సుమతీ శతకం

శ్రీ రాముని దయచేతనునారూఢిగ సకల జనులు నౌరాయనగాఁధారాళమైన నీతులునోరూరగఁ జవులుబుట్ట నుడివెద సుమతీ!సుమతీశతక కారుడు “సుమతీ” అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్తానని తెలిపాడు. లోకంలో నీతి మార్గాన్ని ఆచరించి బోధించిన శ్రీరాముని అనుగ్రహం పొందినవాడనై, లోకులు మెచ్చుకొనేలా మరలా మరలా చదువాలని ఆశ కలిగేలా వచిస్తున్నాను.……………………………………………………………………………………….అక్కరకు రాని చుట్టము,మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁదానెక్కిన బాఱని గుఱ్ఱము,గ్రక్కున విడువంగవలయుఁ గదరా! సుమతీ!సమయానికి సహాయం చేయని చుట్టాన్ని, నమస్కరించినా వరాలీయని దైవాన్ని, యుద్ధంలో తానెక్కగా పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడవాలి.……………………………………………………………………………………….అడిగిన జీతం బియ్యనిమిడిమేలపు దొరనుఁ గొల్చి మిడుకుట కంటెన్వడిగల యెద్దులఁ గట్టుకమడిదున్నక బ్రతకవచ్చు మహిలో సుమతీ!అడిగినా జీతమీయని ప్రభువును సేవించి కష్టపడటం కంటే, వడిగల యెద్దులను కట్టుకొని పొలం దున్నుకొని జీవించటమే మేలు.……………………………………………………………………………………….అడియాస కొలువుఁ గొలువకు,గుడిమణియముఁ సేయఁబోకు, కుజనుల తోడన్విడువక కూరిమి సేయకుమడవినిఁ దో డరయ…

Read More