పక్షులు కరెంటు తీగల మీద ఎలా నిలబడగలుగుతాయి?

ఈ సమాధానం చెప్పే ముందు అసలు విద్యుత్తు ఏ సందర్భాలలో ప్రవహిస్తుందో తెలుసుకున్దాం. ఏమైనా రెండు వేర్వేరు బిందువుల(points) యొక్క విద్యుత్ విభావాలలో ( potentials) వ్యత్యాసం ఉన్నప్పుడు , వాటి మధ్యలో ఒక వాహకాన్ని పెడితే విద్యుత్ ప్రవహిస్తుంది. చిన్న రోజువారీ ఉదాహరణతో చెప్తాను, : విభావాన్ని “వోల్టేజ్(voltage)” అని కూడా అంటూ ఉంటారు.మన ఇంటికి విద్యుత్ తెచ్చే తీగలను ఫేౙు , న్యూట్రల్ అని అనడం వినే ఉంటాం. ఇందులో ఫేౙు తీగకు కొంత మొత్తంలో విభావం ఉంటుంది , న్యూట్రల్ తీగకు సున్నా విభావం ఉంటుంది. కావున ఈ రెండు తీగల విభావాల మధ్య కొంత వ్యత్యాసం ఉంది. ఇందు చేతనే మనం ఏదైనా విద్యుత్ పరికరాన్ని వీటిమధ్య పెట్టినప్పుడు దాని గుండా విద్యుత్ ప్రవహించి , ఆ పరికరం పని చేస్తుంది. ఇప్పుడు విద్యుత్…

Read More