ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్‌ ఖరారు – 2022

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖారాదైంది. మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలను మే 6 నుంచి నిర్వహిస్తున్నందున పదో తరగతి పరీక్షల షెడ్యూల్ లో అధికారులు మార్పులు చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇదే సమయంలో ఇంటర్ పరీక్షలున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసిన పాఠశాల విద్యాశాఖ తాజాగా కొత్త షెడ్యూల్ ను ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్ ఇదే.. ఏప్రిల్ 27 – తెలుగు ఏప్రిల్ 28 – సెకండ్ లాంగ్వేజ్ ఏప్రిల్ 29 – ఇంగ్లిష్ మే 2 –…

Read More

జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు

మొత్తం ఎనిమిది రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండేలా విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌లో పనిదినాలను సర్దుబాటు చేసింది. ఈ ఏడాది కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, ఇంకా పూర్తిస్థాయిలో స్కూళ్లు తెరవలేని పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో విద్యాసంవత్సరంలో పనిదినాలు కోల్పోకుండా ఉండేందుకు విద్యాశాఖ పండగ సెలవులను కుదించాలని భావించింది. ఈనెల 13 నుంచి మూడు రోజులు పండగ దినాలు కావడంతో సెలవులు అటుఇటుగా ఆ మేరకు ప్రకటించాలనుకున్నారు. అయితే సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యం, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ సెలవు రోజులను పెంచేలా చర్యలు తీసుకుంది. 18వ తేదీ సోమవారం పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు

  కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం ప్రకటించారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.   పదో తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్‌లో ఫెయిల్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులంతా పాస్‌ అయినట్టు మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి‌ పేర్కొన్నారు. కాగా, తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.  

Read More