లెక్కలు నేర్చుకునేందుకు…… ఉచిత వెబ్సైట్లు

అన్ని సబ్జెక్టుల్లో నాకు మంచి మార్కులు వస్తాయి. ఒక్క లెక్కల వల్లే ర్యాంకును పోగొట్టుకుంటున్నాను ఆల్జీబ్రా గుండె గాబ్రా అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థమవుతోంది. టెన్త్ అయిపోయాక నేనిక మ్యాథ్స్ నే తీసుకోను. ఇలా తరగతి పెరిగేకొద్దీ లెక్కల విషయంలో పిల్లలకు ఉండే భయమూ, కంగారూ అంతాఇంతా కాదు. ఏ వయసుకా కష్టం అన్నట్లుగా… చిన్న పిల్లలకు అంకెలూ, కూడికలూ, తీసివేతలూ నేర్చుకోవడం సమస్య అయితే… క్లాసులు పెరిగేకొద్దీ జామెట్రీ, ఆల్జీబ్రా, రియల్నంబర్స్, ట్రిగ్నామెట్రీ… వంటి పాఠాలను నేర్చుకోవడానికి పిల్లలు తలకిందులవుతుంటారు. అలాంటివన్నీ వీలైనంత సులభంగా అర్థమయ్యేలా నేర్పించేందుకే కొన్ని వెబ్సైట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మ్యాథ్ ఈజ్ ఫన్, ఫొటో మ్యాథ్, ఖాన్ అకాడమీ, డౌట్ నట్, మాటిఫిక్ వంటివి కొన్ని. ఈ రోజుల్లో ఒక్క మ్యాథ్స్ అనే కాదు, సైన్స్, సోషల్…

Read More