ఏరువాక పూర్ణిమ పండుగ
ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. వర్ష ఋతువులో వచ్చే ‘జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి’ ని తెలుగువారు ఏరువాక పూర్ణిమ గా జరుపుకుంటారు. వైశాఖ మాసం పూర్తై జ్యేష్ఠం వచ్చే సరికి వానలు పడటం మొదలౌతాయి, ఎంతలేదన్నా పౌర్ణమి లోగా చిన్న జల్లైనా కొడుతుంది. దాంతో భూమి మెత్తబడుతుంది. తొలకరి జల్లుల రాకతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలౌతాయి. …
You must be logged in to post a comment.