passion fruit – తపన ఫలం

ఇవి జామకాయల కంటే చిన్నసైజులో ఉండే… పర్పుల్, ఎరుపు రంగులో కనిపించే… తియ్యటి, పుల్లటి పండ్లు. నిండా పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా వేడి ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. ప్రధానంగా వియత్నాం ప్రజలు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ప్యాషన్ పండ్ల తోటల్లోకి వెళ్లామంటే… తియ్యటి వాసన వస్తుంది. అందువల్ల ఈ పండ్లపై పరిశోధనలు చేశారు. ఇవి ఎంతో మంచివని తేలింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ (మన బాడీలో విష వ్యర్థాల్ని తొలగించే గుణాలు), విటమిన్ A, విటమిన్ C, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ పండ్లను మందుల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే ఇవి తింటే రిలాక్స్ ఫీల్ కలిగిస్తున్నాయి. ఒత్తిడి దూరం చేస్తున్నాయి. మంచిగా నిద్ర పట్టేలా చేయగలుగుతున్నాయి. ఇవి కంటిచూపును మెరుగుపరుస్తున్నాయి. రేచీకటికి చెక్ పెడతాయి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకానికి…

Read More

తేగలు & బుర్రగుంజు

తాటి పండ్లను భూమిలో పాతర వేస్తారు ల. (తక్కువ లోతు గుంటలో లేదా భూమి మీది తాటి పండ్ల పరిచి మీద మట్టి కప్పుతారు). ఒక్కో తాటి పండులో సాధారణంగా మూడు బుర్రలు ఉంటాయి, ఒక్కో బుర్ర ఒక్కో తాటి చెట్టు విత్తనం. కొన్ని రోజులకు తాటి పండ్ల లోని ముట్ల/బుర్రల నుంచి మొలకలు వచ్చి వేరు భూమిలోకి దిగుతుంది,ఈ వేరునే మనం తేగ అని పిలుస్తాం. పచ్చి తేగలను తినలేం, వాటిని ఉడక బెట్టటమో లేదా నిప్పులలో కాల్చి తినాలి. ఉడకబెట్టిన తేగ తొందరగా పాడవుతుంది, తేగ మీద ఒక బంక లాంటి పదార్థం ఏర్పడుతుంది. అందువల్ల ఉడక బెట్టిన తీగలను వాటి పైన ఉండే చర్మాన్ని వలిచి ఆరబెట్టాలి. తేగలను కుండలో ఉంచి, తేగలపై కొంచెం నీళ్లు జిలకరిచి గడ్డి చుట్టతో కుండా మూతిని…

Read More

తాటి తాండ్ర

తాటి కాయలు కోయకుండా అలానే చెట్టుకు వదిలేస్తే పండిపోతాయి. బాగా పండిన తాటి పండు ఈ పండ్ల పైన కండను కోసి ఉడకబెడితే తీయ్యని పీచుతో కూడిన తాటి తాండ్ర వస్తుంది.

Read More

తాటి ముంజలు

తాటి చెట్టుకు తాటి కాయలు కాస్తాయి. ఈ తాటికాయలు లేతగా ఉన్నపుడు కొస్తే మనకు తాటి ముంజలు లభిస్తాయి. పైన చిత్రంలోలా ఒక్కో తాటి కాయలో మూడు ముంజలు ఉంటాయి, ఈ ముంజల పైన తెల్లని మందమైన పోర ఉంటుంది , ఈ పొర వగరుగా ఉంటుంది, ముంజను ఈ పొరతో పాటు గా తింటే బాగా అరుగుతుంది అనే చెప్పే వాళ్ళు. ఈ ముంజలు ముదిరితే గట్టిగా తయారయి చివరికి గట్టి ముట్టెలుగా తయారవుతాయి. ఈ ముంజలు లేతగా ఉన్నపుడు తీయగా ఉంటాయి, ముదిరే కొద్దీ రుచి తగ్గి పోతాయి. ముదిరిన ముంజలు తింటే కడుపు నొప్పి వస్తుంది అని తిననిచ్చే వారు కాదు. తాటి ముంజలు తిన్న తరువాత పిల్లలు రెండుచక్రాల బండి చేసుకొని ఆడుకొనే వాళ్ళు.

Read More

కొబ్బరి పువ్వు

బాగా పండిన కొబ్బరికాయకు తేమ తగిలినప్పుడు కొబ్బరికాయ నుండి మొలక వస్తుంది కొబ్బరికాయ కన్నుల నుంచి అన్ని విత్తనాల లాగానే. ఆలా కొబ్బరికాయలో మొలక వచ్చినపుడు కొబ్బరి కాయలోపల పువ్వులాంటి తెల్లని పదార్థం కొబ్బరికాయ లోపల పెరుగు తుంది, దీన్నే కొబ్బరి పువ్వు అంటారు. దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే అదృష్టం అని చెబుతారు.

Read More

డ్రాగన్ ఫ్రూట్

ఇది ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందిన చెట్టు. మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది. లాటిన్ అమెరికాలో ఈ పండును ‘పితాయ’ లేదా ‘పితాహాయ’ అని కూడా పిలుస్తారు. లాటిన్ అమెరికానుంచీ వచ్చిన ఈ పండ్లను ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్‌లాండ్, వియత్నాంలలో చాలాకాలంగా పెంచుతున్నారు. ఈ పండ్లలో కూడా కివీ పండ్ల మాదిరిగానే చిన్న చిన్న నల్లని గింజలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది. ఈ పండ్ల ఎగుమతిలో కూడా వియత్నాందే పైచేయి. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ వలసదారులతో పాటు ఈ పండు వియత్నాంలోకి ప్రవేశించింది. ఆ దేశంలో దీన్ని ‘థాన్ లాంగ్’ అని పిలుస్తారు. అంటే డ్రాగన్ కళ్లు అని అర్థం. చైనా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, శ్రీలంకలలో కూడా ఈ పండ్లను విరివిగా పండిస్తున్నారు. భారతదేశంలో 1990లనుంచీ వీటి పెంపకం…

Read More

రాంబుటాన్ (rambutan)

పేరు వెరైటీ గా ఉంది కదా? ఇది చూడటానికి ఉమ్మెత్తకాయ లాగా ఉంటుంది.ఇది జపాన్, మలేషియా, ఫిలిపిన్స్, తైవాన్ దేశాలలో పండుతుంది. పశ్చిమగోదావరి జిల్లా లోని వెంకట్రామన్న గూడెం లో వైస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం లో ఈ పండు మొక్కల సాగు కు రీసెర్చ్ చేస్తున్నారు. ఇది ఎర్రపు, పసుపు రెండు రంగుల్లో దొరుకుతుంది. పులుపు, తీపి కలిపి రుచి ఉంటుంది. పై తోలు తీసేసి తింటారు. పండు లోపల తెల్లగా ముంజు కాయల లాగా ఉండి ఒక పండు కి ఒక గింజ చప్పున ఉంటాయి.

Read More

పెర్సిమోన్ (persimmon fruit)

ఇది చూడటానికి పెద్ద సైజ్ టొమాటో లాగా ఉంటుంది. దీని రుచి ఆపిల్ రుచి ని పోలి తీయగా ఉంటుంది. లోపల గింజ ఏమి ఉండదు. పండు లోపల జెల్లీ లాంటి టెక్చర్ గా ఉంటుంది. పండు పై తోలు తీసేసి, లేదా అలానే తినేయచ్చు.ఈత కాయల సువాసన కలిగి ఉంటుంది. తెలుగు లో తున్నిక్కాయ అంటారని విన్నాను.

Read More