Category: పుస్తకాలు, కథలు
Potana Telugu Bhagavatham
బమ్మెర పోతన
Bhagavatham Part-I ( Read Here)
Bhagavatham Part-II ( Read Here)
Bhagavatham Part-III ( Read Here)
Bhagavatham Part-IV ( Read Here)
రామాయణం
(In the foot steps of Shri Ram)
శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్య నుంచి బయలుదేరి మొదట అక్కడికి *20కి. మీ* దూరంలోని తమసా నదీ తటాన ఉన్న *మాండా* (Mandah) అనే ప్రాంతాన్ని చేరుకున్నారు.
సంపూర్ణ రామాయణం
తెనాలి రామక్రిష్ణ కథలు

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు
![]() |
“ఇప్పుడేం చేధ్ధాం ?” మిగిలిన ఇద్దరినీ అడిగాడు ఒకదొంగ.
“అసలు నిజంగా వాళ్ళు పెట్టె పడేసారంటావా?” తన సందేహాన్ని వెలిబుచ్చాడు మరొక దొంగ
“ఒరేయ్! మీవన్నీ పిచ్చి అనుమానాలు. వాళ్ళు నగలు ఉన్న పెట్టెను తీసుకుని వెళ్ళి బావిలో పడేయడం మనం చూసాం కదా!
“అవును” అని మిగిలిన ఇద్దరూ అంగీకరించారు.
“మరి అలా అయితే తప్పకుండా ఈ బావిలోనే ఆ నగల పెట్టె ఉండి ఉంటుంది కదా!”
“నిజమే” అన్నారు మిగిలిన ఇద్దరు దొంగలు.
“అలా అయితే ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే బదులు వెతుకుదాం. తప్పకుండా మనకు నగలపెట్టి దొరుకుతుంది. మనం ఇలాగే కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఉంటే తెల్లారిపోతుంది. మనందొరికిపోతాం..” అన్నాడు.
“సరే..ఇప్పుడేం చేద్దాం” అడిగాడు ఒక దొంగ.
“పెట్టె చాలా బరువుగా ఉండటం వలన బావి అడుగుకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఇంక బావిలోపల ఉండి చేసేదేం లేదు. పైకి వెళ్ళి నీళ్ళన్నీ తోడి పోద్దాం. నీళ్ళు అన్నీ తోడిపోస్తే పెట్టె ఎక్కడ ఉందో మనకు కనిపిస్తున్నది. అప్పుడు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది” అని సలహా ఇచ్చాడు ఒకదొంగ.
మిగిలిన దొంగలు ఇద్దరూ అందుకు ఒప్పుకున్నారు.
ముగ్గురు దొంగలు బావిలోంచి పైకి వచ్చేసి నీళ్ళు తోడటం మొదలు పెట్టారు. వాళ్ళలా నీళ్ళు తోడి పోస్తుంటే తెనాలి రామలింగడు, ఆయన కొడుకు ఇద్దరూ కలిసి చాటుగా ఉండి మొక్కలకు పాదులు చేసారు.
ఈవిధంగా దొంగలు చాలాసేపు నీళ్ళు తోడుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళ శ్రమఫలించింది. బావిలో అట్టడుగున ఉన్న నగలపెట్టె దొంగలకు కంపించింది. దొంగలలో ఒకడు బావిలో దిగి ఆ నగలపెట్టెకు తాడు కట్టాడు. మిగిలిన దొంగలు ఇద్దరూ పెట్టెను జాగ్రత్తగా పైకి లాగారు. వాళ్ళు నగలపెట్టెను బావిలోంచి పైకి తీయాలన్న ఆ ఖంగారులో, ఆ హడావిడిలో తెల్లారిపోయిన సంగతిని కూడా గమనించలేదు. ఈ లోగా తెనాలి రామలింగడు భటులను పిలిపించి దొంగలను పట్టుకోమని చెప్పాడు. అంతే! వాళ్ళు దొంగలను పట్టుకున్నారు.
చూసారా పిల్లలూ! తెనాలి రామలింగడు ఎంత తెలివి కలవాడో…!?
ఎప్పుడైతే దొంగలు తన ఇంటిని దోచుకోవాలని పథకం వేసుకుంటున్నారని రామలింగడికి అర్థం అయ్యిందో అప్పుడే రామలింగడు ఓ పథకం వేసుకున్నాడు. ఎలాగూ తన తోటకు మనుషులను పెట్టి నీళ్ళు పెట్టించాలనుకున్నాడు కదా! ఆ పనేదో ఈ దొంగలచేతనే చేయిస్తే సరిపోతుంది అని రామలింగడికి అంపించింది.
వెంటనే లోపలికి వెళ్ళి…కొడుకుతో నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి బావిలో పడేద్దాం. రాజ్యంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది. ఆ బెడద తగ్గాక బావిలోంచి నగల పెట్టెను తీసుకుందాం అని చెప్పాడు.
నిజంగానే దొంగలు ఆ మాటలు విన్నారు. తెనాలి రామలింగడు ఆయన కొడుకు కలిసి నగల పెట్టెను బావిలో పడేయడం చూసారు. ఆ నగల పెట్టెలో నగలు పెట్టారని దొంగలు అనుకున్నారు. కానీ తెనాలి రామలింగడు ఆ నగల పెట్టెలో దొంగలు అనుకున్నట్టుగా నగలు పెట్టలేదు. చిన్న చిన్న రాళ్ళు పెట్టాడు. కానీ దొంగలు మాత్రం పెట్టెలో నగలు ఉన్నాయని అనుకున్నారు. అందుకే బావిలో దిగి ముందుగా బావిని శుభ్రంచేసారు.
బావిలో ఉన్న నీళ్ళని తోడిపోసారు. ఎంతో కష్టపడి పెట్టెను పైకి తీసారు. ఆ సమయానికల్లా తెల్లారిపోయింది. భటులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. ఇదీ జరిగింది…
ఈ సంగతంతా తెనాలి రామలింగడు రాజుగారికి చెప్పాడు.
రాజుగారు ఇదంతా వినగానే ఒక్కసారిగా పెద్దపెట్టున నవ్వేసాడు. “నిజంగా నీ తెలివి తేటలు అమోఘం. నీ ఇంటికి దొంగతనానికి వచ్చిన వాళ్ళతో నువ్వు చెట్లకి నీళ్ళు పెట్టించావా?” అంటూ నవ్వాడు.
తెనాలి రామలింగడు “అవును మహారాజా!” అన్నాడు. దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్న మాట నిజమే. అలా అని అందరూ దొంగతనాలు చేస్తామంటే ఎలా? వాళ్ళకి గుణపాఠం చెప్పేందుకే ఆ విధంగా చేసాను.” అని చెప్పాడు.
వేదములు
-
ఋగ్వేదము – దేవతల గుణగణాలను స్తుతిస్తుoది.
-
యజుర్వేదము – యజ్నములు వాటికి స్తoభoధిoచిన కర్మకాండలను ఫలితాలను తెలియజేస్తుంది.
-
సామవేదము – సంగీత ప్రధానం.
-
అధర్వణ వేదము – బ్రహ్మజ్నానాన్ని, ఔషధీ విశేషాలను, యంత్ర పరికరాల వివరాలను తెలుపుతుంది.
“వేధో రక్షితి రక్షిత: “
మహాభారతం (Mahabharatam)
Mahabharatam telugu e-books
Mahabharatham_vol_2_adi_parvam_
Mahabharatham vol 3 sabha parvam
Mahabharatham vol4 aranya parvam
Mahabharatham vol5 aranya parvam2
Mahabharatham vol6 virata parvam
Mahabharatham vol7 udyoga parvam
Mahabharatham vol8 bheeshma parvam
Mahabharatham vol8 Dronoa parvam
Mahabharatham vol10 karna parvam
Mahabharatham vol11 shalya sowptika stri parvam
Mahabharatham vol12 santi parvam1
Mahabharatham vol13 santi parvam2
Mahabharatham vol14 anushasanika parvam
Mahabharatham vol15 aswamedha asramavasa mousala mahaprasthanika parvam
‘పద్మవ్యూహం’ రహస్యం ఏంటి?

రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకంలోని సారాంశం ఏంటో మీరు చెప్పగలరా?
- మీరు గొప్ప ధనవంతులు అందరి కన్నా ఎత్తులో ఉండాలి అనుకుంటే మీరు రిచ్ డాడ్, పూర్ డాడ్ తప్పక చదవాలి. దీనివల్ల మీకు మార్కెట్లను గురించి, డబ్బు గురించి వ్యవహారిక జ్ఞానం తప్పక పెరుగుతుంది. ఆ విధంగా ఆర్థికంగా భవిష్యత్తులో మీరు బాగుపడగలుగుతరు.
- వ్యక్తిగతంగా ధనం సంపాదించి, ఆ ధనాన్ని నిలబెట్టుకోవడం గురించిన రహస్యాలు, తెలివితేటలు కావాలనుకుంటే, ఈ పుస్తకం చదవండి!
- రిచ్ డాడ్ పూర్ డాడ్ మామూలుగా డబ్బు గురించి మీరు చదివే లాంటి పుస్తకం కాదు… రిచ్ డాడ్ పూర్ డాడ్ చదవడానికి సులభ శైలిలో ఉంటుంది. ఇందులో కీలకమైన సందేశాలు ఉన్నాయి, ధనవంతులు కావాలనుకుంటే ఏకాగ్రత ధైర్యం ఉండాలి అంటాడు రాబర్ట్ కియోసాకి.
- రిచ్ డాడ్ పూర్ డాడ్ త్వరగా ధనవంతులు ఎలా అవగలమో చెప్పదు. మీరు మీ ఆర్ధిక వ్యవహారాలు బాధ్యత ఎలా వహించలో డబ్బు మీద అధికారాన్ని సాధించి మీ ఆస్తిపస్తుల్ని ఎలా మెరుగుపరుచుకోవాలో చెబుతోంది. మీరు ఆర్థిక ప్రతిభని చైతన్యవంతం చేయాలనుకుంటే దీన్ని చదవండి.
- భవిష్యత్తులో ధనవంతులు అనుకుంటున్న వారందరూ రిచ్ డాడ్ పూర్ డాడ్ తప్పక చదవాల్సిన పుస్తకం.