సీరియల్ పాటలు

All time best telugu Tv Serial Songs
ఇపుడు సినిమా పాటలే వినేలా ఉంటాయి, కానీ ఒకపుడు సినిమా పాటల్ని మించిన పాటలు సీరియల్ లో ఉండేవి , అందులో చాలా వారికి ఈటీవీ లో వచ్చిన సుమన్ రచించిన పాటలే సినిమాలకి మించి ఉండేవి , అప్పట్లో ఆడియో క్యాసెట్ రూపంలో వచ్చి అవి సినిమాలకి మించిన క్యాసెట్లు అమ్ముడయేవి.
అంతరంగాలు అనే సీరియల్ నుండి మొదలయిన ఈ ప్రస్థానం చాలా రోజులు కొనసాగింది , కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదు , మంచి పాట ఉందంటే అది సినిమా వాళ్ళకే ఇవ్వాలనే ఉదేశంలో ఇప్పటి లిరిక్ రైటర్స్ ఉన్నారు.
ది బెస్ట్ సాంగ్స్
అంతరంగాలు అనంత మానస చదరంగాలు : Antharagaalu serial
గుండెకి సవ్వడేందుకో : Antharagaalu serial
వాసంత సమీరం లా నులు వెచ్చని గ్రీష్మంలా : ruthu ragaalu
అన్వేషిత అన్వేషిత : anveshitha
అందం అందం జీవన మకరందం : Andham
ఓ కళంకిత :kalankitha
లేడీ డేటాక్టీవ్ అమ్మో : lady detective
ఓ విధి విచిత్రాల నిధి : vidhi
కృష్ణమ్మకు గోదారికి తోడేవారమ్మా : Pinni
నమ్మకం నమ్మకం : Nammakam
మనసు ఉన్నదీ మమతల కోసం : shivayya
మెట్టెల సవ్వడి : mettela savvadi
చక్రవాకం : chakravaakam
నమ్మకమే నాన్న అయి : nanna
ఒరేయ్ ఆంజనేలు : amrutham
తొలి లేత లేత : mogalirekulu

తెలుగు గేయాలు

నన్ను దోచుకుందువటె…

గులేబకావళి కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.  


చిత్రం : గులేబకావళి కథ (1962) 
సంగీతం : విజయ కృష్ణమూర్తి  
సాహిత్యం : సినారె  
గానం : ఘంటసాల, సుశీల 


నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే 
వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు 
నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటే 

తరియింతును నీ చల్లని 
చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని 
చరణమ్ముల నీడలోన
పూలదండ వోలె 
కర్పూర కళికవోలె 
కర్పూర కళికవోలె

ఎంతటి నెఱజాణవో 
నా అంతరంగమందు నీవు
ఎంతటి నెఱజాణవో 
నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని 
సంకెలలు వేసినావు 
సంకెలలు వేసినావు 

నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే 
వన్నెల దొరసాని 
కన్నులలో దాచుకొందు 
నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటే.. 

నా మదియే మందిరమై 
నీవే ఒక దేవతవై
నా మదియే మందిరమై 
నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో 
నే కలసిపోదు నీలో 
కలసిపోదు నీలో

ఏనాటిదొ మనబంధం 
ఎరుగరాని అనుబంధం
ఏనాటిదొ మనబంధం 
ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైనా 
ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం

నన్ను దోచుకుందువటే
నన్ను దోచుకుందువటే 
వన్నెల దొరసాని 
కన్నులలో దాచుకొందు 
నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి 
నన్ను దోచుకుందువటే 

మా పెరటి జాంచెట్టు…

పెళ్ళిసందడి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.  ట్రయాంగిల్ లవ్ లో రెండు ప్రేమ కథలని చూపించే ఈ పాటలో ఎక్కడో జరుగుతున్న అల్లుడు గారి సంగీత పాఠాల ప్రేమకథకి ఇక్కడ అమ్మాయి గారి పాటని జతకలుపుతూ రాఘవేందర్రావ్ గారి చిత్రీకరణ మామూలుగా ఉండదు. ఇక ఇలాంటి పాటలో ఆయన మార్క్ షాట్స్ ని వదిలేస్తారా అందుకే వాటికీ కొదవే ఉండదు. కీరవాణి గారి సింపుల్ సంగీతం హాయిగా ఉంటుంది. మీరూ చూసీ వినీ ఆనందించండి.
చిత్రం : పెళ్ళిసందడి (1996) 
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : వేటూరి  
గానం : బాలు, చిత్ర 

కాబోయే శ్రీవారికీ… ప్రేమతో.
రాసి పంపుతున్న 
ప్రియ రాగాల ఈ లేఖ.

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ 
నీ కొసం ఎదురే చూసే
నిన్ను చూసినాక నిదరైన రాక 
మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది 
ఏ నాడని… అంటూ.

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే

Yes you are my dream girl 
నా కలల రాణి నా కళ్ళ ముందుంది
అద్భుతం హహ అవును అద్భుతం. 
మన కలయిక అద్భుతం.
ఈ కలయిక ఇలాగే వుండాలి … 
promise… promise…

నిన్ను చూడందే పదే పదే పడే యాతన
తోట పూలన్ని కనీ వినీ పడేను వేదనా
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా

చూసే కన్నుల ఆరాటం 
రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి 
నీ రాక కొసం వేచి వున్న 
ఈ మనసుని అలుసుగ 
చూడకనీ… అంటూ…

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ 
నీ కొసం ఎదురే చూసే

పెళ్ళి చూపుల్లొ నిలేసినా కధేవిటొ మరీ
ఙ్నాపకాలల్లొ చలేసిన జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లా ప్రతీ క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ
తప్పులు రాస్తే మన్నించు 
తప్పక దర్శన మిప్పించు
యెదటో నుదుటో ఎచటో మజిలీ. 
నీ మీద ప్రాణం నిలుపుకున్న 
మా మనవిని విని 
దయచేయమనీ… అంటూ…

మా పెరటి జాంచెట్టు 
పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ 
నీ కొసం ఎదురే చూసే

సపమ నిప గాగా మా రీ సాస 
నిస రిస రిపగా
సపమ నిప గాగా మా రీ సాస 
నిస రిస రిమగా 

కాశ్మీరు లోయలో…
పసివాడి ప్రాణం చిత్రంలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ని ఈ రోజు తలచుకుందాం. . ఈ సినిమా రిలీజైన రోజుల్లో చిత్రలహరిలో ప్రతి సారి ఈ పాట వేసేవాడు.


చిత్రం : పసివాడి ప్రాణం (1987)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి 

కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ

పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాణ్ణి తగిలేసినాడే
చెమ్మాచెక్క చేత చిక్క
మంచమల్లె మారిపోయె
మంచు కొండలు

మంచిరోజు మార్చమంది
మల్లె దండలు

కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ

తేనీటి వాగుల్లో తెడ్డేసుకో
పూలారబోసేటి ఒడ్డందుకో
శృంగార వీధుల్లో చిందేసుకో
మందార బుగ్గల్ని చిదిమేసుకో

సూరీడుతో ఈడు చలికాచుకో
పొద్దారిపోయాక పొద చేరుకో
గుండెలోనే పాగా గుట్టుగా వేశాక
గుత్తమైన సోకు నీదే కదా

అరె తస్సా చెక్క ఆకు వక్క
ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము
పెళ్ళి కాక ముందే జరిగె పేరంటము

కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ

సింధూర రాగాలు చిత్రించుకో
అందాల గంధాల హాయందుకో

పన్నీటి తానాలు ఆడేసుకో
పరువాలు నా కంట ఆరేసుకో
కాశ్మీర చిలకమ్మ కసి చూసుకో
చిలక పచ్చ రైక బిగి చూసుకో

గూటి పడవల్లోన చాటుగా కలిశాక
నీటికైనా వేడి పుట్టాలిలే
పూత మొగ్గ లేత బుగ్గ
సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు
హేయ్ సొంతమైన చోట లేవు ఏ హద్దులు

అరె కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ

పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాణ్ణి తగిలేసినాడే
చెమ్మాచెక్క హా చేత చిక్క అహ
మంచమల్లె మారిపోయె
మంచు కొండలు

మంచిరోజు మార్చమంది

మల్లె దండలు

చిలకా ఏ తోడు లేక…

శుభలగ్నం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. .
                                                  చిత్రం : శుభలగ్నం (1994)

                                                 సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి     

                                                 సాహిత్యం : సిరివెన్నెల

                                                          గానం : బాలు


                                         చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక

                                         తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

                                         మంగళ సూత్రం అంగడి సరుకా

                                         కొనగలవా చెయ్ జారాక

                                          లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక


                                        చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక

                                        తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక


                                       బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే

                                       బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే

                                       వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే

                                       అమృతమే చెల్లించి ఆ విలువతో

                                       హలాహలం కొన్నావే అతి తెలివితో

                                        కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే


                                       చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక

                                       తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక


                                      అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో

                                     అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో

                                    మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో

                                    ఆనందం కొనలేని ధన రాశితో

                                    అనాధగా మిగిలావే అమవాసలో

                                    తీరా నువు కను తెరిచాక తీరం కనబడదే ఇంక


                                    చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక

                                    తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

                                    మంగళ సూత్రం అంగడి సరుకా

                                    కొనగలవా చెయ్ జారాక

                                   లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేసాక


                                  చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక

                                   తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక

ప్రియతమా…

జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలై నిన్నటికి ముప్పై ఏళ్ళైందట. ఈ సంధర్భంగా ఆ సినిమాలోని ఒక మంచి మెలోడీని తలచుకుందాం. . మొదట ఫ్లాప్ టాక్ తో విడుదలై తుఫానులో చిక్కుకుని బాక్సాఫీస్ సైతం వెల వెలబోయి తుఫాన్ కాస్త తగ్గుముఖం పట్టగానే కలెక్షన్స్ తుఫాన్ ప్రారంభించిన సినిమా ఇది. వేటూరి గారి కలం వెర్సటాలిటీ తెలియాలంటే ఈ ఆల్బమ్ లోని పాటలన్నీ వింటే చాలు 🙂

చిత్రం : జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..

నింగి వీణకేమో నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
వలపె తెలిపే నాలో విరిసి

మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా
నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్నా చీరకట్టుకున్న
పడుచుతనమే నాలో మురిసే

మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్నీ దాటగానే తగిలే గగనం.. రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా

ప్రాణవాయువేదో వేణువూదిపోయే
శృతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలాయే
మనసు మమత అన్నీ కలిసి

వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే
బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె
కులము గుణము అన్నీ కుదిరి

నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే


ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా


హైర హైర హైరబ్బా…
జీన్స్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. 

చిత్రం : జీన్స్ (1999)
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : శివగణేష్, ఏ.ఎం.రత్నం
గానం : ఉన్నికృష్ణన్, పల్లవి

నాకే నాకా… నాకే నాకా…
నువు నాకే నాకా… ఆ...ఊఁ…
మధుమిత మధుమిత మధుమిత…

హైర హైర హైరబ్బా… హైర హైర హైరబ్బా…

హైర హైర హైరబ్బా… హైర హైర హైరబ్బా…
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

హైర హైర హైరబ్బా… హైర హైర హైరబ్బా…పాకెట్ సైజు వెన్నెలలు నాకే నాకా
ఫ్యాక్స్‌లొచ్చిన స్త్రీ కవిత నాకే నాకా
ముద్దుల వానలొ నిను తడిపేనా
కురుల తోటే తడి తుడిచేనా
నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
పట్టు పూవా పుట్ట తేన
నీ నడుం సగం తాకనివ్వమా

హైర హైర హైరబ్బా… హైర హైర హైరబ్బా…
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

కలిసి ఇద్దరం చిరునడకలతో
అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎరట్రి తివాచీ పరచి
ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనే కవి పాడగా
షెల్లీకి బైరన్‌కూ సమాధి
నిద్దర చెడగొడదాం

నీలాకాశమే దాటి ఎగరకూ
ఏమైనదో నీ మనసుకు
ఉల్లాసమో ఉత్సాహమో
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు
ఏమైనదో నీ వయసుకు
ఆయాసమో ఆవేశమో

 
పైర గాలికి వయసాయే
నేల తల్లికి వయసాయే
కోటియుగాలైనాగానీ
ప్రేమకు మాత్రం వయసైపోదు

హైర హైర హైరబ్బా… హైర హైర హైరబ్బా…
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా
హైర హైర హైరబ్బా… హైర హైర హైరబ్బా…

చెర్రీ పూలను దోచేగాలి
చెవిలో చెప్పెను ఐలవ్‌యూ
సైప్రస్ చెట్లలో దావుద్ పక్షి
నాతో అన్నది ఐలవ్‌యూ
నీ ప్రేమనే నువు తెలుపగ
గాలులూ పక్షులూ
ప్రేమ పత్రమై కుమిలినవో

ఒంటి కాలితో పూవే నిలిచెను
నీ కురులలో నిలిచేందుకే
పూబాల ఓ పూవెట్టనా
చిందే చినుకులు నేల వాలెను
నీ బుగ్గలే ముద్దాడ గా
నేనూ నిన్నూ ముద్దాడనా

హృదయ స్పందన నిలిచిననూ
ప్రాణముండును ఒక నిమిషం
ప్రియా నన్నూ నువ్వీడితే
మరుక్షణముండదు నాప్రాణం

హైర హైర హైరబ్బా… హైర హైర హైరబ్బా…
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైటు తెచ్చిన నందవనం నాకే నాకా

హైర హైర హైరబ్బా… హైర హైర హైరబ్బా…
పాకెట్ సైజు వెన్నెలలు నీకే నీకు
ఫ్యాక్స్‌లొచ్చిన స్త్రీ కవిత నీకే నీకు

నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
ముద్దుల వానలో నిను తడిపేనా
కురులతోటే తడి తుడిచేనా

పట్టు పూవా పుట్ట తేనే
నీ నడుం సగం తాకనివ్వమా
హైర హైర హైరబ్బా…
హైర హైర హైరబ్బా…


సాపాటు ఎటూ లేదు…

ఆకలిరాజ్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : ఆకలి రాజ్యం (1980)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

హే హే హే హే హే హే హేహే ఏ ఏహే
రు రు రు రు రూరు రూ రూ రురు

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్ 

 
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా

డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పుచ్చుకొని
ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్ 

 
బంగారు పంట మనది
మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా
ఇంట్లో ఈగల్ని తోలుదామురా

ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా

ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా… ఆ.. ఆ..
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ 

 
సంతాన మూలికలము
సంసార బానిసలము
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడు
సంపాదనొకటి కరువురా

చదవెయ్య సీటు లేదు చదివొస్తే పనీ లేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే బ్రదర్ 


ఏ కులము నీదంటే…
సప్తపది చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. 


చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

ఓఓఓఓఓఓ… 
ఆఆఆఆఆఆ…

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

ఏడు వర్ణాలు కలిసి
ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే
ఇహము పరముంటాది

ఏడు వర్ణాలు కలిసి
ఇంద్రధనస్సవుతాది
అన్నీ వర్ణాలకు ఒకటే
ఇహము పరముంటాది

ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది

ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది
ఆది నుంచి ఆకాశం మూగది
అనాదిగా తల్లి ధరణి మూగది

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు
ఇన్ని మాటలు..

ఆఆఅ ఏ కులము నీదంటే
గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు
మా కులమే లెమ్మంది
నీలి నీలి ఆకాశం…
యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు మొదటిసారి హీరోగా నటిస్తున్న “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : 30 రోజుల్లో ప్రేమించడం ఎలా (2020)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : చంద్రబోస్
గానం : సిధ్ శ్రీరామ్, సునీత 

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
నెలవంకను ఇద్దామనుకున్నా.. ఓహో ఓహో
నీ నవ్వుకు సరిపోదంటున్నా…

నువ్వే నడిచేటి తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి శ్వాసకే
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

ఓహో వానవిల్లులో ఉండని రంగు నువ్వులే
ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే
నల్ల మబ్బులా మెరిసే కళ్లు నీవిలే
ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదిక అంటు ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా

నీలి నీలి ఆశాశం ఇద్దామనుకున్నా
నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా

ఓహో అమ్మ చూపులో వొలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే
నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలే
దయ కలిగిన దేవుడే మనలను కలిపాడులే
వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే

ఏదో ఇవ్వాలి కానుక ఎంతో వెతికాను ఆశగా
ఏది నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా
కనుకే మళ్లి మళ్లీ జన్మనెత్తి నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా
యా కుందేందు…
హ్యాపీ డేస్ చిత్రం కోసం ప్రణవి గానం చేసిన సరస్వతి స్తుతిని ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : హ్యాపీ డేస్  (2016)
సంగీతం : మిక్కీ జె మేయర్      
సాహిత్యం : సరస్వతి స్తుతి
గానం : ప్రణవి  

యా కుందేందు తుషార హార ధవళా
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మణ్డిత కరా
యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్
దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా 
భారత మాతకు జేజేలు…

బడిపంతులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. 

చిత్రం : బడి పంతులు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, బృందం

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు 
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
త్రివేణి సంగమ పవిత్రభూమి 
నాల్గు వేదములు పుట్టిన భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి 
త్రివేణి సంగమ పవిత్రభూమి 
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి 
పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
 
భారత మాతకు జేజేలు 
బంగరు భూమికి జేజేలు
 
శాంతిదూతగా వెలసిన బాపూ
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ 
జాతి రత్నమై వెలిగిన వెహ్రూ 
విప్లవ వీరులు వీర మాతలు 
విప్లవ వీరులు వీర మాతలు 
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..

భారత మాతకు జేజేలు 

బంగరు భూమికి జేజేలు
 
సహజీవనము సమభావనము 
సమతా వాదము వేదముగా
సమతా వాదము వేదముగా 
సహజీవనము సమభావనము 
సమతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము 
లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
 
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఅఆ
ఏ దేశమేగినా…
అమెరికా అబ్బాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. .
చిత్రం : అమెరికా అబ్బాయి (1986)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు 
సాహిత్యం : సినారె
గానం : సుశీల 

ఏ దేశమేగినా… ఎందుకాలిడినా…
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ…

రాయప్రోలన్నాడు ఆనాడూ..
అది మరిచిపోవద్దు ఏనాడూ..

పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాల వెలసినా ధరణిరా
వేదాల వెలసినా ధరణిరా
ఓంకార నాదాలు పలికినా అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా..
ఏ పీఠమెక్కినా.. ఎవ్వరెదురైనా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ..

వెన్నెలదీ ఏ మతమురా…?
కోకిలదీ ఏ కులమురా…?
గాలికి ఏ భాష ఉందిరా…?
నీటికి ఏ ప్రాంతముందిరా…?

గాలికీ నీటికీ లేవు భేధాలూ..
మనుషుల్లో ఎందుకీ తగాదాలు
కులమత విభేదాలూ

ఏ దేశమేగినా… ఎందుకాలిడినా…
ఏ పీఠమెక్కినా… ఎవ్వరెదురైనా…
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ…

గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ..
గాంధీ చూపిన మార్గం విడవద్దూ….
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ….

ద్వేషాల చీకట్లూ తొలగించూ..
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా…


అందుకే నిరంతరం సాగాలి దీక్షా
సుందరాకాండకు…
సుందరకాండ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : సుందరకాండ (1992)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

సుందరాకాండకు..
హో హో హో..
సందడే సందడి…
హో హో హో…
అందుకే బీ రెడీ
హో హో హో..
వెల్కమ్……

జాక్సన్ స్టెప్స్ కు..
హో హో హో..
లాఫర్ లిప్స్ కు..
హో హో హో..
జోలీడే పాప్స్ కు
హో హో హో..
Come Come…..
శతమర్కటం….. పితలాటకం….
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం …

సుబ్బరాజు
వచ్చాను Sir..
ఇబ్రహీం
ఇక్కడ వున్నా…
అశోకుడు చెట్లు నాటించెను
మన నవ్వులే అవి పూయించెను
వనజా
వచ్చగా…
పాకిజా
ఆయి హు…
మహాత్ముడు ఫ్రీడమిప్పించెను
మన పగ్గాలనే అది తెంచేసేను
అరే నిన్నటి లెక్చరు సినిమా
స్కోపుల పిక్చరు కావాలి
అది ఆంధ్ర సీడెడ్ నైజాం
ఎరుగని సిక్సరు కొట్టాలి..
ఇదేరా ఖుషీలా మజాల కిష్కింధకాండ
శతమర్కటం….. పితలాటకం….
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం …

సుందరాకాండకు..
హో హో హో..
సందడే సందడి…
హో హో హో…
అందుకే బీ రెడీ
హో హో హో..
వెల్కమ్…

ఎమ్వీఎస్ 
ఎస్ ఎస్సూ..
ఎస్వీఆర్
ఆ నేనే సారూ…
గులామలీ ఘజలే పాడవోయ్
కథాకళి కసిగ ఆడవోయ్
సక్కుబాయి
సామిరంగా…
సత్యభామ
అమ్మదొంగా..
రాగింగు లో రంభ ఏమన్నదోయ్
జాగింగు లో జత నేనన్నదోయ్
అది వన్ ఇయరాడిన సూపర్
హిట్లర్ సెక్సీ థ్రిల్లర్ లే
అరే మచిలిపట్నపు మ్యాట్నీ
ఆటకు బాక్సులు నిండును లే
ఇదేరా…ఆ హమేషా… ఆ
తమాషా కాలేజీకాండ….
శతమర్కటం….. పితలాటకం….
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం …

సుందరాకాండకు..
హో హో హో..
సందడే సందడి…
హో హో హో…
అందుకే బీ రెడీ
హో హో హో..
వెల్కమ్……
శతమర్కటం….. పితలాటకం….
బ్రహ్మచారుల బ్రతుకే సుఖం …
నారాయణ మంత్రం…
భక్త ప్రహ్లాద చిత్రం లోని ఒక చక్కని పాటను గుర్తు చేసుకుందాం. 
చిత్రం : భక్తప్రహ్లాద
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల

ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 

ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

 
గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

 
తల్లియు తండ్రియు నారాయణుడె
గురువు చదువు నారాయణుడె
యోగము యాగము నారాయణుడె
ముక్తియు దాతయు నారాయణుడె
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

 
నాథహరే శ్రీ నాథహరే
నాథహరే జగన్నాథహరే


జయ జయ జయ ప్రియ భారత…
రాక్షసుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. 

చిత్రం : రాక్షసుడు (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : జానకి

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి

జయ జయ సశ్యామల
సుశ్యామచలాచ్చేలాంచల
జయ జయ సశ్యామల
సుశ్యామచలాచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
ఆఆఆఆఆఆ..ఆఆఆఆఆ..
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి

జయ దిశాంత గత శకుంత
దివ్య గాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత
దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక
గళ విశాల పత విహరణ
ఆఆఆఆఆ..ఆఆఆఆఆ..
జయ మదీయ మధురగేయ
చుంబిత సుందర చరణా

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
ఐమె వెరీ గుడ్ గర్ల్…
లిటిల్ సోల్జర్స్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. .
చిత్రం : లిటిల్ సోల్జర్స్ (1996)


సంగీతం : శ్రీ

సాహిత్యం : సిరివెన్నెల

గానం : విష్ణుకాంత్, దీపిక


ఐమె వెరి గుడ్ గర్ల్ టెల్ల్ మై ఆల్ల్ టేచర్స్ మై డియర్ బ్రదర్

అన్ని మంచి హేబిట్స్ ఉన్నాయంట నాలో విన్నావా మిస్టర్

ఐమె వెరి గుడ్ గర్ల్ టెల్ల్ మై ఆల్ల్ టేచర్స్ మై డియర్ బ్రదర్

అన్ని మంచి హేబిట్స్ ఉన్నాయంట నాలో విన్నావా మిస్టర్


బ్రష్ చేసుకుంటా నేను క్లోజ్-అప్ తో

నీళ్లోసుకుంటా నేను లిరిల్ సోప్ తో

బ్రేక్ఫాస్ట్ చేస్తా నేను బ్రేడ్ జాం తో

స్కూల్ కెళ్ళిపోతా నేను యూనిఫార్మ్ లో

ఐమె గుడ్ గర్ల్… ఐమె గుడ్ గర్ల్…

ఐమె గుడ్ గర్ల్…

బన్నీ వస్తుంది జాగర్తగుండండి

ఫన్నీగా చూస్తుంది ఏదో చేస్తుంది

రన్ అవే సమ్హౌ…లేకపోతే డేంజర్

గప్ చుప్ గా దాక్కోండి ఎక్కడైనా

బన్ని ఈస్ ఎ బేడ్ గర్ల్

వుయ్ డొంట్ వాంట్ హర్ విన్నావా మిస్టర్

పాడుపన్ల దెయ్యం దాన్ని చూస్తే భయ్యం

డామ్ యువర్ సిస్టర్

పిచ్చి గోల మానమంటే ఊరుకోదుగా

మిస్చిఎఫ్ చెయ్యకుండా ఉండలేదుగా

గిచ్చి ఏడిపించకుండా వెళ్లిపోదుగా

అందర్నీ వెక్కిరించి నవ్వుతుందిగా

షీస్ ఎ బేడ్ గర్ల్… షీస్ ఎ బేడ్ గర్ల్…షీస్ ఎ మేడ్ గర్ల్…


ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా

ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా.. నీకిది అలవాటా

వద్దంటూ ఉన్నా వస్తావే వెంటా .. నా పరువుంటుందా

ఉన్న ఒక్క చెల్లినీ ..ఇంత చిన్నపిల్లనీ
నువ్విలా తిట్టినా కొట్టినా
నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా..
చక్కనీ బొమ్మనే ఇవ్వనా
వ్హాట్ ఎ రియల్లి నైస్ ప్లేన్…
తీసుకొని దీన్ని థంక్ యౌ చెప్పుకో
ఐమ్ నాట్ ఎ నాటి గర్ల్ తెల్సుకో సన్నీ …
ఇప్పుడైనా ఒప్పుకో

టన్నుల కొద్దీ … పెన్సిళ్లన్నీ…
టన్నుల కొద్దీ పెన్సిళ్లన్నీ స్వాహా చేస్తావే
తినవే తల్లీ అంటూ ఉన్నా అన్నం తినవేమే

బన్నీ పేరు చెబితే ఊరిలో అందరూ బాబోయ్ అంటున్నారే

దాని బ్రదర్ అంటే నన్నే ముందుగా అంతా తంతున్నారే

సన్నీ మాట నమ్మకు అన్నీ ఉత్త కోతలు .. ప్రొమిస్ మమ్మి
చిన్నదాన్ని కనకే అంత కోపమొద్దులే .. ప్లీస్ ఎక్స్ క్యూస్ మి

ఇదో పెద్ద డ్రామ .. దీన్ని బాగా తందామా

ఇది పేరెంట్స్ కి పరీక్ష .. ఇది బ్రదర్ కి శిక్ష

దీనికి అంటిబైయొటిక్ లేదా .. దీనికి నీరసం రాదా

దీంతో మాట్లాడను .. దీంతో ఆట్లాడను

ఇదో సైతాన్ .. ఇదో తూఫాన్

ఇదో .. నా బంగారు పాప
గున్నమామిడీ కొమ్మమీద…బాలమిత్రుల కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. .

చిత్రం : బాలమిత్రుల కథ (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : జానకి

గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది…
ఒక గూటిలోన కోయిలుంది…

గున్నమామిడీ కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయిన ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయిన ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చుడందే
ముదు ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చుడందే
ముదు ముద్దుగ ముచ్చటలాడందే
చిగురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగధు కొమ్మ ఊయల…

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలుకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగు రూపు వేరైన జాతి రీతి వేరైన
రంగు రూపు వేరైన తమ జాతి రీతి వేరైన
చిలక కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి…

గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలుకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఏ స్క్వేర్ బి స్క్వేర్…
100% లవ్ చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : 100% లవ్ (2011)
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్  
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవీ శ్రీ ప్రసాద్ 
  
ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏ టైమైనా డోంట్ కేర్
చీటింగ్ చీటింగ్ పిల్లి ఎలక పిల్లనీ
చీటింగ్ చీటింగ్ నక్క పిల్ల కాకినీ
చీటింగ్ చీటింగ్ మీసం జడకుచ్చునీ
చీటింగ్ చీటింగ్

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్

రింగ రింగ రోజెస్ పాకెట్ ఫుల్లాఫ్ పోజెస్
దొంగ దొంగా చదివేసేయ్ ఇంపార్టెంట్ బుక్స్
సబ్జెట్ సబ్జెక్టు కలిపేసి సిలబస్ చూజే చేసి
చూపుల స్ట్రానే వేసి చప్పున జుర్రేయ్ మార్క్స్

చీటింగ్ చీటింగ్ చీమ పంచదారనే
చీటింగ్ చీటింగ్ తేనెటీగ పువ్వునీ
చీటింగ్ చీటింగ్ ఉడతా జాంపండు నీ…
చీటింగ్ చీటింగ్…

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఏటైమైనా డోంట్ కేర్

నువ్వు నా ముందుంటే…
గూఢాచారి 116 సినిమాలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. .

చిత్రం : గూఢాచారి 116 (1966)
సంగీతం : టి.చలపతిరావు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..
నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..

ముద్దబంతిలా ఉన్నావు..
ముద్దులొలికిపోతున్నావు..
ముద్దబంతిలా ఉన్నావు..
ముద్దులొలికిపోతున్నావు..
జింక పిల్లలా చెంగు చెంగుమని
చిలిపి సైగలే చేసేవు..

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..

చల్లచల్లగ రగిలించేవు..
మెల్లమెల్లగ పెనవేసేవు..
చల్లచల్లగ రగిలించేవు..
మెల్లమెల్లగ పెనవేసేవు..
బుగ్గపైన కొనగోట మీటి
నా సిగ్గు దొంతరలు దోచేవు..

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..
జివ్వుమంటుంది మనసు..
రివ్వుమంటుంది వయసు..

నువ్వు నా ముందుంటే..
నిన్నలా చూస్తుంటే..

నిలువవే వాలు కనులదానా…
ఇల్లరికం చిత్రంలోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : ఇల్లరికం (1959)
సంగీతం : టి. చలపతిరావు
సాహిత్యం : కొసరాజు
గానం : ఘంటసాల

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె చానా
నువ్వు కులుకుతూ లఘల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు ఓ లలనా అది నీకే తెలుసు
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె చానా

ఎవరని ఎంచుకోనినావో పరుడని భ్రాంతిపడినావో
ఎవరని ఎంచుకోనినావో.. భ్రాంతి పడినావో
సిగ్గుపడి తోలిగేవో… విరహాగ్నిలో నను తోసిపోయేవో

నువ్వు కులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు ఓ లలనా  అది నీకే తెలుసు

ఒకసారి నన్ను చూడరాదా
చెంతచేరా సమయమిది కాదా
ఒకసారి నన్ను చూడరాదా సమయమిది కాదా
చాలు నీ మరియాదా వగలాడి నే నీవాడనే కాదా?

నువ్వు కులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు ఓ లలనా  అది నీకే తెలుసు

మగడంటే మొజులేనిదానా
మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజు లేనిదానా నీకు నేను లేనా
కోపమా నా పైనా?
నీ నోటి మాటకే నోచుకోలేనా?

నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నదె చానా
నువ్వు కులుకుతూ ఘల ఘల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు
ఓ చెలియా.. ఓ మగువా.. ఓ.. లలనా
అది నీకే తెలుసు 

ఈనాటి ఈ హాయి…
జయసింహ చిత్రంలోని ఓ అందమైన పాట ఈ రోజు తలచుకుందాం. 

చిత్రం : జయసింహా (1955)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, పి.లీల

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..

నీ ఊహతోనే పులకించి పోయే
ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..
నీ ఊహతోనే పులకించి పోయే
ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..
నీ కోసమే ఈ అడియాశలన్ని
నా ధ్యాస నా ఆశ నీవే సఖా

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి.. 

ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ..
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ..
మనియేములే ఇక విరితావిలీల
మన ప్రేమ కెదురేది లేదే సఖి..

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..

ఊగేములే తుల తూగేములే 
 ఇక తొలి ప్రేమ భోగాలా..
ఆ..ఆ..ఆ.. ఊగేములే తులతూగేములే
ఇక తొలి ప్రేమ భోగాలా..
మురిపాలతేలే మన జీవితాలు
మురిపాలతేలే మన జీవితాలు 

 దరహాస లీలావిలాసాలులే..

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..ఈ..ఈ..ఈ..
ఈనాటి ఈ హాయి..


నన్ను వదలి నీవు పోలేవులే..

మహదేవన్ గారు స్వరపరచిన మంచిమనసులు చిత్రంలోని ఓ చక్కని పాట. .

చిత్రం : మంచి మనసులు (1962)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే
నన్ను వదలి నీవు పోలేవులే.. అది నిజములే..ఏ..ఏ..
పూవులేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే …

తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే
తావిలేని పూవు విలువ లేనిదే .. ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
నా మనసే చిక్కుకొనె నీ చూపుల వలలో
నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె
దూరదూర తీరాలు చేరువైపోయె..ఓ..ఓ..

తావిలేని పూవు విలువ లేనిదే ..ఇది నిజములే..ఏ..ఏ..
నేను లేని నీవు లేనె లేవులే..ఏ..ఏ.. లేవులే

సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ…
సిగ్గుతెరలలో కనులు దించుకొని.. తలను వంచుకొని
బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ…
రంగులీను నీ మెడలో బంగారపు తాళిగట్టి
పొంగిపోవు శుభదినము రానున్నదిలే..
ఓ…

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
పూవు లేక తావి నిలువలేదులే..ఏ..ఏ.. లేదులే

తొలినాటి రేయి తడబాటు పడుతూ
మెల్లమెల్లగా నీవు రాగా…
నీ మేని హొయలూ నీలోని వగలూ…
నాలోన గిలిగింతలిడగా
హృదయాలు కలసీ ఉయ్యాలలూగీ…
ఆకాశమే అందుకొనగా..ఆ..ఆ..
పైపైకి సాగే మేఘాలదాటి..
కనరాని లోకాలు కనగా…

ఆహా ఓహో ఉహు…ఆ… ఆ…ఓ…
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే
నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే
నీవు లేని నేను లేనె లేనులే..ఏ..ఏ.. లేనులే

వినరా వినరా నరుడా…

చిత్రం : గోవుల గోపన్న (1968)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం : ఘంటసాల, సుశీల

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరి పోలవురా

కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను
ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను
పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా
నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా
వయసుడిగిన నాడు నన్ను కటిక వాని పాల్జేస్తే
ఉసురు కోల్పోయి మీకే ఉపయోగిస్తున్నాను

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నవోయి
నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయి
నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయి
నా ఒళ్లే ఢంకాలకు నాదం పుట్టించునోయి

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

నా కొమ్ములే దువ్వెనలై మీ తల చిక్కులను తీర్చు
నే కల్పించిన విభూది మీ నొసటను రాణించు
నా రాకయే మీ ఇంట్లో శుబములెన్నో కలిగించు
నా చేయుతయే చివరకు వైతరణిని దాటించు

వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరి పోలవురా 

రాములో రాములా…
అలవైకుంఠపురములో చిత్రంలోని మరో సూపర్ హిట్ సాంగ్ ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : అల వైకుంఠపురములో (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గానం : అనురాగ్ కులకర్ణి, సత్యవతి (మంగ్లి)

హే బ్రో ఆపమ్మ
ఈ డిచుక్ డిచుక్ కాకుండ
మన మ్యూజిక్ ఏమైన ఉందా?

అబ్బా కడుపు నిండి పోయింది బంగారం

బంటూ గానికి ట్వంటీటూ
బస్తిల మస్తు కట్టౌటూ
బచ్చాగాండ్ల బ్యాచుండేది
వచ్చినమంటే సుట్టు
కిక్కే సాలక ఓ నైటూ 
ఎక్కి డొక్కు బుల్లెట్టూ
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంటే రూటు
సిల్కు చీర గట్టుకొని
చిల్డు బీరు మెరిసినట్టు
పొట్లంగట్టిన బిర్యానీకి
బొట్టు బిల్ల పెట్టినట్టు
బంగ్లా మీద నిల్సోనుందిరో
ఓ సందామావ
సుక్క తాగక షక్కరొచ్చరో
ఏం అందం మావ
జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందామావ
జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ

రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో

రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్నాగం జేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో

హేయ్ తమ్మలపాకే ఏస్తుంటే
కమ్మగ వాసన వస్తావే
ఎర్రగ పండిన బుగ్గలు
రెండూ యాదీ కొస్తాయే
అరె పువ్వుల అంగీ ఏస్తుంటే
గుండీ నువ్వై పూస్తావే
పండూకున్న గుండెల 
దూరి లొల్లే చెస్తావే

అరె ఇంటి ముందు లైటు
మిణుకు మిణుకుమంటాంటే
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే
ఎహె నువ్వు లాగినట్టు ఒళ్ళు ఝల్లుమంటాందే

నాగస్వరం ఊదుతుంటె
నాగు పాము ఊగినట్టు
ఎంటాపడి వస్తున్న నీ
పట్టా గొలుసు సప్పూడింటు
పట్టనట్టే తిరుగుతున్నవే
ఓ సందామావ
పక్కకు పోయి తొంగిజూస్తవె
ఏం టెక్కురా మావ

రాములో రాములా నన్నాగం జేసిండురో
రాములో రాములా నా పానం తీసిండురో
రాములో రాములా నన్నాగం జేసిండురో
రాములో రాములా నా పానం తీసిండురో

రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో
రాములో రాములా నన్నాగం చేసిందిరో
రాములో రాములా నా పానం తీసిందిరో

ఓం ఓం అయ్యప్ప…
అయ్యప్ప స్వామి మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : అయ్యప్పస్వామి మహత్యం (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప

సహస్రారమే శబరీ శిఖరం
బ్రహ్మ కపాలం నీ స్థానం
సహస్రారమే శబరీ శిఖరం
బ్రహ్మ కపాలం నీ స్థానం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

ధనుష్కోటికి ఆది మూలమై
ఉన్నది మూలాధారం
అది గణపతికే ప్రాకారం
ఎరుమేలి యాత్రకే ఆరంభం
శ్రీ కాళహస్తి క్షేత్రం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

లింగాంగంభుల పానవట్టమే
వెలిగే స్వాధిష్ఠానం
ఇది బ్రహ్మకు మూలస్థానం
కాలైకట్టి అను క్షేత్రం
జంభుకేశ్వరం ఈ తీర్థం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

అరుణాచలమై వెలిగేది
ఋణపాశాలను త్రెంచేది
పృథ్వి జలమ్ముల దాటినది
నాబి జలజమై వెలిగేది
కలిడుంకుండ్రు అన్న పేరుతో
మణిపూరకమై వెలిసేది

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

హృదయ స్థానం కరిమలా
భక్తుల పాలిటి సిరిమలా
పంచప్రాణముల వాయువులే
శ్వాసనాళముల విలవిల
అనాహతం ఈ కరిమల
అసదృశం ఈ కరిమల
ఓ… ఓ… ఓ…
సాధకులకు ఇది గండశిల

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

నాదోంకార స్వరహారం
శరీరానికొక శారీరం
శబరిపాదమున పంపాతీరం
ఆత్మ విశుద్ధికి ఆధారం
ఆకాశానికి ఆరంభం

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప

కనుబొమల మధ్య
ఒక జీవకళా.. ఓం…
అజ్ఞాచక్రపు మిలమిల ఓం…
చర్మ చక్షువులకందని
అవధులూ… ఓం…
సాధించే ఈ శబరిమలా
అదే కాంతిమలా
అదే కాంతిమలా

ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప
ఓం ఓం అయ్యప్ప
ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప 

ఇది తొలి రాత్రి…
మజ్ను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. .
చిత్రం : మజ్ఞు (1989)
సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్
సాహిత్యం : దాసరి 
గానం : బాలు

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కథల రాత్రీ
ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే

ఇది తొలి రాత్రి కదలని రాత్రి
ఇది తొలి రాత్రి కదలని రాత్రి
నీవు నాకు నేను నీకు
చెప్పుకున్న కథల రాత్రీ
ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే..

వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ
మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ
నీ రాక కొరకు తలుపు
నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి…పిలిచి.. వేచి..వేచి
ఎదురుచూస్తున్నవీ..ఈ…ఈ…ఈ…

ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే

వెన్నలంతా అడవి పాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ…ఆ..ఆ..ఆ..
ఆ..ఆ వెన్నలంతా అడవి పాలు కానున్నదీ
మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
అనురాగం గాలీలో దీపమైనదీ
మమకారం మనసునే కాల్చుతున్నదీ

నీ చివరి పిలుపు కొరకు
ఈ చావు రాని బ్రతుకూ
చూసి చూసి వేచి వేచి
వేగిపోతున్నదీ..ఆ..ఆ..ఆ

ప్రేయసీ రావే ఊర్వశి రావే
ప్రేయసీ రావే ఊర్వశి రావే 


అడిగా అడిగా…
నిన్ను కోరి చిత్రంలోని ఒక హాంటింగ్ మెలోడీని ఈ రోజు తలచుకుందాం..
చిత్రం : నిన్నుకోరి (2017)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : శ్రీజో
గానం : సిద్ శ్రీరామ్

అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలె క్షణమా చెలి ఏదని
నన్నే మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదని

నువ్వే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకథే
నీలోనె ఉన్నా నిను కోరి ఉన్నా
నిజమై నడిచా జతగా

గుండెలోతుల్లొ ఉంది నువ్వేగా
నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నను నడిపే స్వరం
నిను చేరగ ఆగిపొనీ పయనం
అలుపే లేని గమనం

అడిగా అడిగా ఎదలో లయనడిగా
కదిలే క్షణమా చెలి ఏదని
నన్నే మరిచా తన పేరునె తలిచా
మదినే అడిగా తన ఊసేదని

నువ్వే లేని నన్ను ఊహించలేను
నా ప్రతి ఊహలోను వెతికితే మనకథే
నీలోనె ఉన్న నిను కోరి ఉన్న
నిజమై నడిచా జతగా….

ఓ ఓ ఓ….
గాలి వానలో..
స్వయంవరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. .
చిత్రం : స్వయంవరం (1982)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాసరి
గానం : ఏసుదాస్

గాలి వానలో.. వాన నీటిలో..
గాలి వానలో వాన నీటిలో
పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం
తెలియదు పాపం

గాలి వానలో వాన నీటిలో
పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో
ఒఒఒ…. ఒఒఒ

ఇటు హొరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
ఇటు హొరు గాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
హొరు గాలిలో వరద పొంగులో
సాగలేనని తెలుసు

అది జోరు వాన అని తెలుసు
ఇవి నీటి సుడులని తెలుసు
అది జోరు వాన అని తెలుసు
ఇవి నీటి సుడులని తెలుసు
జోరు వానలో నీటి సుడులలో
మునక తప్పదని తెలుసు

అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో

ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలాగటం
ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలాగటం
ఆశ జారినా వెలుగు తొలిగినా
ఆగదు జీవిత పొరాటం

ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై
బ్రతుకుతున్నదొక శవం

అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం
తెలియదు పాపం

గాలి వానలో వాన నీటిలో
పడవ ప్రయణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం
తెలియదు పాపం
ఒహోహో ఒహోహో
ఒహోహో ఒహోహో

ఆకాశ దేశాన…
మేఘసందేశం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. .
చిత్రం : మేఘసందేశం (1982)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : కె.జె.ఏసుదాస్

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి
మేఘసందేశం మేఘసందేశం


వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో
ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి
విన్న వేదన నా విరహ వేదన

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా


రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిథిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో
రుధిర భాష్పజల దారలతో
ఆ..ఆ..ఆ..ఆ
విన్నవించు నా చెలికి
మనోవేదన నా మరణయాతన

ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి
మేఘసందేశం మేఘసందేశం 

మనసు గతి ఇంతే…
ప్రేమనగర్ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. .
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల

తాగితే మరచిపోగలను
తాగనివ్వదు
మర్చిపోతే తాగగలను
మరువనివ్వదు

మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ
సుఖము లేదంతే

మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ
సుఖము లేదంతే
మనసు గతి ఇంతే


ఒకరికిస్తే మరలి రాదూ
ఓడిపోతే మరిచిపోదూ
ఒకరికిస్తే మరలి రాదూ
ఓడిపోతే మరిచిపోదూ
గాయమైతే మాసిపోదూ
పగిలిపోతే అతుకుపడదూ

మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే


అంతా మట్టేనని తెలుసూ
అదీ ఒక మాయేనని తెలుసూ
అంతా మట్టేనని తెలుసూ
అదీ ఒక మాయేనని తెలుసూ
తెలిసీ వలచీ విలపించుటలో
తీయదనం ఎవరికి తెలుసూ

మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే


మరుజన్మ ఉన్నదో లేదో
ఈ మమతలప్పుడేమౌతాయో
మరుజన్మ ఉన్నదో లేదో
ఈ మమతలప్పుడేమౌతాయో
మనిషికి మనసే తీరని శిక్షా
దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా

మనసు గతి ఇంతే
మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ
సుఖము లేదంతే
మనసు గతి ఇంతే  

ప్రేమ లేదని…
అభినందన చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం .
చిత్రం : అభినందన (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

లాలల లలాలాల
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు …

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు

మనసు మాసిపోతే మనిషే కాదని
కటికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ
ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడు లేకుంటినీ


ప్రేమ లేదని లలలాలలాల

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగులిపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు
లాలల లలాలాల
లాలల లలాలాల 


రావమ్మా మహాలక్ష్మీ…
ఉండమ్మా బొట్టు పెడతా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు, సుశీల

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా

నీ కోవెల…ఈ ఇల్లు కొలువై ఉందువుగాని…
నీ కోవెల…ఈ ఇల్లు కొలువై ఉందువుగాని…
కొలువై ఉందువుగాని…కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ…రావమ్మా… రావమ్మా

గురివింద పొదకింద గొరవంక పలికె… 
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె …
గురివింద పొదకింద గొరవంక పలికె… 
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె

తెల్లారి పోయింది పల్లె లేచింది…
తెల్లారి పోయింది పల్లె లేచింది… 

పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది

రావమ్మా మహాలక్ష్మీ… రావమ్మా… రావమ్మా… కృష్ణార్పణం

కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి…గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి… గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు

కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి… గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి… గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు

ముత్యాల ముగ్గుల్లో …ముగ్గుల్లో… గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో …ముగ్గుల్లో… గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో …ముగ్గుల్లో… గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో …ముగ్గుల్లో… గొబ్బిళ్ళు 


రావమ్మా మహాలక్ష్మీ… రావమ్మా… రావమ్మా… కృష్ణార్పణం

పాడిచ్చే గోవులకు పసుపుకుంకం…

పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం… 
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం …
గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం …
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం …కలకాలం సౌఖ్యం ..

రావమ్మా మహాలక్ష్మీ …రావమ్మా

నీ కోవెల…ఈ ఇల్లు కొలువై ఉందువుగాని…
నీ కోవెల…ఈ ఇల్లు కొలువై ఉందువుగాని…
కొలువై ఉందువుగాని…కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ…రావమ్మా …రావమ్మా…కృష్ణార్పణం


విన్నపాలు వినవలే…
అన్నమయ్య చిత్రంలో కీర్తనలతో కూర్చిన ఒక చక్కని పాట తలచుకుందాం. 
చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అన్నమయ్య
గానం : బాలు, రేణుక, శ్రీలేఖ, పార్ధసారధి

విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ…

కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ …

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడియె పెండ్లి కూతురూ… ఊ ఊ…

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల

మా తెలుగు తల్లికి…

చిత్రం : అల్లుడొచ్చాడు (1976)
సంగీతం : శంకరంబాడి సుందరాచారి
సాహిత్యం : శంకరంబాడి సుందరాచారి
గానం : సుశీల

మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ
మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ

కడుపులో బంగారు కను చూపులో కరుణా
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

మా తెలుగు తల్లికి మల్లె పూదండా

గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

మా తెలుగు తల్లికి మల్లె పూదండా

అమరావతీ గుహల అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే పాడుతాం
నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!! 

వస్తాడు నా రాజు ఈ రోజు…
అల్లూరి సీతారామరాజు చిత్రంలోని ఒక చక్కని పాటను  తలచుకుందాం.
చిత్రం : అల్లూరి సీతారామ రాజు (1974)
సంగీతం : పి.ఆదినారాయణ రావు
సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
గానం : పి.సుశీల

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
తేలి వస్తాడు నా రోజు ఈ రోజు

వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
వేల తారకల నయనాలతో
నీలాకాశం తిలకించేను
అతని చల్లని అడుగుల సవ్వడి
వీచే గాలి వినిపించేను
ఆతని పావన పాద ధూళికై
అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే
పాలసంద్రమై పరవశించేను
పాలసంద్రమై పరవశించేను

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

వెన్నెలలెంతగా విరిసిన గాని
చంద్రుణ్ణి విడిపోలేవు
కెరటాలెంతగా పొంగిన గాని
కడలిని విడిపోలేవు
కలసిన ఆత్మల అనుబంధాలు
ఏ జన్మకూ విడి పోలేవులే
తనువులు వేరైనా దారులు వేరైనా
తనువులు వేరైనా దారులు వేరైనా
ఆ బంధాలే నిలిచేనులే
ఆ బంధాలే నిలిచేనులే

వస్తాడు నా రాజు ఈ రోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
వస్తాడు నా రాజు ఈ రోజు

బలపం పట్టి భామ బళ్ళో
బొబ్బిలిరాజా చిత్రంలోని ఒక హుషారైన పాటను తలచుకుందాం. 

చిత్రం : బొబ్బిలి రాజా (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : యస్.పి.బాలు, చిత్ర

బలపం పట్టి భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
అం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్
కం అః ఉండేటప్పుడూ…
బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో!!
సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో??
అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ??

ఎట్టాగుందే పాప తొలి చూపే చుట్టుకుంటే?
ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే!!
ఉండుండి ఎటుంచో ఒక నవ్వే తాకుతోంది.
మొత్తంగా ప్రపంచం మహ గమ్మత్తుగా ఉంది!!
ప్రేమంటే ఇంతేనేమో బాగుందే ఏమైనా…
నాక్కూడా కొత్తేనయ్యో ఏం చేద్దాం ఈ పైనా??
కాస్తైనా… కంగారు తగ్గాలి, కాదనను ఏం చేసినా

సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొ
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో?
అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్
కం అః ఉండేటప్పుడూ… అరె రె ఓహోహోహో!!

తుప్పల్లో తుపాకీ సడి ఎట్టారేగుతుందో
రెప్పల్లో రహస్యం పడి అట్టా అయ్యిందయ్యో
కొమ్మల్లో కుకూలే మన స్నేహం కోరుతుంటే
కొండల్లో యకోలే మనమెట్టా వున్నామంటే
అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
ఎవరెవరో అత్తామామ వరసెట్టా తెలిసేనే
అందాకా… అమర్రి నీఅత్తమ్మ ఈ మద్ది మమనుకో

బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
పంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటా
అచ్చులే అయ్యాయిప్పుడూ హొయ్యారె హొయ్యారె హోయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ??
పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో

బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటా
అపుడే ఇట్టా ప్రేమ బళ్ళో అయితే గియితే ఎందుకయ్యో??
అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ??

తాన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
తనన తన్న తాన నన్నా తందా నన్నా తందా నన్నా
తందన తందానన్నానా అరె హొయ్యారె హొయ్యారె హోయ్
తందన తందానన్నానా ఓహో ఓహో ఓహో హోయ్

పున్నమి రాత్రి…పున్నమి నాగు చిత్రంలోని ఒక చక్కని పాటను  తలచుకుందాం.

చిత్రం : పున్నమి నాగు (1980)

సంగీతం : కె.చక్రవర్తి

సాహిత్యం : వేటూరి

గానం : యస్.పి.బాలు


ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

పున్నమి రాత్రీ..ఈ..ఈ..ఈ..

పూవుల రాత్రీ..ఈ..ఈ..ఈ

వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
పొంగిన వెన్నెల రాత్రీ..ఈ..ఈ..

పున్నమి రాత్రీ….పూవుల రాత్రీ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
పొంగిన వెన్నెల రాత్రీ..ఆ…

మగువ సోకులే మొగలి రేకులయి
మత్తుగ పిలిచే రాత్రీ…
మరుడు నరుడిపై..మల్లెలు చల్లి
మైమరిపించే రాత్రీ..
ఈ వెన్నెలలో..ఓ..ఓ..
ఆ వేదనలో..ఓ..ఓ..
ఈ వెన్నెలలో..ఓ..ఓ..
ఆ వేదనలో..ఓ..ఓ..
నాలో వయసుకు నవరాత్రీ..ఈ..
కలగా మిగిలే కడ రాత్రీ..

పున్నమి రాత్రీ..ఆ…ఆ…
పూవుల రాత్రీ..ఆ..ఆ…ఆ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
పొంగిన వెన్నెల రాత్రీ….

కోడెనాగుకై  కొదమనాగిని..
కన్నులు మూసే రాత్రీ….
కామ దీక్షలో కన్నెలందరూ..
మోక్షం పొందే రాత్రీ..
నా కౌగిలిలో..ఓ..ఓ..
ఈ రాగిణీతో..ఓ..ఓ..
నా కౌగిలిలో..ఓ..ఓ..
ఈ రాగిణీతో..ఓ..ఓ..
తొలకరి వలపుల తొలిరాత్రీ..
ఆఖరి పిలుపుల తుదిరాత్రీ..

పున్నమి రాత్రీ..ఆ..ఆ..ఆ…
పూవుల రాత్రీ..ఆ..ఆ…ఆ..
వెల్లువ నాలో..ఓ..ఓ..ఓ..
పొంగిన వెన్నెల రాత్రీ..ఆ..ఆ..ఆ..

పదర పదర పదరా…
మహర్షి చిత్రంలోని ఒక చక్కని పాటను  తలచుకుందాం


చిత్రం : మహర్షి (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : శంకర్ మహదేవన్

భళ్ళుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే

పదర పదర పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా
ఈ పుడమిని అడిగిచూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా

నీ కథ ఇదిరా నీ మొదలిదిరా
ఈ పథమున మొదటడుగేయి రా
నీ తరమిదిరా అనితరమిదిరా
అని చాటెయ్ రా

పదర పదర పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా
పదర పదర పదరా
ఈ పుడమిని అడిగిచూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా

ఓ.. భళ్ళుమంటు నింగి ఒళ్ళు విరిగెను గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరచుకున్న వేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తె వెతికెనొ ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు ముద్దిడె మట్టినేలనే

కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి
బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా
పగిలే ఇల హృదయం, తన ఎదలో రోదనకి,
వరమల్లే దొరికిన ఆఖరిసాయం నువ్వేరా
కనురెప్పలలో తడి ఎందుకని, తననడిగే వాడే లేక,
విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేలా

పదర పదర పదరా
ఈ హలమును భుజముకెత్తి పదరా
ఈ నేలను ఎదకు హత్తుకుని
మొలకలెత్తమని, పిలుపునిచ్చి పదరా

పదర పదర పదరా
ఈ వెలుగను పలుగు దించి పదరా
పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు
భూములిక మెతుకులిచ్చు కదరా

నీలో ఈ చలనం మరి కాదా సంచలనం
చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కధనం
నీలో ఈ జడికి చెలరేగే అలజడికి
గెలుపల్లే మొదలై చరితగ మారే నీ పయనం
నీ ఆశయమే తమ ఆశ అని, తమకోసమని తెలిసాక,
నువు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా

పదర పదర పదరా
నీ గతముకు కొత్త జననమిదిరా
నీ ఎత్తుకు తగిన లోతు ఇది
తొలి పునాది గది తలుపు తెరిచి పదరా
పదర పదర పదరా
ప్రతొక్కరి కథవు నువ్వు కదరా
నీ ఒరవడి భవిత కలల ఒడి
బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా

తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి పెంచిన కాంతిచుక్కవో
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో

ప్రియతమా ప్రియతమా…మజిలి చిత్రంలోని ఒక చక్కని పాటను  తలచుకుందాం.

చిత్రం : మజిలి (2019)

సంగీతం : గోపీసుందర్     

సాహిత్యం : చైతన్య ప్రసాద్ 

గానం : చిన్మయి శ్రీపాద


ప్రియతమా ప్రియతమా

పలికినది హృదయమే సరిగమా

చిలిపి నీ తలపులో

తెలిసినది వలపులో మధురిమా
చెలి చూపు తాకినా
ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా
దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైనచుక్కరా చక్కనైనచుక్కరా
నిన్ను కోరుకుందిరా సుందరా

ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమా
చిలిపి నీ తలపులో
తెలిసినది వలపులో మధురిమా

నీ ప్రేమలో ఆ రాధనై
నే నిండుగా మునిగాకా
నీ కోసమే. రాశానుగా
నా కళ్లతో ప్రియలేఖ
చేరునో చేరదో
తెలియదు ఆ కానుక
ఆశనే వీడకా వెనుక పడెను
మనసు పడిన మనసే

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా

ఉన్నానిలా ఉంటానిలా
నీ నీడగా కడదాకా
కన్నీటిలో కార్తీకపు
దీపాన్నిరా నువులేక
దూరమే భారమై
కదలదు నా జీవితం
నీవు నా చేరువై నిలిచి మసలు
మధుర క్షణములెపుడో

ప్రియతమా ప్రియతమా
పలికినది హృదయమే సరిగమా
చిలిపి నీ తలపులో
తెలిసినది వలపులో మధురిమా
చెలి చూపు తాకినా
ఉలకవా పలకవా
వలవేసి వేచి చూస్తున్నా
దొరకనే దొరకవా

ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా పిల్లడా
చక్కనైనచుక్కరా చక్కనైనచుక్కరా
నిన్ను కోరుకుందిరా సుందరా

పాల పిట్టలో వలపు…మహర్షి చిత్రంలోని ఒక హుషారైన పాటను  తలచుకుందాం.


చిత్రం : మహర్షి (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : శ్రీమణి  
గానం : రాహుల్ సిప్లిగంజ్, మానసి 

ఏవో గుస గుసలే
నాలో వలసే విడిసీ
వలపే  విరిసే  ఎదలో

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు పట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే
పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

కొండవలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే
గడపకద్దినా పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి
నా మానసిట్టా
నీవైపుకి మళ్ళిందే
పిల్లోడ గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే

విల్లు లాంటి నీ ఒళ్ళు
విసురుతుంటే బాణాలు
గడ్డి పరకపై అగ్గి పుల్లలా
భగ్గుమన్నవే నా కళ్ళు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటే మరి ముళ్ళు
నిప్పు పెట్టిన తేనె పట్టులా
నిద్ర పట్టదే రాత్రుళ్ళు
నీ నడుము చూస్తే మల్లె తీగ
మనసు దానినల్లే తూనీగ
మెల్ల మెల్లగా చల్లినావుగా
కొత్త కలలు బాగా

పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల పుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే

పిల్లోడా గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే

ఆ గట్టునుంటావా…రంగస్థలం చిత్రంలోని ఒక చక్కని పాటను  తలచుకుందాం.


చిత్రం : రంగస్థలం (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : శివనాగులు (ఆడియో)
దేవీశ్రీప్రసాద్(వీడియో)

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న

హే.. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునేమో సీసాడు సార ఉంది
కుండేడు కల్లు ఉంది బుట్టేడు బ్రాంది ఉందీ
ఈ గట్టునేమో ముంతడంత మజ్జిగుంది

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనేమో తోడేళ్ళ దండు ఉంది
నక్కాల మూక ఉంది పందికొక్కుల గుంపు ఉందీ
ఈ దిబ్బనేమో గోవుల మంద ఉంది

ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా
ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడపనేమో గన్నేరు పప్పు ఉంది
గుర్రాపు డెక్క ఉంది గంజాయి మొక్క ఉంది
ఈ గడపనేమో గంధపు చెక్క ఉందీ

ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా
ఆ గడప నుంటావా నాగన్న ఈ గడపకొస్తావా

ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న
ఈ ఏపుకొస్తావా నాగన్న ఆ ఏపునుంటావా
ఈ ఏపునేమో న్యాయముంది ధర్మముంది
బద్దం ఉంది శుద్దముందీ
ఆ ఏపునన్నిటికి ముందర ఆ ఉందీ
అంటే….. అన్యాయం అధర్మం అబద్దం అశు.. ఉష్షూ..
అందుకనీ….

ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న
ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న 


వెన్నెలైనా.. చీకటైనా.
పచ్చని కాపురం చిత్రం కోసం చక్రవర్తి గారు స్వరపరచిన ఓ చక్కని పాట  తలచుకుందాం.

చిత్రం : పచ్చని కాపురం (1985)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : సినారె
గానం : జానకి

వెన్నెలైనా.. చీకటైనా..
వెన్నెలైనా.. చీకటైనా..
చేరువైనా.. దూరమైనా
నీవే నా జీవితము..
నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము..
ప్రేమకు లేవూ దూరాలూ..
నీవూ నేనే సాక్ష్యాలు..

వెన్నెలైనా.. చీకటైనా..
చేరువైనా.. దూరమైనా
నీవే నా జీవితము..
నీ ప్రేమే శాశ్వతము

నీ తోటలోనే ఒకనాడు పూశాను
నా ఆశ తీరా ఈనాడు చూశానూ
అమ్మలేని జీవితాన చంటిపాపనై
నాన్న బాధ చూడ లేని చంటి పాపనై
ఇన్నాళ్ళుగా కన్నీళ్ళతో
ఉన్న బిడ్డనమ్మా కన్నబిడ్డనమ్మా
గుండెలోన నన్ను దాచుకోమ్మా

వెన్నెలైనా.. చీకటైనా..
చేరువైనా.. దూరమైనా
నీవే నా జీవితము..

అమ్మా..
నేనెవరినో నీవెవరివో
ఏమి చెప్పనమ్మా 
గుర్తుపట్టవమ్మ
అమ్మా.. అమ్మా..
అమ్మా.. అమ్మా..
నువ్వు నా కన్నతల్లివమ్మా.. 
నువ్వు నా కన్నతల్లివమ్మా.. 

వెన్నెలైనా.. చీకటైనా..
చేరువైనా.. దూరమైనా
నీవే నా జీవితము..
నీ ప్రేమే శాశ్వతము..
ఎక్కడో పుట్టి…
స్టూడెంట్ నంబర్ వన్ చిత్రంలోని ఒక చక్కని ఫేర్వెల్ పాట.
చిత్రం : స్టూడెంట్ నంబర్ 1  (2001)
సంగీతం : కీరవాణి  
సాహిత్యం : చంద్రబోస్
గానం : కీరవాణి 

ఆ.. ఆ.. ఆ..

ఓ మై డియర్ గర్ల్స్ .. డియర్ బోయ్స్ ..
డియర్ మేడమ్స్ .. గురుబ్రహ్మలారా ..

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో
వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్ 
వియ్ మిస్ యూ
వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ

నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ
సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ
ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ
రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ
రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు
శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు
కైలాష్ కూసిన కాకి కూతలు
కళ్యాణి పేల్చిన లెంపకాయలు
మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ

అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి
ఆ అల్లరంటే మాక్కూడా సరదాలెండీ

వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్ 
వియ్ మిస్ యూ
వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము
చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము
చిలిపితనపు చివరి మలుపులో

బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ
రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ
టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ
బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు
సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు
బాత్ రూముల్లోన భావకవితలు
క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు
మరపురాని తిరిగిరాని గురుతులండి
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ

మనకు మనకు క్షమాపణలు ఎందుకండి
మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ

వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్ 
వియ్ మిస్ యూ
వియ్ మిస్ ఆల్ ద ఫన్ 
వియ్ మిస్ ఆల్ ద జాయ్
వియ్ మిస్ యూ

బోటనీ పాఠముంది…
శివ చిత్రం లోని ఒక సరదా అయిన పాట ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : శివ (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : బాలు, శైలజ, బృందం

బోటనీ పాఠముంది..మ్యాటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది
సోదరా ఏది బె స్టురా
బోటనీ క్లాసంటే బోరు బోరు
హస్టరీ రొస్టు కన్నా రెస్టు మేలు
పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు
బ్రేకులు డిస్కోలు చూపుతారు

జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం 
జగడ జగడ జగడ జగడజాం  
జగడ జగడ జగడ జగడజాం 

దువ్వెనే కోడిజుత్తు నవ్వెనే ఏడ్చినట్టు 
ఎవ్వరే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు
ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్స్‌బాండు
గీరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే వీడి బ్రాండు
ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు

జగడ జగడ జగడ జగడజాం
జగడ జగడ జగడ జగడజాం 
జగడ జగడ జగడ జగడజాం  
జగడ జగడ జగడ జగడజాం

అయ్యో… మార్చినే తలచుకుంటే
మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా…
ఆ… ఛీ… తాళం రాదు మార్చిట మార్చి
తాళంలో పాడరా వెధవా
మార్చినే తలచుకుంటే
మూర్ఛలే ముంచుకొచ్చె
మార్గమే చెప్పు గురువా…
కొండలా కోర్సువుంది ఎంతకీ
తగ్గనంది ఏందిరో ఇంత గొడవ
ఎందుకీ హైరానా వెర్రినాన్నా
వెళ్లరా సులువైన దారిలోనా
ఉందిగా సెప్టెంబర్ మార్చిపైనా
హోయ్ వాయిదా పద్ధతుంది దేనికైనా

మ్యాగ్జిమమ్ మార్కులిచ్చు 
మ్యాథ్స్‌లో ధ్యాసవుంచు
కొద్దిగా ఒళ్ళు వంచరా ఒరేయ్..
తందనా తందననన్ తందనా
తందననన్ తందనా తందననన్నా
క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టుకాస్త 
ఫస్ట్ ర్యాంక్ పొందవచ్చురోయ్
తందనా తందననన్ తందనా
తందననన్ తందనా తందననన్నా

అరె ఏం సార్…
లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు
లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరు
పుస్కాల్తో కుస్తీలు పట్టెటోళ్ళు
సర్కారీ క్లర్కులై మురిగిపోతరు

జగడ జగడ జగడ జగడజాం… 
జగడ జగడ జగడ జగడజాం… 
జగడ జగడ జగడ జగడజాం… 
జగడ జగడ జగడ జగడజాం… 

ఉండిపోరాదే…
హుషారు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : హుషారు (2018)
సంగీతం : రాధన్  
సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ  
గానం : సిద్ శ్రీరామ్

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ
మళ్ళీమళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ
అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే

నిశిలో శశిలా నిన్నే చూశాకా
మనసే మురిసే ఎగసే అలలాగా
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
చీకట్లో కూడా నీడలా
నీవెంటే నేను ఉండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిముషం చాలులే

అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే

ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే

మాటే వినదుగ…
టాక్సీవాలా చిత్రంలోని ఒక చక్కని పాటను  తలచుకుందాం.
చిత్రం : టాక్సీవాలా (2018)
సంగీతం : జాక్స్ బెజోయ్ 
సాహిత్యం : కృష్ణకాంత్  
గానం : సిద్ శ్రీరామ్
  
మాటే వినదుగ.. మాటే.. మాటే
మాటే వినదుగ.. మాటే.. మాటే
పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..

ఒకటే గమ్యమె.. దారులు వేరులె
పయనమె నీ పనిలే..

అరరె.. పుడుతూ మొదలే..
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమె చూపెను
బ్రతుకులలో తీరే.. ఏ.. ఏ.. ఏ
ఆ వైపరె తుడిచే కారే కన్నీరే..

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..
ఒకటే గమ్యమే.. దారులు వేరులె
పయనమె నీ పనిలే

అరరె.. పుడుతూ మొదలే..
మలుపు కుదుపు నీదే
ఆ అద్దమె చూపెను
బ్రతుకులలో తీరే.. ఏ.. ఏ.. ఏ
ఆ వైపరె తుడిచే కారే కన్నీరే..

చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే.. బ్రతుకంటే
కొన్ని అందులోన పంచవ మిగులుంటే.. హో.. హో
నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా..
నీడలా వీడక.. సాయాన్నే నేర్పురా

కష్టాలెన్ని రాని.. జేబే ఖాళీ కానీ..
నడుచునులే బండి నడుచునులే
దారే మారిపోని ఊరే మర్చిపోనీ
వీడకులే శ్రమ విడువకులే..

తడి ఆరె ఎదపై.. ముసిరేను మేఘం
మనసంతా తడిసేలా.. కురిసే ఆ వానా..

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

మాటే వినుదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం దిగదుగ దిగదుగ వేగం..
మాటే వినదుగ.. వినదుగ.. వినదుగ..
వేగం.. వేగం.. వే..గం

పెరిగే వేగమే.. తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే..
ఒకటే గమ్యమే.. దారులు వేరులే
పయనమె నీ పనిలే

అరరె.. పుడుతూ మొదలే..
మలుపు కుదుపు నీదే
మరు జన్మతో.. పరిచయం
అంతలా పరవశం..
రంగు చినుకులే గుండెపై రాలెనా 

అయిగిరి నందిని…
చిత్రం : సప్తపది (1981)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : మహిషాసురమర్ధిని స్తోత్రం
గానం : బాలు

అయిగిరి నందిని నందిత మోదిని
విశ్వ వినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధిని వాసిని
విష్ణు విలాసిని జిష్ణునుతే

భగవతి హేశితి కంఠ కుటుంబిని
భూరి కుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని
రమ్యకపర్దిని శైలసుతే

అయి జగదంబ కదంబవన
ప్రియవాసవిలాసిని వాసరతే
శిఖరిశిరోమణి తుంగహిమాలయ
శృంగ నిజాలయ మధ్యగతే

మధు మధురే మధు కైటభ

భంజని కైటభ భంజని రాసర తే
జయ జయ హే మహిషాసురమర్దిని
రమ్యకపర్దిని శైలసుతే

ఝణ ఝణ ఝణ హింకృత సుర
నూపుర రంజిత మోహిత భూతపతే
నటిత నటార్ధ నటీనటనాయుత
నాటిత నాటక నాట్యరతే

పవనతపాలిని ఫాలవిలోచని
పద్మ విలాసిని విశ్వధురే
జయ జయ హే మహిషాసురమర్దిని
రమ్యకపర్దిని శైలసుతే

కలమురళీరవ వాజిత కూజిత
కోకిల మంజుల మంజురతే
మిళిత మిళింద మనోహరగుంభిత
రంజిత శైల నికుంజగతే

మృగగణభూత మహాశబరీగణ
రింగణ సంభృతకేళిభృతే
జయ జయ హే మహిషాసురమర్దిని
రమ్యకపర్దిని శైలసుతే 


ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…
గీత గోవిందం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.
చిత్రం : గీత గోవిందం (2018)
సంగీతం : గోపి సుందర్
సాహిత్యం : అనంత శ్రీరామ్
గానం : సిద్ శ్రీరామ్, బృందం

తథిగిణ తకఝణు
తథిగిణ తకఝణు
తరికిట తదరిన
తద్ధీంధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం

 
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరణాల్లే


గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మే
మళ్ళీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరణాల్లే

 
తథిగిణ తకఝణు
తథిగిణ తకఝణు
తరికిట తదరిన
తద్ధీంధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం


ఊహలకు దొరకని సొగసా
ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడి పడినది తెలుసా
మనసున ప్రతి కొసా
నీ కనుల మెరుపుల వరసా
రేపినది వయసున రభసా
నా చిలిపి కలలకు బహుశా
ఇది వెలుగుల దశ

నీ యెదుట నిలబడు చనువే వీసా
అందుకొని గగనపు కొనలే చూసా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే…
ఇకపై తిరణాల్లే

 
మాయలకు కదలని మగువా
మాటలకు కరగని మధువా
పంతములు విడువని బిగువా
జరిగినదడగవా
నా కధని తెలుపుట సులువా
జాలిపడి నిమిషము వినవా
ఎందుకని గడికొక గొడవా
చెలిమిగ మెలగవా

నా పేరు తలచితె ఉబికే లావా
చల్లబడి నను నువు కరుణించేవా

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరణాల్లే

 
గుండెల్లోన వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మే
మళ్ళీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరణాల్లే


తథిగిణ తకఝణు
తథిగిణ తకఝణు
తరికిట తదరిన
తద్ధీంధీంత ఆనందం
తలవని తలపుగ
ఎదలను కలుపగ
మొదలిక మొదలిక
మళ్ళీ గీత గోవిందం 


భరత్ అనే నేను…
భరత్ అనే నేను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.
చిత్రం : భరత్ అనే నేను (2018)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం:  డేవిడ్ సైమన్

విరచిస్తా నేడే నవశకం
నినదిస్తా నిత్యం జనహితం
నలుపెరగని సేవే అభిమతం
కష్టం ఏదైనా సమ్మతం

భరత్ అనే నేనూ హామి ఇస్తున్నానూ
బాధ్యుడ్నై ఉంటానూ
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా..
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ

పాలించే ప్రభువును కాననీ
సేవించే బంటును నేననీ
అధికారం అర్దం ఇది అనీ
తెలిసేలా చేస్తా నా పనీ

భరత్ అనే నేనూ హామి ఇస్తున్నానూ
బాధ్యుడ్నై ఉంటానూ
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా..
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ

మాటిచ్చా నేనీ పుడమికీ
పాటిస్తా ప్రాణం చివరికీ
అట్టడుగున నలిగే కలలకీ
బలమివ్వని పదవులు దేనికీ

భరత్ అనే నేనూ హామి ఇస్తున్నానూ
బాధ్యుడ్నై ఉంటానూ
ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్
బై ద పీపుల్ ప్రతినిధిగా..
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ
దిస్ ఈజ్ మీ.. దిస్ ఈజ్ మీ

ఎంత సక్కగున్నావే…
రంగస్థలం చిత్రం లోని ఒక చక్కని మెలోడీని తలచుకుందాం.
చిత్రం : రంగస్థలం (2018)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : చంద్రబోస్
గానం : దేవీశ్రీప్రసాద్

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా దొరికిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే
చేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె

మల్లెపూల మధ్య ముద్దబంతి లాగా
ఎంత సక్కగున్నావె
ముత్తయిదువ మెళ్లో పసుపు కొమ్ములాగ
ఎంత సక్కగున్నావె
చుక్కలసీర కట్టుకున్న ఎన్నెల లాగ
ఎంత సక్కగున్నావె

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే
చేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె

ఓ.. రెండు కాళ్ల సినుకువి నువ్వు
గుండె సెర్లో దూకేసినావు..
అలల మూటలిప్పేసినావు
ఎంత సక్కగున్నావె..లచ్చిమి..ఎంత సక్కగున్నావె
మబ్బులేని మెరుపువి నువ్వు..
నేలమీద నడిసేసినావు..
నన్ను నింగి సేసేసినావు 
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
సెరుకుముక్క నువ్వు కొరికి తింటా వుంటే
ఎంత సక్కగున్నావె
సెరుకు గెడకే తీపి రుసి తెలిపీనావె
ఎంత సక్కగున్నావె

తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు
ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె

గాలి పల్లకిలో ఎంకి పాటలాగ
ఎంకిపాటలోన తెలుగు మాటలాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె

కడవ నువ్వు నడుమున బెట్టీ
కట్టమీద నడిసొస్తా వుంటే
సంద్రం నీ సంకెక్కినట్టూ
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
కట్టెల మోపు తలకెత్తుకుని
అడుగులోన అడుగేత్తా వుంటే
అడవి నీకు గొడుగట్టినట్టూ
ఎంత సక్కగున్నావె లచ్చిమీ ఎంత సక్కగున్నావె
బురదసేలో వరి నాటు యేత్తావుంటే
ఎంత సక్కగున్నావే భూమి బొమ్మకు నువ్వు
ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నావె

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..

సింత సెట్టు ఎక్కి సిగురు కొయ్యాబోతే
చేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..

జామురాతిరి జాబిలమ్మ…
క్షణ క్షణం చిత్రంలోని ఓ అద్భుతమైన పాటను  తలచుకుందాం. 
చిత్రం : క్షణం క్షణం  (1991)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా వరాల వెండిపూల వాన
స్వరాల ఊయలూగు వేళ

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

కుహు కుహు సరాగాలే శృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిల సమీపించే సడులతో
ప్రతి పొద పదాలేవో పలుకగా

కునుకు రాక బుట్టబొమ్మ గుబులుగుందనీ
వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చనీ

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

మనసులో భయాలన్నీ మరిచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషాతీరం వెతుకుతూ
నిదరతో నిషారానే నడిచిపో

చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా
జోరుగాలిలో జాజికొమ్మ జారనియ్యకే కలా
వయ్యారి వాలు కళ్ళలోనా 

ఊఊఊహ్.హ్.హ్. ఆహ
స్వరాల ఊయలూగు వేళ

అబ్బనీ తియ్యనీ దెబ్బ…
జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.
చిత్రం : జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ
అబ్బనీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

చిటపట నడుముల ఊపులో ఒక ఇరుసున వరసలు కలవగా
ముసిరిన కసికసి వయసులో ఒక ఎదనస పదనిస కలవగా
కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు
ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు
చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట

అబ్బనీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గాఆఁ…
 
అడగక అడిగినదేవిఁటో లిపి చిలిపిగ ముదిరిన కవితగా
అది విని అదిమిన షోకులో పురి విడిచిన నెమలికి సవతిగా
నిన్నే నావి పెదవులు అవి నేడైనాయి మధువులు 
రెండున్నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు
వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట
అబ్బనీ తీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారెవా
పురుషుల్లోనా పుంగవా పులకింతొస్తే ఆగవా
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బా
అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ

సిరిమల్లె పువ్వా…

పదహారేళ్ళ వయసు చిత్రంలోని ఒక అద్భుతమైన పాట ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : జానకి

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా

తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడా నా సందమామ రాడే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా

కొండల్లో కోనల్లో కూయన్న ఓ కొయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా 

ఆకుచాటు పిందె తడిసే…
వేటగాడు సినిమాలోని ఈ పాట
చిత్రం : వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఆకు చాటు పిందె తడిసే .. కొమ్మ చాటు పువ్వు తడిసే
ఆకు చాటు పిందె తడిసే .. కొమ్మ చాటు పువ్వు తడిసే

ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది

గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే

ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది .. కొంగుల్ని ముడిపెట్టింది  

ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే
అహ అహ.. అహా అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
అహ అహ .. అహ అహ

ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే

నీ మాట విని మబ్బు మెరిసి ..అహ
జడివానలే కురిసి కురిసి ..
వళ్ళు తడిసి ..వెల్లి విరిసి…
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి

అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..
 

ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది

మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
అహ అహ .. అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
అహ అహ .. అహా అహ అహ

ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే..
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే

అహ .. నీ పాట విని మెరుపులొచ్చి… అహ
నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి .. చెలిమి పంచి
తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..ఆకు చాటు పిందె తడిసే.. ఆహా అహా అహా అహా 

కొమ్మచాటు పువ్వు తడిసే.. ఆహా అహా అహా అహా 
 ఆకు చాటు పిందె తడిసే .. కొమ్మచాటు పువ్వు తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది.

చినుకు చినుకు అందెలతో…
శుభలగ్నం చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. 

చిత్రం : మాయలోడు (1993) / శుభలగ్నం(1994)
సంగీతం : ఎస్. వి. కృష్ణారెడ్డి 
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : బాలు, చిత్ర

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా 

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా


నింగి నేల ఈవేళ చలికి వణికిపోతుంటే
బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది
ఈ కౌగిలింతలోన ఏలో
గుండెల్లో ఎండ కాసే ఏలో

 
అరె.. పైన మబ్బు ఉరిమింది
పడుచు జింక బెదిరింది
వలవేయక సెలయేరై పెనవేసింది
అరె..చినుకమ్మ మెరుపమ్మ ఏలో
చిటికేస్తే బుగ్గ మీద ఏలో 

 
తలపు తొలివలపు ఇక తక ఝుం తక ఝుం
వయసు తడి సొగసు అర విరిసె సమయం 

ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి

 వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా


మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది
ఎద లోపల చలిగాలుల సుడి రేగింది
 

వానొచ్చే వరదొచ్చే ఏలో
వయసంటే తెలిసొచ్చే ఏలో 


మేను చూపు పో అంది వాలు చుపు సై అంది
చెలి కోరిక అలవోకగ తల ఊపింది
 

అరె.. సరసాల సిందులోన ఏలో
సరి గంగ తానాలు ఏలో


ఒడిలో ఇక ఒకటై తక తకతై అంటే 

 సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే
ఆహా…ఊహూ… ఓహోహొహో

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా  


 చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో
నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి
వాన జాణ ఆడింది వయ్యారంగా
నీళ్ళ పూలు జల్లింది సింగారంగా 

బంగారు కోడిపెట్ట…
ఘరానా మొగుడు చిత్రం నుండి ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం.
చిత్రం : ఘరానా మొగుడు (1992)
సంగీతం : ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం : భువన చంద్ర
గానం : బాలు, చిత్ర

పాపా హ్యాండ్సప్
పాపా హ్యాండ్సప్… హ హ…
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీ లక్
దిక్ దిక్ డోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాకప్
షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప

ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు
అంతంత ఉన్న ఎత్తులు బోలొ బోలో
నీ కన్ను పడ్డాక ఓరయ్యో
పొంగేస్తున్నాయి సొత్తులు చెల్లొ చెల్లో

సిగ్గులేని రైక టెక్కు చూస్తా
గోలుమాలు కోక పొంగులో
కావలిస్తే మళ్ళీ వస్తానయ్యో
కొంగుపట్టి కొల్లగొట్టకు

హే హే అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీలక్ దిక్ దిక్ డోలక్కుతో
రైటో జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప

ఏంటమ్మా ఏంటమ్మా అందుల్లో
అందాల చిట్టి గంపల్లో బోలొ బోలో
నా ఈడు నక్కింది బావయ్యో
చేయ్యెసినాక మత్తుల్లో చెల్లొ చెల్లో

చేత చిక్కినావే గిన్నెకోడి
దాచుకున్న గుట్టు తియ్యానా తియ్యానా
కాక మీద వున్న దాన్నిరయ్యో
దాక మీద కోపమెందుకు

హే హే అప్ అప్ హ్యాండ్సప్
చెక్ చెక్ నీ లక్ దిక్ దిక్ డోలక్కుతో
ఓకే జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప
అప్ అప్ హ్యాండ్సప్ చెక్ చెక్ నీ లక్
దిక్ దిక్ డోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్
స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి
హే పాపా, హే పాపా, హే పాప
చెంగావి చీర గుట్టు చూసుకోండి
హే పాపా, హే పాపా, హే పాప 


పచ్చగడ్డి కోసేటి…
దసరా బుల్లోడు చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం.
చిత్రం : దసరా బుల్లోడు (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా

కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
అహ..కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా

కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి
చెప్పలేని ఊసులేవొ చెప్పుచున్నవీ
కొప్పులోన బంతి పూలు గునుస్తున్నవి
చెప్పలేని ఊసులేవొ చెప్పుచున్నవీ

ఊసులన్ని వింటివా ఊరుకోవవీ
ఆశలై బాసలై అంటుకుంటవి
ఊసులన్ని వింటివా ఊరుకోవవీ
ఆశలై బాసలై అంటుకుంటవి

హేయ్.. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
అహ.. కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా

వరిచేను కోతకొచ్చి వంగుతున్నదీ
వంపులన్ని వయసొచ్చి పొంగుతున్నవీ
వరిచేను కోతకొచ్చి వంగుతున్నదీ
వంపులన్ని వయసొచ్చి పొంగుతున్నవీ

వయసుతోటి మనసేమొ పోరుతున్నదీ
వయసుతోటి మనసేమొ పోరుతున్నదీ
వలపులోనే రెంటికీ ఒద్దికున్నదీ
వలపులోనే రెంటికీ ఒద్దికున్నదీ

పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
అహ . . కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా

కొడవలితో లేత గడ్డి కోసుకుంటివీ
కొంటె చూపుతో గుండె దూసుకుంటివీ
కొడవలితో లేత గడ్డి కోసుకుంటివీ
కొంటె చూపుతో గుండె దూసుకుంటివీ

గడ్డిమోపు తలపైనా మోసుకొస్తినీ
గడుసువాణ్ణి తలపుల్లో దాచుకొంటినీ
గడ్డిమోపు తలపైనా మోసుకొస్తినీ
గడుసువాణ్ణి తలపుల్లో దాచుకొంటినీ

ఆహా.. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్
నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
హా . . కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా 

నేను సైతం ప్రపంచాగ్నికి…
ఠాగూర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.

చిత్రం : ఠాగూర్ (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : బాలు

నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి
అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోసానూ

నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను

అగ్నినేత్ర ఉగ్ర జ్వాల దాచినా ఓ రుద్రుడా
అగ్ని శిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశమా
హింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా
మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా
భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా

అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా

నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి
అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోసానూ

నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను


మౌనంగానే ఎదగమని…

చిత్రం : నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం : M.M.కీరవాణి
రచన : చంద్రబోస్
గానం : చిత్ర

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది


మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడ ఉన్నాయిగా
భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుంది
తెలుసుకుంటె సత్యమిది
తలచుకుంటె సాధ్యమిది

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా 
మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి

మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది


ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

వచ్చిండే మెల్ల మెల్లగ…
ఫిదా చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం.
చిత్రం : ఫిదా (2017)
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం: మధుప్రియ, రాంకీ, కోరస్

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే

హే.. పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే
డిన్నరన్నాడే డేటు అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా చేసిండే హెయ్ హెయ్

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే
 పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే..ఒచ్చిండే..ఏఏ..ఆఅ.
మగవాళ్లు మస్తు చాలు.. హొయ్ హొయ్ 
మగవాళ్ళు మస్తు చాలు..ఆహ 
మగవాళ్ళు మస్తు చాలు.. మస్కలు కొడతా ఉంటారే
నువ్వు వెన్న పూస లెక్క కరిగితే అంతే సంగతే
ఓసారి సరే అంటూ ఓసారి సారీ అంటూ
మెయింటేను నువ్వు జేస్తే
లైఫ్ అంతా పడుంటాడే

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే

అయ్ బాబోయ్ ఎంత పొడుగో 
అయ్ బాబోయ్ ఎంత పొడుగు
అయ్ బాబోయ్ ఎంత పొడుగు
ముద్దు లెట్టా ఇచ్చుడే
అయ్ బాబోయ్ ఎంత పొడుగు
ముద్దు లెట్టా ఇచ్చుడే
తన ముందో నిచ్చనేసి
ఎక్కితే కానీ అందడే
ఫరవాలే నడుము పట్టి
పైకెత్తి ముద్దే పెట్టే
టెక్నిక్సే నాకున్నాయిలే
పరేషానే నీకక్కర్లే

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్ట్రబ్ జేసిండే
హేయ్ పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే వచ్చిండే..ఏఏ..
డిన్నరన్నాడే డేటు అన్నాడే అన్నాడే..ఏఏ..
ఏలు పట్టి పోలు తిరిగి
నిన్ను ఉల్టా సీదా చేసిండే
అరే ఓ పిల్లా ఇంకా నువ్వు
నేలనిడిచి గాలి మోటర్‌లో.. తుర్ర్.ర్.ర్.ర్.ర్

వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే 
క్రీము బిస్కెటు ఏసిండే 
గమ్మున కూసోనీయడే కుదురుగ నిల్సోనీయడే 
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్దా నోటికి పోకుండామస్తు డిస్ట్రబ్ జేసిండే

ఓరోరి రాజా వీరాధి వీరా…
చిత్రం : బాహుబలి ది కంక్లూజన్ (2017)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : చైతన్య ప్రసాద్
గానం : దీపు, సోని

ఓరోరి రాజా వీరాధి వీరా
ఓరోరి రాజా వీరాధి వీరా
నీతోనె నేను ఉండిపోనా
ఎందాక నువ్వూ వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా
హాయైన హంసనావ లోనా
నీగాలి సోకుతుంటె పైనా
మెచ్చిందిలే దేవసేనా

నేన్నీ ఎదపై
విశాల వీర భూమిపై
వసించనా
నేనే వలపై
వరాల మాలికై వాలనా
నీలో రగిలే
పరాక్రమాల జ్వాలనై
హసించనా
నిన్నే గెలిచే
సుఖాల కేళిలో తేలనా

ఓహొహో ఓహొహో
ఏకాంత కాంత మందిరానా
ఓహొహో ఓహొహో
నీ మోహ బాహు బంధనానా
నూరేళ్ళు బంధీని కానా

ఓరోరి రాజా
ఓరోరి రాజా
వీరాధి వీరా
నీతోనె నేను ఉండిపోనా
ఎందాక నువ్వూ వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడ రానా
హాయైన హంస నావలోనా
నీగాలి సోకుతుంటె పైనా
మెచ్చిందిలే దేవసేనా

అయ్యయ్యో చేతిలో డబ్బులు…
కులగోత్రాలు చిత్రంలో జూదం గురించి ఒక సరదా అయిన పాట.
చిత్రం : కులగోత్రాలు (1962)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు
గానం : మాధవపెద్ది, పిఠాపురం, రాఘవులు

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే
ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది
ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది
పెళ్లాం మెళ్లో నగలతో సహా
తిరుక్షవరమై పోయింది
పెళ్లాం మెళ్లో నగలతో సహా
తిరుక్షవరమై పోయింది

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే

ఆ మహా మహా నలమహారాజుకే
తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయీ

మరి నువు చెప్పలేదు భాయీ
అది నా తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగ
చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ
బాబూ నిబ్బరించవోయీ


అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే

నిలువు దోపిడీ దేవుడికిచ్చిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
గోవిందా గోవిందా
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
చక్కెర పొంగలి చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చుపెడితే
ఎం.ఎల్.ఏ దక్కేది
మనకు అంతటి లక్కేదీ

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే

గెలుపూ ఓటమి దైవాధీనం
చెయ్యి తిరగవచ్చు
మళ్ళీ ఆడి గెల్వవచ్చు

ఇంకా పెట్టుబడెవడిచ్చు
ఇల్లు కుదవ పెట్టవచ్చు
ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో
మన కరువు తీరవచ్చు

పోతే అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయయ్యో జేబులు ఖాళీ ఆయెనే

వారెవా ఏమి ఫేసు…
చిత్రం : మనీ (1993)
సంగీతం : శ్రీ మూర్తి 

సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శ్రీ మూర్తి , సత్యం, సిరివెన్నెల

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా వుంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు
ఇంక వేసెయ్ మరో ఆహాహా ….డోసు

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా వుంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు
ఇంక వేసెయ్ మరో ఆహాహా ….డోసు
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు
చెప్పింది చెయ్యరా
నీవేరా ముందు డేసు

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా వుంది బాసు

అమితాబచ్చన్ కన్నా ఏం తక్కువ నీకైనా
హాలీవుడ్లో అయినా ఎవరెక్కువ నీకన్నా
ఫైటు ఫీటు ఆట పాట రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే
మెగాస్టార్ ఐపోలేదయ్యా
తెగించి సత్తా చూపందే
సడన్గా స్వర్గం రాదయ్యా

 బాలయ్య వెంకటేశు నాగార్జున నరేషు
రాజేంద్రుడు సురేషు
రాజశేఖరు ఆదర్సు
మొత్తంగా అందరూ
అయిపోవాలోయ్ మటాషు

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా వుంది బాసు

గూండా రౌడీ దాదా అంటారే బయటుంటే
ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే
ఒహో అంటూ జైకొడతారు
తేడా మేకప్పే
నువుంటే చాల్లే అంటారు
కధెందుకు పోన్లే అంటారు
కటౌట్లు గట్రా కడతారు
టికెట్లకు కొట్టుకు ఛస్తారు

 బాగుంది గాని ప్లాను
పల్టీ కొట్టిందో ఏవి గాను
బేకారీ బాత్ మాను
జర జారు తగ్గించు ఖాను….
అరె ఛి పో శకున పక్షిలా తగులుకోకు ముందు

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా వుంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు
ఇంక వేసెయ్ మరో… డోసు…


అరె ఏమైందీ.. ఒక మనసుకు…
ఆరాధన చిత్రంలోని ఒక చక్కని పాటను  తలచుకుందాం.
చిత్రం : ఆరాధన (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, జానకి

అరె ఏమైందీ…
అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ

అది ఏమైందీ.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దుర లేపిందీ.. ఆఆఅ…ఆఆ…
అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ…

నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది
నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది

పూలు నేను చూడలేదూ – పూజలేవి చేయలేను
నేలపైన కాళ్ళులేవూ – నింగివైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు
అది దోచావూ…
 లలలల లలలల ల ల ల


బీడులోన వాన చినుకు.. పిచ్చి మొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటె పాట నీవె రాయగలవు

రాత రానివాడి రాత దేవుడేమి రాసాడో
చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు
మనిషౌతాడూ…

అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలిందీ

కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దుర లేపిందీ
అరె ఏమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ..
అది ఏమైందీ… 

ఓ పాపా లాలి జన్మకే లాలి…
గీతాంజలి చిత్రంలోని ఒక చక్కని పాటను  తలచుకుందాం.
చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి

నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక
కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో
తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవీ

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ కోయిలా పాడవే నా పాటని తీయనీ తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి
చెప్పవే చిరుగాలి…
ఒక్కడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : ఒక్కడు (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఉదిత్ నారాయణ్, సుజాత 

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి

ఆశ దీపికలై మెరిసే తారకలు
చూసే దీపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో

అడుగే అలై పొంగుతుందీ 

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ చుట్టూ ఇంకా రేయున్నా
అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ 
రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతు 
ఉంటే ఆపగలవా షికార్లు
కురిసే సుగంధాల హోళి ఓ 
చూపదా వసంతాల కేళీ
కురిసే సుగంధాల హోళి ఓ 
చూపదా వసంతాల కేళీ
 
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి

యమునా తీరాల కధ వినిపించేలా
రాధామాధవుల జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళ
చెవిలో సన్నాయి రాగంలా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల
రాతిరి ఏటిని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా
పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లసంగా తుళ్ళీ
హో చూపదా వసంతాల కేళీ
ఊపిరే ఉల్లసంగా తుళ్ళీ హో
 చూపదా వసంతాల కేళీ

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ

చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ
చూపవే నీతో తీసుకెళ్ళి


చందమామ రావే…
ఈ రోజు సిరివెన్నెల చిత్రంలోని ఒక చక్కని పాట విందాం.
చిత్రం : సిరివెన్నెల (1987)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, సుశీల

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే

చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినీయ జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే…

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే

మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
మునిజన మానస మోహిని యోగిని బృందావనం
మురళీ రవళికి ఆడిన నాగిని బృందావనం
రాధా మాధవ గాధల రంజిలు బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
బృందావనం బృందావనం
హే కృష్ణా ముకుందా మురారీ
కృష్ణా ముకుందా మురారీ..
జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే…
చందమామ రావే జాబిల్లి రావే

చిటపట చినుకులు పడుతూ..
చిత్రం : ఆత్మబలం (1964)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

చిటపట చినుకులు పడుతూ ఉంటే
చెలికాడె సరసన ఉంటే..
చెట్టాపట్టగ చేతులు పట్టి
చెట్టు నీడకై పరుగిడుతుంటే

చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ

ఉరుములు పెళపెళ ఉరుముతు ఉంటే..
మెరుపులు తళ తళ మెరుస్తు ఉంటే..
మెరుపు వెలుగులో చెలి కన్నులలో
బిత్తర చూపులు కనపడుతుంటే..

చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ

కారు మబ్బులు కమ్ముతు ఉంటే
కమ్ముతు ఉంటే..ఓ..ఓ..
కళ్ళకు ఎవరూ కనపడకుంటే
కనపడకుంటే ఆ..
కారు మబ్బులు కమ్ముతు ఉంటే
కమ్ముతు ఉంటే..ఓ..ఓ..
కళ్ళకు ఎవరూ కనపడకుంటే

కనపడకుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే
అనుకొని హత్తుకు పోతుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే
అనుకొని హత్తుకు పోతుంటే

 

చెప్పలేని ఆ హాయీ
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ..

చెప్పలేని ఆ హాయీ
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ..

చలి చలిగా గిలివెస్తుంటే..ఆ హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే..ఓహోహో.
చలి చలిగా గిలివెస్తుంటే..ఆ హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే..
ఓహోహో.

చెలి గుండెయిలో రగిలే వగలే
చెలి గుండెయిలో రగిలే వగలే
చలిమంటలుగా అనుకుంటే. 


చెప్పలేనీ ఆ హాయీ
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేనీ ఆ హాయీ
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ

చిటపట చినుకులు పడుతూ ఉంటే..
చెలికాడె సరసన ఉంటే..
చెట్టాపట్టగ చేతులు పట్టి
చెట్టు నీడకై పరుగిడుతుంటే..
చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేని ఆ హాయి
ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
శుభలేఖ రాసుకున్నా…
కొండవీటిదొంగ చిత్రం కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. 
చిత్రం : కొండవీటి దొంగ (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
పుష్యమి పూవ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో…

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో…

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో

చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికి

మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కథంతేలే అదంతేలే…

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
పుష్యమి పూవ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో…

శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! 
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో

హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా వేణు పూలతోటలో

వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు
వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు
అంతేలే కధంతేలే అదంతేలే…

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో  
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో…

శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!

ఎన్నెన్నో జన్మల బంధం…
చిత్రం : పూజ (1975)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : దాశరథి
గానం : బాలు, వాణీ జయరాం

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి
నిన్నే చూసిన వేళా నిండును చెలిమి
ఓహో హో హో ..నువ్వు కడలివైతే
నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను
చేరనా. చేరనా.. చేరనా…
 
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

విరిసిన కుసుమము నీవై మురిపించేవు
తావిని నేనై నిన్నూ పెనవేసేను
ఓహో హో హో మేఘము నీవై నెమలిని నేనై
ఆశతో నిన్ను చూసి చూసి
ఆడనా.. ఆడనా.. ఆడనా…
  
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

కోటి జన్మలకైనా కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ .. నేనుండాలి
ఓహో హో హో నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్ల వేళలందు
ఉండనీ. ఉండనీ.. ఉండనీ..

ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఆఅహాహహహాఅ..ఓహోహోహొహో..

ఓ మగువా నీతో…సత్యం


చిత్రం : సత్యం (2003)
సంగీతం : చక్రి
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
గానం : చక్రి

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా…
కాళిదాసులాగ మారి కవితే రాసేశా!

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా…
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా!
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా…
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా!
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
ఫుడ్డు లేకపోయినా బెడ్డు లేకపోయినా
పగలు రాత్రి వెతికీ వెతికీ నీకే లైనేశా

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా…
కాళిదాసులాగ మారి కవితే రాసేశా!

ట్రిపుల్ ఎక్స్ రమ్ములోన కిక్కులేదు హల్లో మైనా
నీ లుక్సే చూడబోతే మత్తులోకి దించేనా
సన్‌లైట్ వేళ నుంచి మూన్‌లైట్ వేళ్లేదాకా
ఫుల్ టైమ్ నా గుండెల్లో ధాట్‌లన్నీ నీవేగా
ఓ లలనా ఇది నీ జాలమా
నీ వలన మనసే గాయమా
కుదురేమో లేదాయే నువు
నమ్మవుగాని కలవరమాయె
ఓ మగువా… ఓ మగువా… ఓ మగువా… ఏయ్

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా…
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా!

కో అంటే కోటి మంది అందగత్తెలున్నా గాని
నీ జంటే కోరుతుంటే దంచుతావె కారాన్ని
క్రేజీగా ఉంటే చాలు ప్రేమలోన పడతారండి
ట్రూ లవ్వే చూపుతుంటే పెంచుతారు దూరాన్ని
ఓ మగువా నీకే న్యాయమా
ఎదలో ప్రేమే శాపమా
మనసేమో బరువాయె…
నీ మాటలు లేక మోడైపోయె
మగువా… ఓ మగువా… ఓ మగువా…

ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా…
కాళిదాసులాగ మారి కవితే రాసేశా!
ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా…
దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా!

అలనాటి రామచంద్రుడి..
చిత్రం : మురారి (2001),
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : మణిశర్మ,
గానం : జిక్కి, సంధ్య, సునీత

ఆ… ఆ… ఆ… ఆ…
అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి
అ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి

అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి
అ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి
ఆ… ఆ… ఆ… ఆ…
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
ఆ… ఆ… ఆ… ఆ…

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ వ్రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపున ముద్దగా తడిసిన తుంటరి జలకాలు

అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ… ఆ…
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడండి
తళతళ మెరిసిన ఆనందపు తడిచూపుల అక్షితలేయండి

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా

సీతారాముల కల్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపాన
గౌరిశంకరులు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా
మరగ లేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన

దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
ఆ… ఆ… ఆ… ఆ…
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసి నివ్వెరబోవమ్మా
 
ఆ… ఆ… ఆ… ఆ…

వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా

ముత్యాల చెమ్మచెక్క…
చిత్రం : బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : సుశీల, కోరస్

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో
గాజులు గలగలలాడ

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో
గాజులు గలగలలాడ

తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ
తళ తళ తళ తళ మెరిసే సొగసు
ఇంపైన సంపంగి అమ్మాయి మనసూ

పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె
పరువము వేసిన పందిరిలో
బుజబుజ రేకులు పూయవలె

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ

ఒప్పులకుప్ప.. వయ్యారి భామా
సన్నబియ్యం..  ఛాయపప్పు
చిన్నమువ్వ..  సన్నగాజు
కొబ్బరికోరు..  బెల్లప్పచ్చు
గూట్లో రూపాయ్.. నీ మొగుడు సిపాయ్
రోట్లో తవుడు.. నీ మొగుడెవడు
హహహహ హహహ హాహహహహహ
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారెడేసి మొగ్గలు
గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె
ఆ..ఆ..ఆ..ఆ… ఓ..ఓ..ఓ..ఓ…

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క
ఓ చెలి మురిపెముగా ఆడుదమా
కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ

ఆమనీ పాడవే హాయిగా..
చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల
మౌనమైన వేళల

ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా


వయస్సులో వసంతమే
ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే
రచించెలే మరీచికా
పదాల నా యెద
స్వరాల సంపద
తరాల నా కథ
క్షణాలదే కదా
గతించి పోవు గాధ నేనని

ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో


శుకాలతో పికాలతో
ధ్వనించినా మధూదయం
దివీ భువీ కలా నిజం
స్పృశించినా మహోదయం
మరో ప్రపంచమే
మరింత చేరువై..
నివాళి కోరినా
ఉగాది వేళలో
గతించి పోని గాధ నేనని

ఆమనీ పాడవే హాయిగా
మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో
పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల
మౌనమైన వేళల
ఆమనీ పాడవే హాయిగా
ఆమనీ పాడవే హాయిగా

ఊహలు గుసగుసలాడే…
చిత్రం : బందిపోటు (1963)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

ఊ హూ హూ.. ఊ ఊ ఊ…
ఊ ఊ ఊ…. ఊ ఊ ఊ
ఊ హూ హూ.. ఊ ఊ ఊ…
ఊ ఊ ఊ…. ఊ ఊ ఊ

ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే
ప్రియా… ఊ
ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే

వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు
కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే
అది నీకు మునుపే తెలుసు

ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే

నను కోరి చేరిన బేలా
దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా
దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో
విడలేను ఊపిరి కూడా

ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే

దివి మల్లెపందిరి వేసే
భువి పెళ్ళిపీటను వేసే
దివి మల్లెపందిరి వేసే
భువి పెళ్ళిపీటను వేసే
నెర వెన్నెల కురిపించుచు
నెలరాజు పెండ్లిని చేసే

ఊహలు గుసగుసలాడే
మన హృదయములూయలలూగే

కిన్నెరసాని వచ్చిందమ్మ…చిత్రం : సితార (1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఎస్.పి.శైలజ

తననననన తననననన…
తననననన తననననన…
తననననన తననననన… తననననన

చమకు చమకు జింజిన జింజిన..
చమకు చమకు జిన్న జిన్న జిన్న..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
జమకు జమకు జింజిన జింజిన..
జమకు జమకు జిన్న జిన్న జిన్న.
.

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
విశ్వనాధ పలుకై.. అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై..

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన
పచ్చని చేలా..  పావడగట్టి..
కొండమల్లెలే కొప్పునబెట్టి
వచ్చేదొరసాని.. మా వన్నెల కిన్నెరసాని

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..

ఎండల కన్నె సోకని రాణి..
పల్లెకు రాణి పల్లవ పాణి..
కోటను విడిచీ.. పేటను విడిచీ..
కోటను విడిచీ.. పేటను విడిచీ..
కనులా గంగా పొంగే వేళ..
నదిలా తానే సాగే వేళ..
రాగాల రాదారి పూదారి ఔతుంటే..
ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే..

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..

మాగాణమ్మా చీరలు నేసే..
మలిసందెమ్మ కుంకుమ పూసే..
మువ్వలబొమ్మా.. ముద్దులగుమ్మా..
మువ్వలబొమ్మా.. ముద్దులగుమ్మా..

గడపా దాటి నడిచే వేళ..
అదుపే విడిచీ ఎగిరే వేళ..
వయ్యారి అందాలు.. గోదారి చూస్తుంటే..
ఈ వయ్యారి అందాలు.. గోదారి చూస్తుంటే

కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి.. 
కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి..
విశ్వనాధ పలుకై… అది విరుల తేనెచినుకై..
కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై..

పచ్చని చేలా.. తనననన..
పావడగట్టి.. తనననన
ఓయ్ పచ్చని చేలా..  పావడగట్టి..
 అ కొండమల్లెలే కొప్పునబెట్టి
వచ్చేదొరసాని.. మా వన్నెల కిన్నెరసాని  

 వచ్చేదొరసాని.. మా వన్నెల కిన్నెరసాని  

ఎల్లువొచ్చి గోదారమ్మా…

చిత్రం : దేవత (1982)
సంగీతం : చక్రవర్తి 
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..

మీగడంతా నీదేలేరా బుల్లోడా
 
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..ఆగమంటే రేగేనమ్మా  సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగమంటే రేగేనమ్మా  సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు

ఈ కళ్ళకున్న ఆకళ్ళలోనా అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ళ పంట వద్దంటే విందమ్మ నవ్వు
చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ
చేయ్యేస్తే చేమంతి బుగ్గా..చెంగావి గన్నేరు మొగ్గ
ఈడొచ్చి నీ చోటు ఈడుంది రమ్మంటే ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను కూడు..ఆకళ్ళకుంటాది కూడు.. 
గుండెల్లో చోటుంది చూడు
 
ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
 
కొంగుచాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓరయ్యో..రావయ్యో..ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..
మీగడంతా నీదేలేరా బుల్లోడా
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు

నీ కళ్ళు సోక నా తెల్ల కోక అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న నా జారు పైట పాడిందిలే గాలిపాట
 

కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు 
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళూ.. నే కోరిన మూడూ ముళ్ళు
పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ యేరు తోడూ.. ఏరెండినా ఊరు తోడు..
నీ తోడులో ఊపిరాడు..

ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లా కిల్లా పడ్డాదమ్మో

ఎన్నెలొచ్చి రెల్లూపూలే ఎండీ గిన్నేలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో..రావమ్మో..
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు..
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా..
మీగడంతా నీదేలేరా బుల్లోడా 


వేదంలా ఘోషించే గోదావరి…

చిత్రం : ఆంధ్రకేసరి (1983)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు

నమః సోమాయచ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయచ
నమశ్శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ
నమో వృక్షేభ్యోహరి కేశేభ్యో నమస్తారాయ నమశ్శంభవే చ
మయో భవే చ నమశ్శంకరాయ చ మయస్కరాయ చ
నమశ్శివాయ చ శివతరాయ చ

వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

రాజరాజ నరేంద్రుడు.. కాకతీయులు
తేజమున్న మేటి దొరలు.. రెడ్డి రాజులు
గజపతులు.. నరపతులు.. ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించె గౌతమి హోరు
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

శ్రీవాణి గిరిజాస్చిరాయ దథతో వక్షో ముఖాంగేశు
యే లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీపుంస యోగోద్భవాం
దేవేదత్రయమూర్తాయ స్త్రిపురుష సంపూజితాపస్సురైర్భూయాశుః
పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే…

ఆది కవిత నన్నయ్యా వ్రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
ఆది కవిత నన్నయ్యా వ్రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
కవిసార్వభౌములకిది ఆలవాలము
కవిసార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించె నందనవనము

వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు

వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరి
అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి 

పూసింది పూసింది పున్నాగ…

చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు (1991)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ… జతులాడ…

హహ..పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడే…… మదిపాడే……

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి అభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూలతోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసే…. విరబూసే……
పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ… జతులాడ…

పూసింది పూసింది పున్నాగ 
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగా 

దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

ప్రేమయాత్రలకు బృందావనము…
చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు
గానం : ఘంటసాల, సుశీల

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
ఆహాహా ఆహాహా హా
కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో
తీర్ధయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో
ఆహాహా ఆహాహా హా
ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో
తీర్ధయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో

చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
ఆహాహా ఆహా ఆహాహా ఆహాహా హా
చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునే ఊటీశాయగా
ఆహాహా ఆహాహా హా
సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునే ఊటీశాయగా
ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో

కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా
ఆహాహా ఆహా ఆహాహా ఆహాహా హా
కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
ఆహాహా ఆహాహాహా
పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా
తీర్ధయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ ఏలనో
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

మౌనమేలనోయి…
చిత్రం : సాగర సంగమం (1982)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
ఆఆఆఆఆఆఅ…
మౌనమేలనోయి…
మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి
మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి

ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
తారాడే హాయిలో..
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
 

పలికే పెదవి వొణికింది ఎందుకో?
వొణికే పెదవి వెనకాల ఏమిటో?
కలిసే మనసులా.. విరిసే వయసులా
కలిసే మనసులా.. విరిసే వయసులా
 
నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు..
ఏమేమో అడిగినా

మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి
 

హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగుల వలపూమడుగుల
ఇవి ఏడడుగుల వలపూమడుగుల
కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు…  
ఎంతెంతొ తెలిసిన

మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల ఆఆఆఅ వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల ఆఆఆఅ వెలిగే కన్నుల
తారాడే హాయిలో..
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి 


చిన్నారి పొన్నారి పువ్వు…
చిత్రం : నాదీ ఆడజన్మే (1965)
సంగీతం : ఆర్. సుదర్శన్
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

 

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

 
ఆహ హా..ఊహు హూ..
ల.ల.ల.ల.ల.ల.లా.లా.
ల.ల.ల.ల.ల.ల.లా.లా.

హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ
హృదయాన కదలాడు బాబూ
రేపు ఉయ్యాల జంపాలలూగూ
 

పసివాడు పలికేటి మాటా
ముత్యాల రతనాల మూటా

చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ
నిను చూసి నను చూసి నవ్వూ

 

ఆహ హా..ఊహు హూ..
ల.ల.ల.ల.ల.ల.లా.లా.
ల.ల.ల.ల.ల.ల.లా.లా.

ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా
ఒడిలోన పవళించు వేళా
నేను పాడేను ఒక జోల పాటా
 

కనుమూసి నిదురించు బాబూ
కలలందు జోగాడగలడు

చిన్నారి పొన్నారి పువ్వు

విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వూ 
నిను చూసి నను చూసి నవ్వూ 
ఆహాహ ఆహాహ ఆహా…
ఆహాహ ఆహాహ ఆహా..

పాడలేను పల్లవైనా…
చిత్రం: సింధుభైరవి (1985)
రచన: రాజశ్రీ
సంగీతం: ఇళయరాజా
గానం: చిత్ర

పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
 పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా
పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నదీ
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నదీ
ఊయలే తాళం పైరగాలే మేళం
మమతే రాగం శ్రమజీవనమే భావం
రాగమే లోకమంతా ఆ ఆ
రాగమే లోకమంతా కష్ట సుఖములే స్వరములంటా
షడ్జమ కోకిల గాన స్రవంతికి పొద్దుపొడుపే సంగతంటా
పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను

రాగానిదేముంది రసికులు మన్నిస్తే
తెలిసిని భాషలోనే తీయగా వినిపిస్తే
ఏ పాటైనా ఎద పొంగిపోదా
ఏప్రాణమైనా తనివితీరిపోదా
చెప్పేది తప్పో ఒప్పో ఓ ఓ
చెప్పేది తప్పో ఒప్పో రహస్యమేముంది విప్పి చెపితే
అహూ ఉహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం
ఆహూ ఊహూ రోకటి పాటలో లేదా మధుర సంగీతం
పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
తోచింది చెప్పాలనీ ఎదుటకొచ్చినిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా
పాడలేను పల్లవైనా భాషరాని దానను
వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగను
మ ప ద మ పాడలేను పల్లవైనా
స రి గమ ప ద మ పాడలేను పల్లవైనా
ప ద ని స ని ద మ గ స రి పాడలేను పల్లవైనా
స స రి గ స రి గ మ గ స ప ద మ
మ మ ప ద మ ప ద ని ద మ ప ద ని
పదనిసరిగ సనిదమ పదనిస
నిదపద నిదమప దమగమ పదమగ మగస
సాసస సా సస సా స సరిగమ గమగసనిద
మా మమ మా మమ మా మ పదనిస నిసనిదమగ
సస రిరి గగ మమ పప దద నిని సస
నిససస నినిదనిద
మపదని దని దదమా
గమగ సరిగమ గమపద మపదని
సరిగమ గమసనిదమగ
మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయరాదా