తాజా చేపలను తెలుసుకొనే విధానం, చేపలలో రకాలు

ఆరోగ్యానికి ముఖ్యంగా మెదడుకు మేలు చేసేవి చేపలు…చేపలలో సముద్రపు చేపలు వేరు. మంచినీటి చేపల ఎముకలు గట్టిగా ఉంటే సముద్రపు చేపలు మెత్తటి ఎముకలతో ఉంటాయి. మంచినీటి చేపలలో మైక్రో న్యూట్రియంట్లు మరియు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. సముద్రపు చేపలలో ఇవి ఎక్కువ. అందుకే చెరువు చేపలకంటే సముద్రపు చేపలు మంచివి అంటారు నిపుణులు. విటమిన్లు ఖనిజాలు ఏ చేపలలోనైనా ఒకటే. చేపలు తినటం వలన రక్తనాళాలలో రక్తం గడ్డకట్టదు. ట్రైగ్లిజరేడ్లు తగ్గుతాయి. బిపిని కంట్రోల్ లో ఉంచుతాయి. చేపలు కొనే ముందు వాటి నాణ్యత, తాజాదనం పరీక్షించి కొనవలసి ఉంటుంది.తాజా చేపలను తెలుసుకొనే విధానం :01. చేపల మొప్పలు ఎత్తి చూసినపుడు లోపల ఎర్రగా గాని, పింక్ కలర్లో గాని కాంతివంతంగా ఉండాలి. ఎర్రగా కనపడటానికి రంగుకూడా వేస్తారు. కనుక జాగ్రత్తగా గమనించి…

Read More