passion fruit – తపన ఫలం

Nutritional Value and Health Benefits of Passion Fruit | HerbBreak

ఇవి జామకాయల కంటే చిన్నసైజులో ఉండే… పర్పుల్, ఎరుపు రంగులో కనిపించే… తియ్యటి, పుల్లటి పండ్లు. నిండా పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా వేడి ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. ప్రధానంగా వియత్నాం ప్రజలు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ప్యాషన్ పండ్ల తోటల్లోకి వెళ్లామంటే… తియ్యటి వాసన వస్తుంది. అందువల్ల ఈ పండ్లపై పరిశోధనలు చేశారు. ఇవి ఎంతో మంచివని తేలింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ (మన బాడీలో విష వ్యర్థాల్ని తొలగించే గుణాలు), విటమిన్ A, విటమిన్ C, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ పండ్లను మందుల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే ఇవి తింటే రిలాక్స్ ఫీల్ కలిగిస్తున్నాయి. ఒత్తిడి దూరం చేస్తున్నాయి. మంచిగా నిద్ర పట్టేలా చేయగలుగుతున్నాయి.

ఇవి కంటిచూపును మెరుగుపరుస్తున్నాయి. రేచీకటికి చెక్ పెడతాయి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకానికి చెక్ పెడుతుంది. ఈ పండ్లలో ఐరన్ ఎక్కువ. అందువల్ల ఇవి మన రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతాయి. వీటిలోని కాపర్, పొటాషియం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. పొటాషియం, సోడియం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. మన ఎముకలు బలంగా ఉండేందుకు కూడా ఈ పండ్లు సహకరిస్తాయి.

భోజనాల వేళ పాటించాల్సిన కొన్ని నియమాలు

1.భోజనం చేసేవేళ మాట్లాడద్దు- భోజనము ఒంటపట్టదు,

2. భోజనం చేస్తూ ఒళ్ళు విరుచుకోకు – డిక్క పడుతుంది, ఊపిరాడదు, ఉక్కిరిబిక్కిరి అవుతావు, (ఇలా అయితే ముక్కు నించీ ఊపిరి తిత్తులదాక అవస్థ పడాల్సి వస్తుంది.)

3.తినేదాని మీద, నమిలి మింగడం మీద శ్రద్ధ పెట్టి తినకపోతే ఒంటపట్టదు,

4. కోపంగా ఎవరినీ తిట్టుకుంటూ తినకు- ఒంటపట్టదు,

5. ముందు మంచినీళ్లు పెట్టి తరువాత భోజనం వడ్డించాలి లేకపోతే ఎక్కిళ్ళు వచ్చినా, కారం -ఘాటు ఎక్కువయినా ఇబ్బంది పడాలి,

6.భోజనం లో స్వీట్, లేదా పండు తప్పక0డా ఉండాలి.

చదువు – చిట్కాలు

చదివేటపుడు ఇంట్లో మామూలుగా ఉండే కంటే ఒక ఆగరుబత్తి, లేదా ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటే ప్రదేశం ఆహ్లాదం గా మారుతుంది, మీకు ఆ వాసన వచ్చేటప్పడు చదవాలి అనే ఉత్సాహం వస్తుంది

వీలైనంత వరకి కిటికీ పక్కన కూర్చొని చదవడం మంచిది

పక్కనే ఒక వాటర్ బాటిల్ పెట్టుకుని గంట గంట కు నీళ్ళు తగుతుంటే మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి చదివేది వంట పడుతుంది.

చదవాల్సిన విషయాలను కూడా ముందుగా divide చేసుకుని టాపిక్ వైస్ చదివితే మంచిది.

వన్ day బాటింగ్ కాకుండా రోజుకి కొంత కొంత మొదటినుండి చదవడం మంచిది.

చదివినదాన్ని ప్రతిరోజు ఒకసారి రివైస్ చేసుకుంటే అన్నీ విషయాలు గుర్తుంటాయి.

గంట గంటకు ఒక 5 నిముషాలు విశ్రాంతి ఇవ్వండి.

ఆ టైమ్ లో చెస్ కానీ, సుడోకు కానీ ఏదైనా పజెల్ లాంటిది సాల్వ్ చేయండి .

మరీ చదివేందుకు ఆసక్తి తగ్గితే ఒక 30 నిముషాలు అలా బయట నడిచి మళ్ళీ మొదలుపెట్టండి.

ఏకాగ్రత

ఏకాగ్రత పెంచుకోవడం అందరికి, ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. అందుకోసం కొన్ని పద్ధతులు పాటించవచ్చు:

మాములుగా అందరూ కంటితో చూస్తూ చదువుతారు. ఒకటి కంటే ఎక్కువ ఇంద్రియాల ప్రమేయం చదివే ప్రక్రియలో మనం భాగం చేయగలిగితే ఏకాగ్రత మెరుగవుతుంది. 1) పైకి చదవడం- చదువుతున్నది చెప్పడమే కాకుండా వింటాం కూడా. 2) చదివేది పుస్తకంలో క్లుప్తంగా రాయడం. 3) ఇప్పుడు చాలా రకాలైన పుస్తకాలు, పిడిఎఫ్ లు చదివి వినిపించే ఆప్స్ ఉన్నాయి. కుదిరితే ఇలా వింటూ, చూస్తూ, ఒక నోటు పుస్తకంలో ముఖ్యమైన వాటిని రాసుకుంటూ చదివితే ఏకాగ్రత కోల్పోవడం తగ్గుతుంది.

మన ఏకాగ్రతకు భంగం కలిగించే వస్తువులు (సెల్ ఫోను), వ్యక్తులను చదువుతున్నప్పుడు దూరం పెట్టాలి.

వీలయినంత వరకు చదవడానికి ఒక ప్రదేశం ( లైబ్రరీ, ఇంటి లో ఒక గది) నిర్ణయించుకుని అక్కడే ప్రతి రోజు చదివితే, మన బుర్రలో అది స్థిరపడి, ఆ ప్రదేశానికి వెళ్లిన వెంటనే వేరే ఆలోచనలు తకువవుతాయి. కొంతమంది ఎక్కువ సేపు ఒక చోట కూర్చోలేరు. అలాంటివారు 3–4 చోట్ల మధ్య మారుతూ మెల్లగా అలవాటు చేసుకోవచ్చు.

చదివే వ్యాసాలను ఫ్లో- చార్ట్స్, డైయాగ్రామ్స్ గా నోటు పుస్తకాలలో రాసుకుంటే బాగా గుర్తుంటాయి.

పైన పేర్కొన్న పద్దతులు చాలా చిన్న విషయాలు అనిపించినా ఇవి పాటించడం వలన ఏకాగ్రత మెరుగుపరచుకోవచ్చు.

ఇక విద్యార్థులు గుర్తుంచుకోవలసిన విషయం మానవులలో సగటు Attention Span (ఒక విషయంపై దృష్టి నిలప గలిగే సమయం) ఇరవై నిమిషాలు. ఒక అధ్యయనం ప్రకారం ‘A’ students కు ‘C’students కు ఉన్న తేడా ఏకాగ్రత కాదు, ఏదైనా distractions (పరధ్యానం ) వచ్చినా ‘A’students తేరుకుని, తిరిగి చదవడం ప్రారంభిస్తే, C students మాత్రం చదివే ప్రయత్నం విరమించారు.చాలా మంది పాఠశాలలో ఒక మోస్తరు విద్యార్థులుగా ఉన్నకూడా తర్వాత మెరుగవ్వడానికి కారణం ఇదే కావచ్చు. చిన్నప్పుడు చదువు ప్రముఖ్యత తెలియక ఏవైనా distractions కి లొంగిపోయి వెనుకబడిన, తరువాత కొంత వయసు వచ్చాక వాటిని ఎలా జయించాలో నేర్చుకుంటారు.

మానసిక ఒత్తిడి ని దూరం చేసుకోడానికి ధ్యానం, యోగా వంటివి ప్రయతించవచ్చు. మరీ ఎక్కువ ఒత్తిడికి లోనయ్యేవారు నిపుణులను సంప్రదించడం మంచిది.

ఉడుత

ఉడుత రోడెంట్ అనే జాతికి చెందింది. ఈ రోడెంట్ లలో ఉడుతల ను సియురిడే(family Sciuridae) కుటుంబం లో చేర్చారు.వీటికుండే కుచ్చు లాంటి తోక ఇందులోని సభ్యుల ప్రధాన లక్షణం.ఇంకా ఉడుతల లో నేల మీదవి,ఎగిరేవి, ప్రయరి డాగ్,చిప్మంక్ ,మార్మట్ ఇలా బోలెడు రకాలు ఉన్నాయి.

మళ్ళీ వీటిలో మన దేశం లో ఉండేవి ఇండియన్ పాం స్క్విరాల్(Funambulus palmarum) ఇది దక్షిణ భారతం లో, శ్రీలంక లో ఉంటుంది.దీనినే మూడు చారల ఉడుత (three-striped palm squirrel).ఇది ఉత్తర భారత దేశం లో ఐదు చారల ఉడుత ( (Funambulus pennantii) కనిపిస్తుంది

ఇది అన్ని రంగుల్లో ,చారలు లేకుండా ప్రపంచమంతా కనిపించినా, మన దేశం లో చారలతోనే కనిపిస్తుంది

ఉడుతలు ఇయోసిన్ యుగం అంటే 56 నుంచి 34 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి.అంటే ఒక రకంగా మనకంటే పురాతన మైనవి.వీటి ప్రత్యేకతలేమంటే,ఇవి చాలా మనిషికి దగ్గరగా పెరగ గలవు.ఒక రకంగా మనుషుల ఉనికి కావాలి వీటికి.కొంతమంది వీటిని ఇష్టపడి పెంచుతారు.పార్కుల్లో,ఇతర తోటల్లో వీటి ఉనికి,సంచారం అందంగా ఉంటుంది అంటారు.ఇంకొందరు వీటిని చీడ లాగ భావిస్తారు.వీటికుండే తెలుసుకోవాలనే లక్షణం వల్ల ,కోరికే గుణం వల్ల వైర్లు,ఇంటి పరికరాలు,అన్నిటిని పాడు చేస్తాయి. అందుకని వాటికి ట్రాప్ లు అమర్చి చంపడమో,దూరంగా వదిలేయ్యడమో చేస్తారు. చాలా సంస్కృతులలో వీటికి కొంత స్థానం ఉంది.నార్స్ పురాణాల్లో “రాటోటోస్కర్” అని ఓడిన్ తాలూకు ఒక అనుయాయి అంటారు.ఇంకొన్ని ఆదిమ సమాజాల్లో టోటెమ్ లాగా,గొప్ప శక్తులుండే ఆత్మ లాగ కుడా వర్ణిస్తారు.

నాణేల దిగువన ఉన్న చిహ్నాలు

ఈ చిహ్నాలను టంకశాల గుర్తులు అని అంటారు. ఈ గుర్తు ని బట్టి ఇది ఏ ప్రాంతంలో ముద్రించబడిందన్నది తెలుసుకోవచ్చు.

భారతదేశం టంకశాల:

ఇండియాలో నాలుగు చోట్ల కాయిన్స్ ని ముద్రిస్తారు.

1. బాంబే

ఇష్యూ చేసిన సంవత్సరం కింద మీకు వజ్రం గుర్తు కనిపిస్తే అది బాంబేలో ముద్రించారని అర్థం

2. కోలకతా

ఇష్యూ చేసిన సంవత్సరం కింద మీకు ఏ గుర్తు కనిపించకపోతే అప్పుడు అది కోల్‌కతలో ముద్రించారు అని అర్థం

3.హైదరాబాద్

ఇష్యూ చేసిన సంవత్సరం కింద మీకు స్టార్ గుర్తు కనిపించినట్లయితే అప్పుడు అది హైదరాబాద్‌లో ముద్రించారు అని అర్థం

4.నోయిడా

ఇష్యూ చేసిన సంవత్సరం కింద మీకు చుక్క గుర్తు కనిపించినట్లయితే అప్పుడు అది నోయిడాలో ముద్రించారు అని అర్థం

విదేశీ టంకశాల:

భారతీయ నాణేలను విదేశీ మింట్లు ముద్రించిన సందర్భాలు ఉన్నాయి.

గతంలో (80లు, 90లలో) భారతదేశంలో సాధారణ నాణేల కొరత ఉండేది. నాణెం డిమాండ్ నెరవేర్చడానికి, భారతదేశం విదేశీ మింట్ల నుండి భారతీయ నాణేలను సేకరించడానికి ఆశ్రయించింది. 1980 నుండి 2001 సంవత్సరాల్లో నాణేలు విదేశీ మింట్స్ చేత తయారు చేయబడ్డాయి మరియు నాణెం డిమాండ్ నెరవేర్చడానికి భారతదేశానికి దిగుమతి చేయబడ్డాయి.

విదేశీ మింట్స్‌లో ముద్రించిన నాణేలు ఈ క్రింది గుర్తింపు గుర్తులను కలిగి ఉంటాయి:

ఈ కింద ఉన్న గుర్తులతో మీ దగ్గర ఏదైనా నాణెం ఉండినట్లైతే అది విదేశంలో ముద్రించబడింది అని అర్థం

ఎలుక vs చుంచు vs పందికొక్కు

ఎలుక సైజు పెద్దది.సుమారు 500 gm వరకు పెరుగుతుంది.చుంచు చిన్నవి .సాధారణం గా ఒకటి నుంచి 7 అంగుళాల పొడవు పెరుగుతుంది.ఈ భేదాలు జంతుశాస్త్ర పరంగా కాదు.ఎందుకంటే కొన్ని ఎలుకలు ,కొన్ని చుంచులు ఆ పేర్లు ఉన్న వేరే లక్షణాలు ఉన్నవి కూడా ఉంటాయి కాబట్టి .అంటే deer mouse అనే పెద్ద సైజులో ఉంటుంది.అలాగే కంగారు rat పేరుకే ఎలుక.ఇలా సామాన్య నామం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక ఇదంతా మామూలు పరిభాష అనుకోవచ్చు.ఇలాటిదే పందికొక్కు దీన్ని bandicoot అంటారు.

పైన కనిపించేవి చుంచులు.వీటిని పెంచుకుంటారు.

చూడడానికి చాలా ముద్దుగా ఉన్నా వీటిని చాలా చోట్ల పంటలను,ఇంట్లో వస్తువులను నాశనం చేసే తెగులు/చీడ (pest) గా భావిస్తారు.వీటి ద్వారా వ్యాధులు( ఈ కోలి ,సాల్మొనెల్లా,) కూడా వచ్చే ప్రమాదం ఉంది. అడవి జాతుల వల్ల 35 రకాల వ్యాధులు సోకవచ్చు. ఇవి నిశాచరులు అంటే రాత్రి సంచారం చేసి పగలు నిద్ర పోతాయి.ఇవి NASA వారి SPACEx లో భాగం గా 40 చుంచులను అంతరిక్షం లోకి డిసెంబర్ 2019 లో పంపారు.ఇవి ఎలక్ట్రిక్ వైర్లు,గాస్ పైపులు లాంటివి కొరికి ఎన్నో ప్రమాదాలు తెచ్చిపెడతాయి.

ఇక ఎలుక ని అందరూ చూసే ఉంటారు.ఇవి చుంచు కన్నా పెద్దవి.

ఇవి కుడా pest లే.వీటిని కుడా పెంచుకునే వారు ఉన్నారు.బాగా ఫేమస్ అయిన ఎలుక రాటటోల్లె ఎలుక.

ఇది ఎలుకయే.

ఇంకా చుంచు మాత్రం తక్కువా ఏమి దానికి బోలేడ్ ఫాన్స్ ఉన్నారు.అదేనండి

ఇందులో జెర్రీ అనేది చుంచు అనే mouse .ఇవి రెండు అంటే ఎలుక,చుంచు ధుమ,తెలుపు,నలుపు రంగుల్లో ఉంటాయి.రెంటికి ముందు రెండు కోర పళ్ళు బాగా పెరిగి కొరక డానికి పనికొస్తాయి.

దేశ్నోక్ కర్ణి మాత గుడి లో ఉండేవి ఎలుకలు .

ఇంకో కదా పైడ్ పైపర్ అఫ్ హామెలిన్.వినే ఉంటారు.ఎలుకలని నిర్ములిస్తా అని డబ్బులకు ఒప్పందం చేసుకుని పైడ్ పైపర్ వాద్యం తో ఎలుకలని సమ్మోహనం చేసి నదిలో నీళ్ళలో పంపి చంపుతాడు.అయితే ఒప్పందం ప్రకారం డబ్బు ఇవ్వనందుకు ప్రతీకారంగా ఆ వూరి పిల్లలను తీసుకుని పాట పాడుతూ కొండల్లోకి మాయం అవుతాడు.

అలాగే ఇంకో చుంచు బుల్లోడు ఏకంగా ఇంట్లో పిల్లోడికి తమ్ముడులా సెటిల్ అవుతాడు.అదే స్టుఆర్ట్ లిటిల్.

వాహనం చక్రాల దగ్గర నిమ్మకాయ ఉంచడం

మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం, మనం కూడా పాటిస్తుంటం. ఏంటంటే ఏదైనా కొత్త వాహనం కొన్నప్పుడు ఆ వాహనం చక్రాల దగ్గర నిమ్మకాయ ఉంచి వాటి పై నుంచి మన వాహనాన్ని నడపడం చేస్తాము. ఇది మూడనమ్మకం, అంధ విశ్వాసం కాదు.మనకు తెలిసిందే పూర్వకాలంలో ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చేయడానికి మనం గుర్రం బండి ,ఎద్దుల బండి ఉపయోగించే వాళ్ళం. అప్పట్లో ప్రయాణ మార్గాలు కూడా అడవుల మీదుగా లేదా రాళ్ళు,గుట్టల మీద సాగేవి. ఆ ప్రయాణాల్లో గుర్రపు లేదా ఎద్దుల కాళ్లకు ఏమైనా ముళ్ళు,రాళ్ళు వల్ల గాయాల అయ్యి వాటి కాళ్లకు పుండ్లు ఏర్పడేవి.దాని వల్ల అవి నడవలేవు. అందుకోసం మన పూర్వీకులు గుర్రపు లేదా ఎద్దుల కాళ్ల కింద నిమ్మకాయ ఉంచి వాటిపై నుంచి వెళ్ళనిచ్చే వాళ్ళు. మనకు తెలిసిందేగా నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ వాటి కాళ్ళలోకి వెళ్లి క్రిమికీటకాలు, చిన్న చిన్న బ్యాక్టీరియాలు నశింపజేసి వాటికి ఎటువంటి హాని కలగకుండా చేస్తాయి. కానీ మనం ఉపయోగించే వాహనాలకు rubber tires ఉన్న కూడా మనం అదే పద్ధతిని ఉపయోగిస్తున్నాం. ఎక్కడో కొన్ని ప్రదేశాల్లో తప్ప,మన ప్రయాణం మోటార్ వాహనాలు(బసు,car,auto,bike, train) ఉపయోగిస్తున్నాము.

AD, BC ల నిర్వచన

AD అనగా 1 నుండి ఇప్పుడు నడుస్తునా సంవత్సరం 2020 వరకు (+1, +500, +1000, +1500, +2000)

BC అనగా 1 నుండి 2000 సంవత్సరాలు వెనకకు అనగా ( -1, -500, -1000, -1500, -2000) అంటే ఈ రెడింటికి మధ్యలో ( 1 సంవత్సరం ) అనేది రెండిటిని కలుపుతుంది.

ఉదాహరణకు: యేసు పుట్టక ముందు ( – ) అనుకుందాం యేసు పుట్టక ( + ) అనుకుందాం,

( కొన్ని వచనాలలో ఉంది యేసు పుట్టకముందు యేసు పుట్టాక అని అంతకు మించి వాస్తవాలు తెలియదు యేసు గురించి )

తేగలు & బుర్రగుంజు

తాటి పండ్లను భూమిలో పాతర వేస్తారు ల. (తక్కువ లోతు గుంటలో లేదా భూమి మీది తాటి పండ్ల పరిచి మీద మట్టి కప్పుతారు). ఒక్కో తాటి పండులో సాధారణంగా మూడు బుర్రలు ఉంటాయి, ఒక్కో బుర్ర ఒక్కో తాటి చెట్టు విత్తనం.

కొన్ని రోజులకు తాటి పండ్ల లోని ముట్ల/బుర్రల నుంచి మొలకలు వచ్చి వేరు భూమిలోకి దిగుతుంది,ఈ వేరునే మనం తేగ అని పిలుస్తాం.

పచ్చి తేగలను తినలేం, వాటిని ఉడక బెట్టటమో లేదా నిప్పులలో కాల్చి తినాలి. ఉడకబెట్టిన తేగ తొందరగా పాడవుతుంది, తేగ మీద ఒక బంక లాంటి పదార్థం ఏర్పడుతుంది. అందువల్ల ఉడక బెట్టిన తీగలను వాటి పైన ఉండే చర్మాన్ని వలిచి ఆరబెట్టాలి.

తేగలను కుండలో ఉంచి, తేగలపై కొంచెం నీళ్లు జిలకరిచి గడ్డి చుట్టతో కుండా మూతిని మూసి, ఈ కుండను బోర్లించి చుట్టూ గడ్డి చిన్న చిన్న పుల్లలు వేసి మంట పెడతారు. బోర్లా ఉంచిన కుండలో ఉన్న తేగలు బాగా ఉడుకుతాయి. ఈ పద్దతిని “తంపటి” వేయడం అంటారు. తంపటి వేసిన తేగలు రుచిగా ఉంటాయి, పైగా ఎక్కువ రోజులు బంక , భూజు పట్టకుండా ఉంటాయి.

సంక్రాంతి భోగి మంటల చివర్లో తేగలు కాల్చుకు తినడం ఒక ఆనవాయితీ గా ఉండేది. భోగి లోకి తేగలు ఇవిగో తీసుకోండి అంటూ పచ్చితేగలు పల్లెటూర్లలోని బంధువులు తెచ్చి ఇచ్చేవాళ్ళు.

తేగ మధ్యలో వివిధ పొరలతో కూడిన మెత్తని పుల్ల లాంటిది ఉంటుంది దాన్ని చందమామ అంటారు, దాని చివరన మెత్తగా ఉండి చాల తీయగా ఉంటుంది. తేగని భూమి నుంచి తీయకుండాఉంచి ఉంటె ఈ చందమామే తాటి ఆకు చిగురు అవుతుంది.

ఇసుక నేల అయితే తేగ బాగా బలంగా పెరుగుతుంది (తేగ బాగా ఊరింది అంటారు పల్లెల్లో ), తేగని భూమి నుండి పెరకడం కూడా సులభం. తేగ లేతగా ఉన్నపుడు రుచి బాగుంటుంది, అదే సమయంలో బుర్రగుంజు కూడా బాగుంటుంది.

తాటి బుర్రలు లేక తాటి ముట్లు

తాటి బుర్రలను మధ్యకి కత్తి తో చీల్చిన తరువాత

తేగ ముదిరే కొండి పిండి పదార్థం ఎక్కువై గట్టి పడుతుంది, కానీ బుర్ర లోని గుంజు వదులుగా గా అయిపోయి నీరు చేరుతుంది.

ఇలా నీరు ఎక్కువైన బుర్రగుంజు తింటే విరోచనాలు అవుతాయి.

తాటి తాండ్ర

తాటి కాయలు కోయకుండా అలానే చెట్టుకు వదిలేస్తే పండిపోతాయి.

బాగా పండిన తాటి పండు

ఈ పండ్ల పైన కండను కోసి ఉడకబెడితే తీయ్యని పీచుతో కూడిన తాటి తాండ్ర వస్తుంది.

తాటి ముంజలు

తాటి చెట్టుకు తాటి కాయలు కాస్తాయి.

ఈ తాటికాయలు లేతగా ఉన్నపుడు కొస్తే మనకు తాటి ముంజలు లభిస్తాయి.

పైన చిత్రంలోలా ఒక్కో తాటి కాయలో మూడు ముంజలు ఉంటాయి, ఈ ముంజల పైన తెల్లని మందమైన పోర ఉంటుంది , ఈ పొర వగరుగా ఉంటుంది, ముంజను ఈ పొరతో పాటు గా తింటే బాగా అరుగుతుంది అనే చెప్పే వాళ్ళు.

ఈ ముంజలు ముదిరితే గట్టిగా తయారయి చివరికి గట్టి ముట్టెలుగా తయారవుతాయి.

ఈ ముంజలు లేతగా ఉన్నపుడు తీయగా ఉంటాయి, ముదిరే కొద్దీ రుచి తగ్గి పోతాయి. ముదిరిన ముంజలు తింటే కడుపు నొప్పి వస్తుంది అని తిననిచ్చే వారు కాదు.

తాటి ముంజలు తిన్న తరువాత పిల్లలు రెండుచక్రాల బండి చేసుకొని ఆడుకొనే వాళ్ళు.

కొబ్బరి పువ్వు

బాగా పండిన కొబ్బరికాయకు తేమ తగిలినప్పుడు కొబ్బరికాయ నుండి మొలక వస్తుంది కొబ్బరికాయ కన్నుల నుంచి అన్ని విత్తనాల లాగానే. ఆలా కొబ్బరికాయలో మొలక వచ్చినపుడు కొబ్బరి కాయలోపల పువ్వులాంటి తెల్లని పదార్థం కొబ్బరికాయ లోపల పెరుగు తుంది, దీన్నే కొబ్బరి పువ్వు అంటారు.

దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే అదృష్టం అని చెబుతారు.

Healthy life

 1. The STOMACH is injured when you do not have breakfast in the morning.
 2. The KIDNEYS are injured when you do not even drink 10 glasses of water in 24 hours.
 3. GALLBLADDR is injured when you do not even sleep until 11 o’clock and do not wake up to the sunrise.
 4. The SMALL INTESTINE is injured when you eat cold and stale food.
 5. The LARGE INTESTINES are injured when you eat more fried and spicy food.
 6. The LUNGS are injured when you breathe in smoke and stay in polluted environment of cigarettes.
 7. The LIVER is injured when you eat heavy fried food, junk, and fast food.
 8. The HEART is injured when you eat your meal with more salt and cholesterol.
 9. The PANCREAS is injured when you eat sweet things because they are tasty and freely available.
 10. The Eyes are injured when you work in the light of mobile phone and computer screen in the dark.
 11. The Brain is injured when you start thinking negative thoughts.
 12. The SOUL gets injured when you don’t have family and friends to care and share with you in life their love, affection, happiness, sorrow and joy.

డ్రాగన్ ఫ్రూట్

డ్రాగన్ ఫ్రూట్.. కమలం

ఇది ముళ్లజెముడు (కాక్టస్) జాతికి చెందిన చెట్టు. మధ్య అమెరికా, దక్షిణ అమెరికా అడవుల్లో పుట్టింది. లాటిన్ అమెరికాలో ఈ పండును ‘పితాయ’ లేదా ‘పితాహాయ’ అని కూడా పిలుస్తారు. లాటిన్ అమెరికానుంచీ వచ్చిన ఈ పండ్లను ఆగ్నేయాసియా దేశాలైనా థాయ్‌లాండ్, వియత్నాంలలో చాలాకాలంగా పెంచుతున్నారు. ఈ పండ్లలో కూడా కివీ పండ్ల మాదిరిగానే చిన్న చిన్న నల్లని గింజలు ఉంటాయి.

ప్రపంచవ్యాప్తంగా వియత్నాం డ్రాగన్ ఫ్రూట్ల ఉత్పత్తిలో ముందుంది. ఈ పండ్ల ఎగుమతిలో కూడా వియత్నాందే పైచేయి. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ వలసదారులతో పాటు ఈ పండు వియత్నాంలోకి ప్రవేశించింది. ఆ దేశంలో దీన్ని ‘థాన్ లాంగ్’ అని పిలుస్తారు. అంటే డ్రాగన్ కళ్లు అని అర్థం.

చైనా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, శ్రీలంకలలో కూడా ఈ పండ్లను విరివిగా పండిస్తున్నారు. భారతదేశంలో 1990లనుంచీ వీటి పెంపకం ప్రారంభమైంది. గత కొన్నేళ్లుగా దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఈ పండ్ల తోటల పెంపకం పెరిగింది. సాంప్రదాయ పంటలకు బదులుగా కచ్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో రైతులు డ్రాగన్ పండ్ల తోటలవైపు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. గుజరాత్‌తోపాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. గుజరాత్‌లోని అనేకమంది రైతులు ఈ పండ్ల పెంపకం గురించి తెలుసుకోవడం కోసం పూణె వెళుతుంటారు. ఇంటర్నెట్‌లో కూడా విస్తారమైన సమాచారం లభ్యమవుతోంది.

ఎరుపు రంగు డ్రాగన్ ఫ్రూట్ పండ్లకు డిమాండ్ ఎక్కువ

ఈ పండ్ల లోపలి భాగం రెండు రకాలుగా ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఎరుపు పండ్లకు డిమాండ్ ఎక్కువ. అయితే, భారతదేశంలో అనేకమంది దీన్ని స్థానిక ఫలంగానే భావిస్తున్నారు. డెంగ్యూ వచ్చిన రోగులలో ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినడం మంచిదని చెబుతారు.

గుజరాత్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు

మనిషి చనిపోయిన తరువాత . మనిషి శరీరం ఎందుకు నీటిలో తేలుతుంది?

మనిషి శరీరం చాలా వరకు బోలుగా ఉంటుంది. ఊపిరితుత్తులు, జీర్ణ వ్యవస్థ మొదలైన పెద్ద పెద్ద దేహ భాగాలు బోలుగా ఉంటాయి. కాబట్టి మనిషి దేహం నీటిలో తేలుతుంది. కానీ మనం మిగతా శరీర భాగాలని (కాళ్ళు, చేతులు) సమంగా అమార్చగలిగితేనే. లేకపోతే మునిగిపోతాము. ఆ విధంగా ప్రయత్నం చేసినవారు నీటిపై తేలుతారు.

మన మెదడు మన నియంత్రణ లో ఉంటే నీటిపై తేలటం తేలికైన పనే. మనం మునిగిపోయేది భయం వలన మాత్రమే. చనిపోయాక మెదడు ఎలాగూ పనిచేయదు కాబట్టి భయం, కళ్ళు చేతుల కదలికలు ఉండవు కాబట్టి శవం నీటిలో తేలుతుంది.

రోలర్ కోష్టర్

Roller coster,fun,theme park,roller coaster,rides - free image from needpix.com

ముందుగా ఆ రోలర్ కోష్టర్ నీ విద్యుత్తు శక్తి తో ఆ పట్టాలు ఉన్న ఎత్తైన ప్రదేశం మీదికి తీసుకువెళతారు. అలా తీసుకెళ్లడం ద్వారా ఆ రైలు బండి లో మనం స్థితి శక్తి నీ నింపుతాము. అలా రైలు బండి ని మనం మీదికి తీసుకెళ్లే కొద్దీ దానిలో స్థితి శక్తి అనేది వస్తూ ఉంటుంది.

అలా ఒకసారి ఆ పట్టాలు ఉన్న ఎత్తైన ప్రదేశం లోకి వెళ్ళిన తరువాత అది కిందకి రావడం మొదలవుతుంది. ఇప్పుడు దాని మీద ఎలాంటి శక్తి ఉండదు. కేవలం గురుత్వాక్షణ ద్వారా వస్తుంది. అది అలా వచ్చేప్పుడు ఆ రైలు బండి స్థితి శక్తి క్రమంగా వదిలేసి, గతి శక్తి ని తెచ్చుకుంటుంది. ఇది ఆ కిందికి వచ్చే పట్టాలు చివర లో ఈ గతి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ గతి శక్తి ద్వారా నే ఆ రైలు బండి ఆ తర్వాత ఉన్న చిన్న చిన్న ఎత్తులు, మలుపులు ఎక్కుతుంది. అలా మళ్లీ ఎత్తుకు ఎక్కెప్పుడు స్థితి శక్తి తీసుకుంటూ, మళ్లీ కిందికి వచ్చేపుడు గతి శక్తి ను తెచ్చుకుంటుంది. అలా ఆ రైలు బండి ఎత్తు నుండి కిందికి వస్తుంది కాబట్టి అది ఆ కిందికి వచ్చే దారిలో వేగం పుంజకుంటుంది.

అయితే ఇప్పుడు మరి మలుపు ఉన్నప్పుడు ఎందుకని మనం బయట కి పడిపోము అంటే దానికి కారణం అభుకెంద్ర బలం. మన రైలు బండి మలుపు ఉన్న ప్రదేశం లో తిరిగెప్పుడు, మన రైలు ఇనర్షియా స్థితి వల్ల నేరుగా వెళ్తుంది. అయితే బండి పక్కకు పడిపోకుండా ఆ పట్టాలను మలుపు ఉన్న ప్రదేశం లోపలి వైపు వంచుతారు. (అచ్చం మన రోడ్లను మలుపు దగ్గర వంచినట్టు, అలా వంచకపోతే రెండు చక్రాల బండి అయితే మనం వంచుతాం కానీ కారు ను వంచలేము కదా, అప్పుడు ఆ కారు స్లయిడింగ్ వల్ల రోడ్డు మీద నుండి కింద పడే ప్రమాదం ఉంది, కాబట్టి అలా రోడ్లను వంచడాన్ని “బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్” అంటారు). అలా వంచడం వల్ల అభికెంధ్ర బలం పుడుతుంది. ఇప్పుడు మన రైలు బండి వేగానికి బయటికి పడిపోతుంటే అభికేమధ్ర బలం లోపలికి లాగుతుంది. కాబట్టి మన రైలు బండి సరిగ్గా వెళ్తుంది. ఇప్పుడు పట్టాలు ఎలా వంచుతారు అంటే ఈ కింద చిత్రం చూడండి.

ఇలా ఉండడం వల్ల ఆ వేగానికి రైలు బండి బయటికి పడిపోతున్నా కూడా అభికెంధ్ర బలం ( centripetal force) లోపలికి లాగుతుంది. ఇక నిలువుగా ఉన్న సున్నా లో కూడా ఇదే రకంగా జరుగుతుంది. బండి సున్నా ను ఎక్కే మొదట్లో మనకి ఏమ్ అనిపించదు, కానీ కాస్త మీదికి వెళ్ళాక మనల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది. సరిగ్గా సున్నా మధ్యలో కి వచ్చే సరికి మనకు అసలు ఎలాంటి బరువు అనిపించదు. మనం చాలా తేలిక అయిపోతాం. కారణం ఎంటి అంటే, రైలు బండి సున్నా మధ్యలో ఉన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి రైలు ను కిందికి (లోపలికి) లాగుతుంది. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా యాక్సిలారేశన్ శక్తి రైలు ను పైకి ( బయటికి) లాగుతుంది. ఇనార్షియా మాత్రం ఆ రైలు ను అదే పట్టాల మార్గం మీద వెళ్లేలా చేస్తుంది. దీని వల్ల అక్కడ అపకెంద్రం (Centrifuge) ఏర్పడుతుంది. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశల్లో ఉండడం వల్ల మనకు ఏమి అనిపించదు.

ఇలా ఉంటుంది అనమాట.

అయితే ఇక రైలు బండి ఎత్తుకు ఎక్కడం, కిందికి దిగడం ఇలా ఐతే మరి అది ఆగేది ఎలా అంటే.. ఫ్రీక్షన్ వల్ల. మన రైలు బండి తైర్లకు పట్టాలకు జరిగే ఫ్రిక్షాన్ మరియు గాలి వల్ల వచ్చే resistance. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన బండికి ఉన్న డోము ఎప్పుడు పైకి వచ్చే కొద్దీ లోపలికి వంగి ఉంటుందో, అలా లేకపోతే గాలి వల్ల వచ్చే resistance ఆ బండి ని వేగంగా వెళ్లనివ్వదు. అచ్చం ఇలాగే మన రైలు బండి కి కూడా AIR RESISTANCE ఉంటుంది. అలా బండి మొదలయిన దగ్గర నుండి చివర వరకు ఈ ఫ్రిక్షణ్, RESISTANCE ను ఎదుర్కొంటూ చివరికి వచ్చే వరకు వేగం మొత్తం తగ్గిపోయాయి ఆగిపోతుంది.

చివర వరకు వచ్చింది అయిన ఆగలేదు అనుకున్నప్పుడు “ఏడ్డి కరెంటు” బ్రేకు వేసి ఆపుతారు. ఇది ఎలా అంటే ఏదైనా ఆకర్షించే ఒక conductive material ఒక అయస్కాంతం మీదుగా వెళ్ళినప్పుడు అక్కడ ఒక magnetic filed ఏర్పడి ఎడ్డి కరెంటు వస్తుంది. ఇది ఆ రైలు కు ఉన్న వేగాన్ని HEAT ENERGY గా మార్చి ఆపేస్తుంది. ఇక ఈ రైలు బండి కి ఉన్న పట్టాలు ఎలా ఉంటాయి అంటే.. పట్టా గుండ్రంగా ఉంటే దాని మీద, కింద, పక్కన మూడు దిక్కులా కూడా మూడు పయ్యలు ఉండేలా ఉంటుంది ఈ రైలు బండి పయ్యలు అమరణ. అందువల్ల రైలు బండి ఆ పట్టాలను వదిలే సమస్యే లేదు అణమాట.

ఈనాడు

ఈనాడు దిన పత్రిక విజయవంతం కావడానికి కారణాలు

ఈనాడు దిన పత్రిక విజయవంతం కావడానికి కాలానుగుణంగా మార్పులు, పటిష్టమైన ప్రణాళికలు, పాఠకాభిరుచికి అనుగుణంగా అంశాలు రాయడం.

స్థానిక వార్తలకు ప్రాధాన్యం

ఈనాడు1974 ఆగస్టు10 న ప్రారంభించేనాటికి పరిమాణంలో చిన్నది అప్పటికి ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి వంటి దినపత్రికలు ముందంజలో ఉన్నాయి. అయితే వీటి వార్తలకు భిన్నంగా ఈనాడు రాయడం ప్రారంభించింది. ముఖ్యంగా స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. పాఠకులకు సమీప ప్రాంతాల విశేషాలు అందించింది. మొదట జిల్లాకు ఓ పేజీ కేటాయించింది.క్రమంగా 16, 20 పేజీలకు పెంచింది. అందులోనే డివిజన్ కు ప్రత్యేక పేజీ, అనంతరం నియోజకవర్గ పేజీ ఏర్పాటు చేసి స్థానిక వార్తలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇది భారతీయ భాషా పత్రికల చరిత్రలో కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. అనంతరం ఈ విధానాన్ని ఇతర పత్రికలూ అనుసరించాయి.

సూర్యోదయానికి పత్రిక

ఈనాడు విజయానికి ఇదో కారణం. సూర్యోదయానికిముందే చందాదారుని చేతిలో పత్రిక ఉండాలనేది ఈనాడు విధానపరమైన నిర్ణయం. దీనికి అనుగుణంగానే పత్రికలు పంచే ఏజెంట్లతో ఒప్పందం చేసుకుంటుంటుంది. ఇందుకు భిన్నంగా ఆలశ్యంగా పత్రిక చేరితే, ఆ ఏజంటును, సంబంధించిన ఉద్యోగులను తొలగించడానికి వెనుకాడదు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఎన్ని కష్టాలు పడినా, మరెంత ఖర్చు అయినా యాజమాన్యం లెక్కచేయదు. ఈ సమయపాలన చందాదారుల అభిమానాన్ని చూరగొంది. కష్టసమయాల్లో తెగువ చూపిన సిబ్బంది, ఏజంట్లు, విలేకరులను ప్రోత్సాహకాలు, సన్మానాలతో అభినందించడం ద్వారా పటిష్టమైన యంత్రాంగాన్ని సమకూర్చుకుంది. ఈ చర్యల వల్ల సర్కులేషన్ పెంచుకుంది.

నిరంతర శిక్షణ

తెలుగు పత్రికా రంగంలో ఈనాడు అగ్రగామిగా ఉండటానికి ఇదో కారణం. నైపుణ్యం లేని విద్యావంతులను విలేకరులుగా తీసుకుని వారికి ప్రతినెలా శిక్షణ ఇస్తుంది. డివిజన్, జిల్లా స్థాయిల్లో ఇన్మాఈవేశాలు నిర్వహిస్తుంది. అందులో, ప్రత్యేక కథనాలకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. గతంలో విజయాలు, వైఫల్యాలను సమీక్షిస్తారు. వార్తల్లో తప్పొప్పులు విశదీకరిస్తారు. వర్తమాన రాజకీయాలు, సమస్యలపై చర్చిస్తారు. దీనివల్ల నాణ్యమైన వార్తలు అందించగలుగుతోంది. ఇలా సమావేశాలు నిర్వహించినపుడు వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీరావు గారితో సహా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు హాజరు కావడం, ప్రజ్ఞావంతులను సన్మానించడం పరిపాటి. ఇలాంటి ఓ సమావేశంలో రామోజీ రావు గారు మాట్లాడుతూ ” మనం ఎంతో సాధించామని ఆదమరిస్తే మనమీంచి మరొకరు నడిచి వెళ్ళిపోతారు. కాబట్టి గర్వించక, నిరంతర జాగురూకతతో మెలగాలి.”అని చెప్పారు. అలాగే ఎన్నికలు, వరదలు వంటివి వచ్చినపుడు పాత్రికేయులకు నిరంతరం దిశానిర్దేశం చేయడం ఈనాడు ప్రారంభించి, కొనసాగిస్తోంది. ఉత్తమ సంపాదక వర్గాన్ని, పాత్రికేయులను తయారు చేసి ఉద్దేశ్యంతో ఈనాడుకు అనుబంధంగా జర్నలిజం స్కూల్ ప్రారంభించింది. ఇందుకోసం సివిల్స్ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది. బయటి అభ్యర్థులతోపాటు, సంస్థలోని కంట్రిబ్యూటర్లకు అవకాశం కల్పిస్తోంది. ఇదే పద్ధతిని మరికొన్ని పత్రికలు అనుసరించి, జర్నలిజం స్కూళ్ళు ప్రారంభించాయి.

సమాజసేవ

ఉప్పెన, భూకంపాలు, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సమయంలో ఈనాడు తనవంతు సేవ చేస్తోంది. ముందుగా కొంత విరాళం తాను ప్రకటించి, దాతలను ప్రోత్సహించి కోట్లాది రూపాయల నిధిని పొగుచేస్తోంది. ఆ విధంగా మహారాష్ట్ర భూకంపం, ఒడిశా, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో గృహ సముదాయాలు నిర్మించింది. ఇటీవలే కేరళ వరద బాధితులకు రెండుగదుల మోడల్ గృహాలు అందజేసింది. మూడురోజుల క్రితం భాగ్యనగరం వరద బాధితులకోసం రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెక్కు ఇచ్చింది. అలాగే పదోతరగతి విద్యార్థులకు అవగాహనా సదస్సులు, విద్యార్థులకు, మహిళలకు వివిధ పోటీలు, వైద్య శిబిరాలు నిర్వహించింది. ఈ సేవలు పరోక్షంగా పత్రిక అభివృద్ధికి బాటలు వేశాయి.

విభిన్న అంశాలు

క్రీడలు, సినిమా, వసుంధర, పిల్లలు, బిజినెస్, పోటీ పరీక్షలు తోపాటు వారంలో ప్రతిరోజూ ఓ అంశంపై ప్రత్యేక పేజీలు నిర్వహిస్తుంది.ఆదివారం బీమా, సోమవారం చదువు, మంగళవారం సుఖీభవ..అలాగే మకరందం, ఈ(e)నాడు,పర్యాటకం తదితరఅంశాలపై ఆసక్తికరమైన విషయాలు ప్రచురిస్తుంటుంది. విభిన్న అభిరుచులున్నవారు ఈ అంశాలపై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ, పత్రికను అభిమాణిస్తున్నారు. ఒక వార్త నిజమా, కాదా అనే విషయంలో పాఠకులు చివరిగా ఈనాడును అనుసరిస్తుంటారు. ఎన్నో బహిరంగ చర్చల్లో ఈ విషయం వెల్లడైనది. ఇన్ని సానుకూల అంశాల వల్ల ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో అద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రాంతీయ భాషా పత్రికలలో గతంలో సర్కులేషన్ పరంగా మలయాళ మనోరమ ప్రథమ స్థానంలో వుండేది. ఆ స్థానాన్ని సాధించాలని ఈనాడు మొదట్నించీ కృషి చేస్తోంది.

శీర్షికలపై పరిశోధన

ఈనాడు ప్రారంభం నుంచీ వార్తా, వ్యాసాల శీర్షికలు పెట్టే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు, మంచి శీర్షికలు పెట్టిన సంపాదక సిబ్బందికి, విలేకరులకు ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఈనాడులో వచ్చిన శీర్షికలపై ఓ విద్యార్థిని పరిశోధన చేయగా, డాక్టరేట్ లభించింది.

నాగు పాములు

దీన్ని “రొజెర్ హాల్” వైల్డ్ ఆర్ట్ అని తయారు చేసిన అంతర్జాల చిత్రం.

ఇందులో చూపిన స్పిట్టింగ్ కోబ్రా అంటే విషాన్ని చిమ్మే పాము. అది ఇలా చిమ్ముతుంది.

ఇది ఆఫ్రికన్ స్నేక్ బైట్ సొసైటీ చిత్రం

ఇంకా వారివే కొన్ని చిత్రాలు

ఇవన్నీ మనదేశం లోవి కావు.

ఇక మనదేశం లో ఉండే నాగు పాములలో ప్రధానం గా రెండు కళ్ళద్దాలు ,లేదా ఒక కళ్ళద్దము ఉండే రకాలు.(mono Spectacle Bi spectacle) ఇవి ఇలా ఉంటాయి.

ఇకా తెల్లవి, నల్లవి ,అదేనండి శ్వేతా నాగు, అలాంటివి జన్యు పరివర్తన వల్లనే కానీ ప్రత్యెక తరగతి కాదు. రెండు కళ్ళద్దాలు పడగ పై ఉండే పాము ని నజ నజ ( naja naja) అనే శాస్త్రీయ నామం తో పిలుస్తారు.ఇది ఎలాపిడే (ELAPIDAE) అనే కుటుంబం నకు చెందింది .ప్రజాతి నామం నాజ .

అలాగే ఒక అద్దం(monocle) పడగ పై ఉండే పాము ని నాజా కౌతియ(Naja kaouthia) అని పిలుస్తారు.ఇది ఎక్కువగా తూర్పు భారత దేశం మరియు బంగ్లా, చైనా, వియత్నాం కంబోడియా ల లో ఉంటుంది.

ఇక చివరది నల్లత్రాచు లేదా రాచనాగు లేదా కింగ్ కోబ్రా (Ophiophagus hannah – జాతి/ప్రజాతి నామము).ఇది “నాజ” ప్రజాతికి చెందదు.దీని జాతి పేరు “ఓఫియోఫేగస్ .అంటే పాముల్ని తినేది అనే అర్ధం.ఇది ఇతర పాములను తినగలదు. చాల పొడవు పెరుగుతుంది.దీని విషం అత్యంత ప్రమాద కరం. దీని పడగ మీద ^ గుర్తు ఉంటుంది.

బొమ్మ లో అతని పేరు ” వా వా సురేష్ ” కేరళ వాసి.50,౦౦౦ పాములు పట్టిన నేర్పు ఈయన కు ఉంది.ఈయనను ముద్దు గా “స్నేక్ మాన్ ఆఫ్ కేరళ” అంటారు. దీనికి నాగు పాముకు తేడా లున్నాయి. ఇది గుడ్లు పెట్టడానికి గూడు కడుతుంది.మామూలు నాగు 5.5 అడుగులు పెరిగితే ఇది15 అడుగుల వరకు పెరుగుతుంది. దీని పడగ వెడల్పు గా ఉండదు.

Snake in a byke

పాము vs ముంగిస 

అన్ని జాతుల ముంగిసలు పాములను తింటాయి, కాని సన్నని ముంగిస మరియు బూడిద రంగు ముంగిస కింగ్ కోబ్రాను ఎదుర్కొని మ్రింగివేయగల రెండు జాతులు. ముంగిస ఎదురు పడితే పాము తప్పించుకొని పారిపోయి ప్రాణం కాపాడుకోడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ ముంగిస పామును చంపి తినే ప్రయత్నం చేస్తుంది. వీటిది జాతి వైరం. ఒకటి మరొక దానిని ద్వేషిస్తాయి. ఒకటి గెలిస్తే మరొకటి చనిపోతుంది. కాకపోతే ముంగిస తన చిత్ర విచిత్రమైన కదలికలతో పాము కాటునుండి తప్పించుకొని చంపే ప్రయత్నం చేస్తుంది. పాము తన కాటుతో ముంగిసను మట్టు పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకోసారి అది ఇంకో సారి ఇది గెలుస్తుంది. అందుకే మనం ప్రకృతిలో రెండింటిని చూస్తాము.

రాంబుటాన్ (rambutan)

పేరు వెరైటీ గా ఉంది కదా? ఇది చూడటానికి ఉమ్మెత్తకాయ లాగా ఉంటుంది.ఇది జపాన్, మలేషియా, ఫిలిపిన్స్, తైవాన్ దేశాలలో పండుతుంది. పశ్చిమగోదావరి జిల్లా లోని వెంకట్రామన్న గూడెం లో వైస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం లో ఈ పండు మొక్కల సాగు కు రీసెర్చ్ చేస్తున్నారు. ఇది ఎర్రపు, పసుపు రెండు రంగుల్లో దొరుకుతుంది. పులుపు, తీపి కలిపి రుచి ఉంటుంది. పై తోలు తీసేసి తింటారు. పండు లోపల తెల్లగా ముంజు కాయల లాగా ఉండి ఒక పండు కి ఒక గింజ చప్పున ఉంటాయి.

పెర్సిమోన్ (persimmon fruit)

ఇది చూడటానికి పెద్ద సైజ్ టొమాటో లాగా ఉంటుంది. దీని రుచి ఆపిల్ రుచి ని పోలి తీయగా ఉంటుంది. లోపల గింజ ఏమి ఉండదు. పండు లోపల జెల్లీ లాంటి టెక్చర్ గా ఉంటుంది. పండు పై తోలు తీసేసి, లేదా అలానే తినేయచ్చు.ఈత కాయల సువాసన కలిగి ఉంటుంది. తెలుగు లో తున్నిక్కాయ అంటారని విన్నాను.

The crocodile

 The vast majority of man eating is down to only two Croc species.

 • The Saltwater Crocodile (from South East Asia and parts of Australia) and
 • The Nile Crocodile (who is comfortable roaming pretty much all over Africa).

Between the two of them, they are responsible for hundreds of fatal attacks on humans for the sole purpose of consuming us.

NOW FOR THE RANKING:

No 1: Let’s start with the Saltwater Crocodile:

The Saltwater Croc is the largest living reptile known to science and

 • males can grow up to over 6 meters (or 20 ft) in length and
 • weight up to 1,300 kg (or 2,900 lb).

The Salty is considered the ultimate Apex predator and to provide some context just to fully get my point across, considering the following:

Aside from being capable of devouring adult humans without much effort and the same goes for virtually any other animal that enters its territory.. Because they are saltwater reptiles, their diet includes one of the most aggressive and the 2nd most dangerous of all the shark species – the Bull Shark.

I for one did not see that coming when I began my research into the topic.

No 2: Onto the Nile Crocodile:

The Nile Croc is the 2nd largest living reptile known to science and

 • males can also grow up to over 6 meters (or 20 ft) in length (much like their saltwater cousins)
 • but they do weight in at a slightly less at 1,100 kg (or 2,400 lb).

They’re also freshwater reptiles, so at least the shark population around the African coastline can rest a little easier at night (…. ignoring of course the recent spike in Orcas a.k.a. Killer Whales that’s been adding sharks to their regular menu).

Despite being slightly smaller than their Saltwater cousins, Nile Crocs are known to be:

 • more aggressive,
 • more agile and
 • can remain under water for longer.

The Nile Crocodile is also surprisingly responsible for more human deaths annually than the Saltwater Croc, however that’s most likely because they’ve decided to inhabit virtually all of Africa and overlap with humans more frequently than the Salty’s.

As for the diet of the Nile Crocodile, (aside from humans of course) it pretty much eats anything that crosses its path. There is actual evidence that Nile Crocodiles have been known to take down:

 • Young (not baby) Male African Elephants: (2-3 tons);
 • Adult Black Rhino: (1,400kg/3,000lb)
 • Buffalo: (1,00kg/2,200lb)
 • A fatal attack on an Adult Female Hippo has even officially been recorded (5m/17ft specimen, weighing 1,300kg/3,330lb).

It’s worth noting that attacks on large prey by Nile Crocodiles generally occur at drinking holes or rivers, where the Nile Crocodile is strong enough to drown its prey.

For some further interesting reading, I’ve included a link to a Nile crocodile named Gustave. Having eaten an estimated 300 human beings, he is considered one of the most notorious man-eaters to ever roam the earth:

Aside from these top two Apex man eaters, it would be unfair to not give an honourable mention to their somewhat smaller and less hot-headed cousins.

No 3: The Mugger Crocodile (freshwater croc found in India and Iran)

Although smaller than the Big 2, a standard Large Adult Mugger Male Croc can grow up to 5m/16ft and weight up to 200kg/450lb).

Pythons however appear to be a common target for Mugger Crocs, with even large Burmese and Reticulated Pythons (i.e. 6m/20ft -100 kg/220lb) often making it onto the menu.

BUT

Unlike the Big 2, Muggers has on occasion fallen prey to large Tigers and Lions (albeit rarely) and with Lions the predator/prey relationship seems to go both ways (with the winner dependent on the size of the animals and location of the battle – i.e. water or land).

An American Crocodile Male grow up to 5m/16.5ft and attacks on average 45 humans per year of which 5 attacks result in death.

In comparison:

An American Alligator is slightly smaller (4.5m/15ft) and attacks on average around the same number of humans as the American Croc, although the fatality rate is significantly lower.

పక్షులు కరెంటు తీగల మీద ఎలా నిలబడగలుగుతాయి?

ఈ సమాధానం చెప్పే ముందు అసలు విద్యుత్తు ఏ సందర్భాలలో ప్రవహిస్తుందో తెలుసుకున్దాం.

ఏమైనా రెండు వేర్వేరు బిందువుల(points) యొక్క విద్యుత్ విభావాలలో ( potentials) వ్యత్యాసం ఉన్నప్పుడు , వాటి మధ్యలో ఒక వాహకాన్ని పెడితే విద్యుత్ ప్రవహిస్తుంది.

చిన్న రోజువారీ ఉదాహరణతో చెప్తాను, : విభావాన్ని “వోల్టేజ్(voltage)” అని కూడా అంటూ ఉంటారు.
మన ఇంటికి విద్యుత్ తెచ్చే తీగలను ఫేౙు , న్యూట్రల్ అని అనడం వినే ఉంటాం. ఇందులో ఫేౙు తీగకు కొంత మొత్తంలో విభావం ఉంటుంది , న్యూట్రల్ తీగకు సున్నా విభావం ఉంటుంది. కావున ఈ రెండు తీగల విభావాల మధ్య కొంత వ్యత్యాసం ఉంది. ఇందు చేతనే మనం ఏదైనా విద్యుత్ పరికరాన్ని వీటిమధ్య పెట్టినప్పుడు దాని గుండా విద్యుత్ ప్రవహించి , ఆ పరికరం పని చేస్తుంది.

ఇప్పుడు విద్యుత్ ప్రవహించడానికి విభావ వ్యత్యాసం అవసరమని తెలుసుకున్నాము కదా.

మళ్లీ మనం మన పక్షి వద్దకు వద్దాం. ఈ పక్షి రెండు కాళ్లను ఒకే తీగ మీద పెట్టింది,
అంటే… రెండు కాళ్ల దగ్గర ఒకే విభావం ఉంది. కాబట్టి విభావాలలో ఎటువంటి వ్యత్యాసం లేదు, కాబట్టి విద్యుత్ ఏమి ప్రవహించదు. ఆ పక్షి సురక్షితంగానే ఉంటుంది.
అదే కనుక ఆ పక్షి ఒక కాలూ ఒక తీగ మీద , మరో కాలూ మరో తీగ మీద పెడితే అప్పుడు విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది, అప్పుడు ప్రమాదం.

అర్థం అయింది అనుకుంటున్నాను ,… అయితే శుభాకాంక్షలు, లేక పోతే క్రింద ఉన్న ఈ విచిత్రమైన కథను చదవండి

ఉదాహరణకు ఒక వ్యక్తిని తీసుకుందాం. ఆ వ్యక్తికి రాము అని పేరు పెడదాం.

రాముకి సర్కస్ విన్యాసాలు అంటే చాలా ఇష్టం.ఆతను ఒక రోజు ఒక విద్యుత్ తీగకు వేలాడుతూ విన్యాసాలు చేస్తున్నాడు. ఇంతలో అతని ఇంకోచెయ్యి మరో తీగను తాకడం జరిగి అతనికి విద్యుత్ఘాతం అయి కిందపడిపోయాడు.

అయినా పట్టువిడవకుండా, మళ్లీ అదే తీగకు వేళ్ళాడాడు ( కొంత జాగరూకతతో) . సరదా తీరిపోయాక క్రిందకు దిగుదాం అనుకుంటాడు. ఒక్కసారిగా తీగ ను వదిలి కిందకు దూకడం మాని. మెల్లిగా ఒక అడుగు కింద పెట్టాడు. భూమికి సున్నా విభావం ఉంటాది అని ఆయన మరిచిపోయారు. కాబట్టి ఆయన పట్టుకున్న చేతికి ,.. కింద పాదానికి మధ్య విభావ వ్యత్యాసం ఏర్పడి ఆయనకు విద్యుత్ఘాతం జరిగింది.

(ఈ సారి కాస్త బలంగానే తగిలి, రాము ఆసుపత్రి లో చేరాడు , అది వేరే విషయం)

కాబట్టి నేల మీది నుండి తిన్నగా తీగలను తాకకూడదు .

మాఘమాసం

సనాతన హిందూ ధర్మంలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం రోజూ చేసే స్నానం దేహాన్ని శుద్దిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తాయి.మాఘమాసంలో చేసే స్నానాలకు ప్రత్యేకత ఉంది. దేవతలు తమ శక్తులను తేజస్సులను మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలామంచిది. పౌర్ణమి చంద్రుడు మఘ (మఖ) నక్షత్రంలో ఉండే మాసమే మాఘమాసం. ఈ సమయంలో సూర్యోదయం వేళల్లో సూర్యకిరణాలు ప్రత్యేక కోణాల్లో భూమిపై పడతాయి. అందువల్ల సాధారణ సూర్యకిరణాలకంటే వీటి సాంద్రతలో చాలా తేడా ఉంటుంది. కిరణాలు నీటిపై పడటం వల్ల నీరు చాలా శక్తివంతమవుతుందట. అందుకే జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందుచేసే స్నానాలు చాలా మంచివని చెబుతారు. మాఘమాసంలో సర్యోదయానికి ముందు నక్షత్రాలున్నపుడు చేసేస్నానం అత్యత్తమైనది. సూర్యోదయం తరువాత చేసే స్నానం వల్ల ఉపయోగంలేదు. ఇలాంటి స్నానాలు ప్రవాహజలాల్లో మరియు సాగరసంగమ ప్రదేశాల్లో చేస్తే ఇంకా మంచిదని పెద్దలు చెబుతారు. ఈ నెలలో ఆదివారం చాలా పవిత్రమైనది. ఈరోజున తలస్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించాలి. కృష్ణా నది సాగరసంగమంలో – కృష్ణాజిల్లా అవనిగడ్డ, కోడూరు మండలంలోని హంసలదీవిలో కృష్ణానది సాగరంలో కలుస్తుంది. మాఘమాసంలో రాష్ర్టం నలుమూలల నుండి ఇక్కడ స్నానం చేయటానికి లక్షలాదిమంది వస్తారు. ఇక్కడ ప్రధాన ఆలయం వేణుగోపాల స్వామి. హంసలదీవికి వెళ్ళే మార్గం : కృష్ణాజిల్లా విజయవాడ నుండి అవనిగడ్డకు వరకు వెళ్ళి అక్కడ నుండి కోడూరుదాకా వెళ్లి కోడూరు నుండి ఉల్లిపాలెం మీదుగా హంసలదీవి వెళితే అక్కడ నుండి 5 కి.మీ. దూరంలో సాగరసంగమం ఉంటుంది.

భాద్రపద మాసం

భాద్రపద మాసంలో రెండు విశేషాలున్నాయి. ఒకటి వరాహ జయంతి. దశావతారాల్లో ఇది మూడవది. కల్పాంత సమయంలో భూమి జలమయమైపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు మనువును పిలిచి… భూమిని పాలించమన్నాడు. భూమి నీటిలో ఉంది..ఎవరు పైకి తెస్తారు అంటాడు మనువు. సరిగ్గా అదే సమయంలో బ్రహ్మకు తుమ్ము వచ్చింది. ఆయన ముక్కులోంచి యజ్ఞవరాహమూర్తి పుట్టాడు. యజ్ఞవరాహము అంటే యజ్ఞంలో వాడే పదార్థాన్నీ శరీరంలో భాగాలుగా ఉన్నవాడు. అందుకే ఆయనది మంగళ స్వరూపం. బొటన వేంత దేహంతో పుట్టిన అతడు క్షణకాంలోనే భూమ్యాకాశాలకు పెరిగిపోయాడు. సముద్రంలో ఉన్న భూమిని బయటకు తీయడానికి వెళ్ళాడు. అదే సమయానికి హిరణ్యాక్షుడు ఆ భూమి నాది అని వరాహమూర్తితో యుద్దానికి దిగాడు. అప్పుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని పైకెత్తి తన కోరలమీద నిలబెట్టాడు. ఆ రూపాన్ని స్మరిస్తే ఎంతో మంచిదట. శ్రీహరి భాద్రపద శుద్ధ తదియనాడు ఈ అవతారాన్ని స్వీకరించాడు.

ఆ మరునాడు పదహారు కుడుమల తద్దె. స్త్రీలు ఈ రోజున గౌరీ దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. తరువాత వచ్చేది చవితి. అదే వినాయక చవితి. ఈ రోజున గణపతిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే విద్యాబుద్దులు సంపదలు అభిస్తాయి.

మరునాడు రుషి పంచమి. ఈ వ్రతం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడట. ఇది చేసేటప్పుడు కశ్యపుడు, అత్రి, భరధ్యాజుడు మొదలైన సప్తర్షులతోపాటూ అరుంధతీదేవిని కూడా పూజించాలి. ఇలా చేస్తే సకల పాపాలు నశిస్తాయని చెబుతారు.ఈ వ్రతం చేయలేనివారు ఈ రోజున ఈ మహర్షులను ఒక్కసారైనా తలచుకోవాలి. మర్నాడు షష్టి. దీన్ని సూర్యషష్టి అంటారు. నిజానికి భాద్రపద మాసంలోని ప్రతి ఆదివారం నాడు సూర్యుణ్ణి ఆరాధిస్తే ఎంతో మంచిది.

ఈ నెలలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశినాడు పాలసముద్రంలో శయనించిన శ్రీహరి ఈ రోజున మరోప్రక్కకు ఒత్తిగిల్లుతాడట. అందుకే ఇది పరివర్తన ఏకాదశి. ఈ రోజు ఉపవాసం చేసి శ్రీహరిని పూజిస్తే కరవుకాటకాలు తొలగిపోతాయట.

ఆ మరునాడు ద్వాదశి శ్రవణా నక్షత్రం ఉన్న ఈ రోజునే వామనావతార శ్రీకారం చేశాడు శ్రీహరి. ప్రహ్లాదుడి మనుమడైన బలిచక్రవర్తి పరమ ధార్మికుడు. అతడు స్వర్గాన్ని జయించడంతో దేవతలు అక్కణ్ణుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బలిచక్రవర్తిని సంహరించకుండానే అతడి నుంచి స్వర్గాన్ని దేవతలకు ఇచ్చేందుకు బ్రాహ్మణులైన అదితి, కశ్యప ప్రజాపతులకు బిడ్డగా జన్మించాడు శ్రీహరి. బలిచక్రవర్తి నుంచి సకల భూమండలాన్ని స్వర్గలోకాన్ని దానంగా పొందాడు. సుత లోకాన్ని బలిచక్రవర్తికి ఇస్తున్నాను. నా సుదర్శన చక్రం అతడికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటుంది. సావర్థి మన్వంతరంలో నేనే అతడ్ని ఇండ్రుణ్ణి చేసి తరువాత మోక్షమిస్తాను అని అనుగ్రహించాడు. అందుకే, ఈ రోజున వామనావతారాన్ని స్మరించుకుంటే మోక్షం భిస్తుంది.

పితృదేవతల పక్షం: మరునాడు చతుర్థశి ఇదే అనంత పద్మనాభ చతుర్థశి. ఈ రోజున అనంత పద్మనాభవ్రతం చేసి శేషతల్పశాయి అయిన శ్రీహరిని కొలిస్తే సకల సిరిసంపదలు కలుగుతాయి.
పౌర్ణమినాడు ఉమామహేశ్వరుల వ్రతం చేస్తారు. పార్వతీ దేవి ఈ వ్రతం చేసి శివుడి శరీరంలోని అర్థభాగాన్ని పొందిందట.

ఆ మర్నాటినుంచి అంటే కృష్ణపక్షం పితృదేవతలకు ఇష్టమైన కాంల. దీన్ని మహాలయ పక్షం అంటారు. ఈ పక్షమంతా నిత్యం తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులు నిర్వహించడం వంటివాటి ద్వారా పితృదేవతలను ఆరాధించాలి. అలా పక్షం రోజులు చేయలేకపోతే కనీసం మహాలయ అమావాశ్య దాకా అన్నశ్రాద్ధం పెట్టాలట.

భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్లతద్దె. కన్నె పిల్లలు ఈ రోజున గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతారు.

శ్రావణమాసం

శ్రావణమాసంలో ప్రతి ఇల్లూ లక్ష్మీనివాసమే. పెళ్ళిప్రయత్నాలు, సేద్యపు పనులు …మంచి పనులు ప్రారంభించటానికి ఇదే మంచిమాసమంటారు వేదపండితులు. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణా నక్షత్రంలో ఉంటాడు. అందుకే శ్రావణమాసమని పేరు. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. దశావతారాల్లో కృష్ణావతారం ఈ మాసంలోనే మెదయ్యింది. శ్రీకృష్ణుడు శ్రావణబహుళ అష్టమినాడు దేవకీ వసుదేవు అష్టమగర్భంలో జన్మిస్తాడు. శ్రావణపౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి.

శ్రావణ శుక్రవారాలు : శ్రావణం దేవుడికి, భక్తుడికి అనుసంధానం కావించే మాసం.ఉపవాసం అంటే పరమాత్మకు దగ్గరగా వెళ్ళటం. లక్ష్మీదేవి కటాక్షంకోసం శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేస్తారు. అలా కుదరకపోతే ఎదో ఒక శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేస్తారు. పోలాల అమావాస్య : శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ రోజు పాడిపశువులను శుభ్రంగా కడిగి కుంకుమదిద్ది హారతులిస్తారు. మనిషికి-పశువుకు మధ్యవుండే అనుబంధాన్ని చాటే పండుగ పోలాల అమావాస్య.

భానుసప్తమి : సమస్త ప్రపంచానికి వెలుగులు పంచే ప్రత్యక్ష భగవానుడైన సూర్యునికి నమస్కారాలు సమర్పిస్తూ భానుసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు. శ్రావణ మంగళవారాలో గౌరిదేవి వ్రతమాచరిస్తారు. శ్రావణమాసం సోమవారాలలో శివుణ్ణి ఆరాధిస్తారు.

శ్రావణపౌర్ణమి : ఇస్తినమ్మ వాయనం…పుచ్చుకొంటినమ్మ వాయనం… శ్రావణమాసపు వాయన దానాల్లో ముత్తైదువలు చెప్పుకునే మాట నిజానికి ఇది వాయనం కాదని వాహనం అని అంటారు. అంతిమ ఘడిల్లో వైకుంఠం నుంచి దేవదూతలుల తీసుకొచ్చే దివ్యవాహనం. కడదాకా నీ దాతృత్వమే నిన్ను కాపాడుతుంది అన్న సత్యాన్ని మన పెద్దలు ఇలా చెప్పించారన్నమాట.

శ్రావణపౌర్ణమి రోజే రక్షాబంధనం లేక రాఖీపౌర్ణమి. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధనం యెక్క ప్రాధాన్యతను వివరిస్తాడు. సోదరీమణులు సోదరులకు రాఖీకట్టి రక్షకోరతారు. ఈ వేడుక గురించి పురాణాల్లో కూడా చెప్పబడింది.

మార్గశిరమాసం

మార్గశిరమాసం మార్గానాం మార్గశీర్షోహం అర్జునా మాసాలలో మార్గశిరాన్ని నేను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రకటించుకొన్నాడు. మార్గశిరంలో వ్రతాలకు, పూజలకూ కొదవలేదు. చంద్రుడు ఈ మాసానికి అధిపతి. ధనుర్మాసం సూర్యుడు వృశ్ఛికరాశి నుండి ధనూరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే ధనుస్సంక్రమణం అంటారు. సూర్యడు మరలా మకరరాశిలోకి ప్రవేశించేదాకా ఉన్న 30 రోజులూ పరమ పవిత్రం. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. గోదాదేవిది మధురభక్తి. తండ్రి విష్ణుచిత్తుడు శ్రీరంగనాధునికి పూజకోసం సిద్ధం చేసిన మాలలను మెడలో వేసుకొని మురిసిపోయేది. ఆ సంగతి తండ్రికి తెలిసింది. మందలించాడు ఐనా వినలేదు. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. రోజుకో పాశురంతో నారాయణుకి పారాయణ జరిపింది. భక్తవత్సలుడు బాసికం కట్టుకొని మరీ భువికి దిగివస్తాడు. గోదాదేవిని తనదాన్ని చేసుకొని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇదంతా జరిగింది ఈ మాసంలోనే. 

మార్గశిర విశేషాలు :
మార్గశిరమాసంలో ప్రతిరోజూ పవిత్రమైనదే. శుక్లపక్ష పాడ్యమి రోజు నదీస్నానం శ్రేష్టమని అంటారు. తదియనాడు మామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. అలా మార్గశిరం కేశవుడికే కాదు. శివుడికి కూడా ప్రీతికరంగా మారింది. తారకాసుర వధ జరిగింది కూడా ఈ మాసంలోనే. ఇలాగే 30రోజులకు ప్రత్యేకత ఉంది.

వైశాఖ మాసం

తెలుగునెలల్లో రెండో మాసం వైశాఖం. వసంత రుతువులో వచ్చే ఈ మాసంలో ఎండ తీవ్రత ఎక్కువగా వుంటుంది. నిర్మలమైన ఆకాశంతో పాటు రాత్రిళ్లు ఆహ్లాదకరంగా వుంటాయి. ఈ మాసంలో పండ్లకు రాజైన మామిడిపండు దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి.

వైశాఖంలోనే మహామహులు జన్మించడం విశేషం. ప్రపంచానికి శాంతి మార్గం ప్రబోధించిన గౌతమబుద్దుడు, అద్వైత సిద్ధాంతాన్ని ఆ సేతు హిమాచలం ప్రచారం చేసి హైందవ మత పటిష్టతకు కృషి చేసిన శంకర భగవత్పాదులు, విశిష్టాద్వైత ప్రచారకర్త రామానుజాచార్యులు, పదకవితా పితామహుడు అన్నమాచార్యులు, కర్ణాటక సంగీత దిగ్గజం త్యాగయ్య… తదితరులు భువిపై అవతరించిది ఈ మాసంలోనే కావడం గమనార్హం.

శివుని తలపై వున్న గంగానది కూడా ఈ మాసంలోనే భువిపైకి అడుగిడిందని పురాణాలు తెలుపుతున్నాయి.శ్రీమహావిష్ణువు పరశురాముడిగా జన్మించింది, అక్షయతృతీయ తిథి కూడా ఈనెలలోనే వస్తాయి. తిరుమలేశుని సేవలో తరించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మించింది వైశాఖమాసంలోనే.

అక్షయమంటే తరగదని అని అర్ధం. త్రేతాయుగం ఈ తిధి నాడే ప్రారంభమయింది. అందుకునే అక్షయతృతీయను భాగ్యవంతమైన దినంగా భావించి పూజలు చేస్తుంటారు. ఎండ తీవ్రత ఎక్కువగా వున్నా ఈ మాసంలో పిల్లలకు సెలవులు వుంటాయి.

అందుకనే పెద్దలు, పిల్లలు తీర్థయాత్రలు చేస్తుంటారు. దీంతో ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు వివిధ ప్రదేశాల్లోని సంస్కృతి, కట్టుబాట్లు పిల్లలకు తెలుస్తాయి.

ధనుర్మాసం

ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే పుణ్యసమయం (డిసెంబర్‌ 16 నుండి) అదే ధనుస్సక్రమణం. నాటి నుంచి భోగి పండగ వరకూ పరమపవిత్ర కాలం తెలుగు వారి లోగిళ్లలో దీనిని నెలగంట అంటారు.

ఈ మాసంలోనే పరమాత్ముడు గోదాదేవిని ప్రేమగా స్వీకరించింది. గోదాదేవిని ఆండాళ్‌ అని పిలుస్తారు. ఈమె తమిళనాడులోని శ్రీవిల్లీపుత్తూరులో తులసి మొక్కలమధ్య దర్శనమిచ్చింది. ఈమెకు గోదాదేవి అని పేరుపెట్టి విష్ణుచిత్తుడనే పరమభక్తుడు పెంచి పెద్దచేశాడు. గోదాదేవి బాల్యం నుంచి శ్రీరంగనాధుడే సర్వస్వమని భావించింది. ఆ భగవంతుడే తన భర్త అని విశ్వసించింది. స్వామిని పొందటానికి ధనుర్మాస వ్రతం చేసింది. ముప్పైరోజులు ముప్పై పాశురాలతో కొలిచింది. పూజకోసం తండ్రి సిద్ధం చేసిన దండల్ని మెడలో వేసుకుని అందచందాల్లో తాను రంగనాధస్వామికి సరిజోడి అని మురిసిపోయింది. ఓ సారి విష్ణుచిత్తుడు పూలదండలో గోదాదేవి వెంట్రుకలను చూశాడు మహాపరాధం జరిగిందని బాధపడ్డాడు. రంగనాథస్వామికి మాత్రం విరుల సౌరభాకన్నా గోదాదేవి కురుల పరిమళమే నచ్చింది. విష్ణుచిత్తుడికి కలలో కనిపించి గోదా కళ్యాణానికి అనతి ఇచ్చాడు. ఆండాళమ్మ ఆ అనంతకోటి బ్రహ్మాండనాయకుడిలో అదృశ్యమైంది. పన్నిద్దరు ఆళ్వారులో ఒకే ఒక మహిళ గోదాదేవి.

గోదాదేవి మధురభక్తికి ప్రతీక. శ్రీకృష్ణదేవరాయలు ఈ అంశాన్ని తీసుకుని అముక్తమాల్యద అనే కావ్యాన్ని రాశారు. రాయలవారు కళింగయుద్దాన్ని ముగించుకుని విజయవాడ దగ్గరలోని శ్రీకాకుళం అనే గ్రామంలో ఆంధ్రమహావిష్ణువు ఆలయంలో విడిదిచేశాడు. ఆ రాత్రి ఆంధ్రమహావిష్ణువు కలలో కనిపించి అండాళ్‌ మధురగాథను తెలుగులో ప్రబంధంగా రాసి సమర్పించమని ఆదేశించాడు. అలా తెలుగువారికి గోదాదేవితో ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడింది.

తిరుప్పావై : తిరు అంటే శ్రీ పావై అంటే వ్రతం తిరుప్పావై వ్రతాన్ని శ్రీవ్రతమని అంటారు. సూర్యోదయానికి ముందే లేచి ఆరాధన మొదలు నివేదన దాకా అన్నీ పూర్తి చేసుకుంటారు. గోదాదేవి పాడుకున్న 30 పాశురాల్ని రోజుకొక్కటి చొప్పున ఆలపిస్తారు. వయో లింగబేధాలు లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని జరుపుకోవచ్చుంటారు వైష్ణవ గురువు. ఇష్టఫలములను అందుకొనుటకు కష్టపడవలె చెల్లెలా.. అంటుంది గోదాదేవి చెలికత్తెతో ఓ పాశురంలో. ఆధ్యాత్మిక ఉన్నతికి శారీరక క్రలమశిక్షణ కూడా చాలా అవసరం ఓ వైపు వణికించే చలి. తెల్లవారుజామునే మేల్కొనాలి. ఆహార నియమాల్ని పాటించాలి. మితభాషణ చేయాలి. ఇతరులకు సాధ్యమైనంత ఇబ్బందిలేకుండా చూడాలి. అంటే ప్రియభాషణ కూడా అవసరమే. దానధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. భోగాలకు దూరంగా ఉండాలి.

ఆలయాలో : రేపల్లెలో గోపికలు కాత్యాయనీ వ్రతాన్ని నోచినట్లే.. గోదాదేవి పాశురాలతో శ్రీరంగనాథుని కొలుస్తుంది. తిరుప్పావై కృష్ణుడికీ గోపికకూ సంబంధించిన మామూలు కథలా అనిపించవచ్చు కానీ, పత్తిపువ్వును విప్పుతూ పోతే పత్తి ఎలా విస్తరిస్తుందో ప్రతి పాశురానికీ అంత విస్తారమైన అర్థం ఉంది అంటారు చిన జియర్‌స్వామి. ఇందులో రామాయణ, భారత సారాంశం ఉంది. అంతర్లీనంగా శ్రీవైష్ణవతత్వం, ఉపనిషత్‌ రహస్యాలు ఉన్నాయి.

వైష్ణావాలయాలు ధనుర్మాసంలో ఆధ్యాత్మికశోభతోపాటు వెలిగిపోతుంటాయి. విష్ణుసహస్రనామ పారాయణాలు, పాశురగానాలూ, గీతా ప్రవచనాలు ప్రతిధ్వనిస్తుంటాయి. తిరుమలలో ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదుగా తిరుప్పావైతోనే స్వామిని మేల్కొలుపుతారు. ధనువు అన్న మాటకు ధర్మమనే అర్థమూ ఉంది. ఈ మాసంలో ఆచరించే ధర్మమే..మనలను మిగతా మాసాల్లోనూ కాపాడుతుందనీ సత్యమార్గంలో నడిపిస్తుందని పండితులు చెబుతారు.

సుమతీ శతకం

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరాయనగాఁ
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులుబుట్ట నుడివెద సుమతీ!
సుమతీశతక కారుడు “సుమతీ” అని సంబోధన చేసి బుద్ధిమంతులకు మాత్రమే నీతులను చెప్తానని తెలిపాడు. లోకంలో నీతి మార్గాన్ని ఆచరించి బోధించిన శ్రీరాముని అనుగ్రహం పొందినవాడనై, లోకులు మెచ్చుకొనేలా మరలా మరలా చదువాలని ఆశ కలిగేలా వచిస్తున్నాను.
……………………………………………………………………………………….
అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమునఁదా
నెక్కిన బాఱని గుఱ్ఱము,
గ్రక్కున విడువంగవలయుఁ గదరా! సుమతీ!
సమయానికి సహాయం చేయని చుట్టాన్ని, నమస్కరించినా వరాలీయని దైవాన్ని, యుద్ధంలో తానెక్కగా పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడవాలి.
……………………………………………………………………………………….
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరనుఁ గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడిదున్నక బ్రతకవచ్చు మహిలో సుమతీ!
అడిగినా జీతమీయని ప్రభువును సేవించి కష్టపడటం కంటే, వడిగల యెద్దులను కట్టుకొని పొలం దున్నుకొని జీవించటమే మేలు.
……………………………………………………………………………………….
అడియాస కొలువుఁ గొలువకు,
గుడిమణియముఁ సేయఁబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దో డరయ కొంటి నరుగకు సుమతీ!
వ్యర్ధమైన ఆశగల కొలువు, దేవాలయంలో అధికారం, విడువకుండా చెడ్డవారితో స్నేహాం, అడవిలో తోడు లేకుండా ఓంటరిగా పోవటం తగినవికావు (కనుక, వాటిని మానివేయాలి).
……………………………………………………………………………………….


అధరము కదలియుఁగదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ,
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁజూడ బాపము సుమతీ!
పెదవి కదిలిందో లేదో తెలియని విధంగా, మంచి మాటలను మాని, అధికారమనే రోగంతో పలుకకపోవటమే నియమం కల్గినట్టి అధికారి – కన్నులతో చూడక, చెవులతో వినక, పెదవి కదల్చక ఉండే పీనుగుకు సమానమే అగుట చేత, అట్టి అధికారిని చూసినంతనే పాపం కలుగుతుంది.
……………………………………………………………………………………….
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్,
దప్పరయని నృపురాజ్యము
దెప్పరమై మీఁద గీఁడు దెచ్చుర సుమతీ!
అప్పులు చేసి ఆడంబరాలు చేయడం, ముసలితనంలో వయసులోనున్న భార్య ఉండటం, మూర్ఖుని తపస్సు, తప్పొప్పులను గుర్తించని రాజ్య పరిపాలన ముందు ముందు భయంకరమైన కష్టాన్ని కలిగిస్తాయి.
……………………………………………………………………………………….
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!
అప్పులిచ్చేవాడు, వైద్యుడు, యెడతెగకుండా నీరు పారుతుండే నది, బ్రాహ్మణుడూ ఇవి ఉన్న వూరిలో నివశించు. ఇవి లేని వూరిలో ప్రవేశించకు.
……………………………………………………………………………………….
అల్లుని మంచితనంబును,
గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్,
బొల్లున దంచిన బియ్యముఁ,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ!
అల్లుడు మంచిగానుండుట, గొల్ల విద్వాంసుడౌట, ఆడది నిజం చెప్పుట, పొల్లున దంచిన బియ్యం, తెల్లనికాకులు లోకంలో లేవని తెలియాలి.
……………………………………………………………………………………….
ఆఁకొన్న కూడె యమృతము
తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్
సోఁకోర్చువాఁడె మనుజుఁడు
తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ!
ఆకలిగా నున్నప్పుడు తిన్న అన్నమే అమృతం వంటిది. వెనుక ముందులాడక ఇచ్చేవాడే దాత. కష్టాలు సహించేవాడే మనిషి. ధైర్యం గలవాడే కులంలో శ్రేష్ఠుడు.
……………………………………………………………………………………….
ఆఁకలి యుడుగని కడుపును
వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్,
బ్రాఁ కొన్న నూతి యుదకము
మేకల పాడియును రోఁత మేదిని సుమతీ!
కడుపునిండని తిండి, గర్భం దాల్చికూడా లంజరికం మానని భోగం దాని జీవితం, పాచిపట్టి పాడయిన బావి నీరు, మేకల పాడి రోత కలిగిస్తాయి
……………………………………………………………………………………….
. ఇచ్చునదె విద్య, రణమునఁ
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్‌
మెచ్చునదె నేర్పు, వాదుకు
వచ్చునదే కీడుసుమ్ము! వసుధను సుమతీ!
ధనం ఇచ్చేదే విద్య, యుద్ధభూమిలో చొరబడేదే పౌరుషం, గొప్ప కవులు కూడా మెచ్చేదే నేర్పరితనం, తగువుకు వచ్చేదే చెరవు.
……………………………………………………………………………………….
ఇమ్ముగఁజదువని నోరును
‘అమ్మా’ యని పిలిచియన్న మడుగని నోరున్,
దమ్ములఁమబ్బని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
ఇంపుగా చదవని నోరు, అమ్మాయని పిలిచి అన్నమడగని నోరు, ఎన్నడూ తాంబూలం వేసుకోని నోరు, కుమ్మరి మన్నుకై త్రవ్విన గుంటతో సమానం.
……………………………………………………………………………………….
ఉడుముండదె నూఱేండ్లునుఁ
బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
కడునిలఁ బురుషార్థపరుఁడు గావలె సుమతీ!
ఉడుము నూరేళ్ళుండును, పాము వెయ్యేండ్లుడును, కొంగ మడుగులో చాలాకాలం జీవించును. కానీ, వాటి వలన ప్రయోజనమేమి? మంచి పనులలో ఆశక్తిగలవాడుండిన ప్రయోజనం కాని.
……………………………………………………………………………………….
ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యడలన్ దా
నెత్తిచ్చి కఱఁగబోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!
బంగారంతో సమానంగా తూచి కరగించి కడ్డీలుగా పోసినప్పటికీ ఇత్తడి బంగారంతో సమానం కాదు. అదేవిధంగా, నీచుడెంత ప్రయత్నించినా ఉత్తమ గుణాలను పొందలేడు.
……………………………………………………………………………………….
ఉదకముఁ ద్రావెడు హయమును,
మదమున నుప్పంగుచుండు మత్తేభబున్,
మొదవుకడ నున్న వృషభముఁ
జదువని యా నీచకడకుఁ జనకుర సుమతీ.
నీరు త్రాగుతున్న గుర్రం దగ్గరకు, మదం చేత ఉప్పొంగుతున్న మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గరనున్న ఎద్దు దగ్గరకు, చదువు రాని హీనుని వద్దకు వెళ్ళకు.
……………………………………………………………………………………….
ఉపకారికి నుపకారము
విపరీతము గాదుసేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక జేయువాడె నేర్పరి సుమతీ!
ఉపకారం చేసిన వానికి తిరిగి ఉపకారం చేయడం గొప్పవిషయం కాదు. కీడు చేసిన వాని తప్పులు లెక్కపెట్టకుండా ఉపకారం చేయటం తెలివైన పని.
……………………………………………………………………………………….
ఉపమింప మొదలు తియ్యన
కపటంబెడ నెడను, జెఱకు కై వడినే పో
నెపములు వెదకునుఁ గడపటఁ
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతీ!
పోల్చుకొని చూడగా, చెఱకు గడ మొదలు తియ్యగా ఉండి, మధ్యలో తీపి తగ్గి, చివరకు చప్పబడేట్లు, చెడు స్నేహం మొదట యింపుగా, మధ్యలో వికటంగా చివరకు చెరుపు కలిగించేదిగా ఉంటుంది.
……………………………………………………………………………………….
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుఁగువాఁడె ధన్యుఁడు సుమతీ!
ఏ సమయానికి ఏది తగినదో, అప్పటికి ఆ మాటలాడి, ఇతరుల మనస్సులు నొప్పించక, తాను బాధపడక, తప్పించుకొని నడచుకొనేవాడే కృతార్ధుడు.
……………………………………………………………………………………….
ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషునిఁ గొల్వఁగూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగనీడను
గప్పవసించు విధంబు గదరా సుమతీ!
ఎప్పుడు కూడా, తన తప్పులను వెతికే అధికారిని కొలువరాదు. తనను చంపటానికి ప్రయత్నించే పాము పడగ నీడన కప్ప నిలబడటానికి ప్రయత్నించకూడదు. ఈ రెండు కార్యాలు కష్టాన్ని కలిగిస్తాయి.
……………………………………………………………………………………….
ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్
దెప్పులుగఁ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ!
చెరువులో తెప్పలాడునట్లు నీరు నిండుగా ఉంటే, కప్పలు అనేకం చేరుతాయి. అలాగే భాగ్యం కలిగినప్పుడే చుట్టాలు వస్తారు.
లేతకాయలను కోయరాదు. చుట్టాలను నిందించరాదు. యుద్ధంలో పారిపోరాదు. గురువుల ఆజ్ఞను అతిక్రమించరాదు.
ఒక గ్రామానికి ఒక కరణం, ఒక న్యాయాధికారి కాకుండా, క్రమంగా ఎక్కువ మంది ఉంటే, అన్ని పనులు చెడిపోయి చెల్లాచెదురు కాకుంటాయా? (ఉండవు.)
……………………………………………………………………………………….
ఒల్లని సతి నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
గొల్లండుఁ గాక ధరలో
గొల్లండుఁను గొల్లడౌనె గుణమున సుమతీ!
ఇష్టపడని భార్యని, విశ్వాసంలేని యజమానిని, ఇష్టపడని స్నేహితుని, విడవటానికి ఇష్టపడనివాడే గొల్ల కాని, ఆ కులంలో పుట్టిన మాత్రాన గొల్లకాడు.
……………………………………………………………………………………….
ఓడలఁ బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీఁద నొప్పుగ వచ్చున్
ఓడలు బండ్లును వలెనే
వాడగబడుఁ గలిమిలేమి వసుధను సుమతీ!
ఓడల మీద బండ్లు, బండ్లమీద ఓడలు వస్తాయి. అలాగే ఐశ్వర్యం వెంట దారిద్ర్యం, దారిద్ర్యం వెంట ఐశ్వర్యం వస్తాయి
……………………………………………………………………………………….
కడు బలవంతుండైననుఁ
బుడమినిఁ బ్రాయంపుటాలిఁ పుట్టిన యింటన్
దడ వుండనిచ్చె నేనియుఁ
బడుపుగఁ నంగడికిఁదానె బంపుట సుమతీ!
ఎంత బలవంతుడైనా, పడుచు పెళ్ళాన్ని ఆమె పుట్టింటి దగ్గర ఎక్కువ కాలం ఉండనిస్తే, తానే ఆమెను వ్యభిచారిణిగా దుకాణానికి పంపినట్లవుతుంది.
బంగారపు గద్దెమీద కుక్కను కూర్చోబెట్టి, మంచి ముహూర్తాన పట్టాభిషేకం చేసినా దానికి సహజమైన అల్పగుణం మానదు. అలాగే నీచుడైన వానిని ఎంత గౌరవించినా వాని నీచగుణం వదలడు.
……………………………………………………………………………………….
కప్పకు నొరగాలైనను,
సప్పమునకు రోగమైన, సతి తులువైనన్,
ముప్పున దరిద్రుడైనను
తప్పదు మఱి దుఃఖమగుట తధ్యము సుమతీ!
కప్పకు కుంటికాలైనా, పాముకు రోగమైనా, భార్య చెడ్డదైనా, ముసలితనంలో దరిద్రం వచ్చినా, తప్పకుండా దుఃఖం కలుగుతుంది
……………………………………………………………………………………….
కమలములు నీరు బాసినఁ
గమలాప్తు రశ్మిసోకి కమలిన భంగిన్
దమతమ నెలవులు దప్పినఁ
దమ మిత్రులే శత్రులౌట తథ్యము సుమతీ!
కమలాలు తమ స్థానమయిన నీటిని వదిలితే, తమకు మిత్రుడగు సూర్యుని వేడి చేతనే వాడిపోతాయి. అలాగే, ఎవరైనా తమ తమ ఉనికిని విడిచినచో, తమ స్నేహితులే విరోధులవక తప్పదు.
……………………………………………………………………………………….
కరణముఁ గరణము నమ్మిన
మరణామ్తక మౌనుగాని మనలేడు సుమీ
కరణము దనసరి కరణము
మరి నమ్మక మర్మమీక మనవలె సుమతీ!
కరణం మరొక కరణాన్ని నమ్మితే ప్రాణాపాయమైన ఆపద కల్గును గానీ బ్రతుకలేడు. కావునా కరణం, తనతో సాటియైన కరణాన్ని నమ్మక మరియు రహస్యాన్ని తెలుపక జీవించాలి.
……………………………………………………………………………………….
కరణముల ననుసరింపక విరిసంబునఁ
దిన్నతిండి వికటించుఁజుమీ,
యిరుసునఁ గందెన బెట్టక
పరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ!
కందెన లేకపోతే, ఏ విధంగా దేవుని బండైనా కదలదో, అదే విధంగా కరణానికి ధనమిచ్చి అతనికి నచ్చినట్లు నడవకపోతే తన స్వంత ఆస్తికే మోసమొస్తుంది.

కరణము సాధై యున్నను
గరి మద ముడిగినను బాము కరవకయున్నన్
ధరదేలు మీటకున్నను
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ!
తాత్పర్యం కరణం మెత్తనితనం కలిగిఉన్నా, ఏనుగు మదం విడిచినా, పాము కరవకున్నా, తేలు కుట్టకున్నా జనులు లెక్కచేయరు.
…………………………………………………………………………………………..
కసుగాయఁ గరచి చూచిన
మసలక తన యోగరుగాక మధురంబగునా?
పసగలుగు యువతులుండఁగఁ
బసిబాలలఁ బొందువాఁడు పశువుర సుమతీ!
తాత్పర్యం పండిన పండు తినకుండా, పచ్చికాయ కొరికితే వెంటనే వగరు రుచి కలుగుతుంది గానీ, మధురంగా ఎలా ఉంటుంది; అలాగే యౌవనం గల స్త్రీలుండగా పసి బాలికలతో కూడినచో వికటంగా ఉంటుంది. చిన్న బాలికల పొందు గూడినవాడు పశువుతో సమానుడు. .
…………………………………………………………………………………………..
కవి గానివాని వ్రాతయు.
నవరసభావములు లేని నాతులవలపున్.
దవిలి చని పంది నేయని.
విధధాయుధకౌశలంబు వృధరా సుమతీ! .
తాత్పర్యం కవిత్వ శక్తిలేనివాడు వ్రాసిన వ్రాత, నవరసాల అనుభవంలేని స్త్రీలయొక్క మోహం, వెంబడించి పరుగెత్తి పందిని కొట్టలేనటువంటివాని నానా విధాయుధాల నేర్పరితనం వ్యర్థాలు. .
…………………………………………………………………………………………..
కాదుసుమీ దుస్సంగతి.
పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్, .
వాదుసుమీ యప్పిచ్చుట.
లేదుసుమీ సతులవలపు లేశము సుమతీ! .
తాత్పర్యం దుర్జన స్నేహం మంచిది కాదు. కీర్తి సంపాదించిన తరువాత తొలగిపోదు. అప్పునిచ్చుట కలహానికి మూలం. స్త్రీలకు కొంచెమైనా ప్రేమ ఉండదు. .
…………………………………………………………………………………………..
కాముకుడు దనిసి విడిచినఁ.
కోమలిఁ బరవిటుఁడు గవయఁ .
గోరుటయెల్లన్.
బ్రేమమునఁ జెఱుకు పిప్పికిఁ.
జీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ! .
తాత్పర్యం కాముకుడు తాను తృప్తిపడే వరకూ అనుభవించి విడిచిన స్త్రీని మరొక విటగాడనుభవించగోరుట, చెరుకురసం పీల్చుకొనగా మిగిలిన పిప్పిని చీమలు ఆశతో ముసురుకొన్నట్లు ఉపయోగంలేనిదిగా ఉంటుంది.
…………………………………………………………………………………………..
కారణము లేని నగవునుఁ.
బేరణములేని లేమ పృథివీ స్థలిలోఁ.
బూరణములేని బూరెయు.
వీరణములులేని పెండ్లి, వృధరా సుమతీ! .
తాత్పర్యం కారణంలేని నవ్వుకి, రవిక లేక స్త్రీకి, పూరణంలేని బూరెకి, వాయిద్యాలు లేని పెళ్ళికి గౌరవం ఉండదు. ..
…………………………………………………………………………………………..
కులకాంతతోఁడ నెప్పుడుఁ..
గలహింపకుఁ వట్టితప్పు ఘటియింపకుమీ..
కలకంఠ కంటి కన్నీ..
రొలికిన సిరి యింటనుండ నొల్లదు సుమతీ! ..
తాత్పర్యం భార్యతో ఎప్పుడూ జగడమాడరాదు, లేని తప్పులు మోపరాదు. పతివ్రతైన స్త్రీ కంటినీరు ఇంట పడితే, ఆ ఇంటిలో సంపద వుండదు. …………………………………………………………………………………………..


కూరిమిగల దినములలో
నేరము లెన్నఁడును గలుఁగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ!
తాత్పర్యం స్నేహం గల దినాలలో ఎన్నడూ తప్పులు కనపడవు. ఆ స్నేహం విరోధమైతే ఒప్పులే తప్పులుగా కనిపిస్తాయి. ..
…………………………………………………………………………………………..
కొంచెపు నరుసంగతిచే ..
నంచితముఁగ గీడువచ్చు నది యెట్లన్నన్..
గించిత్తు నల్లి కఱచిన..
మంచమునకుఁ బెట్లు వచ్చు మహిలో సుమతీ! ..
తాత్పర్యం చిన్న నల్లి కరిస్తే మంచానికే విధంగా దెబ్బలు కలుగుతాయో, అలాగే నీచునితో స్నేహం చేస్తే కీడు కలుగుతుంది. ..
…………………………………………………………………………………………..
కొక్కోక మెల్ల జదివిన
చక్కనివాఁసైన రాజ చంద్రుండైనన్ ..
మిక్కిలి రొక్కము నీయక..
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ! ..
తాత్పర్యం రతిశాస్త్రమంతా చదివినవాడైనా, అందం గలవాడైనా, రాజులలో శ్రేష్టుడైనా, మిక్కిలి ధనమీయకుండా వేశ్య లభించదు. ..
…………………………………………………………………………………………..
కొఱగాని కొడుకు పుట్టినఁ..
గొఱగామియెగాదు తండ్రి ..
గుణములఁజెఱచున్..
జెఱకుతుద వెన్ను పుట్టినఁ..
జెఱ్కునఁ తీపెల్ల జెరచు సిద్ధము సుమతీ! ..
తాత్పర్యం చెరకుకొనకు వెన్నుపుట్టి ఆ చెరకులోని తియ్యదనమంతా ఎలా పాడుచేస్తుందో, అలాగే నిష్ప్రయోజకుడైన కొడుకు పుడితే వాడు నిష్ప్రయోజకుడవటమేగాక తండ్రి యొక్క మంచి గుణాలు కూడా పాడుచేస్తాడు. ..
…………………………………………………………………………………………..
కోమలి విశ్వాసం బునూ ..
బాములతో జెలిమిఁ యన్య భామల వలపున్, ..
వేముల తియ్యదనంబును, ..
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ! ..
తాత్పర్యం స్త్రీలయొక్క నమ్మకం, పాములతో స్నేహం, పరస్త్రీల యొక్క మోహం, వేపచెట్టు తియ్యదనం, రాజుల విశ్వాసానికి కల్లలు …………………………………………………………………………………………..
గడనగల మగనిఁ జూచిన..
నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలోఁ..
గడనుడుగు మగనిఁజూచిన..
నడపీనుగు వచ్చెననుచు నగుదురు సుమతీ! ..
తాత్పర్యం స్త్రీలు సంపాదన గల పతిని చూసి, అడుగులకు క్రింద వస్త్రపు మడతలు వేసినట్లు తమలో భావిస్తూ గౌరవిస్తారు. సంపాదన లేని పతిని చూస్తే, నడిచే పీనుగుగా తమలో భావిస్తూ పరిహాసం చేస్తారు. ..
…………………………………………………………………………………………..
చింతింపకు కడచిన పని..
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో ..
నంతఃపుర కాంతలతో ..
మంతనముల మానుమిదియె మతముర సుమతీ! ..
తాత్పర్యం జరిగిపోయిన పనికి విచారించకు. స్త్రీలు ప్రేమిస్తారని నమ్మకు. రాణివాస స్త్రీలతో రహస్య ఆలోచనలు చేయకు. ఇదే మంచి నడవడి సుమా! ..
…………………………………………………………………………………………..
చీమలు పెట్టిన పుట్టలు..
పాముల కిరువైన యట్లు పామరుఁడుదగన్..
హేమంబుఁ గూడఁ బెట్టిన..
భూమీశుల పాలఁజేరు భువిలో సుమతీ! ..
తాత్పర్యం చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైన విధంగానే, లోభి దాచిన ధనం రాజుల పాలవుతుంది..
…………………………………………………………………………………………..
చుట్టములు గానివారలు..
చుట్టములముఁ నీకటంచు సొంపుదలిర్పన్ నెట్టుకొని యాశ్రయింతురు..
గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ! ..
తాత్పర్యం బంధువులుకాని వారు సహితం ధనం కలిగినపుడు, నీకు మేము చుట్టాలమని ఉల్లాసంతో బలవంతంగా వచ్చి మిగుల దృఢంగా ఆశ్రయిస్తారు. ..
…………………………………………………………………………………………..
చేతులకు తొడవు దానము..
భూతలనాథులకుఁ దొడవు బొంకమి, ధరలో, ..
నీతియె తోడ వెవ్వారికి..
నాతికి మానంబు తొడవు, నయముగ సుమతీ! ..
తాత్పర్యం చేతులకు దానం, రాజులకు అబద్ధమాడకుండటం, ధరణిలో ఎవ్వరికైనా న్యాయం, స్త్రీకి పాతివ్రత్యం అలంకారం. ..
…………………………………………………………………………………………..
తడవోర్వక యొడలోర్వక..
కడువేగం బడచిపడిన గార్యంబుగానే..
తడవోర్చిన నొడ లోర్చినఁ..
జెడిపోయిన కార్యమెల్లఁ జేకురు సుమతీ! ..
తాత్పర్యం ఆలస్యాన్ని, శ్రమను సహించక వెంటనే త్వరపడితే ఏ కార్యం జరగదు? ఆలస్యం, శ్రమ సహించి ఓపిక పడితే చెడిపోయిన కార్యమంతా సమకూరుతుంది. ..
…………………………………………………………………………………………..
తన కోపమె తన శత్రువు..
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌఁ..
తన సంతోషమె స్వర్గము..
తనదుఖఃమె నరక మండ్రు, తథ్యము సుమతీ!
తాత్పర్యం తన కోపం శత్రువులాగా భాధను, నెమ్మదితనం రక్షకునిలాగా రక్షను, కరుణ చుట్టంలాగా ఆదరమును, సంతోషం స్వర్గంలాగా సుఖాన్ని, దుఃఖం నరకంలాగా వేదనను కల్గిస్తాయని చెప్తారు. ..
…………………………………………………………………………………………..
తనయూరి తపసి తనమును
దనబుత్రుని విద్యపెంపుఁ దన సతి రూపున్
దన పెరటిచెట్టు మందును
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి
తాత్పర్యం
తన గ్రామంలో చేసే తపోనిష్ఠను, తన కుమారుని విద్యావైభోగంను, తన భార్య యొక్క సౌందర్యంను, తన పెరటిలోని చెట్టు మందును, ఎటువంటి మనిషైనా పొగడడు. ..
…………………………………………………………………………………………..
తన కలిమి యింద్రభోగము, ..
తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్, ..
తన చావు జగత్ప్రళయము..
తను వలచిన యదియెరంభ తథ్యము సుమతీ! ..
తాత్పర్యం తన భాగ్యం ఇంద్రవైభవం వంటిదిగానూ, తన పేదరికమే ప్రపంచాన గొప్ప దారిద్ర్యం వంటిదిగానూ, తన చావే యుగాంత ప్రళయం వంటిదిగానూ, తాను వలచిన స్త్రీయే చక్కదనం కలిగినటువంటిదిగానూ మనుషులెంచుతారు. ..
…………………………………………………………………………………………..
తనవారు లేని చోటను, ..
జన వించుక లేనిచోట జగడము చోటన్, ..
అనుమానమైన చోటను, ..
మనుజునట నిలువఁదగదు మహిలో సుమతీ! ..
తాత్పర్యం తన బంధువులులేని చోటులో, తనకు మచ్చికలేని చోటులో, తనపై అనుమాన మైన చోటులో మనుష్యుడు నిలువకూడదు. ..
…………………………………………………………………………………………..
తలపొడుగు ధనముఁబోసిన..
వెలయాలికి నిజములేదు వివరింపంగాఁ..
దల దడివి బాస జేఁసిన..
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ! ..
తాత్పర్యం తల పొడుగు ధనం పోసినప్పటికీ, వేశ్యా స్త్రీకి నిజం చెప్పటమనేది లేదు. తల మీద చేయి వేసుకొని ప్రమాణం చేసినా అటువంటి కాంతను నమ్మరాదు. ..
…………………………………………………………………………………………..
తలమాసిన, వొలుమాసినఁ, ..
వలువలు మాసిననుఁ బ్రాణ వల్లభునైనన్..
కులకాంతలైన రోఁతురు, ..
తిలకింపఁగ భూమిలోన దిరముగ సుమతీ! ..
తాత్పర్యం ఆలోచించగా, భూమిమీద తల, శరీరం, బట్టలు మాస్తే భర్తనైనా (మంచి స్త్రీలైనప్పటికీ) అసహ్యపడటం నిజం ..
. …………………………………………………………………………………………..
దగ్గర కొండెము చెప్పెడు ..
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱి తా..
నెగ్గుఁ బ్రజ కాచరించుట..
బొగ్గులకై కల్పతరువుఁ బొడచుట సుమతీ! ..
తాత్పర్యం మంత్రి చెప్పే చాడీ మాటలకు లోబడి మంచిచెడ్డలు తెలుసుకొనక రాజు ప్రజలను హింసించడం బొగ్గుల కోసం కోరిన కోరికలిచ్చే కల్పవృక్షాన్ని నరికేసుకోవడం వంటిది.
…………………………………………………………………………………………..
తాననుభవింప నర్ధము ..
మానవపతి జేరు గొంత మఱి భూగతమౌ ..
గానల నీగలు గూర్చిన..
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ! ..
తాత్పర్యం నిజంగా తేనెటీగలు అడవులలో చేర్చి ఉంచిన తేనె ఇతరులకు ఎలా చేరుతుందో, అలాగే తాము అనుభవించక దాచి ఉంచిన ధనం కొంత రాజులకు చేరుతుంది, మరికొంత భూమి పాలవుతుంది. ..
…………………………………………………………………………………………..
ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్షమెత్తగవలసెన్
దనవారి కెంతకల గిన
దనభాగ్యమె తనఁకుగాక తథ్యము సుమతీ!
తాత్పర్యం ధన వంతుడైన కుబేరుడు స్నేహితుడైనప్పటికీ, ఈశ్వరుడు బిచ్చమెత్తటం సంభవించెను. కాబట్టి, తన వారికెంత సంపద ఉన్నా, తనకుపయోగపడదు. తన భాగ్యమే తనకు ఉపయోగపడును. ..
…………………………………………………………………………………………..
ధీరులకుఁ జేయు మేలది..
సారంబగు నారికేళ సలిలము భంగిన్..
గౌరవమును మఱి మీఁదట..
భూరిసుఖావహము నగును భువిలో సుమతీ! ..
తాత్పర్యం కొబ్బరిచెట్టుకు నీరు పోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను యిచ్చును. అలాగే బుద్ధిమంతులకు చేసిన ఉపకారం మర్యాదను, తరువాత మిక్కిలి సుఖాలను కల్గిస్తుంది. ..

నడువకుమీ తెరువొక్కటఁ
గుడువకుమీ శత్రునింట గూరిమితోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ!
తాత్పర్యము మార్గంలో ఒంటరిగా నడవకు. పగవాని ఇంటిలో స్నేహంతో భుజించకు. ఇతరుల ధనాన్ని మూట కట్టకు. ఇతరుల మనస్సు నొచ్చునట్లు మాట్లాడకు.
………………………………………………………………………………………….
నమ్మకు సుంకరి, జూదరి
నమ్మకు మగసాలివాని, నటు వెలయాలిన్
నమ్మకు నంగడి వానిని
నమ్మకుమీ వామహస్త నవనిని సుమతి
తాత్పర్యము పన్నులు వసూలు చేయువానిని, జూదమాడు వానిని, కంసాలిని, భోగం స్త్రీని, సరుకులమ్మేవానిని, ఎడమచేతితో పనిచేయువానిని నమ్మకు.
………………………………………………………………………………………….
నవమున బాలుంద్రావరు
భయమునను విషమ్మునైన భక్షింతురుగా
నయమెంత దోసకారియె
భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!
తాత్పర్యము మంచితనం వల్ల పాలను సహితం త్రాగరు. భయపెట్టటం చేత విషమైనా తింటారు. కావునా, భయాన్ని చక్కగా చూపించాలి. ………………………………………………………………………………………….
నరపతులు మేరఁదప్పిన,
దిర మొప్పగ విధవ యింటఁ దీర్పరియైనన్,
గరణము వైదికుఁడయినను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!
తాత్పర్యము రాజులు ధర్మం యొక్క హద్దు తప్పినా, విధవాస్త్రీ ఇంటిని ఎల్లకాలం పెత్తనం చేసినా, గ్రామకరణం వైదికవృత్తి గలవాడైనా ప్రాణం పోవునంతటి కష్టం తప్పకుండా సంభవిస్తుంది.
………………………………………………………………………………………….
నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును, దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!
తాత్పర్యము శృంగారాది నవరసాలతో, భావాలతో అలంకరించబడిన కవిత్వ ప్రసంగాన్ని, మనోహరమైన పాటను, తెలివిలేనివారికెంత తెలియజేసినా చెవిటివాడికి శంఖమూదినట్లే నిరర్థకమవుతాయి.
………………………………………………………………………………………….
నవ్వకుమీ సభలోపల
సవ్వకుమీ తల్లిదండ్రి నాధులతోడన్,
నవ్వకుమీ పరసతులతో,
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
తాత్పర్యము సభలోపల, తల్లిదండ్రులతో, అధికారులతో, పరస్త్రీతో, బ్రాహ్మణ శ్రేష్టులతో పరిహాసాలాడకు.
………………………………………………………………………………………….


నీరే ప్రాణాధారము,
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్,
నారే నరులకు రత్నము,
చీరే శృంగార మండ్రు, సిద్ధము సుమతీ!
తాత్పర్యము నీరే అన్ని జీవులకు బ్రతకటానికి ఆధారం. నోరే రసవంతమైన సమస్తమైన మాటలు పల్కటానికి స్థానం. స్త్రీయే సర్వజనులకు రత్నం. వస్త్రమే సింగారానికి ముఖ్యం.
………………………………………………………………………………………….
పగవల దెవ్వరితోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగనాడవలదు సభలను,
మగువకు మన సియ్యవలదు మహిలో సుమతీ!
తాత్పర్యము ఎటువంటి వారితోనూ పగపెట్టుకోరాదు. బీదతనం సంభవించిన తరువాత విచారించరాదు. సభలలో మోమాటం లేకుండా మాట్లాడరాదు. స్త్రీకి, మనసులోని వలపు తెలుపరాదు.
………………………………………………………………………………………….
పతికడకుఁ, తనుఁ గూర్చిన
సతికడకును, వేల్పుఁకడకు, సద్గురు కడకున్,
సుతుకడకును రిత్తచేతుల
మతిమంతులు చనరు, నీతి మార్గము సుమతీ!
తాత్పర్యము నీతి ప్రవర్తన గలవారు, రాజు దగ్గరకు, తనను ప్రేమించే భార్య దగ్గరకు, దేవుని సముఖానికి, గురువు దగ్గరకు, కుమారుని దగ్గరకు వట్టి చేతులతో వెళ్ళరు
………………………………………………………………………………………….


. పనిచేయు నెడల దాసియు,
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్,
దనుభక్తి యెడలఁ దల్లియు,
యనదగు కులకాంత యుండనగురా సుమతీ!
తాత్పర్యము
భార్య ఇంటిపనులు చేసేటపుడు సేవకురాలవుతుంది, భోగించునపుడు రంభలాగా, సలహాలు చెప్పునపుడు మంత్రిలాగా, భుజించునపుడు తల్లిలాగా ఉండాలి.
………………………………………………………………………………………….
పరనారీ సోదరుఁడై
పరధనముల కాసపడక పరులకు హితుడైఁ
పరుల దనుఁబొగడ నెగడక
పరుఁలలిగిన నలుగనతఁడు పరముడు సుమతీ!
తాత్పర్యము పరస్త్రీలకు సోదరునిలాగా ఉండి, పరుల భాగ్యాలకు ఆశపడక, పరులకు స్నేహితుడై, పరులు తన్ను కొనియాడితే వుబ్బక, పరులు కోపించినా తాను కోపించని మనుష్యుడే ఉత్తముడు.
………………………………………………………………………………………….
పరసతి కూటమిఁ గోరకు,
పరధనముల కాసపడకు, పరునెంచకుమీ,
సరిగాని గోష్టి చేయకు,
సిరిచెడి చుట్టంబుకడకు జేరకు సుమతీ!
తాత్పర్యము పరసతుల పొందు కోరకు. ఇతరుల భాగ్యానికి ఆశపడకు. పరుల తప్పులెంచకు. తగనటువంటి ప్రసంగం చేయకు. ఐశ్వర్యం కోల్పోయిన కారణంగా బంధువుల వద్దకు వెళ్ళకు.
………………………………………………………………………………………….
పరసతుల గోష్ఠినుండిన
పురుషుఁఢు గాంగేయుఁడైన భువినిందవడున్,
బరసతి సుశీలయైనను,
బరుసంగతినున్న నింద పాలగు సుమతీ!
తాత్పర్యము బ్రహ్మచర్య వ్రతం గల భీష్ముడైనప్పటికీ, పరకాంతల ప్రసంగంలో ఉంటే అపకీర్తి పాలవుతాడు. అలాగే, మంచిగుణం గల స్త్రీయైనా పరపురుషుని సహవాసం కల్గిఉంటే అపకీర్తి పాలవుతుంది.
………………………………………………………………………………………….
తాత్పర్యము మనసులో పరపురుషుని కోరే భార్యను విడవాలి. ఎదురుమాట్లాడే కుమారుని క్షమించకూడదు. భయపడని సేవకుని ఉంచరాదు. పలుమార్లు భార్యతో పొందు మానాలి.
………………………………………………………………………………………….
పరుల కనిష్టము సెప్పకు,
పొరుగిండ్లకుఁ బనులు లేక పోవకు మెపుడున్
బరుఁ గలిసిన సతి గవయకు
మెరిఁగియు బిరుసైన హయము నెక్కకు సుమతీ!
తాత్పర్యము ఇతరులకు యిష్టంగాని దానిని మాట్లాడకు. పనిలేక ఇతరుల ఇండ్లకెన్నడూ వెళ్ళకు. ఇతరులు పొందిన స్త్రీని పొందకు. పెంకితనం కలిగిన గుర్రం ఎక్కకు.
………………………………………………………………………………………….
పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో
గర్వింపఁ నాలి బెంపకు
నిర్వాహము లేనిచోట నిలువకు, సుమతీ!
తాత్పర్యము పుణ్యదినాలలో స్త్రీలను పొందకు. రాజు యొక్క దయను నమ్మి పొంగకు. గర్వించేలా భార్యను పోషించకు. బాగుపడలేనిచోట ఉండకు.
పలుదోమి సేయు విడియము
………………………………………………………………………………………….
తలగడిగిన నాఁటి నిద్ర, తరుణులతోడన్
పొలయలుక నాఁటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ!
తాత్పర్యము దంతాలు తోముకొనిన వెంటనే వేసుకొను తాంబూలం, తలంటుకొని స్నానం చేసిననాటి నిద్ర, స్త్రీలతో ప్రణయకలహంనాడు కూడిన పొందు వీటి విలువ ఇంతని చెప్పలేం సుమా!
………………………………………………………………………………………….
పాటెరుగని పతి కొలువును,
గూటంబున కెఱుకపడని గోమలి రతియున్,
జేటెత్త జేయు జెలిమియు
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ!
తాత్పర్యము పనియొక్క కష్టసుఖాలు తెలుసుకోని అధికారి సేవ, కూటమి తెలియనటువంటి స్త్రీయొక్క సంభోగం, కీడును కలిగించే స్నేహం, విచారించి చూడగా – నదికి ఎదురు యీదు నంతటి కష్టంలాగా ఉంటుంది.
………………………………………………………………………………………….
పాలను గలిసిన జలమును
బాలవిధంబుననే యుండుఁ బరికింపగ
బాల చవిఁజెరచు గావున
బాలసుఁడగువాని పొందు వలదుర సుమతీ!
తాత్పర్యము పాలతో కలిపిన నీరు పాల విధంగానే ఉంటుంది. కానీ, శోధించి చూడగా పాలయొక్క రుచిని పోగొడుతుంది. అలాగే, చెడ్డవారితో స్నేహం చేస్తే మంచి గుణాలు పోతాయి. కావునా, చెడ్డవారితో స్నేహం వద్దు.
………………………………………………………………………………………….
పాలసునకైన యాపద
జాలింబడి తీర్పఁదగదు సర్వజ్ఞునకుఁ
దే లగ్నిబడగఁ బట్టిన
మేలెరుగునె మీటుగాక మేదిని సుమతీ!
తాత్పర్యము తేలు నిప్పులో పడినప్పుడు దానిని జాలితో బయటకు తీసి పట్టుకొంటే కుడుతుంది. కానీ మనం చేసే మేలును తెలుసుకోలేదు. అలాగే జాలిపడి మూర్ఖునికి ఆపదలో సహాయం చేయజూస్తే తిరిగి మనకే ఆపకారం చేస్తాడు. కనుక అట్లు చేయరాదు.
………………………………………………………………………………………….
పిలువని పనులకు బోవుట
కలయని సతి రతియు రాజు గానని కొలువు
బిలువని పేరంటంబును
వలవని చెలిమియును జేయవలదుర సుమతీ
తాత్పర్యము పిలువని పనులకు పోవటం, ఇష్టపడని స్త్రీతో భోగించటం, రాజు చూడని ఉద్యోగం, పిలువని పేరంటం, ప్రేమించని స్నేహం చేయరాదు.
………………………………………………………………………………………….
పురికిని బ్రాణము కోమటి
వరికిని బ్రాణంబు నీరు వసుమతిలోనం
గరికిని బ్రాణము తొండము
సిరికిని బ్రాణమ్ము మగువ సిద్ధము సుమతీ!
తాత్పర్యము పట్టణానికి కోమటి, వరిపైరుకి నీరు, ఏనుగుకు తొండం, సిరి సంపదలకు స్త్రీ ప్రాణం వంటివి.
………………………………………………………………………………………….
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని గనుకొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ!
తాత్పర్యము తండ్రికి కుమారుడు పుట్టగానే పుత్రుడు కలగటం వలన వచ్చే సంతోషం కలగదు. ప్రజలు ఆ కుమారుని చూసి మెచ్చిన రోజునే ఆ సంతోషం కలుగుతుంది.
………………………………………………………………………………………….
పులిపాలు దెచ్చియిచ్చిన
నలవడఁగా గుండెగోసి యరచే నిడినన్
దలపొడుగు ధనముఁబోసిన
వెలయాలికిఁగూర్మిలేదు వినరా సుమతీ!
తాత్పర్యము పులి పాలు తెచ్చినా, గుండెకాయను కోసి అరచేతిలో పెట్టినా, తలెత్తు ధనం పోసినా, వేశ్యా స్త్రీకి ప్రేమ ఉండదు.
………………………………………………………………………………………….
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్ధములున్
బెట్టని దినములఁ గనకఁపు
గట్టెక్కిన నేమిలేదు గదరా సుమతీ!
తాత్పర్యము పూర్వజన్మలో తాను దానమిచ్చిన ఫలం వలన, అడవి మధ్యలో ఉన్నా సకల పదార్ధాలు కలుగుతాయి. పూర్వ జన్మలో దానమియ్యకపోతే తాను బంగారుకొండ ఎక్కినా ఏమీ లభించదు
………………………………………………………………………………………….
పొరుగునఁపగవాఁడుండిన
నిర వొందఁగ వ్రాతగాఁడు ఏలికయైనన్
ధరఁగాఁపు కొండెమాడినఁ
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ!
తాత్పర్యము ఇంటి పొరుగున విరోధి కాపురమున్నా, వ్రాతలో నేర్పరియైనవాడు పాలకుడైనా, రైతు చాడీలు చెప్పేవాడైనా కరణాలకు బ్రతుకుతెరువుండదు.
………………………………………………………………………………………….
బంగారు కుదువఁబెట్టకు
సంగరమునఁ బాఱిపోకు, సరసుడవై తే
నంగడి వెచ్చము లాడకు,
వెంగలితోఁ జెలిమివలదు వినురా సుమతీ!
తాత్పర్యము బంగారం తాకట్టుపెట్టకు. యుద్ధంలో పారిపోకు. దుకాణంలో వెచ్చాలు అప్పు తీసుకోకు. అవివేకితో స్నేహం చేయకు.
………………………………………………………………………………………….
బలవంతుఁడ నాకేమని
బలువురతో నిగ్రహించి పలుకుటమేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేతఁజిక్కి చావదె సుమతీ!
తాత్పర్యము బలం కలిగిన పాము ఐనా చలి చీమల చేత పట్టుబడి చస్తుంది. అలాగే తాను బలవంతుడనే గదా అని అనేకులతో విరోధ పడితే, తనకే కీడు వస్తుంది.
………………………………………………………………………………………….
మండలపతి సముఖంబున
మెండైన ప్రధానిలేక మెలఁగుట యెల్లన్‌
గొండంత మదపుటేనుగు
తొండము లేకుండినట్లు తోచుర సుమతీ!
తాత్పర్యము కొండంత ఏనుగుకు తొండంలేకపోతే ఎలా నిరర్ధకమో, అలాగే రాజు యొక్క సముఖాన సమర్ధత గల మంత్రిలేకపోతే రాజ్యం నిరర్ధకం.
మంత్రి ఉన్న రాజు యొక్క రాజ్యం, కట్టుబాటు చెడిపోకుండా జరుగుతుంది. మంత్రి లేని రాజు యొక్క రాజ్యం కీలూడిన యంత్రంలాగా నడవదు.
…………………………………………………………………………………………..

మాటకుఁ బ్రాణము సత్యము
కోటకుఁ బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్
బోటికిఁ బ్రాణము మానము
చీటికిఁ బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ
తాత్పర్యం : మాటకు సత్యం, కోటకు మంచి భటుల సమూహం, స్త్రీకి సిగ్గు, ఉత్తరానికి చేవ్రాలు (సంతకం) జీవనాలు(ప్రాణంలాగా ముఖ్యమైనవి).
…………………………………………………………………………………………..
మానఘనుఁ డాత్మధృతిఁ జెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెడు జలములలోపల
నేనుఁగు మెయి దాఁచినట్టు లెరగుము సుమతీ!
తాత్పర్యం : అభిమానవంతుడు ధైర్యం తొలగి నీచుని సేవించటం, కొంచెం నీళ్ళలో ఏనుగు శరీరాన్ని దాచుకొను విధంగా ఉంటుంది.
…………………………………………………………………………………………..
నాది నొకని వలచియుండగ
మదిచెడి యొక క్రూరవిటుడు మానక తిరుగున్‌
బొది జిలుక పిల్లి పట్టిన
జదువునె యా పంజరమున జగతిని సుమతీ!
తాత్పర్యం : పిల్లిని పంజరంలో పెట్టినా, పంజరం మధ్యనున్న చిలుక మాట్లాడునా? అలాగే మనసునందొకని ప్రేమించిన స్త్రీ, మరొక విటుడెంత బ్రతిమాలినా ప్రేమించదు.
…………………………………………………………………………………………..
మేలెంచని మాలిన్యుని
మాలను నగసాలివాని మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేలఁగలసిపోవుగాని నెగడదు సుమతీ!
తాత్పర్యం : ఉపకారం తలపోయని పాపాత్ముని, మాలను, కంసాలిని, మంగలిని వీళ్ళను స్నేహితులుగా చేసుకున్న రాజుయొక్క రాజ్యం నశించునే గానీ వృద్ధి చెందదు.
…………………………………………………………………………………………..
రా పొమ్మని పిలువని యా
భూపాలునిఁ గొల్వ ముక్తి ముక్తులు గలవే
దీపంబు లేని ఇంటను
చెవుణికీళ్లాడినట్లు సిద్ధము సుమతీ!
తాత్పర్యం : దీపంలేని ఇంటిలో చేతిపట్టులాడిన పట్టుదొరకనట్లే, ‘రమ్ము పొమ్ము’ అని ఆదరించని రాజును సేవించటం వలన భుక్తి ముక్తులు కల్గవు.
…………………………………………………………………………………………..
రూపించి పలికి బొంకకు,
ప్రాపగు చుట్టంబు కెగ్గు పలుకకు, మదిలో
గోపించు రాజుఁ గొల్వకు
పాపపు దేశంబు సొరకు, పదిలము సుమతీ!
తాత్పర్యం : రూఢి చేసి మాట్లాడిన తరువాత అబద్ధమాడకు. సహాయంగా ఉండు బంధువులకు కీడు చేయకు. కోపించే రాజును సేవించకు. పాపాత్ములుండే దేశానికి వెళ్ళకు
…………………………………………………………………………………………..


. లావుగలవానికంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ!
తాత్పర్యం : కొండంతటి ఏనుగును మావటి వాడెక్కి లోబరచుకొనేట్లు లావుగలిగిన వాడికంటే, నీతి గల్గినవాడు బలవంతుడగును.
…………………………………………………………………………………………..
వరదైన చేను దున్నకు
కరవైనను బంధుజనుల కడకేగకుమీ
పరులకు మర్మము సెప్పకు
పిరికికి దళవాయితనము బెట్టకు సుమతీ!
తాత్పర్యం : వరద వచ్చే పొలంలో వ్యవసాయం చేయకు, కరువు వస్తే చుట్టాల కడ కరుగకు. ఇతరులకు రహస్యం చెప్పకు. భయం గలవాడికి సేవా నాయకత్వం ఇవ్వకు.
…………………………………………………………………………………………..
వరి పంటలేని యూరును
దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్
ధరను బతిలేని గృహమును
అరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!
తాత్పర్యం : వరిపంట లేని ఊరు, అధికారి ఉండని గ్రామం, తోడు దొరకని మార్గం, యజమాని లేని ఇల్లు వల్లకాడుతో సమానం.
…………………………………………………………………………………………..
తాత్పర్యం : ఎవ్వరు చెప్పినా వినవచ్చు. వినగానే తొందరపడక నిజమో అబద్ధమో వివరించి తెలుసుకొనినవాడే న్యాయం తెలిసినవాడు.
…………………………………………………………………………………………..
వీడెము సేయని నోరును
జేడెల యధరామృతంబుఁ జేయని నోరును
బాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!
తాత్పర్యం : తాంబూలం వేసుకోని నోరు, చెప్పిన మాట మరలా లేదని పలికే నోరు, పాటపాడటం తెలియని నోరు, బూడిద మన్ను పోసే గుంటతో సమానం
…………………………………………………………………………………………..
వెలయాలివలనఁ గూరిమి
గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా
పలువురు నడిచెడి తెరుపునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
తాత్పర్యం : పదుగురు నడిచే మార్గంలో గడ్డి మొలవనే మొలవదు. ఒకవేళ కలిగినా, కడవరకు స్థిరంగా ఉండదు. అలాగే వేశ్య ప్రేమించదు, ప్రేమించినా తుదివరకూ నిలువదు.
…………………………………………………………………………………………..
వెలయాలు సేయు బాసలు
వెలయఁగ నగపాలి పొందు, వెలమల చెలిమిన్
గలలోఁన గన్న కలిమియు,
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!
తాత్పర్యం : వేశ్యా ప్రమాణాలను, విశ్వ బ్రాహ్మణుని స్నేహాన్ని, వెలమ దొరల జతను, కలలో చూసిన సంపదను, స్పష్టంగా నమ్మరాదు.
…………………………………………………………………………………………..
వేసరవు జాతి కానీ
వీసముఁ దాజేయనట్టి వ్యర్థుడు గానీ
దాసి కొడుకైన గాని
కాసులు గలవాఁడే రాజు గదరా సుమతీ!
తాత్పర్యం : నీచజాతివాడైనా, కొంచెమైనా చేయలేమనే నిష్ప్రయోజకుడైనా, దాసీపుత్రుడైనా – ధనంగలవాడే అధిపతి.
…………………………………………………………………………………………..
శుభముల నొందని చదువును
అభినయమున రాగరసము నందని పాటల్
గుభగుభలు లేని కూటమి
సభమెచ్చని మాటలెల్లఁ జప్పన సుమతీ!
తాత్పర్యం : మంగళాలు పొందని విద్య, అభినయం రాగరసాలులేని పాట, సందడులులేని రతి, సభలో మెచ్చని మాటలు ఇవన్నీ సారంలేనివి.
…………………………………………………………………………………………..
సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!
తాత్పర్యం : హాస్యాలాడటం విరోధం కల్గటానికే, ఎక్కువ సౌఖ్యాలననుభవించటం బాగా కష్టాలను పొందటానికే అధికంగా పెరగటం విరుగుట కొరకే, ధర తగ్గటం అధికమవటానికే – నిజమైన కారణాలు.
…………………………………………………………………………………………..
సిరి దా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి దాఁ బోయిన బోవును
కరిమింగిన వెలగపండు కరణిని సుమతీ!
తాత్పర్యం : సంపద కలుగునప్పుడు కొబ్బరి కాయలోకి నీరువచ్చే విధంగానే రమ్యంగా కలుగును. సంపద పోవునప్పుడు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుజ్జు మాయమగు విధంగానే మాయమైపోవును.
…………………………………………………………………………………………..
స్త్రీలయెడల వాదులాడకు
బాలురతోఁ జెలిమి చేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నిందసేయ కెన్నడు సుమతీ!
తాత్పర్యం : ఎన్నడూ స్త్రీలతో వివాదాలాడకు, బాలురతో స్నేహం చేసి మాట్లాడకు, మంచి గుణాలు వదలకు, పాలించు యజమానిని దూషించకు.
…………………………………………………………………………………………..

వేమన శతకం

అల్పుడెపుడుఁబల్కు నాడంబురముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పలు చెప్పుచుండును. మంచి బుద్ధి గలవాడు తగినంత మాత్రమునే మాటలాడును. కంచు మ్రోగినంత పెద్దగా బంగారం మ్రోగదు కదా! అని భావం.
……………………………………………………………………….
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడచూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకే విధంగా కనిపించును. కానీ పరిశీలించి చూసినచో వాటి రుచులు, గుణములు వేరు వేరుగా ఉండును. ఆ విధంగానే మానవులందరూ ఒకే విధంగా అవయవ లక్షణములు, ఆకారములు కలియున్ననూ మామూలు మనుషుల కంటే గొప్పవారి లక్షణములను పరిశీలించి తెలుసుకొనగలిగినచో అవి విలక్షణముగా ఉండునని భావం.
………………………………………………………………………..
గంగిగోవు పాలు గరిటెడైనా చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమా! మంచి ఆవు పాలు కొంచమైనా ఉపయోగంగా ఉండును. కానివి కడవ నిండా ఉన్న గాడిద పాలు పని ఏమి? భక్తితో పెట్టిన భోజనం కొద్దిగా అయినా చాలును కదా! అని భావం.
………………………………………………………………………..
అనువుగానిచోట నధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువ గాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మనకు తగని ప్రదేశంలో గొప్పవారమని, ఎక్కువ అని అనుట మంచిది కాదు. మనకు గల గొప్పతనమును, ఆధిక్యతను ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యమునకు భంగం కలగదు. కొండ ఎంత పెద్దదైననూ అద్దములో చూచినపుడు చిన్నదిగానే కనిపించును గదా! అని అర్థం.
………………………………………………………………………..
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! తల్లిదండ్రులపై ప్రేమలేని కుమారుడు పుట్టిననూ, చచ్చిననూ ఒక్కటే. పుట్టలలో పుట్టి ఎవరికీ ఉపయోగం లేక ఆ పుట్టలోనే చచ్చెడు చెదపురుగుల వలె తల్లిదండ్రులపై ప్రేమ లేని కుమారుని జన్మము వ్యర్థం కదా! అని భావం.
………………………………………………………………………..
వేరుపురుగు చేరి వృక్షంబు జెఱచును
చీడపురుగు చేరి చెట్టు చెఱచు
కుత్సితుండు చేరి గుణవంతు చెఱచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! ఓ మహా వృక్షమును అడుగు భాగమున చేరిన వేఱు పురుగు ఆ వృక్షమును చంపివేయును. ఒక చీడ పురుగు ఆ చెట్టును నాశనం చేయును. అలాగే దుర్మార్గుడు మంచివారిని చెదగొట్టును కదా! అని భావం.
………………………………………………………………………..


నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్ళు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! నిజమైన మంచి నీలమణి ఒక్కటైనా చాలును. అంతేగానీ ఊరక మెరిసే గాజురాళ్ళు తట్టెడు ఉన్ననూ వ్యర్థమే. చాటు పద్యము ఒక్క దానిని విన్ననూ చాలును గదా! అనేక రసహీన పద్యములను విన్ననూ నిరుపయోగమే కదా! అని భావం.
………………………………………………………………………..
మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! పైకి మేడిపండు ఎర్రగా పండి చక్కగా కన్పించుచుండును. దానిని చీల్చి చూడగా పొట్టలో పురుగులుండును. పిరికివాడు పైకి గాంభీర్యముగా ప్రదర్శించినప్పటికీ పిరికి తనము కలిగియుండును.
………………………………………………………………………..
ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికివచ్చు.
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విశ్వవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేపాకు కూడా ఔషధ రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, అంతేకాదు హాని కూడా చేస్తాడు.
………………………………………………………………………..
నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బైట కుక్క చేత భంగ పడును
స్థానబల్మిగాని తన బల్మిగాదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! నీళ్ళలో ఉన్న మొసలి చిన్నదైననూ ఏనుగును కూడా నీటిలోకి లాగి చంపగలదు. కానీ ఆ మొసలి తన స్థానమైన నీటి నుంచి బయటకి వచ్చినపుడు కుక్క చేత కూడా ఓడింపబడును. మొసలికి ఆ బలము స్థానము వలన వచ్చినదే కాని తన స్వంత బలము కాదు.
………………………………………………………………………..
వంపుకర్రగాచి వంపు తీర్చగవచ్చు
కొండలన్ని పిండిగొట్టవచ్చు
కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు.
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: వంకర కర్రను మంటలో వేడి చేసి తిన్నగా చేయవచ్చు, కొండలను పిండి చేయవచ్చు. కఠిన చిత్తుని దయావంతునిగా మార్చలేం. ………………………………………………………………………..
ప్రియములేని విందు పిండివంటల చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
పాత్రమెఱుగనీవిబంగారు చేటురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ప్రేమ లేని అన్న సంతర్పణము నందు పిండివంటకము వ్యర్థము. బంగారము అపాత్రతగల దానిచ్చి సొమ్ములు చేయమంటే బంగారము వన్నె తగ్గును. ఆ రీతిగానే దేవునిపై గురిలేని పూజ పత్రి పరమ వ్యర్థమని అర్థము.
………………………………………………………………………..
పని తొడవులు వేరు బంగారమొక్కటి
పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి
అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: వృత్తి కళాకారుని పనితనంలో రూపొందే ఆభరణాలు ఎన్నో రకాలు, కానీ దానికి వాడే మూల వస్తువు బంగారం ఒక్కటే. శరీరాలు వేరు వేరు కాని వాటిలో కదలాడే ప్రాణం ఒక్కటే. ఆహారాలు అనేకమైనా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే అని అర్థం.
………………………………………………………………………..
నీచగుణములెల్ల నిర్మూలమైపోవు
కొదవలేదు సుజన గోష్ఠి వలన
గంధ మలద మేనికంపడగినయట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: సుగంధ భరితమైన చందనాన్ని శరీరానికి పూసుకుంటే దేహానికుండే దుర్గంధం ఎలా పోతుందో అలాగే సుజన గోష్ఠి వలన మనలోని చెడు గుణాలన్నీ దూరమైపోతాయి. అందుచేత సదా సజ్జన సాంగత్యాన్నే కోరుకోవాలి అని అర్థం.
………………………………………………………………………..
ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె
పసిడి గలుగు వాని పిపిన జేసె
బ్రహ్మదేవు సేత పదడైన సేతరా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టు వానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని అర్థం.
………………………………………………………………………..
కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు
యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొకటే
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: సంస్కృతంలో కుండను కుంభం అంటారు. ఉప్పును లవణం అంటారు. కొండను పర్వతం అంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు కాని అసలు పదార్ధం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, ఏసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి. కేవలం పేర్లు మార్పే కాని పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే. మతాలు వేరైనా మనుష్యులు ఒక్కటే అని అర్థం.
………………………………………………………………………..
పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి
పుష్పజాతి వేరు పూజ ఒకటి
దర్శనంబులారు దైవంబు ఒక్కటె
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మనుష్యులంతా ఒక్కటే. పశువులు వేరువేరు రంగులలో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అలాగే మనుషులు వివిధ వర్ణాల వారైనా మనసులు ఒకటిగా మసలుకోవాలంటాడు వేమన. పూవులు వేరువేరు రంగులతో ఉన్నా పూజకు వినియోగపడటంలో అవన్నీ ఒక్కటే గదా! అని అర్థం.
………………………………………………………………………..
జీవిజంపుటెల్ల శివభక్తి తప్పుటే
జీవునరసి కనుడు శివుడె యగును
జీవుడు శివుడను సిద్ధంబు తెలియరా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ివుడికి, జీవుడికి మధ్య బేధం లేదు. తరచి చూస్తే జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఏ జీవినీ హీనంగా చూడరాదు. జీవిని చంపడమంటే శివభక్తి తప్పడమే. జీవహింస మహాపాపం అన్నారు పెద్దలు.
………………………………………………………………………..
ఎరుగ వాని దెలుప నెవ్వడైనను జాలు
నొరుల వశముగాదు ఓగుదెల్ప
యేటివంక దీర్ప నెవ్వరి తరమయా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తెలుసుకోవాలనే జిజ్ఞాసగలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని వాదించటం మూర్ఖుని సహజ లక్షణం. అలాంటి వాడికి తెలియజెప్పటం ఎవరి తరం కాదు. ఏటికుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయటం ఎవరికీ సాధ్యం కాదు. అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము.
………………………………………………………………………..
అసువినాశమైన నానంద సుఖకేళి
సత్యనిష్ఠపరుని సంతరించు
సత్యనిష్ఠజూడ సజ్జన భావంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: సత్యనిష్టాగాపరుడు తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా ఆనందంగా సిద్ధపడతాడుగానీ, అసత్యమాడటానికి మాత్రం అంగీకరించాడు. అటువంటి సత్యవంతుడే సజ్జనుడు. పూజ్యుడు, చిరస్మరణీయుడు. దీనికి హరిశ్చంద్రుడే తార్కాణం.
………………………………………………………………………..
పగలుడుగ నాసలుడుగును
పగవుడుగం గోర్కెలుడుగు వడిజన్మంబుల్
తగులుడుగు భోగముడిగిన
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విరోధాలు లేనప్పుడు ఆశలు ఉండవు. విచారం లేకపోతే కోరికలుండవు. సుఖం నశించినపుడు అనురాగం ఉండదు. త్రిగుణాలు నశిస్తేనే ముక్తి కలుగుతుంది.
………………………………………………………………………..
చంపదగినయట్టి శత్రువు తన చేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! చంపదగినవాడైననూ శత్రువు తన చేతిలో చిక్కినప్పుడు అతనిని చంపక, హాని చేయక మేలు చేసి పొమ్మనుటే మేలు, అదే అతనికి శిక్ష అగును అని భావం.
………………………………………………………………………..
లోభమోహములను ప్రాభవములు తప్పు
తలచిన పనులెల్ల తప్పి చనును
తానొకటి దలచిన దైవమొండగుచుండు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: లోభం, మొహం ఉండేవారికి గొప్పతనం ఉండదు. అటువంటివారు తలచిన పనులు జరగవు. తానొకటి తలిస్తే దైవమొకటి తలుచుట సామాన్యం అని అర్థం.
………………………………………………………………………..
పనస తొనలకన్న పంచదారలకన్న
జుంటుతేనే కన్న జున్ను కన్న
చెరుకు రసముకన్న చెలుల మాటలె తీపి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పనస తొనలు, పంచదార, తేనె, జున్ను వీటన్నింటికంటే యువతుల మాటలే మిక్కిలి మధురంగా ఉంటాయి.
మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు
………………………………………………………………………..
కొఱికి చూడ లోనంజుఱు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మిరియము గింజ పైకి చూచినచో నల్లగా యున్ననూ, కొరికి చూచినచో కారంగా మంటగా ఉండును. ఆ విధంగానే మంచివాడు పైకి చూచుటకు అలంకారములు లేకపోయిననూ, లోపల హృదయమునందు మేధాసంపత్తి నిండియుండును అని భావం

కనగ సొమ్ము లెన్నొ కనకంబదొక్కటి
పసుల వన్నె లెన్నొ పాలొకటియె
పుష్పజాతులెన్నొ పూజయొక్కటె సుమీ
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఆభరణములు వేరైనా బంగారం ఒక్కటే. పశువుల రంగుల వేరైనా పాలు ఒక్కటే. సుగంధభరిత పుష్ప జాతులు వేరైనా చేసే పూజ మాత్రం ఒక్కటే. అలాగే శాస్త్ర పరిజ్ఞానం గల పండితులు వేరైనా జ్ఞానం మాత్రం ఒక్కటే.
………………………………………………………………………………………….
హీనగుణమువాని నిలు సేరనిచ్చిన
ఎంతవానికైన నిడుము గలుగు!
ఈఁగ కడుపు జొచ్చి యిట్టట్టు చేయదా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చెడ్డవానికి ఆశ్రయమిచ్చి ఇల్లు చేర్చినచో, ఎంతటి వానికైననూ కడుపులో ఈగ, పురుగులు ప్రవేశించి బాధపెట్టు విధంగా ఆపదలు కలుగజేయును అని భావం.
………………………………………………………………………………………….
నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుఁడాఁడు రీతి నధికుండు నాఁడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! గొప్ప నదులు నిదానంగానూ, గంభీరంగానూ ప్రవహించును. కానీ చిన్న వాగు, అతి వేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహించును. అట్లే యోగ్యుడు నిదానంగా, గంభీరంగా మాట్లాడును. నీచుడు వాగుచూ ఉండును.
………………………………………………………………………………………….
విద్యలేనివాడు విధ్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం.
………………………………………………………………………………………….


మర్మమెఱుగ లేక మతములు కల్పించి

యుర్విజనులు దుఃఖ మొందుచుంద్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: అద్దాల గదిలో ఉన్న కుక్క దర్పణంలో తన ప్రతిబింబాన్ని చూచి కలతపడి ఏ విధంగా బాధపడుతుందో, అలాగే మూఢ జనులు ఆత్మతత్వం తెలుసుకోలేక, విభిన్న మతాలను కల్పించి, మతమౌడ్యంలో చిక్కుకుని, ఒకరినొకరు ద్వేషించుకొనుచూ, దుఃఖంతో కాలం గడుపుతున్నారు. నిజానికి పరబ్రహ్మం ఒక్కటే అని గుర్తించలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారు.
………………………………………………………………………………………….
నేరనన్నవాఁడె నేర్పరి మహిలోన
నేర్తునన్నవాఁడు నిందఁజెందు
ఊరకున్నవాఁడె యుత్తమ యోగిరా!
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తెలివిగలవాడు తనకేమియు తెలియదు. అని నిదానముగా మాట్లాడును. తెలియునన్నచో వాదించెదరు. అపకీర్తి రావచ్చును గాన తెలివిగలవాడు ఋషివలె మౌనంగా నుండును. తెలివి తక్కువవాడు అన్నియు తెలిసినట్లు నటనచేయుచూ చివరకు అపనిందను పొందగలడు.
………………………………………………………………………………………….
పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న నెంచ గుణపు ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! దేవుని పూజలకంటే నిశ్చలమైన బుద్ధి ఉండుట మంచిది. మాటలు చెప్పుట కంటే నిశ్చలమైన మనస్సు కల్గియుండుట మంచిది. వంశము యొక్క గొప్పతనం కంటే వ్యక్తి యొక్క మంచితనం ముఖ్యము.
………………………………………………………………………………………….


కానివానితోడ గలసి మెలఁగుచున్నఁ
గానివానిగానె కాంతు రవనిఁ
దాటి క్రిందఁబాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: గ ౌరవం లేని వారితో కలిసి తిరుగుచున్నచో ఆ వ్యక్తిని అందరూ గౌరవము లేని వానిగానే భావిస్తారు. ఎట్లనగా తాటి చెట్టు క్రింద కూర్చొని ఓ వ్యక్తి పాలు తాగుచున్ననూ, అతడు తాగుచున్నది పాలు అనికాక కల్లు త్రాగుచున్నారని భావించగలరు గదా! అని అర్థం.
………………………………………………………………………………………….
పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక! పరహితచారై
పరు లలిగిన తా నలగక
పరులెన్నగ బ్రతుకువాడు! ప్రాజ్ఞుఁడు వేమా!
తాత్పర్యం: తోటి స్త్రీలను తన సొదరిలుగా భావించి, పరుల ధనమును సేకరించుట మానివేసి, ఇతరుల కోపించినను తాను కోపించుకొనక, ఇతరులచే కీర్తింపబడుతూ జీవన విధానమును చేయవలెను అని భావం.
………………………………………………………………………………………….
అల్పజాతి వాని కధికార మిచ్చిన
దొడ్డవారి నెల్ల దోలి తిరుగుఁ
జెప్పు దినెడి కుక్క చెఱకు తీపెఱుగునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: అల్పబుద్ది వానికి అధికారము కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును, మరియు అవమానములు పెట్టగలడు. ఏలనగా చెప్పులు తిను కుక్క చెఱకు తీపి యేమి తెలియును. అట్లే మంచి గుణములు వానికి ఉండవని భావము.
………………………………………………………………………………………….
నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు
బైట మూరెడైనఁబాఱలేదు
నెలవు తప్పుచోట నేర్పరి కొరగాఁడు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పడవ నీటియందు చక్కగా నడుచును. భూమి మీద మూరెడైననూ పోజాలదు. అట్టే స్థానబలము లేకున్నచో బుద్ధిమంతుడైననూ మంచిని గ్రహింపలేరు.
………………………………………………………………………………………….
అల్పుడైనవాని కధిక భాగ్యము గల్గ
దొడ్దవారిఁదిట్టి తొలఁగ గొట్టు
అల్పజాతి మొప్పె యధికుల నెఱఁగునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: అల్పబుద్ధివానికి సంపద కలిగినచో మంచివారిని తిట్టి అవమానించును. నీచ్యకులమున పుట్టినవాడు మంచివారిని తెలుసుకొనలేడు.
………………………………………………………………………………………….
కులములో నొకండు గుణవంతుడుండిన
కులము నెలయువాని గుణముచేత
వెలయు వనములోన మలయజం బున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఓ వేమనా! అడవిలో ఒక మంచి గంధపు చెట్టున్నను ఆ అడివి అంతటినీ తన సుగంధము వ్యాపింపజేయును. అట్లే వంశములో ఒక్కడు ఉత్తముడు ఉన్ననూ వాని గుణముల చేత ఆ వంశమంతయు మంచిపేరు పొందును.
………………………………………………………………………………………….
పందిపిల్ల లీను పదియు నైదింటిని
కుంజరంబు లీను కొదమ నొకటి
యుత్తమ పురుషుండు యొక్కడు చాలడా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పంది ఒక్కసారే పదునైదు పిల్లలను కనును. కాని గొప్పదైన ఏనుగు ఒక పిల్లనే కనును. కాబట్టి పెక్కు సంతానమున కంటే గుణవంతుడగు ఒకడు మేలు అని అర్థము.
………………………………………………………………………………………….
ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన
మాట దెలిసి నడచు మర్మమెఱిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బండి లాగే ఎద్దుకైననూ ఒక సంవత్సరం తర్ఫీదు ఇస్తే మాటలు గ్రహించి నడుచుకొనును. మూఢుడికి మాత్రం ముప్పై ఏండ్లకైనా బుద్ధి నేర్వలేడు. మూఢత్వమును మార్చుకోలేడు సుమా!
………………………………………………………………………………………….
పాలు పంచదార పాపర పండ్లలోఁ
జాల బోసి వండఁ జవికిరాదు
కుటిల మానవులకు గుణమేల కల్గురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చేదుగల పండ్లలో పాలు, పంచదార పోసి వంటకం చేసిననూ ఆ పండ్లకు గల చేదు గుణములెట్లు ఉండునో, అలానే మంచి గుణములు ఎన్ని ప్రభోధించిననూ కుటిలుడు దుర్గుణములను వీడడని భావము.
………………………………………………………………………………………….
పట్టు పట్టరాదు పట్టు విడవరాదు
పట్టెనేని బిగియ బట్టవలయు
బట్టి విడుటకన్నఁబరగఁజచ్చుట మేలు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కార్యమునకు ముందు పట్టుదల చేయరాదు. పట్టుదల పట్టిన తర్వాత కార్యాన్ని వదలరాదు. పట్టుదల పట్టి విడుచుట కన్నా చచ్చుట మంచిది. చదువు జదువకున్న సౌఖ్యంబులును లేవు
………………………………………………………………………………………….
చదువు జదివెనేని సరసుడగును
చదువు మర్మమెరిగి చదువగ చూడుము
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చదువు లేనివారికి సౌఖ్యం లభించదు. చదువుకున్నవాడే సజ్జనుడు. చదువుకోవాలనే అభిలాష కలవాడు విద్యలలోని సారాన్ని, మర్మాన్ని గ్రహించడానికి చదవలిగాని వృధా పఠనమువలన ప్రయోజనం లేదు అని భావం.
………………………………………………………………………………………….
కులములేనివాఁడు కలిమిచే వెలయును
గలిమిలేనివాఁడు కులము దిగును
కులముకన్న భువిని గలిమి ఎక్కవసుమీ
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కులము తక్కువ వాడు సంపదచే కీర్తి పొందును. భాగ్యము లేనివాడు కులముతో పొత్తు పెట్టుకోడు. జీవన విధానము చూచును. అందుచే కులము కంటే సంపద ముఖ్యము అని భావం.
………………………………………………………………………………………….
కులము గలుగువాడు గోత్రంబు గలవాడు
విద్య చేత విఱ్ఱవీగువాఁడు
పసిడిగల్గువాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మంచి కులముగల వాడునూ, మంచి గోత్రము కలవాడునూ, విద్యచేత గర్వించువాడునూ ముగ్గురూ సంపద గలవానిని చూచి ఆశ్రయిస్తారు. ఆతిథ్యము పొందుతారు. వానికి బానిసగా ఉంటారని భావం.
………………………………………………………………………………………….
నీళ్ళలోని మీను నెఱిమాంస మాశించి
గాలమందు జిక్కుకరణి భువిని
ఆశ దగిలి నరుడు నాలాగె చెడిపోవు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: నీటియందలి చేప మాంసమును ఆశించి గాలమునకు చిక్కుకున్నట్లు, భూమియందు ఆశతో నరుడు చేపవలె జీవించి నశించును అని భావం. ………………………………………………………………………………………….
త్రాడు పామటంచు దాజూచి భయపడు
దెలిసి త్రాడటన్న దీరు భయము
భయము తీరినపుడె బ్రహ్మంబు తానగు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: త్రాడును పాముగా బ్రమించి భయపడతాడు మానవుడు. అది పాము కాదు, త్రాడు అన్న నిజాన్ని తెలుసుకున్న క్షణంలో భయం తొలగి పోతుంది. భయం తొలగితే ఆనందం కలుగుతుంది. రజ్జుసర్ప భ్రాంతి వంటిదే సంసారం. సంసారం భ్రాంతి అనే సత్యాన్ని గుర్తించినవాడు తానే బ్రహ్మ అవుతాడు. అందుకే “ఆనందో బ్రహ్మ” అని అన్నారు.
………………………………………………………………………………………….
మేఁక కుతిక పట్టి మెడచన్ను గుడవగా
ఆక లేల మాను నాశగాక
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మేక యొక్క మెడచన్ను పట్టుకొని కుడిచినచో ఆకలి తీరదు. పాలు లభించవు. అట్లే లోభివానిని అడిగి ప్రయోజనము లేదని గ్రహించాలి. ఏమి గొంచువచ్చె నేమి తాఁగొనిపోవు
………………………………………………………………………………………….
బుట్టువేళ నరుఁడు గిట్టువేళ
ధనము లెచట కేఁగు దానెచ్చటికి నేగు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మనుజుడు పుట్టుకతో ఏమి తీసుకురాడు, చచ్చినచో ఏమీ తీసుకుపోడు. అట్లే ఈ సంపదలు ఎక్కడికీ పోవు. తానేక్కడికీ పోడు అని తెలుసుకోలేడు అని భావం.

పెట్టిపోయలేని వట్టి నరుడు భూమి
బుట్టనేమి వారు గిట్టనేమి
పుట్టలోనఁజెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: దానధర్మములు ఏ మాత్రము చేయునట్టి మనుజుడు పుట్టినా, గిట్టినా ప్రయోజనం లేదు. ఎలాగంటే చదల పురుగులు పుట్టుటలేదా? చచ్చుట లేదా? ఆ విధంగానే ఉండును అని భావం.
…………………………………………………………………………………………
బహుళ కావ్యములను పరికింపగా వచ్చు
బహుళ శబ్దచయము బలుకవచ్చు
సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చాలా కావ్యాలను చదువవచ్చును. అనేక మాటలు నేర్పవచ్చును, కానీ ఓర్పును అలవరచుకోవడం చాలా కష్టం అని భావం.
…………………………………………………………………………………………
ఆశచేత మనుజు లాయువు గలనాళ్ళు
తిరుగుచుంద్రు భ్రమము ద్రిప్పలేక
మురికి భాండమందు ముసురు నీఁగల భంగి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: జనులు ఆశచే ఆయుర్దాయము ఉన్నంతవరకు కోరికలను విడువలేక తిరిగుచుందురు. ఎలాగనగా దుర్వాసనగల కుండ యందు ముసురు ఈగలవలె తిరుగుచుందురు కదా అని అర్థం.
…………………………………………………………………………………………
తనువ దెవరిసొమ్ము తనదని పోషింప
ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనఁగ
బ్రాణ మెవరి సొమ్ము పారిపోకను నిల్వ
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఈ శరీరం ఎవరి సొత్తూ కాదు, ఈ ధనము ఎవరిదీ కాదు, ప్రాణము పోకుండా ఎవరూ ఉండరు. ఇదంతా ప్రకృతి సహజమని గ్రహించవలెను అని భావం.
…………………………………………………………………………………………
ఆశ కోసి వేసి యనలంబు చల్లార్చి
గోఁచి బిగియగట్టి గుట్టు దెలిసి
నిలిచి నట్టివాఁడె నెఱియోగి యెందైన
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఆశను కోసి, అగ్నియందు చల్లార్చి తన గోచి బిగియ కట్టి, ఈ జన్మ లక్షణములను తెలుసుకొని నిలిచిన వాడే యతీశ్వరుడు. వాడినే యోగి అందురు.
…………………………………………………………………………………………


ఇమ్ము దప్పువేళ నెమ్మిలెన్నియు మాని
కాల మొక్కరీతి కడపవలయు
విజయుఁడిమ్ము దప్పి విరటుని కొల్వఁడా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పంచ పాండవులందు గల అర్జునుడు విరటుని కొల్వుయందు ఉన్నాడు కదా! అట్లే స్థానము దప్పినపుడు విషయ వాంఛను, దిగులును, విడచి కాలమును గడుపవలెను. జీవన మార్గమును అన్వేషించి బ్రతుకుట మంచిది అని భావం.
…………………………………………………………………………………………
చచ్చిపడిన పశువు చర్మంబు కండలు
పట్టి పెఱిగి తినును పరగ గ్రద్ద
గ్రద్ద వంటివాడు జగపతి కాడొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: గ్రద్ద చచ్చిపడియున్న పశువు చర్మమును తినును. అట్లే రాజులునూ గ్రద్ద లాంటివారే కదా! అని భావం.
…………………………………………………………………………………………
ఎరుకలేని దొరల నెన్నాళ్ళు గొలిచిన
బ్రతుకలేదు వట్టి భ్రాంతికాని
గొడ్డుటావు పాలు గోరితే చేపునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎండిపోయిన ఆవును పాలు ఇవ్వమంటే ఏ విధంగా ఇవ్వదో, అట్లే తాను చేయుచున్న కష్టమును గుర్తించలేని యజమాని వద్ద ఎంత కాలము చేసినా వ్యర్థమే కదా! అని భావం.
…………………………………………………………………………………………
ఐదు వేళ్ళ బలిమి హస్తంబు పని చేయును
నందొకటియు వీడ బొందిక చెడు
స్వీయుడొకడు విడిన జెడుగదా పని బల్మి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చేతికి ఐదు వేళ్ళూ ఉన్నపుడే నువ్వు చేయదలచిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలవు. ఆ ఐదింటిలో ఏ ఒక్కవేలు లోపించినా ఆ హస్తం ఎందుకూ కొరకరాదు. అలాగే మనలను ప్రాణ సమానంగా భావించి ప్రేమించే ఆప్తుడు ఒక్కడు వీడినా కార్యహాని జరగడమే కాకుండా జీవితంలో అభివృద్ధి సాధించటం కూడా చాలా కష్టం అవుతుంది.
…………………………………………………………………………………………
పూర్వజన్మమందు పుణ్యంబు చేయని
పాపి తా ధనంబు బడయలేడు
విత్తమరచి కోయ వెదకిన చందంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: పూర్వజన్మలో ఒక్క పుణ్య కార్యం కూడా చేయకుండా, ఈ జన్మలో ధన, ధాన్యాలతో తుల తూగాలని, స్వర్ణ సుఖాలు అనుభవించాలి అని కోరుకున్నంత మాత్రాన లభించవు. విత్తనమే నాటకుండా పంటకు ఆశ పడడం ఎంత అజ్ఞానమో, పుణ్య కార్యాలు ఆచరించకుండా సుఖ భోగాలను, అష్టైశ్వర్యాలను కోరుకోవటం కూడా అజ్ఞానమే అని భావం.
…………………………………………………………………………………………
గొడ్డుటావు బితుక గుండ గొంపోయిన
బండ్ల నూడ దన్ను పాల నీదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: గొడ్డుటావు దగ్గరకి కుండని తీసుకునిపోయి ప్రయత్నిస్తే పళ్ళు రాలేలా తంతుందే గాని పాలనివ్వదు. అదే విధంగా పిసినిగొట్టు వానిని ఎంత ప్రాధేయపడినా నోరు నొప్పి పుడుతుందే కాని పైసా కూడా వాని నుంచి పొందలేము అని అర్థం.
…………………………………………………………………………………………
అలను బుగ్గపుట్టినప్పుడే క్షయమౌను
గలను గాంచు లక్ష్మిఁగనుటలేదు
ఇలను భోగభాగ్యమీతీరు గాదొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: సముద్రపు అలలందు బుడగ ఏ విధంగా పుట్టుచూ గిట్టుచూ ఉండునో, అలాగే ఎల్లప్పుడూ భోగభాగ్యములుండవు. ఒకదాని తర్వాత ఒకటి అనుభవించవలసివచ్చుచుండును అని అర్థం.
…………………………………………………………………………………………
కోతినొనరదెచ్చి కొత్తపట్టముగట్టి
కొండముచ్చు లెల్ల గొలిచినట్లు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుండుట
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: జ్ఞానములేని వానిని తెచ్చి రాజుని చేసిన వాని వద్ద అటువంటివారే మనగలరు. ఎలాగనగా, కోతిని తెచ్చి రాజ్యాభిషేకమును చేసిన కొండముచ్చు లెల్ల వానిని కొలిచినట్లు ఉండును అని భావం.
…………………………………………………………………………………………
ఒకనిఁజెఱిచెదమని యుల్లమం దెంతురు
తమదు చే టెరుఁగరు ధరను నరులు
తమ్ము జెఱుచువాఁడు దైవంబుగాడొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కొందరు దుర్మార్గులు మంచివారికి ఆపదలను కలిగిస్తారు. కాని ఆ దుర్మార్గులను శిక్షించి మంచివారిని దేవుడు రక్షిస్తాడని భావం.
…………………………………………………………………………………………
భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దానహీను జూచి ధనము నవ్వు
కదన భీతుఁజూచి కాలుడు నవ్వును
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా వెంట రాదనీ తెలిసి కూడా దాన గుణం లేని లోభివానిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వానిని చూచి మృత్యువు నవ్వుతుంది.
…………………………………………………………………………………………
కల్లలాడువాని గ్రామకర్త యెఱుంగు
నీరు పళ్ళ మెఱుగు నిజముగాను
దల్లి తానెరుగును దనయుని జన్మంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మనుజుడు ఆడే అబద్ధములు, నిజాములు ఈశ్వరునకు తెలుసును. నీరు పల్లపు ప్రదేశమునకే పోవును. కుమారుని పుట్టుక తల్లికి మాత్రమే తెలుస్తుందని భావం.
…………………………………………………………………………………………
మైలకోక తోడ మాసిన తలతోడ
ఒడలు ముఱికి తోడ నుండెనేని
అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మురికిబట్టలతో గానీ, మాసిన శిరస్సుతో కానీ, శరీరమునందు దుర్గంధముతో గాని ఉన్నచో అగ్రకులజుడైననూ పంక్తి వద్దకు ఆహ్వానించరు, గౌరవముగా చూడరు అని భావం.
…………………………………………………………………………………………
తప్పులెన్నువారు తండోపతండంబు
లుర్వి జనుల కెల్లా నుండు దప్పు
తప్పులెన్నువారు తమ తప్పు లెఱుగరు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎదుటివారు తప్పులను లెక్కించువారు అనేకులు ఉందురు. తన యొక్క తప్పులను తెలుసుకొనువారు కొందరే యందురు. ఇతరుల తప్పులెన్నువారు తమ తప్పులను తెలుసుకోలేరు అని భావం.
…………………………………………………………………………………………
తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా
ఓగు నేర మెంచు నొరులఁగాంచి
చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా, వాడు ఇతరులను తప్పులను లెక్కించుచూ ఉండును. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు ఉండునని భావం.

విడువ ముడువ లేక కుడువగట్టగలేక
వెరపులేక విద్యవిధము లేక
వెడలలేనివాని నడపీను గనరొకో
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: సమయం సందర్భాలకూ తగినట్టుగా పట్టువిడుపులు ప్రదర్శించలేని అలౌక్యుడూ, ధనం సంపాదించి కూడా ఆప్తులను ఆదుకోలేనివాడు, లోకానికి మంచి చెడ్డలకు భయపడనివాడు, విద్యాహీనుడు, నలుగురిలో కలిసి మెలిసి మెలగనివాడు, క్రమ పద్ధతి లేనివాడు నడిచే శవంగా పరిగణించబడతాడు.
…………………………………………………………………………………………
వాన రాకడయును బ్రాణంబు పోకడ
కానఁబడ దదెంత ఘనునికైన
గానఁబడిన మీఁద గలియెట్లు నడుచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: వర్షము వచ్చుట, ప్రాణము పోవుట యే మనుజునకైనా తెలియదు. అది తెలిసినచో కలికాలము ముందుకు నడవదు అని భావం. …………………………………………………………………………………………
కానివాని చేతఁగాసు వీసంబిచ్చి
వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రివాడు. పిలిచే తినబడిన కోడి పలుకరించితే పలుకదు కదా అని భావం. వాన కురియకున్న వచ్చును కక్షామంబు
…………………………………………………………………………………………
వాన గురిసెనేని వఱద పాఱు
వఱద కఱవు రెండు వరుసతో నెఱుగుడి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ప్రకృతి యందు వర్షము లేకున్నా దేశమునకు కరువు కాటకములు వచ్చును, మరియు వర్షములున్నచో వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజమే కదా అని భావం.
…………………………………………………………………………………………


ఆలి మాటలు విని అన్నదమ్ములఁబాసి
వేఱె పోవువాఁడు వెఱ్ఱివాడు
కుక్క తోకఁబట్టి గోదావరీదునా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తన భార్య మాటలు విని ప్రత్యేక కాపురము పెట్టువాడు వెర్రివాడు. ఎట్లనగా కుక్కతోక పట్టుకొని గోదావరి నది దాటుత అసాధ్యము కదా! కనుక భార్యం మాట విని ఆలోచించి కాపురము పెట్టాలని భావము.
…………………………………………………………………………………………
మాటలాడ నేర్చి మనసు రంజిల జేసి
పరగ ప్రియము జెప్పి బడలకున్న
నొకరి చేతి సొమ్ములూరక వచ్చునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మంచి మాటలు పలికి, మనసును రంజింపజేసి, ప్రియంగా హితవులు చెప్పి ఇతరులకు ఆనందం కలుగ చేసినపుడే వారి నుంచి ధనాన్ని పొందగలుగుతాము. కనుక సుమధుర, సరస సంభాషణ అన్ని వేళలా లాభదాయకం అని తెలుసుకోండి.
…………………………………………………………………………………………
తనువులోని యాత్మ తత్వ మెఱుంగక
వేరె కలడటంచు వెదుక డెపుడు
భానుడుండ దివ్వె పట్టుక వెదుకునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: “దేహో దేవాలయః ప్రోక్తో జీవో దేవస్సనాతనః” అన్నారు ఆర్యులు. దేహంలోనే దేవుడున్నాడని గ్రహించిన విద్వాంసులు తమలోనే ఆత్మస్వరూపాన్ని చూస్తారేగానీ వేరొక చోట వెతకరు. కోటి ప్రభలలో సూర్యుడు ప్రకాశించుచుండగా గుడ్డిదీపంతో వస్తువులను అన్వేషించడం అజ్ఞానం కదా! అని భావం.
…………………………………………………………………………………………
కలుష మానసులకు గాన్పింపగారాదు
అడుసులోన భానుడడగినట్టు
తేటనీరు పుణ్యదేహమట్లుండురా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బురదలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా కనపడదో, అలాగే పాప చిత్తులకు జ్ఞానం కనిపించదు. నిర్మలమైన తేటనీటిలో సూర్యుని ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సుగల పుణ్యాత్ములకు మాత్రమే జ్ఞానం గోచరిస్తుంది అని అర్థం.
…………………………………………………………………………………………
ఇచ్చువాని యొద్ద నీయని వాఁడున్న
జచ్చుగాని యీవి సాగనీఁడు
కల్పతరువు క్రింద గచ్చ పొదున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: దానము చేయువాని వద్ద లోభియగు బంట్రోతు ఉన్నచో దానములు ఇవ్వనీయడు. కీర్తి తీసుకురానివ్వడు. ఎలాగనగా కోరికలు ఇచ్చు కల్పవృక్షం క్రింద ముళ్ళపొద ఉంటే ఆ వృక్షసమీపమునకు రానివ్వదు కదా! ధర్మాత్ముని వద్ద కూడా లోభి ఉంటే అలాగే జరుగుతుందని భావం.
…………………………………………………………………………………………
ఎన్ని చోట్ల తిరిగి యేపాట్లు పడినను
అంటనియ్యక శని వెంటఁదిరుగు
భూమి క్రొత్తలైన భుక్తులు క్రొత్తలా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎన్ని స్థలములు తిరిగిననూ, ఎన్ని కష్టములు పడిననూ, ఏమి యును పొందనీయక శని వెన్నంటుచూ తిరుగుచుండును. మునుపు శివుని వెంబడించి బాధలు పెట్టెను కదా! అలాగే భూమి కొత్తదైనచో జ్యోతిషభుక్తి కొత్తది కాదు కదా! అని భావం.
…………………………………………………………………………………………
హీను డెన్ని విద్య లిల నభ్యసించిన
ఘనుడుగాడు మొఱకు జనుడెగాని
పరిమళములు గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎంతటి ఉన్నత విద్యావంతుడైనా, బహు గ్రంథ పారంగతుడైన మూర్ఖుడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను మోసినంత మాత్రాన గాడిద గొప్పదవదు కదా! గాడిద గాడిదే, మూర్ఖుడు మూర్ఖుడే, మార్పు రాదు అని భావం.
…………………………………………………………………………………………
ఉన్నఘనతబట్టి మన్నింతురే కాని
పిన్న, పెద్దతనము నెన్నబోరు
వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: మనిషి ఎన్ని గొప్ప గుణాలు కలిగి ఉంటే సంఘంలో అంత గొప్పగా గౌరవించబడతాడు. గొప్పతనానికి వయస్సుతో నిమిత్తం లేదు. వాసుదేవుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి అయిన వాసుదేవుని కంటే ఎక్కువగా గౌరవించి పూజింపబడుతున్నాడంటే దానికి అతని గొప్ప గుణాలే కారణం.
…………………………………………………………………………………………
కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుభట్టుఁజేసెఁగటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కర్మమును ఎవ్వరూ దాటజాలరు. దైవము రాజగు ధర్మరాజుని విరాట రాజువద్ద కంకుభట్టు వేషమును ధరింపజేశారు. అలాగే విధి బలవత్తరమని గ్రహించుము అని భావం.
…………………………………………………………………………………………
మగని కాలమందు మగువ కష్టించిన
సుతుల కాలమందు సుఖమునందు
కలిమి లేమి రెండు గల వెంతవారికి
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఆడది భర్త ఉన్నపుడు కష్టపడినచో కొడుకుల కాలంలో సుఖమును పొందును. సంపద, దారిద్ర్యములు రెండునూ ఎంతవారైననూ అనుభవించవలసిందే కదా! అని భావం.
…………………………………………………………………………………………
చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటఁగలిసె
బ్రాప్తిగల్గు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: స్వాతి కార్తె యందు వర్షపు బిందు చిప్పయందు పడినచో ముత్తెమగును. నీటియందు పడినచో నీటిలో కలిసిపోవును, కనుక ప్రాప్తి ఉన్నచో అదృష్టము ఎక్కడికీ పోదని భావం.
…………………………………………………………………………………………
బక్కకుక్కకఱచి బాధ చేయు
బలిమి లేని వేళఁబంతంబు చెల్లదు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: బలము తగ్గి యున్నచో సింహమునైననూ బక్కకుక్క కరచును. ఆ విధంగానే బలము లేనపుడు పంతము చెల్లనేరదు అని భావం.

Relationships

అమ్మ…………………. Mother
నాన్న…………………. Father
కూతురు …………………. Daughter
కొడుకు …………………. Son
అల్లుడు …………………. Son-in-law
కోడలు ………………….Daughter-in-law
భర్త ………………….Husband
భార్య …………………. Wife
సోదరి …………………. Sister
సోదరుడు …………………. Brother
మామ/బాబాయి/పెదనానన్న ………………….Uncle
అత్త/పిన్ని/పెద్దమ్మ …………………. Aunt
మరదలు / వదిన………………….Sister-in-law
తాతయ్య ………………….Grand Father
అమ్మమ్మ / నాయనమ్మ ………………….Grand Mother
దత్తత కూతురు …………………. Adopted Daughter
దత్తత కొడుకు ………………….Adopted Son
మేనమామ ………………….Maternal Uncle
మేనమామ భార్య ………………….Maternal Aunt
మామ గారు ………………….Uncle
అత్త గారు …………………. Aunt
బంధువు …………………. Relative
సవతి తండ్రి…………………. Step Father
సవతి తల్లి కూతురు …………………. Step Sister
సవతి తల్లి కొడుకు ………………….Step Brother
వారసుదు ………………….Heir
మామ కొడుకు/బావ ………………….Brother-in-law
స్నేహితుడు ………………….Friend
అతిధి ………………….Guest

Professions and Occupations

రైతు ……………… Farmer
కుమ్మరి ……………… Potter
కంసాలి ……………… Turner
వైద్యుడు ……………. Doctor
శస్త్ర చికిత్సకుడు ……………… Surgeon
కాపలాదారుడు ……………… Watchman
దర్జీ ……………… Tailor
దూదేకుల వాడు ……………… Carder
చాకలి ……………… Washer man
మంగలి ……………… Barber
వడ్రంగి ……………… Carpentar
చేపలు పట్టేవాడు ……………… Fisherman
తోటమాలి ……………… Gardner
చెప్పులు కుట్టేవాడు ……………… Cobbler
కమ్మరి ……………… Blacksmith
స్వర్ణకారుడు ……………… Jeweller
శిల్పి ……………… Sculptor
కారు నడుపు వాడు ……………… Driver
బంట్రోతు ……………… Peon
వృత్తిపనివాడు ……………… Artisan
రచయుత ……………… Writer
చిల్లర వర్తకుడు ……………… Retailer
కసాయివాడు ……………… Butcher
ఉపాధ్యాయుడు ……………… Teacher
ఇంజనీరు ……………… Engineer
మందులిచ్చువాడు ……………… Compounder
కవి ……………… Poet
మంత్రగాడు ……………… Musician
నగల వర్తకుడు ……………… Jeweller
తపాలా వాడు ……………… Postman
దాకాణాదారు ……………… Shopkeeper
నర్సు ……………… Nurse
నృత్య కళాకారుడు ……………… Damcer
మత బోధకుడు ……………… Priest
రక్షక భటుడు ……………… Police
వీధుల వెంట సామాను అమ్మేవారు ………………Hawker
నావికుడు ………………Sailor
గుమస్తా ……………… Clerk
వీధులు ఊడ్చేవారు ……………… Sweeper
వకీలు ……………… Advocate
బంగారు పనివాడు……Goldsmith
విమాన చోదకుడు…………. Pilot
కవి ………………….Poet
రంగులు వేసేవాడు ………………. Painter

Human Body Parts

Parts of the Body….శరీర భాగాలు (అవయవాలు)
తల ………………….. Head
వెంట్రుకలు …………… hair
కణత …………………. Temple
నుదురు …………………. Forehead
ముఖము …………………. Face
దవడ …………………. Jaw
పుర్రె ………………Skull
పెదాలు ………….. Lips
నాలుక ………….. Tongue
గడ్డము ………………….Chin
నోరు ……………… Mouth
అంగిలి …………………. Palate
దవడ పళ్లు ………………….Molar Teeth
పన్ను ……………… Teeth
మెదడు …………………. Brain
ముక్కు పుటము …………………. Nostril
ముక్కు …………………. Nose
చెవి ……………… Ear
చెవి గూబ ………………Eardrum
చెక్కిళ్లు ……………….Throat
కంటి రెప్ప …………………. Eye lid
కనుగ్రుడ్డు ………………….Eyeball
కంటి రెప్ప వెంట్రుకలు …………………. Eyelash
భ్రుకుటి …………………. Eyebrow
నోరు ………………….Mouth
మీసము …………………. Moustache
గొంతు ……………… Throat
మెడ ………………….Neck
చేయి …………………. Hand
మోచేయి ……………… Elbow
అరచేయి …………………. Palm
వ్రేలు …………………. Finger
ఉంగరపు వ్రేలు …………………. Ring Finger
చేతి బొటన వ్రేలు …………………. Thumb
కాలి బొటనవ్రేలు …………………. Toe
చూపుడు వ్రేలు …………………. Index Finger
మధ్య వ్రేలు …………………. Middle Finger
చిటికెన వ్రేలు …………………. Little Finger
గోరు ……………… Nail
మణికట్టు ……………… Wrist
భుజము ……………… Shoulder
చంక ……………… Armpit
రొమ్ము ……………… Chest
రొమ్ము, స్థనము ……………… Breast
కుచాగ్రము ……………… Nipple
పక్క ఎముక ……………… Rib
నడుము ……………… Waist
వీపు ……………… Back
పొట్ట……………… Belly
పొట్ట లోపల ……………… Stomach
పొత్తి కడుపు ……………… Abdomen
ఊపిరి తిత్తి ……………… Lung
గుండె ……………… Heart
శ్వాసనాళము ……………… Trachea
నాభి (బొడ్డు) ……………… Navel
పెద్ద పేగులు ……………… Big intestines
చిన్నపేగులు……………… Small intestines
మూత్రపిండము ……………… Kidney
కాలేయలు ……………… Liver
గర్భాశయము ……………… Uterus
ఒడి ……………… Lap
తొడ ……………… Thigh
గుదము ……………… Anus
భగము ……………… Vagina
మూత్రసంచి ……………… Urinary Bladder
పిరుదు ……………… Rump (buttock)
లింగము ……………… Penis
కాలు ……………… Leg
మోకాలు ……………… Knee
మడమ ……………… Heel
కీలు ……………… Ankle
ఉపాస్థి ……………… Cartilage
అరికాలు ……………… Sole
పిక్క ……………… Calf
రక్తము ………………Blood
ఎముకలు ……………… Bones
నరము ……………… Vein

Animals

ఒంటె…………….Camel
కస్తూరి మృగము …………….Musk Deer
కంగారు ……………. Kangaroo
కంగారు పిల్ల ……….Joey
కుక్క ……………. Dog
ఆడకుక్క …………….Bitch
వేటకుక్క ………………….. Hound
కంచర గాడిద ……………. Mule
కుందేలు …………….Rabbit
సీమ కుందేలు …………….Hare
గాడిద ……………. Ass / Donkey
ఆవు ……………. Cow
బర్రె ……………. Buffalo
దూడ ……………. Calf
పెయ్య దూడ ……………. She-calf
ఎద్దు ………………….Bull/Ox
ఆంబోతు ……………….. Sire
ఉడుత …………………… Squirrel
ఖడ్గమృగము ……………. Rhinoceros
చారల గుర్రము ……………. Zebra
గుర్రము ……………….. Horse
ఆడగుర్రము ……………. Mare
గుఱ్ఱపుపిల్ల ……………. Colt
గుర్రపు పిల్ల ……………. Pony
చిరుత పులి ……………. Panther
చీమలను తినే జంతువు ……………. Ant Eater
ఎలుక …………………Mouse
చుంచెలుక ……………. Mole
అడవిపంది ……………. Boar
జిరాఫీ …………………. Giraffe
ముంగీస ……………. Mongoose
మేకపోతు ……………. He-goat
మేక ………………….. She Goat
పిల్లి …………………… Cat
పిల్లి పిల్ల ………………..Kitten
కోతి …………………… Monkey
పెద్ద కోతి ………………Ape
చింపాంజి……………….Chimpanzee
సింహము ………………Lion
పులి …………………… Tiger
జింక ………………….. Deer
జింకపిల్ల ……………….Fawn
దుప్పి …………………… Stag
ఆడ కణితి ……………….Hind
ఎలుగుబంటి ……………..Bear
తోడేలు …………………… Wolf
నక్క ……………………….. Fox
గుంట నక్క …………… Jackal
దుమ్మనగుంట………..Hyena
గొర్రె ……………………….Sheep
ఆడ గొర్రె ………………….Ewe
గొర్రెపిల్ల …………………… Lamb
పొట్టేలు …………………… Ram
చిట్టెలుక …………………… Rat
ముళ్లపంది …………………..Porcupine
పంది ………………………..Pig
పంది పిల్ల ………………….. Piglet
ఎనుగు ……………………..Elephant

తెలుగు గుణింతాలు

క కా కి కీ కు కూ కృ కౄ కె కే కై కొ కో కౌ కం కః
ఖ ఖా ఖి ఖీ ఖు ఖూ ఖృ ఖౄ ఖె ఖే ఖై ఖొ ఖో ఖౌ ఖం ఖః
గ గా గి గీ గు గూ గృ గౄ గె గే గై గొ గో గౌ గం గః
ఘ ఘా ఘి ఘీ ఘు ఘూ ఘృ ఘౄ ఘె ఘే ఘై ఘొ ఘూ ఘౌ ఘం ఘః
చ చా చి చీ చు చూ చృ చౄ చె చే చై చొ చో చౌ చం చః
ఛ ఛా ఛి ఛీ ఛు ఛూ ఛృ ఛౄ ఛె ఛే ఛై ఛొ ఛో ఛౌ ఛం ఛః
జ జా జి జీ జు జూ జృ జౄ జె జే జై జొ జో జౌ జం జః
ఝ ఝా ఝి ఝీ ఝు ఝూ ఝృ ఝౄ ఝె ఝే ఝై ఝొ ఝూ ఝౌ ఝం ఝః
ట టా టి టీ టు టూ టృ టౄ టె టే టై టొ టో టౌ టం టః
ఠ ఠా ఠి ఠీ ఠు ఠూ ఠృ ఠౄ ఠె ఠే ఠై ఠొ ఠో ఠౌ ఠం ఠః
డ డా డి డీ డు డూ డృ డౄ డె డే డై డొ డో డౌ డం డః
ఢ ఢా ఢి ఢీ ఢు ఢూ ఢృ ఢౄ ఢె ఢే ఢై ఢొ ఢో ఢౌ ఢం ఢః
ణ ణా ణి ణీ ణు ణూ ణృ ణౄ ణె ణే ణై ణొ ణో ణౌ ణం ణః
త తా తి తీ తు తూ తృ తౄ తె తే తై తొ తో తౌ తం తః
థ థా థి థీ థు థూ థృ థౄ థె థే థై థొ థో థౌ థం థః
ద దా ది దీ దు దూ దృ దౄ దె దే దై దొ దో దౌ దం దః
ధ ధా ధి ధీ ధు ధూ ధృ ధౄ ధె ధే ధై ధొ ధో ధౌ ధం ధః
న నా ని నీ ను నూ నృ నౄ నె నే నై నొ నో నౌ నం నః
ప పా పి పీ పు పూ పృ పౄ పె పే పై పొ పో పౌ పం పః
ఫ ఫా ఫి ఫీ ఫు ఫూ ఫృ ఫౄ ఫె ఫే ఫై ఫొ ఫో ఫౌ ఫం ఫః
బ బా బి బీ బు బూ బృ బౄ బె బే బై బొ బో బౌ బం బః
భ భా భి భీ భు భూ భృ భౄ భె భే భై భొ భో భౌ భం భః
మ మా మి మీ ము మూ మృ మౄ మె మే మై మొ మో మౌ మం మః
య యా యి యీ యు యూ యృ యౄ యె యే యై యొ యో యౌ యం యః
ర రా రి రీ రు రూ రృ రౄ రె రే రై రొ రో రౌ రం రః
ల లా లి లీ లు లూ లృ లౄ లె లే లై లొ లో లౌ లం లః
వ వా వి వీ వు వూ వృ వౄ వె వే వై వొ వో వౌ వం వః
శ శా శి శీ శు శూ శృ శౄ శె శే శై శొ శో శౌ శం శః
ష షా షి షీ షు షూ షృ షౄ షె షే షై షొ షో షౌ షం షః
స సా సి సీ సు సూ సృ సౄ సె సే సై సొ సో సౌ సం సః
హ హా హి హీ హు హూ హృ హౄ హె హే హై హొ హౌ హం హః
క్ష క్షా క్షి క్షీ క్షు క్షూ క్ష్ క్ష్ క్షె క్షే క్షై క్షొ క్షో క్షౌ క్షం క్షః

Telugu Varnamala

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః

క ఖ గ ఘ ఙ

చ ఛ జ ఝ ఞ

ట ఠ డ ఢ ణ

త థ ద ధ న

ప ఫ బ భ మ

య ర ల వ శ

ష స హ ళ క్ష ఱ

జ్యోతిశ్యం – ఒక శాస్త్ర విజ్ఞానం

ఒక జ్యోతిష్య పండితుడు.. ఏరోజు సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది… సూర్యాస్తమయం ఎన్ని గంటలకు జరుగుతుంది… గ్రహణాల గురించి ఖచ్చితంగా చెప్పగలరు.. ఉదాహరణకు గురుగ్రహ నీడ భూమి మీద పడినపుడు మనకు కర్తరి వస్తుంది.. ఆ సమయంలో పెళ్ళిళ్ళు జరగవు.. అంత ఖచ్చితమైనవి… ఇలా ఏ గ్రహం నీడ మన భూమి మీద పడితే ఆ కర్తరి వస్తుంది… వాడుక భాషలో దీనిని కత్తెరలు వచ్చాయి అని పిలుస్తాము…
వివాహ మహోత్సవ సంధర్భంలోనే భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారా అన్నట్లుంది ఈ ప్రక్రియ:: ఒక సారి చూడండి..
5,000 – 7,000 ఏళ్ళ క్రితమే జంట నక్షత్రాల గురించి మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులకు తెలుసు. అందుకే మన ఆధునిక శాస్త్రజ్ఞులు కనుగొన్న15వ అత్యంతకాంతివంతమైన నక్షత్రాన్ని మన వారు ఎప్పుడోగుర్తించగలిగారు.. మనము దీనినే జ్యేష్టా నక్షత్రం అంటున్నాము… ఇప్పుడు సైన్సు ఇది భూమి కంటే 40,000 రెట్లు పెద్దద(జ్యేష్టమ)ని గుర్తించగలిగింది.. ఈ జంట నక్షత్రాలను అరుంధతి-వశిష్ట నక్షత్రాలు అని పిలుచుకుంటున్నాం.. ఈ జంట నక్షత్రాలను మరింత ముందుకు తీసుకువెళ్ళి మన వివాహంలో ఒక తంతుకు కూడా ముడి పెట్టారు.. మామూలుగా అయితే ఒక గ్రహం వేరొక గ్రహం చుట్టూ మాత్రమే తిరుగుతాయి.. కానీ ఈ జంట నక్షత్రాలు మాత్రం ఒకదానిచుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి.. ఇంకా చెప్పాలంటే దస్తీ బిస్తీ అని తిరుగుతూ ఆడుతూ ఉంటాం చూడండి అలాగన్న మాట.. దీనినే ఒకరకంగా హోమగుండం చుట్టూ ఒకరి వేలు పట్టుకుని మరొకరు తిరిగినట్లుగా చూపుట, వివాహానంతరం ఈ జంట నక్షత్రాలను చూపుటలో భార్యా భర్తల మధ్య సoబంధం ఇలాచూపారేమోనని ఒక అభిప్రాయం. అయితే 5,000 ఏళ్ళ క్రితమే ఎటువంటి టెలిస్కోప్ లు లేకుండా ఈ నక్షత్రాల భ్రమణ పద్దతులను అధ్యయనం చేయగలిగారంటే నిజంగా అద్బుతమే…