డిజిటల్‌ లెర్నింగ్‌

Digital Learning: Know About This - Sakshi

అదో గొడుగు
డిజిటల్‌ లెర్నింగ్‌ అనేది గొడుగు లాంటిది. మనం నేర్చుకోవాలనుకున్నది ఏదైనా కూడా అందులో డిజిటల్‌ టెక్నాలజీ పాత్ర తప్పక ఉంటుంది. ఉదాహరణకు విద్యార్థులు ఆన్‌లైన్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ క్లాసులను వీడియో ద్వారా వీక్షించడం.. అలాగే ఉపాధ్యాయులు డిజిటల్‌ టూల్స్‌ అంటే స్మార్ట్‌ బోర్డ్స్, టాబ్లెట్స్‌ ఆధారంగా బోధించడం. ఇలాంటివి అన్నీ డిజిటల్‌ లెర్నింగ్‌ కిందకు వస్తాయి. 

ఆన్‌లైన్‌ లెర్నింగ్‌
విద్యార్థులకు ఇంట్లోనే తరగతి గది లాంటి వాతావరణాన్ని కల్పించేదే ఆన్‌లైన్‌ లెర్నింగ్‌. ఇందులో విద్యార్థులు క్లాసులను వినడమే కాదు. ప్రత్యక్షంగా నేర్చుకుంటున్న పాఠ్యాంశాల్లో ఎలాంటి సందేహాలు ఉన్నా.. అడిగి వాటిని నివృత్తి చేసుకునే సౌకర్యం ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ క్లాసుల ద్వారా సాధ్యమవుతుంది. విద్యార్థులు–టీచర్‌ మధ్య పరస్పర సంభాషణకు అవకాశం ఉన్న వేదికనే.. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌!

ఈ లెర్నింగ్‌
ఈ లెర్నింగ్‌ని వర్చువల్‌ లెర్నింగ్‌ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా ఇంటర్నెట్‌ ఆధారంగా.. ఏదైనా కోర్సు నేర్చుకోవాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యక్షంగా కలవనవసరం లేకుండా.. ఇంటర్నెట్‌ ఆధారంగా అంటే ఈ–మెయిల్, చాటింగ్, వీడియోలు వంటివి ఈ–లెర్నింగ్‌కు దోహదపడతాయి. 

స్వయం
చదువుకోవాలనే ఆలోచన ఉండాలేకాని ప్రస్తుతం మార్గాలు అనేకం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్వయం ఆన్‌లైన్‌ కోర్సులను నేర్చుకోవడానికి విద్యార్థులను ప్రొత్సహిస్తుంది. జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ విద్యను ప్రొత్సహించే ఉద్దేశంతో మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సు (మూక్స్‌) తరహాలో స్వయం పేరిట ఈ ఆన్‌లైన్‌ వేదికను ఏర్పాటు చేశారు. ఇది వివిధ కోర్సుల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 

ఉచితంగానే నేర్చుకోవచ్చు
కరోనా కారణంగా విద్యాసంస్థల మూసివేయడంతో ఆన్‌లైన్‌ కోర్సులకు డిమాండ్‌ ఏర్పడింది. పూర్తిగా ఉచితంగా కోర్సులను అందించడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానం వైపు వస్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలోని దీక్ష, ఈ–పాఠశాలతోపాటు ఈతంత్ర, వర్చువల్‌ ల్యాబ్స్, స్పోకెన్‌ ట్యుటోరియల్, ఎన్‌పీటీఈఎల్‌ లాంటి వాటిని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. 

టీచర్లూ నేర్చుకోవచ్చు
ఉపాధ్యాయలు సైతం ఆన్‌లైన్‌ వేదికగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆయా బోధనాంశాల్లో, పద్ధతుల్లో మరింత మెరుగవడానికి, ఆయా రంగాల్లో జరుగుతున్న మార్పులు, కొత్త పరిశోధనలు, పరిణామాలు తెలుసుకోవడానికి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ చక్కగా ఉపయోగపడతాయి. ఆన్‌లైన్‌ విద్యవైపు విద్యార్థులను ప్రోత్సహించడానికి డిజిటల్‌ లెర్నింగ్‌ దోహదపడుతుంది. 

ప్రోత్సహించాలి
ప్రస్తుతం కొత్త జనరేషన్‌ మొత్తం ఆన్‌లైన్‌లో మునిగితేలుతోంది. చిన్నారులు స్కూల్‌ గ్రౌండ్‌లో ఆడే ఆటలకంటే.. మొబైల్‌ ఫోన్లలో వీడియో గేముల్లోనే ఎక్కువగా లీనమవుతున్నారు. నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉండే ఈ వయసులోనే విద్యార్థులను ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ వైపు ప్రోత్సహించాలి. సమయాన్ని వృథా చేసుకోకుండా.. ఆన్‌లైన్‌ వేదికగా ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటూ.. సబ్జెక్టులపై అవగాహన పెంచుకునేలా చూడొచ్చు

లాక్‌డౌన్‌ కాలంలో.. ఆన్‌లైన్‌ విజ్ఞానం

కరోనా కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు.. అన్నింటికీ సెలవులు ప్రకటించారు. కాని ఇంకా అటు అకడెమిక్‌ పరీక్షలు కానీ.. ఇటు పోటీ పరీక్షలు కానీ పూర్తికాలేదు.
Current Affairs

ఇలాంటి కీలక సమయంలో తరగతి గది బోధన లేని లోటును తీరుస్తున్నాయి.. ఆన్‌లైన్‌ వేదికలు! ముఖ్యంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్‌డీ) అందుబాటులోకి తెచ్చిన.. స్వయం, ఈ పాఠశాల, స్వయం ప్రభ, నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ, ఈ–సోధ్‌ సింధు వంటివి విద్యార్థులకు వరంగా మారుతున్నాయి. ఇంట్లోనే ఉండి అవసరమైన సబ్జెక్టులను నేర్చుకునేందుకు వీలుండడం, ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకులు చెప్పే పాఠాలు, వీడియో లెక్చర్స్‌ అందిస్తుండటంతో.. విద్యార్థులు ఆన్‌లైన్‌ లెర్నింగ్‌వైపు దృష్టి సారిస్తున్నారు. ఎంహెచ్‌ఆర్‌డీ అందిస్తున్న ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ వేదికలపై ప్రత్యేక కథనం…
స్వయం
నాణ్యమైన, ఉత్తమమైన విద్యను, బోధనను ప్రతి ఒక్కరికి చేరువచేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్‌ పోర్టల్‌.. ‘స్వయం’. ఇందులో అందుబాటులో ఉంచిన కోర్సులు.. దేశంలోని వెయ్యిమందికి పైగా అత్యుత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు కలిసి రూపొందించినవే కావడం విశేషం. స్వయం ద్వారా అందిస్తున్న కోర్సుల పాఠాలు వీడియోల రూపంలో, ప్రింటింగ్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా పొందుపరిచారు.

ఇందులో 4 వారాల నుంచి 24 వారాల కాలపరిమితి గల తొమ్మిదో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ దాకా.. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులను ఉచితంగా పొందవచ్చు. తరగతి గదిలో బోధించినట్టే ఇక్కడా పాఠాలు ఉంటాయి. వీటిని ఎవరైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్‌ చేయవచ్చు. అంతేకాకుండా స్వీయ అంచనా వేసుకునేందుకు వీలుగా పరీక్షలు, క్విజ్‌లు, సందేహాల నివృత్తికి ఆన్‌లైన్‌ చర్చావేదికగా అందిస్తున్నారు. కొన్ని అంశాలను మల్టీమీడియా ద్వారా వివరిస్తూ నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నారు. స్వయం పోర్టల్‌లో కోర్సులకు నేషనల్‌ కోఆర్డినేటర్లుగా ఏఐసీటీఈ, ఎన్‌పీటీఈఎల్, యూజీసీ, సీఈసీ, ఎన్‌సీఈఆర్‌టీ, ఇగ్నో, ఐఐఎం బెంగళూరు, ఎన్‌ఐఓఎస్, ఎన్‌ఐటీటీఆర్‌ వ్యవహరిస్తున్నాయి. ఈ ఆన్‌లైన్‌ కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. పైగా ఈ కోర్సుల క్రెడిట్స్‌ను రెగ్యులర్‌ కోర్సులతో కలుపుకోవచ్చు. సర్టిఫికెట్‌ పొందాలనుకునేవారు మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://swayam.gov.in

ఈ–పాఠశాల
ఈ పాఠశాల ద్వారా ఆన్‌లైన్‌లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు.. ఎన్‌సీఈఆర్‌టీ ‘ఈ–టెక్ట్స్‌ బుక్స్, సప్లిమెంటరీ బుక్స్, ఆడియో, వీడియో పాఠాలు’ అందుబాటులో ఉంచింది. అవసరమనుకుంటే పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్‌ కూడా చేసుకోవచ్చు.
ఉపాధ్యాయుల కోసం ఈ బుక్స్, టీచింగ్‌ నిబంధనలు, విధివిధానాలు, అభ్యాస ఫలితాలు(లెర్నింగ్‌ ఔట్‌కమ్స్‌).. చిన్నారులకు ఎలా అందించాలో వివరించే టెక్నిక్స్‌ కూడా ఉన్నాయి. ఈ రిసోర్సెస్‌ వంటి విభాగాల ద్వారా బోధనా ప్రమాణాలు పెంచే అంశాలను, ప్రామాణికంగా రూపొందించిన ఎడ్యుకేషనల్‌ జర్నల్స్‌ను అందుబాటులో ఉంచారు.విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపయోగపడే సమాచారం, విద్యావంతులకు అవసరమైన వివరాలు సైతం ఇందులో పొందవచ్చు.
పాఠశాల విద్యలో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు భారత ప్రభుత్వం 1961లో ఏర్పాటు చేసిన స్వయం ప్రతిపత్తి గల సంస్థ ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌’ (ఎన్‌సీఈఆర్‌టీ). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతమైన, మెరుగైన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ను అందించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను ఎన్‌సీఈఆర్‌టీ అందిస్తుంది. పాఠ్యపుస్తకాలు రూపొందించడం, విద్యా సంబంధ పరిశోధనలు చేపట్టడం, జర్నల్స్‌ వంటి అంశాలను ఈ సంస్థ పరిశీలిస్తుంది.
పూర్తి వివరాలకు వెబ్ సైట్http://www.epathashala.nic.in
స్వయం ప్రభ
ఉపగ్రహం ద్వారా నిరంతరాయంగా నాణ్యమైన విద్యా కార్యక్రమాలు అందించేందుకు భారత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 32 డీటీహెచ్‌ చానెళ్ల సమూహం ‘స్వయం ప్రభ’. ఈ చానెళ్ల ద్వారా ప్రతిరోజు నాలుగు గంటలపాటు కొత్త కంటెంట్‌ను ప్రసారం చేస్తారు. రోజులో ఐదు పర్యాయాలు తిరిగి అదే కంటెంట్‌ ప్రసారం చేస్తుండడంతో.. విద్యార్థులు తమకు అనువైన సమయంలో వాటిని వీక్షించే వీలుంది.
ఉన్నత విద్యకు సంబంధించి యూజీ, పీజీ కోర్సుల విద్యార్థులకు ఉపయోగపడేలా కరిక్యులం ఆధారిత కంటెంట్‌ను అందిస్తున్నారు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, సోషల్‌ సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చర్‌ వంటి విభాగాల విద్యార్థులు ప్రయోజనం పొందొచ్చు.
ఈ చానెళ్ల ద్వారా పాఠశాల విద్య (9 నుంచి 12 తరగతులు)లో భాగంగా ఉపాధ్యాయుల శిక్షణా అంశాలను, పిల్లలకు పాఠ్యాంశాల బోధనను ప్రసారం చేస్తున్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అవసరమైన సమాచారం సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఈ పాఠాలను ఎన్‌పీటీఈఎల్, ఐఐటీలు, యూజీసీ, సీఈసీ, ఇగ్నో, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఐవోఎస్‌లు అందిస్తున్నాయి.
పూర్తి వివరాలకు వెబ్ సైట్https://swayamprabha.gov.in
నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ
భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ).. ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ త్రూ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ’ (ఎన్‌ఎంఈఐసీటీ) కింద నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌డీఎల్‌ ఇండియా) పైలట్‌ ప్రాజెక్టును ఖరగ్‌పూర్‌ ఐఐటీ ఆధ్వర్యంలో అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడే మెటీరియల్, కంటెంట్, టెక్ట్స్, వీడియో, ఆడియోల రూపంలో పొందుపరిచారు. వివిధ భాషల్లో స్కూల్‌ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఆయా సబ్జెక్టుల పాఠ్యాంశాలు.. సైన్స్, సోషల్‌ సైన్సెస్, టెక్నాలజీ, హుమానిటీస్, హిస్టరీ, జాగ్రఫీ వంటి వాటితోపాటు వివిధ కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు, జర్నల్స్‌లను ఇక్కడ చూడొచ్చు. ప్రఖ్యాత విద్యాసంస్థలు అందించే పాఠ్యాంశాలు ఇక్కడ కోకొల్లలుగా పొందవచ్చు. ప్రధానంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇదో అద్భుతమైన వేదికగా చెప్పవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్ సైట్https://ndl.iitkgp.ac.in
ఈ–సోధ్‌ సింధు
ఒకవిధంగా చెప్పాలంటే.. ఈ సోద్‌ సింధు కూడా ఆన్‌లైన్‌ లైబ్రరీ వంటిదే. ఇందులోని పాఠ్యాంశాలు, జర్నల్స్, ఆర్కైవల్స్‌ పొందేందుకు చందా చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా విద్యా సంస్థలకు తక్కువ చందాతో విలువైన ఈ–పుస్తకాలను అందించేందుకు యూజీసీ–ఇన్‌ఫోనెట్‌ లైబ్రరీ కన్సార్టియం, ఎన్‌ఎల్‌ఐఎస్‌టీ, ఇన్‌డెస్ట్‌–ఏఐసీటీఈలను అనుసంధానం చేస్తూ.. ‘ఈ–సోధ్‌ సింధు’ను ఏర్పాటు చేశారు. దీనికి సైన్స్, ఆర్ట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర రంగాలకు చెందిన ప్రసిద్ధ విభాగాల గ్రంథాలయాలను, పెద్ద సంఖ్యలో ప్రచురణకర్తలు, ఆగ్రిగేటర్లు, కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక సంస్థలు, విశ్వ విద్యాలయాలు, కళాశాలల డేటాబేస్‌ను అనుసంధానం చేశారు. పోర్టల్‌లో 10 వేలకు పైగా ఈ జర్నల్స్, 32 లక్షల ఈ బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి.
దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే.. శాశ్వత ప్రాతిపదికన ఈ–జర్నల్స్, ఈ–ఆర్కైవ్స్, ఈ–పుస్తకాలను అభివృద్ధి చేయడం. దాంతోపాటు అవగాహన, శిక్షణా కార్యక్రమాల ద్వారా మెంబర్‌షిప్‌ గల విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, సాంకేతిక సంస్థల్లో ఈ–వనరుల వినియోగాన్ని పర్యవేక్షించడం, ప్రోత్సహించడం.
ఈ–సోధ్‌ సింధులో సభ్యత్వం తీసుకున్న కళాశాలలు , విద్యా సంస్థలకు దేశంలో ఏ యూనివర్సిటీ డేటాబేస్‌తోనైనా అనుసంధానం అయ్యే∙వీలుంటుంది.
ఇప్పటికే ఇందులో 217 విశ్వవిద్యాలయాలు, 75 టెక్నికల్‌ ఇనిస్టిట్యూట్స్, 3200పైగా కళాశాలలు సభ్యత్వం పొందాయి. వీటి ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందొచ్చు.
పూర్తి వివరాలకు వెబ్ సైట్https://ess.inflibnet.ac.in

టెడ్ (TED) Technology, Entertainment, Design

టెడ్ (TED) అనగా టెక్నోలజీ, ఎంటర్ టైన్మెంట్‌, డిజైన్ అనమాట. దీనికి కాప్షను ideas worth spreading. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఆ పైన చెప్పిన రంగాలలో స్పీకర్లు వాళ్ళ ఆలోచనలను పంచుకోవచ్చు అనమాట. ఇది 1984 లో ఒక కాన్ఫరెన్స్ రూపంలో మొదలైంది. ఇక్కడ స్పీకరుకు 18 నిమిషాలలో తన చెప్పాలనుకున్న విషయాన్ని/ తన వినూత్న ఆలోచనల గురించి మాట్లాడచ్చు. అందరిలో ఎవరి ఐడియా అయితే బాగుంటుందో వారికి 1 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ కాన్ఫరెన్స్ లో మనం కూడా ప్రేక్షకుడిగా పాల్గొనాలంటే అక్షరాలా 8500 డాలర్లు  చెల్లించవలసి వుంటుందట. ఇది సంవత్సరానికి ఒక సారి వాంకోవర్, బ్రిటీష్ కొలంబియా, కెనడాలో జరుగుతుంది. 2006 వ సంవత్సరం నుండీ ఆ వీడియోలను అందరికీ అందుబాటులో టెడ్.కామ్ లో చేర్చారు. ఇప్పుడు ఎవరైనా వాటిని ఉచ్చితంగా ఆ వెబ్సైటులో చూడచ్చు. దీనికి ప్రస్తుత ఓనరు క్రిస్ ఏండర్సన్. 
TED's Chris Anderson: the man who made YouTube clever | Technology ...

మీరందరు “ఇదేంటీ మనం యూట్యూబ్ లో చూసిన వీడియోలలో ఇలా ఏమీ లేదే, 18 నిమిషాలు టైమ్ లిమిట్ అసలు లేదు, ఇంకా వచ్చిన వారంతా వాళ్ళ జీవితం గురించి వాళ్ళు సాధించనవి కదా చెప్పేది ” అని అనుకుంటున్నారు కదూ. అవును అదే టెడ్ ఎక్స్.
అంటే రెండూ వేరువేరా? మరి టెడ్ ఎక్స్ ఏంటీ?
వేరు వేరా అంటే అవును , అది కేవలం దాన్ని నిర్వాహకులు వేరు . “ఎక్స్” అంటే ఇండిపెండెంట్లీ ఆర్గనైజుడ్ టెడ్ ఈవెంటు. అర్థమయ్యేలా చెబుతాను. టెడ్ కు ప్రపంచంలో చాలా ఆదరణ లభించింది, చాలా మంది దీనిలో ఆసక్తి చూపించారు , వాళ్ళ దేశంలో /వాళ్ళ ప్రాంతంలో దీన్ని నిర్వైహించాలనుకున్నారు. అదే టెడ్ ఎక్స్. టెడ్ వారి దగ్గర కొంత డబ్బు చెల్లించి వారి దగ్గర నుండి లైసెన్సు తీసుకోవాలి. దానితో పాటు దానికి కొన్ని రూల్సు, పోలసీలు వుంటాయి , అవి పాటించాలి ఎలాంటివి అంటే పాలిటిక్స్ , మతం ఇలాంటి వాటి గురించి మాట్లాడకూడదూ అని, ఇంకా దీనితో డబ్బు సంపాదన చేయకూడదు మొదలైనవి. ఆ లైసెన్సు కేవలం ఒక ఈవెంటుకు మాత్రమే అది కూడా కొనుక్కున ఒక సంవత్సరం లోపే అనుమతి , ఆ తర్వాత మళ్ళీ కొత్తగా కొనుక్కోవాలి. ఇంకా ఒక టెడ్ ఎక్స్ వేదికపై మాట్లాడిన అదే వ్యక్తిని ఆ సంవత్సరంలో మళ్ళీ వేరే టెడ్ ఎక్స్ వేదిక పై పిలవకూడదట (దీని పై పూర్తిగా అవగాహన లేదు నాకు) . ఇలా నిర్వహించబడేదే టెడ్ ఎక్స్, ఇప్పుడు చాలా కళాశాలలో నిర్వహింపబడుతున్నది.

1. How “she” became an IAS officer => TEDx talk by Surabhi Gautam


2.  A story of struggle & grit => TEDx talk by Naveen Polishetty