దేశీ వరి రకాలు వాటి ప్రాముఖ్యత

1. రక్త శాలి:ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.అత్యంత పోషక విలువలు,ఔషధ మూలికా విలువలు కలిగినది. ఆయుర్వేదలో వాతము పిత్తము కఫము నివారించును అని మరియు మూడు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ కాలము నాటిది అని చెప్పబదినది. ఈ రైస్‌ను ఎర్రసాలి,చెన్నేల్లు,రక్తాసలి అని కూడా అంటారు. ఎరుపు రకాల్లోమోస్ట్ వ్యాల్యూబుల్ రైస్. 2. కర్పూకవుని:ఈ రైసు నలుపు రంగులో ఉంటుంది.బరువు తగ్గుటకు అనువైన ఆహారముకొలెస్ట్రాల్ తగ్గుటకు, క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.ఈ రైస్‌ను యాంటీ ఏజింగ్ రైస్ అని కూడా అంటారు. 3. కుళ్లాకార్: ఈ రైసు ఎరుపు రంగులో ఉంటుంది.గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది సాధారణ ప్రసవానికి తోడ్పడుతుంది మరియు పిల్లలకు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఈ రైస్‌లో మాంగనీసు,విటమిన్ బి6,కాల్షియం, ప్రోటీన్స్ ,కార్బోహైడ్రేట్స్ ,పొటాషియం ,ఫైబర్ అధికంగా ఉంటాయి. ప్రపంచములో అత్యంత ముఖ్యమైన మానవ…

Read More

దేశీ వరి విత్తనాలు రకాలు.

1)రక్తశాలి >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు.2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>110 నుండి115 రోజులు.3) పుంగార్ >ఎరుపు >లావురకం> పంటకాలం>95 నుండి115 రోజులు.4) కర్పూకౌవుని >నలుపు> పొడవురకము> పంటకాలం>110 నుండి120 రోజులు.5) మైసూర్ మల్లిగ >తెలుపు>సన్నరకము> పంటకాలం>110 నుంచి 120 రోజులు.6) చింతలూరు సన్నాలు > తెలుపు> సన్నరకం > పంటకాలం>110 నుండి 120 రోజులు.7) కుజీపటాలీయా >తెలుపు>సన్నరకము> పంటకాలం>120 నుండి 125రోజులు.8) ఇంద్రాణి >తెలుపు>సన్నరకం>పంటకాలం> 120 నుండి 125 రోజులు.9) నవార >ఎరుపు>మధ్యరకం>పంటకాలం> 125 నుండి 130 రోజులు.10) రామ్ జీరా > తెలుపు> పొట్టిరకము> పంటకాలం 120 నుండి130 రోజులు.11) ఘని >తెలుపు>పొట్టిరకం>పంటకాలం> 125 నుండి 130 రోజులు.12) సిద్ధ సన్నాలు >తెలుపు>సన్నరకం> పంటకాలం>130 నుండి 135రోజులు.13) గురుమట్టియా > తెలుపు> లావురకం> పంటకాలం130 నుండి135రోజులు.14) రత్నచోడి > తెలుపు>సన్నరకం>…

Read More

హైడ్రోపోనిక్ వ్యవసాయం

హైడ్రోపోనిక్ వ్యవసాయం అంటే నీటిని ఉపయోగించి మట్టి లేకుండా వ్యవసాయం చేయడం. మట్టి ద్వారా అందే పోషకాలను నీటిలో కలిపి మొక్కలకు అందిస్తారు. తక్కువ స్థలంలో ఎక్కువ పంటను పండించవచ్చు.పాలిహౌజ్ ల కన్నా అధునాతన పద్దతిలో ఈ విధానంలో కొన్ని రకాల పూలు,పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. ఆహారోత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. చౌడు నేలలు, వ్యవసాయానికి అనుకూలంగా లేని ప్రదేశాలలో ఈ విధానం అవలంబించవచ్చు.తక్కువ నీరు, పోషకాలను ఉపయోగించి అధిక దిగుబడి సాధించవచ్చు. మొక్క స్థిరంగా ఉండడానికి మట్టికి బదులు జడపదార్థం ఉపయోగిస్తారు. పంట రకాన్ని బట్టి రాక్ పూల్, పెర్లైట్, వెర్మికులైట్, ఇసుకలను జడపదార్థంగా ఉపయోగిస్తారు. గాలి , వెలుతురు పంట రకాన్ని బట్టి తగిన మోతాదులో కృత్రిమంగా అందిస్తారు. లాభాలు: 1.నీటి వినియోగం తక్కువ. 2.తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ పంట దిగుబడి. 3.నీటి…

Read More

ఏరువాక పూర్ణిమ పండుగ

ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. వర్ష ఋతువులో వచ్చే ‘జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి’ ని తెలుగువారు ఏరువాక పూర్ణిమ గా జరుపుకుంటారు. వైశాఖ మాసం పూర్తై జ్యేష్ఠం వచ్చే సరికి వానలు పడటం మొదలౌతాయి, ఎంతలేదన్నా పౌర్ణమి లోగా చిన్న జల్లైనా కొడుతుంది. దాంతో భూమి మెత్తబడుతుంది. తొలకరి జల్లుల రాకతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలౌతాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠ పూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు. ఈ రోజున రైతులు వ్యవసాయ పనిముట్లన్నింటినీ శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ అద్ది పూజ చేస్తారు. అలాగే ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. ఆ…

Read More