది సంస్కృతంలో.

రాజవత్ పంచవ ర్షా ని

దశ వర్షా ని దాసవ త్

ప్రాప్ తే తు షోడసే వర్షే

పుత్రం మిత్రవదాచ రే త్

అంటే చిన్న పిల్ల వాడిని రాజువలే పెంచాలి అయిదు సంవత్సరాలు.ఎలాంటి ఇబ్బందీ లేకుండా.ఆ తర్వాత పది సంవత్సరాలు సేవకుని వలె ఎంతో క్రమశిక్షతో పెంచాలి.ఇలా 15 సంవత్సరాలు గడిచిపోతాయి. పదునారవ సంవత్సరం వచ్చిన తర్వాత పుత్రుని మిత్రునిలా చూడాలి.అంటే తిట్టినా లేదా ఒక దెబ్బ వేసినా అది 15 సంవత్సరాలు వచ్చేవరకు మాత్రమే. ఆ తర్వాత చాలా గౌరవంగా ఒక మిత్రునితో మాట్లాడినట్లు మాట్లాడాలి.అలాగే అయిదు సంవత్సరాలు నిండే వరకు పిల్లలను చాలా ప్రేమతో పెంచాలి.కొట్టడం తిట్టడం చేయరాదు.

పెళ్లిళ్లు – కోరికలు

పెళ్లి అయినా వెంటనే భర్త అన్ని సౌకర్యాలు అమర్చాలి అని యువతులు ఆశిస్తూ ఉన్నారు. కారు తో సహా. ఇక యువకులు అయితే భార్య ఉద్యోగం చేసి సంపాదించాలని కొందరు ఆశిస్తే, కోరికలు తగ్గించు కుని ఉన్నంతలో సర్దుకు పోవాలని కొందరు ఆశిస్తారు. ప్రస్తుతo ఎక్కువ మంది యువతులు సమానత్వం ఆశిస్తున్నారు. స్వేచ్చను ఇది వరకు కంటే ఎక్కువ ఆశిస్తున్నారు.పెళ్లి అంటేనే సర్దుబాటు. సర్దు బాటు లేని సంసారం ఎక్కువ కాలం నిలబడ దని నా అభిప్రాయం.

పరిపక్వత ఉంటే వాస్తవానికి దగ్గరగా అలోచించగలరు. ఉద్యోగం చేసే యువతి ఆశించే దొకటి. ఉన్నత వర్గాల యువతీ, యువకుల ఆశలు వేరే. పెళ్లిళ్లు చాలా విఫలం అవుతున్నాయి. కారణం ఎమిటి? తీర్చలేని కోరికలు, అత్యాశలు కారణం. వాస్తవానికి దూరంగా అంచనాలు.

తక్కువ ఆశిస్తే ఎక్కువ పొందవచ్చు. మనం మన భాగస్వామి నుండి ఏమి ఆశిస్తున్నామో, మనం భాగస్వామి ఆశలు ఆలాగే ఉంటాయని అర్ధం చేసుకుంటే సమస్యలు తగ్గుతాయి. పెళ్లి గురించి చిన్న కొటేషన్, మనలో ఏ లక్షణాలు లేవో, ఆ లక్షణాలు ఉన్న వాళ్ళను పెళ్లి చేసుకుంటే, ఆ పెళ్లి జయప్రదం అవుతుంది.

నవ వదు వరులు – సలహాలు – సూచనలు

సలహాలు

వివాహం అయిన మొదట్లోనే మీ మనసంతా కోసి అవతల వారికి ఇచ్చేయకండి. మెల్ల మెల్లగా ఒక్కో తెర తొలగి, ఒక్కో విషయం తెలుసుకుంటూ తెలుపుతూ ముందుకు సాగండి. మీ ఆవీ జీవీ అంతా పిండుకుని చెప్పినా అవతల వారికి అర్ధం ఔతుందని ఏమీ గ్యారంటీ లేదు. నిరుత్సాహం తప్ప ఇలా చేస్తే ఫలితం ఏమీ లేదు.

పెళ్లికి ముందే మాట్లాడుకున్నాం, నిర్ణయించుకున్నాం కనుక అలాగే జరగాలి జరుగుతుంది అని అనుకోకండి. పెళ్లికి ముందు అమ్మాయి అమెరికా వెళ్దాం అనచ్చు, పెళ్లయ్యాక ఇండియాలోనే ఉందామని అనుకోవచ్చు..పెళ్లికి ముందు పిల్లల ఇప్పుడే వద్దు అనుకోవచ్చు, పెళ్లయ్యాక వెంటనే కావాలి అనిపించవచ్చు. All decisions are and will always be subject to change. మీరు వారితో కలిసి ప్రయాణించడం, కలసిన మీ అభిప్రాయాలు, నిర్ణయాలు వల్ల కాక, కలిసి నడవాలి అనే మీ నిర్ణయం వలన మాత్రమే అయితే మంచిది.

మా అమ్మ ఇలా చేసేది, మా నాన్న ఇలా చేసేవారు లాంటివి మాట్లాడకూడదు. అంటే వాళ్ళని మర్చిపోవాలనో, గుర్తుతెచ్చుకోకూడదనో కాదు. పోల్చకూడదు అని. అమ్మా నాన్నలు చేసినట్టు మనకు ప్రపంచంలో ఎవరు చేయరు భార్య అయినా భర్త అయినా. అందుకే వాళ్ళతో పోల్చి పక్క వాళ్ళ నించి ఆశించకండి.భార్య అమ్మ ఎలా అవుతుంది. భర్త తండ్రి ఎలా అవుతాడు.

సాధారణంగా పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలు ఇంట్లో వున్నా సమయంలో తమ ఇంటి వాళ్ళ నుంచి ఫోన్ వస్తే పక్కవారిని ఎక్కడిక్కక్కడే వొదిలేసి బాల్కనీ లోకో, లేకపోతే ఇంటి బయటకి పోయి మాట్లాడుతుంటారు . అలా చేయడం వల్ల మీ భాగస్వామి తాను వేరు మీ కుటుంబం వేరు అని, లేకపోతే తన మీద మీరు ఏమైనా చెప్తున్నారు ఏమో అని ఓ అని ఊహించుకుని బాధపడిపోతుంటారు . ఇలాంటివి వారు బయటకు చెప్పటం బహు అరుదు.

కాబట్టి ఇక మీదట ఇద్దరు ఇంట్లో వున్నపుడు ఫోన్ వస్తే ముందు మీ భాగస్వామిని ఫోన్ ఎత్తి మాట్లాడమని ప్రోత్సహించండి కావాలంటే “తాను స్నానం చేస్తున్నాడు/చేస్తున్నది” అని చెప్పి ఒక పది నిముషాలు మాట్లాడే విధంగా చేయండి. తద్వారా ఇరువురికి తమ భాగస్వామి యొక్క కుటుంబంతో చక్కటి సాన్నిహితం కలుగుతుంది. కలగకపోయిన అధమపక్షం దూరం లేక అపార్థం వంటివి జరగవు. ఒక సదభిప్రాయం కలుగుతుంది.

తల్లి తండ్రులకి ఊరికే రోజుకో పది సార్లు ఫోన్ చేసి మా అయన ఇలా అన్నారు, మా ఆవిడ ఇలా చేసింది లాంటివి చెప్పకూడదు.

స్నేహితులతో పూస గుచ్చినట్టు మన ఇంట్లో విషయాలు అన్నీ చెప్పెయ్యకూడదు.

బంధం నిలవాలంటే

ఒకరి మీద ఒకరికి నమ్మకం విశ్వాసం చాలా అవసరం. ముందు తరాలవారు సాధారణంగా తెలిసిన వారిని బంధుత్వం కలిసిన వారితోనే వివాహాలు జరపడం వలన భార్యభర్తలు ఒకరికొకరు తెలిసి వారి స్వభావం కూడా తెలిసేది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబాలు కావడం వల్ల ఇబ్బందులొస్తే సర్దుబాటు చేయడం జరిగేది. కాలానుగుణంగా పరిస్థితులను బట్టి ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలయ్యాయి. తల్లిదండ్రులు ఇరువురు సంపాదనాపరులైతే కుటుంబాలుసాఫీగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడిచే పరిస్థితులొచ్చాయి. ప్రేమ వివాహాలు కులమత దేశ భాషల బేధాలను చెరిపి ఇరువురిని ఒకటిగా చేస్తున్నాయి. విద్య ఇరువురి సమానమైతే హక్కుల గురించి పోరాటాలు బలమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో భార్యభర్తలు ఒకరి మీద మరొకరు నమ్మకం కలిగుండడం తమ వైపు నుండి బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం చాలా ముఖ్యం. ఇరువురి వైపు నుండి సర్దుబాటు చేయడానికి మిత్రులు తప్ప మిగిలిన వారి ప్రమేయం లేకపోవడం సున్నితంగా ఆలోచించడం చాలా అవసరం. దానితో బంధం గట్టి పడి తమతమ బాధ్యతలు గుర్తుంచుకునేలా చేస్తుంది.

సూచనలు

పెళ్లి లో ప్రేమ కన్నా బాధ్యత కే ప్రాముఖ్యత ఎక్కువ. నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తాను అని మన మంత్రాలలో ఉండదు..అసలు ప్రేమ అన్న పదం వేదాలలో ఉందో లేదో… నేను నిన్ను ఎప్పుడూ విడువను, అతిక్రమించను అనే ఉంటుంది మన మంత్రాలలో. ప్రేమ ఒక భావన అది ఎప్పుడైనా ఎలాగైనా మారచ్చు. భావనలు, ఉద్వేగాలూ మారిపోతాయి. బాధ్యతలు అంత తేలికగా వదిలేవు కావు.

పెళ్లికి కావలసినది Compatability కాదు, companionship.

మేనరికం

భారతీయ వివాహ సంబంధాల ఆచారాల్లో మేనమామ కూతురు, అక్క కూతురిని చేసుకోవడం ‘మేనరికం ‘ అంటారు. ఇవి ఆచార సమ్మతమైన వివాహ సంబంధాలు. మేనత్త కూతుర్ని చేసుకోవడం ‘ ఎదురు మేనరికం ‘ అంటారు. మేనమామ కూతుర్ని చేసుకోవచ్చు. అక్క కూతుర్ని చేసుకోవచ్చు. మన సంప్రదాయం ప్రకారం మేనత్త కూతుర్ని చేసుకోరాదు.

ఈ మూడు వరసల్లో ఏది చేసుకున్నా, ఆ దంపతులకు పుట్టే సంతానం అవకరాలతో జన్మిస్తారని వైద్య శాస్త్రం చెబుతోంది. అవకరాలు లేకుండా పుట్టిన సందర్భాలు బాగానే వున్నాయి. ఒక తరం వరకూ కొంత పరవాలేదు. కానీ రెండు మూడు తరాలవారు మేనరికాలు చేసుకుంటే, ఖచ్చితంగా అవకరాలతో పిల్లలు పుడతారనడానికి చాలా దృష్టాంతరాలున్నాయి. బయటి సంబంధాలు చేసుకుంటే, ఆస్తులు బయటకు వెళ్లిపోతాయని చాలా మంది మేనరికాల వైపు మొగ్గు చూపుతున్నారు. బయటి అమ్మాయి, అబ్బాయి అలవాట్లు, ప్రవర్తన, సంప్రదాయం ఎలా ఉంటాయోనని భయపడి దగ్గర సంబంధాలు చేసుకోవడం పరిపాటి అవుతోంది.

రెండు మూడు తరాల్లో మేనరికాలు చేసుకుని, అవకరాలతో బిడ్డలు పుట్టడం, వారిలో చాలా మంది చనిపోవడం, వంశమే నిర్వీర్యం అయిన కుటుంబాలు ఎన్నో నేడు తప్పు చేశామని కుమిలిపోతున్నాయి. కాబట్టి, మేనత్త కూతురే కాదు, మేనమామ కూతురు, అక్కకూతురు సంబంధాలు కలుపుకోక పోవడమే శ్రేయస్కరం.

మేనత్త కూతురిని చేసుకోరాదనే నియమం వెనుక పెద్దల దూరదృష్టి ఉందనిపిస్తోంది. ఈ మేనత్త తన తల్లికి ఆడపడుచు కదా! ‘ ఆడ పడుచు అర్ధ మొగుడు ‘ అనే సామెత ఉందిగా. ఆమె తన వదిన గారిని కష్టాలు పెట్టడమో, అధికారం చెలాయించడమో చేసి వుండొచ్చు. ఇపుడు ఆమె కూతుర్ని తన కొడుకుకు చేసుకుంటే, పాతకక్షతో వచ్చిన అమ్మాయిని కష్టాలు పెడుతుందని… ఇలాంటి ఆచారం సృష్టించి వుంటారు.

మేనరికపు పెళ్లిళ్లా, జర ఆలోచించండి!

Consanguineous Marriage Risk And Doubts - Sakshi

మేనరికపు పెళ్లిళ్లు లేదా రక్తసంబంధీకులు లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహాలు జరిగితే… వాళ్లకు పుట్టబోయే బిడ్డల్లో అంగవైకల్యాలు, ఆరోగ్య సమస్యలు ఎందుకొస్తాయో తెలుసుకుందాం. సంక్షిప్తంగా చెప్పాలంటే… బిడ్డకు తల్లి నుంచి 23, తండ్రి నుంచి∙23 క్రోమోజోములు వస్తాయి. ఈ క్రోమోజోములు తల్లిదండ్రుల నుంచి పుట్టబోయే బిడ్డలకు వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తాయి. కాసేపు దంపతులిద్దరూ రక్తసంబంధీకులు కాదని అనుకుందాం.

అప్పుడు ఒక సమాచారాన్ని బిడ్డకు చేరవేసే ఒక జన్యువు తండ్రిలో లోపభూయిష్టంగా ఉందనుకుంటే… తల్లి తాలూకు మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అవుతుంది. అదే తల్లిలో ఉండే లోపభూయిష్టమైన అదే తరహా జన్యువును తండ్రి తాలూకు జన్యువు డామినేట్‌ చేసి, బిడ్డలో లోపం రాకుండా చూస్తుంది. కానీ ఇద్దరూ ఒకే కుటుంబాలకు సంబంధించిన వారైతే ఒకవేళ ఇద్దరిలోనూ సదరు సమాచారాన్ని తీసుకెళ్లే జన్యువులో లోపం ఉందనుకుందాం. అప్పుడు దాన్ని అధిగమించేలా చేయడానికి డామినెంట్‌ జన్యువు ఏదీ లేకపోవడంతో బిడ్డలో జన్యుపరమైన లోపం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.

ప్లటోనిక్ లవ్ (Platonic love)

ఆలుమగల మధ్య కల బంధం మొదట్లో కేవలం శారీరిక సంబంధ సుఖాల పట్లే కేంద్రీకరింపబడినా, సమయంగడిచే కొద్దీ వారి సంబంధం మానసికమౌతుంది. అప్పుడు వయసు మళ్ళిన తర్వాత శరీరం ఉడిగినా, వారు ఇంకా ప్రేమించుకుంటూనే ఉంటారు.. అయితే ఈ ప్రేమ మానసికం. నా ఉద్దేశ్యంలో పరిపక్వమైన ప్రేమను మనము పొందగలిగేదీ, ఇవ్వగలిగేదీ ఇప్పుడే. శారీరిక ఆకర్షణ అన్నది మొదట పునాది వేస్తుంది ..మానసిక పరిణితి ఆ పునాదుల మీద తర్వాతి దశకు మనలను చేరుస్తుంది.

తల్లిదండ్రులు – పొరపాట్లు

ధైర్యం- అతను ఈ స్వంత పాషన్‌ను ఎంచుకుంటే నా పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉంటుంది

ప్రకటనలు – 8 వ తరగతిలోనే ఐఐటి కోచింగ్ ప్రారంభమయ్యే పాఠశాలల్లో పిల్లలను చేరడం.

గుర్తింపు – భవిష్యత్తులో వారి పిల్లలు ఏమి కావాలనుకుంటున్నారో తెలుసుకోవడం. వారు ఎలా ఉండాలనుకుంటున్నారు? హాహాహా! తల్లిదండ్రులు తమ చుట్టూ ఉన్నవారి మాటలు వింటారు కాని వారి స్వంత పిల్లలను వినరు.

విద్య ముఖ్యం కాదు. మీ పిల్లలను ఆంగ్ల భాషలో మాత్రమే బోధించే ఇంటర్నేషనల్ పాఠశాలలు లేదా పాఠశాలల్లో చేరడం సరైన ఎంపిక కాదు. పిల్లలకు నీతి, నీతులు నేర్పించాలి. విద్య కంటే పాత్ర ముఖ్యం.

కంఫర్ట్ జోన్ – పిల్లలకు కావలసినది ఇవ్వడం. మీరు కోరుకున్నదంతా మీరు ఇస్తే, దాని విలువ వారికి తెలియదు.

గౌరవం – తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పొరుగువారు, ప్రతి వ్యక్తిని గౌరవించాలి.

తల్లిదండ్రులు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారో, అది పిల్లలు గమనిస్తారు. వారు వారి తల్లిదండ్రుల చర్యల నుండి నేర్చుకుంటారు. మీరు ఫోన్‌తో ఉంటే, వారు కూడా ఫోన్‌ను ఉపయోగిస్తారు.

ప్రేమ – సైకలాజికల్ భావాలు

ప్రేమ ఒక మధురమైన అనుభూతి. ఒక వస్తువు మీద ప్రేమ కలిగింది అంటే దానిని అపురూపం గా దాచుకుంటారు . మనుషుల్ని ప్రేమిస్తే ,సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ప్రేమిస్తున్నారు , ప్రేమని పొంది అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు కొంత మంది చాలా హుషారు గా వుంటారు. కొంత మంది నాకేంటి నేను సాధించాను అని చాలా గర్వంతో వుంటారు.

కొంత మంది పెళ్లి కుదిరింది అనుకోండి. రోజంతా మొబైల్ లో మాట్లాడుకుంటూ ,ప్రేమజంట లా ఫీల్ అవుతారు. పెళ్లి కట్నం మూలం గా, లేదా ఉద్యోగం మూలంగా జరుగుతోంది అని అసలు అనుకోరు. అది కూడా ప్రేమ గా భావిస్తారు. ప్రేమించడం వేరు , ప్రేమించుకున్నాం అని ఫీల్ అవ్వడం వేరుగా వుంటాయి.

నిజం గా ప్రేమ వుందా లేదా అన్నది పరిస్థితులు తెలుపుతాయి. ఒకమ్మాయి ఒకబ్బాయి నీ తెలివి తేటలు చూసి ప్రేమిస్తే ,ఆ అబ్బాయి రాంక్ బాగా లేకపోతే, నెమ్మదిగా గా రాంక్ వచ్చిన అబ్బాయిని చూసుకుని , ప్రేమను ఆ అబ్బాయి తో మొదలు పెడుతుంది. ఇక్కడ పరిస్థితులు మీద ఆధారపడింది ప్రేమ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి నీ అందం చూసి ప్రేమిస్తే ,ఇంకా అందమైన అమ్మాయి కనుక దొరికితే నెమ్మదిగా ఆ అమ్మాయితో ప్రేమాయణం మొదలు పెడతాడు. మొత్తానికి ఎవరైనా వాళ్ళ కు లభించే విధంగా వుంటేనే ఇలాంటి ప్రేమలు మొదలు పెడతారు.

అందాన్ని ప్రేమించాలంటే ,ప్రపంచ సుందరిని ప్రేమించ వచ్చు.కానీ లభించదు కనుక ఆ ప్రేమను దొరికే వాళ్ళ మీద ప్రయత్నిస్తారు. ప్రేమించారు కాబట్టి ప్రపంచ సుందరి కానక్కరలేదు. ప్రపంచ సుందరి ఎలాగూ దొరకదు అందుకు ప్రేమించడం మానెయ్యరు కదా. ఎవరో ఒకరు గంత కు తగ్గ బొంత అని తృప్తి పడతారు. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. ఏం చూసింది ప్రేమించింది…… అని హాశ్చర్య పోతారు జనాలు.

అంతకంటే అందమైన వాళ్ళు వుండ రా లోకం లో ? వుంటారు కానీ దొరకాలి కదా… సరిపెట్టు కొని ప్రేమిస్తారు. ఈ విధంగా పరిస్థితులు ప్రేమను మారుస్తూ వుంటాయి. ఇవేమీ ఆలోచించకుండా ,ప్రేమించి విఫలం అవుతారు కొంత మంది.

బావా మరదళ్ల ప్రేమ వుండేది.అది అందరికీ ఆమోదయోగ్యం గా వుండేది. నిజానికి బావా మరదళ్ళు సహ జీవనం చేసేవారు. ఒకరి గురించి ఒకరు ముందే తెలుసుకుని వుండేవారు.

బాల్య ప్రేమలు నుండి హైస్కూల్ ప్రేమ, కాలేజీ ప్రేమ, యూనివర్సిటీ ప్రేమ, కొంచెం లేటు గా PhD ప్రేమ, లాండ్ లైన్ ఫోన్ ప్రేమలు నుండి పేజర్ ,మొబైల్, వాట్స్ అప్ , ఫేస్బుక్ , ఇలా ఇంటర్నెట్ ప్రేమల వరకూ, ప్రక్కింటి ప్రేమ నుండీ గ్లోబలింటి వరకూ ప్రేమ విస్తరించింది.

కొంత మంది అమ్మాయిలు కానీ,అబ్బాయిలు కానీ వాళ్ళ అవసరాలు తీరే దాకా చుట్టూ ఏదో వంకన తిరుగు తారు. ప్రపోజ్ చేస్తే ఎలాంటి ఉద్దేశ్యం లేదు అని చెబుతారు. లేదా నాకు ఇష్టమే ,మా ఇంట్లో అడగమంటారు. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఇలా చెప్పరు. ప్రేమ చూపించి నప్పుడు ,ఇంట్లో వాళ్ళు గుర్తు వుండరు. ఈ లోగా ఎదుటి వారిని వాడుకుని ,వదిలేస్తారు. ఇది అబ్బాయిలు చేస్తే, అన్యాయం అంటారు. అమ్మాయి చేస్తే, అంత స్పందించరు. ఏది ఏమైనా అలా ఒకరిని ప్రలోభ పెట్టీ,మొహం చాటు వెయ్యడం వల్ల ,ఇంకొకరి తో ప్రేమాయణం మొదలు పెట్టడం వలన, తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఎలా గెలవాలో ప్రేమ కి తెలుసు.

పెళ్లి – భవిష్యత్తు బాధ్యతలు

పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తంతు అయినా, ఇద్దరి కుటుంబాలు, ఆ సభ్యుల భవిష్యత్తు కూడా వీరు ఇద్దరి పై ఆధార పడి ఉంటుంది. అమ్మాయి కేవలం భర్తను మాత్రమే దృష్టిలో పెట్టుకుని లేదా భర్తకు మాత్రమే చెందినది భావించడం ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం. అమ్మాయికి తన తల్లిదండ్రులు ఎంత ముఖ్యులతో, వారు శారీరకంగా , మానసికంగా బాగుండాలని ఎంతగా కోరుకోరుకుంటుందో, అబ్బాయి కూడా అంతే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అత్తమామల సేవ కోసమే అమ్మాయిజీవితం గడపాలని కోరుకునే వారి ఆలోచన లో ఎంత తప్పు ఉందో, పెళ్లి చేసుకున్న అబ్బాయి పట్ల తప్ప మరెవరి బాధ్యత తనది కాదని భావించడం కూడా అంతే తప్పు. అటువంటి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం లో తన బాధ్యత, అవసరం ఉందని అమ్మాయి తెలుసుకోవాలి.

అమ్మాయి అత్తవారింటికి ఎంత కొత్తో అత్తవారికి అమ్మాయి కూడా అంతే కొత్త కనుక కొన్ని అభిప్రాయ బేధాలు, అలవాట్ల లోని తేడాలు వల్ల, ఇరు వైపుల జరిగే చిన్న చిన్న తప్పుల్ని ఇద్దరు వదిలేస్తూ ఉండాలి. అమ్మాయి తన అమ్మగారింట్లో ఉండే వ్యక్తుల్ని ఎలా అయితే వారి ఇష్టాయిష్టాలు, గుణ దోషాలతో వారిని వారుగా స్వీకరిస్తూ ప్రేమించిందో అదే విధంగా అత్తవారింట్లో వారిని స్వీకరించే దృక్పథాన్ని అలవరచు కోవాలి. అలా స్వీకరించే మనస్తత్వం లేక పోవడం వల్లనే ఎన్నో కుటుంబాలలో చిన్న విభేదాలు ఆధారంగా అత్తమామలకు , కోడలికి పొసగక కలిసి ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది.

క్రమంగా వారు శారీరికంగా బలహీనులు అయ్యాక వృద్దాశ్రమాలకు చేరే అగత్యం వస్తోంది. కుటుంబ కలహాలు ,వాటి కారణాలు నివారణ పై దృష్టి పెట్టిన న్యాయవాదులు, మానసిక శాస్త్రవేత్త లు ఈ విషయం తెలియజెప్పడం కోసమే పెళ్లికి ముందు కౌన్సిలింగ్ జరగాలని సూచిస్తున్నారు అంటే స్వీకరించడం అనే ఒక గుణం ఎంత తక్కువ గా ఉందో దాని తాలూకు పర్యవసానాలు ఎంత బాధాకరం గా ఉన్నాయో ఊహించ వచ్చు.

వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చెయ్యాలంటారు

వెయ్యి అబధ్ధాలు అనేది అతిశయోక్తి మాత్రమే. సాధారణంగా ఎవరూ సమస్త సద్గుణసంపన్నులు కారు.ప్రతి వధువు, వరుని లోఏదో ఒక చిన్న లేక పెద్ద లోపం ఉంటుంది. కానీ వారు వైవాహిక జీవితానికి పనికి వస్తారు.ఇలా సంప్రదింపులు జరిపే టపుడు 99 విషయాలు నిజమే.చెబుతారు.ఏదో ఒక విషయాన్ని కప్పిపుచ్చుతారు. .ఇది కొంత వరకు సమర్ధనీయమే.కానీ చదువు, ఉద్యోగం. లేదా.ఆరోగ్య విషయాలలో అబధ్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు.

ఈమధ్య ఇలాంటి వి కొన్ని చూస్తున్నాము.ITC లో ఉద్యోగం. అని చెబుతారు. పెళ్ళయిన తర్వాత తెలిసిందేమిటంటే అతను ITC లో చిన్న కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఇలాగే ఒక అబ్బాయి దుబాయ్ లోఉద్యోగం చేస్తున్నాడు అని నమ్మించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అతను దుబాయ్ వెళ్లి పోయాడు.ఎన్నాళ్ళకు భార్యకు వీసా.పంపించ లేదు.చివరకు ఎంక్వైర్ చేస్తే అతను అక్కడ ఒక అధ్యాత్మిక కేంద్ర ము లో పని చేస్తున్నాడు. అతనికి జీతం ఏమి ఉండదు ఎక్కువగా. వసతి,భోజనం మాత్రమే కల్పిస్తారు.అతని కుటుంబసభ్యుల ను తీసుకుని వచ్చేందుకు అనర్హుడు.

ఇలా కావాలని అబధ్ధాలు ఆడినవారు తమ చర్యను సమర్ధించుకొనేందుకు పుట్టించిన సామెత.

వివాహం vs సహజీవనం

వివాహం అనేది ఒక వ్యవస్థ- ఏ దేశంలో అయినా దాని మూలాలు, భూమికి, గొడ్డుకీ ప్రతిగా వారసుడిని ఇచ్చి, పనికి వచ్చే పిల్లలను కనిచ్చే ఒక ఆడమనిషిని ఇవ్వడంతో మొదలయ్యింది. కాల క్రమేణా ఆ వ్యవస్థ రూపాంతరం చెందింది. ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఆడవారికి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు కాబట్టి, నచ్చినా నచ్చకున్నా, వివాహాలలో ఉండేవారు. విడాకులు అనే చట్టం మన దేశానికి వచ్చి గట్టిగా 75 ఏళ్ళు కాలేదు, అంత మాత్రం చేత మన వ్యవస్థ అద్భుతమని, న భూతో న భవిష్యత్ అని 90ల లో వచ్చిన తెలుగు సినిమా డైరెక్టర్ లాగా మనం భుజాలు తట్టేసుకో అక్కర్లేదు.

సహజీవనం అనగానే ప్రతి ఒక్కరూ ఊహించుకునేది, ఇవాళ ఒకరితో, రేపు ఇంకొకరితో అని, మన ఆలోచన అక్కడితో ఆగిపోతుంది, అటువంటి ఆలోచన ఉన్న వారు పెళ్ళి చేసికొని, సమాజానికి భయపడి ఉంటారే తప్ప తమకీ తమ మనసుకు విలువ ఇవ్వరు. నేను పెళ్ళి చేసుకున్నాను కాబట్టి నేను గొప్ప, వాళ్ళు నాకంటే భిన్నంగా ఉన్నారు కాబట్టి వారు కుక్కలతో సమానం.. ఇలా ఉంటాయి మాటలు..

ఏ వ్యవస్థ అయినా, అందులోని మనుషులని బట్టే ఉంటుది… అది పెళ్ళైనా, సహజీవనం అయినా..

పెళ్లికి, దానంతట దానికే ఏ గొప్పతనం ఉండదు మనం ఆపాదిస్తే తప్ప.. అలాగే సహజీవనానికి కూడా.. దానంతట దానికి ఏ అవలక్షణం ఉండదు మనం ఆపాదిస్తే తప్ప! మన వివాహ వ్యవస్థలో లోపాలు— ప్రేమ రాహిత్యం, వర కట్నం, ఆడవారిని తక్కువగా చూడడం, గృహహింస

అలానే, సహజీవనం లో కూడా లోపాలు ఉంటాయి.. అని మనం ఉండదలచిన వ్యక్తిని బట్టి, మనని బట్టి ఉంటాయి.. అంతే కానీ, భారతీయులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని పెళ్ళి గొప్పదైపోదు.. పాశ్చాత్య దేశాల వారు సహజీవనం చేస్తున్నారు కాబట్టి అది చెడ్డదీ అయిపోదు.

జీవితంలో పెళ్లి చేసుకోకపోతే వచ్చే సమస్యలు

మీ గురించి ఆలోచించే వ్యక్తి వుండరు, ఇప్పుడు అమ్మ నాన్న ఇంకా మీ సహోదరులు ఉండొచ్చు ఏమో మరి భవిష్యత్తులో వీళ్ళు గతిస్తే మీ గురించి ఆలోచించే వారు, పట్టించుకునే వారు ఉండరు. పెళ్లి అయితే మీ పనుల్ని పంచుకునే భాగస్వామి ఉంటుంది. శారీరక శ్రమ కొద్దిగా తగ్గుతుంది. పెళ్లి చేసుకోకపోతే, వయస్సుతో పాటు శ్రమ కూడా పెరుగుతుంది.

మనలో పరిపక్వత పెరగడానికి చాలా సమయం పడుతుంది. అదే పెళ్లి చేసుకుంటే త్వరగా వస్తుంది. పెళ్లి చేసుకోకపోతే మనలో విశాలత్వం, సూక్ష్మత్వం, మృదు స్వభావం ఇవి అన్ని లోపిస్తాయి,

గుండెని ఆకాశంలా పరచడం,

కంటి చూపుని సీతాకోకపై నిలపడం

విశాలత్వం, సూక్ష్మత్వం…

రెండు కలవాడు మనిషి.

పెళ్ళి ఏ వయస్సులో చేసుకోవాలి

పెళ్ళి అనేది కేవలం ఒక తంతు కాదు. వైవాహిక జీవితం సవ్యంగా సాగాలి అంటే ఆర్ధిక, మానసిక, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందరికీ చిన్న వయస్సులోనే ఆర్ధికబలం చేకూరదు. అలానే మానసిక సంసిద్ధత ఉండదు. భయాలు, అపోహలు ఉంటాయి. కొందరి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి.

జీవితంలో పెళ్ళంటూ చేసుకోవాలి కాబట్టి కానిచ్చేద్దాం అని చేసుకోకూడదు. అది ఎవరికీ మంచిది కాదు. అన్ని రకాలుగా ఆలోచించుకుని, ఒక బాధ్యతాయుతమైన వైవాహిక జీవితానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నప్పుడే చేసుకోవాలి.

అలానే 24-28 ఏళ్ళ వయస్సులో చేసుకోవటంలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని నా అభిప్రాయం.

 1. అన్నింటికంటే ముఖ్యమైనది దంపతులకు జీవితాన్ని కాస్త ఆస్వాదించే సమయం, వెసులుబాటు ఉంటుంది. వయస్సు మీద పడ్డాక పెళ్ళి చేసుకుంటే సంతానమే మొదటి ప్రియారిటీగా ఉంటుంది.
 2. ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు కనుక వీలైనన్ని విహారయాత్రలకు, ప్రయాణాలకు వెళ్ళొచ్చు.
 3. కెరీర్‌లో కూడా ప్రాధమిక స్థాయిలో ఉంటే ఒత్తిడి తక్కువగా ఉండి ఒకరికొకరు సమయం ఇవ్వగలుగుతారు. దాని వల్ల ఒకరినొకరు బాగా అర్ధం చేసుకునే వీలుంటుంది.
 4. 24-28 వయస్సులో ఉంటే ఇంకా పూర్తిగా తల్లిదండ్రుల నీడ నుండి బయటకి రాకపోవటం వల్ల, పూర్తిగా ఇండిపెండెంట్ లైఫ్‌కి అలవాటు పడి ఉండరు. నా జీవితానికి నేనే రాజు/రాణి, నా మాట వినాల్సిందే అనే పట్టుదల ఉండే అవకాశాలు తక్కువ. ఆ స్థితిలో కొత్త వ్యక్తులను త్వరగా జీవితంలోకి ఆహ్వానించగలుగుతారు.

30లోకి వచ్చినవాళ్ళు కెరీర్‌లో ఒక స్థాయికి వచ్చేసి, ఆర్ధికంగా స్థిరపడి, వీలైతే సొంత ఇల్లు కొనేసుకుని ఉంటారు. అప్పటికి ఒక నిర్ధిష్టమైన జీవితానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఎంతలా అంటే ఎన్నింటికి తినాలి, ఎన్నింటికి పడుకోవాలి, ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, తాగేసిన టీ కప్ ఎక్కడ పెట్టాలి, ఇంటిలో కుక్కలు, మొక్కలు ఉండాలా? వద్దా?

ఇలా ప్రతి విషయంలోనూ నిశ్చితమైన అభిప్రాయాలు ఏర్పడి ఒక ఇండిపెండెంట్ జీవితానికి అలవాటు పడిపోయుంటారు. అలాంటి స్థితిలో తమ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తిని ఆహ్వానించటం అంత తేలిక కాదు. మన అభిప్రాయాలతో ఎదుటి వారిని బేరీజు వేస్తూ ఉండటం వల్ల ఎప్పటికీ వారికి దగ్గరకాలేము. అలానే కొత్తగా మన జీవితంలో అడుగుపెట్టాలనుకునే వాళ్ళకి మన ఇష్టాలు, పద్దతులు ఆంక్షలుగా కనిపించి భయపెడతాయి.

ఏది ఏమైనా పెళ్ళికి మానసిక సంసిద్ధతే అవసరమైనది. అలా ఇరువురు సిద్ధపడి చేసుకుంటే వయస్సు పెద్ద సమస్య కాదు.

ఫిబ్రవరి12 – కిస్‌డే

Happy Kiss Day: Types Of Kisses And Feelings With Your Loved One And Parents - Sakshi

స్‌.. అంటే ముద్దు పెట్టుకోవడం అని సింపుల్‌ తీసిపారేయడానికి లేదు. ముద్దువల్ల వ్యక్తులు పొందే అనుభూతి అనిర్వచనీయం. ఇది మనసుకు దగ్గరైన వారితో మాత్రమే పంచుకునే ఒక తియ్యని అనుభూతి. అందుకే వాలెంటైన్స్‌ వీక్‌లో​ లవర్స్‌ ఈరోజు ( ఫిబ్రవరి12)ను  కిస్‌డే గా సెలబ్రెట్‌ చేసుకుంటారు. అయితే  ఈ కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే  రోమాంటిక్‌ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి.

ప్రేమికులు తమ మనసులోని ప్రేమను, వారి లవర్‌కి కొంత రొమాంటిక్‌గా వ్యక్తపరచుకోవాలన్నప్పుడు కిస్‌ చేస్తారు. ఈ చర్యతో వారే తమ ప్రపంచమని మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు.  ఇలా చేయడం వలన ప్రేమించిన వారి పట్ల తమకున్న ప్రేమ, నమ్మకం, పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ప్రేమికులు గాఢంగా చుంబించుకోవడం వలన కొన్ని రకాల రసాయనాలు విడుదలై ఒత్తిడి తగ్గి వారి మధ్య ఒక బాండింగ్‌ క్రియేట్‌ అవుతుందని కొన్ని పరిశోధనల్లో కూడా వెల్లడైంది.

కిస్‌ చేస్తే.. 
తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గర తీసుకొని నుదుటి పైన కిస్‌ చేస్తారు.  ఈ చర్యతో వారిని ఆశీర్వదిస్తారు. ఒక్కొసారి పిల్లలు తమ వారు కిస్‌చేయడం వలన తామున్నమనే భరోసా ఏర్పడుతుందని అనుకుంటారు. చుంబించుకోవడం అనే చర్యవలన మానసిక ఆనందం కలిగి మాములు కన్నా5 ఏళ్ల ఆయుర్దాయం పెరుగుతొందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 

ఫిబ్రవరి11 – ప్రామిస్‌ డే

Happy Promise Day: 5 Promises To Strengthen Love With Your Loved One - Sakshi

ప్రా‘మిస్‌’..నేను జీవితాంతం వరకు నీతోనే ఉంటారు.. నిన్ను కెరింగ్‌గా చూసుకుంటాను.. నీతో ఎప్పటికి నిజాయితీగా ఉంటాను..ఇలాంటివి తరచుగా అందరినోట్లోను వింటూనే ఉంటాం. ప్రేమ నిజంగా పండాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ముఖ్యం..అందుకే మనం కోరుకున్న ప్రేమను ప్రామిస్‌ వేసి మరి చెప్తాం. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో ఈరోజు (ఫిబ్రవరి11)ను లవర్స్‌ ‘ప్రామిస్‌ డే’ గా జరుపుకొంటారు. 

పండంటి ప్రేమకు.. 
► ఇద్దరు మధ్యలో ప్రధానంగా ఉండాల్సింది నమ్మకం. ఈ పునాది ఎంత గట్టిగా ఉంటుందో వారి ప్రేమ    అంత ధృడంగా ఉంటుంది.
► పరిస్థితులు ఎలా ఉన్నా ఒకరికి మరొకరు తామున్నామనే భరోసా ఇచ్చుకొవాలి.
►  ప్రేమలో ఎదుటివారి లోపాలు, వారినుంచి తిరిగి ఆశించడం, డిమాండ్‌ చేయడం వంటివి ఉండవు.
►  ప్రేమ అన్నాక చిరుకోపాలు, తాపాలు సహజం.. వాటిని పెద్దగా పట్టించుకోకుండా పరిష్కరించుకోవాలి.
►  ప్రేమలో ఇరువురి ఇష్టాలను పరస్పరం గౌరవించుకోవాలి.

ఇక్కడ ప్రామిస్‌ మోటో మాత్రం ఒక్కటే.. తల్లిదండ్రులతో, బంధువులతో , మిత్రులతో మనం చేయగలిగేది మాత్రమే చెప్పాలి. ప్రతి ఒక్కరిలోను చిన్నపాటి లోపాలుండటం సహజం. అనవసర కోపాలకు పోకుండా, వాటిని పరిష్కరించుకుంటూ.. మనకు వారితో ఉన్న ప్రేమ కలకాలం నిలవాలని ‘ప్రామిస్‌’ వేసి మరికోరుకుందాం..

ప్రేమను వ్యక్తం చేయడం

Valentine Week: Ways To Express Love And Gift Ideas On Propose Day - Sakshi

ప్రేమికులు ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డేగా జరుపుకుంటారు. అయితే ఈ వారం రోజులను సంబరంగా చేసుకుంటారు. ఈ వారంలో వచ్చే రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. అలా రోజ్‌ డేతో మొదలయ్యే ప్రేమికుల హుషారు వాలేంటైన్స్‌ డేతో ముగుస్తుంది. ఫిబ్రవరి 7ను రోజ్‌ డే జరుపుకున్న ప్రేమికులు, ఈ రోజు ప్రపోజ్‌ డే జరుపుకుంటారు. ప్రేమించడం ఒక ఆర్ట్‌ అయితే ప్రేమను వ్యక్తం చేయడం మరో గొప్ప ఆర్ట్‌..! 

ఎలా ప్రపోజ్‌ చేస్తారో తెలుసుకుందాం.. 
ప్రేమించిన వారికి ఏ గిఫ్ట్‌ ఇస్తే ఇంప్రెస్‌ అవుతారో అని ఆలోచిస్తూ నానాతంటాలు పడుతుంటారు చాలా మంది. ఇందుకోసం  గ్రీటింగ్‌ కార్డులు, చాక్లెట్‌లు, గిఫ్ట్‌లు , పువ్వులు ఇలా రకారకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రేమికుల మోటో మాత్రం ఒక్కటే.. వీటిలో ఏదైనా వారికి సర్‌ప్రైజ్‌ అందించి మనసులో ఉన్న ప్రేమను చాటుకుంటారు. 

ఇందుకోసం ప్రేమించిన వారిని అనుసరించడం, వారి మిత్రులను కలవడం, వారి అభిరుచులు తెలుసుకోవడం వంటి చిన్నపాటి పోరాటాలు కూడా చేస్తారు. చివరికి వారికి నచ్చింది ఇచ్చి, ఆ కళ్లలో ఆనందం చూసి, వరల్డ్‌ కప్‌ గెలిచినంత సంబరపడతారు. అయితే ఈ ప్రపోజ్‌డేను కొత్తగా ప్రేమికులే కాకుండా , ఇప్పటికీ ప్రేమించి పెళ్లిచేసుకున్న దంపతులు ఈ రోజు ఒకరికొకరు ప్రత్యేక బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య బంధం మరింత దృఢపడుతుందని నమ్ముతారు.

సాహసాలకు సిద్ధపడతారు..
మొదటిసారిగా ఇద్దరూ కలుసుకున్న చోటులో కొంత మంది ప్రేమికులు ప్రపోస్‌ చేస్తే, మరికొందరు టీ-షర్ట్‌మీద ఆక్సెప్ట్‌ మై లవ్‌ అని రాసుకొని ప్రేమికుల ఎదుట వాలిపోతారు. ఒక్కోసారి తమకు తామే ఒక బహుమతిగా మారిపోయి గిఫ్ట్‌ బాక్స్‌గా తమ వారి దగ్గరికి వెళతారు. తమదైన శైలిలో ప్రేమ విషయం చెప్పేందుకు మరికొందరు జూలియట్లు ప్రేమించిన వారి వివరాలు తెలుసుకునేందుకు సాహసాలకు సిద్ధపడతారు. ఆక్రమంలో చుట్టుపక్కల వారితోను, మిత్రులతోను చివాట్లు కూడా తింటారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రేమికుల సమాచారం సేకరించి వారికి ఇష్టమైంది బహుమతిగా ఇవ్వడానికి ఆరాటపడతారు. 

వేలంటైన్ వీక్

ఫిబ్రవరి నెల ప్రేమికుల హృదయాలలో ఉత్సాహాన్ని తెస్తుంది. ఇది ప్రేమికుల నెల! ఈ నెలలో, 7 నుండి 14 వరకు, రోజ్ డేతో ప్రారంభమయ్యే వాలెంటైన్ వారాన్ని ప్రపంచం జరుపుకుంటుంది. ప్రతి రోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, కిస్ డే, మరియు హగ్ డే – మరియు చివరికి – వాలెంటైన్స్ డే!

 • రోజ్ డే

ఫిబ్రవరి 7 న జరుపుకుంటారు, రోజ్ డే వాలెంటైన్ వీక్ ప్రారంభానికి గుర్తుగా ఉంది. ఈ రోజు ప్రేమికులు తమ పాట్నర్కి‌‌ గులాబీలతో బుకే ‌ఇస్తారు. (ఎరుపు గులాబీలు అత్యంత ప్రాచుర్యం పొందాయి.) గులాబీలు తెచ్చే వాగ్దానం – తాజాదనం, సువాసన మరియు ప్రేమ యొక్క నిత్య సౌందర్యం.

 • ప్రపోజ్ డే

ఫిబ్రవరి 8 న జరుపుకుంటారు, అన్ని రకాల ప్రతిపాదనల కోసం ప్రపోజ్ డే. మీ ప్రేమను మీ ప్రేమతో అంగీకరించే రోజు ఇది. మీరు ప్రపోజ్ చేయాలనుకుంటే, బహుమతి, కొన్ని పువ్వులు, కేక్ మరియు ఆమె లేదా అతడు ఎప్పటికీ గుర్తుంచుకునే తేదీగా మార్చండి.

 • చాక్లెట్ డే

ఫిబ్రవరి 9 న జరుపుకుంటారు, చాక్లెట్ డే మీ బంధాన్ని ప్రేమతో మధురంగా ​​- చాక్లెట్లతో ప్రత్యేకంగా చేస్తుంది.

 • టెడ్డీ డే

ఫిబ్రవరి 10 న జరుపుకుంటారు, టెడ్డీ డే మనం తల్లిదండ్రులచే సురక్షితంగా మంచం పట్టడం వంటి చిన్ననాటి జ్ఞాపకాలను తెస్తుంది. టెడ్డి అనేది ఒక అందమైన జంతువు.ఇది అన్ని హాయిగా, తీపి విషయాలను గుర్తుకు తెస్తుంది. మీరు అప్పగించే టెడ్డిలా మీరు కూడా ఎప్పటికీ, హాయిగా మరియు హగ్గబుల్ గా (huggable) ఉంటారు అని మీ ప్రియమైన వ్యక్తికి తెలియజేయండి.

Happy Teddy Day: Find Out Why Your Loved One Loves Teddy Bears - Sakshi

ప్రేమించిన వారు ప్రతిక్షణం  మనతోనే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు! కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రేమికులు ఒకరిని విడిచి మరొకరు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ విరహ వేదనను టెడ్డీబేర్‌లు దూరం చేయగలవు. అందుకే ఈ టెడ్డీలకు వాలెంటైన్స్‌ వీక్‌లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. లవర్స్‌ ఈరోజును (ఫిబ్రవరి10) టెడ్డీబేర్‌ డేగా జరుపుకుంటారు.

మరోవైపు టెడ్డీబేర్‌లకు, అమ్మాయిలకు మధ్య చిన్ననాటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉంటుంది.  వారు రకారకాల బొమ్మలతో ఆడుకుంటుంటారు. ఒక్కరే ఉన్నప్పుడు టెడ్డీలతో సరదాగా గడుపుతారు. తల్లిదండ్రులతో సరదాగా ఇతర ప్రాంతాలకు వెళ్లినా పక్కనే టెడ్డీ ఉండాల్సిందే. చిన్నారి పాపలు కొన్నిసార్లు తమ టెడ్డీలకు ప్రాణం ఆపాదించి అందంగా ముస్తాబు చేసి తయారుచేసి సంతోషపడిపోతారు. బెడ్‌పైనే తమ పక్కనే పెట్టుకుని నిద్రపోతారు. 

ఇక ప్రేమికుల విషయానికొస్తే.. మనసుపడిన వారికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ప్రియుడు/ప్రియురాలు టెడ్డీని గిఫ్ట్‌గా ఇస్తుంటారు.  తమవారు గుర్తుగా ఇచ్చే టెడ్డీ బొమ్మలతో వారు లోన్లీ ఫీలింగ్‌ను కొంతవరకు దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమే కాకుండా కోపతాపాలకు కొన్నిసార్లు వేదిక అవుతుంటాయి. ప్రేమించినవారిపై అలకను, చిరుకోపాన్ని టెడ్డీలపై చూపించి వారు తెగ ఆనందపడిపోతారు.

 • ప్రామిస్ డే

ఫిబ్రవరి 11 న జరుపుకుంటారు, ప్రామిస్ డే నిబద్ధత యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఈ రోజున, మీరు స్థిరంగా వెళ్లడం, లేదా కలిసి ఉండటం మరియు ఆ వాగ్దానాన్ని ఎప్పటికీ పట్టుకుంటారు అని నమ్మకం కలిగించండి.

 • హగ్ డే

ఫిబ్రవరి 12 న జరుపుకుంటారు, హగ్ డే ప్రేమ యొక్క వెచ్చని, అందమైన వ్యక్తీకరణను అందిస్తుంది – పదాల కంటే ఎక్కువగా మాట్లాడే సౌకర్యవంతమైన కౌగిలింత. ఒక కౌగిలింత మీ సమస్యలన్నింటినీ ఆ కొద్ది నిమిషాలలో ఎగిరిపోయేలా చేస్తుంది, కాబట్టి ముందుకు సాగండి, మీ ప్రియమైన వ్యక్తికి సున్నితమైన కౌగిలింత ఇవ్వండి, వారు ప్రేమిస్తున్నారని తెలియజేయండి.

 • కిస్ డే

ఫిబ్రవరి 13 న జరుపుకుంటారు, ఈ రోజున, కొత్త ప్రేమికులు వారి మొట్టమొదటి నిబద్ధత ముద్దును పంచుకుంటారు.

 • ‌ప్రేమికుల రోజు

ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు, వాలెంటైన్స్ డే వాలెంటైన్ వీక్ ముగుస్తుంది. ప్రేమికులు తమ ప్రియమైనవారితో నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తూ, వారు కోరుకున్న విధంగా రోజును జరుపుకుంటారు. ఇది ఆనందం యొక్క రోజు, ప్రేమ కనుగొనడంలో ఆనందకరమైన ఉత్సాహం గల రోజు.

వివాహ జీవితాన్ని దెబ్బతీసే అత్యంత చిన్న చిన్న విషయాలు ఏమిటి? ఈ విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

వివాహ జీవితం చాలా అందమైనది మరియు ముఖ్యమైనది. మానవ మనుగడ కోసం మరియు మన సుఖం కోసం వివాహం అనే ఒక బలమైన వ్యవస్థను మనం (అనగా మన మానవ జాతి) ఏర్పాటుచేసుకున్నాము. మానవుడు మనిషిగా పరిణామం చెందుతూ, మనలో ఉన్న యానిమల్ ఇన్స్టిక్స్ తో వచ్చే ఇబ్బందులను హేతుబద్దంగా అధ్యయనం చేసి వివాహం యొక్క నియమాలను, వివాహ చట్టాలు మన సుఖం కోసం లేదా మనుగడ కోసం మనం ఎర్పరుచుకున్నాం. వివాహ జీవితం ఎంత అందమైనదో, అంతే కఠినమైనది. ఇద్దరు ఆలోచనలు, వ్యక్తిత్వాలు, బాధ్యతలు, కలసికట్టుగా జీవితాంతం ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ప్రేమ ఆప్యాయతల మధ్య ప్రయాణం సాగించాలి అంటే ఎంతో ఓర్పు, సహనం అవసరం. ఈ ప్రయాణం మధ్యలో అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఎన్నో చిన్ని చిన్న కారణాలు పెద్దవిగా మారి దంపతులు విడిపోవడానికి కారణాలవుతున్నాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం,

వివాహ జీవితంలో తొందరగా అడుగు పెట్టే మహిళలకు, అంటే లేత(18–24) వయసులోనే వివాహం జరగడం, అది కూడా తమకంటే మరీ ఎక్కువ వయసు ఉన్న భర్తను చేసుకోవడం ద్వారా వివాహ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు రావడం తరుచుగా జరుగుతుంది. దీని ముఖ్య కారణం ఇద్దరి ఆలోచనల మధ్య చాలా ఎక్కువ వ్యత్యాసం ఉండడంతో వచ్చే మనస్పర్థాలు. ఆడపిల్లలకు సొంత నిర్ణయాలు మరియు ఒక బంధాన్ని నిలబెట్టుకునే పరిపక్వత కొన్ని సార్లు రాకముందే వారికి పెళ్లి చేయడంతో కొంత వివాహ జీవితంలో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గం భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్. వారి ఆలోచనావిధానం గురించి ఒకరికొకరు మనసువిప్పి మాట్లాడుకోవటం, తమ అభిప్రాయాలను మరియు కొరికలను నిర్భయంగా పంచుకోవటం చాలా ముఖ్యం. అదేవిదంగా ఆడపిల్లలకు మరియు మగవారికి పూర్తి పరిపక్వత వచ్చిన తరువాత వారికి మనసుకు నచ్చిన వారితో పెళ్లి జరిపించడం ఒక మార్గంగా కనిపిస్తుంది.

గత మూడు దశాబ్దకాలం నుండి మన దేశం లో వేగంగా మారుతున్న పరిస్థితులు, ఉదాహరణకు మార్కెట్ సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు, ఆధునిక పట్టణ జీవనా విధానం, తీరికలేని జీవనం మన వివాహ జీవితం లో చాలా మార్పులను తీసుకొచ్చింది. భార్య భర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వలన, ఇద్దరు కలిసి విలువైన సమయమును గడపకపోవడం వలన కూడా వివాహ జీవితం లో చాలా సమస్యలకు దారి తీస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గం, భార్య భర్తలు తమ వివాహ జీవితం ఎప్పటికపుడు విశ్లేషకుంటూ ముందుకు సాగడం మరియు కమ్యూనికేట్ చేసుకోవడం.

ఇక భార్య భర్తలు వృత్తి పరంగా మంచి స్థాయిలో ఉన్నాకూడా, సమాన గౌరవం ఇచ్చిపుచ్చు కోకపోవడం ద్వారా కొంత ఈగో సమస్యలు ఎక్కువయ్యి దాంపత్య జీవితంలో ఆటుపోట్లు ఎదురుకుంటున్నారు . దీనికి ముఖ్యంగా ఇరువురి దంపతులు వారు వృత్తిపరంగా ఎంత స్థాయిలో ఉన్నా కూడా, ఇంట్లో ఇద్దరు సమానమే అని గుర్తించకపోవడం. ఎల్లపుడు ఒకరినిఒకరు గౌరవించుకుంటూ ముందుకు సాగడం వివాహ జీవితంలో చాలా ముఖ్యం.

భర్త మరియు భర్త తరుపున కుటుంబంలో (కొన్ని తక్కువ సంఖ్యలో భార్య తరుపున కుటుంబంతో) వారి జోక్యం ఎక్కువగా ఉండడం వలన దంపతుల మధ్య ఎక్కువగా సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. వర కట్నం, అర్ధాంగి మీద ఎక్కువ అంచనాలు, కుటుంబంలో మనస్పర్థాలు వంటి సమస్యలు చిలికి చిలికి గాలివాన లా మారి వివాహ జీవితం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ముందుగా భార్య భర్తలు వివాహ జీవితంలోకి అడుగు పెట్టాక వారిరువురు తమ దాంపత్యజీవితం లోకి మూడో వ్యక్తిని రానివ్వకుండా చూసుకోవడం వారి బాధ్యత. పెద్దల దగ్గర సలహాలు తీసుకోవచ్చు కానీ ఒకరు దాంపత్య జీవితం మీద మూడో వ్యక్తి పెత్తనం ఉండకుండా చూసుకోవడం కూడా దంపతుల బాధ్యతే!

పితృస్వామ్య భావజాలం ఇంకా మన సమాజంలో ఉండడం, దాని పర్యవసానాలుగా భర్త భార్యను బానిసగా చూడడం, సమాన హక్కు ఉందని గుర్తుంచకపోవడం చాలా సమస్యలకు దారితీస్తుంది అలాగే భార్య భర్తనుండి ఎక్కువ అంచనాలతో అనేకమైనటువంటివి ఆశించడం వివాహ జీవితంలో సమస్యలుగా కనపడుతున్నవి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు తమ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు హేతుబదంగా విశ్లేషించుకుని, అవసరమైతే ఫ్యామిలీ కౌన్సిలర్స్ ని సంప్రదించి తమ ఆలోచన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది!

ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలు, ఆరోగ్య సమస్యలు, సెక్స్ జీవితంలో ఇబ్బందులు, అధికంగా ఉండే వ్యసనాల వలన చాలా దంపతుల మధ్య చిన్ని చిన్న సమస్యలు పెద్దవిగా మారి దాపత్య జీవితం మీద తీవ్రమయిన ప్రభావం చూపుతాయి. ఆర్థికంగా మన స్థాయిని బట్టి మన జీవన విధానాన్ని సాగించడం, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం (ఇది మన యానిమల్ ఇంస్టింక్ట్ ద్వారా కొన్ని సార్లు జరిగే అవకాశం ఉన్నా, మనం వివాహ బంధానికి కట్టుబడి, మన దాoపత్య జీవితం లో ఉన్నా ప్రేమ ఆప్యాయతతో అధిగమించవచ్చు), ఆరోగ్య సమస్యలు రాకుండా రోజు కొంత వ్యాయామం, మన ఆరోగ్యం పట్ల శ్రద్ద, సెక్స్ జీవితం గురించి కమ్యూనికేషన్, ఇబ్బందులు ఉంటె డాక్టర్ల సహాయంతో అధిగమించ వచ్చు.

ఒక సమస్యను చిన్నగా ఉన్నపుడే గ్రహించి, దాన్ని ఓపికతో, హేతుబదంగా పరిష్కరించుకుంటే వివాహజీవితం సాఫీగా సాగుతుంది.

GLOBAL OPINIONS ABOUT MARRIAGE

After marriage, husband and wife become two sides of a coin, they just can’t face each other, but still they stay together.
– Al Gore

By all means marry. If you get a good wife, you’ll be happy. If you get a bad one, you’ll become a philosopher.
– Socrates

Wife inspires us to great things and prevent us from achieving them.
– Mike Tyson

I had some words with my wife, and she had some paragraphs with me.
– Bill Clinton

There’s a way of transferring funds that is even faster than electronic banking. It’s called marriage.
– Michael Jordan

A good wife always forgives her husband when she’s wrong.
– Barack Obama

When you are in love,
wonders happen.
But once you get married, you wonder, what happened.

 • Steve Jobs

And the best one is…

Marriage is a beautiful forest where Brave Lions are killed by Beautiful Deers.

 • Brad Pitt

Husband and the Wife are Two Halves of a Whole

Over the past years, equality in marriages has been picking up pace among the married couples. Earlier, back in the ages, a constitution of marriage used to get fame where the code of conduct stated that the breadwinner of the family will always be a man only. Globally, equality in marriages used to be seen over the past few decades. Gender inequality was visible and used to grow other types of inequality between a married couple.
From the outset, the emphasis focused on accomplishing equivalent opportunities and chances for women in the paid workforce. Lately, attention has concentrated on the disparities among married couples in the sharing of the obligations of unpaid work at their homes. Without a doubt, a late Gallup Poll of 1,234 haphazardly chose grown-ups from over the nation found that 57% of the populace presently says that the perfect marriage is one in which both the husband and the wife have occupations and share in the responsibilities of their children’s upbringing and thinking about the home (DeStefano and Colasanto, 1990). The developing enthusiasm for these issues among the general public is resembled by an expanding number of researches of equality by social researchers. Those keen on the psychology of equity have explored the degree to which fairness, as contrasted and different standards of equity, is related to the dependability of connections and the relative fulfilment of the two accomplices.
Family sociologists have been interested in issues of family power and in recognizing the components that add to shifting degree of fulfilment and mental prosperity in dual-earner relationships. These investigations show that, in spite of the developing open underwriting of uniformity, most relationships keep on being unequal. Incomprehensibly, the same writer gives developing proof of the advantages of fairness. Progressively equivalent connections are related with more noteworthy fulfilment for both accomplices and with improved mental prosperity, especially, it appears, for ladies. Why, at that point, does disparity continue? A few clarifications have been offered, yet none appears to enough clarify the disparities of marriage.
Equality in marriage implies individuals grumbling about their rights being disregarded. In the past, numerous rights have been perceived that are presently underestimated. This specific theme – uniformity in marriage – could emerge from any number of gatherings in the public arena. It could be ladies whining that they need to do the vast majority of the housework. It could be men complaining that Western courts will side with the mother if separation happens between them. It could also be individuals who need to wed somebody of similar sex, griping that their privileges are being abused by conventional marriage rehearses. Last but not the lease, It could be women activists grumbling that marriage brings out and stresses numerous distinctions in expectations of the people.
Equality in a marriage means that both the husband and the wife are two halves of a whole, with equal rights and responsibilities. It must be positioned on the possibility that, as people, we are equivalent; no better, or more terrible, than the other.

తొలి రాత్రి తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు?

తొలి రాత్రి తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు?

భారతీయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలు ఎంతో గొప్పగా కీర్తిస్తాయి. ఇండియాలో ఫిబ్రవరి నెలలోనే వివాహాలకు ముహూర్తాలు ఎందుకు నిర్ణయిస్తారంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం ఎంతో పవిత్రమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పెళ్లి తర్వాత వధూవరులు ఎదురుచూసేది తొలిరాత్రి కోసం. పురాతన కాలం నాటి ఆచారాలను, సంప్రదాయాలను చాలా మంది భారతీయులు నేటికీ అనుసరిస్తున్నారు. కానీ వీటిపై చాలా విమర్శలున్నాయి. అసలు శోభనం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

శోభనం రోజు కొత్త దంపతులు పడుకునే మంచంపై తెల్లటి దుప్పటి లేదా బెడ్‌షీట్ వేస్తారు. తెల్లని వస్త్రం వేయడం వెనుక రహస్యం ఏమిటంటే.. దీని వల్ల వధువు కన్వత్వాన్ని తెలుసుకోవచ్చట. తొలిరాత్రి కలయిక వల్ల రక్తం స్రావం జరిగితే అది తెల్లని వస్త్రంపై స్పష్టంగా కనపడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు ఆ వస్త్రంపై రక్తపు మరకలు గుర్తిస్తే వధువు కన్య అనేది పూర్వీకులు నమ్మకం. దీన్ని కూడా సంబరంగా జరుపుకునేవారు. దీన్ని ఉతకడానికి ముందు ఎంతో పవిత్రంగా ఆరాధించేవారు. అయితే, కన్యత్వం తెలుసుకోవడానికి రక్తం రావాలనే రూల్ లేదు. కొంతమంది అమ్మాయిలకు రక్తస్రావం జరగదు. కాబట్టి.. అలాంటి అమ్మాయిలను అనుమానించకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

కన్యత్వ పరీక్ష: పురాతన భారతీయ సంప్రదాయం. కానీ ఈ దురాచారం కొన్ని ప్రాంతాల్లో నేటికీ కొనసాగుతుంది. ఈ ఆచారం ప్రకారం శోభనం తర్వాత రోజు ఉదయం అత్తగారు ఆ గదిలోకి రహస్యంగా దూరి దంపతలు నిద్రించిన మంచం మీద వేసిన తెల్లని వస్త్రంపై రక్తపు మరకలను పరిశీలిస్తుంది. పశ్చిమాఫ్రికాలో శోభనం రోజు కోడలు కన్వత్వాన్ని నిరూపించుకుంటే అత్త కొంత నగదు చెల్లిస్తుందట.

కాళ రాత్రి: ఇది పురాతన బెంగాలీ సంప్రదాయం. దీని ప్రకారం పెళ్లైన తర్వాత వరుడి ఇంట్లో కొత్త దంపతలు వేర్వేరు గదుల్లో నిద్రిస్తారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోరు కూడా. ఆ తర్వాత రోజు ఉదయం వధువు తన పుట్టింటికి వెళ్లి అత్తగారిల్లు తనకు అనుకూలంగా ఉందని నిర్ణయానికి వచ్చిన తర్వాతే శోభనం జరిపిస్తారు.

పాన్ తినిపిస్తారు: కొన్ని సంప్రదాయాల్లో వధూవరులతో శోభనం రోజు పాన్ తినిపిస్తారు. రాత్రంతా జాగారం చేస్తారు కాబట్టి పాన్ తింటే నోటి దుర్వాసన ఉండదు. అలాగే చెడు వాసనలను దంపతులకు కూడా దూరం చేస్తుంది. బంధువులు, స్నేహితులు శోభనం కోసం మంచాన్ని పూలతో అందంగా అలంకరిస్తారు. ఎందుకంటే పూల వెదజల్లే సువాసనలు కొత్త జీవితాన్ని ప్రారంభించే జంట మధ్య శృంగారానికి ప్రేరిపించే స్థితిని కలుగజేస్తాయి.

సహన పరీక్ష: శోభనం రోజు రాత్రి కొత్త జంట సహనాన్ని పరీక్షించడానికి బంధువులు, స్నేహితులు ఆటపట్టిస్తారు. సాధ్యమైనంత ఆలస్యంగా నిద్రపోయేలా ప్రయత్నాలు చేస్తారు. అందుకే కొన్ని రకాల ఆటలు ఆడిస్తారు. శోభనం గదిలోకి పాల గ్లాసు అనే సంప్రదాయం భారతీయ వివాహాల్లో సర్వసాధారణం. కుంకుమ పువ్వు, బాదం వేసిన పాలను వధూవరులు తొలిరాత్రి తాగితే సత్వరమే శక్తినిస్తుంది. ఈ పాలు శోభనం రాత్రి భార్యభర్తల మధ్య సాగే చర్యలను నిర్ధారించడానికి ఓ వాహకంగా పనిచేస్తాయి.

కొత్తగా పిల్లల పుట్టిన తల్లి దండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రతీ దాని లో కూడా తల్లి దండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. ఎందు కంటే చిన్న పిల్ల కాబట్టి చాలా సున్నితంగా ఉంటుంది. దానికి తోడు ఆకలి బాధ నవ్వు పంచు కోలేదు కాబట్టి తల్లి దండ్రులే జాగ్రత్తలు తీసుకుని అన్నింట్లో కూడా బాగా చూసు కోవాలి. ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. అయితే ఇలాంటి వాటి పట్ల చాలా శ్రద్ధ వహించాలి అంటే బిడ్డ యొక్క చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసు కోవాలి ఎందుకంటే వాళ్ళు అని ఇంట్లో పెట్టి ఆడుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ల చేతులు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉన్నాయో లేదో చూసు కోవాలి.

అలాగే ఎవరైనా వాళ్ళకి ఎత్తుకుంటే వాళ్ల చేతులు కూడా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి అని హెచ్చరించాలి. ఎందుకంటే మీ పిల్లల్ని ఎవరైనా ఎత్తుకు ఉంటే గనక వాళ్ల నుంచి క్రిములు సోక కుండా ఉండడానికి హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించి కోవడం మేలు వాళ్ల దగ్గర ఇమ్యూనిటీ సిస్టం ఎక్కువ ఉండదు కాబట్టి త్వరగా ఇన్ఫెక్షన్కి గురవుతారు కాబట్టి ఈ జాగ్రత్త తీసు కోవడం చాలా మంచిది. అలానే మెడ మీద చేయి పెట్టి ఎత్తు కోవాలి ఎందుకంటే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు కదా అందుకనే వాళ్ళ తల పై చేయి పెట్టి పట్టు కోవాలి ఎప్పుడూ కూడా వాళ్ళని షేక్ చేయకండి దీని వల్ల లోపల షేక్ చేసినట్లయితే వల్ల మెదడు లో రక్తం బ్లీడ్ అవడానికి అవకాశం ఉంది ఎప్పుడు కూడా వాళ్ళని షేక్ చేయడం అంత మంచిది కాదు నెమ్మదిగా సున్నితంగా వాళ్ళని ఆడించాలి కానీ ఇలా షేక్ చేయకూడదు అలానే క్యారియర్ రోలర్లు కానీ ఇంకా కార్ లో కానీ కూర్చునేటప్పుడు వాళ్లకి సెక్యూరిటీ ఉండేలా చూసుకోండి అలా నడిచేటప్పుడు విసరడం కానీ తోయడం కానీ చేయకూడదు.


వాళ్లతో ఎక్కువగా ఆడుకోవడం కేర్ తీసుకోవడం చాలా మంచిది అలానే వాళ్ల తో మీరు నవ్వుతూ ఉండడం పక్కన కూర్చోవడం వంటివి చేయాలి ఫిజికల్గా మీరు క్లోజ్గా ఉంటే ఎమోషనల్గా మీ బంధం మరింత కనెక్ట్ అవ్వడానికి సహకరిస్తుంది ఇలా చేయడం వల్ల వాళ్లలో ఎమోషనల్ గ్రోత్ కూడా పెరుగుతుంది అలాగే వాడిని కూడా బాగా పెరుగుతుంది. అలానే వాళ్లు మాట్లాడకుండా చిన్నచిన్న శబ్దాలు చేయడం చెబుతుంటారు కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడం మీ వంతు అలాగే వాళ్లకి పాటలు వినిపించడం పక్షులు శబ్దాలు ఇలాంటివి పెట్టడం రైమ్స్ వంటివి పెట్టడం చేస్తే వాళ్లు మరింత ఆనందంగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ క్లీన్ డైపర్ ని వెయ్యాలి. అలానే ఏ రాష్ లాంటివి రాకుండా డైపర్ క్రీం కూడా వాడొచ్చు. ఇలా జాగ్రత్తలు తీసుకుని మనం ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. ఇలా అనేక జాగ్రత్తలని మనం తీసుకుంటూ వాళ్ళని బాగా పెంచాలి. కాబట్టి ఇటువంటి వాటిని తప్పక పాటించాలి.

వివాహానికి ముందు వధూవరుల జాతకాలు చూడటం ఎంతో ముఖ్యం

samayam telugu

హిందు వివాహ ప్రక్రియలో వధువరూల జాతకాలను చూపించడం తప్పనిసరి. వీరిద్దరి జాతకాలు కలిస్తినే వారి భవిష్యత్తు బాగుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజుల్లో అధునాతన కారణంగా కొంతమంది జాతకాలు సర్దుబాట్లు లేదా కుండలిలో మార్పులుచేర్పులు చేయడం మర్చిపోతున్నారు. అందుకే కొన్ని వివాహాలు ఎక్కువ కాలం నిలవడం లేదు. గందరగోళాలు, కలహాలు లాంటి వైవాహిక జీవితాన్ని చేదుగా మారుస్తున్నాయి. ఈ కారణంగానే పూర్వకాలం నుంచి జాతకాలకు సరిపోల్చే సంప్రదాయం ఉంది. ఫలితంగా జాతకం సర్దుబాటు వధూవరుల వివాహం అవకాశాన్ని అంతం చేయడం ఇదే మొదటి దశ. కాబట్టి వివాహంలో జాతకాన్ని చూడటం ఎంతో ముఖ్యం. 

భారతదేశంలో ముఖ్యంగా హిందు సంప్రదాయంలో వివాహానికి సంబంధించి జాతకాలు అనుకూలించాయా లేదానేది ముఖ్యమైన అంశం. అబ్బాయి, అమ్మాయిల జాతకాన్ని జ్యోతిష్కులు అంచనా వేస్తారు. కుండలి సర్దుబాటు లేదా జాతకం ప్రకారం గ్రహాల లక్షణాలు ఆధారంగా చేస్తారు. జాతకం దృష్టిలో ఏదైనా లోపభూయిష్ట గ్రహాలు ఉంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహంలో వాటి పరిష్కారాలకు మార్గం సుగమం చేస్తారు.

​జాతకాన్ని సరిపోల్చడం ఎందుకు ముఖ్యమంటే..

samayam telugu

సంప్రదాయబద్ధ వివాహాలకు ప్రాధాన్యత తీసుకొచ్చింది భారతీయులే అన్న విషయం అందరికి తెలిసిందే. ఇంతకు ముందు చూడని, తెలియని వ్యక్తిని జీవితాంతం వివాహం అనే ఘట్టం ద్వారా జీవితంలోకి ఆహ్వానిస్తారు. కాబట్టి వివాహం ఖరారయ్యే ముందు వధూవరులిద్దరి జాతకాలను సరిపోలుస్తారు. జాతకాలను పరిశీలిస్తే వారి జీవితాలు సంతోషంగా ఉన్నాయని, వైవాహిక జీవితం విజయవంతమవుతుందా లేదా అనేది తెలుస్తుంది. జ్యోతిషశాస్త్రంలో జాతకంలో మొత్తం 36 లక్షణాలు ఉన్నాయి. వీటిలో వధూవరులకు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయో వారి జీవితాలు ఎంత సౌకర్యవంతంగా ఉన్నాయో నిర్ణయిస్తారు. దోషాలు ఏమైనా ఉంటే జ్యోతిష్కులు వాటికి నివారణలు చేయిస్తారు. పిల్లల ఆనందం, ఆరోగ్యానికి కుండలి సర్దుబాటు ముఖ్యమైనదిగా భావిస్తారు.

భౌతిక, మానసిక సర్దుబాట్లు..

samayam telugu

వధూవరుల శారీరక, మానసిక సమన్వయం ద్వారా కుండలి సర్దుబాటు ప్రయోజనాలు కూడా నిర్ధారించబడతాయి. గ్రహాల స్థానాల ఆధారంగా ఇద్దరు భాగస్వాముల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాతకం సరిపోలిక దంపతుల మానసిక స్థితి, ఆసక్తి, వైఖరి, ప్రవర్తన లాంటి మొదలైన అంశాల గురించి తెలుపుతుంది. అబ్బాయి ఆరోగ్యం, శ్రేయస్సు కూడా ఇక్కడ అంచనా వేయబడుతుంది. బాలుడిలో తగినంత శారీరక ఆకర్షణ ఉందని కూడా జాతకం నిర్ధారిస్తుంది.

ఆర్థికంగా స్థిరత్వం చూస్తారు..

samayam telugu

నక్షత్రాల స్థానం వాటి సమయం అనేవి వ్యక్తుల జాతకంలో శని లేదా మంగళ దశ సంప్రాప్తిస్తుందా అనేవి అంచనా వేస్తారు. వీటి ద్వారా కుండలిని సరిపోల్చడం వల్ల ఏమైన క్లిష్టపరిస్థితుల ఉంటే తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన జ్యోతిష్యనిపుణులు జాతకంలో ప్రతికూలతలు ఏమైన ఉంటే వాటిని పరిష్కరిస్తారు. ముఖ్యంగా దంపతుల కుండలిలో దోషమేమైనా ఉంటే వాటిని నివారిస్తారు. అర్థిక స్థిరత్వం, వృత్తిగత విషయాలు లాంటి వాటిని కుండలి సర్దుబాట్లు ద్వారా కనుగొంటారు. వైదిక జ్యోతిషం ప్రకారం గ్రహాల కదలిక అనేవి వ్యక్తిగత జీవితంలో ఎంతో ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా వివాహం అనంతరం జీవిత భాగస్వామి వల్ల వచ్చే ప్రయోజనాలు అంచనా వేస్తారు. కాబ్టటి తల్లిదండ్రులు తమ సంతానానికి కాబోయే జీవిత భాగస్వామి ఆర్థిక స్థిరత్వం విషయంలో కచ్చితత్వంతో ఉంటారు.

జాతకంలో ఇవి అనుకూలించాలి..

samayam telugu

జ్యోతిషశాస్త్రం ప్రకారం వధూవరుల జాతకం అనుకూలించిందా లేదా అని తెలుసుకోవడం కోసం 36 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందులో సంతోషకరమైన, విజయవంతమైన వివాహం జరగాలంటే 36లో కనీసం 18 లక్షణాలు సరిపోలి ఉండాలి. వధూవరుల జాతకంలోని 36 అంశాల్లో 18 నుంచి 25 గుణాలు సరిపోలితే అది ఉత్తమమైన జాతకంగా భావిస్తారు. కుండలి లేదా జాతకం ముఖ్య ఉద్దేశం వివాహం ద్వారా ఒక్కటయ్యే జంటలు కలిసి ఆహ్లదకరమైన, సంపన్నమైన, సూదీర్ఘమైన వైవాహిక బంధాన్ని కలిగి ఉండటం.

భార్య.. భర్త.. మూడు తగవులు

Special Story About Husband And Wife Relationship In Sakshi Family

ఇంటి పని
ఇంటి పని భారం ప్రధానంగా గృహిణి మీద ఉంటుంది. ఆమె గృహిణి అయినా ఉద్యోగిని అయినా ఇంటి పని ఆమెదే అనే ధోరణి భర్తకు ఉంటుంది. మామూలు రోజుల్లో పని మనుషుల వల్ల, బయట తిండి తెచ్చుకోవడం వల్ల, వారూ వీరూ వచ్చి సాయ పడుతూ ఉండటం వల్ల ఈ భారం గృహిణికి అంతో ఇంతో తగ్గేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భర్త, పిల్లలు అన్ని వేళలా ఇంట్లో ఉండటం వల్ల పని పెరిగింది. ఈ పని చేసి చేసి ఇళ్లల్లో స్త్రీలకు విసుగు చిరాకు పెరిగి భర్తను నిలదియ్యాల్సి వస్తోంది. భర్త ఇంటి పనిని పంచుకుంటే సరేసరి. లేకుంటే ఈ తగాదా పెరిగి పెద్దదైపోతోంది.

ఇంట్లోని పెద్దలిద్దరూ ఇంటి పని ఎంత ఉందో అది ఎంత శ్రమను కలిగిస్తుందో బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. పని పెంచుకోవడం, ఎదిగిన పిల్లలు ఉంటే వారు చేయదగ్గ పనిని పంచి ఇవ్వడం ఇంకా ముఖ్యం. ఒక టైమ్‌టేబుల్‌ వేసుకొని రోజుకు ఏ టైమ్‌లో ఎవరు ఏ పని చేయాలో రాసుకుంటే చాలామటుకు గొడవ రాకుండా ఉంటుంది. ఉదాహరణకు ఉదయాన్నే లేచి చెత్తబుట్ట బయటపెట్టే పని భర్తది అని అనుకుంటే భార్యకు సగం ఓదార్పుగా ఉంటుంది. మొక్కలకు నీళ్లు పోయడం, పిల్లలను నిద్ర లేపడం, భార్య వంట చేసినా పిల్లలకు టిఫిన్‌ పెట్టే పని భర్త చూడటం.. ఇలా ఎవరికి ఏది సౌకర్యమో చేసుకోకపోతే ఇల్లు రచ్చలోకి పడే ప్రమాదం ఉంది. పని అంతా భార్య చేయాలని అనుకోవడం ఎలా సరి కాదో పని అంతా భర్త చేయాలని అనుకోవడం కూడా సరి కాదని తెలుసుకోవడం కూడా ముఖ్యమే.

అనుమానం పెనుభూతం
లాక్‌డౌన్‌ సమయంలో ఫోన్‌తో కాలక్షేపం కుటుంబాలలో కలత రేపుతున్నదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాని ఇది నిజం. భర్త ఆఫీస్‌ పని చేసుకుంటూ ఉంటే భార్య ఫోన్‌లో మునిగినా, భార్య ఇంటి పని చేసుకుంటూ ఉంటే భర్త ఫోన్‌లో మునిగినా, ఇద్దరికీ ఏ పని లేని సమయంలో అర్ధరాత్రి వరకూ ఫోన్‌ చూస్తూ ఉన్నా, చాటింగ్‌ చేస్తూ ఉన్నా అది ఎంత అయినవారితోనో, బంధువులతోనో, మిత్రులతోనో అయినప్పటికీ అనుమానాలు వచ్చేస్తుండటం తాజా స్థితి.

సాధారణ రోజుల్లోని ప్రైవసీ ఇప్పుడు లేకపోవడం వల్ల ఇరువురూ చేస్తున్న పని అనుక్షణం కనపడుతూ ఉండటం వల్ల ఈ తగాదాలు వస్తున్నాయి. ఎదుటి పక్షానికి సందేహం కలిగించే సంభాషణలు, ఫోన్‌ సమయాలు పరిహరించుకోవడమే దీనికి పరిష్కారం. మాట్లాడే అవసరం ఉన్న మాటలు శషబిషలు లేకుండా పబ్లిక్‌గా మాట్లాడటం కూడా ఒక పరిష్కారం. ఫోన్‌లలోని కాలక్షేపం వీడియోలు చూసేటట్టయితే అదేదో ఇద్దరం చూద్దాం రా అని పిలిచి పక్కన కూచోపెట్టుకోవడం కూడా పరిష్కారమే. మన చేతులు మనవిగా ఉంటూ అవి ఫోన్‌ని కాకుండా భార్య చేతులనో భర్త చేతులనో పట్టుకుంటూ ఉంటే ఇంట్లో మనశ్శాంతి గ్యారంటీ.

డబ్బు పెద్ద జబ్బు
కరోనా శరీర కష్టాన్నే కాకుండా డబ్బు కష్టాన్ని కూడా తెచ్చి పెట్టింది. ఉద్యోగాలు పోవడం, సగం జీతాలు రావడం, వ్యాపారాలు సరిగ్గా జరక్కపోవడం ఇవన్నీ ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టాయి. సంపాదించలేకపోతున్నానన్న బాధ భర్తకు, సంపాదించింది చాలట్లేదన్న ఫ్రస్ట్రేషన్‌ భార్యకు ఉంటే ఇక ఇల్లు ప్రమాదంలో పడినట్టే. ఈ విషయంలో మాత్రం భార్య, భర్త సంపూర్ణంగా సహకరించుకోవాలి. సర్దుబాట్లు చేసుకోవాలి. భ్రమల్లో ఉండకుండా వాస్తవిక అంచనాలతో ఇంటి భవిష్యత్తును ప్లాన్‌ చేసుకోవాలి.

డబ్బు ఉన్నది/కావాల్సినది అనే విషయం ఇరువురూ ట్రాన్స్‌పరెన్సీని పాటిస్తే చాలా వరకు సమస్య తీరినట్టే. డబ్బు లేదు కదా అని మనసును కష్టపెట్టే మాటలు మొదలెడితే అవి లోతైన గాయం చేస్తాయి. పాజిటివ్‌గా మాట్లాడటం, పరస్పరం సహకరిస్తున్నట్టుగా మాట్లాడుకోవడం ఇంటిని చాలా చాలా ప్రశాంతతతో ఉంచుతుంది. కష్టం వస్తే ఏముందిలే ప్రేమైతే ఉంది కదా అని అనిపించేలా చేస్తుంది. ఇల్లు తయారు కావడానికి ఏళ్లు పడుతుంది. ఛిద్రం చేసుకోవడానికి క్షణం పట్టదు. ఆరోగ్యాన్ని కరోనా నుంచి కాపాడుకుంటున్నట్టుగానే ఇంటిని స్పర్థల నుంచి, తగవుల నుంచి కాపాడుకుందాం

గిఫ్ట్స్

సహజంగా అందరూ ఇష్టపడే గిఫ్ట్స్ ఇవే…

వాలెట్ :

వాలెట్ ని ప్రతి రోజు ప్రతి ఒక్కరూ వాడేది. ఈ వాలెట్ని వివిధ రకాల కంపెనీలు తయారు చేస్తూ ఉంటారు. సహజంగా మనకు షాపుల్లో అవి ఎక్కువగా దొరుకుతాయి లేదా ఆన్లైన్ లో కూడా ఇప్పుడు వీటిని కొనుగోలు చేసి నచ్చిన వారికి బహుమతిగా ఇవ్వొచ్చు అయితే వాలెట్ నిజంగా ప్రతి ఒక్కరు వాడుకుంటారు.

లేడీస్ నుంచి జెంట్స్ వరకు బయటకు వెళితే దీన్ని డబ్బులు పెట్టుకుని తీసుకెళ్తారు. కాబట్టి మీకు నచ్చిన కలర్ బ్రాండ్ వంటివి చూసుకుని వీటిని విక్రయించవచ్చు. అలానే వాళ్ల పేరు మీద వాలెట్ ను తయారు చేయవచ్చు లేదా తయారు చేసింది కొనవచ్చు. ఇప్పుడు చాలా మంది వాలెట్ బయట పేరు రాయిస్తున్నారు. ఇది కూడా బావుంటుంది దీనినే కనుక గిఫ్ట్ చేస్తే తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది
కీ చైన్స్:

కీచైన్ మంచి గిఫ్ట్ ఐటమ్. అయితే చాలా మంది కిచెన్లు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ హాబీ అంతే కాకుండా బైక్, కబోర్డ్ వంటి వాటికి కూడా కీ చైన్ ని తగ్గిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పేరు తో ఒక మంచి కిచెన్ డిజైన్ చేయించిన కూడా చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు. ఇది మంచి గిఫ్ట్ వాళ్లు నిక్ నేమ్ లేదా పెట్ నేమ్ సర్ నేమ్ నచ్చిన రీతిలో వాళ్ళ పేరు వ్రాయించి వారికి బహుమతి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

ఫోటో ఫ్రేమ్ :

ఫోటో ఫ్రేమ్ కూడా బాగుంటుంది. వాళ్లకి గతం లో ఉన్న అనుభవాలని లేదా వాళ్ళ సరదా రోజుల్ని వాళ్లు మరిచి పోలేని రోజుల్ని ఇలా ఫోటోలను తీసి ఫ్రామ్ కట్టించవచ్చు లేదా ఇప్పుడు అన్ని రకాల ఫోటోలను జతచేసి ఒక ఫోటో ఫ్రేమ్ లో పెట్టడం ఫ్యాషన్ అయి పోయింది ఇది కూడా నిజంగా చాలా బాగుంటుంది. వాళ్ళ జ్ఞాపకాలని అన్నీ కూడా ఒక ఫ్రేమ్ లో గోడ మీద చూసుకోవచ్చు.

ఫోటో కేక్స్ :

వాళ్ళ ఫోటో ని కేక్ మీద ప్రింట్ చేయించి వాళ్లకి సర్ప్రైజ్ ప్లాన్ చేయొచ్చు. ఇది నిజంగా బావుంటుంది. ఎక్కడైనా బేకరీ లో ఇది అందుబాటు లో ఉంటే వాళ్ళ ఫోటోని కేక్ మీద చిత్రించి వాళ్లకి కేక్ ప్రెజెంట్ చేయొచ్చు ఇది కూడా చాలా మంచి ఐడియా

ఫోటో హ్యాంగింగ్స్:

చిన్నచిన్న లైట్లు మధ్య లో వాళ్ళ ఫోటోలు అన్ని పెట్టి తయారు చేయవచ్చు దీనిని గోడ మీద పెడితే ఎంతో అందంగా ఉంటుంది అదే కనుక చీకట్లో ఉంచితే చాలా బాగుంటుంది చక్కటి లైటింగ్ వెలుగుతూ ఇది బాగా ఆకట్టుకుంటుంది తప్పకుండా ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా తక్కువ ఖర్చు తో చాలా అందంగా ఉండే గిఫ్ట్స్ ఇవి. కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళు స్నేహితులు పుట్టిన రోజు లేదా ప్రత్యేకమైన రోజున మీరు వీటిని ప్రజెంట్ చేయవచ్చు

వివాహం

మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం.
రెండు హృదయాలు ఒక్కటై చివరి వరకు సాగే ప్రయాణం.
ఇది ప్రేమ వివాహమైనా కావచ్చు, పెద్దలు నిర్ణయించిన సంబంధమైనా కావచ్చు, మూడు ముళ్ళు తో ఏకమై, ఏడడుగులతో ప్రయాణం మొదలుపెట్టి, నూరేళ్లపంటను పండించే అందమైన ప్రయాణము.
తల్లిదండ్రి కానీ, తోడబుట్టిన కానీ, స్నేహితులు కానీ
కొంతవరకే సాగేది. చివరివరకు తోడుగా నీ వెంట ఉండేది
భార్య/భర్త మాత్రమే.
నిజంగా ఇదొక అద్భుత ప్రయాణం. ఎక్కడో పుట్టినటువంటి అమ్మాయి పెళ్లి అనే పేరుతో పుట్టింటి నుండి అత్తవారింటికి వచ్చి, మొదట్లో ఎవరు ఎలాంటి వారు తెలుసుకుని, పెంచిన వాళ్ల తల్లిదండ్రులను వదిలివేసి, కొత్త ఇంటిలో ఆమె చేసే అష్టావధానం నిజంగా భగవంతుడి యొక్క ప్రసాదం.
సంతానం కలిగిన తర్వాత వారి కోసమే జీవితమంతా ధారపోయడం ఆ మాతృమూర్తికే చెందుతుంది. కోపతాపాలు ఇంటిలో ఈసడింపులు భరిస్తూ వివాహవ్యవస్థను గౌరవిస్తూ ముందుకు సాగే ధన్యముర్తి భార్య.

ఇక్కడ ఒక నిజం చెప్పదలుచుకున్నా. భార్య భర్తలలో
భర్త ముందుగా పోయిన బతకగలదు. ఒకవేళ  భార్య చనిపోతే భర్త యొక్క బతుకు నరక ప్రాయమే.
వారి బాధలు వర్ణనాతీతం. సకాలానికి భర్తకు అందించే స్త్రీ
భర్తను చిన్నపిల్లవాడిలా చూసుకొనే భార్య దూరమైతే,
ఆ భర్త బ్రతికి ఉన్నా సచ్చిన వాడితోనే సమానం..
అందుకే భాగస్వామి లేకపోతే బతుకు భారమే.

భార్య భర్తల అనుబంధం నమ్మకం మీద ఆధారపడి సాగుతుంది. బండికి రెండు చక్రాలు ఎంత ముఖ్యమో కుటుంబానికి వారు అంతే ముఖ్యం. చక్రాలను బ్యాలెన్స్ చేసేది ఇరుసు అంటే ఇక్కడ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. తప్పులు ఇద్దరూ కలిసి సరిదిద్దుకోవాలి. చిన్న చిన్న తప్పులను చిలికి గాలివాన చెయ్యకుండా. ఒకరికొకరు క్షమించుకుంటూ ముందుకు సాగిపోతే, ఆ సంసారమే స్వర్గంతో సమానం. సంసారం నిస్సారంగా అయిందా అది నరకంతో సమానం.

భారతీయవివాహవ్యవస్థను చూసి ప్రపంచదేశాలన్నీ మెచ్చుకుంటుంటే గర్వపడుతున్నాను. వివాహమనే ఒప్పందంపై కలకాలం కలిసి జీవించే, మహోత్సవ కార్యక్రమం వివాహమని, ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా చివరి ప్రయాణం సాగించేది ఒక భారతీయవివాహవ్యవస్థలోనే ఉన్నదని మనందరికీ తెలిసిన విషయమే.

అరుంధతి-వశిష్ట జంట నక్షత్రాలు

మన భారతదేశ జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం: Important to know our culture::

వివాహ మహోత్సవ సంధర్భంలోనే భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారా అన్నట్లుంది ఈ ప్రక్రియ:: ఒక సారి చూడండి..
5,000 – 7,000 ఏళ్ళ క్రితమే జంట నక్షత్రాల గురించి మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులకు తెలుసు. అందుకే మన ఆధునిక శాస్త్రజ్ఞులు కనుగొన్న15వ అత్యంతకాంతివంతమైన నక్షత్రాన్ని మన వారు ఎప్పుడోగుర్తించగలిగారు.. మనము దీనినే జ్యేష్టా నక్షత్రం అంటున్నాము… ఇప్పుడు సైన్సు ఇది భూమి కంటే 40,000 రెట్లు పెద్దద(జ్యేష్టమ)ని గుర్తించగలిగింది.. ఈ జంట నక్షత్రాలను అరుంధతి-వశిష్ట నక్షత్రాలు అని పిలుచుకుంటున్నాం.. ఈ జంట నక్షత్రాలను మరింత ముందుకు తీసుకువెళ్ళి మన వివాహంలో ఒక తంతుకు కూడా ముడి పెట్టారు.. మామూలుగా అయితే ఒక గ్రహం వేరొక గ్రహం చుట్టూ మాత్రమే తిరుగుతాయి.. కానీ ఈ జంట నక్షత్రాలు మాత్రం ఒకదానిచుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి.. ఇంకా చెప్పాలంటే దస్తీ బిస్తీ అని తిరుగుతూ ఆడుతూ ఉంటాం చూడండి అలాగన్న మాట.. దీనినే ఒకరకంగా హోమగుండం చుట్టూ ఒకరి వేలు పట్టుకుని మరొకరు తిరిగినట్లుగా చూపుట, వివాహానంతరం ఈ జంట నక్షత్రాలను చూపుటలో భార్యా భర్తల మధ్య సoబంధం ఇలాచూపారేమోనని ఒక అభిప్రాయం.
అయితే 5,000 ఏళ్ళ క్రితమే ఎటువంటి టెలిస్కోప్ లు లేకుండా ఈ నక్షత్రాల భ్రమణ పద్దతులను అధ్యయనం చేయగలిగారంటే నిజంగా అద్బుతమే…

పేరెంటింగ్

Image may contain: text

PARENTING IS AN ART and SCIENCE.
Please learn it and gift a beautiful future to your child.
🚫 స్మార్ట్ ఫోన్ల వల్లనే పిల్లలు చెడిపోతున్నారు, వాటిని బ్యాన్ చేయాలి.
🚫 సినిమాల వల్లనే హింసా ప్రవత్తి పెరుగుతోంది, వాటిని నియంత్రించాలి.
🚫 టీవీ సీరియళ్ల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, వాటిని చూడనివ్వకూడదు.
🚫 ఇంటర్నెట్ పెద్ద భూతంలా మారింది, దానికి దూరంగా ఉంచాలి.
🚫 స్కూళ్లు, కాలేజీలు మార్కులు, ర్యాంకుల మిల్లులుగా మారాయి, ఆ వ్యవస్థను మార్చాలి.
🚫 ఫ్రెండ్స్ ప్రభావం వల్ల టీనేజర్లు పెడధోరణులు పడుతున్నారు, వారికి దూరంగా ఉంచాలి.
🚫 పబ్జీ లాంటి వీడియో గేమ్స్ వల్ల ఆవేశం, హింసాప్రవత్తి పెరుగుతోంది, దాన్ని బ్యాన్ చేయాలి.
🚫 టిక్ టాక్ మోజులో పడి చదువు గాలికి వదిలేస్తున్నారు, లైక్స్ కోసం పెడధోరణులు పడుతున్నారు, దాన్ని బ్యాన్ చేయాలి.
🚫 యూట్యూబ్ లో చెత్త వీడియోలు చూసి చెడిపోతున్నారు, దాన్ని బ్యాన్ చేయాలి.
🚫 వాట్సాప్, స్నాప్ చాట్ ల్లో చెత్తంతా షేర్ చేసుకుని చెడిపోతున్నారు, వాటిని కంట్రోల్ చేయాలి.
🚫 సినిమాలు, సీరియల్స్, వీడియో గేమ్స్, యూట్యూబ్ షార్ట్ మూవీస్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, టిక్ టాక్, పబ్జీ, వాట్సాప్, స్నాప్ చాట్, మద్యం, డ్రగ్స్, ఫ్రీసెక్స్… వీటన్నింటితో సమాజమే చెడిపోయింది. దీన్నెవ్వడూ బాగుచేయలేడు.
ఏదైనా సంఘటన జరిగినప్పుడు, పత్రికల్లో, టీవీల్లో వాటికి సంబంధించిన వార్తలు చూసినప్పుడు సగటు తల్లిదండ్రుల స్పందనిది. ఇక ఫేస్బుక్లో వీటిపై పెట్టే పోస్టుల గురించి చెప్పనక్కర్లేదు. తల్లిని చంపిన కూతురు, అత్తారింట్లో దొంగతనం చేసిన కోడలు వార్తల నేపథ్యంలో కూడా ఇలాంటి స్పందనే కనిపించింది. తల్లిని చంపి, శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని, మూడు రోజులపాటు ప్రియుడితో గడిపేటంత క్రిమినల్ అయ్యేందుకు మీడియా, సోషల్ మీడియానే కారణమంటూ రకరకాల పోస్టులు కనిపించాయి.
నిజమే పిల్లల ఆలోచన, ప్రవర్తనా సరళిపై మీడియా, సోషల్ మీడియా, టెక్నాలజీ ప్రభావం ఉంటుంది. అయితే ఎంతవరకు? కొంతవరకే. పిల్లలపై అత్యంత ప్రభావం చూపేది కుటుంబం, కుటుంబ వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన, వారి పెంపకం. కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు, ఆ బాధ్యతను అంగీకరించేందుకు మనం సిద్ధంగా లేము. ఎందుకంటే… మన పిల్లలు తప్పుదారి పట్టడానికి మనమే కారణమని అంగీకరించలేము. తల్లిదండ్రులందరూ తప్పు చేశారనను, చేస్తున్నారనను. పెళ్లయ్యాక పిల్లలు పుట్టడం సహజంగా జరిగే చర్య. కానీ పిల్లల పెంపకం అంత సులువుగా, సహజంగా జరిగే చర్య కాదు. అదో సైన్స్, ఆర్ట్. ఏ వయసులో పిల్లలు ఎలా పెరుగుతారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా స్పందిస్తారో తెలియకుండానే, తెలుసుకోకుండానే పిల్లల్ని పెంచేస్తున్నాం. ఫలితమే ఇలాంటి సమస్యలు.
ఈ తప్పులెవరివి?
❓ఉదయం లేచింది మొదలు మొబైల్ లేదా ల్యాప్ టాప్ పై గడిపే తండ్రి తన కూతురు మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయ్యొందంటూ కౌన్సెలింగ్ కు తీసుకువచ్చారు. ఆ మొబైల్ కొనిచ్చిందెవరు? ఎవర్ని చూసి ఆమె మొబైల్ వాడకం నేర్చుకుంది? నువ్వు చేస్తుంది ఏంటి డాడీ అని ఆ అమ్మాయి అడిగితే ఆ తండ్రి ఏం సమాధానం చెప్తాడు?
❓చదువుకోసం, బంగారు భవిష్యత్తు అందించేందుకు కొడుకుని చిన్నప్పటినుంచీ ఇంటికి దూరంగా రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో చదివించిన తల్లిదండ్రులు ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన కొడుకు తమను పట్టించుకోవడంలేదని బాధపడుతూ కౌన్సెలింగ్ కు వచ్చారు. బంధాలు, అనుబంధాలకు దూరంగా మార్కులు, ర్యాంకులకు దగ్గరగా పెంచి, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం?
❓కెనడాలో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబం తమ కూతురు ఆల్కహాల్ కు అడిక్ట్ అయ్యిందంటూ సంప్రదించారు. కానీ తాగడం తమ దగ్గరినుంచే నేర్చుకుందనే విషయం దాచిపెడతారు. ఎవర్ని మోసం చేసేందుకు?
❓విజయవాడకు చెందిన ఓ వ్యాపారకుటుంబం తమ కూతురికి రోజుకు మూడు వేలు… ఎస్, రోజుకు మూడువేలు పాకెట్ మనీ ఇచ్చారు. అంత పాకెట్ మనీ ఇవ్వడం గర్వంగా ఫీలయ్యారు. ఇప్పుడదే సమస్యగా మారింది. కౌన్సెలింగ్ కు వచ్చారు. కూతురుకి రోజుకు మూడువేలిచ్చిన తండ్రి నా ఫీజు మాత్రం వెయ్యి తగ్గించి ఇచ్చాడు. దేనికి డబ్బు ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపుగా ఉండాలో తల్లిదండ్రులకే తెలియకపోతే ఆ పిల్లకెలా తెలుస్తుంది?
❓సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఒంటరితనంతో బాధపడుతున్నానంటూ సంప్రదించాడు. తన కుటుంబ సభ్యులు తన సంపాదన కోసమే చూస్తున్నారు తప్ప తనను పట్టించుకోవడంలేదని ఏడ్చేశాడు.
❓తిరుపతి చెందిన ఓ తండ్రి అమెరికాలో చదువుతున్న కొడుక్కి కారు కొనిపెట్టాడో తండ్రి. అతను దారితప్పి ఇండియాకు వచ్చేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కౌన్సెలింగ్ కు తీసుకొచ్చారు. చదువుకునే కొడుక్కి కారు ఎందుకనే ప్రశ్న తండ్రికి రాలేదు. అవసరానికి (నీడ్) ఆడంబరానికి (వాంట్) మధ్య తేడా తెలీకుండా పెంచి ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం? కొడుక్కి కారు కొనిచ్చిన తండ్రి కౌన్సెలింగ్ ఫీజు దగ్గర మాత్రం కూరగాయల బేరాలాడటం కొసమెరుపు.
ఏం నేర్పిస్తున్నాం?
⁉️ కొడుకు ప్రాజెక్టు వర్క్ కోసం ఆపీసు నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నాడు?
⁉️ నచ్చిన చీర కొనుక్కుని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురుకి ఏం నేర్పిస్తుంది?
⁉️ పిల్లల ఎదురుగా భర్త లేదా భార్యతో గొడవపడటం ద్వారా మీరేం నేర్పిస్తున్నారు?
⁉️ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి, వారు వెళ్లిపోగానే విమర్శించే మీనుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారో తెలుసా?
⁉️ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిని తల్లిపై బిడ్డలకు ఏం గౌరవం ఉంటుంది?
⁉️ పిల్లలు చదువుతుండగా మీరు టీవీ చూస్తుంటే వారిపట్ల మీకేం శ్రద్ధ ఉన్నట్లు?
⁉️ పిల్లల్ని కూర్చోబెట్టుకుని జబర్దస్త్ లాంటి షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే విలువలు ఎక్కడినుంచి వస్తాయి?
⁉️ మార్కులు, ర్యాంకుల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీరెప్పుడైనా మాట్లాడారా? వారి ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకున్నారా? అసలు వారికిష్టమైన కోర్సు చదవనిచ్చారా?
⁉️ చదువుల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చుచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించడం నేర్పిస్తున్నారా? దానికోసం రూపాయైనా ఖర్చు చేస్తున్నారా?
⁉️ అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసా? అందుకోసం కనీసం ఒక్క పుస్తకమైనా కొని చదివారా? ఒక్క వీడియో అయినా చూశారా? ఒక్క క్లాసయినా విన్నారా?
⁉️ అవసరానికి, ఆడంబరానికి మధ్య ఉన్న తేడా మీ పిల్లలకు తెలిసేలా చేశారా?
⁉️ సరదాకు, విచ్చలవిడితనానికి తేడా ఏమిటో వివరించారా?
⁉️ వారి జీవితానికి వారే బాధ్యులని ఎన్నడైనా చెప్పారా?
⁉️ మీ పిల్లలు చెడిపోవడానికి మీడియా, సోషల్ మీడియా, టెక్నాలజీనే కారణమని తిడుతూ మీరు మీ బాధ్యతనుంచి తప్పించుకుంటున్నారని ఎన్నడైనా గుర్తించారా?
మీ పిల్లలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారని, మిమ్మల్నే అనుసరిస్తారని, వారిపై అన్నింటికంటే మీ ప్రభావమే ఎక్కువని తెలుసుకోండి.
అన్నిటికీ సమాజాన్ని తిట్టడం మానేసి మార్పు మీనుంచి, మీ ఇంటినుంచి మొదలుపెట్టండి.